Cyclone Effect
-
ఏపీకి పొంచి ఉన్న మరో వాయుగుండం..
-
పునరావాస కేంద్రాలను పరిశీలించిన సుచరిత
-
ధైర్యంగా ఉండండి.. ప్రతీ రైతునూ ఆదుకుంటాం: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్బంగా తుపాను ఎఫెక్ట్, పునరావాస చర్యలు, నష్టం అంచనాలు తదితర అంశాలపై సీఎం జగన్ చర్చించారు. సీఎం జగన్ కామెంట్స్.. ప్రస్తుతం తుపాను బలహీనపడి అల్పపీడనంగా మారింది తుపాను వల్ల భారీ వర్షాలు పడ్డాయి అధికారులంతా మీమీ ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులను తీసుకురావడంపై దృష్టిపెట్టాలి బాధితుల పట్ల సానుభూతితో వ్యవహరించండి బాధితుల స్థానంలో మనం ఉంటే.. ఎలాంటి సహాయాన్ని ఆశిస్తామో.. ఆ తరహా సహాయం వారికి అందించాలి రుణ సాయం ఎక్కువైనా ఫర్వాలేదు, వారికి మంచి సహాయం అందాలి ఇంత కష్టంలో కూడా బాగా చూసుకున్నారనే మాట రావాలి పరిహారం అందించడం పట్ల సానుభూతితో ఉండండి దెబ్బతిన్న ఇళ్ల విషయంలో కానీ, క్యాంపుల నుంచి ప్రజలు తిరిగి వెళ్తున్న సందర్బంలో కానీ, వారికి ఇవ్వాల్సిన సహాయం వారికి ఇవ్వాలి రేషన్ పంపిణీలో కూడా ఎలాంటి లోపం ఉండకూడదు పంట పొలాల్లో ఉన్న వరదనీటిని పూర్తిగా తొలగించడంపై దృష్టిపెట్టాలి అన్నిరకాల మానవ వనరులు దీనిపై దృష్టి పెట్టండి ధ్యాసంతా ఇప్పుడు దీనిపై పెట్టాలి రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది వారు అధైర్యపడాల్సిన పనిలేదు ప్రతి రైతునూ ఆదుకుంటుంది పంటల రక్షణ, తడిసిన ధాన్యాన్ని, రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం దగ్గర నుంచి అన్నిరకాలుగా తోడుగా ప్రభుత్వం ఉంటుంది. సబ్సిడీపై విత్తనాల సరఫరాకు రకాలుగా సిద్ధం కావాలి. యుద్ధప్రాతిపదికన విద్యుత్‌ను పునరుద్ధరించాలి రోడ్లు దెబ్బతిన్న ప్రాంతాల్లో రవాణా పునరుద్ధరణకు వెంటనే చర్యలు తీసుకోండి దీన్నికూడా ప్రాధాన్యతగా తీసుకోండి వర్షాలు తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్యంపై దృష్టిపెట్టండి అధికారులంతా బాగానే పనిచేస్తున్నారు. చెట్టుకూలి చనిపోయిన కానిస్టేబుల్ కుటుంబాన్ని కూడా ప్రభుత్వం ఆదుకుంటుంది ఆ కుటుంబానికి రూ.30 లక్షల సహాయాన్ని అందిస్తాం విధినిర్వహణలో ఉన్న ఉద్యోగుల స్థైర్యం నిలబడేలా ప్రభుత్వం తోడుగా నిలుస్తుంది వలంటీర్ల దగ్గర నుంచి పైస్థాయి ఉద్యోగుల వరకూ ఈ ప్రభుత్వం తోడుగా నిలుస్తుంది వారిలో ఆత్మస్థైర్యాన్ని నిలబెట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ సమీక్షలో క్యాంపు కార్యాలయం నుంచి హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత, సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి, రెవెన్యూ, విపత్తు నిర్వహణశాఖ స్పెషల్ సీఎస్ జి.సాయి ప్రసాద్, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, ఇంధనశాఖ స్పెషల్ సీఎస్ కె విజయానంద్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ ఎం టీ కృష్ణబాబు, హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా, పౌరసరఫరాలశాఖ కమిషనర్ హెచ్ అరుణ్ కుమార్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ ఏ.సూర్యకుమారి, ఏపీ స్టేట్ సివిల్ సఫ్లైస్ కార్పొరేషన్ వీసీ అండ్ ఎండీ జి వీరపాండియన్, గృహనిర్మాణశాఖ స్పెషల్ సెక్రటరీ బి మహమ్మద్ దీవాన్, విపత్తు నిర్వహణశాఖ డైరెక్టర్ డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
Cyclone Michaung In AP Photos: ఏపీలో తుపాను బీభత్సం (ఫొటోలు)
-
AP: సైక్లోన్ అలర్ట్.. ఐదు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
Updates.. కలెక్టర్లతో ముగిసిన సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్.. సీఎం జగన్ కామెంట్స్.. ప్రస్తుతం తుపాను బలహీనపడి అల్పపీడనంగా మారింది తుపాను వల్ల భారీ వర్షాలు పడ్డాయి అధికారులంతా మీమీ ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులను తీసుకురావడంపై దృష్టిపెట్టాలి బాధితుల పట్ల సానుభూతితో వ్యవహరించండి బాధితుల స్థానంలో మనం ఉంటే.. ఎలాంటి సహాయాన్ని ఆశిస్తామో.. ఆ తరహా సహాయం వారికి అందించాలి రుణ సాయం ఎక్కువైనా ఫర్వాలేదు, వారికి మంచి సహాయం అందాలి ఇంత కష్టంలో కూడా బాగా చూసుకున్నారనే మాట రావాలి పరిహారం అందించడం పట్ల సానుభూతితో ఉండండి దెబ్బతిన్న ఇళ్ల విషయంలో కానీ, క్యాంపుల నుంచి ప్రజలు తిరిగి వెళ్తున్న సందర్బంలో కానీ, వారికి ఇవ్వాల్సిన సహాయం వారికి ఇవ్వాలి రేషన్ పంపిణీలో కూడా ఎలాంటి లోపం ఉండకూడదు పంట పొలాల్లో ఉన్న వరదనీటిని పూర్తిగా తొలగించడంపై దృష్టిపెట్టాలి అన్నిరకాల మానవ వనరులు దీనిపై దృష్టి పెట్టండి ధ్యాసంతా ఇప్పుడు దీనిపై పెట్టాలి రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది వారు అధైర్యపడాల్సిన పనిలేదు ప్రతి రైతునూ ఆదుకుంటుంది పంటల రక్షణ, తడిసిన ధాన్యాన్ని, రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం దగ్గర నుంచి అన్నిరకాలుగా తోడుగా ప్రభుత్వం ఉంటుంది. సబ్సిడీపై విత్తనాల సరఫరాకు రకాలుగా సిద్ధం కావాలి. యుద్ధప్రాతిపదికన విద్యుత్‌ను పునరుద్ధరించాలి రోడ్లు దెబ్బతిన్న ప్రాంతాల్లో రవాణా పునరుద్ధరణకు వెంటనే చర్యలు తీసుకోండి దీన్నికూడా ప్రాధాన్యతగా తీసుకోండి వర్షాలు తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్యంపై దృష్టిపెట్టండి అధికారులంతా బాగానే పనిచేస్తున్నారు. చెట్టుకూలి చనిపోయిన కానిస్టేబుల్ కుటుంబాన్ని కూడా ప్రభుత్వం ఆదుకుంటుంది ఆ కుటుంబానికి రూ.30 లక్షల సహాయాన్ని అందిస్తాం విధినిర్వహణలో ఉన్న ఉద్యోగుల స్థైర్యం నిలబడేలా ప్రభుత్వం తోడుగా నిలుస్తుంది వలంటీర్ల దగ్గర నుంచి పైస్థాయి ఉద్యోగుల వరకూ ఈ ప్రభుత్వం తోడుగా నిలుస్తుంది వారిలో ఆత్మస్థైర్యాన్ని నిలబెట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభం తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సీఎం వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ తుపాను ఎఫెక్ట్, పునరావాస చర్యలు, నష్టం అంచనాలు తదితర అంశాలపై చర్చ మిగ్జామ్ తుపాపులో గ్రామ, వార్డు వలంటీర్ల సేవలు విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలిచిన వలంటీర్ వ్యవస్థ ప్రజలను అప్రమత్తం చేసి.. ప్రాణనష్టం లేకుండా చూసిన వలంటీర్లు పునరావాస కేంద్రాలకు తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలను తరలించేందుకు కృషి పునరావాస కేంద్రాల్లోనూ సేవలందించిన వలంటీర్లు. తుపాను, వర్షాలపై రైతులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసిన వలంటీర్లు సకాలంలో కళ్లాల్లోని ధాన్యాన్ని ఆర్బీకేలకు తరలింపులోనూ రైతులకు అండగా నిలిచిన వలంటీర్లు. తుపాను నష్టాన్ని అంచనా వేయడంలోనూ కీలక పాత్ర పోషించిన వలంటీర్లు. వలంటీర్ల సేవలపై హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ ఈరోజు ఉదయం 11:30 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ తుపాన్ ప్రభావిత ప్రాంతాలపై సమీక్ష చేయనున్న సీఎం జగన్ తమిళనాడులో వరద కష్టాలు.. #WATCH | Tamil Nadu: Severe waterlogging in various parts of Chennai following the rainfall (Drone visuals from Arumbakkam) pic.twitter.com/eJWIKMChiW — ANI (@ANI) December 6, 2023 వరదల్లో చిక్కుకున్న విదేశీయులు.. #WATCH | A local hotel staff helps a foreign guest to cross a waterlogged street to reach his car in Chennai's Arumbakkam area pic.twitter.com/Errdcdp9Rf — ANI (@ANI) December 6, 2023 తీవ్రవాయుగుండంగా కొనసాగుతున్న మిగ్జామ్ ఏపీలో బలహీనపడుతున్న మిగ్జామ్ తుపాను. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, అల్లూరి, ఏలూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. ఏపీలో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం. తుపాను ప్రభావంతో దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు తీరం వెంబడి గంటకు 45 కి.మీల వేగంతో గాలులు వీచే అవకాశం. ఏపీ తీరం వెంబడి మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరిక చెన్నైపై తుపాను తీవ్ర ప్రభావం.. #ChennaiCyclone #Michaungcyclone #Ayanavaram Another video of people struggling. But even the innocent animals too. pic.twitter.com/yPjAuaHvMB — Shruthi Tuli (@ShruthiTuli) December 4, 2023 #ChennaiRain#Michaungcyclone OMR Okkiyampet road is looking like a pool..avoid driving two wheelers even four wheelers are struggling to pass..stay safe.. pic.twitter.com/hClaLLTp78 — Sundar (@sundarraja1997) December 3, 2023 విద్యా సంస్థలకు సెలవు.. తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని విద్యా సంస్థలకు బుధవారం కూడా ప్రభుత్వం సెలవు ప్రకటించింది. తుపాను తీవ్రత అధికంగా ఉండే ప్రాంతాల్లో అన్ని విద్యా సంస్థలను మూసివేయాలని.. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్, ఇంటర్ బోర్డు కార్యదర్శి సౌరభ్‌గౌర్ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. బుధవారం కూడా కాకినాడ నుంచి నెల్లూరు వరకు ఉన్న జిల్లాల్లో విద్యా సంస్థలు తెరవరాదని ఆదేశించారు. తూర్పుగోదావరిలో తుపాను బీభత్సం మిచౌంగ్ తుపాన్ ప్రభావంతో తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల్లో నిన్న సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం భారీ ఈదురు గాలులతో రెండు జిల్లాల్లో బీభత్సం సృష్టించిన మిచౌంగ్ తుపాన్ ఇక్కడే తీరం దాటుతుందా అన్న రీతిలో వంద కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు పలుచోట్ల కూలిన హోర్డింగులు, విద్యుత్ స్తంభాలు, విరిగిపడిన చెట్లు పూర్తిగా జలమయమైన రోడ్లు.. లోతట్టు ప్రాంతాల్లో నిలిచిపోయిన వర్షపునీరు కోనసీమ జిల్లాలో మరింత పెరిగిన పంట నష్టం ప్రాథమికంగా పదివేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు అంచనా కొన్ని చోట్ల తీవ్రంగా దెబ్బతిన్న ట్రాన్స్ఫార్మర్లు, పలుచోట్ల విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం విజయవాడలో ఘాట్ రోడ్ మూసివేత.. భారీ వర్షాల నేపథ్యంలో వర్షం కారణంగా దుర్గగుడి ఘాట్ రోడ్డు మూసివేత భక్తుల భద్రతా కారణాల దృష్ట్యా ఘాట్ రోడ్డు ద్వారా వాహనాల రాకపోకలు నిలుపుదల వర్షాలు తగ్గేవరకూ ఘాట్ రోడ్డు మూసి ఉంచాలని నిర్ణయం అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు కనకదుర్గ నగర్ మార్గం ద్వారా రావాలని సూచన సాక్షి, అమరావతి: మిచాంగ్ తుపాను తిరుపతి, నెల్లూరు జిల్లాలను కుదిపేసింది. పలు జిల్లాలను వణికించింది. దీని ప్రభావంతో కురుస్తున్న కుండపోత వర్షాలకు తిరుపతి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో జన జీవనం పూర్తిగా స్తంభించిపోయింది. రికార్డు స్థాయిలో కురిసిన వర్షాలు.. 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురు గాలులతో పట్టణాలు, పల్లెలు చిగురుటాకుల్లా వణికిపోయాయి. 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన అతి తీవ్ర వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ప్రధాన రోడ్లపై మోకాళ్ల లోతుకుపైగా నీళ్లు ఉండడంతో రాకపోకలు దాదాపు నిలిచిపోయాయి. వాగులు, వంకలు పొంగి పొర్లాయి. దీంతో పలుచోట్ల రోడ్లు తెగిపోయాయి. ఈదురు గాలులకు నెల్లూరు జిల్లాలో కరెంటు స్తంభాలు, పలు చోట్ల గుడిసెలు నేలకూలాయి. అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రోడ్లపై చెట్లు కూలిపోయాయి. అయితే ప్రభుత్వం సహాయక చర్యల్ని వేగంగా చేపట్టడంతో యుద్ధ ప్రాతిపదికన కరెంటును పునరుద్ధరించగలిగారు. కూలిన చెట్లను రోడ్లపై నుంచి తొలగించే పనులు చేపట్టారు. సహాయక పనులకు వర్షం అంతరాయం కలిగిస్తోంది. -
5 జిల్లాల్లో భారీ వర్షాలు.. ఏపీ వ్యాప్తంగా మిగ్జామ్ తుపాన్ ఎఫెక్ట్
-
మిచౌంగ్ తుపాను : చెన్నైలో వర్ష బీభత్సం (ఫొటోలు)
-
మిచౌంగ్ ముంచేసింది.. తీరం దాటింది.. అప్డేట్స్
cyclone michaung Live Updates.. బాపట్ల జిల్లా: అద్దంకి లో మిచౌంగ్ తూపాను ప్రభావంతో పొంగిపొర్లుతున్న వాగులు నల్లవాగు, దోర్నపువాగు ఉధృతంగా ప్రవహించడంతో నిలిచిన రాకపోకలు అద్దంకి, పరిసర ప్రాంతాలలో విరిగిపడ్డ చెట్లు, నిలిచిన విద్యుత్ సరఫరా రేపు పాఠశాలలు, కళాశాలలకు సెలవు ►భారీ వర్షాలు కారణంగా రేపు ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం తీరం దాటిన మిచౌంగ్ తుపాను 12:30 నుంచి 2:30 గంటల మధ్య బాపట్ల సమీపంలో తీరం దాటిన తీవ్ర తుపాను తీరం వెంబడి గంటకు 90-100 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు రాగల రెండు గంటల్లో తుపానుగా బలహీనపడనున్న తీవ్ర తుపాను తీరం దాటినప్పటికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: విపత్తుల నిర్వహణ సంస్థ కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన కాకినాడ జిల్లా తుపాను ప్రభావంతో గడిచిన 24 గంటలలో జిల్లా వ్యాప్తంగా నమోదయిన వర్షపాతం జిల్లా వ్యాప్తంగా 990.6 మి.మి అత్యధికంగా కాజులూరు మండలం 79.08 మి.మి, తాళ్లరేవు 73.08 మి.మి వర్షపాతం అత్యల్పంగా రౌతులపూడి మండలంలో 24 మి.మి నమోదు కాకినాడ రూరల్ 72.6. మి.మి, కాకినాడ అర్భన్ 60.2 మి.మి వర్షపాతం నమోదు కోనసీమ పంట నష్టం జరిగిన ప్రాంతాలను పరిశీలించిన మంత్రి పినిపే విశ్వరూప్ భగవంతుడి దయవల్ల కోనసీమపై మిచౌంగ్ ప్రభావం పెద్దగా లేదు ఇప్పటికే లక్షా ఆరు వేల ఎకరాల్లో పంట కోతలు పూర్తయ్యాయి ఇంకా 51 వేల ఎకరాల్లో మాత్రమే కోతలు కోయాల్సి ఉంది దాదాపు తొమ్మిది వేల ఎకరాలపై తుఫాన్ ప్రభావం ఉన్నట్లు ప్రాథమికంగా అంచనా తడిచిన ధాన్యాన్ని, రంగు మారిన ధాన్యాన్ని, మొలకెత్తిన ధాన్యాన్ని సైతం కచ్చితంగా కొనుగోలు చేస్తాం మిల్లర్లకు ఆదేశాలు.. ప్రత్యేక అధికారిణి జయలక్ష్మి కోనసీమలో పంట నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించాం సీఎం జగన్ ఆదేశాల మేరకు తడిచిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని మిల్లర్లను ఆదేశించాం రైతుకు ఏమాత్రం నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకుంటున్నాం రైతుల్ని ఆదుకుంటాం.. కలెక్టర్ హిమాన్షు శుక్లా చేలలో నీరు నిల్వ ఉండకుండా జాతియ ఉపాధి హామీ పథకం కూలీలను పెట్టి నీటిని బయటికి తోడిస్తున్నాం దీనివల్ల నేలనంటిన పైరు సైతం నష్టపోకుండా ఉంటుంది ప్రాథమికంగా తొమ్మిది వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు గుర్తించాం నక్కా రామేశ్వరం వద్ద డ్రైన్‌కు పూర్తిస్థాయిలో మరమ్మత్తులు చేయడంతో చేయడంతో వర్షపు నీరు చాలా వరకూ బయటకు పోతుంది సహాయ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంతాలు ప్రజల్ని ఆదుకుంటున్నాం పశ్చిమగోదావరి జిల్లా ► మొగల్తూరు మండలం పేరుపాలెం సౌత్ మోళ్లపర్రు లో పర్యటించి పునరావాస కేంద్రాలను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు ► ఈడురు గాలులు ఎక్కువగా ఉన్నందున దయచేసి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు. ► ఇళ్ళ నుండి బయటకు రావొద్దు.. పిడుగులు పడే ప్రమాదం ఉంది కనుక జాగ్రత్తగా ఉండాలి. ► పునరావాస కేంద్రాలకు రావాలి.. అన్ని సదుపాయాలను కల్పించడం జరిగింది. ► పోలీస్,రెవెన్యూ,ఎలక్ట్రికల్,ఇతర అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేయటం జరిగింది. ఏలూరు జిల్లా ►తూఫాన్ నేపథ్యంలో వాతారవరణ హెచ్చరికల మేరకు ఏలూరు జిల్లాలో జిల్లా, డివిజన్, మండల స్థాయిలలో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు . ►ఏలూరు జిల్లా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్ 18002331077. ►సబ్ కలెక్టర్ కార్యాలయం నూజివీడు : 08656-232717 ►ఆర్డీఓ కార్యాలయం, జంగారెడ్డిగూడెం : 9553220254 ►ఆర్డీఓ కార్యాలయం, ఏలూరు - 8500667696 కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ ►కంట్రోల్ రూమ్ లను అత్యవసర సహాయం కోసం వినియోగించుకోవాలి. ►లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిరావాలి. ►నేడు, రేపు భారీ, అతి భారీ వర్షాలు ఉంటాయి ►ప్రజలు అవసరమైతే తప్ప ఇంటిని వదిలి బయటికి రావద్దు. ►బలహీనంగా వున్న ఏటిగట్లు, వంతెనలు, తదితర ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలకు అధికారులకు ఆదేశాలు జారీ. ప్రకాశం జిల్లా: ►మిచౌంగ్ తుఫాన్ కారణంగా సంతనూతలపాడు మండలం మంగమూరు-ఒంగోలు మధ్యలోనీ రోడ్డుపై పారుతున్న వర్షపు నీరు ►రాకపోకలు అంతరాయం ►రెండు రోజుల వరకు ఈ రోడ్డులో ఎవరు ప్రయాణం చేయవద్దని సూచించిన అధికారులు ►దగ్గరుండి సహాయ చర్యలు చేపడుతున్న ఎమ్మార్వో మధుసూదన్ రావు, సిబ్బంది నెల్లూరు జిల్లా: ►ఉలవపాడు మండలంలోని తుపాను పునరావాస కేంద్రాలను సందర్శించిన ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి. ►బాధితులను పరామర్శించి భోజన ఏర్పాట్లు గురించి అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే. ►నిర్వాసితులకు బ్రెడ్, బిస్కెట్లు అందజేసిన వైఎస్సార్సీపీ శ్రేణులు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: ►సఖినేటిపల్లి మండలం మోరి గ్రామంలో మినీ టోర్నడో బీభత్సం ►విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ తో పాటు పలు దుకాణాలు ధ్వంసం కృష్ణాజిల్లా ►జిల్లాలో 25 మండలాల పై మిచౌంగ్ తుఫాన్ ఎఫెక్ట్ ►పంట నష్టం పై ప్రాధమిక అంచనా ►68392 హెక్టార్లలో వరి,212 హెక్టార్లలో పత్తి, 162 హెక్టార్లలో మొక్కజొన్న,583 హెక్టార్లలో మినుము,854 హెక్టార్లలో వేరుశెనగ, పంట నష్టం జరిగినట్లు అంచనా వేసిన అధికారులు విశాఖ: ►విశాఖ రూరల్ అత్యధికంగా 51.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు ►ఆనంద పురంలో 37.2 మిల్లీ మీటర్ల వర్షపాతం ►భీమిలి లో 44.2 మిల్లీ మీటర్ల వర్షపాతం ►పద్మనాభం 35.2 మిల్లీ మీటర్ల వర్షపాతం ►సితమ్మధర 44.6 మిల్లీ మీటర్ల వర్షపాతం ►పెందుర్తి 35.8 మిల్లీ మీటర్ల వర్షపాతం ► గాజువాక 44.6 మిల్లీ మీటర్ల వర్షపాతం ►గోపాలపట్నం 46.8 మిల్లీ మీటర్ల వర్షపాతం ► ములగడ 49.2 మిల్లీ మీటర్ల వర్షపాతం గుంటూరు: ► తెనాలి మండలం ఖాజీపేట, కొలకలూరు లో మిచౌంగ్ తుపాను ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాలను సందర్శించిన జిల్లా వ్యవసాయాధికారి నున్న. వెంకటేశ్వర్లు. గుంటూరు జిల్లా: ►ప్రత్తిపాడులో పొంగుతున్న ప్రత్తిపాడు-గొట్టిపాడు మధ్యనున్న లోలెవల్ చప్టా వద్ద పోలీసుల పహారా ►ప్రజలు, ప్రయాణీకుల భద్రత దృష్ట్యా రాకపోకలు నిలిపివేసిన ఎస్ఐ రవీంద్ర బాబు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: ►మిచౌంగ్ తుఫాను ప్రభావంతో కురుస్తూన్న భారీ వర్షాలకు ►కోనసీమ ముఖద్వారం రావులపాలెం ఆర్టీసీ బస్సు స్టాండ్ నీటమునక ►బస్సు రాకపోకలకు అంతరాయం కాకినాడ జిల్లా ►మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో ఉప్పాడ తీరంలో కోత గురయిన ప్రాంతాలను సందర్శించిన పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు ►ఉప్పాడ,మాయపట్నం,సుబ్బంపేటలో బైక్ మీద తిరుగుతూ తుఫాన్ సహయక చర్యలు పరిశీలించిన ఎమ్మెల్యే దొరబాబు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: ►మిచౌంగ్ తుఫాను ప్రభావంతో కురుస్తూన్న భారీ వర్షాలకు ►కోనసీమ ముఖద్వారం రావులపాలెం ఆర్ టి సి బస్సు స్టాండ్ నీటమునక ► బస్సు రాకపోకలకు అంతరాయం ► బాపట్ల దగ్గర కొనసాగుతున్న మిచౌంగ్ తుపాను ల్యాండ్‌ఫాల్ ప్రక్రియ ► మరో మూడు గంటల్లో పూర్తిగా తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా ►తీరం వెంబడి గంటకు 100-120కిలో మీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు ► మరో రెండు గంటల్లో మిచౌంగ్ తుపాను తీరం దాటనుండగా.. తుపాను తీవ్రత నెమ్మదిగా తగ్గుముఖం పడుతోంది. తీరాన్ని తాకిన మిచౌంగ్ తుపాను: డా. బి.ఆర్ అంబేద్కర్, మేనేజింగ్ డైరెక్టర్, విపత్తుల సంస్థ. ►మరో రెండు గంటల్లో పూర్తిగా తీరాన్ని దాటనుంది ►తీరం వెంబడి గంటకు 90-110 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు ►తీరం దాటినప్పటికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ►ఈరోజు కోస్తాంధ్రలో చాలాచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, ►పలుచోట్ల భారీ నుండి అతిభారీ వర్షాలు. ►అక్కడక్కడ తీవ్రభారీ వర్షాలు కురిసే అవకాశం నెల్లూరు జిల్లా: ►మిచౌంగ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పర్యటన ►గొలగమూడి,అనికేపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను పరిశీలించి,బాధితులతో మాట్లాడి ధైర్యం చెప్పిన మంత్రి ►బాధితులకు కల్పిస్తున్న సౌకర్యాలను అధికారులను అడిగి తెలుసుకున్న మంత్రి, బాధితులకు దుప్పట్లు, ఆహారం అందజేసిన మంత్రి ►కనుపూరు చెరువు ఆయుకట్టను జిల్లా కలెక్టర్ హరి నారాయణ్‌తో కలిసి పరిశీలించిన మంత్రి కాకాణి. తాడేపల్లి: మిచౌంగ్ తుపాను బాధిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం క్యాంప్ కార్యాలయంలో మంళవారం సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ స్పెషల్ సీఎస్ జి సాయి ప్రసాద్, సీసీఎల్ఏ సెక్రటరీ ఇంతియాజ్, సీఎంఓ అధికారులతో సీఎం భేటీ అయ్యారు. తుపాను పరిస్థితులపై ఆరా: ► నెల్లూరు –కావలి మధ్య సగం ల్యాండ్ ఫాల్, సగం సముద్రంలో తుపాను గమనం ఉందని తెలిపిన అధికారులు ► చీరాల, బాపట్ల మధ్య పయనించి అక్కడ పూర్తిగా తీరం దాటనుందని ముఖ్యమంత్రికి వివరించిన అధికారులు ► తిరుపతి, నెల్లూరు జిల్లాలో తుపాను ప్రభావం ఈ ఉదయం నుంచి క్రమంగా తగ్గుముఖం పడుతోందన్న అధికారులు ► తిరుపతి, నెల్లూరు జిల్లాలో సహాయ కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయని వెల్లడి ► ప్రకాశం, గుంటూరు, కృష్ణా తదితర జిల్లాల కలెక్టర్లనూ అప్రమత్తంగా చేశామని చెప్పిన అధికారులు ► ఇప్పటివరకూ 211 సహాయ శిబిరాల్లో సుమారు 9500 మందిని తరలించినట్టు వెల్లడి సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ►బాధితులకు మంచి సదుపాయాలు అందించాలి. ►సౌకర్యాల కల్పనలో ఎలాంటి పొరపాట్లు రాకుండా చూడాలి. ►నెల్లూరు, తిరుపతి సహా తుపాను వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో కరెంటు సరఫరా వ్యవస్థను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలి. ►మనుషులు, పశువులు మరణించినట్టు సమాచారం అందితే 48 గంటల్లోగా పరిహారం అందించాలి. ►తుపాను తగ్గిన వెంటనే ఎన్యుమరేషన్ కూడా ప్రారంభం కావాలి. ►గ్రామ, వార్డు సచివాలయ, వాలంటీర్ వ్యవస్ధలను వాడుకుని రేషన్ పంపిణీ సమర్ధవంతంగా చేపట్టాలని సీఎం వైఎస్ జగన్ అధికారును ఆదేశించారు. తుపాను ఎఫెక్టుపై వైసీపి కేంద్ర కార్యాలయం సమీక్ష ► తీర ప్రాంత ఎమ్మెల్యేలతో టెలికాన్ఫరెన్స్ ► ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులను సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశించాం: కేంద్ర కార్యాలయ ఇన్‌ఛార్జి కేళ్ల అప్పిరెడ్డి ► బాధితులను పునరావాస కేంద్రాలకు తరలింపులో నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారు ► ట్రాక్టర్లు, ఆటోలలో బాధితులను తరలిస్తారు ► ఇల్లు ఖాళీ చేయాల్సిన సమయంలోనూ సహకరిస్తారు ► ఆపదలో ఉన్నవారిని ఆదుకోవటం తమ ధర్మం ► రైతులు ఎవరూ భయపడాల్సిన పనిలేదు ► తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని సీఎం జగన్ చెప్పారు ► వర్షాలు తగ్గగానే పంటనష్టం అంచనాలు వేస్తారు తిరుమలలో టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి జలాశయాల పరిశీలన. ► నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నిండుకుండలా మారిన జలాశయాలు. ► తిరుమలలో ఉన్న ఐదు జలాశయాలు ఫుల్ ► పాప వినాశనం, ఆకాశగంగ, గోగర్భం డ్యామ్ లలో నీటి నిల్వాలను అధికారులు అడిగి సమాచారం తీసుకున్న టీటీడీ చైర్మన్ ► పాప వినాశనం ,గోగర్భం డ్యామ్ లు గెట్లు ఎత్తిన అధికారులు. ► 23న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహం హోమం మొదలైన రోజు నుంచి వర్షం కురుస్తుంది ► రెండు రోజులుగా 200 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు ► తిరుమలలో అన్ని జలాశయాలు నిండాయి ► ఒకటిన్నర సంవత్సరానికి సరిపడా నీరు చేరింది ► తిరుపతి భూగర్భ నీటిశాతం పెరిగింది ► శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహం హోమం ద్వారానే వర్షాలు కురిశాయి. తీరానికి చేరువలో మిచౌంగ్ తుపాను: విశాఖ వాతావరణం కేంద్రం డైరెక్టర్ సునంద ► మరి కాసేపట్లో బాపట్ల వద్ద తీరాన్ని దాటే అవకాశం ► తుపాను ప్రభావంతో దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు ► మచిలీపట్నం నిజాంపట్నం పోర్టులో పదో నంబరు ప్రమాద సూచిక కాకినాడలో తొమ్మిదో నెంబర్ ప్రమాద సూచిక ఎగురువేత ► తీరం దాటిన తర్వాత తుఫానుగా ఉత్తర దిశలో పయనించనున్న తుపాను ► తుపాను ప్రభావంతో ఉత్తరకొస్తా జిల్లాలో ఈరోజు రేపు కూడా భారీ వర్షాలు ► తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు ► తుపాను ప్రభావంతో ఒడిశా, చత్తీస్‌గఢ్ తెలంగాణ జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు ఉయ్యూరు మండలం గండిగుంట ఆర్బికే కేంద్రాన్ని పరిశీలించిన సివిల్ సప్లై కమిషనర్ అరుణ్ కుమార్ ► తుఫాను వలన రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకున్నాం: అరుణ్ కుమార్ ► రాష్ట్ర వ్యాప్తంగా 5లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం ► ప్రతి గింజా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది ► రవాణ సమస్య లేకుండా చర్యలు తీసుకున్నాం ► రైతులు దళారుల చేతుల్లో మోసపోవద్దు ► సీఎం జగన్ అధికారులకు దిశానిర్దేశం చేశారు ► రాష్ట్రంలో మిచౌంగ్ తుపాను ప్రభావంపై అప్రమత్తంగా ఉన్నాం: ఏపీ చీఫ్ సెక్రటరీ జవహర్‌రెడ్డి ► ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ► నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అత్యధికంగా వర్షాలు కురుస్తున్నాయి. ► రాష్ట్రంలో ని అన్ని ప్రాంతాల్లోనూ వర్షపాతం నమోదు అవుతోంది ► 8 జిల్లాలకు సీనియర్ ఐఏఎస్ అధికారులను పంపాము ► రేపు సాయంత్రం వరకు వర్షాలు కురుస్తాయి ► 22 కోట్లు తక్షణ చర్యలు కోసం విడుదల చేశాం ► లక్ష టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశాం ► 4 లక్షల టన్నుల ధాన్యాన్ని తడవకుండా చర్యలు తీసుకున్నాం ► 11 వేల మంది పునరావాస కేంద్రాల్లో ఉన్నారు ► అందరికి ఆహారం, నిత్యావసరాలు, ఆర్థిక సహాయం అందిస్తున్నాం ► తుపాను ప్రభావంతో కలిగే నష్టాన్ని వెంటనే అంచనా వేసి కేంద్రానికి పంపిస్తాం ► వర్షాలు అధికంగా ఉన్న చోట పాఠశాలలకు సెలవు ప్రకటించాం ► ఇప్పటివరకు ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం కృష్ణాజిల్లా : ► కృత్తివెన్ను మండలం పీతలావ, వర్లగొంది తిప్ప గ్రామాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు. ► పునరావాస కేంద్రాల్లో ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేసిన అధికారులు. ► నిడమర్రు, చిన్న గొల్లపాలెం, పడతడిక, ఇంతేరు సముద్ర తీరం వెంబడి 75 మంది అదనపు పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు జిల్లా ఎస్పీ జాషువా. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: ► రాజోలు నియోజకవర్గంలో భారీ వర్షంతో నేలకు ఒరిగిన చేతికి అంది వచ్చిన వరిచేలు. ► శ్రమించి పండించిన పంట చేతికి వచ్చే సమయంలో ఈ తుపాను కారణంగా చేతికి అందకుండా పోయిందని రైతుల ఆవేదన. ► ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్న రైతులు. తిరుపతి: ►మిచౌంగ్ తుపాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భక్తుల భద్రతా దృష్ట్యా తిరుమల ఘాట్ రోడ్డు మార్గంలో ఆంక్షలు విధించారు. వర్షాల కారణంగా రెండు ఘాట్ రోడ్లలో పొగ మంచు దట్టంగా కమ్ముకుంది. దీంతో వాహన రాకపోకులకు అంతరాయం కలుగుతోంది. ►అంతేకాకుండా ద్విచక్ర వాహనదారులు ముందున్న వాహనాలు సరిగా కనపడక ఇబ్బందులకు గురవుతున్నారు. తద్వారా వాహనాలు, ప్రయాణికులు ప్రమాదాలకు గురి అయ్యే అవకాశం ఉంది. ► ఈ నేపథ్యంలో వర్షాలు తగ్గి సాధారణ స్థితి వచ్చేంత వరకు రెండు ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాలను ఉదయం 6 నుండి సాయంత్రం 8 వరకు మాత్రమే అనుమతించేలా చర్యలు తీసుకున్నారు. వరద సృష్టించిన విధ్వంసం(ఫోటోలు) బాపట్ల జిల్లా: ►చీరాలలో 10 నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు. ►మిచౌంగ్ తుపాను ప్రభావంతో చీరాలలో ఈదురు గాలులతో కూడిన వర్షం. ►తీరప్రాంతంలోని 25 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు. ►విపత్తును ఎదుర్కొనేందుకు 16 మంది ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని సిద్ధం చేసిన అధికారులు. ►మిచౌంగ్ తుపాను కారణంగా చీరాల తహశీల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు. మిచౌంగ్ తుపాను ప్రభావంతో మరో మూడు రైళ్లు రద్దు. ►గూడూరు-రేణిగుంట, రేణిగుంట-గూడూరు, తిరుపతి-పుల్ల రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే. ►హౌరా కన్యాకుమారి రైలు దారి మళ్లింపు. తిరుపతి ► వరద బాధితులకు అండగా నిలుస్తూ అవసరమైన ఏర్పాట్లను చేపడుతున్న టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి. ► అప్రమత్తంగా ఉండాలని, ఏ అవసరమొచ్చిన తక్షణమే తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించిన భూమన. ► పూలవాని గుంట, గొల్లవాని గుంట ప్రాంతాల్లో వరద బాధితులను పరామర్శించిన భూమన. ► పునరావాస కేంద్రాలకు తరలించిన వారితో పాటు అవసరమైన ప్రాంత ప్రజలకు పునరావాస కేంద్రాలకు రాలేని పరిస్థితి ఉన్నా సరే అలాంటి వారికి ఆహార పానియాలను అందజేయాలని తహశీల్దార్ వెంకట రమణను ఆదేశించిన భూమన. రైళ్ల రాకపోకలపై తుపాను ఎఫెక్ట్ ►హైదరాబాద్ నుంచి దక్షిణాదికి నిలిచిన రైళ్లు ►ఉత్తరాది నుంచి వచ్చే వాటికీ బ్రేక్ ►ఇప్పటికే 150కిపైగా రైళ్లను రద్దు చేసిన దక్షిణమధ్య రైల్వే ►వివరాల కోసం ప్రత్యేక సహాయ కేంద్రాలు ఏర్పాటు ►తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని రైల్వే అధికారులకు జీఎం ఆదేశాలు ►అత్యవసరమైతేనే ప్రయాణాలు చేయాలని సూచనలు కాకినాడ జిల్లా ►పెద్దాపురం:మీచాంగ్ తూపాన్ నేపథ్యంలో సామర్లకోట మండలంలో 4000 వేలమంది రైతుల వద్ద నుండి ఆన్లైన్లో 17,450, ఆఫ్ లైన్లో 1504 మెట్రిక్ టన్నుల ధాన్యం. ►పెద్దాపురం మండలంలో 832 మంది రైతుల వద్ద నుండి ఆన్లైన్లో 4303, ఆఫ్‌లైన్‌లో 369 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిన వ్యవసాయ అధికారులు. ►రెండు మండలాల్లో 80 శాతం పూర్తైన వరి కోతలు. నెల్లూరు జిల్లా: బంగాలఖాతంలో ఏర్పడ్డ తుపాన్ ప్రభావంతో ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలకు సోమశిల జలాశయానికి కొనసాగుతున్న వరద. ►ఇన్ ప్లో 10,915 క్యూసిక్కులు,అవుట్ ప్లొ 70 క్యూసెక్కులు. ►ప్రస్తుత జలాశయం సామర్థ్యం 30.756 టీఎంసీలు. మిచౌంగ్ తుపాను ప్రభావంతో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షం పశ్చిమగోదావరి జిల్లాకు రెడ్ ఎలర్ట్, ఏలూరు జిల్లాకు ఆరెంజ్ ఎలర్ట్ ప్రకటన తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు ముందస్తు చర్యలు నర్సాపురం, మొగల్తూరు రెండు మండలాల్లో 12 తుఫాన్ ప్రభావిత ప్రాంతాలు గుర్తింపు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు భీమవరం కలెక్టర్ కార్యాలయంలో 'మిచాంగ్' తుఫాన్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు. అత్యవస సహాయం కోసం కంట్రోల్ రూమ్ నెంబర్ 08816 299219... విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన అధికారులు ఎన్ డి ఆర్ ఎఫ్ ,ఎస్ డి ఆర్ ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచిన అధికారులు జిల్లాలో 1. 40 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు ముమ్మరంగా తుపాను సహాయచర్యలు చేపట్టిన ఏపీ ప్రభుత్వం జిల్లా కలెక్టర్లు, అధికార యంత్రాంగానికి సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం రాష్ట్రంలో తుపాను ప్రభావిత జిల్లాల్లో పటిష్టమైన చర్యలు చేపట్టిన ప్రభుత్వం బాపట్ల, కోనసమీ, తూర్పుగోదావరి, కాకినాడ, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, పశ్చిమగోదావరి జిల్లాలకు ప్రత్యేక అధికారుల నియామకం పలు జిల్లాల్లో తుపాను ప్రభావంతో భారీ వర్షపాతం నమోదు కోనసీమలో86, క్రిష్నా జిల్లాలో 55, బాపట్ల జిల్లాలో 64, నెల్లూరు జిల్లాలో 55, చిత్తూరు జిల్లాలో 93 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు గత రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాలు. 10 మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదు తిరుపతి జిల్లా కోటలో అత్యధికంగా 388 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు మనుబోలు లో 366, చిల్లకూరు లో 350, నాయుడు పేటలో 271, బలయపల్లిలో 239, సైదాపురంలో 223, వెంకటాచలంలో 213 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలో సున్నపువాగులో చిక్కుకున్న బండారు పల్లెకు చెందిన శివ, వెంకటేష్ నిన్న సాయంత్రం సున్నపు వాగు ఉదృతి పెరగడం తో మధ్యలో నిలిచిపోయిన వ్యవసాయ కూలీలు రక్షించే ప్రయత్నం చేస్తున్న రెవెన్యూ అధికారులు, ఫైర్ అధికారులు కాకినాడ: మిచాంగ్ తుపాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వానలు తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు కాకినాడ ఉప్పాడ బీచ్ రోడ్డులో వాహనాల రాకపోకలను నిలిపివేసిన పోలీసులు ఇవాళ కూడా పాఠశాలలకు శెలవు ప్రకటించిన అధికారులు కాకినాడ పోర్టులో ఎగుమతులు, దిగుమతులకు ఆటంకం వేటను నిలిపివేసి తీరానికే పరిమితమైన గంగపుత్రులు ఉప్పాడలో తుపాను పునరావాస కేంద్ర ఏర్పాటు భారీ వర్షాలకు 3 వేల ఎకారాల్లో నేల కొరిగిన వరి పంట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్రతుఫాను మిచౌంగ్: ప్రస్తుతానికి నెల్లూరుకు 50 కి.మీ, బాపట్లకు 110 కి.మీ, మచిలీపట్నానికి 170కి.మీ. దూరంలో తుపాను మధ్యాహ్ననంలోపు నెల్లూరు - మచిలీపట్నం మధ్య బాపట్ల దగ్గర తీవ్రతుఫానుగా తీరం దాటనున్న మిచౌంగ్ తీరం వెంబడి గంటకు 90-110 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు మిచౌంగ్ తుపాను కారణంగా విశాఖలో బీచ్‌లు మూసివేత ఆర్కే బీచ్‌లో పోలీసుల ప్రత్యేక పెట్రోలింగ్ అన్ని బీచ్‌ల వద్ద పోలీసుల పర్యవేక్షణ పర్యాటకులు బీచ్‌లోకి దిగకుండా ఆంక్షలు చెన్నైలో జలప్రళయం ముంచెత్తిన మిచౌంగ్ తుపాను ఏకంగా 35 సెంటీమీటర్ల వాన పూర్తిగా స్తంభించిన జనజీవనం వరదలకు కొట్టుకుపోయిన పార్కింగ్ ప్రదేశాల్లో ఉన్న వందలాది కార్లు, వాహనాలు నడుం లోతుకు పైగా నీరు చేరడంతో నగరంలోని అన్ని హైవేలను, సబ్‌వేలను మూసేశారు. రన్ వేపైకి నీరు చేరడంతో చెన్నై విమానాశ్రయం కూడా మూసివేత హైవేలు, సబ్‌వేల మూసివేత నీట మునిగిన విమానాశ్రయం 160 విమానాలు రద్దు నేడు మరింత వర్ష సూచన! Chennai in deep trouble.. 😔#ChennaiRain #MichaungCyclone pic.twitter.com/DSXZvIo3p5 — Dr. Jitendra Nagar (@NagarJitendra) December 5, 2023 తూర్పుగోదావరి జిల్లా: రాజమండ్రి నగరంలో నిలిచిపోయిన వర్షం.. స్తబ్దంగా ఉన్న వాతావరణం ఏజెన్సీ ప్రాంతంలో తుఫాను ప్రభావంతో ఏకధాటిగా కురుస్తున్న వర్షం ముందస్తు చర్యగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 30 పురావస కేంద్రాల ఏర్పాటు ఇవాళ తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల పరిధిలో పాఠశాలలకు సెలవు ప్రకటించిన అధికారులు సముద్ర తీర ప్రాంతంలోకి మత్స్యకారులు గాని, పిక్నిక్ల పేరిట సాధారణ జనం కానీ వెళ్ళద్దని హెచ్చరికలు గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే కోతలు పూర్తి చేసి, ఆరబెట్టిన ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు రైతులకు సహాయపడుతున్న అధికారులు తీర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా ఉండేందుకు సిబ్బందిని ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్న జిల్లా యంత్రాంగం రాజమండ్రి కలెక్టరేట్, రాజమండ్రి ,కొవ్వూరు ఆర్డీవో కార్యాలయాల్లోను, అమలాపురం కలెక్టరేట్లోనూ కంట్రోల్ రూమ్ ఏర్పాటు తిరుపతి: తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను, అధికారులను అప్రమత్తం చేశాం: భూమన గత అనుభవాల దృష్ట్యా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడం జరిగింది. ముందుస్తుగా వరద కాలువల్లో పూడిక తీయడం వంటి చర్యలు చేపట్టం జరిగింది దీని వల్ల మరీ లోతట్టు ప్రాంతాల్లో మినహా వరద నీటి ఉదృతి చాలా వరకు తగ్గింది తిరుమలలో కూడా జలాశయాన్ని పూర్తిగా నిండాయి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించడం జరిగింది కృష్ణాజిల్లా: మచిలీపట్నం హార్బర్ లో గ్రేట్ డేంజర్ సిగ్నల్ 10 వ నెంబర్ ప్రమాద హెచ్చరిక ఎగురవేత తీరప్రాంతాల్లో దంచికొడుతున్న వర్షం తుపానుపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్రతుఫాను మిచౌంగ్ ప్రస్తుతానికి చెన్నైకి 170 కి.మీ, నెల్లూరుకు 20 కి.మీ, బాపట్లకు 150 కి.మీ, మచిలీపట్నానికి 210కి.మీ. దూరంలో తుపాను మధ్యాహ్ననికి నెల్లూరు - మచిలీపట్నం మధ్య బాపట్ల దగ్గర తీవ్రతుఫానుగా తీరం దాటనున్న మిచౌంగ్ తీరం వెంబడి గంటకు 90-110 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు కోస్తాంధ్రలో చాలాచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, పలుచోట్ల భారీ నుండి అతిభారీ వర్షాలు, అక్కడక్కడ తీవ్రభారీ వర్షాలు కురిసే అవకాశం రేపు రాయలసీమల, ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీవర్షాలు నమోదైయ్యే అవకాశం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి 4 జిల్లాల్లో కుండపోత వర్షాలు తీవ్ర రూపం దాల్చిన తుపాను.. 4 జిల్లాల్లో కుండపోత వర్షాలు తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో ఎడతెరపి లేకుండా వాన పలు చోట్ల 15–20 సెంటీమీటర్ల కంటే అధికంగా వర్షం.. అత్యధికంగా బుచ్చినాయుడు కండ్రిగలో 28 సెంటీమీటర్లు కృష్ణపట్నం పోర్టులో 10వ నంబరు ప్రమాద హెచ్చరిక జారీ.. పొంగుతున్న వాగులు, వంకలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం బాపట్ల, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లోనూ మొదలైన వానలు.. నేటి మధ్యాహ్నం చీరాల, బాపట్ల మధ్యలో తీరం దాటే అవకాశం ఉప్పాడ తీరంలో గ్రామాల్లోకి చొచ్చుకొచ్చిన సముద్రపు నీరు.. నేడు, రేపు కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలకు అవకాశం బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుపాను సోమవారం తీవ్ర రూపం దాల్చింది. గంటకు పది కిలోమీటర్ల వేగంతో దక్షిణ కోస్తాంధ్రకు సమాంతరంగా కదులుతుండడంతో తీరం వెంబడి ఉన్న జిల్లాల్లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లా, నెల్లూరు జిల్లాల్లో కురుస్తున్న కుండపోత వర్షాలకు అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిగలో 28.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. తిరుపతి జిల్లా పెళ్లకూరులో 23.1, దొరవారిసత్రంలో 26.4, నాయుడుపేట 21, సూళ్లూరుపేట 20.3, నెల్లూరు 24.3, ఇందుకూరుపేటలో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆయా ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా నీరు చేరింది. నేడు, రేపు భారీ వర్షాలు మిచౌంగ్ తుపాను తీవ్రరూపం దాలుస్తూ కోస్తాంధ్ర వైపు దూసుకొస్తోంది. గుంటూరు జిల్లా రేపల్లె, ప్రకాశం జిల్లా చీరాల, ఒంగోలు, కృష్ణా జిల్లా మచిలీపట్నం, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటల్లో సముద్రం 120 నుంచి 250 మీటర్ల వరకు ముందుకు చొచ్చుకు వచ్చే అవకాశం ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ఐఎండీ సూచన తుపాను ప్రభావం వల్ల మంగళ, బుధవారాల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, తిరుపతి, నెల్లూరు, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఒకట్రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు.. కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ, వైఎస్సార్, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఒకట్రెండు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, ఎఎస్సార్, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలకు ఆస్కారం ఉంది. ఫలితంగా తూర్పు గోదావరి, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, యానాం, చిత్తూరు, కర్నూలు, కడప జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం. తెలంగాణలోని ఖమ్మం, నాగర్ కర్నూలు, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల్లో వరదకు అవకాశం ఉంది -
'Michaung' Cyclone: దిశమార్చుకున్న మిచౌంగ్.. తీవ్ర తుపానుగా..
cyclone michaung Live Updates.. ఉదయానికి ఏపీని తాకనున్న మిచౌంగ్ తుపాను తీరాన్ని తాకే వేళ భయంకరంగా మిచౌంగ్ ప్రచండ గాలులతో విరుచుకుపడుతుందన్న వాతావరణ శాఖ తీరం దాటిన తర్వాత కూడా కొనసాగనున్న తుపాను ప్రభావం తుపానును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్న అధికార యంత్రాంగం ఇప్పటికే పునరావాస కేంద్రాలకు పలువురు.. సహాయక చర్యలందించేందుకు రెడీ చెన్నై-నెల్లూరు రాకపోకలు బంద్ మిచౌంగ్ తుపాను బీభత్సం సూళ్లూరుపేట మండలం గోకుల్ కృష్ణ ఇంజనీరింగ్ కళాశాల వద్ద జాతీయ రహదారిపై 4 అడుగుల మేర ప్రవహిస్తున్న వరదనీరు తమినాడు,ఆంధ్రప్రదేశ్ కు నిలిచిపోయిన రాకపోకలు బారికేడ్లతో జాతీయ రహదారి మూసివేత ప్రజలు ప్రత్యామ్నాయ మార్గం చూసుకోవాలన్న జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డి ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని సూచన మిచౌంగ్ ఒంగోలు హెల్ప్‌లైన్ నెంబర్లు ప్రకాశం జిల్లా ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ఆఫీస్‌లో హెల్ప్ లైన్ 1. 9949796033 2. 8555931920 3. 9000443065 4. 7661834294 5. 8555871450 ఎలాంటి సమస్య వున్నా హెల్ప్.లైన్.నెంబర్లకు కాల్ చేయాలని ప్రజలకు ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని పిలుపు చెన్నై నగరంలో వర్ష బీభత్సం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న మిచౌంగ్ తుపాను అతి భారీ వర్షాలతో చెన్నై పూర్తిగా జలమయం నగరంలో ఎటు చూసినా నీరే. నగరంలో గత 70-80 ఏళ్లలో ఎన్నడూ లేనంత వర్షం కురిసిందని తమిళనాడు పురపాలక శాఖ మంత్రి కేఎన్ నెహ్రూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నా.. తుపాను తీవ్రతకు సరిపోలేదని వ్యాఖ్య తుపాను విలయం ముందు తమ యంత్రాంగం విఫలమైందన్న తమిళనాడు మంత్రి ముంపు ప్రాంతాల ప్రజలను తరలించేందుకు బోట్లు పంపించినట్లు వెల్లడి చెన్నైలో కుండపోత వానలు కురుస్తుండడంతో విమానాశ్రయంలోకి నీళ్లు పలు ప్రాంతాల్లో రోడ్లపైకి నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తాంబరంలో నీటిలో చిక్కుకుపోయిన 15 మందిని రక్షించిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తుపాను కారణంగా నగరంలోని కోర్టులకు సెలవు ఇచ్చినట్టు మద్రాస్ హైకోర్టు చెంగల్పట్టు, తిరువళ్లూర్, కాంచీపురం జిల్లాల్లోనూ భారీ వర్షాలు.. అతలాకుతం ఏపీ తమిళనాడు మధ్య రాకపోకలు బంద్ మిచౌంగ్ తుపాను ప్రభావంతో.. కుంభవృష్ణి కాళంగి నది ఉధృతి ఏపీ-తమిళనాడు మధ్య రాకపోకలు బంద్ సూళ్లూరు పేటలో నాలుగు అడుగుల మేర ఎత్తులో ప్రవహిస్తున్న నది ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలంటున్న పోలీసులు రేపు ఉదయం వరకు ఎవరూ అటువైపు రావొద్దని వెనక్కి పంపిచేస్తున్న పోలీసుల తిరుపతిలో స్కూళ్లకు సెలవు మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో తిరుపతి జిల్లా వ్యాప్తంగా స్కూల్స్, కళాశాలకు సెలవు ప్రకటించిన జిల్లా కలెక్టర్ వెంకట రమణ రెడ్డి ధాన్యం నష్టపోకుండా.. ఉమ్మడి నెల్లూరు, గుంటూరు, ప్రకాశం, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలోని రైతుల వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సూచన మిచౌంగ్ తుఫాన్ కారణంగా భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకుని కోతకోసిన ధాన్యం నిల్వచేసుకునేందుకు సదుపాయం కల్పించిన మార్కెటింగ్ శాఖ ధాన్యం నిల్వచేసుకునే సౌకర్యం లేని వారు ఆయా ప్రాంతాల్లోని మార్కెట్ యార్డు గోదాముల్లో భద్రపరచుకోవచ్చని సూచించిన వ్యవసాయ మార్కెటింగ్ శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ కె.శ్రీనివాసరావు విజయవాడలోని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ కార్యాలయంలో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు టోల్ ఫ్రీ నెంబర్ - 73311 54812 ( ఎ. సుకుమార్ ) తుపాన్ ఎఫెక్ట్‌తో గన్నవరం నుంచి విమానాలు రద్దు ముంచుకొస్తున్న ముప్పు అల్లకల్లోలంగా సముద్రం రాబోయే రెండు రోజులు ప్రమాదకరమని వాతావరణ శాఖ హెచ్చరిక దక్షిణ కొస్తాను ముంచెత్తనున్న మిచౌంగ్ నెల్లూరు 120 కి.మీ. దూరంలో! రేపు ఉదయానికి బాపట్ల-దివిసీమ మధ్య తీరం దాటే అవకాశం కుంభవృష్టి వర్షాలతో ఆక్మసిక వరదలు తప్పవని హెచ్చరిక తీవ్ర తుపాను నెమ్మదిగా పయనిస్తే మాత్రం భారీ నష్టం తప్పదని అంచనా తుపానును ఎదుర్కొనేందుకు అన్ని రకాలుగా సిద్ధమైన అధికార యంత్రాంగం దక్షిణ మధ్య రైల్వే హెల్ప్ లైన్ నెంబర్లు తీవ్రతుపాన్గా మారిన మిచౌంగ్ అప్రమత్తమైన దక్షిణమధ్య రైల్వే దక్షిమధ్య రైల్వే పరిధిలోని స్టేషన్లలో హెల్ప్ లైన్లు ఏర్పాటు అనకాపల్లి : 08924 - 221698 తుని : 08854 – 252172 సామర్లకోట : 08842 - 327010 రాజమండ్రి : 08832 – 420541 తాడేపల్లిగూడెం : 08818 – 226162 ఏలూరు : 08812 – 232267 భీమవరం టౌన్ : 08816 – 230098; 7815909402 విజయవాడ : 08862 – 571244 తెనాలి : 08644 – 227600 బాపట్ల : 08643 – 222178 ఒంగోలు : 08592 – 280306 నెల్లూరు : 08612 – 345863 గూడూరు : 08624 – 250795; 7815909300 కాకినాడ టౌన్ : 08842 – 374227 గుంటూరు : 9701379072 రేపల్లె : 7093998699 కర్నూల్ సిటీ : 8518220110 తిరుపతి : 7815915571 రేణిగుంట : 9493548008 కమర్షియల్ కంట్రోల్ రూమ్స్ సికింద్రాబాద్ : 040 – 27786666, 040 – 27801112 హైదరాబాద్ : 9676904334 కాచిగూడ : 040 – 27784453 ఖాజీపేట్ : 0870 – 2576430 ఖమ్మం : 7815955306 దిశమార్చుకున్న మిచౌంగ్ హఠాత్తుగా దిశ మార్చుకున్న మిచౌంగ్ తుపాను ప్రస్తుతం నెల్లూరు సూళ్లూరుపేట వద్ద కేంద్రీకృతం ఇప్పటికే జలదిగ్బంధంలో సూళ్లూరుపేట రాత్రి పది నుండి పన్నెండు గంటల లోపు నెల్లూరు సమీపంలో తీరం దాటే అవకాశం.. దీని ప్రభావంతో ఇప్పటికే నెల్లూరు జిల్లాలోని మనుబోలు, కలువాయి, నెల్లూరులో ఈదురు గాలుల బీభత్సం ఇవాళ అర్ధరాత్రి లోపు నెల్లూరు - కావలి మధ్య తీరం దాటే అవకాశం మిచాంగ్ తుఫాన్ తీరం దాటిన తర్వాత ఒంగోలు, విజయవాడ, ఖమ్మం, వరంగల్ మీదుగా పయనించనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడి తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 150 నుండి 200 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు బాపట్లలో హైఅలర్ట్ మిచౌంగ్ తుపాను నేపథ్యంలో బాపట్ల చేరుకున్న ఎన్ డీ ఆర్ ఎఫ్, ఎస్ డీ ఆర్ ఎఫ్ బృందాలు లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేస్తున్న అధికారులు 14 పునరావస కేంద్రాలకు 800 మందిని తరలించిన అధికారులు మండలానికి ఒక స్పెషల్ టీం ను ఏర్పాటు చేసిన అధికారులు 50 మండలాలకు 50 టీములు ఏర్పాటు 350 మంది గజ ఈతగాళ్ళను సిద్దం చేసిన అధికారులు 43 తుఫాను పునరావాస కేంద్రాలు సిద్ధం చేసిన అధికారులు నిజాంపట్నం హార్బర్ లో పదవ ప్రమాద హెచ్చరికను జారీ చేసిన అధికారులు మిచౌంగ్ ఎఫెక్ట్.. రెండో చోట్లా బస్సుయాత్ర వాయిదా మిచౌంగ్ ఎఫెక్ట్‌తో డిసెంబర్ 5వ తేదీ రెండు చోట్ల వైఎస్సార్సీపీ బస్సు యాత్ర వాయిదా రేపు చోడవరం, నందిగామ, రాయదుర్గం నియోజకవర్గాలలో జరగాల్సిన యాత్ర భారీ వర్షాల కారణంగా రెండు చోట్ల వాయిదా వేసిన వైఎస్సార్సీపీ నేతలు ఎన్టీఆర్ జిల్లా నందిగామ, అనకాపల్లి జిల్లా చోడవరంలో వాయిదా అనంతపురం జిల్లా రాయదుర్గంలో యథాతథంగా కొనసాగనున్న యాత్ర వర్షాలు తగ్గిన అనంతరం నందిగామ, చోడవరంలో నిర్వహించే అవకాశం తెలంగాణపైనా మిచౌంగ్ ఎఫెక్ట్ ఏపీతో పాటు తెలంగాణ పైనా మిచౌంగ్ ప్రభావం ఉమ్మడి ఖమ్మం జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ రాగల రెండు రోజులు భారీ వర్ష సూచన మంగళవారం అన్ని విద్యా సంస్థలకు సెలవు.. హాస్టల్ విద్యార్థులు బయటకు రావొద్దని హెచ్చరికలు సహాయం కోసం జిల్లా కంట్రోల్ రూం నెంబర్లు 1077, 9063211298 ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న జిల్లా కలెక్టర్ గౌతమ్ తీవ్రతుపానుగా మారిన మిచౌంగ్ తీరప్రాంత గ్రామాల్లో పెరిగిన గాలుల తీవ్రత , వర్షం నాగాయలంక మండలం ఎదురుమొండి దీవుల్లో ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు ఎదురుమొండి దీవుల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ప్రత్యేక బోట్లు ఏర్పాటు ఏటిమొగ రేవు వద్ద పరిస్థితిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ జాషువా, అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ఏటిమొగ గ్రామంలోని పునరావాస కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్,ఎస్పీ,ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్, రాజాబాబు మాట్లాడుతూ.. ‘‘నాగాయలంక , ఏటిమొగ,నాచుగుంట,ఈలచెట్ల దిబ్బ దీవుల పై తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ దీవుల్లోని ప్రజలను అప్రమత్తం చేశాం. కొందరిని ఇప్పటికే పునరావాసకేంద్రాలకు తరలించాం. అత్యవసర పరిస్థితుల్లో దీవుల్లోని ప్రజలను తరలిస్తాం. పోలీస్, రెవిన్యూ , ఎన్డీఆర్ఎఫ్ ,ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. జిల్లా ఎస్పీ, జాషువా మాట్లాడుతూ.. తుపాను ప్రభావిత ఐల్యాండ్స్ లో పోలీస్ సిబ్బందిని అందుబాటులో ఉంచాం. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నాం. కమ్యూనికేషన్ కోసం వైర్ లెస్ కనెక్షన్స్ అందుబాటులో ఉంచాం. కలెక్టర్ తో కలిసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నాం రాబోయే రెండు రోజుల్లో.. చెన్నైకి 90కి.మీ, నెల్లూరుకు 140 కిమీ.. బాపట్లకి 250 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైన తీవ్ర తుపాను రేపు ఉదయం బాపట్ల, మచిలీపట్నం సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఇవాళ, రేపు కోస్తాలోని అన్ని ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ ఇవాళ రాత్రి దక్షిణ కోస్తా జిల్లాల్లో కుండపోతగా వర్షం నెల్లూరు నుంచి కాకినాడ వరకు కొన్ని ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు రాబోయే రెండు రోజుల్లో కోస్తాంధ్ర ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ తరుముకొస్తున్న మిచౌంగ్ అధికార యంత్రాగం అప్రమత్తం తిరుపతిలో.. రేణిగుంట విమానాశ్రయ రన్ వే పైకి వరదనీరు రేణిగుంటలో విమానాశ్రయం రన్ వే పైకి దూసుకొచ్చిన వరదనీరు.. వరదనీరు చేరిక కారణంగా రేణిగుంట విమానాశ్రయంలో విమానా రాకపోకలకు అంతరాయం.. రేణిగుంటకు విమాన రాకపోకలు రద్దు చేసిన అధికారులు.. మిచౌంగ్‌తో.. నాలుగు రైళ్లు రద్దు మిచౌంగ్ తుపాను కారణంగా 4 రైళ్లు పూర్తిగా రద్దు 3 రైళ్లు పాక్షికంగా రద్దు తుపాను ప్రభావిత జిల్లాలకు ప్రత్యేకాధికారుల నియామకం బాపట్ల – కాటమనేని భాస్కర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ – జయలక్ష్మి తూర్పుగోదావరి – వివేక్ యాదవ్ కాకినాడ – యువరాజ్ ప్రకాశం – ప్రద్యుమ్న నెల్లూరు – హరికిరణ్ తిరుపతి – జె.శ్యామలరావు వెస్ట్‌గోదావరి – కన్నబాబు చెరువును తలపిస్తున్న చెన్నై విమానాశ్రయం చెన్నై విమానాశ్రయంలోకి భారీగా చేరిన వరద నీరు. వర్షాల కారణంగా పలు విమాన సర్వీసులు రద్దు. Understand this is Chennai airport today. The sea seems to have taken it over. And the most lowly paid staff in an airline typically are out braving it all. 👏👍#ChennaiRains pic.twitter.com/vJWNTmtTez — Tarun Shukla (@shukla_tarun) December 4, 2023 వర్షపు నీటిలో మునిగిపోయిన వాహనాలు.. #ChennaiRains Hi Chennai! The same old chennai with not a single improvement. This is happening every year & still no one cares about it. All they need is big apartments & for that they cut down the trees, demolish the lakes. Hence, the suffering!!!#CycloneMichuang #CycloneAlert pic.twitter.com/L0yo94nwBD — Bala Harish (@balaharish25) December 4, 2023 నీట మునిగిన పలు కాలనీలు.. It's Aishwarya Nagar, Madambakkam, Chennai-126 (@TambaramCorpor ) It's a scary day... Seems like ocean. #ChennaiFloods #Chennai #ChennaiCorporation #chennairains pic.twitter.com/rBgvF6CQig — CommonHuman (@voiceout_m) December 4, 2023 ఈదురు గాలులతో భారీ వర్షం.. location: sholinganallur wipro. #ChennaiRains #ChennaiFloods pic.twitter.com/GMuHc9NqS6 — ワル.🍭🍿 (@itz_shivvvuuu) December 4, 2023 పలు కాలనీల్లో ఇళ్లలోకి చేరిన వరద నీరు.. Despite this much rain TNEB power is still going. So that I can use Twitter. Hats off to vidiyal arasu. #ChennaiRains #Guduvacheri pic.twitter.com/hcyTrj26Kr — Kabilan Shan (@ksrsk92_) December 3, 2023 கடவுளை கொஞ்சம் கருணை காட்டு பா.... தண்ணி ஏறிக்கிட்டே வருது... 😰😰😰#ChennaiRains #CycloneMichaung https://t.co/d0D3HjnqiU pic.twitter.com/7wTG4zr8xy — Ravi (@ajuravi) December 4, 2023 SAD!!!!!Next to Apollo hospitals at Teynampet be safe #chennairains #chennairains #ChennaiRains #ChennaiFloods #ChennaiFloods #DunkiTrailer #DunkiDrop4 #Yash19DAMNNN@Portalcoin#CycloneMichuang pic.twitter.com/GrkHTzLwtS — Jussu ❤️ Memecoin | jitu123sahani.bnb (@Jussu26237885) December 4, 2023 తుపాను దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎం జగన్ సమీక్ష.. ఎనిమిది మంది జిల్లా కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్పరెన్స్ వీడియో కాన్పరెన్స్‌లో పలు శాఖలకు చెందిన అధికారులు సైతం పాల్గొన్నారు. సీఎం జగన్ ఆదేశాలు ఇవే.. తుపాను సందర్బంగా ప్రభుత్వ యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలి హుద్‌హుద్ లాంటి పెద్ద పెద్ద తుపాన్లను చూసిన అనుభవం మనకు ఉంది తుపాన్లను ఎదుర్కోవడంలో మన యంత్రాంగానికి మంచి అనుభవం ఉంది: తుపాన్ పట్ల అప్రమత్తంగా ఉంటూ యంత్రాంగం సీరియస్‌గా ఉండాల్సిన అనుభవం ఉంది: బాపట్ల సమీపంలో రేపు సాయంత్రం తీరందాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు గంటకు 110 కి.మీ. వేగంతో గాలులు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు ఇప్పటికే జిల్లాల కలెక్టర్లకు నిధులు విడుదలచేశాం అత్యవసర ఖర్చులకు ప్రతి జిల్లాకు రూ.2 కోట్ల చొప్పున నిధులు ఇవ్వాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం ప్రతి జిల్లాకు సీనియర్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమిస్తున్నాం: వీరంతాకూడా జిల్లాల యంత్రాంగంతో కలిసి సహాయక చర్యలను పర్యవేక్షిస్తారు: ఎలాంటి ప్రాణనష్టం లేకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉంది: పశువులకూ ఎలాంటి ప్రాణనష్టం రాకూడదు: ఆ మేరకు వెంటనే చర్యలు తీసుకోవాలి: కోతకు వచ్చిన ఖరీఫ్ పంటను కాపాడుకోవడం అన్నది చాలా ముఖ్యమైనది నిన్న ఒక్కరోజే 97 వేల టన్నలు ధాన్యాన్ని సేకరించాం 6.5 లక్షల టన్నుల ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాం: పంటకోయని ప్రాంతాల్లో వీలైనంత మేర కోయకుండా వాయిదా వేసుకుంటే మంచిదని అధికారులు చెప్తున్నారు దీనిపై రైతులకు అవగాహన కల్పించాలి కోసిన ధాన్యాన్ని వెంటనే సేకరించడంపై అధికారులు దృష్టిపెట్టాలి యుద్ధ ప్రాతిపదికన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి: తేమ, రంగు లాంటి అంశాలను పట్టించుకోకుండా రైతులకు అండగా నిలవండి: తుపాను దృష్ట్యా రైతులకు తోడుగా నిలవాల్సిన అవసరం ఉంది: అన్నిరకాలుగా రైతులకు తోడుగా నిలవడం అన్నది అత్యంత ప్రాధాన్యతాంశం తుపాను ప్రభావం ఉన్న ప్రాంతాలనుంచి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలి: 308 శిబిరాల ఏర్పాటుకు గుర్తించామని, అప్పటివరకూ 181 తెరిచామని చెప్తున్నారు: అవసరమైన చోట వెంటనే శిబిరాలను తెరిచి ప్రజలను అక్కడకు తరలించాలి: ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ 5, ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ 5 కూడా ఉన్నాయి: ఇతర రాష్ట్రాలకు లేని, మనకు మాత్రమే ఉన్న మరో బలం ఏంటంటే గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ విలేజ్ క్లినిక్స్, ఆర్బీకేలు కూడా మనకు ఉన్నాయి: ఇది మనకు ఉన్న పటిష్టమైన బలం ఇతర రాష్ట్రాలకు ఇలాంటి వ్యవస్థ లేదు ఈ యంత్రాంగాన్ని బాగా వినియోగించుకోవాలి ఈ వ్యవస్థను అత్యంత సమర్థవంతంగా వినియోగించుకోవాలి ప్రజల ప్రాణాలను రక్షించడంలో, తపాను వల్ల, భారీవర్షాల వల్ల దెబ్బతినే అవకాశాలున్న ప్రాంతాల్లో వీరి సేవలను వినియోగించుకోవాలి సహాయక శిబిరాల్లో వచ్చే ప్రజలకు మంచి సౌకర్యాలను ఏర్పాటు చేయాలి మనం ఉంటే ఎలాంటి సదుపాయాలు కోరుకుంటామో, అలాంటి సదుపాయాలు ఉండాలి మందులు, తాగునీరు, మంచి ఆహారం అందించాలి: కాస్త డబ్బు ఖర్చైనా పర్వాలేదు, సదుపాయాలు విషయంలో ఎలాంటి లోటూ రాకూడదు: క్యాంపునుంచి ఇంటికి వెళ్లేటన్పుడు చిరునవ్వుతో వారు ఇంటికి వెళ్లాలి: ప్రతి ఒక్కరికీ రూ.1000 లేదా కుటుంబానికి గతంలో మాదిరిగా కాకుండా రూ.500 పెంచి రూ.2500ఇవ్వాలి: క్యాంపులకు రాకుండా, ఇళ్లలోకి నీళ్లు చేరిన వారికి 25 కేజీల బియ్యం, కందిపప్పు, పామాయిల్, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు కిలోచొప్పున అందించాలి ఈ రేషన్‌ను వారికి సకాలంలో సక్రమంగా అందించాలి గాలులు వల్ల, వర్షాల వల్ల గుడిసెల్లాంటివి దెబ్బతింటే వారికి రూ.10వేలు అందించాలి బాధితుల పట్ల దయతో, సానుభూతితో అందించాలి పరిహారాన్ని సకాలంలో అందించాలి తుపాను తగ్గు ముఖం పట్టిన 24 గంటల్లో వీటిని అందించాలి గ్రామ సచివాలయాలు, వాలంటీర్లు వ్యవస్థను వినియోగించుకుని బాధితులను గుర్తించి వెంటనే వారికి ఇవ్వాల్సినవి ఇవ్వాలి ఎమర్జెన్సీ సర్వీసుల నిర్వహణపై దృష్టిపెట్టాలి జనరేటర్లను అందుబాటులో ఉంచుకోవాలి గర్భిణీలను ఆస్పత్రులకు తరలించాలి తుపాను వల్ల వచ్చే వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత వ్యాధులు ప్రబలకుండా ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలి పారిశుద్ధ్య కార్యక్రమాలు యుద్ధ ప్రాతిపదికిన నిర్వహించాలి విద్యుత్, రవాణా సౌకర్యాలకు అంతరాయం ఏర్పడితే వెంటనే యుద్ధ ప్రాతిపదికిన వాటిని సరిచేయాలి సాధారణ పరిస్థితులను తీసుకురావడంపై ప్రత్యేకాధికారులు దృష్టిపెట్టాలి తుపాను, వర్షాలు తగ్గాక పంటలకు జరిగిన నష్టంపై వెంటనే ఎన్యుమరేషన్ పూర్తిచేయాలి నేను కూడా ప్రజల దగ్గరకు వెళ్లి.. కలెక్టర్లు బాగా చేశారా? లేదా? అడుగుతాను బాగానే చేశారని ప్రజలు సంతోషంగా నాకు చెప్పాలి తుపాను బాధిత ప్రాంతాల్లో తిరుగుతాను, ప్రభుత్వం యంత్రాంగం పనితీరుపై అడిగి తెలుసుకుంటాను సహాయం అందలేదని, బాగా చూసుకోలేదన్న మాట బాధితులనుంచి వినిపించకూడదు సంతృప్తకర స్థాయిలో బాధితులందరికీ సహాయం అందాలి ఈ సాయంత్రం నుంచి ప్రత్యేకాధికారులు జిల్లాల్లో పర్యవేక్షణ ప్రారంభిస్తారు డబ్బులు ఇంకా అవసరమైతే..వెంటనే పంపించడానికి అన్నిరకాలుగా ఏర్పాట్లు చేశాను ఒక ఫోన్ కాల్ దూరంలో మేం ఉంటాం. ఏం కావాలన్నా వెంటనే అడగండి సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికిన నడవాలి కృష్ణాజిల్లా: మిచౌంగ్ తుఫాను కారణంగా అవనిగడ్డ నియోజకవర్గంలో వరి రైతులను అప్రమత్తం చేసిన ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, రైతు విభాగం జోనల్ ఇన్చార్జి కడవకొల్లు నరసింహారావు డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తుఫాన్ ప్రభావంతో అల్లవరం మండలం ఓడల రేవు సముద్రతీరంలో ఎగసి పడుతున్న అలలు 8 మీటర్ల మేర కోతకు గురైన సముద్రతీరం అధికారిక యంత్రాంగం అప్రమత్తం నక్కపల్లి నుండి వేటకు వచ్చిన 30 మంది మత్స్యకారులను నక్కా రామేశ్వరం తుఫాన్ పునారావాస కేంద్రానికి తరలింపు... మిచౌంగ్ ప్రభావంతో ఐదు జిల్లాలకు అలర్ట్.. మచిలీపట్నం చేరుకున్న 25 మందితో కూడిన ఎన్డీఆర్ఎఫ్ టీమ్ అవనిగడ్డ చేరుకున్న 37 మందితో కూడిన ఎన్డీఆర్ఎఫ్ బృందం తణుకులో మంత్రి కారుమూరి పర్యవేక్షణ తణుకు నియోజకవర్గంలోని ఇరగవరం, అత్తిలి మండలాల్లో పర్యటించి రైతులతో మాట్లాడిన కారుమూరి మిచౌంగ్ తుపాన్‌కు రైతులు ఎవరూ అదైర్యపడవద్దు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ధాన్యాన్ని ప్రభుత్వం కొంటుంది. వీలైనంత త్వరగా రైతులు తమ ధాన్యాన్ని మీకు అందుబాటులో ఉన్న మిల్లులకు తరలించాలి ఆప్లైన్, ఆన్లైన్ రెండు విధాలుగా ధాన్యాన్ని తరలించే వెసులుబాటు కల్పించాం. ఏ మిల్లర్ అయినా రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటాం. తుపాన్ తీవ్రత తగ్గే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండి రైతులకు ఇబ్బంది కలుగకుండా చూడాలని ఆదేశించాము. ఏ ఒక్క రైతు నష్టపోకుండా మనమే చూసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. విశాఖపట్నం.. తుపాన్ ఎఫెక్ట్‌తో పలు విమానాలు రద్దు.. ఐదు విమానాలను రద్దు చేసినట్టు అధికారుల ప్రకటన తమిళనాడు అతలాకుతలం.. తుపాను ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జవజీవనం స్థంభించిపోయింది. ఎటు చూసినా వరద నీరే కనిపిస్తోంది. Stay safe 🙏 people of South AP & North Tamil Nadu districts including Chennai, particularly low lying areas. Don't venture out unless in an emergency Brace yourselves for very heavy to massive rains in the next 15-18 hours#ChennaiRains #CycloneMichaung pic.twitter.com/QNu8LPNkqL — Memer Aspirant (@MemerAspirant) December 4, 2023 #WATCH | Tamil Nadu: Amid severe water logging due to heavy rainfall in Chennai city, Thillai Ganga Nagar Subway in Alandur has been closed. pic.twitter.com/jnQYVuJ9a1 — ANI (@ANI) December 4, 2023 #WATCH | Tamil Nadu: Amid heavy rainfall in Chennai city, severe water logging witnessed in several areas of the city. (Visuals from the Pazhaverkadu Beach area) pic.twitter.com/dQpvK0e5VA — ANI (@ANI) December 4, 2023 పలుచోట్ల రైల్వే స్టేషన్లలోకి నీరు చేరడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. #WATCH | Tamil Nadu: As cyclone 'Michaung' approaches Chennai coast, accompanied by heavy rainfall, several trains are delayed and a few have been cancelled. (Visuals from Egmore Railway Station) pic.twitter.com/5SfV1Xr81L — ANI (@ANI) December 4, 2023 Stay safe 🙏 people of South AP & North Tamil Nadu districts including Chennai, particularly low lying areas. Don't venture out unless in an emergency Brace yourselves for very heavy to massive rains in the next 15-18 hours #ChennaiRains @Portalcoin #CycloneMichaung pic.twitter.com/fMUerahj2v — M.N.K (@Nithin1833) December 4, 2023 మిచౌంగ్ తుపాన్ కారణంగా చెన్నైలో భారీ వర్షం, కూలిన చెట్లు.. #WATCH | Tamil Nadu: Amid heavy rainfall, trees uprooted near the Ambattur area, Chennai. pic.twitter.com/XU2Tihh9PO — ANI (@ANI) December 4, 2023 #WATCH | Tamil Nadu: Trees uproot, rainwater enters the residential area as strong winds, accompanied by rainfall, lash parts of Chennai. (Visuals from Thirumullaivoyal-Annanur area) pic.twitter.com/LTGDKJZF4t — ANI (@ANI) December 4, 2023 కాకినాడలో అప్రమత్తం.. మిచౌంగ్ తుపాన్ ప్రభావంతో జిల్లాలో మారిన వాతావరణ పరిస్ధితులు పలు ప్రాంతాల్లో కురుస్తున్న వానలు తుపాన్ కారణంగా ఏడు తీర ప్రాంత మండలాల్లో పాఠశాలలకు సెలవు వేటను నిలిపివేసిన మత్స్యకారులు భారీ వర్షాలతో ఆందోళనలో రైతాంగం వరికోతలు వాయిదా వేసుకోవాలని రైతులకు అధికారుల సూచన ఇప్పటికే కల్లాల్లో 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం. యుద్ద ప్రాతిపధికన ఆఫ్ లైన్ ద్వారా 16 వేల మెట్రిక్ ధాన్యం కొనుగోలు ఉప్పాడ జడ్పీ హై స్కూల్లో పునరావాస కేంద్రం ఏర్పాటు. హోప్ ఐలాండ్ మత్స్యకారుల తరలింపు. తుపాన్ పరిస్ధితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న కలెక్టర్ కృతికా శుక్లా తుపాన్ హెచ్చరికల నేపథ్యంలో కలెక్టరేట్‌తో పాటుగా కాకినాడ,పెద్దాపురం ఆర్డీవో కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు. కలెక్టరేట్.. 18004253077 కాకినాడ ఆర్డీవో కార్యాలయం 9701579666 పెద్దాపురం ఆర్డీవో కార్యాలయం 9949393805 నేడు కృష్ణా జిల్లాలో అన్ని పాఠశాలలకు సెలవు నేడు జరగాల్సిన సమ్మెటివ్ అసెస్మెంట్-1 పరీక్ష వాయిదా నేడు, రేపు ఎన్టీఆర్ జిల్లాలోని అన్ని పాఠశాలలకు సెలవు. తుపాను ఎఫెక్ట్ నేడు పలు రైళ్లు రద్దు.. తిరుపతి-చెన్నై, చెన్నై-తిరుపతి మధ్య రైలు సర్వీసులు రద్దు. Cancellation of Trains pic.twitter.com/JpRBLoj5Cx — South Central Railway (@SCRailwayIndia) December 4, 2023 Cancellation of Trains pic.twitter.com/JtoUYobINh — South Central Railway (@SCRailwayIndia) December 4, 2023 Diversion/Restoration of Trains pic.twitter.com/EgdyrWLBX7 — South Central Railway (@SCRailwayIndia) December 4, 2023 మిచౌంగ్ తుపాన్ కారణంగా తమిళనాడులో భారీ వర్షాలు.. రోడ్లపై భారీగా నిలిచిన వర్షపు నీరు వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు. #WATCH | Tamil Nadu | Heavy rainfall in Chennai causes massive waterlogging in parts of the city. Visuals from Vadapalani area of the city. pic.twitter.com/nBNE5oDW25 — ANI (@ANI) December 4, 2023 #WATCH | Tamil Nadu: Several parts of Chennai receive heavy rainfall as cyclone 'Michaung' approaches the coast. pic.twitter.com/SXeeGaCaH0 — ANI (@ANI) December 4, 2023 మిచౌంగ్ తుపాను హెచ్చరిక.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక నైరుతి బంగాళాఖాతంలో వాయువ్య దిశగా కదులుతున్న మిచౌంగ్ తుపాను గంటకు 13 కి.మీ వేగంతో కదులుతున్న తుపాన్ ప్రస్తుతానికి చెన్నైకి 150 కి.మీ, నెల్లూరుకు 250 కి.మీ, బాపట్లకు 360 కి.మీ, మచిలీపట్నానికి 380కి.మీ. దూరంలో కేంద్రీకృతం నేడు కోస్తా తీరానికి సమాంతరంగా పయనించనున్న తుపాన్ రేపు మధ్యాహ్నం నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీవ్రతుపానుగా తీరం దాటనున్న మిచౌంగ్ దీని ప్రభావంతో నేడు,రేపు కూడా కోస్తాంధ్రలో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, అక్కడక్కడ అతి భారీ వర్షాలు రాయలసీమలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు ఎల్లుండి ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు నమోదైయ్యే అవకాశం తీరం వెంబడి గంటకు 80 -100 కి.మీ సాయంత్రం నుంచి గంటకు 90-110 కి.మీల వేగంతో గాలులు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళరాదని హెచ్చరిక. #ChennaiRains to continue till noon #ChennaiRain#CycloneMichaung is 110 kms E-NE of #Chennai as it slowly moves North closer to the coasts of North Tamil Nadu & South Andhra Pradesh. North TN will see heavy rains till noon. Coastal AP will see heavy rains post late noon with… pic.twitter.com/N3IggzlHz6 — Karnataka Weather (@Bnglrweatherman) December 4, 2023 విజయవాడ: దక్షిణమధ్య రైల్వే హెల్ప్ డెస్క్.. మిచౌంగ్ తుపాన్ నేపధ్యంలో విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు 13 స్టేషన్లలో హెల్ప్ లైన్లు ఏర్పాటు ఒంగోలు - 08592-280306 కాకినాడ టౌన్ - 0884-2374227 తెనాలి - 08644-227600 గూడూరు - 08624-250795; 7815909300 నెల్లూరు - 0861-2345863 ఏలూరు - 08812-232267 బాపట్ల - 08643-222178 భీమవరం టౌన్ - 08816 230098 ;7815909402 సామర్లకోట - 0884-2327010 గుడివాడ - 08674-242454 విజయవాడ - 0866-2571244 తుని - 0885-4252172 రాజమండ్రి - 0883-2420541. విశాఖ, అనకాపల్లిలో సెలవు.. ►మిచౌంగ్ తుపాన్ కారణంగా విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో అని ప్రభుత్వ, ప్రైవేట్ పాటశాలలకు, జూనియర్ కాలేజీలకు ఈరోజు సెలవు ప్రకటించిన ప్రభుత్వం ►తుపాను నేపథ్యంలో విశాఖపట్నం పోర్టులో రెండో నంబరు, బందరు, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో మూడో నంబరు, కాకినాడ, గంగవరం పోర్టుల్లో నాలుగో నంబరు ప్రమాద హెచ్చరికలను జారీచేశారు. అలాగే.. సోమవారం దక్షిణ కోస్తాంధ్రలో కొన్నిచోట్ల, రాయలసీమలోని ఆగ్నేయ ప్రాంతంలోనూ అక్కడక్కడ ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం కూడా ఉందని ఐఎండీ హెచ్చరించింది. కృష్ణాజిల్లా మచిలీపట్నం, అవనిగడ్డ, గుంటూరు జిల్లా రేపల్లెలలో కడలి కెరటాలు భారీగా ఎగసిపడతాయని, 250 మీటర్ల దూరం వరకు సముద్రం ముందుకు రావచ్చని, ఫలితంగా అక్కడ లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశాలున్నాయని తెలిపింది. -
ప్రయాణికులకు అలర్ట్: మిచాంగ్ తుపాన్ ఎఫెక్ట్.. 142 రైళ్లు రద్దు
సాక్షి, హైదరాబాద్: మిచాంగ్ తుపాను నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే విభాగం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో దాదాపు 142 రైళ్లను రద్దు చేస్తున్నట్టు శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ నెల మూడో తేదీ నుంచి ఆరో తేదీ వరకూ ఈ రైలు సర్వీసులు రద్దు చేసినట్టు సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ చెప్పారు. వివరాల ప్రకారం.. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్ప పీడనం శుక్రవారం వాయుగుండంగా మారి.. ఆదివారానికి తుపానుగా బల పడనున్నది. ఈ తుఫాన్‌కు మిచౌంగ్ అని భారత వాతావరణ విభాగం పేర్కొంది. దీంతో ఆదివారం, సోమవారాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడింది. రేపటికి తుపానుగా మారే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఆ తర్వాత దక్షిణకోస్తా తీరానికి సమాంతరంగా పయనించనుందని, మంగళవారం మధ్యాహ్నం నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశముంది. Passengers Please Note: Cancellation of Trains in View of #CycloneMichaung pic.twitter.com/RjI1X4hXAg — South Central Railway (@SCRailwayIndia) December 2, 2023 ఈ నేపథ్యంలో రైల్వే ప్రయాణికులను దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) అలర్ట్ జారీ చేసింది. మిచాంగ్ తుపాన్ తీరాన్ని దాటనున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) పరిధిలో 142 రైళ్లు రద్దు చేశామని సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ చెప్పారు. ఈ నెల మూడో తేదీ నుంచి ఆరో తేదీ వరకూ ఈ రైలు సర్వీసులు రద్దు చేశామని, ప్రయాణికులు గమనించాలని కోరారు. మరికొన్ని రైళ్లు పాక్షికంగా రద్దు చేసినట్లు రాకేశ్ తెలిపారు. (3/3) Passengers Please Note: Cancellation of Trains in View of #CycloneMichaung pic.twitter.com/qKREufE9R1 — South Central Railway (@SCRailwayIndia) December 2, 2023 Cancellation / Partial Cancellation of Trains in View of #CycloneMichaung pic.twitter.com/LHKg9gExjD — South Central Railway (@SCRailwayIndia) December 2, 2023 -
అమెరికన్లకు చుక్కలు చూపిస్తున్న బాంబ్ సైక్లోన్.. భయానక వీడియోలు ఇవే..
Bomb Cyclone.. అగ్రరాజ్యం అమెరికా.. బాంబ్ సైక్లోన్ ధాటికి వణికిపోతోంది. మంచు తుఫాన్ కారణంగా దాదాపు 13 రాష్ట్రాల్లో అమెరికన్లు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇళ్లలో నుంచి బయట అడ్డుగుపెట్టలేని పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు.. మంచు తుఫాన్ క్రిస్మన్ పండుగపై కూడా ఎఫెక్ట్ చూపించింది. తుఫాను కారణంగా పండుగ వేళ దేశ వ్యాప్తంగా దాదాపు 5,700 విమానాలను అధికారులు రద్దు చేశారు. పలు చోట్ల రోడ్లపై మంచు పేరుకుపోవడంతో రోడ్డు మార్గాలను మూసివేశారు. At least 17 people have died across eight states as a "bomb cyclone" winter storm grips the US, officials say. pic.twitter.com/649fv36k2m — DW News (@dwnews) December 24, 2022 దీంతో, క్రిస్మస్ సందర్భంగా ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశంలోని 60 శాతం మందిపై ఈ మంచు తుఫాను ప్రభావం పడింది. అమెరికా లెక్కల ప్రకారం.. మంచు తుఫాన్ కారణంగా ఇప్పటికే 18 మంది మృతిచెందారు. మంచుతుఫాన్ కారణంగా ఉష్ణోగ్రతలు మైనస్ 45 డిగ్రీలకు పడిపోవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మరిగే నీటిని సైతం గాల్లోకి విసిరితే సెకన్ల కాలంలో ఆ నీరు మంచులా మారిపోతోంది. కాగా, అమెరికా మంచు తుఫాను ధాటికి వాహనాలు కూడా రోడ్డుపై జారుకుంటూ వెళ్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. And this is WHY I stayed home today. I also live on a hill and no matter how much they sand, it’s too unsafe. Stay safe out there. #icestorm #WinterStorm pic.twitter.com/rzTE3nshwY — Kento Ito (@alchemistmuffin) December 24, 2022 Break the screen guard 🥶 #WinterStorm #Elliott #Hampton #ColdWave #Virginia #BombCyclone #Snow #Storm #Blizzard #Viral #Weather #Climate #Winter #GlobalWarming #ArcticBlast #USA #VAwx Snowy #carcrashes & #bus #crash in #USA from #December 2022 #severeweather pic.twitter.com/je7cIUv7yp — kartik (@manishh_2) December 24, 2022 బాంబ్ సైక్లోన్ అంటే.. బాంబ్ సైక్లోన్ అనేది మధ్య-అక్షాంశ తుపాను. దీనిలో కేంద్ర పీడనం గంటకు ఒక మిల్లీబార్ వద్ద కనీసం 24 గంటల పాటు వేగంగా పడిపోతుంటుంది. అయితే, తుపాను ఎక్కడ ఏర్పడుతుందనే అనే దాని ఆధారంగా మిల్లీబార్ రీడింగులు మారే అవకాశం ఉంటుంది. వాయు పీడనం అనేది వాతావరణం యొక్క బరువు ద్వారా ప్రయోగించే శక్తిని కొలవడం. ఈ పీడనం ఎంత తక్కువగా ఉంటే తుపాను అంత బలంగా ఉంటుందన్న మాట. బాంబు తుపాన్ ఎలా ఏర్పడుతుందంటే.. వివిధరకాల వాయు ద్రవ్యరాశి (చల్లని, పొడి) గాల్లో కలిసినప్పుడు. వెచ్చని గాలి పెరిగేకొద్దీ, అది గాలి ఒత్తిడిని తగ్గించే క్లౌడ్ వ్యవస్థను సృష్టిస్తుంది. అల్పపీడన ప్రాంతం చుట్టూ అపసవ్య దిశలో ప్రసరించే తుఫానుగా ఏర్పడుతుంది. A "bomb cyclone" winter storm is threatening travel plans — and lives — ahead of the holiday weekend. More than 1 million people across the U.S. have lost power as the storm is reaching the East Coast on Friday. https://t.co/3Z8Wk02HLb pic.twitter.com/zUAfipK3lo — The New York Times (@nytimes) December 23, 2022 జనావాసాలపై బాంబ్ సైక్లోన్ ప్రభావం ఊహించని రీతిలో ఉంటుంది. మనుషుల ప్రాణాలు తీయడంతో పాటు ఆస్తి నష్టం కూడా భారీగానే ఉంటుంది. గట్టిగా గాలి పీల్చినా.. మాట్లాడినా సరే ఆ చలికి తెమడ పట్టేసి.. ప్రాణాల మీదకు తీసుకొస్తుంది. -
AP: శరవేగంగా సాయం.. 99 మండలాల్లో భారీ వర్షాల ప్రభావం..
సాక్షి, అమరావతి, నెట్వర్క్: మాండూస్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు శరవేగంగా కొనసాగుతున్నాయి. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లోని 99 మండలాల్లో 416 గ్రామాలు వర్షాల ప్రభావానికి గురయ్యాయి. నెల్లూరు జిల్లాలోని పునరావాస కేంద్రాల్లో 208 మంది, చిత్తూరు జిల్లాలో 416 మంది, తిరుపతి జిల్లాలోని కేంద్రాల్లో 571 మంది మొత్తం 1,195 మందికి ఆశ్రయమిచ్చి భోజన సదుపాయాలు కల్పించారు. ఇళ్లకు తిరిగి వెళుతున్న బాధితులకు రూ.2 వేల చొప్పున సాయాన్ని అందిస్తున్నారు. పారిశుధ్య చర్యలు చేపట్టి అంటువ్యాధులు ప్రబలకుండా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు పంట, ఆస్తి నష్టాలను ఆయా శాఖలు అంచనా వేసే పనిలో నిమగ్నమయ్యాయి. వదలని వర్షాలు.. తుపాన్ ప్రభావిత జిల్లాల్లో వర్షాలు ఇంకా కురుస్తూనే ఉన్నాయి. ఆదివారం ఉదయం 8.30 నుంచి సోమవారం ఉదయం 8.30 గంటల వరకు నెల్లూరు జిల్లా ఉలవపాడులో అత్యధికంగా 12.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. విశాఖ జిల్లా భీమునిపట్నంలో 10.2 సెంటీమీటర్లు, నెల్లూరు జిల్లా కందుకూరులో 9.8, విశాఖ జిల్లా భీమిలిలో 9.4, ప్రకాశం జిల్లా జరుగుమిల్లిలో 8.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సోమవారం ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు అన్నమయ్య జిల్లా కురబలకోటలో 7 సెంటీమీటర్ల వర్షం పడింది. 1,267 బృందాలు తుపాన్ ప్రభావిత గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణతో పాటు రోడ్లపై నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టేందుకు పంచాయతీరాజ్ శాఖ 1,267 బృందాలను సిద్ధం చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది సోమవారం శాఖ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. మురుగు కాల్వలలో పూడిక తొలగింపు పనులను వెంటనే చేపట్టాలని సూచించారు. 21 కల్లా నష్టం లెక్కలు మాండూస్ తుపాన్ వల్ల జరిగిన పంట నష్టం లెక్కింపు ప్రక్రియను ఈ నెల 21వ తేదీకల్లా పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ చేవూరు హరికిరణ్ అధికారులకు సూచించారు. పంట నష్టం జాబితాలను సామాజిక తనిఖీల కోసం 26 కల్లా పూర్తి చేసి డిసెంబర్ 27న ఈ – క్రాప్ ప్రాతిపదికన తుది జాబితాలను సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. తుపాన్ వల్ల రబీ సీజన్లో దెబ్బ తిన్న పంటల స్థానంలో రెండోసారి విత్తుకునేందుకు వీలుగా ప్రతిపాదనలను రెండు రోజుల్లో పంపాలని అధికారులకు సూచించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మల్లిమడుగు, కాళంగి, అరిణియార్, ఎన్టీఆర్ జలాశయాలు పూర్తిస్థాయిలో నిండిపోవటంతో గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. అత్యధికంగా సోమల మండలంలో 37.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తిరుపతి జిల్లా వ్యాప్తంగా 2,650 చెరువులు ఉండగా 90 శాతం పూర్తిగా నిండిపోయాయి. రాష్ట్రంలోనే అతిపెద్ద చెరువైన తొండమనాడు చెరువు కలుజు పారుతోంది. 10,500 హెక్టార్లలో వివిధ పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు పేర్కొన్నారు. చిల్లకూరు మండలం పాలెం గ్రామానికి చెందిన కిడ్నీ బాధితుడు వ్యాధిగ్రస్తుడు ప్రదీప్ నాయుడు ఆక్వా గుంత వద్ద చిక్కుకోవడంతో రెస్క్యూటీం పడవ ద్వారా చేరుకుని రక్షించింది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సోమశిల జలాశయానికి సోమవారం సాయంత్రానికి 26 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. -
మాండూస్ ఎఫెక్ట్: కుండపోత వర్షాలు.. ఆరు జిల్లాల్లో తీవ్ర ప్రభావం
Cyclone Mandous Andhra Pradesh Updates ప్రకాశం జిల్లా: సముద్రంలో చిక్కుకున్న 7 గురు మత్స్యకారులు కొత్తపట్నం వద్ద సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. ఈ నెల 4 తేదీన చీరాల ఓడరేవు మత్స్యకారులు సముద్రం వేటకు వెళ్లారు. తుపాను ఉధృతికి సముద్రంలొనే చిక్కుకుపోయారు. జిల్లాలో రాత్రంతా ఎడతెరిపిలేని వర్షం కురవగా, ఈ రోజు ఉదయం నుండి కొద్దిగా తగ్గుముఖం పట్టింది. జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. బైరవకొన జలపాతం ఉరకలేస్తుంది. భారీ వర్షాలతో శనగ, పొగాకు రైతులు ఆందోళనలో ఉన్నారు. తిరుపతి: పోటెత్తిన వరద నీరు స్వర్ణముఖి నదికి వరద నీరు పోటెత్తింది. ఏర్పేడు మండలం పాపానాయుడు పేట వద్ద స్వర్ణముఖి నది ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో నదికి అవతల వైపు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మల్లేమడుగు రిజర్వాయర్ 12 గేట్లను ఎత్తివేసి స్వర్ణ ముఖి నదిలో దిగువకు నీరు విడుదల చేశారు. సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: మాండూస్ తుపాను రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో తీవ్ర ప్రభావాన్ని చూపింది. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కుండపోతగా.. అన్నమయ్య, చిత్తూరు, ప్రకాశం, వైఎస్సార్ జిల్లాల్లో భారీగా వర్షం కురుస్తోంది. మిగతా జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు పడుతున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి కురుస్తున్న కుండపోత, భారీ వర్షాలకు ఆయా ప్రాంతాల్లోని పట్టణాలు, గ్రామాల్లో వర్షపు నీరు మోకాలి లోతున ప్రవహిస్తోంది. పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. తిరుపతి, తిరుమలలో జనజీవనం స్తంభించింది. తిరుపతి జిల్లాలో నాయుడుపేట, బాలాయపల్లె, ఓజిలి, శ్రీకాళహస్తి, తొట్టెంబేడు, తిరుపతి, వాకాడు, చిల్లకూరు, నెల్లూరు జిల్లాలో ముత్తుకూరు, ఆత్మకూరు, కలువోయ, అనంతసాగరం, మర్రిపాడు, అనుమసముద్రంపేట, మనుబోలు, ముత్తుకూరు, వెంకటాచలం, తదితర ప్రాంతాల్లో జనం పూర్తిగా ఇళ్లకే పరిమితమయ్యారు. తుపాను ప్రభావంతో రాష్ట్రమంతటా చలి గాలులు వీస్తున్నాయి. భారీ వర్షాలకు ఇంటి గోడ కూలి వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్టలో కే పద్మావతి అనే మహిళ మృతి చెందింది. సురక్షిత ప్రాంతాలకు తరలింపు ఆరు జిల్లాల్లోని 32 మండలాల్లో తుపాను తీవ్ర ప్రభావం చూపింది. ఈ జిల్లాల్లో ప్రమాదకరమైన లోతట్టు ప్రాంతాల నుంచి అధికార యంత్రాంగం 708 మందిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వర్షాల తీవ్రత ఎక్కువగా ఉన్న నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో 33 సహాయక శిబిరాలు ఏర్పాటు చేశారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి పూర్తి స్థాయిలో ఆహారపు ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు అందించారు. ఆయా జిల్లాల్లో 4 ఎస్డీఆర్ఎఫ్, 5 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. లోతట్లు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారిని సురక్షిత ప్రాంతాలకు చేర్చడంలో ఈ బృందాలు చురుగ్గా పని చేస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కండలేరు, మానేరు, స్వర్ణముఖి నదులకు ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందనే హెచ్చరికలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. నదీ తీర ప్రాంతాల్లో ముందస్తు సహాయక చర్యలు చేపట్టింది. వాయుగుండంగా బలహీనపడిన తుపాను మాండూస్ తుపాను శుక్రవారం అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో తమిళనాడులోని మహాబలిపురం సమీపంలో తీరం దాటింది. ఆ తర్వాత తమిళనాడులోని వెల్లూరు వైపు కదులుతూ తీవ్ర వాయుగుండంగా, శనివారం సాయంత్రానికి వాయుగుండంగా బలహీన పడింది. రాబోయే కొద్ది గంటల్లో ఇది క్రమేపీ బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తుపాను తీరం దాటిన తర్వాత దాని ప్రభావంతో మన రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆది, సోమవారాల్లో కూడా పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. చలి గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. ముందు జాగ్రత్తతో తగ్గిన నష్టం తీవ్రత మాండూస్ తుపాను అల్పపీడనంగా బలహీన పడినా, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ముందస్తుగా ప్రత్యేక చర్యలు తీసుకున్నాం. స్టేట్ ఎమర్జన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి ఎప్పటికప్పుడు ఆయా ప్రాంతాల్లో పరిస్థితిపై ఆరా తీస్తున్నాం. సంబంధిత జిల్లాల కలెక్టర్లకు తగిన సూచనలు ఇస్తున్నాం. అధికార యంత్రాంగం 24 గంటలు పని చేస్తూ సత్వరమే స్పందించేలా ఏర్పాట్లు చేశాం. ప్రమాదాలను స్పష్టంగా అంచనా వేస్తూ.. అందుకనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాం. అందువల్లే నష్ట తీవ్రతను బాగా తగ్గించ గలిగాం. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులను వెనక్కి పిలిపించాం. – జి సాయిప్రసాద్, రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శుక్రవారం ఉ.8.30 గంటల నుంచి శనివారం ఉ.8.30 వరకు వర్షపాతం ప్రదేశం సెంటీమీటర్లలో నాయుడుపేట, తిరుపతి జిల్లా 28.1 హస్తకావేరి, తిరుపతి జిల్లా 24.1 కట్టవపల్లె, నెల్లూరు జిల్లా 23.8 అరిమనిపాడు, తిరుపతి జిల్లా 23.4 బ్రహ్మదేవం, నెల్లూరు జిల్లా 22.2 వెంకటాచలం, నెల్లూరు జిల్లా 21.5 శ్రీకాళహస్తి, తిరుపతి జిల్లా 21.3 పాలూరు, నెల్లూరు జిల్లా 21.2 విద్యానగర్, తిరుపతి జిల్లా 21 తొట్టెంబేడు, తిరుపతి జిల్లా 20.9 శనివారం ఉ.8.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు నమోదైన వర్షపాతం ప్రదేశం సెంటీమీటర్లలో భట్టేపాడు, నెల్లూరు జిల్లా 13.3 బల్లిపల్లి, ప్రకాశం జిల్లా 11.9 పెదచెర్లోపల్లి, ప్రకాశం జిల్లా 11.6 చీపినపి, నెల్లూరు జిల్లా 11.1 మోపిదేవి, కృష్ణా జిల్లా 9.4 ఆత్మకూరు, నెల్లూరు జిల్లా 8.9 రేవూరు, నెల్లూరు జిల్లా 8.8 వాసిలి, నెల్లూరు జిల్లా 8.8 మర్రిపాడు, నెల్లూరు జిల్లా 8.4 పాకల, ప్రకాశం జిల్లా 8.2 తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో స్తంభించిన రాకపోకలు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. జలాశయాలకు భారీగా నీరు చేరుతుండటంతో గేట్లు ఎత్తి నీటిని వదిలారు. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తిరుపతి నగరంలో లోతట్టు ప్రాంతాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. తిరుమలను పొగ మంచు చుట్టుముట్టింది. ఘాట్ రోడ్డులో వాహన దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాకపోకలు స్తంభించాయి. అలిపిరి వద్ద భారీ ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. శ్రీవారిమెట్టు కాలినడక మార్గాన్ని అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. తిరుపతి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, బియ్యపు మధుసూదన్‌రెడ్డి సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కెవీబీ పురం మండల పరిధిలోని కాళంగి రిజర్వాయర్ పూర్తిగా నిండిపోవటంతో 16 గేట్లు ఎత్తి నీటిని విడిచిపెట్టారు. ఫలితంగా 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద ప్రవాహానికి పూడి, పోలినాయుడు కండ్రిగ, రాజులకండ్రిగ కాజ్ వే లు కొట్టుకుపోయాయి. పిచ్చాటూరు పరిధిలోని అరణియార్ రిజర్వాయర్, పెనుమూరు మండల పరిధిలోని ఎన్టీఆర్ జలాశయానికి భారీగా నీరు చేరుతుండటంతో గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. స్వర్ణముఖి, కుశస్థలి, నీవా, అరుణానది, కైవల్యా, కాళంగి, బహుదా, కౌండిన్య, గార్గేయ నదులు, గొడ్డేరు వాగు, పాములకాలువ, నేరేడు కాలువ, ఉప్పుటేరు, అలపలేరు వాగు, బడబళ్లు వాగు, ఏటి చెరువు, పెద్దేరు పొంగి ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తుపాను తీవ్రతకు జిల్లాలో పది పశువులు మృతి చెందాయి. వందకుపైగా విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. రైల్వేకోడూరు–తిరుపతి రహదారిపైకి వరద నీరు అన్నమయ్య జిల్లాలోని రైల్వేకోడూరు, పుల్లంపేట మండలాల పరిధిలో సుమారు 20 గ్రామాలకుపైగా రాకపోకలు స్తంభించాయి. అరటి, బొప్పాయి తోటల్లోకి నీరు చేరింది. రైల్వేకోడూరు–తిరుపతి ప్రధాన రహదారిపై వరద నీరు పోటెత్తింది. నిమ్మనపల్లె వద్ద ఉన్న బాహుదా ప్రాజెక్టుతోపాటు గాలివీడు పరిధిలోని వెలిగల్లు ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో గేట్లు ఎత్తి దిగువకు రెండు ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. వైఎస్సార్ జిల్లాలోనూ పలు చోట్ల పొలాల్లో వర్షపు నీరు నిలిచింది. గండికోట ప్రాజెక్టు నుంచి మైలవరం డ్యామ్‌కు 4 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. మైలవరం డ్యామ్ నుంచి 3 వేల క్యూసెక్కులను పెన్నానదిలోకి వదిలారు. చిత్రవతి రిజర్వాయర్ నుంచి 2 గేట్లు ఎత్తి 2400 క్యాసెక్కుల నీటికి నదిలోకి వదులుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. అత్యధికంగా మనుబోలు మండలంలో 277 మి.మీ. వర్షం కురిసింది. బొగ్గేరు, పైడేరు, ఆల్తుర్తి, బీరాపేరులో నీటి ప్రవాహం పెరిగింది. సోమశిల ప్రాజెక్ట్‌కు వరద నీరు పెద్ద ఎత్తున చేరుతోంది. దీంతో 35 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. లోతట్లు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పలు ప్రాంతాల్లో పొలా నీట మునిగాయి. నెల్లూరులోని ఆర్టీసీ కాలనీ, వైఎస్సార్ నగర్, బుచ్చిరెడ్డిపాళెం తదితర ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. – ప్రకాశం జిల్లా వ్యాప్తంగా శనివారం రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. ఐదు మండలాల పరిధిలో 57 గ్రామాల్లోని పొలాల్లో నీరు నిలిచింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదైంది. జడివానకు తోడు ఈదురు గాలులు జనాన్ని వణికించాయి. పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు లాంటి శుభాకార్యాలు ఎక్కువగా ఉండటంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. కాగా, రబీ సాగుకు ఈ వర్షాలు ఊరటనిస్తాయని చెబుతున్నారు. రవాణాకు ఇబ్బంది కలగనివ్వం మాండూస్ తుపాను వల్ల వివిధ జిల్లాల్లో పంచాయతీరాజ్ రోడ్లకు జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలను ఎప్పడికప్పుడు తెలియజేయాలని పీఆర్ ఇంజనీర్ ఇన్ చీఫ్ బాలునాయక్ ఆదేశించారు. శనివారం కర్నూలు వచ్చిన ఆయన స్థానిక జెడ్పీ ప్రాంగణంలోని పీఆర్ ఎస్ఈ కార్యాలయం నుంచి చిత్తూరు, తిరుపతి, వైఎస్సార్, అన్నమయ్య, ప్రకాశం, నెల్లూరు, కృష్ణా, గుంటూరు జిల్లాల ఎస్ఈలతో వెబె కాన్ఫరెన్స్ నిర్వహించారు. రోడ్లు దెబ్బతిన్న ప్రాంతాల్లో ప్రజల రవాణా సౌకర్యానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు. తుపాను తగ్గిన అనంతరం జరిగిన నష్టానికి సంబంధించి పూర్తి స్థాయి నివేదికలను పంపాలన్నారు. ఏ ఒక్క రైతునూ నష్టపోనివ్వం : మంత్రి కారుమూరి తణుకు అర్బన్: మాండూస్ తుపాను కారణంగా పంట తడిసినా కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రైతాంగానికి ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని తక్షణమే ఆఫ్‌లైన్ ద్వారా సేకరిస్తామని స్పష్టం చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రతి గింజనూ సత్వరమే కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని సిద్ధం చేశామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పటికే రైతాంగానికి అనుకూలంగా అధికారులకు ఆదేశాలిచ్చారని చెప్పారు. ఏ ఒక్క రైతూ నష్టపోకుండా చూడాలనే తపనతో తమ ప్రభుత్వం ఉందని తెలిపారు. -
భయపెడుతున్న తుఫాన్ సిత్రాంగ్.. దిశ మార్చుకుంటూ దడ పుట్టిస్తోంది!
భువనేశ్వర్: సిత్రాంగ్ తుపాను హెచ్చరికలు సర్వత్రా ఆందోళన కలిగిస్తున్నాయి. తుఫాన్ బంగాళాఖాతంలో క్షణక్షణం దిశను మార్చుకుంటూ తీరప్రాంత ప్రజలను కలవరపాటుకు గురి చేస్తోంది. తుఫాన్ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల గుండా తీరం దాటుతుందనే ముందస్తు సంకేతాలతో బిక్కుబిక్కుమంటున్నారు. అక్టోబరు నెలలో పలు తుపానులు ఇప్పటికే ఇక్కడి ప్రజల గుండెల్లో దడ పుట్టించాయి. ఈ భయంతోనే సిత్రాంగ్ తుపాను ఎటువంటి బీభత్సం సృష్టిస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. దీనిపై విపత్తు నిర్వహణ యంత్రాంగం సకాలంలో స్పందించేందుకు వాతావరణ విభాగం అనుక్షణం తాజా సమాచారం ముందస్తుగా జారీ చేస్తుంది. ప్రజలు భయపడి ఆందోళన చెందాల్సిందేమీ లేదని పేర్కొంటోంది. తుపాను ముఖచిత్రం ఇంకా స్పష్టం కానందున సిత్రాంగ్ తుపాను ఎక్కడ తీరం దాటుతుందో స్పష్టం కాలేదని భారతీయ వాతావరణ విభాగం డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ మహాపాత్రో తెలియజేశారు. ఇదిలాఉండగా ఈనెల 25వ తేదీ నాటికి సిత్రాంగ్ తుపాను పశ్చిమ బెంగాల్ దిఘా ప్రాంతంలో తీరం దాటుతుందని అమెరికా గ్లోబల్ ఫోర్కాస్ట్ సిస్టమ్ జీఎఫ్ఎస్ మంగళవారం ముందస్తు సమాచారం ప్రసారం చేసింది. యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్ట్ (ఈసీఎండబ్ల్యూఎఫ్) సంస్థ సిత్రాంగ్ తుపాను రాష్ట్రంలో బాలాసోర్ ప్రాంతంలో తీరం దాటుతుందని వెల్లడించింది. అత్యవసర సమావేశం విపత్తు నిర్వహణ విభాగం సిత్రాంగ్ తుపాను తీవ్రత నేపథ్యంలో అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. ఈనెల 22వ తేదీ తర్వాత ఏ క్షణంలోనైనా తుపాను తీరం దాటే సంకేతాలు క్రమంగా బలపడుతున్నట్లు ప్రాంతీయ వాతావరణ విభాగం తెలిపింది. ఈనెల 23వ తేదీ లేదా 24వ తేదీ నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపాను ఖరారు అయ్యే సంకేతాలను ఈ కేంద్రం జారీ చేసింది. దక్షిణ అండమాన్ సముద్రం, పరిసర ప్రాంతాల్లో సోమవారం ఏర్పడిన వాయుగుండం (సైక్లోనిక్ సర్క్యులేషన్) మంగళవారం నాటికి ఘనీభవించింది. ప్రస్తుతం ఉత్తర అండమాన్ సముద్రం, పరిసర ప్రాంతాల్లో తాండవిస్తుంది. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుంది. ఫలితంగా రాష్ట్రంలో కొన్నిచోట్ల ఈనెల 23వ తేదీ వరకు వర్షం కురుస్తుంది. ఈనెల 23 లేదా 24వ తేదీ నాటికి ఈ వాతావరణం తుపానుగా పరిణతి చెందుతుందని భారతీయ వాతావరణ విభాగం డైరెక్టర్ జనరల్ డాక్టరు మృత్యుంజయ మహాపాత్రో వెల్లడించారు. ప్రస్తుతానికి అల్ప పీడన ప్రాంతం స్పష్టం కానందున తుపాను తీవ్రత, తీరం దాటే ప్రాంతం వివరాలు ధ్రువీకరించడం సాధ్యం కాదని ఆయన వివరించారు. తుపాను కదలికపై అనుక్షణం నిఘా వేసి ఉన్నట్లు తెలిపారు. క్రమంగా తుపాను వాతావరణం బలపడుతున్నందున గాలుల వేగం పుంజుకుంటుంది. ఈనెల 22వ తేదీ నుంచి పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో గంటకు 45 కిలో మీటర్ల నుంచి 55 కిలో మీటర్ల వేగంతో వీచే గాలుల తీవ్రత గంటకు 65 కిలో మీటర్ల వేగం పుంజుకునే అవకాశం ఉందని తెలిపారు. సమావేశం నిర్వహణ బెంబేలెత్తిస్తున్న సిత్రాంగ్ తుపాను హెచ్చరికల నేపథ్యంలో విపత్తు నిర్వహణ యంత్రాంగం మంగళవారం అత్యవసర సమావేశం నిర్వహించింది. ప్రత్యేక సహాయ కమిషనర్ ఇన్చార్జి సత్యవ్రత సాహు ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. తుపాను తాకిడి ప్రతిపాదిత తీర ప్రాంతాల జిల్లా కలెక్టర్లు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించినట్లు ఒడిశా రాష్ట్ర విపత్తు నిర్వహణ వర్గం ఓస్డమా కార్య నిర్వాహక అధికారి జ్ఞానదాస్ తెలిపారు. దక్షిణ అండమాన్ సాగరం, పరిసర ప్రాంతాల్లో సోమవారం ఆవిర్భవించిన వాయుగుండం రానున్న 48 గంటల్లో మరింత ఘనీభవించి బుధవారం లేదా గురువారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడన క్షేత్రం స్పష్టమయ్యే సంకేతాలు బలపడుతున్నట్లు వాతావరణ విభాగం ముందస్తు సమాచారం జారీ చేసిందని జ్ఞానదాస్ వివరించారు. అల్పపీడనం క్రమంగా బలపడుతూ పశ్చిమ కేంద్రీయ, కేంద్ర బంగాళాఖాతం గుండా కదలిక పుంజుకుంటుంది. దీని ప్రభావంతో ఈనెల 21వ తేదీ నుంచి రాష్ట్రంలో వానలు ప్రారంభమవుతాయన్నారు. ఈ నెల 22 లేదా 23వ తేదీ నాటికి అల్పపీడనం తుపాను రూపురేఖలు స్పష్టం అవుతాయని పేర్కొన్నారు. అల్పపీడనం స్పష్టమైతే తప్ప తుపాను తాకిడి, తీవ్రత వివరాలను అంచనా వేయడం అసాధ్యమని వివరించారు. #Rains_thunderStorm_winds activities.. The Latest Updates many version says Probably, if the formation of #Sitrang completed...the cyclone come up #UTurn based perpendicular "Yaas"way Bengal way 23 Oct/3 pm to 26 Oct 7am a #touftimes direction #SWtoNE. pic.twitter.com/QsyrdYCcWo — EverythingIND20 (@EverythingIND20) October 19, 2022 -
ఉత్తరాంధ్రకు తుపాను గండం.. సీఎం జగన్ సమీక్ష
సాక్షి, అమరావతి: ఉత్తరాంధ్రకు ‘జావద్’ తుపాన్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టర్లు, సీఎంఓ అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో గురువారం జరిగిన ఈ సమీక్షలో.. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను దేశించారు. అవసరమైన చోట్ల సహాయ శిబిరాలు తెరిచేందుకు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసుకోవాలని నిర్దేశించారు. లోతట్టు, ముంపు ప్రాంతాలు ఉంటే అప్రమత్తంగా ఉండాలని అన్నారు. తుపాన్ వల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితుల వల్ల ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా చూడాలని సీఎం ఆదేశించారు. మరోవైపు ఉత్తరాంధ్రలో తుపాన్ సహాయ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే బాధ్యతను ముగ్గురు సీనియర్ అధికారులకు అప్పగించారు. శ్రీకాకుళం జిల్లాకు హెచ్.అరుణ్‌కుమార్, విజయనగరం జిల్లాకు కాంతిలాల్‌దండే, విశాఖ జిల్లాలకు శ్యామలరావును నియమించారు. వారు వెంటనే ఆయా జిల్లాలకు చేరుకుని తుపాన్ సహాయ కార్యక్రమాల సమన్వయ, పర్యవేక్షక బాధ్యతలు స్వీకరించాలని సీఎం జగన్ ఆదేశించారు. చదవండి: సీఎంను కలిసిన పాణ్యం ఎమ్మెల్యే.. కుమారుడి వివాహానికి ఆహ్వానం కాగా దక్షిణ థాయ్‌లాండ్ పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడింది. ఇది అండమాన్ సముద్రం పరిసరాల్లోకి ప్రవేశించి, ఆ తరువాత పశ్చిమ వాయవ్యంగా పయనించి గురువారానికి వాయుగుండంగా మారి ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుంది. ఆ తరువాత 24గంటల్లో(శుక్రవారం) వాయవ్యంగా పయనించి తుఫాన్‌గా మారనుంది. తుఫాను శనివారం ఉదయానికి ఉత్తరాంధ్ర తీరం దిశగా రానుంది. మూడో తేదీ నుంచి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, దక్షిణ ఒడిశాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. దీనికి ‘జావద్’ అని నామకరణం చేశారు. -
ఒమన్‌లో తుఫాను బీభత్సం.. టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లపై ప్రభావం..!
Cyclone Shaheen Almost Forced Oman To Wave Goodbye To T20 World Cup: టీ20 ప్రపంచ కప్‌కు ఆతిధ్య దేశమైన ఒమన్‌లో షహీన్ తుఫాను బీభత్సం సృష్టించింది. వేగవంతమైన గాలులు, అతి భారీ వర్షాల కారణంగా దేశ రాజధాని మస్కట్ సహా చుట్టు పక్క ప్రాంతాల్లో వరదలు సంభవించాయి. ఈ ప్రభావం ఇక్కడ జరగాల్సిన ప్రపంచకప్ మ్యాచ్‌లపై పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తుఫాను నేపథ్యంలో క్వాలిఫయర్స్ (శ్రీలంక, ఐర్లాండ్, పపువా న్యూగినియా, ఒమన్, బంగ్లాదేశ్, నమీబియా, నెదర్లాండ్స్, స్కాట్లాండ్) జట్ల మధ్య జరగాల్సిన 6 రౌండ్-1 మ్యాచ్‌ల టికెట్ల అమ్మకాలను ఐసీసీ తాత్కాలికంగా నిలిపేసింది. మరోవైపు యూఏఈలోని దుబాయ్, షార్జా, అబుదాబి స్టేడియాల్లో జరగనున్న మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్ల అమ్మకం యధావిధిగా కొనసాగుతోంది. ఇదిలా ఉంటే, క్వాలిఫయర్స్ జట్ల మధ్య రౌండ్-1 మ్యాచ్‌లు అక్టోబర్ 17 నుంచి ప్రారంభంకానున్నాయి. శ్రీలంక, ఐర్లాండ్ జట్లు టోర్నీ ప్రారంభ మ్యాచ్‌లో తలపడనున్నాయి. కరోనా నేపథ్యంలో ఒమన్ ప్రభుత్వం 70 శాతం మంది ప్రేక్షకులకు మాత్రమే అనుమతి ఇచ్చింది. అయితే తప్పనిసరిగా రెండు డోస్‌ల వ్యాక్సిన్ వేసుకున్న వారికి మాత్రమే స్టేడియాల్లోకి అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. కాగా, మేజర్ జట్ల మధ్య సూపర్ 12 స్టేజ్ మ్యాచ్‌లు అక్టోబర్ 23 నుంచి ప్రారంభమవుతాయి. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మ్యాచ్‌తో రసవత్తర పోరు మొదలవుతుంది. ఈ టోర్నీలో టీమిండియా లీగ్ దశలో తలపడబోయే మ్యాచ్‌ల విషయానికొస్తే.. అక్టోబర్ 24న పాక్‌తో, అక్టోబర్ 31న న్యూజిలాండ్‌తో, నవంబర్ 3న అఫ్గానిస్తాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లన్నీ భారతకాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతాయి. చదవండి: ధోని ఫ్యాన్స్‌కు శుభవార్త.. ఫేర్వెల్ గేమ్ అక్కడే..! -
నివర్ ఎఫెక్ట్: ఏపీలో కుండపోత వర్షాలు
సాక్షి, నెల్లూరు: బంగాళాఖాతంలో ఏర్పడిన నివర్ తుపాను కారణంగా జిల్లాలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. కోట, వాకాడు, చిట్టుమూడు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్ష ప్రభావంతో రహదారులపై చెట్లు విరిగిపడటంతో పలుచోట్ల విద్యుత్ సరాఫరాకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలతో చెరువులన్ని నిండుకుండను తలపిస్తున్నాయి. ఈ క్రమంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ జిల్లా ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నివర్ తుఫాన్ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. చదవండి: తీవ్రరూపం దాల్చిన నివర్ తుఫాన్ అతి తీవ్ర తుఫానుగా మారనున్న నివర్ నైరుతి బంగాళాఖాతంలో నివర్ తుపాను ప్రభావం కొనసాగుతుంది. కడలూరుకు తూర్పు ఆగ్నేయ దిశగా 180 కిలోమీటర్లు దూరంలో పుదుచ్చేరికి 190 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. చెన్నైకి 250 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. తీవ్ర తుపానుగా కొనసాగుతున్న నివర్ మరికొన్ని గంటల్లో అతి తీవ్ర తుఫానుగా మారే అవకాశం కనిపిస్తోంది. గంటకు 11 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న తుపాను కరైకల్- మహాబలిపురం మధ్య ఈ అర్థరాత్రి లేదా రేపు ఉదయం తీరం దాటే సూచనలు కనిపిస్తున్నాయి. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 120 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. తుఫాన్ ఈ అర్ధ రాత్రి లేదా రేపు తెల్లవారుజామున తీరం దాటే అవకాశం ఉంది. చదవండి:నివర్ తుపాను.. అప్రమత్తంగా ఉందాం సాక్షి, వైఎస్సార్ కడప : నివర్ తుపాను వల్ల తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై ఎస్పీ కార్యాలయ ఆవరణంలో ట్రయిల్ రన్ ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ అన్బు రాజన్ ఆదేశాల మేరకు 'నివర్' తుపానును ఎదుర్కొనేందుకు ప్రత్యేక పోలీసు బలగాలు ఏర్పాటు చేశారు. జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో సంసిద్ధంగా మూడు ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేశారు. ప్రతి పోలీస్ సబ్ డివిజన్లో ఒక రెస్క్యూ బృందం ఏర్పాటు చేసినట్లు, బృందాలకు అవసరమైన అత్యవసర లైటింగ్ సామాగ్రి, లైఫ్ జాకెట్లు, టార్చ్ లైట్లు, తాళ్లను ఏఆర్ పోలీసు అధికారులు అందజేశారు. (చదవండి: తిరుమలపై ‘నివర్’ ప్రభావం) సాక్షి, చిత్తూరు : నివర్ తుపాను ప్రభావం జిల్లాపై కూడా ఉండటంతో జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో రెండు రోజులు సెలవులు ప్రకటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఈదురు గాలులతోపాటు బారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. దాదాపు 68 చెరువుల వద్ద అధికారులను అలెర్ట్ చేశామన్నారు. 16 సమస్యాత్మక ప్రదేశాలను గుర్తించినట్లు, నిరాశ్రయులకు పాఠశాల భవనాలలో అసరా కల్పించాలని ఆదేశించినట్లు తెలిపారు. అధిక వర్షపాతమున్న ప్రాంతాలలో ప్రజలు బయటకు రావద్దని సూచించారు. నివర్ తుపాను ప్రభావం నేపథ్యంలో వరదయ్యపాలెం మండలంలో 100 మంది నిరాశ్రయులైన గిరిజనులను ముందస్తుగా గుర్తించి పునరావాస కేంద్రంలకు తరలించినట్లు తెలిపారు. నివర్ తుపానుతో రేణిగుంటలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. మల్లెమడుగు రిజర్వాయర్ నిండు కుండలా తలపిస్తోంది. దీంతో మూడు గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. -
ఫొని షాక్ : కోల్‌కతా విమానాశ్రయం మూసివేత
కోల్‌కతా : ఫొని తుపాన్ పలు రాష్ట్రాలపై పెను ప్రభావం చూపుతోంది. ఒడిషా తీరాన్ని తాకిన ఫొని తుపాన్ ప్రచండ వేగంతో కదులుతుండగా కొల్కతా విమానాశ్రయాన్ని శుక్రవారం మధ్యాహ్నం నుంచి శనివారం ఉదయం వరకూ మూసివేయాలని పౌరవిమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) ఆదేశించింది. కోల్‌కతా విమానాశ్రయం నుంచి శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకూ విమానాల రాకపోకలు నిలిపివేసినట్టు డీజీసీఏ పేర్కొంది. ఫొని తుపాన్ పురోగతిని పరిశీలించి కోల్‌కతా విమానాశ్రయంలో విమాన రాకపోకల నిలిపివేత సమయాన్ని సవరించామని అధికార వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు విమానాల రద్దుపై ఎలాంటి సమాచారం రాకపోవడంతో కోల్‌కతా విమానాశ్రయంలో పెద్దసంఖ్యలో ప్రయాణీకులు నిలిచిపోవడంతో గందరగోళం నెలకొంది. -
‘ఇదాయ్’ తాకిడికి 150 మంది మృతి
హరారే: ఆఫ్రికా దేశాలైన మొజాంబిక్, జింబాంబ్వే, మలావిలను ‘ఇదాయ్’ తుపాను అతలాకుతలం చేస్తోంది. భారీవర్షాలకు తోడు ఎగువప్రాంతాల నుంచి వరదలు ఒక్కసారిగా పోటెత్తడంతో ఈ మూడుదేశాల్లో 150 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది ప్రజలు గల్లంతయ్యారు. మూడుదేశాల్లో దాదాపు 15 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఇదాయ్ తాకిడితో వేలాది ఇళ్లతో పాటు రహదారులు, వంతెనలు ధ్వంసం కాగా, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. దీంతో చాలాప్రాంతాలు అంధకారంలోకి జారిపోయాయి. విమానాశ్రయాల్లో భారీగా వరదనీరు నిలిచిపోవడంతో ఆహారసామగ్రి, మందులు, ఇతర నిత్యావసరాలు తీసుకొచ్చేందుకు తీవ్రఆటంకం కలుగుతోంది. ఈ నేపథ్యంలో ఆర్మీతో పాటు రెడ్‌క్రాస్, ఇతర స్వచ్ఛంద సంస్థలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. -
42 మండలాల్లో ‘పెథాయ్’ పంట నష్టం
సాక్షి, హైదరాబాద్: పెథాయ్ తుపాను కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. దాదాపు 6,168 ఎకరాల్లో వ్యవసాయ పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్‌లో తుపాను తీరం దాటే సమయంలో దాని ప్రభావం రాష్ట్రంలోని పలు జిల్లాలపై పడిందని, దీంతో పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు వెల్లడించారు. మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, జగిత్యాల, వరంగల్ రూరల్, భద్రాది కొత్తగూడెం, సూర్యాపేట జిల్లాల్లోని మొత్తం 42 మండలాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. వరి, మొక్కజొన్న, వేరుశనగ, ఆవాలు, పత్తి పంటలు పెథాయ్ తుపాను ప్రభావంతో వచ్చిన ఈదురు గాలులు, వర్షానికి దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు. చేతికొచ్చిన వరి, మొక్కజొన్న పంటలే అధికంగా నీటిపాలయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పునరావాసం కల్పించండి: సీఎస్ పెథాయ్ తుపాను ప్రభావంతో గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్ర చలిగాలులు వీస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. జిల్లాలకు అవసరమైన మందులు, దుస్తులు, పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారని సీఎస్ తెలిపారు. జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండి ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలన్నారు. అవసరమైతే జిల్లా ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల సహాయం తీసుకోవాలని ఆదేశించారు. -
రైతులను ముంచిన తుపాను
సాక్షి ప్రతినిధి, ఖమ్మం/మంథని/సాక్షి, వరంగల్: పెథాయ్ తుపాను ప్రభావం ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులను నట్టేట ముంచింది. చేతికొచ్చిన పంట వర్షం బారిన పడటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోసి ఆరబెట్టిన వరి పనలతోపాటు కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకెళ్లిన ధాన్యం కూడా తడిసిపోయింది. వరితో పాటు మిర్చి, పత్తి పంటలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. మిరప పంట తడవటంతో తెగుళ్లు సోకే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ఖమ్మం జిల్లాలో 4.1 సెంటీమీటర్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 10.92 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తుపాను కారణంగా కురిసిన వర్షం పెద్దపల్లి జిల్లా మంథని మార్కెట్‌ను ముంచెత్తింది. డివిజన్ పరిధిలోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది. ఉమ్మడి వరంగల్‌లో.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆదివారం సాయంత్రం నుంచి కురుస్తున్న వర్షాలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. చాలా చోట్ల కుప్పలుగా పోసిన వరిధాన్యం తడిసింది. వరి చేలు, మిరప తోటలు నేలవాలాయి. కొన్ని ప్రాంతాల్లో వాన నీటికి ధాన్యం కొట్టుకుపోయింది. పత్తి పంటకు కూడా నష్టం వాటిల్లింది. -
పొంచి ఉన్న సూపర్ సైక్లోన్
వినుకొండ టౌన్: గుంటూరు, ప్రకాశం జిల్లాలకు సూపర్ సైక్లోన్ ప్రమాదం పొంచి ఉన్నందున కలెక్టర్ ఆదేశానుసారం అధికారులు అప్రమత్తంగా ఉండాలని వినుకొండ నియోజకవర్గ ప్రత్యేకాధికారి సలీమ్ ఖాన్ హెచ్చరించారు. తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో విద్యుత్, రెవెన్యూ, వ్యవసాయ, పోలీసు, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, ఫైర్, తదితర శాఖల అధికారులతో గురువారం అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ నెల 17న తీవ్ర గాలులు, భారీ వర్షాలతో కూడిన తుఫాన్ వచ్చే అవకాశం ఉందని తుఫాన్ హెచ్చరికల విభాగం అధికారులు సూచించారన్నారు. ప్రకాశం జిల్లాలో మొదలైన వాయుగుండం గుంటూరు జిల్లా బాపట్ల, నిజాంపట్నంల వద్ద తీరం దాటే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గంటకు 100 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెప్పారు. రైతులు పంటలు నష్టపోకుండా రానున్న రెండు రోజుల్లో పంట కోతలను మిషన్ల ద్వారా పూర్తి చేసుకోవాలని, కోత కోసిన ఓదేలను వెంటనే గూళ్లు వేయించేందుకు చర్యలు చేపట్టాలని చెప్పారు. కోళ్ల ఫారం యజమానులకు తగు సూచనలు చేయాలని, గ్రామాల్లో ఉన్న పశువులను చెట్లవద్ద కట్టేయకుండా ఉండేందుకు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో వర్షాలకు కూలిపోయే ఇళ్లను గుర్తించి వారిని తరలించేందుకు అవసరమైన షెల్టర్లను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. అన్ని విభాగాలు అప్రమత్తంగా ఉండాలి నూతనంగా నిర్మించి ధృడంగా ఉన్న పాఠశాల భవనాలను అధికారులు గుర్తించి వాటిని తమ ఆధీనంలోకి తీసుకోవాలని సూచించారు. అంగన్వాడీల ద్వారా ప్రసవ సమయానికి దగ్గరగా ఉన్న గర్భిణులను గుర్తించి వెంటనే వారిని ఆస్పత్రులకు తరలించాలన్నారు. తుఫాన్ తాకిడికి వారం నుంచి పది రోజల వరకు విద్యుత్ అంతరాయం ఏర్పడే అవకాశం ఉన్నందున మంచినీటి నిల్వలను గ్రామాల్లో ట్యాంకులకు నింపి ఉంచాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించి ప్రజలకు ఇబ్బందులు జరగకుండా సురక్షత ప్రాంతాలకు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు సముద్ర స్నానాలు చేసే అవకాశాలు ఉన్నందున వారిని అప్రమత్తం చేయాలని చెప్పారు. ఆర్అండ్బీ అధికారులు అప్రమత్తంగా ఉండడంతో పాటు అవసరమైన సామగ్రిని అందుబాటులో ఉంచుకోవాలన్నారు. వైద్యాధికారులు సిబ్బంది అవసరమైన అత్యవసర సేవలు అందించేందుకు, అవసరమైన మందులు సిద్ధంగా ఉంచాలని చెప్పారు. అవసరమైన చోట పోలీసు సిబ్బంది సహకారం తీసుకోవాలని ఆదేశించారు. సమన్వయంతో చర్యలు తీసుకోవాలి అధికారుల సెల్ఫోన్లు విద్యుత్ ఇబ్బందులతో నిలిచిపోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. సెలవుల్లో ఉన్న సిబ్బందిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, ఇకపై ఎవరూ సెలవు పెట్టాలన్న కలెక్టర్ అనుమతి తీసుకోవాలన్నారు. తుఫాన్ అనంతరం పొంచి ఉండే ప్రమాదాలు, అతిసారం, కలరా వంటి వ్యాధులు ప్రబలకుండా సత్వర చర్యలు తీసుకోవాలని చెప్పారు. తుఫాన్ సమయంలో మరణాలు, ఆస్తి నష్టాలు, జీవాల నష్టాలను వెంటనే అంచనాలు వేసేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. అవసరమైన చోట స్వచ్ఛంద సంస్థల నిర్వాహకుల సహాయ సహకారాలను తీసుకోవాలని చెప్పారు. అధికారులు, సిబ్బంది ఎప్పటికప్పుడు సమన్వయంతో పనిచేసి తుఫాన్ వల్ల ప్రాణ నష్టం జరగకుండా, ప్రజలకు అవగాహన కల్పిస్తు, వారికి ధైర్యాన్ని ఇస్తూ రక్షణ కవచంగా ఉండాలని ఆయన కోరారు. -
సైక్లోన్ ఎఫెక్ట్: మోదీ, రాహుల్ ర్యాలీలు రద్దు
సాక్షి,అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంపై సైక్లోన్ ఓఖి ప్రభావం పడింది. తుపాన్ గుజరాత్ తీరాన్ని తాకడంతో పలు రాజకీయ పార్టీలు సూరత్ పరిసర ప్రాంతాల్లో ర్యాలీలు, ప్రచార సభలను రద్దు చేశాయి. సూరత్‌లో బుధవారం జరగాల్సిన ప్రధాని నరేంద్ర మోదీ ర్యాలీని రద్దు చేసినట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.అయితే ధన్‌దుక, దహోద్, నేత్రంగ్‌లలో ర్యాలీలు యథావిథిగా జరుగుతాయని స్పష్టం చేశాయి. ఇక బీజేపీ చీఫ్ అమిత్ షా రాజుల, షిహోర్‌లో నిర్వహంచతలపెట్టిన ర్యాలీలు సైతం రద్దయ్యాయి. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మోర్బి, దర్బంగా, సురేంద్రనగర్ ర్యాలీలు రద్దు చేసినట్టు పార్టీ నేతలు వెల్లడించారు. తుపాన్ తీరం దాటే క్రమంలో గుజరాత్ వ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు, తీవ్ర గాలులు వీచే అవకాశం ఉందని ప్రధాన నదుల్లో వరద ఉధృతి పెరగవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. -
‘వర్దా’రుణం
కొట్టుకుపోతున్న కోనపాపపేట సముద్రం పాలైన 25 మత్స్యకారుల ఇళ్లు కడలి ఆగ్రహానికి ముక్కలవుతున్న హేచరీలు భారీగా ఆస్తి నష్టం కానరాని రక్షణ చర్యలు వర్దా తుపాను కొత్తపల్లి మండల తీర ప్రాంతాన్ని అతలాకుతలం చేసింది. ఎక్కడ చూసినా సుమారు 50 మీటర్ల మేర ముందుకు చొచ్చుకువచ్చిన సముద్రం తీరప్రాంతాన్ని కబళీంచేసింది. ఏక్షణంలోనైనా సముద్ర కోతకు గురయ్యే ప్రమాదస్థితిలో పలు ఇళ్లు ఉన్నప్పటికి పట్టించుకునే వారు లేక పోవడంతో మత్స్యకారులు ఆ గృహాలలోనే బిక్కుబిక్కుమంటు కాలం గడుపుతున్నారు. – పిఠాపురం పొన్నాడ శివారు కోనపాపపేట తీవ్ర కోతకు గురైంది. సుమారు 25 మత్స్యకారుల ఇళ్లు నేలమట్టమై సముద్రంలో కలిసిపోగా, పలు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. మరికొన్ని ఏక్షణంలోనైనా సముద్రకోతకు గురయ్యే ప్రమాద పరిస్థితిలో ఉన్నాయి. కొందరు మత్స్యకారులు సామగ్రిని ఇతర ప్రాంతాలకు తరలించుకునే పనిలో ఉన్నారు. మరోపక్క తీరం వెంబడి ఉన్న పలు రొయ్యపిల్లల ఉత్పత్తి కేంద్రాలు (హేచరీలు) సముద్రకోతకు గురయ్యాయి. సుమారు 10 హేచరీలకు చెందిన పంప్‌హౌస్‌లు కడలిలో కలిసి పోయి సుమారు రూ.50 లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. మంగళవారం ఉదయానికి కెరటాల తీవ్రత తగ్గక పోగా కోత కొనసాగుతుండడంతో హేచరీల యాజమానులు తమ కట్టడాలను కాపాడుకునేందుకు ఇసుక బస్తాలతో రక్షణ ఏర్పాటు చేసుకోవడంలో మునిగిపోయారు. కోనపాపపేట వద్ద బీచ్‌రోడ్డు అడుగుభాగం పూర్తిగా కొట్టుకు పోవడంతో ఏక్షణంలోనైనా రోడ్డు తెగిపోయే ప్రమాదం ఉంది. దీంతో ఉప్పాడ తుని మధ్య బీచ్‌రోడ్డుపై రాకపోకలు ప్రమాదకరంగా మారాయి. పరిస్థితి ఇలా ఉన్నా అధికారిక యంత్రాంగం మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. -
తుఫాను ప్రభావం: శ్రీకాకుళంలో వర్షాలు ప్రారంభం
హుదూద్ తుఫాను ప్రభావం మొదలైపోయింది. శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికే వర్షాలు మొదలయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో చిన్న తుంపర్లు వస్తుండగా మరికొన్ని గ్రామాల్లో పెద్ద వర్షమే కురుస్తోందని సమాచారం. ఇక తుఫాను నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఐదు జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించారు. విశాఖ, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు. మొత్తం 64 మండలాల పరిధిలోని 5.14 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తక్షణం తరలించాలని ఆదేశించారు. మొత్తం 370 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. సహాయ కార్యక్రమాల కోసం 54 బోట్లతో 689 మంది గజ ఈతగాళ్లను సిద్ధం చేశారు. మొత్తం 13 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను జిల్లాలకు తరలించారు.