సాక్షి, వేములవాడ : కాంగ్రెస్ యువరాజు రాఫెల్ కుంభకోణం బయటపడిన నాటి నుంచి ఐదేండ్లుగా ఒక్కటే జపం చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రకటన తర్వాత ఆయన నోరు మెదపరేం అంటూ ప్రధాని మోదీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై విమర్శనాస్త్రాలు సంధించారు.
లోక్‌సభ ఎన్నికల తరుణంలో వేములవాడలో బీజేపీ శ్రేణులు భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఆ సభలో పాల్గొన్న మోదీ.. రాహుల్ గాంధీపై ప్రశ్నల వర్షం కురిపించారు.
ఎందుకు సైలెంట్ అయ్యారు
ఐదేళ్లుగా ఫైవ్ ఇండస్ట్రీలిస్ట్.. ఫైవ్ ఇండస్ట్రీలిస్ట్..ఆపై అంబానీ-అదానీ అంటూ జపం చేసిన రాహుల్ గాందీ లోక్‌సభ ఎన్నికల ప్రకటనతో ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు.
తెలంగాణ గడ్డమీద నుంచి
తెలంగాణ గడ్డమీద నుంచి రాహుల్ గాంధీని ఒకటే అడుగుతున్నా అంబానీ, అదానీల నుంచి ఎంత తీసుకున్నారు? మీ మధ్య ఒప్పందం ఏమైనా జరిగిందా? లేకపోతే ఓవర్ నైట్‌లోనే అంబానీ, అదానీలను విమర్శించడం ఎందుకు మానేశారని ప్రశ్నించారు.
పదునైన అస్త్రాలను
రాహుల్ గాంధీ.. ప్రధాని మోదీ ప్రముఖ వ్యాపార వేత్తలకు లబ్ధి చేకూరుస్తున్నారంటూ ఆరోపణలు చేస్తూ వచ్చారు. అంతేకాదు బీజేపీ 22 మందిని బిలియనీర్లుగా మార్చిందని వ్యాఖ్యానించారు. అదే కాంగ్రెస్ ఈ సారి అధికారంలోకి వస్తే కోట్లాది మంది ప్రజల్ని లక్షాదికారుల్ని చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. అయితే తాజాగా, వేములవాడ సభలో పదే పదే రాహుల్ గాంధీ ఆరోపణలపై ప్రధాని మోదీ పదునైన అస్త్రాలను ఎక్కుపెట్టారు
Comments
Please login to add a commentAdd a comment