
విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కక్ష సాధింపు చర్యలు ఒక్కోక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వైఎస్సార్సీపీ శ్రేణులే లక్ష్యంగా ఇప్పటికే కుట్ర పూరిత రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు.. ఈసారి ఏకంగా ఆ పార్టీకి చెందిన వారికి ఏ పనులు చేయొద్దంటూ వ్యాఖ్యానించడం తీవ్ర దుమారం రేపుతోంది. వైఎస్సార్ సీపీకి చెందిన వారికి ఎటువంటి పనులు చేయొద్దని చంద్రబాబు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ గా వైఎస్సార్ సీపీ శ్రేణులకు ఏ పనులు చేయకండని, అన్ని స్థాయిల్లోనూ ఇది వర్తిస్తుందని వ్యాఖ్యానించారు. తన సొంత జిల్లా(చిత్తూరు జిల్లా) పర్యటనలో భాగంగా ప్రజా వేదిక పేరుతో ఏర్పాటు చేసిన సభలో సీఎం చంద్రబాబు ఈ రకంగా కక్ష పూరిత వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు వ్యాఖ్యలపై విమర్శలు
ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు ఈ తరహా కక్ష సాధింపు వ్యాఖ్యలు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. గతంలో పార్టీ రహితంగా మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పాలన అందిస్తే, ఇప్పుడు చంద్రబాబు ఇలా వ్యాఖ్యానించడం కక్ష పూరిత రాజకీయం కాకపోతే ఏంటని రాజకీయ విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. సీఎంగా ప్రమాణం చేసే సమయంలో రాజ్యాంగాన్ని గౌరవిస్తానంటూ చంద్రబాబు చేసిన ప్రమాణం ఏమైందని మండిపడుతున్నారు. ఇది రాజ్యాంగానికి, సీఎం ప్రమాణానికి విరుద్ధమంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment