
న్యూఢిల్లీ: కొత్త ఆన్‌లైన్ పోర్టల్‌ను సోమవారం ప్రారంభించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇకపై ఈ పోర్టల్‌లోనే రాజకీయ పార్టీలు తమ ఆర్థిక వివరాలను వెల్లడించాల్సి ఉంటుంది. ఆర్థిక వివరాలతో పాటు ఎన్నికలకు సంబంధించి ఖర్చులు, పార్టీకి వచ్చిన విరాళాలు తదితర వివరాలను ఈ పోర్టల్ ద్వారా అందించవచ్చు.
దేశంలో ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించే లక్ష్యంతో ఈ పోర్టల్‌ను తీసుకొచ్చినట్లు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. . అక్రమ నిధులను అరికట్టడం, రాజకీయ పార్టీల నిధులు, ఖర్చుల్లో పారదర్శకత, జవాబుదారీతనాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యం పోర్టల్‌ను తీసుకువచ్చినట్లు చెప్పింది.
తమ ఆర్థిక నివేదికను ఆన్‌లైన్‌లో ఇవ్వకూడదని భావిస్తే.. అందుకు గల కారణాలను రాతపూర్వకంగా తెలియజేయాలని, ఆన్‌లైన్‌లో సమర్పించకపోతే నిర్దేశించిన ఫార్మాట్‌లో సీడీలు, పెన్‌డ్రైవ్‌లు, హార్డ్ కాపీ ఫార్మాట్‌లో నివేదికను అందజేయాలని స్పష్టం చేసింది.
ఆన్‌లైన్‌లో ఆర్థిక నివేదికలను దాఖలు చేయనందుకు పార్టీ పంపిన సమర్థన లేఖతో పాటు అలాంటి అన్ని నివేదికలను ఆన్‌లైన్‌లో ప్రచురిస్తుందని ఈసీ పేర్కొంది.
చదవండి: పాత మిత్రుల కౌంటర్ల ఎపిసోడ్‌కు శుభం కార్డు.. ‘ఎలా అర్థం చేసుకుంటారో మీ ఇష్టమంటూ..
Comments
Please login to add a commentAdd a comment