‘ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది’.. జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు | Jagga Reddy Interesting Comments About Defeat On Assembly Election | Sakshi
Sakshi News home page

‘ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది’.. జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Published Sun, Jul 7 2024 7:26 PM | Last Updated on Sun, Jul 7 2024 7:44 PM

Jagga Reddy Interesting Comments About Defeat On Assembly Election

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి చాలా ప్రశాంతంగా ఉన్నానంటూ సంగారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘‘నేను ఎమ్మెల్యేగా ఒడిపోయినందుకు చాలా ప్రశాంతంగా ఉన్నా. మనస్ఫూర్తిగా చెబుతున్న మొన్నటి ఎన్నికల్లో ఓడిపోవడంతో నేనే రిలాక్స్ అవుతున్నా. నాయకులు, కార్యకర్తలు ఎవరు కూడా నేను ఓడిపోయానని బాధపడొద్దు. కాంగ్రెస్‌ అధికారంలో ఉంది కాబట్టి పనులు చేసుకుందామని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా  సంగారెడ్డి ప్రజల కోసం మనం జవాబుదారీగా ఉండాలని సూచించారు.

‘‘సంగారెడ్డి ప్రజల కోసం రెండు నెలల తర్వాత ప్రతి సోమవారం సంగారెడ్డిలోని రాంనగర్ లో నా ఇంటి వద్ద అందిబాటులో ఉంటా. కార్యకర్తలు ఎవరు గాంధీ భవన్ కి రావొద్దు...మీరు వస్తే నేను కలవలేను..మాట్లాడలేను. నా కూతురికి పెళ్లి చెయ్యాలి..కొడుకు బిజినెస్ పెడుతా డబ్బులు కావాలంటున్నాడు. అప్పులు తీర్చడానికే నా జీవితం సరిపోతుంది. ఈ 20 ఏళ్లలో సంగారెడ్డిలో బోనాలు, దసరా ఉత్సవాల కోసం 20 కోట్ల రూపాయలు ఖర్చు చేశానని జగ్గారెడ్డి‘‘ వ్యాఖ్యానించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement