go
-
మీ సపోర్ట్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు.. అల్లు అర్జున్ ట్వీట్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ధన్యవాదాలు తెలిపారు. సినిమాకు మీరు ఇస్తున్న సపోర్ట్‌కు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా అంటూ ట్వీట్ చేశారు. పుష్ప-2 టికెట్స్ పెంచుకునేందుకు జీవో ఇవ్వడం లాంటి మీ ఆలోచనాత్మక నిర్ణయం తెలుగు సినిమా ఎదుగుదలను ప్రోత్సహిస్తుందని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎంవో, సీఎం రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డిని ట్యాగ్ చేస్తూ ధన్యవాదాలు తెలిపారు.(ఇది చదవండి: తెలంగాణలో పుష్ప-2 రిలీజ్‌కు తొలగిన అడ్డంకులు)కాగా.. సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో వస్తోన్న పుష్ప-2 సినిమాకు బెనిఫిట్ షోలతో పాటు టికెట్స్ పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతులిచ్చింది. డిసెంబర్ 4న రాత్రి 9.30 గంటలకే పడనున్న బెనిఫిట్ షోలకు గరిష్ఠంగా రూ.800 పెంచుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ స్క్రీన్, మల్టీఫ్లెక్స్ ఏదైనా సరే ప్రస్తుతం ఉన్న టికెట్ ధరకు అదనంగా రూ.800 చెల్లించాల్సిందే. అలాగే అర్ధరాత్రి 1 గంట నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు అదనపు షోలకు కూడా అనుమతించింది. డిసెంబర్ 5 నుంచి 8 వరకు సింగిల్ స్క్రీన్లలో రూ.150, మల్టీఫ్లెక్స్‌లో రూ.200 పెంపుకోవచ్చని జీవోలో తెలిపింది. డిసెంబర్ 9 నుంచి 16 వరకు సింగిల్ స్క్రీన్‌లో రూ.105, మల్టీఫ్లెక్స్‌లో రూ.150, డిసెంబర్ 17 నుంచి 23 వరకు సింగిల్ స్క్రీన్‌లో రూ.20, మల్టీఫ్లెక్స్‌లో రూ.50 పెంచుకునేలా జీవో జారీ చేసింది.A heartfelt thank you to the Government of Telangana for their support through the approval of ticket hikes and the new GO. Your thoughtful decision fosters the growth of Telugu cinema. A special thank you to Hon’ble @TelanganaCMO Sri @revanth_anumula garu for his unwavering…— Allu Arjun (@alluarjun) December 3, 2024 -
TG: పలువురు ఐఏఎస్‌ల బదిలీ
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో తొమ్మిది మంది ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) శాంతికుమారి శనివారం(ఆగస్టు31)ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో సురేంద్రమోహన్,యాస్మిన్‌బాషా,వినయ్ కృష్ణారెడ్డి, మల్సూర్ తదితరులున్నారు. వీరిలో సురేంద్రమోహన్ను మైన్స్ అండ్ జియాలజీ సెక్రటరీగా యాస్మిన్ బాషాను హార్టీ కల్చర్ డైరెక్టర్‌గా మల్సూర్‌ను మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వైస్‌చైర్మన్‌గా నియమించారు. -
ఏపీలో ఇసుక విధానం కోసం మార్గదర్శకాలు
అమరావతి, సాక్షి: ఏపీలో కొత్త ఇసుక విధానం విషయంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జీవో నెంబర్ 40 పేరిట.. 2019, 2021 ఇసుక విధానాలు రద్దు చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే 2024 ఇసుక విధానం రూపకల్పన జరగాల్సిన ఉందని చెబుతూ.. అప్పటిదాకా కలెక్టర్లకు ఇచ్చిన ఈ అంతర్గత మార్గదర్శకాలు అమల్లో ఉంటాయని పేర్కొంది. ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ఇసుక విధానం అమలు చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా ఎస్పీ, జేసీ, పలువురు శాఖల అధికారులు కమిటీలుగా నియమించింది. అయితే భవన నిర్మాణాలు మినహా మరేయితర అవసరాలకు ఇసుకను వినియోగించకూడదని స్పష్టం చేసింది. ప్రస్తుతం వేర్వేరు స్టాక్ పాయింట్ల వద్ద 49 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వలున్నాయి. స్టాక్ పాయింట్ల నుంచి ఉచిత ఇసుక సరఫరాపై అధికారికంగా ఇంకా ఉత్తర్వులు విడుదల కాలేదు. అయితే వీటిని కమిటీలు పర్యవేక్షించాలని ప్రభుత్వం తాజా జీవోలో తెలిపింది. ఇక కొత్త ఇసుక విధానంపై త్వరలో ఉత్తర్వులు జారీ కావొచ్చని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. -
TG: తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీ
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం భారీగా ఐపీఎస్ బదిలీలు చేసింది. మొత్తం 28 మంది పోలీసు ఉన్నతాధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు సాధారణపరిపాలన శాఖ సోమవారం(జూన్17) ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో భారీగా ఐపీఎస్ బదిలీలు.. వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ట్రిపుల్ ఆర్ వరకు హెచ్ఎండీఏ విస్తరణ...
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ పరిధిని ట్రిపుల్ ఆర్ వరకు విస్తరించనున్నట్లు ప్రభుత్వం తాజాగా ప్రతిపాదించిన నేపథ్యంలో జీవో 111 అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. జంట జలాశయాల పరిరక్షణ కోసం అమల్లోకి తెచ్చిన ఈ జీవో ఇప్పటికే అన్ని విధాలుగా నిర్వీర్యమైంది. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు మహానగర విస్తరణ చేపట్టనున్న దృష్ట్యా జీవో 111పైన కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ముందుకెళ్లనుందనేది ఆసక్తికరంగా మారింది. రీజనల్ రింగ్‌రోడ్డు వరకు ఉన్న అన్ని ప్రాంతాలను హెచ్ఎండీఏ పరిధిలోకి తేనున్నట్లు సీఎం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకనుగుణంగా మెగా మాస్టర్ ప్లాన్–2050 రూపొందించాలని ఆయన హెచ్ఎండీఏను ఆదేశించారు. దీంతో ట్రిపుల్ వన్ పరిధిలోని 82 గ్రామాలను మెగా మాస్టర్ ప్లాన్‌లో విలీనం చేస్తారా, లేక త్రిబుల్ వన్ జీవోను యధాతథంగా కొనసాగిస్తారా అనే అంశంపైన సందిగ్ధం నెలకొంది. ప్రస్తుతం హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్‌తోపాటు, సైబరాబాద్, పాత ఎంసీహెచ్, ఎయిర్‌పోర్టు, జీహెచ్ఎంసీ మాస్టర్ప్లాన్లు అమల్లో ఉన్నాయి. ఈ ఐదింటిని కలిపి ఒకే బృహత్తర మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించాలని, ట్రిపుల్ వన్‌లోని ప్రాంతాలను కూడా మాస్టర్‌ప్లాన్ పరిధిలోకి తేవాలని గత ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మేరకు అప్పట్లో ట్రిపుల్ వన్ జీవోను ఎత్తివేశారు. కానీ హైకోర్టు ఆదేశాలతో తిరిగి యదాతథస్థితి కల్పించవలసి వచ్చింది. ఈ క్రమంలో బృహత్తర మాస్టర్ప్లాన్పైన హెచ్ఎండీఏ ఇప్పటికే కసరత్తు చేపట్టింది. కానీ తాజా ప్రతిపాదనల మేరకు మెగా మాస్టర్‌ప్లాన్–2050పైన దృష్టి సారించింది. ప్రస్తుతం ఉన్న 7000 చదరపు కిలోమీటర్ల హెచ్ఎండీఏ పరిధిని మరో 3000 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరిస్తూ భారీ మాస్టర్‌ప్లాన్ రూపొందిస్తే ప్రస్తుతం హెచ్ఎండీఏ పరిధిలోనే ఉన్న ట్రిపుల్ వన్ జీవోలోకి వచ్చే 82 గ్రామాల్లో ఉన్న సుమారు 1.30 లక్షల ఎకరాల భూమి కూడా ఈ మాస్టర్‌ప్లాన్‌లో భాగం కానుంది. పరిరక్షణపై నీలినీడలు... ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ల పరివాహక ప్రాంతాలను కాపాడేందుకు 1996లో ప్రభుత్వం జీవో 111ను అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. హెచ్ఎండీఏ పరిధిలోని 82 గ్రామాలు ఈ జీవో పరిధిలో ఉన్నాయి. సుమారు 1.30 లక్షల ఎకరాల భూమి విస్తరించింది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఏదో ఒక స్థాయిలో ఈ జీవో చర్చనీయాంశమవుతూనే ఉంది. మరోవైపు జీవోను పటిష్టంగా అమలు చేయాలని కోరుతూ పర్యావరణ సంస్థలు, సామాజిక కార్యకర్తలు న్యాయస్థానాల్లో పోరాడుతున్నారు. జీవోకు విఘాతం కలిగించే చర్యలపైన కేసులు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే గత ప్రభుత్వం మరోసారి ఈ జీవోను కదిలించింది. 82 గ్రామాలకు చెందిన రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ జీవోను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. దాని స్థానంలో జీవో 69ను కూడా తెచ్చారు. కానీ న్యాయస్థానంలో జీవో 111 అమల్లోనే ఉన్నట్లు ప్రభుత్వం స్పష్టతనివ్వడంతో తీవ్రమైన సందిగ్ధం కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ఎన్నికలు వచ్చాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం స్థానంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. భారీగా అక్రమ నిర్మాణాలు... ఒకవైపు ఇలా వివిధ రకాలుగా ట్రిపుల్ వన్ జీవోను నిర్వీర్యమవుతున్న పరిస్థితుల్లోనే అన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు వెలిశాయి. వట్టినాగులపల్లి, పుప్పాలగూడ, తదితర ప్రాంతాల్లో అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు హెచ్ఎండీఏ ఆధ్వర్యంలోనే అడ్డగోలుగా చేంజ్ ఆఫ్ లాండ్ యూజ్ సర్టిఫికెట్లను ఇచ్చేశారు. మరోవైపు రియల్ఎస్టేట్ వర్గాలు, నిర్మాణ సంస్థలు భారీగా అక్రమ నిర్మాణాలు చేపట్టాయి. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వరకు ఈ అక్రమ నిర్మాణాలు యథావిధిగా కొనసాగుతూనే ఉన్నాయి. శంషాబాద్, శంకర్పల్లి, తదితర ప్రాంతాల్లో వందల సంఖ్యలో బహుళ అంతస్థుల భవనాలు వెలిశాయి. ‘శంషాబాద్ పరిధిలోని శాతంరాయి, పెద్ద తుప్రా, ముచ్చింతల్ వంటి ప్రాంతాల్లో ఎలాంటి అనుమతులు లేకుండానే బిల్డింగ్లు నిర్మిస్తున్నారు. ఆ తరువాత అనుమతులు తీసుకుంటున్నారు.’ అని శంషాబాద్ ప్రాంతానికి చెందిన ఒక అధికారి విస్మయం వ్యక్తం చేశారు. ఏం చేస్తారు... ఇలా అన్ని విధాలుగా జీవో 111 ప్రమాదంలో పడిన దృష్ట్యా మెగామాస్టర్ ప్లాన్‌పైన అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం కన్జర్వేషన్ జోన్లో ఉన్న ప్రాంతాలను అలాగే ఉంచి మిగతా ప్రాంతాలకు మాస్టర్‌ప్లాన్ విస్తరిస్తారా లేక, ఈ జీవోలోని గ్రామాల కోసం ప్రత్యేకమైన మాస్టర్ ప్లాన్ రూపొందిస్తారా అనే అంశాలు ఇప్పుడు చర్చనీయంగా మారాయి. మరోవైపు మెగా మాస్టర్‌ప్లాన్ ఎప్పటి వరకు రూపొందిస్తారనేది కూడా చర్చనీయాంశమే. ట్రిపుల్ ఆర్ వరకు నిర్మాణ రంగానికి అనుమతులపైన కూడా మాస్టర్‌ప్లాన్‌లో ఏ ప్రమాణాలను పాటిస్తారనేది కూడా తాజాగా ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం డీటీసీపీ పరిధిలో ఉన్న ప్రాంతాలు భవిష్యత్తులో హెచ్ఎండీఏ పరిధిలోకి రానున్నాయి. దీంతో భవన నిర్మాణాలకు హెచ్ఎండీఏ అనుమతులు తప్పనిసరి. అలాంటప్పుడు వివిధ రకాల జోన్ల విభజనపైన కూడా మాస్టర్‌ప్లాన్‌లో ఎలా ముందుకెళ్తారనేది కూడా రియల్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. -
AP: ఎస్మా పరిధిలోకి అంగన్వాడీ సర్వీసులు
సాక్షి, విజయవాడ: అత్యవసర సర్వీసుల నిర్వహణ చట్టం (ఎస్మా) పరిధిలోకి రాష్ట్రంలోని అంగన్వాడీలను ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. అంగన్వాడీ కార్యకర్తలు, గర్భిణులు, బాలింతలు, పసి పిల్లలకు అందించే సేవలను అత్యవసర సేవలుగా ప్రభుత్వం పరిగణించింది. ఆరు నెలల పాటు అంగన్వాడీ కేంద్రాల్లో సమ్మెలు నిషేధించినట్లు ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ఇదీచదవండి.. సంక్రాంతికి స్పెషల్ రైళ్లు -
అవసరంలేని, అప్రాధాన్య జీవోలనే వెబ్సైట్లో ఉంచడం లేదు
సాక్షి, అమరావతి: ప్రజలకు ఏ మాత్రం అవసరంలేని, ప్రాధాన్యతలేని, ఇతర సాధారణ జీవోలను అధికారిక వెబ్సైట్లో ఉంచడం లేదని రాష్ట్ర ప్రభుత్వం బుధవారం హైకోర్టుకు నివేదించింది. మెడికల్ బిల్లులు, పెట్రోల్ అలవెన్సులు, ఇతర చెల్లింపులు తదితరాలకు సంబంధించిన జీవోలు ప్రజలకు అంత అవసరంలేదని, అందుకే వాటిని వెబ్సైట్లో ఉంచడం లేదని ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) చింతల సుమన్ హైకోర్టుకు వివరించారు. ఇందులో దాచేందుకు ఏమీలేదని తెలిపారు. మిగిలిన జీవోలను విడుదలైన వారం రోజుల్లో వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నామన్నారు. అత్యవసర జీవోలను మరుసటిరోజే అప్లోడ్ చేస్తున్నామని చెప్పారు. జీవోల విషయంలో గోప్యత పాటించాల్సిన అవసరం లేదని హైకోర్టు ఈ సందర్భంగా అభిప్రాయపడింది. ఈ వ్యవహారంపై ఈ నెల 22న విచారిస్తామంది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందనరావు ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. జీవోలను ప్రభుత్వ వెబ్సైట్లో ఉంచకపోవడం సమాచారహక్కు చట్ట నిబంధనలకు విరుద్ధమంటూ నెల్లూరుకు చెందిన జి.ఎం.ఎన్.ఎస్.దేవి, గుంటూరుకు చెందిన కె.శ్రీనివాసరావు, అనంతపురం జిల్లాకు చెందిన ఎస్.ఆర్.ఆంజనేయులు, బాపట్ల జిల్లాకు చెందిన సింగయ్య తదితరులు హైకోర్టులో వేర్వేరుగా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలు విచారణ జాబితాలో ఉన్నప్పటికీ విచారణకు నోచుకోని వీటిపై అత్యవసర విచారణ జరపాలంటూ పిటిషనర్ల న్యాయవాదులు బుదవారం సీజే ధర్మాసనం ముందు ప్రస్తావించారు. అత్యధిక జీవోలను ప్రభుత్వం అప్లోడ్ చేయకుండా గోప్యత పాటిస్తోందన్నారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. జీవోలను వెబ్సైట్లో ఉంచడం వల్ల నష్టమేముందని ప్రశ్నించింది. జీవోను ప్రజలకు అందుబాటులో ఉంచితే మంచిదేగా అని వ్యాఖ్యానించింది. దీనికి ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సుమన్ స్పందిస్తూ.. ప్రజలకు అవసరంలేని, ప్రాధాన్యతలేని, సాధారణ జీవోలనే వెబ్సైట్లో ఉంచడం లేదని తెలిపారు. మిగిలిన జీవోలను వెబ్సైట్లో ఉంచుతున్నామని చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఈ వ్యాజ్యాల్లో విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది. -
వీఆర్వోలకు మేలు చేసేలా జీవోలు
సాక్షి, అమరావతి: వీఆర్వోలకు మేలు జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం 154, 64, 6538, 166, 31 జీవోలు జారీ చేసిందని ఏపీ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం (వీఆర్వో అసోసియేషన్) అధ్యక్షుడు భూపతిరాజు రవీంద్రరాజు పేర్కొన్నారు. సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వానికి కృతజ్ఞత తెలిపేందుకు త్వరలో రాష్ట్రస్థాయిలో విజయోత్సవ సభ నిర్వహించనున్నట్టు తెలిపారు. ఆదివారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన ఏపీ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ అసోసియేషన్ సమావేశంలో రవీంద్రరాజు మాట్లాడుతూ.. రెవెన్యూ విభాగంలో సీనియర్ అసిస్టెంట్ పదోన్నతులలో వీఆర్వోలకు ప్రస్తుతం ఉన్న కోటా 40 శాతం నుంచి 70 శాతానికి పెంచాలని, ఖాళీగా ఉన్న సీనియర్ సహాయకుల పోస్టులలో వన్‌టైమ్ సెటిల్మెంట్ ప్రకారం 70 శాతం పదోన్నతులను వీఆర్వోలతో భర్తీ చేయాలని కోరారు. సర్వే సప్లిమెంటరీ పరీక్షలు రాసిన గ్రేడ్–2 వీఆర్వోల ఫలితాలు వెంటనే విడుదల చేయాలని కోరారు. ఏపీ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘాన్ని గుర్తింపు సంఘంగా ఎంపిక చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్టు తెలిపారు. సమావేశంలో సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అప్పలనాయుడు, నాయకులు బాలాజీరెడ్డి, మౌళి భాష, లక్ష్మీనారాయణ, బాపూజీ పాల్గొన్నారు. -
ఆ జీవోలపై హైకోర్టు పునర్విచారణ
సాక్షి, అమరావతి: అమరావతి భూ కుంభకోణం, ఏపీ ఫైబర్‌నెట్ స్కాంలతో పాటు గత చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు, చేపట్టిన ప్రాజెక్టులు తదితరాలపై సమీక్ష జరిపేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీఓ 1411.. మంత్రివర్గ ఉప సంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆ ఆక్రమాలపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటుచేస్తూ జారీచేసిన జీఓ 344ను సవాలుచేస్తూ తెలుగుదేశం పార్టీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌లు వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు శనివారం తిరిగి విచారణ జరిపింది. ఈ వ్యాజ్యాల్లో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే, కేంద్రం దాఖలు చేసే కౌంటర్లకు సమాధానం దాఖలు చేయాలని పిటిషనర్లయిన రామయ్య, రాజేంద్రప్రసాద్‌లను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 20కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్ర ప్రభుత్వ వాదనను పట్టించుకోని సింగిల్ జడ్జి.. మంత్రివర్గ ఉప సంఘం, సిట్ ఏర్పాటు జీఓలను సవాలుచేస్తూ టీడీపీ నేతలు వర్ల రామయ్య, రాజేంద్రప్రసాద్‌లు 2020లో వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలుచేశారు. వీటిపై విచారణ జరిపిన నాటి న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు, ఆ జీఓల్లో తదుపరి చర్యలన్నింటినీ నిలిపేస్తూ 2020 సెపె్టంబర్ 16న మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. గత ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించే సంపూర్ణాధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని పేర్కొన్నారు. గత ప్రభుత్వ నిర్ణయాలను ఆ తరువాత ప్రభుత్వాలు తప్పనిసరిగా కొనసాగించాలన్నారు. ఈ వ్యాజ్యంలో కేంద్ర ప్రభుత్వం, ఈడీలను ప్రతివాదులుగా చేర్చుకుని వారి వాదనలు వినాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను సైతం న్యాయమూర్తి తోసిపుచ్చారు. ఈ జీఓలవల్ల వర్ల రామయ్య, రాజేంద్రప్రసాద్‌లు బాధిత వ్యక్తులు కాదని, వారి వ్యాజ్యాలకు విచారణార్హతే లేదన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనను సైతం జస్టిస్ సోమయాజులు పరిగణనలోకి తీసుకోలేదు. ‘సుప్రీం’ ఆదేశాలతో తిరిగి విచారణ.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు టీడీపీ నేతలు దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు తిరిగి ఈ ఏడాది జూన్‌లో విచారణ మొదలుపెట్టింది. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చింది. అటు తరువాత పలుమార్లు ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపింది. తాజాగా.. శనివారం ఈ వ్యాజ్యాలపై జస్టిస్ రామకృష్ణప్రసాద్ మరోసారి విచారణ జరిపారు. కౌంటర్ల దాఖలుకు కేంద్ర ప్రభుత్వం తరఫున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ (డీఎస్జీ) ఎన్.హరినాథ్ తరఫు న్యాయవాది వరుణ్ బైరెడ్డి గడువు కోరారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్. శ్రీరామ్ స్పందిస్తూ.. సిట్ పరిధిలో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణాన్ని సీబీఐకి అప్పగించాలంటూ తాజాగా పిల్ దాఖలైందని న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. ఆ వ్యాజ్యం విచారణకు వస్తే అందులోనూ కేంద్రం తన వైఖరిని తెలియజేయాల్సి ఉంటుందని వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి కౌంటర్ దాఖలు చేసేందుకు కేంద్రానికి గడువునిచ్చారు. తదుపరి విచారణను అక్టోబరు 20కి వాయిదా వేశారు. అప్పటికల్లా ఇరుపక్షాలు కౌంటర్లు, వాటికి రిప్లైలు దాఖలు చేయడం పూర్తిచేయాలని న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణప్రసాద్ స్పష్టంచేశారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు రద్దు.. దీంతో.. జస్టిస్ సోమయాజులు ఇచ్చిన ఉత్తర్వులను సవాలుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఉత్తర్వులను రద్దుచేయాలని కోరింది. రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను తప్పుపట్టి వాటిని రద్దుచేసింది. హైకోర్టు ఆ మధ్యంతర ఉత్తర్వులిచ్చి ఉండాల్సింది కాదని, కేసు ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని గుర్తుచేసింది. రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన రెండు జీఓలను పరిశీలిస్తే, గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సమీక్షించేందుకు ఆ జీఓ జారీ అయినట్లు భావించడానికి వీల్లేదంది. కేంద్రాన్ని సైతం ఈ వ్యాజ్యాల్లో ప్రతివాదిగా చేర్చుకోవాలని హైకోర్టును ఆదేశించింది. కేంద్రం అభిప్రాయం కూడా తెలుసుకోవాలంది. కేసు పూర్వాపరాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ వ్యాజ్యాలను మూడునెలల్లో పరిష్కరించాలని సుప్రీంకోర్టు ఈ ఏడాది మేలో హైకోర్టుకు స్పష్టం చేసింది. -
‘పాలమూరు–రంగారెడ్డి’ జీవోపై సుప్రీంకోర్టుకు ఏపీ
సాక్షి, అమరావతి: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 90 టీఎంసీలు కేటాయించుకుంటూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల(జీవో)ను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్(ఎస్ఎల్పీ) దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ జీవోపై విచారణ చేపట్టడం తమ పరిధిలోకి రాదంటూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన ఇంటర్ లొకేటరీ అప్లికేషన్(ఐఏ)ను తిరస్కరిస్తూ కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్(కేడబ్ల్యూడీటీ–2) బుధవారం తీర్పు ఇచ్చింది. ఈ అంశంపై మరో న్యాయస్థానాన్ని ఆశ్రయించే స్వేచ్చ ఏపీ ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేసింది. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలకు నీటి కేటాయింపుల వల్ల రాష్ట్ర హక్కులకు విఘాతం కలుగుతుందని నివేదించనుంది. ఆ జీవోను రద్దు చేయడం ద్వారా ఏపీ హక్కులను పరిరక్షించాలని సుప్రీంకోర్టుకు విన్నవించనుంది. -
'పాక్‌కు వెళ్లండి..' టీచర్ వివాదాస్పద వ్యాఖ్యలు
బెంగళూరు: కర్ణాటకాలో ఓ టీచర్ విద్యార్థులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. గొడవ పడుతున్న ఇద్దరు ముస్లిం విద్యార్థులను ఉద్దేశించి పాకిస్థాన్‌కు వెళ్లండి.. ఇది హిందూ దేశం అని అన్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు విద్యార్థులు వారి కుటుంబంతో కలిసి విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. శివమొగ్గ జిల్లాలోని ఓ ఉర్దూ ఇన్స్టిట్యూషన్లో ఈ ఘటన జరిగింది. ఐదవ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు కన్నడ భాష క్లాస్ జరుగుతుండగానే అల్లరి చేశారు. ఒకరిపై మరొకరు ఘర్ణణకు దిగారు. దీంతో విసిగిపోయిన కన్నడ భాష బోధించే టీచర్.. విద్యార్థులను పాకిస్థాన్‌కు వెళ్లాలని.. ఇది హిందూ దేశమని అన్నారు. సదరు టీచర్‌ను బదిలీ చేసినట్లు అధికారులు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. ఉర్దూ స్కూల్లో ఆ టీచర్ ఎనిమిదేళ్లుగా బోధిస్తున్నారని, మొత్తం 26 ఏళ్ల అనుభవం ఉన్నట్లు గుర్తించారు. ఆమె రెగ్యులర్ ఉద్యోగిని అని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ఘటనల తర్వాత మళ్లీ కర్ణాటకాలో ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. యూపీలోని ముజఫర్‌నగర్‌లో ఓ ముస్లిం విద్యార్థిని తోటి పిల్లలతో టీచర్ కొట్టించారు. చివరికి పిల్లాడిని దండించాలనే తప్పా మతపరమైన ఉద్దేశం తనకు లేదని చెప్పారు. ఢిల్లీలో తరగది గదిలో ఓ టీచర్ విద్యార్థులను పాక్‌కు వెళ్లాలని సూచించారు. అనంతరం మళ్లీ కర్ణాటకలో ఈ ఘటన జరిగింది. ఇదీ చదవండి: సోనియాగాంధీకి ఆస్వస్థత.. గంగారామ్ ఆస్పత్రిలో చికిత్స.. -
సర్దార్ పాపన్నగౌడ్ ఆశయాలను కొనసాగిస్తాం
గన్‌పౌండ్రీ (హైదరాబాద్): సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను కొనసాగిస్తామని తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ఆదివారం రవీంద్రభారతిలో సర్దార్ పాపన్న మహారాజ్ ధర్మ పరిపాలన సంస్థ, జై గౌడ్ ఉద్యమం జాతీయ కమిటీ ఆధ్వర్యంలో తొలి తెలుగు బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయ్ పాపన్న గౌడ్ మహరాజ్ 373వ జయంతి జాతీయ వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌడ కులస్తుల అనేక సమస్యలు పరిష్కారమయ్యాయన్నారు. పాపన్న చరిత్ర తెలుసుకుంటే జాతిపట్ల అప్పట్లో ఎంత వివక్షత ఉందో తెలుస్తుందన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాపన్న గౌడ్ జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్నట్లు గుర్తుచేశారు. ట్యాంక్‌బండ్‌పై పాపన్న విగ్రహాన్ని పెట్టేందుకు జీవో జారీ చేశామని హెచ్ఎండీఏ అధికారులు స్థలాన్ని అన్వేషీస్తున్నట్లు వెల్లడించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కర్ణాటక ఎమ్మెల్సీ బీకే హరిప్రసాద్ మాట్లాడుతూ, బహుజనులంతా ఐక్యంగా ఉన్నప్పుడే బీసీలకు రాజ్యాధికారం సాధ్యమవుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు భరత్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీలకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తున్నట్లు తెలిపారు. 75 సంవత్సరాల రాజమండ్రి పార్లమెంటు చరిత్రలో మొట్టమొదటిసారి ఒక బీసీ వ్యక్తి పార్లమెంటుకు ఎంపిక కావడమే అందుకు నిదర్శనమన్నారు. ఈ సందర్భంగా పాపన్నగౌడ్ బయోపిక్‌పై రూపొందించిన సినిమా వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించగా పలు సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర శాసన మండలి మాజీ చైర్మన్ కె.స్వామిగౌడ్, మాజీ పార్లమెంట్ సభ్యులు మధుయాష్కిగౌడ్, పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్, గౌడ కార్పొరేషన్ చైర్మన్ పల్లే రవికుమార్‌గౌడ్, జై గౌడ్ ఉద్యమం వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు వి.రామారావుగౌడ్ పాల్గొన్నారు. -
జీవో కాపీలను వీసీ రాజారెడ్డికి ఇచ్చిన నాన్ టీచింగ్ స్టాఫ్
-
111 జీవో పూర్తిగా రద్దు
-
AP: ఉద్యోగుల పదవీ విరమణ ఫేక్ జీవోపై ఆర్థిక శాఖ సీరియస్
సాక్షి, అమరావతి: ఉద్యోగుల పదవీ విరమణ ఫేక్ జీవోపై ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ సీరియస్ అయ్యింది. ఉద్యోగుల రిటైర్మెంట్పై సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఫేక్ జీవోపై గుంటూరు డీఐజీకి ఆర్థికశాఖ అధికారులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేయాలంటూ ఎస్పీని డీఐజీ ఆదేశించారు. మేమెలాంటి సర్వే చేయలేదు.. ఇదిలా ఉండగా, ఎల్లో మీడియాలో ప్రచురితమైన ‘మంత్రులకు ముచ్చెమటలే’ వార్త పూర్తిగా అబద్ధమని ఐ–ప్యాక్ సంస్థ శుక్రవారం ట్విట్టర్లో స్పష్టంచేసింది. తాము ఎలాంటి సర్వేలు చేయలేదని తేల్చిచెప్పింది. ఐ–ప్యాక్ సర్వే చేసినట్లు ప్రచురించిన కథనాల్లో వీసమెత్తు కూడా వాస్తవం లేదని ట్వీట్ చేసింది. చదవండి: లోకేష్ పాదయాత్రలో ఏం కనిపించింది?.. వర్కౌట్ అవుతుందా? #Factcheck G.O. (pdf file named as GO MS NO15. ANDHRA PRADESH) mentioning that the age of retirement of Government employees is raised from 62 years to 65 years is under circulation. No such G.O. has been issued by the Finance Department, Government of Andhra Pradesh. pic.twitter.com/8CuFVVHzJp — FactCheck.AP.Gov.in (@FactCheckAPGov) January 28, 2023 -
బీజేపీ వాయిస్ లో నాయిస్..!
-
జీవోపై టీడీపీ నేతల అసత్య ప్రచారం : ఎంపీ మార్గాని భరత్
-
నాయీ బ్రాహ్మణులను కించపరిచే పదాలపై నిషేధం
సాక్షి, అమరావతి: నాయీ బ్రాహ్మణులను, వారి సామాజికవర్గాన్ని కించపరిచే పదాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిషేధం విధించింది. మంగలి, మంగలోడా, బొచ్చుగొరిగేవాడా, మంగలిది, కొండ మంగలి తదితరాలను నాయీబ్రాహ్మణులను ఉద్దేశించి ఉపయోగిస్తే.. వారి మనోభావాలను గాయపరిచినట్టుగా పరిగణిస్తారు. అందుకు బాధ్యులైన వారిపై భారత శిక్షాస్పృతి 1860 కింద చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి జీవో ఎంఎస్ 50 జారీ చేశారు. ఆగస్టు 7న జారీ చేసిన ఈ జీవో బుధవారం వెలుగులోకి వచ్చింది. సర్వత్రా హర్షం కులదూషణను నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై నాయీ బ్రాహ్మణులు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెల్పుతున్నారు. సీఎం చిత్రపటానికి పాలాభిషేకాలు చేస్తూ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. జీవో ఎంఎస్ 50ను విస్తృతంగా ప్రచారం చేసి ఆత్మగౌరవాన్ని కాపాడుకుందామని నాయీ బ్రాహ్మణ సంఘ నాయకులు పిలుపునిచ్చారు. (క్లిక్: ఏదినిజం.. గోబెల్స్‌ను మించిన రామోజీ!) తెలంగాణలోనూ అమలు చేయండి నాయీ బ్రాహ్మణులను కించపరిచే పదాలను ఏపీ ప్రభుత్వం నిషేధించడం పట్ల తెలంగాణ నాయీ బ్రాహ్మణ ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు మద్దికుంట లింగం నాయి హర్షం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నాయీ బ్రాహ్మణుల ఆత్మగౌరవాన్ని కాపాడటానికి తెలంగాణలోనూ ఇటువంటి జీవో తేవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. (క్లిక్: గోరంట్ల మాధవ్ పేరిట వైరల్ అవుతున్న వీడియో ఒరిజినల్ కాదు) -
AP: అర్ధరాత్రి వరకు హోటళ్లు, రెస్టారెంట్లకు అనుమతి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని హోటళ్లు, రెస్టారెంట్ల వ్యాపార వేళలను పొడిగిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. బార్ అండ్ రెస్టారెంట్లు మినహా ఇతర ఆహార దుకాణాలు ఉదయం ఐదు గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు కార్యకలాపాలు కొనసాగించుకోవచ్చని పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి(ఎఫ్ఏసీ) జి.అనంతరాము మార్గదర్శకాలు విడుదల చేశారు. కోవిడ్ నేపథ్యంలో జారీ చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనల గడువు మార్చితో ముగియడంతో కొత్త ఉత్తర్వులు వెంటనే అమలులోకి వస్తాయని స్పష్టం చేశారు. ఏపీ హోటల్ అసోసియేషన్ అభ్యర్థన మేరకు వ్యాపార వేళలను పెంచినట్టు తెలిపారు. కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ వ్యాపారులు, వినియోగదారులు విధిగా మాస్క్ ధరించడంతో పాటు శానిటైజర్ వాడాలని సూచించారు. చదవండి: (ఎలాంటి కాన్పులైనా అమ్మకు 5,000) -
ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్‌పై నిషేధం
సాక్షి, హైదరాబాద్: కొత్తగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో నియమితులయ్యే వైద్యులు ఇక నుంచి ప్రైవేటు ప్రాక్టీసు చేయకుండా నిషేధం విధిస్తూ వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. నేరుగా నియమితులైన క్లినికల్, నాన్ క్లినికల్ విభాగాలకు చెందిన స్పెషలిస్టు, సూపర్ స్పెషలిస్టు వైద్యులు గానీ, బోధనేతర విభాగం నుంచి బదిలీపై వచ్చిన వైద్యనిపుణులు గానీ ఇక నుంచి ప్రైవేటు ప్రాక్టీసు నిషేధం పరిధిలోకి వస్తారని వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రజారోగ్య విభాగంలో ఎంబీబీఎస్ అర్హతతో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులో చేరే వైద్యులకు, తెలం గాణ వైద్య విధాన పరిషత్ విభాగాల పరిధిలో స్పెషలిస్టు సివిల్ అసిస్టెంట్ సర్జన్లుగా నియమితు లయ్యే వారికి కూడా ఈ నిషేధం వర్తిస్తుంది. ప్రాథ మిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ), సామాజిక ఆరోగ్య కేంద్రాలు (సీహెచ్‌సీ), ఏరియా, జిల్లా ఆసుపత్రులు, బోధనాసుపత్రుల వరకు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో నియమితులయ్యే డాక్టర్లంద రికీ ప్రైవేట్ ప్రాక్టీస్ నిషేధం నిబంధన వర్తిస్తుంది. కొత్తగా నియమితులయ్యే డాక్టర్లంతా తమ అర్హత ధ్రువపత్రాలను రాష్ట్ర వైద్య మండలిలో తప్పని సరిగా నమోదు చేసుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా 12,755 వైద్య పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్ధమవగా వాటిలో 10 వేలకుపైగా పోస్టులను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు భర్తీ చేయ నుంది. డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎం పోస్టు లను మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు భర్తీ చేయనుం డగా..ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులను టీఎస్పీఎస్సీ భర్తీ చేయనుంది. డీఎంఈ పరిధిలోని కాలేజీల్లో నియమితులయ్యే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. సర్వీస్ రూల్స్‌లో మార్పులు చేర్పులు చేసింది. ఏడాది సీనియర్ రెసిడెంట్ అనుభవం క్లినికల్ విభాగంలో మొత్తం 18 రకాల స్పెషలిస్ట్ పోస్టులను భర్తీ చేస్తారు. వాటికి అర్హత వివరాలను మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనకాలజీ, పీడియాట్రిక్స్, రెస్పి రేటరీ మెడిసిన్, సైకియాట్రీ, డెర్మటాలజీ, వెనిరీయోలజీ లెప్రసీ, ఆర్థోపెడిక్స్, అనెస్థీషియా, రేడియో డయాగ్నసిస్, రేడియేషన్ ఆంకాలజీ, ఈఎన్టీ, ఆప్తమాలజీ, హాస్పిటల్ అడ్మిన్, ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహాబిలిటేషన్, ఎమర్జెన్సీ మెడిసిన్ క్లినికల్ పోస్టులు భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు ఎండీ/డీఎన్బీ పూర్తి చేసిన వారు అర్హులు. అలాగే ఎండీ పూర్తి చేసిన తర్వాత ఏడాదిపాటు సీనియర్ రెసిడెంట్లుగా పనిచేసిన అనుభవం ఉండాలి. 500కు పైగా పడకలున్న ఆసుపత్రిలో డీఎన్బీ కోర్సు చేస్తే.. ఒక ఏడాది సీనియర్ రెసిడెంట్‌గా పని చేయాలి. ఒకవేళ 500లోపు పడకలున్న ఆసుపత్రిలో డీఎన్బీ కోర్సు చేస్తే.. రెండేళ్లపాటు సీనియర్ రెసిడెంట్‌గా సేవలందించిన వారే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు అర్హులవుతారని స్పష్టం చేశారు. నాన్ క్లినికల్ విభాగంలో... నాన్ క్లినికల్ విభాగంలో అసిస్టెంట్ పోస్టులుగా అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకా లజీ, పాథాలజీ, మైక్రోబయోలజీ, కమ్యూనిటీ మెడిసిన్, ఫోరెన్సిక్ మెడిసిన్ అండ్ టాక్సికాలజీ, ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ ఉన్నాయి. వీటికి ఎండీ/ డీఎన్బీ/ఎంఎస్ చదివి ఉండాలి. అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ, ఫార్మకాలజీలకు సబ్జెక్టుల్లో ఎండీ తత్సమాన కోర్సు చేసినవారు లేకుంటే ఆ కోర్సుల్లో ఎంఎస్సీ (పీహెచ్డీ) చేసిన వారిని 15% వరకు తీసుకోవచ్చు. ఈ పోస్టుల్లో చేరేవారు ఏడాదిపాటు ట్యూటర్‌గా పనిచేసిన అను భవం ఉండాలి. సూపర్ స్పెషాలిటీలో.. సూపర్ స్పెషాలిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ విభాగం లో కార్డియాలజీ, ఎండోక్రైనాలజీ, మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, మెడికల్ ఆంకాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, థోరాసిక్ సర్జరీ/కార్డియాక్ సర్జరీ (సీటీ సర్జరీ), యూరాలజీ, న్యూరో సర్జరీ, పీడియాట్రిక్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ పోస్టులున్నాయి. వీటికి ఆయా కోర్సులను బట్టి డీఎం/డీఎన్బీ లేదా ఎంసీ హెచ్/డీఎన్బీ చదివి ఉండాలి. కాగా, విదేశాల్లో 18 రకాల పీజీ కోర్సులు పూర్తి చేసిన వారికి అవకాశం కల్పిస్తారా లేదా అన్న విషయంపై ఉత్తర్వుల్లో స్పష్టత ఇవ్వలేదు. వైద్యుల వ్యతిరేకత.. ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయ కుండా నిషేధం విధించడంపై పలువురు వైద్యులు వ్యతిరే కత వ్యక్తం చేస్తున్నారు. తమకు ప్రభుత్వం తక్కువ వేతనాలు ఇస్తూ, ఇలా నిషేధం విధించడం తగదన్నారు. కనీ సం ప్రోత్సాహకాలు ఇవ్వడమో లేదా నిమ్స్ మాదిరిగా సాయంత్రం వేళల్లో పనిచేస్తే ఆదా యం వచ్చే మార్గమైనా వెతికే పనిచేస్తే బాగుంటుందని అంటున్నారు. -
ఏపీలో ఉద్యోగుల సాధారణ బదిలీలకు గ్రీన్‌సిగ్నల్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగుల సాధారణ బదిలీలకు గ్రీన్‌సిగ్నల్ లభించింది. ఆమేరకు విధించిన బ్యాన్‌ను ఎత్తేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 8 నుంచి 17వరకు బదిలీలకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఐదేళ్లకు పైబడిన ఉద్యోగులకు బదిలీ అవకాశం కల్పిస్తున్నారు. వ్యక్తిగత వినతులు, పరిపాలన సౌలభ్యం ఆధారంగా బదిలీలను చేపడుతున్నారు. చదవండి: (CM YS Jagan: ట్రాక్టర్ నడిపిన సీఎం జగన్) -
పుప్పాలగూడ భూముల వ్యవహారం.. హైకోర్టులో తెలంగాణ సర్కార్‌కు చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా పుప్పాలగూడలోని సర్వే నంబరు 335, 336, 338, 340, 341, 342లో 80.25 ఎకరాల కాందిశీకులకు సంబంధించిన భూముల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి చుక్కెదురైంది. ఈ భూమిపై కాందిశీకులకు హక్కులు ఉన్నాయంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీళ్లను హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం కొట్టివేసింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొనే సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చారని, ఆ తీర్పులో జోక్యం చేసుకోమంటూ ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది. కాందిశీకులకు 1956లో కేటాయించిన భూమిని మిగులు భూమిగా పేర్కొంటూ ఏపీఐఐసీకి కేటాయిస్తూ 2008లో రెవెన్యూ శాఖ జీవో జారీచేసింది. ఈ జీవోను సవాల్‌చేస్తూ పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. చదవండి👉🏻ఇంగ్లిష్–1 బండిల్లో కెమిస్ట్రీ ప్రశ్నపత్రాలు! ‘వాసుదేవ్‌కు 1956లో ప్రభుత్వం ఈ భూమిని కేటాయించింది. తర్వాత వాసుదేవ్ పలువురికి ఈ భూమిని విక్రయించారు. ఇందులో 11.05 ఎకరాలను 1968లో ఇద్దరు వ్య క్తులు అతని నుంచి కొనుగోలు చేశారు. అయితే ఈ భూమి యూఎల్సీ పరిధిలో ఉందంటూ 2006లో ప్రభుత్వం ఆ మేరకు ప్రొసీడింగ్స్ ఇచ్చింది. వాసుదేవ్‌కు 2006లో నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించగా ఆ చిరునామాలో లేరని రెవె న్యూ అధికారులు పేర్కొన్నారు. 1998లోనే వాసుదేవ్ చనిపోయారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చట్టబద్దంగా కేటాయించిన భూమిని నిబంధనలకు విరుద్ధంగా మిగులు భూమిగా చూపించడం, పట్టాదారుకు నోటీసులు ఇవ్వకుండా ఆ కేటాయింపులను రద్దు చేయడం చట్టవిరుద్ధం. ఈ మేరకు ఏపీఐఐసీకి కేటాయిస్తూ ఇచ్చిన జీవోను చట్టవిరుద్ధంగా ప్రకటిస్తున్నాం. కేటాయింపులు రద్దు చేస్తున్నాం’అని సింగిల్ జడ్జి 2017లో తీర్పునిచ్చారు. చదవండి👉 300 మందికి పైగా ఔట్సోర్సింగ్ జేపీఎస్‌లకు ఉద్వాసన -
