'Michaung' Cyclone: దిశమార్చుకున్న మిచౌంగ్‌.. తీవ్ర తుపానుగా.. | Cyclone Michaung Tracker In AP Live Updates | Sakshi
Sakshi News home page

'Michaung' Cyclone: తరుముకొస్తున్న మిచౌంగ్‌.. తీవ్ర తుపానుగా.. అప్‌డేట్స్‌

Published Mon, Dec 4 2023 7:47 AM | Last Updated on Mon, Dec 4 2023 9:40 PM

Cyclone Michaung Tracker In AP Live Updates - Sakshi

cyclone michaung Live Updates..

ఉదయానికి ఏపీని తాకనున్న మిచౌంగ్‌ తుపాను
 

  • తీరాన్ని తాకే వేళ భయంకరంగా మిచౌంగ్‌
  • ప్రచండ గాలులతో విరుచుకుపడుతుందన్న వాతావరణ శాఖ
  • తీరం దాటిన తర్వాత కూడా కొనసాగనున్న తుపాను ప్రభావం
  • తుపానును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్న అధికార యంత్రాంగం
  • ఇప్పటికే పునరావాస కేంద్రాలకు పలువురు..  సహాయక చర్యలందించేందుకు రెడీ

చెన్నై-నెల్లూరు రాకపోకలు బంద్‌

  • మిచౌంగ్‌ తుపాను బీభత్సం
  • సూళ్లూరుపేట మండలం గోకుల్ కృష్ణ ఇంజనీరింగ్ కళాశాల వద్ద జాతీయ రహదారిపై 4 అడుగుల మేర ప్రవహిస్తున్న వరదనీరు
  • తమినాడు,ఆంధ్రప్రదేశ్ కు నిలిచిపోయిన రాకపోకలు
  • బారికేడ్లతో జాతీయ రహదారి మూసివేత 
  • ప్రజలు ప్రత్యామ్నాయ మార్గం చూసుకోవాలన్న జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డి 
  • ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని సూచన

మిచౌంగ్‌ ఒంగోలు హెల్ప్‌లైన్‌ నెంబర్లు 

ప్రకాశం జిల్లా ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ఆఫీస్‌లో హెల్ప్ లైన్

1. 9949796033
2. 8555931920
3. 9000443065
4. 7661834294
5. 8555871450

ఎలాంటి సమస్య వున్నా హెల్ప్.లైన్.నెంబర్లకు కాల్ చేయాలని ప్రజలకు ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని పిలుపు


చెన్నై నగరంలో వర్ష బీభత్సం

  • పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న మిచౌంగ్‌ తుపాను
  • అతి భారీ వర్షాలతో చెన్నై పూర్తిగా జలమయం
  • నగరంలో ఎటు చూసినా నీరే.
  • నగరంలో గత 70-80 ఏళ్లలో ఎన్నడూ లేనంత వర్షం కురిసిందని తమిళనాడు పురపాలక శాఖ మంత్రి కేఎన్ నెహ్రూ
  • ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నా.. తుపాను తీవ్రతకు సరిపోలేదని వ్యాఖ్య
  • తుపాను విలయం ముందు తమ యంత్రాంగం విఫలమైందన్న తమిళనాడు మంత్రి 
  • ముంపు ప్రాంతాల ప్రజలను తరలించేందుకు బోట్లు పంపించినట్లు వెల్లడి
  • చెన్నైలో కుండపోత వానలు కురుస్తుండడంతో విమానాశ్రయంలోకి నీళ్లు
  • పలు ప్రాంతాల్లో రోడ్లపైకి నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 
  • తాంబరంలో నీటిలో చిక్కుకుపోయిన 15 మందిని రక్షించిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు 
  • తుపాను కారణంగా నగరంలోని కోర్టులకు సెలవు ఇచ్చినట్టు మద్రాస్ హైకోర్టు 
  • చెంగల్పట్టు, తిరువళ్లూర్, కాంచీపురం జిల్లాల్లోనూ భారీ వర్షాలు.. అతలాకుతం

     

ఏపీ తమిళనాడు మధ్య రాకపోకలు బంద్‌

  • మిచౌంగ్‌ తుపాను ప్రభావంతో.. కుంభవృష్ణి 
  • కాళంగి నది ఉధృతి
  • ఏపీ-తమిళనాడు మధ్య రాకపోకలు బంద్‌
  • సూళ్లూరు పేటలో నాలుగు అడుగుల మేర ఎత్తులో ప్రవహిస్తున్న నది
  • ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలంటున్న పోలీసులు
  • రేపు ఉదయం వరకు ఎవరూ అటువైపు రావొద్దని వెనక్కి పంపిచేస్తున్న పోలీసుల
     

తిరుపతిలో స్కూళ్లకు సెలవు 

  • మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో తిరుపతి జిల్లా వ్యాప్తంగా స్కూల్స్, కళాశాలకు సెలవు ప్రకటించిన జిల్లా కలెక్టర్ వెంకట రమణ రెడ్డి

ధాన్యం నష్టపోకుండా..

  • ఉమ్మడి నెల్లూరు, గుంటూరు, ప్రకాశం, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలోని రైతుల వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సూచన
  • మిచౌంగ్ తుఫాన్ కారణంగా భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకుని కోతకోసిన ధాన్యం నిల్వచేసుకునేందుకు సదుపాయం కల్పించిన మార్కెటింగ్ శాఖ
  • ధాన్యం నిల్వచేసుకునే సౌకర్యం లేని వారు ఆయా ప్రాంతాల్లోని మార్కెట్ యార్డు గోదాముల్లో భద్రపరచుకోవచ్చని సూచించిన వ్యవసాయ మార్కెటింగ్ శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ కె.శ్రీనివాసరావు 
  • విజయవాడలోని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ కార్యాలయంలో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు 
  • టోల్ ఫ్రీ నెంబర్ - 73311 54812 ( ఎ. సుకుమార్ )

  • తుపాన్‌ ఎఫెక్ట్‌తో గన్నవరం నుంచి విమానాలు రద్దు



ముంచుకొస్తున్న ముప్పు

  • అల్లకల్లోలంగా సముద్రం
  • రాబోయే రెండు రోజులు ప్రమాదకరమని వాతావరణ శాఖ హెచ్చరిక
  • దక్షిణ కొస్తాను ముంచెత్తనున్న మిచౌంగ్‌
  • నెల్లూరు 120 కి.మీ. దూరంలో!
  • రేపు ఉదయానికి బాపట్ల-దివిసీమ మధ్య తీరం దాటే అవకాశం
  • కుంభవృష్టి వర్షాలతో ఆక్మసిక వరదలు తప్పవని హెచ్చరిక
  • తీవ్ర తుపాను నెమ్మదిగా పయనిస్తే మాత్రం భారీ నష్టం తప్పదని అంచనా 
  • తుపానును ఎదుర్కొనేందుకు అన్ని రకాలుగా సిద్ధమైన అధికార యంత్రాంగం



దక్షిణ మధ్య రైల్వే హెల్ప్‌ లైన్‌ నెంబర్లు
 

  • తీవ్రతుపాన్గా మారిన మిచౌంగ్
  • అప్రమత్తమైన దక్షిణమధ్య రైల్వే
  • దక్షిమధ్య రైల్వే పరిధిలోని స్టేషన్లలో హెల్ప్ లైన్లు ఏర్పాటు 

అనకాపల్లి : 08924 - 221698
తుని : 08854 – 252172
సామర్లకోట : 08842 - 327010
రాజమండ్రి : 08832 – 420541
తాడేపల్లిగూడెం :    08818 – 226162
ఏలూరు : 08812 – 232267
భీమవరం టౌన్ :    08816 – 230098; 7815909402
విజయవాడ : 08862 – 571244
తెనాలి : 08644 – 227600
బాపట్ల : 08643 – 222178
ఒంగోలు : 08592 – 280306
నెల్లూరు : 08612 – 345863
గూడూరు : 08624 – 250795; 7815909300
కాకినాడ టౌన్ : 08842 – 374227
గుంటూరు : 9701379072
రేపల్లె : 7093998699
కర్నూల్ సిటీ : 8518220110
తిరుపతి : 7815915571
రేణిగుంట : 9493548008
    
కమర్షియల్ కంట్రోల్ రూమ్స్ 

సికింద్రాబాద్ : 040 – 27786666, 040 – 27801112
హైదరాబాద్ : 9676904334
కాచిగూడ : 040 – 27784453
ఖాజీపేట్ : 0870 – 2576430
ఖమ్మం : 7815955306






దిశమార్చుకున్న మిచౌంగ్‌

  • హఠాత్తుగా దిశ మార్చుకున్న  మిచౌంగ్‌ తుపాను
  • ప్రస్తుతం నెల్లూరు సూళ్లూరుపేట వద్ద కేంద్రీకృతం 
  • ఇప్పటికే జలదిగ్బంధంలో సూళ్లూరుపేట
  • రాత్రి పది నుండి పన్నెండు గంటల లోపు నెల్లూరు సమీపంలో తీరం దాటే అవకాశం..
  • దీని ప్రభావంతో ఇప్పటికే నెల్లూరు జిల్లాలోని మనుబోలు, కలువాయి, నెల్లూరులో ఈదురు గాలుల బీభత్సం
  • ఇవాళ అర్ధరాత్రి లోపు  నెల్లూరు - కావలి మధ్య తీరం దాటే అవకాశం
  • మిచాంగ్ తుఫాన్ తీరం దాటిన తర్వాత  ఒంగోలు, విజయవాడ, ఖమ్మం, వరంగల్ మీదుగా పయనించనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడి 
  • తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 150 నుండి 200 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు


 

బాపట్లలో హైఅలర్ట్‌

  • మిచౌంగ్‌ తుపాను నేపథ్యంలో బాపట్ల చేరుకున్న ఎన్ డీ ఆర్ ఎఫ్, ఎస్‌ డీ ఆర్ ఎఫ్ బృందాలు
  • లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేస్తున్న అధికారులు
  • 14 పునరావస కేంద్రాలకు 800 మందిని తరలించిన అధికారులు
  • మండలానికి ఒక స్పెషల్ టీం ను ఏర్పాటు చేసిన అధికారులు 50 మండలాలకు 50 టీములు ఏర్పాటు
  • 350 మంది గజ ఈతగాళ్ళను సిద్దం చేసిన అధికారులు
  • 43 తుఫాను పునరావాస కేంద్రాలు సిద్ధం చేసిన అధికారులు
  • నిజాంపట్నం హార్బర్ లో పదవ ప్రమాద హెచ్చరికను జారీ చేసిన అధికారులు


మిచౌంగ్‌ ఎఫెక్ట్‌.. రెండో చోట్లా బస్సుయాత్ర వాయిదా

  • మిచౌంగ్‌ ఎఫెక్ట్‌తో డిసెంబర్‌ 5వ తేదీ రెండు చోట్ల వైఎస్సార్‌సీపీ బస్సు యాత్ర వాయిదా 
  • రేపు చోడవరం, నందిగామ, రాయదుర్గం నియోజకవర్గాలలో జరగాల్సిన యాత్ర
  • భారీ వర్షాల కారణంగా రెండు చోట్ల వాయిదా వేసిన వైఎస్సార్‌సీపీ నేతలు
  • ఎన్టీఆర్ జిల్లా నందిగామ, అనకాపల్లి జిల్లా చోడవరంలో వాయిదా
  • అనంతపురం జిల్లా రాయదుర్గంలో యథాతథంగా కొనసాగనున్న యాత్ర
  • వర్షాలు తగ్గిన అనంతరం నందిగామ, చోడవరంలో నిర్వహించే అవకాశం



తెలంగాణపైనా మిచౌంగ్‌ ఎఫెక్ట్‌

  • ఏపీతో పాటు తెలంగాణ పైనా మిచౌంగ్‌ ప్రభావం
  • ఉమ్మడి ఖమ్మం జిల్లాకు రెడ్‌ అలర్ట్‌ జారీ
  • రాగల రెండు రోజులు భారీ వర్ష సూచన
  • మంగళవారం అన్ని విద్యా సంస్థలకు సెలవు..
  • హాస్టల్ విద్యార్థులు బయటకు రావొద్దని హెచ్చరికలు
  • సహాయం కోసం జిల్లా కంట్రోల్ రూం నెంబర్లు 1077, 9063211298
  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న జిల్లా కలెక్టర్ గౌతమ్

తీవ్రతుపానుగా మారిన మిచౌంగ్‌

  • తీరప్రాంత గ్రామాల్లో పెరిగిన గాలుల తీవ్రత , వర్షం 
  • నాగాయలంక మండలం ఎదురుమొండి దీవుల్లో ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు 
  • ఎదురుమొండి దీవుల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ప్రత్యేక బోట్లు ఏర్పాటు 
  • ఏటిమొగ రేవు వద్ద పరిస్థితిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ జాషువా, అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు 
  • ఏటిమొగ గ్రామంలోని పునరావాస కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్,ఎస్పీ,ఎమ్మెల్యే 

జిల్లా కలెక్టర్, రాజాబాబు మాట్లాడుతూ.. ‘‘నాగాయలంక , ఏటిమొగ,నాచుగుంట,ఈలచెట్ల దిబ్బ దీవుల పై తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ దీవుల్లోని ప్రజలను అప్రమత్తం చేశాం. కొందరిని ఇప్పటికే పునరావాసకేంద్రాలకు తరలించాం. అత్యవసర పరిస్థితుల్లో దీవుల్లోని ప్రజలను తరలిస్తాం. పోలీస్, రెవిన్యూ , ఎన్డీఆర్ఎఫ్ ,ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సిద్ధంగా ఉన్నారు.  

జిల్లా ఎస్పీ, జాషువా మాట్లాడుతూ.. తుపాను ప్రభావిత ఐల్యాండ్స్ లో పోలీస్ సిబ్బందిని అందుబాటులో ఉంచాం. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నాం. కమ్యూనికేషన్ కోసం వైర్ లెస్ కనెక్షన్స్ అందుబాటులో ఉంచాం. కలెక్టర్ తో కలిసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నాం

రాబోయే రెండు రోజుల్లో..

  • చెన్నైకి 90కి.మీ, నెల్లూరుకు 140 కిమీ.. బాపట్లకి 250 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైన తీవ్ర తుపాను
  • రేపు ఉదయం బాపట్ల, మచిలీపట్నం సమీపంలో తీరాన్ని దాటే అవకాశం​
  • ఇవాళ, రేపు కోస్తాలోని అన్ని ప్రాంతాల్లో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించిన వాతావరణ శాఖ
  • ఇవాళ రాత్రి దక్షిణ కోస్తా జిల్లాల్లో కుండపోతగా వర్షం
  • నెల్లూరు నుంచి కాకినాడ వరకు కొన్ని ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు
  • రాబోయే రెండు రోజుల్లో కోస్తాంధ్ర ప్రాంతాల్లో రెడ్‌ అలర్ట్‌

  • తరుముకొస్తున్న మిచౌంగ్‌
  • అధికార యంత్రాగం అప్రమత్తం



    తిరుపతిలో..
  • రేణిగుంట విమానాశ్రయ రన్ వే పైకి వరదనీరు
  • రేణిగుంటలో విమానాశ్రయం రన్ వే పైకి దూసుకొచ్చిన వరదనీరు..
  • వరదనీరు చేరిక కారణంగా రేణిగుంట విమానాశ్రయంలో విమానా రాకపోకలకు అంతరాయం..
  • రేణిగుంటకు విమాన రాకపోకలు రద్దు చేసిన అధికారులు..





మిచౌంగ్‌తో.. నాలుగు రైళ్లు రద్దు

  • మిచౌంగ్ తుపాను కారణంగా 4 రైళ్లు పూర్తిగా రద్దు
  • 3 రైళ్లు పాక్షికంగా రద్దు


తుపాను ప్రభావిత జిల్లాలకు ప్రత్యేకాధికారుల నియామకం

బాపట్ల – కాటమనేని భాస్కర్‌

బి.ఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ – జయలక్ష్మి

తూర్పుగోదావరి – వివేక్‌ యాదవ్‌

కాకినాడ – యువరాజ్‌

ప్రకాశం – ప్రద్యుమ్న

నెల్లూరు – హరికిరణ్‌

తిరుపతి – జె.శ్యామలరావు

వెస్ట్‌గోదావరి – కన్నబాబు

చెరువును తలపిస్తున్న చెన్నై విమానాశ్రయం

  • చెన్నై విమానాశ్రయంలోకి భారీగా చేరిన వరద నీరు.
  • వర్షాల కారణంగా పలు విమాన సర్వీసులు రద్దు.

వర్షపు నీటిలో మునిగిపోయిన వాహనాలు..

నీట మునిగిన పలు కాలనీలు..

ఈదురు గాలులతో భారీ వర్షం..

పలు కాలనీల్లో ఇళ్లలోకి చేరిన వరద నీరు..

తుపాను దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎం జగన్‌ సమీక్ష..

  • ఎనిమిది మంది జిల్లా కలెక్టర్లతో సీఎం జగన్‌ వీడియో కాన్పరెన్స్‌ 
  • వీడియో కాన్పరెన్స్‌లో పలు శాఖలకు చెందిన అధికారులు సైతం పాల్గొన్నారు.
  • సీఎం జగన్‌ ఆదేశాలు ఇవే..
  • తుపాను సందర్బంగా ప్రభుత్వ యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలి
  • హుద్‌హుద్‌ లాంటి పెద్ద పెద్ద తుపాన్లను చూసిన అనుభవం మనకు ఉంది
  • తుపాన్లను ఎదుర్కోవడంలో మన యంత్రాంగానికి మంచి అనుభవం ఉంది:
  • తుపాన్‌ పట్ల అప్రమత్తంగా  ఉంటూ యంత్రాంగం సీరియస్‌గా ఉండాల్సిన అనుభవం ఉంది:
  • బాపట్ల సమీపంలో రేపు సాయంత్రం తీరందాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు
  • గంటకు 110 కి.మీ. వేగంతో గాలులు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు
  • ఇప్పటికే జిల్లాల కలెక్టర్లకు నిధులు విడుదలచేశాం
  • అత్యవసర ఖర్చులకు ప్రతి జిల్లాకు రూ.2 కోట్ల చొప్పున నిధులు ఇవ్వాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం
  • ప్రతి జిల్లాకు సీనియర్‌ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమిస్తున్నాం:
  • వీరంతాకూడా జిల్లాల యంత్రాంగంతో కలిసి సహాయక చర్యలను పర్యవేక్షిస్తారు: 
  • ఎలాంటి ప్రాణనష్టం లేకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉంది:
  • పశువులకూ ఎలాంటి ప్రాణనష్టం రాకూడదు:
  • ఆ మేరకు వెంటనే చర్యలు తీసుకోవాలి:
  • కోతకు వచ్చిన ఖరీఫ్‌ పంటను కాపాడుకోవడం అన్నది చాలా  ముఖ్యమైనది
  • నిన్న ఒక్కరోజే 97 వేల టన్నలు ధాన్యాన్ని సేకరించాం
  • 6.5 లక్షల టన్నుల ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాం:
  • పంటకోయని ప్రాంతాల్లో వీలైనంత మేర కోయకుండా వాయిదా వేసుకుంటే మంచిదని అధికారులు చెప్తున్నారు
  • దీనిపై రైతులకు అవగాహన కల్పించాలి
  • కోసిన ధాన్యాన్ని వెంటనే సేకరించడంపై అధికారులు దృష్టిపెట్టాలి
  • యుద్ధ ప్రాతిపదికన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి:
  • తేమ, రంగు లాంటి అంశాలను పట్టించుకోకుండా రైతులకు అండగా నిలవండి:
  • తుపాను దృష్ట్యా రైతులకు తోడుగా నిలవాల్సిన అవసరం ఉంది:
  • అన్నిరకాలుగా రైతులకు తోడుగా నిలవడం అన్నది అత్యంత ప్రాధాన్యతాంశం
  • తుపాను ప్రభావం ఉన్న ప్రాంతాలనుంచి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలి:
  • 308 శిబిరాల ఏర్పాటుకు గుర్తించామని, అప్పటివరకూ 181 తెరిచామని చెప్తున్నారు:
  • అవసరమైన చోట వెంటనే శిబిరాలను తెరిచి ప్రజలను అక్కడకు తరలించాలి:
  • ఇప్పటికే ఎన్డీఆర్‌ఎఫ్‌ టీమ్స్‌ 5, ఎస్డీఆర్‌ఎఫ్‌ టీమ్స్‌ 5 కూడా ఉన్నాయి:
  • ఇతర రాష్ట్రాలకు లేని, మనకు మాత్రమే ఉన్న మరో బలం ఏంటంటే గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ
  • విలేజ్‌ క్లినిక్స్‌, ఆర్బీకేలు కూడా మనకు ఉన్నాయి:
  • ఇది మనకు ఉన్న పటిష్టమైన బలం
  • ఇతర రాష్ట్రాలకు ఇలాంటి వ్యవస్థ లేదు 
  • ఈ యంత్రాంగాన్ని బాగా వినియోగించుకోవాలి
  • ఈ వ్యవస్థను అత్యంత సమర్థవంతంగా వినియోగించుకోవాలి
  • ప్రజల ప్రాణాలను రక్షించడంలో, తపాను వల్ల, భారీవర్షాల వల్ల దెబ్బతినే అవకాశాలున్న ప్రాంతాల్లో వీరి సేవలను వినియోగించుకోవాలి
  • సహాయక శిబిరాల్లో వచ్చే ప్రజలకు మంచి సౌకర్యాలను ఏర్పాటు చేయాలి
  • మనం ఉంటే ఎలాంటి సదుపాయాలు కోరుకుంటామో, అలాంటి సదుపాయాలు ఉండాలి
  • మందులు, తాగునీరు, మంచి ఆహారం అందించాలి:
  • కాస్త డబ్బు ఖర్చైనా పర్వాలేదు, సదుపాయాలు విషయంలో ఎలాంటి లోటూ రాకూడదు:
  • క్యాంపునుంచి ఇంటికి వెళ్లేటన్పుడు చిరునవ్వుతో వారు ఇంటికి వెళ్లాలి:
  • ప్రతి ఒక్కరికీ రూ.1000 లేదా కుటుంబానికి గతంలో మాదిరిగా కాకుండా రూ.500 పెంచి రూ.2500ఇవ్వాలి:
  • క్యాంపులకు రాకుండా, ఇళ్లలోకి నీళ్లు చేరిన వారికి  25 కేజీల బియ్యం, కందిపప్పు, పామాయిల్‌, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు కిలోచొప్పున అందించాలి
  • ఈ రేషన్‌ను వారికి సకాలంలో సక్రమంగా అందించాలి
  • గాలులు వల్ల, వర్షాల వల్ల గుడిసెల్లాంటివి దెబ్బతింటే వారికి రూ.10వేలు అందించాలి
  • బాధితుల పట్ల దయతో, సానుభూతితో అందించాలి
  • పరిహారాన్ని సకాలంలో అందించాలి
  • తుపాను తగ్గు ముఖం పట్టిన 24 గంటల్లో వీటిని అందించాలి
  • గ్రామ సచివాలయాలు, వాలంటీర్లు వ్యవస్థను వినియోగించుకుని బాధితులను గుర్తించి వెంటనే వారికి ఇవ్వాల్సినవి ఇవ్వాలి
  • ఎమర్జెన్సీ సర్వీసుల నిర్వహణపై దృష్టిపెట్టాలి
  • జనరేటర్లను అందుబాటులో ఉంచుకోవాలి
  • గర్భిణీలను ఆస్పత్రులకు తరలించాలి
  • తుపాను వల్ల వచ్చే వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత వ్యాధులు ప్రబలకుండా ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలి
  • పారిశుద్ధ్య కార్యక్రమాలు యుద్ధ ప్రాతిపదికిన నిర్వహించాలి
  • విద్యుత్‌, రవాణా సౌకర్యాలకు అంతరాయం ఏర్పడితే వెంటనే యుద్ధ ప్రాతిపదికిన వాటిని సరిచేయాలి
  • సాధారణ పరిస్థితులను తీసుకురావడంపై ప్రత్యేకాధికారులు దృష్టిపెట్టాలి
  • తుపాను, వర్షాలు తగ్గాక పంటలకు జరిగిన నష్టంపై వెంటనే ఎన్యుమరేషన్‌ పూర్తిచేయాలి
  • నేను కూడా ప్రజల దగ్గరకు వెళ్లి.. కలెక్టర్లు బాగా చేశారా? లేదా? అడుగుతాను
  • బాగానే చేశారని ప్రజలు సంతోషంగా నాకు చెప్పాలి
  • తుపాను బాధిత ప్రాంతాల్లో తిరుగుతాను, ప్రభుత్వం యంత్రాంగం పనితీరుపై అడిగి తెలుసుకుంటాను
  • సహాయం అందలేదని, బాగా చూసుకోలేదన్న మాట బాధితులనుంచి వినిపించకూడదు
  • సంతృప్తకర స్థాయిలో బాధితులందరికీ సహాయం అందాలి
  • ఈ సాయంత్రం నుంచి ప్రత్యేకాధికారులు జిల్లాల్లో పర్యవేక్షణ ప్రారంభిస్తారు
  • డబ్బులు ఇంకా అవసరమైతే..వెంటనే పంపించడానికి అన్నిరకాలుగా ఏర్పాట్లు చేశాను
  • ఒక ఫోన్‌ కాల్‌ దూరంలో మేం ఉంటాం. ఏం కావాలన్నా వెంటనే అడగండి
  • సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికిన నడవాలి

కృష్ణాజిల్లా:

  • మిచౌంగ్ తుఫాను కారణంగా అవనిగడ్డ నియోజకవర్గంలో వరి రైతులను అప్రమత్తం చేసిన ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు
  • ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, రైతు విభాగం జోనల్ ఇన్చార్జి కడవకొల్లు నరసింహారావు

డా. బీఆర్‌ అంబేద్కర్ కోనసీమ జిల్లా

  • తుఫాన్ ప్రభావంతో అల్లవరం మండలం ఓడల రేవు సముద్రతీరంలో ఎగసి పడుతున్న అలలు
  • 8 మీటర్ల మేర కోతకు గురైన సముద్రతీరం
  • అధికారిక యంత్రాంగం అప్రమత్తం
  • నక్కపల్లి నుండి వేటకు వచ్చిన 30 మంది మత్స్యకారులను నక్కా రామేశ్వరం తుఫాన్ పునారావాస కేంద్రానికి తరలింపు...

మిచౌంగ్‌ ప్రభావంతో ఐదు జిల్లాలకు అలర్ట్‌..

  • మచిలీపట్నం చేరుకున్న 25 మందితో కూడిన ఎన్డీఆర్ఎఫ్‌ టీమ్‌
  • అవనిగడ్డ చేరుకున్న 37 మందితో కూడిన ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం

తణుకులో మంత్రి కారుమూరి పర్యవేక్షణ

  • తణుకు నియోజకవర్గంలోని ఇరగవరం, అత్తిలి మండలాల్లో పర్యటించి రైతులతో మాట్లాడిన కారుమూరి
  • మిచౌంగ్‌ తుపాన్‌కు రైతులు ఎవరూ అదైర్యపడవద్దు. 
  • ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ధాన్యాన్ని ప్రభుత్వం కొంటుంది.
  • వీలైనంత త్వరగా రైతులు తమ ధాన్యాన్ని మీకు అందుబాటులో ఉన్న మిల్లులకు తరలించాలి 
  • ఆప్‌లైన్‌, ఆన్‌లైన్‌ రెండు విధాలుగా ధాన్యాన్ని తరలించే వెసులుబాటు కల్పించాం. 
  • ఏ మిల్లర్‌ అయినా రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటాం. 
  • తుపాన్‌ తీవ్రత తగ్గే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండి రైతులకు ఇబ్బంది కలుగకుండా చూడాలని ఆదేశించాము. 
  • ఏ ఒక్క రైతు నష్టపోకుండా మనమే చూసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. 
     

విశాఖపట్నం..

  • తుపాన్‌ ఎఫెక్ట్‌తో పలు విమానాలు రద్దు..
  • ఐదు విమానాలను రద్దు చేసినట్టు అధికారుల ప్రకటన

తమిళనాడు అతలాకుతలం..

  • తుపాను ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 
  • జవజీవనం స్థంభించిపోయింది. 
  • ఎటు చూసినా వరద నీరే కనిపిస్తోంది. 

పలుచోట్ల రైల్వే స్టేషన్లలోకి నీరు చేరడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 

మిచౌంగ్‌ తుపాన్‌ కారణంగా చెన్నైలో భారీ వర్షం, కూలిన చెట్లు..

కాకినాడలో అప్రమత్తం..

  • మిచౌంగ్‌ తుపాన్ ప్రభావంతో జిల్లాలో మారిన వాతావరణ పరిస్ధితులు
  • పలు ప్రాంతాల్లో కురుస్తున్న వానలు
  • తుపాన్‌ కారణంగా ఏడు తీర ప్రాంత మండలాల్లో పాఠశాలలకు సెలవు
  • వేటను నిలిపివేసిన మత్స్యకారులు
  • భారీ వర్షాలతో ఆందోళనలో రైతాంగం
  • వరికోతలు వాయిదా వేసుకోవాలని రైతులకు అధికారుల సూచన
  • ఇప్పటికే కల్లాల్లో 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం. 
  • యుద్ద ప్రాతిపధికన ఆఫ్ లైన్ ద్వారా  16 వేల మెట్రిక్ ధాన్యం కొనుగోలు
  • ఉప్పాడ జడ్పీ హై స్కూల్‌లో పునరావాస కేంద్రం ఏర్పాటు.
  • హోప్ ఐలాండ్ మత్స్యకారుల తరలింపు.
  • తుపాన్ పరిస్ధితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న కలెక్టర్ కృతికా శుక్లా
  • తుపాన్ హెచ్చరికల నేపథ్యంలో కలెక్టరేట్‌తో పాటుగా కాకినాడ,పెద్దాపురం ఆర్డీవో కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు.
  • కలెక్టరేట్..
  • 18004253077
  • కాకినాడ ఆర్డీవో కార్యాలయం
  • 9701579666
  • పెద్దాపురం ఆర్డీవో కార్యాలయం
  • 9949393805

నేడు కృష్ణా జిల్లాలో అన్ని పాఠశాలలకు సెలవు

నేడు జరగాల్సిన సమ్మెటివ్‌ అసెస్మెంట్‌-1 పరీక్ష వాయిదా

నేడు, రేపు ఎన్టీఆర్‌ జిల్లాలోని అన్ని పాఠశాలలకు సెలవు. 

తుపాను ఎఫెక్ట్‌ నేడు పలు రైళ్లు రద్దు..

  • తిరుపతి-చెన్నై,
  • చెన్నై-తిరుపతి మధ్య రైలు సర్వీసులు రద్దు.

మిచౌంగ్‌ తుపాన్‌ కారణంగా తమిళనాడులో భారీ వర్షాలు.. 

  • రోడ్లపై భారీగా నిలిచిన వర్షపు నీరు
  • వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు. 

మిచౌంగ్‌ తుపాను హెచ్చరిక..   

  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక
  • నైరుతి బంగాళాఖాతంలో వాయువ్య దిశగా కదులుతున్న మిచౌంగ్ తుపాను
  • గంటకు 13 కి.మీ వేగంతో కదులుతున్న తుపాన్ 
  • ప్రస్తుతానికి చెన్నైకి 150 కి.మీ, నెల్లూరుకు 250 కి.మీ, బాపట్లకు 360 కి.మీ, మచిలీపట్నానికి 380కి.మీ. దూరంలో కేంద్రీకృతం 
  • నేడు కోస్తా తీరానికి సమాంతరంగా పయనించనున్న తుపాన్
  • రేపు మధ్యాహ్నం నెల్లూరు-మచిలీపట్నం మధ్య  తీవ్రతుపానుగా తీరం దాటనున్న మిచౌంగ్
  • దీని ప్రభావంతో నేడు,రేపు కూడా కోస్తాంధ్రలో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
  • కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, అక్కడక్కడ అతి భారీ వర్షాలు
  • రాయలసీమలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు 
  • ఎల్లుండి ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు నమోదైయ్యే అవకాశం 
  • తీరం వెంబడి గంటకు 80 -100 కి.మీ సాయంత్రం నుంచి గంటకు 90-110 కి.మీల వేగంతో గాలులు
  • మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళరాదని హెచ్చరిక.  

విజయవాడ: దక్షిణమధ్య రైల్వే హెల్ప్‌ డెస్క్‌..

  • మిచౌంగ్ తుపాన్ నేపధ్యంలో విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు
  • 13 స్టేషన్లలో హెల్ప్ లైన్లు ఏర్పాటు
  • ఒంగోలు - 08592-280306
  • కాకినాడ టౌన్ - 0884-2374227
  • తెనాలి - 08644-227600
  • గూడూరు - 08624-250795; 7815909300
  • నెల్లూరు - 0861-2345863
  • ఏలూరు - 08812-232267
  • బాపట్ల - 08643-222178
  • భీమవరం టౌన్ - 08816 230098 ;7815909402
  • సామర్లకోట - 0884-2327010
  • గుడివాడ - 08674-242454
  • విజయవాడ - 0866-2571244
  • తుని - 0885-4252172
  • రాజమండ్రి - 0883-2420541.

విశాఖ, అనకాపల్లిలో సెలవు..
►మిచౌంగ్ తుపాన్‌ కారణంగా విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో అని ప్రభుత్వ, ప్రైవేట్ పాటశాలలకు, జూనియర్ కాలేజీలకు ఈరోజు సెలవు ప్రకటించిన ప్రభుత్వం

►తుపాను నేపథ్యంలో విశాఖపట్నం పోర్టులో రెండో నంబరు, బందరు, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో మూడో నంబరు, కాకినాడ, గంగవరం పోర్టుల్లో నాలుగో నంబరు ప్రమాద హెచ్చరికలను జారీచేశారు. అలాగే.. సోమవారం దక్షిణ కోస్తాంధ్రలో కొన్నిచోట్ల, రాయలసీమలోని ఆగ్నేయ ప్రాంతంలోనూ అక్కడక్కడ ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం కూడా ఉందని ఐఎండీ హెచ్చరించింది. కృష్ణాజిల్లా మచిలీపట్న­ం, అవనిగడ్డ, గుంటూరు జిల్లా రేపల్లెలలో కడలి కెరటాలు భారీగా ఎగసిపడతాయని, 250 మీటర్ల దూరం వరకు సముద్రం ముందుకు రావచ్చని, ఫలితంగా అక్కడ లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశాలున్నాయని తెలిపింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement