సాక్షి, న్యూఢిల్లీ : మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని ఈడీ వేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తుది తీర్పు వచ్చే వరకు కేజ్రీవాల్ తీహార్ జైల్లోనే ఉండనున్నారు.
కాగా, నిన్న కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేస్తూ ట్రయల్ కోర్టు తీర్పిచ్చింది. అయితే ఆ తీర్పును సవాలు చేస్తూ ఈడీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును ఛాలెంజ్ చేసిన ఈడీ.. మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా ఆధారాలున్నాయని వాదించింది. అయితే ఇరు పక్షాల వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. కోర్టు నిర్ణయంతో జైలు అధికారులు కేజ్రీవాల్‌ను తీహార్ జైలుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment