durgesh
-
డబ్బుల కోసం అడల్ట్ సినిమాలు చేశా: 'పంచాయత్' నటుడు
సినిమా ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి నిలబడాలంటే చాలా కష్టం. ఎన్నో కష్టాలు తట్టుకోవాలి. ఈ క్రమంలోనే మనసుకు నచ్చకపోయినా సరే కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. 'పంచాయత్' వెబ్ సిరీస్‌తో బోలెడంత ఫేమ్ సొంతం చేసుకున్న దుర్గేశ్ కుమార్‌ది కూడా ఇలాంటి కథే. నటుడిగా నిలదొక్కుకునే క్రమంలోనే అడల్ట్ ఫిల్మ్స్‌లోనూ నటించానని ఇప్పుడు ఓపెన్ అయిపోయాడు.(ఇదీ చదవండి: తండ్రయిన స్టార్ హీరో.. మహాలక్ష్మి పుట్టిందని వీడియో పోస్ట్)బిహార్‌కి చెందిన దుర్గేశ్ కుమార్.. 2001లో ఇంజినీరింగ్ చేయడం కోసం దిల్లీ వెళ్లాడు. కానీ ఎగ్జామ్ కష్టంగా ఉండేసరికి.. నటనవైపు షిఫ్ట్ అయ్యాడు. ఓవైపు నాటకాల్లో నటిస్తూనే డిగ్రీ పూర్తి చేశాడు. 'నేషనల్ డ్రామా స్కూల్'లో యాక్టింగ్ కోర్సు చేశాడు. ఆ తర్వాత 'హైవే' సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చాడు. 'సుల్తాన్', 'ఫ్రీకీ అలీ' లాంటి చిత్రాల్లో నటించాడు కానీ ఇబ్బందులు తప్పలేదు. దీంతో తప్పని పరిస్థితుల్లో డబ్బుల కోసం అడల్ట్ మూవీస్ చేశాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇదంతా చెప్పుకొచ్చాడు.'యాక్టింగ్ చేయకపోతే నేను బతకలేదు. దీంతో నాకొచ్చిన ప్రతిదీ చేసుకుంటూ పోయాను. అలానే కొన్ని అడల్ట్ మూవీస్‌లోనూ చేయాల్సి వచ్చింది. 2016లో నేను ముంబయికి వచ్చాను. కొందరు ఫ్రెండ్స్ అయ్యారు. మేమందరం ఎలాగైనా సరే ఇండస్ట్రీలోకి నిలబడాలనుకున్నాం. కానీ ఛాన్సుల కోసం ప్రతి క్యాస్టింగ్ డైరెక్టర్‌కి దగ్గరకెళ్లి, వాళ్ల కాళ్ల మీద పడ్డాం. ఇదంతా కూడా 'హైవే', 'ఫ్రీకీ అలీ', 'సుల్తాన్' లాంటి సినిమాల్లో నేను నటించిన తర్వాతే జరిగింది. కొన్ని చిత్రాల్లో యాక్ట్ చేసిన తర్వాత కూడా ఆడిషన్స్‌కి వెళ్లాలంటే ఏదోలా ఉంటుంది. అలా పంచాయత్ మొదటి సీజన్లో చిన్న రోల్ చేశాను. రెండున్నర గంటల్లో దీని షూట్ చేశారు' అని దుర్గేశ్ చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు.. అవి ఏంటంటే?) -
Delhi liquor scam: ఆప్ ఎమ్మెల్యే పాఠక్, కేజ్రీవాల్ పీఏను... ప్రశ్నించిన ఈడీ
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ఆప్ ఎమ్మెలే దుర్గేశ్ పాఠక్‌తో పాటు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పీఏ విభవ్ కుమార్‌ను సోమవారం ఈడీ ప్రశ్నించింది. సౌత్ గ్రూప్ నుంచి హవాలా రూపంలో తీసుకున్న రూ.45 కోట్లను గోవా అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఆప్ వాడిందని ఈడీ ఆరోపిస్తుండటం తెలిసిందే. ఆ ఎన్నికల్లో గోవాకు పాఠక్ ఇన్చార్జిగా ఉన్నారు. ఎన్నికల వేళ జరిగిన నగదు లావాదేవీలపై ఆయన్ను ఈడీ ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ కేసులో కీలక పత్రాలకు సంబంధించిన వివరాల కోసం విభన్‌ను విచారించింది. ప్రచారం నుంచి దూరం చేసేందుకే: ఆతిశి పాఠక్‌ను విచారించడంపై ఢిల్లీ మంత్రి అతిశి మండిపడ్డారు. ఆప్ నేతలను ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా చేసేందుకే విచారణ పేరుతో బీజేపీ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. -
లిక్కర్ కేసు.. ‘ఆప్’ మరో కీలక నేతకు ‘ఈడీ’ సమన్లు
న్యూఢిల్లీ: లిక్కర్ స్కామ్ కేసు ఆమ్ఆద్మీపార్టీ(ఆప్)ని నీడలా వెంటాడుతోంది. ఏకంగా ఆ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టయి జైలులో ఉన్నప్పటికీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దూకుడు తగ్గించడం లేదు. ఇదే కేసులో ఈడీ తాజాగా ఆప్ ఎమ్మెల్యే, గోవా ఆప్ ఇంఛార్జ్ దుర్గేష్ పాఠక్‌కు నోటీసులు జారీ చేసింది. లిక్కర్ కేసు విచారణ నిమిత్తం తమ ముందు విచారణకు హాజరు కావాలని కోరింది. దుర్గేష్ పాఠక్‌కు ఈడీ నోటీసులు పంపడం ఇది రెండవసారి. 2022లో కూడా ఇదే కేసు విషయమై పాఠక్‌కు ఈడీ నోటీసులు పంపింది. అప్పట్లో లిక్కర్ కేసు నిందితుడు ఆప్ కమ్యూనికేషన్స్ ఇంఛార్జ్ విజయ్‌నాయర్ ముంబై ఇంట్లో ఈడీ సోదాలు జరిపినపుడు పాఠక్ అక్కడే ఉన్నట్లు సమాచారం. దీంతో విజయ్‌నాయర్‌తో ఉన్న సంబంధాలు, డిజిటల్ ఆధారాలపై పాఠక్‌ను ప్రశ్నించడానికే ఈడీ తాజాగా సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి.. కవితకు దక్కని ఊరట -
రాజమండ్రి రూరల్‌లో జనసేన, టీడీపీ మధ్య చిచ్చు
సాక్షి, రాజమహేంద్రవరం: చంద్రబాబు వ్యవహార శైలి టీడీపీ, జనసేన నేతల మధ్య అగ్నికి ఆజ్యం పోస్తోంది. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే స్థానంపై ఎటూ తేల్చకపోవడం ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. ప్రస్తుతం అది బహిరంగంగా ప్రెస్మీట్లు పెట్టి విమర్శలు గుప్పించే స్థాయికి చేరింది. తనకు అధిష్టానం ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని, తనకే టికెట్ దక్కుతుందని జనసేన నేత కందుల దుర్గేష్ ఇటీవల విలేకర్ల సమావేశంలో స్పష్టం చేశారు. దానిని టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి ప్రెస్‌మీట్ పెట్టి ఖండించారు. ప్రెస్మీట్లు.. సిగపట్లు.. పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు పవన్, చంద్రబాబు కలిసే చేస్తారని, కచ్చితంగా తనకే టిక్కెట్ దక్కుతుందని కందుల దుర్గేష్ ధీమా వ్యక్తం చేశారు. సిటింగ్ ఎమ్మెల్యేలకే సీట్లు అని గతంలో చంద్రబాబు చేసిన ప్రకటన తమ పొత్తు తర్వాత చెల్లదన్నారు. దీంతో తానే పోటీ చేస్తానని పరోక్షంగా వెల్లడించారు. దుర్గేష్ ఇలా ప్రకటించిన ఒక రోజు వ్యవధిలోనే టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల స్పందించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఖాయమని చంద్రబాబు చెప్పిన విషయాన్ని గుర్తుచేసి.. అది ఇప్పుడు చెల్లదనడానికి జనసేన నాయకుడు ఎవరని దుర్గేష్‌పై శివాలెత్తారు. ఎవరేమన్నా రానున్న ఎన్నికల్లో తాను ఎంపీగా పోటీ చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. రూరల్ ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని బల్లగుద్ది మరీ ప్రకటించారు. బుచ్చయ్యకు కష్టమేనా.. బుచ్చయ్య రూరల్ ఎమ్మెల్యే అయినా ఆయన దృష్టంతా రాజమహేంద్రవరం సిటీ స్థానంపైనే ఉండేది. పార్టీలో సీనియర్ అయిన తనను కాదని ఇతరులను ప్రోత్సహిస్తున్నారని ఆవేదన చెందేవారు. ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో వెళ్లగక్కారు. ఆయనకు రూరల్ ఇవ్వని పక్షంలో ఆదిరెడ్డి వాసును ఎంపీగా రంగంలోకి దింపి, సిటీ సీటు బలమైన క్యాడర్ ఉన్న బుచ్చయ్యకు కేటాయిస్తారన్న ప్రచారం కొంతకాలం నడిచింది. బాబు ఇక్కడి సెంట్రల్ జైలుకు వచ్చాక ఆయన కుటుంబం ఇక్కడే ఉండి ఆందోళనల్లో పాల్గొన్నపుడు.. చొరవగా వ్యవహరించిన ఆదిరెడ్డి వాసుకే సిటీ సీటు ఖాయమన్న వాదన వినిపిస్తోంది. దీంతో బుచ్చయ్యకు సిటీ ఆశ కూడా అడియాసగా మారుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. బాబు వైఖరితోనే.. చంద్రబాబు వైఖరితోనే రాజమండ్రి రూరల్‌లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని టీడీపీ, జనసేన కార్యకర్తలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. స్పష్టత ఇవ్వకుండా చంద్రబాబు విభేదాలకు మరింత ఆజ్యం పోస్తున్నారని మండి పడుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఖాయమని గతంలో చంద్రబాబు ప్రకటించేశారు. దీంతో రూరల్ సీటు తనకే అన్న ధీమాలో బుచ్చయ్య ఉండగా.. పొత్తులో భాగంగా దుర్గేష్‌కు ఇద్దామన్న మరో ప్రతిపాదన సైతం బుచ్చయ్య వద్ద ఉంచారు. ఇలా రెండువైపులా అనుకూలంగా వ్యవహరిస్తూ.. ఇరు వర్గాల మధ్య గొడవలకు చంద్రబాబు ఆజ్యం పోస్తున్నారని జనసేన, టీడీపీ నేతలు అంటున్నారు. గుంటూరులో సిగపట్లు ♦ గుంటూరు పశ్చిమం, తెనాలి కావాలని జనసేన డిమాండ్ ♦ ఆ రెండూ తమ పార్టీకి బలమైన సీట్లు అంటున్న నేతలు ♦ కానీ, తెనాలిలో పాదయాత్ర మొదలుపెట్టిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజా ♦ గుంటూరు పశ్చిమ.. మా సిట్టింగ్ సీటు అంటున్న తెలుగుదేశం సాక్షి ప్రతినిధి, గుంటూరు: గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి జనసేనతో పొత్తు తలనొప్పిగా మారుతోంది. టీడీపీకి పట్టున్న రెండు సీట్లను జనసేన డిమాండ్ చేస్తుండడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. తెనాలి నియోజకవర్గంలో తెలుగుదేశం నుంచి ఆలపాటి రాజా, జనసేన నుంచి ఆ పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పోటీపడుతున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున గతంలో ఇక్కడ్నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. కాంగ్రెస్, జనసేన తరఫున మరో రెండుసార్లు ఓటమి చవిచూశారు. నాదెండ్ల మనోహర్ ఇప్పుడు మళ్లీ తెనాలి నుంచి టీడీపీ–జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీచేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ కూడా సమ్మతించారు. అయితే, ఇక్కడ టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ కూడా మరోసారి పోటీచేయాలని చూస్తున్నారు. రెండు పార్టీలు కలిసి పోటీచేస్తే గెలుస్తామన్న భావనతో ఆయన పార్టీపరంగా లైన్ క్లియర్ చేసుకునేందుకు లోకేశ్‌తో టచ్‌లో ఉన్నారు. నియోజకవర్గంలోనూ ఆయన పర్యటిస్తున్నారు. రెండురోజుల క్రితం పాదయాత్ర మొదలుపెట్టారు. గత ఎన్నికల్లో జనసేనకు 29 వేల ఓట్లు రాగా టీడీపీకి 76 వేల ఓట్లు వచ్చాయి. తమకు బలమైన సీటును వదులుకోవడానికి సిద్ధంగాలేమని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. గుంటూరు పశ్చిమం కోసం జనసేన పట్టు.. ఇక జనసేన అడుగుతున్న రెండో సీటు గుంటూరు పశ్చిమం. ఈ సీటు 2014, 2019లో కూడా తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. తమ సిట్టింగ్ సీటును ఇచ్చేదిలేదని వారు తెగేసి చెబుతున్నారు. అయితే ఇక్కడ తెలుగుదేశం బలంతో పాటు కాపు ఓటింగ్ కూడా గణనీయంగా ఉండటంతో ఇక్కడ పోటీచేయాలని జనసేన భావిస్తోంది. గత ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థిగా పోటీచేసిన బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ఈ సీటు కోసం పట్టుపడుతున్నారు. ఇందులో భాగంగా.. సోమవారం కూడా గుంటూరు జనసేన నేతలు పవన్‌ను కలిసి ఈ సీటు కావాల్సిందేనని, ఏ విధంగా గెలుస్తామో ఆయనకు వివరించారు. మరోవైపు.. టీడీపీ కూడా ఇక్కడ అభ్యర్థి కోసం అన్వేషిస్తోంది. ఇక్కడ వైఎస్సార్సీపీ నుంచి మంత్రి విడదల రజిని బరిలోకి దిగడంతో ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని బరిలోకి దింపేందుకు తెలుగుదేశం ప్రయత్నిస్తోంది. దీంతో ఇప్పటివరకూ ఈ నియోజకవర్గంపై ఆశలు పెట్టుకున్న ఎన్ఆర్ఐలు తమ కార్యకలాపాలు నిలిపివేశారు. ఈ నేపథ్యంలో.. పొత్తులో భాగంగా ఏ సీటు వదులుకోవాలో, ఏ సీటు ఉంచుకోవాలో తెలీక టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. -
కిడ్నాప్ చేసి.. గన్ పెట్టి.. పెళ్లి చేశారు
పాట్నా : వేరే పెళ్లి చేసుకుంటున్న వ్యక్తిని కిడ్నాప్ చేయడం, గన్ పెట్టి బెదిరించి పిల్లను ఇచ్చి పెళ్లి చేయడం ఇదంతా సినిమాల్లో చూసుంటా. తాజాగా బిహార్‌లో ఇదే సంఘటన జరిగింది. సమస్తిపుర్ రైల్వే డివిజన్లో పనిచేస్తున్న దుర్గేష్ శరణ్ అనే ఇంజనీర్‌ను కిడ్నాప్ చేసి, బలవంతంగా ఓ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి చేసుకునేందుకు నిరాకరించడంతో, గన్‌పెట్టి మరీ ఓ అమ్మాయితో పెళ్లి జరిపించారు. వివరాల్లోకి వెళ్తే... దుర్గేష్ సెక్షన్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. బిందూపూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని ఖజ్వట్ట గ్రామంలో ఉన్న తన స్నేహితుడు సౌరభ్ ఇంటి నుంచి తిరిగి వస్తున్న సమయంలో అతన్ని అమ్మాయి కుటుంబం కిడ్నాప్ చేసింది. జందాహ స్టేషన్ ప్రాంతంలో శాల పవర్ హౌజ్‌లో దగ్గరిలో దుర్గేశ్ కిడ్నాప్‌కు గురయ్యాడు. ఎస్‌యూవీలో వచ్చిన కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు అతన్ని, సౌరభ్‌ను లాక్కొని వెళ్లారు. ఆ అనంతరం దుర్గేశ్‌ను రాఘోపూర్ నదీతీరం ప్రాంతానికి తీసుకెళ్లి, ప్రియాంక కుమారి అనే 23 ఏళ్ల అమ్మాయికి వచ్చి బలవంతంగా పెళ్లి చేశారు. దుర్గేశ్ కిడ్నాప్‌కు గురవడంతో, తన స్నేహితుడు సౌరభ్ జందాహ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు నమోదు చేశాడు. స్నేహితుడి సౌరభ్ ఈ విషయంపై జందాహ పోలీసు స్టేషన్లో జరిగిందంతా వివరించారు. సౌరభ్ చెప్పిన మేరకు వైశాలి జిల్లా ఎస్పీ మానవ్‌జీత్ సింగ్ ఆదేశంతో పోలీసులు భారీ ఎత్తున్న సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ సెర్చ్ ఆపరేషన్‌లో దుర్గేశ్, రాఘోపూర్ నదీతీరం ప్రాంతంలో ఉన్న పెళ్లి కూతురి ఇంట్లో దొరికాడు. అయితే దుర్గేశ్ తమకు గత ఏడాది కాలంగా తెలుసని పెళ్లి కూతురు కుటుంబం చెబుతోంది. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని, కానీ అధిక కట్నం ఆశతో దుర్గేశ్ వివాహానికి నిరాకరిస్తున్నాడని చెప్పారు. తన కొడుకును కిడ్నాప్ చేసి, బలవంతంగా పెళ్లి చేశారని, వీరెవరూ తమకు తెలియదని ఇంజనీర్ తల్లి వీణా దేవీ తన ఎఫ్ఐఆర్లో పేర్కొంది. -
బడా నర్సరీల్ని కాదు.. బడుగు రైతుల్ని చూడండి
-మీటర్ల బిగింపు ఆలోచనను విరమించుకోవాలి -నాడు వైఎస్ ఇచ్చిన వరాన్ని కొనసాగించాలి –గ్రేటర్ రాజమహేంద్రవరం వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు కందుల కడియం : ఒకరిద్దరు పెద్ద రైతుల నర్సరీలను చూసి అదే నర్సరీ రంగం అనుకోవడం పొరపాటని వైఎస్సార్ సీపీ గ్రేటర్ రాజమహేంద్రవరం అధ్యక్షుడు కందుల దుర్గేష్ అన్నారు. నర్సరీల విద్యుత్ సర్వీసులకు మీటర్లు బిగించాలన్న ఆలోచనను ప్రభుత్వం తక్షణం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కడియపులంకలో బుధవారం ఆయన స్థానిక నర్సరీ రైతులతో సమావేశయ్యారు. అనంతర విలేకరులతో మాట్లాడుతూ పెట్టుబడులు పెరిగిన నేపథ్యంలో చిన్న, మధ్య తరహా, కౌలు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ పరిస్థితుల్లో ఏడాదికి రూ.48 వేలకు పైగా కరెంటు బిల్లుల రూపంలో బరువు మోపితే ఆర్థికంగా దెబ్బ తింటారన్నారు. పెద్ద నర్సరీలనే కాక 99 శాతం మంది చిన్న రైతుల పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకోవాలని కోరారు. చిన్న రైతుల ఆర్థిక పరిస్థితిని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, మాజీ మంత్రి దివంగత జక్కంపూడి రామ్మోహనరావు అప్పటి సీఎం రాజశేఖరరెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా విద్యుత్ బిల్లుల నుంచి మినహాయింపు ఇచ్చారన్నారు. ఆ తరువాత సీఎంలు రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా సానుకూలంగానే వ్యవహరించారని, కానీ అప్పటి రాజకీయ అస్థిరత కారణంగా జీవో రాలేదని వివరించారు. అయితే అధికారుల నుంచి వచ్చే ఒత్తిడులను ప్రభుత్వపరంగా అడ్డుకోగలిగామన్నారు. రెగ్యులేటరీ కమిషన్ ఎప్పుడూ ఉందని, కానీ అవసరమైన చోట మినహాయింపు ఇచ్చేందుకు ప్రభుత్వం కూడా చొరవ చూపించాలన్నారు. దేశస్థాయిలో నర్సరీమెన్కు అధ్యక్షుడిగా కడియం ప్రాంతం నుంచే ఎన్నికయ్యారని, దేశంలో ఎక్కడాలేని విధంగా కడియంలోనే నర్సరీ రంగం విస్తరించిందని అన్నారు. ఇక్కడి రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా కేవలం అధికారులు చెప్పిన దానికే మొగ్గు చూపడం ప్రభుత్వానికి సరికాదన్నారు. మీటర్లు ఏర్పాటు చేయడాన్ని వైఎస్సార్సీపీ పూర్తిగా వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నర్సరీ రైతులతో పాటు అఖిలపక్ష కమిటీని ఏర్పాటు చేసిన కార్యాచరణను రూపొందిస్తామని చెప్పారు. సమావేశంలో డీసీఎంఎస్ డైరెక్టర్ వెలుగుబంటి అచ్యుతరాయ్, ఎంపీటీసీ సభ్యుడు టేకి శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ సాపిరెడ్డి సూరిబాబు, మాజీ ఉపసర్పంచ్లు తోరాటి శ్రీనివాసరావు, చిక్కాల బాబులు, నర్సరీ రైతులు ముద్రగడ జెమి, సలాది ప్రసాద్, రామారావు తదితరులు పాల్గొన్నారు. -
ఇష్టారాజ్యంగా పన్నుల పెంపు
ప్రభుత్వం తీరుపూ మాజీ ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ నేత కందుల దుర్గేష్ ఆగ్రహం కడియం : శాస్త్రీయమైన హేతుబద్దత లేకుండా పంచాయతీల్లో పన్నులు పెంచుతున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ కందుల లక్ష్మీదుర్గేష్ అన్నారు. శనివారం ఆయన కడియంలో స్థానిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేఽశారు. మూడు నాలుగు రెట్లు ఒకేసారి పన్నులు పెంచడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. 2000 సంవత్సరానికి ముందు టాక్స్ రివిజన్ విధానం ఉండేదన్నారు. ఆ తర్వాత ఏటా 5 శాతం టాక్స్ పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చిందన్నారు. వీటిని కాదని కేవలం పంచాయతీరాజ్ కమిషనర్ డీవో లెటర్ ద్వారా కలెక్టర్ల విచక్షణ మేరకు పంచాయతీల్లో పన్నులు పెంచేస్తున్నారన్నారు. బ్రిటష్ పాలనను గుర్తుకు తెచ్చే ఈ విధానం ఎంత వరకు సబబని దుర్గేష్ ప్రశ్నించారు. దీనిపై ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమవుతామన్నారు. సాచురేషన్ విధానంలో భాగంగా ఆ నాడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందించారన్నారు. చేనేత కుటుంబాల్లో 55 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేశారన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పురుషులకు 50 ఏళ్లు, మహిళలకు 55 ఏళ్లు ఉండాలని జీవో తీసుకువచ్చారు. ఇది మహిళల పై చూపుతున్న వివక్ష కాదా? అని దుర్గేష్ ప్రశ్నించారు. మహిళా పార్లమెంటేరియన్ సదస్సు పెట్టి మహిళలు, పురుషులు సమానమని చెబుతున్న చంద్రబాబు చేనేత కార్మికుల విషయంలో ఎందుకు వివక్ష చూపుతున్నారో సమాధానం చెప్పాలన్నారు. నూటికి 90 మంది ఉన్న నర్సరీ రైతులపై విద్యుత్ చార్జీలు, ట్యాక్స్‌ల భారం మోపితే చిన్న రైతుల పరిస్థితి ఏమవుతుందని ప్రశ్నించారు. రూ.ఐదు కోట్లతో నర్సరీ రైతులకు ఉపయోగపడే కన్వెన్షన్ సెంటర్‌ను అప్పటి కేంద్రమంత్రి చిరంజీవి మంజూరు చేశారన్నారు. దానిని తక్షణం పూర్తి చేసే చర్యలు చేపట్టాలని కోరారు. డీసీఎంఎస్ డైరెక్టర్ వెలుగుబంటి అచ్యుతరామ్, మాజీ సర్పంచ్‌లు గట్ట నర్సయ్య, సాపిరెడ్డి సూరిబాబు, మాజీ ఉప సర్పంచ్ చిక్కాల బాబులు, స్థానిక నాయకులు ముద్రగడ జెమి, పల్లి చిన్న, తూపాటి చిన్న, పాటంశెట్టి సునీల్‌కుమార్, బొబ్బిలి ప్రసాద్, గాద పెద్దబ్బులు, రత్నం విజ్జయ్య, గాద రామన్న, అంబటి రాజరత్నం పాల్గొన్నారు. -
‘పచ్చ’ చొక్కాలకే అభివృద్ధి పరిమితం
కడియం : ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు పచ్చచొక్కాలు వేసుకున్న వారికే పరిమితమయ్యాయని మాజీ ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ నాయకుడు కందుల దుర్గేష్ అన్నారు. పార్టీలో చేరిన తరువాత తొలిసారిగా శుక్రవారం కడియం వచ్చిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా టీడీపీ అనుసరిస్తున్న విధానాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. జన్మభూమి కమిటీల పేరుతో ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేస్తున్నారన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చేందుకు 750 హామీలను ఇచ్చారని, కానీ అందులో పూర్తిస్థాయిలో అమలైన హామీ ఒక్కటి కూడా లేదన్నారు. ప్రచార ఆర్భాటం తప్పితే ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయడం లేదన్నారు. సంక్షేమ పథకాలు అందరికీ అందాలన్న విశాల దృక్ఫథంతో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పనిచేసేవారన్నారు. ఆయన స్ఫూర్తిని జగ¯ŒS కొనసాగిస్తారన్న విశ్వాçÜం ఉందన్నారు.అందుకే వైఎస్సార్ సీపీలో చేరానని స్పష్టం చేశారు. సమావేశంలో డీసీఎంఎస్ డైరెక్టర్ వెలుగుబంటి అచ్యుతరామ్, గట్టి నర్సయ్య, సాపిరెడ్డి సూరిబాబు, తోరాటి శ్రీను, చిక్కాల బాబులు, ముద్రగడ జెమి, బోణం సతీష్ పాల్గొన్నారు. -
పార్టీ పటిష్టతకు కృషి చేస్తా
డీసీసీ మాజీ అధ్యక్షుడు కందుల దుర్గేష్ ∙ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిక 300 మంది కాంగ్రెస్ పార్టీ నేతలు ఆయనతోనే.. సాక్షి, రాజమహేంద్రవరం : పార్టీ నేతలతో సమన్వయం చేసుకుంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని మరింత పటిష్టం చేస్తానని డీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ పేర్కొన్నారు. సోమవారం ఆయన హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, రాజసభ్య సభ్యుడు వి.విజయసాయిరెడ్డిల సమక్షంలో పార్టీలో చేరారు. వై.ఎస్.జగ¯ŒS పార్టీ కండువా కప్పి దుర్గేష్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతోపాటు డీసీఎంఎస్ డైరెక్టర్ ఎలుగుబంటి అచ్యుత్‌రామ్; మాజీ జెడ్పీటీసీ దొంతంశెట్టి వీరభద్రయ్య, పలువురు మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, రాష్ట్ర, జిల్లా స్థాయి కాంగ్రెస్ పార్టీ నేతలు, అనుచరులు 300 మంది పార్టీలో చేరారు. వీరందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్ర బోస్, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ కుమారుడు కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, రౌతు సూర్యప్రకాశరావు, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, రాజమహేంద్రవరం రూర ల్ కోఆర్డినేటర్లు ఆకుల వీర్రాజు, గిరజాల వీర్రాజు(బాబు), రాష్ట్ర కార్యదర్శి నక్కా రాజబాబు, రాష్ట్ర కార్యదర్శి మింది నాగేంద్ర, రాజమహేంద్రవరం నాగరపాలక సంస్థ ఫ్లోర్‌లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి, కార్పొరేటర్ బొంతా శ్రీహరి, పార్టీనేతలు పోలుకిరణ్మోహ¯ŒSరెడ్డి, గుర్రం గౌతమ్, అడపాహరి తదితరులు పాల్గొన్నారు. పార్టీకి మరింత బలం సౌమ్యునిగా పేరొందిన కందుల దుర్గేష్ వైఎస్సార్సీపీలో చేరడంతో పార్టీ మరింత బలోపేతమవుతుందని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. మంచి వాగ్ధాటి కలిగిన దుర్గేష్ ప్రజా సమస్యలను బలంగా వినిపించగలరని ఆ పార్టీ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన దుర్గేష్ ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడుగా పని చేశారు. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దాదాపు దుర్గేష్ వెంట పయనించాయి. దుర్గేష్, ఆయన అనుచరులు వైఎస్సార్ సీపీలో చేరడంతో ఇక కాంగ్రెస్ పార్టీ జిల్లాలో నామ మాత్రమేనని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. -
వైఎస్సార్ సీపీలో నేడు దుర్గేష్ చేరిక
బలోపేతం కానున్న పార్టీ సాక్షి, రాజమహేంద్రవరం : కాంగ్రెస్ పార్టీ జిల్లా మాజీ అ««దl్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగ¯ŒSమోహ¯ŒSరెడ్డి సమక్షంలో తన అనుచరులతో కలసి ఆయన పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు రాజమహేంద్రవరంలోని తన నివాసం నుంచి అనుచరులతో కలిసి ఆయన ఆదివారం సాయంత్రం హైదరాబాద్ పయనమయ్యారు. వివాదరహితుడు, మంచి వక్తగా పేరొందిన దుర్గేష్ చేరిక వైఎస్సార్ సీపీకి లాభిస్తుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో దుర్గేష్ ఎమ్మెల్సీగా ఎన్నికై ఆరేళ్లు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యంగా దళితవాడల్లో ఎక్కువగా అభివృద్ధి పనులు చేపట్టారు. జిల్లావ్యాప్తంగా అనుచరులను సంపాదించుకున్నారు. 30 ఏళ్ల రాజకీయ అనుభవం దుర్గేష్ 30 ఏళ్లు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. రాజకీయాలపై ఉన్న ఆసక్తితో విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకి వచ్చారు. మొదట రాజమండ్రి వీటీ కాలేజీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1980లో ఎ¯ŒSఎస్‌యూఐ రాజమండ్రి టౌ¯ŒS కార్యదర్శిగా, 1982 నుంచి జిల్లా అధ్యక్షునిగా పని చేశారు. 1984లో యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమితులై అంచెలంచెలుగా ఎదుగుతూ, 2014లో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. పార్టీకి దుర్గేష్ చేసిన సేవలను గుర్తించిన నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2007లో ఎమ్మెల్సీ పదవికి ఎంపిక చేశారు. ఉద్దండులతో అనుబంధం సౌమ్యునిగా పేరొందిన కందుల దుర్గేష్ జిల్లా స్థాయిలో మాజీ ఎమ్మెల్యే ఏసీవై రెడ్డి, మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌లతో మంచి అనుబంధం కొనసాగించారు. ఆయా కాలాల్లో వారి ఆదేశాల మేరకు పార్టీ పటిష్టతకు కృషి చేశారు. రాష్ట్రస్థాయిలో వైఎస్ అనుచరుడిగా ఉన్నారు. వైఎస్ రాజశేఖరెడ్డి పేదల కోసం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, రాష్ట్ర అభివృద్ధి వైఎస్ జగ¯ŒSమోహ¯ŒSరెడ్డితోనే సాధ్యమని భావించి తాను వైఎస్సార్ సీపీలో చేరుతున్నట్లు దుర్గేష్ చెప్పారు. -
ఇవి ములక్కాడలు కాదండోయ్!
రాజానగరం, : ఆహా..... విరగకాశాయి ములక్కాడలు అనుకుంటున్నారు కదూ? నిజమే విరక్కాశాయి, కాని అవి ములక్కాడలు కాదు, వాటిలా భ్రమింపజేస్తున్న ఏడాకుల పాల (అలస్టోనియా స్కోలో రోసెస్) కాయలవి. ఆర్అండ్బి రోడ్లతోపాటు 16వ నంబరు జాతీయ రహదారి వెంబడి పలుచోట్ల ఉన్న ఈ చెట్లు ప్రస్తుతం విపరీతంగా కాయలు కాసి చూపరులను ‘ముల క్కాడలా?’ అనే భ్రమలో పడవేస్త్తున్నాయి. ఆకులు చూస్తే మామిడి ఆకుల మాదిరిగా ఉండే ఈ చెట్టును ఏడాకుల పాలగా పిలుస్తుంటారు. అంతేకాక మామిడి ఆకులను పోలి ఉండటంతో వీటి ఆకులను చాలామంది ఇళ్లకు తోరణాలుగా కూడా కడుతున్నారు. అయితే దీని శాస్త్రీయ నామం ‘అలస్టోనియా స్కోలో రోసెస్’గా ఉద్యానవన శాఖ సహాయ సంచాలకులు దుర్గేష్ తెలిపారు. సాధారణంగా గ్రీష్మరుతువులో చెట్లన్నీ ఆకులు రాలుస్తుంటాయి. కాని ఈ చెట్టు మాత్రం ఆకుపచ్చదనంతో ఎవర్‌గ్రీన్‌గా ఉంటుందన్నారు. గుబురుగా పెరిగి మంచి నీడనిచ్చే విధంగా ఉంటాయి కాబట్టే ఈ చెట్లను ఎక్కువగా రోడ్ల పక్కన పెంచుతున్నారన్నారు. విద్యార్థులు ఉపయోగించే పలకల తయారీకి, కర్ర పెట్టెలు, బ్లాక్బోర్డ్సు తయారీకి దీని కలపను వాడుతుంటారు.