బెంగళూరు: కర్ణాటకాలో ఓ టీచర్ విద్యార్థులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. గొడవ పడుతున్న ఇద్దరు ముస్లిం విద్యార్థులను ఉద్దేశించి పాకిస్థాన్‌కు వెళ్లండి.. ఇది హిందూ దేశం అని అన్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు విద్యార్థులు వారి కుటుంబంతో కలిసి విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. శివమొగ్గ జిల్లాలోని ఓ ఉర్దూ ఇన్‌స్టిట్యూషన్‌లో ఈ ఘటన జరిగింది.
ఐదవ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు కన్నడ భాష క్లాస్ జరుగుతుండగానే అల్లరి చేశారు. ఒకరిపై మరొకరు ఘర్ణణకు దిగారు. దీంతో విసిగిపోయిన కన్నడ భాష బోధించే టీచర్.. విద్యార్థులను పాకిస్థాన్‌కు వెళ్లాలని.. ఇది హిందూ దేశమని అన్నారు. సదరు టీచర్‌ను బదిలీ చేసినట్లు అధికారులు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతున్నట్లు వెల్లడించారు.
ఉర్దూ స్కూల్‌లో ఆ టీచర్ ఎనిమిదేళ్లుగా బోధిస్తున్నారని, మొత్తం 26 ఏళ్ల అనుభవం ఉన్నట్లు గుర్తించారు. ఆమె రెగ్యులర్ ఉద్యోగిని అని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ఘటనల తర్వాత మళ్లీ కర్ణాటకాలో ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది.
యూపీలోని ముజఫర్‌నగర్‌లో ఓ ముస్లిం విద్యార్థిని తోటి పిల్లలతో టీచర్ కొట్టించారు. చివరికి పిల్లాడిని దండించాలనే తప్పా మతపరమైన ఉద్దేశం తనకు లేదని చెప్పారు. ఢిల్లీలో తరగది గదిలో ఓ టీచర్ విద్యార్థులను పాక్‌కు వెళ్లాలని సూచించారు. అనంతరం మళ్లీ కర్ణాటకలో ఈ ఘటన జరిగింది.
ఇదీ చదవండి: సోనియాగాంధీకి ఆస్వస్థత.. గంగారామ్ ఆస్పత్రిలో చికిత్స..
Comments
Please login to add a commentAdd a comment