111 జీవో ఎత్తేస్తే నగరానికి ముప్పు
సాక్షి,బంజారాహిల్స్: హైదరాబాద్ నగరానికి వరదల నివారణ కోసం నిర్మించిన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జంట జలాశయాలను కాపాడుకోకపోతే భవిష్యత్తులో భాగ్యనగరానికి ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరించారు. జలాశయాల పరిరక్షణకు తెచ్చిన 111 జీవోను ఎత్తేయడం వల్ల రాబోయే రోజుల్లో నగరానికి ముప్పు పొంచి ఉన్నట్లేనని అభిప్రాయపడ్డారు. 111 జీవో ఎత్తివేతపై శుక్రవారం బంజారాహిల్స్‌లోని లామకాన్‌లో త్రిసభ్య పీపుల్స్ కమిటీ సమావేశం జరిగింది. ఐఐసీటీ హైదరాబాద్ రిటైర్డ్ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ బాబూరావు కలపాల, సుప్రీంకోర్టు కమిటీ సభ్యుడు సాగర్ దార, ఎన్జీఆర్ఐ రిటైర్డ్ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ బి. రామలింగేశ్వర్రావు, వాటర్ రిసోర్సెస్ కౌన్సిల్ స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ లుగ్నా సార్వత్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ బాబూరావు మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మేలు చేకూర్చేందుకే 111 జీవో ఎత్తేశారనే విమర్శలు వినిపిస్తున్నాయన్నారు. ఈ జీవో ఎత్తివేత వల్ల జంట జలాశయాలు హుస్సేన్‌సాగర్‌లాగా మారబోతున్నాయని చెప్పారు. మల్లన్న సాగర్ నుంచి పంప్‌ల ద్వారా ఉస్మాన్‌సాగర్, హిమాయత్సాగర్లకు నీళ్లు నింపుతామని చెబుతున్నారని.... అయితే ఈ నీటిని తీసుకొచ్చేందుకు ఎంత విద్యుత్ అవసరమవుతుందో తెలుసా అని ప్రశ్నించారు. 90 శాతం ఓపెన్ ఏరియాను కాపాడతామని ప్రభుత్వం చెబుతున్నదని... తీరా నిర్మాణాలు జరిగాక బీఆర్ఎస్ పేరుతో వాటిని రెగ్యులరైజ్ చేయడానికి ఏ మాత్రం వెనుకాడబోదని మరో హైదరాబాద్‌గా 111 జీవో ప్రాంతమంతా మారబోతున్నదని హెచ్చరించారు. వాతా వరణ మార్పుల వల్ల ఉష్ణోగ్రత పెరుగుతుందని.. రాబోయే రోజుల్లో హైదరాబాద్‌కు ఈ ప్రమాదం పొంచి ఉందని సాగర్ ధార పేర్కొన్నారు. -
పోలీస్ స్టేషన్ల పరిధి మార్పు.. ప్రభుత్వం ఉత్తర్వులు
సాక్షి, ఒంగోలు: జిల్లాలో పలు గ్రామాల పోలీసుస్టేషన్ల పరిధిని మార్పు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. జిల్లాల విభజన సందర్భంగా జీవో ఎంఎస్ నెంబర్ 93 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు అమలు చేసే క్రమంలో ప్రస్తుతం కొన్ని పోలీసుస్టేషన్ల పరిధిలో ఉన్న ఇతర రెవెన్యూ మండలాల గ్రామాలను ఆయా రెవెన్యూ మండలాల పరిధిలోని పోలీసుస్టేషన్‌కు కింద మార్పు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ మేరకు మార్పులకు గురైన గ్రామాలు ఏ పోలీసుస్టేషన్ పరిధిలో చేరాయనే దానిపై సంబంధిత గ్రామాల్లో పోలీసు అధికారులు గ్రామసభలు నిర్వహించి అవగాహన కల్పించారు. ఈ గ్రామాలు మార్చి 1వ తేదీ నుంచి సంబంధిత మండలానికి సంబంధించిన పోలీసుస్టేషన్ల పరిధిలోకి రానున్నాయి. మారిన గ్రామాలు ఇవే.. రాచర్ల రెవెన్యూ మండలానికి చెందిన యడవల్లి, రంగారెడ్డిపల్లి, అంకిరెడ్డిపల్లి, చెర్లోపల్లి, వద్దులవాగుపల్లి, మేడంవారిపల్లి, గుడిమెట్ల, కొత్తపల్లి, రామాపురం, అచ్చంపల్లి గ్రామాలు రాచర్ల పోలీసుస్టేషన్ పరిధిలో చేరాయి. గిద్దలూరు పోలీసుస్టేషన్ పరిధిలో ఉన్న కొమరోలు రెవెన్యూ మండలానికి చెందిన దద్దవాడ , నారాయణపల్లి, గుండ్రెడ్డిపల్లి, అలసందలపల్లి, గోవిందపల్లి, అక్కపల్లి, వెంకటంపల్లి, కంకరవారిపల్లి, పొట్టుపల్లి, తాటిచర్ల, హసనాపురం, నాగిరెడ్డిపల్లి, ముత్తరాసిపల్లి కొమరోలు పోలీసుస్టేషన్ పరిధిలోకి మారాయి. వేటపాలెం పీయస్ పరిధిలోని ఎన్జీపాడు రెవెన్యూ మండలానికి చెందిన మట్టిగుంట (ఎన్జీపాడు పరిధిలోకి), ఇంకొల్లు పీయస్ పరిధిలో ఉన్న ఎన్జీపాడు రెవెన్యూ మండలానికి చెందిన తిమ్మసముద్రం, మద్దిరాల, ముప్పాల గ్రామాలు ఎన్జీపాడు పోలీసుస్టేషన్ పరిధిలోకి చేరాయి. చదవండి: (తిరుమల: టీటీడీ కీలక నిర్ణయం) కందుకూరు టౌన్ పీయస్ పరిధిలో ఉన్న మోపాడు, కంచరగుంట గ్రామాలు కందుకూరు రూరల్ పోలీసుస్టేషన్ పరిధిలోకి చేరాయి. కందుకూరు టౌన్ పీయస్ పరిధిలో ఉన్న వలేటివారిపాలెం రెవెన్యూ మండలానికి చెందిన కాకుటూరు, బడేవారిపాలెం, నేకునాంపురం (అత్తింటివారిపాలెం), నూకవరం, పోకూరు, సింగమనేనిపల్లి, కొండారెడ్డిపల్లి, నలదలపూర్ గ్రామాలు వలేటివారిపాలెం పోలీసుస్టేషన్ పరిధిలోకి మారాయి. గుడ్లూరు పీయస్ పరిధిలో ఉన్న లింగసముద్రం రెవెన్యూ మండలానికి చెందిన చిన్నపవని, పెద్ద పవని, ముత్యాలపాడు, ముత్తంవారిపల్లి, అంగిరేకులపాడు, మేదరమెట్లవారిపాలెం, అన్నెబోయినపల్లి గ్రామాలు లింగసముద్రం పీఎస్ పరిధిలోకి వచ్చాయి. -
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల కొత్త పీఆర్సీ అమలు జీవో విడుదల