బ్లూఫిల్మ్‌లు చూపుతూ.. టీచర్‌ వంకరబుద్ధి | teacher abuses students, villagers beat him | Sakshi
Sakshi News home page

Published Tue, Nov 21 2017 8:29 PM | Last Updated on Tue, Nov 21 2017 8:43 PM

teacher abuses students, villagers beat him - Sakshi

సాక్షి, తుమకూరు(కర్ణాటక): విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి.. వారిని సన్మార్గంలో నడపాల్సిన ఉపాధ్యాయుడే దారి తప్పాడు. విద్యార్థినుల పట్ల వంకరబుద్ధి చూపాడు. తన సెల్‌ఫోన్‌లో అసభ్య చిత్రాలు చూపిస్తూ.. విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్న సదరు టీచర్‌కు గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. తుమకూరు జిల్లా కుణిగల్‌ తాలూకా వడ్డరకుప్పె గ్రామ ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. 

పాఠశాల ఉపాధ్యాయుడు దయానంద్‌(40) గత కొంత కాలంగా తరగతి గదిలో బాలికలను లైంగికంగా వేధిస్తున్నాడు. తన సెల్‌ఫోన్‌లో ఉన్న బ్లూఫిల్మ్‌లను, చిత్రాలను చూపిస్తున్నాడు. దీంతో బాలికలు ఇతర ఉపాధ్యాయుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. సదరు టీచర్‌ చేష్టలు ఎక్కువ కావటంతో బాధిత బాలికలు ఈ విషయాన్ని తమ తల్లిదండ్రులకు చెప్పారు. ఆగ్రహం చెందిన తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని ఉపాధ్యాయుడు దయానంద్‌కు దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు. కుణిగల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు  చేస్తున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement