అమరావతి, సాక్షి: ఏపీలో కొత్త ఇసుక విధానం విషయంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జీవో నెంబర్ 40 పేరిట.. 2019, 2021 ఇసుక విధానాలు రద్దు చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే 2024 ఇసుక విధానం రూపకల్పన జరగాల్సిన ఉందని చెబుతూ.. అప్పటిదాకా కలెక్టర్లకు ఇచ్చిన ఈ అంతర్గత మార్గదర్శకాలు అమల్లో ఉంటాయని పేర్కొంది.
ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ఇసుక విధానం అమలు చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా ఎస్పీ, జేసీ, పలువురు శాఖల అధికారులు కమిటీలుగా నియమించింది. అయితే భవన నిర్మాణాలు మినహా మరేయితర అవసరాలకు ఇసుకను వినియోగించకూడదని స్పష్టం చేసింది.
ప్రస్తుతం వేర్వేరు స్టాక్ పాయింట్ల వద్ద 49 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వలున్నాయి. స్టాక్ పాయింట్ల నుంచి ఉచిత ఇసుక సరఫరాపై అధికారికంగా ఇంకా ఉత్తర్వులు విడుదల కాలేదు. అయితే వీటిని కమిటీలు పర్యవేక్షించాలని ప్రభుత్వం తాజా జీవోలో తెలిపింది. ఇక కొత్త ఇసుక విధానంపై త్వరలో ఉత్తర్వులు జారీ కావొచ్చని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment