న్యూఢిల్లీ: లిక్కర్ స్కామ్ కేసు ఆమ్‌ఆద్మీపార్టీ(ఆప్)ని నీడలా వెంటాడుతోంది. ఏకంగా ఆ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టయి జైలులో ఉన్నప్పటికీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దూకుడు తగ్గించడం లేదు. ఇదే కేసులో ఈడీ తాజాగా ఆప్ ఎమ్మెల్యే, గోవా ఆప్ ఇంఛార్జ్ దుర్గేష్ పాఠక్‌కు నోటీసులు జారీ చేసింది. లిక్కర్ కేసు విచారణ నిమిత్తం తమ ముందు విచారణకు హాజరు కావాలని కోరింది.
దుర్గేష్ పాఠక్‌కు ఈడీ నోటీసులు పంపడం ఇది రెండవసారి. 2022లో కూడా ఇదే కేసు విషయమై పాఠక్‌కు ఈడీ నోటీసులు పంపింది. అప్పట్లో లిక్కర్ కేసు నిందితుడు ఆప్ కమ్యూనికేషన్స్ ఇంఛార్జ్ విజయ్‌నాయర్ ముంబై ఇంట్లో ఈడీ సోదాలు జరిపినపుడు పాఠక్ అక్కడే ఉన్నట్లు సమాచారం. దీంతో విజయ్‌నాయర్‌తో ఉన్న సంబంధాలు, డిజిటల్ ఆధారాలపై పాఠక్‌ను ప్రశ్నించడానికే ఈడీ తాజాగా సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి.. కవితకు దక్కని ఊరట
Comments
Please login to add a commentAdd a comment