‘ఆప్‌ ఎమ్మెల్యేలతో బేరమాడింది ఎవరు?’ | BJP MP Parvesh Verma comments on Manish Sisodia | Sakshi
Sakshi News home page

‘ఆప్‌ ఎమ్మెల్యేలతో బేరమాడింది ఎవరు?’

Published Wed, Aug 31 2022 11:13 AM | Last Updated on Wed, Aug 31 2022 12:10 PM

BJP MP Parvesh Verma comments on Manish Sisodia - Sakshi

సాక్షి, ఢిల్లీ: అప్‌, బీజేపీ నేతల మధ్య మాటల మంటలు కొనసాగుతున్నాయి. ఆప్‌లో చీలికలు తెచ్చి ఢిల్లీ సర్కార్‌ను కూలగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆప్‌ నేతలు చేస్తున్న ఆరోపణలు కలకలం రేపాయి. ఈ క్రమంలో బీజేపీ ఎంపీ పర్వేష్‌ వర్మ బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మనీష్ సిసోడియాపై విరుచుకుపడ్డారు. ఆయనకు లైడిటెక్ట్‌, నార్కో టెస్ట్‌ చేయాలని పర్వేష్‌ వర్మ డిమాండ్‌ చేశారు. సిసోడియా రోజుకో అబద్ధం చెబుతున్నారని మండిపడ్డారు. ఆప్‌ ఎమ్మెల్యేలతో బేరమాడింది ఎవరో చెప్పాలన్నారు. కేజ్రీవాల్‌ అవినీతిలో ఒక్కో మంత్రి ఇరుక్కుంటున్నారని ధ్వజమెత్తారు.
చదవండి: అన్నా హజారే లేఖపై కేజ్రీవాల్‌ కౌంటర్‌!

‘‘ఢిల్లీ అసెంబ్లీలో వింతగా వ్యవహరిస్తున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్‌పై ఇష్టారాజ్యంగా ఆరోపణలు చేస్తున్నారు. మనీష్ సిసోడియా యోగ ప్రాక్టీస్ చెయ్యాలి. తీహార్ జైలుకు వెళ్ళాక ఇక్కడి వసతులు ఉండవు. ఫైల్స్ పై సీఎం కేజ్రీవాల్ సంతకాలు పెట్టకుండా తప్పించుకుంటున్నారు’’ అని పర్వేష్‌ వర్మ దుయ్యబట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement