న్యూఢిల్లీ: లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన తర్వాత ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తొలిసారి సీఎం హోదాలో ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీ ప్రభుత్వంలోని జల మంత్రిత్వ శాఖకు కేజ్రీవాల్ ఈ ఆదేశాలిచ్చారు. ఈ ఆదేశాల వివరాలు ఆదివారం(మార్చ్ 24) నిర్వహించిన మీడియా సమావేశంలో ఢిల్లీ ఆర్థిక, జల వనరుల మంత్రి అతిషి వెల్లడించారు.
‘జైలులో ఉండి కూడా సీఎం తన కుటుంబ సభ్యులైన ఢిల్లీ వాసుల గురించే ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం వేసవిలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున ఢిల్లీలో నీటి కొరత లేకుండా చూడాలని తనను సీఎం ఆదేశించారు. క్యాబినెట్ పనితీరును సీఎం జైలు నుంచే పర్యవేక్షిస్తున్నారన్నారు’ అని అతిషి చెప్పారు.
मुख्यमंत्री अरविंद केजरीवाल जी को जेल से भी अपने परिवार दिल्ली की जनता की चिंता है
— AAP (@AamAadmiParty) March 24, 2024
उन्होंने मुझे जेल से लिखित आदेश भेजा है, जिसे पढ़ते वक्त मेरी आँखों में आँसू थे
ऐसा कौन सा मुख्यमंत्री है जो जेल में होने के बावजूद भी अपनी चिंता नहीं कर रहा है बल्कि लोगों के बारे में सोच रहा… pic.twitter.com/6Ht9lNdunN
కాగా, ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్‌లో మార్చ్ 21న అరెస్టయిన కేజ్రీవాల్ ప్రస్తుతం ఎన్‌ఫోర్స్‌మెంట్(ఈడీ) కస్టడీలో ఉన్నారు. కోర్టు ఆయనను మార్చ్ 29దాకా ఈడీ కస్డడీకి ఇచ్చింది. జైలు నుంచే తమ నేత సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తారని ఆప్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. గ్యాంగులే జైళ్ల నుంచి ఆపరేట్ చేస్తాయని దీనిపై ఇప్పటికే బీజేపీ కౌంటర్ కూడా ఇవ్వడం గమనార్హం.
Delhi CM Arvind Kejriwal sends order from ED custody to Water Minister Atishi. https://t.co/FcceGPK5Yx pic.twitter.com/iZs4PzHhhR
— ANI (@ANI) March 24, 2024
Comments
Please login to add a commentAdd a comment