
సాక్షి,హైదరాబాద్ : బీఆర్‌ఎస్‌లో గెలిచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్‌పై హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా అనర్హత పిటిషన్లపై విచారణకు అర్హతలేదని డైరెక్టర్ జనరల్ వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు విచారణను ఈ నెల 11కి వాయిదా వేసింది.
కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు ప్రకటించాలని కోరుతూ హుజురాబాద్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఎమ్మెల్యే పాడి కౌషిక్ రెడ్డి పిటిషన్‌లో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్‌ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పేర్లను ప్రధానంగా ప్రస్తావించారు.
Comments
Please login to add a commentAdd a comment