
సాక్షి, అమరావతి : ఇసుక పాలసీకి సంబంధించి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంగళవారం 13 జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 5న సీఎం జగన్ ఇసుక తవ్వకానికి సంబంధించి కొత్త పాలసీని ప్రకటిస్తారని తెలిపారు. ప్రజలకు నాణ్యమైన ఇసుకను అందించేందుకు 100 రీచులను గుర్తించినట్లు పేర్కొన్నారు. 5వ తేది నుంచి స్టాక్ యార్డుల ద్వారా ఇసుకను సరఫరా చేస్తామని మంత్రి పెద్దిరెడ్డి వెల్లడించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో వివిధ జిల్లాల కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment