సాక్షి, న్యూఢిల్లీ : రఫేల్ ఒప్పందంలో ప్రధాని నరేంద్ర మోదీని విచారించాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. రఫేల్ ఒప్పందంలో ప్రధాని మోదీ బైపాస్ సర్జరీ చేశారు. అనిల్ అంబానీకి ప్రయోజనం చేకూర్చేలా ఒప్పందంలో జాప్యం చేశారని రాహుల్ వ్యాఖ్యానించారు. 2016లో నోట్ల రద్దు తర్వాత లక్షలాది ఉద్యోగాలు గల్లంతైన తరహాలో రఫేల్ ఒప్పందానికి సంబంధించిన ఫైళ్లు మాయమయ్యాయని రాహుల్ ఎద్దేవా చేశారు.
రఫేల్ ఒప్పందానికి సంబంధించి కీలక పత్రాలు చోరీ అయ్యాయని సుప్రీం కోర్టులో ప్రభుత్వం పేర్కొన్న నేపథ్యంలో రాహుల్ వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. ‘ఈ రోజుల్లో అన్నీ అదృశ్యమవుతున్నాయి..రెండు కోట్ల మంది ఉద్యోగాలు కనుమరుగయ్యాయి..ప్రజలందరి ఖాతాల్లో రూ 15 లక్షలు జమచేస్తానన్న హామీ మాయామైంది...వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కనుమరుగైంది..ఇప్పుడు రఫేల్ ఫైళ్లు మాయమయ్యా’యని రాహుల్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment