chittoor district
-
ఆటోను ఢీకొన్న మోటార్ బైక్.. ఇద్దరు విద్యార్థులు మృత్యువాత
తవణంపల్లె: చిత్తూరు, కాణిపాకం రోడ్డు సత్తారు బావి సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృత్యువాత పడ్డారు. తవణంపల్లె ఎస్ఐ చిరంజీవి కథనం మేరకు.. మండలంలోని ముత్తరపల్లె గ్రామానికి చెందిన గోవిందు కుమారుడు సాయితేజ (19), మైనగుండ్లపల్లెకు చెందిన ప్రసాద్‌రెడ్డి కుమారుడు హర్ష (19) ఇద్దరు స్నేహితులు. వీరిద్దరూ చిత్తూరు నగరంలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ప్రథమ సంవత్సరం చదువుతున్నారు. శుక్రవారం సాయితేజ తన మోటార్ సైకిల్లో తన స్నేహితుడు హర్షను వెనుక కూర్చోబెట్టుకుని పరీక్ష రాయడానికి కాలేజ్‌కు బయలుదేరారు. ఈ తరుణంలో సత్తారు బావి సమీపంలో ముందు వెళ్తున్న బస్సును అధిగమించే క్రమంలో ఎదురుగా వస్తున్న ఆటోను వేగంగా ఢీకొన్నారు. ప్రమాదంలో సాయితేజ, హర్షకు బలమైన గాయాలు కావడంతో తీవ్రంగా రక్తస్రావం అయ్యింది. దీంతో క్షతగాత్రులను 108 వాహనం ద్వారా చికిత్స నిమిత్తం చిత్తూరులోని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి అప్పటికే వారిద్దరూ మృతి చెందినట్లు నిర్థారించారు. తల్లిదండ్రులు, తోటి విద్యార్థులు, గ్రామస్తులు కన్నీటిపర్యంతమయ్యారు. -
మహిళా ‘సూపర్’ మార్ట్
చిత్తూరు యాసలో వినిపించే ‘పుష్పా–2’ డైలాగ్....‘పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా... ఇంటర్నేసనల్’ బాగా పేలింది.చిత్తూరు జిల్లా తవణంపల్లె మహిళా మార్ట్‌కు కూడా ఈ డైలాగ్‌ను అన్వయించుకోవచ్చు.‘మా మహిళా మార్ట్ అంటే స్టేట్ అనుకుంటివా... ఇప్పుడు నేషనల్... రేపు ఇంటర్నేషనల్’ఆనాటి వై.ఎస్.జగన్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ‘మారనున్న అక్కాచెల్లెమ్మల భవిత’ నినాదంతో పురుడు పోసుకున్న ‘మహిళా మార్ట్’లు ఇంతై ఇంతింతై అన్నట్లుగా ఎదిగి పోయాయి.కార్పొరేట్ సూపర్ మార్కెట్లతో సమానంగా సత్తా చాటుతున్నాయి.తాజాగా... చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలోని తవణంపల్లె ‘మహిళా మార్ట్’ జాతీయస్థాయిలో పురస్కారం పొందింది.చిన్న దుకాణాన్ని నడపడానికి కూడా ఎన్నోవిధాల ఆలోచించాల్సి ఉంటుంది. ఎంతో కొంత డబ్బు కావాల్సి ఉంటుంది. అలాంటిది కార్పొరేట్ మార్ట్‌లకు దీటుగా ఒక్క అడుగు వెనక్కి తగ్గకుండా సాధారణ మహిళల ‘మహిళా మార్ట్’లు విజయం సాధించడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. వ్యాపారంలో ఓనమాలు కూడా తెలియని వారు, భర్త ఆదాయంపైనే పూర్తిగా ఆధారపడేవారు, పల్లెకే పరిమితమైన వారు ‘మహిళా మార్ట్’ల పుణ్యమా అని వ్యాపారంలో మెలకువలు తెలుసుకున్నారు. ఆర్థికంగా సొంత కాళ్ల మీద నిలబడే శక్తిని తెచ్చుకున్నారు. పల్లె దాటి ప్రపంచాన్ని చూస్తున్నారు.‘ఇది మా వ్యాపారం. మా టర్నోవర్ ఇంత...’ అని గర్వంగా చెప్పుకునే స్థాయికి ఎదిగారు.వై.ఎస్.జగన్ ప్రభుత్వంలో మండల సమాఖ్య ద్వారా స్వయం సహాయక సంఘ సభ్యుల భాగస్వామ్యంతో రాష్ట్రంలోనే రెండో ‘చేయూత మహిళా మార్ట్ ను తవణంపల్లెలో 2023 ఫిబ్రవరిలో ఏర్పాటు చేశారు. మండలంలోని 1,431 స్వయం సహాయక సంఘాల్లోని 14,889 మంది సభ్యుల వాటా ధనం రూ.26 లక్షలతో ‘చేయూత మహిళా మార్ట్’(ప్రస్తుతం వెలుగు మహిళ మార్ట్‌గా పేరు మార్చారు)ను ్రపారంభించారు.ఆర్థిక అవగాహన, పొదుపు, అప్పుల రికవరీలు, సిఐఎఫ్ చెల్లింపులు. స్త్రీనిధి, పారదర్శక నిర్వహణ, రైతు ఉత్పత్తిదారుల సమాఖ్య ద్వారా రైతులకు అందిస్తున్న సేవలతో తవణంపల్లె మహిళా మార్ట్ ముందంజలో ఉంది. మండల సమాఖ్య ద్వారా సభ్యుల భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న ఈ మహిళా మార్ట్ రాష్ట్రంలో ప్రథమ స్థానంలో, జాతీయ స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచింది. హైదరాబాద్ యూసఫ్‌గూడలోని నేషనల్ ఇ¯Œ స్టిట్యూట్ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కార్యాలయంలో తవణంపల్లె మహిళా సమాఖ్య అధ్యక్షురాలు రేఖ, కార్యదర్శి అనిత సర్టిఫికేట్, షీల్డు, ్రపోత్సాహక నగదు (రూ.75 వేలు) అందుకున్నారు.‘ఇది ఒకరిద్దరి విజయం కాదు. ఎంతోమంది మహిళల సామూహిక విజయం. ఎంతోమందికి స్ఫూర్తినిచ్చే విజయం’ అంటున్నారు రేఖ, అనిత.– తగీరు జగన్నాథం, సాక్షి, తవణంపల్లె, చిత్తూరు జిల్లా.పారదర్శకత... మా బలం‘అన్నీ తెలిసిన వారు లేరు. ఏమీ తెలియని వారు లేరు’ అనే సామెత ఉంది. ఏమీ తెలియకుండా ఎవరూ ఉండరు. మనకు తెలిసినదాన్ని మరింత మెరుగుపరుచుకుంటే ఏదీ అసాధ్యంగా అనిపించదు. ‘మహిళా మార్ట్’ అనే బడిలో వ్యాపారంలో ఓనమాలు దిద్దుకున్నాం. ఎన్నో పాఠాలు నేర్చుకున్నాం. ఏ వ్యాపారానికి అయినా పారదర్శకత అనేది ముఖ్యం. ఆ పారదర్శకత వల్లే జాతీయ గుర్తింపు వచ్చింది. మహిళా సంఘాలు ‘వెలుగు మహిళా మార్ట్’ను పారదర్శకంగా నిర్వహించడంతో జాతీయ పురస్కారం అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. గుర్తింపు అనేది ఉత్సాహాన్ని ఇవ్వడమే కాదు మరిన్ని విజయాలు సాధించడానికి అవసరమైన శక్తిని ఇస్తుంది.– అనిత మహిళా సమాఖ్య మండల కార్యదర్శిఆ నమ్మకమే ముందుకు నడిపిస్తుందివ్యాపారంలో ఫలానా మహిళ ఉన్నత స్థాయికి చేరింది... లాంటి ఎన్నో విజయగాథలను వినేవాళ్లం. అలాంటి ఒక స్థాయికి ఏదో ఒకరోజు చేరుకోగలమా అనిపించేది. ‘మహిళా మార్ట్’ ద్వారా మమ్మల్ని గొప్ప అవకాశం వెదుక్కుంటూ వచ్చింది. మాకు ధైర్యాన్ని ఇచ్చింది. ముందుకు నడిపించింది. ‘మీ విజయ రహస్యం ఏమిటి?’ అడిగే వాళ్లకు నేను చెప్పే జవాబు... ‘నేను సాధించగలను’ అనే నమ్మకం. ఆ నమ్మకానికి కష్టం, అంకితభావం తోడు కావాలి. తవణంపల్లెలోని వెలుగు మహిళా మార్ట్‌లో సభ్యులకు నాణ్యమైన వస్తువులు సరసమైన ధరలకు విక్రయిస్తున్నాం. బయట మార్కెట్ కంటే తక్కువ ధరలకు అన్నిరకాల వస్తువులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. డ్వాక్రా సభ్యులు మార్ట్‌లోని వస్తువులే కొంటున్నారు.– రేఖ మహిళా సమాఖ్య మండల అధ్యక్షురాలు -
తీరుతెన్నూ లేని చందంగా ఏపీ!
ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం, పోలీసులు ఎంత ఘోరంగా పని చేస్తున్నారో చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణలు అవసరం లేదేమో! మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిపై పెట్టిన దుర్మార్గపు కేసు ఒక ఉదాహరణైతే, ప్రముఖ సినీ దర్శకుడు వర్మకు సంబంధించి పోలీసులు ప్రవర్తించిన తీరు మరొకటి. ఇంకోపక్క తెలుగుదేశం సోషల్ మీడియా సీనియర్ ఐఎఎస్ అధికారులను కూడా వదలకుండా ఇష్టారీతిలో బురదవేసి అవమానిస్తున్నా ప్రభుత్వం అస్సలు పట్టించుకోవడం లేదు. చిత్తూరు జిల్లాలో ఎర్రావారిపాలెం అనే గ్రామం వద్ద ఒక బాలిక పై అఘాయిత్యం జరిగింది.ఆ బాలిక తండ్రి ఈ విషయాన్ని ఫోన్ ద్వారా చెవిరెడ్డికి వివరిస్తే, ఆయన ఆ కుటుంబానికి సాయపడడానికి ఆ గ్రామానికి వెళ్లారు.ఆ క్రమంలో ఆ బాలిక తండ్రి రమణను పరామర్శించి బాలికకు ధైర్యం చెప్పారు. వారిని ఆస్పత్రికి తరలించడానికి అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఈ ఉదంతం ఏలికలకు కోపం తెప్పించింది. ఎలాగైనా చెవిరెడ్డిపై కేసు పెట్టాలని పోలీసులు భావించినట్లు ఉన్నారు. ఇలాంటి కేసులలో బాలికల ఐడెంటిటిని ఎవరూ బయటపెట్టకూడదు. చెవిరెడ్డి కూడా ఆ జాగ్రత్తలు తీసుకుంటూనే మీడియాతో మాట్లాడారు. ఆ తర్వాత ఏమైందో కాని ఘటన జరిగిన కొద్ది రోజులకు చెవిరెడ్డిపై పోక్సో కేసుతోపాటు మరికొన్ని పెట్టినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఆశ్చర్యపోవడం లాయర్ కూడా అయిన చెవిరెడ్డి వంతైంది. బాలిక తండ్రిని బెదిరించి ఫిర్యాదు తీసుకున్నారా అన్న అనుమానం అప్పట్లో వచ్చింది.చెవిరెడ్డి ఈ కేసును ఎదుర్కోవడానికి సిద్ధపడి మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. అంతలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. బాధిత తండ్రి మీడియా సమావేశం పెట్టి తానసలు చెవిరెడ్డిపై కేసు పెట్టలేదని, తమకు సాయపడడానికి వచ్చిన వారిపై కేసు ఎలా పెడతామని ప్రశ్నించారు. పోలీసులు కేసును తారుమారు చేస్తారన్న భయంతో చెవిరెడ్డిని పిలిచామని ఆయన చెప్పారు. తాను చదువుకోలేదని, పోలీసులు సంతకం చేయమంటే చేశానని ,దానిని వాడుకుని చెవిరెడ్డిపై తప్పుడు కేసు పెట్టారని ఆయన స్పష్టం చేశారు. దీనిపై పోలీసులు స్పందించలేకపోయారు. ఇది కేవలం చిత్తూరు పోలీసులకే కాదు..రాష్ట్ర పోలీసు శాఖకు కూడా అప్రతిష్ట తెచ్చిందని చెప్పాలి. రాష్ట్రంలో వైసిపివారిపై జరుగుతున్న దాడులు, హింసాకాండకు సంబంధించి పలు ఫిర్యాదులు వచ్చినా పోలీసులు స్పందించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై ఇష్టారీతిన కేసులు పెడుతున్నారు. టీడీపీ సోషల్ మీడియా ఎంత అరాచకంగా పోస్టులు పెట్టినా, అసభ్య పోస్టులు ప్రచారం చేసినా పోలీసులు వారి జోలికి వెళ్లడం లేదు. వీటికి తోడు ఇప్పుడు వైసీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్న తీరు ఎపిలో ప్రజాస్వామ్యం ఏ రకంగా ఖూనీ అవుతుందో చెప్పడానికి నిదర్శనంగా కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నపుడు ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. బాధితురాలిని విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. ఆ బాలికను పరామర్శించడానికి చంద్రబాబు అక్కడకు వెళ్లారు. బాధిత కుటుంబం పిలవకపోయినా ఆయన వెళ్లారు. మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా ఉన్న వాసిరెడ్డి పద్మ ఆనాడు ఎంత వారించినా వినలేదు. చంద్రబాబు వెళ్లి పరామర్శ చేస్తే రైటు, చెవిరెడ్డి వెళితే తప్పా అన్నదానికి బదులు దొరకదు. అప్పట్లో చంద్రబాబు పై వైసీపీ ప్రభుత్వం ఎలాంటి కేసు పెట్టలేదు. మహిళా కమిషన్ చంద్రబాబుకు నోటీసు పంపించినా, ఆయన పట్టించుకోలేదు. చెవిరెడ్డి విషయంలో మాత్రం తప్పుడు ఫిర్యాదు తీసుకుని మరీ దారుణమైన చట్టాన్ని ప్రయోగించారు. పోక్సో కేసు అంటే మైనర్లపై అత్యాచారం వంటి నేరాలకు పాల్పడ్డ వారి మీద పెట్టే కేసు అన్నమాట. చెవిరెడ్డిపై అలాంటి కేసు పెట్టడం పోలీసులు ఎంత పక్షపాతంగా వ్యవహరిస్తున్నారో చెప్పకనే చెబుతోంది. ప్రమఖ దర్శకుడు వర్మపై టీడీపీ వారితో సోషల్ మీడియా కేసులు పెట్టించి, ఆయనను అరెస్టు చేయడానికి జరిగిన ప్రయత్నాలు శోచనీయం. ఆయన ధైర్యంగా నిలబడి పోరాడుతున్నారు.ఈ సందర్భంగా ఆయన పలు ప్రశ్నలు కూడా సంధించారు. తాను ఎప్పుడో పెట్టిన పోస్టింగ్‌లకు తాను ఎవరిపైన కార్టూన్లు పోస్టు చేశానో వారికి కాకుండా ఇంతకాలం తర్వాత ఎవరివో మనో భావాలు దెబ్బతినడం ఏమిటని ఆయన అడిగారు. తొమ్మిది మందికి ఏడాది తర్వాత ఒకేసారి మనోభావాలు దెబ్బ తిన్నాయా అని అన్నారు. తాను పారిపోయినట్లు ఎల్లో మీడియా చేసిన ప్రచారంలో వాస్తవం లేదని, తన ఆఫీస్‌లోకి పోలీసులు రాకుండానే వెళ్లిపోయారని ఆయన చెప్పారు. ఇలాంటి పోస్టింగులు లక్షల కొద్ది వస్తున్నాయని, వాటి సంగతేమిటని ఆయన ప్రశ్నించారు. చట్టంలో దీనికి సంబంధించి ఉన్న అంశాలకు, తనపై పెట్టిన సెక్షన్లలకు లింకు కనిపించడం లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. ఏ ఏ సందర్భాలలో సోషల్ మీడియా కేసులు పెట్టవచ్చో కూడా వివరించారు. ఆయన వేసిన ప్రశ్నలకు పోలీసుల నుంచి జవాబు వచ్చినట్లు లేదు. నిజానికి వర్మ తరహాలో అనేక మంది పోస్టులు పెడుతుంటారు. ఆ మాటకు వస్తే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ఈనాడు వంటి ఎల్లో మీడియా ఎంత నీచమైన కార్టూన్లు వేసిందో గుర్తు చేసుకుంటేనే భయానకంగా ఉంటుందని, వాటిపై ఎన్నడూ కేసులు పెట్టకపోవడం తప్పు అయినట్లుగా ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఒకప్పుడు ఎన్.టి.రామారావుకు దుస్తులు లేకుండా వేసిన కార్టూన్లను వారు ప్రస్తావిస్తున్నారు. ఎవరైనా బూతులు పెడితే చర్య తీసుకోవచ్చు. అలాగే కుల, మతాల మధ్య విద్వేషాలు నింపేలా వ్యవహరిస్తే కేసు పెట్టవచ్చు. విచిత్రం ఏమిటంటే రోజుల తరబడి ఎల్లో మీడియా టివి ఛానళ్లలో కూర్చుని కులాల మధ్య చిచ్చు పెట్టిన వ్యక్తిపై అప్పటి ప్రభుత్వం కేసు పెడితే దానిని వేరే విధంగా డైవర్ట్ చేశారు. పైగా ఆయనకు మంచి పదవిని కూడా చంద్రబాబు ఇచ్చారు. తాజాగా ఐటీడీపీకి చెందిన విజయ్ సీనియర్ ఐఎఎస్ అధికారి కృష్ణబాబుపై పెట్టిన పోస్టింగ్ మాటేమిటి? కృష్ణబాబుకు ఏ ప్రభుత్వం ఉన్నా మంచి పేరు ఉంది.ఇప్పటికి ప్రధాన శాఖలలోనే పని చేస్తున్నారు. కానీ ఆయనపై నిందలు మోపుతూ, వైసీపీ కోసమే పనిచేస్తున్నారని, పులివెందులకు చెందిన ఒక కంపెనీకి బిల్లులు చెల్లించారని ఆరోపిస్తూ పోస్టు పెట్టారు. దీనిపై కృష్ణబాబు ఆవేదన చెందిన ముఖ్యమంత్రికి పిర్యాదు చేశారట. అసలు తాను కొత్త ప్రభుత్వం వచ్చాక ఎవరికి బిల్లులు చెల్లించ లేదని ఆయన చెబుతున్నారు. అయినా చట్టప్రకారం బిల్లులు ఒక అధికారి చెల్లిస్తే అది ఎలా తప్పు అవుతుంది? విజయ్ స్పీకర్ అయ్యన్నపాత్రుడి కుమారుడు. అయ్యన్న కూడా విపక్షంలో ఉండగా, ఆ తర్వాత కూడా కొందరు అధికారులను తూలనాడుతూ మాట్లాడిన వీడియోలు వచ్చాయి. ఆయన మహిళ అధికారులను కూడా దూషించినట్లు వార్తలు వచ్చాయి. మరో వైపు వైసీపీ సోషల్ మీడియాకు చెందిన కార్యకర్తలు కొందరిపై అనేక కేసులు పెట్టి ఊరూరా తిప్పుతూ దారుణంగా వేధిస్తున్నారు. అసలు ఏపీలో ప్రజాస్వామ్యం అనేది లేకుండా రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నారు. సూపర్ సిక్స్ హామీలను గాలికి వదలివేసిన చంద్రబాబు ప్రభుత్వం సాధించిన ఘనత ఇదే అనుకోవాలి.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
తిరుపతి, నెల్లూరు జిల్లాలకు రెడ్ అలర్ట్
సాక్షి, అమరావతి/విశాఖపట్నం/నెట్వర్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుపాను నెమ్మదిగా కదులుతోంది. శనివారం రాత్రికి గంటకు 7కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. మహాబలిపురానికి 50 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 80 కిలోమీటర్లు, చెన్నైకి 90 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. శనివారం రాత్రికి తుపాను తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే తమిళనాడు–పుదుచ్చేరి తీరాల వద్ద కారైకాల్, మహాబలిపురం మధ్య పుదుచ్చేరి దగ్గర తీరం దాటే ప్రక్రియ మొదలైనట్టు పేర్కొంది.తీరం దాటే సమయంలో ఇంకా నెమ్మదిగా కదులుతున్నట్టు తెలిపింది. తుపాను చెన్నైకి సమీపంలో తీరం దాటేందుకు వచ్చినట్టే వచ్చి దాదాపు 6 గంటల వరకూ సముద్రంలోనే స్థిరంగా నిలిచిపోయింది. అనంతరం.. పశ్చిమ నైరుతి దిశగా కదులుతూ పుదుచ్చేరి తీరం వైపు పయనించింది. తుపాను తీరం దాటిన తర్వాత తీవ్ర వాయుగుండంగా బలహీనపడనుందని అధికారులు తెలిపారు. ఇప్పటికే తుపాను ప్రభావంతో దక్షిణకోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తుండగా.. కోస్తాంధ్ర జిల్లాల్లో తీరం వెంబడి తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడుతున్నాయి.భారీ నుంచి అతి భారీ వర్షాలు డిసెంబర్ 2 వరకూ కొనసాగే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. తిరుపతి, నెల్లూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉందని.. ఆయా జిల్లాల్లోని లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులు 3వ తేదీ వరకూ వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. తుపాను తీవ్రత దృష్ట్యా తిరుపతి, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాల్లో అత్యంత తీవ్రంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తూ∙ఆరెంజ్ అలర్ట్, అనకాపల్లి, విశాఖపట్నం, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ప్రకాశం, వైఎస్సార్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయనే హెచ్చరికలతో ఎల్లో అలర్ట్ ప్రకటించారు.రెండు జిల్లాల్లో కుండపోతశ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు, అన్నమయ్య, ప్రకాశం, వైఎస్సార్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెగని వర్షాలకు తిరుపతి జిల్లా అంతా తడిసి ముద్దయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నెల్లూరు జిల్లాలోనూ వర్షాల తీవ్రతకు అనేక ప్రాంతాల్లోని రోడ్లపై నీరు చేరింది. కోస్తా జిల్లాల అంతటా వర్షాలు పడుతుండటంతో కళ్లాల్లో ఉన్న ధాన్యం తడిసిపోయి పనికిరాకుండా పోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో ఆకస్మిక అతి భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉన్నట్టు అధికారుహెచ్చరికలు జారీ చేశారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా శనివారం ఉదయం నుంచి ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి.ఈదురుగాలులు ఎక్కువగా ఉండటంతో చలి తీవ్రంగా ఉంది. జనమంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. వాకాడు, కోట, చిట్టమూరు, చిల్లకూరు, సూళ్లూరుపేట, తడ మండలాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదయ్యపాళెం నుంచి∙సంతవేలూరుకు వెళ్లే మార్గంలో సీఎల్‌ఎన్‌పల్లి వద్ద పాముల కాలువ, అంబూరు సమీపంలో మార్ల మడుగు కాలువలు ఉధృతంగా ప్రవహించడంతో ఆ మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 10 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. పెద్ద పాండూరు సమీపంలో రాళ్ల కాలువ వద్ద నీటి ఉధృతి పెరగడంతో మరో 7 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో గాలులకు పలు ప్రాంతాల్లో చెట్లు నెలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు పడిపోవంతో విద్యుత్‌కు అంతరాయం కలిగింది.తిరుమలలో భారీ వర్షంతిరుమలలో శనివారం ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. చలి తీవ్రత పెరిగింది. చంటి పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అద్దె గదులు దొరకని భక్తులు షెడ్ల కింద వర్షానికి, చలికి వణికిపోతున్నారు. వ్యాపార సంస్థలు ఉదయం నుంచి మూతపడ్డాయి. తిరుమల శిలాతోరణం నుంచి శ్రీవారి పాదాల వద్దకు వెళ్లే మార్గంతోపాటు, ఆకాశ గంగ, పాపవినాశనం మార్గాలను తాతాల్కింగా మూసివేశారు. విమాన సర్వీస్‌లు రద్దువిజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే పలు విమాన సరీ్వస్‌లను శనివారం రద్దు చేశారు. చెన్నై విమానాశ్రయాన్ని మూసివేయడంతో అక్కడి నుంచి గన్నవరం వచ్చి వెళ్లాల్సిన రెండు ఇండిగో విమానాలు రద్దయ్యాయి. తిరుపతి, షిర్డీ విమాన సర్వీస్‌లు కూడా రద్దయ్యాయి. చెన్నై, షిర్డీ, తిరుపతి వెళ్లాల్సిన ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. కాగా.. తిరుపతి (రేణిగుంట) విమానాశ్రయంలోని రన్‌వేపై నీళ్లు చేరడంతో ఏడు విమాన సరీ్వస్‌లు రద్దయ్యాయి. భీములవారిపాలెంలో అత్యధికంగా 13.1సెంటీ మీటర్లుశనివారం తిరుపతి జిల్లా భీములవారిపాలెంలో అత్యధికంగా 13.1సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అదే జిల్లా మన్నార్పోలూర్లో 13.0, పుత్తూరులో 12.3, సూళ్లూరుపేటలో 11.8, పూలతోటలో 11.5, తడలో 10.8, మల్లంలో 10.3, చిత్తూరు జిల్లా నగరిలో 9.4, నిండ్రలో 8.8 సెంటీమీటర్లు చొప్పున వర్షపాతం నమోదైంది.సముద్రం అల్లకల్లోలంవిశాఖ సముద్ర తీరం భారీ కెరటాలతో అల్లకల్లోలంగా మారింది. మూడు అడుగుల కంటే ఎత్తుగా కెరటాలు ఎగసి పడుతున్నాయి. విశాఖలోని వైఎంసీఏ నుంచి విక్టరీ ఎట్ సీ వరకు గల తీరం భారీగా కోతకు గురయింది. నాలుగు అడుగులకుపైగా ఎత్తున ఇసుక పూర్తిగా కోతకు గురైంది. పశ్చిమ గోదావరి జిల్లాలో శనివారం ఉదయం నుంచి జల్లులు పడటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ జిల్లాల్లో జల్లులు కురిశాయి. విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాలో అక్కడడక్కడా జల్లులు పడ్డాయి.కృష్ణా జిల్లా వ్యాప్తంగా శనివారం మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. వర్షం కురవడంతో రోడ్ల వెంబడి ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. కోతలు కోసి పనలపై ఉన్న ధాన్యం తడిసిపోయింది. హంసలదీవి వద్ద సాగరతీరం అల్లకల్లోలంగా మారింది. పల్నాడు జిల్లాలో అక్కడక్కడా జల్లులు పడుతున్నాయి. బాపట్ల జిల్లా రేపల్లె, వేమూరు నియోజకవర్గాలలో విడతలవారీగా ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. సుమారు 3వేల ఎకరాలకుపైగా వరిపంట నేలకొరిగింది.తుపానుపై సీఎం సమీక్ష సాక్షి, అమరావతి: ఫెంగల్ తుపాను నేపథ్యంలో అన్ని స్థాయిల్లో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. తుపాను పరిస్థితులపై శనివారం జిల్లా కలెక్టర్లు, సీఎంవో, రియల్ టైమ్ గవర్నెన్స్ అధికారులతో సమీక్షించారు. ఆర్టీజీ ద్వారా నిరంతర పర్యవేక్షణతో ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ఆస్తి, ప్రాణ నష్ట నివారణకు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.సహాయ, పునరావాస కార్యక్రమాలకు సమాయత్తం కావాలని కలెక్టర్లను ఆదేశించారు. తుపాను విషయంలో రైతులు ఆందోళనగా ఉన్నారని, నిరి్ధష్టమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అన్నదాతలకు చేరవేయాలని సూచించారు. కాగా, ఫెంగల్ తుపాను దృష్ట్యా భారీ వర్షాలు కురిసి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే పునరుద్ధరణ చర్యలు చేపట్టడానికి సిద్ధంగా ఉండాలని విద్యుత్ సంస్థలను ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ శనివారం టెలీకాన్ఫరెన్స్ ద్వారా సూచించారు. -
వైఎస్సార్ విగ్రహం ధ్వంసం.. టీడీపీ నేతలపై అనుమానం
-
వైఎస్సార్సీపీ నేత కుటుంబం కిడ్నాప్ కలకలం
రామకుప్పం: సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం మండలంలో గురువారం అర్ధరాత్రి వైఎస్సార్సీపీ నేత గోవిందప్ప కుటుంబాన్ని కిడ్నాప్ చేయడం కలకలం సృష్టించింది. కిడ్నాపర్ల నుంచి వారిని పోలీసులు రక్షించారు. ఆ సమయంలో కిడ్నాపర్లు పరారయ్యారు. బాధితుల కథనం మేరకు.. మండలంలోని పెద్దకురబలపల్లిలోని వైఎస్సార్సీపీకి చెందిన మాజీ సర్పంచ్ గోవిందప్ప కుటుంబాన్ని గురువారం రాత్రి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు.మూడు లగ్జరీ కార్లలో వచ్చిన ఆగంతకులు గన్లతో బెదిరించి గోవిందప్ప కుటుంబసభ్యుల్ని కారుల్లో ఎక్కించుకున్నారు. గోవిందప్ప, గంగమ్మ, మాధవమ్మ, సుబ్బక్క, సిద్ధప్ప, సోమశేఖర్, పునీత్‌లను కారుల్లో ఎక్కించుకుని రామకుప్పం వైపు బయలుదేరారు. తాము ఆదాయపన్ను అధికారులమని, మీ దగ్గర ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు ఫిర్యాదు అందిందని గోవిందప్పకు చెప్పారు. మీవద్ద దాచిన నగదు ఇస్తే పంచుకుని వదిలేస్తామని ఆఫర్ ఇచ్చారు. విజలాపురం సమీపంలో గోవిందప్ప తమ్ముడు జయరఘురాం కోసం వాకబు చేశారు. తన తమ్ముడు ఇంటివద్దే ఉన్నట్లు గోవిందప్ప చెప్పడంతో మళ్లీ పెద్దకురబలపల్లి వెళ్లారు. అక్కడ జయరఘురాం లేకపోవడంతో కార్లను రామకుప్పం వైపు తీసుకెళ్లారు. రామకుప్పంలోని వైఎస్సార్ సర్కిల్లో బీట్ విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుళ్లను గమనించిన ఆగంతకులు కుటుంబం మొత్తాన్ని ఆస్పత్రికి తీసుకెళ్తున్నట్లు పోలీసులకు చెప్పాలని బాధితులను బెదిరించారు. ముందు రెండు కార్లను ఆపిన పోలీసులకు బాధితులు ఆవిధంగానే చెప్పారు. అయినా అనుమానించిన పోలీసులు అందరినీ కిందికి దించి ప్రశ్నించసాగారు. ఈ నేపథ్యంలో ఆ రెండు కార్లలోని కిడ్నాపర్లు పరారయ్యారు. ఆ సమయంలో వెనుక ఉన్న మూడోకారు వేగంగా ముందుకెళ్లిపోయింది. ఆ కారులో ఉన్న బాధితులు ఇద్దరిని రెండు కిలోమీటర్ల తరువాత కిడ్నాపర్లు వదిలేసి వెళ్లిపోయారు. చేతులు మారిన నగదే కారణమా? ప్రశాంతంగా ఉన్న రామకుప్పం మండలంలో కిడ్నాప్ అంశం ప్రజల్లో తీవ్రచర్చకు దారితీసింది. రైస్‌పుల్లింగ్ పేరిట కోట్లాది రూపాయలు చేతులు మారాయని అందులో భాగంగానే ఈ కిడ్నాప్ జరిగిందన్న చర్చలు సాగుతున్నాయి. దుండగులు కర్ణాటకకు చెందిన వారని తెలిసింది. పోలీసులు మాట్లాడుతుండగానే దుండగులు పరారవడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎంతటివారైనా వదిలిపెట్టం: కుప్పం సీఐ మాజీ సర్పంచ్ గోవిందప్ప కుటుంబం కిడ్నాప్‌ను తీవ్రంగా పరిగణిస్తున్నామని కుప్పం రూరల్ సీఐ మల్లేష్ యాదవ్ తెలిపారు. అందులో భాగంగా గోవిందప్ప తమ్ముడు జయరఘురాంను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు చెప్పారు. నగదు లావాదేవీలు, నగదు మార్పిడి కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
చిత్తూరు జిల్లాలో కిడ్నాప్ కలకలం
-
తిరుపతి, చిత్తూరు జిల్లాల YSRCP అధ్యక్షుడిగా భూమన బాధ్యతలు
-
ఈ చిన్నారి ఘటన మీకు కనిపించలేదా?
పుంగనూరు((చిత్తూరు జిల్లా): కిడ్నాప్‌కు గురై ఆపై హత్య గావించబడ్డ పుంగనూరుకు చెందిన అశ్వియా కుటుంబాన్ని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డిలు పరామర్శించారు. శనివారం పుంగనూరుకు వెళ్లిన పెద్దిరెడ్డి, మిథున్‌రెడ్డిలు.. అశ్వియా కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చారు. కుమార్తె అశ్వియా హత్యకు గురి కావడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తండ్రి హజ్మతుల్లాను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్‌రెడ్డిలు ఓదార్చి ధైర్యం చెప్పారు.అనంతరం పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. ‘పుంగనూరులో ఇలాంటి దారుణ ఘటన ఎప్పుడూ జరగలేదు. ఇంటి ముందు ఆడుకుంటున్న రెండవ తరగతి చదువుతున్న చిన్నారి కిడ్నాప్ , హత్య జరిగితే ప్రభుత్వం పట్టించుకోలేదు. దీనిపై దోషులను శిక్షించకపోతే అందుకు తగిన విధంగా స్పందిస్తాం. ఈ ఘటనలో పోలీసుల అసమర్థత కనిపిస్తోంది. మదనపల్లి సబ్ కలెక్టర్ ఘటనలో డీజీపీ, సీఐడీ అధికారులను ప్రత్యేక ఫ్లైట్, హెలికాప్టర్ ఇచ్చి పంపించి దర్యాప్తు చేశారు. మరి ఈ చిన్నారి ఘటన పోలీస్ ఉన్నతాధికారులకు కనిపించడం లేదా?, ఈ నెల9వ తేదీన వైఎస్ జగన్మోహన్రెడ్డి పుంగనూరుకు వచ్చి బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వైఎస్సార్సీపీ ఆందోళన చేపట్టనుంది. బాధిత కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుంది’ అని పేర్కొన్నారు. ‘కానరాని లోకాలకు చిట్టితల్లి’9న పుంగనూరుకు వైఎస్ జగన్ -
‘ప్రజల దృష్టి మరల్చేందుకు కుట్రకు తెరలేపారు’
తిరుపతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన వంద రోజుల పాలనపై ప్రజల దృష్టిని మరల్చేందుకే తిరుమల లడ్డూ వివాదాన్ని తెరపైకి తెచ్చారని పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. చంద్రబాబు పాలనలో సూపర్ సిక్స్ లేదు.. సూపర్ సెవెన్ లేదు అంటూ ఎద్దేవా చేశారు పెద్దిరెడ్డి. ‘ లడ్డూ ప్రసాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. పుంగనూరులో చిన్నారి అశ్వియా అంజుమ్ కిడ్నాప్‌కు గురై హత్య గావించబడితే పోలీసులు కనీసం పట్టించుకోలేదు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఫైల్స్ కాలిపోతే డిజిపి స్పెషల్ ఫ్లైట్, ప్రత్యేక హెలికాప్టర్ లో వచ్చారు. డిజిపి పనితీరు మార్చుకోవాలి. మదనపల్లి సబ్ కలెక్టర్ ఘటనలో నాపై బురద చల్లెందుకు ఎన్నో కుట్రలు చేశారు, ఎలాంటి ఆధారాలు లభించక లేదు’ అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన అశ్వియా అనే బాలిక కిడ్నాప్ గురై ఆ తర్వాత దారుణంగా హత్య చేయబడింది. అశ్వియా కుటుంబ సభ్యులను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డిలు పరామర్శించనున్నారు. అయితే పెద్దిరెడ్డి, మిథున్‌రెడ్డిలు హత్యకు గురైన బాలిక కుటుంబాన్ని పరామర్శించేందుకు పుంగనూరుకు వెళుతున్నారన్న సమాచారంతో అక్కడ పెద్ద ఎత్తును పోలీసులను మోహరించింది చంద్రబాబు సర్కారు. -
9న పుంగనూరుకు వైఎస్ జగన్
పుంగనూరు: చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని ఉబేదుల్లా కాంపౌండులో కిడ్నాప్, ఆపై హత్యకు గురైన చిన్నారి అశ్వియ అంజుమ్ (7) కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 9వ తేదీన పుంగనూరుకు రానున్నారు. ఈ మేరకు తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.అంజుమ్ కిడ్నాప్, హత్య ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిందన్నారు. ఈ నేపథ్యంలో ఆ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి పరామర్శించేందుకు వైఎస్ జగన్ రానున్నారని, మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డిలు కూడా వస్తారని తెలిపారు. వైఎస్సార్సీపీ అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొని బాధిత కుటుంబానికి అండగా నిలవాలని కోరారు.ఇదీ చదవండి: తప్పు చేసిన బాబు క్షమాపణ చెప్పాలి -
చిత్తూరు మొగలిఘాట్ రోడ్లో మరో ఘోరం
చిత్తూరు, సాక్షి: జిల్లాలో రోడ్డు ప్రమాదాలకు కేరాఫ్‌గా మారింది మొగిలి ఘాట్ రోడ్. నిత్యం అత్యంత రద్దీగా ఉండే ఇక్కడి బెంగళూరు - చెన్నై జాతీయ రహదారి.. బుధవారం అర్ధరాత్రి మళ్లీ నెత్తురోడింది. ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీ కొట్టడంతో.. మంటలు చెలరేగి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.బంగారు పాళ్యం మండలం మొగిలి ఘాట్ రోడ్లో అర్థరాత్రి ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. రిపేరుతో ఆగివున్న ఓ కలప లోడ్ లారీని.. వెనుక నుండి బలంగా ఢీ కొట్టింది మరో లారీ. దీంతో.. కలప లారీలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. లారీ డ్రైవర్ సజీవ దహనం కాగా క్లీనర్ గాయపడ్డాడు. అదే టైంలో.. ఢీ కొట్టిన లారీ క్యాబిన్లో ఇరుక్కుపోయి క్లీనర్ మృతి చెందగా, డ్రైవర్ గాయపడ్డాడు. డీఎస్పీ ప్రభాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు వి.కోట నుంచి తెలంగాణ భద్రాచలం వెళ్లాల్సిన యూకలిప్టస్ లోడ్ లారీ మొగిలి ఘాట్ వద్ద ఇంజన్ సమస్యతో డ్రైవర్ పక్కన నిలిపి రిపేర్ చేస్తున్నాడు. అదే టైంలో.. హుబ్లీ(కర్ణాటక) నుంచి చిత్తూరు వైపు వస్తున్న షుగర్ లోడ్ తో వస్తున్న లారీ వెనుక నుంచి అతి వేగంగా వచ్చి ఢీ కొట్టింది. అర్ధరాత్రి 2.30గం. ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. కలప లారీలో మంటలు చెలరేగి డ్రైవర్ సజీవ దహనం అయ్యాడు. షుగర్ లోడ్ లారీ క్యాబిన్లో డ్రైవర్, క్లీనర్ ఇరుక్కుపోగా.. క్లీనర్ స్పాట్లోనే కన్నుమూశాడు. స్థానికులు డ్రైవర్‌ను అతికష్టం మీద బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన క్లీనర్‌తో పాటు, మరో లారీ డ్రైవర్‌ను చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికు తరలించారు. అర్ధరాత్రి ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీస్ బలగాలు.. 108, ఫైర్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటల్ని అదుపు చేసి.. ట్రాఫిక్‌ను పునరుద్ధరించాయి. మరో రెండు నిమిషాల్లో షుగర్ లోడ్ లారీ శ్రీని ఫుడ్స్‌కు చేరుకోవాల్సి ఉంది. ఈ లోపే ప్రమాదానికి కారణం కావడం గమనార్హం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మొగలి ఘాట్.. ☠️ స్పాట్ ఈనెల 13 న ఆర్టీసీ బస్సు ను ఢీ కొట్టిన లారీ ప్రమాదంలో 7 మంది మృతి, 33 మందికి గాయాలు ఈనెల 14 గాజుల పల్లి వద్ద ఇన్నోవా వాహనం ఫ్రంట్ టైర్ పేలి బోల్తా.. ఇద్దరు మృతి ఈనెల 15 న మొగిలి ఘాట్ లో రోడ్ ప్రమాదాలు నివారణ కు స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు ఈనెల 18 న మొగిలి ఘాట్ రోడ్ లో ఆ స్పీడ్ బ్రేకర్స్ గుర్తించక.. టెంపో ట్రావెలర్ ను అతివేగంగా ఢీ కొన్న టమోటో బొలెరో ట్రక్ వాహనం. ఏడుగురికి తీవ్ర గాయాలు తాజాగా.. రెండు లారీలు ఢీ కొట్టి.. ఒకరి సజీవ దహనం, మరోకరు క్యాబిన్లో ఇరుక్కుని మృతి -
మొగిలి ఘాట్ రోడ్డులో ప్రమాదం.. టెంపో-మినీ లారీ ఢీ
సాక్షి, చిత్తూరు జిల్లా: బంగారు పాళ్యం మండలం మొగిలి ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. టెంపో ట్రావెలర్‌ను మినీ లారీ ఢీకొట్టింది. దీంతో జాతీయ రహదారి దిగువకు టెంపో దూసుకుపోయింది. టెంపోలో ప్రయాణిస్తున్న ఏడుగురికి తీవ్ర గాయలయ్యాయి. క్షతగాత్రులను బంగారు పాళ్యం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.కర్ణాటక రాష్ట్రం ఉడిపి నుంచి టెంపో వాహనంలో తిరుమలకు వస్తుండగా మొగిలి ఘాట్ దగ్గర ప్రమాదం చోటుచేసుకుంది. ఘాట్‌లో స్పీడ్ బ్రేకర్స్ వద్ద మీనీ లారీ బలంగా ఢీ కొట్టింది.ఈ నెల 13 న ఇదే ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. ఈ క్రమంలో మొగిలి ఘాట్ రోడ్డులో హైవే ప్రమాదాలు నివారణకు వేసిన స్పీడ్ బ్రేకర్స్‌పై వేగంగా వెళ్లడంతో ఈ రోజు మరో ప్రమాదం సంభవించింది. -
కుప్పంలో గంజాయి ‘మత్తు’.. తెలుగు తమ్ముళ్ల మధ్య ఘర్షణ
సాక్షి, చిత్తూరు జిల్లా: సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. గంజాయి మత్తులో తెలుగు తమ్ముళ్లు ఘర్షణ పడటంతో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ ఇరువర్గాలు ఒకరిపై మరొకరు కత్తులు, రాడ్డులతో దాడులు చేసుకున్నారు. దాడిలో కుప్పం మాజీ జడ్పీటీసీ రాజ్ కుమార్ తమ్ముడు వినయ్ తీవ్రంగా గాయపడ్డారు.ఈ ఘర్షణలో న్యాయవాది కుమారుడు, రాజకీయ నేతల కుమారులు ఉన్నట్లు తెలిసింది. టీడీపీ కార్యకర్త వినయ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరిన్నివివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గంలో ఇలాంటి ఘర్షణలు జరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.ఇదీ చదవండి: గనుల శాఖలో బదిలీల ‘వేలం’ -
YSRCP అభిమానులపై టీడీపీ నేతలు దాడి
-
ఇదేం పని ‘గురువా’!
శాంతిపురం: విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు విద్యార్థుల ముందే మద్యపానం చేస్తూ ఫొటోలకు చిక్కాడు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ పరిధిలోని శాంతిపురం మండలం కడపల్లి బాలయోగి గురుకుల పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. పాఠశాల ఆవరణలోని బాలుర హాస్టల్లో బుధవారం రాత్రి విద్యార్థులతో పాటు ఉన్న పీఈటీ మురళి అక్కడే మద్యం సేవించడం మొదలుపెట్టాడు. పిల్లల ముందే వారు నిద్రించే పడకపై కూర్చుని హాయిగా మద్యం తాగుతూ ఎవరితోనో ఫోన్లో గొడవ పెట్టుకున్నాడు. పాఠశాలకు వచ్చి ఈ విషయాన్ని గమనించిన రామకుప్పం మండలానికి చెందిన ఓ దళిత నాయకుడు ఈ దృశ్యాలను ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో విషయం వెలుగుచూసింది. దీనిపై ఇన్చార్జి ప్రిన్సిపాల్ రాజేంద్రను వివరణ కోరగా.. పిల్లల మధ్య కూర్చుని మద్యం సేవిస్తున్న కాంట్రాక్ట్ పీఈటీ ఫొటోలు తనకు కూడా వచ్చాయన్నారు. తాను ఈ విషయాన్ని డీసీవో దృష్టికి తీసుకెళ్లానని.. ఆమె గురువారం విచారణకు వస్తున్నారని చెప్పారు. -
రొంపిచెర్లలో టీడీపీ నేతల బరితెగింపు
సాక్షి, చిత్తూరు జిల్లా: రొంపిచెర్లలో టీడీపీ నేతలు బరితెగించారు. వైఎస్సార్సీపీ నేత వెంకటరమణ షాప్‌పై టీడీపీ నేతలు దాడి చేశారు. షాపుపై దాడి చేసి సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. దాడిని అడ్డుకున్న వైఎస్సార్సీపీ కార్యకర్త ఓబులేసుపైనా దాడి చేశారు. టీడీపీ నేతల దాడిలో ఓబులేసుకు తీవ్ర గాయాలు కావడంతో పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదును పోలీసులు స్వీకరించకపోవడంతో ఎస్పీకి ఫిర్యాదు చేశారు.టీడీపీ నేతల వేధింపులకు మహిళ మృతిమరో ఘటనలో టీడీపీ నేతల వేధింపులు తట్టుకోలేక మహిళ మృతిచెందింది. కుప్పం కేజీబీవీలో ఆయాగా పనిచేస్తున్న సెల్వమ్మను పనికిరావద్దని టీడీపీ నేతలు చెప్పడంతో మనస్తాపానికి గురైంది. వాటర్ సంపులో పడి ఆయా సెల్వమ్మ అనుమానాస్పదంగా మృతిచెందింది. ఆమె మృతికి టీడీపీ నేతలే కారణమని కుటుంబ సభ్యులు అంటున్నారు. -
కుప్పంలో జల్లికట్టు నిర్వహణ.. 10 మందికి గాయాలు
సాక్షి, చిత్తూరు: చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో జల్లికట్టు నిర్వహించారు. టీడీపీ నేతల కనుసన్నల్లో ఈ జల్లికట్టు నిర్వహణ జరిగింది. చెక్కునత్తం గ్రామంలో నిర్వహించిన జల్లికట్టులో 10 మందికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం కుప్పం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
చిత్తూరు జిల్లాలో 50 కోట్ల స్కాం..
-
కేసులకు భయపడొద్దు.. ధైర్యంగా ఉండండి: ఎంపీ మిథున్‌రెడ్డి
సాక్షి, చిత్తూరు: మన ప్రభుత్వంలో ఇలాంటి దాడులు చూడలేదని.. కేసులకు భయపడొద్దు.. ధైర్యంగా ఉండండి’’ అంటూ పార్టీ నేతలు, కార్యకర్తలకు వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి ధైర్యం చెప్పారు. శుక్రవారం ఆయన సదుం మండలంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మిథున్‌రెడ్డి మాట్లాడుతూ, నాపై కూడా నాన్‌బెయిలబుల్ కేసులు పెట్టారు. పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తే సహించం. పోలీసులు పట్టించుకోకుంటే న్యాయపోరాటం చేస్తాం. నేను ఎవ్వరినీ వదిలి పెట్టను, కార్యకర్తలకు అండగా ఉంటా. పోలీసులు పట్టించుకోకుంటే కోర్టు ద్వారా ప్రైవేట్ కేసులు వేస్తాం.. మీకు ధైర్యం చెప్పేందుకే నేను వచ్చాను’’ అని మిథున్‌రెడ్డి చెప్పారు.వైఎస్సార్సీపీ నేత పోకల అశోక్‌కుమార్ మాట్లాడుతూ, చట్టానికి ఎవరు అతీతులు కారు, కుట్ర పూరితంగా కేసులు పెడుతున్నారు. ప్రజలు అందరు గమనిస్తున్నారు. వాళ్లకు తగిన బుద్ధి చెప్తారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి వెన్నంటే మన కార్యకర్తలు, నాయకులు ఉన్నారన్నారు. -
కుమ్మపల్లిలో టీడీపీ నేతల అరాచకం
-
కమ్మపల్లిలో ఆగని టీడీపీ అరాచకం
సాక్షి టాస్క్‌ఫోర్స్: చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సోమల మండలంలోని కమ్మపల్లి గ్రామంలో వైఎస్సార్సీపీ శ్రేణులపై టీడీపీ నేతల దౌర్జన్యాలు కొనసాగుతున్నాయి. పదిరోజుల నుంచి వైఎస్సార్సీపీ కుటుంబాలు గ్రామంలోంచి బయటకు వెళ్లకుండా, వెలుపల ఉన్నవారు గ్రామంలోకి రాకుండా అడ్డుకున్నారు. గ్రామంలో జరుగుతున్న ఆటవిక చర్యల గురించి సాక్షి వెలుగులోకి తీసుకొచ్చింది. అయినా పోలీసులు తగిన చర్యలు తీసుకోలేదు. నాలుగు రోజుల కిందట టీడీపీ నేతల దాడుల్లో తీవ్రంగా గాయపడినవారి పరిస్థితి ఎలా ఉందో కూడా తెలియని దుస్థితి నెలకొంది.రెండురోజుల కిందట పోలీసులు గ్రామంలోకి వెళ్లి ఇరువర్గాల వారితో మాట్లాడినా.. టీడీపీ నేతల దౌర్జన్యకాండ కొనసాగుతూనే ఉంది. గ్రామంలో జరుగుతున్న దౌర్జన్యకాండ బయటకు పొక్కకుండా చూసేందుకు వారి ఫోన్లు కూడా లాగేసుకున్నట్లు సమాచారం. ఇప్పటికీ గ్రామంలోకి పాల సరఫరా నిలిపివేశారు. వైఎస్సార్సీపీ వారి పశువులకు గ్రాసం కూడా వేయనీయడంలేదని తెలిసింది. గ్రామంలోని వైఎస్సార్సీపీ కుటుంబాలకు చెందిన టమాటా దిగుబడులను మార్కెట్‌కు తరలించకుండా నిలిపేశారు. పొలాల్లో నాలుగు రోజులుగా నిల్వ ఉన్న టమాటా దిగుబడికి సంబంధించినవీడియోలు బయటకు వచ్చాయి.గ్రామంలో సుమారు వెయ్యి బాక్సుల వరకు టమాటా నిల్వలు ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఒక బాక్సు విలువ రూ.500కు పైనే. ఒకటి రెండురోజుల్లో మార్కెట్‌కు తరలించకపోతే ఈ టమాటా దిగుబడి మొత్తం కుళ్లిపోయే ప్రమాదం ఉంది. టీడీపీ దౌర్జన్యకాండను జీర్ణించుకోలేని ఆ పార్టీ కార్యకర్త ఒకరు ఈవీడియోలు, ఫొటోలను వైరల్ చేసినట్లు తెలిసింది. మీడియా, పత్రికల వారికి పంపినట్లు సమాచారం. గ్రామంలో జరుగుతున్న టీడీపీ నేతల దాష్టీకంపై మానవహక్కుల కమిషన్ స్పందించాలని మానవతావాదులు కోరుతున్నారు. -
రక్తమోడిన రహదారులు
పెద్దపంజాణి: చిత్తూరు జిల్లా బసవరాజు కండ్రిగ సమీపంలో యాత్రికులతో వెళ్తున్న బస్సు బోల్తా పడిన ఘటనలో ఇద్దరు దుర్మరణం పాలు కాగా, మరో 21 మంది గాయపడ్డారు. శనివారం వేకువజామున ఈ ఘటన చోటుచేసుకుంది. పెద్దపంజాణి పోలీసుల కథనం ప్రకారం.. సత్యసాయి జిల్లా రామగిరి మండలం పేరూరు పరిసర గ్రామాలకు చెందిన 45 మంది తమిళనాడు రాష్ట్రంలోని ఆధ్యాత్మిక క్షేత్రాలను దర్శించుకోవాలనుకున్నారు. అనంతపురానికి చెందిన ఖాన్ ట్రావెల్స్ బస్సు మాట్లాడుకుని, ఐదుగురు టూర్ నిర్వాహకులతో శుక్రవారం రాత్రి బయలుదేరారు.అతివేగమే ప్రమాదానికి కారణంబస్సు శనివారం వేకువజామున పెద్దపంజాణి మండల పరిధి పలమనేరు–పుంగనూరు మార్గంలో బసవరాజు కండ్రిగ సమీపానికి చేరుకుంది. బస్సును డ్రైవర్ అతివేగం, అజాగ్రత్తగా నడపడంతో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో సత్యసాయి జిల్లా రొద్దం మండలం చిన్నగువ్వలపల్లికి చెందిన తిమ్మారెడ్డి భార్య రామానుజమ్మ (58), కర్ణాటక రాష్ట్రంలోని తుముకూరు జిల్లా మురారాయనపలి్లకి చెందిన నరసింహారెడ్డి (68) అక్కడిక్కడే మృతి చెందారు. బస్సులోని 21 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పెద్దపంజాణి పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని క్షతగాత్రులను పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలకు పోస్టుమార్టం జరిపించి బంధువులకు అప్పగించారు. కేసు దర్యాప్తులో ఉంది.అన్నమయ్య జిల్లాలో ఘోరంరామాపురం: కర్నూలు–చిత్తూరు 40వ జాతీయ రహదారిపై అన్నమయ్య జిల్లా రామాపురం మండలం చిట్లూరు పంచాయతీ దళితవాడ సమీపంలో శనివారం తెల్లవారుఝామున ఘోర ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న ట్యాంకర్‌ను కారు ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో కడప నాగరాజుపేటకు చెందిన హోంగార్డు పూజారి ఆంజనేయులునాయక్ (28), కడప రాజారెడ్డివీధికి చెందిన కారు డ్రైవర్ పఠాన్ అఫ్రోజ్‌ఖాన్ (35), కడప నాగరాజుపేటకు చెందిన మారాబత్తుల జితేంద్రకుమార్ (24), కడప ఐటీఐ సర్కిల్‌కు చెందిన షేక్ హలీమ్ (35) ఉన్నారు.కడప రవీంద్రనగర్‌కు చెందిన షేక్ ఖాదర్బాషాకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. కడప పట్టణానికి చెందిన ఈ ఐదుగురూ శుక్రవారం అర్ధరాత్రి కారులో కడప నుంచి బయలుదేరి రాయచోటి వైపు కారులో వెళ్తుండగా, రామాపురం మండలం చిట్లూరు దళితవాడ సమీపంలోని వంతెన వద్ద ఆ కారు ముందు వెళ్తున్న ట్యాంకర్‌ను వెనుక వైపు ఢీకొట్టింది. ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 వాహనంలో రాయచోటి ఆస్పత్రికి తరలిస్తుండగా జితేందర్‌కుమార్ మార్గంమధ్యలో మృతి చెందాడు. లక్కిరెడ్డిపల్లె సీఐ గంగనాధబాబు, రామాపురం ఎస్ఐ వి.లక్ష్మీప్రసాద్‌రెడ్డి సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
వైఎస్సార్సీపీ దళిత నేత ఇంటిపై దాడి
పెద్దపంజాణి (చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లాలో వైఎస్సార్సీపీకి చెందిన ఓ దళిత నేత ఇంట్లోకి టీడీపీకి చెందిన వారిగా భావిస్తున్న ముగ్గురు వ్యక్తులు చొరబడి, ఆయన భార్య, కుమారుడిపై దాడి చేసి, విధ్వంసం సృష్టించారు. బాధితుని కథనం ప్రకారం.. దళితుడైన వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ ఎర్రబల్లి శ్రీనివాసులు పెద్దపంజాణి మండలం వీరప్పల్లి పంచాయతీ కెళవాతి సమీపంలోని తన పొలం వద్ద ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్నారు.వైఎస్సార్సీపీలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. సోమవారం రాత్రి 8.30 గంటల సమయంలో ముసుగులు ధరించి కారులో వచ్చిన ముగ్గురు వ్యక్తులు అతని ఇంట్లోకి చొరబడ్డారు. శ్రీనివాసులు కోసం ఆరాతీశారు. ఆయన ఇంట్లో లేకపోవడంతో అతని భార్య, కుమారుడి వద్ద ఉన్న సెల్ఫోన్లను తీసుకున్నారు. పెద్దగా కేకలు వేస్తూ వారిద్దరిపైనా దాడి చేసి, గాయపరిచారు. ఇంట్లోని ఫరి్నఛర్‌ను ధ్వంసం చేసి భయభ్రాంతులకు గురిచేశారు.గతంలో సీఎం చంద్రబాబు, స్థానిక ఎమ్మెల్యే అమరనాథరెడ్డికి వ్యతిరేకంగా శ్రీనివాసులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడని, అతన్ని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టబోమని, రాష్ట్రం విడిచి వెళ్లే వరకూ వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించి వెళ్లిపోయారు. కుటుంబీకుల సమాచారంతో ఇంటికి చేరుకున్న శ్రీనివాసులు పెద్దపంజాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, విచారణ చేపట్టారు. -
బక్రీద్ పొట్టేళ్లకు భలే డిమాండ్
బైరెడ్డిపల్లి/పలమనేరు( చిత్తూరు జిల్లా) : చిత్తూరు జిల్లాలోని బైరెడ్డిపల్లిలో పొట్టేళ్ల సంతకు ప్రసిద్ధి. ఈ నెల 16న బక్రీద్ పండగను పురస్కరించుకుని ముందస్తుగానే కొందరు మాంసాహారం కోసం పొట్టేళ్లను ఇక్కడకొచ్చి కొనడం ఆనవాయితీ. ఆ మేరకు శనివారం జరిగిన వారపు సంతలో జత పొట్టేళ్లు గరిష్టంగా రూ.3 లక్షల దాకా పలికాయి. సాధారణంగా జత పొట్టేళ్లు్ల రూ.40 వేల దాకా ఉంటాయి. రాష్ట్రంలోనే పొట్టేళ్ల వారపుసంతగా పేరొందిన సంత చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లిలో జరుగుతుంది. ఇక్కడ లభించే నాణ్యమైన, రుచికరమైన పొట్టేళ్ల కోసం మన రాష్ట్రం నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక, కేరళల నుంచి వచ్చి వ్యాపారులు పొట్టేళ్లను కొని తీసుకెళుతుంటారు. పండుగకు ముందు సంత కావడంతో పొట్టేళ్లను విక్రయించే రైతులు, కొనే వ్యాపారులతో సంత ప్రాంతం జనంతో కిక్కిరిసిపోయింది. ఇక వాహనాలైతే మూడు కిలోమీటర్ల మేర బారులుతీశాయి. ముఖ్యంగా కాశ్మీరీ మేకపోతులు, స్థానికంగా పెంచిన పొట్టేళ్లు మాత్రం లక్షల్లో ధరలు పలకడం విశేషం. బక్రీద్ నేపథ్యంలో శనివారం జరిగిన వారపుసంతకు పొట్టేళ్లు, మేకలు, గొర్రెలు సుమారుగా 40 నుంచి 50 వేల దాకా వచ్చాయి. మొత్తం మీద ఇక్కడ పండుగ సంతలో రూ.20 కోట్ల దాకా క్రయ, విక్రయాలు జరిగాయి. వచ్చే శనివారమూ ఇదే స్థాయిలో వ్యాపారం జరుగుతుందని అంచనా వేస్తున్నారు. దళారులకు పండగే.. ఇక్కడి పొట్టేళ్ల సంతలో పండుగసంత కావడంతో దళారుల హవా కొనసాగింది. మొత్తం వ్యవహారం చేతిరుమాళ్ల ద్వారా రహస్య వ్యాపారాలతోనే జరిగింది. అటు రైతులు, ఇటు వ్యాపారులకు మధ్య బేరం కుదర్చడంలో దళారులే ఇక్కడ కీâ¶లకం. వీరికి ఇరువైపుల నుంచి నిర్ణయించిన మేర కమీషన్లు దక్కుతాయి. కేవలం బక్రీద్ పండుగకు పొట్టేళ్లను పెంచి మంచి ధరలకు అమ్ముకోవడం రైతులకు మంచి ఆదాయంగా మారింది. దీంతో చిత్తూరు, అనంతపురం జిల్లాలు, కర్ణాటకలోని కోలారు, చింతామణి, శ్రీనివాసపురం, మాలూరు జిల్లాల్లో బక్రీద్ పొట్టేళ్ల పెంపకం సాగుతోంది. ఏటా మేలో మంచి పొట్టేళ్ల కోసం రైతుల అన్వేషణ మొదలవుతుంది. కందూరు, సోమల, సదుం, పీలేరు, అంగళ్లు, బైరెడ్డిపల్లె, బంగారుపేట(కర్ణాటక) తదితర ప్రాంతాల నుంచి మంచి గొర్రె పొట్టేళ్లను రైతులు కొనుగోలు చేస్తారు. అప్పటికే వీటి ధర రూ.10 వేల దాకా ఉంటుంది. ఆ తర్వాత వీటిని బాగా సంరక్షిస్తారు. పచి్చగడ్డితో పాటు బూసా, గానుగపిండి, మొక్కజొన్న తదితరాలను పెట్టి ఏడాది పాటు సాకుతారు. దీంతో బక్రీద్ పండుగకల్లా కొమ్ములు తిరిగిన పొట్టేళ్లు మంచి మాంసంతో సిద్ధమవుతాయి. ఇక్కడి పొట్టేళ్ల మాంసం చాలా రుచి నేను బైరెడ్డిపల్లి సంతంలో 30 ఏళ్ల నుంచి బక్రీద్ పొట్టేళ్లను కొంటున్నా. మా ప్రాంతంలో బైరెడ్డిపల్లి పొట్టేళ్లకు భలే డిమాండ్. వీటి మాంసం చాలా రుచిగా ఉంటుంది. ఫారాల్లో మేపే పొటేళ్లలో ఈ రుచి రాదు. అందుకే ఇక్కడి కొచ్చి కొంటుంటాం. – అబ్దుల్ బాషా, గుడియాత్తం, తమిళనాడు ఇక్కడి పొట్టేళ్లకు భలే డిమాండ్ ఈ ప్రాంతంలోని రైతులు కొండల్లో, బీడు భూముల్లో పొట్టేళ్లను మేపుతుంటారు. దీంతో ఫామ్‌లో ఉండే వాటి కన్నా వీటి శరీరం దృఢంగా ఉంటుంది. దీంతో పాటు రుచి బాగుంటుంది. ఇక మేకలను అటవీప్రాంతంలో మేపుతారు. అవి అడవుల్లోని పలురకాల ఔషధ గుణాలున్న ఆకులను తినడంతో వీటికీ డిమాండ్ ఎక్కువగా ఉంది. – డా.వేణు, గొర్రెల పరిశోధన కేంద్ర చీఫ్ సైంటిస్ట్, పలమనేరు