
సాక్షి, తిరుపతి : చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార‍్టీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అధికార దుర్వినియోగానికి పరాకాష్ట చంద్రబాబు అని, ఆయన బాబు కుట్రలు, కుతంత్రాలు ప్రజలందరికీ తెలుసని అన్నారు. జూబ్లీహిల్స్‌లో తన తల్లి ఆస్తులను బాబు లోకేష్ పేరుపై మార్చుకున్నారని ఆరోపించారు. ఇంటి పెద్ద కొడుకు అంటే ఇంట్లో వారందరినీ బాగా చూసుకోవాలని.. సొంత తమ్ముడ్ని, అక్కాచెల్లెళ్లను పట్టించుకోని బాబు పెద్ద కొడుకా అంటూ నిలదీశారు.
మైక్రో ఇరిగేషన్‌లో ఎస్సీ, ఎస్టీలకు సబ్సిడీలు ఇచ్చి మభ్యపెట్టారని విమర్శించారు. ఎన్నికల ముందు ఓటర్లను ప్రభావితం చేసేలా వ్యవహరించారని మండిపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ నేతలపై టీడీపీ నేతలు దాడులకు దిగారన్నారు. చంద్రబాబు రాయలసీమలో ఫ్యాక్షనిజాన్ని ఉసిగొల్పుతున్నారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి బాబు దిగజారి మాట్లాడుతున్నారని అన్నారు. చిత్తూరు జిల్లా ఎస్పీ తీరుపై ఫిర్యాదు చేసినా.. ఈసీ చర్యలు తీసుకోలేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment