
దుర్గేశ్ పాఠక్ ఇంట్లో సీబీఐ సోదాలు
న్యూఢిల్లీ: నిబంధనలను ఉల్లంఘిస్తూ ఆమ్ ఆద్మీ పార్టి(ఆప్)కి విదేశాల నుంచి నిధులు అందాయనే ఆరోపణలపై మాజీ ఎమ్మెల్యే, పార్టీ గుజరాత్ ఎన్నికల సహ ఇన్‌చార్జి దుర్గేశ్ పాఠక్ ఇంటిపై గురువారం సీబీఐ అధికారులు దాడులు జరిపారు. విదేశీ విరాళాల నిబంధనల సవరణ చట్టం(ఎఫ్‌సీఆర్‌ఏ)– 2010కు విరుద్ధంగా ఆప్ నిధులు అందుకుందనే ఆరోపణలపై హోం శాఖ నుంచి అందిన ఫిర్యాదు మేరకు సీబీఐ కేసు నమోదు చేసింది.
ఇందులో ఆప్‌కు చెందిన మరో నేత దివంగత కపిల్ భరద్వాజ్ పేరు కూడా ఉంది. ఆప్ ఓవర్సీస్ ఇండియా పేరుతో ఏర్పాటైన విభాగానికి అమెరికా, కెనడా, ఆ్రస్టేలియా తదితర దేశాల్లో వలంటీర్లు ఉన్నారని తెలిపింది. వీరు నిబంధనలకు విరుద్ధంగా నిధులు సేకరించి దుర్గేశ్ పాఠక్, కపిల్ భరద్వాజ్‌లకు పంపినట్లు ఎఫ్‌ఐఆర్ పేర్కొంది. కాగా, విచారణకు అవసరమైతే పార్టీ అగ్ర నేతలను కూడా ప్రశ్నించే అవకాశముందని సీబీఐ వర్గాలు తెలిపాయి. సోదాలపై దుర్గేశ్ స్పందించారు. గుజరాత్‌లో పార్టికి పెరుగుతున్న ఆదరణను చూసి భయంతోనే కేంద్ర ప్రభుత్వం తనను బెదిరించేందుకు ఈ కుట్ర పన్నిందని ఆరోపించారు.
గురువారం ఉదయం ఆరుగురు సీబీఐ అధికారులు తన నివాసానికి వచి్చ, రెండు గదుల్లో దాదాపు 4 గంటల పాటు అణువణువూ గాలించారని, వారికేమీ దొరకలేదని ఆయన చెప్పారు. సెర్చ్ వారెంట్ చూపిన అధికారులు సోదాలకు కారణం మాత్రం చెప్పలేదన్నారు. భయపెట్టడం ద్వారా గుజరాత్‌లో తమ పార్టీని ఏకాకిని చేయడమే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ఉద్దేశమని ఆరోపించారు. తమ పార్టీని అంతం చేయడమే బీజేపీ ఉద్దేశమని ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించారు. దుర్గేశ్‌కు గుజరాత్‌లో 2027లో జరిగే అసెంబ్లీ ఎ న్నికల బాధ్యతలను అప్పగించిన వెంటనే బీ జేపీ ప్రభుత్వం దాడులకు దిగిందని ఆప్‡ నేత మనీశ్ సిసోడియా ఆరోపించారు.