Jagga Reddy
-
సినిమాల్లోకి ఎంట్రీ.. జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: గత మూడు నెలల క్రితం డైరెక్టర్ రామానుజం తనకు చూపిన ఫోటో చూసి కనెక్ట్ అయ్యానని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. 2013 నుంచి తనలాంటి వ్యక్తి కోసం చూస్తున్నానని.. టైం ఇస్తారా అని డైరెక్టర్ అడగగానే... టైం ఇవ్వలేనేమోననుకున్నా.. కానీ ఆ తర్వాత డైరెక్టర్ చూపెట్టిన ఫోటో చూసి ఇది కచ్చితంగా చేయాలని డిసైడ్ అయ్యా’’ అని జగ్గారెడ్డి చెప్పారు.‘‘ఏ వార్ ఆఫ్ లవ్’ క్యాప్షన్‌ను డైరెక్టర్ ముందే రాసుకున్నారు. నా కథకు, లవ్‌కు సంబంధం లేదు. కథ చెప్పే క్రమంలో స్టార్టింట్ అంతా డైరెక్టర్ చెప్పారు.. మిగతా అంతా నా లైఫ్‌లో జరిగిన కొన్ని విషయాలు చెప్పా. కొన్ని విషయాలలో డైరెక్టర్ కన్విన్స్ అయ్యారు. నేను సినిమాల్లోకి వెళ్లడానికి ఢిల్లీ టూర్ పనికొచ్చింది. నా రాజకీయానికి సంబంధం లేదు. నేను రాజకీయాల్లో ఉన్నా.. సినిమా ద్వారా కొత్త గా రాజకీయాల్లో అడ్వాంటేజ్ తీసుకునేదేమీలేదు’ అని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు.విద్యార్థి నేతగా, కౌన్సిలర్‌గా రోల్ ఉంటుంది. మున్సిపల్ ఛైర్మన్ ఎలా అయ్యాననేది ఇందులో చూపిస్తాం. లవ్, ఫ్యాక్షన్, ఎమోషన్ , పొలిటికల్‌గా సినిమా ఉంటుంది. ఢిల్లీ టూర్ నన్ను పూర్తి గా మార్చేసింది.. దీని పరిణామాలు ఎటు పోతాయో నాకు తెలియదు. సంగారెడ్డి అభివృద్ధిపై ఫోకస్ చేస్తూనే సినిమాపై దృష్టి పెడతా. మా ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఎక్కువ నిధులు సంగారెడ్డి తీసుకుపోయేందుకు ప్రయత్నం చేస్తా.. స్టేట్ పార్టీలో ఇప్పుడు నా అవసరం లేదు. ఉగాదికి నా సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది. సంగారెడ్డికి చెందిన మొగిలయ్య 18 ఏళ్ల క్రితం రాసిన పాటను విడుదల చేస్తాం’’ అని జగ్గారెడ్డి తెలిపారు. -
సినిమాల్లోకి జగ్గారెడ్డి ఎంట్రీ.. మూవీ పోస్టర్ విడుదల
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి త్వరలో సినిమా రంగంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. త్వరలో ఒక ప్రేమ కథా చిత్రంలో ప్రత్యేక పోషిస్తున్నట్టు జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఈ క్రమంలో జగ్గారెడ్డి సినిమాకు సంబంధించిన పోస్టర్ విడుదలైంది.కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాజకీయాల నుంచి కొంత రిలాక్స్ అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సినిమాలపై ఆసక్తితో ఉన్నట్టు జగ్గారెడ్డి తెలిపారు. తాజాగా జగ్గారెడ్డి మాట్లాడుతూ..‘నాకు సినిమా ఆఫర్ వచ్చింది. లవ్‌స్టోరీ చిత్రంలో ప్రత్యేక పాత్ర చేస్తున్నాను. ప్రేమికుల ప్రేమను కాపాడే క్యారెక్టర్లో జగ్గారెడ్డి కనిపిస్తాడు. మాఫీయాను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసే నాయకుడి పాత్ర పోషిస్తున్నాను. రాజకీయాల్లో ఉంటా.. సినిమాల్లో కూడా ఉంటాను. రాజకీయాల్లో నన్ను ఎవరూ తొక్కలేరు. నా ఒరిజినల్ క్యారెక్టర్ సినిమాలో చూస్తారు. ఉగాదికి సినిమా కథ విని వచ్చే ఉగాదికి సినిమా పూర్తి చేస్తాను. పీసీపీ, ముఖ్యమంత్రికి చెప్పి సమయం తీసుకుని ఏడాది పాటు సినిమాలో నటిస్తాను అని చెప్పుకొచ్చారు. ఇక, తాజాగా జగ్గారెడ్డి పోస్టర్లను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ చిత్రానికి వద్ది రామానుజం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు.. జగ్గారెడ్డి సినిమాల్లో ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
అప్పుడు లేని తపన ఇప్పుడెందుకు?: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకు ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ఇవాళ సీఎం రేవంత్, మంత్రులు కూడా ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. ప్రమాదం జరిగిన వెంటనే ప్రధాని మోదీ.. సీఎంతో ఫోన్లో మాట్లాడారు. కేంద్రం కూడా బృందాలు పంపి సహకరిస్తుంది. ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. రిస్క్ అని తెలిసి కూడా అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్నారు’’ అని జగ్గారెడ్డి అన్నారు.ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు ద్వారా నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య శాశ్వతంగా పోవాలని మంచి నీళ్లు ఇచ్చేందుకు దీనిని వైఎస్ చేపట్టారు. ఫ్లోరైడ్‌తో నల్గొండలో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని వైఎస్ గుర్తించి.. శ్రీశైలం నీళ్ళు నల్గొండ ప్రజలకు ఇవ్వాలని భావించారు. రూ.1925 కోట్లతో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు శంకుస్థాపన చేయడం జరిగింది. పదేళ్ల కేసీఆర్ పాలనలో ఎస్ఎల్బీసీ పూర్తి కావాల్సి ఉండే.. కానీ కాలేదు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పూర్తి చేయాలని మంచి ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే నల్గొండలో 4 నుంచి 5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఘటనను ప్రతిపక్షాలు రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. కనీస అవగాహన ఉండాలి. ప్రభుత్వం తన బాధ్యత నిర్వర్తిస్తుంది.’’ అని జగ్గారెడ్డి తెలిపారు.‘‘హరీష్‌రావు ఆర్థిక మంత్రిగా.. ఇరిగేషన్ మంత్రిగా ఉండి ఎందుకు పూర్తి చేయలేదు? అప్పుడు లేని తపన ఇప్పుడు ఎందుకు?. హరీష్‌రావు ముసలి కన్నీరు కారుస్తున్నారు. కొండగట్టు బస్సు ప్రమాదం జరిగితే.. అప్పటి సీఎం కేసీఆర్ ఎందుకు వెళ్లలేదు. హరీష్‌రావు గొంతు అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం జవాబుదారీ ప్రభుత్వం. బీఆర్ఎస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా వ్యత్యాసం ఉంది. బీజేపీ క్రమశిక్షణ లేని పార్టీ. కిషన్ రెడ్డి బీసీలను అణచివేస్తుందని ఎమ్మెల్యే రాజసింగ్ అన్నారు’’ అని జగ్గారెడ్డి గుర్తు చేశారు. -
రాహుల్ గాంధీపై బండి సంజయ్ వ్యాఖ్యలకు జగ్గారెడ్డి కౌంటర్
-
ఖజానా ఖాళీ.. తలలు పట్టుకుంటున్న సీఎం,డిప్యూటీ సీఎం
సాక్షి,హైదరాబాద్ : కేసీఆర్ ఖజానా ఖాళీ చేశారు. ఇప్పుడు నిధులు సర్దుబాటు చేయలేక సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క తలలు పట్టుకుంటున్నారని’ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలపై ఆయన మీడియాతో మాట్లాడారు. బండి సంజయ్ ,కిషన్ రెడ్డి కోతల రాయుళ్లు.ఐటీఐఆర్ తీసుకొచ్చి బీజేపీ నేతలు మాట్లాడాలి. నేనేంటో,నా పనితనం ఏంటో రాష్ట్ర నేతలకు, ఎంపీ రాహుల్ గాంధీ, ఏఐసీసీ నేతలకు తెలుసు. నా అవసరం అనుకుంటే జగ్గారెడ్డికి పదవి ఇస్తారు. జగ్గారెడ్డి పదవి ఉన్నా ..లేకున్నా పార్టీ కోసం పనిచేస్తూనే ఉంటాడు.బీజేపీ నేతలు సీఎం రేవంత్‌ను రెచ్చగొట్టి తిట్టించుకుంటారు. ఎన్నికలకు చాలా సమయం ఉంది.. పింక్ బుక్ అంటూ రెచ్చగొట్టకు కవిత. కేసీఆర్ ఖజానా ఖాళీ చేశారు. నిధులు సర్దుబాటు చేయలేక మా సీఎం, డిప్యూటీ సీఎం తలలు పట్టుకుంటుంన్నారు.వరంగల్‌కు రావాలంటే రాహుల్ గాంధీ భయపడతారా?..రాహుల్ గాంధీ ఓంట్లోనే భయం లేదు.. కన్యాకుమారి టూ కాశ్మీర్ పాదయాత్ర చేశారు. కేసీఆర్ కనీసం పది కిలోమీటర్లు పాదయాత్ర చేయగలరా? ఐటీఐఆర్ కోసం అవసరం అయితే కిషన్ రెడ్డి, బండి సంజయ్‌ను కలుస్తా. ఐటీఐఆర్ ద్వారా వేల ఉధ్యోగాలు తెలంగాణ నిరుద్యోగులకు వస్తాయి’ అని అన్నారు. -
రేవంత్ రెడ్డి పేరును మరిచిపొయ్యిన లీడర్
-
ఇదేం రాజకీయం.. తెలంగాణలో బీజేపీ బలమెంత?: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందన్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. భారత్ మాతాకీ జై అనే బీజేపీ నాయకులు.. భారతమాత కూతురు ప్రియాంకా గాంధీని తిడితే ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. ఇదే సమయంలో తెలంగాణలో బీజేపీ బలమెంతా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.తాజాగా జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘బీజేపీ నాయకులు ప్రియాంక గాంధీపై అనుచిత వాఖ్యలు చేయకపోతే బీజేపీ ఆఫీసుకి పోవాల్సిన అవసరం మాకేంటి?. మా ఇంటి ఆడబిడ్డలను తిడితే మనం ఊరుకుంటామా. ప్రియాంక గాంధీని తిడితే ఎందుకు ఊరుకోవాలి. మా యూత్ కాంగ్రెస్ నేతలు బీజేపీ ఆఫీసుకు పోవడాన్ని పీసీసీ చీఫ్ తప్పు పట్టారు. కాంగ్రెస్ నేతలు మా లైన్ దాటితే మేం పెద్ద మనసుతో సర్ది చెప్పుకున్నాం.కేంద్ర మంత్రి బండి సంజయ్ రెచ్చగొట్టేలా గాంధీ భవన్ వెళ్లి దాడి చేసి తగల పెట్టండి అని మాట్లాడుతున్నారు. బీజేపీ సంస్కారం ఏంటో, కాంగ్రెస్ సంస్కారం ఏంటో బయటపడింది. సెంట్రల్ మినిస్టర్స్ వాళ్ళ కార్యకర్తలకు సర్ది చెపుతారా? రెచ్చ గొడుతారా?. బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోంది. భారత్ మాతాకీ జై అనే బీజేపీ నాయకులు భారతమాత కూతురు ప్రియాంకా గాంధీని తిడితే ఊరుకుంటారా?. మా వాళ్లని కొట్టడానికి బీజేపీ నాయకులు అంత పెద్ద తోపులా?. మా యూత్ కాంగ్రెస్ వాళ్లని ఎందుకు రెచ్చగొడుతున్నారు?. తెలంగాణలో బీజేపీ బలం ఎంత?. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులపై దాడి చేసేంత బలం బీజేపీకి ఉందా?. మేం మా కార్యకర్తలకు ఏం చెప్తున్నాం? మీరు మీ కార్యకర్తలకు ఏం చెప్తున్నారు?. ప్రియాంక గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యలకు బీజేపీ నాయకులు క్షమాపణ చెప్పాలి.డీకే అరుణ, రాజాసింగ్‌కు కౌంటర్..డీకే అరుణ తప్పుడు మార్గంలో వెళ్తున్నారు. ప్రియాంక గాంధీని అవమానించిన బీదూరిని డీకే అరుణ సమర్థిస్తారా? అని ప్రశ్నించారు. అలాగే, రాజాసింగ్‌కి బీజేపీ ఆఫీసులోకి ఎంట్రీనే లేదు. రాజాసింగ్ డైలాగులు కొట్టడం మానుకోవాలి. ఆయన కంటే పెద్ద డైలాగులు మేము కూడా కొట్టగలం. రాజాసింగ్ ఏమైనా మాట్లాడుకోవచ్చు.. కానీ, కాంగ్రెస్ పార్టీ, నేతలపై మాట్లాడుతా అంటే నడవదు’ అంటూ కామెంట్స్ చేశారు. -
అంబేద్కర్ వల్లే మోదీ, అమిత్ షాకు పదవులు: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు. ఇదే సమయంలో అంబేద్కర్ రాజ్యాంగం వేరు.. భగవంతుడు వేరు అన్న విషయం అమిత్ షా గుర్తించాలి అంటూ కామెంట్స్ చేశారు.తాజాగా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘అంబేద్కర్‌ను అమిత్ షా అవమానించిన విధానంపై రాహుల్ గాంధీ గళం విప్పారు. పార్లమెంట్ నిండు సభలో అంబేద్కర్‌ను అవమానించేలా అమిత్ షా చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొనే వరకు రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారు. చట్టాలు, న్యాయాలు అంబేద్కర్ రాజ్యాంగం వల్లే ఉన్నాయి. బీసీలుగా చెప్పుకొనే మోదీ, అమిత్ షా కూడా అంబేద్కర్ రాజ్యాంగం వల్లే పదవులు పొందారు.అమిత్ షా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. దేశ ప్రజల భావాలు దృష్టిలో పెట్టుకొని రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారు. రాహుల్ గాంధీ బాధ్యత.. గాంధీ, నెహ్రూ అడుగుజాడల్లో నడవటం. అంబేద్కర్ రాజ్యాంగం వేరు భగవంతుడు వేరు అనే విషయం అమిత్ షా గుర్తించాలి. అమిత్ షా, రాహుల్ గాంధీకి తేడా.. రాహుల్ గాంధీ దేవుని మొక్కుతాడు కానీ పబ్లిసిటీ చేయరు. బీజేపీ నేతలు కూడా దేవుడ్ని మొక్కతారు కానీ, పబ్లిసిటీ చేసుకుంటారు. దేవుడు అనేది నమ్మకం ధైర్యం.. భగవంతుడు అనేది వ్యక్తిగత విషయం. కాంగ్రెస్ కార్యకర్తలు రాహుల్ గాంధీ పిలుపునకు సిద్ధంగా ఉంటారు’ అని కామెంట్స్ చేశారు. -
ప్రధాని మోదీకి ఎటువంటి విజన్ లేదు: జగ్గారెడ్డి
-
AICC కార్యదర్శి విష్ణుపై జగ్గారెడ్డి ఫైర్
-
కాంగ్రెస్‌ను చంపేస్తారా?.. ఏఐసీసీ కార్యదర్శిపై జగ్గారెడ్డి ఫైర్
సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ కార్యదర్శి విష్ణుపై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మండిపడ్డారు. ఇన్ఛార్జ్లు పార్టీని చంపేయాలని చూస్తున్నారా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత రాత్రి ఓ ఫంక్షన్లో ఏఐసీసీ కార్యదర్శిపై ఆయన మాటల దాడి చేశారు. ఇంతకీ మీరు ఏఐసీసీ కార్యదర్శిగా ఉన్నారా..? వేరే రాష్ట్రం వెళ్ళిపోయారా..? అంటూ జగ్గారెడ్డి ప్రశ్నించారు.మెదక్ జిల్లా కూడా నేనే చూస్తున్నానంటూ విష్ణు చెప్పగా, పార్టీ ఇన్ఛార్జ్ దీపా దాస్ మున్షీ కూడా ఉన్నారా.. వేరే రాష్ట్రం పోయారా..?. అధికార పార్టీ అంటే ఎలా ఉండాలి? మీరేం చేస్తున్నారో అర్థం అవుతుందా? అంటూ జగ్గారెడ్డి నిలదీశారు. కొత్త వాళ్లకు పదవులు సిఫార్సు చేస్తున్నారు. వారు ఫైనల్ అయ్యే వరకు కూడా మాకు తెలియడం లేదంటూ కార్యదర్శికి జగ్గారెడ్డి ధ్వజమెత్తారు.ఇదీ చదవండి: లగచర్ల రైతుకు సంకెళ్లు.. సీఎం రేవంత్ సీరియస్ -
కేటీఆర్.. కాంగ్రెస్ ముందు నీ అనుభవమెంత?: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ కల్పవృక్షం లాంటిది. కేటీఆర్, హరీష్ రావు కోతల రాయుళ్లు అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. అలాగే, కాంగ్రెస్ వ్యూహాల ముందు కేటీఆర్ ఆలోచన, అనుభవం ఎంత? అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ఇవ్వడం వల్లే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని చెప్పుకొచ్చారు.కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘రేవంత్ రెడ్డిని రెచ్చగొట్టి మీ(బీఆర్ఎస్) నెత్తి మీద పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్ళతో పెకలిస్తామని అంటారా?. అధికారంలో ఉన్నా.. లేకున్నా కాంగ్రెస్ నేతలందరూ గంభీరంగానే ఉంటారు. కేటీఆర్, హరీష్ రావు కోతలు కోసే కోతల రాయులు. కాంగ్రెస్ పార్టీ కల్పవృక్షం లాంటిది. కాంగ్రెస్ పార్టీ లాంటి మర్రి చెట్టును కేటీఆర్ పీకేస్తా అనడం సాధ్యమా?.కేటీఆర్ వయసు ఎంత? కాంగ్రెస్ వయసు ఎంత?. కాంగ్రెస్ వ్యూహాల ముందు కేటీఆర్ ఆలోచన, అనుభవం ఎంత?. కాంగ్రెస్ పార్టీ వయసులో కేటీఆర్ వయసు పావు వంతు. రాజకీయం కోసం నిందలు వేయడాన్ని కూడా మేం తప్పు పట్టడం లేదు. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ లేదా టీడీపీ ప్రభుత్వం ఏర్పడేది. రాష్ట్రం రావడం వల్లే కేసీఆర్ అధికారంలోకి వచ్చారు. మా పాలనపై కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు.బీఆర్ఎస్ పార్టీ ఇంకో ఇరవై ఏళ్తు ప్రతిపక్షంగా కొనసాగాలి. కాంగ్రెస్ వ్యూహాలు అంతుచిక్కవు. మా వ్యూహాలు ఎవరికి అర్థం కావు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక బ్యూరోక్రాట్స్ సంతోషంగా నిద్రపోయే రోజులు వచ్చాయి. అధికారులను మానసికంగా కుంగదీసి కలెక్టర్లను మోకాళ్లపై కూర్చోపెట్టిన ఘనత బీఆర్ఎస్ నాయకులది. ఈ భూమి మీద మనుషులు ఉన్నన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. దేశంలో ఉన్న అనేక రాజకీయ పార్టీలు కాంగ్రెస్ అధికారంలోకి రావాలి.. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నాయి’ అని కామెంట్స్ చేశారు. -
మా తడాకా చూపిస్తాం.. జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: కలెక్టర్‌ను చంపాలని బీఆర్ఎస్ కుట్ర చేసిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. కలెక్టర్ డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి ఆయనన కాపాడారన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పథకం ప్రకారమే కలెక్టర్‌పై దాడి జరిగిందన్నారు. పదేళ్ల అధికారంలో ఉన్నప్పుడు పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రజలపై బీఆర్ఎస్ దాడులు చేసిందన్నారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి బీఆర్ఎస్ కార్యకర్తలతో అధికారులపై దాడులు చేస్తున్నారు. దాడులకు ప్రతి దాడులు ఉంటాయి. అభివృద్ధిని అడ్డుకుంటే ఊరుకునేది లేదు. బీఆర్ఎస్ నేతలకు మా తడాకా ఏంటో చూపిస్తాం’’ అంటూ హెచ్చరించారు.మరోవైపు, బీఆర్ఎస్ అరాచక శక్తులతో కలిసి కుట్రపూరితంగా దళిత, గిరిజన రైతులను రెచ్చగొట్టి లగచర్లలో జిల్లా కలెక్టర్, ఆర్డీవో స్థాయి అధికారిపై దాడి చేయించిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు తలకిందులుగా తపస్సు చేసినా ఈ ప్రభుత్వాన్ని అస్థిరపర్చలేరని చెప్పారు. లగచర్ల ఘటనలో నిందితుల కాల్ డేటాను సేకరించగా, బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన అభ్యర్థి ఉన్నట్టు తేలిందన్నారు. దీని వెనుక ఎంతటి పెద్దవారున్నా ఉపేక్షించేది లేదని, చట్టప్రకారం కఠినంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఏ కేసులోనైనా అరెస్ట్ కావొచ్చు.. పోరాటాలకు సిద్ధమవ్వండి: కేటీఆర్ -
‘మా సోషల్ మీడియాను రంగంలోకి దింపుతాం’
హైదరాబాద్, సాక్షి: బీఆర్ఎస్ సోషల్ మీడియా దండుపాళ్యం ముఠాలా తయారైందని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. అధికారం కోల్పోవడంతో బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావులకు పిచ్చిపట్టిందని ఎద్దేవా చేశారు. శనివారం జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే కేటీఆర్, హరీశ్‌రావు పనిగా పెట్టుకున్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా చర్యలతో కేటీఆర్, హరీశ్‌రావులు తిట్లు తింటుంన్నారు. అమెరికా, సింగపూర్ల నుంచి సోషల్ మీడియా నడపడం కాదు. దమ్ముంటే ధైర్యంగా ముందుకు రండి. సమస్యలపై పోరాడితే తప్పులేదు. కానీ వ్యక్తిగత అంశాలపై బీఆర్ఎస్ సోషల్ మీడియా ట్రోల్ చేస్తుంది. ..బీఆర్ఎస్ హాయాంలో ఇద్దరు కలెక్టర్లకు పది సార్లు ఫోన్ చేసినా ఎత్తలేదు. తిట్టినా.. తప్పేంటి? నేను తిట్టింది గత ప్రభుత్వంలో ఇప్పుడు కాదు. సీఎం వ్యాఖ్యలు అననివి అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి ఫైటర్స్. బీఆర్ఎస్ నేతలు ఇలానే వ్యవహరిస్తే.. మా సోషల్ మీడియాను రంగంలోకి దింపుతాం’’ అని అన్నారు. -
జీవన్‌రెడ్డికి యాష్కీ, జగ్గారెడ్డి మద్దతు
సాక్షి, హైదరాబాద్: జగిత్యాల నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత టి. జీవన్‌రెడ్డికి ఆ పార్టీలోని పలువురు నేతలు బహిరంగంగా మద్దతు పలుకుతున్నారు. అనుచరుడి హత్యతో తీవ్ర ఆవేదనలో ఉన్న ఆయన్ను టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ హైదరాబాద్‌లోని జీవన్‌రెడ్డి నివాసంలో శుక్రవారం కలిసి పరామర్శించారు. అనుచరుడి హత్యకు సంబంధించిన వివరాలు తెలుసుకొని సానుభూతి వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 40 ఏళ్ల రాజకీయ జీవితంలో జీవన్‌రెడ్డి కాంగ్రెస్ పారీ్టకి ఎనలేని సేవ చేశారని... ఆయన సేవలు పారీ్టకి మరింత అవసర మని అభిప్రాయపడ్డారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో పార్టీ ఎమ్మెల్యేలు ఓడిపోయినా ఆ తర్వాత జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జీవన్‌రెడ్డి గెలిచారని గుర్తుచేశారు. అప్పుడే ఆయనకున్న ప్రజాబలం ఏమిటో అర్థమైందన్నారు. జీవన్‌రెడ్డిని పార్టీ కాపాడుకుంటుందని.. ప్రస్తుత రాజకీయ పరిణామాలతోపాటు ప్రభుత్వ పాలనలో ఆయన తెలిపిన అభ్యంతరాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని యాష్కీగౌడ్ చెప్పారు. ఆయన ఆవేదన చూసి బాధపడ్డా: జగ్గారెడ్డి జీవన్‌రెడ్డి ఆవేదనపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా స్పందించారు. జీవన్‌రెడ్డి ఆవేదన చూసి తాను చాలా బాధపడ్డానని.. మనసు కలుక్కుమందని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘మీకు అండగా ఉన్నానని చెప్పడానికి ఈ ప్రకటన మీడియా ద్వారా చేస్తున్నా. నేను ఎవరినీ తప్పుబట్టట్లేదు. కానీ పారీ్టలో మీరు ఒంటరినని అనుకోవద్దు. సమయం వచ్చినప్పుడు నేను మీ వెంట ఉంటా. ఎప్పుడూ జనంలో ఉండే మిమ్మల్ని జగిత్యాల, సంగారెడ్డి ప్రజలు ఎందుకు ఓడించారో అర్థం కావట్లేదు. మీ సమస్యకు అధిష్టానం పరిష్కారం చూపాలని సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాం«దీని కోరుతున్నా’అని జగ్గారెడ్డి ఆ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు -
హరీష్.. కేసీఆర్‌ను తీసుకొచ్చే కెపాసిటీ ఉందా?: జగ్గారెడ్డి సవాల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇప్పటికే ఇరు పార్టీల నేతలు ఆరోపణలు చేసుకున్నారు. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సవాల్ విసిరారు. రుణమాఫీకి సిద్దమా? అని చాలెంట్ చేశారు.మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి శనివారం మీడియాతో మాట్లాడుతూ..‘రుణమాఫీపై హరీష్ రావుకు సవాల్ చేస్తున్నాను. రుణమాఫీపై చర్చకు బీఆర్ఎస్ సిద్దామా?. రుణమాఫీపై చర్చకు మల్లిగాడు, ఎల్లిగాడు కాకుండా కేసీఆర్ రావాలి. సీఎం రేవంత్‌ను ఒప్పించి చర్చకు నేను తీసుకువస్తాను. కేసీఆర్‌ను ఒప్పించి చర్చకు తీసుకువచ్చే కెపాసిటీ హరీష్‌కు ఉందా?. మాతో చర్చకు మీకు భయంగా ఉంటే.. సిద్దిపేటలోనే చర్చ పెట్టండి.రుణమాఫీ విషయంలో పబ్లిసిటీ చేయడంలో మేము ఫేయిల్ అయ్యాం. కానీ, బీఆర్ఎస్ మాత్రం పబ్లిసిటీలో పాస్ అయ్యింది. సాంకేతిక కారణాల వల్ల కొందరికి రుణమాఫీ కాలేదని మేమే చెబుతున్నాం. దీనిపై హరీష్ రావు సహా, బీఆర్ఎస్ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు. ఆర్థిక శాఖను కేసీఆర్ దివాలా తీశారు. బీఆర్ఎస్ పాలన సమయంలో ఎనిమిది కిస్తీల్లో లక్ష రూపాయలు కూడా రుణమాఫీ చేయలేకపోయారు. మేం పబ్లిసిటీ దగ్గర ఫెయిల్ అయ్యాం. రుణ మాఫీ అందని రైతులకు ఏ కారణాల వల్ల అందలేదో వివరాలు తెప్పించమని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు’ అని చెప్పుకొచ్చారు. ఇది కూడా చదవండి: రేవంత్.. ముందు రెడ్డికుంటలో నీ ఇల్లు కూల్చేవేయ్: కేటీఆర్ -
బీఆర్ఎస్ నేతలు సురేఖకు క్షమాపణలు చెప్పాలి: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: రైతుల గురించి మాట్లాడే అర్హత బీజేపీకి లేదన్నారు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. రాజకీయ పరిపూర్ణత లేని నాయకుడిగా కేటీఆర్ వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు. కొండా సురేఖపై ఇలాంటి కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదంటూ హితవు పలికారు.మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి కొండా సురేఖను రెచ్చగొట్టి కేసీఆర్, కేటీఆర్‌లు విమర్శలు చేయించుకుంటున్నారు. వ్యక్తిగత జీవితంలోకి వెళ్లి విమర్శలు చేసుకోవడం పద్దతి కాదు. కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావులకు దండలు వేసిన వాళ్లందరినీ అలానే అనుకుంటారా?. రాజకీయ పరిపూర్ణత లేని నాయకుడిగా కేటీఆర్ వ్యాఖ్యలు చేస్తున్నాడు. కొండా సురేఖకు ఇప్పటికైనా క్షమాపణలు చెప్పి.. ఇప్పటికైనా ఈ వివాదాన్ని బీఆర్ఎస్ ఆపాలి.తెలంగాణలో రుణమాఫీ 18వేల కోట్లు మాఫీ చేశాం. డేటా సరిగా లేకపోవడంతో మిగిలిన రుణమాఫీ చేయలేకపోయాం. రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బందుల్లో కేసీఆర్ వదిలి వెళ్లారు. తెలంగాణ బీజేపీకి పట్టు లేదు. కాబట్టి ఉనికి కోసం బీజేపీ రైతు దీక్షతో ప్రయత్నాలు చేసింది. రైతుల గురించి మాట్లాడే అర్హత బీజేపీకి లేదు. ప్రధాని మోదీ ప్రతీ పేద వాడి అకౌంట్లో 2లక్షలు వేస్తా అన్నారు. పదేళ్లు ప్రధానిగా ఉండి ఎందుకు చేయలేదు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు.. చేయలేదు. రైతుల ఆదాయం డబుల్ చేస్తాం అన్నారు, చేశారా?. రైతు నల్ల చట్టాలు తెచ్చింది మీరు కదా?.రైతుల మీదకు వెహికల్తో చంపింది మీరు కదా.. ఎప్పుడు ఎందుకు బీజేపీ రాష్ట్ర నాయకులు మాట్లాడలేదు. ధరలు పెరిగినా ప్రజలు ఓట్లు వేసి 8 సీట్లు ఇచ్చేసరికి.. బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలకు కళ్ళు నెత్తికి ఎక్కాయి. బీజేపీ నేతలు నటిస్తున్నారు.. డ్రామా ఆర్టిస్టులు. తెలంగాణ రైతులకు మా విజ్ఞప్తి. రేవంత్ సర్కార్ చేసే ప్రయత్నాలకు అండగా ఉండండి. దేశ ప్రజలకు రాహుల్ గాంధీ కుటుంబం గురించి తెలుసు. దేశాన్ని 52 ఏళ్ల పాటు రాహుల్ గాంధీ కుటుంబం పాలించింది. మీ మాదిరి రాహుల్ గాంధీ కుటుంబం అని భావించకండి. గాంధీ కుటుంబం మీద పగా పట్టిన మోదీ.. సభ్యత్వం రద్దు చేసి ఆయన ఉండే బంగ్లా ఖాళీ చేయించారు. రాహుల్ గాంధీ చరిత్ర తెలుసుకో.. ఎందుకు నోరు పారేసుకుంటున్నావు కేటీఆర్. మూసీ సుందరీకరణ డబ్బుతో రాహుల్ గాంధీ బతుకుతాడా?. దీంతో, ఏమైనా అర్థం ఉందా?’ అని ప్రశ్నించారు.ఇది కూడా చదవండి: వాళ్లు ఆడబిడ్డలు కాదా.. మంత్రి కొండా సురేఖకు సబిత కౌంటర్ -
అట్లుంటది.. జగ్గారెడ్డితో!
-
రెచ్చగొడితే.. నాలుక కోస్తాం: జగ్గారెడ్డి
సాక్షి హైదరాబాద్: కాంగ్రెస్ కార్యకర్తల్ని ఎందుకు రెచ్చగొడుతున్నారు? రేవంత్‌రెడ్డిని తిడితే మా కార్యకర్తలు వాళ్ల నాలుకలు కోస్తారంటూ ఆ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం ఆయన గాంధీభవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌ను చెడ్డగొట్టాలని బీఆర్ఎస్ నేతలు చూస్తున్నారంటూ మండిపడ్డారు.‘‘రేవంత్‌ను ఎవరైనా పనికిమాలిన వాడు అంటే సహించేది లేదు. సీఎంపై కేసీఆర్, కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేస్తే నాలుకు కోస్తాం. బీఆర్ఎస్ నేతలు.. హైదరాబాద్ ప్రజల మూడ్‌ను ఖరాబ్ చేశారు. గాంధీ, కౌశిక్ రెడ్డి వ్యవహారం బీఆర్ఎస్ పార్టీ అంతర్గత వ్యవహారం. వినాయక నిమజ్జనం కోసం కష్టపడుతుంటే.. బీఆర్ఎస్ అనవసర పంచాయతీలు చేస్తున్నారు. వినాయక నిమజ్జనం కార్యక్రమాన్ని డిస్టబ్ చేయాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది’’ అంటూ జగ్గారెడ్డి ధ్వజమెత్తారు.ఇదీ చదవండి: హైదరాబాద్ ప్రజలపై సీఎం రేవంత్ పగ: కేటీఆర్‘‘పార్టీ మారిన ఎమ్మెల్యేలకు కండువాలు కప్పే సాంప్రదాయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో లేదు. తెలంగాణ ఏర్పాటు తర్వాత కొత్త సాంప్రదాయాని కేసీఆర్ తెరలేపాడు. 2014-18 వరకు కాంగ్రెస్ ఎంపీలు 4, ఎమ్మెల్యేలు 25, ఎమ్మెల్సీ 18 మందిని బీఆర్ఎస్లో చేర్చుకున్నప్పుడు బీఆర్ఎస్ నేతలు ఎందుకు మాట్లాడలేదు?. పార్టీ మారిన వారికి మంత్రి పదవి ఇచ్చింది కేసీఆర్ కాదా.. పార్టీ ఫిరాయింపులకు ఆధ్యుడు కేసీఆర్ కాదా.. శాసన పక్షాన్ని విలీనం చేసుకునే కుట్రకు కేసీఆర్ కారణం. కేటీఆర్ చరిత్ర తెలుసుకో.. కేసీఆర్ సీఎం అయిన రోజే రాజకీయాలలో విలువలు నశించాయి. బీజేపీ డైరెక్షన్లో కేసీఆర్.. కాంగ్రెస్‌కు వెన్నుపోటు పోడిచారు’’ అంటూ జగ్గారెడ్డి మండిపడ్డారు. -
‘ఎప్పటికైనా పీసీసీ చీఫ్ అవుతా!’
సాక్షి, గాంధీభవన్: టీపీసీసీ చీఫ్ పదవి బీసీ నేతకు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. ఇదే సమయంలో తన మనసులోని మాటను బహిర్గతం చేశారు. తాను కూడా పీసీసీ చీఫ్ కావాలనుకుంటున్నట్టు తెలిపారు. ఎప్పటికైనా పీసీసీ చీఫ్ అవుతానని కామెంట్స్ చేశారు.కాగా, జగ్గారెడ్డి శనివారం గాంధీభవన్‌లో మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడుతూ..‘కొత్త పీసీసీ చీఫ్ పార్టీలో అందరినీ కలుపుకునిపోతారని భావిస్తున్నాను. పార్టీ లైన్లో పనిచేసిన నేత మహేష్ కుమార్ గౌడ్. పీసీసీ పదవి బీసీ నేతకు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాను. తెలంగాణలో ముఖ్యమంత్రి రెడ్డి సామాజికి వర్గానికి చెందిన నేత కావడంతో పీసీసీ బీసీ నేతకు ఇచ్చారు. నేను కూడా ఏదో ఒకరోజు పీసీసీ చీఫ్ అవుతాను. ప్రస్తుతం బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి అధిష్టానం పీసీసీ ఇచ్చింది. భవిష్యత్‌లో రెడ్డిలకు పీసీసీ ఇవ్వాలని అధిష్టానం నిర్ణయిస్తే నేను ప్రయత్నాలు చేస్తాను. కాంగ్రెస్ పార్టీలో జగ్గారెడ్డి చాలా హ్యాపీగా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీలోనే ఫ్రీడమ్ ఉంటుంది. బీజేపీలో స్టేట్ ప్రెసిడెంట్ కావాలన్నా కష్టమే. ఎవరికీ వస్తుందో తెలియదు. ఎప్పుడు పోతుందో తెలియదు. బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ.. అందులో పార్టీ ప్రెసిడెంట్ పోస్టు ఉండదు. బీసీ కమిషన్ నియామకం విషయంలో సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. రైతుల పట్ల పూర్తి అవగాహన ఉన్న నేత కోదండరెడ్డికి రైతు కమిషన్ ఇచ్చారు. వరదల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం అందరినీ ఆదుకుంటుంది’ అంటూ కామెంట్స్ చేశారు. -
ఇదేనా బీఆర్ఎస్ రాజకీయం: జగ్గారెడ్డి ఫైర్
సాక్షి, హైదరాబాద్: అధికారంలో లేకున్నా ఆ మైకం నుంచి హరీష్ రావు ఇంకా బయటకు రావడం లేదని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. తెలంగాణలో ప్రతిపక్షాలు రాజకీయం చేయడానికి ఇదే సమయం కాదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్కు చాలా వ్యత్యాసం ఉంది అని చెప్పుకొచ్చారు.కాగా, జగ్గారెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడుతూ..‘ప్రతిపక్ష నేతలు ఖమ్మంలో పర్యటించి ప్రజల నుంచి వచ్చిన సూచనలను ప్రభుత్వానికి ఇవ్వండి. ప్రతిపక్షం ఎలా ఉండాలి అనేది కాంగ్రెస్ పక్షాన నేను ట్రైనింగ్ ఇస్తాను. హరీష్ ఇంకా అధికారం ఉందనే మైకంలోనే ఉన్నారు. ప్రభుత్వం, ప్రతిపక్షం మొదట ప్రజలను సేఫ్ జోన్లోకి తేవాలి. ప్రతిపక్షాల రాజకీయానికి ఇది సమయం కాదు. ప్రభుత్వం మీద బురద చల్లెందుకు బీఆర్ఎస్ లేనిపోని మాటలు చెబుతోంది.మన రాష్ట్ర ప్రతిపక్ష నాయకు కేసీఆర్ ఇంట్లో ఉంటే బీఆర్ఎస్ నేతలు బయట కామెంట్స్ చేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్కు చాలా తేడా ఉంది. కాంగ్రెస్ వాస్తవాలకు దగ్గరగా ఉంటుంది. కాంగ్రెస్ శ్రద్ధగా పని చేస్తుంది. కానీ, ప్రచారానికి ప్రయారిటీ ఇవ్వదు. బీఆర్ఎస్ నేతలు 90 శాతం పబ్లిసిటీ చేసి.. 10శాతం పని చేస్తారు. ప్రభుత్వం ప్రజలను కాపాడేందుకు వంద శాతం ప్రయారిటి ఇస్తుంది.ఐదు రోజుల నుంచి వర్షాలు తెలంగాణ, ఆంధ్రలో కురుస్తున్నాయి. పెద్ద మొత్తంలో వర్షాలు రావడంతో చెరువులు, వాగులు, అలగులు పడుతున్నాయి. జంట నగరాల్లో కూడా ఇప్పుడు వర్షాలు ఎక్కువగా కురుస్తున్నాయి. ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వర్షం కారణంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఖమ్మం జిల్లాలో ఇండ్లు మునిగిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు తుమ్మల, పొంగులేటి మూడు రోజులుగా వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. సహాయక చర్యలు అందిస్తున్నారు.సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మంలో వరద ప్రాంతాల్లో పర్యటించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే.. అన్ని శాఖల సమన్వయంతో పని చేస్తున్నారు. ఇప్పటికే 7వేల కోట్ల నష్టం జరిగింది. తక్షణ సాయం కోసం కేంద్రం రెండు వేల కోట్లు విడుదల చేయాలని ప్రధాని మోదీకి సీఎం రేవంత్ లేఖ రాశారు’ అని కామెంట్స్ చేశారు. -
ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఎందుకొచ్చిందంటే? : జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా డైరెక్షన్లోనే బెయిల్ వచ్చిందని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.కవితకు బెయిల్ రావడంపై జగ్గారెడ్డి స్పందించారు.‘‘లిక్కర్ స్కామ్ లో కవిత మెయిన్ విలన్. మోదీ, అమిత్ షా డైరెక్షన్ లోనే కవితకు బెయిల్ వచ్చింది. రాజకీయ చీకటి ఒప్పందంలో భాగమే కవితకు బెయిల్ వచ్చింది. అదే మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు బెయిల్ ఎందుకు ఇవ్వలేదు..15నెలలు వరకు సిసోడియకు బెయిల్ ఇవ్వలేదు ..ఐదు నెలలకే కవితకు ఎందుకు బెయిల్ ఇచ్చారు’’ అని ప్రశ్నించారు.‘కేసీఆర్ రాజకీయంగా కాంగ్రెస్‌ను ఢీకొనలేక బీజేపీతో చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ,బీఆర్ఎస్ అలయన్స్గా పోటీ చేస్తాయి. బీఆర్ఎస్, బీజేపీ కలిసి పోయే భాగంగానే మద్యం పాలసీ కేసులో కవిత జైలు నాటకం’అని వ్యాఖ్యానించారు.బెయిల్ రాక ముందే మూడు రోజుల నుండి బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారు.తీర్పు వెలువరించక ముందే కేసీఆర్ ,కేటీఆర్,హరీష్ రావు,బెయిల్ వస్తుందని లీక్ ఇస్తున్నారు.కేసీఆర్ కుటుంబంపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలి.కవిత బెయిల్ అంశం దేశ రాజకీయాలలో కొత్తగా అనిపిస్తుంది. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ డమ్మీ పాత్ర పోషించింది. కేసీఆర్ బీఆర్ఎస్ నాయకులను న్యూట్రల్ చేసి బీజేపీకి ఓటు వేయించారు. ట్రబుల్ షూటర్ అంటున్న హరీష్ రావు ఇలాకాలో బీఆర్ఎస్ మూడవ స్థానంలో ఉంది. మోదీ తన బలం పెంచుకోవడానికి ప్రాంతీయ పార్టీలతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. బీజేపీ వెనుక ఉందనే ధైర్యంతో హరీష్ రావు, కేటీఆర్‌లు మాట్లాడుతున్నారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ధ్వజమెత్తారు.ఇవాళ కవితకి బెయిల్ రావడం BRS - BJPలో విలీనమా.?వచ్చే ఎన్నికల్లో BJP BRS పొత్తా?ఇదే కేసీఆర్, మోడీకి ఇచ్చే రిటర్న్ గిఫ్ట్..17 నెలల వరకు సిసోడియాకి బెయిల్ రాలేదు,ఐదు నెలలకే కవితకి బెయిల్ ఎలా వచ్చింది..తెలంగాణలో కాంగ్రెస్ నీ దెబ్బతీసే కుట్ర జరుగుతుంది..#jaggareddy #congress pic.twitter.com/nKH58h8iJJ— Jayaprakash Reddy(OFFICIAL ) (@ImJaggaReddy) August 27, 2024 -
చీప్ లిక్కర్ తాగావా..? జగ్గారెడ్డి కౌంటర్
-
దమ్ముంటే రాజీవ్ విగ్రహాన్ని టచ్ చేయ్: కేటీఆర్‌కు జగ్గారెడ్డి కౌంటర్
సాక్షి, హైదరాబాద్: రాజీవ్ గాంధీ విగ్రహం కూలగొడతామంటే మేము ఖాళీగా ఉన్నామా అంటూ కేటీఆర్‌కు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ చీఫ్ లిక్కర్ తాగినట్టుగా ప్రవర్తిసున్నారంటూ దుయ్యబట్టారు.‘‘తల్లి గుండెల్లో ఉండాలి కాబట్టి తెలంగాణ తల్లి విగ్రహం సచివాలయం లోపల పెడతామని రేవంత్ అన్నారు. రాజీవ్ విగ్రహం ముట్టుకుంటే చెప్పుతో కొడతానన్న సీఎం వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుంది’’ అని జగ్గారెడ్డి పేర్కొన్నారు.పొలిటికల్ కోచింగ్ సెంటర్లో కేటీఆర్ ట్రైనింగ్ తీసుకుంటే మంచిది. కేటీఆర్‌కు ఎలాంటి విషయాలు మాట్లాడాలో తెలియడం లేదు. కేసీఆర్.. కేటీఆర్‌కు కోచింగ్ ఇప్పిస్తే మంచిది. పదేళ్ల కాలంలో జర్నలిస్టుల సమస్యల కోసం, ప్లాట్ల కోసం ఏనాడైనా అల్లం నారాయణ కోట్లాడిండా?’’ అంటూ జగ్గారెడ్డి ప్రశ్నించారు. -
బడ్జెట్‌పై కేసీఆర్ వ్యాఖ్యలు తగదు.. జగ్గారెడ్డి
ప్రతిపక్షనేత కేసీఆర్ తెలంగాణ ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా వ్యాఖ్యలు చేస్తున్నారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై ఆయన స్పందించారు.కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన బడ్జెట్.. రాష్ట్ర ప్రజలకు దగ్గరగా ఉండే బడ్జెట్. గత పదేళ్ల కాలంలో హైప్ బడ్జెట్..కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ ప్రాక్టీకల్ అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ పదేళ్ల బడ్జెట్ ఊహల్లో విహరించిన బడ్జెట్ అన్న ఆయన.. కాంగ్రెస్ నాయకత్వం వాస్తవానికి ఎప్పుడూ దగ్గరగా ఉంటుందని తెలిపారు. ప్రజా సంక్షేమం కోరి ప్రవేశ పెట్టిన బడ్జెట్ వ్యవసాయానికి పెద్ద పీట వేయడంతో అన్ని రంగాలకు ప్రాధాన్యత ఇస్తే.. గత పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వం అప్పులకే ప్రాధాన్యత ఇచ్చిందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. -
చిరుకు జగ్గారెడ్డి చురకలు
హైదరాబాద్, సాక్షి: రైతులకు నష్టం జరుగుతుందని పలు సినిమాలు తీసిన చిరంజీవి... ఢిల్లీలో ధర్నా చేస్తున్న రైతులకు ఎందుకు మద్దతు ఇవ్వలేకపోతున్నాడని ప్రశ్నించారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. రుణమాఫీ హామీ నెరవేర్చిన తరుణంలో ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్పై, అలాగే నటుడు చిరంజీవిపైనా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘తెలంగాణలో రుణమాఫీ పైసలతో ఫోన్లు అన్ని టింగు టింగుమంటుంన్నాయి. ఆగస్టు 15 లోపు 2 లక్షల మాఫీ అయిపోతుంది. దీనికి సాక్ష్యం రైతులే. ఫోన్ లలో మెసేజ్ లు చూసి రైతు ల ఇళ్ళలో సంబరాలు జరుగుతున్నాయి. కానీ, బీజేపీ, బీఆర్ఎస్ నేతలకు గత రాత్రి నిద్రలేదు. కేటీఆర్ ట్విట్టర్ కే పనికొస్తడు.. పనికి పనికిరాడు. మా ప్రభుత్వానికి ఇంకా నాలుగున్నర సంవత్సరాల టైం ఉన్నా.. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఇచ్చిన హామీ నెరవేర్చాం... ఇప్పటిదాకా బీజేపీ ఎన్నివేల కోట్ల రైతు రుణమాఫీ చేసింది? దీనికి బండి సంజయ్ సమాధానం చెప్పాలి. నీరవ్ మోదీ, లలిత్ మోదీ లాంటోళ్లకు రూ.16 లక్షల కోట్లు బీజేపీ మాఫీ చేసింది. కానీ, ఒక్క రైతుకైనా చేసిందా?. గతంలో.. దేశం మొత్తం 71 వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్‌కే చెల్లింది. .. రైతులకు నష్టం జరుగుతుందని సినిమా తీసిన మెగాస్టార్ చిరంజీవి.. ఢిల్లీలో ధర్నా చేసిన వారికి ఎందుకు మద్దతు ఇవ్వలేదు?. పవన్ కల్యాణ్‌కు, బీజేపీ వాళ్లకే ఎందుకు మద్దతు ఇస్తున్నారు. సినిమాలతో కోట్లు సంపాదిస్తున్న మీరు(చిరును ఉద్దేశించి..) రైతుల కష్టాలను ఎందుకు పట్టించుకోవడం లేదు?. రైతుల పేరుతో సినిమా తీసి డబ్బులు సంపాదించి, మోదీకి మద్దతు ఇస్తున్నారు!. రైతులకు మద్దతుగా నిలిచిన రాహుల్‌కు ఎందుకు సపోర్ట్ ఇవ్వలేదు. కాంగ్రెస్‌లో ఉంటే చిరంజీవి సరైన దారి లో ఉండేవాడు. ఇప్పుడు పక్కదారి పట్టాడు అని జగ్గారెడ్డి వ్యాఖ్యలు చేశారు... బీఆర్ఎస్ చరిత్ర అంతా అప్పులే. కేసీఆర్ గత పదేళ్ళలో రూ.7 లక్షల కోట్ల ఆప్పులు చేసి రైతులకు ఇచ్చింది 26 వేల కోట్ల రూపాయలే. కాంగ్రెస్ గత 6 నెలల్లో రైతులకు ఇచ్చింది రూ. 31 వేల కోట్లు. తెలంగాణ ప్రజలను బీఆర్ఎస్ ఖూనీ చేసింది. అటు కేంద్రంలో బీజేపీ నల్ల చట్టాలతో రైతులను మర్డర్ చేసింది. కేంద్ర మంత్రుల కొడుకులు రైతు ల మీద నుంచి బండ్లు ఎక్కించారు అని జగ్గారెడ్డి విమర్శలు గుప్పించారు. -
చంద్రబాబు వచ్చింది అందుకే.. కాంగ్రెస్ కేడర్ అలర్ట్: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు భేటీతో రాష్ట్రంలో రాజకీయం మరోసారి హీటెక్కింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను కబ్జా చేసే ప్రయత్నం జరుగుతోందని కామెంట్స్ చేశారు.కాగా, జగ్గారెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణలో బీజేపీ గేమ్ స్టార్ట్ చేసింది. టీడీపీని ముందుపెట్టి బీజేపీ పొలిటికల్ గేమ్ ఆడుతోంది. తెలంగాణను కబ్జా చేసే ప్రయత్నం జరుగుతోంది. ఈ విషయంలో కాంగ్రెస్ కేడర్ అలర్ట్‌గా ఉండాలని సూచిస్తున్నాను. సీఎం హోదాలో చంద్రబాబు తెలంగాణలో అడుగుపెట్టాడు.చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతంలో రాజకీయం మొదలు పెట్టాడు. కాంగ్రెస్‌ను దెబ్బ కొట్టేందుకు టీడీపీ, జనసేనను బీజేపీ రంగంలోకి దింపింది. చంద్రబాబు పావుగా వ్యవహరిస్తున్నాడు. ఏపీలో చేసిన పొలిటికల్ గేమ్‌ను తెలంగాణలో ఆడాలనుకుంటున్నారు. విభజన సమస్యల పేరుతో చంద్రబాబు తెలంగాణలో ఎంటరయ్యారు. రాష్ట్రంలో ఐటీని అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీనే. చంద్రబాబు కేవలం కొనసాగించారు’ అంటూ కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో కేంద్రమంత్రి బండి సంజయ్‌కు కూడా జగ్గారెడ్డి కౌంటరిచ్చారు. దేశంలో బలమంతా ఈడీ, సీబీఐ, ఐటీ చేతిలోనే ఉంది. ఇప్పటి వరకు బీజేపీలో చేరిన వారంతా వివిధ కేసుల్లో ఉన్నవారే ఉన్నారు. ఇంత కన్నా సాక్ష్యం ఏం కావాలి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో, జగ్గారెడ్డి వ్యాఖ్యలు తెలంగాణలో చర్చనీయాంశంగా మారాయి. ఇక, ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ సందర్భంగా పలుచోట్ల టీడీపీ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించిన విషయం తెలిసిందే. -
‘ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది’.. జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి చాలా ప్రశాంతంగా ఉన్నానంటూ సంగారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.‘‘నేను ఎమ్మెల్యేగా ఒడిపోయినందుకు చాలా ప్రశాంతంగా ఉన్నా. మనస్ఫూర్తిగా చెబుతున్న మొన్నటి ఎన్నికల్లో ఓడిపోవడంతో నేనే రిలాక్స్ అవుతున్నా. నాయకులు, కార్యకర్తలు ఎవరు కూడా నేను ఓడిపోయానని బాధపడొద్దు. కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి పనులు చేసుకుందామని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా సంగారెడ్డి ప్రజల కోసం మనం జవాబుదారీగా ఉండాలని సూచించారు.‘‘సంగారెడ్డి ప్రజల కోసం రెండు నెలల తర్వాత ప్రతి సోమవారం సంగారెడ్డిలోని రాంనగర్ లో నా ఇంటి వద్ద అందిబాటులో ఉంటా. కార్యకర్తలు ఎవరు గాంధీ భవన్ కి రావొద్దు...మీరు వస్తే నేను కలవలేను..మాట్లాడలేను. నా కూతురికి పెళ్లి చెయ్యాలి..కొడుకు బిజినెస్ పెడుతా డబ్బులు కావాలంటున్నాడు. అప్పులు తీర్చడానికే నా జీవితం సరిపోతుంది. ఈ 20 ఏళ్లలో సంగారెడ్డిలో బోనాలు, దసరా ఉత్సవాల కోసం 20 కోట్ల రూపాయలు ఖర్చు చేశానని జగ్గారెడ్డి‘‘ వ్యాఖ్యానించారు. -
ఇదే నా టార్గెట్..
