న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి మనీష్ సిసోడియా ఈడీ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఈ రిపోర్టులో మరోసారి కల్వకుంట్ల కవిత పేరును ప్రస్తావించారు. హైదరాబాద్‌లో ఐటీసీ కోహినూర్ వేదికగా కీలక చర్చలు జరిగినట్లు ఈడీ అధికారులు రిపోర్టులో పేర్కొన్నారు. కవిత, సిసోడియా మధ్య రాజకీయ అవగాహన ఉందని బుచ్చిబాబు స్టేట్‌మెంట్ ఇచ్చినట్లు తెలిపారు. డిల్లీ లిక్కర్ స్కాం హైదరాబాద్‌లోనే జరిగిందని చెప్పారు.
'హవాలా ద్వారా రూ.100 కోట్ల ముడుపులు పంపామని బుచ్చిబాబు ఒప్పుకున్నారు. కేజ్రీవాల్‌తో సిసోడియా, విజయ్ నాయర్ సంప్రదింపులు జరిపారు. డిల్లీ లిక్కర్ పాలసీలో కవితకు అనుకూలంగా వ్యవహరిస్తే ఆప్‌కు ముడుపులు ఇవ్వాలని సమావేశంలో చర్చలు జరిపారు. కవిత తరఫున అరుణ్‌చంద్ర పిళ్లై, సిసోడియా తరఫున విజయ్ నాయర్ పనిచేశారు. ఈ స్కాంలో సౌత్ గ్రూప్‌కు అనుకూలంగా వ్యవహరించినందుకు మద్యం కంపెనీలో కవితకు వాటాలు ఇచ్చారు.' అని రిమాండ్ రిపోర్టులో ఈడీ పేర్కొంది.
చదవండి: మనీష్ సిసోడియా తరఫున విజయ్ నాయర్ కవితను కలిశారు.. కోర్టులో ఈడీ
Comments
Please login to add a commentAdd a comment