Kejriwal
-
ఆప్ పార్టీకి, మంత్రి పదవికి కైలాష్ గెహ్లాట్ రాజీనామా
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ ప్రభుత్వ రవాణా శాఖ మంత్రి కైలాష్ గెహ్లాట్ పార్టీకి, మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన పార్టీపై పలు విమర్శలు చేస్తూ, ఒక ప్రకటిన విడుదల చేశారు.కైలాష్ ఆ పకటనలో పార్టీలో పలు వింత వివాదాల ఉన్నాయని, అవి అందరినీ పలు సందేహాలకు గురిచేస్తున్నాయన్నారు. ఢిల్లీ ప్రభుత్వం కేంద్రంపై పోరాటానికి ఎక్కువ సమయం కేటాయిస్తే ఢిల్లీకి నిజమైన పురోగతి ఉండదని ఇప్పుడు స్పష్టమైందన్నారు. ఆప్ నుండి విడిపోవడం తప్ప తనకు వేరే మార్గం లేదని, అందుకే తాను ఆమ్ ఆద్మీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశానని తెలిపారు.కేంద్రంతో పోరాడడం వల్ల సమయం వృధా అని కైలాష్ అభిప్రాయపడ్డారు. ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం రాజకీయ ఎజెండా కోసమే పోరాడుతోందని, కేజ్రీవాల్ తన కోసం విలాసవంతమైన ఇంటిని నిర్మించుకున్నారని ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ సామాన్యుల సమస్యలపై దృష్టి పెట్టడం లేదని, తాము చేసిన వాగ్దానాలను నిలబెట్టుకోలేకపోయామన్నారు. యమునా నదిని శుభ్రం చేయలేకపోయామని, అది నేడు అత్యంత కలుషితంగా మారిందన్నారు. ఢిల్లీలో ని సామాన్యులు కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని స్థితిలో ఉన్నారన్నారు. Delhi Minister and AAP leader Kailash Gahlot resigned from primary membership of Aam Aadmi Party; writes to party national convenor Arvind Kejriwal.The letter reads, "There are many embarrassing and awkward controversies like the 'Sheeshmahal', which are now making everyone… https://t.co/NVhTjXl1c2 pic.twitter.com/wVU7dSesBa— ANI (@ANI) November 17, 2024ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కైలాష్ గెహ్లాట్‌ను ఈడీ విచారించింది. మద్యం కుంభకోణంలో నిందితుడైన విజయ్ నాయర్ మంత్రి కైలాష్ గెహ్లాట్ అధికారిక నివాసంలో నివసించినట్లు ఈడీ తన ఛార్జ్ షీట్లో పేర్కొంది. కాగా కైలాష్ గెహ్లాట్ రాజీనామా తర్వాత బీజేపీ నేత కపిల్ మిశ్రా ఒక ప్రకటన చేశారు. మంత్రి కైలాష్ గెహ్లాట్ రాజీనామా లేఖతో పలు విషయాలు స్పష్టమయ్యాయన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీలో, ప్రభుత్వంలో కొనసాగడం అసాధ్యమైందని గెహ్లాట్ తన రాజీనామా లేఖలో స్పష్టంగా రాశారన్నారు. కైలాష్ గెహ్లాట్ తీసుకున్న ఈ చర్య స్వాగతించదగినదని కపిల్ మిశ్రా అన్నారు. -
ఆ రెండు రాష్ట్రాల్లో కేజ్రీవాల్ మద్దతు ఎవరికి?
న్యూఢిల్లీ: త్వరలో మహారాష్ట్ర, జార్ఖండ్‌లలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. మీడియాకు అందిన వివరాల ప్రకారం ఆయన తన మిత్రపక్షం అయిన ఇండియా అలయన్స్‌తో పాటు ఇతర మిత్రపక్ష పార్టీలకు ప్రచారం చేయనున్నారు.కేజ్రీవాల్ మహారాష్ట్రలో మహావికాస్ అఘాడి (ఎంవీఏ) తరపున ప్రచారం చేయనున్నారు. పార్టీ వాలంటీర్లు ఉన్న అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే అరవింద్ కేజ్రీవాల్ ప్రచారం చేయనున్నారు. అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు, పార్టీ సీనియర్ నేతలు కూడా ఈ రెండు రాష్ట్రాలలో ప్రచార ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించే అవకాశం ఉంది. అరవింద్ కేజ్రీవాల్ జార్ఖండ్‌లో.. జార్ఖండ్ ముక్తి మోర్చా అభ్యర్థుల కోసం ప్రచారం చేయనున్నారు. అలాగే ఇండియా బ్లాక్‌లోని అర్బన్ స్థానాలకు ఆయన ప్రచారం చేయనున్నారు.మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 20న పోలింగ్ జరగనుంది. నవంబరు 23న ఓట్ల లెక్కింపు తర్వాత ఫలితం వెలువడనుంది. మహారాష్ట్రలో ప్రధాన పోటీ ఎంఏవీ పాలక మహాయుతికి మధ్యనే ఉంది. అధికార మహా కూటమిలో బీజేపీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (అజిత్ పవార్), శివసేన (ఏక్నాథ్ షిండే) ఉన్నాయి. రెండవ కూటమి మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ)లో కాంగ్రెస్, శివసేన (యూబీటీ), ఎన్సీపీ (శరద్ పవార్) ఉన్నాయి. రెండు కూటముల్లోనూ సీట్ల పంపకం జరిగింది. ఎన్నికల ప్రచారం కూడా మొదలైంది.జార్ఖండ్‌లో నవంబర్ 13, నవంబర్ 20 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు నవంబర్ 23న జరగనుంది. జార్ఖండ్‌లో ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (ఏజేఎస్‌యూ), జనతాదళ్ (యునైటెడ్) (జేడీయూ), లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) కూటమిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) రాష్ట్రీయ జనతాదళ్, కాంగ్రెస్‌తో కలిసి ఎన్నికల పోరులోకి దిగింది.ఇది కూడా చదవండి: ‘ప్రియాంక రోడ్డు షో.. సీజనల్ ఫెస్టివల్ లాంటిది’ -
Arvind Kejriwal: ఉచిత విద్యుతిస్తే బీజేపీకి ప్రచారం చేస్తా
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీకి ఆప్ జాతీయ కనీ్వనర్, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ సవాల్ విసిరారు. దేశంలోని 22 బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రజలకు ఉచితంగా విద్యుత్ ఇస్తే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ప్రచారం చేస్తానన్నారు. పదేళ్లలో ఒక్క మంచి పని కూడా చేయని మోదీ రిటైర్మెంట్కు ముందు కనీసం ఈ ఒక్క మంచి పనైనా చేయాలని సూచించారు. ఆదివారం ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంలో జరిగిన ఆప్ బహిరంగ సభలో బీజేపీపై కేజ్రీవాల్ విరుచుకుపడ్డారు. ‘‘వచ్చే ఏడాది సెప్టెంబర్ 17కు మోదీకి 75ఏళ్లు వస్తాయి. రిటైరవుతారు. ప్రధానిగా ఆయనకు మరో ఏడాది సమయమే ఉంది. ఈలోగా ఢిల్లీ ప్రభుత్వం మాదిరిగా బీజేపీ పాలిత రాష్ట్రాలన్నింట్లోనూవిద్యుత్తు ఉచితంగా ఇవ్వండి. బడులు, ఆసుపత్రులు బాగు చేయండి. ఫిబ్రవరిలో ఢిల్లీ ఎన్నికల్లోపు ఆ పని చేసి చూపిస్తే ఢిల్లీ ఎన్నికల్లో మోదీకి ప్రచారం చేస్తా’’ అన్నారు. ‘‘డబుల్ ఇంజిన్ ప్రభుత్వమటే ‘డబుల్ దోపిడీ, నిరుద్యోగం, అధిక ధరలు’. హరియాణాలో బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ దిగిపోనుంది. జార్ఖండ్, మహారాష్ట్రల్లోనూ ఆ పార్టీ ప్రభుత్వాలు పోతాయి’’ అన్నారు. తన జేబులో ఆరు స్వీట్లున్న ప్యాకెట్ ఉందని కేజ్రీవాల్ అన్నారు. ‘‘ఉచిత విద్యుత్, నీరు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, వృద్ధులకు తీర్థయాత్ర, ఆరోగ్య వసతులు, విద్య... ఇవే ఆ ఆరు స్వీట్లు’’ అని చెప్పారు. ఢిల్లీలో పొరపాటున బీజేపీకి ఓటేస్తే ఆ ఆరు స్వీట్లు ప్రజలకు అందకుండా పోతాయన్నారు. -
ఇల్లు ఖాళీ చేసిన కేజ్రీవాల్
న్యూఢిల్లీ:ఆమ్ఆద్మీపార్టీ చీఫ్,ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం నివాసాన్ని ఖాళీ చేశారు. శుక్రవారం(అక్టోబర్4) కుటుంబ సభ్యులతో కలిసి కేజ్రీవాల్ ఇంటి నుంచి బయటికి వచ్చారు. ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేయడంతో సీఎం అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాల్సిన పరిస్థితి కేజ్రీవాల్‌కు ఏర్పడింది. సీఎంగా పదవి చేపట్టిన 2015 నుంచి సివిల్ లైన్స్ ఏరియా 6 ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్డులో ఉన్న ఇంటిలోనే కేజ్రీవాల్ కుటుంబం నివసించింది.ఇక నుంచి ఢిల్లీలోని 5, ఫిరోజ్‌షా రోడ్డులోని ఆప్ రాజ్యసభ ఎంపీ అశోక్‌మిట్టల్ ఇంట్లో కేజ్రీవాల్ కుటుంబం నివాసం ఉండనుంది. కేజ్రీవాల్ తన ఇంటిని ఎంచుకోవడం పట్ల ఎంపీ అశోక్‌మిట్టల్ హర్షం వ్యక్తం చేశారు.ఆప్ పార్టికి చెందిన పలువురు ఎంపీలు, మంత్రులు తమ ఇళ్లు తీసుకోవాల్సిందిగా కేజ్రీవాల్‌ను కోరినప్పటికీ ఆయన మాత్రం ఎంపీ అశోక్‌మిట్టల్ ఇంటినే ఎంచుకున్నారు.లిక్కర్ కేసులో జైలు నుంచి బెయిల్‌పై వచ్చిన తర్వాత కేజ్రీవాల్ తన సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: ఢిల్లీలో పెరిగిన కాలుష్యం -
4న సీఎం నివాసాన్ని ఖాళీ చేయనున్న కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈనెల 4న (శుక్రవారం) సీఎం నివాసాన్ని ఖాళీ చేయనున్నారు. ఇకపై కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ అశోక్ మిట్టల్ ఇంట్లో ఉండనున్నారు. అశోక్ మిట్టల్ ఇల్లు న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉంది. ఇది కేజ్రీవాల్‌కు వివిధ పనులు నిర్వహణకు ఎంతో అనువుగా ఉండనున్నదని తెలుస్తోంది. అరవింద్ కేజ్రీవాల్ త్వరలోనే ముఖ్యమంత్రి నివాసాన్ని ఖాళీ చేయనున్నారని, ఆయన కొత్త ఇంటి కోసం వెదుకులాట జరుగుతోందని పార్టీ ఇటీవలే ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నేపధ్యంలో కేజ్రీవాల్ న్యూ ఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గానికి సమీపంలో ఉండే ఇంటికోసం వెదికారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు మరికొద్ది నెలలు మాత్రమే మిగిలి ఉన్నందున కేజ్రీవాల్ తన సమయాన్ని, వనరులను ఉపయోగించుకునేందుకు అనువుగా ఉండే ఇంటి కోసం వెదికారు. మాజీ సీఎం కేజ్రీవాల్‌కు ఆప్ ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు, కార్మికులు, వివిధ సామాజిక, రాజకీయ ప్రముఖులు వసతి కల్పించేందుకు ముందుకువచ్చారని ఆమ్ ఆద్మీ పార్టీ తెలిపింది. డిఫెన్స్ కాలనీ, పితంపురా, జోర్‌బాగ్, చాణక్యపురి, గ్రేటర్ కైలాష్, వసంత్ విహార్, హౌస్ ఖాస్‌తో సహా నగరంలోని అనేక ప్రాంతాలలో అరవింద్ కేజ్రీవాల్‌కు వసతి కల్పిస్తామంటూ అనేక ప్రతిపాదనలు వచ్చాయి. అయితే కేజ్రీవాల్ తన అసెంబ్లీ నియోజకవర్గం ప్రజలను కలిసే సౌలభ్యం ఉండే అశోక్ మిట్టల్ ఇంటిని ఎంచుకున్నారు.కేజ్రీవాల్ జాతీయ పార్టీ అధినేత పదవిలో ఉన్నందున ఆయనకు అధికారిక నివాసం కల్పించాలని పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కేజ్రీవాల్ తన భార్య, పిల్లలు, వృద్ధ తల్లిదండ్రులతో కలసి ఉంటున్నారు. రాజకీయాల్లోకి రాకముందు కేజ్రీవాల్ ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని కౌశాంబిలో ఉన్నారు. 2013లో తొలిసారిగా ఢిల్లీ సీఎం అయ్యాక తిలక్ లేన్‌లోని బంగ్లాలో నివాసమున్నారు. 2015లో రెండోసారి ఢిల్లీ సీఎం అయిన తర్వాత నుంచి ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్డులో నివాసం ఉంటున్నారు.ఇది కూడా చదవండి: HCA: అజారుద్దీన్‌కు ఈడీ సమన్లు -
జైల్లో టార్చర్ చేశారు: కేజ్రీవాల్
చండీగఢ్:ఆమ్ఆద్మీపార్టీ(ఆప్)చీఫ్,ఢిల్లీమాజీసీఎం అరవింద్కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు.ఆదివారం(సెప్టెంబర్29)హర్యానాలో జరిగిన బహిరంగసభలో కేజ్రీవాల్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ‘జైలులో నన్ను మానసికంగా,శారీరకంగా చిత్రహింసలు పెట్టేందుకు ప్రయత్నించారు.నేను షుగర్ పేషేంట్‌ను.నాకు రోజుకు నాలుగు ఇన్సులిన్ ఇంజెలిక్షన్లు అవసరం. జైలులో నాకు ఇన్సులిన్ ఇంజెక్షన్లు అందకుండా చేశారు.అయితే వారికి తెలియని విషయం ఏంటంటే.వాళ్లు నన్ను ఏమీ చేయలేరు.ఎందుకంటే నేను హర్యానా బిడ్డను’అని కేజ్రీవాల్ అన్నారు.లిక్కర్ స్కామ్ కేసులో ఐదు నెలలు జైలులో గడిపిన తర్వాత కేజ్రీవాల్‌కు సుపప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. దీంతో ఆయన సెప్టెంబర్ 13న తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేశారు.ఢిల్లీ ప్రజలు మళ్లీ ఆమ్ఆద్మీపార్టీకి అధికారం ఇస్తేనే తాను సీఎం పదవి తీసుకుంటానని తెలిపారు. ఇదీ చదవండి: సభా వేదికపై ఖర్గేకు అస్వస్థత -
‘కేజ్రీవాల్ జైల్లో ఎందుకు రాజీనామా చేయలేదు?’
చండీగఢ్: హర్యానా అసెంబ్లీ ఎన్నికలపై ఆప్ నేత సంజయ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈసారి హర్యానాలో బీజేపీ అధికారం నుండి దిగిపోతుందని, ఆమ్ ఆద్మీ పార్టీ సాయం లేకుండా కొత్త ప్రభుత్వం ఏర్పడే పరిస్థితి లేదన్నారు. అప్పుడు అరవింద్ కేజ్రీవాల్ కింగ్ మేకర్ అవుతారని, అధికార రిమోట్ కేజ్రీవాల్ చేతుల్లో ఉంటుందని పేర్కొన్నారు. అలాగే కేజ్రీవాల్ జైల్లో ఉన్న సమయంలో ఎందుకు రాజీనామా చేయలేదో కూడా సంజయ్ సింగ్ వివరించారు. ఒక మీడియా సంస్థ నిర్వహించిన డిబేట్లో పాల్గొన్న ఆప్ నేత సంజయ్ సింగ్ మాట్లాడుతూ తాము సీట్ల విషయంలో కాంగ్రెస్‌తో ఒప్పందం కుదుర్చుకోలేదని, వారు, తాము విడివిడిగానే పోటీ చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ వారి ముఖ్యమంత్రి ఎవరో నిర్ణయించుకోవాల్సి ఉందని, అయితే రిమోట్ కేజ్రీవాల్ చేతిలో ఉంటుందనే నమ్మకం తనలో ఉందన్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం 90 స్థానాల్లో తన అభ్యర్థులను నిలబెట్టిందన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని జోస్యం చెప్పారు.గత పదేళ్ల పాలనలో సీఎం ఖట్టర్ హర్యానాను పూర్తిగా దిగజార్చారని, ఇప్పుడు నిరుద్యోగం విషయంలో భారతదేశంలో హర్యానా మొదటి స్థానంలో ఉందన్నారు. అగ్నివీర్ పథకంపై గ్రామాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోందని, ప్రభుత్వ పనితీరుపై రైతులు మండిపడుతున్నారన్నారు.జైల్లో ఉన్నప్పుడు అరవింద్ కేజ్రీవాల్ సీఎం పదవికి ఎందుకు రాజీనామా చేయలేదని సంజయ్ సింగ్‌ను మీడియా ప్రశ్నించగా అదేగనుక జరిగివుంటే, బీజేపీ వ్యూహం ఫలించేదని.. ఆ తర్వాత మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్, రేవంత్ రెడ్డి, పి. విజయన్.. ఇలా అందరినీ జైల్లో పెట్టి, బీజేపీ వారి రాజీనామాలను తీసుకుని ఉండేదని అన్నారు. ఇప్పుడు కేజ్రీవాల్ రాజీనామా చేసి, అతిశీని ముఖ్యమంత్రిని చేశారని, ఢిల్లీ ప్రజలు నాలుగు నెలల తర్వాత మళ్లీ కేజ్రీవాల్‌ను ముఖ్యమంత్రిగా ఎన్నికుంటారని సంజయ్ సింగ్ దీమా వ్యక్తం చేశారు.ఇది కూడా చదవండి: డిప్యూటీ సీఎం ఇంట్లో భారీ చోరీ -
జైలు జీవితంపై సిసోడియా భావోద్వేగ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ:లిక్కర్‌స్కామ్ కేసులో జైలులో ఉన్నప్పటి అనుభవాలను ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్‌సిసోడియా పార్టీ నేతలతో పంచుకున్నారు. ఆమ్ఆద్మీపార్టీ (ఆప్) ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆదివారం(సెప్టెంబర్22) జరిగిన ‘జనతాకీ అదాలత్’ కార్యక్రమంలో పాల్గొన్న సిసోడియా తన జైలు అనుభవాలు వెల్లడించారు.‘జైలులో ఉన్నపుడు అనేక బెదిరింపులు వచ్చాయి. జైలులోనే చంపేస్తామన్నారు. కేజ్రీవాల్ మీకు వ్యతిరేకంగా సాక్ష్యమిచ్చారని నాకు చెప్పారు. మీరు కూడా కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలని కోరారు. అలా చెబితే మీరు కేసు నుంచి బయటపడొచ్చన్నారు. పార్టీ మారీ బీజేపీలో చేరాలని సూచించారు.జైలులో ఉన్న సమయంలో ఎన్ఫోర్స్మెంట్డైరెక్టరేట్(ఈడీ) నా బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ చేసింది. కొడుకు స్కూల్ ఫీజు కట్టేందుకు కూడా అడుక్కోవాల్సి వచ్చింది. ఎన్ని చేసినా లక్ష్మణున్ని రాముడి నుంచి ఏ రావణుడు వేరు చేయలేడు. కేజ్రీవాల్ నా రాజకీయ గురువు’అని సిసోడియా అన్నారు. కాగా, ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మనీష్‌సిసోడియా ఏకంగా ఏడాదిన్నరపాటు తీహార్జైలులో ఉన్నారు. ఇటీవలే ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో విడుదలయ్యారు. ఇదే కేసులో నిందితులు కేజ్రీవాల్, కల్వకుంట్ల కవితకు కూడా సుప్రీంకోర్టులోనే ఇటీవలే బెయిల్ మంజూరైంది. ఇదీ చదవండి..ప్రధాని మోదీ నాపై కుట్ర పన్నారు: కేజ్రీవాల్ -
ఢిల్లీ సీఎంగా అతిషి ప్రమాణస్వీకారం
సాక్షి,న్యూఢిల్లీ: ఢిల్లీ కొత్త సీఎంగా అతిషి శనివారం(సెప్టెంబర్21) సాయంత్రం ప్రమాణస్వీకారం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అతిషి ఎల్జీ కార్యాలయం రాజ్‌నివాస్‌లో ప్రమాణం చేయించారు. ప్రమాణస్వీకారానికి ముందు అతిషి ఆమ్ఆద్మీపార్టీ చీఫ్, మాజీ సీఎం కేజ్రీవాల్‌తో సమావేశమయ్యారు. అతిషితో పాటు నలుగురు మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. అతిషితో పాటు ఐదుగురు మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. వీరిలో సౌరభ్ భరద్వాజ్, గోపాల్‌రాయ్,ముకేష్ అహ్లావత్,ఇమ్రాన్‌హుస్సేన్ తదితరులు మంత్రులుగా భాద్యతలు చేపట్టారు. ప్రమాణస్వీకారానికి అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు ఆమ్ఆద్మీపార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు. అతిషి ఢిల్లీకి మూడో మహిళా సీఎం కావడం విశేషం. కాగా లిక్కర్ స్కామ్ కేసులో ఇటీవలే బెయిల్‌పై విడుదలైన ఆమ్ఆద్మీపార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో అతిషి సీఎంగా పదవి చేపట్టారు. మళ్లీ ఎన్నికల్లో పార్టీ గెలిస్తేనే సీఎం పదవి చేపడతానని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. 2025 ఫిబ్రవరి ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు రానున్నాయి. అప్పటిదాకా అతిషి నేతృత్వంలో ఆప్ ప్రభుత్వం కొనసాగనుంది. #WATCH | AAP leader Atishi takes oath as Chief Minister of Delhi pic.twitter.com/R1iomGAaS9— ANI (@ANI) September 21, 2024 -
21న ఢిల్లీ సీఎంగా అతిషి ప్రమాణస్వీకారం..!
న్యూఢిల్లీ: ఢిల్లీ కొత్త సీఎంగా మంత్రి అతిషి ప్రమాణస్వీకారం 21న ఉండే అవకాశాలున్నాయి. ప్రమాణస్వీకార తేదీని అతిషి లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) వీకే సక్సేనాకు అందజేసిన లేఖలో తెలపలేదు. అయితే ఎల్జీ మాత్రం 21న అతిషి ప్రమాణస్వీకారాన్ని ప్రతిపాదిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమాచారమందించారు. మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాజీనామాతో పాటు అతిషి అందించిన ఎమ్మెల్యేల మద్దతు లేఖను ఎల్జీ రాష్ట్రపతికి పంపించారు. ఈ సందర్భంగా అతిషి ప్రమాణస్వీకారం 21న ఎల్జీ ప్రతిపాదించారు. అయితే అతిషి ఒక్కరే ప్రమాణస్వీకారం చేస్తారా లేదా కేబినెట్ మంత్రులు ఎవరైనా ఆమెతో ప్రమాణస్వీకారం చేస్తారా అనేదానిపై ఇప్పటికీ స్పష్టత లేదు.కాగా, అరవింద్ కేజ్రీవాల్ తన రాజీనామా లేఖలో ఎల్జీకి కాకుండా రాష్ట్రపతిని ఉద్దేశించి ఒకే ఒక వ్యాఖ్యంలో రాశారు. లేఖ అందించడానికి మాత్రం కేజ్రీవాల్ స్వయంగా ఎల్జీ వద్దకు వెళ్లి అందిచడం గమనార్హం. ఇదీ చదవండి.. ‘అతిషి డమ్మీ సీఎంగా ఉంటారు’ -
సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా
సాక్షి,ఢిల్లీ: ఢిల్లీ సీఎం పదవికి ఆమ్ఆద్మీపార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేశారు. మంగళవారం(సెప్టెంబర్17) సాయంత్రం లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) వీకేసక్సేనా నివాసానికి వెళ్లిన కేజ్రీవాల్ తన రాజీనామాను సమర్పించారు. ఎల్జీని కలిసేందుకు కేజ్రీవాల్ వెంట ఆమ్ఆద్మీపార్టీ సీనియర్ నేత మనీష్ సిసోడియా, కాబోయే సీఎం అతిషి, మంత్రులు ఉన్నారు. అతిషిని కొత్త సీఎంగా ఎంపిక చేసినట్లు ఈ సందర్భంగా ఎల్జీకి కేజ్రీవాల్ తెలిపారు. #WATCH | Delhi CM Arvind Kejriwal along with proposed CM Atishi and other cabinet ministers arrive at the LG secretariateArvind Kejriwal will tender his resignation as Delhi CM pic.twitter.com/BNVrUChlgR— ANI (@ANI) September 17, 2024కాగా, రెండు రోజల క్రితం ఆప్ పార్టీ మీటింగ్‌లో చెప్పినట్లుగానే కేజ్రీవాల్ తన సీఎం పదవికి రాజీనామా చేశారు. సీఎం పదవికి ఇప్పటికే మంత్రి ఆతిషి పేరును కేజ్రీవాల్ ప్రకటించారు. మంగళవారం జరిగిన ఆమ్ఆద్మీపార్టీ శాసనాసభాపక్షంలోనూ అతిషి పేరును కొత్త సీఎం పదవికి ఆమోదించారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా ఎల్జీని కోరిన అతిషి..రాజీనామా చేసేందుకు ఎల్జీ వద్దకు వెళ్లిన మాజీ సీఎం కేజ్రీవాల్‌తో పాటే కాబోయే సీఎం అతిషి కూడా వెళ్లారు. కేజ్రీవాల్ రాజీనామా సమర్పించిన తర్వాత ఆమె ఎల్జీని కలిశారు. తనను కొత్త సీఎంగా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ఆమె ఎల్జీని కోరారు. తనకు ఆమ్ఆద్మీపార్టీ ఎమ్మెల్యేలు మద్దతిస్తూ సంతకం చేసిన పత్రాన్ని ఆమె ఈ సందర్భంగా ఎల్జీకి అందించినట్లు తెలిసింది. #WATCH | Delhi CM Arvind Kejriwal along with proposed CM Atishi and other cabinet ministers arrive at the LG secretariateArvind Kejriwal will tender his resignation as Delhi CM pic.twitter.com/BNVrUChlgR— ANI (@ANI) September 17, 2024ఇదీ చదవండి.. కొత్త సీఎంగా అతిషి.. ప్రకటించిన కేజ్రీవాల్ -
ప్రభుత్వాన్ని జైలు నుంచే నడవపచ్చని నిరూపించాం: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి బయటకు వచ్చాక తొలిసారి ఆదివారం పార్టీ కార్యాలయానికి వచ్చారు. అక్కడ ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలతో సంభాషించారు. తనకు జైల్లో పుస్తకాలు చదవడానికి, ఆలోచించడానికి చాలా సమయం దొరికిందని కేజ్రీవాల్ అన్నారు. తాను గీతను చాలాసార్లు చదివానని, ఈ రోజు నేను మీ ముందుకు ‘భగత్ సింగ్ జైల్ డైరీ’తీసుకువచ్చానని అన్నారు. భగత్ సింగ్ జైలులో చాలా లేఖలు రాశారు. భగత్ సింగ్ బలిదానం జరిగిన 95 ఏళ్ల తర్వాత ఒక విప్లవ ముఖ్యమంత్రి జైలుకు వెళ్లాడు. నేను ఎల్జీకి జైలు నుంచి ఒక లేఖ రాశాను. జాతీయ జెండా ఎగురవేసేందుకు అతిషీకి అనుమతివ్వాలని ఆగస్టు 15వ తేదీకి ముందు లేఖ రాశాను. ఆ లేఖ ఎల్జీకి అందలేదు. మరోసారి లేఖ రాస్తే కుటుంబ సభ్యులను కలిసే అవకాశాన్ని నిలిపివేస్తామని హెచ్చరించారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడిచాక తమకంటే క్రూరమైన పాలకుడు ఈ దేశానికి వస్తాడని బ్రిటీష్ వారు కూడా ఊహించి ఉండరు అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.తాను జైల్లో ఉన్నప్పుడు ఒకరోజు సందీప్ పాఠక్ తనను కలవడానికి వచ్చాడు. అతను నాతో రాజకీయాల గురించి మాట్లాడాడు. దేశంలో ఏమి జరుగుతోంది, పార్టీలో ఏమి జరుగుతోంది అని నేను అడిగాను. ఇది జరిగాక సందీప్ పాఠక్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టారు. ఆమ్ ఆద్మీ పార్టీని విచ్ఛిన్నం చేయడం, కేజ్రీవాల్ ధైర్యాన్ని దెబ్బతీయడం వారి లక్ష్యం. వారు ఒక ఫార్ములా తయారుచేశారు. కేజ్రీవాల్‌ను జైలుకు పంపితే ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే ఫీలింగ్‌లో ఉన్నారు. అయితే మా పార్టీ విచ్ఛిన్నం కాలేదు. మా ఎమ్మెల్యేలు విచ్ఛిన్నం కాలేదు. వారి పెద్ద కుట్రలకు వ్యతిరేకంగా పోరాడే శక్తి ఆమ్ ఆద్మీ పార్టీకి మాత్రమే ఉంది.ప్రభుత్వాన్ని జైలు నుంచే నడపవచ్చని నిరూపించామని కేజ్రీవాల్ అన్నారు.ప్రభుత్వాన్ని జైలు లోపల నుండి ఎందుకు నడపకూడదని సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అప్పుడు మేము ప్రభుత్వాన్ని నడపగలమని నిరూపించాం. బీజేపీయేతర ముఖ్యమంత్రులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఎప్పుడైనా మిమ్మల్ని అరెస్టు చేసే ప్రయత్నం జరిగితే భయపడవద్దు. ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీకి వారి కుట్రలన్నింటిని తిప్పికొట్టే శక్తి ఉంది ఎందుకంటే మనం నిజాయితీపరులం. వారు నిజాయితీ లేనివారు కాబట్టి మన నిజాయితీకి భయపడతారని సీఎం కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: సెబీ చీఫ్‌పై మరోసారి కాంగ్రెస్ ఆరోపణలు -
రెండు రోజుల్లో సీఎం పదవికి రాజీనామా: కేజ్రీవాల్
సాక్షి,ఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. రెండు రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తానని బాంబు పేల్చారు. లిక్కర్ స్కామ్ కేసులో నిర్దోషిగా నిరూణ అయ్యేవరకు సీఎం పదవి చేపట్టనని స్పష్టం చేశారు. ఆదివారం(సెప్టెంబర్15) ఢిల్లీలో జరిగిన ఆమ్ఆద్మీపార్టీ సమావేశంలో కేజ్రీవాల్ ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నవంబర్‌లో మహారాష్ట్ర అసెంబ్లీతో పాటు ఢిల్లీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు నిర్వహించండి. నేను అగ్ని పరీక్షకు సిద్ధంగా ఉన్నా. నా భవిష్యత్తును ఓటర్లే నిర్ణయిస్తారు. నేను నిజాయితీగా ఉన్నానని భావిస్తేనే నాకు ఓట్లు వేయండి.’అని కేజ్రీవాల్ కోరారు.‘రాజ్యాంగాన్ని రక్షించేందుకే ఇన్ని రోజులు సీఎం పదవికి రాజీనామా చేయలేదు. కొత్త సీఎం పేరును త్వరలో ప్రకటిస్తాం. నేను, సిసోడియా సీఎం పదవిలో ఉండం. ఆమ్‌ఆద్మీపార్టీని చీల్చేందుకు బీజేపీ ప్రయత్నించింది. ఇందులో భాగంగానే నన్ను జైలుకు పంపించింది’అని కేజ్రీవాల్ అన్నారు. కాగా, లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్ రెండు రోజుల క్రితమే సుప్రీంకోర్టు బెయిలివ్వడంతో జైలు నుంచి విడుదలయ్యారు. అయితే బెయిల్ షరతుల ప్రకారం కేజ్రీవాల్ సీఎం ఆఫీసుకు వెళ్లడానికి వీళ్లేదని కోర్టు ఆదేశించింది. మరోపక్క బీజేపీ కేజ్రీవాల్ రాజీనామాకు డిమాండ్ చేసింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం 2025 ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇదీ చదవండి.. తమిళనాడులో రాముడంటే తెలియదు: గవర్నర్ రవి -
నేడు హనుమాన్ ఆలయానికి సీఎం కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. ఆయన జైలు నుంచి బయటకు రాగానే ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు, నేతలు, మద్దతుదారులలో ఉత్సాహం కనిపించింది. వర్షంలో తడుస్తూనే వారంతా కేజ్రీవాల్‌కు స్వాగతం పలికారు.సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈరోజు (శనివారం) మధ్యాహ్నం 12 గంటలకు హనుమాన్ ఆలయాన్ని సందర్శించనున్నారు. ఆయనతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఇతర నేతలు కూడా హాజరుకానున్నారు. సీఎం హనుమాన్ ఆలయంలో స్వామివారిని దర్శించుకుని, పూజలు చేయనున్నారు.శుక్రవారం భారీ వర్షం కురుస్తున్నప్పటికీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు స్వాగతం పలికేందుకు తీహార్ జైలు వెలుపల అభిమానులు గుమిగూడారు. కేజ్రీవాల్‌కు ఆప్ కార్యకర్తలు, నాయకులు ఘనస్వాగతం పలికారు. డప్పుల దరువులు, నృత్యాలు, కేజ్రీవాల్‌కు మద్దతుగా పలికే నినాదాల మధ్య ఆ ప్రాంతమంతా ఉత్సాహంతో నిండిపోయింది. కేజ్రీవాల్‌కు మద్దతుగా పలు నినాదాలతో కూడిన పోస్టర్లు, బ్యానర్లను అభిమానులు ప్రదర్శించారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో సహా పార్టీ సీనియర్ నేతలు తదితరులు సీఎం కేజ్రీవాల్‌కు స్వాగతం పలికినవారిలో ఉన్నారు.ఇది కూడా చదవండి: ఆ కూడలికి భగత్ సింగ్ పేరు పెట్టండి: పాక్ కోర్టు -
ఓ వైపు కాంగ్రెస్‌తో పొత్తంటూనే.. పక్క చూపులు చూస్తున్న కేజ్రీవాల్?
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ఆయా రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్నాయి. పట్టు విడుపులు లేకుండా పొత్తులు పెట్టుకునేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే తాము కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునేందుకు సిద్దమేనంటూ సంకేతాలిచ్చిన ఆప్ అధినేత, సీఎం కేజ్రీవాల్ పక్క చూపులు చూస్తున్నట్లు తెలుస్తోంది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం..అక్టోబర్ 5న జరగనున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్.. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉంది. కానీ కలయత్,కురుక్షేత్ర అసెంబ్లీ స్థానాలు తమకే కావాలని చర్చలు జరుతుంది. ఓవైపు ఆప్ పొత్తు చర్చలు జరుపుతూనే కాంగ్రెస్, బీజేపీ రెబల్ అభ్యర్థులకు గాలం వేసే పనిలో పడింది. ఏ పార్టీతో పొత్తు లేదనుకుంటే రెబల్ అభ్యర్థులను తమ పార్టీలోకి చేర్చుకుని అసెంబ్లీ స్థానాల్ని ఖరారు చేయనుంది. రంగంలోకి రాఘవ్ చద్దాఇది లావుండగా,ఆప్ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా ఆదివారం మాట్లాడుతూ..పార్టీల మధ్య చర్చలు కొనసాగుతున్నాయని, చర్చలు సఫలం అవుతాయనే నమ్మకంతో ఉన్నామని చెప్పారు.హర్యానా ప్రజల సంక్షేమం కోసం రెండు జాతీయ పార్టీలు కూటమిగా ఏర్పడితే గెలుపు తధ్యమన్నారు. పొత్తు విషయమై కాంగ్రెస్‌తో రాఘవ్ చద్దా చర్చలు జరుపుతున్నారు. కాగా, హర్యానాలో అక్టోబరు 5న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 8న ఫలితాలు వెల్లడికానున్నాయి.90 స్థానాల్లో పోటీ చేస్తాంఇక చర్చలపై ఆప్ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ మాట్లాడుతూ.. ఆప్ మొత్తం 90 స్థానాల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉంది. కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు.క్షేత్రస్థాయిలో తమ పార్టీ బలంగా ఉందని చెప్పారు. -
కేజ్రీవాల్ విచారణకు సీబీఐకి అనుమతి
న్యూఢిల్లీ: లిక్కర్ పాలసీ కేసులో అరెస్టై తీహార్జైలులో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను అవినీతి కేసులోప్రాసిక్యూట్ చేసేందుకు తమకు అనుమతి లభించినట్లు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) సంస్థ వెల్లడించింది. లిక్కర్‌స్కామ్ అవినీతి కేసులో ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) ఎమ్మెల్యే దుర్గేశ్ పాఠక్‌నూ విచారించనున్నట్లు సీబీఐ తెలిపింది. తమకు అనుమతి లభించిన విషయాన్ని సీబీఐ తాజాగా రౌస్ ఎవెన్యూకోర్టుకు తెలిపింది. కేజ్రీవాల్‌పై సీబీఐ దాఖలు చేసిన అనుబంధ ఛార్జ్‌షీట్‌ను ఆగస్టు 27న కోర్టు పరిగణలోకి తీసుకోనుంది. ఛార్జ్‌షీట్ అనంతరం కేసు విచారణ ముందుకు సాగాలంటే కేజ్రీవాల్ విచారణకు పరిపాలన పరమైన అనుమతి తప్పనిసరి. దీంతో సీబీఐ ఈ మేరకు అనుమతులు తెచ్చుకుంది. మరోవైపు, సీబీఐ అరెస్టును సవాలు, బెయిల్ విజ్ఞప్తిపై దాఖలు చేసిన పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు సెప్టెంబర్ 5కు వాయిదా వేసింది. లిక్కర్ స్కామ్ ఈడీ కేసులో కేజ్రీవాల్‌కు ఇప్పటికే బెయిల్ మంజూరైంది. -
కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపు
సాక్షి,ఢిల్లీ: లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. ఆగస్టు 27 వరకు కేజ్రీవాల్‌కు ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం(ఆగస్టు20) కేజ్రీవాల్ కోర్టు ముందు హాజరయ్యారు. లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో జూన్ 26న కేజ్రీవాల్ అరెస్టయ్యారు. అప్పటి నుంచి ఈ కేసులో ఆయన తీహార్జైలులో రిమాండ్‌లో ఉన్నారు. లిక్కర్ పాలసీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసులో కేజ్రీవాల్‌కు ఇప్పటికే బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. సీబీఐ కేసులో బెయిల్ కోసం కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌పై ప్రస్తుతం వాదనలు జరుగుతున్నాయి. -
లిక్కర్కేసు: సుప్రీంకోర్టులో కేజ్రీవాల్‌కు దక్కని ఊరట
న్యూఢిల్లీ: లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో ఢిల్లీ సీఎం, ఆమ్ఆద్మీపార్టీ చీఫ్ కేజ్రీవాల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు బుధవారం(ఆగస్టు14) విచారించింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్భూయాన్లతో కూడిన బెంచ్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. రెగ్యులర్ బెయిల్ మీద కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐకి నోటీసులు జారీ చేసి విచారణను వాయిదా వేసింది.లిక్కర్‌కేసులో ఈ ఏడాది మార్చి21న అరెస్టయిన కేజ్రీవాల్‌కు మనీలాండరింగ్ కేసులో సుప్రీంకోర్టు ఇప్పటికే బెయిల్ మంజూరు చేసింది. అయితే సీబీఐ అవినీతి కేసులో మాత్రం కేజ్రీవాల్ ఇంకా తీహార్జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. ఇదే కేసులో 17 నెలలు రిమాండ్‌లో ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆమ్ఆద్మీపార్టీ సీనియర్ నేత మనీష్‌సిసోడియాకు ఇటీవలే సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. -
బెయిల్ ఇవ్వండి: సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్
సాక్షి,ఢిల్లీ: లిక్కర్ పాలసీ సిబీఐ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సీబీఐ కేసులో కేసులో కేజ్రీవాల్‌కు ఇటీవలే హైకోర్టు బెయిల్ నిరాకరించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆగస్టు 5న కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఇప్పటికే ఈడీ కేసులో కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది.సీబీఐ కేసులో బెయిల్ రాకపోవడంతో ప్రస్తుతం కేజ్రీవాల్ తీహార్జైలులోనే ఉన్నారు. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) సీనియర్ నేత మనీష్‌సిసోడియాకు లిక్కర్ పాలసీ కేసులో సుప్రీంకోర్టు ఇటీవలే బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. -
మళ్లీ డిప్యూటీ సీఎంగా మనీష్ సిసోడియా..?
న్యూఢిల్లీ: లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా బెయిల్‌పై విడుదలవడంతో కొత్త వాదనకు తెరలేచింది. సిసోడియాను మళ్లీ డిప్యూటీ సీఎంగా నియమిస్తారని ఆమ్ఆద్మీపార్టీ(ఆప్)వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా లిక్కర్ కేసులో జైలులో ఉండడంతో సిసోడియా డిప్యూటీ సీఎంగా ఉంటేనే ఇటు పాలనాపరంగా అటు రాజకీయంగా పార్టీకి బలం చేకూరుతుందని ఆప్ నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయనను త్వరలోనే మళ్లీ డిప్యూటీ సీఎంగా నియమించి కీలకమైన ఆర్థిక, విద్యా శాఖలు కేటాయిస్తారని చెబుతున్నారు.గతేడాది ఫిబ్రవరిలో అరెస్టయిన తర్వాత సిసోడియా తన డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేశారు. లిక్కర్ కేసులో అరెస్టయి తీహార్ జైలులో రిమాండ్‌లో ఉన్న సిసోడియాకు శుక్రవారం(ఆగస్టు 9) సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో శుక్రవారం సాయంత్రమే ఆయన జైలు నుంచి విడుదలై సీఎం కేజ్రీవాల్ కుటుంబ సభ్యులను కలిశారు.ప్రస్తుతం సిసోడియా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. -
బెయిలొస్తదేమోనని మనం కూడా గందరగోళంలోనే ఉన్నాం!
-
మోదీకి కేజ్రీవాల్ ఎప్పటికీ తలవంచరు: సునీతా కేజ్రీవాల్
చండీగఢ్: ప్రధాని నరేంద్రమోదీ ముందు తన భర్త ఎప్పటికీ తలవంచరని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్ అన్నారు. హర్యానాలోని సోహ్నాలో ఆదివారం(ఆగస్టు4) జరిగిన ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) ప్రచార సభలో సునీత ప్రసంగించారు. ‘ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పనులు మోదీ చేయలేకపోయారని విమర్శించారు. #WATCH | Sohna, Haryana: Delhi CM and AAP national convenor Arvind Kejriwal's wife Sunita Kejriwal says, "Is there any other party that has improved the conditions of government schools, hospitals, made mohalla clinics, provided free electricity? Only Arvind Kejriwal can do all… pic.twitter.com/tWUzLC4vsN— ANI (@ANI) August 4, 2024 మరిన్ని మంచి పనులు చేయకుండా కేజ్రీవాల్‌ను ఆపడానికే జైలులో పెట్టారు. ‘హర్యానా భూమి పుత్రుడైన కేజ్రీవాల్ మోదీకి ఎప్పటికీ తలవంచరు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో హర్యానాలో బీజేపీకి ఎవరూ ఒక్క ఓటు కూడా వేయొద్దు’అని సునీత కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. -
కేజ్రీవాల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ చేసిన ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ: లిక్కర్ స్కామ్ సీబీఐ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై తీర్పును ఢిల్లీ హైకోర్టు రిజర్వ్ చేసింది. సీబీఐ అరెస్టును సవాల్ చేయడంతోపాటు మధ్యంతర బెయిల్ కోరుతూ ఆయన పిటిషన్లు వేశారు. ఆ పిటిషన్లపై హోరాహోరీగా వాదనలు జరగ్గా.. తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు హైకోర్టు ధర్మాసనం ప్రకటించింది. మరోవైపు.. రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై జులై 29న విచారణ చేపడతామని కోర్టు వెల్లడించింది.సీబీఐ కేసులో కేజ్రీవాల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు బుధవారం(జులై 17) విచారించింది. ఈ సందర్భంగా కేజ్రీవాల్ తరపున ప్రముఖ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు.‘‘కేజ్రీవాల్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేసులో ట్రయల్ కోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాతే సీబీఐ ఆయనను అరెస్టు చేసింది. అప్పటిదాకా సీబీఐ కనీసం కేజ్రీవాల్‌ను లిక్కర్ కేసులో విచారించలేదు. 2022లో కేసు నమోదైతే 2024 జూన్‌లో విచారించడమేంటి. అదీ కోర్టులో జడ్జి ఎదుటే అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది?. ఇది కచ్చితంగా బెయిల్ తర్వాత వచ్చిన ఆలోచనతో చేసిన ‘ఆఫ్టర్‌థాట్ ఇన్సూరెన్స్’ అరెస్ట్. సీబీఐ కేజ్రీవాల్ ప్రాథమిక హక్కులను ఉల్లంఘించింది. అరెస్టు సీర్పీసీ సెక్షన్ 41 ప్రకారం చట్ట విరుద్ధం. ఆయన ఒక సీఎం. టెర్రరిస్టు కాదు’అని సింఘ్వీ వాదించారు. కేజ్రీవాల్‌కు బెయిల్ ఇవ్వొద్దు: సీబీఐ అఫిడవిట్ అంతకుముందు కేజ్రీవాల్ బెయిల్ అభ్యర్థనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సీబీఐ ఢిల్లీ హైకోర్టులో అఫిడవిట్ వేసింది. ‘ఢిల్లీ లిక్కర్ పాలసీలో సీఎం కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగా మార్పులు చేశారు. లిక్కర్ పాలసీలో మార్పులు చేసినందుకుగాను సౌత్ గ్రూపు వద్ద నుంచి రూ.100 కోట్ల దాకా లంచం తీసుకున్నారు. ఈ డబ్బులను గోవా ఎన్నికల్లో ‘ఆప్’ పార్టీ తరపున ఖర్చు చేశారు. అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్ కుట్రలో ప్రధాన సూత్రధారి. పాలసీ రూపకల్పన మొత్తం ఆయన కనుసన్నల్లోనే జరిగింది’అని సీబీఐ అఫిడవిట్లో పేర్కొంది. కాగా, కేజ్రీవాల్ లిక్కర్‌స్కామ్ సీబీఐ కేసులో సుప్రీంకోర్టు ఇప్పటికే మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయినా సీబీఐ కేసులో రిమాండ్‌లో ఉండటంతో ఆయన తీహార్ జైలులోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే.. లిక్కర్ స్కాం కేసులో ఈ ఏడాది మార్చి నెలలో కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసింది. అప్పటి నుంచి ఆయన తీహార్ జైలులోనే ఉన్నారు. అయితే లోక్‌సభ ఎన్నికల ప్రచారానికిగాను ఆయనకు సుప్రీంకోర్టు కొన్ని రోజుల పాటు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. బెయిల్ ముగిసిన తర్వాత కేజ్రీవాల్ తిరిగి జైలుకు వెళ్లారు. -
నేడు ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ విచారణ
సాక్షి,ఢిల్లీ: ఢిల్లీ హైకోర్టులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై బుధవారం(జులై 17) విచారణ జరగనుంది. లిక్కర్ స్కామ్ సీబీఐ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కేజ్రీవాల్ తాజాగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ ధర్మాసనం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌ను విచారించనుంది. ఇప్పటికే లిక్కర్ స్కామ్ ఈడీ కేసులో సీఎం కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయినా ఇదే స్కామ్‌లో సీబీఐ కేసులో ఇంకా జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉండటంతో కేజ్రీవాల్ తీహార్ జైలులోనే ఉండాల్సి వచ్చింది. -
సీఎం కేజ్రీవాల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
సాక్షి, హైదరాబాద్ : తీహార్ జైల్లో ఉన్న తనకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మరో రెండు అదనపు సమావేశాలకు అనుమతి ఇవ్వాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై ఇవ్వాళ ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది.ఈ సందర్బంగా కేజ్రివాల్ పిటిషన్ జైలు అధికారులు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్పందించాలని జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ ధర్మాసనం కోరింది. కేజ్రీవాల్ పిటిషన్‌పై తదుపరి విచారణ జూలై 15 కు వాయిదా వేస్తూ తీర్పును వెలువరించింది.