Liqour
-
మందుబాబులకు పండుగ.. ఒకటికి మరొకటి ఫ్రీ.. రూ. 200 డిస్కౌంట్
నోయిడా: మద్యం ప్రియులకు శుభవార్త. ఆ రాష్ట్రంలోని మద్యం దుకాణంలో ఒక బాటిల్ కొంటే మరొక బాటిల్ ఉచితం(Buy one bottle, get another bottle free). పైగా ఫుల్ బాటిల్ కొంటే రూ. 200 డిస్కౌంట్. ఇది ఏ ఒక్క మద్యం దుకాణానికో పరిమితం కాదు. పలు జిల్లాల్లో ఈ ఆఫర్ కొనసాగుతోంది. దీంతో మద్యం ప్రియులంతా ఆయా దుకాణాల ముందు బారులు తీరుతున్నారు.ఉత్తరప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో మద్యంపై భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు అందిస్తున్నారు. తాజాగా మంగళవారం నోయిడాలోని ఒక దుకాణంలో ఒక బాటిల్ కొంటే మరొకటి ఉచితం అనే ఆఫర్ పెట్టడంతో మద్యం ప్రియులు భారీ సంఖ్యలో క్యూకట్టారు. కాగా మద్యంపై తగ్గింపు ధరలు ఒక్క నోయిడాకు మాత్రమే పరిమితం కాలేదు. యూపీలోని పలు జిల్లాల్లో మద్యంపై అద్భుతమైన ఆఫర్లు కొనసాగుతున్నాయి. కొన్ని చోట్ల ఒక బాటిల్ కొనుగోలు చేస్తే మరొక బాటిల్, మరికొన్ని చోట్ల పూర్తి బాటిల్ కొనుగోలు చేస్తే రూ. 200 వరకు తగ్గింపు అందిస్తున్నారు.एक बोतल शराब लीजिए, उसके साथ एक फ्री..उत्तर प्रदेश के शराब ठेके वालों को 31 मार्च की रात 12 बजे तक सारा स्टॉक खत्म करना है. वरना बची हुई दारू सरकारी खाते में जमा हो जाएगी और उसकी बिक्री नहीं हो पाएगी. इसलिए ठेके वाले ग्राहकों को खूब ऑफर दे रहे हैं. Video नोएडा का है.#Noida pic.twitter.com/lXZqadqzCd— NDTV India (@ndtvindia) March 25, 2025ఎన్డీటీవీ పేర్కొన్న కథనం ప్రకారం నోయిడా సెక్టార్ 18లోని ఒక మద్యం దుకాణం ముందు ‘ఒక బాటిల్ కొంటే ఒకటి ఉచితం’ అనే బోర్డు పెట్టగానే మద్యం ప్రియులు పరిగెత్తుకుంటూ ఆ దుకాణానికి చేరుకున్నారు. దీంతో అక్కడ ఏదో జాతర జరుగుతున్నలాంటి దృశ్యం కనిపించింది. కొందరు క్యూలో నిలుచుని మద్యం కోనుగోలుకు వేచిచూడగా, మరికొందరు ఇతరులతో గొడవపడుతూ, మద్యం కొనుగోలుకు ప్రయత్నించారు. అక్కడున్నవారికి మద్యం బాటిల్ దొరకగానే ఏదో జాక్‌పాట్ తగిలినట్లు ఆనందించారు. ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని ముజఫర్‌నగర్ జిల్లాలో మద్యం దుకాణాలలో భారీ ఆఫర్లు ప్రకటించడంతో ఆయా దుకాణాలకు మందుబాబులు భారీగా చేరుకుంటున్నారు. ఇప్పటికే భారీగా నిల్వవున్న మద్యం బాటిళ్లను ఖాళీ చేసేందుకే ఇక్కడి మద్యం దుకాణాలలో ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నారు. ముజఫర్ నగర్‌లోని ఒక మద్యం దుకాణం వద్ద మద్యం కొనుగోలుకు వేచిచూస్తున్న రాహుల్ అనే వ్యక్తి మాట్లాడుతూ ఒక బాటిల్ కొనుగోలుకు మరొక బాటిల్ ఉచితం అనే ఆఫర్ పెట్టడంతో విపరీతంగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని చెప్పాడు.యూపీలోని మద్యం స్టాకును అమ్మేందుకు మార్చి 25 చివరి తేదీ. అయితే మద్యం కాంట్రాక్టర్లు(Liquor contractors) మరో ఐదు రోజుల గడువుకోరి, డిస్కౌంట్లు అందిస్తూ జోరుగా మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల ఈ-లాటరీ ద్వారా కొత్తగా మద్యం దుకాణాలను కేటాయించారు. ఈ నేపధ్యంలో కొందరు మద్యం దుకాణాల నిర్వాహకులు ఈ-లాటరీలో దుకాణాలను దక్కించుకోలేకపోయారు. మరోవైపు మార్చి 31 నాటికి పాత దుకాణాల్లో స్టాక్‌ను పూర్తిగా ఖాళీ చేయాల్సి ఉంటుంది. ఫలితంగా మద్యం దుకాణాల్లో తగ్గింపు ధరలు కొనసాగుతున్నాయి. ఇది కూడా చదవండి: Delhi Budget: రూ. ఒక లక్ష కోట్లు.. బీజేపీ వరాల జల్లు -
వాట్సాప్ ద్వారా మద్యం డోర్ డెలివరి.. ‘సంపద సృష్టి అంటే ఇదేనా చంద్రబాబు’
సాక్షి,నెల్లూరు: ‘రాష్ట్రంలో వాట్సాప్ ద్వారా మద్యం డోర్ డెలివరీ అవుతుంది.. చంద్రబాబు ఇదేనా మీ సంపద సృష్టి అని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. మద్యం వ్యాపారులతో చంద్రబాబు ఒప్పందం కుదుర్చుకున్నారు. మద్యం ధరల్ని పెంచారు. తద్వారా ఏటా మూడు వేల కోట్లు చంద్రబాబు జేబులోకి వెళ్లనున్నాయి’అని విమర్శలు గుప్పించారు.కూటమి ప్రభుత్వం లిక్కర్ ధరల్ని పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. ‘లిక్కర్ ధరలు పెంచి చంద్రబాబు బాదుడు మళ్ళీ షురూ చేశారు. ప్రభుత్వ అధీనంలో ఉన్న మద్యం షాపుల్ని టీడీపీ నేతలకు కట్టబెట్టి.. ధరలు పెంచేశాడు. లిక్కర్ షాప్స్‌లో పని చేస్తున్న వారిని రోడ్డున పడేశారు.ఎమ్మెల్యేల కనుసన్నల్లో బెల్ట్ షాపులు నడుస్తున్నాయి.తక్కువ ధరకే మేలైన మద్యం ఇస్తానని హామీ ఇచ్చి.. ఉన్న ఫలంగా రేట్లు పెంచాడు.ప్రభుత్వ ఆదాయానికి తూట్లు పొడుస్తూ.. టీడీపీ నేతలు జేబులు నింపుకునేలా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.పద సృష్టిస్తానని చెప్పి.. తన సంపద పెంచుకునే పనిలో పడ్డారు. ఎల్లో సిండికేట్స్ ఏకమై ప్రజల కష్టాన్ని దోచుకుంటున్నారు. మద్యం షాప్స్ దగ్గర నుంచి బెల్ట్ షాప్స్ దాకా.. స్థానిక ఎమ్మెల్యేలు కమిషన్స్ వసూలు చేస్తున్నారు. వందల కోట్ల కమిషన్స్ దండుకోవడంలో భాగంగా.. చంద్రబాబు మద్యం ధరలు పెంచారు.చంద్రబాబు ఉండవల్లి నివాసానికి నోట్ల కట్టలు భారీగా వెళ్తున్నాయి. మద్యం వ్యాపారులతో చంద్రబాబు డీల్ కుదుర్చుకుని.. మద్యం ధరలు పెంచారు. ఏటా 3 వేల కోట్ల రూపాయలు చంద్రబాబు జేబులోకి వెళ్ళబోతున్నాయి. వాట్సాప్ ద్వారా లిక్కర్ డోర్ డెలివరి అవుతుంది. రాష్ట్ర ప్రజలను చంద్రబాబు గాలికి వదిలేశారు’ అని దుయ్యబట్టారు. -
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోలు
-
తిరువూరులో బెల్ట్ షాపుల భాగోతం
-
అనిత ఇలాకాలో బెల్టు షాపులకు వేలం పాట.. దండోరా వేసి మరి..
సాక్షి, అనకాపల్లి: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో బెల్టు షాపుల దందా కొనసాగుతోంది. ఏకంగా హోం మంత్రి అనిత ఇలాకాలోనే బెల్టు షాపులకు బహిరంగ వేలం పాటకు దండోరా వేయడం చర్చనీయాంశంగా మారింది. కూటమి ప్రభుత్వ అసమర్థత తీరుకు ఇది నిదర్శమని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.వివరాల ప్రకారం.. ఏపీ హోం మంత్రి అనిత ఇలాకాలో బెల్ట్ షాపులకు బహిరంగ వేలం పాట ప్రకటించారు. ఎస్ రాయవరం మండలంలోని పేట సూదిపురంలో బహిరంగ వేలం పాట నిర్వహణకు ప్లాన్ చేస్తున్నారు. బెల్టు షాపు వేలంపాట కోసం ముందు రోజు రాత్రి గ్రామంలో దండోరా వేయడం చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీ కూటమి నేతల కనుసన్నల్లో బెల్టు షాపులు వేలం పాట జరుగుతున్నట్టు తెలుస్తోంది.అయితే, రాష్ట్రంలో బెల్టు షాపులు లేవని సీఎం చంద్రబాబు, మంత్రి అనిత అడ్డగోలు వాదనలు చేస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా బెల్టు షాపులు నిర్వహిస్తే ఐదు లక్షల జరిమానా అంటూ ప్రకటన కూడా చేశారు. మరోవైపు.. తనిఖీల్లో బెల్టు షాపు నిర్వాహకులు దొరికినా ఎటువంటి జరిమానా విధించడం లేదు ఎక్సైజ్ అధికారులు. ప్రభుత్వ పెద్దలు చెప్పేది ఒకటి.. గ్రౌండ్ లెవల్ జరుగుతున్నది మరొకటి అని పలువురు గుసగుసలాడుకుంటున్నారు. -
Bal Thackeray: సీఎంనే మందు పార్టీ అడిగిన బాల్ ఠాక్రే
న్యూఢిల్లీ: బాల్ ఠాక్రే.. మహారాష్ట్ర రాజకీయాల్లో శక్తివంతమైన నేతగా పేరుగాంచారు. నేడు (నవంబర్ 17) ఆయన వర్థంతి. 1926 జనవరి 23న జన్మించిన ఆయన 2012 నవంబర్ 17న కన్నుమూశారు. ఒకానొక సమయంలో బాల్ ఠాక్రే మహారాష్ట్ర రాజకీయాలను శాసించారు.మహారాష్ట్ర సీఎం పదవిలో ఎవరున్నా బాల్ ఠాక్రే ఆధిపత్యమే కొనసాగేదని చెబుతుంటారు. ప్రముఖ జర్నలిస్టు సుజాతా ఆనందన్ 'హిందూ హృదయ సామ్రాట్ - హౌ ది శివసేన ఛేంజ్డ్ ముంబై ఫర్ ఎవర్’ అనే పుస్తకాన్ని రాశారు. దానిలో ఆమె బాల్ ఠాక్రేకు సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను తెలియజేశారు. బాల్ ఠాక్రే బహిరంగంగా బీరు తాగేందుకు, సిగరెట్లు కాల్చేందుకు ఏమాత్రం మొహమాటపడేవారు కాదని సుజాతా ఆనందన్ ఆ పుస్తకంలో తెలిపారు. ఈ రెండూ అంటే బాల్ ఠాక్రేకు ఎంతో ఇష్టమని, ఆయన అందరి ముందు మద్యం తాగేవారని ఆమె ఆ పుస్తకంలో పేర్కొన్నారు.అది 1995. బాల్ ఠాక్రే పార్టీ గెలిచింది. దీంతో ముంబైకి చెందిన బిల్డర్ నిరంజన్ హీరానందాని తండ్రి డాక్టర్ ఎల్ హెచ్ హీరానందాని ఒక పార్టీని ఏర్పాటు చేశారు. ఈ పార్టీలో గొంతు తడపడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని బాల్ ఠాక్రే కోరారు. వెంటనే హీరానందానీ.. ‘పార్టీకి సీఎం వస్తారు. వారి సమక్షంలో మద్యం ఎలా తాగగలం?’ అని ప్రశ్నించారు. దీనికి స్పందించిన బాల్ ఠాక్రే నేరుగా సీఎం మనోహర్ జోషితో ‘ఏంటి మనోహర్.. మీరేమీ తాగరా’ అని ప్రశ్నించారు. ఈ మాట వినగానే సీఎం అవాక్కయ్యారు. తరువాత బాల్‌ఠాక్రే డాక్టర్ హీరానందానీతో మనం ఇప్పుడిప్పుడే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. కనీసం షాంపైన్ అయినా ఏర్పాటు చేయాలి అని అన్నారు. దీంతో ఫ్రూట్ జ్యూస్ పార్టీ కాస్తా మద్యం పార్టీగా మారిపోయింది.ఇది కూడా చదవండి: ఎన్నికల ప్రచారంలో నటుడు గోవిందాకు అస్వస్థత -
లిక్కర్ అమ్మకాలపై రేవంత్‌రెడ్డికి ప్రేమ ఎక్కువైంది: హరీశ్‌రావు
సాక్షి,నల్గొండజిల్లా: ాన్యం సకాలంలో కొనుగోలు చేయక రైతులను ఇబ్బంది పెడుతున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు.నల్గొండ జిల్లాలోని మర్రిగూడలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని హరీశ్‌రావు బుధవారం(నవంబర్ 13) పరిశీలించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ ‘రైతులు రూ.1800లకు క్వింటాల్ చొప్పున ధాన్యం దళారులకు అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ ఇస్తున్నామని తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. రైతుల ధాన్యం లోడ్ ఎత్తమంటే మహారాష్ట్రకు నోట్ల కట్టల లోడ్ ఎత్తుతున్నాడు ముఖ్యమంత్రి. ధాన్యానికి మద్దతుధర వస్తలేదని రైతులు మిర్యాలగూడలో రాస్తారోకో చేశారు.కొనుగోలు చేసిన ధాన్యానికి కూడా తరుగు పేరుతో రైతులను తీవ్ర ఇబ్బంది పెడుతున్నారు.ఇప్పటివరకు నల్లగొండ జిల్లాలో ఒక కిలో సన్న ధాన్యాన్ని కొనలేదు.ముఖ్యమంత్రికి మద్యం అమ్మకంపై ప్రేమ ఎక్కువైంది.మందు తక్కువ అమ్మిన ఎక్సైజ్ అధికారులకు మెమోలు ఇస్తున్నారు.25 మంది సర్కిల్ ఇన్స్పెక్టర్లకు మెమో జారీ చేశారు.తెలంగాణను తాగుబోతుల తెలంగాణ చేయాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాడు.మహిళల పుస్తెలు తెంపుతున్నారు.రాష్ట్రంలో 90 లక్షల మెట్రిక్ టన్నులు కొంటామని ప్రభుత్వం ప్రకటించింది.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కూడా కొనే పరిస్థితి లేదు.యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టు పెట్టి రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తానని మోసం చేసావ్.రేవంత్‌రెడ్డి రాజ్యంలో రైతులు దుఃఖపడుతున్నాడు.ధాన్యం కొనుగోలులోనే కాదు పత్తి కొనుగోలు విషయంలోనూ ప్రభుత్వం తీవ్రంగా విఫలమైంది.కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 15000 రూపాయల రైతుబంధు రైతులకు వెంటనే ఇవ్వాలి’అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: కేటీఆర్ అరెస్ట్ కావాల్సిందే: మంత్రి కోమటిరెడ్డి -
AP: ఉద్రిక్తత.. వైన్‌షాప్ మూసేయాలని మహిళల ఆందోళన
సాక్షి, నెల్లూరు: నెల్లూరు జగదీష్‌నగర్‌లో ఉద్రిక్తత నెలకొంది. స్థానికంగా నూతనంగా ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని ఎత్తివేయాలంటూ మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. జనావాసాల నడుమ ఏర్పాటు చేసిన మద్యం షాపును తొలగించాలని డిమాండ్ చేశారు.మహిళలు, స్థానికులు షాపు వద్ద పెద్దఎత్తున ఆందోళనకు దిగడంతో తీవ్రతరంగా మారింది దుకాణం కౌంటర్ వద్దకు వెళ్లి నిర్వాహకులను హెచ్చరించారు.అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. జనావాసాల మధ్య మద్యం షాపు వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందని, ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజులుగా ఆందోళనలు చేస్తున్నా.. ఎక్సైజ్ అధికారులు స్పందించకపోవడం దారుణమని, ఇప్పటికైనా దుకాణాన్ని తొలగించాలని లేనిపక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. జగదీష్‌నగర్‌లో మద్యం షాపు వద్ద స్థానికుల ఆందోళనకు ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి సంఘీభావం ప్రకటించారు.ఇదిలా ఉండగా వైన్ షాప్ నిర్వాహకునికి మద్దతుగా పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. అంతేగాక మహిళను బెదిరించేందుకు వైన్‌షాప్ నిర్వాహకులు రౌడీలను తీసుకొచ్చారు. మరోవైపు షాప్ మూసేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని మహిళలు హెచ్చరిస్తున్నారు. తమకు ళలకు అన్యాయం జరిగితే రాని పోలీసులు.. మద్యం షాప్ ఓనర్‌కు మద్దతుగా వచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
బాబు మద్యం బ్రాండ్లపై వైఎస్ జగన్ సెటైర్లు
సాక్షి, తాడేపల్లి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన హయంలో తీసుకొచ్చిన మద్యం బ్రాండ్లపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సెటైర్లు వేశారు. గత బాబు పాలనలో చిత్రవిచిత్రమైన మద్యం బ్రాండ్ల పేర్లను బయటకు తెచ్చారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మున్ముందు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి బ్రాండ్లను సైతం తీసుకొచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదంటూ చమత్కరించారు. ఈ క్రమంలోనే బాబు ప్రభుత్వం ఏ లిక్కర్ బ్రాండ్లను అందుబాటులోకి తీసుకొచ్చిందనే విషయాన్ని వైఎస్ జగన్ చదివి వినిపించారు.బూం.. బూం బీర్ప్రెసిడెంట్ మెడల్గవర్నర్స్ ఛాయిస్పవర్స్టార్ 999రష్యన్ రోమనోవాఏసీబీ999 లెజెండ్హెవెన్స్ డోర్క్రేజీ డాల్క్లిఫ్ హ్యంగర్నెపోలియన్సెవెన్త్ హెవెన్హైదరాబాద్ బ్రాండ్ విస్కీవీరా బ్లామ్ డే2019 మే నెలలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా బ్రాండ్లు రిలీజ్ చేశారని ప్రస్తావించారు. అయితే అవన్నీ తరువాత వైఎస్సార్సీపీ హయాంలో వచ్చిన బ్రాండ్లంటూ అబద్ధాలు ప్రచారం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు తెచ్చిన బ్రాండ్లే తమ హయాంలో ఇచ్చామని, మార్చిందేమీ లేదని తెలిపారు. వాస్తవాలను వక్రీకరించి దుష్ప్రచారం చేశారని విమర్శలు గుప్పించారు.. ప్రస్తుతం బాబు ఈ అయిదు నెలల్లోనూ అవే బ్రాండ్లు, అదే మద్యం ఇస్తున్నారని చెప్పారు.గతంలో బాబు హయాంలో 4,380 మద్యం షాపులు ఉంటే వాటిని వైఎస్సార్సీపీ పాలనలో 2934కు తగ్గించామని తెలిపారు. బాబు హయాంలో 43 వేల బెల్ట్ షాప్‌లు నడిచేవని.. తమ ప్రభుత్వం వచ్చాక పర్మిట్ రూమ్‌లను రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. లిక్కర్ షాప్‌లు ఎప్పటి వరకు నడపాలనే టైమింగ్‌ను కూడా తీసుకొచ్చామని చెప్పారు.మద్యం మాఫియాకు సూత్రధారి, పాత్రధారి చంద్రబాబే: వైఎస్ జగన్ 20 డిస్టిలరీలకు గానూ 14కు లైసెన్స్‌లు ఇచ్చింది చంద్రబాబేమా హయాంలో ఒక్క డిస్టిలరీకి కూడా పర్మిషన్ ఇవ్వలేదు.మేం నాసిరకం మద్యం విక్రయించామని ప్రచారం చేశారు.ఇప్పుడు నాణ్యమైన లిక్కర్ అంటూ ఊదరగొడుతున్నారు.షాప్‌ల సంఖ్య తగ్గించి మద్యం అమ్మకాలు నియంత్రించాం.ప్రభుత్వ మద్యం షాపులను చంద్రబాబు రద్దు చేశాడు.ఇది నిజంగా పెద్ద స్కాం.తన మద్యం మాఫియాకు మొత్తం షాపులు కట్టబెట్టాడు.డిస్టలరీస్‌కు వాల్యూమ్స్ పెంచి కమీషన్లు తీసుకుంటున్నాడు.ఎమ్మార్పీ రేట్ల కంటే ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు.త్వరలో బెల్ట్‌షాప్‌లు, పర్మిట్ రూమ్‌లు కూడా వచ్చేస్తాయి.రూ.99కే మద్యం అన్నాడు.. ఇది కూడా స్కామే -
బాబు మాఫియా బండారం బయటపెట్టిన జగన్
-
ఇసుక TO "మద్యం దోచుకో.. పంచుకో.. తినుకో.. వైఎస్ జగన్ సెటైర్లు
-
లిక్కర్ మాఫియాకు సూత్రధారి.. పాత్రధారి నువ్వు కాదా ?
-
ధూంధాం... దసరా.. ఐదు రోజుల్లో 25 శాతం పెరిగిన మద్యం అమ్మకాలు
సాక్షి, హైదరాబాద్: దసరా పండుగ ఈసారి రాష్ట్రంలో ధూంధాంగా జరుగుతోందని మద్యం విక్రయ గణాంకాలు చెప్పకనే చెబుతున్నాయి. సాధారణ రోజులతో పోలిస్తే గత ఐదు రోజుల్లో 25 శాతం, అమ్మకాలు పెరిగాయి. గత ఏడాది దసరాతో ఆయన పోలిస్తే.. ఈ ఐదు రోజుల్లో 15 శాతం మేర అమ్మ కాలు పెరగ్గా, ప్రతిరోజు రాష్ట్రంలో సగటున రూ.124 కోట్ల మద్యం అమ్ముడవుతోంది. రికార్డు విద్యుత్ స్థాయిలో ఈనెల 10వ తేదీన ఏకంగా రూ.139 కోట్ల విలువైన మద్యాన్ని డిపోల నుంచి వైన్షావు లకు తరలించారు. అదే రోజున ఏకంగా 2.35 లక్షల కేసుల బీర్లు వైన్‌షాపులకు చేరడం గమనార్హం . ఈ స్థాయిలో బీర్ అమ్మకాలు ఏడాది కాలంలోనే రికార్డు అని ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నా వాస్తవానికి, సాధారణ రోజుల్లో సగటున రోజు రూ.100 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరుగుతుంటాయి. లక్ష కేసుల వరకు లిక్కర్ అమ్ముడవు తుంది. కానీ, దసరా సందర్భంగా ఈ అమ్మకాల జోరు పెరిగింది. ఐదు రోజుల సగటు చూస్తే రోజుకు 1.20 లక్షల కేసుల లిక్కర్, 2 లక్షల కేసుల బీర్లు అమ్ముడుపోయాయి. ఇక, ఈనెల 1వ తేదీ నుంచి గణాంకాలను పరిశీలిస్తే 8 రోజుల్లో రూ.852.38 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపో యింది. ఇందులో 8.37లక్షల కేసుల లిక్కర్ ఉం డగా, 14:53 లక్షల కేసుల బీర్లు ఉన్నాయి. అదే గత ఏడాది అక్టోబర్1 నుంచి 10వ తేదీ వరకు రూ.800 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. గత ఏడాదితో పోలిస్తే పది రోజుల్లో కూడా 6.55 శాతం మేర మందుబాబులు పుల్లుగా లాగించేశారని ఈ గణాంకాలు చెబుతున్నాయి. -
మద్యం షాపులన్నీ మావే: ‘జేసీ’ బెదిరింపులు
సాక్షి,అనంతపురం:తాడిపత్రిలో టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మద్యం మాఫియా గుట్టు బయటపడింది.మద్యం షాపులన్నీ మాకే కావాలని జేసీ వర్గీయులు అంటున్నారు. ఎవరైనా టెండర్లు వేస్తే అంతు చూస్తామని బెదిరిస్తున్నారు.తమ అనుమతి లేనిదే తాడిపత్రిలో ఎవరికీ రూములు అద్దెకు ఇవ్వొద్దని హెటల్ యజమానులకు టీడీపీ నేతలు అల్టిమేటం జారీ చేశారు.ఇంత జరుగుతున్నా తాడిపత్రిలో పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తుండటం గమనార్హం. మరోవైపు మద్యం షాపులకు దరఖాస్తుల గడువును టీడీపీ నేతల కోసమే పెంచినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే నెల్లూరులో మద్యంషాపులన్నీ తమ సిండికేట్‌కే దక్కాలని మంత్రి నారాయణ మాట్లాడిన ఫోన్ సంభాషణ బయటపడిన విషయం తెలిసిందే.ఇదీ చదవండి: ఏపీలో మద్యం షాపులకు దరఖాస్తు గడువు పెంపు -
రేపే సీఎం పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా?
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రేపే (సెప్టెంబర్ 17) తన పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందులో భాగంగా రేపు లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాతో భేటీ అయ్యేందుకు అపాయిట్మెంట్ అడిగినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సన్నిహిత వర్గాలు తెలిపాయి.కేజ్రీవాల్ రేపు సాయంత్రం 4:30 గంటలకు సక్సేనాను కలిసే అవకాశం ఉందని, ఆ తర్వాత ఆయన రాజీనామాను సమర్పించవచ్చని సమాచారం. ఇదిలా ఉండగా, పార్టీ తదుపరి చర్యలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించడానికి ఆప్ సీనియర్ నాయకులు ఈరోజు సాయంత్రం 5 గంటలకు సమావేశం కానున్నారు.లిక్కర్ పాలసీ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో శుక్రవారం తీహార్ జైలు నుంచి విడుదలైన అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం ఆప్ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. తన తొలి ప్రసంగంలో రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. రెండు రోజుల తర్వాత సీఎం పదవికి రాజీనామా చేయబోతున్నాను . ప్రజలు తీర్పు ఇచ్చేంత వరకు సీఎం సీట్లో కూర్చోను. ప్రతి ఇంటికి, ప్రతి వీధికి వెళ్తాను.. తప్ప సీఎం కుర్చీలో కూర్చోను. ప్రజల నుంచి నాకు తీర్పు వస్తుంది’ అని ఆయన అన్నారు.ఇదీ చదవండి : గణేష్ నిమజ్జనం.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు -
బెయిల్ ఇవ్వండి: సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్
సాక్షి,ఢిల్లీ: లిక్కర్ పాలసీ సిబీఐ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సీబీఐ కేసులో కేసులో కేజ్రీవాల్‌కు ఇటీవలే హైకోర్టు బెయిల్ నిరాకరించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆగస్టు 5న కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఇప్పటికే ఈడీ కేసులో కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది.సీబీఐ కేసులో బెయిల్ రాకపోవడంతో ప్రస్తుతం కేజ్రీవాల్ తీహార్జైలులోనే ఉన్నారు. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) సీనియర్ నేత మనీష్‌సిసోడియాకు లిక్కర్ పాలసీ కేసులో సుప్రీంకోర్టు ఇటీవలే బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. -
మళ్లీ డిప్యూటీ సీఎంగా మనీష్ సిసోడియా..?
న్యూఢిల్లీ: లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా బెయిల్‌పై విడుదలవడంతో కొత్త వాదనకు తెరలేచింది. సిసోడియాను మళ్లీ డిప్యూటీ సీఎంగా నియమిస్తారని ఆమ్ఆద్మీపార్టీ(ఆప్)వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా లిక్కర్ కేసులో జైలులో ఉండడంతో సిసోడియా డిప్యూటీ సీఎంగా ఉంటేనే ఇటు పాలనాపరంగా అటు రాజకీయంగా పార్టీకి బలం చేకూరుతుందని ఆప్ నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయనను త్వరలోనే మళ్లీ డిప్యూటీ సీఎంగా నియమించి కీలకమైన ఆర్థిక, విద్యా శాఖలు కేటాయిస్తారని చెబుతున్నారు.గతేడాది ఫిబ్రవరిలో అరెస్టయిన తర్వాత సిసోడియా తన డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేశారు. లిక్కర్ కేసులో అరెస్టయి తీహార్ జైలులో రిమాండ్‌లో ఉన్న సిసోడియాకు శుక్రవారం(ఆగస్టు 9) సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో శుక్రవారం సాయంత్రమే ఆయన జైలు నుంచి విడుదలై సీఎం కేజ్రీవాల్ కుటుంబ సభ్యులను కలిశారు.ప్రస్తుతం సిసోడియా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. -
లిక్కర్ కేసు విచారణకు కవిత వర్చువల్ హాజరు
సాక్షి,ఢిల్లీ: లిక్కర్‌స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్ మీద ఢిల్లీ కోర్టులో శుక్రవారం(ఆగస్టు9) విచారణ జరిగింది. విచారణకు కవిత సహా లిక్కర్ కేసు నిందితులు వర్చువల్‌గా హాజరయ్యారు. సీబిఐ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో పేజినేషన్ సరిగ్గా లేదని నిందితులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నెల 14 వరకు ఛార్జ్‌షీట్‌లో సరిగ్గా పేజినేషన్ చేస్తామని సీబీఐ కోర్టుకు తెలిపింది. అనంతరం కేసును న్యాయమూర్తి కావేరి బవేజా ఆగస్టు 21కి వాయిదా వేశారు. -
మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టులో ఊరట
సాక్షి,ఢిల్లీ: లిక్కర్‌స్కామ్‌కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆమ్ఆద్మీపార్టీ సీనియర్‌నేత మనీష్ సిసోడియాకు ఎట్టకేలకు ఊరట లభించింది. లిక్కర్ కేసులో నమోదైన సీబీఐ, ఈడీ కేసులు రెండింటిలో సిసోడియాకు బెయిల్ ఇస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం(ఆగస్టు9) ఉదయం తీర్పు వెలువరించింది. బెయిల్‌పై ఉన్నంత కాలం దేశం విడిచి వెళ్లకూడదని, పాస్‌పోర్టు సరెండర్ చేయాలని కోర్టు షరతు విధించింది. ఇటీవలే సిసోడియా బెయిల్‌పై వాదనలు విన్న జస్టిస్ బీఆర్ గవాయ్,జస్టిస్ కె.వి విశ్వనాథన్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. వాదనల సందర్భంగా బెయిల్‌ను ఈడీ,సీబీఐ వ్యతిరేకించినప్పటికీ సిసోడియాకు దేశ అత్యున్నత కోర్టు బెయిల్ విషయంలో ఉపశమనం కల్పించింది. కేసులో విచారణ ఆలస్యమవుతున్నందునే బెయిల్ ఇస్తున్నామని కోర్టు తెలిపింది. బెయిల్ ఇవ్వకుండా ఎక్కువ కాలం నిందితుడిని జైలులో ఉంచడం అతడి హక్కులను హరించడమేనని వ్యాఖ్యానించింది. గతేడాది ఫిబ్రవరిలో అరెస్టయిన సిసోడియా 17 నెలలుగా తీహార్ జైలులో ఉన్నారు. -
‘లిక్కర్‌స్కామ్’లో పీకల్లోతులో సిసోడియా: సుప్రీంలో ఈడీ
న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ పార్టీ సీనియర్ నేత మనీష్ సిసోడియాకు లిక్కర్ కేసులో బెయిల్ ఇవ్వవద్దని సుప్రీంకోర్టులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వాదించింది. లిక్కర్‌స్కామ్‌లో మనీష్‌సిసోడియా పీకల్లోతు కూరుకుపోయారని ఈడీ తెలిపింది. ఈడీ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌విరాజు వాదనలు వినిపించారు. మనీష్‌సిసోడియాపై పెట్టిన కేసులు కల్పితం కాదని, ఆయనకు వ్యతిరేకంగా చాలా సాక్షాధారాలున్నాయని తెలిపారు. కేసు దర్యాప్తులో ఎలాంటి జాప్యం లేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. మనీష్‌సిసోడియా ఈ కేసులో 17 నెలలుగా ఎందుకు జైలులో ఉండాలని ఆయన తరపు న్యాయవాది అభిషేక్‌మనుసింఘ్వి వాదించారు. వాదనల సందర్భంగా ఈడీ న్యాయవాది లిక్కర్ పాలసీ రూపకల్పన అని ప్రస్తావించినపుడు సుప్రీం ధర్మాసనం జోక్యం చేసుకుంది. పాలసీ రూపకల్పనకు నేరం చేయడానికి మధ్య తేడా ఏంటో చెప్పాలని కోరింది. కాగా, మనీష్ సిసోడియా లిక్కర్ స్కామ్‌లో సీబీఐ, ఈడీ కేసుల్లో అరెస్టయి జైలులో ఉన్నారు. -
కేజ్రీవాల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ చేసిన ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ: లిక్కర్ స్కామ్ సీబీఐ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై తీర్పును ఢిల్లీ హైకోర్టు రిజర్వ్ చేసింది. సీబీఐ అరెస్టును సవాల్ చేయడంతోపాటు మధ్యంతర బెయిల్ కోరుతూ ఆయన పిటిషన్లు వేశారు. ఆ పిటిషన్లపై హోరాహోరీగా వాదనలు జరగ్గా.. తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు హైకోర్టు ధర్మాసనం ప్రకటించింది. మరోవైపు.. రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై జులై 29న విచారణ చేపడతామని కోర్టు వెల్లడించింది.సీబీఐ కేసులో కేజ్రీవాల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు బుధవారం(జులై 17) విచారించింది. ఈ సందర్భంగా కేజ్రీవాల్ తరపున ప్రముఖ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు.‘‘కేజ్రీవాల్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేసులో ట్రయల్ కోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాతే సీబీఐ ఆయనను అరెస్టు చేసింది. అప్పటిదాకా సీబీఐ కనీసం కేజ్రీవాల్‌ను లిక్కర్ కేసులో విచారించలేదు. 2022లో కేసు నమోదైతే 2024 జూన్‌లో విచారించడమేంటి. అదీ కోర్టులో జడ్జి ఎదుటే అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది?. ఇది కచ్చితంగా బెయిల్ తర్వాత వచ్చిన ఆలోచనతో చేసిన ‘ఆఫ్టర్‌థాట్ ఇన్సూరెన్స్’ అరెస్ట్. సీబీఐ కేజ్రీవాల్ ప్రాథమిక హక్కులను ఉల్లంఘించింది. అరెస్టు సీర్పీసీ సెక్షన్ 41 ప్రకారం చట్ట విరుద్ధం. ఆయన ఒక సీఎం. టెర్రరిస్టు కాదు’అని సింఘ్వీ వాదించారు. కేజ్రీవాల్‌కు బెయిల్ ఇవ్వొద్దు: సీబీఐ అఫిడవిట్ అంతకుముందు కేజ్రీవాల్ బెయిల్ అభ్యర్థనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సీబీఐ ఢిల్లీ హైకోర్టులో అఫిడవిట్ వేసింది. ‘ఢిల్లీ లిక్కర్ పాలసీలో సీఎం కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగా మార్పులు చేశారు. లిక్కర్ పాలసీలో మార్పులు చేసినందుకుగాను సౌత్ గ్రూపు వద్ద నుంచి రూ.100 కోట్ల దాకా లంచం తీసుకున్నారు. ఈ డబ్బులను గోవా ఎన్నికల్లో ‘ఆప్’ పార్టీ తరపున ఖర్చు చేశారు. అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్ కుట్రలో ప్రధాన సూత్రధారి. పాలసీ రూపకల్పన మొత్తం ఆయన కనుసన్నల్లోనే జరిగింది’అని సీబీఐ అఫిడవిట్లో పేర్కొంది. కాగా, కేజ్రీవాల్ లిక్కర్‌స్కామ్ సీబీఐ కేసులో సుప్రీంకోర్టు ఇప్పటికే మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయినా సీబీఐ కేసులో రిమాండ్‌లో ఉండటంతో ఆయన తీహార్ జైలులోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే.. లిక్కర్ స్కాం కేసులో ఈ ఏడాది మార్చి నెలలో కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసింది. అప్పటి నుంచి ఆయన తీహార్ జైలులోనే ఉన్నారు. అయితే లోక్‌సభ ఎన్నికల ప్రచారానికిగాను ఆయనకు సుప్రీంకోర్టు కొన్ని రోజుల పాటు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. బెయిల్ ముగిసిన తర్వాత కేజ్రీవాల్ తిరిగి జైలుకు వెళ్లారు. -
నేడు ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ విచారణ
సాక్షి,ఢిల్లీ: ఢిల్లీ హైకోర్టులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై బుధవారం(జులై 17) విచారణ జరగనుంది. లిక్కర్ స్కామ్ సీబీఐ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కేజ్రీవాల్ తాజాగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ ధర్మాసనం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌ను విచారించనుంది. ఇప్పటికే లిక్కర్ స్కామ్ ఈడీ కేసులో సీఎం కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయినా ఇదే స్కామ్‌లో సీబీఐ కేసులో ఇంకా జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉండటంతో కేజ్రీవాల్ తీహార్ జైలులోనే ఉండాల్సి వచ్చింది. -
‘సీబీఐ నన్ను వేధిస్తోంది’.. ఢిల్లీ హైకోర్టుకు కేజ్రీవాల్
సాక్షి,న్యూఢిల్లీ : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.మద్యం పాలసీ కేసులో బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.పలు జాతీయ మీడియా కథనాల ప్రకారం.. లిక్కర్ పాలసీ కేసులో కొనసాగుతున్న దర్యాప్తుల ముసుగులో సీబీఐ తనను వేధింపులకు గురిచేస్తోందని కేజజ్రీవాల్ ఆరోపించారు. సీబీఐ అధికారుల తీరు నిరాశ, ఆందోళన కలిగించే విషయమని పిటిషన్లో పేర్కొన్నారు.ఈ సందర్భంగా 2023 ఏప్రిల్‌లో విచారణకు పిలిచినప్పుడు తాను సీబీఐకి సహకరించినట్లు గుర్తు చేశారు. అంతేకాదు, సీబీఐ అరెస్ట్ చట్టవిరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా అభివర్ణించారు. రిమాండ్ ఉత్తర్వులు చాలా సాధారణమైనవని, మొత్తం అరెస్ట్, విచారణ ప్రక్రియను నిర్విర్యం చేయడానికి దారితీస్తుందని కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్లో వెల్లడించారు.కాగా, సీబీఐ అరెస్ట్, ట్రయల్ కోర్టు తనను సీబీఐ కస్టడీకి అప్పగించడాన్ని సవాలు చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ కూడా హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. -
లిక్కర్ కేసు: కవితకు మళ్లీ నిరాశే
సాక్షి,ఢిల్లీ: లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ చుక్కెదురయింది. కవిత బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఈడీ, సీబీఐ రెండు కేసుల్లోనూ బెయిల్ రిజెక్ట్ చేసింది. లిక్కర్ కేసులో బెయిల్ కోసం కవిత ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. ట్రయల్ కోర్టు బెయిల్ ఇవ్వకపోవడంతో ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను విచారించిన హైకోర్టు గతంలో రిజర్వు చేసిన తీర్పును సోమవారం(జులై1) సాయంత్రం వెలువరించింది. సీబీఐ, ఈడీ రెండు కేసుల్లో కవితకు బెయిల్ నిరాకరిస్తూ తీర్పిచ్చింది. -
ప్రభుత్వ లిక్కర్ కిక్కెక్కట్లేదు : మంత్రి కామెంట్స్
చెన్నై: ప్రభుత్వ మద్యం దుకాణాల్లో(టాస్మాక్షాపులు) దొరికే లిక్కర్‌తో కిక్కు సరిపోక ప్రజలు సారా(అరకు) తాగుతున్నారని తమిళనాడు మంత్రి దురైమురుగన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తమిళనాడు అసెంబ్లీలో ఎక్సైజ్, ప్రొహిబిషన్ చట్టాన్ని బలోపేతం చేస్తూ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా దురైమురుగన్ మాట్లాడారు. టాస్మాక్ మద్యం దుకాణాల్లో దొరకే మందు కొందరికి సాఫ్ట్ డ్రింక్‌లా అనిపిస్తోందన్నారు. తమిళనాడులో పూర్తిగా మద్యాన్ని నిషేధించడం కుదరదని స్పష్టం చేశారు. పొరుగు స్టేట్స్లో మద్యం దొరుకుతున్నపుడు తమిళనాడులో పూర్తి మద్య నిషేధం అమలు చేయడం సాధ్యం కాదన్నారు.రోజంతా కష్టపడి పనిచేసుకునేవాళ్లు అలసట మరిచిపోయి నిద్రపోవాలంటే మద్యం అవసరమన్నారు. కాగా, దురైమురుగన్ వ్యాఖ్యలపై అన్నాడీఎంకే ఆగ్రహం వ్యక్తం చేసింది. డీఎంకే ప్రభుత్వ అసమర్థత వల్లే ఇటీవల కల్లకురిచిలో కల్తీసారా తాగి చాలా మంది మరణించారని అన్నాడీఎంకే అధికార ప్రతినిధి కోవై సత్యన్ మండిపడ్డారు. -
ఢిల్లీలో ‘ఆప్’ వల్లే ఓడాం: కాంగ్రెస్ బ్లేమ్‌గేమ్
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు ముగిసిన కొద్ది రోజులకే కాంగ్రెస్ పార్టీ తన మిత్రపక్షమైన ఆమ్‌ఆద్మీపార్టీపై(ఆప్) బ్లేమ్‌గేమ్ ప్రారంభించింది. ఢిల్లీలో పోటీ చేసిన సీట్లలో కాంగ్రెస్ ఓడిపోవడానికి లిక్కర్ స్కామే కారణమని కాంగ్రెస్ నేత అభిషేక్‌దత్ అన్నారు. తాము గనుక ఈ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఉంటే మంచి ఫలితాలు వచ్చేవన్నారు.#WATCH | Delhi: Congress leader Abhishek Dutt says, "When we exposed excise scam, we demanded the then government to conduct a proper investigation. ED and CBI didn't take any action, even after 18 months of filing the case. But, just 1 month before the Lok Sabha polls, they… pic.twitter.com/9TYjbifIce— ANI (@ANI) June 29, 2024 ఢిల్లీలో నీటి సంక్షోభం వస్తే మంత్రి అతిషి చర్యలు తీసుకోవాల్సిందిపోయి నిరాహారదీక్ష పేరుతో డ్రామా చేసిందని విమర్శించారు. భారీ వర్షం పడి ఢిల్లీ స్తంభించి పోవడానికి ఆప్ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని మరో కాంగ్రెస్ నేత దేవేందర్‌యాదవ్ విమర్శించారు. కాంగ్రెస్ నేతల విమర్శలకు ఆప్ స్పందించింది. రాజ్యాంగాన్ని కాపాడేందుకు ప్రతిపక్షపార్టీలన్నీ ఐక్యంగా పోరాడుతున్నాయని, వాటి మధ్య చీలికలు మంచివి కావని ఆప్ నేత సౌరభ్‌భరద్వాజ్ సూచించారు. -
కేజ్రీవాల్ బెయిల్ రద్దు పిటిషన్‌పై తీర్పు రిజర్వ్
సాక్షి, న్యూఢిల్లీ : మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని ఈడీ వేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తుది తీర్పు వచ్చే వరకు కేజ్రీవాల్ తీహార్ జైల్లోనే ఉండనున్నారు.కాగా, నిన్న కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేస్తూ ట్రయల్ కోర్టు తీర్పిచ్చింది. అయితే ఆ తీర్పును సవాలు చేస్తూ ఈడీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును ఛాలెంజ్ చేసిన ఈడీ.. మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా ఆధారాలున్నాయని వాదించింది. అయితే ఇరు పక్షాల వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. కోర్టు నిర్ణయంతో జైలు అధికారులు కేజ్రీవాల్‌ను తీహార్ జైలుకు తరలించారు. -
బుక్కయిన బాలయ్య.. అంతా గ్రాఫిక్స్ అంటున్న ప్రొడ్యూసర్...
-
మద్యం పాలసీ కేసులో కీలక పరిణామం.. ఈడీ చరిత్రలో తొలిసారిగా
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మద్యం పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆమ్ఆద్మీపార్టీ (AAP) పేరును నిందితుల జాబితాలో చేర్చుతూ ఛార్జ్ షీట్‌ను దాఖలు చేసింది. దీంతో దర్యాప్తు సంస్థ చరిత్రలో తొలిసారి ఓ జాతీయ పార్టీ పేరును నిందితులుగా ప్రస్తావించినట్లైంది. మద్యం పాలసీ కేసులో తనను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ఇరువర్గాల వాదనలు విన్న జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం ఈ అంశంపై తీర్పును రిజర్వు చేసింది.కేజ్రీవాల్ పిటిషన్‌పై విచారణ జరిగే సమయంలో ఈడీ తరుపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు మాట్లాడుతూ.. ఆప్‌పై ఛార్జ్ షీట్ నమోదు చేస్తున్నామని, అందులో ఆప్ పార్టీని నిందితులుగా చేర్చినట్లు కోర్టుకు తెలిపారు. ఈ కేసు 2021- 22కి ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీని రూపొందించడంతో పాటు అమలు చేయడంలో అవినీతి, మనీలాండరింగ్ ఆరోపణలు వెల్లువెత్తాయి. కేసు విచారణ జరిపే సమయంలో మద్యం కుంభకోణంలో ప్రధాన లబ్ధిదారు ఆమ్ఆద్మీ పార్టీ అయినప్పుడు.. ఆ పేరును నిందితుల జాబితాలో ఎందుకు చేర్చలేదని గతేడాది అక్టోబర్‌లో సుప్రీంకోర్టు ప్రశ్నించింది.ఆ నేపథ్యంలో ఈడీ దీనిపై కసరత్తు ప్రారంభించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో వివిధ వ్యక్తుల నుంచి అందిన రూ.100 కోట్ల ముడుపులను ఆప్.. 2022 గోవా అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వినియోగించిందని ఈడీ ఆరోపించింది. తాజాగా ఆప్‌ను నిందితుల జాబితాలో చేరుస్తూ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో ఈడీ ఇప్పటి వరకు ఏడు ఛార్జిషీట్లు దాఖలు చేసింది. అరవింద్ కేజ్రీవాల్, ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్, బీఆర్ఎస్ నేత కవిత, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సహా 18 మందిని దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేశాయి. వీరిలో సంజయ్ సింగ్ బెయిల్ మీద బయటకు వచ్చారు. లోక్‌సభ ఎన్నికల తరుణంలో మే 10న కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. -
లిక్కర్ కేసు: నేడు కోర్టుకు కవిత
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై జ్యుడీషియల్ కస్టడీలో ఉన్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మంగళవారం రౌస్ అవెన్యూ కోర్టు ముందు హాజరుపరచనున్నారు. మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్టు నేపథ్యంలో ఆమె తిహార్ జైల్లో ఉంటున్న విషయం తెలిసిందే.కాగా, ఆమె జ్యుడీషియల్ కస్టడీ పొడిగించాలా లేదా అనే అంశంపై మంగళవారం రౌజ్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టనుంది. ఢిల్లీ మద్యం పాలసీలో కవిత పాత్రను ప్రస్తావిస్తూ ఇటీవల ఈడీ చార్జిషీట్ దాఖలు చేసింది. దీనిని పరిగణనలోకి తీసుకోవాలని ఈడీ తరఫు న్యాయవాది కోర్టును కోరే అవకాశం ఉంది. ఇలావుండగా ఈడీ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ఈ నెల 24న విచారణ చేపట్టనుంది. -
కుక్కను తప్పించబోయి అదుపు తప్పిన కారు.. ఒక వ్యక్తి మరణం
అడ్డాకుల: కర్నూల్ జిల్లాకు చెందిన రామయ్య(80) తన సోదరుడు, మరో డ్రైవర్‌తో కలిసి కారులో హైదరాబాద్ వెళ్తున్నారు. శాఖాపూర్ దాటిన తర్వాత పాత రోడ్డు సమీపంలో కారుకు అడ్డుగా కుక్క వచ్చింది. దీంతో దాన్ని తప్పించే క్రమంలో డ్రైవర్ కారును పక్కకు తిప్పగా.. కారు అదుపు తప్పి రోడ్డు కిందకు దూసుకెళ్లి బోల్తా పడింది. అందులోని రామయ్య తీవ్రంగా గాయపడ్డాడు. మిగిలిన ఇద్దరు స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి సురక్షితంగా బయట పడ్డారు. రామయ్యను ఎల్అండ్టీ అంబులెన్స్‌లో జిల్లా ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆయన మృతి చెందారని అక్కడి వైద్యులు చెప్పినట్లు తెలిసింది. ఈ ప్రమాదంపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ మాధవరెడ్డి తెలియజేశారు. విద్యుదాఘాతంతో రైతు.. మహబూబ్‌నగర్ రూరల్: మండల పరిధిలోని మనికొండలో పెండెం చంద్రశేఖర్(49) విద్యుదాఘాతంతో మృతిచెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుడు ఆదివారం ఉదయం తన ఇంట్లో స్విచ్ బోర్డు వద్ద ఆన్ఆఫ్ చేస్తుండగా.. విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందినట్లు సర్పంచ్ గంగాపురి తెలియజేశారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు, భార్య ఉన్నారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకొని పేద కుటుంబానికి అండగా నిలవాలని గ్రామస్తులు కోరుతున్నారు. మద్యం దుకాణం సీజ్ మహబూబ్‌నగర్ క్రైం: జిల్లా కేంద్రంలోని న్యూబాలాజీ మద్యం దుకాణాన్ని ఆదివారం రాత్రి ఎన్నికల వ్యయ పరిశీలకుడు, ఐఆర్ఎస్ అధికారి కుందన్‌యాదవ్ తనిఖీ చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ఎక్కువ మొత్తంలో మద్యం విక్రయించినట్లు గుర్తించారు. ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఎకై ్సజ్ ఈఎస్ సైదులు, సీఐ వీరారెడ్డి, ఎస్ఐ శ్రీనివాస్ మద్యం దుకాణంలో స్టాక్ పరిశీలించి సీజ్ చేశారు. సదరు దుకాణాదారుడి లైసెన్స్ రద్దు చేశారు. దుకాణంలో రూ.8లక్షల విలువగల స్టాక్ ఉన్నట్లు తెలిపారు. అదేవిధంగా రెండు రోజుల కిందట జహంగీర్ అనే వ్యక్తి రూ.2లక్షల విలువగల మద్యాన్ని ఆటోలో తరలిస్తుండగా, పట్టుకుని సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. భారీగా మద్యం పట్టివేత చిన్నంబావి: వనపర్తి జిల్లా చిన్నంబావి మండలంలోని దగడపల్లిలో రూ.4లక్షల విలువగల 47 కాటన్ల మద్యాన్ని పట్టుకున్నట్లు ఎస్ఐ ఓబుల్‌రెడ్డి తెలిపారు. దగడపల్లికి చెందిన వెంకట్రావు ఇంట్లో 29 కాటన్లు, కుమ్మరి రమేష్ ఇంట్లో 3 కాటన్లు, కుమ్మరి శంకరయ్య ఇంట్లో 17 కాటన్ల మద్యం నిల్వ చేయగా, స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ తనిఖీల్లో ఎకై ్సజ్ సీఐ కళ్యాణ్, స్పెషల్ పార్టీ పోలీస్ రవినాయక్, వీపనగండ్ల ఎస్ఐ రవికుమార్ పాల్గొన్నారు. -
పురందేశ్వరిపై మంత్రి పెద్దిరెడ్డి ఫైర్
సాక్షి, విజయవాడ: పురంధేశ్వరి టీడీపీ గౌరవాధ్యక్షురాలిగా పని చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు తరపున ఆమె మాట్లాడితే ఇబ్బంది లేదని, అయితే వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. రాష్ట్రంలో డిస్టిలరీలన్నీ చంద్రబాబు మంజూరు చేసినవేనన్నారు. మద్యంపై చంద్రబాబుతో పురంధేశ్వరి మాట్లాడితేనే మంచిదన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన విద్యుత్ సబ్ స్టేషన్లను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదివారం ప్రారంభించారు. నియోజకవర్గంలో రూ.40 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. తూర్పు నియోజకవర్గంలో దేవినేని అవినాష్‌ను ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గక ఇంఛార్జ్ దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, మేయర్ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
Fact Check: మత్తులోనూ ఇంతటి అబద్ధాలు కష్టమే!
అచ్చం రామోజీరావు నోట్లోంచి ఊడిపడ్డట్టు... ‘ఈనాడు’ రాతల్లోంచి పుట్టుకొచ్చినట్లు... తెలుగుదేశం ఆరోపణల్ని పుణికిపుచ్చుకున్నట్లు...!! కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి చేసిన ఫిర్యాదు గురించి మూడు ముక్కల్లో చెప్పాలంటే ఇంతకన్నా మరేమీ లేదు. టీడీపీ నేతల ఆరోపణల్ని చూసి రాసినట్టుగా తయారు చేసిన లేఖను అమిత్‌షాకు అందజేసి.. దీనిపై సీబీఐ దర్యాప్తు జరపాలని కోరటం ద్వారా పురందేశ్వరి తన మరిది చంద్రబాబు నాయుడి కళ్లలో సంతోషాన్ని చూడాలనుకున్నట్టున్నారు. తెలుగుదేశం పార్టీకి కొత్త ఆశలివ్వాలని అనుకున్నట్టున్నారు. అసలు ఆమె లేఖలో పేర్కొన్న ఆరోపణల్లో ఏ కొంచెమైనా నిజం ఉందా? ఏది నిజం? చూద్దాం... వైఎస్సార్సీపీ హయాంలో దశలవారీ మద్య నియంత్రణ రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం దశలవారీగా మద్య నియంత్రణ విధానాన్ని సమర్థంగా అమలుచేస్తోంది. ఇందుకోసం పలు చర్యలు చేపట్టింది. ► టీడీపీ హయాంలో ప్రైవేటు మద్యం దుకా ణాలు ఉదయం 10 నుంచి రాత్రి 11 వరకూ విక్రయాలు సాగించేవి. అనధికారికంగా 24 గంటలూ విక్రయిస్తుండేవి. కానీ, ఇప్పుడు ఆ సమయాన్ని కుదించి, ఉదయం 10 నుంచి రాత్రి 9 వరకే విక్రయాలకు అనుమతించారు. ఇది నిజం కాదా? ► బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్‌లు రద్దు చేశారు. చంద్రబాబు హయాంలో ప్రైవేటు మద్యం దుకాణాలకు అనుబంధంగా 43 వేల బెల్ట్ దుకాణాలుండేవి. వైఎస్ జగన్ ప్రభుత్వం రాగానే వాటన్నింటినీ పూర్తిగా తొలగించారు. గతంలో మద్యం దుకాణాలకు అనుబంధంగా అనుమతించిన పర్మిట్ రూమ్‌లు అనధికారిక బార్లుగా చలామణి అయ్యేవి. వాటినీ ఈ ప్రభుత్వం రద్దు చేయటం పచ్చి నిజం. ► రాష్ట్రంలో మద్యం దుకాణాల సంఖ్యనూ తగ్గించారు. టీడీపీ హయాంలో 4,380 మద్యం దుకాణాలుండగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం వాటిని 2,934కి తగ్గించింది. బార్ల సంఖ్యను పెంచలేదు. 2019లో ఖరారుచేసిన 840 బార్లే ఉన్నాయి. కొత్త బార్లకు లైసెన్సులివ్వలేదు. ఇది నిజం కాదా? ► మద్యం విక్రయాలను నిరుత్సాహపరచడమే తమ పార్టీ విధానమని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల్లో చాలాసార్లు చెప్పారు. అందుకే అధికారంలోకి వచ్చాక మందుబాబులకు షాక్ కొట్టేలా మద్యం ధరలను పెంచారు. అదనపు ఎక్సైజ్ టాక్స్ (ఏఆర్ఈటీ) విధించారు. దీంతో మద్యం ధరలు పెరిగాయి. ఏఆర్ఈటీ పన్నుతో రాబడి పెరుగుతున్నట్లు కనిపిస్తున్నా, వాస్తవానికి మద్యం విక్రయాలు గణనీయంగా తగ్గాయి. ఫలితంగా పేదలు ఈ వ్యసనానికి క్రమంగా దూరమవుతున్నారు. ఇది నూరుశాతం నిజం. తగ్గిన మద్యం వినియోగం... కేంద్ర సర్వేనే వెల్లడించిన వాస్తవం: రాష్ట్రంలో మద్య వినియోగం గణనీయంగా తగ్గిందని కేంద్ర ప్రభుత్వ నివేదికే వెల్లడించింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్) నివేదిక ప్రకారం 2015–16లో రాష్ట్రంలో పురుషుల్లో 34.9 శాతం, మహిళల్లో 0.4 శాతం మద్యం సేవించేవారు. 2019–21 నాటికి రాష్ట్రంలో మద్యం సేవించే పురుషులు 31.2 శాతానికి, మహిళలు 0.2 శాతానికి తగ్గారు. ఇది మద్య నియంత్రణ విధానాల వల్ల కాదా పురందేశ్వరి గారూ? డిస్టిలరీలన్నీ మీ చంద్రబాబు అనుమతిచ్చినవే చంద్రబాబుకు రాజకీయ ప్రయోజనం కల్పించాలనే ఆతృతతో పురందేశ్వరి వాస్తవాలను విస్మరించారు. వైఎస్సార్సీపీ నేతలకు చెందిన కంపెనీలకే మద్యం తయారీ కాంట్రాక్టులు అప్పగించి దోపిడీకి పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. కానీ వాస్తవం ఏమిటంటే.. ఈ ప్రభుత్వం వచ్చాక ఒక్క మద్యం డిస్టిలరీకి కూడా అనుమతివ్వలేదు. రాష్ట్రంలో 20 మద్యం డిస్టిలరీలు ఉంటే వాటిలో 12 డిస్టిలరీలకు చంద్రబాబే అనుమతిచ్చారు. మిగిలిన 6 అంతకు ముందటి ప్రభుత్వాలు అనుమతిచ్చినవి. ప్రస్తుతం చంద్రబాబు సన్నిహితుల కంపెనీలే మద్యాన్ని తయారు చేస్తున్నాయి. గతంలో తయారు చేస్తున్న మద్యాన్నే ఇప్పుడూ తయారు చేస్తున్నాయి. మరి ఎందుకీ దుష్ప్రచారం? ► ఎంకే డిస్టిలరీ టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అల్లుడు పుట్టా మహేశ్‌కుమార్‌ది. ఆయన టీడీపీ నేత పుట్టా మధుసూదన్ యాదవ్‌కు కుమారుడు కూడా. ► శ్రీకృష్ణ ఎంటర్‌ప్రైజస్ టీడీపీ మాజీ ఎంపీ దివంగత డీకే ఆదికేశవుల నాయుడు కుటుంబానిది. ► ఎస్పీవై ఆగ్రో ప్రొడక్ట్స్ టీడీపీ నేత, మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డి కుటుంబానిది. వైఎస్సార్సీపీ తరపున ఎంపీగా గెలిచి నిబంధనలకు విరుద్ధంగా టీడీపీలో చేరినందుకు నజరానాగా ఎస్పీవై రెడ్డికి చంద్రబాబు అనుమతిచ్చారు. ► ఇక బాబు ప్రభుత్వం 2019 ఎన్నికలకు ముందు ఆగమేఘాల మీద 2019 ఫిబ్రవరి 25న అనుమతినిచ్చిన విశాఖ డిస్టిలరీస్‌లో టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు వాటాదారు. మద్యం నాణ్యతపైనా దుష్ప్రచారమే పురందేశ్వరి కుట్రపూరితంగా చేసిన మరో దుష్ప్రచారం.. మద్యంలో నాణ్యత లేదని. గతంలో తెలుగుదేశం పార్టీ కూడా ఇలాంటి విషపు ఆరోపణే చేసి భంగపడింది. విషపు అవశేషాలు ఉన్నాయని చెన్నైలోని ఎస్జీఎస్ లేబోరేటరీ పేరిట ఓ నకిలీ నివేదికను టీడీపీ తెరపైకి తెచ్చి అభాసుపాలైంది. కానీ, అదే నివేదికను ఉటంకిస్తూ పురందేశ్వరి అవే అసత్య ఆరోపణలు ఇప్పుడూ చేయడం విచిత్రమే. చెన్నైలోని ఎస్జీఎస్ లేబోరేటరీ అసలు తాము అలాంటి నివేదికే ఇవ్వలేదని అప్పట్లోనే స్పష్టంచేసింది. తాము పరీక్షించిన మద్యం నమూనాల్లో అవశేషాలు పరిమితికి లోబడే ఉన్నాయని, అవి ప్రమాదకరం కాని సహజసిద్ధమైన మొక్కల నుంచి తయారైనవేనని స్పష్టం చేసింది. తమ నివేదికను తప్పుగా అన్వయించారని చెప్పింది. అయినా సరే రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ రాష్ట్రంలో మద్యం నమూనాలను హైదరాబాద్‌లోని సీఎస్ఐఆర్కు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నా లజీ ప్రయోగశాలలో పరీక్షించింది. ఆ నమూనాలన్నీ నిర్దేశిత ప్రమాణాల ప్రకారమే ఉన్నాయని ఆ లేబోరేటరీ నివేదిక ఇచ్చింది. మద్యం నాణ్యతపై ఆరోపణల్లో వాస్తవం లేదని తేల్చిచెప్పింది. పురందేశ్వరి ఆరోపణలు చేసే ముందు ఈ వాస్తవాలను కావాలనే విస్మరించారు. డిజిటల్ చెల్లింపులూ జరుగుతున్నాయి రాష్ట్రంలో 80 శాతం మద్యం అమ్మకాలు నగదు లావాదేవీల ద్వారానే నిర్వహిస్తూ అవినీతికి పాల్పడుతున్నారని çపురందేశ్వరి మరో అబద్ధాన్ని రాసేశారు. వాస్తవానికి రాష్ట్రంలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో నగదు అమ్మకాలే కాదు డిజిటల్ చెల్లింపుల విధానాన్నీ బెవరేజెస్ కార్పొరేషన్ అమలు చేస్తోంది. రోజువారీ వేతనాలు తీసుకునే కూలీలు నగదు ద్వారానే కొంటున్నారు కనక ఆ విధానాన్నీ కొనసాగిస్తోంది. మద్యం విక్రయాల మొత్తాన్ని ఏ రోజుకా రోజు సమీపంలోని ఎస్బీఐ శాఖలో జమ చేసి చలానాలు అందజేస్తోంది. మద్యం నిల్వలు, విక్రయాలు, బ్యాంకుల్లో జమ చేసిన మొత్తం అన్నింటిపై బెవరేజెస్ కార్పొరేషన్ పకడ్బందీగా రికార్డులు నిర్వహిస్తోంది. ఇవి కాకిలెక్కలు కాదా? ► రాష్ట్రంలో రోజూ 80 లక్షల మంది ఒకొక్కరూ సగటున రూ.200 విలువైన మద్యాన్ని సేవిస్తున్నారని పురందేశ్వరి కాకి లెక్కలు వల్లించడం మరో విడ్డూరం. ఆ విధంగా మద్యం అమ్మకాల మొత్తం రూ.57,600 కోట్లలో రూ.25 వేల కోట్లు అక్రమంగా మళ్లిస్తున్నారని నోటికొచ్చింది కూసేశారు. కేంద్ర జాతీయ కుటుంబ ఆరోగ్య నివేదిక(ఎన్ఎఫ్హెచ్ఎస్) నివేదిక ప్రకారం 2019–21లో రాష్ట్రంలో 18.7 శాతం మంది అంటే దాదాపు 40 లక్షల మంది మాత్రమే మద్యం సేవిస్తున్నారు. మరి 80 లక్షల మంది అంటూ అంత అబద్ధాన్ని ఎలా చెప్పగలిగారో పురందేశ్వరికే తెలియాలి!!. ► లంచాలిచ్చే కంపెనీల నుంచే మద్యం కొంటున్నారని పురందేశ్వరి ఆరోపించారు. కానీ రాష్ట్రంలో 2015లో ఇచ్చిన నోటిఫికేషన్‌ను అనుసరించే ప్రస్తుతం బెవరేజస్ కార్పొరేషన్ మద్యం కొంటోంది. 2019 తరువాత ఆ విధానంలో ఎలాంటి మార్పూ లేదు. కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా రాష్ట్రంలో మద్యం కొనుగోళ్లు పూర్తి పారదర్శకంగా, నిబంధనల మేరకే ఉన్నాయని నివేదిక ఇచ్చింది. ► రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై స్పెషల్ డ్యూటీ (పన్ను) వసూలు చేస్తున్నారని, ఆ మొత్తం ఎక్కడికి వెళ్తోందో తెలియడంలేదని పురందేశ్వరి మరో దరిద్రమైన ఆరోపణ చేశారు. ఏదైనా ప్రభుత్వ ఖజానాకు వెళ్లేదే కదా!. వాస్తవానికి అది స్పెషల్ డ్యూటీ (పన్ను) కాదు. అది స్పెషల్ మార్జిన్. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంక్షేమ పథకాలు కోసం ప్రభుత్వం 2021 నవంబరు 9న ప్రత్యేక జీవో జారీ చేసి ఆ స్పెషల్ మార్జిన్ వసూలు చేస్తోంది. ఆ నిధుల్ని సంక్షేమ పథకాల కోసం వెచ్చిస్తోంది. ► రాష్ట్రంలో రెండేళ్లలో కాలేయ సంబంధ వ్యాధులతో మృతి చెందిన వారు 25 శాతం పెరిగారనటం మరో దుర్మార్గం. విశాఖపట్నంలోని కేజీహెచ్‌లో గత పదేళ్లలో నెలకు సగటున 20 మంది మాత్రమే కాలేయ సంబంధిత వ్యాధులతో ఆసుపత్రిలో చేరారు. వారిలో కూడా 95 శాతం మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని ఆ ఆసుపత్రి సూపరింటెండెంట్ నివేదిక కూడా ఇచ్చారు. కాకపోతే మరిది కోసం... బాబు కోసం కష్టపడుతున్న పురందేశ్వరికి ఈ వాస్తవాలతో పనేముంటుంది!? -
మద్యం టెండర్ కోసం...డబ్బులు అడుగుతున్న రాజేష్
-
ఆ బిజినెస్‌లో 'కేజీఎఫ్' విలన్ రూ.1000 కోట్ల పెట్టుబడి?
మనల్ని ఎంటర్టైన్ చేసే సినిమా స్టార్స్.. నటించడంతో పాటు పలు వ్యాపారాలు చేస్తుంటారు. మొన్నటివరకు ఫుడ్, రెస్టారెంట్స్ లో వీళ్లు ఎక్కువగా కనిపించారు. రీసంట్ టైంలో మహేశ్, బన్నీ, విజయ్ దేవరకొండ లాంటివాళ్లు మల్టీప్లెక్ రంగంలోకి కూడా అడుగుపెట్టారు. ఇవన్నీ చాలా సాధారణ విషయాలన్నట్లు బాలీవుడ్ స్టార్ హీరో, 'కేజీఎఫ్ 2' విలన్ ఎవరూ ఊహించని వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. కళ్లు చెదిరే మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టినట్లు తెలుస్తోంది. సంజయ్ దత్ గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంటాయి. డ్రగ్స్ కి బానిసవడం, అక్రమాయుధాల కేసులో జైలుకి వెళ్లడం లాంటి చాలా ఆసక్తికర విషయాలు కనిపిస్తాయి. అదంతా పక్కనబెట్టి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఓవైపు లీడ్ రోల్స్ చేస్తూనే మరోవైపు విలన్, సహాయక పాత్రలు చేస్తూ బిజీ అయిపోయాడు. గతేడాది 'కేజీఎఫ్ 2'లో అధీరాగా భయపెట్టిన సంజూ.. ప్రస్తుతం విజయ్ 'లియో', ప్రభాస్-మారుతి దర్శకత్వంలో వస్తున్న మూవీలోనూ కీలక పాత్రలు పోషిస్తున్నాడు. ఇలా కెరీర్ పరంగా బాగా సంపాదిస్తున్న సంజయ్ దత్.. ఇప్పుడు లిక్కర్ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. రిటైల్ బిజినెస్ చేయడమే టార్గెట్ గా కార్టెల్ & బ్రోస్ అనే ఆల్కోబెవ్ (ఆల్కహాలిక్ బేవరేజ్) స్టార్టప్ లో పెట్టుబడి పెట్టాడు. ఈ కంపెనీ ఎక్కువగా స్కాచ్-విస్కీ తయారు చేస్తుంది. మన దేశంలో పోర్ట్ ఫోలియోని విస్తరించడమే లక్ష్యంగా.. ఈ కంపెనీలో సంజయ్ దత్ దాదాపు రూ.1000 కోట్ల మొత్తం పెట్టుబడిగా ఉంచినట్లు టాక్ వినిపిస్తోంది. మరి ఇందులో నిజమేంటనేది తెలియాల్సి ఉంది. (ఇదీ చదవండి: 'ఆదిపురుష్' రిజల్ట్ ముందే పసిగట్టిన ప్రభాస్.. ఆ వీడియో వైరల్!) -
‘స్నేక్ వైన్’ అంటే ఏమిటి? దీనిని ఎలా తయారు చేస్తారో తెలిస్తే...
మీరెప్పుడైనా పాములతో తయారయ్యే మద్యం గురించి విన్నారా? ఈ మాట వినగానే హడలెత్తిపోతున్నారా? ఈ తరహా మద్యం తయారు చేసేందుకు ముందుగా వరి ధాన్యంతో పాటు ఇతర దినుసులతో మద్యం తయారు చేసి, దానిలో బతికున్న లేదా చచ్చిన పామును ఉంచి, కొంత కాలం దానిని నిల్వ చేస్తారు. ఈ రకంగా తయారు చేసిన మద్యాన్ని పలు చికిత్సలలో కూడా వినియోగిస్తారు. స్నేక్ వైన్‌ను చైనాలో తయారు చేస్తుంటారు. దీనిని ‘పినియన్’, ‘వియత్నామీ’ భాషలో ‘ఖమెర్’ అని అంటారు. దీనిని తొలిసారి పశ్చిమ జోవు వంశానికి చెందినవారు తయారు చేశారని చెబుతారు. అనంతరం కాలంలో ఈ మద్యానికి చైనా అంతటా ఆదరణ దక్కిందని అంటారు. చైనాతోపాటు ఈ మద్యాన్ని దక్షిణాసియా, ఉత్తర కొరియా, లావోస్, థాయ్‌లాండ్, వియత్నాం, జపాన్, కంబోడియాలలోనూ తయారు చేస్తుంటారు. ఈ మద్యాన్ని కుష్టు వ్యాధి, అత్యధికంగా చెమట కారడం, జట్టు ఊడిపోవడం, చర్మం పొడిబారడం తదితర సమస్యల పరిష్కారానికి వినియోగిస్తుంటారు. దీనిని టానిక్ మాదిరిగా భావిస్తుంటారు. పలు దేశాలలో ఈ తరహా మద్యాన్ని ఔషధ దుకాణాలలో విక్రయిస్తుంటారు. వియత్నాంలో పామును వేడికి, మగతనానికి ప్రతీకగా భావిస్తారు. అందుకే ఇక్కడ ఈ తరహా మద్యానికి ఎంతో ఆదరణ లభిస్తుంటుంది. దీనిని ఇక్కడి ప్రజలు లైంగికశక్తిని పెంచే ఔషధంగా పేర్కొంటారు. కాగా ఈ మద్యంపై నిర్వహించిన కొన్ని అధ్యయనాల ప్రకారం స్నేక్వైన్లో శారీరక నొప్పులను తగ్గించే, వాపును నివారించే గుణాలు ఉన్నాయని తేలింది. అయితే దీనిని తాగడం ఎంతవరకూ సురక్షితమనే దానిపై నిపుణులు సమాధానమిస్తూ వరిధాన్యంతో చేసే మద్యంలో ఇథనాల్ వినియోగిస్తారని, దీని వలన పాములోని విషం తొలగిపోతుందని తెలిపారు. కాగా ఈ తరహా మద్యం తయారీలో అత్యధిక విషం కలిగిన పాములను వినియోగించరు. అయితే ఈ మద్యం బాటిళ్లపై ఇది ప్రమాదకరం అని కూడా రాసివుంటుంది. -
మందుబాబులకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన మద్యం ధరలు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మద్యం ధరలు భారీగా తగ్గించింది. ఫుల్ బాటిల్‌పై(750ఎంల్) రూ.40 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే 180 ఎంఎల్‌పై రూ.20, 180 ఎంఎల్‌పై రూ.10, 90 ఎంఎల్‌పై రూ.5 తగ్గించింది. తగ్గిన ధరలు శనివారం నుంచి అమలులోకి రానున్నాయి. దీంతో మద్యం ప్రియులకు గుడ్‌న్యూస్ చెప్పినట్లయింది. అయితే బీరు ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. కేవలం లిక్కర్ బ్రాండ్లకే కొత్త ధరలు వర్తిస్తాయి. కాగా.. తెలంగాణలో ఏప్రిల్ నెలలో కోటికిపైగా బీర్లు అమ్ముడైన విషయం తెలిసిందే. ఎండల్లో చల్లబడేందుకు బీర్ ప్రియులు తెగ లాగించేస్తున్నారు. చదవండి: హైదరాబాద్‌లో రోజుకు ఇన్ని వీధి కుక్కలు చనిపోతున్నాయా? -
వామ్మో.. కోట్లు పలుకుతున్న లిక్కర్.. ఖాళీ బాటిల్ కూడా ఖరీదే గురూ!
మద్యం తాగితే తెలియని కిక్ వస్తుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే కొన్ని లిక్కర్ బ్రాండ్ల ధరలు వింటే మాత్రం ఎక్కిన కిక్కు కూడా దిగిపోతుంది. ప్రపంచంలో ఖరీదైన ఆల్కహాల్ బ్రాండ్లు ఎవరు ఎక్కువగా వినియోగిస్తారన్న దానిపై స్పష్టత లేదు. అయితే కొంతమంది ఎంత ఖరీదైన పర్లేదు గానీ ఈ కాస్ట్లీ లిక్కర్‌ను ఒక్కసారైన తాగాలని ఆసక్తి చూపుతారట. దీంతో వీటికి భారీగా డిమాండ్ ఏర్పడుతోంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మద్యం సీసాలపై ఓ లుక్కేద్దాం! టెకీలా లీ 925 (Tequila Lee .925) ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వైన్‌గా మొదటి స్థానంలో నిలిచింది. ఈ మద్యాన్ని సేవిస్తే ఎంత మత్తు ఎక్కుతుందో తెలీదు దీన ధర వింటే మాత్రం తాగింది దిగిపోతుంది. దీని ధర దాదాపు రూ. 25 కోట్లట. ఈ లిక్కర్ ఎందుకంత ఖరీదంటే.. సీసాలో 6400 వజ్రాలు పొదిగినవి ఉండడమే. హెన్రీ IV డుడోగ్నే కాగ్నాక్ ప్రపంచంలో రెండవ అత్యంత ఖరీదైన వైన్. ఈ బ్రాండ్ మద్యం బాటిల్ ఖరీదు 56 లక్షల 93 వేల రూపాయలు. దాని బాటిల్ కూడా 24 క్యారెట్ల బంగారం అమరిక ఉండగా దీన్ని ప్లాటినంతో తయారు చేస్తారట. దీంతో ఈ తరహావి.. మద్యం లేకపోయినా కేవలం ఖాళీ సీసాలు కూడా ఎక్కువ ధరకే పలుకుతాయట. ఇక ప్రపంచంలోని అత్యంత ఖరీదైన షాంపైన్ అంటే.. అమండా డి బ్రిగ్నాక్ మిడాస్ పేరు మొదటి స్థానంలో ఉంటుంది. ఈ షాంపైన్ ఒక్క బాటిల్ ధర దాదాపు రూ.1 కోటి 40 లక్షల రూపాయలు ఉంటుంది. అత్యంత ఖరీదైన రెడ్ వైన్ ధర తెలిస్తే షాక్ అవుతారు. పెన్ఫోల్డ్స్ ఆంపౌల్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రెడ్ వైన్. ఈ బ్రాండ్ రెడ్ వైన్ ఒక బాటిల్ రేటు వచ్చేసి కోటి రూపాయలు పై మాటే ఉంటుందట. ఈ ఖరీదైన మద్యం ధరలు వింటే మద్యం మత్తులో ఉన్న జనం షాక్ అవ్వాల్సిందే. -
కలెక్టర్ సారూ.. కింగ్ ఫిషర్ బీర్లు దొరకడం లేదు..!
మద్యం ప్రియులు బ్రాండ్ల విషయంలో ఏ మాత్రం రాజీపడరనే విషయం మరోసారి రుజువైంది. తమకు అత్యంత ఇష్టమైన మద్యం బ్రాండ్ లేకపోతే తాము ఎందుకు సర్దుకుపోవాలి అనుకున్నాడో ఏమో గానీ ఒక వ్యక్తి ఏకంగా కలెక్టరేట్‌నే ఆశ్రయించాడు. ‘మాకు కింగ్ ఫిషర్ బీర్లు అందుబాటులో లేవు’ అని ఫిర్యాదు చేశాడు. మద్యం పాలసీ అనేది ప్రభుత్వం చూస్తుంది కాబట్టి దాన్ని ఏకండా ప్రభుత్వ ఉన్నతాధికారి దృష్టికే తీసుకెళ్లాడు మనోడు. ఏకంగా కలెక్టర్‌కే ఫిర్యాడు చేశాడు. జగిత్యాలకు చెందిన బీరం రాజేష్ అనే వ్యక్తి తమ ఊరిలో ప్రజావాణి కార్యక్రమం జరుగుతుందనే విషయం తెలుసుకున్నాడు. ఏదైనా సమస్య కదా అనుకున్నాడు. తనకు వచ్చిన సమస్య కింగ్ ఫిషర్ బ్రాండ్ అందుబాటులో లేదనేది. దీన్ని కలెక్టర్ వద్దకే తీసుకెళ్లాడు. ప్రజావాణిలో తమకు కింగ్ ఫిషర్ బ్రాండ్ బీర్లు దొరకడం లేదని విన్నవించాడు. ఇది చూడటానికి నవ్వు తెప్పించినా మనోడి కష్టం ఎవరికి తెలుసు. మరి ఆ కలెక్టర్‌గారు దీనిపై చర్యలు తీసుకుంటామన్నారా.. లేక లైట్ తీసుకుంటారో చూడాలి. గతంలో కూడా జగిత్యాల ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది. అదే జగిత్యాలలో 2018లో అయిల సూర్యనారాయణ అనే వ్యక్తి కూడా కింగ్ ఫిషర్ బ్రాండ్ బీరు దొరకడం లేదని ఫిర్యాదు చేశాడు. అప్పుడు కూడా ప్రజావాణి కార్యక్రమంలోనే కలెక్టర్‌గా ఫిర్యాదు చేశాడు. జగిత్యాలలో కింగ్ ఫిషర్ బీరు విక్రయాలను నిలిపేసి వాటి స్థానంలో నాసిరకం బీరును అమ్ముతూ కొనుగోలుదారులను మోసం చేస్తున్నారని తెలిపారు. పొరుగున కరీంనగర్లో కింగ్ ఫిషర్ బీర్ యథేచ్చగా దొరుకుతుండగా జగిత్యాలలో ఈ గడ్డు పరిస్థితికి కారణమేంటని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడుమరొక ఫిర్యాదు. వ్యక్తులు మారారు కానీ అదే ఫిర్యాదు. బ్రాండ్ కూడా అదే. -
ఫుల్ కిక్కు, తెగ తాగేస్తున్నారుగా.. ఐదేళ్లుగా రికార్డ్ సేల్స్!
శివాజీనగర(బెంగళూరు): రాష్ట్రంలో మద్యం వినియోగం సర్కారు నిర్దేశించిన మేరకు వంద శాతాన్ని చేరుతోంది. ఇది నెలా, రెండు నెలలకో కాదు, గత ఐదేళ్లుగా మద్యం ద్వారా కాసుల వర్షం కురుస్తోంది. స్వయంగా అబ్కారీ మంత్రి అసెంబ్లీలో ప్రకటించారు. మద్యం కొనుగోలు వయోపరిమితి 21 సంవత్సరాల నుంచి 18 ఏళ్లకు తగ్గించడంపై ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో సర్కారు దిగివచ్చింది. పాత పద్ధతిలోనే 21 ఏళ్లనే కొనసాగుతుందని ఎక్సైజ్ శాఖ మంత్రి కే.గోపాలయ్య తెలిపారు. గురువారం విధానపరిషత్ ప్రశ్నోత్తరాల సమయంలో జేడీఎస్ సభ్యుడు గోవిందరాజు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. వయో పరిమితిని తగ్గిస్తూ జనవరి 9న ఉత్తర్వులు జారీ చేశాం, అయితే ఇందుకు అనేక అభ్యంతరాలు రావడంతో పరిశీలన జరిపి పాత పద్ధతినే కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఐదేళ్లుగా మద్యం ఆర్థిక లక్ష్యం సఫలం గ్రామాల్లో అక్రమ మద్యం అమ్మకాల గురించి అనేకచోట్ల కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు మంత్రి చెప్పారు. మద్యానికి బాగా గిరాకీ ఉండడంతో ఈ సంవత్సరం ఎక్సైజ్ శాఖ నిర్ధారించిన ఆర్థిక లక్ష్యాన్ని దాటుతుందని చెప్పారు. గత ఐదు సంవత్సరాలు వరుసగా నిర్ధారిత లక్ష్యాన్ని చేరుకొన్నట్లు చెప్పారు. -
Telangana: పన్నుల ఆదాయం రెండేళ్లలో డబుల్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సొంత పన్నుల ఆదాయం వేగంగా పెరుగుతోంది. ఖజానాకు గణనీయంగా రాబడి సమకూరుతోంది. 2020–21 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి తొలి ఏడు నెలల్లో వచ్చిన పన్ను ఆదాయం దాదాపు రెండింతలు కావడం గమనార్హం. రెండేళ్ల క్రితం తొలి ఏడు నెలల్లో (ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు) అన్నిపన్నుల రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.22,846 కోట్ల ఆదాయంరాగా.. ఈ ఏడాది అదే సమయానికి రూ.40,788 కోట్లు సమకూరింది. నిజానికి గత ఏడాది (2021–22) నుంచే ఆదాయం పెరగడం మొదలైందని.. అదే ఒరవడి కొనసాగుతోందని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు చెప్తున్నారు. గత ఏడాది కన్నా ఈసారి అన్ని పన్నుల ఆదాయం సగటున 10 శాతం పెరిగిందని వివరిస్తున్నారు. వ్యాట్ నుంచి అధికంగా.. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యక్ష పన్నుల ఆదాయం రెండు రూపాల్లో సమకూరుతుంది. పెట్రో ఉత్పత్తులు, లిక్కర్లపై విలువ ఆధారిత పన్ను (వ్యాట్) రూపంలో, ఇతర అన్నిరకాల వ్యాపార లావాదేవీలపై వస్తుసేవల పన్ను (జీఎస్టీ) రూపంలో రాబడి వస్తుంది. ప్రస్తుతం వ్యాట్ కింద పెట్రోల్, లిక్కర్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరుతున్నట్టు లెక్కలు చెప్తున్నాయి. పెట్రో ఉత్పత్తుల ద్వారా 2020–21 ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలలతో పోలిస్తే ఈసారి రెండింతలకుపైగా ఖజానాకు సమకూరింది. 2020–21లో పెట్రో ఉత్పత్తులపై వ్యాట్ ద్వారా రూ.3,970 కోట్లురాగా.. ఈసారి ఏకంగా రూ.8,770 కోట్లకు చేరింది. లిక్కర్‌పై వ్యాట్ రాబడి కూడా 40 శాతం వరకు పెరిగింది. 2020–21 ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు రూ.6వేల కోట్లు సమకూరగా.. 2021–22లో రూ.7,529 కోట్లు, ఈసారి రూ.8,384 కోట్లు వచ్చాయి. గత ఏడాదితో పోల్చితే 10 శాతం పెరిగింది. ఇక ఇతర వ్యాపార లావాదేవీలపై విధించే వ్యాట్ కలిపి ఈ ఏడాది మొత్తంగా రూ.17,560 కోట్లు ఖజానాకు చేరింది. ఇది 2020–21లో రూ.10,367 కోట్లు, 2021–22లో రూ.15,340 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. జీఎస్టీ పరిహారం రాకపోయినా.. వస్తుసేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి వచ్చి ఐదేళ్లు పూర్తికావడంతో ఈ ఏడాది జూలై నుంచి రాష్ట్రాలకు రావాల్సిన పరిహారాన్ని కేంద్రం నిలిపివేసింది. ఆ పరిహారం రాకపోయినా జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ దూసుకెళుతోంది. అక్టోబర్ చివరినాటికి వచ్చిన గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది జీఎస్టీ రూపంలో రూ.21,322 కోట్లు రాష్ట్ర ఖజానాకు చేరింది. ఇందులో ఎస్జీఎస్టీ రూ.9,537.63 కోట్లుకాగా, ఐజీఎస్టీలో వాటా రూ.10,801 కోట్లు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పన్ను రాబడి 31 శాతం వృద్ధి చెందడం విశేషం. ఎస్జీఎస్టీ, ఐజీఎస్టీ కలిపి 2020–21లో రూ.10,917 కోట్లు, 2021–22లో రూ.16,222 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. అంటే రెండేళ్లలో జీఎస్టీ వసూళ్లు రెండింతలు పెరిగినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మొత్తంగా వ్యాట్, జీఎస్టీ రెండూ కలిపి పన్నుల రూపంలో భారీగా ఆదాయం వస్తుండటం పట్ల అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే గత ఆర్థిక సంవత్సరం తొలి ఏడునెలలతో పోలిస్తే.. ఈసారి జూలై, అక్టోబర్ నెలల్లో పన్ను వసూళ్లు కాస్త తగ్గాయని తెలిపారు. కానీ మిగతా ఐదు నెలల్లో అధిక వృద్ధితో మొత్తంగా పన్ను వసూళ్లు పెరిగాయని వివరించారు. -
మద్యం తాగి.. రోడ్డు మధ్యలో కారు నిలిపి నిద్రపోయాడు!
యశవంతపుర(బెంగళూరు): తాగిన మత్తులో కారును డ్రైవర్ రోడ్డు మధ్యలో నిలిపి నిద్రలోకి జారిపోయాడు. మడికేరి పట్టణంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. మడికేరి పట్టణంలోని బస్టాండ్‌కు సమీపంలో మద్యం దుకాణం ఉంది. అక్కడ మద్యం తాగిన డ్రైవర్ కొద్దిదూరం కారును నడుపుకుంటూ వెళ్లాడు. మత్తు ఎక్కువగా ఉండటంతో రోడ్డు మధ్యలోనే కారును నిలిపి నిద్రపోయాడు. రోడ్డు మధ్యలో కారు నిలపటాన్ని చూసిన స్థానికులు భయపడ్డారు. రెండు వైపుల వాహనాలు నిలిచి పోయాయి. మడికేరి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసును నమోదు చేశారు. చదవండి: వీడియో: నాగుపాము నుదుట ముద్దు పెట్టబోయాడు.. రివర్స్‌లో ‘లిప్‌లాక్’ పడింది! -
‘నీకెంత ధైర్యం.. నా మనుషులపైనే కేసులు పెట్టి బైండోవర్ చేస్తావా’
గద్వాల రూరల్: ‘నీకెంత ధైర్యం.. నా మనుషులపైనే కేసులు పెట్టి బైండోవర్ చేస్తావా.. అంటూ గద్వాలలో కల్లు కం లిక్కర్ మాఫియా పేట్రేగిపోతుంది.. అనధికార కల్లు దుకాణాలు నడిపిస్తూ అమాయక ప్రజల రక్తాన్ని పీల్చి జేబులు నింపుకొంటున్న కల్లు కం లిక్కర్ మాఫియా లీడర్ బుధవారం ఏకంగా ఎక్సైజ్ శాఖ కార్యాలయానికి వెళ్లి అధికారికి వార్నింగ్ ఇచ్చి దాదాగిరి చేయడం జిల్లాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. గద్వాలలో అక్రమంగా కల్లు వ్యాపారం చేస్తూ.. కల్లు మాఫియా లీడర్‌గా పేరుగాంచిన సివిల్ సప్లయ్ బియ్యం కాంట్రాక్టర్ ఇటీవల లిక్కర్ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. తన అక్రమ వ్యాపారాలకు అధికారం కూడా తోడవడంతో అక్రమ దందా మూడు కల్లు సీసాలు.. ఆరు బీర్లుగా సాగుతోంది. అయితే గద్వాల పట్టణ శివారులోని అయిజ రహదారికి వెళ్లే మార్గంలో ఉన్న ఓ వైన్‌షాపు సదరు కల్లు మాఫియా లీడర్ కనుసన్నల్లో కొనసాగుతుంది. అదే ప్రాంతంలో తన మార్కెట్‌ను పెంచుకునేందుకు ఎలాంటి అనుమతి లేకుండా మాంసం దుకాణాలు ఏర్పాటు చేయించి అక్రమంగా బార్ అండ్ రెస్టారెంట్ మాదిరి లిక్కర్ దందా కొనసాగిస్తున్నాడు. నిబంధనలకు నీళ్లు.. వాస్తవానికి ప్రభుత్వం అనుమతులిచ్చిన వైన్‌షాపుల వద్ద లిక్కర్‌ను మాత్రమే కొనుగోలుదారునికి విక్రయించాలి. అక్కడ ఎలాంటి ఫుడ్ ఐటమ్స్, స్నాక్స్ వంటివి విక్రయించరాదని ప్రభుత్వ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. కానీ, ఇక్కడ మాత్రం అక్రమ దందాకు అలవాటు పడిన సదరు లీడర్ ఎలాంటి అనుమతులు లేకుండానే సుమారు 10కిపైగా మాంసం, స్నాక్స్ దుకాణాలను తన మనుషులతో ఏర్పాటు చేయించి దర్జాగా అక్రమ వ్యాపారం కొనసాగిస్తున్నాడు. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు అనుమతులు లేకుండా కొనసాగిస్తున్న మాంసం, స్నాక్స్ దుకాణాలను తొలగించాలని, లేదంటే చట్టప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని మొదటి హెచ్చరికగా సదరు వ్యాపారులకు స్పష్టం చేశారు. దీంతో అక్రమంగా వ్యాపారం చేసుకుంటున్న సదరు వ్యాపారులు తమ లీడర్‌ను ఆశ్రయించారు. దీంతో రెచ్చిపోయిన సదరు కల్లు లీడర్ తన అనుచర వర్గంతో కలిసి బుధవారం ఏకంగా గద్వాలలోని ఎక్సైజ్ శాఖ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ డ్యూటీలో ఉన్న ఓ అధికారిపై జులుం ప్రదర్శించారు. నేనెవరో నీకు తెలుసు కదా.. నా దందాకే అడ్డు చెబుతావా.. మా వాళ్లను బెదిరిస్తావా.. నీకెంత ధైర్యం.. నీఅంతు చూస్తా..? నేను తలుచుకుంటే చిటికెలో నిన్ను ట్రాన్స్ఫర్ చేయిస్తా.. తమాషా చేస్తున్నావా.. నావెనక సర్కారే ఉంది.. జాగ్రత్త అంటూ దాదాగిరి చేశారు. ఈ విషయం కాస్త బయటికి పొక్కి టీవీల్లో ప్రసారమై.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రభుత్వ అధికారికే భద్రత కరువైతే.. మరి సామాన్యుల పరిస్థితి ఏమిటని పట్టణవాసులు విమర్శిస్తున్నారు. నాపై దాడి చేయలేదు ఎక్సైజ్‌శాఖ కార్యాలయంలో చోటుచేసుకున్న ఈ వ్యవహారంపై సదరు కార్యాలయ అధికారిని వివరణ కోరగా సదరు వ్యక్తి వచ్చిన మాట వాస్తవమే.. మా వాళ్లే దుకాణాలను పెట్టుకుని బతుకుతున్నారు.. మీరు బైండోవర్ చేస్తామని చెప్పారంటా అని నాతో కొద్దిగా గట్టిగా అడిగారు. అంతేకాని నాపై ఎలాంటి దాడి చేయలేదు. బయట న్యూస్ టీవీలు, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో మాత్రం నిజం లేదని చెప్పుకొచ్చారు. -
ఫుల్‌గా తాగి.. స్నేహితుడిపై ఆటో ఎక్కించేశాడు!
తిరువొత్తియూరు(చెన్నై): కరూర్ జిల్లాలో మద్యం మత్తులో స్నేహితుడిపై ఆటో ఎక్కించడంతో ఓ యువకుడు మృతి చెందాడు. వివరాలు.. కరూర్ జిల్లా తోగైమలై సమీపం కన్నైకలై పంచాయతీ సుక్కాంపట్టికి చెందిన శరవణన్(35) లోడు ఆటోలో దుకాణాలకు నీళ్లను సప్లై చేస్తున్నాడు. అతని స్నేహితుడు పుట్టూర్ పంచాయతీకి చెందిన వెంకటతాంపట్టికి చెందిన కుమరిముత్తు (24). ఇతను ఆ ప్రాంతంలో సెలూన్ నడుపుతున్నాడు. శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో ఇద్దరూ కలిసి సుక్కాంపట్టి, కులందైపట్టికి మధ్య ఉన్న అటవీ ప్రాంతానికి వెళ్లి అక్కడ మద్యం తాగారు. ఈ సమయంలో శరవణన్ అక్కడే నిద్రపోయాడు. మద్యం మత్తులో ఉన్న మారిముత్తు ఆటోను శరవణన్ పైకి ఎక్కించడంతో ఘటనా స్థలంలోనే శరవణన్ మృతిచెందాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు శరవణన్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి మారిముత్తుని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. చదవండి: చండీగఢ్ యూనివర్సిటీ ఘటనపై స్పందించిన పోలీసులు.. వీడియో పంపింది అతనికే! -
చంద్రబాబు హయాంలో 14 డిస్టిలరీలకు అనుమతులు
-
ఈ లిక్కర్ బ్రాండ్లు టీడీపీవి కావా..!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉన్న మద్యం బ్రాండ్లన్నీ బాబు, భువనేశ్వరి, బ్రహ్మణి (బీ–3) బ్రాండ్లేనని మహిళా, శిశుసంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉషశ్రీ చరణ్, ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి, పోతుల సునీత, ఎస్సీ (మాల) కార్పొరేషన్ చైర్ పర్సన్ పి.అమ్మాజీ స్పష్టం చేశారు. టీడీపీ అధికారంలో ఉండగా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రహ్మణి ఆధ్వర్యంలోనే లిక్కర్ డీల్స్ జరిగాయని పేర్కొన్నారు. హెరిటేజ్ పేరుతో వారు పాల వ్యాపారం చేస్తున్నట్లు కనిపించినా తెర వెనక జరిగింది లిక్కర్ బేరమేనని వెల్లడించారు. మద్యం తయారీకి అనుమతులు ఇప్పించటాన్ని చంద్రబాబు, భువనేశ్వరి దశాబ్దాలుగా కుటీర పరిశ్రమగా మార్చుకున్నారని చెప్పారు. మద్యం సేవించటంలో స్వయంగా అత్తా కోడళ్లు పోటీ పడతారని.. ఇలా తాగి ఇటీవల కొట్టుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయని చెప్పారు. టోటల్‌గా బాబు కుటుంబమే తాగుబోతు ఫ్యామిలీ అని వ్యాఖ్యానించారు. ఒకవంక మగువ, మరోవంక మద్యం.. ఇదే పప్పు బ్రాండ్ అని లోకేష్‌పై ధ్వజమెత్తారు. ఇంట్లో అన్నింటికీ లైసెన్స్.. అది తమకు సాధారణమే అన్నట్లుగా నారా కుటుంబం వ్యవహార శైలి ఉందన్నారు. చుక్క లేకపోతే తండ్రీ కొడుకులు ఒక్క ముక్క కూడా మాట్లాడలేరని చెప్పారు. ఆదివారం అనంతపురం, విశాఖపట్నం, తాడేపల్లిలో వారు వేర్వురుగా మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలివీ.. ► చంద్రబాబు హయాంలోనే బూమ్ బూమ్ బీర్, ప్రెసిడెంట్స్ మెడల్, గవర్నర్స్ ఛాయిస్, పవర్ స్టార్ 999, రష్యన్ రోమనోవా, ఏసీబీ, 999 లెజండ్, హెవెన్స్ డోర్, క్రేజీ డాల్, క్లిఫ్ హేంగర్ లాంటి 254 బ్రాండ్లకు అనుమతులిచ్చారు. ఇలాంటి బ్రాండ్ల పేరుతో దత్త పుత్రుడి రుణం, వియ్యంకుడి రుణం తీర్చుకున్నారు. ► మద్యం కంపెనీలన్నీ టీడీపీ నేతలవే. ఎస్పీవై బ్రాండ్ ఎవరిది? ఎస్పీవై రెడ్డి ఏ పార్టీలో ఉన్నారు? ఆయన టీడీపీ నాయకుడు కాదా? ► విశాఖ డిస్టిలరీకి 2019 ఫిబ్రవరి 25న అనుమతి ఇచ్చారు. అది టీడీపీ నేతఅయ్యన్నపాత్రుడికి చెందిన కంపెనీ. దాన్ని గత ఏడాది అమ్మేశానని ఆయన చెబుతున్నారు. అంటే ఏడాది క్రితం వరకు అది అయ్యన్నదే కదా? ఎన్నికల ముందు ఆ కంపెనీకి చంద్రబాబు అనుమతి ఇచ్చారా? లేదా? ► పీఎంకే డిస్టిలరీ యనమల రామకృష్ణుడి వియ్యంకుడిది కాదా? శ్రీకృష్ణా డిస్టిలరీ ఆదికేశవులునాయుడిది కాదా? లైసెన్సులు ఇచ్చింది చంద్రబాబు.. బ్రాండ్లకు అనుమతి ఇచ్చినది ఆయన హయాంలోనే. లిక్కర్ విక్రయాలను ఆకాశానికి పెంచింది చంద్రబాబే. ఈ అనుమతులన్నీ బీ–3 వల్లే వచ్చాయి. టీడీపీ నేతలు ఈ అనుమతుల కోసం లంచాలు ఎవరికి ఇస్తారు? మద్యం వినియోగం తగ్గింది.. ► లిక్కర్ సేల్స్ పెంచితే కమీషన్లు వస్తాయి గానీ తగ్గిస్తే ఎవరైనా ఇస్తారా? బెల్ట్ షాపుల్ని రద్దు చేసి, బార్ లైసెన్సుల్ని 33 శాతం తగ్గించి, పర్మిట్ రూముల్ని మూసి వేయించి, ప్రభుత్వ దుకాణాల ద్వారా ఇప్పుడు పరిమితంగా లిక్కర్ అమ్ముతున్నారు. ఇలా విక్రయాలు గణనీయంగా తగ్గిపోయిన పరిస్థితుల్లో ఎవరైనా కమీషన్లు ఇస్తారా? ► రాష్ట్రంలో మద్యం వినియోగం ఎంతగా తగ్గిందో అందరికీ తెలుసు. 2018–19లో లిక్కర్ అమ్మకాలు 384.31 లక్షల కేసులు ఉంటే 2021–22లో ఏకంగా 278.5 లక్షల కేసులకు తగ్గాయి. ఇదే సమయంలో బీరు అమ్మకాలు 277.10 లక్షల కేసుల నుంచి గణనీయంగా 82.6 లక్షల కేసులకు తగ్గిపోయాయి. ► 2018–19లో మద్యం విక్రయాల ఆదాయం రూ.20,128 కోట్లు కాగా 2021–22లో ఆదాయం రూ. 25,023 కోట్లు ఉంది. ► 43 వేలకు పైగా బెల్టుషాపులను రద్దు చేశాం. పర్మిట్ రూమ్‌లన్నీ రద్దు చేశాం. 4,380 నుంచి 2,934కి వైన్ షాప్‌లను తగ్గించాం. ► ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో షాపులుంటే విచ్చలవిడిగా మద్యం విక్రయించి బెల్టుషాపులు కూడా ఏర్పాటు చేస్తారు కాబట్టి ప్రభుత్వమే పరిమితంగా నిర్ణీత వేళల్లో విక్రయాలు చేపట్టింది. ► నాటు సారా తయారీ, అమ్మకాలపై గట్టి నిఘా వ్యవస్థ ఏర్పాటు చేశాం. ఎస్ఈబీ ద్వారా ఎక్కడిక్కడ దాడులు చేస్తూ కఠినంగా వ్యవహరిస్తున్నాం. డిస్టిలరీల ఓనర్లు పచ్చబాబులే ► భవిష్యత్తులో ఏర్పడే మద్యం డిమాండ్‌కు అనుగుణంగా అంటూ చంద్రబాబు హయాంలో విచ్చలవిడిగా లైసెన్స్‌లు ఇచ్చారు. అదీ దిగిపోయే ముందు! లిక్కర్ తయారీదార్లు, డిస్టిలరీ ఓనర్లు పచ్చబాబులే. ► 2019 తర్వాత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక ఒక్క డిస్టిలరీకి కానీ, ఒక్క బ్రూవరీకి కానీ అనుమతి ఇచ్చిందే లేదు. ► రాష్ట్రంలో 20 డిస్టిలరీలు ఉండగా వాటికి అనుమతులు ఎప్పుడు వచ్చాయో గమనిస్తే ఆశ్చర్యం కలిగించే విషయాలు తెలుస్తాయి. 1982కి ముందు ఉన్నవి కేవలం ఐదు డిస్టిలరీలే. ఆ తర్వాతే మిగిలినవన్నీ వచ్చాయి. యాజమాన్యం మారిన రెండు కంపెనీలతో కలిపి చంద్రబాబు హయాంలో అనుమతి ఇచ్చినవి మొత్తం 14. చంద్రబాబు 2014 నుంచి 2019 మధ్యలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏకంగా 7 డిస్టిలరీలకు కు అనుమతి ఇచ్చారు. ఐదేళ్లలో 254 బ్రాండ్లు, ఏడు డిస్టిల్లరీలకు అనుమతి ఇచ్చి లిక్కర్ విక్రయాలను ప్రోత్సహించారు. ► సొంత మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ఎన్నికలు రాగానే మళ్లీ దండలు వేస్తుంటారు. అలాగే గతంలో తాను అనుమతి ఇచ్చిన బ్రాండ్లు, డిస్టీలరీలపై మళ్లీ ఆయనే ఇవెక్కడివంటూ విమర్శలు చేస్తుంటారు. ఆ దోపిడీ.. బీ–3 కుంభకోణాలే ► ఇసుక అమ్మకాల్లో ఇప్పుడు రూ.4,000 కోట్లు వస్తుంటే... గత ప్రభుత్వంలో ఈ డబ్బంతా ఏమయిందన్న ప్రశ్నకు సమాధానం బీ–3 కుంభకోణం. ► మైనింగ్ దోపిడీ ఎలా జరిగిందన్న ప్రశ్నకు సమాధానం బీ–3 కుంభకోణాలు. ► దోచుకో, పంచుకో, తినుకో (డీపీటీ) అన్నదే టీడీపీ విధానం. దుష్ట చతుష్టయంలోని ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5, దత్త పుత్రుడికి ఎప్పటికప్పుడు వాటాలు. ► టీడీపీ అంటేనే డీపీటీ. లంచాలకు ప్రతిఫలంగానే అనుకూల పత్రికలు, టీవీల్లో ఎల్లో ప్రచారాలు. ఈ కుంభకోణంపై న్యాయ విచారణ చేయాలి. -
నిరాధార కేసులతో వేధిస్తే సహించబోం: వేముల
సాక్షి, హైదరాబాద్: సీఎం కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను నిరాధార కేసులతో వేధిస్తే సహించేది లేదని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి హెచ్చరించారు. ఆమెపై నిరాధారమైన వార్తలు ప్రచురించేలా చేయడం నీతిమాలిన చర్య అని, కవిత ఇంటిపై బీజేపీ దాడి హేయమైన చర్య అని వేముల సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో మండిపడ్డారు. ‘కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, వైఫల్యాలను కేసీఆర్ ఎత్తి చూపుతున్నందునే కవితపై నిరాధారమైన వార్తలు సృష్టిస్తున్నారు. టీఆర్ఎస్ కవితకు అండగా ఉండి బీజేపీ కార్యకర్తలను తరిమి కొడతాం’అని వేముల హెచ్చరించారు. ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, భాస్కర్‌రావు, నోముల భగత్‌లు టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మాట్లాడు తూ.. కవితపై ఆరోపణలు ఖండించారు. -
టీచర్ వికృత చేష్టలు.. ఫుల్‌గా మద్యం తాగి చెప్పుతో..
తుమకూరు(బెంగళూరు): ఉపాధ్యాయుడు పాఠశాలకు మద్యం తాగి వచ్చి ప్రధానోపాధ్యాయున్ని చెప్పుతో బెదిరించి, విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వైనం వెలుగుచూసింది. కర్ణాటక మధుగిరి తాలూకాలోని గొందిహళ్ళి ప్రభుత్వ పాఠశాలలో టీచర్ ఫణీంద్రనాథ్ మద్యం తాగి వచ్చాడు. ఇతనిపైన అనేక సంవత్సరాలుగా ఇలాంటి ఫిర్యాదులు ఉన్నాయి. గతంలో హెడ్మాస్టర్లు కూడా పై అధికారులకు నివేదికలు పంపినా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో ఇతడు ఆడింది ఆటగా సాగుతోంది. దీంతో రెండురోజుల క్రితం మద్యం తాగి నానా హంగామా చేశాడు. దీంతో హెచ్ఎం మధుగిరి విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ ఎం.రేవణ్ణ సిద్దప్పకు ఫిర్యాదు చేయగా ఫణీంద్రనాథ్‌ను సస్పెండ్ చేశారు. వచ్చే శుక్రవారం విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. చదవండి: ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. భర్త చేసిన పనికి.. -
దారుణం: తల్లి, భార్య కలసి గొంతు పిసికి చంపారు
సాక్షి,వర్గల్ (గజ్వేల్): తాగుడుకు బానిసై నిత్యం భార్య, తల్లిని హింసిస్తున్న వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఈ ఘటన శనివారం వర్గల్ మండలం మల్లారెడ్డిపల్లిలో చోటు చేసుకుంది. మల్లారెడ్డిపల్లికి చెందిన నారెడ్డి రవీందర్‌రెడ్డి (36)కి భార్య రజిత, తల్లి లక్ష్మి, పన్నెండేళ్లలోపు యుగంధర్‌రెడ్డి, గగన అనే ఇద్దరు పిల్లలున్నారు. కొంతకాలం నుంచి తాగుడుకు బానిసైన రవీందర్‌రెడ్డి ప్రతిరోజు తాగి భార్యను, తల్లిని, పిల్లలను తిడుతూ, కొడుతూ హింసించేవాడు. పలుమార్లు పంచాయతీ పెట్టి మందలించినా అతని ప్రవర్తనలో మార్పురాలేదు. శనివారం ఉదయం కూడా తాగిన మైకంలో తన తల్లిని, భార్యను తిట్టి కొట్టి గొడవపడ్డాడు. దీంతో అతని హింసలు భరించలేక తల్లి లక్ష్మి, భార్య రజిత ఇంట్లోని ఓ గదిలో రవీందర్‌రెడ్డిని గొంతు పిసికి హతమార్చారని మృతుడి మేనమామ శ్రీనివాస్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సంపత్‌కుమార్ తెలిపారు. ఘటనా స్థలం వద్ద మృతదేహాన్ని సీఐ కమాలాకర్, సంపత్‌కుమార్ పరిశీలించారు. మృతుని మెడపై, కాలు వద్ద గాయాలున్నాయని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు. -
పార్కింగ్ గొడవ.. ముగ్గురిపై లారీ ఎక్కించి పరార్
తిరువళ్లూరు(చెన్నై): మద్యం మత్తులో జరిగిన గొడవలో లారీ ఎక్కించి ఒకరిని హత్య చేసి, ఇద్దరిని గాయపరిచిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన లారీడ్రైవర్, క్లీనర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలోని ఉత్తరపెరుంబక్కం గ్రామం దగ్గరలో ఉన్న ప్రైవేట్ పార్కింగ్ స్థలంలో ఉత్తరప్రదేశ్, బీహార్, ఆంధ్ర, తెలంగాణ తదితర ప్రాంతాలకు చెందిన వారు లారీలను పార్కింగ్ చేస్తారు. బుధవారం రాత్రి స్థానిక గ్రామానికి చెందిన కమలకన్నన్, కుమరన్, నవీన్ తదితరులు లారీ యార్డు వద్ద మద్యం సేవిస్తుండగా, అక్కడే పార్కింగ్ చేసిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన లారీని బయటకు తీయడానికి డ్రైవర్ లాల్‌సింగ్ యత్నించాడు. ఈ సమయంలో వారు తాము మద్యం సేవించిన తరువాతే లారీలను బయటకు తీయాలని లారీడ్రైవర్‌తో ఘర్షణకు దిగారు. దీంతో ఆగ్రహించిన డ్రైవర్ లాల్‌సింగ్ ఆ ముగ్గురిపై లారీ ఎక్కించి పరారయ్యాడు. ఈ సంఘటనలో అక్కడికక్కడే కమల కన్నన్ మృతి చెందగా, ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. చదవండి: బంజారాహిల్స్: బాలికను కారులో తీసుకెళ్లి అసభ్యకర ప్రవర్తన -
తాగిన మత్తులో నోరు జారాడు.. మైకం నుంచి తేరుకునే లోపే..
హోసూరు(బెంగళూరు): హోసూరులో గత రెండు రోజుల క్రితం జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. హతుడు హోసూరు సీతారామ్‌దిన్న కాలేకుంట ప్రాంతానికి చెందిన యారబ్. కొన్ని సంవత్సరాల క్రితం శ్యానసంద్రంకి చెందిన సంతోష్ (20) సోదరి అశ్వినిని అదే ప్రాంతానికి చెందిన అవాస్‌ఖాన్ ప్రేమించి పెళ్లి చేసుకొని కొన్నేళ్లకు హత్య చేసి జైలుకెళ్లాడు. గత శుక్రవారం రాత్రి సంతోష్‌తో కలిసి మద్యం తాగుతూ యారబ్ మీ అక్క అశ్వినిని హత్య చేసేందుకు తాను సహకరించానని చెప్పాడు. దీంతో ఆవేశానికి గురైన సంతోష్ యారబ్ మైకం నుంచి తేరుకునే లోపు ఆ పరిసరాల్లోని బండరాతితో కొట్టి హత్య చేసినట్లు పోలీసులు విచారణలో తేలింది. సంతోష్‌ను పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. మరో ఘటనలో.. సైబర్ మోసగాడు అరెస్టు హోసూరు: ఈ–మెయిల్‌ని హ్యాక్ చేసి ఎలక్ట్రికల్ షాపు యజమానికి రూ. 65 వేలు అబేస్ చేసిన వ్యక్తిని క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. హోసూరుకు దినేష్‌కుమార్ (38) బస్టాండు వద్ద ఎలక్ట్రికల్ దుకాణం నిర్వహిస్తున్నాడు. గత నెల 21వ తేదీ గుర్తు తెలియని వ్యక్తులు అతని ఈమెయిల్ ఐడిని హ్యాక్ చేసి బ్యాంకు ఖాతా వివరాలను సేకరించి ఖాతాలోని 65 వేలను కొట్టేశాడు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ జరిపి బెంగళూరు వద్ద అత్తిపల్లికి చెందిన కాంతరాజ్ (24) అనే యువకున్ని అరెస్ట్ చేశారు. చదవండి: చదువు కోసం మేకలు అమ్మి ఫోన్ కొనిచ్చిన తల్లి! ఆ కొడుకేమో.. -
భార్యను చితకబాదిన భర్త.. కూతురు ఎంత వేడుకున్నా వినకపోవడంతో...
మైసూరు(బెంగళూరు): జిల్లాలోని హుణసూరు తాలూకాలోని ఒకేరోజు మద్యం రక్కసి వల్ల రెండు ఘోరాలు జరిగాయి. తాగుబోతు తండ్రి కూతురు చేతిలో, తాగుబోతు కొడుకు వల్ల తల్లి ప్రాణాలు కోల్పోయారు. వివరాలు.. సీగడికట్టి గ్రామంలో దేవరాజు (50) అనే తాగుబోతు తండ్రిని కుమార్తె హతమార్చింది. మద్యానికి బానిసైన దేవరాజు ప్రతిరోజూ మద్యం తాగి వచ్చి భార్యతో గొడవ పడేవాడు. శనివారం రాత్రి కూడా మద్యం మత్తులో భార్యను కొట్టసాగాడు. తల్లిని కొట్టొద్దని కూతురు సునీత తండ్రిని ఎంత వేడుకున్నా వినలేదు. తల్లిని కాపాడడానికి యత్నించి విఫలమైన సునీత ఒక కట్టెను తీసుకొని తండ్రి తలపై కొట్టడంతో తీవ్ర గాయమై అక్కడే పడిపోయాడు. ఇరుగుపొరుగు చూసి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. హుణసూరు గ్రామీణ పోలీసులు కేసు విచారణ చేపట్టారు. తల్లిని చంపిన తనయుడు బిళికెరె గ్రామంలో జయమ్మ (55) అనే మహిళను ఆమె కొడుకు హరీష్ (30) మద్యం మత్తులో హత్య చేశాడు. శనివారం తాగి వచ్చిన హరీష్ తల్లితో గొడవపడ్డాడు. ఇంటిలోని వేట కొడవలితో ఆమెను నరికిచంపాడు. బిళికెరె పోలీసులు నిందితున్ని అరెస్టు చేశారు. చదవండి: టైం కోసం వేచి చూసి.. ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో.. -
మద్యం మత్తులో ఘాతుకం.. తండ్రిని నరికిన కొడుకు
సంతబొమ్మాళి: మండలంలోని భావనపాడు పంచాయతీ కొత్తపేట కాలనీలో గురువారం కన్నతండ్రిని కుమారుడు నరికిన ఘటన గురువారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కొయ్యాల నారాయణకు ముగ్గురు కుమారులు. వారిలో పెద్ద కుమారుడు కొయ్యల పోలయ్య గురువారం ఉదయం 8 గంటల సమయంలో మద్యం కోసం డబ్బులు కావాలని తన భార్య లక్ష్మిని అడిగాడు. డబ్బులు లేవని చెప్పడంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. అక్కడే ఉన్న తండ్రి నారాయణ కలగజేసుకోవడంతో కోపోద్రిక్తుడైన పోలయ్య.. తండ్రి అని కూడా చూడకుండా విచక్షణ రహితంగా కత్తితో పొడిచాడు. తల వెనుక, ఇతర శరీర భాగాల్లో నాలుగు చోట్ల తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం కత్తితోనే బయటకు వచ్చి వీరంగం సృష్టించడంతో స్థానికులు భయాందోళన చెందారు. సమాచారం అందుకున్న నౌపడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పోలయ్యను అదుపులోకి తీసుకున్నారు. రక్తపు మడుగులో ఉన్న నారాయణను 108 వాహనంలో టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం సర్వజన ఆస్పత్రికి తరలించారు. జిల్లా క్లూస్‌టీం సభ్యు లు రమేష్, ప్రసాద్ ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నౌపడ ఎస్ఐ సాయికుమార్ తెలిపారు. -
అక్కడ ఎనీ టైం మందు.. ఫుల్ కిక్కే కిక్కు..!
సాక్షి,ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మారుమూల గిరిజన తండాల్లో మద్యం ఏరులై పారుతోంది. ఏ సమయంలోనైన(ఏనీటైం) మద్యం బాటిళ్లు దొరకడంతో మందుబాబులు తెల్లవారు జాము నుంచే మత్తులో తూగుతున్నారు. అర్ధరాత్రి గడిచిన గ్రామాల్లో బెల్డ్షాపుల్లో మద్యం విక్రయాలు కొనసాగుతున్నాయి. తండాలు, గ్రామాల్లోని కిరాణా దుకాణాల్లోనే బెల్టుషాపులు నిర్వహిస్తున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలకేంద్రంతోపాటు గ్రామాలు, తండాల్లో విచ్చలవిడిగా అనుమతులు లేకుండా అక్రమంగా మద్యం విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మండలంలో 18 గ్రామాలుండగా, 25 బెల్టుషాపులు అనధికారికంగా ఏర్పాటు చేశారు. ఈ షాపుల్లో ఎమ్మార్పీ కంటే ఎక్కువ రేట్లకు మద్యం విక్రయిస్తున్నారు. హోటళ్లు, బార్లను తలపిస్తున్నాయి. చీప్‌లిక్కర్‌తో మొదలుకొని అన్ని రకాల బ్రాండ్లను అందుబాటులో ఉంచుతున్నారు. బహిరంగంగానే మద్యం విక్రయాలు జరుగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అర్ధరాత్రి అందుబాటులో మద్యం వీర్నపల్లి మండలంలోని తండాలు, గ్రామాల్లో నిర్వహిస్తున్న బెల్టుషాపుల్లో ఎప్పుడైనా మందు అమ్ముతున్నారు. ప్రభుత్వ అనుమతులు పొందిన మద్యం దుకాణాలను రాత్రి పదిన్నర గంటలకే మూసివేస్తుండగా, ఇక్కడ మాత్రం అర్ధరాత్రి వరకు కొనసాగిస్తున్నారు. డోర్ డెలీవరీ పద్ధతిలోనూ మద్యం విక్రయాలు సాగడం మరో విశేషం. ఒకప్పుడు నాటుసారా, గంజాయి మత్తులో తూగిన పల్లెలు.. ఇప్పుడు మద్యం కిక్కులో ఉంటున్నాయి. చర్యలు తీసుకుంటాం అక్రమంగా బెల్టు షాపులను ఏర్పాటు చేసి మద్యం విక్రయిస్తే చర్యలు తీసుకుంటాం. దొంగచాటుగా మద్యం విక్రయాలు, హోటళ్లలో సిట్టింగులు పెట్టిన చట్టరీత్యనేరం. దాడులు చేసి బెల్టుషాపులను గుర్తించి మూసివేస్తాం. – ఎంపీఆర్ చంద్రశేఖర్, ఎక్సైజ్ సీఐ,ఎల్లారెడ్డిపేట -
మందు బాబులు జర జాగ్రత్త.. లేదంటే జేబులు ఖాళీ!
కోహెడరూరల్(హుస్నాబాద్): సిండికేట్ల కనుసన్నల్లో మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. మద్యం వ్యాపారులు ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి సిండికేట్‌గా ఏర్పడి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. హుస్నాబాద్ నిమోజకవర్గంలో మద్యం వ్యాపారులు మద్యం వినియోగదారుల జేబులు ఖాళీ చేసేందుకు కుమ్మక్కయ్యారు. మద్యం వ్యాపారులు, ఎక్సైజ్ అధికారుల పరస్పర అవగాహనతో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైన్స్‌లో కొన్ని బ్రాండ్లను మాత్రమే విక్రయిస్తున్నారు. మద్యం వ్యాపారుల తీరుతో మందుబాబులు విసిగిపోతున్నారు. కొద్ది రోజులుగా మద్యం అమ్మకాల్లో జరుగుతున్న నాటకీయ పరిణామాలు వారి మత్తు దిగేలా చేస్తున్నాయి. కోరింది కాకుండా స్కీం ఇచ్చే కంపెనీల మద్యం మాత్రమే అమ్ముతున్నారు. బెల్ట్ షాపుల్లో మాత్రం 24 గంటలు అన్ని రకల బ్రాండ్లు అందుబాటులో ఉంటున్నాయి. పోలీస్, ఎక్సైజ్ శాఖల అధికారులు అటు వైపు కన్నెత్తి చూడకపోవడంతో పలు సందేహాలకు తావిస్తోంది. (చదవండి: వంట నూనెల సలసల.. 15 రోజుల్లో భారీగా పెరిగిన ధర, ఇలా అయితే కష్టమే! ) వ్యాపారుల ఇష్టారాజ్యం మద్యం కొనుగోలుదారులు అడిగిన బ్రాండ్ కాకుండా తమకు లబ్ధిచేకూర్చే కంపెనీల బ్రాండ్ల మద్యాన్ని మాత్రమే అమ్ముతున్నారు. లాభం ఎక్కువ ఇచ్చే(స్కీం)కంపెనీల మద్యాన్ని మాత్రమే విక్రయించేందుకు వ్యాపారులు సిండికేట్ అయ్యారని స్థానికులు చర్చించుకుంటున్నారు. స్కీంలు భారీగా ఇచ్చే కంపెనీల మద్యం మాత్రమే విక్రయించాలని అంతర్గత ఒప్పందం కుదుర్చుకున్నట్లు స్థానికులు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ప్రధాన బాండ్ల విక్రయాలను నిలిపివేశారు. ఇతర ప్రాంతాల్లో వాటిని అమ్ముతున్నప్పటికీ స్థానిక వ్యాపారులు సిండికేటుగా మారడంతో కొన్ని బ్రాండ్ల మద్యం లభించడం లేదు. దీంతో మద్యం ప్రియులు వారు అంటగడుతున్న వాటినే తీసుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు. స్కీం లేకుంటే అంతే.. యువత ఎక్కువగా బీరు తాగుతుంటారు. అత్యధికంగా కింగ్ ఫిషర్ లైట్ లేదా స్ట్రాంగ్ పైనే మక్కువ చూపుతుంటారు. బీర్ల విక్రయాల్లో ఎక్కువగా అమ్మడు పోయిదే ఈ బ్రాండ్ మాత్రమే. మార్కెట్లో డిమాండ్ ఉన్న బ్రాండ్ కావడంతో కొద్దిరోజులుగా ఆ కంపెనీ స్కీం రూపంలో వైన్‌షాప్‌లకు ఇచ్చే ప్రోత్సహకాలకు నిలిపి వేసినట్లు తెలిసింది. దీంతో ప్రోత్సాహకాలు(స్కీం)ఇవ్వని బ్రాండ్లు అమ్మకూడదని వ్యాపారులు నిర్ణయించుకున్నట్లు వినికిడి. వినియోగదారులు కోరినా స్టాక్ లేదంటూ ఇతర కంపెనీల బీర్లను అంటగడుతున్నారు. (చదవండి: అమ్మమ్మ పాలకూర కావాలంటూ.. పుస్తెలతాడుతో.. ) ఎక్సైజ్ అధికారుల అండతో.. హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎక్సైజ్ అధికారుల అండదండలతో మద్యం వ్యాపారుల సిండికేట్ నడుస్తోంది. సిండికేట్ నడుస్తోందని తెలిసినా ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మా దృష్టికి రాలేదు హుస్నాబాద్ పరిధిలో మద్యం వ్యాపారులు అధిక ధరలకు అమ్మితే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటాం. అధిక ధరలకు అమ్ముతున్నట్టు మాకు సమాచారం లేదు. గ్రామాల్లో బెల్ట్‌షాపులు ఉన్నట్టు మా దృష్టికి రాలేదు. మద్యం వ్యాపారులు సిండికేట్‌గా ఉండకూడదు. నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవు. అధిక ధరలకు మద్యం విక్రయించకూడదు – విజయలక్ష్మి, ఎక్సైజ్ సీఐ, హుస్నాబాద్ సరికొత్త రేట్లతో విక్రయాలు మద్యం వ్యాపారులు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు కాకుండా ఇష్టారాజ్యంగా ధరలు పెంచి బహిరంగంగా విక్రయాలు సాగిస్తున్నారు. ఫుల్ బాటిల్‌పై రూ.20 నుంచి 30, హాఫ్ బాటిల్‌పై రూ.10 నుంచి 20 వరకు, క్వాటర్ సీసాపై రూ.10 నుంచి 15 వరకు విక్రయిస్తున్నారు. బీరుపై రూ.10 నుంచి 20 అధికంగా వసూలు చేస్తున్నారు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా ప్రత్యేకంగా మద్యం సీసాలపై స్టిక్కర్లు వేసి బెల్ట్‌షాపులకు సరఫరా చేస్తున్నారు. -
ఆంక్షలు లేని నిషా.. పాత రికార్డు బద్దలు
సాక్షి, బెంగళూరు: కోవిడ్ భయాలు, రాత్రి కర్ఫ్యూ ఏవీ మందుబాబులను అడ్డుకోలేకపోయాయి. రాష్ట్రంలో కొత్త ఏడాదికి మద్యం విక్రయాల్లో గత ఏడాది రికార్డు బద్ధలైంది. డిసెంబర్ 31న మొత్తం 2.39 లక్షల పెట్టెల మద్యం అమ్ముడైంది. 2020 డిసెంబర్ 31న ఇది 2.25 లక్షల బాక్సులుగా ఉండింది. పగలే రికార్డు కొనుగోళ్లు కరోనా అంటే తెలియని 2019 డిసెంబర్ 31న 3.62 లక్షల బాక్సుల మద్యాన్ని స్వాహా చేశారు. 2020లో కొంచెం తగ్గి, 2021లో మళ్లీ ఊపందుకున్నాయి. తాజాగా నైట్ కర్ఫ్యూ జారీ చేసినప్పటికీ కొనుగోళ్లు తగ్గలేదు. పగటి పూట వైన్‌షాపులకు పోటెత్తారు. పబ్‌లు, బార్లు రాత్రి మూతపడడం వల్ల పగలే కొని పెట్టుకున్నారు. నెలలో రూ.977 కోట్ల రాబడి 2021, డిసెంబర్ మాసంలో మొత్తం 17.18 లక్షల పెట్టెల మద్యం, సుమారు 10.13 లక్షల పెట్టెల బీర్లు ఖాళీ అయ్యాయి. తద్వారా ప్రభుత్వానికి రూ. 977 కోట్ల ఆదాయం వచ్చింది. గతేడాది కంటే ఈ ఏడాది ఎక్కువగా (13 శాతం) ఆదాయం వచ్చింది. -
చదువుపై అలా... మద్యంపై ఇలా..!!
-
చీప్ లిక్కర్ రూ.75, కుదిరితే రూ.50కే.. వాహ్.. ఎంత గొప్ప పథకం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ అధికారంలోకి వస్తే చీప్ లిక్కర్‌ను రూ.75కు ఇస్తామని, కుదిరితే రూ.50కే ఇస్తామని ఏపీ బీజేపీ నేత సోము వీర్రాజు చేసిన ప్రకటనపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ‘వాహ్.. ఎంత గొప్ప పథకం.. ఏపీ బీజేపీ అత్యంత నీచ స్థాయికి దిగజారడం ఎంత సిగ్గుచేటు’అని వ్యాఖ్యానించారు. ‘రూ.50కే చీప్ లిక్కర్‌ను సరఫరా చేయాలనే బంపర్ ఆఫర్.. కేవలం పార్టీకి అత్యంత నిరాశాజనక పరిస్థితులున్న రాష్ట్రాలకే బీజేపీ జాతీయ విధానం పరిమితమా?’అని ట్విట్టర్లో కేటీఆర్ ప్రశ్నించారు. -
మందు బాబులకు షాక్.. కొత్త ఏడాది లిక్కర్ బంద్..!
షిల్లాంగ్: మరి కొద్దిరోజుల్లో 2021 ఏడాది ముగియనుంది. అయితే క్రమంలో కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలకడానికి జనాలు పెద్ద ఎత్తున సిద్ధమవుతున్నారు. అయితే మరోవైపు కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే మేఘాలయ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాత ఏడాది చివరి రోజు, కొత్త సంవత్సరం మొదటి రోజు మద్యం గిరాకీ బాగా పెరుగుతుందన్న విషయం తెలిసిందే. అయితే మేఘాలయలో మాత్రం ఈ నెల 24, 25 తేదీలతో పాటు కొత్త సంవత్సరం మొదటి రోజైన జవనవరి 1న కూడా మద్యం దుకాణాలను బంద్ చేస్తున్నట్లు ప్రకటించి మందు బాబులకు షాకిచ్చింది. అయితే ఈ నిషేధం రాష్ట్ర మొత్తం లేకుండా ఈస్ట్ ఖాసి హిల్స్ జిల్లాలో మాత్రమే ఉండనున్నట్లు పేర్కొంది. దీనికి సంబంధించి జీవోను మేఘాలయ ప్రభుత్వం బుధవారం జారీ చేసింది. (చదవండి: నళినికి నెల రోజుల పెరోల్) -
మాటంటే మాటే.. ‘డ్యూటీలో ఉన్నా లేకున్నా మందు ముట్టం, ఆన’
పట్నా: మద్యాన్ని పూర్తిస్థాయిలో నిషేధించేందుకు బిహార్ ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్ర డీజీపీ సందీప్ కుమార్ సింఘాల్.. తన సహొద్యోలతో కలిసి.. మద్యాన్ని జీవితంలో ముట్టబోనని ప్రమాణం చేశారు. రాష్ట్రంలో మద్యపానం నిషేధాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు కృషి చేస్తానని ఆయన ప్రతిజ్ఞ చేశారు. పాట్నాలోని పోలీసుశాఖ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఈ కార్యక్రమం జరిగింది. నిబంధనలను ఉల్లంఘించే పోలీసు సిబ్బందిని విధుల నుంచి తొలగిస్తామని డీజపీ స్పష్టం చేశారు. ఆయన ప్రమాణం చేస్తూ.. ‘సందీప్ కుమార్ సింఘల్ అనే నేను.. మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తానని, జీవితంలో దానిని ఎప్పుడూ ముట్టనని ఈరోజు (నవంబర్ 26) ప్రమాణం చేస్తున్నాను. విధుల్లో ఉన్నా, లేకపోయినా.. నా ప్రతిజ్ఞకు కట్టుబడి ఉంటాను. రోజువారీ జీవితంలో లిక్కర్ కు తావివ్వను. మద్యపాన నిషేధ చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు కృషి చేస్తాను‘ అని డీజీపీ ప్రమాణం చేశారు. ప్రమాణం చేసిన సీఎం బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కూడా ఇదే విషయమై ప్రతిజ్ఞ చేశారు. రాష్ట్ర అసెంబ్లీలోని ప్రభుత్వ అధికారులతో కలిసి ఆయన శుక్రవారం ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా నితీశ్ మాట్లాడుతూ.. ’మద్యంతో కలిగే అనర్థాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తాము. మద్యపాన నిషేధాన్ని అధికారులు కఠినంగా, నిష్పక్షపాతంగా అమలు చేయాలి’ అని పిలుపునిచ్చారు. గత కొంతకాలంగా.. రాష్ట్రంలోని వివిధ హోటళ్లు, వెడ్డింగ్ హాల్స్ లో పోలీసులు రైడ్లు చేసి.. మద్యం సేవిస్తున్న వారిని అరెస్ట్ చేశారు. ప్రజలను హింసిస్తున్నారని విపక్షాలు తీవ్రంగా విరుచుకుపడ్డాయి. అయితే నితీశ్ కుమార్ ఆ ఆరోపణలను తిప్పికొట్టారు. మద్యాన్ని రాష్ట్రంలో పూర్తిగా నిషేధిస్తామని తేల్చిచెప్పారు. ఈ క్రమంలోనే కఠిన నిర్ణయాలకు పూనుకున్నారు. #WATCH | Patna: Bihar DGP SK Singhal administers an oath to all Police personnel at the Police HQ to ensure implementation of liquor ban in the state, and personally abide by the ban too. pic.twitter.com/DTXloFSJXb — ANI (@ANI) November 26, 2021 చదవండి: Starlink: ఎంట్రీకి ముందే షాకుల మీద షాకులు.. బుక్ చేసుకోవద్దంటూ జనాలకు కేంద్రం సూచన -
‘అది చూపించక్కర్లేదు.. తాగినోడి నోట నిజం తన్నుకుని వస్తాది’
భోపాల్: దేశంలో కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ఆయా రాష్ట్రాలు ఇప్పటికే రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్‌పై ప్రజల్లో అవగాహన కోసం పలు కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఈ క్రమంలో ఓ జిల్లా యంత్రాంగం వ్యాక్సిన్ తీసుకున్న వారికే మద్యం అమ్మాలని నిర్ణయించింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాలో చోటు చేసుకుంది. రాష్ట్ర రాజధాని భోపాల్‌కు 230 కి.మీ దూరంలో ఉన్న ఖాండ్వా జిల్లా యంత్రాంగం కొత్త నిబంధనను విధించింది. తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం రెండు టీకాలు వేసుకున్న వారికే వైన్స్ షాపుల్లో మద్యం విక్రయించనున్నారు. దీనిపై ఓ ప్రభుత్వ అధికారి మాట్లాడుతూ, "ఖచ్చితంగా వాక్సిన్ సర్టిఫికేట్లు చూపించాల్సిన అవసరం లేదు, కేవలం నోటి మాట చెప్తే చాలని, ఎందుకంటే మద్యం తాగే వారు అబద్ధాలు చెప్పరని తెలిపారు. జిల్లాలో ప్రారంభించిన మెగా వ్యాక్సిన్ డ్రైవ్‌లో ప్రజలంతా వ్యాక్సిన్ తీసుకునేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లాలో రెండు డోసుల టీకాలు తీసుకోని వారికి మద్యం కూడా అమ్మకూడదని నిర్ణయం తీసుకున్నారు. "No vaccination proof is required, verbal assurance of being fully vaccinated is enough. Those who drink don’t lie": RP Kirar, Khandwa district excise officer, on recent order restricting the sale of liquor only to those fully vaccinated. pic.twitter.com/Ltzqsy3GUV — NDTV (@ndtv) November 19, 2021 చదవండి: ఇంట్లో మకాం వేసిన కొండచిలువ.. ఇంటి యజమానిని చూసి.. -
మందు.. సోడా.. మంచింగ్.. ఆ కోతే వేరబ్బా!
-
మద్యం తాగితే రూ.10 వేల జరిమానా
పాన్‌గల్: మహాత్మాగాంధీ స్ఫూర్తితో మహబూబ్‌నగర్ జిల్లా పాన్‌గల్ మండలం గోప్లాపూర్‌లో సంపూర్ణ మద్య నిషేధం విజయవంతంగా అమలవుతోంది. మద్య నిషేధం సంపూర్ణంగా అమలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా ఐదేళ్లుగా మద్య నిషేధం కొనసాగిస్తూ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోంది. అంతకుముందు గ్రామంలో చిన్నాపెద్ద తేడా లేకుండా మద్యం తీసుకోవడంతో తరచూ గొడవలు చోటుచేసుకుని అశాంతి వాతావరణం నెలకొనేది. ఈ క్రమంలో విద్యావంతులు, యువకులు ఈ చెడు సంస్కృతిని పారదోలేందుకు నిర్ణయించుకున్నారు. చదవండి: మణికొండ సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతికి బాధ్యత వహిస్తాం: మంత్రి కేటీఆర్ గోప్లాపూర్‌లో మద్య నిషేధంపై ప్రతిజ్ఞ చేస్తున్న విద్యార్థులు, గ్రామస్తులు (ఫైల్) చిన్నాపెద్ద, మహిళలు, యువత ఒక తాటిపైకి వచ్చి మద్యపాన నిషేధానికి నడుం బిగించారు. మద్యం విక్రయించినా.. కొనుగోలు చేసినా రూ.10 వేల జరిమానా విధించాలని తీర్మానించారు. ఈ మేరకు 2016 జూలై 11వ తేదీ నుంచి గ్రామంలో గుడుంబా, గొలుసు మద్యం దుకాణాల పై విధించిన నిషేధం ఇప్పటికీ కొనసాగుతోంది. సంపూర్ణ మద్యపాన నిషేధ గ్రామంగా తీర్చిదిద్దారు. చదవండి: టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో కేవలం 10 వేలే, బంగారం, బండి లేనే లేదు వేలం పాట నిర్వహించి.. గోప్లాపూర్‌లో 4 వేల వరకు జనాభా.. 2 వేల మంది ఓటర్లు ఉన్నారు. అయితే ఐదేళ్ల కిందట గ్రామంలో మద్యం విక్రయించేందుకు వేలంపాట పాడారు. మద్యం విక్రయాలు దక్కించుకున్నవారు ఇష్టానుసారంగా ధరలకు విక్రయించేవారు. దీంతో మద్యం మత్తులో గొడవలు జరగడం, డబ్బు వృథా కావడం, అప్పులు పెరిగి కుటుంబ పోషణ భారంగా మారింది. ఎంతో మంది ఆర్థికంగా కుంగిపోతుండడంతో యువకులు, గ్రామస్తులు సమావేశమై మద్యం భూతాన్ని తరిమేసేందుకు నిర్ణయించుకున్నారు. ఐదేళ్ల కిందట మహిళలు, యువకులు ఏకమై గ్రామ పంచాయతీ ఆవరణలో మద్యం నిషేధంపై గ్రామసభను ఏర్పాటు చేశారు. గ్రామంలో మద్యం విక్రయించరాదని, కొనుగోలు చేసినా రూ.10 వేలు జరిమానా విధించాలని తీర్మానించారు. గ్రామస్తులంతా పార్టీలకతీతంగా సమష్టి కృషితో యువకులతో కలిసి గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించి మద్య నిషేధంపై ప్రచారం నిర్వహించారు. అనంతరం గ్రామంలోని ఆలయం ఎదుట ప్రతిజ్ఞ చేయించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు గ్రామంలో మద్య నిషేధం కొనసాగుతోంది. గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొనడంతోపాటు గ్రామాభివృద్ధికి దోహదపడుతుంది. ప్రశాంతంగా ఉంది గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలుతో ప్రశాంతంగా మారింది. గ్రామస్తులు, యువకుల సహకారంతో అందరం కలిసికట్టుగా పార్టీలకతీతంగా సంపూర్ణ మద్యపాన నిషేధానికి బాటలు వేయడంతో ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదుగుతున్నారు. ఎలాంటి గొడవ లేకుండా హాయిగా పనులు చేసుకుంటున్నాం. - కృష్ణ, ఎంపీటీసీ సభ్యుడు, గోప్లాపూర్ గొడవలు తగ్గాయి.. గతంలో గ్రామంలో మద్యం విక్రయాలతో కొందరు ఇష్టారాజ్యంగా తాగేవారు. దీంతో గ్రామంలో గొడవలు, మహిళలపై దాడులు తరచూ జరిగేవి. సంపూర్ణ మద్యపాన నిషేధానికి నిర్ణయం తీసుకోవడంతో గ్రామంలో అందరూ ఆనందంగా ఉన్నారు. నిషేధాన్ని ఇకపై ఇలానే కొనసాగిస్తాం. - లక్ష్మీ, మాజీ సర్పంచ్, గోప్లాపూర్ -
వైన్ షాప్ లో దొంగల హల్ చల్
-
అక్రమ మద్యం తయారీపై ఉక్కుపాదం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: అక్రమంగా మద్యం తయారీ, రవాణాపైన ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. మద్యం అక్రమ రవాణా, తయారీకి పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి ఇదివరకే చట్టాన్ని తీసుకు వచ్చామని, దీన్ని అమలు చేయాలని ఆదేశించారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కార్యకలాపాల ప్రగతిపై అధికారులు సీఎం వైఎస్ జగన్‌కు వివరాలు అందించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. మద్యం నియంత్రణలో భాగంగా రేట్లను పెంచామని వెల్లడించారు. మూడింట ఒక వంతు దుకాణాలను మూసివేశామని, బెల్టుషాపులను,పర్మిట్‌రూమ్‌ల తీసేశామని తెలిపారు. లిక్కర్ అమ్మకాలు నెలకు 34 లక్షల కేసుల నుంచి 21 లక్షల కేసులకు తగ్గాయని పేర్కొన్నారు. బీరు అమ్మకాలు నెలకు 17 లక్షల కేసుల నుంచి 7 లక్షలకు తగ్గాయన్నారు. ఇలాంటి సందర్భంలో అక్రమంగా రవాణా అవుతున్న మద్యాన్ని, మద్యం తయారీని అడ్డుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఇసుక ఎక్కువ ధరకు అమ్మితే చర్యలు ఇసుకను నిర్దేశించిన రేట్లకన్నా ఎక్కువ ధరకు అమ్మితే చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టగానే మరిన్ని రీచ్‌లు, డిపోల సంఖ్య పెంచేలా చూడాలన్నారు. ఎస్ఈబీ కాల్‌సెంటర్ నంబర్‌పై బాగా ప్రచారం చేయాలన్నారు. అధిక రేట్లకు ఎవరైనా అమ్మితే వెంటనే వినియోగదారులు ఆ నంబర్‌కు కాల్చేసేలా ప్రచారం చేయాలని, సంబంధిత జిల్లాల వారీగా ఈ ప్రచారం చేయాలని సూచించారు. వచ్చే కాల్స్‌పై సత్వరమే స్పందించి అధికారులు చర్యలు తీసుకోవాలని, క్రమం తప్పకుండా అధికారులు దీనిపై పర్యవేక్షణ చేయాలన్నారు. ఆ జిల్లాల్లో రేట్ల వివరాలను తెలియజేస్తూ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలని, అంతకన్నా ఎక్కువ ధరకు ఎవరైనా విక్రయిస్తే తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు. సీఎం జగన్ ఇంకేమన్నారంటే.. చదవండి: ‘అమెరికన్ కార్నర్’ కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం జగన్ గంజాయి సాగు, రవాణాపై ఉక్కుపాదం ► గంజాయ సాగు, రవాణాను అరికట్టాలి. ► క్రమం తప్పకుండా దాడులు నిర్వహించాలి. ► పోలీసు విభాగాలు సమన్వయంతో పనిచేయాలి. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు ► డ్రగ్స్‌కు వ్యతిరేకంగా విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. ► ఏ కాలేజీలోనైనా అలాంటి ఉదంతాలు కనిపిస్తే.. అక్కడ ప్రత్యేక దృష్టిపెట్టాలి. ► క్రమం తప్పకుండా విశ్వవిద్యాలయాలు, కాలేజీలపైన పర్యవేక్షణ ఉండాలి. ► కార్యాచరణ తయారుచేసి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలి. ► ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నామో వచ్చే సమావేశంలో తెలియజేయాలి. ► ఆరోగ్యానికి అత్యంత హానికరంగా మారిన గుట్కా విక్రయాలు, రవాణాపైన దృష్టిపెట్టాలి. చదవండి: Vaccination In AP: అత్యధిక డోసులు మహిళలకే.. ఎస్ఈబీ కార్యకలాపాలు: ►మద్యం అక్రమ రవాణా, తయారీలకు సంబంధించి ఇప్పటివరకూ 1,20,822 కేసులు నమోదు ► 1,25,202 మంది నిందితుల అరెస్టు ► 2020లో 63,310 కేసులు నమోదు ► 2021లో 57,512 కేసులు నమోదు ► 74,311 కేసులు నమోదు చేసిన ఎస్ఈబీ ► 46,511 కేసులు నమోదు చేసిన పోలీసులు ► 8,30,910 లీటర్ల అక్రమ మద్యం సీజ్ ► 8,07,644 లీటర్ల నాటుసారా స్వాధీనం ► 2,30,48,401 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం ► 29,491 వాహనాలు సీజ్ ఇసుక అక్రమ రవాణా ► ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి 12,211 కేసులు నమోదు ► 22,769 మంది నిందితుల అరెస్టు ► 5,72,372 టన్నుల ఇసుక స్వాధీనం ► 16,365 వాహనాలు జప్తు గంజాయి సాగు, రవాణాకు సంబంధించి 220 కేసులు నమోదు ► 384 మంది అరెస్టు ►18,686 కేజీల గంజాయి స్వాధీనం ►మార్చి 20, 2021 నుంచి మార్చి 31, 2021 మధ్య ఆపరేషన్ నయా సవేరా కింద స్పెషల్ ఆపరేషన్ ►69 కేసులు నమోదు, 174 మంది అరెస్టు ►2176 కేజీల గంజాయి స్వాధీనం ►3.065 ఎండీఎం స్వాధీనం ►330 అవేర్నెస్ క్యాంపులు నిర్వహించామని తెలిపిన అధికారులు. ఈ సమీక్షా సమావేశానికి ప్లానింగ్ అండ్ రిసోర్స్ మొబలైజేషన్ స్పెషల్ సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, డీజీపీ గౌతమ్ సవాంగ్, రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ ఎస్ రావత్, ఇంటెలిజెన్స్ చీఫ్ కే వీ రాజేంద్రనాథ్ రెడ్డి, గనులశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార విశ్వజిత్, ఎస్ఈబీ కమిషనర్ వినీత్ బ్రిజ్‌లాల్, ఎస్ఈబీ డైరెక్టర్ (స్పెషల్ యూనిట్స్) ఏ రమేష్ రెడ్డి ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
‘అక్రమ మద్యం వెనుక చంద్రబాబు హస్తం ఉందనే అనుమానం’
సాక్షి, అమరావతి: ప్రజల ఆరోగ్యం దృష్ట్యా దశల వారీగా మద్యపాన నిషేధం విధిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి తెలిపారు. కాగా, బెల్ట్‌షాపులు పెట్టి మద్యం విక్రయాలను ప్రోత్సహించింది ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడేనని విమర్శించారు. అసలు మద్య నియంత్రణ అనేది చంద్రబాబుకు ఇష్టం లేదని తెలిపారు. అక్రమ మద్యం సరఫరా వెనుక చంద్రబాబు ఉన్నారనే అనుమానం ఉందని నారాయణ స్వామి ఆరోపించారు. -
సారు పేరులోనే ‘లక్ష్మీ’ కళ.. వసూళ్లలో డిఫరెంట్ స్టైల్
సాక్షి, అనంతపురం: ఆయన పేరులోనే ‘లక్ష్మీ’ కళ ఉట్టిపడుతూ ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే వ్యవహారశైలీ ఉంటుంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందం. పొరుగు జిల్లా నుంచి బదిలీపై వచ్చిన కొన్నాళ్లకే అక్రమ వసూళ్లకు తెర లేపారు. ఏకంగా అక్రమ మద్యం సరఫరాదారులతో సమావేశం ఏర్పాటు చేసి.. నెల వారీ మామూళ్లు ఫిక్స్ చేశారు. ప్రభుత్వం విడతల వారీగా మద్య నిషేధానికి చర్యలు తీసుకుంటుండగా.. అందుకు చిత్తశుద్ధితో పనిచేయాల్సిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్) హిందూపురం సీఐ లక్ష్మీ దుర్గయ్య మాత్రం భిన్నంగా వెళ్లారు.సర్కారు లక్ష్యానికి తూట్లు పొడిచేలా అక్రమ వసూళ్లకు దిగారు. ఈ విషయం తెలిసి కంగుతిన్న ఉన్నతాధికారులు ఆయన్ను వెంటనే విధుల నుంచి తొలగించి దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. లక్ష్మీదుర్గయ్య ఎక్సైజ్ శాఖలో సీఐగా పని చేసేవారు. కర్నూలు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వర్తించారు. సెబ్ ఏర్పాటుతో అందులో విలీనమయ్యారు. సెబ్ సీఐగా కర్నూలు జిల్లా పంచలింగాల చెక్‌పోస్టులో పనిచేస్తూ.. ఈ ఏడాది జూన్ 15న హిందూపురానికి బదిలీపై వచ్చారు. పని రాక్షసుడనే పేరున్న ఈయన మామూళ్లు వసూలు చేయడంలోనూ దిట్ట అని తెలుస్తోంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో పనిచేసిన సమయంలో అప్పటి మద్యం సిండికేట్‌దారుల నుంచి డబ్బు తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డారు. అయితే.. పంచలింగాల చెక్‌పోస్టులో పనిచేసిన సమయంలో విస్తృత తనిఖీలు నిర్వహించి, పోలీసు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకోవడం గమనార్హం. అనతికాలంలోనే వసూళ్ల పర్వం ఆంధ్ర–కర్ణాటక సరిహద్దున ఉండే హిందూపురంలో అక్రమ మద్యానికి అడ్డుకట్ట పడటం లేదు. బెంగళూరు, బాగేపల్లి, చిక్‌బళ్లాపుర తదితర ప్రాంతాల నుంచి కొందరు కర్ణాటక మద్యాన్ని తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. వీరి ఆగడాలను కట్టడి చేయాల్సిన సెబ్ సీఐ లక్ష్మీదుర్గయ్య బాధ్యతలు చేపట్టిన కొన్ని రోజుల్లోనే వసూళ్ల బాట పట్టారు. అక్రమ మద్యం సరఫరాదారులతో సమావేశం ఏర్పాటు చేసి మరీ మామూళ్లు నిర్ధారించడం కలకలం రేపింది. తక్షణమే చర్యలు అక్రమార్కులపై ఉక్కుపాదం మోపాల్సిన అధికారే వారితో చేతులు కలిపారని సమాచారం అందుకున్న సెబ్ ఉన్నతాధికారి రామమోహన్ రావు తక్షణమే చర్యలకు ఉపక్రమించారు. ఆయన్ను విధుల నుంచి తప్పించి.. జిల్లా ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం ఆయనపై శాఖాపరమైన విచారణ జరుగుతున్నట్లు సమాచారం. అనంతరం చర్యలు తీసుకునే అవకాశముంది. చదవండి: రాహుల్ హత్య: చార్జర్ వైర్‌తో చంపేశారు -
బాబోయ్ బార్.. భయపడుతున్న యజమానులు
సాక్షి, సంగారెడ్డి: బార్‌షాప్‌ల లైసెన్స్‌లు పొందినవారు వాటిని ప్రారంభించేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదు. కోవిడ్ మూడో వేవ్ భయం వెంటాడుతుండటం, బారులో కూర్చుని మద్యం సేవించేందుకు వచ్చేవారి సంఖ్య తగ్గుతుండడమే దీనికి ప్రధాన కారణం. జిల్లాకు మంజూరైన కొత్త బార్లలో కనీసం మూడో వంతు కూడా ఇంకా ప్రారంభం కాలేదు. కరోనా భయం వెంటాడుతోంది ► సంగారెడ్డి జిల్లాలో ప్రస్తుతం 22 బార్లు ఉన్నాయి. ఇవి కాకుండా ప్రభుత్వం మరో 12 బార్లను మంజూరు చేసింది. జనాభా ప్రాతిపధికన ఈ కొత్త బార్లకు ఎక్సైజ్‌శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి మద్యం వ్యాపారుల నుంచి దరఖాస్తులు తీసుకుని డ్రా ద్వారా ఎంపిక చేసింది. ► డ్రాలో గెలుపొందిన వ్యాపారులు బార్‌ను ఎస్టాబ్లిష్ చేసుకునేందుకు మూడు నెలలు గడువుంటుంది. అయితే కోవిడ్ మూడో వేవ్‌పై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ బార్ల లైసెన్సులు పొందిన వ్యాపారులు బార్లను ప్రారంభించడాన్ని వాయిదా వేసుకుంటున్నారు. ► బార్ల ఎస్టాబ్లిష్మెంట్ కోసం ఇచ్చిన మూడు నెలల గడువుకు తోడు మద్యం వ్యాపారులు మరో రెండు నెలల గడువు ఇవ్వాలని ఎక్సైజ్‌శాఖ కమిషనరేట్‌లో దరఖాస్తు చేసుకున్నారు. ఈ రెండు నెలల అదనపు గడువు కూడా మరో పక్షం రోజుల్లో ముగుస్తుందని ఎక్సైజ్ అధికారులు పేర్కొంటున్నారు. ► జిల్లాకు మంజూరైన కొత్త బార్లలో కనీసం మూడో వంతు బార్లు కూడా ప్రారంభం కాలేదు. సంగారెడ్డి ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో మొత్తం నాలుగు కొత్త బార్లకు లైసెన్స్ మంజూరు కాగా, ఇప్పటివరకు కేవలం ఒకే ఒక కొత్త బారు తెరిచింది. ► జీహెచ్ఎంసీ పరిధిలోని బార్ల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. డ్రాలో బార్‌ను దక్కించుకొని ఎక్సైజ్ ట్యాక్‌ను కట్టిన మద్యం వ్యాపారులు కొందరు తమ బార్‌ను తాము నిర్వహించకుండా, ఇతరులకు ఇచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారని ఎక్సైజ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ► జిల్లాలో కొత్తగా సంగారెడ్డి, సదాశివపేట్ పట్టణాల్లో రెండేసి చొప్పున బార్లు మంజూరయ్యాయి. జహీరాబాద్, నారాయణఖేడ్లలో ఒక్కో బార్ మంజూరైంది. జీహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చే అమీన్పూర్ పరిధిలో రెండు బార్లు, బొల్లారంలో నాలుగు బార్లుకు లైసెన్స్‌లు మంజూరు చేసింది. ► జిల్లాలో కొత్త బార్లలో ఇప్పటివరకు నాలుగు బార్లు ప్రారంభమయ్యాయని సంగారెడ్డి ఎక్సైజ్ సూపరిండెంట్ గాయత్రిదేవి “సాక్షి’తో పేర్కొన్నారు. ► మెదక్ జిల్లాలో కొత్తగా మూడు బార్లకు డ్రా తీయగా, ఇప్పటివరకు రెండు బార్లు మాత్రమే ప్రారంభించేందుకు సమాయత్తమవుతున్నాయి. రామాయంపేట్‌కు మంజూరైన బార్ ఇప్పట్లో ప్రారంభమయ్యే అవకాశాలు లేవని ఎక్సైజ్ అధికారులు పేర్కొంటున్నారు. చదవండి: Afghanistan: ‘శవాలపై కూడా అత్యాచారాలకు పాల్పడతారు’ -
ఉత్తరప్రదేశ్‌లో జర్నలిస్టు దారుణ హత్య!
ప్రతాప్‌గఢ్: ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో ఏబీపీ న్యూస్‌చానల్ విలేకరి సులభ్ శ్రీవాస్తవ(42) అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. లిక్కర్ మాఫియా తన భర్తను పొట్టన పెట్టుకుందని ఆయన భార్య ఫిర్యాదు చేయడంతో పోలీసులు సోమవారం హత్య కేసు నమోదు చేశారు. సులభ శ్రీవాస్తవ మరణం ఉత్తరప్రదేశ్‌లో రాజకీయ దుమారం సృష్టిస్తోంది. జర్నలిస్టు మృతిపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని సమాజ్‌వాదీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు. సులభ్ శ్రీవాస్తవ మరణంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిజాన్ని వెలికితీసేందుకు అవిశ్రాంతంగా శ్రమిస్తున్న జర్నలిస్టుల ప్రాణాలను కాపాడుకోలేకపోతున్నామని వ్యాఖ్యానించారు. పోలీసుల కథనం ప్రకారం.. జర్నలిస్టు సులభ్ శ్రీవాస్తవ ఇటీవలే లిక్కర్ మాఫియాపై కీలక సమాచారం సేకరించాడు. దీని ఆధారంగా ఏబీపీ న్యూస్ చానల్‌పై పరిశోధనాత్మక కథనం ప్రసారమయ్యింది. తమ జోలికి రావొద్దంటూ లిక్కర్ మాఫియా నుంచి బెదిరింపులు వచ్చినట్లు ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు రక్షణ కల్పించాలని కోరుతూ సులభ్ శ్రీవాస్తవ పోలీసులకు లేఖ రాశాడు. ఆదివారం లాల్గంజ్లో వార్తల సేకరణ కోసం సులభ్ శ్రీవాస్తవ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. రాత్రి తిరిగి వచ్చాడు. తర్వాత సుఖ్‌పాల్ నగర్ ఇటుక బట్టీ వద్ద తీవ్ర గాయాలతో లేవలేని స్థితిలో కనిపించాడు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. అతడి ద్విచక్ర వాహనం కరెంటు స్తంభాన్ని ఢీకొట్టినట్లు అక్కడి దృశ్యాన్ని బట్టి తెలుస్తోంది. కానీ, లిక్కర్ మాఫియానే సులభ్‌ను హత్య చేసినట్లు ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. -
మద్యం హోం డెలివరీకి ఢిల్లీ ప్రభుత్వం అనుమతి
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఇకపై మద్యం ఇంటికే డెలివరీ కానుంది. యాప్ లేదా వెబ్సైట్ ద్వారా ఆర్డర్ చేస్తే మద్యం ఇంటికి చేరుకొనేలా ఢిల్లీ ప్రభుత్వం చట్టం చేయనుంది. ఢిల్లీ ఎక్సైజు నియమాల సవరణ చట్టం –2021 ద్వారా ఇది అమల్లోకి రానుంది. దీనికి సంబంధించిన ప్రభుత్వ గెజిట్ ప్రటనను ఢిల్లీ ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. బహిరంగంగా అమ్మే లైసెన్సు కలిగిన హోటళ్లు, క్లబ్బులు, బార్ల నుంచి సైతం మద్యాన్ని బాటిళ్ల ద్వారా అందుకునే వీలు ఈ చట్టం ద్వారా కలగనుంది. యాప్, వెబ్సైట్ ద్వారా చేసిన ఆర్డర్లకు మాత్రమే డెలివరీ సదుపాయం ఉంటుంది. కేవలం ఇంటి చిరునామాలకు మాత్రమే డెలివరీ చేయనున్నారు. ఆఫీసులు, సంస్థలు, హోటళ్లకు మాత్రం డెలివరీ ఉండదు. ఈ నిర్ణయాన్ని భారత ఆల్కహాలిక్ బేవరేజెస్ కంపెనీల సమాఖ్య (సీఐఏబీసీ) స్వాగతించింది. లెఫ్టినెంట్ గవర్నర్ పేరుతో ఢిల్లీ ఆర్థిక విభాగం ఈ ప్రకటనను జారీ చేసింది. దీనిపై ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ మండిపడ్డాయి. ఇలా మద్యాన్ని ఇళ్లకు డెలివరీ చేయడం దేశ సంస్కృతికి విరుద్ధమని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా వ్యాఖ్యానించారు. ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అనిల్ కుమార్ మాట్లాడుతూ. నగరంలో కోవిడ్ 19ను అరికట్టడానికి బదులు కేజ్రీవాల్ ప్రభుత్వం మద్యాన్ని డెలివరీ చేయడంలో బిజీగా ఉందంటూ విమర్శించారు. చదవండి: తాజాగా లక్షా 27 వేల కేసులు, 3 వేల మరణాలు -
మద్యం ప్రియులు.. మే నెలలో ఎంత తాగారో తెలుసా!
సాక్షి, వైరా: ఎండల తీవ్రత పెరగడంతో మద్యం ప్రియులు చల్లటి బీర్లను తాగేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీంతో వాటి విక్రయాలు అమాంతంగా పెరిగి పోయాయి. ఓ వైపు కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ.. మే నెలలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఎండ తాపం నుంచి సేద తీరేందుకు మందుబాబులు చల్లటి బీర్లు తాగేశారు. గతేడాది జనవరి నుంచి మే నెల వరకు రూ.61 కోట్ల విలువ చేసే బీర్లను తాగగా, ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు రూ.89.83 కోట్ల విలువైన బీర్లు లాగించేశారు. డిమాండ్‌కు తగ్గట్లుగా సరఫరాకు ఇబ్బంది లేకుండా డిపో అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 167 మద్యం దుకాణాలు, 47 బార్లు, 3 క్లబ్‌లు ఉన్నాయి. వాటితో పాటు అనధికారికంగా వేల సంఖ్యలో బెల్టుషాపుల్లో బీర్ల అమ్మకాలు సాగిస్తున్నారు. అదనపు వసూళ్లు.. వ్యాపారులు కొన్ని చోట్ల సిండికేట్‌గా మారి బీరు ధరపై అదనంగా వసూలు చేస్తూ మందుబాబుల జేబులకు చిల్లులు పెట్టి దండుకుంటున్నారు. జిల్లాలో చాలా మద్యం దుకాణాల్లో బీర్లు దొరకడం లేదు. పక్కనే ఉన్న బెల్టు దుకాణాల్లో మాత్రం యథేచ్ఛగా బీర్లు అమ్ముతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో భానుడి ప్రతాపం విపరీతంగా పెరిగింది. ఇక అప్పటి నుంచి బీర్ల అమ్మకాలు పెరిగి పోయాయి. జనవరి, ఫిబ్రవరి నెలల్లో పగటి పూట 30 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదు కాగా, రాత్రి పూట వాతావరణం చల్లగా మారింది. మార్చి, ఏప్రిల్ నెలల్లో ఎండలు ముదిరిపోయాయి. ఉష్ణోగ్రతలు కూడా 40 డిగ్రీలకు చేరకున్నాయి. దీంతో జనాలు ఎండ వేడికి అల్లాడి పోయారు. ఈ సమయంలో ఎండ వేడిని తట్టుకోవడానికి మందు బాబులు చల్లని బీర్ల వైపు మొగ్గు చూపారు. దీంతో మార్చి నుంచి మే నెల వరకు 60 శాతానికి పైగా విక్రయాలు పెరిగాయి. మొత్తం మీద 5 నెలల్లోనే మద్యం ప్రియులు అక్షరాలా రూ.89.83 కోట్ల విలువ చేసే బీర్లు తాగేశారు. గతేడాది, ఈ ఏడాది అమ్మకాలు ఇలా.. 2020 లో బీర్లు (కేసులు) 2021లో బీర్లు(కేసులు) జనవరి రూ.16 కోట్లు 1.18 లక్షలు రూ.17 కోట్లు 1.20 లక్షలు ఫిబ్రవరి రూ.19 కోట్లు 1.42 లక్షలు రూ.14 కోట్లు 83 వేలు మార్చి రూ.11 కోట్లు 86 వేలు రూ.22 కోట్లు 1.27 లక్షలు ఏప్రిల్ లాక్డౌన్ -------- రూ.22 కోట్లు 1.30 లక్షలు మే రూ.15 కోట్లు 90 వేలు రూ. 14.83 కోట్లు 88 వేలు చదవండి: మందుబాబు ఆత్రం.. రూ1.5లక్షలు గోవింద -
Lockdown ఎఫెక్ట్: రెండు రోజుల్లోనే రూ.200 కోట్లకు పైగా తాగేశారు
సాక్షి, హైదరాబాద్: కరోనా కట్టడి కోసం తెలంగాణలో లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ప్రకటనతో మందు బాబులు బెంబెలేత్తారు. మద్యం దుకాణాల వద్దకు పరుగు తీశారు. పది రోజులకు సరిపడా మద్యాన్ని ఒక్కసారే కొనుగోలు చేశారు. నిన్న ఒక్క రోజే ఏకంగా 125 కోట్ల రూపాయల విలువ చేసే మద్యం కొనుగోలు చేశారంటే.. పరిస్థితిని ఊహించుకోవచ్చు. ఇక నేటి నుంచి లాక్డౌన్ అమల్లోకి రాగా.. ఉదయం 6-10 గంటల వరకే అన్ని కార్యకలపాలకు అనుమతిచ్చారు. ఇక ఇవాళ ఒక్కరోజు అది కూడా 4 గంటల వ్యవధిలో తెలంగాణలో 94 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి. ఈనెల 1 నుంచి 12 వరకు అన్ని డిపోలలో 770 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరగ్గా.. కేవలం నిన్న, ఈ రోజు(మే 11,12) ఏకంగా 219 కోట్ల రూపాయల అమ్మకాలు జరగడం గమనార్హం. ఇక తెలంగాణలో మొత్తం 2,200 మద్యం దుకాణాలు ఉన్నాయి. చదవండి: లాక్డౌన్: వైన్స్, మార్ట్‌ల్లో మద్యం ఖాళీ -
లాక్డౌన్: వైన్స్, మార్ట్‌ల్లో మద్యం ఖాళీ
సాక్షి, హైదరాబాద్: ఒక్కసారిగా తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ అని ప్రకటించగానే మందుబాబులు షాక్‌కు గురయ్యారు. పది రోజుల లాక్డౌన్ ప్రకటన వెలువడిన వెంటనే మద్యంప్రియులు వైన్స్ దుకాణాలు, మార్ట్‌లకు పరుగులు పెట్టారు. గతేడాది అనుభవం దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్త చర్యగా మద్యం కొనుగోలుకు ఎగబడ్డారు. ఏ మద్యం దుకాణం చూసినా కూడా మధ్యాహ్నం నుంచి రాత్రి 8 గంటల వరకు కిటకిటలాడాయి. కొన్ని చోట్ల కిలోమీటర్ల మేర క్యూలైన్ కొనసాగాయి. మద్యం దుకాణాలు ఉదయం 6 నుంచి 10 గంటలకు తెరచి ఉంటుందని తెలిసినా కూడా మందు కోసం ఎగబడ్డారు. సంపన్నులతో పాటు పేద, మధ్యతరగతి ప్రజలు కూడా తమ స్థాయికి మించి మద్యం కొనుగోళ్లు చేశారు. కొందరు తమ వద్ద డబ్బు లేకున్నా అప్పు చేసి మరి మద్యం తీసుకెళ్లారు. ఈ పది రోజులకు సరిపడా తీసుకెళ్లారు. మరికొందరేమో లాక్డౌన్ గడువు పెరుగుతుందని భావించి భారీగా కొనుగోలు చేశారు. మద్యం దుకాణాలకు ఒక్కసారిగా డిమాండ్ పెరగడంతో నిర్వాహకులు, యజమానులు ఒత్తిడిని తట్టుకోలేకపోయారు. ఉన్న అరకొర సిబ్బందితోనే విక్రయాలు కొనసాగించారు. మద్యంప్రియులు ఒక్కసారిగా ఎగబడడంతో మద్యం దుకాణాల్లో స్టాకంతా అయిపోయింది. నో స్టాక్ బోర్డులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది సాధారణ మద్యం దుకాణం నుంచి వైన్స్ మార్ట్ వరకు ఇదే పరిస్థితి. ఒక వైన్స్ మార్ట్‌లో మద్యం సీసాలన్నీ ఖాళీ అవడంతో కబోర్డులన్నీ వెలవెలబోయాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: రాష్ట్రాలకు నెట్టేసి నోరు మెదపని ప్రధాని మోదీ చదవండి: కరోనా ఫండ్‌తో జల్సాలు.. విలాసమంటే నీదే రాజా హైదరాబాద్‌లోని ఓ వైన్స్ మార్ట్‌లో ఖాళీగా ఉన్న ర్యాక్‌లు -
మీ కక్కుర్తి తగలడా.. ప్రాణం కన్న బీరే ముఖ్యమా?
బెంగళూరు: కోవిడ్ సెకండ్ వేవ్ దేశంలో విలయం సృష్టిస్తోంది. మహమ్మారి కట్టడి కోసం ప్రభుత్వాలు ఎన్నో కఠిన చర్యలను తీసుకుంటున్నప్పటికి జనాలు మాత్రం కొంచెం కూడా భయపడటం లేదు. మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం, శానిటైజేషన్ వంటి వాటిని అస్సలు పట్టించుకోవడం లేదు. అన్నింటి కంటే దారుణం ఏంటంటే.. గుంపులు గుంపులుగా తిరుగుతూ.. ఎక్కడికక్కడ కోవిడ్ నియమాలను ఉల్లంఘిస్తున్నారు. జనాలకు తమ ప్రాణల గురించి ఏ మాత్రం ఆలోచన లేదు. ఈ వీడియో చూస్తే.. ఇది ముమ్మాటికి నిజమే అనిపిస్తుంది. మద్యం లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఇంకేముంది.. ఫ్రీగా మందు లభిస్తుండటంతో జనాలు ఎగబడ్డారు. ఒకరిని ఒకరు తోసుకుంటూ.. మందు బాటిళ్ల కోసం పరిగెత్తారు. కరోనా వస్తే తగ్గుతుంది.. కానీ మందు ఫ్రీగా లభిస్తుందా అన్నట్లు ఉంది వారి ధోరణి. ఈ సంఘటన కర్ణాటక చిక్‌మంగళూరులో చోటు చేసుకుంది. మద్యం లోడుతో వెళ్తున్న లారీకి యాక్సిడెంట్ అయ్యి బోల్తా పడింది. ఇది గమనించిన చుట్టుపక్కల వారు డ్రైవర్ పరిస్థితి ఎలా ఉంది ఏంటి అని కూడా ఆలోచించకుండా మందు బాటిళ్ల కోసం ఎగబడ్డారు. క్షణాల్లో విషయం సమీప గ్రామాలకు పాకడం.. వారు మందు బాటిళ్ల కోసం పరిగెత్తుకు రావడంతో.. అక్కడ వందలాదిగా జనాలు పోగయ్యారు. ఇక బీరు బాటిళ్ల కోసం ఒకరిని ఒకరు తోసుకుంటూ.. అందినకాడికి చంక బెట్టుకుని వెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు జనాలను కంట్రోల్ చేయడానికి ప్రయత్నించినప్పటికి కుదరకపోవడంతో.. చివరకు లాఠీ చార్జీ చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇది చూసిన నెటిజనులు మీ కక్కుర్తి తగలడా.. ప్రాణాల కంటే మందే ముఖ్యమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: కరోనా తీవ్రరూపం: కిట్లు లేవు.. టీకాలు లేవు! -
మందు బాబుల తెలివి.. వైరలవుతోన్న వీడియో
-
మేం ఇంకా ఇంత ఎదగలేదురా బాబు: ఆనంద్ మహీంద్రా
ముంబై: ఇళ్లలో భూగర్భంలో గదులుండటం సహజం. కానీ వాహనాల్లో ఎప్పుడైనా అండర్ గ్రౌండ్ స్టోరేజీ గదులను చూశారా.. లేదా. అయితే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ వీడియో చూస్తే.. మీకు వాహనాల్లో కూడా అండర్‌గ్రౌండ్ గదులను ఎలా నిర్మించాలో ఓ ఐడియా వస్తుంది. ట్రక్కులో అండర్ గ్రౌండ్ స్టోరేజీ ఓకే కానీ.. దాన్ని ఇలాంటి పనులకు వినియోగించడం కాస్త నిరాశపరుస్తుంది. వీడియోతో షేర్ చేయడంతో పాటు ‘‘నేను, నా కంపెనీ ఇంకా ఇంత ఎదగలేదురా బాబు.. భవిష్యత్తులో కూడా ఇలాంటి పనులు చేయమంటున్నారు’’ ఆనంద్ మహీంద్రా. ఆ వివరాలు.. వీడియోలో ముందు ఓ పికప్ ట్రక్కు కనిపిస్తుంది. చూడ్డానికే అంతా బాగానే ఉంది.. సమస్య ఏంటి.. పోలీసులు ఏం గాలిస్తున్నరబ్బా అనిపిస్తుంది. ఆ తర్వాత వారు ట్రక్కు కింద భాగంలో ఓ డ్రా బయపడింది. బయటకు కనిపించకుండా అమర్చిన డ్రాలో వందల సంఖ్యలో మద్యం బాటిళ్లు, కార్టన్లు దర్శనమిచ్చాయి. ఈ వీడియో చూసిన వారంతా వీరి అతి తెలివికి కళ్లు తేలేస్తారు. దీనిపై ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ.. తమ పికప్ ట్రక్ డిజైనింగ్‌లో ఇది భాగం కాదని.. భవిష్యత్‌లోనూ దీన్నెప్పటికీ భాగం చేయమంటూ స్పష్టత ఇచ్చారు. ‘భయంకరమైన తెలివైనవాడు. సరుకు రవాణాకు కొత్త అర్థం ఇచ్చాడు! మా పరిశోధనా కేంద్రంలో పికప్ ట్రక్ డిజైనింగ్ మార్పుల్లో ఈ ఆలోచనకు తావు లేదు. ఎప్పటికీ ఉండదు’ అంటూ దాన్ని ఉపయోగించిన తీరును మహీంద్రా వ్యతిరేకించారు. అయితే ఆ ట్రక్కు, అందులోని మందు బాటిళ్లను సీజ్ చేసిన ప్రాంతం వివరాల గురించి ఎలాంటి సమాచారం లభించలేదు. -
పీకలదాక మెక్కారు.. బిల్లు కట్టమంటే తప్పుడు కేసులు
లక్నో: కొన్ని పాత సినిమాల్లో పోలీసులు హోటల్‌కు వెళ్లడం.. బాగా తినడం.. బిల్లు కట్టమంటే.. ‘నా దగ్గరే డబ్బులడుగుతావా.. జైలుకెళ్తావా ఏంటి’ అంటూ బెదిరించే సీన్లు చాలా సార్లు చూశాం. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి సంఘటన వెలుగు చూసింది. బిల్లు కట్టమని అడిగిన పాపానికి ఓ ధాబా ఓనర్, అతడి కుటుంబ సభ్యుల మీద డ్రగ్స్, మద్యం అక్రమ రవాణ చేస్తున్నారంటూ కేసులు పెట్టారు పోలీసులు. విషయం కాస్త పెద్దది కావడంతో రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు ఇందుకు బాధ్యులైన వారిని సస్పెండ్ చేశారు. ఆ వివరాలు.. ఉత్తరప్రదేశ్ ఈటా జిల్లాలో బాధితుడు ఓ ధాబా నడుపుతున్నాడు. ఈ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరి 4న మధ్యాహ్నం ఓ ఎస్సై, ఇద్దరు కానిస్టేబుల్స్ బాధితుడి ధాబాకు వచ్చి భోజనం చేశారు. 400 రూపాయల బిల్లు అయితే వారు కేవలం 100 రూపాయలు మాత్రమే ఇచ్చారు. ఇదెక్కడి న్యాయం.. పూర్తి బిల్లు చెల్లించమని కోరితే.. ధాబా సిబ్బందిని తిడుతూ.. మీ అంతు చూస్తాం అని బెదిరించారు. ఈ ఘటన జరిగిన 40 రోజుల తర్వాత పోలీసులు రెండు జీపుల్లో ఆ ధాబా వద్దకు వచ్చి.. అక్కడ పని చేస్తున్న 9 మందిని జైలుకు తీసుకెళ్లారు. వీరంతా మద్యం, గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారని.. అందుకే అరెస్ట్ చేశామని తెలిపారు. అంతేకాక నిందితుల వద్ద నుంచి ఆరు దేశీ తుపాకులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. (ఫోటో కర్టెసీ: ఎన్డీటీవీ) ఈ క్రమంలో సదరు ధాబా ఓనర్ మాట్లాడుతూ.. ‘‘గతంలో బిల్లు కట్టమని అడిగినందుకు అధికారులు మాపై కక్ష్య కట్టారు. కావాలనే మా మీద అక్రమ కేసులు పెట్టారు. తాగి వచ్చి నా సోదరుడు, సిబ్బందిపై దాడి చేశారు. మా దగ్గర తుపాకులు, గంజాయి దొరికిందని ప్రచారం చేస్తున్నారు. మొత్తం 11 మందిని అరెస్ట్ చేశారు. ఒక్కరిని విడిచిపెట్టారు’’ అని తెలిపారు. ఈ వివాదం కాస్త ముదరడంతో జిల్లా ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. ఈ ఘటనకు బాధ్యులైన ఎస్సై, ఇద్దరు కానిస్టేబుల్స్‌ని సస్పెండ్ చేశారు. విచారణకు ఆదేశించాము అని తెలిపారు. చదవండి: సోషల్ మీడియానా మజాకా: వైరల్ వీడియో -
తెగ తాగేశారు.. భారీగా ఆదాయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మద్యానికి డిమాండ్ ఫుల్లుగా పెరిగింది. గతేడాది ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 28 వరకు ఏకంగా రూ.24,814 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయింది. ఇందులో వ్యాట్ పోగా రూ.15 వేల కోట్లకుపైగా ఎక్సైజ్ శాఖకు ఆదాయం వచ్చింది. ఇక లిక్కర్ బాటిళ్ల వారీగా చూస్తే.. ఈ 11 నెలల కాలంలో 2.4 కోట్ల కేసుల బీర్లు, మూడు కోట్ల కేసులకుపైగా లిక్కర్ విక్రయాలు నమోదుకావడం గమనార్హం. లక్ష్యం రూ.16 వేల కోట్లు కరోనా కారణంగా రాష్ట్ర ప్రజలతోపాటు ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి కూడా దెబ్బతిన్నది. 2020–21 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో పన్నుల రూపంలో వచ్చే ఆదాయ వనరులేవీ లక్ష్యాన్ని చేరుకునే పరిస్థితి లేకుండా పోయింది. కానీ ఎక్సైజ్ ఆదాయ అంచనాలు మాత్రం లక్ష్యాన్ని చేరుకుంటున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్ రాబడుల కింద రూ.16 వేల కోట్లు సమకూర్చుకోవాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకోగా.. మరో నెల గడువు ఉండగానే రూ.15 వేల కోట్ల వరకు ఆదాయం వచ్చింది. మార్చిలో మిగతా వెయ్యి కోట్లకన్నా ఎక్కువే రాబడి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే గతేడాది లాక్డౌన్ టైంలో మార్చి 22 నుంచి మే 6వ వరకు 46 రోజుల పాటు మద్యం విక్రయాలు జరగలేదు. ఆ టైంలో కూడా వైన్‌షాపులు, బార్లు తెరిచి ఉంటే మరో 2వేల కోట్ల మేర ఆదాయం ఎక్కువగా వచ్చేదని ఎక్సైజ్ శాఖ అధికారులు చెప్తున్నారు. మొత్తమ్మీద జీఎస్టీ, అమ్మకపు పన్ను, రిజిస్ట్రేషన్లు వంటి కీలక రంగాల నుంచి ఆదాయం తగ్గినా.. మద్యం రాబడి పెరగడంతో ఖజానాకు ఇబ్బంది తప్పిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రోజుకు 5.6 లక్షల లీటర్ల బీర్లు.. 8.22 లక్షల లీటర్ల లిక్కర్ గత 11 నెలల మద్యం విక్రయాల లెక్కలను చూస్తే.. రాష్ట్రంలో రోజుకు 5.6 లక్షల లీటర్ల బీర్లు, 8.22 లక్షల లీటర్ల లిక్కర్ తాగేస్తున్నారని వెల్లడవుతోంది. ఈ 11 నెలల్లో 3 కోట్ల కేసులకుపైగా లిక్కర్, 2.4 కోట్ల కేసులకుపైగా బీర్లు అమ్ముడయ్యాయి. ఒక్కో లిక్కర్ కేసులో 9 లీటర్ల మద్యం, బీర్ కేసులో 7.8 లీటర్ల బీర్ ఉంటుంది. ఈ లెక్కన గత 334 రోజుల్లో మందుబాబులు.. లిక్కర్, బీర్లు కలిపి రోజుకు 14 లక్షల లీటర్ల వరకు తాగుతున్నారు. ఇక ఈ ఏడాది జనవరిలో రాష్ట్రంలో 28 లక్షల కేసుల లిక్కర్, 33 లక్షల కేసుల బీర్ అమ్ముడయ్యాయి. వీటి విలువ 2,727 కోట్లు. ఫిబ్రవరిలో 28 రోజులే ఉండడం, ఇతర కారణాలతో డిపోల నుంచి మద్యం కొంత తక్కువ వెళ్లింది. జనవరి కంటే 3 లక్షల కేసుల లిక్కర్, 5 లక్షల కేసుల బీర్లు తక్కువగా అమ్ముడుపోయాయి. అయితే మార్చిలో మద్యం విక్రయాలు మళ్లీ పెరుగుతాయని ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి. -
నిషా ఫ్రమ్ ఒడిశా..
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : ఒడిశా వసారాలో సారా నిరంతరం ప్రవహిస్తోంది. దారిలో మన పల్లెలనూ ముంచెత్తుతోంది. జి ల్లాలోని సరిహద్దు గ్రామాలు సారా తయారీ స్థావరాలుగా మారుతున్నాయి. ఇలా 98 గ్రామాల్లో నాటు సారా తయారీ, విక్రయాలు జరుగుతున్నట్టు ఇప్పటికే అధికారులు గుర్తించారు. దాదాపు 200 మంది సారా తయారీ, విక్రయాలపై ఆధారపడి పని చేస్తున్నట్టుగా ప్రాథమికంగా అంచనా వేశారు. ఇప్పుడీ ప్రాంతాలపై స్పెషల్ ఇన్విస్టిగేషన్ బ్యూరో అధికారులు దృష్టి సారించారు. ఎన్నో మార్గాలు.. ఒడిశాను ఆనుకుని ఉన్న కొత్తూరు, పాతపట్నం, ఇచ్ఛాపురం, మందస, భామిని, మెళియాపుట్టి మండలాల్లోని సరిహద్దు గ్రామాల్లో సారా తయారు చేస్తున్నారు. అలాగే తీర ప్రాంత గ్రామాల్లోకి కూడా ఒడిశా నుంచి సారా వస్తోంది. సముద్రంలో బోట్ల ద్వారా రవాణా చేసి, మన జిల్లాకు చెందిన మత్స్యకార బోట్లకు అందజేస్తున్నారు. అక్కడి నుంచి కవిటి, సోంపేట, ఇచ్ఛాపురం, సంతబొమ్మాళి, పోలాకి, గార, ఎచ్చెర్ల, లావేరు, రణస్థలం తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇదంతా గుట్టు చప్పుడు కాకుండా సాగిస్తున్నారు. అలాగే విజయనగరం ఒడిశా సరిహద్దు గ్రా మాల నుంచి వీరఘట్టం, పాలకొండ తదితర ప్రాంతాలకు నాటుసారాను తీసుకొస్తున్నారు. పల్లె పల్లెకూ.. అధికారులు ఇప్పటివరకు 220 కార్డన్ సెర్చ్‌లు నిర్వహించగా ఈ వివరాలు బయటపడ్డాయి. ముఖ్యంగా గంగాపూర్‌కు ఆనుకుని ఉన్న బాతుపురం, విక్రంపురం గ్రామాలకు కొండ పై నుంచి నాటుసారా తీసుకొస్తున్నారు. కావడిలు వేసుకుని బ్యాగులతో తీసుకొస్తున్నారు. మందస మండలం కొండలోగాం, పుట్టు లోగాం, చాపరాయి, పతగాం, లువగడ తదితర ప్రాంతాలకు, సముద్ర తీర ప్రాంత గ్రామాలైన డంకూరు, కవిటి, కపాసకుద్ది తదితర గ్రామాలకు ఈ రకంగా నాటు సారా వస్తోంది. అలాగే విజయనగరం ఒడిశా సరిహ ద్దు నుంచి రెల్లివీధి, తెట్టంగి, మీనానగరం, హుస్సేన్‌పురం, పనసనందివాడ, కోతుల గుమ్మడి తదితర ప్రాంతాలకు నాటుసారా రవాణా అవుతోంది. వీటిన్నింటినీ స్పెషల్ ఇన్విస్టిగేషన్ అధికారులు ఇప్పటికే గుర్తించారు. 18 ఎంట్రీ పా యింట్లు ఉన్నట్టు నిర్ధారించుకున్నారు. దాదాపు 98 గ్రామాలు నాటుసారా ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించారు. ఇప్పటికే 3535కేసులు పెట్టి, 3496మందిని అరెస్టు చేసి, 770 వాహనాలను సీజ్ చేశారు. 33,670 లీటర్ల ఐడీ లిక్కర్, 6లక్షల 27వేల 335లీటర్ల బెల్లం ఊటలు, 1864 కిలోల బెల్లం, 3,633 నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ పట్టుకున్నారు. బెల్లం ఊటలను ఎక్కడికక్కడ ధ్వంసం చేశారు. రసాయనాలు ఉన్నాయా..? సోంపేట మండలం సిరిమామిడిలో చోటు చేసుకున్న సంఘటనతో నాటుసారాలో మిథైనల్ ఏదైనా కలుపుతున్నారా? అనేది తెలుసుకోవడానికి నమూనాలను కెమికల్ ల్యాబ్‌కు పంపించగా అలాంటిదేమీ లేదని తేలింది. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని బాధ్యులుగా గుర్తించి ఇద్దర్ని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనతో పోలీసు, ఎక్సైజ్ అధికారులు మరింత సీరియస్‌గా దృష్టి సారించారు. ఒడిశా నుంచి పూర్తి స్థాయి లో సహకారం కొరవడటంతో అక్కడకక్కడ జిల్లాలోకి నాటు సారా రవాణా అవుతోంది. ఈ నేపథ్యంలో మున్ముందు ఒడి శా అధికారులతో సంప్రదింపులు జరిపి జాయింట్ ఆపరేషన్ చేసి నాటుసారా తయారవుతున్న సరిహద్దు గ్రామాలపై దా డులు చేసి నియంత్రించడానికి కార్యాచరణ రూపొందించా రు. ఒకవైపు ఇలా చేస్తూనే మరోవైపు జాతీయ రహదారిపై 36పాయింట్ల వద్ద, సముద్ర తీర ప్రాంతంలోని 28పాయింట్ల వద్ద, విజయనగరం–ఒడిశా సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి 36పాయింట్ల వద్ద, ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి కొత్తూరు మీదుగా వచ్చే ప్రాంతాలకు సంబంధించి కొన్ని పాయింట్లు పెట్టుకుని తనిఖీలు చేసే కార్యక్రమాలను చేపడుతున్నారు. ఒడిశా నుంచే వస్తోంది.. ఒడిశా సరిహద్దు గ్రామాల నుంచి నాటుసారా జిల్లాలోకి వస్తోంది. ఇప్పటికే పలు ప్రాంతాలను గుర్తించాం వాటిపై దాడులు చేస్తున్నాం. పలు కేసులు కూడా పెట్టాం. లక్షలాది లీటర్ల బెల్లం ఊటలు «ధ్వంసం చేశాం. కరోనా వ్యాప్తి చెందిన దగ్గరి నుంచి ఒడిశా నుంచి సహకారం కొరవడింది. త్వరలోనే వారితో సంప్రదింపులు చేసి జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తాం. తయారీదారుల్లో కూడా అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడతాం. – శ్రీనివాసరావు, ఏఎస్పీ, స్పెషల్ ఇన్విస్టిగేషన్ బ్యూరో -
దారుణం: పెగ్ పోయలేదని ప్రాణం తీశాడు
లక్నో : మద్యం విషయంలో చోటుచేసుకున్న గొడవ కారణంగా ఓ నిండు ప్రాణం బలైంది. పెగ్ పోయలేదన్న కోపంతో ఓ వ్యక్తి తన స్నేహితుడ్ని దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని శామ్లిలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శామ్లి జిల్లాకు చెందిన జస్బిర్ అనే వ్యక్తి ఐదు రోజుల క్రితం స్నేహితుడు క్రిష్ణపాల్‌తో కలిసి మద్యం తాగుతున్నాడు. ఈ నేపథ్యంలో క్రిష్ణపాల్ మద్యం అయిపోయింది. జస్బిర్‌ను ఓ పెగ్ పోయమని అడిగాడు. (చపాతీలు చల్లగా ఉన్నాయని డాబా యజమానిని కాల్చేశాడు) తన దగ్గర కూడా మద్యం తక్కువగా ఉందని చెప్పి, బస్బిర్ ఇందుకు ఒప్పుకోలేదు. ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన క్రిష్ణపాల్ పదునైన ఆయుధంతో జస్బిర్‌ను హత్య చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ శుక్రవారం నిందితుడ్ని అదుపులోకి తీసుకుని విచారించారు. ఓ పెగ్ పోయనందుకే జస్బిర్‌ను హత్య చేసినట్లు క్రిష్ణపాల్ అంగీకరించాడు. -
‘రాష్ట్రంలో తగ్గిన 60 శాతం బీర్ వినియోగాలు’
సాక్షి, గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన బహుముఖ కార్యక్రమాల ఫలితంగా రాష్ట్రంలో 40 శాతం లిక్కర్ వినియోగం తగ్గిందని మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లం రెడ్డి లక్ష్మణ రెడ్డి అన్నారు. అలాగే 60 శాతం బీర్ వినియోగం కూడా తగ్గందన్నారు. గుంటూరు రేంజ్ డీఐజీగా నియమితులైన డా. త్రివిక్రమ వర్మను బుధవారం వల్లం రెడ్డి లక్ష్మణ రెడ్డి అభినందించారు. ఈ మేరకు బుధవారం డీఐజీ కార్యాలయంలో డా. త్రివిక్రమ వర్మను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో నేరాలు సైతం 18 శాతం తగ్గాయని డీఐజీకి వివరించారు. రాష్ట్రంలో దశల వారీ మద్య నిషేధం అమలులో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ పాత్ర గణనీయంగా పెరిగిందన్నారు. పోలీస్ పాత్ర పెరగటం హర్షణీయమని, తద్వారా సత్ఫలితాలు వస్తున్నాయని వివరించారు. చదవండి: వారి రక్షణే మా ప్రాధాన్యం: సీఎం జగన్ "సెబ్ " ఏర్పడక ముందు జనవరి 2020 నుంచి మే15 వరకు సగటున ప్రతి నెల 3,800 కేసులు నమోదయ్యాయని, 3500 మంది అరెస్టు అయ్యారని వల్లరెండ్డి లక్ష్bమణ రెడ్డి తెలిపారు. ప్రతి నెల ఆరు వేల లీటర్ల అక్రమ మద్యం దొరికిందని, 700 వాహనాలను పట్టుకున్నారని అన్నారు. అదే "సెబ్ " ఏర్పడిన తర్వాత మే 15 నుంచి అక్టోబర్ 20 వరకు ప్రతి నెలా సగటున 10, 200 కేసులు నమోదు అవుతున్నాయని, 12800 మంది అరెస్టు అవుతున్నారని పేర్కొన్నారు. ప్రతి నెల 82 వేల లీటర్ల అక్రమ మద్యం దొరుకుతుందని, ప్రతి నెల 3600 వాహనాలను పట్టుకోవడం జరుగుతుందని తెలిపారు. మద్యం అక్రమార్కులపై "సెబ్ " ఉక్కుపాదం మోపుతుందన్నారు. దీనిపై డీఐజీ స్పందిస్తూ.. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో ఎలాంటి అక్రమాలు జరిగినా తమ దృష్టికి తీసుకొస్తే సత్వర చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. -
సారా కట్టడికి ‘నవోదయం’
సాక్షి, అమరావతి: మద్యం నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(ఎస్ఈబీ) ఇప్పుడు నాటుసారా కట్టడిపైనా దృష్టి సారించింది. ఇందుకోసం ‘నవోదయం’ పేరుతో ప్రత్యేక కార్యాచరణ అమలులోకి తెచ్చింది. ఇప్పటికే అన్ని జిల్లాల్లోనూ ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. సారా తయారీ, అక్రమ మద్యంపై ఎప్పటికప్పుడు సమాచారం అందించే వేగుల వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా నాటుసారా తయారీ కేంద్రాల లెక్కలు తేల్చింది. అవి ఎక్కడ? ఎన్ని ఉన్నాయి? ఎవరు తయారు చేస్తున్నారు? వంటి వివరాలను సేకరించింది. ఎస్ఈబీ చేపట్టిన కార్యాచరణలో కీలక అంశాలు ఇవి. ⇔ రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని 79 పోలీస్స్టేషన్ల పరిధిలో 191 మండలాల్లో మొత్తం 682 నాటుసారా తయారీ కేంద్రాలను గుర్తించారు. ⇔ నాలుగున్నర నెలల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఈబీ బృందాలు జరిపిన దాడుల్లో 19,567 మందిపై కేసులు నమోదు చేశారు. నాటుసారా 2,58,448 లీటర్లు, సారా తయారీ కోసం సిద్ధం చేసిన ఊట 57,21,704 లీటర్లు ధ్వంసం చేశారు. సారాను తరలించేందుకు ఉంచిన 2,956 వాహనాలు, సారా తయారీ కోసం ఉంచిన 2,08,795 కిలోల బెల్లంను స్వాధీనం చేసుకున్నారు. ⇔ ఎస్ఈబీ బృందాలు సారా తయారీదార్లను గుర్తించి ప్రజారోగ్యాన్ని దెబ్బతీసే చర్యలు వద్దంటూ మొదట కౌన్సెలింగ్ ఇస్తున్నాయి. మాట విని సారా తయారీకి జోలికివెళ్లని కుటుంబాలకు ప్రభుత్వపరంగా ఆసరా కల్పించేందుకు చర్యలు చేపడుతున్నారు. చెప్పినా మాట వినకుండా సారా తయారు చేస్తున్న వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ⇔ రాష్ట్రంలో నేర చరిత్ర ఉన్న పది వేల మందిని ఇకపై సారా తయారు చేయబోమంటూ హామీ ఇచ్చేలా బైండోవర్ చేశారు. ఎంత చెప్పినా వినకుండా సారా తయారీ వీడని 1,500 మందిపై రౌడీషీట్లు తెరిచారు. ఆరుగురిపై పీడీ యాక్ట్‌లు పెట్టారు. సారా తయారీ ఆపకుంటే కఠిన చర్యలు తప్పవు: వినీత్‌బ్రిజ్‌లాల్, ఎస్ఈబీ డైరెక్టర్ ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసి ప్రాణాల మీదకు తెచ్చే నాటుసారా తయారీపై ఉక్కుపాదం మోపుతున్నాం. సమాజంలో పరువు పోగొట్టుకుని బతకడం కంటే సారా తయారీ ఆపేసి మంచి జీవనం గడపాలని కౌన్సెలింగ్ ఇస్తున్నాం. అయినా వినకుండా సారా తయారు చేసే వారిపై కేసులు నమోదు చేస్తున్నాం. అటువంటి వారికి 8 ఏళ్లు జైలు శిక్ష , రౌడీషీట్లు, పీడీ యాక్ట్‌లు తప్పవు. జిల్లాల వారీగా నాటుసారా తయారీ కేంద్రాలు: జిల్లా ఎన్ని మండలాలు నాటుసారా కేంద్రాలు శ్రీకాకుళం 13 90 విజయనగరం 10 28 విశాఖపట్నం 21 89 తూర్పుగోదావరి 36 186 పశ్చిమగోదావరి 12 20 కృష్ణా 6 27 గుంటూరు 6 14 ప్రకాశం 9 21 నెల్లూరు 2 7 చిత్తూరు 20 39 వైఎస్సార్ కడప 4 8 అనంతపురం 20 46 కర్నూలు 32 107 -
ఎస్ఐ సాహసం
-
ఆటకట్టు, ఎక్కడిక్కడ మద్యం సీజ్
సాక్షి, విజయవాడ: కరోనా కారణంగా రాష్ట్రంలో ఏర్పడ్డ విపత్కర పరిస్థితులను అక్రమార్కులు అనుకూలంగా మలుచుకుంటున్నారు. పొరుగున ఉన్న తెలంగాణ నుంచి మద్యాన్ని తెచ్చి అమ్మి సొమ్ముచేసుకొంటున్నారు. చెక్ పోస్టుల్లో నిఘా పెరగటంతో అడ్డదారులు ఏర్పాటు చేసుకొని పోలీసుల కళ్లుకప్పి దందా కొనసాగిస్తున్నారు. అయితే, అక్రమరవాణా దారుల ఆటకట్టించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) కొరడా ఝళిపిస్తోంది. మూడంచెల చెక్‌పోస్టు విధానంతో నాన్ డ్యూటీ పెయిడ్ అక్రమ మద్యాన్ని ఎక్కడికక్కడ సీజ్ చేస్తోంది. తాజాగా కృష్ణలంక,పెనమలూరు, నున్న ,గన్నవరం పోలీస్ స్టేషన్ల పరిధిలో నాలుగు చోట్ల ఏకకాలంలో ఎస్ఈబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు .కొరియర్ సర్వీస్ ద్వారా తరలిస్తున్న 2,804 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. తొమ్మిది మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు .రవాణాకు ఉపయోగించిన ఆటో, లారీని సీజ్ చేశారు. మరోపక్క పరివర్తన పేరుతో ఎస్ఈబీ అధికారులు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తూ సారా తయారీ దారుల్లో మార్పునకు ప్రయత్నిస్తున్నారు. అక్రమ మద్యం వ్యాపారాన్ని వదిలిపెట్టకపోతే పీడీ యాక్టులు పెట్టి కఠిన శిక్షలు అమలు చేస్తామని హెచ్చరిస్తున్నారు . -
రైడింగ్‌కు వెళ్లిన 42 మంది పోలీసులకు క్వారంటైన్
రాంచీ : అక్రమ మద్యం సరఫరా జరుగుతుందని సమాచారం అందుకొని రైడింగ్‌కు వెళ్లిన పోలీసులు అనుకోకుండా క్వారంటైన్ సెంటర్‌కు వెళ్లాల్సి వచ్చింది. ఈ ఘటన జార్ఖండ్‌లోని కోడెర్మా జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. జూలై 4(శనివారం) అక్రమ మద్యం సరఫరా జరుగుతుందని కోడెర్మా పోలీస్ స్టేషన్‌కు సమాచారమందింది. దీంతో డీఎప్సీ ఆధ్వర్యంలో జయ్ నగర్, చాంద్వారా పోలీస్ స్టేషన్‌కు చెందిన మొత్తం 42 మంది పోలీసులు రెండు బృందాలుగా విడిపోయి అక్రమ మద్యం సరఫరా జరుగుతున్న ప్రదేశంలో రైడింగ్ నిర్వహించారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కాగా జైలుకు తరలించే ముందు పోలీసులు ఇద్దరు నిందితులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే నిందితుల్లో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు మంగళవారం వచ్చిన రిపోర్టులో తేలింది. (కరోనా వ్యాక్సిన్ : సినోవాక్ కీలక ప్రకటన) దీంతో అప్రమత్తమైన పోలీస్ శాఖ పాజిటివ్ వచ్చిన నిందితుడిని ఆసుపత్రికి తరలించారు. కాగా రైడింగ్‌కు వెళ్లిన డీఎస్పీ సహా 42 మంది పోలీసులను, మరొక నిందితుడిని దోమచాంచ్ క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు. కాగా ఈ విషయమై కోడెర్మా డిప్యూటీ కమిషనర్ రమేశ్ గోలప్ స్పందిస్తూ.. 'రైడింగ్‌కు రెండు బృందాలుగా మొత్తం 42 మంది పోలీసులు వెళ్లారు. అరెస్ట్ చేసిన ఇద్దరు నిందితుల్లో ఒకరికి కరోనా పాజిటివ్ రావడంతో అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నాం. ముందస్తుగా వారందరిని మేము ఏర్పాటు చేసుకున్న క్వారంటైన్ సెంటర్‌కు తరలించాం. ప్రస్తుతం వారంతా బాగానే ఉన్నారు. అందరికి కరోనా పరీక్షలు నిర్వహించాం. కరోనా వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నా వైరస్ ఉదృతి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాం'అంటూ తెలిపారు. మరోవైపు ఇప్పటికే జయనగర్, చాంద్‌వారో పోలీస్ స్టేషన్లకు సాధారణ ప్రజలు రాకుండా గట్టి భద్రతా చర్యలు తీసుకున్నట్లు డీసీపీ తెలిపారు. అయితే గత నాలుగు రోజులగా ఫిర్యాదుల కోసం పోలీస్ స్టేషన్‌కు వచ్చిన వారు స్వచ్చందంగా ముందుకు వచ్చి కరోనా పరీక్షలు నిర్వహించుకోవాలని ఇప్పటికే అధికారిక ప్రకటన జారీ చేసినట్లు డీసీపీ పేర్కొన్నారు. కాగా జార్ఖండ్‌లో ఇప్పటివరకు 2,781 కరోనా కేసులు నమోదవ్వగా.. 19 మంది మృతి చెందారు -
లైసెన్సులు వెనక్కి తీసుకోండి మహా ప్రభో!
డెహ్రాడూన్: కోవిడ్ దెబ్బతో ఉత్తరాఖండ్‌లోని మద్యం దుకాణాదారులు వాటిని మూసివేసే పరిస్థితి తలెత్తిందని అంటున్నారు. అమ్మకాలు తగ్గిపోయి భారీ నష్టాల్లో కూరుకుపోయామని, తమ లైసెన్సులను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 90 దుకాణాదారులు ప్రభుత్వానికి ఈమేరకు వినతులు సమర్పించారు. తమ నష్టాలకు ప్రధాన కారణం అమ్మకాలు తగ్గిపోవడం ఒకటైతే, ప్రభుత్వానికి నెలవారీ చెల్లించే కనీసం గ్యారెంటీ మొత్తం మరొకటని చెప్తున్నారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా 650 మద్యం దుకాణాలతో ప్రభుత్వానికి ఏటా రూ.3 వేల కోట్ల ఆదాయం సమకూరుతోంది. ప్రభుత్వానికి అధిక మొత్తంలో ఆదాయం అందించే వనరు ఇదే కావడం గమనార్హం. అక్కడ లైసెన్సు గడవు ఒక ఏడాది. (చదవండి: రాత్రి 2 గంటలకు ఫోన్, చిక్కుల్లో బీజేపీ నేత) లాక్‌డౌన్‌తో అమ్మకాలు నిలిచిపోగా.. అన్‌లాక్-1 అమలైనప్పటికీ డిమాండ్ అంతగా లేదని దుకాణాదారులు తెలిపారు. అమ్మలకాలతో సంబంధం లేకుండా నెలకు రూ.40 లక్షల నుంచి రూ. కోటి వరకు చెల్లించాల్సి ఉంటుందని జైస్వాల్ అనే దుకాణదారు చెప్పారు. అందుకే లైసెన్సులు వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరామని, ఇప్పటి వరకు రిప్లై రాలేదని తెలిపారు. ఇంతకు ముందు అమ్మకాలపై 20 శాతం వాటా ఉండేదని, ఇప్పుడు దానిని 14.5 శాతానికి తగ్గించారని చెప్పారు. ఇది కూడా తమ నష్టాలకు ప్రధాన కారణమని అన్నారు. ఇదిలాఉండగా.. లాక్డౌన్ సమయంలో బకాయిపడ్డ నెలవారీ గ్యారెంటీ మొత్తం రూ. 230 కోట్లు మాఫీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. దీనిపై కొందరు హైకోర్టులో పిటిషన్ వేశారు. మద్యం దుకాణాలపై కనికరం అవసరమా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వం స్పందన కోరుతూ హైకోర్టు మూడు వారాలకు విచారణ వాయిదా వేసింది. (పామును పట్టుకోండి..) -
వివాదాస్పదంగా పంజాబ్ ప్రభుత్వ నిర్ణయం
చంఢీగఢ్: ఇసుక అక్రమ తవ్వకాలను ఆపేందుకు 40 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులను కపుర్తాలా జిల్లాలోని ఫగ్వారా చెక్‌పోస్టుల వద్ద కాపలాగా ఉంచనున్నట్లు పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదంగా మారింది. ఫగ్వారా సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్, సివిల్, పోలీస్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నతాధికారులు, కమ్యూనికేషన్ ఎక్సెంజ్లతో పాటు ఉపాధ్యాయులు కూడా రాత్రి 9 గంటల నుంచి 1 గంటల మధ్య చెక్ పాయింట్ల వద్ద డ్యూటీ చేయాలంటూ శుక్రవారం ఉత్తర్వు జారీ చేసింది. ఇప్పటికే గురుదాస్‌పూర్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం 24 మంది పాఠశాల ఉపాధ్యాయులను డిస్టిలరీలకు కాపాలాగా నియమించింది. కానీ దీనిని ఉపసంహరించిన నెల రోజులకే ప్రభుత్వం మరోసారి ఈ ఉత్తర్వును జారీ చేసింది. (వెంటిలేటర్ ప్లగ్ తీసి కూలర్ పెట్టారు) దీనిపై శిరోమణి అకాలీదళ్(ఎస్ఎడీ) పార్టీ ప్రతినిధి, మాజీ మంత్రి డల్జిత్ సింగ్ చీమా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ‘డిస్టిలరీల తరువాత ఇసుక తవ్వకాలను ఆపడానికి పంజాబ్ ప్రభుత్వం వివిధ పోలీసు చెక్‌పోస్టు వద్ద ప్రభుత్వ ఉపాధ్యాయులను నియమించింది. ఉపాధ్యాయులను మద్యం, ఇసుక మాఫియా కోసం ఎందుకు నియమిస్తున్నారో అర్థం కావడం లేదు. ఇది ఒక సిగ్గుమాలిన నిర్ణయం. ప్రభుత్వం వెంటనే దీనిని ఉపసంహరించుకోవాలి’’ అని డిమాండ్ చేశారు. కాగా గత నెలలో గురుదాస్‌పూర్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం జారీ చేసిన ఈ వివాదాస్పద ఉత్తర్వుపై ప్రభుత్వం ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంది. మద్యం సరఫరాపై నిఘా పెట్టడానికి 24 మంది ఉపాధ్యాయులను కర్మాగారాల్లో మోహరించింది. అయితే ప్రతిపక్షం ఆందోళనలతో ఆ ఉత్తర్వును ప్రభుత్వం ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. (ఎగువసభ ఎన్నికల్లో ఏపీలో వైసీపీ క్లీన్ స్వీప్) -
మందు కోసం నటుడు ఏం చేశాడో తెలుసా?
-
అక్రమార్కుల భరతం పడతోన్న స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో
-
ఆన్లైన్లో మద్యం విక్రయంపై ఆలోచించండి
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు మద్యం అమ్మకాలను ఆన్లైన్ పద్ధతిలో చేపట్టి.. ఇళ్లకే సరఫరా చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని అత్యున్నత న్యాయస్థానం రాష్ట్రాలకు సూచించింది. మద్యం అమ్మకాలపై కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ బి.ఆర్.గవాయిలతో కూడిన ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. దేశవ్యాప్తంగా 70 వేల మద్యం దుకాణాలు తెరుచుకున్నాయని, ఐదుకోట్ల కంటే ఎక్కువ మంది కొనుగోళ్లు చేశారని పిటిషనర్ గురుస్వామి నటరాజ్ పేర్కొన్నారు. దుకాణాల వద్ద భౌతిక దూరం అస్సలు పాటించడం లేదని, ఫలితంగా కోవిడ్–19 కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. దుకాణాల్లో మద్యం నేరుగా అమ్మడాన్ని నిషేధిస్తూ హోం శాఖ ఆదేశాలు జారీ చేసేలా చూడాలని పేర్కొన్నారు. ఈ వాదనలను తోసిపుచ్చిన ధర్మాసనం ..ఆన్లైన్లో అమ్మకాలు, హోం డెలివరీ అంశాలను పరిశీలించాలని రాష్ట్రాలకు సూచించింది. మద్యం దుకాణాలు మూసేయండి చెన్నై: తమిళనాడులో మద్యం దుకాణాలను వెంటనే మూసివేయాలని మద్రాస్ హైకోర్టు తేల్చిచెప్పింది. అడ్వొకేట్ జి.రాజేష్ దాఖలు చేసిన వ్యాజ్యంతోపాటు కమల్ హాసన్‌కు చెందిన మక్కల్ నీది మయ్యమ్ పార్టీ దాఖలు చేసిన ఫిర్యాదుపై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో మద్యం దుకాణాలను తెరిచిన మరుసటి రోజే న్యాయస్థానం ఈ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. మద్యం డోర్ డెలివరీకి హైకోర్టు అనుమతి ఇచ్చింది. -
క్షీరసాగర మథనం
చాలా రోజుల తర్వాత నిషా తిరిగి మబ్బులా ఆవరించింది. వీధులమీద చిత్రవిచిత్రమైన సందళ్లు. ఎప్పుడూ ఇంత స్తబ్దుగా ఈ సమాజం ఉన్నది లేదు. ఎంత డబ్బు?! నమ్మలేని నిజాలు! రోజువారీ రాష్ట్ర అమ్మకాల్లో సామాన్యుడి వాటా పదిహేను కోట్లు. అందులో పేదవాడి చెమట నెత్తురు కనీసం ఏడె నిమిది కోట్లు. ఇంతాచేసి ఇది ఒక్కరోజు కలెక్షను. పైగా ఇది కేవలం ద్రవాల వెల మాత్రమే, ఇందులో ఉపద్రవాలపై ఖర్చు ఉంటుందని అనుభవజ్ఞుడి అంచనా. ఇది పుట్టినప్పుడు దీనికి ‘సురాపానం’ అని నామకరణం చేశారు. అంటే దేవతల అధికారిక డ్రింక్. (చదదవండి: ఐఏఎస్‌లకు ఏం తెలుసు?) ఇది ఎప్పటికీ అసురపానం కాలేదుగానీ క్రమంగా ఓ మెట్టు పైకి చేరినకొద్దీ సురలే అసురులై పోతారని ‘మధు మోహం’ లేనివారు విశ్లేషిస్తుంటారు. కృతయుగంలో ఏ దివ్యముహూర్తాన క్షీర సాగర మహాక్రతువు ఆరంభమైందోగానీ ఆ మహా మథనంలో ఎన్నో వింతలు విశేషాలు పుట్టు కొచ్చాయి. ఐరావతమనే తెల్లఏనుగు నించి వెన్నె లలు కురిపించే చందమామ దాకా ఆ చిలకడంలో వెన్నెముద్దల్లా తేలాయి. దీన్ని జయప్రదం చేయ డానికి విష్ణుమూర్తి రెండు అవతారాలు ధరించాడు. కూర్మమై మునిగిపోతున్న మంథరగిరి కవ్వాన్ని వెన్నంటి నిలిపాడు. శివదేవుడు ఘోర కాకోలమైన విషం చెలరేగినపుడు జుంటి తేనెలా స్వీకరించి గొంతులో నిలిపి గరళ కంఠుడైనాడు. మధ్యలో అనేకానేక విశేషాలు వింతలు వచ్చాయి. అచ్చర కన్నెలు నాట్యభంగిమలతో పాల నురగల్లో కలిసి పోయారు. ఒక దశలో ‘వారుణి’ దిగి వచ్చి ఏరులై ప్రవహించింది. సేవించిన వారందరికీ తిమ్మి రెక్కింది. తిక్క రేగింది. దేవ దానవులు రెచ్చి పోయారు. కలిపిన పట్టువదిలి ఊగసాగారు. విష్ణు మూర్తి, ఇంకో నాలుగు తిప్పులు తిప్పితే ఆశించిన అమృతం సిద్ధిస్తుంది లేకపోతే ఎక్కడికో జారి పోతుందని హెచ్చరించాడు. నిజంగానే అమృతం జాడ పొడకట్టింది. నిత్య యవ్వనంతోబాటు, జర రుజ మరణాల్ని నియంత్రించే అమృతం వచ్చేసరికి మాకంటే మాకంటూ సురాసురులు ఎగబడ్డారు. విష్ణుమూర్తి గమనించాడు. అన్యాయం, అక్రమం, స్వార్థం, భయం, పక్షపాత బుద్ధి అక్కడే పడగ విప్పాయి. దేవుడు మోహినిగా అవతారం ధరిం చాడు. వడ్డన సాగించాడు. ధర్మ సంస్థాపన కోసం జరగాల్సిన దగా దేవుడి చేతుల మీదుగా జరిగి పోయింది. చివరకు సురలకే అమృతం దక్కింది. అసురలకు శ్రమలో వాటా చిక్కింది. కలియుగంలో ఎన్టీఆర్ పాలనలో తెలుగు వారుణి వాహినిగా ప్రభుత్వ సారాయిగా జనం మీదకు వచ్చింది. అన్న గారు కిలో రెండు రూపాయల బియ్యం పథకం దేశాన్ని కుదిపేసింది. ఆనాడు ఆ బియ్యం ధర శ్రామిక వర్గాన్ని నిషా ఎక్కించింది. మిగిలిపోతున్న డబ్బులు వారుణి వాహిని వైపు మొగ్గు చూపాయి. అప్పుడే చాలామంది కష్టపడి ఈ కొత్త మత్తుని అలవాటు చేసుకున్నారు. ప్రభుత్వం ఆ చేత్తో ఇచ్చి, ఈ చేత్తో లాక్కుందని జనం వాపోయారు. (చదవండి: అప్పుడలా.. ఇప్పుడిలా) ఇప్పుడు షాపులు తీశారని ఒక విమర్శ. రాష్ట్ర సరిహద్దు కూత వేటు దూరంలో ఉంటుంది. భాగ్యనగర్ వైన్స్‌కి, బెజవాడ వైన్స్‌కి పది అంగల దూరం ఉంటుంది. ఆ దూరాన్ని ఎవడాపగలడు. అప్పుడు మళ్లీ అదొక విమర్శ. జగన్ మద్యం ధరలు పెంచారట. కొందరైనా విముఖత చూపుతారని ఆశతో. బీద బిక్కి దీనివల్ల చితికి పోతున్నారని చంద్రబాబు ఒక మద్యాస్త్రం సంధించారు. ఎవరి మద్యం వారే కాచుకోండి అంటే ఎట్లా ఉంటుంది? ప్రతి ఇల్లూ ఒక బట్టీ అవుతుంది. ధరలు తగ్గు తాయి. ఏదైనా ఎదుటివారికి చెప్పడం చాలా తేలిక. మనం ఏం చేశామో మనకి గుర్తుండదు. అందుకే నేటి అపోజిషన్ లీడర్లు పాత పేపర్లు తీరిగ్గా చదువు కోవడం మంచిదని ఒక పెద్దాయన సూచిస్తున్నారు. మా ఊరి పెద్దాయన చంద్రబాబు వీరాభిమాని, ‘రోజూ హీనపక్షం రెండు లేఖలు వదుల్తున్నారండీ’ అంటే ఆయన చిద్విలాసంగా నవ్వి, పోన్లెండి ఇవ్వా ల్టికి ఇంటిపట్టున ఉన్నాడు. తాజా కూరలు తాజా పాలు, వేళకి తిని తగినంత విశ్రాంతి తీసుకుంటు న్నట్టున్నాడు. రోజూ ఒకటికి రెండుసార్లు ఇబ్బంది లేకుండా అవుతున్నట్టున్నాయ్ మంచిదే! అన్నారు. అంటే నిత్యం చంద్రబాబు వదుల్తున్న లేఖల్ని మా వూరి పెద్దాయన ఎలా భావిస్తున్నారో చాలా లౌక్యంగా చెప్పారు. అందుకని ఈ దినచర్య మార్చండి. వ్యాసకర్త: శ్రీరమణ, ప్రముఖ కథకుడు -
ఒక్కరోజులో రూ.172 కోట్ల ఆదాయం
చెన్నై: తమిళనాడులో తొలి రోజు మద్యం అమ్మకాలు జోరుగా ముగిశాయి. లాక్డౌన్ అనంతరం తెరుచుకున్నమొదటి రోజే మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగాయి. ప్రాథమిక అంచనా ప్రకారం ఒక్క రోజే తమిళనాడు ప్రభుత్వం రూ.172 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిపినట్లు తేలింది. లాక్డౌన్ కారణంగా మూతపడిన మద్యం దుకాణాలను తమిళనాడు ప్రభుత్వం మే 7(గురువారం)నుంచి తిరిగి ఓపెన్ చేసిన విషయం తెలిసిందే. కేంద్రం లాక్డౌన్ సడలింపుల ఇవ్వడంతో కంటైన్మెంట్ జోన్లు మినహా రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లలోనూ లిక్కర్ సేల్స్‌కు తమిళనాడు ప్రభుత్వం అనుమతినిచ్చింది. అయితే చెన్నైలో కరోనా ప్రభావం అధికంగా ఉండటం వల్ల గ్రేటర్ చెన్నై ప్రాంతంలో మాత్రం మద్యం అమ్మకాలను నిషేధించింది. (మద్యం అమ్మకాలు; మండిపడ్డ మహిళలు) కరోనా లాక్డౌన్ నేపథ్యంలో దాదాపు 44 రోజులపాటు మూతపడిన మద్యం దుకాణాలు తెరుచుకోడంతో మద్యం ప్రియులు పండగ చేసుకుంటున్నారు. దొరికిందే అదునుగా భావించి తెగ తాగుతూ రికార్డు సృష్టిస్తున్నారు. ఏ మద్యం దుకాణం ముందు చూసినా కిలోమీటర్లమేర మందుబాబులు బారులు తీరుతున్నారు. ఒక్క సీసా దొరికినా చాలు అంటూ దుకాణాల ముందు ఎగబడుతున్నారు. అయితే మద్యం దుకాణాల ముందు సామాజిక దూరం పాటించని, మాస్కులు లేని వారిపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఇక తమిళనాడులో కొత్తగా 580 పాజిటివ్ కేసులు నమోదవ్వడంతో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 5,409కి చేరింది. (ఒక్క రోజే పలు పారిశ్రామిక ప్రమాదాలు ) తమిళనాడులో కరోనా విలయతాండవం -
మద్యం ఎక్కువ తాగాడని హత్య
యశవంతపుర : ఇద్దరు స్నేహితుల మధ్య మద్యం విషయంపై జరిగిన ఘర్షణలో ఒకరు హత్యకు గురైన ఘటన రామమూర్తినగర పోలీసుస్టేషన్ పరిధిలో జరగింది. యలహంకకు చెందిన రాజు (40), రామమూర్తినగర 4వ క్రాస్ బోవి కాలనీకి చెందిన నేత స్నేహితులు. మద్యం అంగళ్లు తెరవటంతో మంగళవారం సాయంత్రం ఇద్దరు కలిసి మద్యం తెచ్చుకొని నేతా ఇంట్లోనే రాత్రి 10:30 గంటల వరకు తాగారు. రాజునే ఎక్కువ మద్యం తాగేశాడని నేతా గొడవ పడ్డారు. నేతా రాజు తలను గోడకేసి గుద్ది, మంట పాత్రతో తలపై బలంగా బాది హత్య చేశాడు. రామమూర్తినగర పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గతంలో వ్యక్తిని హత్య చేసిన నేతా జైలుకెళ్లి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. -
వైన్ షాపుల మూతపై వర్మ ట్వీట్
సాక్షి, హైదరాబాద్ : కరోనా కట్టడికి లాక్డౌన్ విధించడంతో దాదాపు అన్ని వ్యాపార కార్యక్రమాలు మూతపడ్డాయి. దీంతో ప్రభుత్వానికి ఆదాయ మార్గాలు మూసుకుపోయాయి. వీటిలో మద్యం షాపుల మూత అనేది పెద్ద ఎత్తున ఆదాయాన్ని స్తంభింపజేసింది. కేవలం దేశంలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా వైన్ షాపులు మూతపటడంతో ఆయా ప్రభుత్వాల ఆదాయానికి గండిపడింది. ముఖ్యంగా భారత్‌లో లిక్కర్ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పెద్ద ఎత్తున రెవెన్యూ అందుతోంది. ఈ క్రమంలో మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించడం కోసం మద్యం దుకాణాలకు ఆంక్షల నుంచి సడలింపు ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. నిషేధం పూర్తిగా ఎత్తివేయకుండా ఆర్థిక నష్టాన్ని పూడ్చుకునేందుకు పరిమితులతో కూడిన వెసులుబాటును ఇవ్వాలని ప్రభుత్వాలకు పలువురు సూచనలు సైతం ఇస్తున్నారు. అలాగే బార్ షాపులు తెరిస్తే ఆహార పదార్థాల విక్రయం ద్వారా కూడా ఆదాయం వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. తాజాగా దీనిపై టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ స్పందించారు. మద్యం అందుబాటులో లేకపోతే బ్లాక్ మార్కెట్ ద్వారా జరిగే అనార్థాలపై ట్వీట్ చేశారు. ‘ప్రజలు కోరుకునే దేనినైనా పరిమితం చేయడం వల్ల బ్లాక్ మార్కెట్ ధరలను పెంచడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల తమకు అవసరమైన ఆల్కహాల్‌ను చాలా ఎక్కువ ధరకు కొనుగోలు చేయడానికి పెద్ద ఎత్తున డబ్బును ఉపయోగిస్తారు. తద్వారా వారి కుటుంబాలు ఇతర అవసరాలను కోల్పోయే అవకాశం ఉంది’ అని ట్విటర్ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. -
హైదరాబాద్‌లో లాక్డౌన్ రూల్స్ బ్రేక్
-
ట్రెండింగ్ డాల్గొనా పెగ్ విస్కీ ఛాలెంజ్
కరోనా కట్టడికి సామాన్యుల నుంచి సెలబ్రటీల వరకు అందరూ ఇళ్లలోనే ఉండాల్సిన పరిస్థితి. దీంతో లాక్డౌన్ పుణ్యమా అని చాలామంది వారిలో ఉన్న సృజనాత్మకతను బయటపెడుతున్నారు. మొన్నటివరకు సోషల్ మీడియాలో దుమ్మురేపిన డాల్గొనా కాఫీ ట్రెండ్‌కి ఇప్పడు ఇంకోటి వచ్చి చేరింది. అదే డాల్గొనా పెగ్. డాల్గొనా కాఫీలానే డాల్గొనా పెగ్ తయారు చేయడం చాలా సులువు కావడంతో ఇప్పడు ఇది డాల్గొనా కాఫీని రీప్లేస్ చేసింది. డాల్గొనా పెగ్‌కి కావల్సినవి 1. నీళ్లు 2. విస్కీ 3. ఏదైనా వస్ర్తం ముందుగా ఓ గ్లాస్లో 3 వంతుల నీళ్లు పోయాలి. పైనుంచి ఓ వస్ర్తంతో కప్పి ఉంచుతూ మెల్లిగా నీళ్లను తాకుతూ క్లాత్‌ను కిందికి జారవిడవాలి. రెండు టేబుల్ స్ఫూన్ల విస్కీని వస్ర్తం పైనుంచి పోయాలి. తర్వాత నెమ్మదినెమ్మదిగా ఆ వస్ర్తాన్ని తీసేయాలి. అంతే డాల్గొనా కాఫీలానే డాల్గొనా విస్కీ పైన తేలియాడుతూ కనిపిస్తుంది. ఇప్పడు ఇది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్డౌన్ విధించిన ప్రభుత్వం..నిత్యవసరాలు, మందులు మినహా మిగతా అమ్యకాలపై నిషేదం విధించింది. దీంతో మద్యం లభించక చాలామంది మద్యం బానిసలు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దీంతో మందుబాబులకు వరం ప్రసాదిస్తూ డాక్టర్ ప్రిస్రిప్షన్ లెటర్ ఉంటే మద్యం సరఫరా చేయాలని కేరళ ప్రభుత్వం నోటీసులు జారీచేసింది. ఆ తర్వాత పశ్చిమబెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం కూడా పరిమిత పాస్‌ల ద్వారా మద్యాన్ని డోర్ డెలివరీ చేసేందుకు అనుమతిచ్చింది. ఇక కర్ణాటకలో ఆదాయాన్ని పెంచే ప్రయత్నంలో భాగంగా ఏప్రిల్ 14 తర్వాత మద్యం అమ్మకాలపై ఉన్న ఆంక్షలను ఎత్తివేసే ఆలోచనలో ఉన్నట్లు సీఎం యడియూరప్ప ప్రకటించారు. దేశంలో అత్యధిక మద్యం సరఫరా చేసే బాకార్డి, రెమీ మార్టిన్ లాంటి కంపెనీలు సామాజిక దూరం, నిబంధనలు పాటిస్తూ పరిమిత సంఖ్యలో అయినా మద్యం విక్రయించడానికి అనుమతి ఇవ్వండంటూ కేంద్రాన్ని కోరాయి. ఇక భారత్‌లోనూ కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లోనే కోవిడ్ కారణంగా 35 మంది ప్రాణాలు విడువగా, 706 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 9,152 కు చేరుకోగా, 308 మంది చనిపోయారు. -
వైరస్ మాటున లిక్కర్ దందా!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా లాక్డౌన్ కొనసాగుతున్నప్పటికీ మద్యం ప్రియుల బలహీనతను ఆసరాగా చేసుకొని గత 20 రోజులుగా యథేచ్ఛగా లిక్కర్ దందా సాగుతోంది. ఏ బ్రాండ్ ఫుల్ బాటిల్ కావాలన్నా బ్లాక్‌లో రెండు నుంచి మూడు రెట్లు ఎక్కువ ధరకు లభి స్తోంది. ఈ పరిణామం వైన్‌షాపుల యజమానులకు, దళారులకు కాసుల పంట పండిస్తోంది. దొడ్డిదారి... దుడ్లు రాలి కరోనా వైరస్ నియంత్రణ కోసం ప్రధాని మోదీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా మార్చి 22న జనతా కర్ఫ్యూ విధించగా ఆ రోజున రాష్ట్రం లోని వైన్‌షాపులన్నీ మూతపడ్డాయి. కానీ అదే రోజు సీఎం కేసీఆర్ రాష్ట్రంలో మార్చి 31 వరకు లాక్డౌన్ ప్రకటించడంతోపాటు వైన్‌షాపుల మూసివేతకు ఆదేశించారు. అందుకు అనుగుణంగా సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. కానీ ఎక్సైజ్ శాఖ మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటనా విడుదల చేయలేదు. దీంతో వైన్‌షాపులను మూసేయాలని ప్రకటించినా వాటిని సీజ్ చేయలేదు. ఈ పరి ణామమే లిక్కర్ వ్యాపారులకు కలిసొచ్చింది. అధికారికంగా ఎక్సైజ్ అధికారులు షాప్‌లు సీజ్ చేయకపోవడంతో దొడ్డిదారిన షాపుల్లోని సరుకును బ్లాక్‌మార్కెట్‌కు మళ్లిస్తూ రెండు, మూడింతల ధరకు దళారుల సాయంతో విక్రయించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే వైన్‌షాపుల్లో కాకుండా వ్యక్తిగతంగా దాచుకొనే సరుకు 20 రోజులపాటు మార్కెట్లో ఉండదని, వైన్‌షాపుల నుంచి సరుకు బయటకు వచ్చినందునే ఇన్ని రోజులు మార్కెట్లో మందు దొరికిందని, ఇప్పుడు దాదాపు వైన్‌షాపులు ఖాళీ అయ్యాయని ఎక్సైజ్ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. అయితే ఎక్సైజ్ వర్గాలు ఈ విషయంలో కళ్లు మూసుకొని వ్యవహరించారని, చిన్న, చిన్న కారణాలతో షాపులు తెరిచేందుకు కూడా (అమ్ముకొనేందుకు కాదు...సరుకు తరలించేందుకు) అంగీకరించారనే విమర్శలు కూడా లేకపోలేదు. ఎక్సైజ్ శాఖ ఉదాసీనత వల్లే వైన్‌షాపుల యజమానులు గుట్టుచప్పుడు కాకుండా మద్యాన్ని మళ్లించారనే చర్చ జరుగుతోంది. చెప్పేదొకటి.. జరిగిందొకటి కరోనా లాక్డౌన్ వల్ల తమకు రూ. లక్షల్లో నష్టాలు వస్తున్నట్లు వైన్‌షాపు యజమానులు పైకి చెబుతున్నా లోలోపల మాత్రం సంబరపడుతున్నారని, కరోనా కాసులు మరికొన్నాళ్లు కురిస్తే బాగుండని అంతర్గతంగా చర్చించుకుంటున్నారని తెలుస్తోంది. ‘జనతా కర్ఫ్యూ తెల్లారి షాపులు తెరుద్దామనుకుంటే అదే రోజు లాక్డౌన్ అని చెప్పి షాపులు బంద్ చేయమన్నరు. గుండె గుభేల్మంది. కానీ షాపులు సీజ్ చేయలేదు కాబట్టి బతికిపోయాం. షాపులోని సరుకు ఎలాగొలా బయటకు తీసుకొచ్చి అమ్మేసినం. రెండు, మూడు రోజులైనా వెసులుబాటు ఇస్తే బాగుండు. డిపోల నుంచి స్టాక్ తెచ్చి పెట్టుకోవచ్చు. ఇప్పటిలాగే రూపాయికి రెండు, మూడు రూపాయిలకు అమ్ముకోవచ్చు... పైపెచ్చు సాధారణ పరిస్థితి రాగానే ఎన్ని రోజులయితే లాక్డౌన్ చేశారో... అన్ని రోజుల లైసెన్స్ పొడిగించాలని కరోనా పరిహారం కింద డిమాండ్ చేయొచ్చు’అని వైన్‌షాపుల యజమానులు అంతర్గతంగా మాట్లాడుకుంటున్నట్లు సమాచారం. బార్ల యజమానులు విలవిల... రాష్ట్రంలో వైన్‌షాపుల యజమానులు యథేచ్ఛగా బ్లాక్‌లో దందా సాగిస్తుండగా బార్ల యజమానులు మాత్రం అల్లాడిపోతున్నారు. వాస్తవానికి వైన్‌షాపుల కంటే బార్లకు పెట్టుబడి ఎక్కువ. లైసెన్స్ ఫీజూ ఎక్కువే. కానీ వైన్ షాపులను మూసేయడానికి వారం ముందు నుంచే రాష్ట్రంలో బార్లు మూసేశారు. అక్కడ ఎలాగూ కూర్చొని తాగే అవకాశం ఉండదు కాబట్టి బ్లాక్‌లో దందాకు అవకాశం లేదు. దీంతో ఎప్పుడు సాధారణ పరిస్థితి వస్తుందా... మళ్లీ ఎప్పుడు బార్లు తెరుద్దామా అని కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. -
మద్యం దొరక్క పెయింట్, వార్నిష్ తాగారు..
సాక్షి, చెన్నై: ప్రభుత్వం విధించిన లాక్డౌన్ కారణంగా మద్యం దొరక్క మందుబాబులు వింత వింతగా ప్రవర్తిస్తున్నారు. కొంతమందికి పిచ్చి ముదిరి హాస్పిటల్ పాలవుతుంటే, మరికొందరేమో ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. తమిళనాడులోని చెంగల్పట్లులో ముగ్గరు మందుబాబులు మద్యం దొరకట్లేలేదని పెయింట్, వార్నిష్‌తో కలిపి సేవించారు. దీంతో తీవ్ర అనారోగ్యం చెంది మరణించారు. వీరిని శివశంకర్, ప్రదీప్, శివరామన్‌లుగా గుర్తించారు. ప్రతిరోజు మద్యం తాగే అలవాటున్న వీరు గత కొన్ని రోజులుగా మద్యం దొరక్క అల్లాడిపోయారు. దీంతో విసుగు చెంది ఆదివారం పేయంట్‌తో కలిపిన వార్నిష్‌ను తాగారు. అంతే కొద్దిసేపటికే ఒకరి తర్వాత ఒకరు వాంతులు చేసుకొని అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయారు. మార్చి 25న దేశవ్యాప్త లాక్డౌన్ అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. నిత్యవసరాలు, ఆసుపత్రులు లాంటి అత్యవసర సేవలు మినహా అన్ని దుకాణాలు, షూటింగ్‌లు, కార్యాలయాలు మూతబడ్డాయి. మద్యం దుకాణాలు కూడా మూసివేయడంతో మందు దొరక్క చాలామంది మందుబాబులు వింతవింతగా ప్రవర్తించడంతో మెంటల్ హాస్పిటల్స్‌కు వారి తాకిడి పెరిగింది. మహారాష్ర్టలోని నాగ్‌పూర్‌లో ఓ రిక్షా కార్మికుడు మద్యం అందుబాటులో లేకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. తమిళనాడులోనూ ఏప్రిల్ 14 వరకు మద్యం దుకాణాలను మూసివేసినట్లు ప్రకటించింది. ఇక కేరళలో మాత్రం ప్రభుత్వం మందుబాబులపై కరుణ చూపించింది. కరోనా లక్షణాలు లేనివారు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ చూపిస్తే ఇంటి వద్దకే మద్యం పంపిణీ చేస్తామని ప్రకటించింది. అయితే ఈ నిర్ణయంపై హైకోర్టు స్టే విధించింది. -
చిత్తూరులో టీడీపీ నేతల మద్యం అమ్మకాలు
-
లాక్డౌన్ : మద్యం బ్లాక్ దందా..
సాక్షి, నిజామాబాద్: లాక్డౌన్ పీరియడ్‌లో మద్యం వ్యాపారుల దోపిడీకి అంతులేకుండా పోయింది. మద్యం ప్రియుల బలహీనతను సొమ్ముగా మార్చుకుంటున్నారు. వైన్స్ షాపులు, బార్లలోని మొత్తం స్టాక్‌ను బ్లాక్ మార్కెట్‌కు తరలించారు. ఎమ్మారీ్పకి నాలుగింతల రేట్లకు మద్యం బాటిళ్లను అమ్ముతున్నారు. మద్యం తాగటం బలహీనతగా మారిన కొందరు గత్యంతరం లేని స్థితిలో కొనుగోలు చేస్తూ జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. వారం రోజులుగా ఎక్కడ పడితే అక్కడ మద్యం విక్రయాలు గుట్టుచప్పుడు సాగుతున్నాయి. ప్రధానంగా నిజామాబాద్ నగరంలో మద్యం వ్యాపారుల ఇష్టారాజ్యం మారింది. ఇప్పుడిది అంతటా హాట్ టాపిక్‌గా మారింది. అడ్డుకోవాల్సిన వారే అండగా.. మద్యం బ్లాక్ మార్కెట్లో అమ్ముడవుతుంటే మరోవైపు ఎక్సైజ్‌శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు. మద్యం అక్రమంగా విక్రయిస్తే పట్టుకొని కేసులు నమోదు చేయాల్సిన వారే అక్కమార్కులకు అండగా ఉంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విజృంభిస్తున్న కల్తీకల్లు.... మరో వైపు కల్తీకల్లు విజృంభిస్తోంది. నగరంలో, జిల్లాలో కల్లు డిపోలు , కల్లు దుకాణాలు ఎక్కడికక్కడ మూతపడిన విషయం తెలిసిందే. అయితే కల్లు విషయంలో సైతం రూ.10 నుండి 20 లోపు ఉండే సీసా ధర ఇప్పుడు ఏకంగా రూ.50 పైనే విక్రయాలు జరుపుతున్నారు. మా దృష్టికి వస్తే లైసెన్స్ రద్దు చేస్తాం జిల్లాలో , నిజామాబాద్ నగరంలో ఎక్కడైన సరే అక్రమంగా మద్యం అమ్మకాలు జరుపడం నేరం. దీనిపైన ఎవరైన మాకు కచ్చితమైన సమాచారంతో ఫిర్యాదు చేస్తే సంబంధిత మద్యం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకుని లైసెన్స్‌ను రద్దుచేయడం చేస్తాం. ఈ విషయంపై మూడు టీమ్‌లు సిద్ధం చేస్తున్నాం. ఎవరు కూడా అక్రమంగా మద్యం , కల్తీకల్లు విక్రయించవద్దు. – డాక్టర్ నవీన్‌చంద్ర, ఎక్సైజ్ సూపరింటెండెంట్ -
ఏమార్చి.. రూటు మార్చి..
సాక్షి, అమరావతిబ్యూరో: విజయవాడ నగరంలో లిక్కర్ మాఫియా రెచ్చిపోతోంది. ప్రభుత్వ దుకాణం నుంచే లిక్కర్ తరలించుకుపోతోంది. ఆదివారం విజయవాడ నగరంలో ప్రభుత్వ మద్యం షాపు నుంచి ఓ ప్రైవేటు బార్ యాజమాన్యం సరుకును తరలించింది. పట్టపగలే ఈ తంతు జరిగినా ఆ ప్రభుత్వ మద్యం షాపుకు కూతవేటు దూరంలో ఉన్న ఎక్సైజ్ అధికారులు పట్టించుకోలేదు. జిల్లా వ్యాప్తంగా ఇటీవల ఇటువంటి ఘటనలు జరుగుతున్నా.. ఎక్సైజ్ ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోకపోవడంతో బెజవాడలో లిక్కర్ మాఫియా చెలరేగిపోతోందన్న విమర్శలున్నాయి. ఇదీ పరిస్థితి.. జిల్లాలో విజయవాడ, మచిలీపట్నం ఎక్సైజ్ యూనిట్లు ఉన్నాయి. రాష్ట్రంలో నూతన మద్యం పాలసీలో భాగంగా జిల్లావ్యాప్తంగా గతంలో ఉన్న 344 షాపులను కుదించి వాటి స్థానంలో 275 మద్యం షాపులను ప్రభుత్వమే నిర్వహిస్తోంది. అందులో విజయవాడ పరిధిలో 135 ప్రభుత్వ షాపులు.. మచిలీపట్నం పరిధిలో 140 ప్రభుత్వ మద్యం షాపులు ఉన్నాయి. ఇవే కాకుండా మరో 148 బార్ అండ్ రెస్టారెంట్లను ప్రైవేటు యాజమాన్యాలు నిర్వహిస్తున్నాయి. వీటన్నింటికీ ప్రభుత్వమే ఏపీఎస్‌బీసీఎల్ గోదాముల నుంచి మద్యం విక్రయిస్తోంది. అయితే ప్రభుత్వ మద్యం షాపులకు, బార్ అండ్ రెస్టారెంట్లకు విక్రయించే మద్యం ధరల్లో వ్యత్యాసం చాలా ఉంది. దీంతో బార్ అండ్ రెస్టారెంట్ యజమానులు కొందరు ప్రభుత్వ మద్యం షాపుల్లో పనిచేసే వారితో కుమ్మక్కవుతున్నారనే ఆరోపణలున్నాయి. అక్రమంగా తరలింపు.. విజయవాడ నగరం టిక్కిల్ రోడ్డులో గత నెల 21న ప్రభుత్వ మద్యం దుకాణాన్ని(06449) ఎక్సైజ్ అధికారులు ప్రారంభించారు. గతంలో ఇక్కడ హాంగోవర్ పేరిట సూపర్ మార్కెట్ తరహాలో ఓ ప్రైవేటు మద్యం దుకాణం ఉండేది. ఆ షాపు నిర్వాహకులకు నగరంలో పలు బార్లు కూడా ఉన్నాయి. గతంలో హాంగోవర్లో పనిచేస్తున్న సిబ్బందినే ప్రస్తుత ప్రభుత్వ మద్యం దుకాణంలో నియమించారు. వీరందరూ కుమ్మక్కై ఆదివారం మధ్యాహ్నం 1.40 గంట సమయంలో 06449 నంబరు మద్యం షాపునకు సంబంధించిన బీరు, మద్యం బాటిళ్ల బాక్స్‌లను ఆటోలో లోడు చేస్తున్న దృశ్యం ‘సాక్షి’ కంట పడింది. అనుమానంతో సాక్షి ప్రతినిధి ఆ ఆటోను అనుసరించగా ఆ ఆటో నేరుగా పంట కాలువ రోడ్డులోని ‘చిల్లీస్ రెస్టారెంట్ అండ్ బార్’ వద్ద ఆగింది. అనంతరం ఆటోలో ఉన్న మద్యాన్ని దించి బార్లోకి తరలించారు. మద్యం షాపు వద్ద లోడు నింపిన దగ్గర నుంచి బార్ వద్ద లోడును దించిన దృశ్యాలను ‘సాక్షి’ తన కెమెరాలో బంధించింది. ఈ తరలింపు తంతు కేవలం అరగంటలోపు పూర్తి చేశారు. పట్టపగలే అందరూ చూస్తుండగానే ప్రభుత్వ మద్యం షాపు నుంచి సరుకును ఒక బార్ అండ్ రెస్టారెంట్‌కు తరలిస్తున్నా ఎక్సైజ్ అధికారులు గుర్తించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కఠిన చర్యలు ఉంటాయ్.. ప్రభుత్వ మద్యం దుకాణంలో ఉన్న సరుకును ఎవరైనా బెల్టు షాపులకు కానీ, బార్ అండ్ రెస్టారెంట్లకు కానీ విక్రయించరాదు. అలా చేస్తే దుకాణంలో పనిచేస్తున్న సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం. అలాగే కొనుగోలు చేసిన బార్ యజమానులపై కఠినంగా వ్యవహరిస్తాం. బార్‌ను సీజ్ చేస్తాం. రూ.లక్ష వరకు జరిమానా విధిస్తాం. – మురళీధర్, ఎక్సైజ్ డీసీ, కృష్ణా జిల్లా -
మూడు దశల్లో సంపూర్ణ మద్య నిషేధం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మూడు దశల్లో సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పునరుద్ఘాటించారు. సుదీర్ఘ పాదయాత్రలోనూ, అనంతరం ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామన్నారు. దశలవారీగా మద్య నిషేధంలో భాగంగా ఎక్సైజ్ విధానంలో మార్పులు చేస్తూ రూపొందించిన బిల్లుపై సోమవారం శాసనసభలో చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడారు. ఇప్పటికే 25 శాతం మద్యం దుకాణాలు, బార్లు తగ్గించామని, మద్యం విక్రయాల వేళల్లోనూ మార్పులు చేశామన్నారు. జిల్లాల్లో డీ–అడిక్షన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖను ఆదేశించామన్నారు. భారీ జరిమానాలు... మద్యపానం, డ్రగ్స్ వల్ల కలిగే అనర్ధాలపై విద్యార్థులకు అవగాహన కల్పించే విధంగా నైతిక విద్యలో బోధనాంశాలు చేర్చాలని విద్యాశాఖను ఆదేశించినట్లు సీఎం జగన్ తెలిపారు. అక్రమ మద్యం, తయారీ, రవాణా, విక్రయాలకు పాల్పడితే నాన్ బెయిలబుల్ కింద కేసులు నమోదు చేసి కనీసం ఆరు నెలల జైలుశిక్షతోపాటు తొలిసారి రూ.రెండు లక్షలు అపరాధ రుసుం వసూలు చేస్తామని హెచ్చరించారు. రెండోసారి కూడా ఇలాంటి తప్పులు చేస్తే జరిమానా రూ.5 లక్షలకు పెంచుతామన్నారు. బార్లలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తే రెండు రెట్ల ఫీజు అపరాధ రుసుము కింద వసూలు చేస్తామని, రెండోసారి ఇదే నేరం చేస్తే నిర్మొహమాటంగా లైసెన్సు రద్దు చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు చట్టంలో సవరణలు చేస్తున్నట్లు తెలిపారు. టార్గెట్లు పెట్టి మరీ విక్రయాలు.. ’’మేం ఎక్సైజ్ పాలసీని 2019 అక్టోబరు 1న ప్రకటించాం. రాష్ట్రంలో అంతకుముందు 43 వేల బెల్టు షాపులుండేవి. గతంలో ప్రభుత్వ పాలసీ ఎలా ఉండేదంటే విక్రయాలు నెలకు 15 శాతం చొప్పున పెరగాలని టార్గెట్ విధించేవారు. అలా విక్రయాలు పెంచితే ప్రోత్సాహకాలు కూడా ఇచ్చేవారు. సాక్షాత్తూ ప్రభుత్వమే అలా టార్గెట్లు పెట్టడంతో ఎక్సైజ్ శాఖపై ఒత్తిడి ఉండేది. షాపులు కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉండడంతో విక్రయాలు పెంచేందుకు యథేచ్ఛగా బడి, గుడి.. ఎక్కడబడితే అక్కడ కనీసం 10 బెల్టు షాపులు నడిపించే వారు. అలా రాష్ట్రంలో 43 వేల బెల్టుషాపులు నడిపారు. మద్యం అమ్మకాలను గ్రామ స్థాయికి తీసుకెళ్లి ప్రతి మనిషిని తాగుబోతుగా చేయాలనే ఆలోచనతో జరిగిన ప్రక్రియ అది. మేం అధికారంలోకి వచ్చాక ఒక్క బెల్టు షాపు కూడా లేకుండా చేశామని సభా వేదికగా గర్వంగా చెబుతున్నా. కారణం ఏమిటంటే ఇంతకు ముందు ప్రైవేట్ వ్యక్తులు షాపులు నడిపేవారు. వాళ్లు లాభాపేక్షతో, అమ్మకాలు పెంచుకుంటే ఇంకా లాభాలు పెరుగుతాయని గ్రామాల్లోకి బెల్టు షాపులు విస్తరించారు’’ అని సీఎం అన్నారు. ఐఎంఎల్, బీర్ల విక్రయాలపై ఇవీ వాస్తవాలు.. 2018తో పోల్చితే 2019లో సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు నెలల్లో మద్యం అమ్మకాలు తగ్గాయి. ఇండియన్ మేడ్ లిక్కర్ (ఐఎంఎల్) సెప్టెంబరు 2018లో 34.20 లక్షల కేసులు అమ్ముడు కాగా అవి సెప్టెంబరు 2019 నాటికి 22.26 లక్షల కేసులకు పడిపోయాయి. అంటే ఐఎంఎల్ అమ్మకాలు 34.92 శాతం తగ్గాయి. అదే సమయంలో అంటే 2018 సెప్టెంబరులో బీర్లు 22.19 లక్షల కేసులు అమ్ముడు పోగా 2019 సెప్టెంబరులో అవి 16.46 లక్షల కేసులకు పడిపోయాయి. అంటే బీర్ల అమ్మకాలు 34.84 శాతం తగ్గాయి. ► ఐఎంఎల్ అమ్మకాలు 2018 అక్టోబరులో 32.28 లక్షల కేసులు కాగా 2019 అక్టోబరులో అవి 24.18 లక్షల కేసులకు పడిపోయాయి. అంటే 25.11 శాతం అమ్మకాలు తగ్గాయి. 2018 అక్టోబరులో 23.86 లక్షల కేసుల బీరు అమ్ముడు పోగా 2019 అక్టోబరులో కేవలం 10.59 లక్షల కేసుల బీరు మాత్రమే అమ్ముడైంది. అంటే బీర్ల అమ్మకాలు 55.62 శాతం తగ్గాయి. ► 2018 నవంబరులో ఐఎంఎల్ 29.62 లక్షల కేసులు అమ్ముడుపోగా, 2019 నవంబరులో కేవలం 22.62 లక్షల కేసులు మాత్రమే అమ్ముడయ్యాయి. అంటే ఆ సమయంలో లిక్కర్ అమ్మకాలు 23.63 శాతం తగ్గాయి. ఇక బీర్ల అమ్మకాలు 2018 నవంబరులో 17.80 లక్షల కేసులు కాగా సరిగ్గా ఏడాది తర్వాత 2019 నవంబరులో కేవలం 8.15 లక్షల కేసుల బీరు మాత్రమే అమ్ముడు పోయింది. అంటే బీర్ల అమ్మకాలు 54.22% తగ్గాయి. ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే... లాభాపేక్ష లేకుండా రద్దు చేశాం.. ‘మేం అధికారంలోకి వచ్చాక ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యాన్ని ప్రోత్సహించరాదని షాపులను కుదించి ప్రభుత్వమే స్వయంగా నడపడం మొదలు పెట్టింది. లాభాపేక్ష లేకుండా మొత్తం 43 వేల బెల్టుషాపులు రద్దు చేశాం. పర్మిట్ రూమ్‌లు రద్దు మద్యం షాపులు తగ్గించడమే కాకుండా పర్మిట్ రూమ్‌లను ఎత్తివేశాం. గతంలో మద్యం షాపుల పక్కన పర్మిట్‌రూమ్‌లో తాగుబోతులంతా కూర్చొని తాగుతుంటే ఆ పక్క నుంచి ఒక అక్క కానీ, చెల్లెమ్మ కానీ నడుచుకుంటూ వెళ్లాలంటే వెళ్లగలరా? ఓ అమ్మాయి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లగలదా? చంద్రబాబు హయాంలో అంత దారుణమైన పరిస్థితి ఉంటే మేం అధికారంలోకి వచ్చాక షాపులు తగ్గించాం. బెల్టు షాపులు లేకుండా చేశాం. పర్మిట్ రూమ్‌లు పూర్తిగా రద్దు చేశాం. విక్రయాల వేళలు కుదింపు మేం మద్యం అమ్మకాల సమయాన్ని కూడా కుదించాం. అంతకు ముందు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు విక్రయాలని చెబుతూ రాత్రి 11, 12 గంటల వరకు కూడా విక్రయించేవారు. ఇవాళ ప్రభుత్వం మద్యం షాపులను ఉదయం 11 నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకే తెరుస్తోంది. మద్యం కొనుగోళ్లపై నిబంధన గతంలో ఒక వ్యక్తికి ఒకేసారి ఆరు బాటిళ్ల వరకూ విక్రయించే వారు. మేం దానిని మూడు బాటిళ్లకు కుదించాం. లిక్కర్ రేట్లు షాక్ కొట్టే విధంగా ఉంటాయని నా పాదయాత్ర సందర్భంగా చెప్పా. ఇవాళ అక్షరాలా అదే అమలు చేస్తున్నానని గర్వంగా చెబుతున్నా. ఇందులో ఎలాంటి మొహమాటం లేదు. జిల్లాకో డీ అడిక్షన్ కేంద్రం ప్రతి జిల్లాలో డీఅడిక్షన్ కేంద్రాల ఏర్పాటు కోసం చర్యలు తీసుకోవాలని ఈ ఏడాది సెప్టెంబరు 25న జీవో ఇచ్చాం. మద్యపానం, డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే అనర్ధాలపై విద్యార్థులకు అవగాహన కల్పించే విధంగా నైతిక బోధనాంశం చేర్చాలని విద్యాశాఖకు కూడా సెప్టెంబరు 25న ఆదేశాలు జారీ చేశాం. సచివాలయాల్లో మహిళా పోలీసులు ఇవాళ 14 వేలకు పైగా మహిళా పోలీసులు గ్రామ సచివాలయాల్లో పని చేస్తున్నారు. వాళ్లు గ్రామాల్లో పోలీసింగ్ చేస్తున్నారు. ఎక్కడైనా అక్రమ మద్యం, బెల్టు షాపులు, కల్తీ మద్యం ఉంటే వెంటనే రిపోర్ట్ చేస్తారు. నిఘా కోసం అదనపు డీజీ సురేంద్రబాబుకు బాధ్యతలు అప్పగించాం. గ్రామ మహిళా పోలీసు నుంచి ఫోన్ రాగానే ఒక టీమ్ అక్కడికి చేరుకుంటుంది. ఇలా గ్రామాల్లో ఎక్కడా అక్రమ మద్యం లేకుండా చర్యలు చేపడుతున్నాం. ప్రతి అడుగూ మద్య నియంత్రణ దిశగా మద్య విమోచన ప్రచార కమిటీని ఏర్పాటు చేశాం. లక్ష్మణరెడ్డి మార్గనిర్దేశంలో ఈ కార్యక్రమం సాగుతోంది. ప్రతి అడుగు మద్య నియంత్రణ దిశగా వేస్తున్నాం. ఇందులో భాగంగానే ఈ చట్టం చేస్తున్నాం. గతంలో 840 బార్లు ఉండగా వాటిని 487కి తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేశాం. ఆ మేరకు నోటిఫికేషన్ కూడా విడుదలైంది. ఈ చర్యలన్నీ ప్రజలను క్రమంగా మద్యానికి దూరం చేస్తాయని, తద్వారా సత్ఫలితాలు వస్తాయని, దీర్ఘకాలంలో వారికి ఎంతో మేలు జరుగుతుందని ఆశిస్తున్నా’ అనుకున్న దానికంటే ఎక్కువ విజయవంతం దశలవారీ మద్య నిషేధంతో సత్ఫలితాలు: మంత్రి నారాయణస్వామి తొలి సంతకం పేరుతో బాబు మోసం : రోజా చంద్రబాబు మద్యం ఏరులై పారించారు : భూమన 28 శాతం మరణాలకు మద్యమే కారణం : రజని ఎక్సైజ్ చట్టం సవరణ బిల్లులపై చర్చలో సభ్యులు సాక్షి, అమరావతి: దశల వారీగా మద్య నిషేధం, నియంత్రణకు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం సత్ఫలితాలిస్తోందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి కె. నారాయణస్వామి అన్నారు. అక్రమ మద్యం తయారీ, విక్రయం, రవాణా చేసే వారిపై కూడా ఉక్కుపాదం మోపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ చట్టంలో పలు సవరణల చేసింది. ఇందుకు సంబంధించి సర్కారు సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రెండు బిల్లులు ఆమోదం పొందాయి. ఈ సందర్భంగా సభలో పలువురు సభ్యులు మాట్లాడారు. బిల్లు ఉద్దేశ్యాలపై నారాయణస్వామి మాట్లాడుతూ.. మద్యం దుకాణాలు తగ్గించడం, వాటి సమయాలు కుదించడం, ధరలు పెంచడం వంటి చర్యలు ఆశించిన దానికంటే ఎక్కువే విజయవంతమయ్యాయన్నారు. రాష్ట్రంలో మద్యం అమ్మకాలు తగ్గాయని.. ఫలితంగా నేరాలు తగ్గడంతోపాటు సామాజికంగానూ సానుకూల పరిణామాలు ఏర్పడుతున్నాయని ఆయన చెప్పారు. చర్చలో ఇంకా ఎవరెవరు ఏం మాట్లాడారంటే.. చంద్రబాబుది ‘విత్త’శుద్ధి : భూమన మద్యం నిషేధం విషయంలో చంద్రబాబుది విత్త (ఆదాయం)శుద్ధి అయితే సీఎం వైఎస్ జగన్‌ది చిత్తశుద్ధని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. ఎన్టీ రామారావు విధించిన మద్య నిషేధాన్ని తొలగించి రాష్ట్రంలో మద్యం ఏరులై పారేలా చేసింది చంద్రబాబేనని ఆయన విమర్శించారు. పేదల బతుకుల్లో ఆయన మద్యం చిచ్చు పెట్టారని ఆయన దుయ్యబట్టారు. కానీ, ప్రభుత్వ ఆదాయం తగ్గినా పర్వాలేదంటూ వైఎస్ జగన్ మద్యం మహమ్మారిని అరికట్టేందుకే నిర్ణయించారన్నారు. చంద్రబాబుది బ్రాందీ పాలన : రోజా రాష్ట్రంలో చంద్రబాబు బ్రాందీ పాలన సాగించగా... ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ గాంధీ పాలన తీసుకువచ్చారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. అధికారం చేపట్టగానే చంద్రబాబు చేసిన తొలి ఐదు సంతకాల్లో బెల్టు దుకాణాల తొలగింపు ఫైలుపై ఒకటి చేశారని ఆమె గుర్తుచేశారు. కానీ, 2019లో ఆయన అధికారం కోల్పోయే నాటికి రాష్ట్రంలో 43 వేల బెల్టు షాపులున్నాయంటే ఆయన తొలి సంతకం పేరుతో ప్రజల్ని ఎంతగా మోసం చేసిందీ తెలుస్తోందన్నారు. కానీ, వైఎస్ జగన్ 43 వేల బెల్టు దుకాణాలను తొలగించడంతోపాటు మద్యం దుకాణాలు 43 శాతం, బార్లు 40 శాతం తగ్గించారని రోజా చెప్పారు. ‘పులిహోరా తింటే పులి కాలేరని.. టీడీపీ నేతలు అంతా పులిహోరా బ్యాచ్’ అని ఆమె ఎద్దేవా చేశారు. ఉల్లంఘనులపై కఠిన చర్యలు : రజిని మద్య నిషేధానికి ప్రభుత్వం చేసిన చట్టాలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వి. రజిని ప్రభుత్వాన్ని కోరారు. ఏటా సంభవిస్తున్న మరణాల్లో 28 శాతం మద్యపానం కారణంగానే జరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక వెల్లడించిందని ఆమె అన్నారు. టీడీపీ పాలనలో మంచినీళ్లు దొరకని గ్రామాలు ఉన్నాయిగానీ మద్యం దొరకని ఊరులేదని విమర్శించారు. -
భారీగా పెరిగిన మద్యం ధరలు
సాక్షి, హైదరాబాద్: కొత్త సంవత్సర వేడుకలకు ముందు మద్యం ప్రియులకు తెలంగాణ ప్రభుత్వం షాకిచ్చింది. మద్యంపై పదిశాతం ధరలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. క్వార్టర్‌పై రూ.20, హాఫ్‌పై రూ.40, ఫుల్‌పై రూ.80 పెంచుతున్నట్లు అబ్కారీశాఖ తెలిపింది. ఈ మేరకు ఆ శాఖ కార్యదర్శి సోమేష్ కుమార్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పెరిగిన ధరలు రేపటి నుంచి (మంగళవారం) అమల్లోకి రానున్నాయి. పాత మద్యం నిల్వలకు కొత్త ధరల పెంపు వర్తించదని ఎక్సైజ్‌శాఖ తెలిపింది. పెరిగిన ధరలతో ప్రభుత్వానికి రూ.300 నుంచి రూ.400 కోట్ల వరకు అదనపు ఆదాయం సమకూరనుంది. -
మద్యం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? : ఎమ్మెల్యే
గద్వాల అర్బన్: నడిగడ్డలో మద్యం ఏరులై పారించిన డీకే అరుణ మహిళలకు క్షమాపణ చెప్పి మద్య నిషేధంపై ఉద్యమించాలని ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. డీకే బంగ్లా రాజకీయ పునాదులు మద్యం, లిక్కర్‌పైనే ప్రారంభమైందని ధ్వజమెత్తారు. డీకే అరుణ మంత్రిగా ఉన్నప్పుడు గద్వాల చుట్టూ సుమారు 40 దాబాలు, బెల్ట్ షాపులు విచ్చలవిడిగా ఉండేవన్నారు. స్వయంగా తన చేతులమీదుగా దాబా లు ప్రారంభించిన ఘనత ఆమెకే దక్కుతుందన్నారు. అలాంటి వ్యక్తి మద్యపాన నిషేధం అంటూ నాటకాలు ఆడితే ప్రజలు హర్షించర న్నారు. ప్రస్తుతం కూడా ఉమ్మడి జిల్లావ్యాప్తం గా సుమారు 25 మద్యం షాపులు ఆమె భర్త మాజీ ఎమ్మెల్యే భరతసింహారెడ్డి నడుపుతున్నారని, ఇదే విషయాన్ని ఆయనే స్వయంగా మీడి యా ముందు వెల్లడించారని గుర్తుచేశారు. మ ద్యపాన నిషేధంపై ఉద్యమించడం తప్పు కాదని, అయితే మద్యం, లిక్కర్‌పై వారి రాజకీయ జీవితం ప్రారంభమైన విషయాన్ని గుర్తించాలన్నారు. ప్రభుత్వంపై నిందలు వేస్తే సహించేది లేదన్నారు. నిజంగా మహిళలపై ప్రేమ, మద్యపాన నిషేధంపై చిత్తశుద్ధి ఉంటే ముందు మీ భర్త నిర్వహిస్తున్న మద్యం షాపులను రద్దు చేసుకొని, మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాం డ్ చేశారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేశవ్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు చెన్నయ్య, ఎంపీపీలు ప్రతాప్‌గౌడ్, విజయ్‌కుమార్, జెడ్పీటీసీ సభ్యుడు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
మద్యపాన నిషేధంపై సీఎం జగన్ మరో ముందడుగు
సాక్షి, అమరావతి : మద్యపాన నిషేధంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో ముందడుగు వేశారు. రాష్ట్రంలో ఉన్న బార్ల సంఖ్యను 40 శాతానికి తగ్గించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. బార్ల పాలసీపై మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో స్టార్ హోటళ్లు మినహా ప్రస్తుతం ఉన్న 798 బార్లను 40శాతానికి ప్రభుత్వం తగ్గించనుంది. బార్ల సంఖ్యను 50శాతానికి తగ్గించాలన్న సీఎం ఆదేశాల నేపథ్యంలో.. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 20శాతం మద్యం దుకాణాలను తగ్గించామని, విడతల వారీగా పూర్తిగా తగ్గిస్తామని అధికారులు తెలిపారు. ఇక బార్ల సంఖ్యను కుదించే క్రమంలో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అక్కడ మద్యం సరఫరా వేళల్ని కుదించింది. బార్లలో మద్యం సరఫరాకు ఉదయం 11 నుంచి రాత్రి 10 వరకూ, ఆహారం రాత్రి 11 వరకు.. స్టార్ హోటళ్లలో మద్యం అమ్మకాలు.. ఉదయం 11నుంచి రాత్రి 11 వరకు అనుమతి ఉంటుంది. దీంతోపాటు మద్యం ధరలను పెంచే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది. మద్యం కల్తీకు పాల్పడినా, స్మగ్లింగ్ చేసినా, నాటుసారా తయారు చేసినా కఠిన చర్యలు ఉంటాయని, నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. లైసెన్స్ ఫీజుకు 3 రెట్లు జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష విధించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. మద్యం, ఇసుక విషయంలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకునేలా వచ్చేఅసెంబ్లీ సమావేశాల్లో చట్టాలు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. నిబంధనలు అతిక్రమిస్తే.. రాష్ట్రంలో 40 శాతం బార్లను తగ్గిస్తున్నామని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘ఇప్పుడున్న బార్లు మొత్తం తీసేస్తామని, కొత్తగా 40 శాతం తగ్గించి బార్లకు అనుమతులు ఇస్తాం. మద్యపాన నిషేధం అమలులో భాగంగా బార్లు తగ్గిస్తున్నాం. వాటి టైమింగ్స్ కూడా మార్చాం. బార్లలో మద్యం ధరలను కూడా పెంచుతాం. లాటరీ పద్ధతిలో బార్ల ను కేటాయిస్తాం. బార్ల పాలసీలో నిబంధనలు అతిక్రమించేవారికి జైలు శిక్ష వేసేలా చర్యలు తీసుకుంటున్నాం’అన్నారు. -
పోలీసులపై కారం చల్లి..
సాక్షి, అనకాపల్లి : అనకాపల్లి మండలం తగరంపూడిలో మద్యం బెల్టు దుకాణం నిర్వాహకులు శుక్రవారం పోలీసులపై కారం చల్లి తిరుగుబాటు చేసింది. రూరల్ ఎస్ఐ పి.రామకృష్ణ కథనం మేరకు వివరాలిలావున్నాయి. మండలంలోని రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో తగరంపూడి గ్రామంలో మద్యం బెల్టు దుకాణం నిర్వహిస్తున్నట్టు పోలీసులకు సమాచారంఅందింది. తక్షణమే అదనపు ఎస్ఐ ఎ.వెంకటేశ్వరరావు, హెచ్‌సీ మల్లేశ్వరి, కానిస్టేబుళ్లు కె.అప్పలనాయుడు, రాజ్‌కుమార్ గ్రామానికి చేరుకున్నారు. మద్యం విక్రయిస్తున్న కొప్పుల వెంకటలక్ష్మి దుకాణంలోకి ప్రవేశించి మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.దీంతో అసహనానికి గురైన కొప్పుల వెంకటలక్ష్మి, భర్త ప్రసాదరావు, తల్లి భాషణ పార్వతి, సోదరుడు చిన్నారావు కానిస్టేబుళ్ళ కంటిపై కారం చల్లి తప్పించుకునే ప్రయత్నం చేశారని అదనపు ఎస్ఐ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన వివరించారు. -
నూతన విధానం
-
బార్ల ‘మందు’చూపు
బార్ల నిర్వాహకులు ‘మందు’చూపుతో వ్యవహరిస్తున్నారు. ఎక్సైజ్ అధికారులను మచ్చిక చేసుకుని మద్యం నిల్వలను డంప్ చేస్తున్నారు. కోరిన మద్యం అందజేస్తూ కాసులు కురిపించుకుంటున్నారు. వైన్ షాపులకు సరుకు సరఫరా కాకుండా చూస్తూ దందా సాగిస్తున్నారు. ఎక్సైజ్ అధికారులను మామూళ్ల మత్తులో ముంచి మందు బాబులను పిండేస్తున్నారు. సాక్షి, అనంతపురం సెంట్రల్ : మద్య నిషేధంలో భాగంగా ప్రభుత్వం మద్యం దుకాణాల సంఖ్య తగ్గించడంతో పాటు వేళలను కూడా మార్చింది. కానీ దీన్ని పకడ్బందీగా అమలు చేయాల్సిన ఎక్సైజ్ శాఖ సర్కార్ లక్ష్యానికి తూట్లు పొడుస్తోంది. బార్ల నిర్వాహకులతో కుమ్మక్కై మందుబాబుల జేబుకు చిల్లు పెడుతోంది. బార్ నిర్వాహకులకు కాసులపంట అక్టోబర్ 1 నూతన మద్యం పాలసీ అమల్లోకి రాగా.. అప్పటి వరకూ నడుస్తున్న ప్రైవేటు మద్యం దుకాణాలు రద్దయ్యాయి. వాటిస్థానంలో ప్రభుత్వమే దుకాణాలను ఏర్పాటు చేసింది. జిల్లాలో 247 మద్యం దుకాణాలున్న చోట 20 శాతం కుదించి 197 దుకాణాలను ఏర్పాటు చేశారు. ఇలా ఏటా 20 శాతం మద్యం దుకాణాలను తగ్గించేలా ప్రభుత్వం పాలసీని తీసుకొచ్చింది. దశల వారీగా మద్యానికి సామాన్యులకు దూరం చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోంది. అయితే ఇది కాస్తా బార్ల యజమానులకు కలసివస్తోంది. రాత్రి 11 గంటల వరకు అనుమతి ఉండటం.. ఎక్సైజ్ అధికారుల ప్రోత్సాహం తోడు కావడంతో బార్ల నిర్వాహకులకు కాసుల పంట పండుతోంది. సరాఫరా నుంచే.. జిల్లాకు వచ్చిన స్టాకు మొత్తం బార్ల యజమానులు తన్నుకుపోతున్నారు. దీంతో ప్రభుత్వ మద్యం దుకాణాలు వెలవెలబోతున్నాయి. ఎక్సైజ్ అధికారుల సహకారంతో రెండు నెలల ముందు నుంచి బార్లలో రూ.కోట్లు విలువజేసే మద్యాన్ని డంప్ చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో మందుబాబులు బార్ల వద్దకే క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల అమ్మకాలు భారీగా పెరిగాయి. రోజుకు రూ.లక్ష జరిగే బార్లు.. నేడు రూ.10 లక్షల వరకూ కౌంటర్ జరుగుతోందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. బార్ల యజమానులతో ఎక్సైజ్ అధికారులు కుమ్మక్కు కావడంతోనే ఇది సాధ్యమవుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిబంధనలన్నీ తూచ్ నిబంధనల ప్రకారం బార్లలో ఫుల్‌బాటిళ్లు మాత్రమే విక్రయించాలి. కానీ అనంతలో క్వాటర్ బాటిల్ నుంచి లభ్యమవుతున్నాయి. ఎక్సైజ్ అధికారులే అధికారికంగా బార్లకు సరఫరా చేస్తుండడం గమనార్హం. కొన్ని బార్లలో లూజు విక్రయాలు కూడా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఎంఆర్పీ ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతోంది. ఫుల్‌బాటిల్‌పై రూ.100 అదనంగా వసూలు చేస్తున్నారు. బార్లలో జరుగుతున్న అక్రమాల గురించి ఎక్సైజ్ అధికారులకు తెలిసినప్పటికీ కనీస తనిఖీలు చేయడం లేదు. జిల్లాలో ఎక్కడా ఒక్క కేసూ నమోదు కాని పరిస్థితి. దీని వెనుక ఎక్సైజ్ అధికారులకు నెలనెలా మామూళ్లకు ఒప్పందం కుదిరిందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. బార్లలో దోపిడీ ఇలా.. బ్రాండ్ పేరు వైన్‌షాపు ధర(క్వాటర్) బార్ ధర(క్వాటర్) మ్యాన్షన్‌హౌస్ 150 180–200 ఎంసీ బ్రాందీ 140 170–190 మార్ఫియస్ 250 280–300 కింగ్‌ఫిషర్(స్ట్రాంగ్ బీరు) 130 160–170 నాకౌట్ 130 160–180 హేవర్డ్స్ (చీప్ లిక్కర్) 120 150–160 కొరియర్ గ్రీన్ విస్కీ 230 260–290 ఐబీ విస్కీ 150 180–190 -
ఆబ్కారీ బోణీ రూ.80.26 కోట్లు
సాక్షి, కరీంనగర్ : నూతన ఎక్సైజ్ పాలసీ అమలులోకి రాకముందే ఆబ్కారీ శాఖ గణమైన బోణీ కొట్టింది. 2019–21 కింద రెండేళ్ల కాలానికి మద్యం దుకాణాల(ఏ–4 షాప్స్) నిర్వహణకు దరఖాస్తులు ఆహ్వానించగా, ఉమ్మడి జిల్లాలోని 266 దుకాణాలకు ఏకంగా 4,013 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు రుసుం రూపంలోనే ఎక్సైజ్ శాఖ ఏకంగా రూ.80.26 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకుంది. ఉమ్మడి జిల్లాలో ఒక్కో దుకాణానికి సగటున 15.01 దరఖాస్తులు అందగా, జగిత్యాల జిల్లాలో పోటీపడ్డ వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మద్యం దుకాణాలు ఏర్పాటుకు వ్యాపారులు పెద్ద ఎత్తున పోటీ పడ్డారు. 2019–21 సంవత్సరాల కోసం(రెండేళ్ల పాటు) మద్యం దుకాణాల లైసెన్స్ కోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు కూడా ఉమ్మడి జిల్లాలో దరఖాస్తు చేసుకు న్నారు. దరఖాస్తుల దాఖలుకు బుధవారంతో గడువు ముగియగా, అర్ధరాత్రి వరకు దరఖాస్తులను స్వీకరించారు. శుక్రవారం ఆయా జిల్లా కేంద్రాల్లో దరఖాస్తుదారులకు లక్కీ డ్రా ద్వారా దుకాణాలను కేటాయిస్తారు. అదృష్టం కలిసి రాకపోతే దరఖాస్తుకు వెచ్చించిన రూ.2లక్షలు తిరిగిరావు. కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 266 మద్యం దుకాణాల ఏర్పాటుకు అవకాశం ఉండగా, ఎన్నడూ లేని విధంగా 4,013 మంది దరఖాస్తు చేసుకున్నారు. అంటే సగటున ఒక్కో దుకాణానికి 15 మంది చొప్పున దరఖాస్తు చేసుకున్నారు. జగిత్యాల, కరీంనగర్‌తో పోలిస్తే పెద్దపల్లి, రాజన్న సిరిసిల్లల్లో పోటీ కొంత తక్కువగా ఉంది. వీరిలో 480 మంది మహిళలు కావడం గమనార్హం. ఒక్కో దరఖాస్తుకు నాన్ రిఫండబుల్(తిరిగి చెల్లించని) రుసుం రూ.2 లక్షలు కాగా, ఈ దరఖాస్తుల ద్వారా ఆబ్కారీ శాఖకు వచ్చిన ఆదాయం రూ.80.26 కోట్లు. ఈసారి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మద్యం వ్యాపారులు కూడా తెలంగాణలో దుకాణాలు దక్కించుకునేందుకు స్థానికుల భాగస్వామ్యంతో దరఖాస్తు చేయించినట్లు తెలిసింది. ఈ తరహాలో కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో ఏపీకి చెందిన వారు స్థానికుల భాగస్వామ్యంతో దరఖాస్తులు అందజేశారు. దీంతో దరఖాస్తుల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. అదే సమయంలో జిల్లాకు చెందిన వ్యాపారులు ఐదుగురు అంతకన్నా ఎక్కువ మంది రింగ్ అయి, డిమాండ్ ఉన్న షాపులకు దరఖాస్తులు చేసుకున్నారు. ఉమ్మడి జిల్లాలో ఒక్కో షాపు కోసం సగటున 15 మంది దరఖాస్తు చేయడంతో 266 షాపులకు గాను ఎక్సైజ్ శాఖకు ఏకంగా రూ.80.26 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ దరఖాస్తుల్లో సగానికి పైగా చివరిరోజైన బుధవారం నాడు దరఖాస్తు చేసుకున్నవే. జగిత్యాలలో సగటున 20 దరఖాస్తులు మద్యం దుకాణాలకు దరఖాస్తులు చేసుకోవడంలో కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో తీవ్ర పోటీ నెలకొంది. కరీంనగర్ జిల్లాలో 87 షాపులు ఉండగా, వీటిని దక్కించుకునేందుకు 1346 మంది దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఒక్కో షాపు కోసం సగటున 15.5 దరఖాస్తులు వచ్చాయి. ఇక్కడ మహిళా దరఖాస్తుదారులే 170 మంది ఉండడం విశేషం. ఈ ఒక్క జిల్లా నుంచే దరఖాస్తులను విక్రయించడం ద్వారా రూ.26.92 కోట్లు ఆబ్కారీ శాఖకు ఆదాయం సమకూరింది. ఇక జగిత్యాల జిల్లాలో 64 దుకాణాలే ఉండగా, 1285 మంది దరఖాస్తు చేసుకున్నారు. అంటే సగటున ఒక దుకాణానికి 20 దరఖాస్తులు వచ్చాయి. ఈ జిల్లాలో దరఖాస్తుల ద్వారా ఎక్సైజ్ శాఖకు రూ.25.70 కోట్లు ఆదాయం సమకూరింది. 161 మంది మహిళలు అదృష్టాన్ని నమ్ముకోవడం గమనార్హం. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రాఘవపేట మద్యం దుకాణం కోసం ఏకంగా 48 మంది దరఖాస్తులు దాఖలు చేశారు. కరీంనగర్ జిల్లాలో మానకొండూరు మండలం 48వ దుకాణానికి 41 దరఖాస్తులు అందాయి. కరీంనగర్ పట్టణంలో లైసెన్స్ ఫీజు ఎక్కువగా ఉండడం, ఇక్కడ పాతుకుపోయిన ఒకటి రెండు దుకాణాలతో పోటీ పడి విక్రయాలు జరపలేమని పలువురు వ్యాపారులు ఆదాయం అధికంగా ఉండే ఇతర ప్రాంతాల్లో దరఖాస్తులు చేసుకున్నారు. అంచనాలు తప్పిన పెద్దపల్లి మద్యం విక్రయాల్లో పెద్దపల్లి జిల్లా ముందంజలో ఉంటుంది. సింగరేణి కాలరీస్ నెలవై ఉన్న రామగుడం కార్పొరేషన్ , పెద్దపల్లి జిల్లా కేంద్రాలతోపాటు రాష్ట్ర, జిల్లాల సరిహద్దు ప్రాంతాలు కూడా ఈ జిల్లాలో అధికం. గోదావరి ఖని కోల్‌బెల్ట్ ఏరియాలోనే రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు జరుగుతాయి. ఈ కొత్త లైసెన్సుల కోసం దరఖాస్తులు మాత్రం సింగరేణి కోల్‌బెల్ట్ నుంచి తక్కువగా రావడం గమనార్హం. దీనిని బట్టి ఇక్కడి వ్యాపారులు రింగ్ అయి పరస్పర ఒప్పందంతో కలిసి దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం మద్యం దుకాణాలు నడుపుతున్న వ్యాపారులే సిండికేట్ అయి దరఖాస్తులు దాఖలు చేసినట్లు తెలిసింది. ఒక్కో దుకాణానికి రెండు లేదా మూడు మాత్రమే దరఖాస్తులు వచ్చాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ జిల్లాలో ఓదెల మండలం పొత్కపల్లి, ఎలిగేడ్ మండల కేంద్రం దుకాణాలకు మాత్రమే 28 మంది చొప్పున దరఖాస్తు చేసుకోగా, గర్రెపల్లి దుకాణానికి 27 మంది పోటీ పడ్డారు. జిల్లాలో 61 మంది మహిళలు మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకోగా, సుల్తానాబాద్ సర్కిల్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోనే 34 మంది పోటీ మహిళలు పోటీ పడడం విశేషం. సిరిసిల్లలో 41 దుకాణాలకు 648 దరఖాస్తులు రాజన్న సిరిసిల్ల జిల్లాలో 41 దుకాణాలకు గాను 648 దరఖాస్తులు అందాయి. వీటిలో 88 మంది మహిళా దరఖాస్తుదారులు ఉన్నారు. కాగా ఈ దరఖాస్తుదారుల ద్వారా ఎక్సైజ్ శాఖకు 12.96 కోట్లు ఆదాయంగా సమకూరనుంది. సిరిసిల్లలోని 6వ నెంబర్ దుకాణానికి అత్యధికంగా 36 మంది దరఖాస్తు చేసుకోగా రుద్రంగి మండలంలోని మానాల మద్యం దుకాణానికి అత్యల్పంగా కేవలం 2 దరఖాస్తులు వచ్చాయి. నేడు లక్కీ డ్రా ద్వారా కేటాయింపులు ఎక్సైజ్ శాఖకు జిల్లాల వారీగా వచ్చిన సీల్డ్ దరఖాస్తులను శుక్రవారం ఆయా జిల్లా కేంద్రాలలో తెరవనున్నారు. జిల్లా కలెక్టర్ లేదా జాయింట్ కలెక్టర్ సమక్షంలో దుకాణాల వారీగా విభజించి, లక్కీ డ్రా ద్వారా కేటాయింపులు జరపనున్నారు. ఈ మేరకు ఎంపిక చేసిన ఆడిటోరియాలలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
'మద్యం' లక్కు ఎవరిదో ?
సాక్షి, ఆదిలాబాద్ : ఒక్కొక్క మద్యం దుకాణం కోసం పదుల సంఖ్యలో దరఖాస్తులు.. షాపు మాత్రం దక్కేది ఒక్కరికే. లక్కీడ్రాలో ఎవరికి మద్యం షాపు దక్కుతుందో నేడు తేలిపోనుంది. బుధవారంతో కొత్త మద్యం పాలసీ దరఖాస్తుల ప్రక్రియ పూర్తి కాగా, శుక్రవారం ఈ టెండర్లకు సంబంధించి లక్కీ డ్రా నిర్వహిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జనార్దన్‌రెడ్డి గార్డెన్స్‌లో ఉదయం 10 గంటల నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. కలెక్టర్ సమక్షంలో.. కలెక్టర్ దివ్యదేవరాజన్ సమక్షంలో ఈ లక్కీడ్రా ప్రక్రియ చేపట్టనున్నారు. డీపీఈఓ రవీందర్‌రాజు, సీఐలు, ఎస్సైలు, ఎక్సైజ్ సిబ్బంది ఇందులో పాల్గొననున్నారు. జిల్లాలో 31 మద్యం దుకాణాల కోసం 528 దరఖాస్తులు వచ్చాయి. సంఖ్య నంబర్ పరంగా మొదటి షాపు నుంచి చివరి షాపు వరకు ఈ లక్కీడ్రా కొనసాగుతుంది. ఇందుకోసం ఎక్సైజ్ శాఖాధికారులు జనార్ధన్ రెడ్డి గార్డెన్స్‌లో ఏర్పాట్లు చేశారు. దరఖాస్తుదారు తప్పనిసరి.. ఈ టెండర్లలో దరఖాస్తుదారు తప్పనిసరి పాల్గొనాలి. లేనిపక్షంలో అతని దరఖాస్తును డిస్క్వాలిఫై చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. అదేవిధంగా రూ.5లక్షల ఫెనా ల్టీ విధించనున్నట్లు పేర్కొంటున్నారు. తద్వారా లక్కీడ్రా సమయంలో దరఖాస్తుదారు లేనిపక్షంలో అతని పేరును తొలగిస్తారు. ఇదిలా ఉంటే లక్కీడ్రాలో షాపు దక్కిన వ్యక్తి వార్షిక అద్దె పరంగా రెండు సంవత్సరాలది కలిపి 8 విడతల్లో చెల్లించాల్సి ఉండగా, మొదటి విడత 1/8వ వంతు అప్పుడే చెల్లించాల్సి ఉంటుంది. దీని కోసం ఇదే ప్రాంగణంలో బ్యాంక్ కౌంటర్ ఏర్పాటు చేశారు. లక్కీడ్రా రోజే 31 దుకాణా లకు సంబంధించి రెండేళ్ల లైసెన్స్ ఫీజులో 1/8వ వంతు శుక్రవారమే వసూలు కానుంది. ఆదాయం భళా.. జిల్లాలో దరఖాస్తు ఫీజు ద్వారా రూ.10.56 కోట్ల ఆదాయం రాగా, రెండేళ్ల లైసెన్స్ ఫీజు ద్వారా 31 షాపులకు మొత్తంగా 8 విడతల్లో కలిపి రూ.35.30 కోట్ల రాబడి రానుంది. 2017–19 పాలసీలో దరఖాస్తుల ద్వారా రూ.5.59 కోట్లు, లైసెన్స్ ఫీజు ద్వారా రూ.26.60 కోట్లు రాబడి సమకూరింది. తాజా పాలసీలో దరఖాస్తు ఫీజు ఆదాయం రెట్టింపు కాగా, లైసెన్స్ ఫీజు రాబడి రూ.8.70 కోట్లు అదనంగా సమకూరుతుంది. ఈ విధంగా ఈ కొత్త పాలసీలో ప్రభుత్వానికి ఆదాయం బాగా నే వచ్చింది. మొత్తం మీద 2019–21 మద్యం పాలసీలో బోణి అదిరింది. ఇదిలా ఉంటే గత రెండేళ్లలో లిక్కర్ అమ్మకాల ద్వారా ఎస్సైజ్ ఆదాయాన్ని పరిశీలిస్తే.. 2017–18 సంవత్సరంలో రూ.226.26 కోట్లు, 2018–19లో రూ.241.32 కోట్లు సమకూరింది. -
మద్యం పాలసీపై మల్లగుల్లాలు
సాక్షి, ఆదిలాబాద్ : కొత్త మద్యం పాలసీపై పలువురు ఆశావహులు మల్లగుల్లాలు పడుతున్నారు. గెజిట్ నోటిఫికేషన్ ఇంకా విడుదల కానందునా మార్పులేమైనా ఉంటాయా? అన్న మీమాంస వారిలో కనిపిస్తోంది. శనివారం కలెక్టర్ ఆధ్వర్యంలో డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. అలాగే 9న గెజిట్ నోటిఫికేషన్ రానుంది. శుక్రవారం ఎక్సైజ్ కమిషనర్‌తో డిప్యూటీ కమిషనర్లు, డీపీఈఓలు హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. కాని నోటిఫికేషన్‌తోనే స్పష్టత రానుంది. నిరుత్సాహం.. మద్యం దుకాణం కోసం దరఖాస్తు చేసుకోవాలంటే రూ.2లక్షల ఫీజు నిర్ధారించడంపై ఆశావహుల్లో నిరుత్సాహం వ్యక్తమవుతోంది. ప్రధానంగా పలువురు కొత్తవారు మద్యం వ్యాపారంలోకి రావాలని ఉత్సాహం చూపిస్తున్నా మొదటి మెట్టులోనే ఫీజు భారీగా ఉండడంతో వెనుకాముందు అవుతున్నారు. కొంతమంది యువకులు గ్రూప్‌గా ఏర్పడి ఒకరి పేరిట దరఖాస్తు ఫీజు కట్టడం ద్వారా మద్యం టెండర్లలో పాల్గొనాలని ఉత్సాహం చూపుతున్నారు. ఒకవేళ అదృష్టం కలిసొచ్చి లక్కీడ్రాలో షాపు దక్కితే ఇప్పటికే వ్యాపారంలో ఉన్నవారు ఇచ్చే గుడ్‌విల్ పొంది వారికే షాపును నడుపుకునేందుకు ఇవ్వడం ద్వారా ప్రయోజనం పొందాలనే ఉత్సాహం వారిలో కనిపిస్తోంది. ఇదివరకు లక్కీడ్రాలో ఇలాంటి సంఘటనలు జరగడంతో పలువురు గ్రూప్‌గా ఏర్పడి దరఖాస్తు ఫీజు చెల్లించేందుకు సిద్ధమవుతున్నారు. 2017–19 ఎక్సైజ్ పాలసీ సమయంలో ఆదిలాబాద్ జిల్లాలో ఏడెనిమిది షాపులకు గాను 559 మంది దరఖాస్తు చేసుకున్నారు. అప్పుడు రూ.లక్ష దరఖాస్తు ఫీజు ఉండగా, దీని ద్వారానే ప్రభుత్వానికి రూ.5.59 కోట్ల ఆదాయం సమకూరింది. ఇప్పుడు ప్రభుత్వం దరఖాస్తు ఫీజు దశలోనే రెట్టింపు ఆదాయంపై దృష్టి సారించింది. దీంతో రూ.లక్ష ఉన్న ఫీజును రూ.2లక్షలకు పెంచింది. ఎక్సైజ్ ట్యాక్స్ భారం.. కొత్త ఎక్సైజ్ పాలసీలో స్పెషల్ రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ రూ.5లక్షలు ఏడాదికి నిర్ణయించడంపై వ్యాపారుల్లో నిరుత్సాహం కనిపిస్తోంది. ఇప్పటికే మద్యం వ్యాపారంలో ఉన్నవారు తిరిగి షాపులు దక్కించుకునేందుకు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. అయితే ఇటు ఏడాదికి చెల్లించే లైసెన్స్ ఫీజు పెరగడం, దీనికితోడు దరఖాస్తు ఫీజు పెంచడం, ఇవన్ని వారికి భారంగా కనిపిస్తున్నాయి. ఆదిలాబాద్ పట్టణంలో గతంలో ఏడాదికి లైసెన్స్ ఫీజు రూ.55 లక్షలు ఉండగా, కొత్త పాలసీలో రూ.65 లక్షలకు పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో రూ.45లక్షలు ఉండగా, రూ.50లక్షలకు పెరిగింది. పెరిగిన లైసెన్స్ ఫీజులతో మద్యం వ్యాపారులు తర్జనభర్జన పడుతుండగా, మరోవైపు ఏడాదికి ఎక్సైజ్ పన్ను రూ.5లక్షలు కొత్తగా విధించడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్లకు కలిపి ఇది రూ.10 లక్షలు చెల్లించాల్సి వస్తుందని వాపోతున్నారు. పర్మిట్ రూమ్ ఉందా?.. లేదా? వైన్‌షాపులకు పర్మిట్ రూమ్ విషయంలో కొత్తపాలసీలో ఎలాంటి అంశం పొందుపర్చకపోవడంతో ఈ విషయంలో సందిగ్ధం కొనసాగుతోంది. అధికారులు మాత్రం పాత పాలసీకి అనుగుణంగానే పర్మిట్ రూమ్ ఉంటుందని చెబుతున్నారు. అయితే నోటిఫికేషన్లోనే దీనిపై స్పష్టత రానుంది. ఇక కొత్త పాలసీలో బీరుపై కమిషన్ 25 శాతం నుంచి 20 శాతానికి తగ్గించడంపై వ్యాపారస్తులు నిరుత్సాహానికి గురయ్యారు. అసలే ఆదాయం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమకు కమిషన్ తగ్గించడం ఏవిధంగా సబబన్న ప్రశ్న వారి నుంచి వ్యక్తమవుతోంది. వైన్ దగ్గర పార్కింగ్ సౌకర్యం కల్పించాలని పొందుపర్చారు. ఇది పట్టణ ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్నటువంటి వైన్స్‌లన్నీ రోడ్ల సమీపంలో ఉన్నాయి. వాటికి పార్కింగ్ సౌకర్యం అసలే లేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న షాపులను మార్చాల్సిన పరిస్థితి వస్తుంది. దీన్ని అంతా సీరియస్‌గా పరిగణించకపోతే ఆ స్థలాల్లోనే కొనసాగే అవకాశం లేకపోలేదు. -
మాకో వైన్స్ కావాలి..!
సిరిసిల్ల: మరో పన్నెండు రోజుల్లో మద్యం లైసెన్స్‌ల గడువు ముగియనుంది. ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ పాలసీ ఏవిధంగా ఉంటుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కొందరు వ్యాపారులు, యువకులు సైతం ఈసారి మద్యం లైసెన్స్‌లు పొందేందుకు జతకడుతున్నారు. జిల్లాలో 42 మద్యం దుకాణాలు ఉండగా.. వీటికి 2017 సెప్టెంబరులో లైసెన్స్ జారీచేశారు. అదే ఏడాది అక్టోబరు ఒకటే తేదీన వైన్స్‌లు తెరిచారు. కలిసొచ్చిన ఎన్నికలు.. మద్యం వ్యాపారులకు గతరెండేళ్లు కలిసి వచ్చింది. ముందస్తు అసెంబ్లీ ఎన్నికలతో పాటు, గ్రామపంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పార్ల మెంట్ ఎన్నికలు వరుసగా రావడంతో మద్యం అమ్మకాలు భారీగా జరిగాయి. జిల్లాలో 42 దుకాణాలు ఉండగా.. రెండేళ్లలో రూ.560. 50 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ఇందులో 8,29,882 ఐఎంఎల్ బాక్స్‌లు, 17,27,113 బీర్ బ్యాక్స్‌లు అమ్ముడుపోయాయి. సిరిసిల్ల, వేములవాడ, ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ సర్కిళ్లు ఉన్నాయి. ఊరూరా కిక్కు.. జిల్లాలోని 42 మద్యం దుకాణాలకు అనుబంధంగా అనేక గ్రామాల్లో బెల్ట్ షాపులు తెరిచారు. సుమారు వెయ్యికిపైగా బెల్ట్‌షాపులు ఉన్నాయని తెలుస్తోంది. ఎల్లారెడ్డిపేటలోని ఓ వైన్స్‌లో రెండేళ్లలో రూ.23.05 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. 25.1 శాతం అమ్మకాలతో టాప్‌లో నిలిచింది. ఎల్లారెడ్డిపేట, రాచర్ల గొల్లపల్లి వైన్స్ షాపుల్లోనూ వరుసగా రూ.18.80కోట్లు, రూ.18.77 కోట్లతో రెండు, మూడు స్థానంలో నిలిచాయి. ఇల్లంతకుంటలోని ఓ వైన్స్ షాప్‌లో రూ.17.54కోట్ల మద్యం విక్రయించి నాలుగో స్థానం దక్కించుకుంది. సిరిసిల్ల, తంగళ్లపల్లి, గంభీరావుపేట వైన్స్ షాపులు వరుసగా పదో స్థానం వరకు ఉన్నాయి. వేములవాడలో ఓ వైన్స్ షాపు రూ.14.50 కోట్ల మద్యం విక్రయించి 11వ స్థానంలో ఉండగా రెండేళ్లలో రూ.10 కోట్లలోపు మద్యం విక్రయించి వేములవాడలోని ఓ మూడు వైన్స్ షాపులు చివరిస్థానంలో నిలిచాయి. కొత్త పాలసీపై కోటి ఆశలు వచ్చే అక్టోబర్ ఒకటి నుంచి కొత్త ఎక్సైజ్ పాలసీ అమల్లోకి రానుంది. దరఖాస్తు ఫీజు, ఈఎండీలో ఏమైనా మార్పులు ఉంటాయా అనే ఉత్కంఠ లిక్కర్ వ్యాపారుల్లో నెలకొంది. ఇప్పటికే మద్యం వ్యాపారులు సన్నిహితులతో జతకడుతూ సిండికేట్‌గా మారుతున్నారు. 10 మంది జతగా ఉండి దరఖాస్తు చేసుకుని ఏ ఒక్కరికి లక్కీ డ్రాలో మద్యం షాపు వచ్చినా అందరూ పంచుకునేలా ఒప్పందాలు చేసు కుంటున్నారు. రెండేళ్ల క్రితం ఆబ్కారీ పాలసీ దరఖాస్తు ఫీజు రూ.లక్ష ఉండగా, ఈఎండీ లైసె న్స్ ఫీజులో 10 శాతం ఉంది. అంటే మండల కేంద్రాల్లో రూ.4.50లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.5.50లక్షలు నిర్దేశించారు. జనాభా ప్రాతిపదికన ఆబ్కారీ విధానం రూపొందించారు. గతంలో జిల్లాలోని 42 వైన్స్ షాపులకు 672 దర ఖాస్తులు వచ్చాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి రూ.6.72 కోట్ల ఆదాయం సమకూరింది. లిక్కర్‌కు ‘రియల్’ ఎఫెక్ట్... జిల్లాలో మద్యం వ్యాపారంపై రియల్ ఎస్టేట్ భూం ప్రభావం ప్రధానంగా ఉంటుంది. సిరిసిల్ల, వేములవాడ, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ దందా ఎక్కువగా ఉంది. భూముల ధరలు పదింతలు అవడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు భారీ ఎత్తున లిక్కర్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధం గా ఉన్నారు. కొత్త ఎక్సైజ్ పాలసీ రాగానే రూ. కోట్లు కుమ్మరించేందుకు సిద్ధమవుతున్నారు. రెండు, మూడు రోజుల్లో కొత్త ఆబ్కారీ విధానానికి నోటిఫికేషన్ వెలువడుతుందని ఎక్సైజ్ అధికారులు పేర్కొంటున్నారు. ఈసారి అన్ని వైన్స్ లకు భారీగా పోటీ ఉంటుందని భావిస్తున్నారు. -
మా ఊళ్లో మద్యం వద్దు !
మరికల్ (నారాయణపేట): గాంధీజీ కన్న కలలను సాకారం చేసేందుకు మండలంలోని మాధ్వార్ గ్రామస్తులు అడుగులు వేస్తున్నారు. ఆగస్టు 15 నుంచి సంపూర్ణ మద్యపాన నిషేధం కోసం మంగళవారం గ్రామస్తులు తిర్మానం చేశారు. మద్య నిషేధ సమయంలో గ్రామంలో ఎవరైనా మద్యం అమ్మకాలు చేపడితే రూ.40వేల జరిమానా విధిస్తామని సర్పంచ్ పుణ్యశీల తిర్మానించారు. మహిళా సర్పంచ్ ముందడుగు.. మరికల్ మండలం మాధ్వార్‌లో 845 కుటుంబాలు ఉండగా 3,568 మంది జనాబా ఉంది. ఇటీవల కాలంలో గ్రామంలో మద్యం సేవించి భవిష్యత్‌ను బుగ్గిపాలు చేసుకుంటున్న యువతను మార్చేందుకు మాహిళ సర్పంచ్ పుణ్యశీల ముందుగా నడుం బిగించారు. ఆమె పిలుపు అందుకున్న మిగితా ప్రజాప్రతినిధులు, యువకులు, గ్రామస్తులు, మహిళలు పంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకొని సంపూర్ణ మద్యపాన నిషేధం కోసం సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామస్తులు తిర్మానించారు. ఇందుకు గ్రామస్తులు సైతం ముందుకు వచ్చి తమ సంసారాలు బాగుపడుతాయంటే ఇంతకంటే ఏం కావాలంటూ పంచాయతీ కార్యాలయం ఎదుట మద్యం నిషేదిస్తున్నట్లు ప్రతిజ్ఞా చేశారు. ఆగష్టు 15 తర్వాత మాధ్వార్‌లో ఎవరైన మద్యం అమ్మకాలు చేప్పడితే రూ. 40 వేలు జరిమాన విధిస్తామని తిర్మానం చేశారు. అంతలో ఏమైన మద్యం మిగిలివుంటే ఆగస్టు 14 వరకు విక్రయించుకోవాలని వారికి వెసులుబాటు కల్పించి మిగితా గ్రామాలకు ఆదర్శంగా నిలిచారు. యువత పెడదారి పట్టొద్దనే నిర్ణయం యువత పెడదారి పట్టకుండా ఉండేందుకే గ్రామంలో మద్యం నిషేదించడం జరిగింది. ఇటీవల కాలంలో గ్రామంలో యువకులతో పాటు మహిళలు కూడా మద్యం సేవించి అలర్లకు కారణమవుతున్నారు. మాధ్వార్ గ్రామాన్ని ఒక ప్రశాంతమైన గ్రామంగా తీర్చేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుంది. – పుణ్యశీల, సర్పంచ్, మాధ్వార్ -
తాగిపిచ్చేది మీరే.. పట్టుకునేది మీరే..
-
ప్రభుత్వానికి తాగుబోతుల సంఘం డిమాండ్లు!
సాక్షి, హైదరాబాద్: పోలీసులు నిర్వహించే డ్రంక్ అండ్ డ్రైవ్ తీరును నిరసిస్తూ తెలంగాణ తాగుబోతుల కమిటీ(టీటీసీ) పేరిట ఓ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి ప్రభుత్వాన్ని కోరిన డిమాండ్స్ ప్రతిఒక్కరిని ఆలోచింపజేస్తున్నాయి. ఏజీఆర్ అనే వ్యక్తి మాట్లాడుతూ.. ‘పర్మిట్ రూంల పేరిట తాగిపిచ్చేది ప్రభుత్వమే.. డ్రంక్ డ్రైవ్‌ల పేరిట పట్టుకునేదే వాళ్లే. అయితే పర్మిట్ రూమ్‌లన్నా ఎత్తేయండి.. లేకుంటే డ్రంక్ అండ్ డ్రైవ్ అన్నా ఎత్తేయండి. లేకపోతే తాగే మందును ఇంటికి పంపించండి. తాగుడు మావంతే దండుగలు కట్టుడు మావంతేనా? పొద్దంత కష్టపడి.. వర్షాలు పడక, ఇంట్ల బాధలకు.. ప్రభుత్వం పర్మిట్ రూంలు ఏర్పాటు చేసింది కదా అని తాగితే.. బయటకు వెళ్లగానే పశువుల కంటే హీనంగా చూస్తున్నారు. మేం అడిగేది ఏంటంటే.. మేం తాగితేనే గవర్నమెంట్ నడుస్తోంది. మా కోసం అంబులెన్స్‌లు ఏర్పాటు చేయండి. మధ్యం బాటిల్ ధరలు పెంచినా అడగలేదు. అదే బాటిల్‌పై రూ.100 తగ్గిస్తోరో లేక రూ. 50 పెంచుతారో తెలవదు కానీ మమ్మల్ని అయితే సౌకర్యంగా ఇంటికి పంపించండి. పైసలు గుంజడానికే ప్రభుత్వం డ్రంక్ డ్రైవ్‌లు చేపడుతోంది.’ అని తమ డిమాండ్లు నెరవేర్చిన వారికే ఈ సారి ఎన్నికల్లో తమ ఓటు వేస్తామని స్పష్టం చేశారు. అయితే ఎక్కడ ఎప్పుడో జరిగిందో తెలియదు కానీ గత రెండు మూడో రోజులుగా ఈ వీడియో వాట్సాప్, ఫేస్బుక్, ట్విటర్లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. -
గుజరాత్ పోల్స్: 9.6 లక్షల లీటర్ల లిక్కర్ సీజ్
సాక్షి,అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మధ్యనిషేధం అమలులో ఉన్న రాష్ట్రంలో ఏకంగా రూ 22 కోట్ల విలువైన 9.6 లక్షల కోట్ల మద్యం, రూ 1.71 కోట్ల నగదు, రూ 8 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల బృందాలు పెద్ద ఎత్తున నగదుతో పాటు రూ 3.11 లక్షల విలువైన 35 కిలోల డ్రగ్స్, 3650 బ్రిటన్ పౌండ్లు, రూ 60,000 విలువైన థాయ్ కరెన్సీని స్వాధీనం చేసుకున్నాయి. గుజరాత్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నల్లధనం ఉపయోగించడంపై కన్నేసేందుకు కేంద్ర పరిశీలకులతో పాటు 100 మంది ఎన్నికల వ్యయ పరిశీలకులను ఈసీ నియమించింది. మరోవైపు బంగారం వ్యాపారాల లావాదేవీలకు సంబంధించిన 311 కిలోల బంగారాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం అధికారులు విడిచిపెట్టినట్టు ఈసీ వర్గాలు వెల్లడించాయి. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రెండు విడతలుగా ఈనెల 9, 14న జరగనున్న విషయం తెలిసిందే. ఈనెల 18న ఓట్ల లెక్కింపు చేపడతారు. -
మద్యం తయారీ అమ్మకం పేరుతో భారీ మోసం
-
పచ్చని పల్లెలో మద్యం మంటలు
మద్యం షాపు వద్దంటూ ఆందోళన షాఫు ధ్వంసం, షాపు యజమాని దాడి వైఎస్సార్ సీపీ నేత చిట్టిబాబు సహ పలువురికి గాయాలు రాస్తారోకోలు, ధర్నాలతో తీవ్ర ఉద్రిక్తత ముమ్మిడివరం : మండలంలోని అయినాపురంలో మద్యం అమ్మకాలు నిలిపివేయాలంటూ గ్రామస్తులు ఆదివారం మద్యం షాపును అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గ్రామస్తులపై షాపు యజమాని అనుచరులు దాడి చేశారు. ఈ దాడిలో గ్రామానికి చెందిన వైఎస్సార్ సీసీ రాష్ట్ర కార్యదర్శి పెయ్యల చిట్టిబాబుతో పాటు పలువురికి బలమైన గాయాలయ్యాయి. దీంతో గ్రామస్తులు కోపోద్రిక్తులై మద్యం షాపుపై దాడి చేశారు. గ్రామస్తులపై అనుచరుడితో కలిసి షాపు యజమాని దాడి చేయగా, పోలీసు స్టేషన్లో వారితో టీడీపీ నాయకులు ఉండడం సమస్య మరింత తీవ్రమైంది. షాపు వద్దని పంచాయతీ తీర్మానం చేసినా... జూలై 29న గ్రామంలో మద్యం అమ్మకాలు నిషేధించాలని కోరుతూ అయినాపురం çపంచాయతీలో తీర్మానం చేసి ఎక్సైజ్ జిల్లా ఉన్నతాధికారులకు, కలెక్టర్‌కు అందజేశారు. అధికారులు అనుమతి ఇవ్వడంతో ఆదివారం షాపు యజమాని అయినాపురంలో షాపును ప్రారంభించారు. దీంతో సర్పంచ్ మట్టపర్తి సత్యకుమారి, మాజీ సర్పంచ్ పెయ్యల భూలక్ష్మి, వందలాది మంది మహిళలు, గ్రామస్తులు మద్యం షాపు వద్ద ఆందోళనకు దిగారు. మూసివేతకు యత్నం... షాపును మూసి వేయడానికి ప్రయత్నించిన మహిళలపై షాపు యజమాని మట్టా సూరిబాబు(పండు), అనుచరుడు వెల్లిగట్ల సుధీర్ ఇటుకలు, కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి పెయ్యల చిట్టిబాబుకు, కాట్రు శ్రీనివాసరావుకు తలపై బలమైన గాయాలయ్యాయి. పంతగడ సత్యనారాయణకు చేతులపై గాయాలయ్యాయి. దీంతో గ్రామస్తులు షాపు ఎదుట రోడ్డుపై బైఠాయించారు. షాపు మూసి వేసి దాడి చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం వారు ముమ్మిడివరం పోలీసుస్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేశారు. అక్కడ హైవేపై రాస్తారోకో చేశారు. 144 సెక్షన్ అమలులో ఉన్నందున ఆందోళన విరమించాలని సీఐ కేటీవీవీ రమణారావు వారిని కోరారు. నిందితులను అరెస్ట్ చేసేవరకు ఆందోళన విరమించమంటూ వాహనాలు అడ్డుకున్నారు. గంటలోగా నిందితులను అరెస్టు చేస్తామని సీఐ హమీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. దాడి చేసిన ఇద్దరిపై అట్రాసిటీ కేసు నమోదు చేసి బాధితులను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసుస్టేషన్లో నిందితులతో టీడీపీ నేతలు.. విషయం తెలుసుకున్న దళిత నాయకులు, వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ఆస్పత్రికి చేరుకుని ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వారు తిరిగి పోలీస్‌స్టేషన్‌కు చేరుకునేసరికి.. స్టేషన్లో నిందితులతోపాటు గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు స్టేషన్లో ఉండడంతో అభ్యం తరం తెలిపారు. నిందితులకు స్టేషన్లో రాచమర్యాదలు చేస్తున్నారని, టీడీపీ నేతలకు ఇక్కడ పనేంటంటూ పోలీసులను ప్రశ్నించారు. ఒక దశలో వారు స్టేషన్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. చివరికి టీటీపీ వారిని పోలీసులు బయటకు పంపడంతో ఆందోళన విరమించారు. ఎక్సైజ్ సీఐ కార్యాలయం వద్ద... అనంతరం వారు ఎక్సైజ్ సీఐ కార్యాలయాన్ని ముట్టడించారు. అయినాపురంలో మద్యం షాపు లైసెన్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మద్యం సిండికేట్ల వద్ద లంచాలు తీసుకుని బెల్టు షాపులకు అనుమతులిస్తున్నారని విరుచుకు పడ్డారు. ఎక్సైజ్ ఎస్సై స్వామిరెడ్డి వారిని బుజ్జగించినా వారు శాంతించలేదు. సీఐ రావాలని షాపు లైసెన్స్ రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. దీంతో ఎస్సై స్వామిరెడ్డి సెల్లో సీఐతో వైఎస్సార్ సీపీ నేత చిట్టిబాబుతో మాట్లాడించారు. గ్రామస్తుల అ«భ్యర్థనను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి షాపు మూసి వేయడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. షాపుపై దాడి చేసి ధ్వంసం చేసినట్టు షాపు యజమాని సూరిబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొంతమంది గ్రామస్తులపై కూడా కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మోకా రామారావు, కాట్రు అప్పారావు, పోలిశెట్టి నాగేశ్వరరావు, అమరా శ్రీను, మట్టా చిరంజీవి, జొన్నాడ నాగేశ్వరరావు, ఏఎస్వీ సుబ్బారావు, వైఎస్సార్ సీపీ నాయకులు కాశి బాలమునికుమారి, జనిపెల్ల బాలశ్రీనివాసరావు, కుడిపూడి శ్రీనివాసరావు, దళిత నాయకులు పామురాజేంద్రప్రసాద్, చీకురుమిల్లి శ్రీనివాసరావు, దేవరపల్లి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. -
బాలలు కిలకిలలాడే చోట.. గ్లాసుల గలగలలా?
-నివాసప్రాంతాల్లో నిషా అంగళ్లా? –ససేమిరా సహించబోమంటున్న జనం –జిల్లావ్యాప్తంగా ఐదో రోజూ కొనసాగిన ఆందోళనలు –ఉద్యమించిన మహిళలను అరెస్టు చేసిన కరప పోలీసులు –కామనగరువులో బ్రాందీషాపును ముట్టడించిన విద్యార్థులు –దుకాణాల ఏర్పాటుకు అనువుగా ఎండీఆర్ రోడ్లుగా రాష్ట్ర రహదారుల మార్పు –ఈ పరిణామంతో జనం మరింత భగ్గుమనే అవకాశం సాక్షి, రాజమహేంద్రవరం : పిల్లాపాపల కిలకిలలు ప్రతిధ్వనించే తావుల్లో మందుగ్లాసుల గలగలలను సహించబోమన్న జనాగ్రహం రగులుతూనే ఉంది. ముంగిళ్లలో ముగ్గులు, లోగిళ్లలో మర్యాదమన్ననలకు పెద్దపీట వేసే మనుషులు ఉండే నివాసప్రాంతాల్లో నిషా దుకాణాలు ఏర్పాటు చేసే అనాగరిక వ్యాపార వైఖరిపై నిరసన గళం మార్మోగుతూనే ఉంది. బడి, గుడి గంటల సవ్వడి గాలిలో తేలివచ్చే చోట తాగుబోతుల ప్రేలాపలను ఎంత మాత్రం వినబోమన్న సమరభేరితో దిక్కులు దద్దరిల్లుతూనే ఉన్నాయి. ఇళ్ల మధ్య, గుడులు, బడుల చేరువలో మద్యం దుకాణాల ఏర్పాటును వ్యతిరేకిస్తూ జనం రోడ్లెక్కుతూనే ఉన్నారు. కొత్త మద్యం పాలసీ (2017–19) ఈ నెల ఒకటి నుంచి అమలులోకి వచ్చిన నేపథ్యంలో కొత్తగా వేలంలో పాడుకున్న వారు మద్యం దుకాణాల ఏర్పాటుకు సంసిద్ధులయ్యారు. అయితే జనావాసాల మధ్య ఏర్పాటు చేయవద్దని తొలిరోజు నుంచీ జిల్లాలో పలుచోట్ల స్థానికులు ముఖ్యంగా మíßహిళలు, యువకులు, ఆందోళనలు, ధర్నాలు చేస్తున్నారు. జిల్లాలో 545 దుకాణాల ఏర్పాటుకు అవకాశం ఉండగా ఈసారి 534 దుకాణాలు లాటరీలో వ్యాపారులకు కేటాయించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకూ జిల్లాలో 175 దుకాణాలు ఏర్పాటు చేశారు. వీటిలో ఇళ్ల మధ్య, పాఠశాలలు, దేవాలయాలకు సమీపంలో ఉన్న దుకాణాలను తొలగించాలంటూ తీవ్రస్థాయిలో ఆందోళనలు జరుగుతున్నాయి. బుధవారం రాజమహేంద్రవరంలోని జాంపేట మార్కెట్ ఎదురుగా ఇళ్ల మధ్యలో, మసీదుకు సమీపంలో ఉన్న మద్యం దుకాణాన్ని తొలగించాలని 31వ డివిజన్ కార్పొరేటర్ మజ్టి నూకరత్నం, బీసీ సంఘం పట్టణ అధ్యక్షుడు మజ్జి అప్పారావు, ముస్లిం నేత మున్నా మహిళలు, స్థానికులతో కలసి ఆందోళన చేపట్టారు. నాలుగు రోజుల్లో దుకాణాన్ని తొలగిస్తామని ఎక్సైజ్ సీఐ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఏవీ అప్పారావు రోడ్డులో ఇళ్ల మధ్య దుకాణం ఏర్పాటును వ్యతిరేకిస్తున్న మహిళలు బుధవారం కూడా నిరసనను కొనసాగించారు. అమలాపురం రూరల్ మండలం ఇందుపల్లిలో మద్యం షాపు ఏర్పాటుతో గ్రామ మహిళలు, స్థానికులు దుకాణం ఎదుట ఆందోళన చేశారు. ఆలమూరులో మద్యం దుకాణం తొలగించాలని డిమాండ్ చేస్తూ మహిళలు, గ్రామస్తులు ధర్నా చేశారు. అమలాపురం రూరల్ మండలం కామనగరువులోని ఓ ప్రైవేటు పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన దుకాణాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు ముట్టడించి, తొలగించాలని పట్టుబట్టారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. కాకినాడ పోలీస్‌స్టేషన్‌కు వీరలక్ష్మి తదితరులు కరప మండలం వేళంగిలో మద్యం దుకాణం ఏర్పాటు చేయొద్దంటూ స్థానికులు చేస్తున్న ఆందోళనలను పెడచెవిన పెట్టి మంగళవారం దుకాణం ఏర్పాటు చేశారు. దీంతో గ్రామ మహిళలు, సీఐటీయూ జిల్లా సెక్రటరీ ఎం.వీరలక్ష్మి తదితరులు మంగళవారం రాత్రి వరకు తీవ్రస్థాయిలో ఆందోళన చేశారు. పోలీసులు వీరలక్ష్మిని, మరో ముగ్గురు మహిళలను అరెస్టు చేసి కరప పోలీస్ స్టేషన్‌కు తరలిచారు. గ్రామస్తులు స్టేషన్ వద్ద ధర్నా చేయడంతో ఉద్రిక్త పరిస్థితుల నడుమ అరెస్ట్ చేసిన వారిని కాకినాడ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దుకాణం 20 రోజుల్లో తొలగిస్తామని పెద్దల సమక్షంలో దుకాణ యజమానులు అంగీకరించడంతో నిరసన విరమించారు. పిఠాపురం మండలం కందరాడ రాజీవ్‌కాలనీ రోడ్డులో మద్యం షాపు ఏర్పాటు చేయవద్దని ఆ ప్రాంత మహిళలు ఆందోళనకు దిగారు. పిఠాపురం రూరల్ ఎస్సై వి.కోటేశ్వరరావుతో వాగ్వివాదానికి దిగారు. అనంతరం ఎక్సైజ్ సీఐ కార్యాలయానికి వెళ్లి నిరసన తెలిపారు. ఆది నుంచీ ఆగ్రహాగ్నే.. ఇళ్ల మధ్య దుకాణాల ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఈ నెల ఒకటి నుంచి జిల్లాలో పలు చోట్ల స్థానికులు ఆందోళనలు చేస్తున్నారు. ముమ్మిడివరం బాలయోగి తపోవనం చేరువలో మద్యం షాపును తొలగించాలంటూ ఆందోళనలు చేశారు. మామిడికుదురు మండలం పాశర్లపూడి బొమ్మిడిపాలంలో, అంబాజీపేట మండలం ఇరుసుమండ గ్రామాల్లో మద్యం దుకాణాలు తీసేయాలని గ్రామస్తులు ఆందోళనలు చేశారు. ఆలమూరు మండలం చింతలూరు, చొప్పెళ్ల, రావులపాలెం సీఆర్పీ రోడ్డులో ఏర్పాటు చేసిన మూడు మద్యం దుకాణాలను తొలగించాలంటూ వాకర్స్, స్థానికులు ధర్నాలు చేశారు. రామచంద్రపురం రూరల్ తాళ్లపొలంలో, కె.గంగవరం మండల కేంద్రంలో మద్యం షాపు వద్దంటూ మహిళలు ఉద్యమించారు. సామర్లకోట 22వ వార్డులో ప్రైవేటు స్కూల్ వద్ద మద్యం దుకాణం ఏర్పాటుచేయవద్దంటూ మహిళలు, స్థానికులు ఆందోళన చేశారు. మండల కేంద్రాలైన కొరుకొండ, సీతానగరంలలో మద్యం దుకాణాల ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి. కాగా, మంగళవారం నగరపాలక, పురపాలక సంఘాలు, మండల కేంద్రాల పరిధిలో ఉన్న రాష్ట్ర రహదారులను జిల్లా ప్రధాన రహదారులుగా మార్పు చేయడంతో మిగిలిన 369 దుకాణాల ఏర్పాటుకు అవకాశం వచ్చింది. ఇందులో జాతీయ రహదారిపై ఉన్న 36 దుకాణాలు కూడా వాటికి 500 మీటర్ల దూరంలో ఏర్పాటు చేసే వీలుంది. ఆ రకంగా ఇవి ఇళ్ల మధ్యకూ వచ్చే అవకాశమూ ఉంది. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు తీవ్రతరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. -
‘నిషా’ మహమ్మారిపై నిప్పులు
- సోమవారం అదే హోరు - అమలాపురం పట్టణంలో తెరుచుకోని మద్యం దుకాణాలు - ఇళ్ల మధ్య దుకాణాలు వద్దంటూ నిరసనలు - జిల్లాలో పలు ప్రాంతాల్లో నిరసనలు అమలాపురం టౌన్: ద్రవరూపంలోని ‘ఉపద్రవం’పై జనంలో ఆగ్రహం రగులుతూనే ఉంది. తాగేవాడి కాలేయాన్నీ, వాడి కుటుంబ శ్రేయాన్నీ బలిగొనే మద్యం మాకొద్దంటూ వేలగొంతులు ఘోషిస్తూనే ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా జనావాసాల నడుమ, గుడులకు, బడులకు చేరువలో బ్రాందీషాపుల ఏర్పాటుపై ప్రజలు భగ్గుమంటూనే ఉన్నారు. సోమవారం కూడా జిల్లావ్యాప్తంగా పలుచోట్ల మద్యం షాపుల ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆందోళనలు జరిగాయి. కొన్ని చోట్ల ధర్నాలు చేస్తే, కొన్ని చోట్ల రాస్తారోకోలు నిర్వహించారు. మరికొన్ని చోట్ల అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ గ్రామస్తులు, కాకినాడ రూరల్ మండలం వేళంగిలో సిరిపురం కొప్పిశెట్టివారి పేట, జి.భావారం గ్రామస్తులు మహిళలతో నిరసనలకు దిగగా... కాకినాడ-రామచంద్రపురం, రాజోలు ప్రాంతాల్లో మహిళలు రాస్తారోకోచేశారు. రాజమహేంద్రవరం రూరల్ మండలం కడియంలో ప్రజావాణిలో వినతిపత్రం అందజేయగా, కాకినాడలో ఎక్సైజ్ డీసీకి వినతిపత్రంఅందజేశారు. కాకినాడ రూరల్ మండలం కొవ్వాడ గ్రామస్తులు కాకినాడ కలెక్టర్ గ్రీవెన్స్‌లో ఎక్సైజ్ డీసీకి, కాకినాడలో గాంధీనగర్ ప్రాంతీయులు జాయింట్ కలెక్టర్‌కు పి.గన్నవరం నియోజకవర్గం మామిడికుదురు గ్రామస్తులు పి.గన్నవరంలోని ప్రజావాణిలో వినతిపత్రాలు అందజేశారు. కోనసీమలో తెరుచుకోని దుకాణాలు... కోనసీమ కేంద్రం అమలాపురం పట్టణంలో మద్యం కొత్త పాలసీలో బార్లు, దుకాణాలు ఏర్పాటు చేసేందుకు ప్రజల నుంచి ఎదరవుతున్న అభ్యంతరాలు, వ్యతిరేకతలతో ఎక్కడా మద్యం టింగమంటూ బోణి కాలేదు. పట్టణంలో మూడు బార్లు, ఎనిమిది దుకాణాలకు వ్యాపారులు లెసెన్సులు పొంది ఉన్నారు. ఒక్కో బార్‌కు రూ.22 లక్షలు..ఒక్కో దుకాణానికి రూ.11 లక్షలు వంతున ప్రభుత్వానికి చెల్లించేసి ఉన్నారు. ఈనెల ఒకటో తేదీ నుంచి బార్లు, దుకాణాలు తెరుచుకుని వ్యాపారాలు చేసుకోవాల్సి ఉంది. నెల మొదలై అప్పుడు మూడు రోజులు గడుస్తున్నా పట్టణంలో ఇప్పటిదాకా బార్లు, దుకాణాల ఏర్పాటుకు అవసరమైన భవనాలు, దుకాణాలే నిర్ధారణ కాలేదు. ఇప్పటికే పది మంది వ్యాపారులు ప్రభుత్వానికి రూ.1.30 కోట్ల మేరు సొమ్ములు చెల్లించేసినా వ్యాపారాలు మొదలు కాకపోవటం ఒక సమస్యయితే ఇళ్ల మధ్య దుకాణాలు వద్దంటూ ప్రజల నుంచి అభ్యంతరాలు ఎదురు కావటం వారికి తలనొప్పిగా తయారైంది. ఇప్పటికే పట్టణంలో సావరం రోడ్డులో ఇళ్ల మధ్య మద్యం దుకాణాన్ని వ్యతిరేకిస్తూ అక్కడి ప్రజలు ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. స్థానిక ఎన్టీఆర్ మార్గ్ సమీపంలో ఏర్పాటు చేయబోయే దుకాణంపై అక్కడ ప్రజలు నేరుగా జిల్లా కలెక్టర్‌కే ఫిర్యాదు చేశారు. పట్టణ శివారు పేరూరు వై.జంక్షన్ సమీపంలో 216 జాతీయ రహదారికి 500 మీటర్ల దూరంలో పెడుతున్న దుకాణానికి అభ్యంతరాలు అనివార్యమయ్యాయి. మద్యం పాలసీపరంగా పట్టణ పరిధిలోకి వచ్చే పేరూరు గ్రామంలో కూడా దుకాణాల ఏర్పాటును నిరసిస్తూ ఆ గ్రామానికి చెందిన మహిళలు అమలాపురంలోని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయానికి సోమవారం సాయంత్రం తరలివచ్చి ధర్నా చేశారు. తమ గ్రామంలో మద్యం దుకాణాలకు అనుమతులు ఇస్తే సహించేది లేదని అధికారులను మహిళలు హెచ్చరించారు. మద్యం దుకాణాలంటే ఎక్కడో ఓ చోట చిన్న జాగాలో కనీసం షెడ్డులోనైనా ఏర్పాటుచేసుకునే వీలుంటుంది. అదే బార్లకు భవనం ఉండాలి. పట్టణానికి దూరంగా ఆ స్థాయిలో భవనాలు దొరక్క... ఉన్నా బార్లకు అంటే అద్దెకు ఇవ్వక..ప్రజల నుంచి నిరసనలను ఎదుర్కొనలేక బార్ల లైసెన్సుదారులు ఆందోళనలో పడ్డారు. కామనగరువులో దుకాణం తెరుచుకున్నా సమీపంలోనే ఓ విద్యా సంస్థ ఉండటంతో ఆ దుకాణాన్ని అడ్డుకునేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. -
మద్య నిషేధం ఏదీ బాబు?
- ఐద్వా రాష్ట్ర మహాసభల్లో అధ్యక్షురాలు ప్రభావతి ప్రశ్న అమలాపురం రూరల్: ఎన్నికలకు ముందు దశల వారీగా మద్యాన్ని నిషేధిస్తామని..బెల్ట్ షాపులను పూర్తిగా తొలగిస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారం చేపట్టాక ఆ హామీలే మరిచారని ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు డి.ప్రభావతి అన్నారు. అమలాపురం రూరల్ మండలం భట్లపాలెం బీవీసీ ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం ప్రారంభమైన రాష్ట్ర స్థాయి ఐద్వా శిక్షణ తరగతులకు ఆమె అధ్యక్షత వహించి ప్రసంగించారు. నాలుగు రోజులపాటు జరిగే ఈ శిక్షణా తరగతులను జ్యోతి ప్రజ్వలనచేసి ఆమె ప్రారంభించారు. రాష్ట్రంలో రోజు రోజుకు మద్యం అమ్మకాలు పెంచేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోందని...మహిళలు మద్య నిషేధం కోసం మరోసారి ఉద్యమించాల్సిన అవసరం ఉందని ప్రభావతి స్పష్టం చేశారు. ప్రభుత్వం ఊరూ వాడా బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తూ గ్రామాలను మద్యం మయం చేస్తోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. 1993–94 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మద్య నిషేధాన్ని అమలు చేశారని గుర్తు చేశారు. బాబు పాలనలో దానికి విరుద్ధంగా మద్యం అమ్మకాలను విచ్చల విడి చేసి ఖాజానా నింపుకుంటున్నారని ఆరోపించారు. జాతీయ రహదారులపై మద్యం దుకాణాలు తొలగించాలని సుప్రీం కోర్టు ఆదేశించినా ప్రభుత్వం అమలు చేయలేదని ఆరోపించారు. ముఖ్య అతిధిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు మాట్లాడుతూ మద్యం వల్ల మహిళల బతుకులు అస్తవ్యస్తంగా మారాయని, భర్త సంపాదనలో అధిక శాతం మద్యానికే ఖర్చు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రొయ్యల పరిశ్రమల్లో సరైన భద్రత లేకే మహిళలు ప్రమాదాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యూటీఎఫ్ జిల్లా నాయకురాలు అరుణకుమారి, ఐద్వా జిల్లా కార్యదర్శి సీహెచ్ రమణి, జిల్లా ఉపాధ్యక్షురాలు కుడుపూడి రాఘవమ్మ, జన విజ్ఞాన వేదిక జిల్లా నాయకుడు కేవీవీ సత్యనారాయణ, మద్యం వ్యతిరేక కమిటీ నాయకులు డాక్టర్ సూర్యనారాయణ, ఐద్వా లీగల్ కార్యదర్శి శిరోమణి తదితరులు పాల్గొన్నారు. -
రెతులకిచ్చే రూ. 4 వేలు మద్యం డబ్బులే..
బెల్ట్‌షాపులు ఎలా మూస్తామన్న ఎక్సైజ్ ఎస్సై విజేందర్ శంకరపట్నం(హుజూరాబాద్): మద్యం అమ్మకాలతో వచ్చే ఆదాయంతోనే రైతులకు ఎరువుల కొనుగోలుకు రూ.4 వేలు ఇవ్వనున్నారని.. బెల్ట్‌షాపులు ఎలా మూస్తామని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఎక్సైజ్ ఎస్సై విజేందర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శంకరపట్నం అంబాల్‌పూర్ గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలు గుడుంబా విక్రయ కేసులో మంగళవారం తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు. ఈ క్రమంలో గ్రామాల్లో గుడుంబా విక్రయాలు 90% తగ్గాయని, బెల్ట్ షాపులు నడుస్తున్నాయని, వాటిపై ఏం చర్యలు తీసుకుంటున్నారని విలేకరుల ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ... ‘బెల్ట్ షాపులు ఎలా మూస్తాం. మద్యంతోనే రైతులకు రూ.4 వేలు ఇవ్వనున్నారు’ అన్నారు. దీనిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
మద్యం వ్యాపారులకు షాక్
– సుప్రీం ఆదేశాల మేరకు నోటీసులు జారీ చేసిన అబ్కారీ శాఖ – జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట ఉన్న దుకాణాల లైసెన్సులు నెలాఖరుతో రద్దు – 500 మీటర్ల దూరంలో పెట్టుకునేందుకు అనుమతి – జిల్లాలో 500 మద్యం దుకాణాలు – సుప్రీం తీర్పునకు ప్రభావితమయ్యే దుకాణాలు 376 – జూన్ వరకు లైసెన్స్ ఉండడంతో ఆందోళనలో వ్యాపారులు – రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంలో వేసిన పిటీషన్‌పై ఆశలు సాక్షి, రాజమహేంద్రవరం: జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట ఉన్న మద్యం దుకాణాలను ఏప్రిల్ 1వ తేదీలోపు తొలగించాలని గత డిసెంబర్ 15న సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పును రాష్ట్ర అబ్కారీ శాఖ అమలులో పెడుతోంది. జాతీయ, రాష్ట్ర రహదారులపై ప్రమాదాలకు మద్యం సేవించి వాహనాలను నడపడమే కారణమని సుప్రీం కోర్టు పై విధంగా తీర్పు వెలువరించిన విషయం విదితమే. గురువారం జిల్లాలో జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట ఉన్న మద్యం దుకాణ యజమానులకు అబ్కారీ శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. దీంతో జాతీయ, రాష్ట్ర రహదారుల వెంబడి ఉన్న మద్యం దుకాణాల నిర్వాహకుల్లో ఆందోళన మొదలైంది. రెండేళ్ల వరకు మద్యం దుకాణాల నిర్వాహణకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు జూన్ 30 వరకు ఉండడంతో తాము తీవ్రంగా నష్టపోతామని మద్యం వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 500 మద్యం దుకాణాలున్నాయి. ఇందులో జాతీయ, రాష్ట్ర రహదారుల వెంబడి 376 దుకాణాలున్నాయని అబ్కారీ శాఖ అధికారులు చెబుతున్నారు. సుప్రీం తీర్పు ప్రభావం జిల్లాలో 376 (75 శాతం) దుకాణాలపై పడుతోంది. తాము మద్యం వ్యాపారులకు ఇచ్చిన లైసెన్స్ జూన్ 30 వరకు ఉందని, అప్పటి వరకు వెలుసుబాటు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. వారం రోజుల్లో విచారణకు వచ్చే అవకాశం ఉందని అబ్కారీ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపధ్యంలో తీర్పు ఎలా ఉండబోతోందన్న ఉత్కంఠలో మద్యం వ్యాపారులున్నారు. మరోచోట ఏర్పాటుకు అబ్కారీ అధికారులతో కమిటీ కోర్టు తీర్పు ప్రకారం మద్యం దుకాణాలు జాతీయ, రాష్ట్ర రహదారికి 500 మీటర్ల దూరంలో ఉండాలి. వాటిని చేరుకునేందుకు నేరుగా మార్గం ఉండకూడదు. అంతేకాకుండా జాతీయ, రాష్ట్ర రహదారుల నుంచి కనిపించే విధంగా ఉండకూడదు. రహదారులపై ఉంటే వాటి లైసెన్స్ రద్దు అవుతుంది. అయితే అక్కడ నుంచి 500 మీటర్ల దూరంలో కనిపించకుండా ఉండే ప్రాంతంలో దుకాణం ఏర్పాటు చేసుకుంటే ఆ లైసెన్స్ జూన్ 30 వరకు అమల్లో ఉంటుంది. మద్యం వ్యాపారులు నష్టపోకుండా ఈ విధానాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ కమిషనర్, సంబంధింత డివిజన్ సూపరింటెండెంట్, అసిస్టెంట్ సూపరింటెండెంట్, స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. మద్యం వ్యాపారులు స్థలం ఎంపిక చేసుకుని దరఖాస్తు చేసుకుంటే ఈ కమిటీ పరిశీలించి అనుమతులు జారీ చేస్తుంది. ఆందోళనలో మద్యం వ్యాపారులు... వచ్చే మూడు నెలలు (ఏప్రిల్, మే, జూన్) మద్యం వ్యాపారానికి మంచి సీజన్. వేసవి కాలం కావడంతో బీర్ల అమ్మకాలు గణనీయంగా ఉంటాయి. ఏడాదంతా చేసిన వ్యాపారం ఒక ఎత్తయితే చివరి మూడు నెలలు చేసే వ్యాపారం మరో ఎత్తు. సుప్రీం తీర్పు నేపథ్యంలో తాము తీవ్రంగా నష్టపోతామని మద్యం వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 500 దుకాణాల్లో జాతీయ రహదారుల వెంట కేవలం 36 మద్యం దుకాణాలున్నాయి. రాష్ట్ర రహదారులు వెంట 340 మద్యం దుకాణాలు న్నాయి. జాతీయ రహదారులు నగరాలు, పట్టణాలకు వెలుపల వెళుతుండగా, రాష్ట్ర రహదారులు మాత్రం పట్టణాలు, నగరాలల్లో ఉన్నాయి. దీంతో అధిక సంఖ్యలో మద్యం దుకాణాలు సుప్రీం తీర్పునకు ప్రభావితం అవుతున్నాయి. 500 మీటర్ల దూరంలో ఏర్పాటు చేసుకునే వెలుసుబాటు ఉన్నా ఇప్పటికిప్పుడు స్థలం దొరకడం కష్టమని మద్యం వ్యాపారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ దొరికినా దుకాణం ఏర్పాటు, స్థలం లీజు ధర యజమాని ఎక్కువ డిమాండ్ చేసే అవకాశం ఉందని వాపోతున్నారు. ప్రస్తుతం ఉన్న దుకాణానికి జూన్ వరకు అద్దె చెల్లించామని, ఇప్పడు అది కోల్పోవడంతోపాటు, కొత్తగా పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని పేర్కొంటున్నారు. సుప్రీం తీర్పును అమలు చేస్తున్నాం... డిసెంబర్ 15న సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట ఉన్న మద్యం దుకాణాలను తొలగించాలని వాటి యజమానులకు గురువారం నోటీసులు జారీ చేశాం. 500 మీటర్ల దూరంలో తిరిగి ఏర్పాటు చేసుకునేందుకు మద్యం వ్యాపారి స్థలం చూసుకుని దరఖాస్తు చేసుకుంటే పరిశీలిస్తాం. ఇందుకు డిప్యూటీ కమిషనర్ నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కమిషనర్ కమిటీ వేశారు. బడి, గుడి, ఆస్పత్రికి 100 మీటర్ల దూరంలో, ఇతర నిబంధనలకు అనుగుణంగా స్థలం ఉంటే కమిటీ పరిశీలించి అనుమతి ఇస్తుంది. తీర్పులో జూన్ వరకు వెలుసుబాటు కల్పించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంలో పిటీషన్ వేసింది. అతి త్వరలో దీనిపై విచారణ జరగనుంది. – ఎస్. లక్ష్మీకాంత్, అసిస్టెంట్ సూపరింటెండెంట్, అబ్కారీ శాఖ, రాజమహేంద్రవరం. -
మంత్రుల ఇలాకాలో మద్యం పరవళ్లు
* జిల్లాలో 1500కు పైగా బెల్టుషాపులు * అధికారపార్టీ అండతో చెలరేగుతున్న సిండికేట్లు * మామూళ్ల మత్తులో ఎక్సైజ్ శాఖ గ్రామాల్లో ప్రజలకు తాగునీరు లభించడం లేదు. మద్యం మాత్రం ఏరులై పారుతోంది. అసలే పంటలు దెబ్బతిని తీవ్ర నష్టాలపాలైన రైతులు మద్యానికి బానిసై జీవితాలు గుల్ల చేసుకుంటున్నారు. రోజువారి కూలీలు సైతం కూలి డబ్బుతో మద్యం సేవించి ఉత్త చేతులతో ఇంటికెళ్తున్నారు. సాక్షి, గుంటూరు: గ్రామాల్లో ఎటు చూసినా కరువు. కానీ మద్యం దుకాణాలు మాత్రం కళకళలాడుతున్నాయి. ఎక్సైజ్ నూతన మద్యం విధానం పేరుతో గ్రామాల్లో ఒక్క బెల్టు దుకాణం కూడా లేకుండా చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న అధికారపార్టీ ప్రజాప్రతినిధులే బెల్టు దుకాణాలను ప్రొత్సహిస్తున్నారు. జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు మంత్రుల నియోజకవర్గాల్లోనే అత్యధికంగా బెల్టుషాపులు ఉండటం విశేషం. అవి కూడా అమాత్యుల అనుచర గణం, అధికారపార్టీ కేడర్ నిర్వహిస్తుండటంతో ఆ నియోజకవర్గాల్లో మద్యం ఏరులై పారుతోంది. జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాల్లోనూ అదే పరిస్థితి. అధికార పార్టీ ఒత్తిళ్లు, మామూళ్లకు దాసోహమైన ఎక్సైజ్ అధికారులు నెలవారీ మామూళ్లు తీసుకుంటూ బెల్టుషాపుల వైపు కన్నెత్తి చూడడం లేదు. పర్యవసనంగా జిల్లాలో 342 మద్యం దుకాణాలు ఉండగా, బెల్టుషాపులు 1500కుపైగా చేరాయి. 24 గంటలూ అందుబాటు.. గ్రామాల్లోని చిల్లర దుకాణాల్లో 24 గంటలూ మద్యం అందుబాటులో ఉండే పరిస్థితి జిల్లాలో నెలకొంది. ఒకటి, రెండు చోట్ల ఎక్సైజ్ అధికారులు బెల్టుదుకాణాలపై దాడులు చేసి నిర్వాహకులను అదుపులోకి తీసుకోగానే, జిల్లాకు చెందిన ఓ మంత్రి ఫోన్ చేసి మనవాళ్లే వదిలేయండంటూ హుకుం జారీచేస్తుండటం జిల్లాలో పరిస్థితి తీవ్రతకు కారణం. గతంలో బెల్టుదుకాణాలపై దాడులు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయడంతోపాటు, బెల్టుదుకాణాలకు మద్యం సరఫరా చేసే మద్యం దుకాణం లైసెన్సును రద్దు చేయాలని పోలీసు అధికారులు ఎక్సైజ్ ఉన్నతాధికారులకు లేఖలు రాసిన దాఖలాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం అది కూడా కనిపించడం లేదు. మన పని కాదు కదా అంటూ పోలీసులు సైతం పట్టించుకోవడం లేదు. పైగా అర్ధరాత్రి వరకు మద్యం దుకాణాలు, బార్లు నడుస్తున్నా నెలవారి మామూళ్లు తీసుకుంటూ గ్రీన్‌సిగ్నల్ ఇస్తున్నారు. బెల్టుదుకాణాలను తొలగించాలని మహిళా సంఘాలు, గ్రామంలోని మహిళలు అనేక సార్లు ప్రజాప్రతినిధులు, అధికారుల ఎదుట ఆందోళనలు చేసినప్పటికీ ప్రయోజనం లేదు. మనవాళ్లే వదిలేయండి.. మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రత్తిపాడు, చిలకలూరిపేట నియోజకవర్గాల్లోని ప్రతి గ్రామంలో బెల్టు దుకాణాలు యథేచ్ఛగా నడుస్తున్నాయి. చిలకలూరిపేట నియోజకవర్గంలోని పసుమర్రు, మురికిపూడి, వేలూరు, కనపర్తి, తూబాడు, చందవరం, కారుచోల, జగ్గాపురం, వంకాయలపాడు, కొండవీడు గ్రామాల్లో అయితే పదికి పైగా బెల్టుదుకాణాలు ఉన్నాయి. ఇటీవల కనపర్తి గ్రామంలో బెల్టుదుకాణాలపై ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకోగా, వెంటనే మంత్రి ఫోన్‌చేసి వారిని వదిలేయాలని ఆదేశించినట్లు సమాచారం. ప్రత్తిపాడు నియోజకవర్గంలో మండలానికి 40 నుంచి 50 బెల్టుదుకాణాలు నడుస్తున్నాయి. నడింపాలెం గ్రామంలో పది దుకాణాలున్నాయి. గతంలో గుంటూరు వచ్చిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ సైతం రాజధాని జిల్లా అయిన గుంటూరులో బెల్టుదుకాణాలు లేకుండా చేసేందుకు చర్యలు తీసుకుంటామంటూ ఆర్భాటంగా ప్రకటించారు. కానీ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాకపోవడం గమనార్హం.