Sand policy
-
ఇసుక పాలసీ బాలేదన్న జ్యోతుల.. మైక్ కట్ చేసిన రఘురామ!
సాక్షి, గుంటూరు: ఇసుక పాలసీపై సొంత పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇసుక పాలసీ అంత మంచిగా లేదని ఇసుక పాలసీపై ప్రభుత్వం పునరాలోచించాలని జగ్గంపేట టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా మాట్లాడిన జ్యోతుల.. ఇసుక విధానాన్ని వ్యతిరేకించారు. సామాన్యులకు అందే పరిస్థితి లేదని అసెంబ్లీలో ప్రస్తావించారు. ఇసుక పక్క రాష్ట్రాలకు పోతుందని మాట్లాడుతుండగానే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మైక్ కట్ చేసేశారు.తాను అందరికంటే సీనియర్‌నని.. మాట్లాడేందుకు కొంత సమయం ఇవ్వాలంటూ స్పీకర్‌ని జ్యోతుల నెహ్రూ రిక్వెస్ట్ చేశారు. అయినా కూడా ఆయన విజ్ఞప్తిని పట్టించుకోకుండా డిప్యూటీ స్పీకర్ మైక్ కట్ చేశారు. మైక్ లేకపోయినా తన ప్రసంగాన్ని జ్యోతుల కొనసాగించారు. రెండు నిమిషాల సమయం ఇవ్వాలంటూ మిగిలిన సభ్యులు చెప్పగా, జ్యోతుల నెహ్రూ ప్రసంగ సమయంలో రఘురామకృష్ణం రాజు అసహనం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు విజయసాయిరెడ్డి సవాల్కాగా, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం భవన నిర్మాణ రంగానికి శాపంగా మారింది. నిర్మాణ రంగంలో ప్రధానమైన ముడి సరకు ఇసుక. కూటమి ప్రభుత్వ విధానం పుణ్యమా అని.. పేరుకు ఉచితమే అయినా.. ఇసుక కోసం వస్తున్న వారిని అధికారం అండతో అక్రమార్కులు ఎక్కడికక్కడ నిలువు దోపిడీ చేస్తున్నారు. ముక్కుపిండి మరీ అధిక ధరలు వసూలు చేస్తున్నారు.ఒక యూనిట్ ఇసుకను రూ.5వేల నుంచి రూ.10 వేల వరకూ విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారంటే ఇసుక దోపిడీ ఏ రీతిలో జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. ఆన్లైన్లో కంటే ఆఫ్‌లైన్‌లోనే ఇసుక విక్ర యాలు అధికంగా జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం, అధికారులు చెబుతున్న మాటలకు, ఇసుక స్టాక్ పాయింట్ల వద్ద పరిస్థితికి ఏమాత్రం పొంతన ఉండటం లేదు. పలు ర్యాంపుల్లో రాత్రి వేళ యథేచ్ఛగా ఇసుక తవ్వుతూ వందలాది లారీల్లో ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. -
టీడీపీ ఉచిత ఇసుక అక్రమాలపై పెట్ల ఉమాశంకర్ గణేష్ ర్యాలీ
-
ఇసుక, మద్యంలో కూటమి పెద్దల అవినీతి: కాకాణి
నెల్లూరు, సాక్షి: ఇసుక, మద్యం విషయంలో కూటమి ప్రభుత్వ పెద్దలు అవినీతికి పాల్పడ్డారని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు. ఆయన నెల్లూరులో శనివారం మీడియాతో మాట్లాడారు. ‘‘సూపర్ సిక్స్‌లో ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. ఇప్పుడు ఇసుకపై కొత్త నాటాకానికి తెరతీశారు. చంద్రబాబు చెప్పేదానికి, చేసేదానికి పొంతనే ఉండటం లేదు. చంద్రంబాబా దొంగ ఎమ్మెల్యేలు అన్నట్లు ఉంది. చంద్రబాబు పార్టీ నేతలకు ఒకటి చెబుతారు.. క్షేత్రస్థాయిలో మరోటి జరుగుతోంది. చంద్రబాబు మాటలకు అర్దాలే వేరులే అన్నట్లు ఉంది. ఇసుక, మద్యం జోలికి వెళ్ళవద్దని చెబుతారు. కానీ టీడీపీ నేతలు వాటినే ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. ఉచిత ఇసుక ఇస్తామని చెప్పారు. ఇప్పుడు సీనరేజ్ రద్దు చేస్తామని చెబుతున్నారు. ఇసుక ఉచితం అన్నప్పుడు సీనరేజ్ ఎక్కడ ఉంటుంది?. రాష్ట్రంలో ఇసుక, మద్యంకు సంబంధించి ఎన్నో దౌర్జన్యాలు జరిగాయి. ఎవరిమీదా చర్యలు తీసుకోలేదు, కేసులూ పెట్టలేదు. ... లాటరీలో మద్యం షాపులు పొందిన వారిని కిడ్నాప్ చేశారు. ఇసుక టెండర్లు పొందిన వారిని మంత్రులు భయపెడుతున్నారు. తమ అనుమతి లేకుండా ఎలా టెండర్లు వేశారు అంటూ నిలదీస్తున్నారు. ఇసుక, మద్యంలో ఎన్నో అక్రమాల జరుగుతున్నాయని టీడీపీ కరపత్రికే రాసింది. సూపర్ సిక్స్‌లో ప్రకటించిన వాటిలో ఏమీ అమలు కాలేదు. ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపిస్తున్న మీడియాపై కేసులు పెడుతున్నారు. నెల్లూరు జిల్లాలో నాలుగు ఇసుక రీచ్‌ల కోసం టెండర్లు పిలిచారు. లాటరీ ద్వారా ఎంపిక చెయ్యాలని మంత్రి నారాయణ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. .. మా రీచ్‌లో మాకు తెలియకుండా టెండర్లు ఎలా వేశారంటూ ఒక మంత్రి, ఎమ్మెల్యే లాటరీలలో పొందిన వారిని భయపెడుతున్నారు. ఒక మంత్రి తీసుకున్న నిర్ణయాన్ని పట్టించుకోకుండా కలెక్టర్ టెండర్లు రద్దు చేశారు. మంత్రి అంటే లెక్క లేకుండా చేశారు. దీనిపై కలెక్టర్ సమాధానం చెప్పాలి. మళ్లీ టెండర్లు పిలుస్తామని చెప్తున్నారు. చంద్రబాబు మాటలు పట్టించుకోకుండా ఇక్కడ నేతలు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈనెల 25న కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహిస్తాం’’ అని అన్నారు.చదవండి: చంద్రబాబు నిర్ణయం.. టీడీపీ నేతలకే తిరుమల వెంకన్న సేవలు! -
ఇసుక పాలసీపై దిగొచ్చిన చంద్రబాబు ప్రభుత్వం
సాక్షి,అమరావతి : ఇసుక పాలసీ వైఫల్యంతో సీఎం చంద్రబాబు ప్రభుత్వం దిగొచ్చింది. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో పాటించిన విధానాలనే అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇసుక దోపిడీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో జీవోని సవరించిన ప్రభుత్వం..గత ప్రభుత్వం హయాంలో స్థానిక అవసరాలకు ఉచితంగా ఇసుక తీసుకెళ్లే విధానానికే మొగ్గుచూపింది, వెంటనే ఆ నిర్ణయాన్ని అమలు చేయాలని ప్రభుత్వం సంబంధిత శాఖకు ఆదేశాలు జారీ చేసింది.ఈ సందర్భంగా ఇసుక రీచ్‌ల నుంచి ఇసుకను ట్రాక్టర్లల్లో ఉచితంగా తీసుకెళ్లేందుకు అనుమతి ఇచ్చినట్లు గనుల శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఈ మేరకు సవరణ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. -
‘ఇసుక దోపిడీ.. చంద్రబాబు మాస్టర్ స్కెచ్’
తాడేపల్లి, సాక్షి: ఊహలకు అందని మాస్టర్ స్కెచ్‌తో ఇసుకను దోపిడీ చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు. చంద్రబాబు తన అనుభవాన్నంతా రంగరించి దోపిడీకి ప్లాన్ వేశారని అన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఇసుక పంపిణీలో లోపాలు జరిగినట్టు ఎల్లో మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని దుయ్యబట్టారు. ఇప్పుడు ఏం జరుగుతుందో ప్రజలు గుర్తించాలని అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు.‘‘2014-19 మధ్యలో కూడా ఇదే కూటమి ప్రభుత్వం ఇసుక విధానం కోసం 19 జీవోలు ఇచ్చారు. ఎమ్మెల్యేలు, నాయకులకు ఎలా దోచిపెట్టవచ్చో చూపిస్తున్నారు. రాజకీయాల్లో ఎన్నికల హామీలకు విలువ లేదని చంద్రబాబు మళ్లీ నిరూపించారు. తాను మారినట్టు, ప్రజల కోసమే పని చేస్తుననట్టు నటిస్తున్నారు. అధికారంలోకి రాగానే తన నిజ స్వభావాన్ని చూపిస్తున్నారు. ఈరోజు 18 టన్నుల లారీ విలువ రూ.33 వేలకుపైగా ఉంది. పేద, మధ్య తరగతి ప్రజలు బతికేదెలా?. మా హయాంలో రూ. 3,750 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. అందరూ దసరా పండుగ హడావుడిలో ఉంటే టీడీపీ నేతలు మాత్రం టెండర్ల పండుగలో ఉన్నారు. రెండు రోజుల్లోనే టెండర్లు పిలవటం ఏంటి?. ఇన్ని అక్రమాలు జరుగుతుంటే ఎల్లోమీడియాలో వార్తలు ఎందుకు రావటం లేదు?.మద్యం టెండర్లలో టీడీపీ నేతలందరూ పాల్గొనలేకపోయారని వారి కోసమే రెండు రోజులు గడువు పెంచారు. మద్యాన్ని దూరం చేయాలని జగన్ కోరుకుంటే.. చంద్రబాబు మాత్రం ఏరులై పారించాలని చూస్తున్నారు. మరోవైపు గుట్టుచప్పుడు కాకుండా ఇసుకకు టెండర్ పెట్టేశారు. ప్రభుత్వ ఆదాయానికి పూర్తిగా గండికొట్టేలా వ్యవహరిస్తున్నారు.వర్షాకాలంలో ఉపయోగపడుతుందని 80 లక్షల టన్నుల ఇసుకను రెడీ చేసి పెడితే.. టీడీపీ నేతలు 40 లక్షల టన్నుల ఇసుకను అక్రమంగా అమ్మేసుకున్నారు.ఇప్పుడు భారీస్థాయిలో రేట్లు పెంచటానికి కారణం ఏంటో కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. సామాన్యలకు టెండర్లు వేసే అవకాశం లేకుండా చేశారు. కలెక్టరేట్ల దగ్గర టీడీపీ గూండాలు, రౌడీలు బెదిరించి తరిమేశారు. ఇదేనా కూటమి ప్రభుత్వపు పాలనా విధానం?. ఇసుకను కచ్చితంగా ఫ్రీగా ప్రజలకు అందించాలని డిమాండ్ చేస్తున్నాం. కూటమి ప్రభుత్వ హామీని అమలు చేయాల్సిందే’’ అని అన్నారు.చదవండి: టీడీపీ, జనసేనలో వర్గ విభేదాలు.. మంత్రికి నిరసన సెగ -
మళ్లీ చంద్రబాబు మోసం.. ఉచిత ఇసుక ఒట్టిదే!
గుంటూరు, సాక్షి: ఏపీలో ఉచిత ఇసుక పంపిణీ అంతా ఉత్తిదేనని తేలిపోయిందని వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు అన్నారు. ఆయన మంగళవారం ఏపీ సర్కార్ చేస్తున్న మోసంపై మాట్లాడారు. ‘‘ చంద్రబాబు మరోసారి ప్రజలను మోసం చేశారు. స్టాక్ యార్డుల దగ్గర ప్రభుత్వమే రేట్లు వివరిస్తూ ఫ్లెక్సీలు పెట్టింది. దీన్ని ఉచిత ఇసుక అంటారా?. రీచ్‌ల దగ్గర వసూలు చేసే డబ్బంతా ఎవరి దగ్గర ఉంచుతోంది?. గతంలో రూ.750 కోట్లు ప్రభుత్వానికి వచ్చింది. ఇప్పుడు ఆ డబ్బంతా టీడీపీ నేతల జేబుల్లోకి వెళ్తోంది?. 2014-19 మధ్య చేసిన అక్రమాలే మళ్ళీ ఇసుక పేరుతో చేస్తున్నారు. .. కూటమి ప్రభుత్వం ఇప్పుడు విక్రయించిన రేట్లకే వైఎస్సార్సీపీ ప్రభుత్వం కూడా విక్రయించింది. దాని ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. మరి ఇప్పుడు చంద్రబాబు ఉచితం అని చేస్తున్నదేమిటి?. చంద్రబాబు ఎన్నికల హామీలు, అధికారంలోకి వచ్చాక చేసే పనులకూ ఎప్పుడూ పొంతన ఉండదు. ఇచ్చిన హామీలు తుంగలో తొక్కటం అనేది చంద్రబాబుకు సహజ నైజం. .. ప్రజలను నిలువునా ముంచటంలో చంద్రబాబుకు తిరుగులేదు. వర్షాకాలంలో ఇసుక తెచ్చుకోలేమని వైఎస్ జగన్ ప్రభుత్వం గతంలో ముందుగానే నిల్వ చేసింది. ఆ నిల్వలన్నీ ఇప్పుడు ఏమయ్యాయి?. 80 లక్షల టన్నుల ఇసుక స్టాక్ యార్డుల్లో ఉంది. ఇప్పుడు 35 లక్షల టన్నుల ఇసుకే ఉన్నట్టు రికార్డుల్లో చూపించారు. అంటే మిగతా ఇసుక ఎవరి జేబుల్లోకి డబ్బుగా మారింది?. దీనిపై చట్ట ప్రకారం విచారణ జరపాలి...2014 -16 మధ్య ఇసుక మీద ఏకంగా నాలుగు జీవోలు ఇచ్చింది చంద్రబాబు ప్రభుత్వం. ఇసుక విధానం పేరుతో ప్రకృతి వనరుల దోపిడీ చేస్తున్నారని హైకోర్టు కూడా హెచ్చరించింది. గ్రీన్ ట్రిబ్యునల్ సైతం తప్పు పట్టింది. ఇది నిజమో కాదో చంద్రబాబు చెప్పాలి. జనానికి అవసరమైన ఇసుకని ఉచితం చేయాలి. ఎక్కడా డబ్బు వసూలు చేయవద్దని కోరుతున్నాం’ అని డిమాండ్ చేశారు. -
ఏపీలో ఇసుక విధానం కోసం మార్గదర్శకాలు
అమరావతి, సాక్షి: ఏపీలో కొత్త ఇసుక విధానం విషయంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జీవో నెంబర్ 40 పేరిట.. 2019, 2021 ఇసుక విధానాలు రద్దు చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే 2024 ఇసుక విధానం రూపకల్పన జరగాల్సిన ఉందని చెబుతూ.. అప్పటిదాకా కలెక్టర్లకు ఇచ్చిన ఈ అంతర్గత మార్గదర్శకాలు అమల్లో ఉంటాయని పేర్కొంది. ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ఇసుక విధానం అమలు చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా ఎస్పీ, జేసీ, పలువురు శాఖల అధికారులు కమిటీలుగా నియమించింది. అయితే భవన నిర్మాణాలు మినహా మరేయితర అవసరాలకు ఇసుకను వినియోగించకూడదని స్పష్టం చేసింది. ప్రస్తుతం వేర్వేరు స్టాక్ పాయింట్ల వద్ద 49 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వలున్నాయి. స్టాక్ పాయింట్ల నుంచి ఉచిత ఇసుక సరఫరాపై అధికారికంగా ఇంకా ఉత్తర్వులు విడుదల కాలేదు. అయితే వీటిని కమిటీలు పర్యవేక్షించాలని ప్రభుత్వం తాజా జీవోలో తెలిపింది. ఇక కొత్త ఇసుక విధానంపై త్వరలో ఉత్తర్వులు జారీ కావొచ్చని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. -
త్వరలో కొత్త ఇసుక విధానం
సాక్షి, అమరావతి: నూతన ఇసుక విధానాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఇందుకోసం సమగ్ర సమాచారం, ఆలోచనలతో రావాలని సూచించారు. అక్రమాలు, అవినీతికి అవకాశం లేకుండా, ప్రజలకు ఇబ్బందులు కలిగించని కొత్త ఇసుక విధానాన్ని తీసుకువస్తామన్నారు. నూతన ఇసుక విధానం, దెబ్బతిన్న రోడ్లు, నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై ఆయన మంగళవారం సచివాలయంలో ఆయా శాఖల మంత్రులు, అధికారులతో విడివిడిగా సమీక్షలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నిర్మాణ రంగానికి అత్యవసరమైన ఇసుకను అందుబాటులోకి తేవడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో నిర్మాణాలకు ఇసుక కొరత లేకుండా చూడాలన్నారు. ప్రస్తుతం స్టాక్ పాయింట్లలో అందుబాటులో ఉన్న ఇసుకను సరఫరా చేసేందుకు ఉన్న వెసులుబాటును చూడాలని సూచించారు. గత ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలు అనేక సమస్యల్లో ఉన్నారని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. దీనికి అవసరమైన రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని ఆదేశించారు. సమస్యల తీవ్రతను బట్టి తక్షణం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? దీర్ఘకాలికంగా ఎటువంటి ప్రణాళికలు అమలు చేయాలి అనే వాటిపై నిర్దిష్టమైన విధానంలో ముందుకెళ్లాలని సూచించారు. దెబ్బతిన్న రోడ్లను బాగు చేయాలి.. రోడ్లపై నిర్వహించిన సమీక్షలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ దెబ్బతిన్న రోడ్లను పూర్తి స్థాయిలో బాగు చేయడంతోపాటు రహదారులపై గుంతలు పూడ్చడం, మరమ్మతులపై దృష్టిపెట్టాలన్నారు. ఎన్ని కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయో నివేదికలు సిద్ధం చేయాలన్నారు. రోడ్ల మరమ్మతులకు సంబంధించి సాంకేతికంగా అందుబాటులోకి వచి్చన కొత్త విధానాలపై అధ్యయనం చేయాలని సూచించారు. ప్రస్తుతం వర్షాలు పడుతున్నా వెంటనే మరమ్మతులు చేయాల్సిన రోడ్లపై ప్రణాళికను రూపొందించాలని కోరారు. నిత్యావసర వస్తువుల ధరల భారం తగ్గించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బియ్యం, కందిపప్పు, టమాటా, ఉల్లి ధరల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై సూచనలు చేశారు. ధరల నియంత్రణకు ఏ చర్యలు తీసుకోవాలనేదానిపై ప్రణాళికతో రావాలని ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 122 రైతు బజార్లు ఉన్నాయని అధికారులు చెప్పగా.. వాటి నిర్వహణ సరిగా లేక.. వాటి ఏర్పాటు వెనుక ఉన్న ఉద్దేశం నెరవేరడం లేదన్నారు. ఈ సమీక్షల్లో మంత్రులు కొల్లు రవీంద్ర, బీసీ జనార్దన్‌రెడ్డి, అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
Fact Check: సిగ్గు ‘ఈడీ’సి రాతలా?
గురివింద చెబుతున్నట్లు గత చంద్రబాబు పాలనలో ఇసుకను ఉచితంగా ఇచ్చి ఉంటే.. చింతమనేని ప్రభాకర్ మహిళా తహశీల్దార్‌ను ఎందుకు జుట్టు పట్టుకుని ఈడ్చినట్లు? అర్ధ రాత్రిళ్లు సాక్షాత్తు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటి వెనుక ప్రొక్లయినర్లతో ఎందుకు ఇసుక తవ్వకాలు సాగించినట్లు? వీటిని బట్టి బాబు అండ్ గ్యాంగ్ అందినకాడికి దోచుకున్నారని ఈ రాజగురివిందకు తెలీదా? ఈ లెక్కన ఈ ప్రభుత్వంలో ఇసుక విక్రయం వల్ల ఏటా రూ.765 కోట్లు ఆదాయం లభిస్తోంది. ఐదేళ్లలో సుమారు రూ.4 వేల కోట్ల ఆదాయం వస్తోంది. మరోవైపు అక్రమ ఇసుక రవాణాపై ఉక్కు పాదం మోపుతోంది. స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో ద్వారా నిఘా పెట్టింది. ఏకంగా 6.36 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను సీజ్ చేసింది. ఇదంతా కళ్లెదుటే అందరికీ కనిపిస్తున్నా.. రామోజీకి, పచ్చ మీడియాకు మాత్రం కనిపించదు. తమ చంద్రబాబును అధికారంలోకి తేవడానికి ఎంతకైనా దిగజారుతామని, అవసరమైతే బట్టలిప్పుకుని దుష్ప్రచారం చేస్తామని అనునిత్యం చాటుకోవడం వీరికి పరిపాటిగా మారింది. ఎవరు నవ్విపోతే మాకేంటని నిస్సిగ్గుగా రోజూ రోత రాతలు రాయడం రామోజీకే చెల్లింది. సాక్షి, అమరావతి: మోకాలికి బోడిగుండుకి ముడి పెట్టడం ఎంత తిక్క తనమో ఏపీలో జరుగుతున్న ఇసుక తవ్వకాలను తమిళనాడుతో పోల్చి అక్కసు వెళ్లగక్కడం అంతకంటే ఎక్కువ పిచ్చితనం. ఈ పిచ్చి రాతలనే నమ్ముకున్న రామోజీ అదే పనిగా ఇసుకపై తనకున్న పైత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఎక్కడో తమిళనాడులో జరిగిన ఇసుక తవ్వకాలపై ఈడీ దృష్టి సారిస్తే, ఇక్కడ కూడా అలాగే జరగాలని కోరుకోవడం సీఎం వైఎస్ జగన్‌పై ఉన్న కక్ష కాకపోతే మరేమిటి?. ఇసుక తవ్వకాలు సక్రమంగా జరుగుతున్నా అక్కసుతో నిత్యం తాను బురద జల్లడమే కాకుండా ఏకంగా ఈడీ జోక్యం చేసుకోవాలని బరి తెగించి అడ్డగోలు రాతలు రాయడం గురువింద రామోజీకి చెల్లింది. నిజానికి ఈడీ దర్యాప్తు జరపాల్సింది డిపాజిటర్లను నిట్టనిలువునా ముంచిన రామోజీ సొంత సంస్థ మార్గదర్శిపైనే. మార్గదర్శికి అక్రమంగా డిపాజిట్లు సేకరించారని సాక్షాత్తూ కోర్టులే స్పష్టం చేశాయి. వేల కోట్లు దోచేసి నంగనాచి రాతలు, దొంగ ఏడుపులు, నక్క తెలివి తేటలతో తప్పించుకున్నారు. రామోజీ ఫిలిం సిటీ భూకుంభకోణాలపై ఈడీగానీ, సీబీఐగానీ విచారణ చేస్తే ప్రపంచం మొత్తం ఉలిక్కిపడేలా నిజాలు బహిర్గతమవుతాయి. తన వెనుక ఉన్న ఈ అక్రమాలను దాచిపెట్టుకుని ప్రభుత్వంపై అదేపనిగా బురద చల్లడం రామోజీకి రోజువారీ ప్రక్రియగా మారిపోయింది. విష ప్రచారం ద్వారా చంద్రబాబుకు మేలు చేయాలనే ఆరాటం తప్ప నిజంగా ఇసుక తవ్వకాల వల్ల ప్రజలకు ఎక్కడ ఇబ్బంది వచ్చిందో తెలిపే ఒక్క లైను ఈనాడు రాయలేకపోతోంది. రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక తవ్వకాలు, ఇక్కడి ఇసుక విధానం, తమిళనాడులో ఇసుక విధానం, తవ్వకాలకు ఎలాంటి సంబంధం లేకపోయినా రెండు రాష్ట్రాలను పోలుస్తూ ఈనాడు ప్రచురించిన కథనంలో అక్కసు మాత్రమే కనిపిస్తోంది. బాబు హయాంలో జేబుల్లోకి రూ.వేల కోట్లు వాస్తవానికి గత ప్రభుత్వంలో ఉచిత ఇసుక విధానం పేరుతో కోట్లాది రూపాయల ఆదాయం ప్రభుత్వానికి రాకుండా ఇసుక మాఫియా జేబుల్లోకి వెళ్ళింది. ఆ దోపిడీని నివారించేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యంత పారదర్శకంగా నూతన ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. దీనివల్ల ప్రతి సంవత్సరం రూ.765 కోట్ల మేర ప్రభుత్వానికి ఆదాయం వస్తోంది. ఈ సొమ్మును తిరిగి ప్రజా సంక్షేమానికే ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఈ డబ్బంతా చంద్రబాబు హయాంలో ఏమైంది? సహజ వనరుల ద్వారా వచ్చే రెవెన్యూ ప్రజా సంక్షేమానికి వినియోగించడానికి బదులు, ఇసుక మాఫియా జేబుల్లోకి వెళ్లేలా చేసింది అప్పటి టీడీపీ ప్రభుత్వం. ఇసుక కొనుగోలు చేయడానికి ప్రజలు బ్లాక్ మార్కెట్‌ను ఆశ్రయించాల్సిన పరిస్థితి కల్పించింది చంద్రబాబు. ఆ అరాచక విధానాన్ని రూపు మాపి ప్రజలకు అందుబాటు ధరలో ఇసుక లభించేలా, పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేశారు. ఇందులో భాగంగా నూతన ఇసుక పాలసీని వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తోంది. దీంతో ఎక్కడా ఇసుక కొరత లేకుండా, అందుబాటు ధరలోనే, కావాల్సినంత ఇసుకను పొందే వీలు కల్పించారు. టెండర్ల ద్వారా ఇసుక తవ్వకాలను ఏజెన్సీలకు అప్పగించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా రూ.765 కోట్లు ఆదాయం లభిస్తోంది. ఐదేళ్లలో రూ.3825 కోట్ల ఆదాయం వస్తోంది. టన్ను ఇసుకను రూ.475కి విక్రయిస్తోంది. అక్రమ ఇసుక దందాపై ఉక్కుపాదం రాష్ట్రంలో అక్రమ ఇసుక దందాపైనా ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. అక్రమాలకు పాల్పడితే రెండు లక్షల రూపాయల జరిమానా, రెండేళ్ళ వరకు జైలు శిక్షను విధించేలా చట్టాల్లో మార్పులు తీసుకువచ్చింది. స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరోను ఏర్పాటు చేసి దాదాపు 18 వేల కేసులను ఈ బ్యూరో నమోదు చేసింది. 6.36 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను సీజ్ చేసింది. ఈ కేసుల్లో చాలా మందికి శిక్షలు కూడా పడ్డాయి. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమ ఇసుక తవ్వకాలపై ఎన్జీటి తీవ్రంగా స్పందించింది. ఏకంగా రూ.100 కోట్లు జరిమానా విధించింది. ఈ తీర్పుకు సంబంధించి వచ్చిన ఆరోపణలు కూడా సీఎంగా చంద్రబాబు నివాసం ఉంటున్న కరకట్ట ప్రాంతంలో జరిగిన అక్రమ ఇసుక తవ్వకాలపైనే. అంటే ఉచిత ఇసుక విధానం వల్ల అటు ప్రభుత్వానికి ఆదాయం రాకపోగా, ఇటు పర్యావరణానికి విఘాతం ఏర్పడింది. టీడీపీ హయాంలో ఇసుక మాఫియా ఎలా రెచ్చిపోయిందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. గత ప్రభుత్వంలో ఆదాయం ఏమైంది ? ఈ ప్రభుత్వంలో ఇసుక టెండర్ల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న రూ.3,825 కోట్ల ఆదాయం గతంలో ఏమైంది? ఇంత ఆదాయం రాష్ట్ర ప్రభుత్వం కోల్పోతోందని తెలిసినా ఎందుకు టెండర్లు పిలువలేదు? పారదర్శక విధానాలను ఎందుకు ఎంచుకోలేదు? అప్పుడు రామోజీరావు ఈ అక్రమాలపై ఈడీ విచారణ జరిపించాలని ఎందుకు కోరలేదు.? ప్రస్తుతం పర్యావరణ అనుమతులు ఉన్న రీచ్ ల్లోనే ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఎక్కడా నిబంధనల ఉల్లంఘన లేదు. అలాగే సంబంధిత శాఖల అనుమతులతోనే రిజర్వాయర్లలో డీసిల్టింగ్ జరుగుతోంది. రాష్ట్రంలో ఎక్కడా అక్రమ తవ్వకాలు జరగడానికి అవకాశమే లేదు. దీనిపై పర్యవేక్షణకు నిఘా కోసం ఎస్ఈబిని ఏర్పాటు చేసింది. అలాగే జిల్లా స్థాయిలో రెవెన్యూ, పోలీస్, గనులశాఖ అధికారులు కూడా తమకు ఫిర్యాదు అందిన వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి జిల్లాకు ఒక విజిలెన్స్ స్క్వాడ్ కూడా గనులశాఖలో పనిచేస్తోంది. అంతేకాకుండా రాష్ట్ర సరిహద్దులతో పాటు కీలకమైన ప్రాంతాల్లో చెక్ పోస్ట్‌లు నిర్వహిస్తున్నారు. -
ఇసుక రిచులపై రామోజీ బురద
-
ఇసుక దందా అంటూ ఈనాడు గగ్గోలు
-
Fact Check: ఊహించినదే వార్తలుగా.. ‘ఈనాడు’ రామోజీ ఇక మారవా?
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా జరిగిన ఇసుక దోపిడీకి చెక్ పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా అమలు చేస్తున్న ఇసుక పాలసీపై మరోసారి 'ఈనాడు' పత్రిక అసత్యాలు, అభూత కల్పనలతో తప్పుడు కథనాన్ని ప్రచురించడాన్ని గనులశాఖ సంచాలకులు వీజీ వెంకటరెడ్డి ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. 'దోచుకో... పంచుకో... తినుకో...’ అనే శీర్షికతో ‘ఈనాడు’ పత్రిక పూర్తి అవాస్తవాలతో కూడిన కథనం రాశారని, వాస్తవాలను వక్రీకరిస్తూ... అబద్దాలతో కూడిన ఆరోపణలను తమ పత్రికలో ప్రచురించారన్నారు. గతంలో జేపీ, టర్న్‌కీ సంస్థలపై పదేపదే తప్పుడు వార్తలు ప్రచురించిన ఈనాడు పత్రిక ఇప్పుడు అధికార పార్టీ ముఖ్య నేతలు, సిండికేట్లు అంటూ మరోసారి ఊహాత్మక ఆరోపణలతో, కట్టుకథలతో వార్తను ప్రచురించడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో జరిగింది ఇదే.. గత ప్రభుత్వంలో ప్రారంభంలో మహిళా సంఘాలకు ఇసుక ఆపరేషన్స్‌ను అప్పగించి, ఇసుక మాఫియా ధాటికి వారు పనిచేయలేని పరిస్థితిని కల్పించింది. తరువాత ప్రభుత్వం తీసుకువచ్చిన ఉచిత ఇసుక విధానంతో ఇసుక మాఫియా ఇష్టారాజ్యంగా ప్రజలను దోచుకుంది. వినియోగదారులు బ్లాక్ మార్కెట్ నుంచి అధిక ధరలకు ఇసుకను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొందరు వ్యక్తుల జేబులు నింపేందుకే ఉచిత ఇసుక విధానం ఉపయోగపడింది. అటు ప్రభుత్వానికి ఐదేళ్లలో రావాల్సిన దాదాపు రూ.3825 కోట్ల ఆదాయానికి గండి పడింది. ఈ సొమ్ము ఇసుక మాఫియా జేబుల్లోకి వెళ్లింది. ఏకంగా ఒక మహిళా ఎమ్మార్వో పైనే మరోవైపు ప్రజలు అధిక ధరల్లో బ్లాక్ మార్కెట్లో ఇసుకను కొనుగోలు చేయాల్సిన పరిస్థితిని కల్పించారు. ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకు పశ్చిమ గోదావరి జిల్లాలో ఏకంగా ఒక మహిళా ఎమ్మార్వో పైనే అప్పటి ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యేగా ఉన్న చింతమనేని ప్రభాకర్ దాడి చేసిన ఘటన ఇసుక మాఫియా ఆగడాలకు అద్దం పట్టింది. గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున ఇసుక లారీలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోయాయి. లెక్కా పత్రం లేకుండా విచ్చల విడిగా ఇసుక తవ్వకాలు జరిగాయి. ఈ మొత్తం విధానాన్ని మార్చేందుకు సీఎం జగన్ నూతన ఇసుక పాలసీని తీసుకువచ్చారు. ఈ విషయం 'ఈనాడు' పత్రికకు తెలియదా? కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా రాష్ట్రంలో ఇసుక టెండర్లను నిర్వహింపచేయడం, పారదర్శక విధానం, సులభతరంగా ఇసుక లభ్యత, అందుబాటు ధరల్లో వినియోగదారులకు చేరువ చేయడానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. అదే క్రమంలో పర్యావరణానికి ఎటువంటి విఘాతం ఏర్పడకుండా, పూర్తి అనుమతులతో ఇసుక ఆపరేషన్స్ జరిగేలా చర్యలు తీసుకుంది. గత ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా జరిగిన ఇసుక తవ్వకాల కారణంగా ఎన్జీటి ఏకంగా రూ.100 కోట్ల జరిమానాను విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ప్రభుత్వం ఇసుక పాలసీ ద్వారా తీసుకున్న చర్యలను పరిశీలించిన ఎన్జీటి సంతృప్తి వ్యక్తం చేస్తూ, గత ప్రభుత్వం తప్పిదాల వల్ల విధించిన రూ.100 కోట్ల జరిమానాను కూడా రద్దు చేసింది. ఈ విషయం 'ఈనాడు' పత్రికకు తెలియదా? ఎక్కడా ఇసుక కొరత అనేది లేకుండా.. టెండర్ల ద్వారా రాష్ట్రంలో ఇసుక ఆపరేషన్స్‌ను దక్కించుకున్న జేపీ సంస్థ ఆధ్వర్యంలోనే ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. సదరు సంస్థ ప్రతి ఏటా ప్రభుత్వానికి రూ.765 కోట్లు రెవెన్యూగా చెల్లిస్తోంది. టన్ను ఇసుక ఓపెన్ రీచ్‌లలో రూ.475 కి విక్రయిస్తున్నారు. అలాగే రీచ్‌లు, డిపోల వద్ద రవాణా చార్జీలతో కలిపి ఇసుక ధరలను కూడా ప్రతివారం పత్రికల ద్వారా ప్రభుత్వం ప్రకటిస్తోంది. అంతకన్నా ఎక్కువకు ఎవరు విక్రయించినా, ఇసుక కొనుగోళ్లు రవాణాలో ఎటువంటి సమస్యలు ఉన్నా టోల్ ఫ్రీ నెంబరు ద్వారా ఫిర్యాదు చేసే సదుపాయం కల్పించాము. వినియోగదారులు నేరుగా డిపోలు, రీచ్ ల వద్దకు వెళ్ళి ఇసుక నాణ్యతను పరిశీలించి, కావాల్సినంత ఇసుకను బుక్ చేసుకునేందుకు వీలు కల్పించాం. రాష్ట్రంలో ఎక్కడా ఇసుక కొరత అనేది లేకుండా సులభతర విధానాన్ని తీసుకువచ్చాం. ఎప్పటికప్పుడు తనిఖీలు ప్రతినెలా జేపీ సంస్థ తమకు అప్పగించిన రీచ్‌లకు గానూ ఎంత పరిమాణంలో పర్యావరణ అనుమతులు పొందింది, ఎంత మేర ఇసుక తవ్వకాలు చేసింది, ఎంత మేర విక్రయాలు చేసిందో గనులశాఖకు నివేదిస్తుంది. గనులశాఖ అధికారులు దీనిని పరిశీలించిన తరువాతే తరువాత తవ్వకాలకు అనుమతులు మంజూరు చేస్తున్నారు. అంతేకాదు రాష్ట్రం దాటి ఇసుకను పొరుకు రాష్ట్రాలకు రవాణా చేసేందుకు వీలు లేకుండా ప్రభుత్వం జిఓ నెం.71 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేసింది. గనులశాఖ రీజనల్ స్వ్కాడ్స్, ఎస్ఇబి కూడా దీనిపై ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. పనికట్టుకుని తప్పుడు కథనాలు.. ఇంత పకడ్భందీగా ఇసుక విధానాన్ని అమలు చేస్తుంటే... ఈనాడు పత్రిక పనికట్టుకుని వరుసగా తప్పుడు కథనాలను ప్రచురించడం బాధాకరం. ఈ ప్రభుత్వంపై ఏదో ఒక రీతిలో బుదరచల్లే ఉద్దేశంతోనే ఇటువంటి అసత్య కథనాలను ఈనాడు పత్రిక వండి వారుస్తోంది. నియోజకవర్గాల్లో అధికారపార్టీ నేతలే సిండికేట్లుగా మారి ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని ఏ సమాచారంతో ఈనాడు పత్రిక ఆరోపిస్తోంది? రాష్ట్రంలో ఏటా 2 కోట్ల టన్నుల ఇసుక వినియోగం ఉంది. దానికి అనుగుణంగానే ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఎక్కడా ఇసుక కొరత అనేది లేదు. ఏ ఆధారాలతో ఈ ఆరోపణలు.. వర్షాకాలం కోసం కూడా ముందుగానే డిపోల్లో ఇసుక నిల్వలను అందుబాటులో ఉంచుతున్నాం. 2 కోట్ల టన్నుల ఇసుక తవ్వకాలకు గానూ రూ.765 కోట్లు రెవెన్యూ వస్తుందని అంచనా. ఈనాడు పత్రిక మాత్రం ఏకంగా ఏడాదికి రూ.1800 కోట్లు ఆదాయం వస్తోందని ఏ లెక్కల ప్రకారం చెబుతోంది? పక్క రాష్ట్రాలకు ఇసుక తరలిపోకుండా ప్రభుత్వం జిఓ 71 ని జారీ చేసి, దానిని అమలు చేస్తోంది. అటువంటప్పుడు పొరుకు రాష్ట్రాలకు భారీగా అక్రమ రవాణా జరుగుతోందని ఏ ఆధారాలతో ఈనాడు పత్రిక ఆరోపణలు చేస్తోంది ఈనాడు పత్రిక చేసిన ఆరోపణల ప్రకారం పొరుగు రాష్ట్రాలకు ఇసుక తరలిపోతే, రాష్ట్రంలో అవసరాలకు ఇసుక కొరత ఏర్పడి ఉండేది కాదా? ఏ రీచ్‌లో అయినా కావాల్సినంత ఇసుక అందుబాటులో ఉంది. అంటే ఈనాడు పత్రిక తన కథనంలో రాసినదంతా అసత్యాలు అని అర్థమవుతోంది. ‘ఈనాడు’ రాతలకు అర్థం ఉందా? ప్రతి రీచ్ లోనూ పర్యావరణ అనుమతులు పొందిన తరువాత ఇసుక తవ్వకాలు ప్రారంభమవుతున్నాయి. ఇసుక పరిమాణం, రేటు కూడా ఖరారు అయిన తరువాత దానిపై వచ్చే ఆదాయం కూడా ముందుగానే నిర్ణయించడం జరిగింది. ఇవ్వన్నీ తెలిసి కూడా జిల్లాల్లో రీచ్ ల వారీగా అత్యధిక రేట్లకు ఇసుక తవ్వకాలు చేస్తామని ఎవరైనా ముందుకు వస్తారా? జిల్లాల వారీగా కోట్ల రూపాయల రేట్లను ఖరారు చేసి, అధికార పార్టీ నేతలకు ఇచ్చారు. వారి నుంచి ముఖ్య నేతలు లక్ష్యాలు విధించి మరీ కోట్లాది రూపాయలను వసూలు చేస్తున్నారనే రాతలకు అర్థం ఉందా? జేపీ సంస్థ నిబంధనల ప్రకారం తాను చెల్లించాల్సిన మొత్తాలను నేరుగా ప్రభుత్వానికి జమ చేస్తోంది. అన్ని రీచ్ లు వారి ఆధీనంలోనే ఉన్నాయి. అలాంటప్పుడు బయటి వ్యక్తులు ఇసుక ఆపరేషన్స్ ఎలా చేస్తారు? నెలకు జిల్లాకు రూ.150 కోట్లు ఎలా వసూలు చేస్తారు? దానిని హైదరాబాద్ లోని ముఖ్య నేతలకు ఏ విధంగా చెల్లిస్తారు? ఊహలను వార్తలుగా రాస్తూ... ఈనాడు పత్రిక తమ ఊహలను వార్తలుగా రాస్తూ.... రాజకీయ ప్రయోజనాల కోసం ఈ ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలని, ప్రజల్లో తప్పుడు అభిప్రాయాలు కలిగించాలనే ఉద్దేశంతోనే ఇసుక పేరుతో పదేపదే తప్పుడు కథనాలను ప్రచురిస్తోంది. దీనిపై వాస్తవాలను తెలుసుకునేందుకు సంబంధిత అధికారులను కూడా కనీసం వివరణ కూడా కోరలేదు. ఉద్దేశపూర్వకంగా ఇటువంటి తప్పుడు కథనాలను ప్రచురిస్తే ఈనాడు పత్రికపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వీజీ వెంకటరెడ్డి హెచ్చరించారు. -
అక్రమాలకు అడ్డుకట్ట.. ఇసుక కోరినంత
అక్రమాలకు అడ్డుకట్ట వేస్తూ.. పారదర్శకంగా జిల్లా ప్రజలకు కోరినంత ఇసుకను జిల్లా యంత్రాంగం సరఫరా చేస్తోంది. కృష్ణా, పెన్నా తీర ప్రాంతాల నుంచి ఉప్పునీటి తాకిడి లేని ఇసుకను అందుబాటులోకి తీసుకొచ్చింది. గతంలో ఉన్న స్టాక్ పాయింట్లను రెట్టింపు చేసి భారీగా నిల్వ చేసింది. జగనన్న కాలనీలకే కాకుండా ఇతర కట్టడాలకు సరిపడా ఇసుకను సరఫరా చేస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో ఇసుక అక్రమార్కుల చెర నుంచి వినియోగదారులను గట్టున పడేసినట్లు అయింది. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఇసుక నిల్వ కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటి ద్వారా అన్ని రకాల నిర్మాణాలకు ఇసుక సరఫరా చేసేలా చర్యలు తీసుకుంది. ప్రధానంగా పెన్నా నది ఇసుక సంగం రీచ్ ద్వారా జిల్లాకు సరఫరా అవుతోంది. ప్రతి నెలా 40 నుంచి 50 వేల టన్నుల ఇసుకను జిల్లాలోని వినియోగదారులకు అందించేలా జిల్లా అధికారులు చర్యలు తీసుకున్నారు. గతంలో ఒంగోలుతో పాటు కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం, యర్రగొండపాలెంలలో ప్రధాన ఇసుక స్టాక్ పాయింట్లు ఉండేవి. పుష్కలంగా ఇసుక నిల్వలను అందుబాటులో ఉంచేందుకు అదనంగా ఏడు స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేశారు. త్వరలో కృష్ణా నది ఇసుకను జిల్లాకు తరలించేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. 500 ఇళ్లకుపైగా ఉన్న జగనన్న కాలనీలకు ప్రత్యేకంగా.. రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మకంగా చేపట్టిన జగనన్న కాలనీలకు కూడా జిల్లా వ్యాప్తంగా ఇసుక ఉచితంగా సరఫరా అవుతోంది. అందులోనూ ప్రత్యేకంగా 500 ఇళ్లకు పైగా ఉన్న జగనన్న కాలనీల్లోనే జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారులు ప్రత్యేకంగా నిల్వ కేంద్రాలు ఏర్పాటు చేశారు. లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా ఆయా కాలనీల సమీపంలో పాయింట్లను ఏర్పాటు చేశారు. దీంతో జగనన్న కాలనీలకు సకాలంలో నాణ్యమైన ఇసుక ఉచితంగా సరఫరా చేస్తున్నారు. సింగరాయకొండలోని నిర్మిత కేంద్రం, కనిగిరి పట్టణం, పొదిలి, దర్శి, గిద్దలూరు టిడ్కో ఇళ్ల పక్కన, యర్రగొండపాలెం మండలంలోని మిల్లంపల్లి, బేస్తవారిపేట మండలంలోని మోక్షగుండంలలో స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేసి ఆయా గ్రామాల్లోని జగనన్న కాలనీలతో పాటు పరిసర ప్రాంతాల్లోని జగనన్న కాలనీలకు కూడా అక్కడ నుంచే ఇసుక సరఫరా చేస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరకే ఇసుక జిల్లాలో ఇతర కట్టడాలకు, వ్యక్తిగత గృహాల నిర్మాణాలకు ప్రభుత్వం అందరికీ అందుబాటులో ఇసుక ఉంచేలా డంపింగ్ యార్డులు ఏర్పాటు చేసింది. పారదర్శక విధానంలో ప్రభుత్వం నిర్దేశించిన ధరకే నాణ్యమైన ఇసుకను ప్రభుత్వం సరఫరా చేస్తోంది. జిల్లాలోని నియోజకవర్గాల వారీగా రీజనబుల్ రవాణా చార్జీలతో కలిపి టన్నుకు ప్రభుత్వం నిర్దేశించిన ధరకు సరఫరా చేస్తోంది. ఎవరైనా ఎక్కువ ధరకు ఇసుక అమ్మితే ఎస్ఈబీ అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. నెలకు 20 వేల టన్నులకు పైగా... జిల్లాలో నిర్మిస్తున్న జగనన్న కాలనీలకు, ప్రభుత్వం మంజూరు చేసిన వ్యక్తిగత ఇళ్ల నిర్మాణాలకు నెలకు దాదాపు 20 వేల టన్నులకు పైగా ఇసుకను గృహ నిర్మాణ శాఖ సరఫరా చేస్తోంది. ఇంకా కొన్ని ఇళ్ల నిర్మాణాలు కోర్టు కేసుల వలన నిలిచిపోయాయి. అవి కూడా ప్రారంభమైతే మరో 5 నుంచి 10 వేల టన్నుల వరకు అదనంగా ఇసుక వాడకం పెరుగుతుంది. జిల్లాలో మొత్తం 570 జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. వాటిలో మొత్తం ప్రస్తుతం 50,813 గృహాల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. నాణ్యమైన ఇసుకతో ఇళ్లు నిర్మించుకున్నాం గ్రామంలో జగనన్న కాలనీలో ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్నాం. గృహ నిర్మాణ శాఖ అధికారులు నెల్లూరు జిల్లా, సంగం ప్రాంతంలోని పెన్నా నది నుంచి తీసుకొచ్చిన ఇసుకను ఉచితంగా అందజేశారు. హాండ్లింగ్ చార్జీల కింద టన్నుకు రూ.175 చొప్పున మాత్రమే ఇచ్చిన ఇసుక తెచ్చుకున్నాం. నాణ్యమైన ఇసుక కావటంతో నిర్మాణం కూడా బాగా వచ్చింది. పటిష్టంగా నిర్మించుకున్నాం. జగనన్న కాలనీ వల్ల సొంతింటి కల నెరవేరింది. అందుకే ఇంటిపై జగనన్న ఫొటోను కూడా ఏర్పాటు చేసుకొని శాశ్వతంగా మా కుటుంబంలో జగనన్నను ఒక సభ్యునిగా చేసుకున్నాం. – ధారా నందిని భవానీ, రామాయణ కండ్రిక, పొదిలి ఇబ్బందులు లేకుండా ఇసుక సరఫరా... ప్రభుత్వం అందిస్తున్న ఇసుకను లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా సరఫరా చేస్తున్నాం. జగనన్న కాలనీలతో పాటు ప్రభుత్వం మంజూరు చేసిన వ్యక్తిగత ఇళ్లకు కూడా అందిస్తున్నాం. ప్రభుత్వం విధించిన నిబంధనల మేరకు సరఫరా చేస్తున్నాం. ప్రతి నెలా 20 నుంచి 25 వేల టన్నుల వరకు సరఫరా చేస్తున్నాం. జగనన్న కాలనీలకు అందుబాటులోనే ఇసుక సరఫరా చేస్తున్నాం. – ఈమని పేరయ్య, పీడీ, జిల్లా గృహ నిర్మాణ శాఖ -
పారదర్శకంగా ఇసుక విధానం
తిరుపతి మంగళం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాకే ఇసుక విధానం పారదర్శకంగా అమలవుతోందని అటవీ, విద్యుత్, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. తిరుపతిలోని తన కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఇసుక దందాను అడ్డుకున్న తహసీల్దార్ వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జుత్తు పట్టుకుని దాడి చేశారని గుర్తు చేశారు. టీడీపీ హయాంలో రూ.4 వేల కోట్లకు పైగా ఇసుక దోపిడీకి పాల్పడ్డారని చెప్పారు. ఇసుకను విచ్చలవిడిగా తవ్వేయడంతో టూరిస్టు బోటు తిరగబడి ఆరుగురు చనిపోయిన ఘటన కూడా టీడీపీ హయాంలోనే జరిగిందన్నారు. నాడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చంద్రబాబు సర్కారుకు రూ.వంద కోట్లు జరిమానా విధించడం టీడీపీ అనుకూల ఎల్లో మీడియాకు కనపడలేదా? అని ప్రశ్నించారు. ప్రజల దృష్టి మళ్లించేందుకే పేదల సంక్షేమం కోసం వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాలను సీఎం జగన్ ప్రకటించారని చెప్పారు. దాని నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ‘ఇక నేతలదే ఇసుక’ అంటూ ఈనాడు పత్రికలో పిచ్చిరాతలు రాస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన మేనిఫెస్టోలోని హామీలను మూడేళ్లలోనే సీఎం జగన్ 99 శాతం అమలు చేశారని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. చంద్రబాబు 100 పేజీల మేనిఫెస్టో ప్రకటించి ఏ ఒక్కటీ నెరవేర్చిన పాపాన పోలేదని విమర్శించారు. దోచుకోవడం, దాచుకోవడం మినహా ప్రజా సంక్షేమం చంద్రబాబుకు పట్టదని ధ్వజమెత్తారు. ఓటుకు కోట్లు నిర్వాకం బాబుదే ఢిల్లీలో లిక్కర్ మాఫియాతో ముఖ్యమంత్రి కుటుంబానికి ముడిపెడుతూ ఎల్లో మీడియా కథనాలు రాస్తోందని మంత్రి పెద్దిరెడ్డి మండిపడ్డారు. ఓటుకు కోట్లు కేసులో పట్టపగలే సాక్ష్యాధారాలతో సహా దొరికిపోయిన చంద్రబాబు నీచ రాజకీయాల కు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంట్లో ఉన్న మహిళను రాజకీయాల్లోకి లాగడం సిగ్గు చేటన్నారు. ఈ సమావేశంలో టీటీడీ పాలకమండలి సభ్యుడు పి.అశోక్‌కుమార్, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు ఎంఆర్సి రెడ్డి పాల్గొన్నారు. -
ఎక్కడనుంచైనా ఇసుక తెచ్చుకోవచ్చు
సాక్షి, అమరావతి : ప్రజలు తమకు నచ్చిన రీచ్‌కు వెళ్లి నాణ్యతను స్వయంగా పరిశీలించి, అక్కడికక్కడే డబ్బు చెల్లించి, కావాల్సిన చోటుకు ఇసుక తీసుకెళ్లవచ్చు. నెట్ పని చేయడం లేదనే తిప్పలు ఉండవు. బుక్ చేసుకోవడం కోసం యాప్ పని చేయడం లేదంటూ నెట్ సెంటర్ల వద్దకు పరుగులు తీయాల్సిన శ్రమ ఏమాత్రం అక్కర లేదు. ఆన్లైన్ మోసాలకు ఆస్కారమే ఉండదు. సిఫార్సుల ఊసుండదు. ఈ మేరకు మంత్రివర్గం ఆమోదంతో ప్రభుత్వం ఇసుక పాలసీ–2019ని మరింత మెరుగు పరిచింది. ఇందుకు సంబంధించి భూగర్భ గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది గురువారం జీఓ జారీ చేశారు. (నేడు గవర్నర్‌తో సీఎం వైఎస్ జగన్ భేటీ) సవరించిన ఇసుక పాలసీలో ముఖ్యాంశాలు ►ఇసుక తవ్వకం, నిల్వ, విక్రయం బాధ్యతలను నామినేషన్ పద్ధతిలో కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం అప్పగిస్తుంది. నిర్ణయించిన మొత్తాన్ని ఆయా సంస్థలు ప్రభుత్వానికి చెల్లించాలి. సీనరేజి, ఇతర పన్నులు దీనికి అదనం. ►కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు ముందుకు రాని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం కనీస టెండరు ధర ఖరారు చేసి అనుభవం, సాంకేతిక నైపుణ్యం, ఆర్థిక పరిపుష్టి ఉన్న సంస్థలను టెక్నికల్, కమర్షియల్ బిడ్ల ద్వారా ఎంపిక చేస్తుంది. మొత్తం రీచ్‌లు మూడు ప్యాకేజీలుగా వర్గీకరణ ►శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలను మొదటి ప్యాకేజీ కింద.. పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలు రెండవ ప్యాకేజీగా.. నెల్లూరు, అనంతపురం, కృష్ణా, కర్నూలు, వైఎస్సార్ కడప జిల్లాలను మూడో ప్యాకేజి కింద చేరుస్తారు. ►1– 3 ఆర్డర్ స్ట్రీమ్స్‌తోపాటు ఆపై స్థాయి స్ట్రీమ్స్ (నదులు, వాగులు)ను నిర్వహణ సంస్థ(ల)కే అప్పగించి ఇసుక తవ్వకం, నిల్వ, విక్రయాలు సాగించేందుకు వీలుగా ఏపీ వాల్టా, ఏపీ మైనర్ మినరల్ కన్సెషన్ రూల్స్‌ను సవరిస్తారు. ► ఆ సంస్థలు ప్రత్యేక నోటిఫైడ్ రీచ్‌లలో డీసిల్టేషన్ ద్వారా ఇసుక సేకరణకు బోట్స్‌మెన్ సొసైటీలకు ఉపాధి కల్పించే విషయాన్ని పరిశీలించవచ్చు. నాణ్యతను దృష్టిలో పెట్టుకుని, పట్టా భూముల్లో తవ్వకాలు నిలిపివేస్తారు. ఇసుక లభ్యత పెంచడానికి ప్రకాశం, ధవళేశ్వరం బ్యారేజీల్లో డ్రెడ్జింగ్ చేస్తారు. భూగర్భ గనులు, జల వనరుల శాఖల సహకారంతో దీన్ని చేపడతారు. ఎవరికి ఎంత ఇసుక కావాలన్నా బుక్ చేసుకుని తీసుకెళ్లవచ్చు. దీనిపై పరిమితులు ఉండవు. స్టాక్ యార్డుల్లో, రాష్ట్రంలోని నిర్ధారిత నగరాల్లో ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ఇసుక సరఫరా జరుగుతుంది. ఆన్లైన్ విధానం ఉండదు ►ఆఫ్‌లైన్ విధానంలోనే డబ్బు చెల్లించి ఇసుకను తీసుకెళ్లొచ్చు. ఆన్లైన్ విధానం ఉండదు. స్టాక్ యార్డులు/ రీచ్‌ల నుంచి ఇసుక తీసుకెళ్లడానికి వినియోగదారులే రవాణా ఏర్పాట్లు చేసుకోవాలి. ఆయా సంస్థలు ప్రతి స్టాక్ యార్డు/ రీచ్‌లలో 20 వాహనాలను అందుబాటులో ఉంచాలి. ఈ సంస్థలు నిర్ణీత పూచీకత్తు మొత్తం (పెర్ఫార్మెన్స్ సెక్యూరిటీ డిపాజిట్ –పీఎస్డీ) చెల్లించాలి. పేదల గృహ నిర్మాణాలకు ఉచితమే ప్రజలు సొంత అవసరాలకు ఇసుకను ఎడ్లబండ్లపై ఉచితంగా తీసుకెళ్లవచ్చు. రీచ్‌లకు సమీపంలోని గ్రామాల వారికి, బలహీన వర్గాలకు ప్రభుత్వ గృహ నిర్మాణ పనులకు, సహాయ–పునరావాస కార్యక్రమం కింద నిర్మించే ఇళ్లకు కూపన్ల జారీ ద్వారా ఇసుకను ఉచితంగా ఇస్తారు. అన్ని దశల్లో పారదర్శకత ఉంటుంది. అక్రమ తవ్వకాలు, నిల్వ, రవాణాను నియంత్రించేందుకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోకు దాడులు చేసి, కేసులు నమోదు చేసే అధికారముంటుంది. మెరుగైన ఇసుక విధానం అమలుకు భూగర్భ గనుల శాఖ సంచాలకులు, ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్, ఎండీ అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం పేర్కొంది. -
ఎక్కడనుంచైనా ఇసుక తెచ్చుకోవచ్చు
సాక్షి, అమరావతి : ప్రజలు తమకు నచ్చిన రీచ్‌కు వెళ్లి నాణ్యతను స్వయంగా పరిశీలించి, అక్కడికక్కడే డబ్బు చెల్లించి, కావాల్సిన చోటుకు ఇసుక తీసుకెళ్లవచ్చు. నెట్ పని చేయడం లేదనే తిప్పలు ఉండవు. బుక్ చేసుకోవడం కోసం యాప్ పని చేయడం లేదంటూ నెట్ సెంటర్ల వద్దకు పరుగులు తీయాల్సిన శ్రమ ఏమాత్రం అక్కర లేదు. ఆన్లైన్ మోసాలకు ఆస్కారమే ఉండదు. సిఫార్సుల ఊసుండదు. ఈ మేరకు మంత్రివర్గం ఆమోదంతో ప్రభుత్వం ఇసుక పాలసీ–2019ని మరింత మెరుగు పరిచింది. ఇందుకు సంబంధించి భూగర్భ గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది గురువారం జీఓ జారీ చేశారు. సవరించిన ఇసుక పాలసీలో ముఖ్యాంశాలు ►ఇసుక తవ్వకం, నిల్వ, విక్రయం బాధ్యతలను నామినేషన్ పద్ధతిలో కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం అప్పగిస్తుంది. నిర్ణయించిన మొత్తాన్ని ఆయా సంస్థలు ప్రభుత్వానికి చెల్లించాలి. సీనరేజి, ఇతర పన్నులు దీనికి అదనం. ►కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు ముందుకు రాని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం కనీస టెండరు ధర ఖరారు చేసి అనుభవం, సాంకేతిక నైపుణ్యం, ఆర్థిక పరిపుష్టి ఉన్న సంస్థలను టెక్నికల్, కమర్షియల్ బిడ్ల ద్వారా ఎంపిక చేస్తుంది. మొత్తం రీచ్‌లు మూడు ప్యాకేజీలుగా వర్గీకరణ ►శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలను మొదటి ప్యాకేజీ కింద.. పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలు రెండవ ప్యాకేజీగా.. నెల్లూరు, అనంతపురం, కృష్ణా, కర్నూలు, వైఎస్సార్ కడప జిల్లాలను మూడో ప్యాకేజి కింద చేరుస్తారు. ►1– 3 ఆర్డర్ స్ట్రీమ్స్‌తోపాటు ఆపై స్థాయి స్ట్రీమ్స్ (నదులు, వాగులు)ను నిర్వహణ సంస్థ(ల)కే అప్పగించి ఇసుక తవ్వకం, నిల్వ, విక్రయాలు సాగించేందుకు వీలుగా ఏపీ వాల్టా, ఏపీ మైనర్ మినరల్ కన్సెషన్ రూల్స్‌ను సవరిస్తారు. ►ఆ సంస్థలు ప్రత్యేక నోటిఫైడ్ రీచ్‌లలో డీసిల్టేషన్ ద్వారా ఇసుక సేకరణకు బోట్స్‌మెన్ సొసైటీలకు ఉపాధి కల్పించే విషయాన్ని పరిశీలించవచ్చు. నాణ్యతను దృష్టిలో పెట్టుకుని, పట్టా భూముల్లో తవ్వకాలు నిలిపివేస్తారు. ఇసుక లభ్యత పెంచడానికి ప్రకాశం, ధవళేశ్వరం బ్యారేజీల్లో డ్రెడ్జింగ్ చేస్తారు. భూగర్భ గనులు, జల వనరుల శాఖల సహకారంతో దీన్ని చేపడతారు. ఎవరికి ఎంత ఇసుక కావాలన్నా బుక్ చేసుకుని తీసుకెళ్లవచ్చు. దీనిపై పరిమితులు ఉండవు. స్టాక్ యార్డుల్లో, రాష్ట్రంలోని నిర్ధారిత నగరాల్లో ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ఇసుక సరఫరా జరుగుతుంది. ఆన్లైన్ విధానం ఉండదు ►ఆఫ్‌లైన్ విధానంలోనే డబ్బు చెల్లించి ఇసుకను తీసుకెళ్లొచ్చు. ఆన్లైన్ విధానం ఉండదు. స్టాక్ యార్డులు/ రీచ్‌ల నుంచి ఇసుక తీసుకెళ్లడానికి వినియోగదారులే రవాణా ఏర్పాట్లు చేసుకోవాలి. ఆయా సంస్థలు ప్రతి స్టాక్ యార్డు/ రీచ్‌లలో 20 వాహనాలను అందుబాటులో ఉంచాలి. ఈ సంస్థలు నిర్ణీత పూచీకత్తు మొత్తం (పెర్ఫార్మెన్స్ సెక్యూరిటీ డిపాజిట్ –పీఎస్డీ) చెల్లించాలి. పేదల గృహ నిర్మాణాలకు ఉచితమే ►ప్రజలు సొంత అవసరాలకు ఇసుకను ఎడ్లబండ్లపై ఉచితంగా తీసుకెళ్లవచ్చు. రీచ్‌లకు సమీపంలోని గ్రామాల వారికి, బలహీన వర్గాలకు ప్రభుత్వ గృహ నిర్మాణ పనులకు, సహాయ–పునరావాస కార్యక్రమం కింద నిర్మించే ఇళ్లకు కూపన్ల జారీ ద్వారా ఇసుకను ఉచితంగా ఇస్తారు. అన్ని దశల్లో పారదర్శకత ఉంటుంది. అక్రమ తవ్వకాలు, నిల్వ, రవాణాను నియంత్రించేందుకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోకు దాడులు చేసి, కేసులు నమోదు చేసే అధికారముంటుంది. మెరుగైన ఇసుక విధానం అమలుకు భూగర్భ గనుల శాఖ సంచాలకులు, ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్, ఎండీ అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం పేర్కొంది. -
నేడు రాష్ట్ర మంత్రివర్గం భేటీ
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన గురువారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. సచివాలయం ఒకటో బ్లాక్‌లో జరిగే ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఎస్సీ, ఎస్టీలను పారిశ్రామిక వేత్తలుగా చేసేందుకు ఇటీవల విడుదల చేసిన ప్రత్యేక పారిశ్రామిక విధానానికి (జగనన్న వైఎస్సార్ బడుగు వికాసం పథకం) కేబినెట్ ఆమోదం తెలపనుంది. అలాగే నూతన ఇసుక విధానంపై కేబినెట్ చర్చించనున్నట్లు అధికార వర్గాల సమాచారం. మచిలీపట్నం పోర్టుకు సంబంధించి డీపీఆర్‌పై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. -
ఇక కోరినంత ఇసుక!
సాక్షి, అమరావతి: ప్రజలకు కోరినంత నాణ్యమైన ఇసుకను అందించేందుకు సవరించిన ఇసుక పాలసీని గురువారం రాష్ట్ర మంత్రివర్గం చర్చించి ఆమోదించనుంది. ఇసుక విధానం మెరుగుపరచడం కోసం సిఫార్సుల నిమిత్తం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంత్రుల కమిటీని నియమించిన విషయం విదితమే. ఈ కమిటీ సభ్యులు ఇసుక విధానంపై లోతుగా అధ్యయనం చేసింది. ప్రజల సౌలభ్యం కోసం ఇసుకను రీచ్‌ల నుంచే ఇవ్వాలని మంత్రుల కమిటీ సూచించింది. పట్టాభూముల్లో నాణ్యత లేని ఇసుక వస్తున్నందున అక్కడ తవ్వకాలకు స్వస్తిచెప్పి నదుల్లో డ్రెడ్జింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని సిఫార్సు చేసింది. వీటితో పాటు మంత్రుల కమిటీ చేసిన పలు సూచనలను పరిశీలించిన సీఎం జగన్ లోపరహితమైన ఇసుక విధాన రూపకల్పన కోసం ప్రజల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించాలని భావించారు. సీఎం సూచన మేరకు ఈ అంశాలపై ప్రజల నుంచి సలహాలు కోరుతూ అధికారులు పత్రికా ప్రకటనలు ఇచ్చారు. ప్రజల నుంచి వచ్చిన సూచనలకు అనుగుణంగా ఇసుక పాలసీని ప్రభుత్వం సవరించింది. నూతన పాలసీలోని ముఖ్యమైన అంశాలు ► ప్రభుత్వమే ఇసుక ధర నిర్ణయిస్తుంది. ప్రజలు నేరుగా రీచ్‌ల వద్ద డబ్బు చెల్లించి ఇసుక తీసుకెళ్లవచ్చు. స్టాక్ యార్డులు ఉండవు. ► రీచ్‌ల నుంచి తమకు నచ్చిన వాహనాల్లో ఇసుక తీసుకెళ్లే స్వేచ్ఛ ప్రజలకు ఉంటుంది. ► అవసరాలకు అనుగుణంగా నదుల్లో పెద్దఎత్తున డ్రెడ్జింగ్ ద్వారా ఇసుక వెలికితీతకు ప్రాధాన్యం ఇస్తారు. ► రీచ్‌ల నిర్వహణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలకు అప్పగించాలన్నది పాలసీలో మరో అంశం. అవి ముందుకురాని పక్షంలో వేలం ద్వారా పెద్ద సంస్థలకు ఈ బాధ్యత ఇస్తారు. -
అవినీతి లేకుండా పారదర్శకత: సీఎం జగన్
సాక్షి, అమరావతి : ఇసుక తవ్వకాలు, సరఫరాలో ఎక్కడా అవినీతికి తావు ఉండొద్దని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండే ధరలో, పూర్తి పారదర్శక విధానం ఉండాలని అన్నారు. అలాగే ఇసుక సరఫరాలో ఎఫీషియన్సీ పెంచాలని, నాణ్యమైన ఇసుకనే సరఫరా చేయాలని సూచించారు. ఇసుక రీచ్‌లు సామర్థ్యం పెంచితే పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయని, వీలుంటే కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ కూడా వస్తుందని సీఎం అంచనా వేశారు. ఈ మేరకు నూతన ఇసుక విధానంపై తన క్యాంప్ కార్యాలయంలో అధికారులతో సోమవారం సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో అధికారులకు మంత్రులకు సీఎం పలు సూచనలు, ఆదేశాలు జారీచేశారు. (బీసీలకు బాసటగా..) సమీక్ష సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ..‘ ఇసుర తవ్వకాల్లో పారదర్శక విధానాన్ని అమలు చేయాలి. రవాణా వ్యయం ఎక్కువగా ఉంటుంది. చలాన్ కట్టి ఎవరైనా వచ్చి ఇసుక తీసుకుపోయే విధంగా ఉండాలి. ఏ రేటుకు అమ్మాలి? అన్నది నియోజకవర్గాలు లేదా ప్రాంతాల వారీగా నిర్ధారణ చేయాలి. అంతకన్నా ఎక్కువ రేటుకు అమ్మితే ఎస్ఈబీ రంగ ప్రవేశం చేస్తుంది. ఎవరికి వారు రీచ్‌కు వచ్చి కావాల్సిన ఇసుక తీసుకుపోవడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన సదుపాయాలు కల్పించాలి. కాంట్రాక్టర్ స్టాండ్‌బై రవాణా సదుపాయం కూడా కల్పించాలి. ఆ నియోజకవర్గంలో నిర్దేశించిన ధర కంటే ఎక్కువకు అస్సలు అమ్మడానికి వీల్లేదు. ప్రభుత్వ నిర్మాణాలు, బలహీన వర్గాల ఇళ్లకు సబ్సిడీపై ఇసుక సరఫరా చేయాలి. టోకెన్లు ఇచ్చి ఇసుక సరఫరా చేయవచ్చు. స్థానికంగా ఉన్న వారికి ఇసుక అవసరమైతే, వారికి కూపన్లు ఇచ్చి, వాటిపై సబ్సిడీ ధరకు ఇసుక సరఫరా చేయొచ్చు. నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న గ్రామాలకు ఎన్ని కిలోమీటర్ల పరిధి వరకు సబ్సిడీ ధరపై ఇసుక సరఫరా చేయవచ్చనే విషయాన్ని పరిశీలించాలి.’ అని పేర్కొన్నారు. సమీక్షలో ఈ అంశాలన్నింటినీ ప్రస్తావించిన సీఎం వైఎస్ జగన్, ఇసుక విధానం ఖరారుకు ముందు పత్రికా ప్రకటన ఇచ్చి, ప్రజల సూచనలు, సలహాలు పొందడంతో పాటు, వారి అభిప్రాయం కూడా తీసుకోవాలని మంత్రుల బృందాన్ని ఆదేశించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పేర్ని నాని, కొడాలి నానితో పాటు, పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు. -
ఇసుక బుకింగ్ మరింత సరళతరం
సాక్షి, అమరావతి: ఇసుక బుకింగ్‌ను మరింత సరళతరం చేసి ఆన్లైన్ మోసాలకు చెక్ పెడతామని భూగర్భ గనులు, పంచాయతీరాజ్ శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. సచివాలయ వ్యవస్థ ద్వారా ఇసుక బుకింగ్‌కు అవకాశం కల్పించే విషయం ఆలోచిస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) కార్యాలయంలో సోమవారం ఆయన ఉన్నతాధికారులు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ఇసుక పాలసీపై సమీక్షించారు. ‘సచివాలయాల ద్వారా ఏపీఎండీసీ నుంచి వినియోగదారులు ఇసుక కొనుగోలు చేసే అవకాశం కల్పించవచ్చు. దీనివల్ల గ్రామస్థాయిలో వినియోగదారుడికి ఇసుక లభ్యత మరింత సులభమవుతుంది. ఈ నూతన విధానంపై సీఎం వైఎస్ జగన్‌తో చర్చించి ఆయన సూచనల ప్రకారం నిర్ణయం తీసుకుంటాం’.. అని మంత్రి పెద్దిరెడ్డి వివరించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. సమీక్షలో మంత్రులు పెద్దిరెడ్డి, పేర్ని నాని, కొడాలి నాని, వెలంపల్లి శ్రీనివాస్ తదితరులు ► బల్క్ బుకింగ్‌లకు కూడా కొత్త నిబంధనలు అమలుచేస్తాం. అక్రమాల కట్టడి కోసం ప్రతి బల్క్ బుకింగ్‌ను జిల్లా స్థాయిలో పునఃపరిశీలన చేసే ఏర్పాట్లుచేస్తాం. ► ప్రతి రీచ్‌కు పది కిలోమీటర్ల పరిధిలోనే స్టాక్‌యార్డ్ ఏర్పాటుచేయాలి. తద్వారా ఇసుక రవాణాభారం వినియోగదారులపై తగ్గించాలి. ► రాజమండ్రి నుంచి విశాఖకు ఇసుక రవాణా చెల్లింపులను కిలోమీటరుకు టన్నుకు రూ.4.90 నుంచి రూ.3.30కి తగ్గించాం. ► వర్షాకాలంలో అవసరాల కోసం 70 లక్షల టన్నుల ఇసుక నిల్వలను సిద్ధం చేయాలని సీఎం ఆదేశించగా ఇప్పటివరకు 40 లక్షల టన్నులు సిద్ధంచేశాం. వచ్చే 20 రోజుల్లో మిగిలిన లక్ష్యాన్ని కూడా పూర్తిచేయాలి. ► ఇసుక రవాణాదారులకు సకాలంలో బిల్లులు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ► జీపీఆర్ఎస్ పరికరాలు లేని వాహనాలను ఇసుక రవాణాకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరాదు. ► రాత్రి పూట ఇసుక ఆపరేషన్లు తగ్గించాలి. ► పర్యావరణ నిబంధనల ప్రకారం తవ్వకాలు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, వెలంపల్లి శ్రీనివాసరావు, మైనింగ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కృష్ణా జిల్లా కలెక్టరు ఇంతియాజ్, జేసీ మాధవీలత, ఏపీఎండీసీ ఎండీ వెంకటరెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. -
‘ఏపీ ఇసుక మైనింగ్ పాలసీ దేశంలోనే రోల్‌మోడల్’
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన ఇసుక మైనింగ్ పాలసీ దేశంలోనే రోల్‌మోడల్‌గా నిలిచిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఇసుక పాలసీ అమలుపై బుధవారం ఆయన తన కార్యదర్శి ద్వారా జిల్లా కలెక్టర్ల ఆదేశాలు జారీ చేశారు. ఒకవైపు పర్యావరణాన్ని పరిరక్షించే చర్యలు తీసుకుంటూనే అవినీతికి తావులేని, పారదర్శకమైన, అక్రమ తవ్వకాలకు అడ్డుకట్టువేసే విధంగా ఇసుక పాలసీని అమలు చేస్తున్నామని ఈ సందర్భంగా సీఎం పేర్కొన్నారు. ఇసుక అక్రమాలకు సంబంధించి ఒక్క కేసు నమోదైనా అది ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తుందన్నారు. అవినీతి రహిత, పారదర్శకమైన ఇసుక పాలసీని అమలుచేయాలని, ఎక్కడా అక్రమాలు జరక్కుండా పటిష్టమైన వ్యవస్థ ఉండాలన్నారు. ఈ విషయంలో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని సీఎం హెచ్చరించారు. ఇందుకోసం కలెక్టర్లందరూ అన్ని వైపుల నుంచి సమగ్రమైన సమాచారం తెప్పించుకొని, అక్రమాలకు తావులేకుండా చూడాలన్నారు. రానున్న స్పందన సమావేశం నాటికి దీనిపై పక్కా సమాచారంతో సన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. -
సత్ఫలితాలు అందిస్తున్న నూతన ఇసుక పాలసీ
సాక్షి, అమరావతి : వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన ఇసుక పాలసీ సత్ఫలితాలను అందిస్తోంది. ఈ పాలసీ ద్వారా వినియోగదారులకు పారదర్శకంగా ఇసుక సరఫరా జరుగుతోంది. నూతన పాలసీ ద్వారా గత నెల 30వ తేదీ నాటికి 23,91,716 టన్నుల ఇసుక సరఫరా జరిగింది. ఫలితంగా రాష్ట్రానికి రూ.89.31కోట్ల ఆదాయం లభించింది. (చదవండి : నెట్టింట్లో ఇసుక!) ఇసుక అక్రమార్కులపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. అక్రమంగా ఇసుక నిల్వ, బ్లాక్ మార్కెటింగ్, ఇసుకతో వ్యాపారం చేసిన వారికి రూ. 2 లక్షల జరిమానాతోపాటు రెండేళ్ల వరకూ జైలు శిక్ష విధించనున్నట్లు హెచ్చరింది. ఇసుక అక్రమాలపై టాస్క్‌ఫోర్స్ దాడులలో కళ్లెం వేసింది. అలాగే ఇసుకను ఆన్లైన్లో బుక్ చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. కంప్యూటర్‌పై స్వల్ప పరిజ్ఞానం ఉన్న వారు కూడా సులభంగా ఇసుక బుక్ చేసుకునేందుకు వీలుగా ప్రత్యేక వెబ్సైట్ రూపొందించారు. ఫలితంగా అక్రమాలకు తావు లేకుండా.. రాష్ట్ర ప్రజలకు సులభంగా ఇసుక లభిస్తోంది. -
చంద్రబాబు వైఖరి దొంగే.. దొంగ అన్నట్లు ఉంది
పిచ్చాటూరు (నాగలాపురం): ప్రతిపక్ష నేత చంద్రబాబు, అతని కుమారుడు, గత టీడీపీ ప్రభుత్వంలోని మంత్రులు ఐదేళ్ల పాటు ఇసుకను ఎడాపెడా దోచుకుని..ఇప్పుడు సీఎం జగన్ ప్రభుత్వంపై అభాండాలు వేస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక విధానంలో చంద్రబాబు మాటలు వింటుంటే దొంగే.. దొంగ అన్న చందంగా ఉందన్నారు. శనివారం చిత్తూరు జిల్లా నాగలాపురం మండలం సురుటపల్లి ఇసుక రీచ్ వద్ద నిర్వహించిన ఇసుక వారోత్సవాల్లో డిప్యూటీ సీఎం కె.నారాయణస్వామి, ఎమ్మెల్యే కె.ఆదిమూలంతో కలసి మంత్రి పెద్దిరెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ పారదర్శకంగా ఇసుక అందేలా రీచ్‌లను ఏర్పాటు చేసి సరఫరా చేస్తున్నారని, దీనిని చూసి ఓర్వలేని చంద్రబాబు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నామని సీఎం, మంత్రులు ఎమ్మెల్యేలపై చార్జిషీట్ వేశారని విమర్శించారు. -
చంద్రబాబుకు పార్థసారధి సవాల్
సాక్షి, తాడేపల్లి: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు దీక్ష చేయడం విడ్డూరంగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పార్థసారధి ఎద్దేవా చేశారు. తనపై చేసిన ఆరోపణలకు సాయంత్రంలోగా ఆధారాలు చూపించాలని, లేకుంటే రేపు (గురువారం) చంద్రబాబు దీక్ష పక్కనే తాను కూడా దీక్షకు దిగుతానని ఆయన హెచ్చరించారు. పార్థసారధి బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘నాపై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించకపోతే చంద్రబాబుపై పరువునష్టం దావా వేస్తా. ఇసుక ఎక్కడ అక్రమంగా రవాణా చేశానో ఆధారాలు చూపించాలి. చంద్రబాబుకు సవాల్ చేస్తున్నా. లేదంటే రేపు చంద్రబాబు చేసే దీక్ష పక్కనే నేను కూడా దీక్ష చేస్తా. చంద్రబాబు హయాంలో లక్షల టన్నుల ఇసుక అక్రమంగా పోగేశారు. మీ ప్రభుత్వానికి వంద కోట్ల రూపాయల జరిమానా విధించిన సంగతి మర్చిపోయారా? టీడీపీ విడుదల చేసిన ఛార్జ్‌షీట్ అబద్ధాల పుట్ట. బీసీ నేతలను టార్గెట్ చేస్తూ బాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇసుకను అన్నంలా తిన్న చరిత్ర చంద్రబాబుది. తన ఇసుక కంపును ఇతరులపై రుద్దేందుకే బాబు దీక్ష. నదుల్లో వరద ఉధృతంగా ఉండటం వల్లే కొంత ఇసుక కొరత ఉంది. వరద తగ్గిన తర్వాత పూర్తిస్థాయిలో ఇసుక లభిస్తుంది. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలపై తప్పుడు ప్రచారం చేస్తున్న చంద్రబాబుపై పరువు నష్టం దావా వేస్తాం. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో ఎక్కడా కూడా అవినీతి జరగలేదు. వ్యవస్థలను నాశనం చేసి నాడు చంద్రబాబు అవినీతికి పట్టం కట్టారు. ఇప్పుడు తన తాబేదారు పవన్ కల్యాణ్‌తో కలిసి చంద్రబాబు నాటకం ఆడుతున్నారు. టీడీపీ, జనసేన ఒకే తానులో ముక్కలు’ అని మండిపడ్డారు. మరోవైపు విజయవాడలో ధర్నా చౌక్ వద్ద రేపు ధర్నా చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పార్థసారధి ...నగర పోలీస్ కమిషనర్‌కు లేఖ రాశారు. -
చంద్రబాబుకు సవాల్ చేస్తున్నా
-
ఇసుక వారోత్సవం
-
వరదలు కనిపించట్లేదా పవన్ నాయుడూ..
సాక్షి, అమరావతి: గోదావరి, కృష్ణా నదుల్లో వరదల కారణంగా ఇసుక తవ్వకాలకు తీవ్ర ఆటంకం కలుగుతోందని.. ఇవేమీ పవన్ కల్యాణ్‌కు కనిపించడం లేదా అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) నిలదీశారు. మంగళవారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించినప్పుడు ఎత్తిన ధవళేశ్వరం బ్యారేజీ గేట్లు ఇప్పటికీ దించలేదని.. మంగళవారం కూడా 55 వేల క్యూసెక్కుల గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నాయని చెప్పారు. కృష్ణా నదిలోనూ అదే పరిస్థితి ఉందన్నారు. ఇవేమీ పవన్‌కు కనిపించడం లేదా అని విరుచుకుపడ్డారు. ‘పవన్ నాయుడూ.. నీ బుర్రలో చంద్రబాబు తప్ప మరేమీ లేదు. అందుకే సీఎం చేస్తున్న మంచి పనుల్లో ఒక్కటి కూడా నీకు కనిపించడం లేదు. రైతు భరోసా, వైఎస్సార్వాహన మిత్ర, చేనేత కార్మికులకు ఏటా రూ. 24 వేలు, మత్స్యకారులకు రూ.10 వేల ఆర్థిక సాయం చేస్తున్నాం. దేశంలో ఎక్కడా లేనివిధంగా పేద విద్యార్థుల తల్లులకు అమ్మ ఒడి అమలు చేస్తున్నాం. కళ్లుండీ వీటిని చూడలేకపోతున్నావా’ అంటూ ధ్వజమెత్తారు. భవన నిర్మాణ కార్మికుల కష్టార్జితం రూ.1,200 కోట్లను జల్సాల కోసం దోచుకున్న టీడీపీ నేత అచ్చెన్నాయుడిని పక్కనే కూర్చోబెట్టుకుని.. కార్మికుల సంక్షేమం అంటూ పవన్ ఎలా మాట్లాడగలిగారని ఎద్దేవా చేశారు. ‘పవన్ నాయుడూ.. నువ్వు ఒక సారి తాట తీస్తాం అంటే మేం వందల సార్లు తాట తీస్తాం’ అని నాని గట్టిగా హెచ్చరించారు. పవన్ సినిమాల్లో గబ్బర్ సింగ్ అయితే కావచ్చని.. రియల్‌గా మాత్రం రబ్బర్ సింగేనని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే కాపు రిజర్వేషన్లు అమలు చేస్తామని 2014 ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు మాట తప్పినా పవన్ ఎందుకు ప్రశ్నించలేదని మంత్రి ప్రశ్నించారు. పవన్‌కే కుల జాఢ్యం ఉందని, కాపులను ఓటు బ్యాంకుగా చూస్తున్నారని ధ్వజమెత్తారు. పవన్ కల్యాణ్ కుమారుడు ఇంగ్లిష్ మీడియం స్కూల్లో చదువుతున్నాడని.. అందులో తెలుగు మాట్లాడితే ఫైన్ వేస్తారని.. దాని గురించి గొప్పగా చెప్పే పవన్ రాష్ట్రంలో తెలుగుకు ఏదో అయిపోతుందన్నట్లు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. పవన్‌కు పెళ్లిళ్లపై మక్కువైతే.. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి ప్రజాసేవపై మక్కువ ఎక్కువని మంత్రి నాని స్పష్టం చేశారు. -
ఎక్కువ ధరకు ఇసుక అమ్మితే కఠిన చర్యలు
-
పవన్ రెండుచోట్లా ఎందుకు ఓడిపోయావ్!!
సాక్షి, అమరావతి : జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ సపోర్టుతో విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ ఎందుకు చేశారో ప్రజలకు అర్థం కాలేదని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. సోమవారం రోజున ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ.. లాంగ్ మార్చ్‌లో వరదల్లో ఇసుక ఎలా తీస్తారో అనే టెక్నాలజీ గురించి చెప్తారేమో అని ఎదురు చూశాం. జనంలో వైఎస్ జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటే లాంగ్‌మార్చ్‌కి అన్ని పార్టీలను జనాల్ని పంపమని ఎందుకు అడిగారు..? పవన్ ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్‌ని కూడా సరిగా చదవలేకపోయారని విమర్శించారు. వేదికల మీద అర్థం లేకుండా ఊగిపోతూ ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే జనం అసహ్యించుకుంటారని అన్నారు. కన్నబాబుని నాగబాబు గెలిపించారని అంటున్నారు. మరి అదే నిజమైతే మీ అన్న నాగబాబు ఎందుకు గెలవలేకపోయారు..? మీ అన్నను నువ్వెందుకు గెలిపించలేకపోయావో ప్రజలకు వివరించాలన్నారు. ప్రజలు నిన్ను నమ్మడం లేదని గుర్తించాలి. ప్రజలు మీతో ఉంటే మీరెందకు రెండు చోట్లా ఓడిపోయారని మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. శ్రీకాకుళంలో ఇసుకను మింగేసి అచ్చెన్నాయుడు ఆంబోతులా బలసిపోయారు. నాగావళి నదిలో ఇసుకను బకాసురుడులా మింగేశారు. అలాంటి అచ్చెన్నాయుడిని పక్కన పెట్టుకొని పవన్ మాకు నీతులు చెప్తారా..? అయ్యన్నపాత్రుడు నర్సీపట్నం ఏరియాలో రంగురాళ్లను దోచేశారని పేర్కొన్నారు. అలాంటి వాళ్లను పక్కన పెట్టుకొని పవన్ నీతులు చెబుతున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబుది శాడిస్టు పాలన కాబట్టే జనం ఓడించారని మంత్రి నాని విమర్శించారు. -
పవన్ కళ్యాణ్ రాజకీయ అజ్ఞాని
సాక్షి, టెక్కలి: ఇసుక విధానంపై కనీస అవగాహన లేని జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ వ్యాఖ్యానించారు. శనివారం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ పవన్‌ను రాజకీయ అజ్ఞానిగా భావించవచ్చునని, ఆయన చేయబోయే లాంగ్‌మార్చ్ ప్రజలను వంచించడానికేనన్నారు. ఇసుక సమస్య త్వరలోనే పరిష్కారమవుతుందని, టెక్కలి, నరసన్నపేట తదితర కేంద్రాల్లో ఇసుక నిల్వ కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఈ పరిస్థితి ఉత్పన్నమయ్యేందుకు గత టీడీపీ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. ఒక రాజకీయ పార్టీకి అధినేతగా ఉండి రెండు చోట్ల పోటీ చేసి ఓటమి పాలైన పవన్‌కు విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబునాయుడు ఒకే బాటలో పయనిస్తున్నారని విమర్శించారు. తొలి నుంచీ ఇద్దరికీ రాజకీయ బంధం ఉందని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేతులు కలపడంతో మరోసారి బట్టబయలైందన్నారు. ఈ కార్యక్రమంలో టెక్కలి వైఎస్సార్సీపీ సమన్వయకర్త పేరాడ తిలక్, పార్టీ మండల అధ్యక్షుడు ఎస్.రాజు, పార్టీ నాయకులు అన్నెపు రామారావు, దుబ్బ వెంకటరావు, పేడాడ వెంకటరావు, ఆర్.శైలేంద్రకుమార్, బోయిన నాగేశ్వరరావు, దుక్క రామకృష్ణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. కేజీబీవీ ఆకస్మిక తనిఖీ అంతకుముందు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయను మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఉపాధ్యాయులు, సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. పాఠశాల వసతి సమస్యలు, ఉపాధ్యాయుల జీతభత్యాల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. -
ఉనికి కోసమే పవన్ లాంగ్ మార్చ్
-
చంద్రబాబుకు తెలుగు తమ్ముళ్లు ఝలక్
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు జిల్లాలోని తెలుగు తమ్ముళ్లు ఝలక్ ఇచ్చారు. ఇసుకపై ప్రభుత్వ తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో నిరసన దీక్షలు చేపట్టాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన పిలుపునకు కనీస స్పందన కరువైంది. జిల్లాలో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు ఉండగా ఏ ఒక్కరూ నిరసన దీక్షలో పాల్గొనకుండా ముఖం చాటేశారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలు సైతం నిరసన దీక్షలు చేపట్టలేదు. జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు సైతం గైర్హాజరు కావడంపై ఆ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. కొందరు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలు జిల్లాలోనే ఉన్నప్పటికీ నిరసన దీక్షలు చేపట్టి దాఖలాలు లేవంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. టీడీపీ ఓటమిపాలైన తరువాత పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమాలకు అనేక మంది ముఖ్య నేతలు డుమ్మా కొడుతుండటంతో టీడీపీ ద్వితీయశ్రేణి నేతలు, కార్యకర్తల్లో అంతర్మథనం నెలకొంది. జిల్లాలో శుక్రవారం టీడీపీ నేతల నిరసన దీక్షలకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఇసుక విధానంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో దీక్షా శిబిరాలు ఏర్పాటు చేసి ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలంతా ఉదయం నుంచి సాయంత్రం వరకూ దీక్షల్లో పాల్గొనాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలో టీడీపీ అత్యధిక ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకున్న ప్రకాశం జిల్లాలో చంద్రబాబు పిలుపును పట్టించుకున్న నాథుడే లేకుండా పోయారు. ఇసుక విషయంలో ప్రభుత్వం నిజంగా విఫలం చెంది ఉంటే టీడీపీ నేతలతోపాటు భవన నిర్మాణ కారి్మకులు సైతం వీరి నిరసన దీక్షలకు మద్దతు తెలిపేవారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో అడ్డగోలుగా ఇసుకను తవ్వేసి కోట్ల రూపాయలు దోచేసిన విషయం అందరికీ తెలిసిందే. దీన్ని నివారించేందుకు ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్న విషయం టీడీపీ నేతలకూ తెలుసు. అందుకే చంద్రబాబునాయుడు ఎంత గొంతు చించుకున్నా సొంత పార్టీ నేతలే స్పందించని దయనీయ పరిస్థితి. ప్రకాశం జిల్లాలో జిల్లా కేంద్రంతోపాటు రెండు రెవెన్యూ డివిజన్లు ఉన్నప్పటికీ ఏ ఒక్కచోట నిరసన దీక్షా శిబిరాలు ఏర్పాటు చేయలేదు. జిల్లా కేంద్రమైన ఒంగోలు నగరంలో సైతం టీడీపీ ఛోటా నేతలు 20 మంది కార్యకర్తలతో కలిసి ఆర్డీఓ కార్యాలయానికి వచ్చి ఆర్డీఓ ప్రభాకర్‌రెడ్డికి వినతిపత్రం ఇచ్చి నిరసన కార్యక్రమాన్ని ముగించారు. జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమానికి ఒంగోలు రెవెన్యూ డివిజన్ పరిధిలోని నియోజకవర్గాలకు పార్టీ బాధ్యులుగా ఉన్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్, మాజీ మంత్రి, ఒంగోలు పార్లమెంట్ టీడీపీ ఇన్చార్జి శిద్దా రాఘవరావు, అద్దంకి, పర్చూరు, చీరాల, కొండపి ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, కరణం బలరాం, డోలా బాల వీరాంజనేయస్వామిలు సైతం ముఖం చాటేశారు. కందుకూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఒక్క కనిగిరి నియోజకవర్గంలో మాత్రం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నర్సింహారెడ్డి తహసీల్దార్ కార్యాలయం వద్ద కొద్దిసేపు నిరసన తెలిపి వెళ్లిపోయారు. అక్కడ మినహా ఏ ఒక్క నియోజకవర్గంలోనూ కనీసం వినతిపత్రం ఇచ్చిన దాఖలాలు కూడా లేవంటే టీడీపీ నేతలకు చంద్రబాబు ఇచ్చిన పిలుపుపై ఎంత గౌరవం ఉందో అర్థం చేసుకోవచ్చు. మార్కాపురం రెవెన్యూ డివిజన్ పరిధిలోని నియోజకవర్గాలకు టీడీపీ బాధ్యులుగా ఉన్న మాజీ ఎమ్మెల్యేలు కందుల నారాయణరెడ్డి, పిడతల సాయికల్పనా రెడ్డిలు మాత్రం మార్కాపురం ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరసన దీక్ష చేపట్టారు. టీడీపీ నేతలు జిల్లాలోని మూడు చోట్ల చేపట్టిన నిరసన కార్యక్రమాలకు ప్రజల నుంచి ఎటువంటి మద్దతు లభించలేదు. ఇసుక కొరత వల్ల భవన నిర్మాణ కారి్మకులు ఇబ్బందులు పడుతున్నప్పటికీ ప్రభుత్వం ఇసుక అక్రమ రవాణా జరగకుండా తీసుకుంటున్న చర్యలను అర్థం చేసుకున్నారు కాబట్టే వారి నుంచి టీడీపీ నేతలకు ఎటువంటి మద్దతు లభించలేదనేది రుజువైంది. టీడీపీ నేతలు తూతూమంత్రంగా నిర్వహించిన నిరసన కార్యక్రమాలకు సొంతపార్టీ నేతలే డుమ్మా కొట్టడం చూస్తుంటే ఇసుక పాలసీపై వారిలో ఎలాంటి అభిప్రాయం ఉందో చెప్పనవసరం లేదు. మొత్తానికి నిరసన కార్యక్రమాలకు టీడీపీ ముఖ్యనేతలంతా గైర్హాజరు కావడంతో ఉన్న పరువు కాస్తా పోయిందని టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ నేత సుజనా చౌదరితో కరణం విందు రాజకీయం బీజేపీ నేత సుజనా చౌదరితో టీడీపీ ఎమ్మెల్యే సాగించిన విందు రాజకీయం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఇసుక సరఫరాపై ప్రభుత్వ తీరుకు నిరసనగా రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో నిరసన దీక్షలు చేపట్టాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన పిలుపు కరణం బలరాం పట్టించుకోలేదు. ఒంగోలు నగరంలోనే ఉన్నప్పటికీ జిల్లా కేంద్రంలో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొనని ఆయన బీజేపీ నేత సుజనా చౌదరితో కలిసి ఒంగోలు నగరంలోని ఓ టీడీపీ నాయకుని ఇంటిలో విందు ఆరగించడంపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు. పార్టీ కార్యక్రమంలో పాల్గొనడానికి లేని తీరిక బీజేపీ నేతతో భోజనం చేయడానికి ఎలా వచ్చిందంటూ ప్రశ్నిస్తున్నారు. భోజనం అనంతరం సుజనా చౌదరితో బలరాం రహస్య మంతనాలు సాగించినట్లు సమాచారం. -
గ్రామీణ స్ధాయిలో ఇసుక సరఫరాకు చర్యలు
-
నిత్యం 45 వేల టన్నుల ఇసుక సరఫరా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతిరోజూ 45 వేల టన్నుల ఇసుకను సరఫరా చేస్తున్నట్టు గనులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. భవన నిర్మాణ కార్మికుల ఉపాధి దెబ్బతినకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. మైనింగ్ శాఖ కార్యదర్శి రామ్ గోపాల్‌తో కలిసి ఆయన మంగళవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. కృష్ణా, గోదావరి నదుల్లో నెలల తరబడి వరద ప్రవాహం కొనసాగుతుండడం వల్ల ప్రధానమైన రీచ్‌ల నుంచి అనుకున్నంత ఇసుక సరఫరా జరగడం లేదని ప్రభుత్వం దృష్టికి వచ్చిందని చెప్పారు. దీన్ని అధిగమించేందుకు ప్రత్యామ్నాయ ఇసుక రీచ్‌లను గుర్తిస్తున్నామని అన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంకా ఏం చెప్పారంటే... ‘‘గత పదేళ్లుగా నెలకొన్న వర్షాభావ పరిస్థితులకు భిన్నంగా ఈ ఏడాది రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా నదిలో 70 రోజులుగా, గోదావరిలో 40 రోజులుగా వరద కొనసాగుతుంది. నదుల్లో రీచ్‌లు వరదతో నిండిపోతే ఇసుకను తవ్వితీయడం ఎలా సాధ్యం? దీన్ని కూడా ప్రతిపక్షాలు రాజకీయం చేయడానికి వాడుకోవడం సమంజసం కాదు. రాష్ట్రంలో నూతన ఇసుక పాలసీ ప్రకటించిన తరువాత ప్రారంభంలో 5 వేల టన్నుల ఇసుక సరఫరాకు అవకాశం ఉండగా, దాన్ని ఇప్పుడు 45 వేల టన్నులకు పెంచగలిగాం. వరద ప్రవాహం వల్ల నదులు, వాగుల్లో ఇసుక తవ్వే అవకాశం లేకపోవడం వల్ల ప్రత్యామ్నాయంగా పట్టా భూముల్లో మేట వేసిన ఇసుకను సేకరిస్తున్నాం. ఇందుకోసం టన్నుకు రూ.100 చొప్పున చెల్లిస్తామని భూయజమానులతో ఒప్పందాలు చేసుకుంటున్నాం. ఇప్పటికే 82 మంది పట్టా భూముల యజమానులు ఇసుక తవ్వకాల కోసం ఒప్పందాలు చేసుకున్నారు. 10 పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలకు అనుమతి కూడా ఇచ్చాం. మరో 15 రోజుల్లో ఇసుక కొరత లేకుండా అడిగిన వారందరికీ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ‘క్రెడాయ్’కి 50 వేల టన్నుల ఇసుక అందించాం కొత్త ఇసుక పాలసీ అమల్లోకి వచ్చిన తర్వాత గత 30–40 రోజుల్లో ఇసుక కోరుతూ దరఖాస్తు చేసుకున్న వారికి 6 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక సరఫరా చేశాం. రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(క్రెడాయ్) ప్రతినిధులతో మాట్లాడి, వారి అవసరాలకు మరో 50 వేల టన్నుల ఇసుక అందించాం. నిర్మాణ రంగ సంఘాలతో సమావేశాలు నిర్వహించి, వారి అవసరాలు ఎంత, ఏ మేరకు ఇసుకను అందించాలి అనేదానిపై అవగాహనకు వచ్చాం. ఆదాయం పోయిందనే అక్కసుతోనే... నదుల్లోని ఇసుకను యథేచ్ఛగా దోచుకున్న తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పుడు అధికారం, ఆదాయం పోయిందనే అక్కసుతోనే ఇసుక లభ్యతపై రాజకీయం చేస్తున్నారు. సాధారణంగానే వర్షాకాలంలో భవన నిర్మాణ రంగంలో పనులు నెమ్మదిస్తాయి. నదుల్లోని ఇసుకను టీడీపీ నాయకులు విచ్చలవిడిగా దోచుకున్న ఫలితంగా కృష్ణా నదిలో ఇసుక గోతుల్లో ఓ బోటు మునిగి చాలామంది మరణించారు. ఇసుక దోపిడీపై గ్రీన్ ట్రిబ్యునల్ చంద్రబాబు ప్రభుత్వానికి ఏకంగా రూ.100 కోట్ల జరిమానా కూడా విధించింది. అలాంటి తప్పుడు విధానాలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకం. ఎంశాండ్ యూనిట్లకు ప్రోత్సాహం రాష్ట్రంలో ఇసుకకు ప్రత్యామ్నాయంగా కంకర నుంచి తయారుచేసే ఎంశాండ్ యూనిట్లకు ప్రోత్సాహాన్ని అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ఉన్న మెటల్ క్వారీల్లో ఎంశాండ్ యూనిట్లు నెలకొల్పే వారికి పావలా వడ్డీకి రుణాలు అందించాలన్న ప్రతిపాదనను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిశీలిస్తున్నారు’’ అని మంత్రి వివరించారు. భవిష్యత్తులో ఇసుక కొరతే రాదు తాజా వరదల కారణంగా నదుల్లో దాదాపు 10 కోట్ల టన్నుల ఇసుక చేరింది. సాధారణంగా రాష్ట్రంలో ఏటా 2 కోట్ల టన్నుల ఇసుక మాత్రమే వినియోగిస్తున్నారు. అంటే మరో ఐదేళ్లకు సరిపడా ఇసుక నిల్వలు రాష్ట్రంలో ఉన్నాయి. రాష్ట్రంలో భవిష్యత్తులో ఇక ఇసుక కొరతే ఉండదు. మరో పదిహేను రోజుల్లో వరదలు తగ్గుముఖం పడతాయని భావిస్తున్నాం. వరద నీరు తగ్గగానే రీచ్‌ల నుంచి కావాల్సినంత ఇసుకను వినియోగదారులకు అందజేస్తాం. -
ప్రభుత్వంపై రాళ్లేయడానికి చూస్తున్నారు : సీఎం జగన్
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇసుక విధానంపై సచివాలయంలో బుధవారం సమీక్ష నిర్వహించారు. ‘ఇసుక’లో అవినీతిని అడ్డుకోవడం వల్ల అది సహించలేని కొందరు ప్రభుత్వంపై రాళ్లేయడానికి చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక స్టాక్‌యార్డు పాయింట్లు పెంచాలని, ప్రభుత్వంపై విమర్శలు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. వరద తగ్గగానే రీచ్‌ల నుంచి ఇసుక వీలైనంత త్వరగా స్టాక్ యార్డులకు చేరేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఇసుక మాఫియాను అరికట్టడానికి అవసరమైన సాంకేతిక సహకారం తీసుకోవాలని చెప్పారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా వీలైనంత త్వరగా చర్యలు చేపట్టాలని వెల్లడించారు. ఏ స్ధాయిలో కూడా అవినీతి ఉండకూడదని, అప్రమత్తంగా ఉండాలని అధికారులకు స్పష్టం చేశారు. ఇసుక రవాణా విషయంలో ఇబ్బందులు అధిగమించామా అని అధికారులను ప్రశ్నించారు. ఎక్కడెక్కడ ఇసుక కొరత ఉందో ఆయా ప్రాంతాల్లో నిర్మాణదారులకు సమాచారం ఇవ్వాలన్నారు. అందుకనుగుణంగా నిర్మాణాదారులు ప్లాన్ చేసుకుంటారని చెప్పారు. అక్రమ రవాణాను అడ్డుకోవడానికి అన్ని చెక్ పోస్టుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఫుటేజీని మానిటరింగ్ చేసే వ్యవస్ధ కూడా ఉండాలని అన్నారు. బల్క్ యూజర్ల కోసం ప్రత్యేక స్టాక్ యార్డులు ఏర్పాటు చేసే అంశాలను పరిశీలించాలని అధికారులకు చెప్పారు. ముఖ్యమంత్రికి అధికారుల వివరణ.. ‘వర్షాలు, వరదల కారణంగా ఇసుకను తవ్వడానికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా రీచ్‌ల నుంచి ఇసుకను తీసుకురాలేకపోతున్నాం. కేవలం 25 రీచ్‌ల నుంచి మాత్రమే ఇసుకను తీయగలుగుతున్నాం. నదుల పక్కన తవ్విన ఇసుక కూడా వరదల కారణంగా కొట్టుకుపోయింది. లంక భూములు కూడా మునిగిపోయాయి. ప్రతిరోజూ పర్యవేక్షిస్తున్నాం. మార్కెట్లో ప్రస్తుతం 23 వేల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వలు అందుబాటులో ఉన్నాయి. నూతన ఇసుక విధానం (సెప్టెంబర్ 5) మొదలైనప్పటి నుంచి మొదటి మూడురోజులు పరిశీలిస్తే.. రోజుకు 10 నుంచి 12 వేల మెట్రిక్ టన్నుల ఇసుక డిమాండ్ ఉంది. సిమెంట్ కొనుగోళ్ల ఆధారంగా ఇసుక డిమాండ్‌ను పరిగణలోకి తీసుకుంటున్నాం. రవాణా విషయంలో 90 శాతం వరకు ఇబ్బందులు లేవు’అని అధికారులు చెప్పారు. -
పారదర్శకంగా ఇసుక పాలసీ
అగనంపూడి (గాజువాక): ప్రభుత్వం నిర్ణయించిన ధరకు, సామాన్యులకు అందుబాటులో ఉండేలా ఇసుక పాలసీ రూపొందించారని మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. ఇసుక దోపిడీని అరికట్టి, పాలసీ ప్రకారం పారదర్శకంగా అందిస్తామన్నారు. అగనంపూడి క్యాన్సర్ ఆస్పత్రికి సమీపంలో ఏర్పాటు చేసిన ఇసుక రీచ్‌ను గురువారం ఆయన ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ ఐదేళ్లలో ఇసుక మాఫి యా వేల కోట్లు దోచుకుందని, ప్రస్తుత విధా నం బకాసురులకు మింగుడు పడడం లేదన్నారు. ఇసుక పాలసీ చారిత్రాత్మకమైందన్నారు. నేటి నుంచి ఇసుకకు కొరత డదని, ఆన్లైన్లో బుక్ చేసుకున్న ప్రతీ ఒక్కరికీ వారి ఇంటికే నాణ్యమైన ఇసుక చేరుతుందన్నారు. 15 రోజుల్లో మరో మూడు డిపోలు ఇసుక పాలసీని పకడ్బందీగా తయారు చేయడం వల్ల కొంత జాప్యం జరిగిందని, దీన్ని కూడా రాజకీయం చేయాలని తెలుగుదేశం చూడడం దుర్మార్గమన్నారు. ప్రస్తుతం నగర పరిధిలో రెండు రీచ్‌లు (డిపో)లను ప్రారంభించామన్నారు. రూరల్ ప్రాంతంలో మరో పక్షం రోజుల్లో మూడు చోట్ల ఇసుక డిపోలు ప్రారంభించనున్నట్లు చెప్పారు. పాయకరావుపేట, చోడవరం, నర్సీపట్నంలలో వీటిని ఏర్పాటు చేయనున్నామన్నారు. ఇసుక అందుబాటులో తేవడంతో పాటు పర్యావరణాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని ఈ విధానం రూపొందించామన్నారు. ఇసుక డిపోల వద్ద ప్రభుత్వ ధర కంటే అధికంగా ఒక్క రూపాయి కూడా డిమాండ్ చేయడానికి వీల్లేదన్నారు. సంక్షేమమే అజెండాగా జగన్ పాలన అవినీతి రహిత సమాజ నిర్మాణానికి ముఖ్య మంత్రి జగన్ కంకణం కట్టుకున్నారన్నారు. వంద రోజుల జగన్ పాలన అన్ని వర్గాల సంక్షేమమే అజెండాగా సాగిందన్నారు. దీంతో ప్రతిపక్షాలకు పనిలేక పసలేని, ఆరోపణలు చేస్తూ ప్రభుత్వాన్ని ఏదో విధంగా ఇరుకున పడేయాలని చూస్తూ.. వారే ఇరుకున పడుతున్నారన్నారు. ఈ విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, వైఎస్సార్సీపీ నాయకులు ఎవరూ జోక్యం చేసుకోవద్దని ముఖ్యమంత్రి హెచ్చరించారన్నారు. ఆన్లైన్లో బుక్ చేస్తే ఇంటికే రవాణా: కలెక్టర్ కలెక్టర్ వినయ్‌చంద్ మాట్లాడుతూ నేటి నుంచి ఇసుక కోసం ప్రజలు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదన్నారు. ఆన్లైన్లో వివరాలు నమోదు చేసుకుని చెల్లింపులు చేస్తే ఇంటికి ఇసుకను రవాణా చేసేలా నిర్ణయం తీసుకున్నామన్నారు. కార్యక్రమంలో గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాసరావు, 56వ వార్డు నాయకులు వి.వి.ఎన్.ఎం.రాజు, జి.పూర్ణానందశర్మ (పూర్ణ), ఇల్లపు ప్రసాద్, నక్కా రమణబాబు, ఏదూరి రాజేష్, పచ్చికోరు రమణమూర్తి, మా మిడి శ్రీను, ప్రగడ వేణుబాబు, సీహెచ్.రమణ, దుగ్గపు దానప్పలు తదితరులు పాల్గొన్నారు. పుష్కలంగా ఇసుక నిల్వలు ,ఆన్లైన్, మీ సేవ కేంద్రాల ద్వారా నమోదు మహారాణిపేట(విశాఖ దక్షిణం): సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఇసుక కష్టాలు లేకుండా పుష్కలంగా ఇసుక నిల్వలు సిద్ధం చేశారు. చినగదిలి మండలం ముడసర్లోవ ఇసుక నిల్వ కేంద్రం, గాజువాక మండలం అగనంపూడి(ఇ.మర్రిపాలెం) వద్ద ఇసుక నిల్వ కేంద్రం ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఇసుక కోసం ఆన్లైన్ లేదా మీ సేవ కేంద్రాల ద్వారా సంప్రదించాలి. మొత్తం 2,397 టన్నుల ఇసుకకు అందుబాటులో ఉంచారు. ఇ.మర్రిపాలెం వద్ద 1623 టన్నులు, ముడసర్లోవ వద్ద 774 టన్నుల ఇసుక సిద్ధంగా ఉంది. డిపోల్లో టన్ను ఇసుకకు 375 రూపాయలు చెల్లించాలి. ఇసుక డిపోల వరకు రవాణా నిమిత్తం టన్నుకు ఒక కిలోమీటర్ నాలుగు రూపాయల 90 పైసలుగా నిర్ణయించారు. ఆన్లైన్ బుకింగ్ ఇసుక కోసం www.sand.ap.gov.in ఆన్లైన్ ద్వారా సంప్రదించాలి. లేకపోతే సమీపంలో ఉన్న మీ సేవ కేంద్రంలో కూడ ఇసుక కోసం సంప్రదించవచ్చని మైనింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ తెలిపారు. ఈ కేంద్రాల్లో ఆధార్ నం బరు, చిరునామా, మొబైల్ నంబర్ రిజిస్టర్ చేసుకుని, ఆన్లైన్ చెల్లింపుల ద్వారా మొబైల్ ఓచర్‌ను పొంది ఇసుకను నిర్ణయించిన ఇసుక డిపోల వద్ద నుంచి పొందాలని ఏడీ తమ్మినాయుడు కోరారు. -
కొత్త ఇసుక పాలసీ..
ప్రభుత్వం ప్రకటించిన కొత్త ఇసుక పాలసీ గురువారం నుంచి అమలులోకి రానుంది. జిల్లాలో ఇప్పటికే ఆరు స్టాక్‌పాయింట్లు ఏర్పాటు చేసి అక్కడి నుంచి ఇసుకను వినియోగదారులకు సులభంగా అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఇసుకను స్టాక్పాయింట్లకు తరలిస్తున్నారు. దీని కోసం రవాణా ధరలు కూడా నిర్ణయించారు. సాక్షి, ఏలూరు(పశ్చిమ గోదావరి) : కొత్త ఇసుక పాలసీ ప్రకారం ఇసుక అందించేందుకు అన్ని ఏర్పాట్లూ చేసినట్లు జాయింట్ కలెక్టర్ ఎం.వేణుగోపాలరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. బుధవారం క్యాబినెట్ సమావేశం తర్వాత దీనికి సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వం విడుదల చేయనున్నదని ఆయన వెల్లడించారు. గోదావరి ర్యాంపుల నుంచి ఇసుకను బయటకు తీసిన తర్వాత అక్కడి నుంచి నేరుగా జిల్లాలో వేర్వేరు ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన ఆరు స్టాక్ పాయింట్లకు తరలిస్తారు. పోలవరం, తాళ్లపూడి మండలం బల్లిపాడు, కొవ్వూరు మండలం కాపవరం, ఏలూరు నగరం, కరుగోరుమిల్లి, చించినాడ సమీపంలోని ఇలపర్రులో స్టాక్‌పాయింట్లు ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతాలకు ఇప్పటికే ఇసుకను తరలించే ప్రక్రియ మొదలు పెట్టారు. ప్రస్తుతం జిల్లాలో మూడు రకాల ఇసుక అందుబాటులో ఉంది. ఒకటి ఓపెన్ రీచ్‌ల ద్వారా, రెండు బోట్ల ద్వారా డీసిల్టింగ్ చేయడం, మూడు రైతుల పొలాల్లో మేట వేసిన ఇసుకను తవ్వడం. అయితే ప్రస్తుతం గోదావరి వరద కారణంగా ఓపెన్ రీచ్‌లు, రైతుల పొలాల్లో నీరు ఉండటం వల్ల తవ్విన ఇసుక అందుబాటులో లేదు. పడవల్లో డీసిల్టింగ్ చేసిన ఇసుక మాత్రమే అందుబాటులో ఉంది. ఇలాంటివి జిల్లాలో 15 రీచ్‌లు ఉండగా, 11 రీచ్‌లు పనిచేస్తున్నాయి. వినియోగదారులకు అందేదిలా.. బోట్లలో నుంచి తీసుకువచ్చిన ఇసుకను ముందుగానే ఏర్పాటు చేసిన వాహనాల ద్వారా స్టాక్ పాయింట్లకు తరలిస్తారు. కొత్త పాలసీ వచ్చిన తర్వాత విధివిధానాలు వస్తాయి. మీసేవా ద్వారా, లేకపోతే వెబ్సైట్ ద్వారా ఇసుక బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ చేసిన తర్వాత సరఫరా చేస్తారు.ఎవరైనా ఇసుక తమ వాహనాల్లో ఇసుక తీసుకువెళ్తామంటే ఆ విధంగా కూడా అనుమతిస్తారు. లేనిపక్షంలో ప్రభుత్వం రిజిస్టర్ చేసిన వాహనాల ద్వారా ఇసుకను పంపిస్తారు. ఇసుక తవ్వకాలు, రవాణాలో ఎటువంటి అక్రమాలూ జరగకుండా అన్ని రీచ్‌లు, స్టాక్ యార్డుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా ఇసుక తరలించే వాహనాలను నిరంతరం ట్రాకింగ్ చేయడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా జీపీఎస్ పరికరాలు అమర్చిన వాహనాలను మాత్రమే ఇసుక రవాణాకు అనుమతించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వాహనాలను కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షించనుంది. జీపీఎస్ పరికరాలు అమర్చుకుని భూగర్భ గనుల శాఖలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాహనాలన్నింటికీ స్టాక్ యార్డుల నుంచి వినియోగదారులు కోరిన చోటకు ఇసుక రవాణా చేసే అవకాశం కల్పించనున్నారు. ఇప్పటికే జిల్లాలో 250 వాహనాలను యజమానులు ఇసుక తరలించేందుకు రిజిస్టర్ చేయించుకున్నారు. రవాణాకు ధర నిర్ధారణ ఇసుక రవాణాకు కిలోమీటరుకు రూ.4.90 ధర నిర్ణయించారు.15 కిలోమీటర్లలోపు ఉంటే ఈ ధర గిట్టుబాటు కానందున దాని కోసం వేరే ధర నిర్ణయించనున్నారు. 15 కిలోమీటర్లు దాటిన ప్రాంతాలకు ఈ ధరనే నిర్ణయిస్తారు. స్టాక్ యార్డు నుంచి దూరాన్ని బట్టి రేటు ఉంటుంది. అన్ని స్టాక్ యార్డుల వద్ద టన్ను ఇసుక రూ.375కే సరఫరా చేస్తారు. అయితే ఏలూరు స్టాక్ యార్డు రేటులో మాత్రం ధర తేడా ఉంటుంది. రూ.375 తో పాటు గోదావరి నుంచి ఏలూరుకు సుమారు 85 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ వరకూ రవాణాకు అయిన వ్యయాన్ని కూడా వినియోగదారుడు చెల్లించాల్సి ఉంటుంది. -
'కొత్త పాలసీ ప్రకారం ఇసుకను అందిస్తాం'
సాక్షి, అమరావతి : ఇసుక పాలసీకి సంబంధించి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంగళవారం 13 జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 5న సీఎం జగన్ ఇసుక తవ్వకానికి సంబంధించి కొత్త పాలసీని ప్రకటిస్తారని తెలిపారు. ప్రజలకు నాణ్యమైన ఇసుకను అందించేందుకు 100 రీచులను గుర్తించినట్లు పేర్కొన్నారు. 5వ తేది నుంచి స్టాక్ యార్డుల ద్వారా ఇసుకను సరఫరా చేస్తామని మంత్రి పెద్దిరెడ్డి వెల్లడించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో వివిధ జిల్లాల కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
నూతన ఇసుక పాలసీ అమలుకు ప్రభుత్వం సిద్ధం
సాక్షి, అమరావతి: ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు నూతన ఇసుక పాలసీను అమలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికలను రూపొందిస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త ఇసుక పాలసీ అమలుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. ఈ మేరకు రాష్ట్రంలో మొత్తం 102 ఇసుక రీచులను ప్రభుత్వం సిద్ధం చేసింది. 57 ఇసుక స్టాక్ పాయింట్లను అధికారులు సిద్ధం చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇసుక నిల్వలు స్టాక్ పాయింట్లకు చేరుతున్నాయి. వచ్చే నెల 5వ తేదీ నుంచి ఇసుక సరఫరా చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాల వారిగా... శ్రీకాకుళం 6, విజయనగరం 2, విశాఖ 2, తూర్పుగోదావరి 13, పశ్చిమగోదావరి 5, కృష్ణా జిల్లా 6, గుంటూరు జిల్లాలో 4 ఇసుక స్టాక్ యార్డులు, ప్రకాశం 3, నెల్లూరు 6, కడప 4, చిత్తూరు 2, అనంతపురం 3, కర్నూలు జిల్లాలో 2 స్టాక్ యార్డులు ఏర్పాటు చేశారు. ఆన్లైన్లో ఇసుకను బుక్ చేసుకోగానే సరసమయిన ధరకు సరఫరా చేసేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. -
‘అభ్యర్థులు దళారులను నమ్మి మోసపోవద్దు’
సాక్షి, అమరావతి : సెప్టెంబర్ 1 నుంచి 8 వరకు జరిగే సచివాలయ పరీక్షల కోసం అన్ని ఏర్పాటు పూర్తి చేశామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. పరీక్షల నిర్వహణ కోసం 5,114 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అభ్యర్థులు దళారులను నమ్మొద్దని సూచించారు.మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సచివాలయ పరీక్షలు పారదర్శకంగా నిర్వహిస్తామని చెప్పారు. ఓఎమ్ఆర్ షీట్లను జిల్లాలకు తరలిస్తున్నామని తెలిపారు. పరీక్షల కోసం ప్రతి జిల్లాలో స్ట్రాంగ్ రూమ్‌లను ఏర్పాటు చేశామని వివరించారు. ‘అక్టోబర్ 2 నుంచి గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయబోతున్నాం. సచివాలయ పరీక్షల నిర్వాహణ ప్రక్రియ సీఎంవో పర్యవేక్షిస్తోంది. సమాధాన పత్రాలను నాగార్జున యూనివర్సీటీకి తరలించి స్కానింగ్ చేస్తారు. పరీక్షల కోసం హాల్ టికెట్‌తో పాటు గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకురావాలి. అభ్యర్థుల కోసం ఆర్టీసీ సౌకర్యం కూడా ఏర్పాటు చేశాం. దివ్యాంగులకు అదనపు సమయం కేటాయిస్తాం. ఈ పరీక్షలు పారదర్శకంగా నిర్వహిస్తున్నాం. చాలా మంది దళారులు రూ.5 లక్షలు ఇస్తే ప్రశ్నాపత్రం ఇస్తామని డబ్బులు వసూలు చేస్తున్నారు. వారిని నమ్మి అభ్యర్థులు మోస పోవద్దు. దళారులపై నిఘా పెట్టాం.. ఎక్కడ తప్పు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం’ అని మంత్రి వివరించారు. సెప్టెంబర్ 5నుంచి ఇసుక పాలసీ అమల్లోకి వస్తుందని మంత్రి తెలిపారు. కొత్తపాలసీని తప్పుదోవ పట్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏపీఎండీసీ ద్వారానే ఇసుక పాలసీ అమలు చేస్తామని మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. -
సెప్టెంబర్ 5 నుంచి ఏపీలో నూతన ఇసుక పాలసీ
సాక్షి, విజయవాడ : సెప్టెంబర్ 5 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో నూతన ఇసుక పాలసీ రానుందని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఇసుక కొరతపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జోగి రమేష్, వసంత కృష్ణా ప్రసాద్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ.. ఇసుక కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇల్లు నిర్మించుకునే వారికి ప్రధమ ప్రాధాన్యత ఇస్తామన్నారు. ప్రభుత్వం ఇసుకను స్టాక్ పాయింట్స్ ద్వారా ఇవ్వడం జరుగుతుందని వెల్లడించారు. ఎవరికైనా ఇసుక కావాలంటే సంబంధిత తహసీల్ధార్ కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు. ఈ నెల 19 నుంచి కొత్త పాలసీ వచ్చే వరకు ఇదే విధానం అమలు జరుగుతుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం జిల్లాలో తోట్ల వల్లూరు ఇసుక రిచ్ మాత్రమే తెరిచి ఉంటుందని తెలిపారు. -
మన ఇసుకకు డిమాండ్
సాక్షి, కరీంనగర్ క్రైం: రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణాల్లో కీలకంగా వినియోగించే ఇసుకకు భారీ డిమాండ్ ఉంది. దీనిని ఆసరాగా చేసుకుని కొందరు అక్రమార్కులు ఇసుకను అక్రమంగా రవాణా చేస్తూ కోట్లాది రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. దీంతో పేద, మధ్యతరగతి ప్రజలకు ఇసుక అందకుండా పోతోంది. ఈ నేపథ్యంలో సామాన్యులకు సైతం ఇసుకను అందుబాటులోకి తీసుకుని రావానే ఉద్దేశంతో నూతన సాండ్ టాక్స్ పాలసీని ప్రవేశపెట్టింది. అయితే అది విజయవంతం కాకపోవడంతో కొన్ని మార్పులు చేసి కొత్తగా ‘మన ఇసుక వాహనం’ పేరుతో కొత్తపాలసీని తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(టీఎస్ఎండీసీ) అందుబాటులోకి తీసుకుని వచ్చారు. ఈనెల 1వ తేదీ నుంచి ప్రారంభమైన నూతన విధానానికి జిల్లా వ్యాప్తంగా మంచి స్పందన వస్తోంది. పది రోజుల్లోనే కొత్త పాలసీ ద్వారా ప్రభుత్వానికి రూ.16 కోట్ల ఆదాయం సమకూరింది. అంతా ఆన్లైన్లో.. మన ఇసుక వాహనం పాలసీ ప్రకారం ఇసుక విక్రయాలన్నీ ఇక ఆన్లైన్ ద్వారా జరుగుతాయి. ఇందుకోసం టీఎస్ఎండీసీ అధికారులు మన ఇసుక వాహనం పేరుతో వెబ్సైట్ కూడా రూపొందించారు. ఇసుక కావాల్సిన వారంతా ఈ వెబ్సైట్ ద్వారానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. కాగా, ఇసుక తరలించే వాహనాలు కూడా ముందుగానే అధికారుల నమోదు చేసుకుంటున్నారు. నమోదు చేసిన వాహనాల్లో మా త్రమే ఇసుక తరలించేందుకు అనుమతి ఇస్తారు. ట్రాక్టర్ల రిజిస్ట్రేషన్ షురు.. మన ఇసుక వాహనం విధానం ద్వారా ఇసుక లబ్ధిదారుడికి రవాణ చేయడానికి ట్రాక్టర్ల రిజిస్ట్రేషన్ పక్రియ ఈనెలలోనే ప్రారంభించారు. ఇప్పటికే ఆయా మండలాల తహసీల్దార్లకు విధివిదాలను అందజేశారు. ట్రాక్టర్‌ను నమోదు చేసుకునే వారు ఆన్లైన్లో లేదా తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తులు నింపడంతోపాటు రూ.15 వేలు డీడీ తీసి దరఖాస్తుతోపాటు వాహనపత్రాలు, ఆధార్, బ్యాంక్‌ఖాతా, ఒప్పందం పత్రం ఇవ్వాలి. వాటిని కార్యాలయంలో ఆన్లైన్లో నమోదు చేస్తారు. ఒకవేళ ట్రాక్టర్ యాజమాని పాలసీ నుంచి తప్పుకుంటే డిపాజిట్ ఉంచిన రూ.15 వేలు తిరిగి చెల్లిస్తారు. మన ఇసుక వాహనం పద్ధతితో ట్రాక్టర్ యాజమానులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇసుక రవాణ చేయవచ్చు. ఇప్పటి వరకు వివిధ ప్రాంతాల నుంచి 3,559 ట్రాక్టర్లు వారి వివరాలు నమోదు చేసుకున్నారు. ప్రభుత్వం నుంచే అద్దె.. ట్రాక్టర్ యాజమానులకు ఇసుక రావాణా చేసినందుకు అద్దెను ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఇందుకు కిలోమీటర్‌కు రూ.65 చెల్లించాలని నిర్ణయించింది. ఇందులో డిజిల్‌కు రూ.15, ట్రాన్స్‌ఫొర్ట్ కింద రూ.50 ఉంటాయి. ఇవే కాకుండా ట్రాక్టర్లో ఇసుక నింపడానికి రూ.250, 5 కిలోమీటర్ల వరకు అన్ని పన్నులు కలుపుకుని రూ.వెయ్యి చెల్లిస్తుంది. ఇలా దూరాన్ని బట్టి రుసుం పెరుగుతుంది. నెల కాగానే యాజమానికి చెల్లించాల్సిన రుసుం వారి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. ఈ విధానంలో ఒక క్యూబిక్ మీటర్ ఇసుక రూ.900 నుంచి రూ.1000 వరకూ ధర పలుకుతుంది. ఒక ట్రాక్టర్లో సుమారు మూడు క్యూబిక్ మీటర్ల «ఇసుక పడుతుంది. మూడు క్యూబిక్ మీటర్ల ఇసుక ట్రాక్టర్‌కు సుమారు రూ.2800 వరకూ ధర ఉంటుంది. జిల్లాలో గుర్తించిన ఇసుక రీచ్‌లు ఇవే.. కరీంనగర్ జిల్లాలో స్థానిక అవసరాల కోసం ఏడు ఇసుక రీచ్‌లను అధికారులు గుర్తించారు. ఇందులో జమ్మికుంట మండలం తణుగుల, వీణవంక మండలం కురిక్యాల, కరీంనగర్ మండలం చేగుర్తి, మానకొండూరు మండలం లింగాపూర్, వెల్ది, తిమ్మాపూర్ మండలం నేదునూర్, కొత్తపల్లి మండలం ఐనవానిపల్లె గ్రామాల్లో ఇసుకరీచ్‌ను గుర్తించి సిద్ధం చేశారు. పక్కాగా అమలు.. గతేడాది అమల్లోకి తీసుకుని వచ్చిన సాండ్ టాక్స్ పాలసీ విజయవంతం కాలేదు. దీంతో మన ఇసుక వాహనం పాలసీని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా యంత్రంగం నిర్ణయిం చింది. ఇప్పటికే కలెక్టర్‌తోపాటు జేసీ, పలువురు అధికారులతో సమావేశాలు నిర్వహించారు. కలెక్టర్ ఆదేశాలతో మైనింగ్, పోలీసులు, రెవెన్యూ, ఆర్టీఏ అధికారుల సహకారంతో పకడ్బందీగా అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా ట్రాక్టర్ యాజమానులకు అవగాహన కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. మన ఇసుక వాహనం పాలసీ అమల్లోకి వస్తే నాణ్య మైన ఇసుక తక్కువ ధరకే లభిస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఇసుక ట్రాక్లర్ల ద్వారా నిర్భయంగా ఇసుక రవాణ చేయడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. బుకింగ్ ప్రారంభం మన ఇసుక వాహనం వెబ్సైట్లో ఇప్పటి వరకు 3,559 ట్రాక్టర్లు వారి వివరాలు నమోదు చేసుకున్నారు. 23,894 మంది ఇసుక కోసం బుకింగ్ చేసుకున్నారు. 22,202 మందికి ఇప్పటికే ఇసుక డెలివరీ చేశారు. 75,573 ట్రిప్పుల ఇసుక రవాణ చేయగా వీటిలో ట్రాక్టర్ల ద్వారా 70,995 ట్రిప్పులు రవాణ చేశారు. వీటి ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ.16.65 కోట్ల ఆదాయం వచ్చింది. బుకింగ్ ఇలా.. ఇసుక కావాల్సిన వారు ఆన్లైన్లో మన ఇసుక వాహనం అనే వెబ్‌సైట్‌కు వెళ్లి క్లిక్ చేస్తే మన ఇసుక వాహనం మెనూ ఒపేన్ అవుతుంది. అందులో మొదట మన మొబైల్ నంబర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత సైట్లోకి వెళ్లి మన వివరాలు నమోదు చేసి ఎక్కడికి, ఎప్పుడు, ఎంత ఇసుక కావాలో వివరాలు నమోదు చేస్తే చివర ఎంత ధర చెల్లించాల్లో కనిపిస్తుంది. దానికి వివిధ పద్ధతులు నెట్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్‌కార్డు, పేమెంట్ యాప్ ద్వారా చెల్లింపులు చేయవచ్చు. కావాల్సిన ఇసుక ట్రాక్టర్లకు చెల్లింపులు చేసిన తర్వాత మన మొబైల్‌కు ఒక ఓటీపీ నంబర్ వస్తుంది. దానిని భద్రపర్చుకోవాలి మన ఇసుక రవాణ చేసిన వ్యక్తికి ఆ ఓటీపీ నంబర్ చేబితే ట్రాక్టర్, లారీ డ్రైవర్ తన వద్ద ఉన్న వివరాలతో సరిపోల్చుకుని ఓటీపీని ఎంటర్ చేస్తే రవాణ పూర్తవుతుంది. ఒక వేళ ఓటీపీ చెప్పకపోతే మనకు ఇసుక రవాణ చేయనట్టే భావిస్తారు. ఈ వెబ్సైట్ నిర్వహణను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెస్(సీజీజీ)కి అప్పగించారు. -
ఆన్లైన్ యాప్ ద్వారా ఇంటికే ఇసుక
సాక్షి, అరసవల్లి (శ్రీకాకుళం): కొత్త ఇసుక విధానంపై స్పష్టత వచ్చేసింది. ఆన్లైన్ యాప్ ద్వారానే ఇంటికి ఇసుక వచ్చే అధునాతన విధానం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఈ పారదర్శక విధానాన్ని రానున్న సెప్టెంబర్ 5వ తేదీ నుంచి అమల్లోకి తీసుకొచ్చేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారమే కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. దీంతో వినియోగ ప్రజలతోపాటు అధికారులకు కూడా గత ఇసుక బాధలు తీరినట్లేనని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇసుక మాఫియా దౌర్జన్యాలు లేకుండా పూర్తి సరళీకృత విధానంలో ఇసుకను నేరుగా ఇంటి వద్దకే అందించేలా ప్రణాళికలను సిద్ధం చేశారు. ఇసుకతోపాటు రవాణా వాహనాలను కూడా ఆన్లైన్లో బుక్ చేసుకునేలా సాంకేతికతను అమలు చేయనున్నారు. ఈ వాహనాలకు ప్రత్యేకంగా జీపీఎస్‌ను అమర్చనున్నారు. అలాగే ఇసుక రీచ్‌ల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. దీంతో ఒక్క క్లిక్‌తో అటు ఇసుక మాఫియాకు.. ఇటు అక్రమాలకు చెక్ పెట్టేలా అడుగు పడనుంది. ఇదిలావుంటే రానున్న సెప్టెంబర్ 5 నుంచి కొత్త పాలసీ అమలు కానున్న నేపథ్యంలో అంతవరకు జిల్లాలో ఇసుక వినియోగం, విక్రయాలపై పూర్తి బాధ్యతలను జిల్లా కలెక్టర్‌కు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. పెద్ద నదుల్లో ఇసుక బాధ్యతలు ఏపీఎండీసీకే.. జిల్లాలో పెద్ద నదుల వద్ద ఇసుక వినియోగంపై స్పష్టమైన విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తాజా పాలసీలో పేర్కొంది. ఈమేరకు 4వ ఆర్డర్ స్ట్రీమ్‌లో ఉన్న వంశధార, నాగావళి నదుల తీరంలోని ఇసుక తవ్వకాలు జరిపి, ప్రజలకు సరసమైన ధరకు విక్రయించే బాధ్యతలన్నీ ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృధ్ది సంస్థ (ఏపీఎండీసీ)కు అప్పగిస్తూ జగన్ సర్కార్ నూతన ఇసుక విధానాన్ని ప్రకటించింది. వంశధార, నాగావళి నదుల్లో తవ్విన ఇసుకను ఆయా రీచ్‌లకు సమీపంలో స్టాక్ యార్డుల్లో నిల్వ చేయనున్నారు. అలాగే జిల్లాలో చిన్న నదులైన మహేంద్ర తనయ, బాహుదా నదులు, చిన్న వాగులు, వంకలు నుంచి ఇసుక వినియోగం ఉచితం కానుంది. థర్డ్ ఆర్డర్ స్ట్రీమ్ కింద జిల్లాలో ఉన్న మహేంద్రతనయ, బాహుదా తదితర చిన్న నదులతోపాటు సువర్ణముఖి తదితర గెడ్డలు, వాగులు, వంకల వద్ద ఉన్న ఇసుకను మాత్రం ‘స్థానికులకు’ ఉచితంగా ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా నదీతీరాల్లో ఎటువంటి యంత్రాలను వినియోగించకుండా, ఆయా మండలాల పరిధి దాటి రవాణాకు అవకాశాలు ఇవ్వకుండా.. ఇసుకను స్థానికులు, ముఖ్యంగా పేద, సామాన్య వర్గాలకు మాత్రమే తమ సొంత గృహ నిర్మాణ అవసరాలకు తోడ్కొనేలా కఠిన నిబంధనలను అమలు చేయనున్నారు. అలాగే జిల్లాలో గిరిజన ప్రాంతాల్లో ఇసుక తరలింపు కోసం పంచాయతీరాజ్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్ ఏరియాస్ (పీసా) చట్టం కచ్చితంగా అమలు కానుంది. ఇక్కడి ఇసుకపై పూర్తి హక్కులను స్థానిక గిరిజనులకు చెందిన సొసైటీలకే కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. చౌకగా..సరళంగా అందేలా...! గత చంద్రబాబు ప్రభుత్వం అమలు చేసిన ‘ఉచిత ఇసుక విధానం’తో.. కేవలం టీడీపీ నేతలకు ప్రధాన ఆదాయ వనరుగా మార్చేసి, అక్రమంగా కోట్లు కూడబెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇలా గత ప్రభుత్వ విధానాలతో నిత్యం అవస్థలు పడ్డ ప్రజలకు.. ప్రస్తుత జగన్ ప్రభుత్వంలో మాత్రం అలాంటి కష్టాలు లేకుండానే సరసమైన ధరకే ఇసుక చెంతకు వచ్చేలా కొత్త పాలసీని రంగంలోకి దించారు. ఇసుకను బుక్ చేసుకునేందుకు ప్రత్యేకంగా యాప్, పోర్టల్‌ను కూడా ఏర్పాటు చేశారు. దీంతో ఇసుక ఎంత అవసరమో..ఎక్కడికి..ఏ వాహనంలో చేర్చాలో..అన్న వివరాలతో ఆన్లైన్లో ఒక్క క్లిక్ చేసి, నిర్ణీత ధరను ఆన్లైన్లో చెల్లించగానే ఎంచక్కా మీ ఇంటికే నేరుగా చేరేలా అవకాశమొచ్చింది. ఈ ఇసుక నిల్వల కోసం ప్రత్యేకంగా రీచ్‌ల వద్ద స్టాక్ యార్డులను ఏర్పాటు చేయనున్నారు. ఈమేరకు త్వరలోనే ధరలను త్వరలోనే ప్రకటించనున్నారు. -
ఏపీలో ఇంటి నుంచే ఇసుక బుకింగ్
ఇసుక కావాల్సిన వారు బుకింగ్ కోసం ఏపీఎండీసీ శాండ్ పోర్టల్‌ను క్లిక్ చేస్తే చాలు సమగ్ర వివరాలు ఉంటాయి. రాష్ట్రంలోని ఏయే స్టాక్ యార్డుల్లో ఎంతెంత ఇసుక నిల్వ ఉందో కూడా అందులో కనిపిస్తుంది. సమీప ప్రాంతంలోని స్టాక్ యార్డు నుంచి ఇసుక సరఫరా కోసం బుక్ చేసుకోవచ్చు. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇసుక కోసం ఇక మాఫియా గ్యాంగులను ఆశ్రయించాల్సిన అవసరం లేదు. అక్కడ ఎంత ధర ఉంది? ఇక్కడ ఎంత రేటు ఉంది? అని వాకబు చేయాల్సిన అవసరమూ లేదు. రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ఇకపై ఇసుకను సరసమైన ధరలకు అందించనుంది. రాష్ట్రంలో ఎక్కడకు ఇసుక కావాలన్నా ఆన్లైన్లో బుక్ చేసుకుంటే చాలు నేరుగా కోరిన ప్రాంతానికే సరఫరా చేసే ఏర్పాట్లను ఈ సంస్థ చేస్తుంది. ఏపీఎండీసీ శాండ్ పోర్టల్‌లోకి వెళ్లి రాష్ట్రంలోని ఏ ప్రాంతం నుంచి అయినా ఇసుకను బుక్ చేసుకోవచ్చు. ఈ మేరకు ప్రభుత్వం ఇసుక సరఫరాకు కొత్త విధాన ముసాయిదా (పాలసీ) రూపొందించింది. గత అయిదేళ్లుగా టీడీపీ నాయకులు సాగిస్తున్న ఇసుక మాఫియాకు చెక్ పెట్టడం, ప్రజలపై ఎలాంటి అదనపు భారం పడకుండా ప్రభుత్వ రాబడి పెంచడం లక్ష్యంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కారు పాత పాలసీని రద్దుచేసి కొత్త పాలసీ రూపొందించింది. ప్రజలకు పారదర్శక సుపరిపాలనే అజెండాగా పెట్టుకున్న కొత్త ప్రభుత్వం ఇసుక రేవులను ప్రయివేటు వ్యక్తుల కబంధ హస్తాల నుంచి తప్పించి ప్రభుత్వ అధీనంలో ఉంచాలని నిర్ణయించుకుని ఆంధ్రప్రదేశ్ ఇసుక విధానం (ముసాయిదా)– 2019ను రూపొందించింది. దీనిని ముఖ్యమంత్రి పరిశీలనకు పంపించి ఆమోదం పొందనున్నారు. అనంతరం కేబినెట్ ఆమోదంతో జీఓ జారీ చేయడం ద్వారా కొత్త విధానం అమల్లోకి వస్తుంది. చిన్న చిన్న నదుల్లో ఉచితమే చిన్న చిన్న నదులు, వాగుల్లో ఇసుకను ప్రజలు సొంత అవసరాల కోసం ఉచితంగా తీసుకెళ్లవచ్చు. చిన్న చిన్న నదులు (వన్ టు థర్డ్ ఆర్డర్ రివర్ స్ట్రీమ్స్) జిల్లా అధికార యంత్రాంగం పర్యవేక్షణలోనే ఉంటాయి. వీటి నుంచి స్థానిక ప్రజలు సొంత అవసరాలకు ఇసుకను ఉచితంగా తీసుకెళ్లవచ్చు. బలహీన వర్గాల గృహ నిర్మాణ పనులకు కూడా వీటి నుంచి ఉచితంగా ఇసుకను తీసుకెళ్లవచ్చు. పేదల ప్రయోజనార్థం ప్రభుత్వం ఈ వెసులుబాటు కల్పించాలని నిర్ణయించింది. చిన్న తరహా ప్రభుత్వ పనులకు సీనరేజి ఫీజు చెల్లించి వీటి నుంచి ఇసుక తీసుకెళ్లవచ్చు. వీటిలో ఇసుక తవ్వకం, లోడింగ్‌కు యంత్రాలను వినియోగించరాదు. మండల పరిధిలోని పట్టణాలు, గ్రామాలకు మాత్రమే వీటి నుంచి ఇసుకను తీసుకెళ్లవచ్చు. మండలం దాటి ఇసుకను ఈ చిన్న నదుల నుంచి తీసుకెళ్లకుండా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటుంది. పెద్ద నదులన్నీ ఏపీఎండీసీకే కృష్ణా, గోదావరి, తుంగభద్ర, పెన్నా, వంశధార లాంటి పెద్ద నదుల్లో (4, 5, అంతకంటే ఎక్కువ స్థాయి రివర్ స్ట్రీమ్స్‌లో) ఇసుక తవ్వకాలు జరిపి ప్రజలకు సరసమైన ధరకు విక్రయించే బాధ్యతను ప్రభుత్వం ఏపీఎండీసీకి అప్పగిస్తుంది. ఇసుక తవ్వకాలు జరపడానికి చట్టబద్ధమైన, పర్యావరణ, ఇతర అనుమతులన్నీ జిల్లా కలెక్టర్లే తీసుకుంటారు. ఏపీఎండీసీ నోడల్ ఏజెన్సీగా ఉంటూ ప్రజలకు అవసరమైన ఇసుకను అందించే ఏర్పాట్లు చేస్తుంది. రేవుల నుంచి ఇసుకను తవ్వి ప్రజలకు (వినియోగదారులకు) అందించడానికి వీలుగా ఏపీఎండీసీతో ఆయా జిల్లా కలెక్టర్లు ఒప్పందాలు కుదుర్చుకుంటారు. నదుల్లో తవ్విన ఇసుకను సమీపంలో స్టాక్ యార్డుల్లో ఏపీఎండీసీ నిల్వ చేస్తుంది. రాష్ట్రంలో 395పైగా పెద్ద పెద్ద ఇసుక రేవులు ఉన్నాయి. అయితే వీటిలో ప్రస్తుతానికి వందలోపు రీచ్‌లకు మాత్రమే పర్యావరణ, ఇతర చట్టబద్ధమైన అనుమతులు ఉన్నాయి. మిగిలిన వాటికి కూడా ఆయా జిల్లా కలెక్టర్లు పర్యావరణ, మైనింగ్ ప్లాన్, రీచ్ ఏర్పాటు, నిర్వహణ తదితర అనుమతులు తీసుకుంటారు. అన్ని రకాల అనుమతులు ఉన్న క్వారీల సమీపంలో ఏపీఎండీసీ ఇసుక స్టాక్ యార్డులు (నిల్వ కేంద్రాలు) ఏర్పాటు చేస్తుంది. క్వారీల్లో ఇసుక తవ్వకాలు సాగించి స్టాక్ యార్డులకు వాహనాల్లో తరలించేందుకు కాంట్రాక్టర్ల ఎంపిక కోసం ఏపీఎండీసీ టెండర్లు పిలుస్తుంది. ఎలాంటి అక్రమాలకు, ఆశ్రిత పక్షపాతానికి వీలు లేకుండా పూర్తి పారదర్శకంగా ఉండేలా రివర్స్ టెండరింగ్ విధానం అవలంబిస్తుంది. స్టాక్ యార్డుల నుంచి ప్రజలకు ఇసుకను అందించనుంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా ఇలాంటి విధానమే అమల్లో ఉంది. అక్కడ ప్రస్తుతం టన్ను ఇసుక రూ.400 చొప్పున అమ్ముతున్నారు. ఇసుక తవ్వకం, లోడింగ్ తదితరాలకు అయ్యే ఖర్చును దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో కూడా ఇదే ధరను పెట్టాలని అధికారులు ప్రతిపాదించారు. (ప్రభుత్వ తుది నిర్ణయం ప్రకారం ధర మారవచ్చు.) వెబ్సైట్ క్లిక్ చేస్తే... ఇసుక కావాల్సిన వారు బుకింగ్ కోసం ఏపీఎండీసీ శాండ్ పోర్టల్‌ను క్లిక్ చేస్తే చాలు సమగ్ర వివరాలు ఉంటాయి. రాష్ట్రంలోని ఏయే స్టాక్ యార్డుల్లో ఎంతెంత ఇసుక నిల్వ ఉందో కూడా అందులో కనిపిస్తుంది. సమీప ప్రాంతంలోని స్టాక్ యార్డు నుంచి ఇసుక సరఫరా కోసం బుక్ చేసుకోవచ్చు. ఉదాహరణకు కృష్ణా జిల్లా నందిగామ వాసులు ఇసుక కావాలంటే నందిగామ స్టాక్ యార్డు నుంచి బుక్ చేసుకోవచ్చు. దీనివల్ల రవాణా వ్యయం చాలా తక్కువగా ఉంటుంది. డీజిల్ ధర, ఇతర అంశాలను ప్రాతిపదికగా చేసుకుని కిలోమీటరుకు ఇంతని ఏపీఎండీసీ అధికారులే ఇసుక రవాణాకు రేటు నిర్ణయిస్తారు. ఈ ధరతో ఇసుక రవాణా చేసే వాహనాల వారందరికీ ఏపీఎండీసీ ఇసుక సరఫరా పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తారు. ఏ రీచ్ నుంచి ఇసుక కావాలో క్లిక్ చేయగానే ధర వస్తుంది. ఆ మొత్తాన్ని ఆన్లైన్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డు, ఇతర విధానాల ద్వారా నేరుగా రాష్ట్ర ఖజానాకు చెల్లించగానే వారికి ఇసుక బుకింగ్ అయినట్లు రిసీప్ట్ వస్తుంది. ఏపీఎండీసీలో శాండ్ ట్రాన్స్‌పోర్టేషన్ అని క్లిక్ చేస్తే ఎక్కడెక్కడ వాహనాలు ఉన్నాయో (యాప్ ద్వారా ఓలా కార్లు /ఆటోలు బుక్ చేసుకుంటే కనిపించినట్లుగా) కనిపిస్తాయి. సమీపంలోని వాహనాన్ని బుక్ చేసుకుంటే చాలు కోరిన ప్రాంతానికి ఇసుకను తీసుకొస్తుంది. ఇసుక కోసం ఆన్లైన్లో చెల్లించిన మొత్తమంతా ప్రభుత్వ ఖజానాకు చేరుతుంది. క్వారీ నుంచి ఇసుకను స్టాక్ యార్డుకు చేర్చడం లాంటి పనులకు అయిన మొత్తంతోపాటు కొంత సొమ్మును నిర్వహణ ఖర్చుల కింద యూజర్ ఏజెన్సీ అయిన ఏపీఎండీసీకి ప్రభుత్వం చెల్లిస్తుంది. మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు వినియోగిస్తుంది. సాగునీటి ప్రాజెక్టుల పనులకు డీసిల్టేషన్ ఇసుక నీటి పారుదల ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, బ్యారేజీల్లో వరద నీటితోపాటు ఇసుక వచ్చి పేరుకుంటుంది. దీనివల్ల నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతుంటుంది. అందువల్ల వీటిలో డీసిల్టేషన్ ద్వారా ఇసుక వెలికి తీయడం ద్వారా నీటి నిల్వ సామర్థ్యం పెంచాల్సి ఉంటుంది. జల వనరుల శాఖ ఇలా వెలికి తీసిన ఇసుకను సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణాలకు వినియోగించుకోవాలి. జల వనరుల శాఖ డీసిల్టేషన్ ద్వారా ఇసుకను తవ్వడానికి అవసరమైన అనుమతులతో పాటు ఇసుక దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకోవాలి. ఇసుక తోడినందుకు సీనరేజి చార్జీలతోపాటు ఇతరత్రా పన్నులను గనుల శాఖకు చెల్లించాల్సి ఉంటుంది. ఇసుక తరలింపునకు కూడా ట్రాన్సిట్ పాసులను భూగర్భ గనుల శాఖ సహాయ సంచాలకుల నుంచి పొందాలి. ఒకవేళ రిజర్వాయర్లలో పేరుకున్న ఇసుకను తోడే బాధ్యతను జల వనరుల శాఖ అధికారులు జిల్లా కలెక్టర్‌కు అప్పగిస్తే వారు తవ్వించిన ఇసుకను ఏపీఎండీసీకి అప్పగించాలి. డీసిల్టేషన్‌కు అయిన మొత్తాన్ని ఏపీఎండీసీ చెల్లిస్తుంది. ఇందుకు కొన్ని విధి విధానాలు ఉన్నాయి. పట్టా భూముల్లో ఇలా.. నదీ పరిసర ప్రాంతాల్లో రైతులకు సంబంధించిన పట్టా భూముల్లో ఒక్కోసారి ఇసుక మేటలు వేస్తుంది. వరదల సమయంలో ఇలా పట్టా భూములు ఇసుక రేవుల్లా మారతాయి. ఇలాంటి భూముల్లో ఇసుకను తవ్వి విక్రయించడానికి రైతులతో ఏపీఎండీసీ ఒప్పందాలు చేసుకోవచ్చు. ఇలా తవ్విన ఇసుక అమ్మగా వచ్చిన మొత్తంలో 10 శాతాన్ని భూ యజమానులైన రైతులకు ఇస్తారు. ఒకవేళ రైతులే నేరుగా తమ భూముల్లో ఇసుక తవ్వుకుంటామని కోరితే అనుమతిస్తారు. ఏపీఎండీసీ నిర్ణయించిన కనీస ధరతోపాటు వారు విక్రయించే అదనపు ధరలో 5 శాతాన్ని ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. గిరిజన ప్రాంతాల్లో సొసైటీలకే అధికారం గిరిజన ప్రాంతాల్లోని ఇసుక తరలింపు కోసం పంచాయతీ రాజ్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్ (పీసా) చట్టం కచ్చితంగా పాటిస్తారు. ఇక్కడి ఇసుకపై గిరిజనులకే హక్కు ఉంటుంది. అందువల్ల ఇక్కడ ఇసుక తరలింపు బాధ్యతను గిరిజన సొసైటీలకే అప్పగిస్తారు. జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని సొసైటీలకు ఇసుక తవ్వకాలు, తరలింపునకు అవసరమైన సాంకేతిక సçహకారాన్ని మాత్రం ఏపీఎండీసీ అందిస్తుంది. ఇందుకు సంబంధించి సమయానుకూలంగా నియమ నిబంధనలను జిల్లా కలెక్టర్లు జారీ చేస్తారు. కృత్రిమ ఇసుక తయారీకి ప్రోత్సాహం పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా నదుల ఇసుక ఉత్పత్తి పెరగడం లేదు. అందువల్ల భవిష్యత్తులో సహజ సిద్ధమైన ఇసుక కొరత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉంది. అందువల్ల నదీ ఇసుకకు ప్రత్యామ్నాయంగా కృత్రిమ (రోబో) శాండ్ తయారీని ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కృత్రిమ ఇసుకను మాన్యుప్యాక్చర్డ్ (ఎం) శాండ్ అంటారు. ఎం.శాండ్‌ను తయారు చేసే సంస్థలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ప్రభుత్వ సంస్థలు కనీసం 50 శాతం కృత్రిమ ఇసుకను కచ్చితంగా వినియోగించాలనే నిబంధన కూడా పెట్టనున్నారు. కృత్రిమ ఇసుక తయారీకి ప్రస్తుతం ఉన్న ప్రోత్సాహకాలను ఇంకా పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. సర్కారు ఆదాయం పెంపే లక్ష్యం గత ప్రభుత్వ హయాంలో ఉచిత ఇసుక పేరుతో రవాణా కాంట్రాక్టర్ల అవతారం ఎత్తిన టీడీపీ నాయకులు శాండ్ మాఫియాకు తెరలేపారు. ముడుపులివ్వందే ఎవరినీ ఇసుక రేవుల్లోకి రానీయలేదు. వారు చెప్పిన మొత్తం ఇస్తేనే ఇసుక సరఫరా చేస్తూ వచ్చారు. ఇలా వేల కోట్ల రూపాయలు దండుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలపై ఎలాంటి అదనపు భారం పడకుండా ఇసుకను సరఫరా చేయడం ద్వారా ప్రభుత్వ రాబడిని పెంచడం లక్ష్యంగా వైఎస్ జగన్ సర్కారు కొత్త విధాన ముసాయిదా రూపొందించింది. -
15 రోజుల్లో కొత్త ఇసుక పాలసీ
సాక్షి, అమరావతి: వచ్చే జులై ఒకటో తేదీ నుంచి నూతన ఇసుక పాలసీని అమల్లోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉచిత ఇసుక ముసుగులో టీడీపీ నాయకులు ఐదేళ్లపాటు సాగించిన దోపిడీకి తక్షణమే అడ్డుకట్ట వేస్తున్నట్లు ప్రకటించింది. పారదర్శక ఇసుక విధానం తెస్తామని రాష్ట్ర మంత్రివర్గ తొలి సమావేశం నిర్ణయించిన మరుసటి రోజే ఈ దిశగా చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, భూగర్భ గనుల శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక ప్రకటన చేశారు. సచివాలయంలో మంగళవారం ఆయన భూగర్భ గనుల శాఖ, ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ అధికారులతో సమీక్షించారు. ‘ప్రజలపై ఎలాంటి భారం పడకుండా సర్కారు రాబడి పెంచేలా కొత్త ఇసుక విధానాన్ని రూపొందించాలి. సర్కారుకు ఆదాయం రావాలేగానీ ఇసుక మాఫియా నేతలకు కాదు. ఇందుకు అనుగుణంగా విధివిధానాలు తయారుచేసి సమర్పించండి. కొత్త పాలసీ రూపకల్పనకు ఎంత సమయం కావాలో చెప్పండి. అప్పటివరకూ ఇసుక తవ్వకాలు, రవాణా నిలిపేద్దాం. సర్కారు ఆదేశాలను ఉల్లంఘించి ఎవరైనా ఇసుక తవ్వినా, రవాణా చేసినా వారిపై ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడి) చట్టం కింద కేసులు పెట్టి అరెస్టు చేయండి. ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాను నిరోధించాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉంటుంది’.. అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విస్పష్టంగా ప్రకటించారు. 15 రోజుల్లో కొత్త ఇసుక విధానానికి సంబంధించి విధివిధానాలు సమర్పిస్తామని అధికారులు మంత్రికి తెలిపారు. దీంతో అప్పటివరకూ ఇసుక తవ్వకాలు, రవాణాను పూర్తిగా నిలిపివేయాలని మంత్రి ఆదేశించారు. 15 రోజులు ఓపిక పట్టండి : పెద్దిరెడ్డి సచివాలయం 2వ బ్లాక్‌లోని సమావేశ మందిరంలో గనుల శాఖ అధికారులతో సమీక్షించిన అనంతరం మంగళవారం సాయంత్రం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు, రవాణాపై 15 రోజులపాటు నిషేధం విధించినట్లు చెప్పారు. తమ ప్రభుత్వం 15 రోజుల్లో నూతన మైనింగ్ పాలసీని తీసుకువస్తుందన్నారు. అప్పటివరకు ప్రజలు కొంచెం ఓపిక పట్టాలని కోరారు. రాష్ట్రంలో అక్రమ మైనింగ్, ఇసుక స్మగ్లింగ్‌కు ఫుల్స్టాప్ పెట్టడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్ర ఆదాయంలో 20–25 శాతం భూగర్భ గనుల శాఖ ద్వారా సాధిస్తామని చెప్పారు. ‘భూగర్భ ఖనిజ శాఖలో అక్రమాలను అరికట్టి సర్కారు రాబడి పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామని పెద్దిరెడ్డి చెప్పారు. నూతన పాలసీని రూపొందించే వరకు ఎక్కడా ఇసుక తవ్వకాలు, రవాణా జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా అవి జరిగితే జిల్లా అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుందని స్పష్టంచేశారు. ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే పీడీ చట్టం కింద కేసులు పెట్టి జైలుకు పంపుతామని హెచ్చరించారు. ఇతర రాష్ట్రాల్లో మైనింగ్ పాలసీలను అధికారులు అధ్యయనం చేస్తున్నారని.. ప్రభుత్వానికి, ప్రజలకు ఉపయోగకరమైన ఉత్తమ పాలసీని రూపొందిస్తారని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు. సమావేశంలో ఆ శాఖ కార్యదర్శి ఐ. శ్రీనివాస శ్రీ నరేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపైనా సమీక్ష మరోవైపు.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతోనూ మంత్రి పెద్దిరెడ్డి మంగళవారం సమావేశమయ్యారు. రెండు శాఖల కమిషనర్ కార్యాలయం, స్వచ్ఛ భారత్ (గ్రామీణ), పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం, గ్రామీణ మంచినీటి సరఫరా విభాగాల వారీగా సమీక్షించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన మంత్రికి ఆయా శాఖల స్వరూపం, శాఖల పరిధిలో పనుల పురోగతిని ఆయా విభాగాల అధిపతులు, అధికారులు వివరించారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి జవహర్‌రెడ్డి పాల్గొన్నారు. -
సిద్దూ వ్యాఖ్యలపై మండిపడ్డ టీకాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇసుక విధానం అద్భుతంగా ఉందని పంజాబ్ కాంగ్రెస్ మంత్రి, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ చేసిన వ్యాఖ్యలను టీపీసీసీ ఖండించింది. టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిన ఒక వైపే సిధ్దూ వినడాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్టు పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ తెలిపారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... సిద్ధూ మరోసారి ఇక్కడికి వస్తే తాము నిజాలు చూపిస్తామన్నారు. ఆయన ప్రభుత్వం పర్యటనలో ఉన్నారని, పార్టీకి సంబంధించినది కాకపోవడంతో అవగాహన లేదని వ్యాఖ్యానించారు. సిధ్దూ విషయాన్ని ఇప్పటికే హైకమాండ్ దృష్టి తీసుకెళ్లినట్టు శ్రవణ్ వెల్లడించారు. అంతే కాకుండా రాష్ట్రంలో ఇసుక మాఫియా నడుస్తోంది శ్రవణ్ పునరుద్ఘాటించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు నేతృత్వంలో కొల్లాపూర్‌లో అక్రమంగా ఇసుక దందా జరుగుతోందని అరోపించారు. కొండూరులో ఎలాంటి లైసెన్స్ లేకుండా దొంగచాటుగా ఇసుక అమ్ముతున్నారన్నారు. జూపల్లి కుటుంబ సభ్యులు, బంధువులు ఈ మాఫియాలో ఉన్నారని ఆయన విమర్శించారు. తామ పార్టీ నేతలు అధికారులకు ఫిర్యాదులు చేసినా స్పందించడం లేదన్నారు. పందికొక్కుల్లా తినడం కోసబా తెలంగాణ తెచ్చుకుందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో మైనింగ్ బాగుందని పక్క రాష్ట్రాల వారితో పొగిడించుకుంటున్నారని మండిపడ్డారు. సర్కార్‌కు చారాణ.. టీఆర్ఎస్ పెద్దలకు బారాణ వెళ్లే విధంగా ఈ వ్యవహారం జరుగుతోందన్నారు. కేటీఆర్‌కు నీతి నిజాయితీ, తెలంగాణ సోయి ఉంటే.. ఇలా దొంగ ఇసుక పక్క రాష్ట్రాలకు తరలిపోవడాన్ని పట్టించుకోవాలని సూచించారు. -
టీకాంగ్రెస్‌ను ఇరుకున పెట్టిన సిద్ధూ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పర్యటించిన పంజాబ్ మంత్రి, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాష్ట్ర కాంగ్రెస్‌ను ఇరకాటంలో పడేశారు. రాష్ట్రంలోని ఇసుక పాలసీని పంజాబ్‌లో అమలు చేసేందుకు కాళేశ్వరం పరిధిలోని ఇసుక రీచ్‌లను గురువారం అధికారుల బృందంతో కలిసి సిద్దూ క్షేత్రస్ధాయిలో పరిశీలించారు. తెలంగాణలో ఇసుక విధానం అద్భుతంగా ఉందని సిద్దు ప్రసంశించారు. ఇసుక అక్రమాలకు తెలంగాణ సర్కార్ అడ్డుకట్ట వేసిందని కితాబిచ్చారు. ఇలాంటి విధానమే పంజాబ్‌లో అమలు చేస్తామని సిధ్దు వివరించారు. అయితే సిద్ధూ పర్యటన కాంగ్రెస్ నాయకులకు ఇపుడు తలనొప్పిగా మారింది. ఇన్నాళ్లు టీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ వచ్చింది. రాష్ట్రంలో ఇసుక దోపిడీ యథేచ్చగా కొనసాగుతోందని, సర్కారు కనుసన్నల్లోనే ఇసుక మాఫియా జరుగుతోందని ఆ పార్టీ నాయకులు ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. మంత్రి కేటీఆర్‌కు ముఖ్యంగా ఇసుక మాఫియాతో సంబంధాలు ఉన్నాయని కూడా ఆరోపించింది. అయితే పంజాబ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సిద్దూ ఇసుక విధానం బాగుందని, తెలంగాణ సర్కార్‌పై ప్రశంసలు కురిపించడం.. రాష్ట్ర నేతలకు మింగుడు పడటం లేదు. తెలంగాణలో సిద్ధూ పర్యటన వద్దంటూ టీ కాంగ్రెస్ ఇంతకుముందే అధిష్టానాన్ని కోరినట్టు సమాచారం. కానీ టీ కాంగ్రెస్ అభ్యంతరాలను తోసిపుచ్చి మరీ సిధ్దూ ఇక్కడ పర్యటించి పార్టీని ఇరుకున పెట్టారు. -
ల్యాప్‘టాప్’లాంటి ఐడియా..
ల్యాప్‌టాప్‌ల్లో ఈ చలాన్ల ఎంట్రీతో సంపాదన వీరంతా దేవాలయంలో ల్యాప్‌టాప్‌లో ఏం చేస్తున్నారో తెలుసా? ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తూ ఉపాధిని పొందుతున్నారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం జైకేసారం దేవాలయంలో యువకులంతా ల్యాప్‌టాప్ బ్రౌజింగ్‌లో బిజీగా ఉన్నారు. విషయం ఏమై ఉంటుందని ఆరా తీస్తే ఆసక్తికరమైన విషయం వెలుగుచూసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇసుక పాలసీలో భాగంగా టీఎస్ఎండీసీ ద్వారా ప్రతిరోజూ ఇసుక రవాణా చేయడానికిచ్చే పర్మిట్లను వీరు ఆన్లైన్లో సాధిస్తున్నారు. టీఎస్ఎండీసీ ద్వారా ప్రతిరోజూ మధ్యాహ్నం వెబ్సైట్ ఓపెన్ చేస్తారు. ఆ సమయంలోనే లారీల యజమానులు తమ లారీ నంబర్‌తో పాటు రూ.8,725 అప్లోడ్ చేయాలి. ‘మీసేవ’ బిజీగా ఉండడంతో కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న యువతకు అవకాశం కల్పించడంతో.. వీరు ఇలా ఉపాధి పొందుతున్నారు. – యాదాద్రి -
ఇక ఏపీలో పూర్తిస్థాయి ఇసుక పాలసీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇకపై ఇసుక పాలసీ విధానం పూర్తిస్థాయిలోకి రానుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం పూర్తి స్థాయి ఇసుక పాలసీని ప్రకటిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 524 ఇసుక రీచ్‌లను గుర్తించింది. నదీ ప్రాంతంలో 166, వాగు ప్రాంతాల్లో 358 ఇసుక రీచ్‌లను గుర్తించింది. అదేవిధంగా లోడింగ్ ఛార్జీలు చెల్లించాకే ఇసుక రీచ్లోనుంచి ఇసుక తీసుకెళ్లాలని ఆదేశించింది. ఇసుక పాలసీ విధానంలో లోడింగ్, రవాణా ఛార్జీలు నిర్ణయించే అధికారం ఆయా జిల్లా కలెక్టర్లకు ఏపీ ప్రభుత్వం అప్పగించినట్టు సమాచారం. -
'రెవిన్యూ పెరగకపోవడానికి కారణం దోపిడీనే'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇసుక దోపిడీపై బుధవారం వాడివేడి చర్చ జరిగింది. గతంతో పోల్చితే ప్రభుత్వం ఇసుక చార్జీలను పెంచినప్పటికీ రెవిన్యూ పెరగలేదంటే.. దానికి కారణం అధికార పార్టీ దోపిడియే అని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఇసుక దోపిడీపై ప్రభుత్వం ఇప్పటివరకు ఏం చర్య తీసుకుంది, ఎవరిని పట్టుకున్నారు అని ఆయన ప్రశ్నించారు. ఇసుక వ్యవహారంలో 2000 కోట్ల అవినీతి చోటు చేసుకుందని స్వయానా రాష్ట్ర మంత్రి యనమల రామకృష్ణుడు సభలో చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా వైఎస్ జగన్ గుర్తు చేశారు. రెండేళ్లు అందినకాడికి ఇసుకను దోచేశారన్నారు. దోపిడీకి పాల్పడిన వారిలో అధికార పార్టీ నాయకులు, చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు ఉన్నారని వైఎస్ జగన్ ఆరోపించారు. -
ఇసుక లారీలను ఏం చేయాలి?
ఆమదాలవలస రూరల్: ప్రభుత్వ ఉచిత ఇసుక పాలసీని ప్రకటించినా.. విధివిధానాలు ఖరారు చేయకపోవడంతో పోలీసులు పట్టుకున్న ఇసుక లారీలను విడిచి పెట్టాలా? ఫైన్ వేయాలా? అన్న మీమాంసలో రెవెన్యూ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. మండలంలోని ముద్దాడపేట నాగావళి నదీతీరం అనధికార ఇసుక ర్యాంపుపై శనివారం అర్ధరాత్రి పోలీసులు దాడులు చేసి ఏడు లారీలు, ఒక పొక్లెయిన్‌ను పట్టుకున్న సంగతి తెలిసిందే. వాటిని సోమవారం మండల తహశీల్దార్ కార్యాలయానికి అప్పగించడంతో వారు ఏం చేయాలో తెలియని స్థితిలో పడ్డారు. ఉచిత ఇసుక విధానం ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురావడంతో అక్రమంగా నిర్వహిస్తున్న ఇసుక రవాణాపై విధివిధానాలపై ప్రభుత్వం ఎలాంటి జీవో విడుదల చేయకపోవడంతో అధికారులకు పెద్ద సవాల్‌గా మారింది. ప్రభుత్వం నిర్ణయించిన ఇసుక ర్యాంపుల వద్దనే ఉచిత ఇసుక తీసుకుపోవాలని, యంత్రాల ద్వారా ఇసుక లోడింగ్ చేయరాదని ఈ నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు వచ్చాయి. కానీ వాహనాలను సీజ్ చేస్తే వాటికి ఎవరూ అపరాధ రుసుం విధించాలో ఆదేశాల్లో పేర్కొనకపోవడంతో రెవెన్యూ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. పట్టుకున్న లారీలను విడిచి పెట్టాలా.. లేక ఫైన్ వేయాలా అన్న సందేహంతో జిల్లా అధికారులతో సంప్రదింపులు కూడా చేస్తున్నారు. మరోవైపు లారీలను విడుదల చేయాలని అధికార పార్టీకి చెందిన నాయకుల నుంచి ఒత్తిళ్లు కూడా త్రీవతరమవుతున్నాయి. లారీలకు ఫైన్ వేస్తే ఏ శాఖ తరఫున చలానా తీయాలో తెలియక అధికారులు తికమకపడుతున్నారు. ఉచిత ఇసుక విధానం సామాన్యులకు కొంత ఊరట కల్పించినా ప్రస్తుతానికి అధికారులకు పెద్ద సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. -
ఆ బాబులకు సరే నాకేంటి?
ఇసుక.. ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు మొదలుకుని సామాన్య, మధ్యతరగతి వర్గాల్లోనూ పదే పదే చర్చకు వస్తున్న ప్రధాన అంశమది. మూడురోజుల కిందట ఏలూరు నగరానికి వచ్చినప్పుడు ఇసుక విధానంలో లోపాలున్నాయని చెప్పుకొచ్చిన సీఎం చంద్రబాబు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న ఇసుక అక్రమాలపై మాత్రం పెదవి విప్పలేదు. పార్టీ అధికారంలోకి వచ్చిన దరిమిలా 22 నెలలుగా గోదావరి తీరంలో ఎక్కడికక్కడ ఇసుక గుట్టలను మింగేసి రూ.కోట్లు వెనకేసుకున్న టీడీపీ ప్రజాప్రతినిధులు, నేతలు చివరకు కాలువలు, వాగుల్లోని ఇసుకనూ వదల్లేదు. న్యాయస్థానాలు మందలించినా లెక్కచేయలేదు. ఇప్పుడు తణుకుకు చెందిన ఓ ఇసుక మాఫియా నాయకుడు ప్రభుత్వ పెద్దలకు రూ.కోట్లు ముట్టజెప్పి ఎట్టకేలకు తనవద్దనున్న ఇసుక కొండలను కరిగించేందుకు అనుమతులు తెచ్చుకున్నాడు. అయితే మా లెక్క తేల్చిన తర్వాతే అమ్ముకోవాలంటూ ఓ టీడీపీ ప్రజాప్రతినిధి నిస్సిగ్గుగా మోకాలడ్డటం గోదావరి తీరంలో కలకలం రేపుతోంది. ఇసుక వ్యాపారికి సిద్ధాంతం తణుకుకు చెందిన బడా ఇసుక వ్యాపారికి సిద్ధాంతం, తణుకు, తీపర్రు, పెండ్యాల, పందలపర్రుల్లో సుమారు రూ.వంద కోట్ల విలువైన ఇసుక నిల్వలు ఉన్నాయి. జిల్లాలోనే ఇసుక మాఫియా నాయకుడిగా వ్యవహరిస్తున్న సదరు వ్యాపారి గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల విజయానికి అక్షరాలా రూ.15 కోట్లు ‘పెట్టుబడి’ పెట్టినట్టు తెలుస్తోంది. ఎన్నికల తర్వాత రూ.5 కోట్లు మాత్రమే వెనక్కు ఇచ్చిన బడాబాబులు రూ.10 కోట్లను తమ వద్దే ఉంచేసుకున్నారని తెలుస్తోంది. నేరుగా ప్రభుత్వ పెద్దలతో ఉన్న ‘ఆర్థిక సంబంధాలు’ ఎప్పుడైనా పనికొస్తాయన్న ముందుచూపుతో సదరు వ్యాపారి కూడా ఆ సొమ్మును అలానే వదిలేశారని సమాచారం. తాజాగా ఆయన బడాబాబులతో ఉన్న ఆర్థిక సంబంధాలనే ఉపయోగించి ఇసుక గుట్టలు అమ్ముకునేందుకు అనుమతులు తెచ్చుకున్నారు. తాను నిల్వ చేసిన మొత్తం ఇసుక గుట్టలను విక్రయించేవరకు బయటి వ్యక్తులకు ఇసుక టెండర్లు ఖరారు చేయకుండా ప్రభుత్వ పెద్దల నుంచి హామీ తీసుకున్నారని చెబుతున్నారు. ఇందుకోసం మళ్లీ పెద్దలకు రూ.కోట్లు ముట్టజెప్పారని తెలిసింది. అధికార యంత్రాంగం అడ్డంకులు సృష్టించకుండా వారికి కూడా రూ.2 కోట్లు అందించినట్టు చెబుతున్నారు. ‘అటు ప్రభుత్వ పెద్దలకు.. ఇటు అధికారులకు ఇచ్చేశాం.. ఇక అడ్డు లేకుండా ఇసుక విక్రయాలు చేసుకోవచ్చ’ని సదరు వ్యాపారి భావించారు. 5 యూనిట్ల ఇసుకను రూ.19 వేలు చొప్పున సరఫరా చేసేందుకు సన్నాహాలు చేశారు. సరిగ్గా అదే సమయంలో టీడీపీ ప్రజాప్రతినిధి రంగప్రవేశం చేశారు. గుట్టకు రూ.కోట్లు లేదా గంపగుత్తుగా రూ.7 కోట్లు ఇస్తే గానీ విక్రయించడానికి వీల్లేదని అడ్డుపడ్డాడు. ‘అదేంటి బడాబాబులకు ఇచ్చిన తర్వాత మళ్లీ మీకేంటని’ సదరు వ్యాపారి నిలదీస్తే ‘వాళ్ల వాటా వాళ్లదే. నా వాటా నాదే. నాకు ఇచ్చిన తర్వాతే నువ్వు అమ్ముకోవాల’ని తెగేసి చెప్పాడట. బేరమాడినా తగ్గలేదు ‘అటు బడా బాబులకు, ఇటు అధికారులకు ఇచ్చాను. మళ్లీ మీకు రూ.కోట్లు నేను ఇవ్వలేను. ఎంతో కొంత ఇస్తాను. సర్ధుకోండి’ అని వ్యాపారి బేరమాడినా సదరు ప్రజాప్రతినిధి మాత్రం వెనక్కి తగ్గలేదని అంటున్నారు. ఈ విషయమై ఇరువురు లారీ డ్రైవర్లు, కూలీల సమక్షంలో వాదులాడుకోవడం చర్చనీయాంశంగా మారింది. చర్చలు చివరికి రచ్చగా మారినా వ్యవహారం కొలిక్కి రాకపోవడంతో ఇసుక విక్రయాలు నిలిచిపోయాయి. టీడీపీ నేతలు రంగప్రవేశం చేయడంతో రెండురోజుల నుంచి దఫదఫాలుగా ఇరువర్గాల మధ్య మళ్లీ చర్చలు సా..గుతున్నట్టు తెలుస్తోంది. ఇసుక కొరతతో భవననిర్మాణ రంగంతోపాటు సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోయి అల్లాడిపోతుంటే టీడీపీ నేతలు తమ వాటా కోసం ఇలా బజారున పడటం ఏవగింపు కలిగిస్తోంది. -
వేలంపై పితలాటకం
జిల్లాలో కొలిక్కిరాని ఇసుక ర్యాంపుల వేలం అధిక ధరలకు బిడ్ల దాఖలు.. ర్యాంపులు రద్దయ్యే అవకాశం ప్రభుత్వానికి నివేదిక పంపిన అధికారులు నూతన ఇసుక పాలసీపై సర్వత్రా విమర్శలు కొవ్వూరు :జిల్లాలో ఇసుక ర్యాంపుల వేలం పితలాటకంగా మారింది. ప్రభుత్వం రూపొందించిన నూతన ఇసుక పాలసీ విధానం లోపభూయిష్టంగా ఉండడంతో ఇటు అధికారులు, అటు వేలం దక్కించుకున్న కాంట్రాక్టర్లు ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. జిల్లాలో 6 ఇసుక ర్యాంపులకు నాలుగు రోజుల కిందట నిర్వహించిన వేలంలో ప్రభుత్వం పేర్కొన్న ధర కంటే అదనపు రేట్లకు కాంట్రాక్టర్లు కోడ్ చేయడంతో వేలం ఖరారు సందిగ్ధంలో పడింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉండడంతో విజయవాడలో సమావేశమైన మంత్రివర్గ ఉప సంఘం ఇసుక వేలం ప్రక్రియపై సుదీర్ఘంగా చర్చించింది. దీనిపై విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని ఉపసంఘం సభ్యులైన మంత్రులు ప్రకటించారు. వేలం రద్దు యోచనలో ప్రభుత్వం ప్రభుత్వం క్యూబిక్ మీటర్ ఇసుక ధర రూ.500గా నిర్ణయించింది. జిల్లాలో వేలం నిర్వహించిన ఆరు ర్యాంపుల్లో రామయ్యపేట మినహా మిగిలిన ర్యాంపులన్నీ అదనపు ధరలకు కోడ్ చేశారు. సిద్ధాంతం ర్యాంపులో రూ.720, పెండ్యాల-కానూరు ర్యాంపులో రూ.646, తీపర్రులో రూ.580, పందలపర్రులో రూ.522 చొప్పున పాడి కాంట్రాక్టర్లు వేలాన్ని దక్కించుకున్నారు. రామయ్యపేటలో మాత్రం రూ.476 పలికింది. ప్రభుత్వ ధర కంటే ఎక్కువగా కోట్ చేయడంతో జిల్లా స్టాండ్ మైనింగ్ కమిటీలో వేలంపై చర్చించి ప్రభుత్వానికి నివేదిక పంపించామని గనుల శాఖ ఏడీ సి.మోహనరావు చెబుతున్నారు. రామయ్యపేట ర్యాంపు పోలవరం ప్రాజెక్టు పరిధిలో ఉండడంతో నీటిపారుదల శాఖ ఎస్ఈ అభ్యంతరం వ్యక్తం చేస్తూ జాయింట్ కలెక్టర్‌కి లేఖ రాశారు. దీనిపై జిల్లా స్టాండ్ మైనింగ్ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. పోలవరం ప్రాజెక్టు పనులు ముమ్మరంగా కొనసాగుతున్న తరుణంలో ఈ ర్యాంపు నిర్వహణ ఇబ్బందులు తలెత్తె అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. లోపభూయిష్టమైన విధానం ప్రభుత్వం నూతన ఇసుక విధానం లోపభూయిష్టంగా ఉంది. ప్రభుత్వం క్యూబిక్ ఇసుక ధరను రూ.500కి విక్రయించాలని నిబంధన విధించింది. వేలంలో కనిష్ట ధర రూ.110గా నిర్ణయించింది. దీనిపై అదనంగా పాడుకున్నవారికి వేలం కట్టబెడతారు. ఇసుక తవ్వకం, సీనరేజి, వాణిజ్య పన్ను, ఆదాయ పన్ను, జిల్లా మినరల్ ఫండ్, ర్యాంపుల ఏర్పాట్లు, నిర్వహణ తదితర ఖర్చులన్నీ కలిపి క్యూబిక్ మీటర్ ఇసుక తవ్వకానికి రూ.200 నుంచి రూ.250 వరకు కాంట్రాక్టర్‌కి ఖర్చవుతుంది. ఉదాహరణకు క్యూబిక్ మీటర్ ఇసుక ధర రూ.200 నుంచి రూ.250 లోపు వేలంలో దక్కించుకుంటేనే ఆ కాంట్రాక్టర్ క్యూబిక్ మీటర్ రూ.500కు విక్రయించగలడు. అయితే వేలంలో రూ.500 పైబడి బిడ్లు దాఖలు చేశారు. వేలం దక్కించుకున్నవారంతా అధికారపార్టీ ప్రజాప్రతినిధులకు బినామీలేనన్న ఆరోపణలు ఉన్నాయి. ఆయా ర్యాంప్‌లలో ప్రభుత్వం నిర్ణయించిన ఇసుక పరిమాణంతో సంబంధం లేకుండా అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాత్రింబవళ్లు తవ్వుకునే కుట్రలో భాగంగానే బిడ్లను అధిక ధరలకు కోడ్ చేశారు. నూతన విధానంపైనా విమర్శలు ఇసుక అక్రమ తవ్వకాలతో ఇప్పటికే అప్రదిష్టను మూటగట్టుకున్న టీడీపీ ప్రభుత్వం.. కొత్తగా రూపొందించిన పాలసీపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ట ధర వద్ద బిడ్ లాక్ చేస్తుందని అందరూ భావించారు. కానీ అలాచేయకపోవడంతో బిడ్లు హెచ్చు ధరకు వెళ్లాయి. ప్రభుత్వం క్యూబిక్ మీటర్‌కు రూ.500కు గరిష్ట ధర నిర్ణయించింది. క్యూబిక్ మీటర్ ఇసుకను రూ.500కు విక్రయించాలని పేర్కొంది. అయితే వేలం దక్కించుకున్న కాంట్రాక్టర్లు క్యూబిక్ మీటర్‌కు దాదాపు రూ.200 వరకు ప్రభుత్వానికి పన్నులు చెల్లించాల్సి ఉంది. అలాంటి పరిస్థితుల్లో క్యూబిక్ మీటర్‌కు రూ.350లోపే గరిష్ట ధర నిర్ణయించాలని అధికారులే చెబుతున్నారు. జిల్లాలో కరుగోరుమిల్లు ర్యాంపులో క్యూబిక్ మీటర్ ఇసుక ధర ఏకంగా రూ.820 పలికింది. దీనికి ఇతర ఖర్చులు రూ.230 కలిపితే కాంట్రాక్టర్‌కి క్యూబిక్ మీటర్ ఇసుక రూ.1,050 గిట్టుబాటు అవుతుంది. దీనిపై కాంట్రాక్టర్ లాభం వేసుకోవాలి. అంటే ప్రభుత్వం నిర్ణయించిన ధరకు దాదాపు రెండు రెట్లు వేసుకుంటే గాని కాంట్రాక్టర్‌కు గిట్టుబాటు కాదు. ప్రభుత్వమే ఇసుక దోపిడీని పరోక్షంగా ప్రోత్సహిస్తోందనే విమర్శలు ఉన్నాయి. -
కోట్లకు 'రీచై' పోతున్నారు
‘మన మహిళా సంఘాలే ఇసుక అందిస్తారుు. దళారీ వ్యవస్థతో పని లేదు’ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం చంద్రబాబు నాయుడి మాట. నూతన ఇసుక పాలసీ 2014ను ప్రవేశ పెట్టినప్పుడూ మళ్లీ ఇదే మాటను ఉటంకించారు. ... ఆ మాటలో నిజం ఉందనుకున్నారు జనం. తొమ్మిదేళ్ల తరువాత పీఠం ఎక్కిన బాబు అంతా మంచే చేస్తారని భావించారు. కానీ జరిగింది మాత్రం ఇందుకు భిన్నం. అంతా దళారీ వ్యవస్థతోనే తెలుగు తమ్ముళ్లు ఇసుక రీచ్‌లను కైవసం చేసుకొని రూ.కోట్లలో ఆర్జించారు. జిల్లా అధికారులు సైతం నోరు మెదపని పరిస్థితి. దీంతో సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక ధరే తడిసిమోపెడై కూర్చుంది. 2014 ఇసుక పాలసీ చాటున దందా డ్వాక్రా గ్రూపులను దోషులుగా చూపిన వైనం ఇప్పటికే కొల్లగొట్టిన ఇసుకాసురులు పాత సీసాలో కొత్త సారా 2016 పాలసీ జిల్లాలోని ఇసుక రీచ్‌లు వేలానికి పనికిరావంటూ ప్రకటన అరుునా ఆగని అక్రమ దందా అధికార పార్టీ నాయకులదే హవా కళ్లకు గంతలు కట్టుకున్న యంత్రాంగం 2014 ఇసుక పాలసీ అటకెక్కింది. తిరిగి కొత్తగా 2016 పాలసీ తెరపైకి వచ్చింది. జిల్లాలో ఉన్న ఇసుక రీచ్లేవీ ఈ-వేలానికి పనికి రావని అధికారులు తేల్చారు. జిల్లాలో ఉన్న చిన్న నదులు, ఏరులు, వాగులు మూడో కేటగిరీ కిందకు వస్తాయని, వీటిలో నుంచి ఇసుకను తీసుకెళ్లడానికి ఈ-వేలం పద్ధతి అనుకూలించదని తేల్చి చెప్పారు. మండలాల స్థాయిలో స్థానికంగా ఉండే వారు ఇసుక అవసరాలు తీర్చుకోవాలంటే ఎడ్లబండ్లతో రవాణా చేసుకోవాలని ప్రకటించారు. చంద్రబాబునాయుడు సీఎం అయ్యూక ఇసుక పాలసీల పేరిట ప్రజలను నానా అవస్థలకు గురిచేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నారుు. దీంతో సామాన్యుడు మొదలుకొని పెద్ద నిర్మాణ సంస్థల వరకూ అల్లాడిపోతున్నారు. నల్లబజారులో ఇసుక రాజ్యమేలుతోంది. ఎలా అంటే... ఒంగోలు క్రైం: జిల్లాలో అవినీతి పరుల గుప్పెట్లో ఇసుక ఇరుక్కుపోరుుంది. పాలసీల మాటున అక్రమార్జనలకు తెరలేపుతున్నారు. ‘ఊరు మనదే దోచేయ్’ అన్న రీతిలో నిబంధనలు తుంగలో తొక్కి మదపుటేనుగుల్లా రీచ్‌ల వైపు అడుగులేస్తున్నారు. 2014 ఇసుక పాలసీ వల్ల జిల్లాలో రూ.20 కోట్ల మేర ప్రభుత్వ ఖజానాకు గండిపడింది. డ్వాక్రా సంఘాల ద్వారా ఇసుకను సరఫరా చేసేందుకు నిర్ణయించిన ఆ పాలసీ అధికార పార్టీ నాయకులకు వరంగా మారింది. 2016 నూతన ఇసుక పాలసీని కూడా అదే రీతిలో తమ చేతుల్లోకి తీసుకొని కొల్లగొట్టేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో ఉన్న పదిహేను రీచుల్లో ఏ ఒక్కటీ ఈ-వేలం ద్వారా ఇసుక అమ్మకానికి పనికి రాదని తేల్చినా అక్రమాలు ఆగడం లేదంటే అధికారులు ఏ స్థారుులో ప్రేక్షకపాత్ర వహిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. తూతూ మంత్రంగా కేసులు నమోదు చేసి దాడులు చేశామని చేతులు దులుపుకోవడమే తప్ప అసలు సూత్రధారుల జోలికి పోకపోవడమే ఇందుకు ఉదాహరణ. జిల్లాలో నాలుగు లక్షల క్యూబిక్ మీటర్ల మేరకు ఇసుక అక్రమ రవాణా జరిగినట్లు తెలుస్తోంది. క్యూబిక్ మీటర్ రూ.500 చొప్పున వేసుకున్నా రూ.20 కోట్లు ప్రభుత్వ ఖజానాకు గండిపడిందని పరిశీలకులు భావిస్తున్నారు. కందుకూరు నియోజకవర్గంలోనే 15 రీచ్‌లు... జిల్లాలోని పదిహేను ఇసుక రీచ్‌ల్లో ఏడు ఇసుక రీచ్‌లు కందుకూరు ని యోజకవర్గం పరిధిలోనే ఉన్నాయి. అక్కడ అధికార పార్టీకి చెందిన మాజీ ప్రతినిధి ఏకంగా ఇసుక దందా నిర్వహించి కోట్లలో వెనుకేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. బద్దిపూడి, దొండపాడు, భీమవరం, మాచవరం, మన్నేటికోట, పలుకూరు, విక్కిరాలపేట ఇసుక రీచ్‌ల నుంచి లక్షలాది క్యూబిక్ మీటర్ల ఇసుక ఇప్పటికే అక్రమంగా తరలిపోయింది. ఈ రీచ్‌ల నుంచే రెండు లక్షల క్యూబిక్ మీటర్లకుపైగా ఇసుక అక్రమార్కుల పాలైంది. చక్రాయిపాలెం, కె.బిట్రగుంట, మద్దిరాలపాడు, మల్లవరం, నందిపాడు, పాదర్తి, గుండ్లకమ్మ, కలవళ్ళ వద్ద ఉన్న వీఆర్ ఆనకట్ట ఇసుక రీచ్‌ల నుంచి కూడా లక్షలాది క్యూబిక్ మీటర్లు ఇసుకకు కాళ్లొచ్చాయి. వాస్తవానికి జిల్లాలో 2014 ఇసుక పాలసీ అమలు సమయంలో 5,83,800 క్యూబిక్ మీటర్లు ఇసుక నిల్వలున్నట్లు అంచనాలు వేశారు. అయితే ఆ పాలసీ ముగిసే నాటికి 2,30,339 క్యూబిక్ మీటర్ల ఇసుకను అధికారికంగా విక్రయించారు. అంటే అధికారులు అంచనాలు వేసి నిల్వ ఉందని తేల్చిన ఇసుక కంటే ఎక్కువగానే అక్రమంగా తరలించినట్లు స్పష్టమవుతోంది. సీసీ కెమేరాలూ పీకేశారు... ఇసుక రీచ్‌ల వద్ద అక్రమాలను అరికట్టేందుకు సొసైటీ ఎలిమినేషన్ ఆఫ్ రూ రల్ పవర్టీ (సెర్ఫ్) ఆధ్వర్యంలో నిఘా కోసం కొన్ని రీచ్‌ల్లో సీసీ కెమేరాలను ఏర్పాటు చేశారు. ఇసుక రీచ్‌ల్లో ఏర్పాటు చేసిన విక్కిరాలపేట, మల్లవరం వద్ద సీసీ కెమేరాలు హార్డ్ డిస్క్‌లతో సహా అపహరించుకుపోయారు. అధికార పార్టీ నాయకులు అక్రమాలు ఎక్కడ బయటపడతాయోనని తమ అనుచరుల ద్వారా ఈ పని చేరుుంచారు. -
నూతన ఇసుక విధానానికి కేబినెట్ ఆమోదం
విజయవాడ: విజయవాడలో బుధవారం ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది. ఆంధ్రప్రదేశ్‌లో నూతన ఇసుక విధానాన్ని కేబినెట్ ఆమోదించింది. ఇసుక రీచ్‌లను వేలం ద్వారా కేటాయించాలని ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.దీంతో ఫిబ్రవరి 1 నుంచి కొత్త విధానం అమలులోకి రానుంది. -
శ్వేతపత్రం కాదు అబద్ధాల పత్రం
అల్లీపురం: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇసుక విధానంపై విడుదల చేసిన శ్వేతపత్రం అబద్ధాల పత్రంగా ఉందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కొయ్యప్రసాద్ రెడ్డి విమర్శించారు. విశాఖపట్నంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ ప్రవేశపెట్టిన ఇసుక విధానం వల్ల మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు కోట్లకు పడగలెత్తారే కానీ ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. ఈ ఇసుక విధానం వల్ల సామాన్యుడు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదన్నారు. బాక్సైట్ తవ్వకాలపై గిరిజనుల ఆందోళనతో వెనక్కి తగ్గిన రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీల ఒత్తిడి మేరకు మళ్లీ అనుమతులిచ్చేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. బాక్సైట్ తవ్వకాలపై గిరిజనులకు అండగా పోరాడతామని, అలా కాకుండా ప్రభుత్వం ముందుకు వెళ్లితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. -
నూతన ఇసుక విధానంపై వైఎస్సార్సీపీ ధర్నా
అనంతపురం : ఇసుక నూతన విధానాన్ని సడలించి సామాన్యునికి ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలని వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో సోమవారం గోరంట్లలో ధర్నాకు దిగారు. అనంతరం తహాశీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. మీ-సేవా కేంద్రాల ద్వారా ఇసుకకు దరఖాస్తు చేసుకునే విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గోరంట్లలో ఇసుకరీచ్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ ధర్నాలో వైఎస్సాసీపీకి చెందిన జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు గంపల వెంకటరమణా రెడ్డితో సహా పలువురు జిల్లా నాయకులు పాల్గొన్నారు. (గోరంట్ల) -
పకడ్బందీగా ఇసుక పాలసీ అమలు
గనుల శాఖ అధికారులతో మంత్రి హరీశ్ సమీక్ష సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త ఇసుక పాలసీని పకడ్బందీగా, అవినీతికి ఆస్కారం లేకుండా, పారదర్శకంగా అమలు చేయాలని అధికారులను గనుల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఆదేశించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో శాఖకు విధించిన రూ. 3,500 కోట్ల ఆదాయాన్ని ఆర్జించడానికి తీసుకోవాల్సిన చర్యలపై శుక్రవారం సచివాలయంలో ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. గనుల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ప్రదీప్‌చంద్ర, ఖనిజాభివృద్ధి సంస్థ ఎండీ ఇతర ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా గత ఏడాది 90 శాతం లక్ష్యాన్ని చేరుకోగలిగామని అధికారులు మంత్రికి వివరించారు. పట్టా భూముల్లో ఇసుక తవ్వకానికి సంబంధించి ఇప్పటికి 120 కేసుల్లో ఎన్వోసీలను జారీ చేశామని, పెండింగ్ కేసులను వచ్చే 3 నెలల్లో పరిష్కరిస్తామని తెలిపారు. సీనరేజి చార్జీల సవరణ విషయంలో కమిటీని నియమించి చార్జీలు నిర్ణయించాలని, గ్రానైట్ క్వారీయింగ్‌లో స్లాబ్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. గతంలో పెట్టిన విజిలెన్స్ కేసులను ఒకేసారి పరిష్కరించుకోవడానికి వీలు కల్పించాలని, బిల్డర్స్ చార్జీల కింద చదరపు అడుగుకు రూ.3 వసూలు చేయాలని మంత్రి సూచించారు. ఈ మేరకు ఉత్తర్వుల జారీకి ఆదేశించారు. పట్టా భూముల్లో ఇసుక తవ్వకానికి కొత్త నిబంధనలను రూపొందించాలని కూడా మంత్రి పేర్కొన్నారు. -
నేడు మూడు ఇసుక రీచ్‌లకు టెండర్లు
సాక్షి, హైదరాబాద్: ఆదిలాబాద్, కరీంనగర్, నల్లగొండ జిల్లాల్లోని 3 ఇసుక రీచ్‌లకు నేడు టెండర్ల ప్రక్రియ నిర్వహించనున్నారు. ఇసుక మాఫియాను కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ఇసుక పాలసీ అమలులోకి వచ్చింది. మంత్రి హరీశ్‌రావు ఆదేశాల మేరకు ప్రభుత్వ ఖనిజాభివృద్ధి సంస్థ(టీఎస్ఎండీసీ) ఇసుక రీచ్‌ల వేలం ప్రక్రియకు ఇప్పటికే శ్రీకారం చుట్టింది. తొలుత కరీంనగర్, నల్లగొండ జిల్లాల్లో రీచ్‌లను టీఎస్ఎండీసీ వేలం వేసింది. అలాగే కరీంనగర్, ఆదిలాబాద్, నల్లగొండ జిల్లాల్లోని మరో మూడు రీచ్‌ల వేలం నిర్వహించాలని మంగళవారం నిర్ణయించింది. నేడు ఈ రీచ్‌లకు టెండర్లు నిర్వహించనున్నారు. ఈ రీచ్‌లలో ఇసుక వారం రోజుల్లో ప్రజలకు అందుబాటులోకి రానున్నట్లు టీఎస్ఎండీసీ ఎండీ లోకేశ్ ‘సాక్షి’కి తెలిపారు. కాగా వేలం ద్వారా ఇప్పటికే కరీంనగర్లో టన్ను ఇసుక రూ. 375, నల్లగొండలో రూ. 400కు అందుబాటులో ఉంచారు. -
16 నుంచి ఇసుక అమ్మకాలు
తొలుత కరీంనగర్ రీచ్ నుంచి.. టెండర్లను తెరిచిన ఎండీసీ సాక్షి, హైదరాబాద్: ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడంతోపాటు, చవక ధరల్లో ఇసుకను అందుబాటులోకి తెచ్చే ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. బహిరంగ మార్కెట్లో ఈ నెల 16 నుంచి ఇసుకను అందుబాటులో ఉంచేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేసింది. ఈ మేరకు ఇప్పటికే గుర్తించిన రీచ్‌ల నుంచి డంపింగ్ యార్డుకు ఇసుకను చేరవేసే కాంట్రాక్టు కోసం అధికారులు టెండర్లను పిలిచారు. కరీంనగర్ రీచ్‌లకు సంబంధించిన టెండర్ల ద్వారా కాంట్రాక్టర్‌ను ఎంపిక చేసే ప్రక్రియను శనివారం టీఎస్ఎండీసీ అధికారులు ప్రారంభించారు. రీచ్‌ల నుంచి ఇసుకను తరలించి, ప్రజలకు అందుబాటులోకి తేవడం వంటి కార్యక్రమాలను ఈ నెల 15లోగా పూర్తి చేసి 16 నుంచి అమ్మకాలు సాగించాలని నిర్ణయించినట్లు టీఎస్ఎండీసీ ఎండీ లోకేష్ ‘సాక్షి’తో పేర్కొన్నారు. కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక అందుబాటులోకి ఇసుకపై గత ప్రభుత్వాలు సరైన విధానాన్ని అవలంభించక పోవడంతో రీచ్‌లన్నీ ఇసుక మాఫియా చేతుల్లోకి వెళ్లాయి. డిమాండ్‌ను బట్టి ఇప్పటి వరకు అక్రమంగా టన్ను ఇసుకను వెయ్యి నుంచి 2 వేల రూపాయల వరకు విక్రయించేవారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కొత్త ఇసుక పాలసీని రూపొందించింది. గోదావరి, దాని ఉప నదులు, కృష్ణా నది, ఇతర వాగుల్లో లభించే మేలైన ఇసుకను సరైన పద్ధతిలో విక్రయిస్తే ప్రజలకు మేలు కలుగుతుందని ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగా టీఎస్ఎండీసీకి ప్రభుత్వ ఆదేశాలు మేరకు ముందుగా కరీంనగర్ జిల్లాలో గుర్తించిన 15 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక రీచ్‌లకు టెండర్లను పిలిచారు. కాంట్రాక్టర్లను సోమవారం నాటికి ఖరారు చేస్తారు. అలాగే కరీంనగర్, నల్గొండలోని మరో రెండు రీచ్‌లలో ఫిబ్రవరి 25 నుంచి ఇసుక అమ్మకాలు సాగిస్తారు. వరంగల్, కరీంనగర్, ఖమ్మంలో గుర్తించిన మూడు రీచ్‌లలో 1.2 కోట్ల మెట్రిక్ టన్నుల ఇసుకను మార్చి 10 నుంచి అందుబాటులోకి తేనున్నారు. ఇసుక టన్నుకు రూ. 400 నుంచి గరిష్టంగా రూ. 1100 వరకు విక్రయించాలని టీఎస్ఎండీసీ నిర్ణయించింది. -
‘మీ సేవ’లో ఇసుక!
చవకగా అందించేలా నూతన ఇసుక పాలసీ: హరీశ్‌రావు ఆన్లైన్ ద్వారా ఇంటికే ఇసుక విధానాన్ని అమలు చేస్తాం టన్నుకు రూ. 400లే.. రవాణా చార్జీలు అదనం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు మేలు చేసేలా, చవకగా ఇసుకను అందుబాటులోకి తెచ్చేలా నూతన ఇసుక పాలసీని తీసుకొస్తామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఇసుక మాఫియాకు కళ్లెం వేస్తామని... పారదర్శకత కోసం ఆన్లైన్ విధానం ద్వారా నేరుగా ఇంటికే ఇసుక డెలివరీ జరిగేలా చూస్తామని ఆయన వెల్లడించారు. మార్కెట్ ధరకన్నా 50 నుంచి 60 శాతం తక్కువ ధరకే ఇసుకను అందించడం, ఓవర్‌లోడ్ రవాణాను నివారించడం, ఇసుక ట్రాక్టర్లు, లారీల కారణంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణ తదితర లక్ష్యాలతో ఈ పాలసీని మరో రెండు నెలల్లో అందుబాటులోకి తెస్తామని చెప్పారు. శుక్రవారం హరీశ్‌రావు సచివాలయంలో ఇసుక పాలసీ అంశంపై అధికారులతో సమీక్షించారు. ప్రస్తుతం ప్రజా అవసరాల దృష్ట్యా పట్టా భూముల్లో మరో రెండు నెలల పాటు ఇసుక తవ్వకాలకు అనుమతించాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికే సీజ్ చేసిన రెండు లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను వేలం వేయనుందని తెలిపారు. టన్ను ఇసుకను కేవలం రూ. 400లకే అందిస్తామని, దీనికి అదనంగా రవాణా చార్జీలు ఉంటాయని తెలిపారు. హైదరాబాద్‌లో ప్రస్తుతం టన్ను ఇసుక ధర రూ. 1,400 వరకు ఉందని.. అదే కొత్త విధానంతో రూ. 900 నుంచి రూ. 1,100 లోపే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుందని మంత్రి తెలిపారు. ప్రజలు సైతం నేరుగా వచ్చి ఇసుక కొనుగోలు చేసేలా స్టాక్‌యార్డ్‌లు, మీసేవ కేంద్రాల్లో ఆన్లైన్ అమ్మకాలను చేపడతామని పేర్కొన్నారు. ఈ వ్యవస్థ ద్వారా పారదర్శకంగా ఇసుక విక్రయాలు జరుగుతాయన్నారు. ఇసుక తరలించే వాహనాలకు జీపీఎస్ వ్యవస్థ ఏర్పాటు చేయడం, రాష్ట్ర విజిలెన్స్‌తో పాటు కలెక్టర్ నేతృత్వంలో జిల్లా విజిలెన్స్‌ల ఏర్పాటు, కాల్‌సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. సాగునీటి ప్రాజెక్టుల కింద చేపట్టాల్సిన భూసేకరణపైనా మంత్రి నీటి పారుదల శాఖ అధికారులతో సమీక్షించారు. త్వరితగతిన భూసేకరణ జరిపేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
చంద్రబాబుపై చాంద్ బాషా ఫైర్
అనంతపురం: ఏపీ సీఎం చంద్రబాబుపై అనంతపురం జిల్లా వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే చాంద్ బాషా మంగళవారం అనంతపురంలో నిప్పులు చెరిగారు. బాబు ప్రభుత్వం అనుసరిస్తున్న ఇసుక విధానం వల్ల సామాన్యులకు సొంతింటి కల దూరం అవుతుందని ఆయన ఆరోపించారు. ట్రాక్టర్ ఇసుక రూ. వెయ్యి నుంచి రూ. 5 వేలకు పెరిగిందన్నారు. ఇసుక ధర పెరగడం వల్ల రాష్ట్రంలో గృహ నిర్మాణాలు ఎక్కడివక్కడ ఆగిపోయాయని ఆయన విమర్శించారు. వేలాది మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక విధానంపై వైఖరీ మార్చుకుంటే ఆందోళనకు దిగుతామని ఈ సందర్భంగా చంద్రబాబును చాంద్ బాషా హెచ్చరించారు. -
ఇలాగైతే ఎలా?
అనంతపురం అగ్రికల్చర్ : ప్రభుత్వం అమలు చేస్తున్న ఇసుక పాలసీ వల్ల వివిధ వర్గాల వారు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని, తీరు మారకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఐక్య కార్యాచరణ కమిటీ నేతలు హెచ్చరించారు. బిల్డర్లు, కాంట్రాక్టర్లు, తాపీమేస్త్రీలు, ట్రాక్టర్ యజమానులు, కూలీలు, డ్రైవర్లు, హమాలీలు... ఒక్కరేంటి ఇసుకతో సంబంధం ఉన్న అందరూ సంఘటితమై సోమవారం నగర వీధుల్లో కదం తొక్కారు. నాలుగు రోజులుగా స్థానిక ఆర్డీవో కార్యాలయం ఎదురుగా రిలేదీక్షలు చేపట్టిన నిర్మాణ రంగ ఐక్య కార్యాచరణ కమిటీ సోమవారం భారీ నిరసన ప్రదర్శన నిర్వహించింది. పెద్ద సంఖ్యలో ట్రాక్టర్లు, కార్మికులతో స్థానిక ఆర్డీవో కార్యాలయం నుంచి మొదలైన ర్యాలీ కలెక్టరేట్ వరకు కొనసాగింది. కలెక్టరేట్ ప్రధాన గేటు వద్ద నేతలు, కార్మికులు బైఠారుుంచి రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్లను పెట్టి స్థంభింపజేశారు. ధర్నాకు సీపీఐ జిల్లా కార్యదర్శి డి.జగదీష్, దళిత హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు సాకేశ్రీహరి, సీఐటీయూ నాయకులు మద్ధతు ప్రకటించి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు బోయ తిరుపాలు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి హెచ్.నదీం అమ్మద్, ప్రసాద్, రాజహంస శ్రీనివాసులు, పెద్దన్న, లోకేష్, బాబు, రామాంజినేయులు, చలమయ్య, గోపాల్, నాగరాజు తదితరులు మాట్లాడుతూ... రైతులు, పేదల ప్రభుత్వమని చెప్పుకుంటున్న చంద్రబాబు ఇసుక పాలసీని తెచ్చి వివిధ వర్గాల వారిని ఇబ్బందుల్లోకి నెట్టేశారని దుమ్మెత్తిపోశారు. వర్షాలు లేక పంటలు పండక, అప్పు చేసి తెచ్చుకున్న ట్రాక్టర్ల ద్వారా ఇసుకను రవాణా చేసుకుంటూ పొట్టపోసుకుంటున్న పేద వర్గాలను వేధిస్తున్నారన్నారు. సహజ వనరుగా ఇసుకకు ధర నిర్ణయించి అమ్మకానికి పెట్టడం దేశంలో ఎక్కడా జరగలేదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఇలాంటి దుస్సాహసానికి ఒడిగట్టడం సిగ్గు చేటన్నారు. నిర్మాణ రంగాన్ని కుదేలు చేయడానికి కంకణం కట్టుకుని పని చేస్తున్నారని మండిపడ్డారు. జిల్లాలో మూడు ఇసుక రీచ్‌లు గుర్తించి అక్కడ నుంచి కదిరి, రాయదుర్గం, హిందూపురం, మడకశిర లాంటి 140 కిలోమీటర్ల దూరానికి ఇసుకను తీసుకెళ్లాంటే ఖర్చు ఎక్కువ అవుతుండటంతో చిన్న వ్యక్తి మరుగుదొడ్డి కూడా కట్టుకోలేని పరిస్థితి కల్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్వాకా సంఘాల పేరుతో అధికార పార్టీ నేతలు ఇసుకను అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే సమైక్యాంధ్ర ఉద్యమ స్పూర్తితో ‘అనంత’ నుంచి ఇసుక పాలసీకి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ఉవ్వెత్తున రగిలిస్తామని హెచ్చరించారు. అవసరమైతే పండుగ తరువాత అస్లెంబ్లీ ముట్టడికి కూడా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక రచిస్తామని తెలిపారు. నిర్మాణ రంగానికి చెందిన అన్ని వర్గాలు సంఘటిత ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ (ఏజేసీ) ఖాజామెహిద్ధీన్ను ఆందోళన చేస్తున్న వారి వద్దకు వచ్చి సమస్యలు విన్నారు. అనంతరం వినతి పత్రం స్వీకరించి ప్రభుత్వానికి పంపుతానని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఇవీ డిమాండ్లు ఇసుక పాలసీని వెంటనే రద్దు చేయాలి. క్యూబిక్ మీటర్ ఇసుక రూ.625 కాకుండా రూ.75 ప్రకారం నిర్ణయించాలి. మీ-సేవాలో చలానా కట్టే పద్ధతికి స్వస్తి పలకాలి. జేసీబీలు, ట్రిప్పర్లు కాకుండా ట్రాక్టర్లు, కూలీలకు అవకాశం కల్పించాలి. ట్రాక్టర్ యజమానులపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలి. పోలీసుల వేధింపులు భరించలేక ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ట్రాక్టర్ యజమాని నాగభూషణం కుటుంబాన్ని ఆదుకోవాలి. -
ఇసుక రాజకీయం
* రీచ్‌ల నిర్వహణలో డ్వాక్రా మహిళలకు సర్కారు సహాయ నిరాకరణ * నాలుగు నెలలు అవుతున్నా ఇస్తానన్న పెట్టుబడీ లేదు, మహిళలకు శిక్షణా లేదు * ఇసుక రీచ్‌ల నిర్వహణ ఖర్చులు కూడా ఇప్పటి వరకూ విడుదల చేయని వైనం * ఇసుక విక్రయాల్లో అక్రమాలకు చెక్ పెట్టే వ్యవస్థ ఏర్పాట్లలోనూ అలసత్వం * ప్రభుత్వమే రీచ్‌లను నిర్వహిస్తుండటంతో ఆ వైపే చూడని విజిలెన్స్ విభాగం * పరోక్షంగా టీడీపీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతల కనుసన్నల్లోనే సాగుతున్న వ్యాపారం * డ్వాక్రా మహిళలు విఫలమయ్యారంటూ.. టీడీపీ నేతల చేతుల్లో రీచ్‌లకు ఎత్తుగడ? సాక్షి, హైదరాబాద్: కుక్కను చంపాలంటే ముందు ఆ కుక్క పిచ్చిదన్న ముద్ర వేయాలి..! రాష్ట్రంలో డ్వాక్రా మహిళల ద్వారా ఇసుక అమ్మకాల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం అచ్చం ఇదే సూత్రాన్ని అమలు చేయడానికి ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో ఇసుక అమ్మకాలను డ్వాక్రా మహిళల ద్వారా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబే ఇప్పుడు వారు సమర్థవంతంగా ఈ వ్యవహారాలు చేయలేకపోతున్నారని చిత్రీకరించి మొత్తం ఇసుక వ్యాపారాన్ని తమ పార్టీ నేతల చేతుల్లో పెట్టడానికి పావులు కదుపుతున్నారని అనుమానాలు రేకెత్తుతున్నాయి. నాలుగు నెలల కిందట తాను తీసుకొచ్చిన కొత్త ఇసుక విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రభుత్వం ఏ మాత్రం ఆసక్తి చూపకపోతుండడంతో అటు డ్వాక్రా మహిళా సంఘాల్లోనూ, ఇటు అధికార వర్గాల్లోనూ ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. సెప్టెంబరు ఒకటవ తేదీ నుంచి డ్వాక్రా మహిళల ద్వారా ఇసుక అమ్మకాలు నిర్వహించాలని నిర్ణ యం తీసుకున్న ప్రభుత్వం, అందుకు సంబంధించి ఏ విషయంలోనూ డ్వాక్రా సంఘాలకు ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందడం లేదు. ఇసుక అక్రమాలకు సర్కారు ఊతం... చంద్రబాబు తీసుకొచ్చిన కొత్త ఇసుక విధానం అమలులో ఆయన డొల్లతనం బయటపడింది. సొంత పార్టీ ఎమ్మెల్యేలను, నేతలను మెప్పించేం దుకు.. ఇసుక విధానంలో పొందుపరిచిన నిబంధనల అమలును ప్రభుత్వం పూర్తిగా పక్కనపెట్టేసింది. శనివారం నాటికి రాష్ట్రంలో 209 ఇసుక రీచ్‌లను ప్రభుత్వం డ్వాక్రా మహిళా సంఘాలకు అప్పగించగాా.. అందులో 193 రీచ్‌లలో ఇసుక అమ్మకాలు మొదలయ్యాయి. దాదాపు 12 వేల డ్వాక్రా గ్రూపులు ప్రాతినిధ్యం వహించే 550 గ్రామ సమైక్య సంఘాలకు ఇసుక రీచ్‌ల నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. కొత్త ఇసుక విధానం ఇసుక వ్యాపారం జరిపే తీరుపై గానీ, విధానంలో పొందుపరిచిన నియ మ నిబంధనలపై గానీ ఇప్పటి వరకు ఏ ఒక్క డ్వాక్రా సంఘ సభ్యురాలికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా శిక్షణా కార్యక్రమం నిర్వహించలేదు. ఒక్కొక్క ఇసుక రీచ్ నిర్వహణకు ఐదేసి లక్షల రూపాయలు ఏపీఎండీసీ ద్వారా ప్రభత్వం నిధులు ఇస్తుందని కొత్త విధానంలో స్పష్టంగా పేర్కొని.. అమలులో పక్కన పెట్టింది. బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించడంలోనూ ప్రభుత్వం చొరవ చూపకపోవడంతో.. రీచ్ నిర్వహణ బాధ్యతలు తీసుకున్న డ్వాక్రా మహిళలు పెట్టుబడి స్థానిక నేతలను ఆశ్రయించే పరిస్థితి ఏర్పడింది. ఈ సమయంలో టీడీపీ ఎమ్మెల్యేలు, స్థానిక అధికార పార్టీ నేతలు డ్వాక్రా మహిళలకు పెట్టుబడి పెట్టి ఈ వ్యాపారంలోకి పరోక్షంగా చొచ్చుకొచ్చారు. ఇప్పుడు పేరుకు డ్వాక్రా సంఘాల ద్వారా ఇసుక వ్యాపారం జరుగుతున్నప్పటికీ ప్రస్తుతం దాదాపు అన్ని రీచ్‌లలోనూ, స్టాక్ పాయింట్ల వద్ద టీడీపీ నేతలకు అనుకూలంగా ఉండేవారే పనిచేస్తున్నారు. ఇసుక రీచ్‌ల వద్ద సీసీ కెమెరాలేవీ? డ్వాక్రా మహిళల ద్వారా నిర్వహించే ఇసుక వ్యాపారంలో అక్రమాలకు తావు లేకుండా రీచ్‌ల వద్ద, స్టాక్ పాయింట్ల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి 24 గంటల పాటు అక్కడి వ్యవహారాలను రికార్డు చేస్తామని.. రాత్రి వేళ రీచ్‌లోనూ, స్టాక్ పాయింట్ వద్ద పటిష్టమైన పహారా నిర్వహిస్తామని.. స్టాక్ పాయింట్ల వద్ద ఇసుక లోడ్ చేసిన వాహనం, వే బిల్లు, ఇసుక చేరవేసే ప్రదేశం వంటి వివరాలను స్థానిక పోలీసు, రెవిన్యూ, ఇతర శాఖల అధికారులకు నిమిషాల వ్యవధిలో చేరవేయటం ద్వారా అక్రమ రవాణాను అరికడతామని.. కొత్త ఇసుక విధానంలో ప్రభుత్వం ప్రకటించింది. ఈ విధానం అమలులోకి వచ్చి నాలుగు నెలలవుతున్నా ఇప్పటి వరకు ఏ ఒక్క ఇసుక రీచ్‌లోనూ, స్టాక్ పాయింట్ వద్దా సీసీ కెమోరాల ఏర్పాటు జరగలేదు. గుంటూరు జిల్లాలో కొన్నింటి వద్ద ఏర్పాటుకు టెండర్లు ఖరారు చేసింది. పెలైట్ ప్రాజెక్టుగా ఆ ఆరు చోట్ల దీనిని అమలు చేసి, అక్కడి పర్యవసానాల ఆధారంలో తరువాత మిగతా చోట్ల విస్తరించాలన్నది అధికారుల ఆలోచన. సంఘాలకు ఇచ్చేది మూడు రూపాయలే... ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇసుక వ్యాపారం చేస్తే ప్రతి క్యూబిక్ మీటర్ అమ్మకానికి రూ. 3 మాత్రమే రీచ్‌లను నిర్వహించే మహిళా సంఘాలకు దక్కుతుంది. వినియోగదారుడికి క్యూబిక్ మీటర్ ఇసుక రూ. 650 వరకు ప్రభుత్వం అమ్ముతున్నప్పటికీ ప్రతి క్యూబిక్ మీటర్ అమ్మకంపై రూ. 15 అక్కడ పనిచేసే ఉద్యోగుల జీతాల కోసం, రీచ్ ఉన్న గ్రామంలో ఉండే మహిళా సంఘాలన్నింటికీ కలిపి రూ. 3 ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈ కారణంగా రీచ్‌లో అక్రమాలకు ఆస్కారమేర్పడుతోంది. సంక్షిప్తంగా రీచ్‌ల సమాచారం.. - రాష్ట్రంలో అందు బాటులో ఉన్న ఇసుక పరిమాణం: 1,64,21,013 క్యూబిక్ మీటర్లు - ప్రభుత్వం ఆశించిన ఆదాయం (ఏడాదికి): రూ. 2,500 కోట్లు - గనులశాఖ అంచనాల ప్రకారం ప్రతి నెలా అమ్మకాలకు అవకాశం: 15-25 లక్షల క్యూబిక్ మీటర్లు - కొత్త ఇసుక విధానంలో నాలుగు నెలల్లో అమ్మకాలు జరిగిన ఇసుక పరిమాణం: 15,96,497 క్యూబిక్ మీటర్లు (శనివారం నాటికి) - సెప్టెంబరులో మొదలైనా నవంబరు, డిసెంబరు నెలల్లోనే ఈ విధానంలో ఎక్కువ అమ్మకాలు జరిగాయి - గత వారం రోజులుగా రోజు వారీ అమ్మకాల సరాసరి: రోజుకు 37 వేల క్యూబిక్ మీటర్లు - కొత్త విధానంలో శనివారం నాటికి అమ్మకాల విలువ: రూ. 106.03 కోట్లు రాత్రి వేళ ఇసుక తోడేస్తున్న తోడేళ్లు... మరోపక్క.. ఇసుక రీచ్‌లు, స్టాక్ పాయింట్ల వద్ద రాత్రి వేళ కాపలాదారులను నియమిం చేకునే బాధ్యతను ప్రభత్వుం ఆయా రీచ్‌ల ను నిర్వహించే డ్వాక్రా సంఘాలకే అప్పగిం చారు. దీంతో పరోక్షంగా ఇసుక రీచ్‌లపై అధిపత్యం చెలాయిస్తున్న టీడీపీ నేతలు రాత్రి వేళ భారీగా ఇసుక తరలించుకొని పోతున్నారు. శ్రీకాకుళం, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో పలుచోట్ల రాత్రి వేళ ఇసుకను తరలించే వాహనాలను పోలీసులు పట్టుకున్నప్పటికీ టీడీపీ నేతలు జోక్యం చేసుకొని విడిపించిన సంఘటనలు ఉన్నాయి. -
ఇసుక పాలసీని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాద్: కొత్త ఇసుక పాల సీపై తీవ్ర కసరత్తులు చేసిన తెలంగాణ ప్రభుత్వం అందుకు సంబంధించిన విధివిధానాలను శుక్రవారం ప్రకటించింది. ఇసుక పాలసీ విభజనను ఐదు కేటగిరీలుగా విభజించిన ప్రభుత్వం.. ఇసుక లభ్యతను మాత్రం మూడు కేటగిరీలుగా విభజించింది. ఇసుక తవ్వకం, రవాణా రేట్లను ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు సిద్ధమైన తెలంగాణ ప్రభుత్వం.. ఇసుక పాలసీ విధానాలు ఖరారు చేస్తూ జీవో నంబరు 38ను విడుదల చేసింది. దీంతో పాటు రాక్ సాండ్ ను ప్రోత్సహిస్తూ వ్యాట్, విద్యుత్ సబ్సిడీ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కేటగిరి-1 నదులు, కాలువల్లో లభించే ఇసుక కేటగిరి-2: రిజర్వాయర్, పరివాహక ప్రాంతాల్లో లభించే ఇసుకు కేటగిరి-3 ప్రైవేటు పట్టాభూముల్లో లభించే ఇసుకు -
పటిష్టంగా కొత్త ఇసుక పాలసీస
మండల టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు కలెక్టర్ యువరాజ్ ఆదేశం విశాఖ రూరల్ : జిల్లాలో కొత్త ఇసుక పాలసీని పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ అధికారులను ఆదేశించారు. బుధవారం తన చాంబర్లో వివిధ శాఖల అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నూతన ఇసుక పాలసీ అమలుకు విధివిధానాలు జారీ చేసిందని చెప్పారు. కలెక్టర్ చైర్మన్‌గా, డీఆర్డీఏ పీడీ కన్వీనర్‌గా ఆయా శాఖల అధికారులు సభ్యులుగా జిల్లా స్థాయి శాండ్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఇసుక తవ్వకాలకు వీలున్న నదీ పరివాహక ప్రాంతాలను గుర్తించి, సరిహద్దులను నిర్ణయిస్తూ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు జిల్లా స్థాయి ఇసుక కమిటీ అప్పగించాల్సి ఉందన్నారు. ఆ నివేదికను ఈ నెల 8కి తనకు సమర్పించాలన్నారు. ఆయా ఇసుక తవ్వక ప్రాంతాల్లోని ఎస్‌హెచ్‌జీలు, మండల మహిళా సమాఖ్యలతో ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేసి వారికి ఇసుక తవ్వకాలు, అమ్మకాలపై అవగాహనకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. తవ్విన ఇసుకను నిల్వ ఉంచేందుకు ప్రధాన రహదారుల దగ్గర్లో స్టాక్ పాయింట్ల ఏర్పాటుకు అనువైన ప్రదేశాలను గుర్తించాలన్నారు. ఇసుక అక్రమ తవ్వకాలపై నిఘా ఉంచి, వాహనాలను సీజ్ చేసి, బాధ్యులపై చర్యలు చేపట్టాలని చెప్పారు. తహశీల్దార్, ఎంపీడీఓ, పోలీసులతో మండల టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసి ఇసుక అక్రమ రవాణా అరికట్టాలని సూచించారు. ఇసుక తవ్వకాలు, లోడింగ్, అన్లోడింగ్ పనులకు ఉపాధి హామీ కూలీలను వినియోగించుకొనే అంశాన్ని పరిశీలించాలని డ్వామా పీడీని ఆదేశించారు. ఈ సమావేశంలో ఐటీడీఏ పీఓ వినయ్‌చంద్, ఎస్పీ కోయ ప్రవీణ్, డీఆర్డీఏ పీడీ సత్యసాయి శ్రీనివాస్, డ్వామా పీడీ శ్రీరాములు నాయుడు, జెడ్పీ సీఈఓ మహేశ్వరరెడ్డి, డీపీఓ సుధాకర్, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ గాయత్రీదేవి తదితరులు పాల్గొన్నారు.