సాక్షి,అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంపై సైక్లోన్ ఓఖి ప్రభావం పడింది. తుపాన్ గుజరాత్ తీరాన్ని తాకడంతో పలు రాజకీయ పార్టీలు సూరత్ పరిసర ప్రాంతాల్లో ర్యాలీలు, ప్రచార సభలను రద్దు చేశాయి. సూరత్‌లో బుధవారం జరగాల్సిన ప్రధాని నరేంద్ర మోదీ ర్యాలీని రద్దు చేసినట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.అయితే ధన్‌దుక, దహోద్, నేత్రంగ్‌లలో ర్యాలీలు యథావిథిగా జరుగుతాయని స్పష్టం చేశాయి.
ఇక బీజేపీ చీఫ్ అమిత్ షా రాజుల, షిహోర్‌లో నిర్వహంచతలపెట్టిన ర్యాలీలు సైతం రద్దయ్యాయి. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మోర్బి, దర్బంగా, సురేంద్రనగర్ ర్యాలీలు రద్దు చేసినట్టు పార్టీ నేతలు వెల్లడించారు.
తుపాన్ తీరం దాటే క్రమంలో గుజరాత్ వ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు, తీవ్ర గాలులు వీచే అవకాశం ఉందని ప్రధాన నదుల్లో వరద ఉధృతి పెరగవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment