Vijay Nair
-
ఢిల్లీ లిక్కర్ కేసు: విజయ్ నాయర్‌కు సుప్రీంకోర్టు బెయిల్
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మాజీ కమ్యూనికేషన్ ఇంచార్జి, వ్యాపారవేత్త విజయ్ నాయర్‌కు సుప్రీంకోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. సుదీర్ఘకాలం పాటు జైలు శిక్ష, విచారణలో జాప్యాన్ని కీలక కారణాలుగా చూపుతూ బెయిల్ మంజూరు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది.కాగా లిక్కర్ కేసులో నిందితుడిగా ఉన్న నాయర్.. 23 నెలలుగా తిహార్ జైల్లో ఉన్నాడు. ఈ క్రమంలోనే అండర్ ట్రయల్‌గా అతన్ని ఎక్కువ కాలం జైలులో ఉంచలేరని, విచారణ శిక్షగా మారకూడదని సుప్రీం న్యాయమూర్తులు హృషికేష్ రాయ్, ఎస్వీఎన్ భట్టీలతో కూడిన ధర్మాసనం తెలిపింది. న్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కోర్టుకు హామీ ఇచ్చినప్పటికీ సకాలంలో విచారణను పూర్తి చేయలేకపోయిందని, దాదాపు 350 మంది సాక్షులను విచారించాల్సి ఉందని పేర్కొంది. ఈ మేరకు ఈ కేసులో ఇతర నిందితులైన మనీష్ సిసోడియా, ఎమ్మెల్సీ కవితకు బెయిల్ జారీ చేసిన ఉత్తర్వులను కోర్టు పరిగణలోకి తీసుకుంది.‘30 అక్టోబర్ 2023న 6 నుంచి 8 నెలల్లో విచారణ ముగిస్తామని ఈడీ కోర్టుకు హామీ ఇచ్చింది. అయితే విచారణ ఇంకా ప్రారంభం కాలేదని అర్థం అవుతోంది.ఈ కేసులో దాదాపు 40 మందిని నిందితులుగా చేర్చారు. దాదాపు 350 మంది సాక్షులను విచారించాలని ప్రాసిక్యూషన్ కోరుతోంది.ఈ కేసులో పిటిషనర్ 23 నెలల పాటు కస్టడీలో ఉన్నాడు. విచారణ ప్రారంభించకుండా అతనిని అండర్ ట్రయల్‌గా నిర్బంధించడం శిక్షా విధానం కాదు. పిటిషనర్‌ను విచారణ ప్రారంభించకుండానే జైలులో ఉంచితే బెయిల్ రూల్, జైలు మినహాయింపు అనే సార్వత్రిక నియమం ఓడిపోతుంది.ఆర్టికల్ 21 ప్రకారం స్వేచ్ఛా హక్కు అనేది ఒక పవిత్రమైన హక్కు. ఇది పీఎంఎల్ఏ వంటి ప్రత్యేక చట్టాల ప్రకారం కఠినమైన నిబంధనలు రూపొందించబడిన సందర్భాల్లో కూడా దీనిని గౌరవించాల్సిన అవసరం ఉంది’ అని సుప్రీంకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది.కాగా లిక్కర్ పాలసీకి సంబంధించి సీబీఐ, ఈడీ కేసులో విజయ్ నాయర్ నిందితుడిగా ఉన్నారు. నవంబర్ 2022లో సీబీఐ కేసులో ఆయనకు బెయిల్ మంజూరైంది. కానీ ఈడీ కేసులో గతేడాది జూలైలో ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరించింది. ఈ క్రమంలోనే ఆయన సుప్రీంను ఆశ్రయించారు. -
లిక్కర్ కేసు.. ‘ఆప్’ మరో కీలక నేతకు ‘ఈడీ’ సమన్లు
న్యూఢిల్లీ: లిక్కర్ స్కామ్ కేసు ఆమ్ఆద్మీపార్టీ(ఆప్)ని నీడలా వెంటాడుతోంది. ఏకంగా ఆ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టయి జైలులో ఉన్నప్పటికీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దూకుడు తగ్గించడం లేదు. ఇదే కేసులో ఈడీ తాజాగా ఆప్ ఎమ్మెల్యే, గోవా ఆప్ ఇంఛార్జ్ దుర్గేష్ పాఠక్‌కు నోటీసులు జారీ చేసింది. లిక్కర్ కేసు విచారణ నిమిత్తం తమ ముందు విచారణకు హాజరు కావాలని కోరింది. దుర్గేష్ పాఠక్‌కు ఈడీ నోటీసులు పంపడం ఇది రెండవసారి. 2022లో కూడా ఇదే కేసు విషయమై పాఠక్‌కు ఈడీ నోటీసులు పంపింది. అప్పట్లో లిక్కర్ కేసు నిందితుడు ఆప్ కమ్యూనికేషన్స్ ఇంఛార్జ్ విజయ్‌నాయర్ ముంబై ఇంట్లో ఈడీ సోదాలు జరిపినపుడు పాఠక్ అక్కడే ఉన్నట్లు సమాచారం. దీంతో విజయ్‌నాయర్‌తో ఉన్న సంబంధాలు, డిజిటల్ ఆధారాలపై పాఠక్‌ను ప్రశ్నించడానికే ఈడీ తాజాగా సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి.. కవితకు దక్కని ఊరట -
సిసోడియా ఈడీ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు..
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి మనీష్ సిసోడియా ఈడీ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఈ రిపోర్టులో మరోసారి కల్వకుంట్ల కవిత పేరును ప్రస్తావించారు. హైదరాబాద్‌లో ఐటీసీ కోహినూర్ వేదికగా కీలక చర్చలు జరిగినట్లు ఈడీ అధికారులు రిపోర్టులో పేర్కొన్నారు. కవిత, సిసోడియా మధ్య రాజకీయ అవగాహన ఉందని బుచ్చిబాబు స్టేట్మెంట్ ఇచ్చినట్లు తెలిపారు. డిల్లీ లిక్కర్ స్కాం హైదరాబాద్‌లోనే జరిగిందని చెప్పారు. 'హవాలా ద్వారా రూ.100 కోట్ల ముడుపులు పంపామని బుచ్చిబాబు ఒప్పుకున్నారు. కేజ్రీవాల్‌తో సిసోడియా, విజయ్ నాయర్ సంప్రదింపులు జరిపారు. డిల్లీ లిక్కర్ పాలసీలో కవితకు అనుకూలంగా వ్యవహరిస్తే ఆప్‌కు ముడుపులు ఇవ్వాలని సమావేశంలో చర్చలు జరిపారు. కవిత తరఫున అరుణ్‌చంద్ర పిళ్లై, సిసోడియా తరఫున విజయ్ నాయర్ పనిచేశారు. ఈ స్కాంలో సౌత్ గ్రూప్‌కు అనుకూలంగా వ్యవహరించినందుకు మద్యం కంపెనీలో కవితకు వాటాలు ఇచ్చారు.' అని రిమాండ్ రిపోర్టులో ఈడీ పేర్కొంది. చదవండి: మనీష్ సిసోడియా తరఫున విజయ్ నాయర్ కవితను కలిశారు.. కోర్టులో ఈడీ -
ఢిల్లీ లిక్కర్ స్కాం: ఈడీ దూకుడు.. రెండో చార్జిషీట్ దాఖలు..
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం రెండో చార్జిషీట్ దాఖలు చేసింది. 13,657 పేజీలతో కూడిన ఈ అనుబంధ (సప్లిమెంటరీ) చార్జిషీట్లో 12 మంది వ్యక్తులు, సంస్థల పేర్లను ప్రస్తావించింది. గతంలో ఈడీ అరెస్ట్ చేసిన విజయ్ నాయర్, శరత్‌రెడ్డి, బినోయ్ బాబు, అభిషేక్ బోయినపల్లి, అమిత్ అరోరా పేర్లతోపాటు మరో ఏడు కంపెనీలపై అభియోగాలు మోపింది. అయితే ఈ చార్జిషీట్లోనూ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పేరు చేర్చకపోవడం గమనార్హం. ఈ వివరాలను ఈడీ అధికారులు శనివారం కోర్టుకు సమర్పించనున్నారు. కాగా, ఇప్పటికే గత ఏడాది నవంబర్‌లో తొలి చార్జిషీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. మద్యం వ్యాపారి సమీర్ మహేంద్రుకు సంబంధించిన చార్జిషీట్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేర్లను ఈడీ ప్రస్తావించింది. ఇప్పటి వరకు ఈ కేసులో సమీర్ మహింద్రు, శరత్‌చంద్రారెడ్డి, బినోయ్ బాబు, అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్, అమిత్ అరోరాలను ఈడీ అరెస్ట్ చేసింది. ఢిల్లీలో ఇటీవల అమల్లోకి వచ్చిన ఎక్సైజ్ పాలసీని రూపొందించి అమలు చేయడంలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో సమీర్ మహింద్రు ఒకరు. ఈ కేసులోని నిందితులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీష్ సిసోడియా పేరు ఈడీ తొలి చార్జిషీట్లోనూ చేర్చలేదు. అయితే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (బీసీఐ) దాఖలు చేసిన ఎఫ్ఐఆర్లో మనీష్ సిసోడియా సహా ఇతర ప్రభుత్వ ఉద్యోగులను ఈ కేసులో నిందితులుగా పేర్కొంది. ఇదిలా ఉండగా శనివారంతో ఢిల్లీ లిక్కర్ కేసు నిందితులైన విజయనాయర్, అభిషేక్ బోయినపల్లి, శరత్ చంద్రారెడ్డి , బినోయ్‌బాబు జ్యూడిషియల్ కస్టడీ ముగియనుంది. జనవరి 7న శరత్ చంద్రారెడ్డి బెయిల్ పిటిషన్‌పై సీబీఐ స్పెషల్ కోర్టు విచారణ చేపట్టనుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈడీ నిందితులను ప్రవేశపెట్టనుంది. చదవండి: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు -
ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఛార్జ్ షీట్ దాఖలు చేసిన ఈడీ
-
ముగిసిన అభిషేక్, విజయ్ నాయర్ ఈడీ కస్టడీ.. కోర్టు ఏం చెప్పిందంటే!
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో నిందితులైన బోయినపల్లి అభిషేక్ రావు, విజయ్ నాయర్ ఈడీ కస్టడీ ముగిసింది. కస్టడీ ముగియడంతో ఇద్దరిని కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్పెషల్ కోర్టులో హాజరుపరిచింది. విజయ్ నాయర్ ల్యాప్‌టాప్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపామని.. డేటా రికవరీ జరగుతోందని వెల్లడించింది. లిక్కర్ స్కామ్‌లో ల్యాప్‌టాప్ నివేదిక కీలకమని, రూ.100కోట్లు చేతులు మారినట్లు కోర్టుకు తెలిపింది. ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి ల్యాబ్‌టాప్ రిపోర్టు శుక్రవారం వస్తుందని పేర్కొంది. ఈడీ విచారణకు విజయ్ నాయర్ సహకరిస్తున్నారని, ఇప్పటికే అన్ని వివరాలు చెప్పారని తెలిపింది. మెయిల్ వివరాలు, ల్యాప్ టాప్ పాస్ వర్డ్ కూడా ఇచ్చారని చెప్పింది. అతన్ని ఇంకా ప్రశ్నించాల్సి ఉందని చెబుతూ మరో అయిదు రోజుల కస్టడీ ఇవ్వాలని కోర్టును కోరింది. దీనికి అంగీకరించిన కోర్టు.. విజయ్ నాయర్‌ను రెండు రోజుల ఈడీ కస్టడీకి అనుమతిచ్చింది. అదే విధంగా అభిషేక్ రావుకు స్పెషల్ కోర్టు డిసెంబర్ 8 వరకు(14 రోజులు) జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అభిషేక్‌కు జైలులో చలి దుస్తులు, అవసరమైన పుస్తకాలు, మందులు అందించాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అతన్ని మళ్ళీ తీహార్ జైలుకు తరలించారు. సీబీఐకి చుక్కెదురు మరోవైపు ఢిల్లీ లిక్కర్ కేసులో సీబీఐకి చుక్కెదురైంది. అభిషేక్ రావు, విజయ్ నాయర్ బెయిల్‌పై స్టే ఇవ్వడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. లిక్కర్ స్కామ్‌లో నిందితులైన అభిషేక్, విజయ్ నాయర్లకు నవంబర్ 14న రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. స్పెషల్ కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సీబీఐ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోర్టు కోరింది. అయితే ఇందుకు హైకోర్టు అంగీకరించలేదు. తదుపరి విచారణను డిసెంబర్ 1కి వాయిదా వేసింది. చదవండి: అదే రోజు ప్రధాని ఎందుకు ఆమోదించారు: సుప్రీం కోర్టు -
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు.. విజయ్ నాయర్, అభిషేక్ ఈడీ కస్టడీ పొడిగింపు..
సాక్షి,న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులు అభిషేక్ బోయిన్పల్లి, విజయ్ నాయర్లకు ఈడీ కస్టడీని మరో ఐదు రోజులు పొడిగించింది రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు. ఈమేరకు శనివారం ఉత్తర్వులు ఇచ్చింది. తదపరి విచారణను ఈనెల 24కి వాయిదా వేసింది. నిందితుడు విజయ్ నాయర్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను ప్రస్తావించింది ఈడీ. ప్రభుత్వంలోని పెద్దలకు రూ.100కోట్ల అడ్వాన్స్ చెల్లించినట్లు పేర్కొంది. పాలసీ తయారీలో వినయ్ నాయరే కీలక పాత్ర పోషించాడని తెలిపింది. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అభిషేక్ బోయిన్పల్లి, ఆప్ సమాచార పర్యవేక్షకుడు విజయ్‌నాయర్‌లు కలిసి లంచాలు ఇచ్చినట్లు చెప్పింది. హోల్‌సెలర్ల నుంచి డబ్బులు వసూలు చేసి ప్రభుత్వ పెద్దలకు అందజేసినట్లు రిపోర్టులో ప్రస్తావించింది. ప్రభుత్వంలోని పెద్దలకు రూ.30కోట్ల వరకు చెల్లించారని, విజయ్ నాయర్ తనకు తాను ఢిల్లీ ఎక్సైజ్ ఉన్నతాధికారిగా పరిచయం చేసుకున్నాడని ఈడీ తెలిపింది. ఎక్సైజ్ పాలసీని తమవారికి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశాడని, పాలసీ తయారీకి 2 నెలల ముందే విజయ్ నాయర్ చేతుల్లోకి వచ్చినట్లు పేర్కొంది. చదవండి: శ్రద్ధ హత్య కేసు.. అడవిని జల్లెడ పట్టిన పోలీసులు.. 3 ఎముకలు స్వాధీనం