Rahul Gandhi
-
ఇంతకీ ఎందుకు.. ఏఐసీసీకి అంత సంతృప్తి?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ పాలన తీరు, హస్తం పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నేను కొట్టినట్లు చేస్తా.. నువ్వు ఏడ్చినట్లు చేయి అనే ఒప్పందమా?.. కుమ్మక్కు రాజకీయంలో ఇదో రహస్యమా?.. రేవంత్ - అదానీలతో వ్యాపార బంధమా? అని ప్రశ్నించారు. ఇదే సమయంలో తెలంగాణకు కాంగ్రెస్ తరతరాల దరిద్రం అంటూ ఘాటు విమర్శలు చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..‘రాహుల్ గాంధీ గారూ..మీరు భూసేకరణ వ్యతిరేక స్వరం వినిపిస్తే ఏం లాభం?అదానీ-అంబానీలపై విరుచుకుపడితే ఏం ప్రయోజనం?దేశవ్యాప్తంగా భూసేకరణపై మీ రణ గర్జన..తెలంగాణలో భూసేకరణను ఎందుకు అడ్డుకోలేకపోయింది?కొడంగల్ రైతుల కన్నీటికి ఎందుకు కారణభూతమైంది?అదానీ-అంబానీలపై మీ జంగ్..రామన్నపేటలో అదానీ ఫ్యాక్టరీకి ద్వారాలు ఎందుకు తెరిచింది?తెలంగాణ కాంగ్రెస్ పాలిత రాష్ట్రమే కదా! ఎందుకు అభ్యంతరం చెప్పలేదు?నేను కొట్టినట్లు చేస్తా..నువ్వు ఏడ్చినట్లు చేయి అనే ఒప్పందమా?కుమ్మక్కు రాజకీయంలో ఇదో రహస్యమా?రేవంత్-అదానీలతో వ్యాపార బంధమా?అదానీ-అంబానీలపై మీ పోరాటం ఓ బూటకంతెలంగాణకు కాంగ్రెస్ తరతరాల దరిద్రం..’ అంటూ ఘాటు విమర్శలు చేశారు.రాహుల్ గాంధీ గారూ...మీరు భూసేకరణ వ్యతిరేక స్వరం వినిపిస్తే ఏం లాభం?అదాని - అంబానీలపై విరుచుకుపడితే ఏం ప్రయోజనం?దేశవ్యాప్తంగా భూసేకరణపై మీ రణ గర్జన...తెలంగాణలో భూసేకరణను ఎందుకు అడ్డుకోలేకపోయింది?కొడంగల్ రైతుల కన్నీటికి ఎందుకు కారణభూతమైంది?అదాని -అంబానీలపై మీ జంగ్..… pic.twitter.com/b6NuJ6MIHl— KTR (@KTRBRS) November 17, 2024ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ పాలనపై ఏఐసీసీ సంతృప్తి చెందిందా ??!!అసలు రాష్ట్రంలో పాలన అనేది ఒకటి ఉంటే కదా..? ఇంతకంటే దిక్కుమాలిన ప్రకటన ఇంకోటి ఉంటదా..!!ఇంతకీ ఎందుకు.. ఏఐసీసీకి అంత సంతృప్తి ?తెలంగాణ రైతులకు సంకెళ్లు వేసినందుకా ?❌అమాయకులైన అన్నదాతలను జైలులో పెట్టినందుకా ??❌కొడంగల్ లో బలవంతంగా భూములు గుంజుకున్నందుకా ??❌కొనుగోలు కేంద్రాల్లో రైతులను బలిపశువులను చేస్తున్నందుకా ??❌మూసీ ప్రాజెక్టులో భాగంగా వేల ఇళ్ల కూల్చివేతకు సిద్ధమైనందుకా ??❌హైడ్రా పేరిట పేద ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నందుకా ??❌ఏడాది కావస్తున్నా గ్యారెంటీ కార్డును పాతాళంలో పాతిపెట్టినందుకా ??❌రెండు లక్షల ఉద్యోగాల హామీ అమలును గాలికి వదిలేసినందుకా ??❌తెలంగాణ ప్రగతికి బ్రేకులు వేసి.. ఆర్థికంగా దివాలా తీయిస్తున్నందుకా ??❌సంక్షేమానికి సమాధి కట్టి.. అభివృద్ధికి అడ్రస్ లేకుండా చేసినందుకా ??తెలంగాణలోని సకల రంగాలను.. సబ్బండ వర్గాలను దగా చేసినందుకా.. మొత్తంగా తెలంగాణను ఆగం చేసినందుకా.. మీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి అంతటి సంతృప్తి ??ఢిల్లీకి అందుతున్న వేల కోట్ల మూటలు చూసి మీరెంత మురిసిపోయినా.. మాటిచ్చి మోసం చేసిన ముఖ్యమంత్రిని.. గ్యారెంటీ కార్డు ఇచ్చి గారడీ చేసిన కాంగ్రెస్ పార్టీని చూసి, నాలుగు కోట్ల తెలంగాణ సమాజం మాత్రం రగిలిపోతోంది. కనికరం లేని కాంగ్రెస్ పాలనకు కర్రుగాల్చి వాతపెడుతుంది.జై తెలంగాణ అంటూ కామెంట్స్ చేశారు. -
రాహుల్ గాంధీపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఫైర్
-
రాహుల్ ఇంటిని ముట్టడిస్తాం: హరీష్‌రావు
సాక్షి, సూర్యాపేట: వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీ ఇచ్చిన రుణమాఫీ హామీ ఏమైందని మాజీ మంత్రి హరీష్‌రావు ప్రశ్నించారు. దసరాలోపు రైతులకు రుణమాఫీ చేయకపోతే ఢిల్లీలో రాహుల్ ఇంటి ముందు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తా.. దసరాలోపు రైతు బంధు పడకపోతే నిన్ను రైతులు వదలరంటూ హరీష్ హెచ్చరించారు. రేవంత్‌రెడ్డికి ప్రజలపై పట్టింపు లేదు.. రైతంటే లెక్క లేదు. దేవుళ్ల మీద ఒట్లు వేసి మాటతప్పాడు. రేవంత్ రెడ్డి మొనగాడు కాదు.. మోసగాడు. 31 కుంటి సాకులు పెట్టి రుణమాఫీ ఎగ్గొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. కర్ణాటకలో ఐదు.. తెలంగాణలో ఆరు.. హర్యానాలలో ఏడు గ్యారెంటీలతో ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తుంది. ఒక చేతిలో రాజ్యాంగం.. మరో చేతిలో రౌడీయిజం. హెడ్రా పేరుతో పేదల ఇండ్లు కూలగొట్టి హక్కు మీకు ఎవరిచ్చారు’’ అంటూ హరీష్‌రావు ప్రశ్నించారు.జూటా మాటలు మానుకోక పోతే నిన్ను వదలం. నిన్ను అడుగుతాం.. కడుగుతాం.. అసెంబ్లీలో నిలదీస్తాం. ఒక్క బస్సు తప్ప.. మీ హామీలు అన్నీ తుస్సే.. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కానీ సీఎంకి కనికరం లేదు. కేసిఆర్‌ది రైతు గుండె.. రేవంత్‌ది రాతి గుండె.. ప్రజల నుండి తిరుగుబాటు రాగానే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. ఏదో ఒక వివాదం సృష్టిస్తున్నారు’’ అని హరీష్‌రావు మండిపడ్డారు.ఇదీ చదవండి: తప్పని తేలితే కూల్చేస్తా.. సీఎం రేవంత్‌కి కేవీపీ లేఖ -
రాహుల్ గాంధీపై భారీ కుట్ర.. కాంగ్రెస్ దేశవ్యాప్త ఆందోళనలు
-
Haryana Assembly Elections 2024: ఎన్నికల బరిలో వినేశ్ ఫొగాట్!
సాక్షి, న్యూఢిల్లీ: ఒలింపిక్ క్రీడాకారిణి, మల్లయోధురాలు వినేశ్ ఫొగాట్ రాజకీయ రంగప్రవేశం దాదాపు ఖాయమైంది. కాంగ్రెస్ తరఫున హరియాణా శాసనసభ ఎన్నికల్లో జులానా స్థానం నుంచి ఆమె పోటీచేసే అవకాశముందని కాంగ్రెస్‌లోని విశ్వసనీయ వర్గాలు బుధవారం వెల్లడించాయి. మరో ప్రముఖ మల్లయోధుడు భజరంగ్ పునియా సైతం బాద్లీ స్థానం నుంచి పోటీచేసే అవకాశముంది. ఈ ఇద్దరు రెజ్లర్లు బుధవారం కాంగ్రెస్ నేత రాహుల్‌గాం«దీతో భేటీ అయ్యారు. దీంతో హస్తం పారీ్టలో వీరిద్దరి చేరిక ఖాయమైందని వార్తలొచ్చాయి. రాహుల్‌తో వినేశ్, పునియాలు దిగిన ఫోటోను కాంగ్రెస్ తన అధికారిక ఖాతా ’ఎక్స్’లో పోస్ట్ చేసిన అనంతరం వీరి పోటీ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. వీరిద్దరి అభ్యరి్థత్వాన్ని గురు లేదా శుక్రవారం జరగబోయే కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో ఖరారుచేస్తారని తెలుస్తోంది. వీరిద్దరి పోటీపై గురువారం నాటికి స్పష్టత వస్తుందని హరియాణా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపక్ బాబరియా మంగళవారం పేర్కొనడం తెల్సిందే. -
ముగిసిన కాంగ్రెస్ హైకమాండ్ కీలక భేటీ
సాక్షి,న్యూఢిల్లీ: కాంగ్రెస్ బలోపేతంపై పార్టీ హైకమాండ్ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా మంగళవారం(ఆగస్టు13) ఉదయం అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులతో పార్టీ అగ్రనేతలు భేటీ అయ్యారు. సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీచీఫ్ మల్లికార్జున ఖర్గే , ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ పాల్గొని పీసీసీ చీఫ్‌లకు దిశానిర్దేశం చేశారు. రానున్న ఎన్నికలకు కాంగ్రెస్‌ను క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే అంశంపై ఈ సమావేశంలో చర్చించారు. రాహుల్ గాంధీ లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి జరుగుతున్న సమావేశం ఇదే. -
మళ్లీ ‘ఈడీ’ విచారణకు రాహుల్‌గాంధీ..?
న్యూఢిల్లీ: లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మళ్లీ విచారణకు పిలిచే అవకాశమున్నట్లు తెలుస్తోంది. రాహుల్, సోనియాగాంధీ ప్రధానవాటాదారులుగా ఉన్న నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఈడీ ఇప్పటికే విచారణ జరుపుతోంది. ఈ కేసులో చార్జ్‌షీట్ ఫైల్ చేసేముందు ఈడీ రాహుల్‌ను విచారించాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.దర్యాప్తునకు ముగింపు పలికి కేసు విచారణకు వెళ్లాల్సిఉందని, ఇందుకోసం కేసుతో సంబంధమున్న అందరినీ చివరిసారిగా విచారించాలనుకుంటున్నట్లు ఈడీ వర్గాలు చెబుతున్నాయి. అయితే కేసులో మరో నిందితురాలిగా ఉన్న కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీని ఈడీ విచారణకు పిలుస్తుందా లేదా అన్నది తెలియాల్సిఉంది. కాగా, నేషనల్హెరాల్డ్ కేసులో రాహుల్, సోనియాలను ఈడీ ఇప్పటికే విచారించిన విషయం తెలిసిందే. -
ఆ ప్రస్తావన ఎందుకు?: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: పార్లమెంట్ తొలి సెషన్ సందర్భంగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ‘ఎమర్జెన్సీ’ని ప్రస్తావిస్తూ తీర్మానం చేయడాన్ని విపక్షనేత రాహుల్ గాంధీ మరోమారు తీవ్రంగా తప్పుబట్టారు. బిర్లాను గురువారం మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంగా ఈ అంశాన్ని ప్రస్తావించారు. రాజకీయ అంశమైన ‘ఎమర్జెన్సీ’ని ప్రస్తావించకుండా ఉండాల్సింది అన్నారు. ‘‘రాహుల్, ఇండియా కూటమి నేతలు స్పీకర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. నేతలంతా పార్లమెంటరీ వ్యవహారాలు మాట్లాడుకున్నారు. అందులో భాగంగానే ఎమర్జెన్సీ అంశమూ ప్రస్తావనకు వచి్చంది.రాహుల్ ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. రాజకీయ అంశాన్ని సభలో లేవనెత్తకుండా నివారిస్తే బాగుండేదన్నారు’’ అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ వెల్లడించారు. ఈ అంశంపై కేసీ వేణుగోపాల్ విడిగా స్పీకర్‌కు ఒక లేఖ రాశారు. ‘పార్లమెంట్ విశ్వసనీయతను తీవ్రంగా దెబ్బతీసే అంశమిది. స్పీకర్‌గా మిమ్మల్ని ఎన్నుకున్న శుభతరుణంలో అర్ధశతాబ్దకాలంనాటి ఎమర్జెన్సీ అంశాన్ని మీరు సభ ముందుకు తేవడం విపక్షాలన్నింటినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. స్పీకర్ ఎన్నిక, బాధ్యతల స్వీకరణ వేళ రాజకీయాలు మాట్లాడటం పార్లమెంట్ చరిత్రలో ఇదే తొలిసారి.నూతన స్పీకర్‌గా ఎన్నికయ్యాక చేపట్టాల్సిన తొలి విధులకు ఇలాంటి చర్యలు తీవ్ర విఘాతం కల్గిస్తాయి. పార్లమెంటరీ సంప్రదాయాలను అపహాస్యం చేస్తూ సాగిన ఈ ఉదంతంపై మేం ఆందోళన చెందాం’’ అని వేణుగోపాల్ ఆ లేఖలో పేర్కొన్నారు. ‘‘1975 జూన్ 25న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో ‘అత్యయిక స్థితి’ అమల్లోకి తెచ్చారు. చాలా మంది ప్రతిపక్ష నేతలను ప్రభుత్వం జైళ్లలో పడేసింది. మీడియాపై ఆంక్షలు విధించింది.న్యాయ వ్యవస్థపై నియంత్రణ చట్రం బిగించింది. ఎమర్జెన్సీ విధించి 49 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సభ అంబేడ్కర్ రాజ్యాంగాన్ని పరిరక్షించడంతోపాటు దాని విలువలకు కట్టుబడి ఉందని నేను హామీ ఇస్తున్నా’’ అని నూతన స్పీకర్ బిర్లా బుధవారం పేర్కొన్నారు. స్పీకర్ ఆ తీర్మానాన్ని చదువుతున్న సందర్భంలో కాంగ్రెస్ సహా విపక్ష నేతలంతా నిలబడి తీవ్ర నిరసన వ్యక్తం చేయడం తెలిసిందే. -
Parliament Special Session: విపక్షనేతగా రాహుల్: స్పీకర్
న్యూఢిల్లీ: రాహుల్‌ను లోక్‌సభలో విపక్షనేతగా గుర్తిస్తున్నట్లు నూతన స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. పదేళ్ల తర్వాత లోక్‌సభలో ప్రతిపక్షాలకు ‘విపక్షనేత’ హోదా దక్కడం విశేషం. ఈ మేరకు జూన్ 9వ తేదీ నుంచే రాహుల్‌ను విపక్షనేతగా పరిగణిస్తూ లోక్‌సభ సెక్రటేరియట్ బుధవారం ఒక నోటిఫికేషన్ జారీచేసింది. పార్లమెంట్చట్టం1977లోని రెండో సెక్షన్ ప్రకారం రాహుల్‌ను విపక్షనేతగా ప్రకటించింది. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడారు. పార్టీ చీఫ్ ఖర్గే, పార్టీ కార్యకర్తలు, నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడిగా ప్రజల ఆకాంక్షలను పార్లమెంట్లో వినిపిద్దామని పిలుపునిచ్చారు. 16వ, 17వ లోక్‌సభలో విపక్షపార్టీలకు కనీసం 10 శాతం సభ్యులబలం లేనికారణంగా ఏ పారీ్టకీ విపక్షహోదా దక్కలేదు. విపక్షనేతగా ఎన్నికవడం ద్వారా రాహుల్ తన పాతికేళ్ల రాజకీయజీవితంలో తొలిసారిగా రాజ్యాంగబద్ద పదవిని స్వీకరించారు. కేబినెట్ మంత్రి హోదాతో సమానమైన విపక్షనేత హోదాలో రాహుల్‌కు ఒక ప్రైవేట్ కార్యదర్శి, ఇద్దరు అదనపు ప్రైవేట్ కార్యదర్శులు, ఇద్దరు వ్యక్తిగత సహాయకులు, ఇక హిందీ స్టెనో, ఒక క్లర్క్, ఒక శానిటేషన్ వర్కర్, నలుగురు ప్యూన్లను కేంద్రం సమకూరుస్తుంది. 1954చట్టం 8వ సెక్షన్, 1977 చట్టాల ప్రకారం జీతభత్యాలు చెల్లిస్తుంది. లోక్‌పాల్, సీఈసీ, ఈసీ, సీబీఐ డైరెక్టర్, సీవీసీ, సీఐసీ, ఎన్‌హెచ్‌ఆర్‌సీల నియామక ప్యానెళ్లలో ఇకపై రాహుల్ సభ్యునిగా ఉండనున్నారు.రాహుల్ తొలిసారిగా 2004లో అమేథీలో విజయంతో పార్లమెంట్‌లోకి అడుగుపెట్టారు. -
‘సిద్ధూ మూసేవాలా కోడ్ ఏమిటి? కాంగ్రెస్ సీట్లతో లింక్ ఎందుకు?
దేశంలో లోక్‌సభ ఎన్నికల ఏడు దశల ఓటింగ్ ముగిసింది. మంగళవారం(జూన్ 4) ఓట్ల లెక్కింపు జరగనుంది. దీనికి ముందే ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏ విజయాన్ని ప్రకటించాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ గురించి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ ‘ఇదొక ఫాంటసీ పోల్ అని వ్యాఖ్యానించారు. గాయకుడు సిద్ధూ మూసేవాలా పాటను ప్రస్తావిస్తూ ఇండియా కూటమికి 295 సీట్లు వస్తాయని అన్నారు.ఇంతకీ రాహుల్ గాంధీ సింగర్ సిద్దూవాలా ‘295’ పాటను ఎందుకు వినమన్నారు? విశ్లేషకులు తెలిపిన వివరాల ప్రకారం దీనిలో రెండు అర్థాలు ఉన్నాయి. మొదటిది కాంగ్రెస్ 295 లోక్‌సభ స్థానాలు సాధిస్తుందని, మరొకటి ఈ పాటలోని అర్థాన్ని తెలుసుకోవాలని కోరారు. మూసేవాలా పాడిన పాట ‘295’లో 295 అనేది కేవలం ఒక సంఖ్య కాదు. ఈ హిందీ పాటలోని అర్థం విషయానికి వస్తే దీనిలో మతం ప్రస్తావన ఉంది. నిజం మాట్లాడే చోట సెక్షన్ 295 విధిస్తారు. ఎవరైనా అభివృద్ధి చెందిన చోట ద్వేషం రగులుతుంది. సెక్షన్ 295 పేరుతో మతానికి సంబంధించిన నిబంధనలు పెట్టారని పాటలో పేర్కొన్నారు.ఈ పాట ప్రారంభంలో ‘అబ్బాయ్.. నువ్వు ఎందుకు నేల చూపులు చూస్తున్నావు? నువ్వు బాగా నవ్వేవాడివి కదా? ఈ రోజు మౌనం వహిస్తున్నావు? ఈ రోజు తలుపుపై ఉన్న నేమ్‌బోర్డును ఎత్తుకుపోయి, తిరుగుతున్న వారెవరో నాకు తెలుసు. వారు ఇక్కడ వారి ప్రతిభను వ్యాపింపజేయాలనుకుంటున్నారు. నువ్వు కిందపడాలని కోరుకుంటున్నారు. వారు కీర్తి కాంక్షతో రగిలిపోతున్నారు. నీ పేరుతో ముందుకు రావాలని అనుకుంటున్నారు’ అని పాటలో వినిపిస్తుంది. రాహుల్ ఈ పాట ద్వారా కాంగ్రెస్ పరిస్థితిపై మీడియాకు సమాధానమిచ్చారు.ఎగ్జిట్ పోల్ గణాంకాలు విడుదలైన తర్వాత ప్రతిపక్ష నేతలు ఈ లెక్కలను తప్పుపడుతున్నారు. దేశంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడబోతోందని, ఎన్డీఏ ప్రభుత్వం కాదని వారు అంటున్నారు. ఎగ్జిట్ పోల్ డేటాను ఎవరూ అంగీకరించబోరని కాంగ్రెస్ నేత పవన్ ఖేదా పేర్కొన్నారు. మీడియావారు మాతో ఆఫ్ ది రికార్డ్ మాట్లాడినప్పుడు ఇండియా కూటమి పనితీరు అద్భుతంగా ఉందన్నారు. అయితే ఇప్పుడు చూస్తున్నది ఊహాజనిత మార్కెట్ అయిన షేర్ మార్కెట్ కోసం జరిగిందా? లేక బీజేపీ మరో కుట్ర పన్నుతోందా అని పవన్ ఖేదా ప్రశ్నించారు. దేశంలో బీజేపీ భక్తులు తప్ప ప్రతీ ఒక్కరూ ఈ ఎగ్జిట్ పోల్స్‌ను ఫేక్‌గా పరిగణిస్తున్నారన్నారు. -
రోడ్డు పక్క సెలూన్లో రాహుల్ షేవింగ్.. ఫొటో వైరల్!
ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల వేళ సోషల్ మీడియాలో పలువురు నేతల ప్రకటనలు, ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇదే కోవలో తాజాగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో హల్హచల్ చేస్తున్నాయి. ఆ ఫొటోలలో రాహుల్ రోడ్డు పక్కనున్న ఒక సాధారణ సెలూన్లో హెయిర్ కటింగ్‌తో పాటు షేవింగ్ చేయించుకోవడం కనిపిస్తుంది.కాంగ్రెస్ తన అధికారిక హ్యాండిల్లో రాహుల్ గాంధీకి సంబంధించిన కొన్ని ఫొటోలను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో షేర్ చేసింది. దానితోపాటు క్యాప్షన్‌లో 'ఎన్నికల సన్నాహాలు పూర్తయ్యాయి. అయితే జుట్టు కత్తిరించుకోవడం కూడా అవసరం. నైపుణ్యం కలిగిన యువత హక్కుల కోసం మేము పోరాడుతున్నాం. దేశ అభివృద్ధిలో వారి భాగస్వామ్యం కావాలని డిమాండ్ చేస్తున్నాం’ అని రాసివుంది.ప్రస్తుతం దేశవ్యాప్తంగా 18వ లోక్‌సభకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు నాలుగు దశల ఎన్నికలు పూర్తికాగా, ఇక మూడు దశల ఎన్నికలు మిగిలివున్నాయి. ఐదో దశ ఎన్నికలు మే 20న, ఆరో దశ ఎన్నికలు మే 25న, చివరి దశ అంటే ఏడో దశ ఎన్నికలు జూన్ ఒకటిన జరగనున్నాయి. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. चुनाव की तैयारी पूरी है, लेकिन हेयर कटिंग भी जरूरी है।हम ऐसे ही हुनरमंद नौजवानों के हक के लिए लड़ रहे हैं, देश के विकास में इनकी हिस्सेदारी मांग रहे हैं। 📍 रायबरेली, उत्तर प्रदेश pic.twitter.com/iTfEzkDGsh— Congress (@INCIndia) May 13, 2024 -
‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
సాక్షి, వేములవాడ : కాంగ్రెస్ యువరాజు రాఫెల్ కుంభకోణం బయటపడిన నాటి నుంచి ఐదేండ్లుగా ఒక్కటే జపం చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రకటన తర్వాత ఆయన నోరు మెదపరేం అంటూ ప్రధాని మోదీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై విమర్శనాస్త్రాలు సంధించారు. లోక్‌సభ ఎన్నికల తరుణంలో వేములవాడలో బీజేపీ శ్రేణులు భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఆ సభలో పాల్గొన్న మోదీ.. రాహుల్ గాంధీపై ప్రశ్నల వర్షం కురిపించారు.ఎందుకు సైలెంట్ అయ్యారు ఐదేళ్లుగా ఫైవ్ ఇండస్ట్రీలిస్ట్.. ఫైవ్ ఇండస్ట్రీలిస్ట్..ఆపై అంబానీ-అదానీ అంటూ జపం చేసిన రాహుల్ గాందీ లోక్‌సభ ఎన్నికల ప్రకటనతో ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు.తెలంగాణ గడ్డమీద నుంచితెలంగాణ గడ్డమీద నుంచి రాహుల్ గాంధీని ఒకటే అడుగుతున్నా అంబానీ, అదానీల నుంచి ఎంత తీసుకున్నారు? మీ మధ్య ఒప్పందం ఏమైనా జరిగిందా? లేకపోతే ఓవర్ నైట్‌లోనే అంబానీ, అదానీలను విమర్శించడం ఎందుకు మానేశారని ప్రశ్నించారు.పదునైన అస్త్రాలను రాహుల్ గాంధీ.. ప్రధాని మోదీ ప్రముఖ వ్యాపార వేత్తలకు లబ్ధి చేకూరుస్తున్నారంటూ ఆరోపణలు చేస్తూ వచ్చారు. అంతేకాదు బీజేపీ 22 మందిని బిలియనీర్లుగా మార్చిందని వ్యాఖ్యానించారు. అదే కాంగ్రెస్ ఈ సారి అధికారంలోకి వస్తే కోట్లాది మంది ప్రజల్ని లక్షాదికారుల్ని చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. అయితే తాజాగా, వేములవాడ సభలో పదే పదే రాహుల్ గాంధీ ఆరోపణలపై ప్రధాని మోదీ పదునైన అస్త్రాలను ఎక్కుపెట్టారు -
అమేథీపై తేల్చుకోలేకపోతున్న కాంగ్రెస్?
జాతీయ కాంగ్రెస్‌లో అమేథీ అభ్యర్థిత్వంపై గందరగోళం నెలకొంది. యూపీలోని అమేథీ నుంచి ఎవరిని ఎన్నికల బరిలో నిలపాలనేదానిపై ఢిల్లీ కాంగ్రెస్ దర్బార్‌లో సమావేశం జరిగి 72 గంటలు గడిచినా, ఎటువంటి ప్రకటనా వెలువడలేదు. అయితే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే.. త్వరలోనే అమేథీ అభ్యర్థిని తెలియజేస్తామని ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.అమేథీని గాంధీ కుటుంబానికి కంచుకోటగా పరిగణిస్తారు. అయితే 2019లో ఈ మ్యాజిక్‌ను స్మృతి ఇరానీ బద్దలు కొట్టారు. అమేథీ లోక్‌సభ స్థానం నుంచి ఇప్పటి వరకు ముగ్గురు కాంగ్రెసేతర ఎంపీలు మాత్రమే ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఓడిపోయిన తర్వాత పార్టీ ఆలోచనలో పడింది. ఇప్పుడు నామినేషన్‌కు నాలుగు రోజులు మాత్రమే గడువు ఉండడంతో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేది తెలియక స్థానిక పార్టీ నేతలు అయోమయంలో కూరుకుపోయారు. అమేథీ అభ్యర్థిని ప్రకటించనప్పటికీ కాంగ్రెస్, ఎస్పీల సమన్వయ కమిటీ సమాలోచనలు చేస్తోంది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ దీపక్ సింగ్ మాట్లాడుతూ అతి త్వరలోనే అమేథీ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేది వెల్లడవుతుందన్నారు. మే 3న రాష్ట్ర ఇన్చార్జి వస్తారని తెలిపారు. అప్పుడు ఇక్కడి అభ్యర్థి ఎవరనేది తెలుస్తుందని ఆయన అన్నారు.వయనాడ్ ఎన్నికల తర్వాత రాహుల్ అమేథీకి వచ్చే అవకాశం ఉందని గతంలో చర్చ జరిగింది. అయితే ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీలో ఇంకా నిశ్శబ్ధం కొనసాగుతోంది. ఇదేసమయంలో ఖర్గే చేసిన ప్రకటన ఇంకేదో సూచిస్తోందని రాజకీయ నిపుణులు అంటున్నారు. మరోవైపు బీజేపీపై ఆగ్రహంతో ఉన్న వరుణ్.. అమేథీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కూడా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. -
సెంటిమెంట్.. కొత్త ఉత్తేజం..
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడలో నిర్వహించిన జనజాతర సభ ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇక్కడ్నుంచే ప్రచారభేరి నిర్వహించి, అధికారంలోకి వచ్చిందని.. లోక్‌సభ ఎన్నికల్లోనూ కలసి వస్తుందన్న సెంటిమెంట్ కనిపించింది. ఈ సభకు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. సాయంత్రం 5 గంటల సమయానికి సభా ప్రాంగణం కిక్కిరిసింది. ముఖ్య అతిథి రాహుల్, ఇతర కీలక నేతల రాక ఆలస్యమైనా.. మంత్రులు, ఇతర నేతలు ప్రసంగిస్తూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. రాహుల్ సభా వేదిక వద్దకు చేరుకున్నాక.. సీనియర్ నేతలు వీహెచ్, జగ్గారెడ్డి, చిన్నారెడ్డి, మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పలువురు మహిళా నేతలు ఆయన వద్దకు వెళ్లి మాట్లాడారు. అనంతరం రాహుల్ ర్యాంప్‌పై నడుస్తూ అభివాదం చేశారు. తర్వాత ప్రసంగించారు. ఈ సమయంలో కార్యకర్తల నినాదాలతో సభాస్థలి మార్మోగిపోయింది. రాహుల్ రాక ఆలస్యం..: ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ శనివారం సాయంత్రం 6:15 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ తదితరులు స్వాగతం పలికారు. రాహుల్ వారితో కలసి నేరుగా నోవాటెల్ హోటల్‌కు వెళ్లారు. కాసేపు వారితో భేటీ అయ్యారు. తర్వాత సాయంత్రం 7:15 గంటల సమయంలో తుక్కుగూడ సభావేదిక వద్దకు చేరుకున్నారు. సభ అనంతరం 8:30 గంటల సమయంలో శంషాబాద్‌కు వెళ్లి, ఢిల్లీకి తిరుగు ప్రయాణం అయ్యారు. సభ తర్వాత సీఎం రేవంత్, మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు నోవాటెల్ హోటల్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా సభ జరిగిన తీరు, లోక్‌సభ ఎన్నికల ప్రచార షెడ్యూల్‌పై చర్చించినట్టు సమాచారం. న్యాయపత్రం విడుదల.. ‘ప్రత్యేక హామీలు’ వాయిదా జన జాతర సభ వేదికగా రాహుల్ గాంధీ కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టోను తెలుగులో ‘న్యాయ పత్రం’పేరిట విడుదల చేశారు. ‘మార్పు కోసం హస్తం’పేరుతో ఐదు గ్యారంటీల పత్రాన్ని కూడా విడుదల చేశారు. అయితే.. ఈ సభలోనే తెలంగాణ కోసం 23 హామీలతో రూపొందించిన ప్రత్యేక హామీలను కూడా ప్రకటించాల్సి ఉన్నా.. చివరి నిమిషంలో వాయిదా వేశారు. ఈ హామీలను త్వరలోనే తెలంగాణ ప్రజల ముందుంచుతామని టీపీసీసీ వర్గాలు తెలిపాయి. తెల్లం వెంకట్రావు రాకపై చర్చ! జన జాతర సభ వేదికపై భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కనిపించడం చర్చకు దారితీసింది. ఆయన ఇంకా కాంగ్రెస్‌లో చేరకపోయినా.. సభా వేదికపై కూర్చోవడం గమనార్హం. ఆయనతోపాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాదరెడ్డి, ఖమ్మం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఆసీనులయ్యారు. వెంకట్రావు, ప్రసాదరెడ్డిలను పలువురు కాంగ్రెస్ నేతలు కలసి అభినందిస్తూ కనిపించారు. -
Tukkuguda: ప్రతి మహిళ ఖాతాలో రూ.లక్షవేస్తాం: రాహుల్ గాంధీ
తుక్కుగూడ జన జాతర సభ.. రాహుల్ గాంధీ ప్రసంగం ముఖ్యాంశాలు కొన్ని రోజుల కిందటే ఇక్కడే తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశా కొన్ని నెలల క్రితం తెలంగాణకు చేసిన వాగ్ధానం గుర్తుంది మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాం తెలంగాణలో హామీలు నెరవేర్చినట్లు దేశంలోనూ మాట నిలబెట్టుకుంటాం దేశవ్యాప్తంగా నిరుద్యోగులకు రూ.లక్ష జీతంతో ఉద్యోగాలు కల్పిస్తాం ఐదు న్యాయసూత్రాలు భారతీయుల ఆత్మ యువతకు శిక్షణా కార్యక్రమాలు పెట్టబోతున్నాం ఏం చేయగలమో అదే మేనిఫెస్టోలో పెట్టాం మోదీ అధికారంలోకి వచ్చాక దేశ ప్రజలు నిరుపేదలయ్యారు తెలంగాణలో 30 వేల ఉద్యోగాలిచ్చాం మరో 50 వేల ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం రూ.500కు గ్యాస్ ఇచ్చాం 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ ఇచ్చాం దేశ ప్రజల మనసులోని మాటే మా మేనిఫెస్టో నారీ న్యాయ్ కింద ప్రతి మహిళ ఖాతాలోకి రూ.లక్ష వేస్తాం .. నారీ న్యాయ్‌తో దేశ ముఖ చిత్రం మారబోతోంది ప్రతి మహిళ ఖాతాలోకి రూ.లక్ష నగదు జమ చేస్తాం పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పిస్తాం దేశంలో నిత్యం 30 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మేం అధికారంలోకి రాగానే రైతుల రుణాలు మాఫీ చేస్తాం ధనవంతులకు మోదీ రూ.16 లక్షల కోట్లు మాఫీ చేశారు రైతులకు మాత్రం మోదీ రూపాయి కూడా మాఫీ చేయలేదు స్వామినాథన్ ఫార్ములా ప్రకారం రైతులకు మద్దతు ధర ఇస్తాం దేశంలో 50 శాతం మంది వెనుకబడిన వర్గాలే బడుగుల జానాభా 50 శాతం ఉంటే 5 శాతం ఉన్నవారి దగ్గరే అధికారం ఉంది కార్మికులకు కనీస వేతనాలు కల్పిస్తాం కేసీఆర్ ఫోన్లు ట్యాప్ చేయించారు... గతంలో ఉన్న సీఎం ప్రభుత్వాన్ని ఎలా నడిపించారో మీకు తెలుసు వేల మంది ఫోన్లను కేసీఆర్ ట్యాప్ చేయించాడు ఇంటెలిజెన్స్, పోలీసు వ్యవస్థను కేసీఆర్ దుర్వినియోగం చేశాడు రాత్రి పూట ఫోన్ చేసి డబ్బులు వసూలు చేశారు ప్రభుత్వం మారగానే డేటా మొత్తం ధ్వంసం చేశారు తెలంగాణలో కాంగ్రెస్ పని మొదలు పెట్టింది.. నిజం మీ ముందుంది కేసీఆర్ ఏం చేశారో మోదీరు అదే చేస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి ఇక్కడ ఏం చేశారో ఢిల్లీలో మోదీ అదే చేస్తున్నారు తెలంగాణలో బీజేపీ బీ టీమ్‌ను ఓడించాం ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణం ఎలక్టోరల్ బాండ్స్ ఈడీ ఎక్స్టార్షన్ డైరెక్టరేట్‌గా మారింది ఒక రోజు సీబీఐ ఒక కంపెనీకి ఝలక్ ఇస్తుంది అదే కంపెనీ మరుసటి రోజు ఎన్నికల బాండ్లు కొంటుంది బీజేపీ దగ్గర డబ్బుంది.. మా దగ్గర ప్రేముంది.. బీజేపీ దగ్గర డబ్బుంది.. మా దగ్గర మీ ప్రేముంది బీజేపీ అనే అతిపెద్ద వాషింగ్‌మెషిన్ నడుస్తోంది బీజేపీకి డబ్బు ఇచ్చిన కంపెనీలకే కాంట్రాక్టులు దక్కాయి బీజేపీ రాజ్యాంగాన్ని రద్దు చేయాలని చూస్తోంది మేము రాజ్యాంగాన్ని రద్దు చేయం మేనిఫెస్టోలో అన్ని వర్గాలకు న్యాయం చేశాం మా మేనిఫెస్టో దేశ ముఖ చిత్రాన్ని మార్చబోతోంది కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేశారు రైతులు, వెనుకబడిన వారికి మరో 5 హామీలు ఇచ్చాం ఢిల్లీలో కాంగ్రెస్ జెండా ఎగురబోతోంది: సీఎం రేవంత్‌రెడ్డి జాతికి 5 గ్యారెంటీలను రాహుల్ అంకితం చేశారు జాతీయ ఎన్నికల మేనిఫెస్టోను తెలంగాణ గడ్డ మీద నుంచి విడుదల చేయడం సంతోషం బీఆర్ఎస్ను ఓడించినట్లే దేశంలో బీజేపీని ఓడించాలి గత ప్రభుత్వం కేసులు పెట్టినా కాంగ్రెస్ శ్రేణులు వెనక్కి తగ్గలేదు బీఆర్ఎస్ను తుక్కుతక్కుగా ఓడించిన ఉత్సాహం తుక్కుగూడలో కనిపిస్తోంది ఢిల్లీలో కాంగ్రెస్ జెండా ఎగురబోతోంది ఉద్యోగాలివ్వనందుకు బీజేపీకి ఓటు వేయాలా తెలంగాణలో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తున్నాం పదేళ్లలో దేశానికి బీజేపీ ఏం చేసింది పదేళ్లలో ఎన్ని ఉద్యోగాలిచ్చారో చెప్పాలి కేసీఆర్‌కు చర్లపల్లిలో చిప్పకూడు తినిపిస్తా .. రేవంత్ మాజీ ముఖ్యమంత్రి భాష సరిగా లేదు పదేళ్ల పాలనలో తెలంగాణను పీడించారు కేసీఆర్ మాట్లాడుతున్న మాటలకు లుంగీ లాగి చర్లపల్లిలతో చిప్పకూడు తినిపిస్తా కేసీఆర్‌కు జైలులో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం జైలులో ఉండొచ్చు ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదు నేను జానారెడ్డిని కాదు.. ఊరుకోవడానికి పదేళ్లలో కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఎన్ని పదేళ్లలో వందేళ్ల విధ్వంసాన్ని సృష్టించారు లక్షలాది ఇందిరమ్మ ఇళ్లు కట్టించే బాధ్యత నాది మేం హామీలు నెరవేరిస్తే 14 లోక్‌సభ సీట్లు గెలిపించండి ఢిల్లీ నుంచి నిధులు తెచ్చుకోవాలంటే 14 మంది ఎంపీలను గెలిపించాలి కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టో రిలీజ్ చేసిన రాహుల్‌గాంధీ తుక్కుగూడ జనజాతర సభలో కాంగ్రెస్ మేనిఫెస్టో ఆవిష్కరించిన రాహుల్ తెలంగాణకు సంబంధించి మేనిఫెస్టోలో 23 అంశాలు న్యాయపత్రం పేరుతో కాంగ్రెస్ మేనిఫెస్టో 5 గ్యారెంటీల పత్రం పేరుతో మేనిఫెస్టో విడుదల భట్టి విక్రమార్క కామెంట్స్.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు 6 గ్యారెంటీలు ప్రకటించాం కేసీఆర్ పాలనలో వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయి ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నాం ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలిస్తున్నాం 200 యూనిట్ల విద్యుత్ జీరో బిల్లులిస్తున్నాం జనజాతర సభకు చేరుకున్న రాహుల్‌గాంధీ తుక్కుగూడ జనజాతర సభకు చేరుకున్న రాహుల్‌గాంధీ రాహుల్‌గాంధీ వెంట పలువురు కాంగ్రెస్ అగ్రనేత కేసీ వేణుగోపాల్ మేనిఫెస్టో విడుదల చేయనున్న రాహుల్‌గాంధీ కేసీఆర్ మాట, యాస అదుపులో ఉంచుకుని మాట్లాడాలి : మంత్రి పొన్నం పదేళ్లు సీఎంగా చేసిన వ్యక్తికి ఎలా మాట్లాడాలో తెలియడం లేదు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తాం రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న రాహుల్‌గాంధీ కాసేపట్లో తుక్కుగూడ కాంగ్రెస్ జనజాతర సభ సభ కోసం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న రాహుల్ గాంధీ ఘనస్వాగతం పలికిన సీఎం రేవంత్, భట్టి, దీపాదాస్ మున్షీ జాతీయ మేనిఫెస్టో విడుదల చేయనున్న రాహుల్‌గాంధీ తెలంగాణకు ఇచ్చే హామీలు వివరించనున్న రాహుల్ మళ్లీ సమర శంఖం కాంగ్రెస్ తెలంగాణ నుంచి లోక్‌సభ ఎన్నికల సమర శంఖాన్ని పూరించేందుకు సిద్ధమైంది. శనివారం సాయంత్రం హైదరాబాద్ నగర శివార్లలోని రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో జన జాతర పేరిట నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభ దీనికి వేదిక కానుంది. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ సభ వేదికగా పార్టీ మేనిఫెస్టోను తెలుగులో విడుదల చేయనున్నారు. దీంతోపాటు తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకమైన హామీలను కూడా ప్రకటించనున్నారు. మరోవైపు ఈ సభలోగానీ, అంతకుముందుగానీ కాంగ్రెస్ పెద్దల సమక్షంలో బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన పలువురు ముఖ్య నేతలు పార్టీలో చేరుతారని అంటున్నారు. ఇందులో ముగ్గురి నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారని ప్రచారం జరుగుతోంది. తుక్కుగూడ సభ ప్రారంభానికి ముందు నోవాటెల్ హోటల్లో రాహుల్ సమక్షంలో ఈ చేరికలు జరగొచ్చని.. తర్వాత వారు సభలో పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. చేరేది ఎవరన్నదానిపై మాత్రం గోప్యత పాటిస్తున్నారు. టీపీసీసీ జన జాతర సభకు ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేపట్టింది. 70 ఎకరాల్లో సభా ప్రాంగణం, 550 ఎకరాల్లో పార్కింగ్ సిద్ధం చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీపీసీసీ ఇదే ప్రాంగణంలో సభ నిర్వహించి.. సోనియా గాం«దీతో ఆరు గ్యారంటీలను ప్రకటింపజేసింది. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల శంఖారావానికి కూడా ఇదే ప్రాంగణాన్ని ఎంచుకోవడం గమనార్హం. ఇక ఎండలు మండిపోతున్న నేపథ్యంలో సభకు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, మంచినీటి కొరత రాకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. పార్లమెంటు స్థానాల వారీ ఇన్చార్జులు, అసెంబ్లీ సమన్వయకర్తల సమన్వయంతో.. సభకు 10లక్షల మందికిపైగా తరలి వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని కా>ంగ్రెస్ వర్గాలు తెలిపాయి. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చేపట్టబోయే అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించడంతోపాటు.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల పాలన విజయాలను ప్రజలకు వివరించనున్నారు. తెలంగాణకు ప్రత్యేక హామీలు తుక్కుగూడ సభలో కాంగ్రెస్ జాతీయ స్థాయి మేనిఫెస్టో ‘పాంచ్ న్యాయ్’ను తెలుగులో విడుదల చేయనుంది. దీనితోపాటు రాహుల్ గాంధీ తెలంగాణకు ప్రత్యేక హామీలను ఇవ్వనున్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీలో కలిపిన ఐదు భద్రాచలం సమీప గ్రామాలను తిరిగి తెలంగాణలో విలీనం చేస్తామని.. విభజన చట్టం హామీలన్నీ అమలు చేస్తామని హామీ ఇవ్వనున్నట్టు సమాచారం. ఐటీఐఆర్ వంటి ఉపాధి ప్రాజెక్టును కేటాయిస్తామనే హామీ కూడా ఉంటుందని తెలిసింది. చేరికలపై గోప్యత జన జాతర సభ సందర్భంగా బీఆర్ఎస్కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ చేరికల అంశాన్ని టీపీసీసీ గోప్యంగా ఉంచుతోంది. పార్టీ ముఖ్య నేతతోపాటు ఆయనకు అత్యంత సన్నిహితుడైన ఓ నాయకుడికి మాత్రమే దీనిపై స్పష్టత ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చేరే అవకాశం ఉందని.. నోవాటెల్ హోటల్లో రాహుల్ గాం«దీని ఎంపీ కె.కేశవరావు కలుస్తారని మాత్రం పేర్కొంటున్నాయి. మరోవైపు కాంగ్రెస్‌లో చేరేవారు వీరే అంటూ కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పేర్లు ప్రచారం అవుతున్నాయి. కాలేరు వెంకటేశ్, కోవ లక్ష్మి, కాలె యాదయ్య, బండారి లక్ష్మారెడ్డి, గంగుల కమలాకర్, టి.ప్రకాశ్‌గౌడ్, మాణిక్‌రావు, డి.సు«దీర్‌రెడ్డి, అరికెపూడి గాం«దీ, మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్ ఈ జాబితాలో ఉన్నట్టు చెప్తున్నారు. కానీ వీరిలో ఎందరు చేరుతారు, ఎవరు చేరుతారన్నది స్పష్టత లేదు. దీనిపై టీపీసీసీ ముఖ్య నాయకుడొకరు మాట్లాడుతూ.. ‘బీఆర్ఎస్కు చెందిన మెజార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరడమైతే ఖాయమే. అన్ని సన్నివేశాలను వెండితెరపై చూడాల్సిందే..’’ అని వ్యాఖ్యానించడం గమనార్హం. శంషాబాద్ నుంచి నోవాటెల్‌కు.. తర్వాత సభకు.. రాహుల్ గాంధీ శనివారం సాయంత్రం 5 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నోవాటెల్ హోటల్‌కు వస్తారు. కొంతసేపు పార్టీ నేతలతో భేటీ అయ్యాక.. తుక్కుగూడ సభకు చేరుకుంటారు. సభ ముగిశాక రాత్రి 7 గంటల సమయంలో శంషాబాద్ మీదుగా తిరిగి ఢిల్లీకి బయలుదేరుతారు. -
6న కాంగ్రెస్‌లోకి భద్రాచలం ఎమ్మెల్యే?
ఇల్లెందు: భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది. ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి పలుమార్లు సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన ఆయన గత నెల 12న మణుగూరులో కాంగ్రెస్ ఆధ్వర్యాన జరిగిన సభకు సైతం హాజరయ్యారు. మంగళవారం ఇల్లెందులో జరిగిన మహబూబాబాద్ లోక్‌సభ స్థాయి కాంగ్రెస్ సమావేశంలోనూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలసి వెంకట్రావు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమైనట్లు సమాచారం. ఈ నెల 6న తుక్కుగూడలో జరిగే సభలో రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. దీనిపై వెంకట్రావును వివరణ కోరగా త్వరలో వివరాలు వెల్లడిస్తానని చెప్పారు. వ్యవస్థలను కేసీఆర్ నాశనం చేశారు: తుమ్మల ఇల్లెందు సభలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ పదేళ్ల పాలనలో వ్యవస్థలన్నీ దుర్వి నియోగం చేశారని ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా గత ఎన్నికల సందర్భంగా సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీలు అమలు చేసి తీరతామని, గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు కొనసాగిస్తూ కొత్తవి కూడా అమలు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో 7,145 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ప్రతి గింజనూ కొంటామన్నారు. ఇప్పటికే 92.36 శాతం రైతుబంధు పంపిణీ పూర్తి చేశామని, పంటల బీమా పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. -
ఏటా 2 కోట్ల ఉద్యోగాల హామీ ఏమైంది?..బీజేపీపై రాహుల్ ఆగ్రహం
ఉద్యోగాల రూప కల్పన విషయంలో బీజేపీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశ యువత ఇదే విషయంపై తమని ప్రశ్నిస్తోందని అన్నారు. ఎన్నికల ముందు యువతకు చేసిన వాగ్ధానం ‘యువ న్యాయ్’ ద్వారా ఉపాధి విప్లవానికి కాంగ్రెస్ శ్రీకారం చుట్టిందని ఆయన హామీ ఇచ్చారు. ‘ప్రధాని మోదీ జీ యువతకు ఉపాధి కోసం మీ వద్ద ఏదైనా ప్రణాళికలు ఉన్నాయా? అనే ప్రశ్న ప్రతి యువతీ యువకుల్లో ఉంది. ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని అబద్ధం ఎందుకు చెప్పారు’ అని ప్రశ్నించారు. 'యువ న్యాయ్ ఆధ్వర్యంలో ఉపాధి విప్లవం చేపట్టాలని కాంగ్రెస్ సంకల్పించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం, చదువుకున్న వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. ‘పెహ్లీ నౌక్రి పక్కీ’ పథకాన్ని అమలు చేయడం ద్వారా పేపర్ లీకేజీలు కాకుండా చూస్తామని రాహుల్ గాంధీ ఎక్స్.కామ్‌లో పోస్ట్ చేశారు. -
కాంగ్రెస్‌కు ఓటు వేయలేని స్థితిలో రాహుల్, సోనియా?
ఈ టైటిల్ చూసి ఏవేవో ఊహలకు వెళ్లకండి. ఓటు వేసే విషయంలో వారిపై ఎటువంటి నిర్బంధం లేదు. అయితే ఇక్కడొక ట్విస్ట్ ఉంది. అదేమిటో, వారితో పాటు ప్రియాంకా గాంధీ కూడా కాంగ్రెస్‌కు ఓటు వేయలేని పరిస్థితిలో ఎందుకు ఉన్నారో, దీనికి గల కారణమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఢిల్లీలో ఆసక్తిగా మారనున్న రాజకీయ సమీకరణాలను మనం చూడబోతున్నాం. ‘ఇండియా కూటమి’ ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీతో సీట్లను పంచుకున్నప్పుడు, గాంధీ కుటుంబానికి చెందిన ఈ ముగ్గురు నేతల ఓట్లు కాంగ్రెస్‌కు పడే అవకాశాలు లేవని ఎవరూ ఊహించివుండరు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు న్యూఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గానికి చెందిన ఓటర్లు. అయినా వారు ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో వారి సొంత పార్టీకి ఓటు వేసుకోలేరు. ‘ఆప్’తో పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉన్న న్యూఢిల్లీ స్థానాన్ని అరవింద్ కేజ్రీవాల్ పార్టీకి అప్పగించింది. న్యూఢిల్లీ, దక్షిణ ఢిల్లీ, తూర్పు ఢిల్లీ, పశ్చిమ ఢిల్లీ లోక్‌సభ స్థానాల్లో ‘ఆప్’ పోటీ చేయనుండగా, కాంగ్రెస్ చాందినీ చౌక్, ఈశాన్య ఢిల్లీ, నార్త్ వెస్ట్ ఢిల్లీలో పోటీ చేస్తోంది. న్యూఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం ఒకప్పుడు కాంగ్రెస్ రాజకీయాలకు నెలవుగా ఉండేది. అయితే 2014లో మోదీ వేవ్ ఇక్కడి అన్ని సమీకరణలను తుడిచిపెట్టేసింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి గాంధీ కుటుంబ సభ్యులు తమ సొంత పార్టీకి ఓటు వేయలేని పరిస్థితి ఏర్పటడం బహుశా ఇదే తొలిసారి. నిజానికి కాంగ్రెస్ పార్టీ తనకు తగ్గుతున్న మద్దతు కారణంగా, యూపీ, ఢిల్లీతో సహా అనేక రాష్ట్రాల్లో ఇతర పార్టీలతో చేతులు కలపవలసి వచ్చింది. 1952- 2009 మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ న్యూఢిల్లీ స్థానాన్ని ఏడు సార్లు గెలుచుకుంది. బీజేపీకి చెందిన మీనాక్షి లేఖి ఇక్కడి నుంచి వరుసగా రెండుసార్లు లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు. 2004, 2009 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ న్యూఢిల్లీ స్థానం నుండి గెలిచి పార్లమెంటుకు చేరుకున్నారు. కాంగ్రెస్ నేతలైన సోనియా, రాహుల్, ప్రియాంకల ఇళ్లు న్యూఢిల్లీ ఏరియాలోనే ఉండటంతో వారికి ఇక్కడే ఓటు హక్కు ఉంది. మరోవైపు ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు రాజీవ్ శుక్లా కూడా న్యూఢిల్లీ ఓటర్లే. దీంతో వీరు కూడా కాంగ్రెస్‌కు ఓటు వేయలేని స్థితిలో ఉన్నారు. -
సాగురైతుల అభివృద్దే లక్ష్యం: రాహుల్ గాంధీ
నాసిక్: రైతుల సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా విపక్షాల ‘ఇండియా’ కూటమి పనిచేస్తుందని కాంగ్రెస్ నేత రాహుల్ ప్రకటించారు. తమ కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తే చేపట్టబోయే రైతు సంక్షేమ కార్యక్రమా లను రాహుల్ వివరించారు. గురువారం మహారాష్ట్రలో చాంద్‌వడ్‌లో రైతుర్యాలీలో ప్రసంగించారు. ‘‘ రైతన్నల ప్రయోజనాలే మాకు పరమావధి. వ్యవసాయాన్ని జీఎస్టీ పరిధి నుంచి తొలగిస్తాం. పంట బీమా పథకంలో సంస్కరణలు తెచ్చి రైతు అనుకూల విధానాలను ప్రవేశపెడతాం’ అని అన్నారు. -
నీటి పాట్లు.. పెళ్లికి అగచాట్లు
బనశంకరి: బెంగళూరు నగరంలో వేసవి నీటి కొరత ప్రజలను పీడిస్తోంది. అలాగే యువకులు పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు కూడా దొరకడం లేదు. నరేంద్ర అనే యువకుడు తన స్నేహితునికి పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి దొరకడం లేదని సోమవారం ఎక్స్‌లో బాధ వెళ్లబోసుకున్నాడు. ఇందుకు నీటి సమస్యే కారణమని చెప్పాడు. తన పోస్టును కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి ట్యాగ్ చేశాడు. రాహుల్‌గాంధీ గారు.. దయచేసి మీరు బెంగళూరులో నీటి సమస్యను పరిష్కరించాలి. ఐటీ ఉద్యోగం చేస్తున్న నా స్నేహితుడు వధువు కోసం ఎంతగానో గాలించినా ప్రయోజనం లేదు. ఐటీ సిటీలో నీటి సమస్య వల్ల అమ్మాయిలు పెళ్లికి ఒప్పుకోవడం లేదని నా స్నేహితుడు బాధపడినట్లు తెలిపాడు. మొత్తం మీద ఈ ఎండాకాలం సిలికాన్ సిటీకి చుక్కలు చూపిస్తోంది. గత నెలరోజుల నుంచి బెంగళూరులో నీటి కొరత తీవ్రరూపం దాల్చింది. నీటి బొట్టుకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నీటిని సరఫరా చేయడానికి ప్రభుత్వం, బెంగళూరు జలమండలి శ్రమిస్తున్నాయి. లక్ష బోర్లు ఎండిపోయాయి. నగరంలో 257 ప్రాంతాల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. -
భారత్ జోడో న్యాయ యాత్రకు అఖిలేష్ దూరం?
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సారధ్యంలో ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో కొనసాగుతున్న భారత్‌జోడో న్యాయ యాత్రలో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్ఫీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ పాల్గొనడం లేదని సమాచారం. లోక్‌సభ ఎన్నికల సీట్ల కేటాయింపు విషయంలో ఒప్పందం కుదరకపోవడమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. అయితే ఈ రెండు పార్టీల మధ్య సీట్ల విషయంలో సోమవారం తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే రాయ్‌బరేలీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ న్యాయ యాత్రలో అఖిలేష్ పాల్గొంటారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆహ్వానాన్నిఅఖిలేష్ అంగీకరించి, అమేథీ లేదా రాయ్ బరేలీలో జరిగే న్యాయ యాత్రలో పాల్గొంటానని స్వయంగా ప్రకటించారు. రాహుల్ యాత్ర సోమవారం అమేథీలో, మంగళవారం రాయ్‌బరేలీలో ఉండనుంది. సోమవారం అఖిలేష్ అమేథీకి వెళ్లడం లేదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాయ్‌బరేలీలో జరిగే న్యాయ యాత్రలో ఆయన పాల్గొనవచ్చని, అయితే దీనిపై స్పష్టత లేనందున ఎలాంటి సన్నాహాలు చేయడం లేదని పార్టీ వర్గాలు తెలిపాయి. -
రాహుల్, ప్రియాంక మధ్య విబేధాలు? బీజేపీ సందేహం వెనుక ఏముంది?
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా శుక్రవారం ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో పాల్గొనలేకపోయారు. తాను యాత్రకు గైర్హాజరు కావడం వెనుక అనారోగ్యమే కారణమని, ఆరోగ్యం మెరుగుపడిన వెంటనే ఈ ప్రయాణంలో భాగమవుతానని ప్రియాంక తెలిపారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న ఈ యాత్ర ప్రారంభమై 34 రోజులు దాటింది. ఈ నేపధ్యంలో ప్రియాంకా గాంధీ తొలిసారిగా దీనిలో పాల్గొనబోతున్నారనే ప్రకటన వెలువడింది. అయితే ఇంతలోనే ఆమె ఈ యాత్రకు గైర్హాజరు కావడంపై బీజేపీ సందేహం వ్యక్తం చేసింది. అన్నాచెల్లెళ్ల మధ్య బేధాభిప్రాయాలే దీనికి కారణమని బీజేపీ ఆరోపించింది. ప్రియాంక గాంధీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో చేసిన పోస్ట్‌లో తాను అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నానని, అందుకే ఆసుపత్రిలో చేరినట్లు తెలియజేశారు. ఆమె తన పోస్ట్‌లో ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ ఉత్తరప్రదేశ్‌కు ఎప్పుడు చేరుకుంటుందానని నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. అయితే అనారోగ్యం కారణంగా నేను ఈరోజే ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. నా ఆరోగ్యం కొద్దిగా మెరుగుపడిన వెంటనే, నేను ఆ ప్రయాణంలో భాగమవుతాను. చందౌలీ-బనారస్‌లో జరిగే ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో పాల్గొనబోయే నేతలకు, కార్యకర్తలకు, నా ప్రియమైన సోదరునికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’ అని పేర్కొన్నారు. सबको अपने स्वास्थ्य का ख़्याल रखना चाहिए। जब यात्रा 2.0 शुरू हुई तब भी प्रियंका वाडरा वहाँ से नदारद थीं, और आज जब राहुल की यात्रा उत्तर प्रदेश पहुँची है, तब भी प्रियंका वहाँ नहीं रहेंगी। पार्टी पर मिल्कियत के लिए भाई-बहन के बीच ना पटने वाली ये खाई अब सर्वविदित है। pic.twitter.com/26KaPOBeYY — Amit Malviya (@amitmalviya) February 16, 2024 మరోవైపు డీహైడ్రేషన్, వికారం కారణంగా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ ఆస్పత్రిలో చేరాల్సి వచ్చిందని పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా ప్రియాంక గాంధీ తన ఆరోగ్య వివరాల గురించి చేసిన ట్వీట్‌కు బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ స్పందించారు. ప్రియాంక గాంధీ పోస్ట్‌పై ఆయన వ్యాఖ్యానిస్తూ ‘ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. యాత్ర 2.0 ప్రారంభమైనప్పుడు కూడా ప్రియాంక వాద్రా కనిపించలేదు. రాహుల్ యాత్ర ఉత్తరప్రదేశ్ చేరుకున్నప్పుడు కూడా ప్రియాంక హాజరుకావడం లేదు. పార్టీ నాయకత్వం కోసం అన్నాచెల్లెళ్ల మధ్య ఏర్పడిన ఈ పూడ్చలేని అగాధం ఇప్పుడు అందరికీ తెలుస్తోంది’ అని పేర్కొన్నారు. ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ యాత్ర 2024, జనవరి 14న కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో మణిపూర్ నుంచి ప్రారంభమైంది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం మార్చి 20 లేదా 21న ముంబైలో ముగియనుంది. అయితే మార్చి మొదటి పక్షంలోనే ముంబైలో ఈ యాత్ర ముగుస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ యాత్ర శుక్రవారం సాయంత్రం ఉత్తరప్రదేశ్‌లోకి ప్రవేశించింది. ఇది తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని జిల్లాల గుండా వెళుతూ, ఫిబ్రవరి 16 నుండి 21 తేదీల మధ్య రాయ్‌బరేలీ అమేథీల గుండా ముందుకు వెళుతుంది. ఫిబ్రవరి 22, 23లలో యాత్రకు విశ్రాంతినివ్వనున్నారు. ఈ యాత్ర పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో ఫిబ్రవరి 24, 25 తేదీలలో తిరిగి ప్రారంభం కానుంది. -
జార్ఖండ్‌లో భారత్ జోడో న్యాయ యాత్ర రద్దు
రాహుల్ గాంధీ రెండో దశ భారత్ జోడో న్యాయ యాత్ర బుధవారం జార్ఖండ్‌లో ప్రారంభం కావాల్సి ఉండగా, ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమం కారణంగా రద్దయ్యింది. రైతు ఉద్యమంలో పాల్గొనేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఢిల్లీ వెళ్లారని, అందుకే ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చిందని పార్టీ వర్గాలు తెలిపాయి. పంజాబ్ రైతులు తమ డిమాండ్లు నెరవేరేందుకు ఢిల్లీలో నిరసనలు చేపడుతున్నారు. కాగా బుధవారం రాహుల్ గాంధీ ఛత్తీస్‌గఢ్‌లోని గర్వా జిల్లా నుంచి జార్ఖండ్‌లో అడుగుపెట్టాల్సి ఉంది. అయితే రైతుల ఆందోళన దృష్ట్యా జార్ఖండ్‌లో భారత్ జోడో న్యాయ యాత్ర కార్యక్రమాన్ని రద్దు చేశామని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సోనాల్ శాంతి తెలిపారు. రైతుల ఆందోళన అనంతరం ఈ యాత్రను పునఃప్రారంభిస్తామని తెలిపారు. -
జార్ఖండ్ ప్రభుత్వంపై... బీజేపీ కుట్ర: రాహుల్
డియోహర్(జార్ఖండ్): జార్ఖండ్‌లో ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు బీజేపీ కుట్ర పన్నిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా శనివారం జార్ఖండ్‌లోని గొడ్డాలో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. అనంతరం దేవగఢ్‌లో ప్రఖ్యాత బైద్యనాథ్ ఆలయంలో రుద్రాభిషేకం చేశారు. స్థానిక ర్యాలీలో మాట్లాడారు. ‘‘యువత ఉద్యోగాలు కోరుతుంటే ప్రధాని మోదీ మాత్రం దేశంలో నిరుద్యోగమనే వ్యాధిని వ్యాప్తి చేస్తున్నారు. ఈ వ్యాధి సోకిన యువత భవిష్యత్తును నాశనం చేసుకుంటోంది’’ అని రాహుల్ అన్నారు. దేశంలో గిరిజన, దళిత, వెనుకబడిన వర్గాల ప్రజల సంఖ్యను కచ్చితంగా తేల్చేందుకు కులగణన అవసరం ఎంతో ఉందని ఆయన చెప్పారు. దేశంలో అన్యాయాలకు గురవుతున్న వారిలో ఈ వర్గాల ప్రజల సంఖ్య పెరుగుతూ పోతోందని తెలిపారు. -
అనైక్యతా కూటమి
వచ్చే ఎన్నికల్లో అధికార బీజేపీని గద్దె దింపడమే లక్ష్యంగా ఐక్యంగా ప్రతిఘటిస్తామని 28 పార్టీల కలగూరగంప ‘ఇండియా’ కూటమి ఆది నుంచి చెబుతోంది. కానీ, ఎన్నికలు ముంచుకొస్తుంటే, కూటమి బీటలు వారుతోంది. అంతటా అనైక్యతా రాగాలే వినిపిస్తున్నాయి. పశ్చిమబెంగాల్లో కాంగ్రెస్‌తో పొత్తు ఉండదని ఆ రాష్ట్ర సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ బుధవారం తేల్చేశారు. ‘ఆప్’ నేత – పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ సైతం తమ రాష్ట్రంలోనూ అంతే అని కుండబద్దలు కొట్టారు. జేడీ(యూ) అధినేత – బిహార్ సీఎం నితీశ్ కుమార్ పైకి ఏమీ చెప్పకున్నా, లోలోపల కుతకుతలాడుతున్నట్టు కనిపిస్తూనే ఉంది. వెరసి, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘భారత్ జోడో’ అని తిరుగుతుంటే, ముందుగా ‘ఇండియా(కూటమి) జోడో’ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. రాహుల్ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ బెంగాల్లోకి ప్రవేశించడానికి ఒక రోజు ముందే మమత షాక్ ఇచ్చారు. బెంగాల్లో హస్తం బలం పుంజుకుంటే, అది తనకు తలనొప్పి అవుతుందని మమతకు తెలుసు. అందుకే, కలసికట్టుగా పోటీ చేసినా... రాష్ట్రంలో నిరుడు కాంగ్రెస్ నెగ్గిన 2 లోక్‌సభా స్థానాలనే ఆ పార్టీకి కేటాయిస్తామన్నది తృణమూల్ ప్రతిపాదన. దూకుడు ప్రదర్శిస్తున్న స్థానిక హస్తం నేతలు అందుకు ససేమిరా అంటున్నారు. ముఖ్యంగా రాష్ట్ర పీసీసీ ప్రెసిడెంట్, కాంగ్రెస్ లోక్‌సభా పక్ష నేత అధీర్ రంజన్ చౌధురి నిత్యం మమతపై చేస్తున్న విమర్శలు చివరకు ఇక్కడకు తెచ్చాయి. కాంగ్రెస్ పెద్దలు నష్టనివారణకు ప్రయత్నిస్తున్నా రాజీ లేదని దీదీ కొట్టిపారే శారు. కూటమిలో కొనసాగుతామంటూనే, ఎన్నికలయ్యాక కాంగ్రెస్ బలాన్ని బట్టి మిగతావి మాట్లా డదామని ఆమె చెబుతున్న మాటలు కంటితుడుపుకే తప్ప, బీజేపీపై కలసికట్టు పోరుకు పనికిరావు. మరోపక్క ‘ఇండియా’ కూటమి ఏర్పాటులో కీలక పాత్రధారి, జేడీ (యూ) అధినేత, బిహార్ సీఎం అయిన నితీశ్ కుమార్ వ్యవహారశైలి సైతం అనుమానాస్పదంగానే ఉంది. కూటమిలో తనకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదని ఆయన అసంతృప్తితో ఉన్నారు. మోదీతో రామ్ రామ్ చెప్పి, ప్రతిపక్ష కూటమిలో చేరిన ఆయన తీరా ఇప్పుడు మళ్ళీ అధికార ఎన్డీఏ కూటమికే తిరిగి వచ్చేస్తారని ఊహాగానం. బిహార్‌లో ఉమ్మడి పాలన సాగిస్తున్న ఆర్జేడీ – జేడీయూల మధ్య కొన్నాళ్ళుగా సఖ్యత లేదు. ప్లేటు ఫిరాయించడంలో పేరొందిన నితీశ్ గతంలో బీజేపీకి కటీఫ్ చెప్పి, ఆర్జేడీతో కలసి ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాటు చేశారు. కానీ, ఇటీవల తననే గద్దె దింపాలని చూసిన ఆర్జేడీ మీద గుర్రుగా ఉన్నారు. ఆ పార్టీని పక్కకు నెట్టి, మళ్ళీ కమలనాథులతో నితీశ్ చేతులు కలిపే సూచనలున్నట్టు పుకారు. బిహార్‌లో జేడీయూ, ఆర్జేడీ నేతలు ఎవరికి వారు గురువారం కీలక భేటీలు జరపడం, ఢిల్లీలో రాజకీయ వాతావరణం వేడెక్కిన తీరు చూస్తుంటే... ఆ రెండు పార్టీల ప్రేమకథ ముగిసినట్టే ఉంది. మరి, రాజకీయ చాణక్యుడు నితీశ్ రానున్న రోజుల్లో ఏం చేస్తారో చూడాలి. విచిత్రమేమిటంటే, మాటలే తప్ప చేతల్లో కూటమి అడుగు ముందుకు పడట్లేదు. సెప్టెంబర్‌లో అనుకున్న సీట్ల సర్దుబాటు వ్యవహారం డిసెంబర్‌కి వాయిదా పడి, జనవరి ముగిసిపోతున్నా అతీగతీ లేకుండా పడివుంది. అన్ని పార్టీలూ కలసి సమష్టి ప్రతిపక్ష ర్యాలీ భోపాల్‌లో చేయాలనుకున్నా అది కార్యరూపం దాల్చలేదు. నెలలు గడుస్తున్నా ఉమ్మడి మేనిఫెస్టో ఊసే లేదు. లౌకికవాద, రాజ్యాంగబద్ధ పాలన కోసం పోరాటం అని చెబుతున్నా... బీజేపీ వ్యతిరేకత, మోడీని గద్దె దింపడమనే లక్ష్యం మినహా తగిన సమష్టి సైద్ధాంతిక భూమికను సిద్ధం చేసుకోవడంలో ప్రతిపక్ష కూటమి విఫలమైంది. వివిధ రాష్ట్రాల్లో తమ బలాబలాలు తెలుసు గనక, పార్టీలు తమలో తాము పోరాడే కన్నా బీజేపీపై బాణం ఎక్కుపెడితే ప్రయోజనం. ఒకటి రెండు సీట్లకై పంపిణీలో కలహించుకొనే కన్నా పెద్ద లక్ష్యం కోసం విశాల హృదయంతో త్యాగాలకు సిద్ధపడితేనే లక్ష్యం చేరువవుతుంది. బెంగాల్లో తృణమూల్, పంజాబ్, ఢిల్లీల్లో ఆప్ లేకుండా కూటమికి ప్రాసంగికత ఏముంది? వాస్తవాల్ని గుర్తించి కాంగ్రెస్ తన వైఖరి మార్చుకోవాలి. పెద్దమనిషిగా కాక, అందరికీ పెద్దన్నగా వ్యవహరించాలనుకోవడంతోనే అసలు ఇబ్బంది. అలాగే, ‘యాత్ర’లతో రాహుల్ ఇమేజ్ పెరగ వచ్చేమో కానీ, ప్రతిపక్ష కూటమికి జరిగే ప్రయోజనమేమిటో తక్షణం చెప్పలేం. మణిపుర్ నుంచి ముంబయ్ దాకా 100 లోక్‌సభా స్థానాల మీదుగా సాగి, మార్చి 20న యాత్ర ముగియనుంది. అన్ని పార్టీలనూ ఒక తాటిపై నడిపి, సమన్వయం సాధించాల్సిన ఎన్నికల వేళ రాహుల్ దూరంగా యాత్రలో ఉంటే ఎలా? కనీసం అన్ని పార్టీలతో కలిసైనా యాత్ర చేయాల్సింది. ప్రభుత్వానికి వ్యతి రేకంగా ప్రతిపక్షాల్ని కూడగట్టడంలో 1977లో జేపీ, 1989లో వీపీ సింగ్, ఆ తరువాత యూపీఏ కాలంలో అందరి సమన్వయానికి సోనియా లాంటి వారు కృషి చేశారు. ప్రస్తుతం యాత్రతో రాహుల్, పార్టీ పునరుజ్జీవనంతో ఖర్గే బిజీ. మరి, కూటమి మెడలో ఐక్యత గంట కట్టేదెవరు? మొత్తానికి, ఎన్నికలు సమీపిస్తున్న వేళ మోదీ రోడ్‌షోలు, ప్రచారగీతాలతో సింహనాదం చేస్తుంటే, ప్రతిపక్షాలు వేటికవి స్వలాభం చూసుకుంటూ విభేదాల బాట పట్టడం విడ్డూరం. సమావేశాలతో హంగామా రేపుతూ మొదలైన ప్రతిపక్ష కూటమి తీరా ఆట ఆడకుండానే ‘వాక్ ఓవర్’తో మోదీకి విజయం కట్టబెడుతోందని అనిపిస్తోంది. 28 కత్తులు ఒకే ఒరలో ఇమడడం కష్టమే. కానీ, అన్ని పార్టీ లకూ ఒకే లక్ష్యం ఉంటే, అసాధ్యం కాకపోవచ్చు. నిష్క్రియాపరత్వంతో, సొంత లాభం కోసం సాటి పార్టీల కాళ్ళు నరికే పనిలో ఉంటే లాభం లేదు. ఢిల్లీలో పాగా వేయాలంటే, సమయం మించిపోక ముందే కళ్ళు తెరవాలి. కూటమిది ఆరంభ శూరత్వం కాదని నిరూపించాలి. కలహాలు మాని కార్యా చరణకు దిగాలి. లేదంటే తర్వాతేం చేసినా చేతులు కాలాక ఆకులు పట్టుకోవడమే అవుతుంది.