టీచర్‌ వికృత చేష్టలు.. ఫుల్‌గా మద్యం తాగి చెప్పుతో.. | Karnataka: Drunken Teacher Suspended Misbehavior With Principal And Students | Sakshi
Sakshi News home page

టీచర్‌ వికృత చేష్టలు.. ఫుల్‌గా మద్యం తాగి చెప్పుతో..

Published Mon, Jul 18 2022 3:13 PM | Last Updated on Mon, Jul 18 2022 3:59 PM

Karnataka: Drunken Teacher Suspended Misbehavior With Principal And Students - Sakshi

తుమకూరు(బెంగళూరు): ఉపాధ్యాయుడు పాఠశాలకు మద్యం తాగి వచ్చి ప్రధానోపాధ్యాయున్ని చెప్పుతో బెదిరించి, విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వైనం వెలుగుచూసింది. కర్ణాటక మధుగిరి తాలూకాలోని గొందిహళ్ళి ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌ ఫణీంద్రనాథ్‌ మద్యం తాగి వచ్చాడు. ఇతనిపైన అనేక సంవత్సరాలుగా ఇలాంటి ఫిర్యాదులు ఉన్నాయి.

గతంలో హెడ్‌మాస్టర్లు కూడా పై అధికారులకు నివేదికలు పంపినా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో ఇతడు ఆడింది ఆటగా సాగుతోంది. దీంతో రెండురోజుల క్రితం మద్యం తాగి నానా హంగామా చేశాడు. దీంతో హెచ్‌ఎం మధుగిరి విద్యాశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ ఎం.రేవణ్ణ సిద్దప్పకు ఫిర్యాదు చేయగా ఫణీంద్రనాథ్‌ను సస్పెండ్‌ చేశారు. వచ్చే శుక్రవారం విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.

చదవండి: ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. భర్త చేసిన పనికి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement