peddireddy ramachandrandra reddy
-
మంగళగిరిలో రాష్ట్ర అటవీశాఖ కార్యాలయం ప్రారంభం
-
పెద్దిరెడ్డి కాన్వాయ్ ప్రమాదంలో కుట్రకోణం
సాక్షి, అమరావతి: రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి ప్రయాణిస్తున్న కాన్వాయ్ రోడ్డు ప్రమాదానికి గురికావడం వెనుక కుట్ర కోణం దాగి ఉందని కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషగిరి అనుమానం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై విచారణ కమిషన్ వేసి నిజనిర్ధారణ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తాడేపల్లిలోని కాపు కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. తన ప్రయోజనాల కోసం చంద్రబాబు చేసే నీచ రాజకీయాలు, హత్యా రాజకీయాలు రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. చదువుకునే రోజుల నుంచి పెద్దిరెడ్డిని ఎదుర్కోలేని చంద్రబాబు ప్రతిసారి కుట్రలు చేసేవాడని ఆరోపించారు. రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్ అందిస్తున్న సంక్షేమ పాలనను ప్రజలకు వివరించి వారి నుంచి విశేష ఆదరణ పొందుతున్న పెద్దిరెడ్డిని ప్రత్యక్షంగా ఎదుర్కోలేక కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ ఏ మీటింగ్ పెట్టినా తాను సీఎం అవుతానని చెప్పడంలేదని, బాబును సీఎం చేయడానికే తాపత్రయ పడుతున్నట్టు అర్థమవుతోందన్నారు. చదవండి: (మంత్రి పెద్దిరెడ్డి, మిథున్‌రెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం) -
మంత్రి పెద్దిరెడ్డి, మిథున్‌రెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం
సాక్షి, అన్నమమ్య: మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. సంక్రాంతి పండుగ వేళ బంధువుల ఇంటికి మంత్రి పెద్దిరెడ్డి వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. కాన్వాయ్‌లోని వాహనాన్ని ఎదురుగా వచ్చిన మరో కారు ఢీకొట్టింది. వివరాల ప్రకారం.. రాయచోటి మండలం చెన్నముక్కపల్లె రింగ్ రోడ్డు వద్ద మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డిలకు తృటిలో ప్రమాదం తప్పింది. పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డిల కుటుంబ సభ్యులందరూ సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు పుంగనూరు నుండి వీరబల్లిలోని అత్తగారి ఇంటికి వెళ్తుండగా మార్గ మద్యంలో ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురుగా వచ్చిన ఓ కారు మిథున్ రెడ్డికి చెందిన కారును ఢీకొట్టింది. ఈ క్రమంలో ఆ కారు పల్టీలు కొట్టి కిందపడిపోయింది. కాగా, ప్రమాద సమయంలో మంత్రి పెద్దిరెడ్డి కారులో మిథున్ రెడ్డి ఉండటంతో ప్రమాదం తప్పింది. ఇక, ఈ ప్రమాదంలో మిథున్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి, భద్రతా సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
పెన్షన్ల విషయంలో చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారు: మంత్రి పెద్దిరెడ్డి
-
600 హామీలు ఇచ్చి మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు: పెద్దిరెడ్డి
శ్రీ సత్యసాయి జిల్లా: మడకశిరలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి, ఎంపీ గోరంట్ల మాధవ్, మాజీ మంత్రి శంకర్ నారాయణ, జెడ్పీ చైర్మన్ బోయగిరిజమ్మ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సమావేశంలో పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన 600 హామీలు ఇచ్చి మోసం చేసిన వ్యక్తి అని విమర్శలు గుప్పించారు. ప్రజల కోసం చిరస్థాయిగా నిలిచేలా చంద్రబాబు ఒక్క పథకమైనా తెచ్చారా? అని ప్రశ్నించారు. మరోవైపు మూడేళ్లలో 98.44 శాతం హామీలను నెరవేర్చిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిది అని పెద్దిరెడ్డి పేర్కొన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసమే గ్రామ, వార్డు సచివాలయాలు తీసుకొచ్చినట్లు చెప్పారు. సీఎం జగన్ పాలనపై ప్రజలంతా సంతృప్తిగా ఉన్నారని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. పార్టీ కోసం కష్టపడేవారికి గుర్తింపు ఉంటుందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి 175కు 175 సీట్లు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. చదవండి: నాణ్యతలో రాజీ పడొద్దు.. సీఎం జగన్ కీలక ఆదేశాలు -
వైఎస్సార్సీపీ శ్రేణులో జోష్
సాక్షి ప్రతినిధి, అనంతపురం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజినల్ కోఆర్డినేటర్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జిల్లాలో ఈ నెల 9 నుంచి 12 వరకు నిర్వహించిన సమీక్షలు పార్టీ శ్రేణుల్లో జోష్ నింపాయి. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీని సంస్థాగతంగా మరింత పటిష్టం చేయాలన్న సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పెద్దిరెడ్డి నాలుగు రోజుల పాటు 8 నియోజక వర్గాల్లో పర్యటించి విస్తృత స్థాయి సమీక్ష సమావేశాలు నిర్వహించారు. అక్కడక్కడ చిన్న చిన్న సమస్యలను అధిగమించేలా ద్వితీయ శ్రేణి నాయకత్వానికి సూచించారు. రానున్న ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకమని కార్యకర్తలకు చెప్పారు. ఇంకా ఏమి సూచించారో ఆయన మాటల్లోనే... హామీలన్నీ అమలు చేశాం : మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 98 శాతం అమలు చేశాం. కులాలు, వర్గాలు, పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల వారికి లబ్ధి చేకూర్చాం. అర్హత కలిగిన ఏ ఒక్క కుటుంబమూ లబ్ధిపొందని పరిస్థితి లేదు. గడప గడపకూ మన ఎమ్మెల్యేలు వెళ్లి వారికి జరిగిన లబ్ధి వివరిస్తున్నారు. ఎక్కడా వ్యతిరేకత అన్నది లేదు. అన్ని వర్గాలకు లబ్ధి కలిగిన విషయాన్ని మరింతగా ప్రచారం చేయాలి. ప్రతి కార్యకర్తా సైనికుడే : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రతి కార్యకర్తా సైనికుడే. చిన్న చిన్న విభేదాలున్నా పక్కన పెట్టి సమన్వయంతో పనిచేయాల్సి ఉంది. కార్యకర్తలే పార్టీకి సైనికులు. క్షేత్రస్థాయిలో పోరాటం మీదే. ప్రత్యేక పరిస్థితుల్లో ఏర్పడిన ఈ పార్టీకి మీరే దిక్సూచి. 2019 ఎన్నికల్లో 151 స్థానాల్లో మన పార్టీ విజయం సాధించిందంటే అది మీ వల్లే. మీ పోరాటం వృథా కాకూడదనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేదలందరికీ లబ్ధి చేకూరుస్తున్నారు. ధైర్యంగా గడప గడపకూ వెళ్తున్నాం :అధికార పార్టీ ప్రజల్లోకి వెళ్లాలంటే కొంచెం భయం ఉంటుంది. కానీ మూడున్నరేళ్ల తర్వాత మనం ఇంటింటికీ ధైర్యంగా వెళ్తున్నామంటే అది మన నాయకుడిపై ఉన్న విశ్వాసం, నమ్మకమే. ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఘనత మన ముఖ్యమంత్రిది. అప్పట్లో ఉచిత విద్యుత్‌పై వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మొదటి సంతకం చేస్తే, జగన్ తొలిరోజు నుంచే మేనిఫెస్టో అమలుకు కృషి చేస్తున్నారు. టీడీపీని నమ్మే స్థితిలో ప్రజలు లేరు : ప్రజా బలం లేనందు వల్లే చంద్రబాబు పచ్చ మీడియాపై ఆధారపడి వెళ్తున్నారు. ప్రభుత్వంపై ఎన్ని నిందలు వేస్తున్నా జనం నమ్మడం లేదనేది తెలుసు. టీడీపీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్లతో పొత్తులున్నా మనం భయపడాల్సిన పనిలేదు. కుటుంబం అన్నాక చిన్న చిన్న సమస్యలుంటాయి. వాటిని అధిగమించి రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ జెండాను ఎగురవేసి.. జగన్‌ను మళ్లీ సీఎంను చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. నాలుగు రోజుల పర్యటనలో పార్టీ శ్రేణులకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ మేరకు దిశానిర్దేశం చేశారు. -
‘ఈనాడు పత్రికకు చంద్రబాబు పిచ్చి పట్టుకుంది’
సాక్షి, విజయవాడ: ఈనాడు పత్రికకు చంద్రబాబు పిచ్చి పట్టుకుంది. విశాఖ రాజధానిగా ఇష్టం లేకపోవడం వల్లే కొన్ని పత్రికలు తప్పుడు వార్తలు రాస్తున్నాయి అని మంత్రి పెద్దిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, మంత్రి పెద్దిరెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. మూడు ప్రాంతాల అభివృద్ధే మా పార్టీ విధానం. ఈనాడు పత్రికకు చంద్రబాబు పిచ్చి పట్టుకుంది. రూ.లక్షల కోట్ల కబ్జా గతంలో రాసింది మీరే కదా?. సిట్ వేసింది కూడా చంద్రబాబు హయంలోనే కదా?. మీ రాతలతో చంద్రబాబు తలరాత మార్చడం సాధ్యం కాదు. కుక్కతోక వంకర మాదిరిగానే మీ బుద్ధి ఎప్పటికీ మారదు. విశాఖలో అక్రమాలకు పాల్పడిన అధికారులపైన మేము చర్యలు తీసుకున్నాం. చంద్రబాబుకు రాజకీయంగా నడిచే సామర్ధ్యం లేదు. టీడీపీ నాయకులు రిషికొండ దగ్గరకు వెళ్తే ఉత్తరాంధ్రను రక్షించినట్లు అవుతుందా?. పాదయాత్రను ఎందుకు మధ్యలోనే నిలిపివేశారో వారికే తెలియదు అంటూ కామెంట్స్ చేశారు. -
ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకోండి.. సీఎం జగన్ కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి: ఇంధనశాఖపై తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. సీఎం ఆదేశాల మేరకు గతంలో తీసుకున్న నిర్ణయాల అమలు ప్రగతిని విద్యుత్ శాఖ అధికారులు వివరించారు. ఈ సమావేశంలో విద్యుత్, అటవీ పర్యావరణం, భూగర్భ గనులు, శాస్త్ర సాంకేతిక శాఖమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, విద్యుత్ శాఖస్పెషల్ సీఎస్ కె విజయానంద్, ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్ ఎస్ ఎస్ రావత్, ఏపీ జెన్కో ఎండీ బి శ్రీధర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చదవండి: దివ్యాంగులు దరఖాస్తు చేసుకోండి సీఎం ఆదేశాల మేరకు విద్యుత్ డిమాండ్, కొనుగోళ్లు, మార్కెట్లో అందుబాటులో ఉన్న విద్యుత్, వాటి ధరలు తదితర అంశాలపై డేటా అనలిటిక్స్ ఎస్‌ఎల్‌డీసీలో ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. విద్యుత్ కొనుగోలు ఖర్చు తగ్గించుకునేందుకు ఇది చాలా ఉపయోగపడుతోందని అధికారులు పేర్కొన్నారు. కచ్చితమైన డిమాండ్‌ను తెలిపిపేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానాన్ని ఉపయోగించుకుంటున్నామని, గతంలో ఎంఓపీఈ 4 నుంచి 5 శాతం ఉంటే, ఇప్పుడు 2 శాతానికి తగ్గిందని అధికారులు తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు ట్రాన్స్‌ఫార్మన్ పాడైన 24 గంటల్లోపే ట్రాన్స్ఫార్మర్ పెడుతున్నామని, దీనివల్ల రైతులకు ఎలాంటి అవాంతరాలు లేకుండా విద్యుత్ అందిస్తున్నామని అధికారులు వివరించారు. గడచిన 90 రోజుల్లో 99.5శాతం ట్రాన్స్ఫార్మర్లను 24 గంటల్లోపే రీప్లేస్ చేశామని అధికారులు తెలిపారు. ఇది నూటికి నూరుశాతం జరగాలని సీఎం అన్నారు. ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే.. ♦బొగ్గు నిల్వలకు ఎలాంటి కొరత లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించిన సీఎం ♦విదేశీ బొగ్గు ధరలు మండిపోతున్న దృష్ట్యా దేశీయంగానే వీటిని సమకూర్చేకునేలా తగిన ప్రయత్నాలు చేయాలన్న సీఎం ♦వేసవి కోసం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్న సీఎం. ♦ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆ మేరకు చర్యలు తీసుకోవాలన్న సీఎం ♦సులియారీ, మహానది కోల్‌బాక్స్ నుంచి పూర్తిస్థాయి ప్రయోజనాలు పొందేలా ఆలోచనలు చేయాలని అధికారులకు సూచించిన సీఎం ♦వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెట్టుకునేందుకు ఇప్పటికే 16,63,705 మంది రైతుల అంగీకరించారన్న అధికారులు ♦రైతులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నందున వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తిచేస్తామన్న అధికారులు ♦వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ పంపిణీ అత్యంత పారదర్శకంగా, నాణ్యంగా, రైతులకు మేలు చేసేదిగా ఉండాలని స్పష్టం చేసిన సీఎం ♦అత్యంత మెరుగైన వ్యవస్థను తీసుకురావాలన్న సీఎం ♦రైతులకు మీటర్లపై నిరంతర అవగాహన కల్పించాలన్న సీఎం ♦దీనివల్ల కలుగుతున్న ప్రయోజనాలపై ఎప్పటికప్పుడు రైతులకు వివరాలు అందించాలన్న సీఎం ♦రైతుల పేరు చెప్పి దొంగతనంగా విద్యుత్ వాడుతున్న ఘటనలు కూడా దాదాపుగా అడ్డుకోగలుగుతున్నామన్న అధికారులు ♦మీటర్లు పెట్టడం వల్ల రైతులకు ఎంత కరెంటు అవసరమో తెలుస్తుంది: సీఎం ♦దీనివల్ల సరిపడా విద్యుత్‌ను వారికి పంపిణీ చేయడానికి వీలు కలుగుతుంది: సీఎం ♦దీనివల్ల రైతుల మోటార్లు కాలిపోవు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవు: సీఎం ♦రైతులకు ఒక్కపైసా కూడా ఖర్చు కాకుండా విద్యుత్ పంపిణీ సంస్థలే మీటర్లను బిగిస్తాయి: సీఎం ♦వినియోగించుకున్న విద్యుత్‌కు అయ్యే ఖర్చును కూడా నేరుగా రైతుల ఖాతాల్లోకి పంపుతారు. ♦అక్కడనుంచి ఆడబ్బు విద్యుత్ పంపిణీ సంస్థలకు చేరుతుంది: సీఎం ♦దీనివల్ల రైతులకు విద్యుత్ పంపిణీ సంస్థలు జవాబుదారీగా ఉంటాయి: ♦మోటార్లు కాలిపోయినా? నాణ్యమైన కరెంటు రాకపోయినా డిస్కంలను రైతు ప్రశ్నించగలుగుతాడు: సీఎం ♦ఈ వివరాలన్నింటిపైనా రైతులకు అవగాహన కల్పించాలి: సీఎం ♦శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన పైలట్ ప్రాజెక్టు కారణంగా రైతులకు పెద్ద ఎత్తున మేలు జరుగుతోంది: సీఎం ♦దీనివల్ల చాలా విద్యుత్ ఆదా అయ్యింది: సీఎం ♦ఈ వివరాలను కూడా విడుదల చేయాలని అధికారులకు సీఎం ఆదేశం ♦కృష్ణపట్నంలో 800 మెగావాట్ల యూనిట్ అందుబాటులోకి వచ్చిందని తెలిపిన అధికారులు ♦ఈ ప్రాజెక్టును ఇదే నెలలో ముఖ్యమంత్రిచే ప్రారంభిస్తామని తెలిపిన అధికారులు. ♦విజయవాడ థర్మల్ పవర్ కేంద్రంలో కూడా మరో 800 మెగావాట్ల కొత్త యూనిట్ కూడా వచ్చే ఏడాది మార్చినాటికి పూర్తిచేస్తామని తెలిపిన అధికారులు ♦జగనన్న కాలనీల్లో విద్యుత్ సదుపాయం కల్పనపై వివరాలు తెలిపిన అధికారులు ♦కాలనీలు పూర్తయ్యే కొద్దీ విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ సదుపాయాలు కల్పించాలన్న సీఎం ♦క్రమేణా ఇతర మౌలిక సదుపాయాలను మెరుగుపరుచుకుంటూ పోవాలన్న సీఎం పంప్డు స్టోరేజీ ప్రాజెక్టులపైనా సీఎం సమీక్ష ♦రాష్ట్రంలో పంప్డు స్టోరేజీ ప్రాజెక్టుల ప్రగతిని వివరించిన అధికారులు ♦పంప్డు స్టోరేజీ ప్రాజెక్టుల వల్ల రాష్ట్రానికి చక్కటి ప్రయోజనాలున్నాయి: సీఎం ♦ప్రాజెక్టులకు భూములు ఇచ్చిన వారికి, అసైన్డ్ భూములున్న వారికి కూడా ఏడాదికి ఎకరాకు రూ.30వేల చొప్పున ప్రయోజనం: సీఎం ♦దీర్ఘకాలం ఈ ప్రయోజనాలు అందుతాయి: సీఎం ♦ప్రతి రెండేళ్లకు ఒకసారి 5శాతం చొప్పున ఈ ధర పెరుగుతుంది భూమిలిచ్చే రైతులకు గరిష్ట ప్రయోజనం కల్పించాలన్నదే ఉద్దేశం, దానికోసమే ఈ విధానానికి శ్రీకారం చుట్టాం ♦గ్రీన్ఎనర్జీ ఉత్పత్తికోసం భారీ ప్రాజెక్టు ప్రతిపాదనలు రాష్ట్రానికి అందాయన్న అధికారులు ♦గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్అమ్మోనియా ప్రాజెక్టులను పెడతామంటూ రాష్ట్ర ప్రభుత్వానికి రెన్యూ కంపెనీ నుంచి ప్రతిపాదనలు వచ్చాయన్న అధికారులు ♦విశాఖపట్నం, కాకినాడ పోర్టులకు సమీపంలో ఈ ప్రాజెక్టులు పెట్టేందుకు ప్రతిపాదించారన్న అధికారులు ♦దాదాపుగా రూ.20వేల కోట్లు పెట్టుబడులు వీటికోసం పెడతామని ప్రతిపాదించారని తెలిపిన అధికారులు ♦అలాగే ఎన్టీపీసీ నుంచి కూడా ప్రతిపాదనలు వచ్చాయన్న సీఎంకు తెలిపిన అధికారులు ♦విశాఖ జిల్లా పూడిమడక సమీపంలో గ్రీన్ హైడ్రోజన్ ఇ– మెథనాల్, గ్రీన్అమ్మోనియా, ఆఫ్ షోర్ విండ్ పవర్, హైడ్రోజన్ ఆధారిత విద్యుత్ కేంద్రాలపై రూ. 95వేల కోట్ల ♦పెట్టుబడులు పెడతామన్న ప్రతిపాదనలు వచ్చాయని తెలిపిన అధికారులు ♦పోలవరం విద్యుత్ ప్రాజెక్టులో నిర్మాణ పనుల ప్రగతిని వివరించిన అధికారులు ♦ఇప్పటికే టర్బైన్ మోడల్ టెస్ట్ ముగిసిందని, ఇంజనీరింగ్ డ్రాయింగ్స్ వేగంగా పూర్తవుతున్నాయని తెలిపిన అధికారులు. పవర్ హౌస్‌లో కాంక్రీటు పనులు ముందుకు సాగుతున్నాయని తెలిపిన అధికారులు. ♦అప్పర్ సీలేరులో 1350 మెగావాట్ల ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్ పూర్తయ్యిందని తెలిపిన అధికారులు ♦టెండర్ల ప్రక్రియకు సిద్ధమవుతున్నామని తెలిపిన అధికారులు -
దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ భేటీ.. హాజరైన ఏపీ మంత్రులు బుగ్గన, పెద్దిరెడ్డి
సాక్షి, తిరువనంతపురం: దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ కేరళ రాజధాని తిరువనంతపురంలో శనివారం సమావేశమైంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో వివిధ రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా ఉన్న వివిధ అంశాలపై చర్చించారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, విద్యుత్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా విభజన సమస్యలను మంత్రులు ప్రస్తావించారు. అలాగే తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టుకు పూర్తి నిధులు ఇవ్వాలని కోరారు. రెవెన్యూ లోటు గ్రాంట్, 7 జిల్లాల ప్యాకేజీ నిధులు, రామాయపట్నం పోర్టు, భోగాపురం ఎయిర్‌పోర్టు గురించి సైతం ప్రస్తావించారు. మరోవైపు ఈ సమావేశానికి తెలంగాణ తరపున హోంమంత్రి మహమూద్ ఆలీ, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. వీరు ఏపీ, తెలంగాణ మధ్య విద్యుత్ బకాయిలు, విభజన సమస్యలు, కృష్ణా జలాల పంపిణీ, నీటిపారుదలకు సంబంధించిన అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. చదవండి: పులివెందులను టచ్ చేసే దమ్ము చంద్రబాబుకు ఉందా?: జోగి రమేష్ -
చంద్రబాబు ఇంగ్లీష్ పై మంత్రి పెద్దిరెడ్డి సెటైర్లు
-
CM Jagan: ప్రొఫెషనలిజం ద్వారా ఆదాయాలు పెంచండి
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెవెన్యూ ఎర్నింగ్ శాఖలపై శుక్రవారం సమీక్ష చేపట్టారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి.. పలువురు మంత్రులు, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన రెవెన్యూ ఎర్నింగ్ శాఖలపై రివ్యూ మీటింగ్‌లో.. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్స్, రవాణా, భూగర్భగనులు, అటవీ తదితర శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా.. శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు సీఎం జగన్. అదే సమయంలో ఆదేశాలు, కీలక సూచనలతో పాటు ప్రొఫెషనలిజం ద్వారా ఆదాయాలు పెంచుకోవాలని అధికారులకు సూచించారాయన. ►ఓటీఎస్ పథకం కింద లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్లను వేగంగా పూర్తిచేయాలని సీఎం జగన్ ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. ► టిడ్కోకు సంబంధించి కూడా రిజిస్ట్రేషన్లను పూర్తిచేయాలి. ► గ్రామ, వార్డు సచివాలయాల్లోకి రిజిస్ట్రేషన్ సేవలు అందుబాటులోకి తీసుకు వచ్చాక.. సిబ్బందికి, ఆపై ప్రజలకు అవగాహన కల్పించాలి. ► ఎలాంటి సేవలు పొందవచ్చు అనే దానిపైనా అవగాహన కల్పించాలి. ► కేవలం ఆస్తుల రిజిస్ట్రేషనే కాకుండా.. రిజిస్ట్రేషన్ పరంగా అందించే ఇతర సేవలపైన కూడా పూర్తిస్థాయి సమాచారం, అవగాహన కల్పించాలి. ► రిజిస్ట్రేషన్ ప్రక్రియతో న్యాయపరంగా ఎలాంటి హక్కులు వస్తాయి, ఎలాంటి భద్రత వస్తుందన్న విషయాలను తెలియజేయాలి. ► అక్టోబరు 2న తొలివిడతగా.. గ్రామాల్లో శాశ్వత భూ హక్కు, భూ రక్ష పత్రాలతో పాటు సంబంధిత సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు అందించడానికి చర్యలు తీసుకోవాలి అని సీఎం జగన్ ఆదేశించారు. ఈ సందర్భంగా అధికారులు.. ఇప్పటికే 650 గ్రామాల్లో జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పత్రాలతో పాటు రిజిస్ట్రేషన్ సేవలు అందించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు, ఈ గ్రామాల సంఖ్యను పెంచడానికి చర్యలు చేపట్టినట్లు అధికారులు సీఎం జగన్‌కు తెలిపారు. అంతేకాదు.. 14వేలమంది గ్రామ, వార్డు సెక్రటరీలకు రిజిస్ట్రేషన్‌పై శిక్షణ కూడా అందిస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో.. రిజిస్ట్రేషన్ సేవలు, భూ హక్కు–భూ రక్ష కింద పత్రాలు అందించే గ్రామాల సంఖ్యను పెంచడానికి ప్రయత్నించాలని సీఎం జగన్, అధికారులకు సూచించారు. వెదురు పెంపకాన్ని ప్రోత్సహించండి: సీఎం జగన్ వెదురు పెంపకాన్ని ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని అటవీశాఖకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. అలాగే.. మైనర్ మినరల్‌కు సంబంధించి కార్యకలాపాలు నిర్వహించని క్వారీలు 2,700కుపైగా ఉన్నాయని, కార్యకలాపాలు తిరిగి ప్రారంభించాల్సిన అవసరం ఉందని అధికారులు వెల్లడించారు. ఈ అంశంపై దృష్టి సారించాలని, తద్వారానే ప్రభుత్వానికి ఆదాయాలు పెరుగుతాయని సీఎం జగన్ చెప్పారు. ఏపీఎండీసీ నిర్వహిస్తున్న సులియారీ బొగ్గు గనుల నుంచి ఉత్పత్తి ప్రారంభమైందని అధికారులు వెల్లడించారు. జెన్కో సహా.. రాష్ట్రంలోని పలు పరిశ్రమలకు దీని నుంచి బొగ్గు సరఫరా అయ్యేలా చూసుకోవాలని, దీనివల్ల జెన్కో ఆధ్వర్యంలోని విద్యుత్ ప్రాజెక్టులకు మేలు జరుగుతుందన్న సీఎం జగన్ తెలిపారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బొగ్గు ధరలు మండిపోతున్న దృష్ట్యా.. ఈ బొగ్గును మన అవసరాలకు వినియోగించుకునేలా చూడాలని సీఎం జగన్ అధికారులతో చెప్పారు. దీనిపై కార్యాచరణ రూపొందించి తనకు నివేదించాలన్న సీఎం జగన్, తదుపరి కూడా బొగ్గుగనుల వేలం ప్రక్రియలో పాల్గొనడంపై దృష్టిపెట్టాలని అధికారులను ఆదేశించారు. సమీక్షలో వాణిజ్య పన్నుల శాఖ పునర్నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నారు సీఎం జగన్. శాఖలో ప్రతి ఒక్కరి పాత్ర, బాధ్యతలపై స్పష్టతతో పాటు డాటా అనలిటిక్స్ విభాగం, లీగల్‌సెల్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అలాగే.. బకాయిల వసూలుకు ఓటీఎస్ సదుపాయం కల్పించనున్నారు. జూన్‌కల్లా వాణిజ్య పన్నుల శాఖలో ఈ విభాగాల ఏర్పాటు జరగనుంది. వీటితో పాటు అక్రమ మద్యం తయారీ, అక్రమ మద్యం రవాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సీఎం జగన్. ఈ సమీక్షా సమావేశానికి ఉపముఖ్యమంత్రి (ఎక్సైజ్ శాఖ) కె నారాయణ స్వామి, రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఇంధన,అటవీ పర్యావరణ, భూగర్భగనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, అటవీ పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ స్పెషల్ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ జి సాయి ప్రసాద్, ఆర్ధికశాఖ స్పెషల్ సీఎస్ ఎస్ ఎస్ రావత్, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనులశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్సు ఎన్ ప్రతీప్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
టీడీపీ హయంలో ఇసుక తవ్వకాల్లో వందల కోట్ల అవినీతి: మంత్రి పెద్దిరెడ్డి
సాక్షి, తిరుపతి: ఏపీలో ఇసుక తవ్వకాలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. పెద్దిరెడ్డి శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఇసుక తవ్వకాలపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. గతంలో చంద్రబాబు ఇంటి పక్కనే అక్రమంగా ఇసుక తవ్వకాలు జరిగాయి. టీడీపీ సర్కార్ హయంలో ఇసుక తవ్వకాల్లో వందల కోట్ల అవినీతి జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయంలో పారదర్శక విధానంలో ఇసుక అమ్మాకాలు జరుగుతున్నాయి’’ అని తెలిపారు. -
పరిశ్రమలకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్..
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా బొగ్గు సంక్షోభం కారణంగా ఏర్పడిన విద్యుత్ కొరత కారణంగా పరిశ్రమలకు ఏప్రిల్ 8వ తేదీనుంచి విధించిన పవర్ హాలిడేను ఎత్తివేసినట్లు రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. అమరావతి సచివాలయంలో మంగళవారం ఇంధన శాఖ కార్యదర్శి బి. శ్రీధర్‌తో కలిసి మంత్రి విలేకరులతో మాట్లాడారు. చదవండి: మత్స్యకార భరోసా 13వ తేదీకి వాయిదా పరిశ్రమలపై విద్యుత్ ఆంక్షలను మరోసారి సడలిస్తూ వారంలో అన్ని రోజుల పాటు విద్యుత్ సరఫరా చేసేందుకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు సోమవారం రాత్రి ఆదేశాలు జారీ చేసిందని మంత్రి చెప్పారు. నిరంతరం విద్యుత్ వినియోగించే పరిశ్రమలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రోజు వారీ డిమాండ్‌లో 70 శాతం విద్యుత్‌ను వినియోగించు కోవడానికి అనుమతించిందన్నారు. మిగతా సమయంలో 50 శాతం వినియోగించు కోవచ్చన్నారు. ఈ నిబంధనలు మంగళవారం నుంచే అమలులోకి వస్తాయని మంత్రి స్పష్టం చేశారు. పగటిపూట పరిశ్రమలకు ఒక షిఫ్టుకే.. పగటిపూట పనిచేసే పరిశ్రమలకు వారంలో ఒక రోజు ఉన్న పవర్‌హాలిడేను తొలగించిందని, అయితే రోజుకి ఒక షిఫ్టు మాత్రమే నడపాలని, సాయంత్రం 6 గంటల తరువాత అనుమతిలేదని ఏపీఈఆర్సీ స్పష్టం చేసిందని మంత్రి పెద్దిరెడ్డి వివరించారు. మిగతా రాష్ట్రాల్లో ఇలా లేదు.. మన రాష్ట్రంలో కంటే దేశంలోని చాలా రాష్ట్రాల్లో విద్యుత్ కోతలను పెద్ద ఎత్తున విధించడం వల్ల పరిశ్రమలను మూసేసుకున్నారని, అటువంటి పరిస్థితులు మన రాష్ట్రంలో తలెత్తలేదన్నారు. విద్యుత్ సరఫరాలో నష్టాన్ని, చౌర్యాన్ని నియంత్రించేందుకు వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లను బిగించే పైలట్ ప్రాజెక్టును శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభించామని మంత్రి తెలిపారు. వ్యవసాయ బోర్లకు స్మార్ట్ మీటర్ల వల్ల ఎవరికీ నష్టం లేదని మీటర్లు పెట్టేది, సబ్సిడీ ఇచ్చేదీ కూడా ప్రభుత్వమే అయినప్పటికీ ఏదో జరిగిపోయినట్లు ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. వారెవరితో పొత్తుపెట్టుకుంటే ఏంటి.. గెలవలేనని తెలిసి చంద్రబాబు పొత్తుల గురించి మాట్లాడుతున్నారని, చంద్రబాబు, పవన్ కల్యాణ్ చేస్తున్న ప్రకటనల్లో పొంతన ఉండటంతో ఇద్దరూ పొత్తు పెట్టుకుంటున్న విషయాన్ని బహిరంగంగా చెప్పాలని తాము అడిగామన్నారు. కాలుష్య కారక సంస్థలపై కఠిన చర్యలు రాష్ట్రంలో కాలుష్యానికి కారణమవుతున్న పరిశ్రమలు, సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పర్యావరణ, అటవీ, ఇంధన, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పర్యావరణం పట్ల బాధ్యతగా వ్యవహరిస్తూ.. నిరంతర పర్యవేక్షణ చేయాలని కోరారు. నారాయణ అరెస్టులో కక్ష ఏముంది? టీడీపీ మాజీమంత్రి నారాయణ అరెస్టు కక్ష పూరితంగా చేసిందేమీ కాదని మంత్రి పెద్ది రెడి స్పష్టం చేశారు. సచివాలయంలో మంత్రి విలేకరులతో మాట్లాడారు. పేపర్ మాల్‌ప్రాక్టీస్ విషయంలో దాదాపు 60 మందిని అరెస్ట్ చేశారన్నారు. ఇదంతా నారాయణ కాలేజీల్లోనే జరిగిందని తేలిందని, అందువల్లనే నారాయణను అరెస్టు చేసుంటారని, దీనిలో తప్పేముందని మంత్రి ప్రశ్నించారు. -
‘పవన్’ నువ్వు ఏ పార్టీతో పొత్తులో ఉన్నావో ప్రజలకైనా చెప్పు..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష పార్టీల పొత్తులపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పెద్దిరెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడుతూ..‘‘2024 ఎన్నికల తర్వాత చంద్రబాబు రాజకీయల నుండి వైదొలగక తప్పదు. చంద్రబాబుకి ప్రజల్లో విశ్వసనీయత లేదు. ఒంటరిగా పోటీ చేస్తే గెలవడని చంద్రబాబుకి తెలుసు.. అందుకే పొత్తులకోసం పాకులాడుతున్నారు. చంద్రబాబుని అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకోమని సూచిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజల్లో అభిమానం ఉంది. అందుకే మేము ధైర్యంగా ఒంటరిగా పోటీ చేస్తున్నాం. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తోడు దొంగలని అందరికీ తెలుసు. బీజేపీతో పొత్తులో ఉండి టీడీపీతో మరో పొత్తుకు ప్రయత్నిస్తున్నాడు. పవన్ ఏ పార్టీతో పొత్తులో ఉన్నాడో ప్రజలకైనా స్పష్టత ఇవ్వాలి’’ అని సూచించారు. ఇది కూడా చదవండి: అందుకే దత్తపుత్రుడితో కలిసి బాబు కుయుక్తులు: ఎంపీ నందిగం సురేష్ -
జిల్లాల పునర్విభజన చారిత్రాత్మక నిర్ణయం: మంత్రి పెద్దిరెడ్డి
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి ప్రజల్లో లభిస్తున్న ఆదరణ చూసి చంద్రబాబు తట్టుకోలేకపోతున్నాడని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ఉంటూ ఏపీ ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడటం తగదని మండిపడ్డారు. ఎన్నికల్లో డబ్బులు పంచటం టీడీపి సంస్కృతని, ఇప్పటికే చంద్రబాబు తన అనుచరుల ద్వారా ఎన్నికల కోసం డబ్బులు కూడ పెడుతున్నారని ధ్వజమెత్తారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటర్లకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని, గతంకంటే వచ్చే ఎన్నికల్లో మరింత మెరుగైన ఫలితాలు సాధిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం జగన్ తీసుకున్న జిల్లాల పునర్విభజన ఒక చారిత్రాత్మక నిర్ణయమని కొనియాడారు. ఉగాది రోజున లాంచనంగా కొత్త జిల్లాలు ఏర్పాటు అవుతాయని, దీంతో కొత్త జిల్లాల వల్ల ప్రజలకు ప్రభుత్వ పాలన మరింత దగ్గర కానున్నట్లు మంత్రి తెలిపారు. -
భాకరాపేట ప్రమాద బాధితులను పరామర్శించిన పెద్దిరెడ్డి
సాక్షి, తిరుపతి: తిరుపతి సమీపంలోని భాకరాపేట వద్ద ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో పెళ్లి బృందానికి చెందిన పలువురు మృతి చెందడంపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సు ప్రమాద బాధితులను ఆయన పరామర్శించారు. తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు భరోసా ఇచ్చారు. రుయాతో పాటు, స్విమ్స్, బర్డ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఇది చాలా బాధాకరమైన ఘటన అని, రాత్రంతా అధికారులు స్పాట్లో ఉండి పర్యవేక్షించారని తెలిపారు. స్పాట్లో ఏడు మంది మృతి చెందారని, చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారని చెప్పారు. ప్రయాణించిన ప్రతి ఒక్కరికీ ఫ్యాక్చర్లు అయ్యాయని, అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం వైద్యం తీసుకుంటున్న వారికి ఎటువంటి ప్రాణాపాయం లేదని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ ఘటనపై సమీక్షించారని వెల్లడించారు. ఇప్పటికే మృతులకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేలు ఆర్థిక సహాయం ప్రకటించారని గుర్తుచేశారు. మంచి చికిత్స అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు. తక్షణం స్పందించిన అధికారులకు అభినందనలు తెలియజేశారు. భాకరాపేట ఘాట్‌లో తక్షణం రైలింగ్ ఏర్పాటుకు ఆదేశిస్తాని పేర్కొన్నారు. తాత్కాలికంగా ఆ రోడ్డులో రైలింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే రూ. 1500 కోట్లతో అక్కడ నాలుగు లైన్లు రోడ్డు మంజూరు అయ్యిందని గుర్తుచేశారు. ఆ రోడ్డు నిర్మాణం సమయంలో పూర్తి స్థాయిలో పర్మనెంట్ రైలింగ్‌కు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: ఎమ్మెల్యే చెవిరెడ్డి భాకరాపేట లోయలో పెళ్లి బస్సు బోల్తా ఘటనలో గాయపడ్డ వారిని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పరామర్శించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. బస్సు బోల్తా ఘటనలో ఎనిమిది మంది మరణించగా 45 మంది క్షతగాత్రులు తిరుపతి రుయా ఆసుపత్రి, స్విమ్స్ ఆసుపత్రి, బర్డ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రుయా ఆసుపత్రిలో ఒక అమ్మాయి పరిస్థితి విషమంగా ఉండటంతో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ అమ్మాయిని మెరుగైన వైద్యం కోసం స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. బస్సు బోల్తా ఘటనలో ప్రభుత్వ యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టిందని తెలిపారు. చదవండి: భాకరాపేట బస్సు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి.. -
అర్హతే ప్రామాణికంగా పింఛన్లు: మంత్రి పెద్దిరెడ్డి
సాక్షి, విజయవాడ: పాదయాత్రలో మహిళలు చెప్పిన అన్ని అంశాలను సీఎం జగన్ గుర్తుంచుకున్నారని.. అందుకే మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రతీ అంశాన్ని నెరవేరుస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. విజయవాడలో సెర్ప్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు. చదవండి: సీఎం వైఎస్ జగన్‌పై సినీ ఇండస్ట్రీ పెద్దల ప్రశంసలు ‘‘ఎన్ని ఇబ్బందులున్నా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. ప్రతీ పథకంలో మహిళలను భాగస్వామ్యులను చేశారు. ఏపీలో 35లక్షలకు పైగా కేవలం మహిళలకే పింఛన్లు ఇస్తున్నాం. ఏ రాష్ట్రంలోనూ ఏపీలో మాదిరిగా పెన్షన్లు ఇస్తున్న దాఖలాలు లేవు. అర్హతే ప్రామాణికంగా పింఛన్లు అందిస్తున్నారు. 50 శాతం రాజకీయ, ఉద్యోగ రిజర్వేషన్లు ఏపీలో తప్ప దేశంలో ఎక్కడా లేవు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా మహిళలకు రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. మహిళల కోసం దిశ యాప్ , దిశ చట్టం రూపొందించారు. సీఎం వైఎస్ జగన్‌కు, ప్రభుత్వానికి మహిళల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని’’ పెద్దిరెడ్డి అన్నారు. -
మంత్రి పెద్దిరెడ్డి, అధికారులకు సీఎం జగన్ అభినందనలు
సాక్షి, తాడేపల్లి: ముఖ్యంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, సెర్ప్ సీఈఓ ఇంతియాజ్ అహ్మద్ సీఎం క్యాంపు కార్యాలయంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా.. గ్రామీణ ప్రాంతాల్లో వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా పథకాల ద్వారా పేదల సుస్ధిరాభివృద్ధి కోసం సెర్ప్ (గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్ధ) చేపడుతున్న కార్యక్రమాలను ప్రశంసిస్తూ.. స్కోచ్ అందించిన గోల్డ్ అవార్డులను సీఎం వైఎస్ జగన్‌కు చూపించారు. ఈ మేరకు గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రిపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి, సెర్ప్ సీఈఓలను సీఎం జగన్ అభినందించారు. చదవండి: రిజిస్ట్రేషన్ సేవలను ప్రారంభించిన సీఎం జగన్ -
వరద బాధితులను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుంది: మంత్రి పెద్దిరెడ్డి
సాక్షి, చిత్తూరు: వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా చంద్రబాబు రాజకీయాలే చేస్తారని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చంద్రబాబు పర్యటనలో అడుగడుగునా టీడీపీ జెండాలే కనిపించాయని విమర్శించారు. తమ నాయకుడు.. సీఎం జగన్ చిత్తూరు పర్యటన నేపథ్యంలో తాము.. ఎక్కడా కూడా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయలేదని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. టీడీపీ నేతలు.. ప్రచారం కోసం మాత్రమే వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారని ఎద్దేవా చేశారు. వరదలలో నష్టపోయిన బాధితులను తమ ప్రభుత్వం అన్నివిధాల ఆదుకుంటుందని మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. -
డాక్టర్ దాసరి సుధను అభినందించిన సీఎం జగన్
-
డాక్టర్ దాసరి సుధను అభినందించిన సీఎం జగన్
అమరావతి: బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన డాక్టర్ దాసరి సుధను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘‘బద్వేలు అసెంబ్లీ ఉపఎన్నికలో అఖండ విజయాన్ని అందించిన ప్రతి అక్కచెల్లెమ్మకు, అవ్వాతాతకు, ప్రతి ఆత్మీయ సోదరునికి పేరుపేరునా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. శాసనసభ్యురాలిగా గెలుపొందిన డా. సుధమ్మకు నా అభినందనలు’’ అన్నారు సీఎం జగన్. బద్వేలు అసెంబ్లీ ఉపఎన్నికలో అఖండ విజయాన్ని అందించిన ప్రతి అక్కచెల్లెమ్మకు, అవ్వాతాతకు, ప్రతి ఆత్మీయ సోదరునికి పేరుపేరునా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. శాసనసభ్యురాలిగా గెలుపొందిన డా. సుధమ్మకు నా అభినందనలు. 1/2 — YS Jagan Mohan Reddy (@ysjagan) November 2, 2021 ‘‘దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనల వల్లే ఇంతటి ఘన విజయం సాధ్యమైంది. ఈ గెలుపు ప్రజాప్రభుత్వానికి, సుపరిపాలనకు మీరిచ్చిన దీవెనలుగా భావిస్తూ.. మరింత మంచి చేసేందుకు కృషి చేస్తాను’’ అని సీఎం జగన్ తెలిపారు. (చదవండి: ‘బద్వేలు తీర్పు సీఎం జగన్‌పై నమ్మకానికి నిదర్శనం’) దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనల వల్లే ఇంతటి ఘన విజయం సాధ్యమైంది. ఈ గెలుపు ప్రజాప్రభుత్వానికి, సుపరిపాలనకు మీరిచ్చిన దీవెనలుగా భావిస్తూ.. మరింత మంచి చేసేందుకు కృషి చేస్తాను. 2/2 — YS Jagan Mohan Reddy (@ysjagan) November 2, 2021 బద్వేల్ ఉప ఎన్నికలో భారీ విజయం నేపథ్యంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో మంగళవారం సీఎం జగన్‌ని కలిశారు. అలానే చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, విప్ కొరుముట్ల శ్రీనివాసులు కూడా సీఎం జగన్‌ని కలిశారు. చదవండి: ‘90 వేలకు పైగా మెజారిటీ ఇచ్చిన ప్రజలకు పాదాభివందనం’ చదవండి: అవార్డు గ్రహీత వీల్‌చైర్ ఫుట్‌స్టెప్స్‌ని సరి చేసిన సీఎం జగన్ -
కాణిపాకం వినాయకునికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి పెద్దిరెడ్డి
సాక్షి, చిత్తూరు: కాణిపాకం వరసిద్ధి వినాయకుడిని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సమేతంగా శుక్రవారం దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరుపున మంత్రి పెద్దిరెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఎమ్మెల్యే ఎస్ బాబు, ఆలయ అధికారి వెంకటేష్.. మంత్రికి ఘన స్వాగతం పలికారు. వేదపండితులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కాణిపాకం వినాయక ఆలయంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వామివారిని భక్తులు దర్శించుకుంటున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఇవీ చదవండి: మంచి పనులకు విఘ్నాలు తొలగాలి మహా గణపతిం మనసా స్మరామి... -
కోటి మొక్కలు నాటాలన్నదే లక్ష్యం: మంత్రి పెద్దిరెడ్డి
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో కోటి మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన అన్ని జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆగస్టు 31 నుంచి మొక్కలు నాటడం ప్రారంభించాలన్నారు. మొక్కలు నాటడంతో పాటు సంరక్షణ కూడా చూసుకోవాలన్నారు. నాటిన మొక్కలు చనిపోతే సర్పంచ్, అధికారులపై చర్యలు తీసుకుంటామని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. ఇవీ చదవండి: గాంధీ ఆసుపత్రి అత్యాచార ఘటనలో ట్విస్ట్ రమ్య హత్య కేసు: హెడ్ కానిస్టేబుల్ ధైర్య సాహసాలు -
అభివృద్ధి, సంక్షేమం సీఎం జగన్‌కు రెండు కళ్లు
సాక్షి, శ్రీకాళహస్తి: అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలన చేస్తున్నారని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. సోమవారం ఆయన శ్రీకాళహస్తిలో టిట్కో ఇళ్లు, జగనన్న కాలనీల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జగనన్న కాలనీలు కొత్త టౌన్లుగా తయారవుతాయన్నారు. జగనన్న కాలనీలో ఇంటికొక పండ్ల మొక్క పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. -
ఏపీ: స్వయం ఉపాధిలో ‘చేయూత’ మహిళలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 45–60 ఏళ్లలోపు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన వైఎస్సార్ చేయూత పథకం తొలి విడతలో 78 వేల రిటైల్ షాపులను మహిళలు ఏర్పాటుచేశారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. తొలి విడత చేయూత లబ్ధిదారులు 1,19,000 పశువులను, 70,955 గొర్రెలు, మేకలను కొనుగోలు చేశారని ఆయన చెప్పారు. గత ఏడాది అక్టోబర్ 12న వైఎస్సార్ చేయూత మొదటి విడత కార్యక్రమాన్ని అమలు చేశామని, దీనిలో మొత్తం 24,00,111 మంది లబ్ధిదారులకు రూ.4,500.20 కోట్ల మేర లబ్ధి జరిగిందన్నారు. రెండో ఏడాది 23.44 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు దాదాపు రూ.4,400 కోట్ల అర్థిక సాయం అందించామని మంత్రి తెలిపారు. మంచి ఆశయంతో ముఖ్యమంత్రి ప్రారంభించిన ఈ పథకాన్ని అమలుచేయడం, పర్యవేక్షించడంలో అధికారులు ఎంతో బాధ్యతగా వ్యవహరించాలని ఆయన ప్రశంసించారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రాంతాల వారీగా స్థానికంగా ఉన్న మార్కెటింగ్ అంశాలను అధ్యయనం చేయాలని.. అర్హత ఉన్న ప్రతిఒక్కరికీ పెన్షన్లు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో గురువారం వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ పెన్షన్ కానుక, జగనన్న పల్లెవెలుగు, గ్రామ పంచాయతీల్లో లేఅవుట్లపై సంబంధిత అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్ చేయూత పథకంలో భాగంగా ఇప్పటికే రిలయన్స్, ఏజియో, మహేంద్ర అండ్ ఖేధీ వంటి ప్రముఖ సంస్థలు మహిళల వ్యాపార కార్యకలాపాలకు అవసరమైన మార్కెటింగ్‌లో శిక్షణకు ముందుకు వచ్చాయన్నారు. వీధి దీపాల నిర్వహణలో ఏజెన్సీ విఫలం గ్రామ పంచాయతీల్లో ఎల్ఈడీ వీధి దీపాలను నిర్వహిస్తున్న కాంట్రాక్టు ఏజెన్సీ పనితీరుపట్ల మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. రాష్ట్రంలో వీధిదీపాలకు చెల్లిస్తున్న విద్యుత్ బిల్లును తగ్గించాలనే లక్ష్యంతో జగనన్న పల్లెవెలుగు కింద రాష్ట్రవ్యాప్తంగా ఎల్ఈడీ బల్బులను ఏర్పాటుచేశామని.. అయితే వీటి నిర్వహణలో కాంట్రాక్టింగ్ ఏజెన్సీ విఫలమయ్యిందన్నారు. పట్టపగలు కూడా వీధి దీపాలు వెలుగుతుండడంపై అనేక ఫిర్యాదులు ఉన్నాయని పెద్దిరెడ్డి అన్నారు. వీటి నిర్వహణలో ఎనర్జీ అసిస్టెంట్లను భాగస్వాములను చేయాలని ఆయన కోరారు. ఇక పంచాయతీల్లో అక్రమ లేఅవుట్లను గుర్తించి, వాటిపై చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. సమీక్షలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పీఆర్ అండ్ ఆర్డీ కమిషనర్ గిరిజాశంకర్, సెర్ప్ సీఈఓ ఎన్ఎండీ ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు. -
ఎంపీ రెడ్డప్పను పరామర్శించిన మంత్రి పెద్దిరెడ్డి
సాక్షి, ఢిల్లీ: వైఎస్సార్సీపీ చిత్తూరు ఎంపీ రెడ్డెప్పను రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి శనివారం పరామర్శించారు. ఎంపీ రెడ్డప్ప ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో ఉన్న చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గుండెపోటు రావడంతో ఆయన్ను ఢిల్లీలోని ఫోర్టీస్ హాస్పిటల్లో చేర్పించారు. ఆయనకు వైద్యులు గుండె ఆపరేషన్ చేశారు. -
ఏపీ: వారంలో రెండుసార్లు సచివాలయాలకు మంత్రులు
-
గోబర్ గ్యాస్, సేంద్రియ ఎరువుల ఉత్పత్తికి ప్లాంట్ల ఏర్పాటు: పెద్దిరెడ్డి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ లోని గ్రామీణ ప్రాంతాల్లో పశు, వ్యవసాయ వ్యర్థాల నుంచి సంప్రదాయేతర ఇంధన వనరులు, సేంద్రియ ఎరువుల ఉత్పత్తి కోసం కేంద్రప్రభుత్వం నిర్ధేశించిన గోబర్-ధన్ పథకంను పైలెట్ ప్రాజెక్ట్ గా నాలుగు జిల్లాల్లో అమలు చేయనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. గాల్వనైజింగ్ ఆర్గానిక్ బయో అగ్రో రిసోర్స్ (గోబర్) ధన్ పథకంపై కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ అధికారులతో కలిసి కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ వివిధ రాష్ట్రాలకు చెందిన గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రులతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫెరెన్స్‌లో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో గోబర్ ధన్ పథకం కింద పశు వ్యర్థాలు, వ్యవసాయ వ్యర్థాలను కూడా సరైన పద్దతుల్లో వినియోగించుకునేందుకు ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం ఒక కార్యచరణను రూపొందించినట్లు వెల్లడించారు. కృష్ణ, అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్ట్ గా ఈ పథకంను అమలు చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. గోబర్ ధన్ పథకం అమలులో భాగంగా రాష్ట్ర స్థాయిలో అపెక్స్, అడ్వయిజరీ కమిటీని ఏర్పాటు చేస్తున్నామని, జిల్లా స్థాయిలో కలెక్టర్ల నేతృత్వంలో వ్యవసాయ, పశుసంవర్థక, పాల ఉత్పత్తిదారుల సంఘాలు, స్వయం సహాయక సంఘాల భాగస్వామ్యంతో ఈ పథకంను ముందుకు తీసుకువెళ్ళేందుకు కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ కమిటీలను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యుఎస్ విభాగాలు సమన్వయం చేస్తాయని వివరించారు. గోబర్ ధన్ కోసం ప్రతి జిల్లాకు రూ.50 లక్షలు కేటాయించినట్లు మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. -
సచివాలయ వ్యవస్థ ప్రపంచస్థాయి గుర్తింపు పొందింది
సాక్షి, చిత్తూరు: సచివాలయ వ్యవస్థ ప్రపంచస్థాయి గుర్తింపు పొందిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. 'కుప్పం వాసులకు సాగు, తాగునీరు అందించి తీరుతాం.రాష్ట్రంలో అభివృద్ధి చంద్రబాబు, ఎల్లోమీడియాకు కనిపించట్లేదా. చంద్రబాబు డైరెక్షన్లో ఎల్లోమీడియా పనిచేస్తోంది.' అని పెద్దిరెడ్డి తెలిపారు. -
ఏపీ: సమగ్ర సర్వేతో భూ వివాదాలకు చెక్: మంత్రులు
సాక్షి, అమరావతి: జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్షపై మంత్రుల కమిటీ శుక్రవారం సమావేశమైంది. డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , బొత్స సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ, వందేళ్ల తర్వాత తొలిసారి ఈ తరహా సమగ్ర సర్వే జరుగుతుందన్నారు. జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్షతో భూ వివాదాలకు చెక్ పడుతుందని మంత్రులు అన్నారు. ఆధునిక డ్రోన్, రోవర్ల సహకారంతో భూ సర్వే నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. భూ సర్వేకు రాష్ట్రంలో 70 కోర్ స్టేషన్లు ఏర్పాటు చేశామన్నారు. ముందుగా గ్రామాల సరిహద్దుల గుర్తింపునకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రులు వివరించారు. సమగ్ర సర్వే కోసం 12వేల మంది సిబ్బందికి శిక్షణ పూర్తి చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు 736 గ్రామాల్లో ల్యాండ్ పార్సిల్ మ్యాప్‌లు సిద్ధం చేసినట్లు తెలిపారు. 70లక్షల అసెస్మెంట్లకు గానూ 13.7లక్షల అసెస్మెంట్ల పరిశీలన పూర్తయ్యిందని, సమగ్ర భూ సర్వే ద్వారా రెవిన్యూ రికార్డుల ప్రక్షాళన పూర్తి చేసినట్లు మంత్రులు వెల్లడించారు. -
వారికి ఆ పదవే తొలిమెట్టు: మంత్రి పెద్దిరెడ్డి
సాక్షి, కృష్ణా: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రాన్ని గ్రామ స్వరాజ్యం దిశగా నడిపిస్తున్నారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామ సర్పంచ్‌లకు పరిపాలనను సులభతరం చేశారన్నారు. కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంలో సర్పంచ్ల శిక్షణా కార్యక్రమాన్ని మంత్రి పెద్దిరెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజా ప్రతినిధులుగా ఎదిగేందుకు గ్రామ సర్పంచ్ పదవి తొలిమెట్టు అని, సమర్థ నాయకత్వంతో గ్రామాలను అభివృద్ధి పథంలో నిలపాలని తెలిపారు. అందుకు అవసరమైన శిక్షణను ప్రభుత్వం అందిస్తోందని గుర్తుచేశారు. సంక్షేమం, అభివృద్ధిని ప్రజలకు చేరువ చేసే బాధ్యత సర్పంచులదే అని పేర్కొన్నారు. గ్రామ పరిపాలనలో సర్పంచ్ల పనితీరే కీలకమని, క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలను సద్వినియోగపరచాలని పెద్దిరెడ్డి తెలిపారు. -
‘జగనన్న పచ్చతోరణం’ కింద ఈ ఏడాది కోటి మొక్కలు: పెద్దిరెడ్డి
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల వెంబడి 17 వేల కిలోమీటర్ల పొడవున ఈ ఏడాది కోటి మొక్కల్ని నాటేందుకు ‘జగనన్న పచ్చతోరణం’ కార్యక్రమం అమలు చేస్తున్నట్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. నాటిన ప్రతి మొక్క బతికేలా.. రాష్ట్రంలో పచ్చదనం విలసిల్లేలా అధికారులు, సిబ్బంది బాధ్యత తీసుకోవాలన్నారు. పచ్చతోరణం కార్యక్రమం నిర్వహణపై గ్రామీణాభివృద్ధి శాఖ 13 జిల్లాల అధికారులకు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మంగళవారం వర్క్‌షాప్ జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్రాన్ని ఆకు పచ్చని ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పమని, నాటిన మొక్కల్లో 90 శాతానికి పైగా బతికించాలన్నది ఆయన లక్ష్యమని చెప్పారు. గతంలో మాదిరిగా మొక్క నాటడంతో సరిపెట్టడం లేదని, ప్రతి మొక్క సంరక్షణ కోసం ట్రీ గార్డులు ఏర్పాటు చేసే వీలు కల్పించామని చెప్పారు. మొక్కలకు నీటి తడులు అందించేందుకు ప్రతినెలా డబ్బులు కూడా కేటాయిస్తున్నామన్నారు. ప్రతి పంచాయతీలో నాటిన మొక్కల్లో కనీసం 83 శాతం మొక్కలను సంరక్షించాల్సిన బాధ్యతను ఆ గ్రామ సర్పంచ్‌పై పెడుతున్నట్టు చెప్పారు. లేనిపక్షంలో వారు పదవికి అనర్హులుగా ప్రకటించేలా నిబంధనలు ఉన్నాయనే విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. మొక్కల సంరక్షణతో నిరుద్యోగులకు ఉపాధి మొక్కల సంరక్షణ బాధ్యతను నిరుద్యోగ యువతకు అప్పగించడం ద్వారా వారికి ఉపాధి కల్పించాలని మంత్రి పెద్దిరెడ్డి అధికారులకు సూచించారు. ప్రతి మొక్కకు నెలకు నాలుగు తడుల చొప్పున ఇవ్వాల్సి ఉంటుందని, ప్రతి తడికి రూ.5 చొప్పున కిలోమీటర్ పరిధిలో కనీసం 400 మొక్కల్ని సంరక్షిస్తే నెలకు రూ.8 వేల చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పారు. 10 కిలోమీటర్ల పరిధిలోని మొక్కల సంరక్షణ బాధ్యతను తీసుకొనే వారు ట్రాక్టరు కొనుక్కుంటే రెండేళ్లు తిరిగే సరికి అతనికి కొనుగోలు ఖర్చు లభించి ట్రాక్టరు మిగిలే అవకాశం ఉంటుందని వివరించారు. ఈ ఏడాది మొక్కల పెంపకంలో ఉత్తమ ఫలితాలు సాధించిన తొలి మూడు జిల్లాల అధికారులను ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సమక్షంలో సన్మానిస్తామని, అదే సమయంలో చివరి మూడు స్థానాల్లో నిలిచే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఏడాది 44 వేల మంది రైతులకు చెందిన 70 వేల ఎకరాల్లో పండ్ల తోటలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యానికి అనుగుణంగా అధికారులు పనిచేయాలని సూచించారు. గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజాశంకర్ మాట్లాడుతూ.. ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న పచ్చతోరణం పక్షోత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో అటవీ శాఖ ప్రధాన ముఖ్య సంరక్షణాధికారి (సోషల్ ఫారెస్ట్) చిరంజీవి చౌదరి, ఉద్యావ శాఖ కమిషనర్ శ్రీధర్, గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్ కమిషనర్ నవీన్‌కుమార్, సెర్ప్ సీఈవో రాజాబాబు, డైరెక్టర్ చినతాతయ్య, పంచాయతీరాజ్ ఈఎన్సీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. -
చిత్తూరు జిల్లాకు కృష్ణా జలాలు తీసుకొస్తాం: పెద్దిరెడ్డి
సాక్షి, చిత్తూరు: కరువు ప్రాంతమైన చిత్తూరు జిల్లాకు సాగు, తాగు నీరు అందించాలని సీఎం జగన్మోహన్రెడ్డి నిర్ణయించుకున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా తంబాలపల్లి మల్లయ్య కొండలో ఉంటున్న పురాతన ఆలయం మల్లికార్జున స్వామి గుడి జీర్ణోద్ధరణ కార్యక్రమానికి మంత్రి పెద్దిరెడ్డి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ ఎన్ని కుట్రలు పన్నినా చిత్తూరు జిల్లాకు కృష్ణా జలాలు తీసుకొస్తామన్నారు. కుప్పంకు కూడా తాగు, సాగునీరు అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. వచ్చే శివరాత్రికి మల్లయ్య కొండ ఆలయ నిర్మాణాలు పూర్తి అవుతాయని అన్నారు. తంబళ్లపల్లె నియోజకవర్గం తోపాటు జిల్లాలోని అన్ని ప్రాంతాలకు సాగు, నీరు అందింస్తామని తెలిపారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధి సంక్షేమం గురించి విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలు ఒకసారి తంబళ్లపల్లె కొచ్చి చూడాలని అన్నారు. సీఎం జగన్ చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు ఓర్వలేక పోతున్నామని మండిపడ్డారు. రూ.3కోట్లతో ఈ గుడిని ఆధునీకరణ చేయనున్నారు. అలాగే ఆరు కోట్ల రూపాయలతో రోడ్డు వసతిని కల్పించనున్నారు. మల్లయ్య కొండలో మల్లికార్జున స్వామి గుడికి భూమి పూజ జరిగిన కార్యక్రమంలో మంత్రితో పాటు ఎంపీ రెడ్డప్ప ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, నవాబ్ భాష, శ్రీనివాసులు, వెంకటేశ్ గౌడ తదితరులు పాల్గొన్నారు. -
విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలు జరగడం లేదు: పెద్దిరెడ్డి
సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలు జరగడం లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి స్పష్టం చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకే లెట్రెయిట్‌కి అనుమతి ఇచ్చామని పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలోనూ లెట్రెయిట్ లీజులు ఇచ్చారని గుర్తు చేశారు. అప్పుడు తవ్వితే లెట్రెయిట్.. ఇప్పుడు తవ్వితే బాక్సైట్ అవుతుందా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వచ్చాకే శాశ్వతంగా బాక్సైట్ తవ్వకాల జీవోలు రద్దు చేశారన్నారు. చంద్రబాబు హయాంలో జరిగిన అక్రమ మైనింగ్‌పై విచారణ జరిపామని తెలిపారు. అక్రమంగా 2 లక్షల టన్నులు తవ్వినందుకు రూ.20 కోట్ల జరిమానా వేశామన్నారు. ఇప్పుడు తమ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. మైనింగ్ ప్రాంతానికి టీడీపీ నేతలు వెళ్తే ఏమొస్తుందని ప్రశ్నించిన పెద్దిరెడ్డి.. వాళ్లేమన్నా మైనింగ్‌ను నిర్ధారించే నిపుణులా అని నిలదీశారు. ప్రజలను టీడీపీ తప్పుదోవ పట్టిస్తోందని మండిపడ్డారు. -
ఏపీ: ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన
చక్రాయపేట/బి.కొత్తకోట: గాలేరు–నగరి సుజల స్రవంతి, ఏవీఆర్ హంద్రీ–నీవా సుజల స్రవంతి ప్రాజెక్టులను అనుసంధానిస్తూ వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో నిర్మించే ఎత్తిపోతల పథకాల్లో భాగంగా చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గ పరిధిలోని ములకల చెరువు మండలం నాయనిచెరువు వద్ద చేపట్టే పనులకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదివారం శంకుస్థాపన చేసి ప్రత్యేక హోమం, పూజలు నిర్వహించారు. మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ నీటి పారుదల రంగానికి సీఎం వైఎస్ జగన్ ప్రాధాన్యత ఇచ్చి నిధులు మంజూరు చేస్తున్నట్టు చెప్పారు. రూ.4,373 కోట్ల అంచనా వ్యయంతో మూడేళ్లలో ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేయించనున్నట్టు చెప్పారు. గండికోట రిజర్వాయర్ నుంచి తంబళ్లపల్లె నియోజకవర్గంలోని హంద్రీ–నీవా పుంగనూరు ఉప కాలువ ద్వారా తంబళ్లపల్లె, మదనపల్లె, పుంగనూరు, పలమనేరు, కుప్పం వరకు కృష్ణా జలాలను తరలిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్యేలు ద్వారకనాథరెడ్డి, నవాజ్‌బాషా, వెంకటేగౌడ పాల్గొన్నారు. 3 లక్షల ఎకరాలకు సాగునీరు రైతుల కళ్లల్లో ఆనందం చూడాలన్న లక్ష్యంతో 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే బృహత్తర పథకానికి సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ఆదివారం కాలేటివాగు వద్ద ఎత్తిపోతల ప్రాజెక్ట్ పథకం నిర్మాణానికి భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఎంపీ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక చొరవ చూపి కృష్ణా జలాలతో చక్రాయపేట మండలంలోని 45 చెరువులతోపాటు రాయచోటి నియోజకవర్గంలోని రామాపురం, లక్కిరెడ్డిపల్లె, రాజంపేట నియోజకవర్గంలోని సుండుపల్లె, వీరబల్లి మండలాల్లోని 90 చెరువులకు కాలేటివాగు నుంచి నీటిని నింపనున్నట్టు వివరించారు. -
‘జగనన్న కాలనీలు’ సీఎం జగన్ మానసపుత్రికలు: మంత్రి పెద్దిరెడ్డి
సాక్షి, చిత్తూరు: జగనన్న కాలనీలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మానస పుత్రికలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఇళ్లు మెగా గ్రౌండింగ్ డ్రైవ్‌లో భాగంగా గురువారం పుంగనూరులో జగనన్న కాలనీల నిర్మాణానికి పెద్దిరెడ్డి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, రెడ్డెప్ప పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా జగనన్న కాలనీల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. ప్రతి లబ్ధిదారుడు ఆనందపడేలా నివాస గృహాలు ఉంటాయని తెలిపారు. జగనన్న కాలనీల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నామని పెద్దరెడ్డి పేర్కొన్నారు. అనంతపురం: ఉరవకొండ జగనన్న కాలనీల్లో మెగా హౌసింగ్ గ్రౌండింగ్ మేళా, ఇళ్ల నిర్మాణాలకు మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర్‌రెడ్డి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ గంగాధర్‌గౌడ్ పాల్గొన్నారు. ► రాయదుర్గం పట్టణ బిటిపి లేఅవుట్లో జగనన్న కాలనీల్లో మెగా హౌసింగ్ గ్రౌండింగ్ మేళాలో భాగంగా ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ఇళ్ల నిర్మాణాలకు భూమి పూజ చేశారు. ► ఆలమూరు లేఅవుట్లో జగనన్న ఇళ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి భూమి పూజ చేశారు. విశాఖపట్నం: పెందుర్తి మండలం గుర్రంపాలెంలో జగనన్న కాలనీల నిర్మాణానికి మంత్రి అవంతి శ్రీనివాస్ భూమి పూజ చేశారు. కర్నూలు: ఎమ్మిగనూరు మండలం బోడబండ గ్రామంలో జగనన్నకాలనీలో గృహ నిర్మాణాల్లో భాగంగా ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి భూమి పూజ చేశారు. కృష్ణా: మచిలీపట్నం మండలం రుద్రవరం గ్రామంలో మెగా హౌసింగ్ గ్రౌండింగ్ మేళ కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్ జగనన్న కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న 600 ఇళ్ల నిర్మాణ పనులకు మంత్రి పేర్నినాని శంకుస్థాపన చేశారు. విజయవాడ రూరల్ మండలం నున్నలో వైఎస్సార్ జగనన్న మోడల్ లేఅవుట్లో లబ్ధిదారులతో కలసి ఇళ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ భూమిపూజ చేశారు. పశ్చిమగోదావరి: ఉంగుటూరు నియోజకవర్గ పరిధిలోని భీమడోలులో జగనన్న కాలనీలలో ఇళ్ల నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు పాల్గొని భూమి పూజ చేశారు. వైఎస్సార్ కడప: కడప నియోజకవర్గ పరిధిలో పలు జగనన్న లేఅవుట్లలో మెగా గ్రౌండింగ్ మేళా కార్యక్రమంలో డిప్యూటీ సీఎం అంజాద్ బాష, మేయర్ సురేష్ బాబు పాల్గొన్నారు. ప్రకాశం: జరుగుమల్లి మండలం కె బిట్రగుంటలో జగన్న కాలనీలో ఇళ్లకు నియోజకవర్గం ఇంచార్జ్ డాక్టర్ మాదాశి వెంకయ్య శంఖుస్థాపన చేశారు. విజయనగరం: కొమరాడ మండలం గుణానుపురం గ్రామంలో మెగా హౌసింగ్ మేళాను సబ్ కలెక్టర్ వేంకటేశ్వరులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ అధికారులు పాల్గొన్నారు. చీపురుపల్లి అగ్రహారంలో జగనన్న ఇళ్లు నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో జిల్లా పార్లమెంటు సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఏపీలో పేదలందరికీ ప్రభుత్వం ఇళ్లు మెగా గ్రౌండింగ్ డ్రైవ్‌ను చేపట్టింది. గురువారంతోపాటు, ఈ నెల 3, 4 తేదీల్లో అన్ని జిల్లాల్లో పెద్దఎత్తున గృహనిర్మాణ శంకుస్థాపనలు జరగన్నాయి. రోజుకు లక్ష ఇళ్ల చొప్పున మూడు రోజుల్లో 3 లక్షల ఇళ్లకు శంకుస్థాపనలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అన్ని జిల్లాల్లో పెద్దఎత్తున గృహనిర్మాణ శంకుస్థాపనలు జగరనున్నాయి. వైఎస్ఆర్ జగనన్న కాలనీల్లో శంకుస్థాపన కార్యక్రమాల్లో ఇన్ఛార్జ్, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొనున్నారు. చదవండి: వైఎస్సార్ స్వప్నం పోలవరం.. జగన్ హయాంలో సాకారం -
ఇసుక సరఫరాలో ఇబ్బందులు లేకుండా చర్యలు: పెద్దిరెడ్డి
సాక్షి, అమరావతి: ఇసుక సరఫరాలో ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పేదల ఇళ్ల నిర్మాణానికి ఒక్కో ఇంటికి 20 టన్నుల ఇసుక ఉచితంగా ఇస్తున్నామని వెల్లడించారు. జగనన్న కాలనీలకు ఇసుకను నేరుగా రీచ్‌ల నుంచి సరఫరా చేస్తామని పేర్కొన్నారు. ఇసుక సరఫరాలో పారదర్శకత కోసం ఈ-పర్మిట్ విధానం తీసుకొచ్చామని తెలిపారు. వర్షాకాలంలో ఇసుక కొరత లేకుండా ముందుగా నిల్వలు పెడుతున్నామని పేర్కొన్నారు. ఈ ఏడాది 50 లక్షల టన్నులకుపైగా ఇసుక నిల్వ చేస్తామన్నారు. ప్రస్తుతం రోజుకి 3 లక్షల టన్నుల ఇసుక తీస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి వెల్లడించారు. చదవండి: సీఎం జగన్ అధ్యక్షతన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం గ్రామ పాలనలో విప్లవాత్మక మార్పులు: మంత్రి పెద్దిరెడ్డి -
‘జగనన్న పచ్చతోరణం’పై ప్రత్యేక దృష్టి: పెద్దిరెడ్డి
సాక్షి, తిరుపతి: జగనన్న పచ్చతోరణంపై ప్రత్యేక దృష్టి పెట్టామని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గ్రామాల్లో మొక్కలను పెంచే బాధ్యతను సర్పంచ్‌లకు అప్పగిస్తున్నామని.. పైలట్ ప్రాజెక్ట్‌గా చిత్తూరు జిల్లాను ఎంపిక చేశామని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన నరేగా పనులపై విచారణ జరుగుతోందన్నారు. ఇప్పటికే రూ.5లక్షలలోపు పెండింగ్‌లో ఉన్న నరేగా బిల్లులను చెల్లించామని.. మిగిలిన పనులకు విజిలెన్స్ నివేదిక రాగానే చెల్లిస్తామని ఆయన వెల్లడించారు. మామిడి రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. మామిడికి గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. చదవండి: బాలల సంక్షేమానికి ఏపీ కృషి భేష్ ‘ఎరక్కపోయి వచ్చాను.. ఇరుక్కుపోయాను’ -
మైనింగ్ శాఖలో సంస్కరణలపై సీఎం జగన్ సమీక్ష
అమరావతి: మైనింగ్ శాఖపై క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. మైనింగ్ శాఖలో సంస్కరణలపై చర్చించారు. ఈ– ఆక్షన్ ద్వారా మైనర్ మినరల్స్ అమ్మాలని.. సీనరేజీ ఫీజు వసూలను ఔట్‌సోర్సింగ్‌కు అప్పగించాలని అధికారులు సీఎం జగన్‌కు సూచించారు. గ్రానైట్ మైనింగ్‌లో సైజు (పరిమాణం) పద్దతిలో కాకుండా బరువు ఆధారంగా సీనరేజీ నిర్ణయించాలని తెలిపారు. ఇకపై ఎన్ని టన్నులు బరువు ఉంటే.. ఆమేరకు సీనరేజీ ఫీజు వసూలు చేయాలని అధికారులు తెలిపారు. దీనివల్ల కనీసం 35 నుంచి 40శాతం ఆదాయం పెరుగుతుందని అధికారులు అంచనా వేశారు. లీజులు పొంది, గనులు నిర్వహించని చోట కొత్తగా ఈ వేలం నిర్వహించాలని.. దీని వల్ల ప్రభుత్వానికి మరో వెయ్యి కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచాన వేశారు. ఈ నిర్ణయాలకు సీఎం ఆమోదం తెలిపారు. సెప్టెంబరు నుంచి కొత్త నిర్ణయాలు అమల్లోకి వస్తాయన్నారు అధికారులు. మైనింగ్ శాఖలో నిఘా, అమలు విభాగం పటిష్టంగా ఉండాలని.. ఆదాయాలకు గండి పడకుండా చూడాలని సీఎం జగన్ ఆదేశించారు. వర్షాలు వచ్చేలోగా కనీసం 60 నుంచి 79 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను అందుబాటులోకి ఉంచాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. వర్షాలు వల్ల రీచ్‌లు మునిగిపోయే అవకాశం ఉంటుంది. మళ్లీ ఇసుకకు ఇబ్బందులు రాకూడదు అన్నారు. అందుకనే సరిపడా నిల్వలను అందుబాటులో ఉంచాలని సీఎం జగన్ ఆదేశించారు. ఈ సమావేశానికి పంచాయతీరాజ్, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మైనింగ్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, భూగర్భగనుల శాఖ డైరెక్టర్ (డిఎంజి) విజి.వెంకటరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. చదవండి: మానవత్వాన్ని చాటుకున్న మంత్రి పెద్దిరెడ్డి -
‘ఆ దంపతుల మృతి నన్ను కలిచి వేసింది’
అమరావతి: పంచాయతీరాజ్ శాఖలో సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేసే శాంతకుమారి దంపతులు కరోనాతో చనిపోవడం పట్ల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. రెండ్రోజుల వ్యవధిలోనే దంపతులిద్దరు కరోనాతో చనిపోవడం తనను తీవ్రంగా కలిచి వేసిందని పెద్దిరెడ్డి అన్నారు. వీరిద్దరు కూడా ఏపీ సచివాలయంలోనే ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. ఈ మహమ్మారి మొదట శాంతకుమారి భర్తకు సోకింది. ఆయన, ఆసుపత్రిలో ఉండి చికిత్స తీసుకున్నప్పటకి ప్రాణాలు దక్కలేదు. తాజాగా, శాంతకుమారి కూడా కరోనాతోనే చనిపోయింది. వీరి కుటుంబానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. -
దొంగ ఓట్ల పేరుతో టీడీపీ డ్రామాలు: పెద్దిరెడ్డి
సాక్షి, చిత్తూరు: తిరుపతికి వచ్చే భక్తులను దొంగ ఓటర్లనటం దుర్మార్గం అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రశాంతంగా జరుగుతున్న తిరుపతి ఉప ఎన్నికల పోలింగ్‌ను అడ్డుకునేందుకు టీడీపీ కుట్రలు చేస్తోందని దుయ్యబట్టారు. దొంగ ఓట్ల పేరుతో టీడీపీ డ్రామాలు ఆడుతోందని ధ్వజమెత్తారు. ఓటమికి ముందే దొంగఓట్ల పేరుతో టీడీపీ సాకులు వెతుక్కుంటోందని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు ఖూనీ చేస్తున్నారని పెద్దిరెడ్డి మండిపడ్డారు. ప్రజలు ఛీకొట్టినా చంద్రబాబులో మార్పు లేదని మంత్రి పెద్దిరెడ్డి ఎద్దేవా చేశారు. తనకు తిరుపతిలో సొంతిల్లు ఉంది అని, చంద్రబాబుకే అక్కడ సొంతిల్లు లేదన్నారు. బాబు జూమ్‌లో, లోకేష్ ట్విట్టర్లో మాత్రమే కనబడతారని మంత్రి పెద్దిరెడ్డి ఎద్దేవా చేశారు. చదవండి: దళిత ఓటర్లను అడ్డుకున్న టీడీపీ నేతలు -
‘దొంగ ఓట్ల పేరుతో టీడీపీ డ్రామాలు’
సాక్షి, తిరుపతి: పోలింగ్‌పై టీడీపీ అబద్ధాలు ప్రచారం చేస్తోందని రాష్ట్ర పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ, బస్సుల్లో వెళ్లే ప్రయాణికులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రశాంతంగా జరుగుతున్న పోలింగ్‌ను అడ్డుకునేందుకు టీడీపీ కుట్రలు చేస్తోందని నిప్పులు చెరిగారు. దొంగ ఓట్ల పేరుతో టీడీపీ డ్రామాలు ఆడుతోందని దుయ్యబట్టారు. ఓటమికి ముందే దొంగఓట్ల పేరుతో టీడీపీ సాకులు వెతుక్కుంటోందన్నారు. ప్రజా బలం లేకే టీడీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నాపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోను. రాజకీయ లబ్ధి కోసం వైఎస్సార్సీపీపై అభాండాలు వేస్తున్నారు. టీడీపీ కుట్రలపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తాం. ఓటమి భయంతోనే చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదని’’ పెద్దిరెడ్డి మండిపడ్డారు. ఓటమికి చంద్రబాబు కారణాలు వెతుక్కుంటున్నారని.. ఇకనైనా ఆయన తన తప్పులు తెలుసుకుంటే ప్రజల్లో ఉంటారని మంత్రి పెద్దిరెడ్డి హితవు పలికారు. చదవండి: ‘సాహో చంద్రబాబు’పై చర్యలు తీసుకోండి విష నాలుకలు.. నీచ నాయకులు... -
అందుకే సీఎం జగన్ గురుమూర్తికి టికెట్ ఇచ్చారు
-
గురుమూర్తి గెలుపును సీఎం జగన్‌కు గిఫ్ట్‌గా ఇవ్వాలి
నెల్లూరు: వైఎస్సార్సీపీ తిరుపతి లోక్‌సభ అభ్యర్థి గురుమూర్తి ఉన్నతమైన వ్యక్తి అని, అఖండ మెజారిటీతో గెలిపించాలని ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల సందర్భంగా నెల్లూరులో సోమవారం మంత్రులు ప్రచారం చేశారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గురుమూర్తిని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఋణం తీర్చుకోవాలి: మంత్రి పెద్దిరెడ్డి పార్టీలకతీతంగా పాలన అందిస్తున్న సీఎం వైఎస్ జగన్ వెంట నడుద్దామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు. మేనిఫెస్టోని కనుమరుగు చేసిన వ్యక్తి చంద్రబాబు అని, అదే మేనిఫెస్టోలోని హామీలు నిలబెట్టుకున్న వ్యక్తి సీఎం జగన్ అని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీకి వస్తున్న అదరణచూసే చంద్రబాబు జెడ్పీ, ఎంపీటీసీ ఎన్నికల నుంచి పారిపోయాడు అని తెలిపారు. ప్రతీ ఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకొని జగన్ ఋణం తీర్చుకోవాలని సూచించారు. భారీ మెజార్టీతో గెలిపించాలి: మంత్రి బాలినేని ఏడాదిన్నర పాలనలో ఊహించని సంక్షేమాన్ని ఇచ్చి సీఎం జగన్ పేదల పెన్నిధిగా నిలిచారని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. దేశంలోనే ఆదర్శ ముఖ్యమంత్రిగా నిలిచారని గుర్తుచేశారు. సీఎం వైఎస్ జగన్ అన్ని వర్గాల పక్షపాతి అని కొనియాడారు. ఉప ఎన్నికలో హేమాహేమీలు నిలిచారని, ఎంపీగా, కేంద్రమంత్రిగా ప్రజా సంక్షేమాన్ని పనబాక గాలికి వొదిలేసారని గుర్తుచేశారు. ఇప్పుడు టీడీపీలో చేరి ఓట్లకు వస్తున్నారని చెప్పారు. సామాన్య పేద కుటుంబం నుంచి వచ్చిన గురుమూర్తిని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. వెంకటగిరి నియోజకవర్గంలో మెజారిటీ పెంచేందుకు ఆనం చేస్తున్న శ్రమ, కృషి అభినందనీయమని తెలిపారు. గురుమూర్తి గుణమంతుడు: డిప్యూటీ సీఎం గురుమూర్తి మంచి గుణమంతుడని, ఆ గుణాన్ని గమనించే ఎంపీ అభ్యర్థిగా సీఎం జగన్ నిలిపారని ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి తెలిపారు. అతడిని అనూహ్య మెజారిటీతో గెలిపించి సంక్షేమ సారథి జగన్‌కు కానుకగా ఇవ్వాలని కోరారు. పచ్చమీడియాలో రాష్ట్రం అప్పులపాలైందని తప్పుడు వార్తలు రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాక్షస రాజ్యం పోయి రామరాజ్యం వచ్చింది అని చెప్పారు. జగన్‌కి వస్తున్న జనాదరణ చూసి అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు త్వరలో టీడీపీని బీజేపీలో విలీనం చేసేస్తాడని జోస్యం చెప్పారు. -
సీఎం జగన్ ధాటికి టీడీపీ జెండా పీకేయడమే
సాక్షి, అమరావతి: మండల, జిల్లా పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు చంద్రబాబు చేసిన ప్రకటనపై ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటమికి భయపడే పోటీ నుంచి తప్పించుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మంత్రులు కన్నబాబు, గౌతమ్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడారు. బాబుకు ఓటమి భయం:మంత్రి కన్నబాబు చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది మంత్రి కన్నబాబు తెలిపారు. ఓటమి భయంతోనే చంద్రబాబు పారిపోతున్నారని చెప్పారు. గత ఎన్నికల సంఘం కమిషనర్ నిర్ణయాన్నే కొత్త ఎస్ఈసీ కొనసాగిస్తున్నారని గుర్తుచేశారు. సీఎం జగన్ ధాటికి చంద్రబాబు టీడీపీ జెండా పీకేయడం ఖాయమని పేర్కొన్నారు. ఆఫీస్ మూసేసుకోవచ్చు: మంత్రి గౌతమ్‌రెడ్డి ఎన్నికల్లో పాల్గొనకపోతే పార్టీ ఎందుకు? ఇక టీడీపీ ఆఫీసును మూసేసుకోవచ్చు అని మంత్రి గౌతమ్‌రెడ్డి ఎద్దేవా చేశారు. నాయకత్వం ఎలా ఉండాలో.. సీఎం జగన్‌ను చూసి నేర్చుకోవాలని హితవు పలికారు. ఏకగ్రీవాలపై హైకోర్టు తీర్పు ఇచ్చాక.. చంద్రబాబు విభేదించడం ఏమిటి? అని ప్రశ్నించారు. ఎన్నికల్లో వందశాతం ఓడిపోతుందనే బాబు పారిపోతున్నారని పేర్కొన్నారు. అనైతిక రాజకీయాలు బాబుకే సాధ్యం: పెద్దిరెడ్డి చంద్రబాబు చేతగాని తనాన్ని తమపై నెడుతున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామంచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనైతిక రాజకీయాలు చంద్రబాబుకే సాధ్యమని స్పష్టంచేశారు. సీఎం జగన్ సంక్షేమ పాలనకు ప్రజలు పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో పట్టం కట్టారని, ఈ ఎన్నికల్లోనూ రిపీట్ అవుతాయని ధీమా వ్యక్తం చేశారు. ఓటమి భయంతోనే చంద్రబాబు పారిపోతున్నారని చెప్పారు. ఆ ప్రకటన ఓ డ్రామా: వైవీ సుబ్బారెడ్డి చంద్రబాబు ప్రకటన ఓ డ్రామాగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అభివర్ణించారు. నాటకాలాడటంలో చంద్రబాబు దిట్ట అని పేర్కొన్నారు. ఓటమి భయంతోనే బాబు పోటీ నుంచి తప్పించుకుంటున్నారని తెలిపారు. సీఎం జగన్ సంక్షేమ పాలనను చూసి బాబు జీర్ణించుకోలేకపోతున్నారని, అన్ని వర్గాలకు గడప వద్దకే సంక్షేమ పథకాలు అందుతున్నాయని వైవీ సుబ్బారెడ్డి వివరించారు. చదవండి: జ్యోతుల నెహ్రూ, అశోక్ గజపతి అసంతృప్తి చదవండి: ఓటమి భయంతోనే బాబు ఎన్నికల బహిష్కరణ -
దొంగే దొంగ..దొంగ.. అని అరిచినట్టు ఉంది: మంత్రి పెద్దిరెడ్డి
-
తిరుపతి ఉప ఎన్నికలో 3 లక్షల మెజార్టీ సాధిస్తాం
-
తిరుపతి ఉప ఎన్నికలో 3 లక్షల మెజార్టీ సాధిస్తాం
అమరావతి: తిరుపతి ఉప ఎన్నికలో కూడా రికార్డ్ సృష్టిస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 3 లక్షల వరకు మెజారిటీ సాధిస్తామన్న నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. తిరుపతి లోక్‌సభ పరిధిలోని అన్ని మున్సిపాలిటీల్లోనూ భారీగా గెలిచామని తెలిపారు. సీఎం జగన్ పరిపాలన వల్లే ఈ ఫలితాలన్నీ రాబోతున్నాయని పేర్కొన్నారు. ఎన్నికలకు సంబంధించిన అన్ని కేసులు క్లియర్ అయ్యాయని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. ఇప్పుడు ఎస్ఈసీ వెంటనే జెడ్పీ, ఎంపీటీసీ ఎన్నికలు పెట్టాలని కోరుతున్నానని పేర్కొన్నారు. అన్ని ఎన్నికలు ఈయన హయాంలోనే పూర్తి కావాలని కోరుతున్నట్లు చెప్పారు. కేవలం 6 రోజుల్లో ఎన్నికలు పూర్తవుతాయని, ఈ ఎన్నికలు పూర్తి చేస్తే మేం వాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేస్తామని వివరించారు. ఈనెల 18వ తేదీన జరిగే మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి కార్పొరేషన్, మున్సిపాలిటీలలో ఇద్దరు డిప్యూటీ మేయర్లు, వైస్ చైర్మన్లను నియమిస్తామని, ఇందుకు అవసరమైన ఆర్డినెన్స్ తీసుకురాబోతున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు. -
సిగ్గుంటే రాజీనామా చెయ్..
తిరుపతి తుడా: వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని రఘురామ కృష్ణరాజు సీఎం జగన్ భిక్షతోనే ఎంపీ అయ్యారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఆయనకు సిగ్గుంటే తక్షణమే ఆ పదవికి రాజీనామా చేసి మాట్లాడాలని డిమాండ్ చేశారు. తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి గురువారం మీడియాతో మాట్లాడారు. ఒక పార్టీ గుర్తుతో గెలిచి.. మరో పార్టీకి మద్దతిచ్చేలా మాట్లాడడాన్ని చంద్రబాబు నుంచి రఘురామ కృష్ణరాజు నేర్చుకున్నట్లున్నారని వ్యాఖ్యానించారు. అతని పేరు కూడా ఉచ్చరించడానికి ఇష్టం లేదని.. తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నందున స్పందిస్తున్నానని చెప్పారు. రూ.1,000 కోట్లకు పైగా బ్యాంకులను మోసగించిన నీచుడి గురించి మాట్లాడడం సిగ్గుగా ఉందన్నారు. ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని ఇంకెన్నాళ్లు కుట్రలు చేస్తావని చంద్రబాబును ప్రశ్నించారు. తన మాటలను ఏబీఎన్ రాధాకృష్ణ తరచూ వక్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలన్నదే చంద్రబాబు, రాధాకృష్ణల లక్ష్యమన్నారు. బాబుకు ప్రజల మీద నమ్మకం లేదని.. కేవలం నయవంచన, వెన్నుపోటుల ద్వారా అధికారంలోకి రావడమే ఆయనకు తెలిసిన విద్య అని విమర్శించారు. బాబు, ఎల్లోమీడియా మాయమాటల్ని ప్రజలు గుర్తించి ఎన్నికల్లో బుద్ధి చెబుతున్నారన్నారు. చదవండి: మహిళా సర్పంచ్ కుటుంబంపై టీడీపీ నేత దాడి నాటి నుంచి నేటి వరకు.. ప్రజాపథమే అజెండా -
గృహనిర్మాణ, గ్రామ వార్డు సచివాలయ శాఖలతో సీఎం జగన్ సమీక్ష
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లకు అవార్డుల ప్రదానంపై గృహ నిర్మాణ, గ్రామ, వార్డు సచివాలయాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. బుధవారం సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగే ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీరంగనాథరాజుతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ గృహనిర్మాణం, జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలపై అధికారులతో చర్చించారు. సమీక్షలోని ముఖ్యంశాలు.. ⇔ సంక్షేమ కార్యక్రమాల్లో చూపిన సమర్థత ఆధారంగా ఎంపిక చేసి, సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర పేర్లతో వాలంటీర్లకు సత్కారం చేయాలని తెలిపారు. ⇔ ఎలాంటి ఫిర్యాదులు లేని, ఏడాదికిపైగా సేవలు అందించిన.. 2,18,115 మంది వాలంటీర్లకు సేవా మిత్ర 4వేల మంది వాలంటీర్లకు సేవా రత్న అందించాలన్నారు. ⇔ ప్రతి మండలానికి ఐదుగురు, ప్రతి మున్సిపాలిటీకి ఐదుగురు, ప్రతి కార్పొరేషన్ నుంచి 10 మంది ఎంపిక చేయాలన్నారు. ⇔ నియోజకవర్గానికి ఐదుగురు చొప్పున సేవా వజ్రాలుగా ఎంపిక చేసి, 875 మంది వాలంటీర్లకు సేవా వజ్రాలు కింద సత్కారం చేయాలని తెలిపారు. ⇔ సేవామిత్రలకు రూ.10వేల నగదు, సేవా రత్నాలకు రూ. 20వేలు, సేవా వజ్రాలకు రూ.30వేల నగదు ప్రోత్సాహకం అందించాలని తెలిపారు. ⇔ తామే ఇళ్లు కట్టుకుంటామని ఆప్షన్ ఎంచుకున్న వారికి.. నిర్మాణ సామగ్రి విషయంలో సహాయకారిగా నిలవాలని ఆయన అధికారులను ఆదేశించారు. ⇔ స్టీలు, సిమ్మెంటు, ఇతరత్రా నిర్మాణ సామగ్రిని.. తక్కువ ధరలకే అందించేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం వైఎస్ జగన్ ⇔ కాలనీల్లో ఇళ్ల నిర్మాణం వేగంగా జరిగేలా .. నీరు, కరెంటు సౌకర్యాలను కల్పించడంపై దృష్టిపెట్టాలన్న సీఎం జగన్ ⇔ కోర్టు వివాదాల్లో ఉన్న ఇళ్లస్థలాల కేసుల పరిష్కారంపై దృష్టి పెట్టాలన్నారు. ⇔ ఇళ్లనిర్మాణంలో నాణ్యత విషయంలో రాజీపడొద్దని తెలిపారు. ⇔ ఖర్చు ఎక్కువైనా పరవాలేదని, కచ్చితంగా నిర్మాణంలో నాణ్యత పాటించాలని అధికారులకు సీఎం జగన్ స్పష్టంగా తెలిపారు. ⇔ తయారు చేసిన డిజైన్లను సీఎం పరిశీలించి సూచనలు చేశారు. ⇔ జగనన్న కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీ, కరెంటు వసతుల కల్పనపై కూడా సీఎం జగన్ చర్చించారు. ⇔ జగనన్న కాలనీల్లో రోడ్ల వెడల్పు 20 అడుగులకు తగ్గకుండా చూడాలన్నారు. -
'వారిపై ప్రభుత్వానికి ఎటువంటి కక్ష సాధింపు ఉండదు'
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే అత్యధికంగా ఉపాధి హామీ పనులు చేశామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఈ ఏడాది రాష్ట్రానికి ఇప్పటి వరకు 23,67 కోట్ల పనిదినాలు కల్పించామని తెలిపారు. మార్చి నెలాఖరు నాటికి ఇచ్చిన లక్ష్యాన్ని అధిగమించాలని అధికారులకు సూచించారు. అసంపూర్తిగా ఉన్న సచివాలయాలు, ఆర్బీకె, అంగన్వాడీలను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. జల్‌జీవన్ మిషన్ కింద రాష్ట్రానికి రూ.4వేల కోట్లు కేటాయించారని, ఈ నిధులతో రాష్ట్రంలో ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి అందించాలని పేర్కొన్నారు. వాటర్ గ్రిడ్ పనులను వేగవంతం చేసి మంచినీటి సమస్య లేకుండా చూడాలని చెప్పారు. గతంలో జరిగిన ఉపాధి హామీ పనుల్లో అక్రమాలపై ప్రస్తుతం విచారణ జరుగుతుందని, రూ.5 లక్షల లోపు పనులకు ఇప్పటికే బిల్లులు చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. ఇంజనీరింగ్ అధికారులపై ప్రభుత్వం ఎటువంటి కక్ష సాధింపు ఉండదని, కేసులు నమోదు చేస్తారంటూ కొందరు చేస్తున్న తప్పుడు ప్రచారం నమ్మవద్దన్నారు. నిజాయితీగా పనిచేసే అధికారులకు ఈ ప్రభుత్వం అండగా వుంటుందని తెలిపారు. చదవండి : (అందుకే అప్పులు చేశాం: మంత్రి బుగ్గన) (ఆ హక్కు ఎవరికీ లేదు: సీఎం జగన్) -
‘సీఎం జగన్ చరిష్మా ముందు బాబు నిలువలేకపోతున్నారు’
సాక్షి, తాడేపల్లి: మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 80 శాతానికి పైగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ ఎన్నికల మొదటి దశ ఫలితాలను చూసి టీడీపీ అధినేత చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. అసెంబ్లీలో చంద్రబాబు సాక్షిగానే ఓ చట్టము చేశామని.. ఇప్పుడు దాన్ని నల్ల చట్టమంటూ వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. బాబు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అంటే ఫోబియా ఎదుర్కొంటున్నారన్నారు. అలాగే తప్పు చేసిన వారు అనుభవించక తప్పుదని అంటున్న బాబు అది ఆయనకే వర్తింస్తుందని తెలుసుకోవాలన్నారు. తమ మేనిఫెస్టోలో ఏదీ అమలు చేయక గత అసెంబ్లీ ఎన్నికల్లో 23 సీట్లకే పరిమితమైన బాబు.. సీఎం జగన్ చరిష్మా ముందు నిలువలేక ఏదో ఆవహించినట్లు మాట్లాడుతున్నారన్నారని ఎద్దేవా చేశారు. సజావుగా ఈ ఎన్నికలు జరుగుతున్నాయని, ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోందని మంత్రి తెలిపారు. కులాలు మతాలు చూడకుండా ఇంటివద్దకే వాలంటీర్ వ్యవస్థ వెళుతుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ నేతలను బాబు రౌడీలు, గూండాలు అంటున్నారని, మరీ అచ్చెంనాయుడు, కొల్లు రవీంద్ర ఏం చేశారని ప్రశ్నించారు. తమ పాలన బాగుందని టీడీపీ వారే కొనియాడుతున్నారన్నారని తెలిపారు. తనకు బాబు పోటుగాడు అనే బిరుదు ఇచ్చారని, అది తాను తీసుకుంటాను కానీ మీలాంటి వెన్నుపోటుదారున్ని మాత్రం కాదని విమర్శించారు. తన జిల్లాలో తిరుగులేని బలం తనకు ఉందని, మీరు ముఖ్యమంత్రిగా ఉండగానే ఒక్క ఓటు మెజారిటీతో ఓ నాయీ బ్రాహ్మణ మహిళను జిల్లా పరిషత్ చైర్మన్ చేశానన్నారు. ఇవన్నీ బాబు ఓర్చుకోలేక పోతున్నారన్నారు. ప్రజాబలం సీఎం వైఎస్ జగన్‌కు ఎక్కువగా ఉందని, 90 శాతం స్థానాలు తమవే అని ధీమా వ్యక్తం చేశారు. ఇక పోస్కో అంతర్జాతీయ సంస్థ వాళ్లకు ముఖ్యమంత్రితో సంబంధం ఏమిటుందని, వారు సీఎంని మర్యాదపూర్వకంగా కలిసి వెళ్లారని తెలిపారు. ఆ రోజు విశాఖ ఉక్కు ఉద్యమాన్ని లీడ్ చేసిన వ్యక్తి వెంకయ్యనాయుడు అని దీనిపై ఆయన ఏ విధంగా స్పందిస్తారో చూడాలన్నారు. సీఎం జగన్‌కు దీనికి ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. ఇక చంద్రబాబు నాయుడు సెంట్రల్ ఫోర్స్ కావాలంటారు.. వీలుంటే విదేశాల నుంచి కూడా ఫోర్స్ కావాలి అని అడిగే వ్యక్తి ఆయన అన్నారు. కానీ ఆయన సీఎంగా ఉన్నపుడు కేంద్రబలగాలను ఎందుకు కోరలేదని ప్రశ్నించారు. బాబుకు పుంగనూర్ , తాంబల్లపల్లిలో ఏకగ్రీవాలు అవుతాయని ముందే తెలుసని, అందుకే బలవంతపు ఏకగ్రీవాలు అంటూ తన వైఫల్యాన్ని కప్పిపుచుకునే ప్రయత్నం చేశారని మంత్రి వ్యాఖ్యానించారు. -
హైకోర్టులో నిమ్మగడ్డకు భారీ ఎదురుదెబ్బ
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్ది రామచంద్రారెడ్డిని నిర్బంధిస్తూ శనివారం ఆయన జారీచేసిన ఉత్తర్వులను న్యాయస్థానం కొట్టివేసింది. పెద్దిరెడ్డిని హౌస్ అరెస్ట్ చేయాలన్న ఎస్ఈసీ ఆదేశాలు చెల్లవని తీర్పును వెలువరించింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ జారీచేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ పెద్దిరెడ్డి దాఖలు చేసిన లంచ్‌మోషన్ పిటిషన్‌పై ఆదివారం విచారణ చేపట్టిన హైకోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో పర్యటించాల్సిన బాధ్యత ఆ శాఖ మంత్రిగా పెద్దిరెడ్డికి ఉందన్న పిటిషనర్ తరపు న్యాయవాదుల వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. రాష్ట్ర మంత్రిగా ఆయన ఎక్కడైనా పర్యటించవచ్చని తీర్పులో స్పష్టం చేసింది. మంత్రిపై ఇంట్లోనే ఉండాంటూ ఆయన విధించిన ఆంక్షలను చెల్లవని పేర్కొంటూ ఎస్ఈసీ జారీచేసిన ఉత్తర్వులను న్యాయస్థానం కొట్టివేసింది. (మంత్రి పెద్దిరెడ్డికి హైకోర్టు అనుమతి) కాగా రాష్ట్రంలో నాలుగు దశల పంచాయతీ ఎన్నికలు ముగిసే ఫిబ్రవరి 21వ తేదీ వరకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఆయన ఇంటి నుంచి బయటకు రాకుండా నియంత్రించాలని డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను ఆదేశిస్తూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. రాజ్యాంగంలోని 243 కె నిబంధన ద్వారా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా తనకు ఉన్న విశేషాధికారాలతో ఈ ఆదేశాలు జారీ చేశానని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 16 రోజుల పాటు మంత్రి పెద్దిరెడ్డిని మీడియాతో కూడా మాట్లాడకుండా నియంత్రించాలని సవాంగ్‌ను కోరారు. దీంతో తనను ఇంటికే పరిమితం చేయాలంటూ రాష్ట్ర డీజీపీకి రాష్ట్ర నిమ్మగడ్డ రమేష్ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శనివారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల కమిషనర్ ఉత్తర్వుల అమలును నిలిపేయాలని కోర్టును కోరారు. ఈ చర్యలను రాజ్యాంగ విరుద్ధంగా, ఏకపక్ష చర్యగా ప్రకటించాలని అభ్యర్థించారు. హైకోర్టులో సీనియర్ న్యాయవాది సీవీ మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి తరఫున వాదనలు వినిపించారు. (మంత్రి పెద్దిరెడ్డిని గృహనిర్బంధం చేయండి) -
రాష్ట్రపతి పర్యటన: మంత్రి పెద్దిరెడ్డికి అనుమతి
సాక్షి, అమరావతి: రాష్ట్రపతి పర్యటనలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ పంచాయతిరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రాష్ట్ర హైకోర్టు అనుమతి ఇచ్చింది. మంత్రి పెద్దిరెడ్డిని ఫిబ్రవరి 21వ తేదీ వరకు నిర్భందించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఎస్ఈసీ ఆదేశాలను సవాలు చేస్తూ.. మంత్రి పెద్దిరెడ్డి ఆదివారం హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం రాష్ట్రపతి పర్యటనలో పాల్గొనందుకు అనుమతినిచ్చింది. మంత్రి పెద్దిరెడ్డి తరుపున న్యాయవాది సీవీ మోహన్ రెడ్డి వాదనలు వినిపించారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఆ శాఖ మంత్రిగా రాష్ట్రంలో పర్యటించాల్సిన బాధ్యత అతనిపై ఉందని న్యాయస్థానానికి వివరించారు. పటిషనర్ వాదనలు విన్న న్యాయస్థానం ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు తుది తీర్పు వెలువరించనున్నది. చదవండి: నిర్బంధ ఉత్తర్వులు ఏకపక్షం రాష్ట్రంలో నాలుగు దశల పంచాయతీ ఎన్నికలు ముగిసే ఫిబ్రవరి 21వ తేదీ వరకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఆయన ఇంటి నుంచి బయటకు రాకుండా నియంత్రించాలని డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను ఆదేశిస్తూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రాజ్యాంగంలోని 243 కె నిబంధన ద్వారా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా తనకు ఉన్న విశేషాధికారాలతో ఈ ఆదేశాలు జారీ చేశానని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 16 రోజుల పాటు మంత్రి పెద్దిరెడ్డిని మీడియాతో కూడా మాట్లాడకుండా నియంత్రించాలని చెప్పిన విషయం తెలిసిందే. -
నిమ్మగడ్డపై మంత్రి పెద్దిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు
సాక్షి, తిరుపతి: ఓటు నమోదు చేసుకోవడం చేత కాని వ్యక్తి రాష్ట్ర ఎన్నికల కమీషనర్‌గా ఉండటం తమ దౌర్భాగ్యమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. తన పరిధిలోని అధికారాలపై లెక్చర్లు దంచికొట్టే నిమ్మగడ్డకు ఓటు ఎలా, ఎక్కడ నమోదు చేసుకోవాలో తెలీకపోవడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. టీడీపీ మేనిఫెస్టో ప్రకటించడంపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆయన ఎస్ఈసీని నిలదీశారు. చంద్రబాబుకు మేలు చేస్తే ఎమ్మెల్యేనో, ఎంపీనో చేస్తారని నిమ్మగడ్డ ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎస్ఈసీ చర్యలు ఆక్షేపణీయమని ఆయన పేర్కొన్నారు. తొలిదశలో పంచాయతీ ఎన్నికల్లో 500లకుపైగా సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయని ఆయన వెల్లడించారు. ఏకగ్రీవమైన అభ్యర్థులు డిక్లరేషన్ పత్రాలు తీసుకున్నాక రిజల్ట్‌ను హోల్డ్‌లో పెట్టే అధికారం నిమ్మగడ్డకు ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. ఏకగ్రీవాలు జరగకూడదని ఏ చట్టంలోనైనా ఉందా అని ఎస్ఈసీని నిలదీశారు. రిటర్నింగ్ అధికారి అధికారాల్లో జోక్యం చేసుకునే హక్కు ఎస్ఈసీకి లేదన్నారు. నిమ్మగడ్డ అధికారులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, ఆయన మాటాలు విని అధికారులెవరు కూడా అక్రమాలకు పాల్పడవద్దని హెచ్చరించారు. అలా కాదని ఎన్నికల నియమావళికి వ్యతిరేకంగా పనిచేసిన అధికారులపై భవిష్యత్తులో న్యాయపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. -
నిమ్మగడ్డపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు
సాక్షి, విజయవాడ: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు జారీ అయ్యింది. పంచాయితీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నిమ్మగడ్డకు ఈ నోటీసులు ఇచ్చారు. అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం నిమ్మగడ్డకు మెయిల్ ద్వారా నోటీస్ పంపారు. ఎస్ఈసీ గవర్నర్‌కి లేఖ రాసి.. మీడియాకి లీక్ చేసి తమ ప్రతిష్టకు భంగం కలిగించారని మంత్రులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎస్ఈసీకి జారీ చేసిన నోటీసులపై స్పీకర్ తమ్మినేని నిర్ణయం తీసుకోనున్నారు. మా హక్కులకు, వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించించే విధంగా తమపై ఆరోపణలు చేసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇవ్వాలని స్పీకర్‌ను కోరినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ శనివారం మీడియా ద్వారా వెల్లడించారు. తాము లక్ష్మణరేఖ దాటామని నిమ్మగడ్డ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. -
ఇష్టారాజ్యంగా ఎస్ఈసీ నిమ్మగడ్డ తీరు..
సాక్షి, తిరుపతి: అధికారులను ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కోర్టు ఉత్తర్వులు రాగానే ఇష్టారాజ్యంగా చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అనుచరుడిగా నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. కరోనా ఉన్నప్పటికీ కోర్టు ఆదేశాలను గౌరవించామని తెలిపారు. 2002 నుంచి ఏకగ్రీవ ఎన్నికల ఆనవాయితీ వస్తోందని.. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడకుండా 19ఏ చట్టం తీసుకొచ్చామని ఆయన పేర్కొన్నారు. చదవండి: పంచాయతీ ఎన్నికలు: టీడీపీ దుష్ట పన్నాగాలు.. ‘‘చంద్రబాబు మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారు. సొంత జిల్లాలోనూ మెజారిటీ తెచ్చుకోలేని వ్యక్తి చంద్రబాబు. ఆయన ఏ రోజైనా ప్రజల కోసం పనిచేశారా?. ప్రజలకు నిస్వార్థంగా సేవ చేసిన వ్యక్తి దివంగత మహానేత వైఎస్సార్. పులివెందులలో ఆయన ఒక్క రూపాయికే వైద్యం అందించారు. వైఎస్సార్ గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని’’ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దుయ్యబట్టారు. గొడవలు వద్దు.. ఏకగ్రీవం చేసుకుందాం: నారాయణ స్వామి వైఎస్సార్సీపీ గెలుస్తుందన్న భయంతో ప్రతిపక్ష నేత చంద్రబాబు.. నిమ్మగడ్డను అడ్డుపెట్టుకున్నారని డిప్యూటీ సీఎం నారాయణస్వామి ధ్వజమెత్తారు. టీడీపీకి ఓట్లు రావనే ఎస్ఈసీ చెలరేగుతోందన్నారు. గ్రామాల్లో గొడవలు లేకుండా ఏకగ్రీవం చేసుకుందామని ఆయన పిలుపునిచ్చారు.అభివృద్ధిని కాంక్షించే వారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి తోడ్పాటును అందించాలని కోరారు. పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా అందరికీ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని మంత్రి నారాయణ స్వామి పేర్కొన్నారు. చదవండి: ఫ్యాక్షనిస్టులా నిమ్మగడ్డ శైలి -
సీఎం జగన్మోహన్రెడ్డి ఆదర్శప్రాయుడు..
విజయవాడ: రాష్ట్రంలో సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తూ, ఏడాదిన్నర కాలంలోనే 90 శాతానికిపైగా ఎన్నికల హామీలు నేరవేర్చి, దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆదర్శప్రాయుడిగా నిలిచిన సీఎం జగన్మోహన్రెడ్డికి రాష్ట్ర ప్రజలు ఎంతో రుణపడి ఉన్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుపై మంత్రి మాట్లాడుతూ.. ఎన్నికల హామీలు మాత్రమే కాకుండా మేనిఫెస్టోలో పొందుపరచని మరెన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి మాత్రమే దక్కుతుందని ఆయన కితాబునిచ్చారు. పథకాల అమలుపై ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడుకు మాట్లాడే అర్హత లేదని ఆయన ధ్వజమెత్తారు. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో తెలుగుదేశం పార్టీ 600 హామీలను గుప్పించిందని, వాటిలో ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేకపోయిందని మంత్రి విమర్శించారు. నాడు ప్రజలు చంద్రబాబు మాయ మాటలు నమ్మి మోసపోయారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ఆయన పేర్కొన్నారు. నమ్మిన ప్రజలను మోసం చేయడం చంద్రబాబుకు అలవాటేనని, ఇకపై ఆయన ఆటలు సాగవని హెచ్చరించారు. రాష్ట్రంలో అత్యుత్తమ విద్య, వైద్యం అందించేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని, ఇందులో భాగంగా అనేక సంస్కరణలు తీసుకొచ్చే యోచనలో ఉన్నారని మంత్రి వెల్లడించారు. సాగునీటి ప్రాజెక్ట్‌లు పూర్తి చేయడంతో పాటు పేదల సొంతిటి కళను నెరవేర్చడమే ముఖ్యమంత్రి తదుపరి లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. -
నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో పథకం పైలన్ ఆవిష్కరణ
-
‘సీఎం జగన్‌కు బాబుకు చాలా వ్యత్యాసం ఉంది’
సాక్షి, విజయవాడ: అధికారంలో ఉండగా రైతుల గురించి పట్టించుకోని చంద్రబాబునాయుడు ఇప్పుడు విడ్డూరంగా మాట్లాడుతున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. రైతు కుటుంబంలో పుట్టి వ్యవసాయం దండగన్న బాబుకి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి చాలా వ్యత్యాసం ఉందన్నారు. టీడీపీ రైతులను మోసం చేస్తే మానవీయకోణంలో ఆలోచిస్తూ ఉదారంగా వ్యవహరిస్తున్న పార్టీ తమదన్నారు. సోమవారం విజయవాడ రైతు శిక్షణా కేంద్రంలో కృష్ణా జిల్లా ఇంచార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన జిల్లా సమీక్ష కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మరో మంత్రి కొడాలి నాని, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. మూడు గంటలపాటు సాగిన ఈ సమీక్షలో తొమ్మిది అంశాలపై చర్చించారు. జిల్లాలో అభివృద్ధి, ప్రజాసమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పలు సూచనలు ఇచ్చారు. జిల్లాలో కురిసిన వర్షాల వల్ల, నివర్ తుపాన్ వల్ల రైతులు ఎక్కువగా నష్టపోయారని, వారిని ఆదుకోవాల్సిన భాద్యత తమపై ఉందని మంత్రులు అన్నారు. పార్టీలకు అతీతంగా ప్రజా ప్రతినిధులంతా జిల్లా అభివృద్దిపై దృష్టిపెట్టాలని సూచించారు. పంటలు నష్టపోయిన ప్రాంతాల్లో ఎన్యూమరేషన్ 10వ తేదీకల్లా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతీ రోజూ వ్యవసాయశాఖ అధికారులతో జాయింట్ కలెక్టర్లు టెలికాన్ఫరెన్స్‌లు నిర్వహించి ఏ ఒక్క రైతు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయశాఖ అధికారులు రైతులకు అవసరమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. రైతులను ఆదుకోవడంలో అధికారులు ఉదారంగా, మానవత్వంతో వ్యవహరించాలని ముఖ్యమంత్రి శాసనసభలో కూడా చెప్పారు కాబట్టి అధికారులు అందుకు అనుగుణంగా పనిచేయాలన్నారు. ఎన్యూమరేషన్ సక్రమంగా చేయాలని వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. ఏ ఒక్క రైతుకు నష్టం జరగదని, నష్టపరిహారం కూడా వెంటనే అందజేస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాల వల్ల ఏర్పడ్డ సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టాలన్నారు. రైతులను మోసం చేసిన టీడీపీకీ.. వారికి అండగా నిలుస్తున్న వైఎస్సార్ సీపీకి చాలా వ్యత్యాసం ఉందన్నారు. -
ఆ జిల్లా ప్రజలకు ఇది శుభవార్తే..
సాక్షి, విజయవాడ: ప్రకాశం బ్యారేజీకి ఎగువన ఒకటి, దిగువన రెండు బ్యారేజీల నిర్మాణానికి త్వరలోనే టెండర్ల ప్రక్రియ చేపడతామని కృష్ణా జిల్లా ఇంచార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన అధ్యక్షతన కృష్ణా జిల్లా 33వ నీటిపారుదల సలహామండలి సమావేశం జరిగింది. ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జోగి రమేష్, సింహాద్రి రమేష్, మొండితోక జగన్మోహన్రావు, జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, జాయింట్ కలెక్టర్ మాధవీలత, ఇరిగేషన్ శాఖ అధికారులు హాజరయ్యారు. ఒకే జిల్లాలో మూడూ బ్యారేజీల నిర్మాణం శుభ పరిణామం అని పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్.. బ్యారేజీల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. నేడు కేబినెట్ సమావేశంలో కూడా ఈ అంశం చర్చకు వచ్చిందన్నారు. (చదవండి: 30 లక్షల ఇళ్ల పట్టాలు: ఏపీ కేబినెట్ ఆమోదం) ‘‘గత ఏడాది రబీకి 16 టీఎంసీల నీరు ఇచ్చాం. ఈ ఏడాది 26 టీఎంసీలు ఇస్తున్నాం. బందరు కాలువకు కూడా 1 టీఎంసీ నీరు ఇవ్వాలని నిర్ణయించాం. ఈ ఏడాది నీటి లభ్యత ఎక్కువగా ఉంది కాబట్టి ఎక్కువగా ఇవ్వాలని నిర్ణయించాం. గత ఏడాది కంటే రెట్టింపుగా ఈ సారి నీటిని ఇస్తున్నాం. టెయిల్ఎండ్ ప్రాంతాలకు మంచి ఉపయోగకరం. ప్రయారిటీ ప్రాతిపదికన పనులు చేపట్టాలని అధికారులకు ఆదేశించామని’’ మంత్రి తెలిపారు. ఇబ్బందులు ఉంటే కలెక్టర్ దృష్టికి తీసుకురావాలని, అన్ని పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. (చదవండి: ప్రభుత్వ అధికారులను కూడా వదలం) -
అవినీతికి తావు లేకుండా చూడాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి : స్వయం ఉపాధి కల్పనలో మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు మార్కెటింగ్ ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. వైఎస్సార్ చేయూత పథకంలో లబ్ధిదారులకు ఇచ్చే ఆవులు, గేదెల కొనుగోలులో నిపుణుల అభిప్రాయం తీసుకోవాలని సూచించారు. లబ్ధిదారులు ఏ ఆవు లేదా గేదె కొనవచ్చు అన్నది మాత్రమే సూచించాలని తుది నిర్ణయం వారికే వదిలేయాలన్నారు. వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా పథకాల అమలుపై క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ.. వైఎస్సార్ చేయూత పథకంలో మహిళలకు ఉపాధి కల్పనపై పెద్ద కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నందున ఎక్కడా లోపం లేకుండా చూసుకోవాలని సూచించారు. చదవండి: రేపే జగనన్న విద్యా కానుక ఉపాధి కోరుతున్న మహిళలు నిజంగా ఈ అవకాశాన్ని వినియోగించుకుని అభివృద్ధి చెందాలని ఆశించారు. దీనిపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలనని ఆదేశించారు. కిరాణా షాపుల నిర్వాహకులకు ఏ సమస్య వచ్చినా, ఎక్కడైనా, ఎవరైనా లంచం అడిగినా, వెంటనే ఫోన్ చేసేందుకు వారికి ఒక నెంబరు ఇవ్వాలన్నారు. ఆ నెంబర్‌ను షాపు వద్ద ప్రదర్శించాలని తెలిపారు. వ్యవస్థలో ఎక్కడా అవినీతికి తావు లేకుండా చూడాలని, లేకపోతే విశ్వాసం కోల్పోతామని హెచ్చరించారు. లబ్దిదారుడికి ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టం రాకుండా చూడాలని పేర్కొన్నారు. కొత్తగా ఏర్పాటవుతున్న షాపులకు ఒక బ్రాండింగ్ తీసుకురావాలని, వాటికి తగిన ప్రాచుర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. చదవండి: మహిళల ఆధ్వర్యంలో పాల సేకరణ కేంద్రాలు అవినీతికి తావునివ్వొద్దు వైఎస్సార్ చేయూత పథకంలో లబ్ధిదారులు ఆవు, గేదె ఏది తీసుకున్నా నాణ్యత ఉండేలా చూసుకోవాలని, ప్రభుత్వం తరపున వెటర్నరీ వైద్యుడి ద్వారా ఆ భరోసా కల్పించాలని సూచించారు. అన్ని విధాలుగా పరీక్షించిన తర్వాతే వారు ఏ ఆవు లేదా గేదె తీసుకోవాలో సూచించాలని, దీని కోసం ఎస్ఓపీ రూపొందించుకోవాలన్నారు. ఎక్కడైనా ప్రభుత్వం ఏదైనా ఇచ్చినప్పుడు సబ్సిడీ వస్తుందని, అప్పుడే అవినీతికి తెర లేస్తుందన్నారు. కానీ ఇక్కడ సబ్సిడీ లేకుండా లబ్ధిదారులకు నేరుగా నగదు ఇస్తున్నామన్నారు.అందుకే ఎలాంటి అవినీతికి తావు ఉండకూడదని ఆదేశించారు. ఇక పథకంలో ఆవు లేదా గేదె పొందిన వారికి ఆర్బీకేల ద్వారా పశు గ్రాసం కూడా పంపిణీ చేయాలని పేర్కొన్నారు. పశువుల సేకరణ, వాటికి దాణా, అవసరమైన మందుల పంపిణీ ప్రక్రియలో అమూల్ సంస్థ కూడా పాలు పంచుకోవాలని తెలిపారు. చదవండి: 42.43 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి నాణ్యత ముఖ్యం -మేలుజాతి ఆవులు, గేదెలు మాత్రమే కొనుగోలు చేయాలి. -అదే విధంగా నాణ్యతతో కూడిన నిర్వహణ (క్వాలిటీ ఆఫ్ మెయింటెనన్స్) కూడా ఎంతో ముఖ్యం. -ఇందులో వెటర్నరీ యూనివర్సిటీ నిపుణులను కూడా ఇన్వాల్వ్ చేయండి. మేకలు–గొర్రెలు – మేకలు, గొర్రెలలో ఆడ, మగ రెండూ సేకరించాలి. – లబ్ధిదారులకు ఇస్తున్న రూ.75 వేలకు ఎన్ని మేకలు, గొర్రెలు వస్తే అన్నీ తీసుకోవాలి. – లబ్ధిదారులకు ఒక మగ మేకపోతు లేక గొర్రెపోతు తప్పనిసరిగా ఇవ్వాలి. – అదే విధంగా ఏ మాంసానికి (మేక లేక గొర్రె) డిమాండ్ ఉందో, ఉంటుందో తెలుసుకుని, వాటిని ఎక్కువగా సేకరించాలి. – ఇంకా ఏది పెంచుకుని, అమ్ముకుంటే ఎక్కువ లాభం ఉంటుందో తెలుసుకుని వాటిని లబ్ధిదారులకు ఇవ్వాలి. – మేకలు, గొర్రెల సేకరణలో కూడా పక్కాగా ఎస్ఓపీ ఉండాలని సీఎం అధికారులను ఆదేశించారు. పథకాలు–లబ్ధిదారులు అదే విధంగా రాష్ట్రంలో వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా అమలుపై సమీక్షా సమావేశంలో అధికారులు పూర్తి వివరాలు తెలిపారు. పథకంలో ఇప్పుడు 21 లక్షల లబ్ధిదారులు ఉండగా, వారికి రూ.3937 కోట్లు,వైఎస్సార్ ఆసరా పథకంలో 87.74 లక్షల లబ్ధిదారులు ఉండగా వారికి రూ.6792 కోట్ల నిధులు విడుదల చేసినట్లు అధికారులు వెల్లడించారు. వారిలో స్వయం సహాయక బృందాలకు చెందిన 13.03 లక్షల మహిళలు రెండు పథకాల్లో ప్రయోజనం పొందారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 33,486 ఔట్లెట్లు (కిరాణా దుకాణాలు) ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటి వరకు 8,836 ఔట్లెట్లు ఏర్పాటయ్యాయని, మిగిలినవి కూడా ఈ నెలాఖరులోగా ఏర్పాటవుతాయన్న అధికారులు, ఆ తర్వాత వాటి సంఖ్య ఇంకా పెరుగుతుందని చెప్పారు. పాల ఉత్పత్తి రాష్ట్రంలో రోజూ 412.1 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయన్న అధికారులు, 9,889 గ్రామాల్లో పాల ఉత్పత్తి బాగా ఉందని తెలిపారు. వాటిలోనూ పాలు అత్యధికంగా ఉత్పత్తి అవుతున్న 6,510 గ్రామాల్లో పాల సేకరణకు ఆర్బీకేల వద్ద అదనంగా గదులు నిర్మించాలని ప్రతిపాదించామని, తద్వారా రోజూ 75 లక్షల లీటర్ల పాలు సేకరించవచ్చని పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో భాగంగా… ఆ 6510 గ్రామాల్లో 1000 నుంచి 5 వేల లీటర్ల సామర్థ్యంతో బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు (బీఎంసీయూ) ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్నట్లు వెల్లడించారు. మొత్తం మీద రాష్ట్రంలో వచ్చే ఏడాది జూలై 31 నాటికి, బీఎంసీయూల ఏర్పాటుతో పాటు, పాల సేకరణ ప్రక్రియ మొదలవుతుందని అధికారులు వివరించారు. ఆవులు, గేదెల కొనుగోలు రాష్ట్రంలో 3.43 లక్షల గేదెలు, 2.20 లక్షల ఆవులు కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు సమావేశంలో ఆ శాఖ అధికారులు వెల్లడించారు. తొలి ఏడాది 40 వేల ఆవులు, 55 వేల గేదెలు, రెండో ఏడాది 1.80 లక్షల ఆవులు, 2.88 లక్షల గేదెలు కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. అదే విధంగా 2.97 లక్షల మేకలు, గొర్రెలు సేకరించి పంపిణీ చేయనున్నట్లు అధికారులు వివరించారు. ఈ సమావేశానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ నీలం సాహ్ని, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీతో పాటు, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
సాక్షి, అమరావతి: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కొత్త బాధ్యతలు అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సంక్షేమ పథకాల అమలు తీరు, పాలనలో విప్లవాత్మక సంస్కరణలకు నాందిపలికిన గ్రామ సచివాలయ, వాలంటీర్ల శాఖను ఆయనకు కేటాయించింది. అదే విధంగా వార్డు సచివాలయాలు, వాలంటీర్ల శాఖను పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు కేటాయించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. (చదవండి: దేశంలోనే తొలిసారి.. ఏపీ పోలీస్ సరికొత్త యాప్) కాగా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 166 అధికరణలో గల క్లాజ్(3), ఏపీ ప్రభుత్వ బిజినెస్ రూల్స్ ఆరులోని సబ్ రూల్(1) ప్రకారం ఆంధ్రప్రదేశ్ గవర్నర్, గ్రామ/వార్డు వాలంటీర్లు, గ్రామ సచివాలయాలు/ వార్డు సచివాలయాల శాఖకు సంబంధించి ఈ మేరకు శాఖలు కేటాయించినట్లు తెలిపింది. -
అభివృద్ధిలో ఉపాధి హామీ నిధులు కీలకం: పెద్దిరెడ్డి
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో పేదలకు ఇచ్చే స్థలాలకు సంబంధించి పదివేల లేఅవుట్లను గుర్తించామని, ఈ లేఅవుట్లలో ఉపాధి హామీ కింద అవెన్యూ ప్లాంటేషన్ చేస్తున్నామని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. పంచాయతీరాజ్ కమిషనర్ క్యాంప్ కార్యాలయంలో మంత్రి అధ్యక్షతన గురువారం ఉపాధి హామీ మండలి సమావేశం నిర్వహించారు. పీఆర్ అండ్ ఆర్డీ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, పీఆర్ కమిషనర్ గిరిజా శంకర్, డైరెక్టర్ (ఇజీఎస్) చిన్నతాతయ్య, వాటర్‌షెడ్ డైరెక్టర్ వెంకటరెడ్డి, ఉపాధి హామీ మండలి (ఎస్ఇజిసి) సభ్యులు హాజరయ్యారు. (చదవండి: ‘ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయి’) రాష్ట్ర అభివృద్ధిలో ఉపాధి హామీ నిధులు కీలకమని, ఇతర రాష్ట్రాల్లో ఉపాధి హామీ ఏ రకంగా జరుగుతుందో మండలి సభ్యులు పరిశీలించేలా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ‘‘ప్రస్తుతం జరుగుతున్న పనులతో పాటు నియోజకవర్గానికి రూ.10 కోట్లు కేటాయించబోతున్నాం. నూరు శాతం ఉపాధి హామీ నిధులతోనే పనులు చేపట్టేందుకు వీలుగా చర్యలు తీసుకుంటున్నాం. వైఎస్సార్ క్లినిక్, ఆర్బీకే, నాడు-నేడు, సచివాలయ భవనాల నిర్మాణం పనులను వేగవంతం చేయాలని’’ అధికారులను మంత్రి ఆదేశించారు. గ్రామాల్లో ఉపాధి హామీ కింద ఈ నాలుగు రకాల పనులను అక్టోబర్ నెల నాటికి పూర్తి చేస్తే నియోజకవర్గానికి ఇంకా అదనంగా మరో రూ.5 కోట్లు ఇస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. (చదవండి: చంద్రబాబు కుప్పంలో కూడా ఓడిపోతారు..) -
ఆగస్టు 1న పెన్షన్ల పంపిణీకి సర్వం సిద్ధం
సాక్షి, అమరావతి: వైఎస్సార్ పెన్షన్ కానుకను ఆగస్టు 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారుల చేతికే నేరుగా అందించేందుకు సర్వం సిద్ధమైంది. ఈ మేరక ఒకేరోజు 61.28 లక్షల మంది పెన్షనర్ల ఇంటి వద్దకే వెళ్లి, నేరుగా వారి చేతికే పెన్షన్ సొమ్మును అందించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 2.68 లక్షల మంది వాలంటీర్లు పెన్షన్ సొమ్మును పంపిణీ చేసేందుకు సిద్ధంగా వున్నారు. పెన్షన్ల కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.1478.90 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ప్రతినెలా ఒకటో తేదీనే పెన్షనర్లకు వారికి అందాల్సిన పెన్షన్ మొత్తాన్ని కచ్చితంగా అందేలా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు జూలై నెలకు సంబంధించిన పెన్షన్‌ను ఆగస్టు ఒకటో తేదీనే అందించేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శుల ఖాతాలకు ఇప్పటికే పెన్షన్సొమ్మును జమచేశారు. వాలంటీర్లు ఈ సొమ్మును నేరుగా లబ్ధిదారుల ఇళ్లకువెళ్లి అందించనున్నారు. గతంలో పెన్షన్ కోసం ప్రభుత్వ కార్యాలయాల వద్ద వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు పడిగాపులు కాసే పరిస్థితిని ప్రభుత్వం పూర్తిగా మార్చేసింది. ప్రతినెలా ఒకటో తేదీన ఉదయం నుంచే పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలా నిర్వహిస్తున్నారు. పెన్షన్ల పంపిణీలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి స్థాయి నుంచి గ్రామ, వార్డు స్థాయి కార్యదర్శి వరకు భాగస్వాములు అవుతుండటం విశేషం. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ నెల కూడా పెన్షనర్ల బయోమెట్రిక్‌కు బదులు జియో ట్యాగింగ్‌తో కూడిన ఫోటోలను తీసుకుని, పెన్షన్ అందిస్తారని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ఫ్) సీఈఓ పి.రాజాబాబు తెలిపారు. ఈ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా 6734 మంది పెన్షనర్లు పోర్టబులిటీ ద్వారా పెన్షన్ తీసుకుంటున్నారని, అలాగే 1458 మందికి సంబంధించి లాక్‌డౌన్‌తో ఇతర ప్రాంతాల్లో ఉండిపోవడం వల్ల ఈనెలకు సంబంధించిన పెన్షన్‌ను హోల్డ్‌లో ఉంచమన్నారు. వారు తిరిగి వచ్చిన తరువాత చెల్లిస్తామని తెలిపారు. 14,967 మంది ఇతర జిల్లాలకు పెన్షన్ బదిలీ కోరారని, మరో 30,044 మంది ఒకే జిల్లాలో ఉంటూ పెన్షన్ బదిలీ చేయాలని కోరినట్లు చెప్పారు. అలాగే వివిధ కారణాల వల్ల గత ఆరు నెలల నుంచి పెన్షన్ తీసుకోలేని 1,52,095 మందికి చెల్లించాల్సిన బకాయిలు కూడా ఈ నెలలోనే అందచేస్తున్నామని అన్నారు. ఈనెల కొత్తగా 2.20 లక్షల పెన్షన్లు: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ నెలలో కొత్తగా మంజూరు చేసిన 2,20,385 మందికి కూడా ఆగస్టు 1వ తేదీ నుంచి పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. కొత్తగా మంజూరు చేసిన పెన్షన్లకు రూ.51.67 కోట్లు విడుదల చేశామని పేర్కొన్నారు. జూలై నెలలో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను గుర్తించి, వారికి దరఖాస్తు చేసుకున్న పది రోజుల్లోనే పెన్షన్ మంజూరు కార్డులను అందచేశామన్నారు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ పాలనలో తీసుకువచ్చిన ఈ విప్లవాత్మక మార్పుతో రాష్ట్రంలో సంతృప్త స్థాయిలో సామాజిక పెన్షన్లను అందించగలుగుతున్నామని అన్నారు. గత నెలలో దరఖాస్తు చేసుకున్న వారిలో 1568 మందికి కొత్తగా హెల్త్ పెన్షన్లు కూడా మంజూరు చేశామని వెల్లడించారు. అలాగే ఈ నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మిణ్ కార్పోరేషన్ ద్వారా నెలకు రూ.2వేలు ఇస్తున్న పెన్షన్లను కూడా వైఎస్సార్ పెన్షన్ కానుక కిందకు తెచ్చి, నెలకు రూ.2250 చెల్లిస్తున్నామని తెలిపారు. వాలంటీర్ల ద్వారా వారికి కూడా నెల ఒకటో తేదీనే పెన్షన్ సొమ్ము వారి చేతికి అందిస్తామని అన్నారు. అలాగే గతంలో కల్చరల్ డిపార్ట్మెంట్ నుంచి కళాకారులకు అందించే పెన్షన్‌ను కూడా వైఎస్సాఆర్ పెన్షన్ కానుక కిందకు తెచ్చి, వాలంటీర్ల ద్వారానే అందించబోతున్నామని వెల్లడించారు. -
నేడు జగనన్న పచ్చ తోరణం
సాక్షి, అమరావతి: ‘ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటి చెట్లు పెంచడం ద్వారా ప్రతి ఇంటినీ, ప్రతి ఊరునూ పచ్చదనంతో సింగారిద్దాం’ అనే నినాదంతో 71వ వన మహోత్సవాన్ని బుధవారం సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. నూతన మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు ఆయన కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉదయం 9 గంటలకు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి, కొడాలి నాని, పేర్ని నాని, వెలంపల్లి పాల్గొననున్నారు. వనమహోత్సవంలో 20 కోట్ల మొక్కలు నాటడానికి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. పచ్చదనం పెంపునకు ప్రతిన బూనుదాం జీవరాశులకు ప్రాణవాయువు అందించే మొక్కలను విరివిగా నాటడం ద్వారా చెట్ల పెంపకానికి త్రికరణ శుద్ధితో పాటుపడతామని ప్రతి ఒక్కరూ ప్రతిన బూనుదామని రాష్ట్ర అటవీ దళాల అధిపతి ఎన్.ప్రతీప్ కుమార్ పిలుపునిచ్చారు. ఆయన ‘జగనన్న పచ్చతోరణం’ ప్రచార సామగ్రిని మంగళవారం విడుదల చేశారు. మొక్కల సంరక్షణ బాధ్యత ప్రభుత్వానిదే : పెద్దిరెడ్డి జగనన్న పచ్చతోరణంలో భాగంగా రాష్ట్రంలో 20 కోట్ల మొక్కలు నాటి, వాటిని సంరక్షించే బాధ్యత కూడా ప్రభుత్వమే చేపడుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నంలో ఈ కార్యక్రమ ప్రారంభ ఏర్పాట్లను మంగళవారం ఆయన మంత్రులు పేర్ని నాని, వెలంపల్లి, సీఎం ప్రోగ్రాం కన్వీనర్ తలశిల రఘురాం, ఎమ్మెల్యేలు వసంత కృష్ణప్రసాద్, జోగి రమేష్‌లతో కలిసి పరిశీలించారు. -
రేపే ‘జగనన్న పచ్చతోరణం, 20 కోట్ల మొక్కలే లక్ష్యం
సాక్షి, కృష్ణా: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇబ్రహీంపట్నంలో రేపు (బుధవారం) ‘జగనన్న పచ్చతోరణం’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పేర్నినాని, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు వసంత కృష్ణ ప్రసాద్, జోగి రమేష్ తదితరులు కార్యక్రమ ఏర్పాట్లను మంగళవారం పర్యవేక్షించారు. అనంతరం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ రేపు ఇబ్రహీంపట్నంలో మొక్కలు నాటి వన మహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. 35 లక్షల మందికి ఇవ్వబోయే ఇళ్ల పట్టాల లే అవుట్లలో ‘జగనన్న పచ్చతోరణం’ కార్యక్రమం కింద మొక్కలు నాటుతున్నామని మంత్రి తెలిపారు. అంతేగాక ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో 20 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ప్రతి మొక్కకు ట్రీ గార్డు ఏర్పాటు చేసి 80 శాతం మొక్కలు కాపాడే బాధ్యత గ్రామ సర్పంచ్‌లకు ఇచ్చామని, నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. -
లీజు నిర్వాహకులకే అనుమతులు పునరుద్ధరించాం
సాక్షి, తిరుపతి తుడా: తూర్పుగోదావరి జిల్లాలోని లేటరైట్ నిక్షేపాల నమూనాలను కెమికల్ అనాలసిస్‌కు పంపామని.. అందులో అల్యూమినియం ఉన్నట్లు తేలడంతో తిరిగి లీజు నిర్వాహకులకే అనుమతులను పునరుద్ధరించామని రాష్ట్ర గనులు, భూగర్భ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టంచేశారు. బాక్సైట్‌కు అయితే కేంద్రమే అనుమతులిస్తుందని ఆయనన్నారు. ఈ విషయాన్ని పక్కనపెట్టి ఆంధ్రజ్యోతి దినపత్రిక నిరాధారమైన ఆరోపణలతో ‘ఏటా రూ.180 కోట్లు’ స్వాహా చేస్తున్నట్లు అసత్య కథనాన్ని ప్రచురిం చిందని ఆయన మండిపడ్డారు. 2012లో అప్పటి ముఖ్యమంత్రి తూర్పు గోదావరి జిల్లాలో తొమ్మిది మందికి 2033 వరకు ఈ లేటరైట్ నిక్షేపాల తవ్వకాలకు అనుమతులిచ్చారని మంత్రి తెలిపారు. తిరుపతిలోని తన నివాసంలో పెద్దిరెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ఆదివారం ఆ పత్రిక ప్రచురించిన ‘ఏటా రూ. 180 కోట్లు’ స్వాహా కథనంపై చట్టపరంగా చర్యలు తప్పవు. ఇప్పటికే నోటీసులు జారీచేశాం. సరైన వివరణ ఇవ్వకున్నా ఆధారాలు చూపకుంటే పరువు నష్టం దావా వేస్తాం. చంద్రబాబు హయాంలో దోచేశారు కాబట్టే మా ప్రభుత్వం కూడా దోచేస్తోందనే భ్రమలో ఎల్లో మీడియా ఉన్నట్లుంది. ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం సిగ్గుచేటు. ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు కథనాలతో ప్రజల్లో అయోమయం సృష్టించేందుకు ఆంధ్రజ్యోతి కుట్ర చేస్తోంది. గనుల కేటాయింపుల్లో ముఖ్యనేత అంటూ ఒకసారి.. మంత్రి సమీ ప బంధువంటూ మరోసారి కథనాలను రాయడం సరైందికాదు. గతంలోనూ సరస్వతి పవర్‌కు కోట్లు కట్టబెట్టారంటూ అసత్యాన్ని ప్రచారం చేశారు. రాష్ట్రంలో పాలన వికేంద్రీకరణ జరిగి తీరుతుంది. కరోనా కా రణంగా ఆలస్యమవుతోంది. సరైన సమయంలో నిర్ణయిస్తాం. -
అందుకే చట్టాన్ని సవరించాం: మంత్రి పెద్దిరెడ్డి
సాక్షి, అమరావతి: పంచాయతీరాజ్ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలన్న ఉద్దేశంతోనే కీలక సవరణలు చేశామని ఆ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. గ్రామ పంచాయితీ ఎన్నికలు 14 రోజుల లోపు, ఎంపీటీసీ, జడ్పీటీసి ఎన్నికలు 10 రోజులు లోపు నిర్వహించాలని సవరణలు చేశామని వెల్లడించారు. గ్రామ సర్పంచ్ స్థానికంగా నివాసం ఉండాలని, దీనివల్ల అభివృద్ధిపై మరింత దృష్టి పెట్టొచ్చునని అన్నారు. చట్ట సవరణలను ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బుధవారం వెల్లడించారు. గ్రామ సభలు సక్రమంగా నిర్వహించకుండా నిర్లక్ష్యంగా ఉన్నా, పంచాయతీ ఆడిట్ సకాలంలో నిర్వహించక పోయినా బాధ్యులను తొలగిస్తామని మంత్రి స్పష్టం చేశారు. షెడ్యూల్డ్ తెగల ప్రాంతాల్లో అన్ని సీట్లు ఎస్టీలకే రిజర్వేషన్లు చేస్తూ చట్ట సవరణలు తీసుకు వచ్చామని తెలిపారు. నల్ల చొక్కాలు వేసుకుని సభకు రాలేదు వార్షిక బడ్జెట్లో బ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ. 200 కోట్లు కేటాయించడం పట్ల డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి హర్షం వ్యక్తం చేశారు. బ్రాహ్మణుల తరుపున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ నిధులపై ప్రభుత్వంపై సోషల్ మీడియాలో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. అటువంటి వారిపై చర్యలు తీసుకుటామని అన్నారు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు విఫలమయ్యారని, నలుపు చొక్కాలు వేసుకొని సభకు రాకుండావెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. -
‘నిబంధనల ప్రకారం లీజ్‌ను పునరుద్దరించాము’
సాక్షి, విజయవాడ: టీడీపీ హయాంలో చంద్రబాబు 30 లీజులు ఇచ్చి, ఉద్దేశపూర్వకంగా సరస్వతీ పవర్ ఇండస్ట్రీ లీజ్ రద్దు చేశారని పంచాయతీరాజ్ శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కోర్టు ఆదేశాల మేరకు తమ ప్రభుత్వం కేంద్ర నిబంధనల ప్రకారం లీజ్‌ను పునరుద్దరించిందని తెలిపారు. సరస్వతి పవర్ ఇండస్ట్రీ లీజ్ పొడిగింపును చంద్రబాబు ప్రశ్నించారని, వయసు మళ్లిన రాజకీయనేత అలా మాట్లాడటం బాధాకరం అన్నారు. ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సర్వసాధారణంగా జరిగే ప్రక్రియను మీడియాను అడ్డుపెట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. (చంద్రబాబు తీరుపై మండిపడ్డ కన్నబాబు) పనిపాటా లేక చంద్రబాబు కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్నారని, గోరంతలను కొండంత చేసేందుకు ప్రయత్నిస్తున్నారని పెద్దిరెడ్డి ఎద్దేవా చేశారు. ఒక్క లీజుకే అర పేజీ రాసిన మీడియా చంద్రబాబు ఇచ్చిన 30 లీజ్‌లకి ఎంత రాయాలని ప్రశ్నించారు. నిబంధనల ప్రకారం బ్లీచింగ్‌ను ఐదు కోట్లకు కొనుగోలు చేశామని తెలిపారు. చెల్లింపులు కూడా ఇంకా పూర్తి స్థాయిలో జరగలేదని వెల్లడించారు. రూ.70 కోట్లు చెల్లించామని అసత్య ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. నాణ్యత పరిశీలన కొరకు ల్యాబ్‌కు పంపామని వ్యాఖ్యానించారు. (బాబు ఎందుకు ఓడిపోయాడో అతనికే తెలియదు) ఏడాది తిరక్కముందే మేనిఫెస్టోను అమలు చేస్తున్న ప్రభుత్వం తమదని పెద్దిరెడ్డి తెలిపారు. నిమ్మగడ్డ వ్యవహారంలో రెండు వారాల తర్వాత సుప్రీంకోర్టు విచారణ చేస్తామని చెప్పిందన్నారు. తమకు వ్యతిరేకంగా తీర్పు వచ్చిందని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తమ పార్టీలో గెలిచిన ప్రజా ప్రతినిధులని పార్టీలో చేర్చుకొని మంత్రి పదవులిచ్చిన నీతిలేని మనిషి చంద్రబాబని నిప్పులు చెరిగారు. అనైతికంగా సీఎం వైఎస్ జగన్ ఎవరినీ పార్టీలో చేర్చుకోరని తెలిపారు. బెదిరించి ఎవరినీ తమ పార్టీలోకి చేర్చుకోవాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వ విధానాలు నచ్చి చేరతామంటే కాదనే పరిస్థితి లేదని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. -
గ్రామ సచివాలయంలో కూడా ఇసుక బుకింగ్
సాక్షి, విజయవాడ: గ్రామ సచివాలయ పరిధిలో ఎవరైనా ఇసుక కావాలంటే ఆ గ్రామ సచివాలయంలో బుకింగ్ చేసుకోవచ్చని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి తెలిపారు. ప్రజా ప్రతినిధులు, మైనింగ్ అధికారులతో సోమవారం ఆయన సమీక్షా నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి పేర్ని నాని, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ: ఇసుక బుకింగ్‌కు సంబంధించిన వెబ్సైట్ 5 నిమిషాల్లోనే క్లోజ్ అవుతుందని ప్రజా ప్రతినిధులు, వినియోగాదారుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. ఇసుక బుకింగ్ ప్రక్రియను ఏపీఎండీసీ నుంచి గ్రామ సచివాలయాలకు అనుసంధానం చేస్తున్నామని తెలిపారు. గ్రామ సచివాలయంలో వచ్చిన డిమాండ్‌ను బట్టి ఏపీఎండీసీ అధికారులు చర్యలు తీసుకుంటారని ఆయన పేర్కొన్నారు. (పల్లె పల్లెకూ ఎల్ఈడీ వెలుగులు) ఈ పద్ధతి ద్వారా వినియోగదారులకు న్యాయం జరుగుతుందని, ఒకే ఆధార్ కార్డుతో వందలాదీ మంది తీసుకుంటూన్నారన్నారు. అందుచేత ఇసుక దుర్వినియోగం కాకుండా సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తున్నామని తెలిపారు. ఇసుక యాడ్ గురించి పది కిలోమిట్లర్లలోపే స్టాక్ పాయింట్ ఉండాలని నిర్ణయించామన్నారు. దీనివల్ల వినియోగదారులకు ట్రాన్స్‌పోర్టు ఖర్చులు తగ్గతాయని, దీనివల్ల వినియోగాదారునికి మేలు జరుగుతుందన్నారు. త్వరలోనే వీటన్నిటిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. -
గ్రామీణాభివృద్ధి శాఖలపై జగన్ సమీక్ష
సాక్షి, అమరావతి: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై శుక్రవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పంచాయితీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేదితో సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. ఉపాధిహామి పనులకు సంబంధించిన విషయాలను సీఎం జగన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో కరోనా కారణంగా ఉపాధి హామీ పనులు మందగించాయని అధికారులు జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. భౌతిక దూరం పాటిస్తూ పనులు మొదలుపెట్టామని, ఇప్పుడిప్పుడే పనులు వేగం పుంజుకుంటున్నాయని తెలిపారు. (‘మనసున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్’) వర్షాలు వచ్చే లోపు వీలైనన్ని పని దినాలు కల్పించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పథకంలో కూలీలకు వీలైనన్ని ఎక్కువ పని దినాలు కల్పించాలన్నారు. గ్రామ సచివాలయాలు, విలేజ్ క్లినిక్స్, రైతు భరోసా కేంద్రాలు, పాఠశాలల్లో నాడు–నేడు కార్యక్రమాలు అత్యంత ప్రాధాన్యమైనవని జగన్ అన్నారు. వీటి నిర్మాణాలు పూర్తి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. పాఠశాలల్లో నాడు–నేడు కార్యక్రమాలు జూలై 31 కల్లా పూర్తి చేస్తామని అధికారులు జగన్‌కు చెప్పారు. అదేవిధంగా 16,208 వార్డు, గ్రామ సచివాలయ పోస్టులు ఖాళీగా ఉన్నాయనిఅధికారులు సీఎంకి నివేదించారు. పరీక్షలకు అనుమతులు రాగానే భర్తీ చేస్తామన్నారు. 2021 మార్చి 31 నాటికి రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్య ఉప కేంద్రాల నిర్మాణాలను పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. గ్రామ సచివాలయాల నిర్మాణం ఆగస్టు 31 కల్లా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నామని కూడా అధికారులు తెలిపారు. అదేవిధంగా వాటర్ గ్రిడ్‌పైనా కూడా సీఎం జగన్ సమీక్షించారు. (మరింత సక్సెస్‌పుల్‌గా టెలి మెడిసిన్..) -
వాళ్లు స్వయంగా ఆస్పత్రికి వెళ్లాలి : పెద్దిరెడ్డి
సాక్షి, తిరుపతి : ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారు స్వయంగా ఆస్పత్రికి వెళ్లి కరోనా టెస్టులు చేయించుకోవాలని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు. అందరూ కొద్ది రోజుల పాటు భౌతికంగా దూరం పాటించాలని కోరారు. సోమవారం వారు మీడియాతో మాట్లాడుతూ.. కరోనా నియంత్రణకు అధికారులు అప్రమత్తంగా ఉన్నారని, ప్రజలు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా కట్టడే ద్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు. తిరుపతిలో పలు ప్రాంతాల్లో రెడ్ జోన్ ప్రకటన ఉందని.. ప్రజలు గుంపులుగా తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. షాపుల వద్ద ప్రజలు గుంపులుగా ఉండకుండా యజమానులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. -
గ్రామాల్లో స్వీయ నియంత్రణ పాటిస్తున్నారు
-
ఆ వ్యక్తి కుటుంబ సభ్యులకు నెగటివ్: పెద్దిరెడ్డి
సాక్షి, చిత్తూరు: జిల్లాలో కరోనా వైరస్ (కోవిడ్-19) ఆందోళనకర స్ధాయిలో లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. శ్రీకాళహస్తిలో ఓ వ్యక్తికి వైరస్ పాజిటివ్‌గా నిర్దారణ అయిందని ఆయన తెలిపారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తి విదేశాల నుంచి వచ్చినట్లు మంత్రి చెప్పారు. ఆ వ్యక్తి కుటుంబ సభ్యులకు అధికారులు పరీక్షలు నిర్వహించారని ఆయన తెలిపారు. ఇక కుంటుంబ సభ్యులందరికీ నెగటివ్‌గా రిపోర్టు వచ్చింనట్లు మంత్రి వెల్లడించారు. అదేవిధంగా వైరస్ నివారణకు మాస్కులు ఒక్కటే పరిస్కారం కాదని ఆయన స్పష్టం చేశారు. తప్పకుండా స్వీయ నిర్బంధం పాటించాలని మంత్రి సూచించారు. రైతులు పండించే కూరగాయలు సకాలంలో మార్కెట్‌కు చేరేలా చర్యలు తీసుకొంటున్నామని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. వెంటిలేటర్స్ కొరత ఉందని.. వెంటనే తగినన్ని వెంటిలేటర్లు సమకూర్చుతామని ఆయన చెప్పారు. ప్రతి ఎమ్మెల్యే కూడా అప్రమత్తం కావాలని ఆయన పిలుపునిచ్చారు. అధికారులకు సహాయ సహకారాలు అందించానలి సూచించారు. ప్రజలకు వైరస్ వ్యాపించకుండా అవగాహన కల్పించాలని మంత్రి చెప్పారు. ఎవరైనా నిబంధనలు పాటించకుంటే కఠినమైన కేసులు తప్పవని.. గ్రామ వాలంటీర్లుకు ప్రతి ఒక్కరు సహకరించాలని పెద్దిరెడ్డి కోరారు. సీఎం జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయ వ్యవస్థ ఈ సమయంలో ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. -
‘ఉపాధి పనులు నిర్ణీత గడువులో పూర్తి చేయాలి’
-
‘ఉపాధి పనులు నిర్ణీత గడువులో పూర్తి చేయాలి’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉపాధి హామీ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని, జిల్లాల వారీగా కేటాయించిన లక్ష్యాలను అధిగమించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్థి శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఆయన బుధవారం సచివాలయంలో ఉపాధి హామీ పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో పనుల పురోగతిలో అలసత్వం కనిపిస్తోందని.. ఇంజినీరింగ్ అధికారులు దీనికి బాధ్యత వహించాలని ఆదేశించారు. ఉపాధి హామీ పనులను జిల్లాల్లోని సీఈలు స్వయంగా పర్యవేక్షించాలని ఆయన సూచించారు. ఆర్థికశాఖ నుంచి కూడా బిల్లులు వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నామని రామచంద్రారెడ్డి తెలిపారు. గత రెండు నెలల్లో ఉపాధి హామీ పనులకు రూ.1400 కోట్లు చెల్లింపులు చేశామని ఆయన పేర్కొన్నారు. ఇంత పెద్ద మొత్తంలో చెల్లింపులు జరుపుతున్నా, కొత్తగా ప్రారంభించిన పనులు ఎందుకు వేగవంతం అవ్వడం లేదని ఆయన అధికారులను ప్రశ్నించారు. డిపార్ట్మెంట్ స్థాయిలో పనులు, చెల్లింపులపై అప్రమత్తంగా వుండాలని అధికారులకు పెద్దిరెడ్డి సూచించారు. స్టీల్, సిమెంట్ కోసం డీలర్లతో జిల్లా కలెక్టర్లు మాట్లాడి అవసరమైతే క్రెడిట్‌పై ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ ఏడాదిలో మనకు నరేగా కింద కేటాయించిన మొత్తాన్ని వినియోగించాలన్నారు. స్థానికంగా ఉన్న ప్రజా ప్రతినిధులకు కూడా అవగాహన కల్పించాలని అధికారులకు ఆయన సూచనలు ఇచ్చారు. మెటీరియల్ కేటాయింపులు ఎక్కువగా ఉంటే సీసీ రోడ్లును చేపట్టాలన్నారు. గ్రామ సచివాలయాలు, సీసీ డ్రైనేజీలు, ప్రహరీ గోడలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని పెద్దిరెడ్డి తెలిపారు. సిమెంట్‌కు సంబంధించిన బిల్లుల చెల్లింపుల్లో జాప్యం లేకుండా చూడాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఇసుక లభ్యతపై ఉపాధి పనులకు మినహాయింపులు ఇచ్చామని పెద్దిరెడ్డి గుర్తుచేశారు. జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుని ఇసుకను తీసుకోవచ్చుమని ఆయన తెలిపారు. ప్రతివారం ఎఫ్టీఓలు జారీ చేయాలి: జనవరి 31 నుంచి ఫిబ్రవరి 18 వరకు జరిగిన మెటీరియల్ వ్యయం రూ.138.68 కోట్లు అయిందని ఆయన తెలిపారు. గత ఏడాది ఏప్రిల్ 1 నుంచి నేటి వరకు (ఫిబ్రవరి 18) వరకు మొత్తం మెటీరియల్ వ్యయం రూ. 871.18 కోట్లు అయిందన్నారు. జిల్లా స్థాయిలో ఇంజనీరింగ్ అధికారులు ప్రతివారం నరేగా పనులపై సమీక్షించాలనిప పెద్దిరెడ్డి అధికారులను ఆదేశించారు. గతవారం జరిపిన నరేగా కింద రూ. 51.73 కోట్లు చెల్లింపులు చేశామన్నారు. ఉపాధి పనులకు ప్రతివారం ఎఫ్టీఓలు జారీ చేయాలని అధికారులకు సూచించారు. గత ఏడాది జరిగిన ఉపాధి పనుల్లో అవకతవకలు జరిగాయన్నారు. వాటిపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించిందని తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చిన తరువాత మంజూరు చేసిన పనులకు ఎక్కడా బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరగలేదన్నారు. వచ్చే అయిదు వారాలు ఇంజనీరింగ్ అధికారులు మరింత కష్టపడాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది చేసే వ్యయంను బట్టే వచ్చే ఆర్థిక సంవత్సరానికి నరేగా కేటాయింపులు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. సుమారు వెయ్యి కోట్లు వరకు నిర్ణీత గడువు లోపు ఖర్చు చేయాలని పెద్దిరెడ్డి అధికారులను ఆదేశించారు. ఎఫ్‌టీఓలను జనరేట్ చేయడం వల్ల బిల్లులు వెంటనే చెల్లించేందుకు అవకాశం వుంటుందని పెద్దిరెడ్డి తెలిపారు. మనబడి నాడు-నేడు కింద ఈ ఏడాది మొత్తం 284 మండలాలను ఎంపిక చేశామన్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది మొత్తం 5853 స్కూల్ భవనాలకు నరేగా కింద పనులు నిర్వహిస్తామని ఆయన అన్నారు. పాఠశాలల టాయిలెట్లు, కాంపౌండ్ వల్స్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన తెలిపారు. పంచాయతీ రాజ్ కింద నాడు-నేడులో 50 శాతం పనులు ఇచ్చామన్నారు. పాఠశాలల ప్రహరీ గోడలకు ఉపాధి హామీ నిధులు ఇస్తున్నామని తెలిపారు. ఈ మార్చి 31 నాటికి ప్రతిపాదించిన ప్రహరీ నిర్మాణాలను నూరుశాతం పూర్తి చేయాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజాశంకర్, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు. -
నూరు గొడ్లు తిన్న రాబందు ఒక్క గాలి వానకు..
సాక్షి, విజయవాడ : ప్రతి రోజు మీడియాతో మాట్లాడే చంద్రబాబు ఇప్పుడెందుకు నోరు విప్పడం లేదని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు ప్రశ్నించారు. శుక్రవారం విజయవాడలో మంత్రి మాట్లాడుతూ.. పీఎస్‌పై సోదాలు చేస్తేనే రూ.2 వేల కోట్లు తేలిందని, చంద్రబాబు, లోకేష్‌లపై సోదాలు జరిపితే ఎన్ని లక్షల కోట్లు తెలుతుందో అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఎంత దోచుకున్నారో ఐటీ సోదాలు బట్టి తేలిపోయిందని, ఆయన అవినీతి, రాష్ట్రానికి జరిగిన నష్టం ఇప్పుడు ప్రజలకు తెలిసిపోయిందన్నారు. చంద్రబాబు, లోకేష్ లపై కూడా ఐటీ సోదాలు జరపాలని సూచించారు. కృష్ణా: నూరు గొడ్డులు తిన్న రాబందు ఒక గాలి వానకు కూలినట్లు ఇన్నాళ్లకు చంద్రబాబు పాపం పండిందని రాష్ట్ర రవాణా, సమాచారశాఖ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. ఇది ఇక్కడితో ఆగదు, చంద్రబాబు అవినీతి చిట్టా బయటపడే రోజు దగ్గరలోనే ఉందని స్పష్టం చేశారు. తన పలుకుబడితో అవినీతి కేసులకు స్టేలు తెచ్చుకున్న చంద్రబాబు ఇన్నాళ్లకు అడ్డంగా దొరికిపోయారని వ్యాఖ్యానించారు. తిరుపతి : గత నాలుగు రోజులుగా జరుగుతున్న ఐటీ దాడుల్లో చంద్రబాబు నాయుడు బినామీల అక్రమ ఆస్తులు వెలుగు చూశాయని పరిశ్రమల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక తప్పుడు ప్రచారం చేసే ఎల్లో మీడియాకి ఐటీ దాడులు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. 2 వేలకోట్లు బయటపడ్డ కళ్లకు గంతలు కట్టినట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇంత జరుగుతున్న చంద్రబాబు ఒక్కమాట కూడా బయట పడటం లేదని, ఆయనకు ఎలాంటి సంబంధం లేకుంటే ఎందుకు ఐటీ దాడులపై స్పందించడం లేదని ప్రశ్నించారు. ప్రశ్నిస్తామని వచ్చిన పవన్ కళ్యాణ్ ,కాంగ్రెస్ నాయకులు కూడా నోరు మెదపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం : చంద్రబాబు కమీషన్ల బాగోతం బట్టబయలు అయిందని మంత్రి ధర్మాన కృష్ణ దాస్ అన్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... గతంలో సీబీఐ విచారణలు వద్దన్నది ఇందుకేనా అని ప్రశ్నించారు. అవినీతి జరిగిందని అరోపణలు వచ్చినప్పుడు విచారణ ఎదుర్కోవాలని హితవు పలికారు. ప్రజలు అవినీతిని సహించడం లేదని, పారదర్శకమైన పాలన కోరుకుంటున్నారన్నారు. నాలగైదు చోట్ల దాడులకే రెండు వేల కోట్లు బయటపడ్డాయని, ఇంకా దాడులు చేయాల్సి ఉందని అన్నారు. *చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్‌లు ఐటీ దాడుల మీద స్పందించాలని పిలుపునిచ్చారు. -
ఎన్నికల్లో సంస్కరణలు చేపట్టాలి: మంత్రి పెద్దిరెడ్డి
సాక్షి, అమరావతి: గ్రామ స్థాయి నుంచే ఎన్నికల సంస్కరణలు చేపట్టాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. స్థానికంగా నివాసం ఉండేలా సర్పంచ్‌లకు నిబంధనలు రూపొందించాలని అలాగే డబ్బు, మద్యం పంపిణీ జరగకుండా ఎన్నికలు నిర్వహించేలా ఎన్నికల నియమావళిని రూపొందించాలని తెలిపారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడితే అనర్హత వేటు వేయాలని సూచించారు. అందరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని, ఉగాది కల్లా పేదలందరికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని తెలిపారు. వికేంద్రీకరణకు ప్రజలందరు మద్దతు తెలుపుతున్నారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. -
అర్హులందరికీ పెన్షన్లు: మంత్రి పెద్దిరెడ్డి
సాక్షి, అమరావతి: అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ ఇవ్వాలన్నదే వైఎస్సార్సీపీ ప్రభుత్వం లక్ష్యమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. పూర్తి పారదర్శకతతో పింఛన్లను ప్రభుత్వం మంజూరు చేస్తోందని స్పష్టం చేశారు. సంతృప్తిస్థాయిలో వైఎస్సార్ పెన్షన్ కానుకను అమలు చేయాలనే సంకల్పంతో వైఎస్సార్సీసీ ప్రభుత్వం ఉందని పేర్కొన్నారు. పెన్షన్ల పంపిణీలో ప్రభుత్వం రికార్డు సృష్టించిందన్నారు. రాష్ట్రంలో పెన్షన్లు మంజూరు కాని వారికి న్యాయం చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. అర్హత ఉన్న కూడా పెన్షన్ రాని వారిని గుర్తించేందుకు వారం రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ నెలలో మొత్తం 54.68 లక్షల మందికి 1వ తేదీనే పింఛన్లు పంపిణీ చేశామన్నారు. వాలంటీర్ల ద్వారా మొత్తం రూ.1320 కోట్లను లబ్ధిదారులకు అందించి ప్రభుత్వం రికార్డు సృష్టించిందన్నారు. నవశకం సర్వే ద్వారా రాష్ట్రంలో అర్హులైన పెన్షనర్లను గుర్తించామని.. కొత్తగా ఈ నెలలో 6.14 లక్షల మందికి పెన్షన్లు మంజూరు చేసామని పేర్కొన్నారు. అర్హత లేని కారణంగా 4.80 లక్షల మందికి పెన్షన్లు తొలగించామని వెల్లడించారు. సుమారు 31,672 మంది దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పింఛన్లు ఇచ్చామని వెల్లడించారు. అర్హులందరికీ లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశ్యంతో గతం కన్నా మార్గదర్శకాలను కూడా సరళం చేశామని వివరించారు. దివ్యాంగులకు వారి వైకల్య శాతంతో సంబంధం లేకుండా 40 శాతం పైబడిన వారందరికీ రూ.3వేలు పెన్షన్ ఇస్తున్నామన్నారు. దివ్యాంగులు,దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఉన్న కుటుంబంలో అర్హత ఉన్న వారికి రెండో పెన్షన్ ఇచ్చే వెసులుబాటు కల్పించామని పేర్కొన్నారు. ‘కుటుంబ ఆదాయ పరిమితి గ్రామీణ ప్రాంతాలలో నెలకు రూ.10వేలు, పట్టణ ప్రాంతాలలో రూ. 12వేలకు పెంచాం. టాక్సీ, ట్రాక్టర్, ఆటో లకు నాలుగు చక్రాల వాహన పరిమితి నుంచి మినహాయింపు ఇచ్చాం. అభయహస్తం పెన్షన్ తీసుకునేవారికి అర్హతను బట్టి వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేస్తున్నాం. మున్సిపల్ ఏరియాలో వెయ్యి చదరపు అడుగుల నివాసం వున్న వారికి కూడా పెన్షన్ ఇస్తున్నామని’ తెలిపారు. కుటుంబ నెలసరి విద్యుత్ వినియోగం 300 యూనిట్ల వరకు మినహాయింపు ఇచ్చామని’ మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు.