manish sisodia
-
ప్రజాధనంతో విలాసవంతమైన శీష్ మహల్!
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఆప్, బీజేపీ తమ కత్తులకు పదునుపెడుతున్నాయి. మూ డో విడత అధికారం కైవసం చేసుకోవాలని ఆమ్ఆద్మీ పార్టీ..ఈసారి ఎలాగైనా గెలవాలని బీజేపీ పట్టుదలతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల చోటుచేసుకున్న పలు నేర ఘటనలను ప్రస్తావిస్తూ ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ శాంతి భద్రతల పరిస్థితి దారుణమంటూ కాషాయ దళంపై విమర్శలు గుప్పిస్తున్నారు. దీనికి బదులుగా అన్నట్లు, సీఎంగా ఉన్న సమయంలో కేజ్రీవాల్ 6 ఫ్లాగ్ స్టాఫ్ రోడ్డులోని అధికార నివాసానికి రూ.42 కోట్లు వెచ్చించిన అంశాన్ని బీజేపీ తెరపైకి తీసుకొచ్చింది. ప్రజాధనంతో విలాసవంతమైన శీష్ మహల్(అద్దాల మేడ), ‘7 స్టార్ రిసార్ట్’ను కట్టుకున్నారంటూ ఆ బంగ్లా వీడియోను మంగళవారం ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవ్ విడుదల చేశారు.కేజ్రీవాల్ కూడబెట్టిన నల్లధనానికి రుజువు ఇదే..‘సామాన్యుడని చెప్పుకునే కేజ్రీవాల్ నిర్మించిన అద్దాల మేడ ఇదే. దీన్ని గురించిన వాస్తవాలను మీ ముందుంచబోతున్నాను’ అని పేర్కొంటూ సచ్దేవ్.. ‘ఢిల్లీ ప్రజల కష్టార్జితాన్ని సొమ్ము చేసుకొని ఒక సామాన్యుడు అద్దాల మేడను నిర్మించాడు. అధికారంలోకి వస్తే ప్రభుత్వ కారు, బంగ్లా, భద్రతను తీసుకోనని చెప్పిన ఈయన, ఇప్పుడు వైభవోపేతమైన 7 స్టార్ రిసార్ట్ నిర్మించుకున్నాడు’అని పేర్కొ న్నారు. ‘రూ.1.9 కోట్ల విలువైన మార్బుల్ గ్రానైట్ లైటింగ్, రూ.1.5 కోట్లతో ఇన్స్టాలేషన్, సివిల్ వర్క్, రూ.35 లక్షల విలువైన జిమ్, స్పా పరికరాలు కలిపి మొత్తంగా వీటికే రూ.3.75 కోట్లు ఖర్చు చేశారు. కేజ్రీవాల్ కూడబెట్టిన నల్లధనానికి రుజువు ఇదే’ అని విమర్శించారు. ప్రభుత్వ వనరులను వ్యక్తిగత అవసరాలకు వినియోగించుకోబోమని ఇచ్చిన హామీని కేజ్రీవాల్ ఉల్లంఘించారన్నారు. ఈ డబ్బుతో నిరుపేదలకు 34 ఇళ్ల ఫ్లాట్లు, లేదా 326 ఈ–రిక్షాలను అందజేయవచ్చన్నారు. బీజేపీ ఎంపీ ప్రవీణ ఖండేల్వాల్ స్పందిస్తూ, కేజ్రీవాల్ చెప్పిన ‘ఆమ్ ఆద్మీ’కథలను అద్దాల మేడ బట్టబయలు చేసిందని వ్యాఖ్యానించారు.తిప్పికొట్టిన ఆప్ఈ విమర్శలను ఆప్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తిప్పికొట్టారు. ‘హరియాణా, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో పాఠశాలలు, మధ్యాహ్న భోజనం, ఆస్పత్రుల నిధుల దుర్వినియోగంపై అడిగే ప్రశ్నలకు సమాధానమివ్వడానికి బదులుగా, వారు కేజ్రీవాల్ నివసించిన అధికారిక నివాసంపై దృష్టి పెట్టారు. విద్య, ఆరోగ్య సంస్కరణల గురించి ప్రజలు అడుగుతుంటే, బీజేపీ నేతలు సీఎం నివాసం గురించి మాట్లాడుతున్నారు’అని ఎదురుదాడికి దిగారు.చదవండి: ముచ్చటగా మూడోసారి.. తేల్చేసిన కేజ్రీవాల్రానున్న ఎన్నికల్లో ఈ అద్దాల మేడ అంశాన్నే ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ యోచిస్తోందని, ఈ అంశం రాజకీయంగా ఆప్‌ను ఇరుకున పెట్టేదేనని విశ్లేషకులు అంటున్నారు. కాగా, ఢిల్లీ ముఖ్యమంత్రి నివాసం ఆధునీకరణకు అయిన మొత్తం వ్యయం రూ.52.71 కోట్లని విజిలెన్స్ డైరెక్టరేట్ 2023లో లెఫ్టినెంట్ గవర్నర్‌కు అందజేసిన నివేదికలో పేర్కొంది. రూ.10 లక్షల బీమా, కుమార్తెల పెళ్లికి సాయంఆటో డ్రైవర్లకు కేజ్రీవాల్ ఎన్నికల హామీఢిల్లీ అసెంబ్లీకి మరో రెండు నెలల్లో జరగాల్సిన ఎన్నికలకు ప్రచారంలో ఆప్ అధినేత కేజ్రీవాల్ ఆటో డ్రైవర్లకు పలు హామీలను ప్రకటించారు. మంగళవారం కేజ్రీవాల్ కొండ్లిలో ఆటో డ్రైవర్ నవనీత్ కుటుంబంతో మాట్లాడారు. ‘ఆటో డ్రైవర్ల కోసం ఐదు గ్యారెంటీలను ప్రకటిస్తున్నాను. అవి.. రూ.10 లక్షల వరకు జీవిత బీమా, రూ.5 లక్షల వరకు ప్రమాద బీమా, కుమార్తెల వివాహానికి రూ.1 లక్ష సాయం, పోటీ పరీక్షలకు హాజరయ్యే వీరి పిల్లలకు ఉచిత శిక్షణ ఇస్తాం’ అని తెలిపారు. -
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కీలక పరిణామం
ఢిల్లీ : మద్యం పాలసీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీష్ సిసోడియాకు సుప్రీం కోర్టు ఊరట కల్పించింది. మద్యం పాలసీ కేసులో తాను వారంలో సోమవారం, బుధవారం పోలీస్‌స్టేషన్‌కు హాజరవ్వాల్సి వస్తుందని, ఈ అంశంలో తనకు వెసులు బాటు కల్పించాలని కోరుతూ సిసోడియా సుప్రీం కోర్టును ఆశ్రయించారు.సిసోడియా పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయ్, కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సిసోడియా పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం తెలిపింది. అయితే, కేసుకు సంబంధించిన విచారణకు మాత్రం తప్పని సరిగా హాజరు కావాలని సూచించింది. తదుపరి విచారణను డిసెంబర్ 17కి వాయిదా వేసింది. माननीय सुप्रीम कोर्ट का हृदय से आभार, जिसने ज़मानत की शर्त को हटाकर राहत प्रदान की है। यह निर्णय न केवल न्यायपालिका में मेरी आस्था को और मजबूत करता है, बल्कि हमारे संवैधानिक मूल्यों की शक्ति को भी दर्शाता है। मैं हमेशा न्यायपालिका और संविधान के प्रति अपने कर्तव्यों का सम्मान करता… https://t.co/er7qTn2QMU— Manish Sisodia (@msisodia) December 11, 2024 మద్యం పాలసీ కేసులో 17నెలల జైలు జీవితంఢిల్లీ మద్యం విధానానికి సంబంధించిన కేసులో గతేడాది ఫిబ్రవరి 26న సీబీఐ అధికారులు అప్పటి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మనీష్ సిసోడియాను అరెస్ట్ చేశారు. అరెస్టయిన రెండు రోజుల తర్వాత మంత్రి పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి గత 17 నెలలకు పైగా ఆయన జైల్లోనే ఉన్నారు. ఈ క్రమంలో బెయిల్ కోరుతూ ఆ మధ్య సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం ఈ ఏడాది ఆగస్ట్ 9న పలు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా రూ.10లక్షల వ్యక్తిగత పూచీకత్తు, ఆ మొత్తానికి ఇద్దరు షూరిటీలతో ఆయనను విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. తన పాస్‌పోర్ట్‌ను అప్పగించాలని, సాక్షులను ప్రభావితం చేయకూడదని ఆదేశించింది. -
అసెంబ్లీ ఎన్నికలకు ఆప్ రెండో జాబితా.. సిసోడియా స్థానం మార్పు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనునన్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అధికార ఆమ్ ఆద్మీ పార్టీ దూకుడు కొనసాగిస్తోంది. ఎన్నికల షెడ్యూల్, తేదీలు ప్రకటించకముందే.. ప్రజాక్షేత్ర సమరానికి సిద్ధమవుతోంది. ఈ మేరకు ఆప్ తమ అభ్యర్థులను ప్రకటిస్తోంది. ఇప్పటికే తొలి జాబితాను విడుదల చేసిన ఆప్.. తాజాగా సోమవారం 20 అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను ప్రకటించింది.ఈ జాబితా ప్రకారం ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జంగ్‌పురా నుంచి పోటీ చేయనున్నారు. ప్రస్తుతం సిసోడియా తూర్పు ఢిల్లీలోని పట్పర్గంజ్ నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తుండగా.. ఆయన్ను జంగ్‌పురాకు మార్చారు. పట్పర్గంజ్ నుంచి ఇటీవల పార్టీలో చేరిన సివిల్ సర్వీసెస్ ఉపాధ్యాయుడు అవధ్ ఓజాను ఆప్ బరిలోకి దించుతోంది. 2013లో ఢిల్లీ అసెంబ్లీ మాజీ స్పీకర్ మణీందర్ సింగ్ ధీర్ గెలిచినప్పటి నుంచి జంగ్‌పురా సీటు ఆప్‌లో ఉంది. అనంతరం మణీందర్ సింగ్ బీజేపీలోకి వెళ్లడంతో 2015, 2020 ఎన్నికలలో ఆప్ ప్రవీణ్ కుమార్‌ను పోటీకి నిలిపింది. ఆయనే రెండు ఎన్నికల్లోనూ విజయం సాధించారు. అయితే ఈసారి జంగ్‌పురా నుంచి ఆప్ సిసోడియాను ఎంపిక చేసింది. ప్రస్తుత జంగ్‌పురా ఎమ్మెల్యే ప్రవీణ్‌కుమార్‌కు జనక్‌పురి సీటు కల్పించింది.కాగా సిసోడియా 2013లో పట్పర్గంజ్ నుంచి తన ప్రత్యర్ధి బీజేపీ అభ్యర్థి నకుల్ భరద్వాజ్‌పై విజయం సాధించి తొలిసారి ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఫిబ్రవరి 2015 ఎన్నికలలో బిజెపికి చెందిన వినోద్ కుమార్ బిన్నీపై, గత 2020 ఎన్నికలలో రవీందర్ సింగ్ నేగిపై విజయం సాధించారు.ఇదిలా ఉండగా గత నెలలో విడుదల చేసిన తొలి జాబితాలో 11 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించగా.. నేటిజాబితాలో 20 అభ్యర్థులను వెల్లడించింది. ఇక 39 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. -
జైలు జీవితంపై సిసోడియా భావోద్వేగ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ:లిక్కర్‌స్కామ్ కేసులో జైలులో ఉన్నప్పటి అనుభవాలను ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్‌సిసోడియా పార్టీ నేతలతో పంచుకున్నారు. ఆమ్ఆద్మీపార్టీ (ఆప్) ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆదివారం(సెప్టెంబర్22) జరిగిన ‘జనతాకీ అదాలత్’ కార్యక్రమంలో పాల్గొన్న సిసోడియా తన జైలు అనుభవాలు వెల్లడించారు.‘జైలులో ఉన్నపుడు అనేక బెదిరింపులు వచ్చాయి. జైలులోనే చంపేస్తామన్నారు. కేజ్రీవాల్ మీకు వ్యతిరేకంగా సాక్ష్యమిచ్చారని నాకు చెప్పారు. మీరు కూడా కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలని కోరారు. అలా చెబితే మీరు కేసు నుంచి బయటపడొచ్చన్నారు. పార్టీ మారీ బీజేపీలో చేరాలని సూచించారు.జైలులో ఉన్న సమయంలో ఎన్ఫోర్స్మెంట్డైరెక్టరేట్(ఈడీ) నా బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ చేసింది. కొడుకు స్కూల్ ఫీజు కట్టేందుకు కూడా అడుక్కోవాల్సి వచ్చింది. ఎన్ని చేసినా లక్ష్మణున్ని రాముడి నుంచి ఏ రావణుడు వేరు చేయలేడు. కేజ్రీవాల్ నా రాజకీయ గురువు’అని సిసోడియా అన్నారు. కాగా, ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మనీష్‌సిసోడియా ఏకంగా ఏడాదిన్నరపాటు తీహార్జైలులో ఉన్నారు. ఇటీవలే ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో విడుదలయ్యారు. ఇదే కేసులో నిందితులు కేజ్రీవాల్, కల్వకుంట్ల కవితకు కూడా సుప్రీంకోర్టులోనే ఇటీవలే బెయిల్ మంజూరైంది. ఇదీ చదవండి..ప్రధాని మోదీ నాపై కుట్ర పన్నారు: కేజ్రీవాల్ -
ఇప్పుడు ఎన్నికలొస్తే.. 70 సీట్లూ మావే: మనీష్ సిసోడియా
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సీనియర్ నేత మనీష్ సిసోడియా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే మొత్తం 70 స్థానాల్లో తమ పార్టీనే విజయం సాధిస్తుందని అన్నారు.రాజేంద్ర నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టిన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బీజేపీపై మాటల దాడి చేశారు. తనను, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను తప్పుడు కేసుల్లో ఇరికించి, జైలులో పెట్టారని ఆరోపించారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో తాను చేపడుతున్న ప్రచారంలో తనకు లభించిన అభిమానాన్ని సిసోడియా గుర్తు చేసుకుంటూ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధిస్తుందని, మొత్తం ఓట్లలో 70 శాతం ఓట్లు సాధిస్తుందని వ్యాఖ్యానించారు.తాను ఏ తప్పూ చేయలేదు. అందుకే జైలు నుంచి నవ్వుతూ బయటకు వచ్చాను. మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్‌తో సహా అనేక ప్రభుత్వాలను బీజేపీ పడగొట్టిందని, తమ నాయకులపైకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)లను పంపడం ద్వారా పార్టీని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేసిందన్నారు. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ ఏమాత్రం బెదరకుండా మరింత బలం పుంజుకున్నదని అన్నారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్ త్వరలోనే మన మధ్యకు వస్తారని ఆయన అన్నారు.వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను 62 స్థానాల్లో ఆప్ విజయం సాధించింది. అయితే ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలో ఆప్ ఖాతా కూడా తెరవలేకపోయింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి 17 నెలలు తీహార్ జైలులో గడిపిన మనీష్ సిసోడియా ఈ నెల ప్రారంభంలో విడుదలయ్యారు. -
ఇన్ని నెలలు జైల్లో ఉంటానని ఊహించలేదు: మనీష్ సిసోడియా
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టైన ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోడియా ఇటీవల తిహార్ జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. గతేడాది ఫిబ్రవరిలో అరెస్ట్ అయిన సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో దాదాపు 17 నెలల అనంతరం ఆగష్టు 9న జైలు నుంచి బయటకు వచ్చారు. ఈ సందర్భంగా తాజాగా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.. ఇంత కాలం తాను జైలులో ఉంటానని ఎప్పుడూ అనుకోలేదని తెలిపారు. విచారణను పొడిగించాలనే ఉద్ధేశ్యంతోనే తనపై ఆరోపణలు చేశారని అన్నారు. కొన్ని నెలల ముందు కూడా తాను జైలుకు వెళ్తానని ఊహించలేదని తెలిపారు. ‘రాజకీయాల్లో ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోవడం మామూలే. కాబట్టి నాకు లోపల నుంచి నమ్మకం ఉండేది. ఒక వ్యక్తిని జైలుకు పంపడం లేదా అరెస్టు చేయడం వెనుక ఏదో ఒక కారణం ఉంటుందని భావించాను.సంస్కరణలు తీసుకురావాలి, అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలి, ప్రజలతో మమేకం అవ్వాలని క్రియాశీల రాజకీయాల్లోకి ఎవరైనా రావాలి అనుకున్నప్పుడు వారికి రెడ్ కార్పెడ్ పరిచి స్వాగతం లభిస్తుందని ఎప్పుడూ ఆశించకూడదు. అదే విధంగా నేను కూడా మానసికంగా సిద్ధమయ్యాను. కానీ మరీ 17 నెలల పాటు మద్యం పాలసీ కేసులో జైలులో నేను ఎప్పుడూ అనుకోలేదుఆరోపణలు కల్పితమే..పీఎంఎల్ చట్టం కింద ఈడీ, సీబీఐ నామీద కేసులు పెట్టింది. ఈ చట్టం ప్రధానంగా ఉగ్రవాదులు, డ్రగ్స్ మాఫియాలకు నిధులను ఆపడానికి ఉద్దేశించిందిది. ఈ చట్టం ప్రకారం బెయిల్ సాధించడం కష్టం. అందుకే నన్ను చాలా కాలం జైలులో ఉంచడమే వారి ఏకైక లక్ష్యం. ముఖ్యంగా నా భార్య అనారోగ్యంతో ఉన్నప్పుడు నేను జైలులో ఉండటం నాకు, నా కుంటుబానికి ఇబ్బందిగా ఉండేది. . అయితే నేను కృంగిపోకూడదని బలంగా నిశ్చయించుకున్నాను.జైలులో ఉన్నప్పుడు, దాదాపు 15 నుంచి 16 గంటలు, సెల్లో ఏకాంతంగా ఉండాల్సి ఉంటుంది. ఎవరితోనూ సంభాషణకు అవకాశం ఉండదు. అందుకే నాతో నేను స్నేహం చేయడం అలవాటు చేసుకున్నాను.’ అని తెలిపారు.మళ్లీ డిప్యూటీ సీఎంగా..కాగా ఢిల్లీ ప్రభుత్వంలో తిరిగి ఉప ముఖ్యమంత్రిగా ఉండాలనుకుంటున్నారా అనే ప్రశ్నకు సిసోడియా స్పందిస్తూ.. ప్రస్తుతానికి, పార్టీ కోసం పని చేయడం గర్వంగా ఉందని, పరిపాలనలో భాగం కావడానికి తొందరపడటం లేదని అన్నారు.‘నేను జైలు నుంచి బయటకు వచ్చి నాలుగు రోజులైంది. సీఎం అరవింద్ కేజ్రీవాల్ త్వరలో తిరిగి వస్తాడు. ఆయన వచ్చాక నేను పార్టీ ప్రమోషన్లో ఉండాలా లేదా ప్రభుత్వంలో ఉండాలా అని ముఖ్యమంత్రి, పార్టీ సీనియర్ నాయకత్వం నిర్ణయిస్తుంది. ’ అని తెలిపారు. -
నియంతృత్వంపై పోరాడదాం: సిసోడియా
న్యూఢిల్లీ: దేశంలో నియంతృత్వం కొనసాగుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఆరోపించారు. నియంతృత్వ పరిపాలనకు వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. నియంతృత్వాన్ని ప్రశి్నస్తూ ప్రతిపక్షాలన్నీ ఒక్కటై బిగ్గరగా గర్జిస్తే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ 24 గంటల్లో జైలు నుంచి బయటకు వస్తారని చెప్పారు. నిజాయతీకి ప్రతిరూపమైన కేజ్రీవాల్‌ను కుట్రపూరితంగా జైల్లో పెట్టారని మండిపడ్డారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో తీహార్ జైలు నుంచి విడుదలైన సిసోడియా శనివారం ‘ఆప్’ కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో మాట్లాడారు. 17 నెలల తర్వాత స్వతంత్రమైన సూర్యోదయం తన భార్యతో కలిసి తేనీరు సేవిస్తున్న ఫొటోను మనీష్ సిసోడియా శనివారం సోషల్ మీడియాలో పోస్టుచేశారు. 17 నెలల తర్వాత స్వతంత్రమైన సూర్యోదయాన మొదటి తేనీరు అని పేర్కొన్నారు. -
భార్యతో టీ తాగుతూ.. మనీష్ సిసోడియా ఎమోషనల్
-
భార్యతో టీ తాగుతూ.. మనీష్ సిసోడియా భావోద్వేగ సెల్ఫీ
న్యూఢిల్లీ: లిక్కర్ కేసులో అరెస్టయి పదిహేడు నెలల తర్వాత తీహార్ జైలు నుంచి విడుదలైన మనీష్ సిసోడియా ఇంటి జీవితాన్ని ఆస్వాదించడం ప్రారంభించారు. శుక్రవారం సాయంత్రం తీహార్ జైలు నుంచి విడుదలైన సిసోడియా శనివారం(ఆగస్టు10) ఉదయం ఇంట్లో తన భార్యతో కలిసి టీ తాగుతూ తీసుకున్న సెల్ఫీ చిత్రాన్ని ఎక్స్(ట్విటర్)లో పోస్టు చేశారు. आज़ादी की सुबह की पहली चाय….. 17 महीने बाद!वह आज़ादी जो संविधान ने हम सब भारतीयों को जीने के अधिकार की गारंटी के रूप में दी है।वह आज़ादी जो ईश्वर ने हमें सबके साथ खुली हवा में साँस लेने के लिए दी है। pic.twitter.com/rPxmlI0SWF— Manish Sisodia (@msisodia) August 10, 2024ఈ సందర్భంగా ‘17 నెలల తర్వాత.. ఫస్ట్ మార్నింగ్ టీ ఆఫ్ ఫ్రీడమ్. భారతీయులందరికీ రాజ్యాంగం ఇచ్చిన జీవించే హక్కు నుంచి వచ్చిందే ఈ స్వేచ్ఛ’అని తన ట్వీట్‌కు సిసోడియా భావోద్వేగపూరిత కామెంట్స్ జత చేశారు. గత ఏడాది ఫిబ్రవరిలో లిక్కర్‌స్కామ్ కేసులో అరెస్టయిన సిసోడియాకు శుక్రవారం సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. దీంతో ఆయన 17 నెలల తర్వాత జైలు నుంచి విడుదలయ్యారు. -
ఢిల్లీ లిక్కర్ కేసులో సిసోడియాకు బెయిల్
-
మళ్లీ డిప్యూటీ సీఎంగా మనీష్ సిసోడియా..?
న్యూఢిల్లీ: లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా బెయిల్‌పై విడుదలవడంతో కొత్త వాదనకు తెరలేచింది. సిసోడియాను మళ్లీ డిప్యూటీ సీఎంగా నియమిస్తారని ఆమ్ఆద్మీపార్టీ(ఆప్)వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా లిక్కర్ కేసులో జైలులో ఉండడంతో సిసోడియా డిప్యూటీ సీఎంగా ఉంటేనే ఇటు పాలనాపరంగా అటు రాజకీయంగా పార్టీకి బలం చేకూరుతుందని ఆప్ నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయనను త్వరలోనే మళ్లీ డిప్యూటీ సీఎంగా నియమించి కీలకమైన ఆర్థిక, విద్యా శాఖలు కేటాయిస్తారని చెబుతున్నారు.గతేడాది ఫిబ్రవరిలో అరెస్టయిన తర్వాత సిసోడియా తన డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేశారు. లిక్కర్ కేసులో అరెస్టయి తీహార్ జైలులో రిమాండ్‌లో ఉన్న సిసోడియాకు శుక్రవారం(ఆగస్టు 9) సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో శుక్రవారం సాయంత్రమే ఆయన జైలు నుంచి విడుదలై సీఎం కేజ్రీవాల్ కుటుంబ సభ్యులను కలిశారు.ప్రస్తుతం సిసోడియా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. -
Supreme Court: సిసోడియాకు బెయిల్
న్యూఢిల్లీ: ఢిల్లీ మధ్య కుంభకోణం కేసులో 17 నెలల క్రితం అరెస్టయి తిహార్ జైలులో విచారణ ఖైదీగా గడుపుతున్న ఆప్ నేత, నాటి ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు ఎట్టకేలకు సుప్రీంకోర్టులో బెయిల్ దొరికింది. సుదీర్ఘకాలంపాటు కేసు దర్యాప్తును సాగదీసి విచారణ ఖైదీకుండే హక్కులను కాలరాయలేమని శుక్రవారం బెయిల్ ఉత్తర్వులిస్తూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ మేరకు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌ల ధర్మాసనం సిసోడియాకు బెయిల్‌ను మంజూరుచేస్తూ 38 పేజీల తీర్పు వెలువరించింది. బెయిల్ పిటిషన్‌పై ఆగస్ట్ ఆరో తేదీన వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్‌చేసి ఆగస్ట్ 9వ తేదీన వెలువరించింది.వైకుంఠపాళి ఆడించారు.. ‘‘బెయిల్ అనేది నియమం. బెయిల్‌ను తిరస్కరించి విచారణ ఖైదీగా జైలుకు పరిమితం చేయడం అనేది ఒక మినహాయింపు’’ మాత్రమే అనే సూత్రాన్ని ట్రయల్ కోర్టులు, హైకోర్టులు జ్ఞప్తికి తెచ్చుకోవాల్సిన సమయమిది. బెయిల్ విషయంలో విచారణ కోర్టులు, హైకోర్టులు సేఫ్ గేమ్ ఆడుతున్నాయి. మనీశ్‌పై సీబీఐ, ఈడీలు దర్యాప్తు పూర్తిచేసి జూలై 3 కల్లా చార్జ్షీట్లు సమర్పిస్తాయని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గతంలో హామీ ఇచ్చారు. కానీ అది జరగలేదు. సిసోడియాను ట్రయల్ కోర్టుకు, అక్కడి నుంచి హైకోర్టుకు, తర్వాత సుప్రీంకోర్టుకు, మళ్లీ ట్రయల్ కోర్టుకు తిప్పుతూ ఆయనతో వైకుంఠపాళి ఆట ఆడించారు. బెయిల్ అనివార్యమైన కేసుల్లోనూ బెయిల్ తిరస్కరించడంతో సంబంధిత పిటిషన్లు సుప్రీంకోర్టుకు వెల్లువలా వస్తున్నాయి. సమాజంతో మమేకమైన సిసోడియా లాంటి వ్యక్తులను శిక్ష ఖరారు కాకుండానే సుదీర్ఘ కాలం నిర్బంధించి ఉంచకూడదు. స్వేచ్ఛగా, వేగవంతమైన విచారణను కోరడం నిందితుడికి రాజ్యాంగం ప్రసాదించిన హక్కు. అయితే కేసు విచారణ నత్తనడకన సాగడానికే సిసోడియానే కారణమన్న కిందికోర్టు అభిప్రాయం వాస్తవదూరంగా ఉంది’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ విషయంలో సిసోడియాకు బెయిల్‌ను తిరస్కరిస్తూ మే 21వ తేదీన ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు పక్కనబెట్టింది. ‘‘రూ.10 లక్షల వ్యక్తిగత బాండ్‌తోపాటు అదే మొత్తానికి మరో రెండు షూరిటీలను సమర్పించాలి. పాస్ట్‌పోర్ట్‌ను ప్రత్యేక ట్రయల్ కోర్టులో ఇచ్చేయాలి. సాక్ష్యాధారాలను ధ్వంసంచేయకూడదు. సాక్షులను ప్రభావితం చేయకూడదు. దర్యాప్తు అధికారి ఎదుట ప్రతి సోమ, గురు వారాల్లో ఉదయం 10–11 గంటల మధ్య హాజరు కావాలి’’ అని కోర్టు షరతులు విధించింది. తొలుత సీబీఐ.. ఆ తర్వాత ఈడీడిఫ్యూటీ సీఎంగా ఉన్న సిసోడియాను మద్యం కేసులో 2023 ఫిబ్రవరి 26వ తేదీన సీబీఐ అరెస్ట్‌చేసింది. తర్వాత రెండు రోజులకే ఆయన తన పదవికి రాజీనామా చేశారు. మార్చి 9న మనీలాండరింగ్ కోణంలో కేసు నమోదుచేసి ఈడీ సైతం జ్యుడీషియల్ కస్టడీలో ఉండగానే ఆయనను అరెస్ట్‌చేసింది.అంబేడ్కర్‌కు రుణపడ్డా: సిసోడియాతీర్పు నేపథ్యంలో శుక్రవారం తీహార్ జైలు నుంచి సిసోడియా విడుదలయ్యారు. పెద్దసంఖ్యలో జైలు వద్దకొ చ్చిన ఆప్ కార్యకర్తలు ఆయనపై పూలు చల్లుతూ స్వాగతం పలికారు. ‘‘ నిరంకుశ కేంద్రప్రభుత్వ చెంప చెళ్లు మనిపించేందుకు రాజ్యాంగ అధికారాలను వినియోగించిన కోర్టుకు నా కృతజ్ఞతలు. శక్తివంతమైన రాజ్యాంగం, ప్రజా స్వామ్యం వల్లే బెయిల్ పొందగలిగా. ఈ బెయిల్ ఉత్తర్వు చూశాక జీవితాంతం రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌కు రుణపడిపోయా. ఈ అనైతిక యుద్ధానికి రాజ్యాంగబద్ధంగా తార్కిక ముగింపు పలికాం. ఏదో ఒక రోజు ఈ చెడు సంస్కృతి అంతమవుతుంది. అప్పుడు బెయిల్‌పై కేజ్రీవాల్ కూడా విడుదల అవుతారు’’ అని సిసోడియా అన్నారు.ఆప్ హర్షంసిసోడియాకు బెయిల్‌పై ఆప్ పార్టీ హర్షం వ్యక్తంచేసింది. ‘‘ సత్యమేవ జ యతే. ఢిల్లీలో విద్యా విప్ల వానికి నాంది పలికిన సిసోడియాకు ఇది గొప్ప విజయం. ఇది విద్యా విజయం, విద్యా ర్థుల విజయం’’ అని ఢిల్లీ మహిళా మంత్రి అతిశి వ్యాఖ్యానించారు. -
17 నెలల తర్వాత.. జైలు నుంచి విడుదలైన మనీష్ సిసోడియా
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తిహార్ జైలు నుంచి విడుదల అయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో.. శుక్రవారం సాయంత్రం తిహార్‌జైలు నుంచి బయటకు వచ్చారు. సిసోడియాకు ఘన స్వాగతం పలికేందుకు ఆప్ నేతలు అతిషి, సంజయ్ సింగ్.. పార్టీ కార్యకర్తలు జైలు గేటు వద్దకు భారీగా చేరకున్నారు.జైలు నుంచి విడుదలైన సందర్భంగా మనీష్ సిసోడియా మాట్లాడుతూ.. ప్రజల ప్రేమ, దేవుడి ఆశీర్వాదం, నిజానికి ఉన్న శక్తి కారణంగానే నేడు తాను జైలు నుంచి విడుదలైనట్లు తెలిపారు. అన్నింటికి మించి తనను దేశ రాజ్యాంగమే రక్షించింనట్లు పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు రుణపడి ఉంటానని తెలిపారు.నియంతృత్వ ప్రభుత్వాలు, చట్టాల ద్వారా ప్రతిపక్షనాయకులను కటకటాల వెనక్కి నెట్టేందుకు ప్రయత్నిస్తే.. రాజ్యాంగం వారిని తప్పక కాపాడుతుంది. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ కన్న కల. రాజ్యాంగ శక్తితోనే సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా బయటకు వస్తారని నేను మీకు హామీ ఇస్తున్నాను’ అని పేర్కొన్నారు.#WATCH | Former Delhi Deputy CM and AAP leader Manish Sisodia greets party leaders and workers who have gathered outside Tihar Jail to welcome him. He was granted bail by Supreme Court today, in Delhi excise policy case. pic.twitter.com/lZTDT5iH3l— ANI (@ANI) August 9, 2024కాగా ఢిల్లీ లిక్కర్ కేసులో సుప్రీంకోర్టు శుక్రవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. సిసోడియా పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ బి.ఆర్ గవాయ్, జస్టిస్ కె.వి. విశ్వనాథన్ ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా కొన్ని షరతులు విధించింది. రూ.10లక్షల వ్యక్తిగత పూచీకత్తు, ఆ మొత్తానికి ఇద్దరు షూరిటీలతో ఆయనను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సిసోడియా తన పాస్‌పోర్ట్‌ను అప్పగించాలని, సాక్షులను ప్రభావితం చేయకూడదని ఆదేశించింది. ఈ తీర్పుతో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.కాగా లిక్కర్ పాలసీకి సంబంధించిన సీబీఐ కేసులో గతేడాది ఫిబ్రవరి 26 ఆయన్ను అరెస్ట్ చేసింది. ఆ తరువాత రెండు వారాలకే ఈడీ కేసులో అదుపులోకి తీసుకున్నారు. .దాదాపు 17 నెలల జైలు శిక్ష అనంతరం నేడు బెయిల్‌పై విడుదలయ్యారు.#WATCH | Former Delhi Deputy CM and AAP leader Manish Sisodia walks out of Tihar Jail. He was granted bail in Delhi excise policy case by Supreme Court today. pic.twitter.com/pBEEkvQZXz— ANI (@ANI) August 9, 2024 -
‘మా హీరోకి బెయిల్ వచ్చింది’.. అంత సంబరపడిపోకండి.. ఆప్‌పై బీజేపీ సెటైర్లు
ఢిల్లీ : ఢిల్లీ మద్యం పాలసీ కేసులో 17 నెలల క్రితం అరెస్టైన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనిష్ సిసోడియాకు భారీ ఊరట దక్కింది. శుక్రవారం (ఆగస్ట్ 09) ఆయనకు సుప్రీం కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆప్ నేతలు మా ఢిల్లీ హీరోకి బెయిల్ వచ్చిందని సంతోషం వ్యక్తం చేస్తుంటే..అంత సంబరపడిపోకండి అంటూ’బీజేపీ నేతలు ఘాటు వ్యాఖ్యలే చేస్తున్నారు.మద్యం విధానానికి సంబంధించిన కేసులో గతేడాది ఫిబ్రవరి 26న సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి జైల్లో ఉన్న ఆయన బెయిల్ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై ఇవాళ సుప్రీం కోర్టు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సమయంలో సుప్రీం ధర్మాససం ఏ నిందితుడిని కాలపరిమితి లేకుండా జైలులో ఉంచలేరని వ్యాఖ్యానించింది. చివరికి సిసోడియాకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది.సుప్రీం కోర్టులో సిసోడియాకు బెయిల్ రావడంపై ఆప్‌తో పాటు ఇతర ఇండియా కూటమి నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆప్ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా ఎక్స్ వేదికగా స్పందించారు. ఢిల్లీ విద్యా విధానంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన మా హీరో మనీష్ సిసోడియాకు బెయిల్ రావడం సంతోషంగా ఉంది. ఆయనకు బెయిల్ రావడంపై ఈ రోజు దేశమంతా సంతోషంగా ఉందని ట్వీట్ చేశారు. - రాఘవ్ చద్దామరో ఆప్ నేత, ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి సంతోషం వ్యక్తం చేశారు. అదే మద్యం పాలసీ కేసులో ఈ ఏడాది మార్చిలో అరెస్టై జైలు జీవితం అనుభవిస్తున్న ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ త్వరలోనే ఈ కేసు నుంచి విముక్తి కలుగుతుందని అన్నారు.నిజం గెలిచింది. 17 నెలల తర్వాత సిసోడియాకు ఈ రోజే బెయిల్ వచ్చింది. ఇది ఢిల్లీ ప్రజల విజయం. తర్వలోనే కేజ్రీవాల్‌కు సైతం బెయిల్ లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.- అతిషిమద్యం పాలసీ కేసులో అరెస్టై ఆరునెలల జైలు శిక్షను అనుభవించి.. బెయిల్‌పై విడుదలైన ఆప్ నేత సంజయ్ సింగ్ మాట్లాడుతూ.. నియంతృత్వానికి ఈ తీర్పు చెంపదెబ్బలాంటిందని స్పష్టం చేశారు. - సంజయ్ సింగ్#WATCH | On Supreme Court granted bail to AAP leader Manish Sisodia, Delhi BJP President Virendraa Sachdeva says, "Getting bail does not mean that someone is not guilty. Manish Sisodia has got bail but the investigation is still on and the BJP has always respected the court's… pic.twitter.com/qtmea7H7oG— ANI (@ANI) August 9, 2024అదే సమయంలో ఆప్ నేతల్ని టార్గెట్ చేస్తూ బీజేపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. ‘సిసోడియాకు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును బీజేపీ గౌరవిస్తుందంటూనే .. కేసులో నిందితుడికి బెయిల్ రావడం అంటే అభియోగాల నుండి విముక్తి పొందడం కాదు’అని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా అన్నారు. ‘విచారణలు జరుగుతున్నాయి.. త్వరలో కోర్టు సాక్ష్యాలను చూస్తుంది’ అని మాట్లాడారు. అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా లేదా ఇతరులు ఎవరైనా సరే.. మద్యం పాలసీ కుంభకోణానికి మధ్యవర్తిత్వం వహించారని, ఈ అంశం ప్రజా కోర్టులో అందరి ముందు ఉందని పునుద్ఘాటించారు. -
సిసోడియాకు బెయిల్.. కేజ్రీవాల్ కేసుకు కూడా ప్రయోజనం: లాయర్
న్యూఢిల్లీ: ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు బెయిల్ లభించిన విషయం తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ కేసులో సుప్రీంకోర్టు సిసోడియాకు శుక్రవారం బెయిల్ మంజూరు మంజూరు చేసింది. దీంతో సిసిఓడియా రేపు తిహార్ జైలు నుంచి విడుదల కానున్నారు.ఈ సందర్భంగా సిసోడియా తరపున కోర్టులో వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ మీడియాతో మాట్లాడుతూ. విధివిధానాలు పూర్తయిన తర్వాత సిసోడియా శనివారం తిహార్ జైలు నుండి విడుదల కానున్నారని తెలిపారు. ఈ తీర్పు సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేసుకు కూడా ప్రయోజనం చేకూరుస్తుందని పేర్కొన్నారు.అయితే లిక్కర్ పాలసీకి సంబంధించిన ఈడీ కేసులో కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చినప్పటికీ సీబీఐ కేసులో బెయిల్ రాకపోవడంతో ఆయన ఇంకా జైలులోనే ఉన్నారు. సీబీఐ కేసులో జ్యుడీషియల్ కస్టడీని ఆగష్టు 20వరకు కోర్టు పొడిగించింది. కాగా లిక్కర్ పాలసీకి సంబంధించిన సీబీఐ కేసులో గతేడాది ఫిబ్రవరి 26న అరెస్టు అయ్యారు. ఆ తరువాత రెండు వారాలకే ఈడీ కేసులో అదుపులోకి తీసుకున్నారు. 18 నెలలుగా జైల్లోనే ఉన్నారు. ఈ క్రమంలో బెయిల్ కోరుతూ ఆ మధ్య సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ బి.ఆర్ గవాయ్, జస్టిస్ కె.వి. విశ్వనాథన్ ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది.రూ.10లక్షల వ్యక్తిగత పూచీకత్తు, ఆ మొత్తానికి ఇద్దరు షూరిటీలతో ఆయనను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా కొన్ని షరతులు విధించింది. సిసోడియా తన పాస్‌పోర్ట్‌ను అప్పగించాలని, సాక్షులను ప్రభావితం చేయకూడదని ఆదేశించింది.ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ఏ నిందితుడిని కాలపరిమితి లేకుండా జైలులో ఉంచలేరు. కేసు విచారణలో పురోగతి లేకపోయినా.. సుదీర్ఘకాలం ఆ వ్యక్తిని జైల్లో ఉంచడం సరికాదు. అది ఆ వ్యప్రాథమిక హక్కులను కాలరాయడమే అవుతుంది. బెయిల్‌కు దరఖాస్తు చేసుకోవడం, ఉపశమనం పొందడం వారి హక్కు. ‘బెయిల్ అనేది నియమం.. జైలు మినహాయింపు’ అనే విషయాన్ని ట్రయల్ కోర్టులు, హైకోర్టులు గ్రహించాల్సిన సమయం ఆసన్నమైంది’. అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.ప్రస్తుతం జైలు నంబర్ 1లో ఉన్న ఆయన.. ఖైదీలను విడుదల చేయడానికి సాధారణంగా ఉపయోగించే గేట్ నంబర్ 3 ద్వారా బయటకు అవకాశం ఉందని తీహార్ జైలు వర్గాలు సూచించాయి. అయితే, భద్రతాపరమైన సమస్యలు ఏవైనా ఉంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయవచ్చు. సిసోడియా విడుదలకు సమయం బెయిల్ ఆర్డర్ ప్రాసెసింగ్‌పై ఆధారపడి ఉండనుంది. -
ఢిల్లీ లిక్కర్ కేసులో మనీష్ సిసోడియాకు బెయిల్
-
మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టులో ఊరట
సాక్షి,ఢిల్లీ: లిక్కర్‌స్కామ్‌కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆమ్ఆద్మీపార్టీ సీనియర్‌నేత మనీష్ సిసోడియాకు ఎట్టకేలకు ఊరట లభించింది. లిక్కర్ కేసులో నమోదైన సీబీఐ, ఈడీ కేసులు రెండింటిలో సిసోడియాకు బెయిల్ ఇస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం(ఆగస్టు9) ఉదయం తీర్పు వెలువరించింది. బెయిల్‌పై ఉన్నంత కాలం దేశం విడిచి వెళ్లకూడదని, పాస్‌పోర్టు సరెండర్ చేయాలని కోర్టు షరతు విధించింది. ఇటీవలే సిసోడియా బెయిల్‌పై వాదనలు విన్న జస్టిస్ బీఆర్ గవాయ్,జస్టిస్ కె.వి విశ్వనాథన్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. వాదనల సందర్భంగా బెయిల్‌ను ఈడీ,సీబీఐ వ్యతిరేకించినప్పటికీ సిసోడియాకు దేశ అత్యున్నత కోర్టు బెయిల్ విషయంలో ఉపశమనం కల్పించింది. కేసులో విచారణ ఆలస్యమవుతున్నందునే బెయిల్ ఇస్తున్నామని కోర్టు తెలిపింది. బెయిల్ ఇవ్వకుండా ఎక్కువ కాలం నిందితుడిని జైలులో ఉంచడం అతడి హక్కులను హరించడమేనని వ్యాఖ్యానించింది. గతేడాది ఫిబ్రవరిలో అరెస్టయిన సిసోడియా 17 నెలలుగా తీహార్ జైలులో ఉన్నారు. -
SC: సిసోడియా పిటిషన్‌పై తీర్పు రిజర్వ్
ఢిల్లీ: లిక్కర్ పాలసీ కేసులో ఆప్ నేత మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌పై విచారణ పూర్తైంది. సీబీఐ, ఈడీ కేసుల్లో ఆయన బెయిల్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై మంగళవారం (ఆగస్ట్6 న)తో వాదనలు పూర్తి కాగా, కోర్టు తీర్పును వాయిదా వేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సిసోడియా 17 నెలలకు పైగా జైలులో ఉన్నారు. గతంలో ఢిల్లీ కోర్టును ఆశ్రయించినప్పటికీ.. ఆయన అక్కడ చుక్కెదురైంది. దీంతో ఆయన సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై ఇవాళ సుప్రీం కోర్టు న్యాయమూర్తులు బీఆర్ గవాయ్, కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. వాదనల సందర్భంగా సిసోడియా తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ.. సిసోడియాకు సుదీర్ఘ జైలు శిక్ష కొనల్సిన అవసరం లేదని గతంలో సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావించారు. అంతేకాదు.. ఒక కేసులో చార్జిషీటు వేశాక ఆ వెంటనే వాదనలు మొదలవ్వాలి. కానీ, అలాంటిదేం జరగలేదని.. పైగా సరైన ఆధారాల్ని కూడా ఉంచలేదని సింఘ్వీ బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు.. బెయిల్ ఇవ్వొద్దంటూ సీబీఐ, ఈడీ తరఫు లాయర్ వాదించారు. దీంతో.. తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు బెంచ్ ప్రకటించింది. Excise policy cases: SC reserves order on AAP leader Manish Sisodia's bail pleasEdited video is available on PTI Videos (https://t.co/L2D7HH309u) #PTINewsAlerts #PTIVideos @PTI_News pic.twitter.com/6fFzsSumFq— PTI News Alerts (@PTI_NewsAlerts) August 6, 2024 -
‘లిక్కర్‌స్కామ్’లో పీకల్లోతులో సిసోడియా: సుప్రీంలో ఈడీ
న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ పార్టీ సీనియర్ నేత మనీష్ సిసోడియాకు లిక్కర్ కేసులో బెయిల్ ఇవ్వవద్దని సుప్రీంకోర్టులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వాదించింది. లిక్కర్‌స్కామ్‌లో మనీష్‌సిసోడియా పీకల్లోతు కూరుకుపోయారని ఈడీ తెలిపింది. ఈడీ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌విరాజు వాదనలు వినిపించారు. మనీష్‌సిసోడియాపై పెట్టిన కేసులు కల్పితం కాదని, ఆయనకు వ్యతిరేకంగా చాలా సాక్షాధారాలున్నాయని తెలిపారు. కేసు దర్యాప్తులో ఎలాంటి జాప్యం లేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. మనీష్‌సిసోడియా ఈ కేసులో 17 నెలలుగా ఎందుకు జైలులో ఉండాలని ఆయన తరపు న్యాయవాది అభిషేక్‌మనుసింఘ్వి వాదించారు. వాదనల సందర్భంగా ఈడీ న్యాయవాది లిక్కర్ పాలసీ రూపకల్పన అని ప్రస్తావించినపుడు సుప్రీం ధర్మాసనం జోక్యం చేసుకుంది. పాలసీ రూపకల్పనకు నేరం చేయడానికి మధ్య తేడా ఏంటో చెప్పాలని కోరింది. కాగా, మనీష్ సిసోడియా లిక్కర్ స్కామ్‌లో సీబీఐ, ఈడీ కేసుల్లో అరెస్టయి జైలులో ఉన్నారు. -
మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్.. విచారణ బెంచ్ నుంచి తప్పుకున్న జడ్జి
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణానికి సంబంధించి ఈడీ, సీబీఐ కేసుల్లో మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై ఇవాళ విచారణ జరగాల్సి ఉండగా.. ఈ కేసు విచారణ బెంచ్ నుంచి న్యాయమూర్తి సంజయ్ కుమార్ తప్పుకోవడంతో వాయిదా పడింది. దీంతో తదుపరి విచారణ జూలై 15వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.ఈ బెయిల్ పిటిషన్లను మరోబెంచ్ విచారణ చేపట్టనుంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఫిబ్రవరి 26వ తేదీన మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసింది. అనంతరం మార్చి 9వ తేదీన ఈడీ కస్టడీలోకి తీసుకుందిన. దీంతో ఆయన ఢిల్లీ కేబినెట్‌కు ఫిబ్రవరి 28న రాజీనామా చేశారు. అదేవిధంగా జూన్ 4వ తేదీన సీబీఐ, ఈడీ దాఖలు చేసిన కేసుల్లో ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. -
సిసోడియా అమాయకుడు, ఆయన్ను నిందించలేదు: కోర్టులో కేజ్రీవాల్
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ బుధవారం సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మంగళవారం తిహార్ జైల్లో ఆయనను విచారించి వాంగ్మూలం నమోదు చేసుకున్నాయి. బుధవారం ట్రయల్ కోర్టులో ప్రవేశపెట్టాయి. తిహార్ జైలు నుంచి కేజ్రీవాల్‌ను ఉదయం కోర్టు ముందు హాజరుపర్చారు అధికారులు. ఆయనను కస్టడీకి కోరుతూ కోర్టుకు సీబీఐ దరఖాస్తు చేసుకుంది.విచారణ సందర్భంగా ప్రస్తుతం రద్దు చేసిన మద్యం పాలసీ కింద నగరంలో మద్యం దుకాణాల ప్రైవేటీకరణకు మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియానే సిఫార్సు చేశారని సీఎం కేజ్రీవాల్ తమ విచారణలో చెప్పినట్లు సీబీఐ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టుకు తెలియజేశారు.అయితే సీబీఐ ఆరోపణలు కేజ్రీవాల్ ఖండించారు. మనీష్ సిసోడియా దోషి అని తాను ఎలాంటి ప్రకటన చేయలేదని పేర్కొన్నారు. సిసోడియా పూర్తిగా అమాయకుడని, తమ పరువు తీయడమే దర్యాప్తు సంస్థల లక్ష్యమని విమర్శించారు. వాస్తవాలను వక్రీకరించి, అసంబద్ధమైన ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు.కేజ్రీవాల్ తిరస్కరణను తిప్పికొట్టిన సీబీఐ.. తాము వాస్తవాలను మాట్లాడుతున్నట్లు కోర్టుకు తెలిపింది. అయితే సీబీఐ వాదనలపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. కేజ్రీవాల్ ప్రకటనను తాము చదివామని ఆయన ఆ విధంగా చెప్పలేదని కోర్టు పేర్కొంది.ప్రైవేటీకరణ తన ఆలోచన కాదని కేజ్రీవాల్ పేర్కొన్నారని, దానిని సీబీఐ తప్పుగా గ్రహించిందని కోర్టు తెలిపింది. ఇదిలా ఉండగా మద్యం కుంభకోణం కేసులో సిసోడియాను గతేడాది ఫిబ్రవరి 26న సీబీఐ అరెస్ట్ చేసింది. అనంతరం మార్చి 9, 2023న మనీలాండరింకేసులో ఈడీ అదుపులోకి తీసుకుంది. -
లిక్కర్ కేసు: మనీష్ సిసోడియాకు మళ్లీ చుక్కెదురు
న్యూఢిల్లీ: లిక్కర్ స్కామ్‌కు సంబంధించి అన్ని కేసుల్లో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ఢిల్లీ హైకోర్టు మంగళవారం(మే21) బెయిల్ నిరాకరించింది. కేసు విచారణలో ట్రయల్ కోర్టు ఎలాంటి ఆలస్యం చేయడం లేదని, దీంతో ఈ కారణంపై బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదని కోర్టు తెలిపింది.సిసోడియా పలుకుబడి ఉన్న వ్యక్తి కావడం వల్ల ప్రస్తుత పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది. అయితే సిసోడియా అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యను ప్రతి వారం చూసేందుకు కోర్టు అనుమతించింది. కాగా, లిక్కర్ కేసులో సోమవారమే(మే20) సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ రౌస్ ఎవెన్యూకోర్టు మే 31 దాకా పొడిగించడం గమనార్హం. -
మనీష్ సిసోడియా జ్యుడిషీయల్ కస్టడీ పొడగింపు
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ కుంభకోణం మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొటున్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎ మనీష్ సిసోడియా జ్యుడిషీయల్ కస్టడినీ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి పొడగించింది. మరో ఐదు రోజుల పాటు.. ఈ నెల 20 వరకు కస్టడీ పొడగిస్తున్నట్లు ప్రత్యేక న్యాయముర్తి కావేరి బవేజా తెలిపారు.తీహార్ జైల్లో ఉన్న మనీష్ సిసోడియా నేటితో కస్టడీ ముగియగా.. ఆయన వీడియో కాన్ఫరెస్ ద్వారా కోర్టుకు హాజరయ్యారు. నిందితుల్లో ఒకరైన అరుణ్ పిళ్లై దాఖలు చేసిన ఆప్పీల్ ఆధారంగా ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు సిసోడియాపై ఉన్న ఆరోపణలపై వాదనలను కోర్టు వాయిదా వేసింది.ఇక.. లిక్కర్ కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ( ఈడీ) గతేడాది మార్చి 9న మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసింది. అనంతరం ఆయన తిహార్ జైలులో జ్యుడిషీయల్ కస్టడీపై ఉంటున్నారు.గత నెల 30న సిసోడియాకు రెండోసారి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను జడ్జి బవేజా కొట్టివేశారు. సిసోడియాకు బెయిల్ లభిస్తే ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలను మార్చడం, సాక్షులను ప్రభావితం చేయడం వంటి వాటికి పాల్పడే అవకాశముందని, ఈ కేసులో మనీష్ సిసోడియా చాలా కీలక నిందితుడని ఈడీ తెలిపింది. -
మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
మద్యం పాలసీ కేసులో అరెస్టైన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ఊరట లభించింది. ట్రయల్ కోర్టు ఆదేశాల ప్రకారం.. సిసోడియా తన భార్యను వారానికి ఒకసారి కస్టడీలో కలుసుకోవచ్చని కోర్టు తెలిపింది.సిసోడియా బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై జస్టిస్ స్వర్ణ కాంత శర్మ నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐ ప్రతి స్పందనలు కోరింది. విచారణను మే 8కి వాయిదా వేసింది.ఇప్పటికే మద్యం పాలసీ కేసులో గతేడాది ఫిబ్రవరి 26 నుంచి జైలు శిక్షను అనుభవిస్తున్న సిసోడియా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ బెయిల్ పిటిషన్‌ను ఏప్రిల్ 30న రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేసింది.ఈ కేసుకులో సీబీఐ, ఈడీలకు ప్రత్యేక న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న కావేరీ బవేజా.. మద్యం పాలసీ కేసు విచారణ సమయంలో బెయిల్ ఇవ్వడం సరైందని కాదని, సిసోడియాకు బెయిల్ ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. అయితే ఏప్రిల్ 30 నాటి ఉత్తర్వులను సవాల్ చేస్తూ, మనీష్ సిసోడియా తరపున న్యాయవాదులు గురువారం బెయిల్ కోరుతూ అత్యవసర విచారణ కోసం హైకోర్టును ఆశ్రయించారు.మనీష్ సిసోడియా మధ్యంతర దరఖాస్తులో అనారోగ్యంతో బాధపడుతున్న భార్యాను వారానికి ఒకసారి చూసుకోవచ్చంటూ ట్రయల్ కోర్టు ఆదేశాలను కొనసాగించాలని కోర్టును కోరారు.తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్, జస్టిస్ మన్మీత్ పీఎస్ అరోరాలతో కూడిన ధర్మాసనం సిసోడియా పిటిషన్‌ను విచారించింది. ఈ సందర్భంగా ట్రయల్ కోర్టు ఆదేశాలను కొనసాగిస్తే దర్యాప్తు సంస్థకు అభ్యంతరం లేదని ఈడీ తరపు న్యాయవాది తెలిపారు. -
లిక్కర్ కేసు: మనీష్ సిసోడియాకు మళ్లీ చుక్కెదురు
న్యూఢిల్లీ: లిక్కర్ కేసులో అరెస్టయి జైలులో ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు కోర్టులో మళ్లీ చుక్కెదురైంది. సిసోడియాకు బెయిల్ ఇచ్చేందుకు కేసు విచారిస్తున్న రౌస్ ఎవెన్యూ కోర్టు నిరాకరించింది. సిసోడియాకు బెయిల్ ఇవ్వకూడదని సీబీఐ,ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కోర్టులో వాదనలు వినిపించాయి. దీంతో కోర్టు సిసోడియాకు బెయిల్ నిరాకరించింది. కాగా, లిక్కర్ స్కామ్ కేసులో సిసోడియాను సీబీఐ గతేడాది ఫిబ్రవరి26న అరెస్టు చేసింది. అప్పటి నుంచి సిసోడియా జైలులోనే ఉంటున్నారు. సీబీఐతో పాటు ఈడీ పెట్టిన కేసుల్లో సిసోడియా రెగ్యులర్ బెయిల్ కోర్టు డిస్మిస్ చేయడం ఇది రెండవసారి. గతేడాది సిసోడియా వేసిన బెయిల్ పిటిషన్లను ట్రయల్‌కోర్టుతో పాటు హైకోర్టు,సుప్రీంకోర్టు డిస్మిస్ చేసిన విషయం తెలిసిందే.