-
మాకొచ్చే సీట్లు !..జగ్గన్న జోకులు
-
మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
నర్సాపూర్ (మెదక్): ‘‘మొన్ననే పెళ్లి చేసిండ్రు...అప్పుడే పిల్లలు పుడతాలేరంటే ఎలా..’’అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా శుక్రవారం మెదక్ జిల్లా నర్సాపూర్‌లో చేపట్టిన బైక్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. తమకు పావలా వడ్డీ రుణం రావడం లేదని, ఇళ్లు రాలేదని తదితర హామీలను మహిళలు ప్రశ్నించగా..బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వడంలో మోసం చేసిందని విమర్శించారు. ప్లాట్లు ఉన్న దళితులకు తమ ప్రభుత్వం రూ.6 లక్షలు, ఇతరులకు రూ.5లక్షలు ఇస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా ‘‘మొన్ననే మాకు పెళ్లి చేసిండ్రు. అప్పుడే పిల్లలు పుడుతలేరంటే ఎట్లా? మూడు నెలలే అయింది, ముచ్చటగా 3 నిద్రలు చేసినం. తొందర పడకండి, జెరా టైమియ్యిండ్రి, హామీ లన్నీ అమలు చేస్తాం’’అని జగ్గారెడ్డి చెప్పారు. -
జగ్గారెడ్డి బంగారం
-
బీఆర్ఎస్ పై జగ్గారెడ్డి నిప్పులు..
-
జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
హైదరాబాద్, సాక్షి: సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే.. టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మళ్లీ క్రియాశీలకంగా మారారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత గత రెండు మూడు రోజులుగా చురుకుగా కనిపిస్తున్నారాయన. సంగారెడ్డిలో తాను ఓడిపోతానని ముందే ఊహించానని వ్యాఖ్యానించిన ఆయన.. తాజాగా ఇవాళ గాంధీభవన్‌లో మళ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావులపై మండిపడ్డారాయన. తెలంగాణ వ్యాప్తంగా మహాలక్ష్మి స్కీమ్ ఉచిత బస్సు ప్రయాణానికి అనూహ్య స్పందన లభిస్తోంది. మహిళలంతా ఈ పథకంపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. హరీష్ రావు, కేటీఆర్‌లకు బస్సు ప్రయాణం తెలియదు. బెంజ్ కార్ల లో తిరిగే వాళ్లకు.. పేదల సమస్యలు ఏం తెలుసు?. బీఆర్ఎస్ నేతలకు తెలిసింది అమరవీరుల స్థూపం మాత్రమే. రుణమాఫీ పై మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్, హరీష్ లకు లేదు. అసెంబ్లీలో కేటీఆర్, హరీష్‌రావు రెచ్చిపోతున్నారు నేను గెలిచి ఉంటే.. అసెంబ్లీలో వీళ్లద్దరినీ ఓ ఆట ఆడుకునేవాడ్ని. బీఆర్ఎస్ది కేసీఆర్ పాలన. కాంగ్రెస్‌ది ప్రజా పాలన. ప్రజాపాలన అనే సంస్కారం బీఆర్ఎస్కు లేదు. కేసీఆర్ కుటుంబానికి ఆరోగ్య శ్రీ అవసరం లేకపోవచ్చు.. కానీ పేదలకు ఆ అవసరం ఉంది. సెక్రటేరియట్ లో 9 ఏళ్ల ఫైల్స్ అన్నీ పెండింగ్ లొ ఉన్నాయి. మా మంత్రులు వాటి బూజు దులుపుతున్నారు. లక్షల కోట్లు అప్పులు చేసి పోయారు. తెలంగాణ ప్రజలు అప్పు చేయమని అడిగారా?. కేబుల్ బ్రిడ్జి కట్టి మీరే ఇంత చెప్పుకుంటే ఓఆర్ఆర్ సృష్టి కర్త వైఎస్ఆర్ గురించి మేం ఇంకెంత చెప్పాల్సి ఉంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత సోనియా గాంధీ ఇంటికి పోయింది కేసీఆర్ కుటుంబం కాదా?. బీఆర్ఎస్ మాట ఇచ్చి తప్పినందుకు కోర్టులో కేసు వేస్తాం. కేసీఆర్ కుటుంబం 420 కాబట్టే ఓడించి ఇంట్లో కూర్చో బెట్టారు. కేటీఆర్, హరీష్ రావుల కోసం 840 చట్టం తేవాలేమో అని జగ్గారెడ్డి మండిపడ్డారు. -
ఓడితే మంత్రి పదవి ఇస్తారా?
-
సోనియా కాళ్లు మొక్కిన కేసీఆర్, తర్వాత రోజే మాట మార్చాడు: ఖర్గే
Updates: గంజి మైదాన్‌లో కాంగ్రెస్ సభ.. మల్లికార్జున ఖర్గే ప్రసంగం ►కాంగ్రెస్ పేదల కోసం ఆలోచిస్తుంది. ►కర్ణాటకలో మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. ►తెలంగాణ ఎవరు ఇచ్చారు? ఎవరి కోసం ఇచ్చారు. ►తెలంగాణ ఇవ్వగానే కేసీఆర్ సోనియా ఇంటికెళ్లాడు, ఆమె కాళ్లు మొక్కాడు. ►ఆ తర్వాత రోజే మాట మార్చాడు. ►ఇందిరా గాంధీ సంగారెడ్డిలో అడుగుపెట్టి దేశమంతా కాంగ్రెస్‌ను గెలిపించింది. ►ఇందిరా గాంధీ హయాంలోనే BHEL, BDL, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు ఏర్పాటయ్యాయి. ►ఇందిరాగాంధీ ఇక్కడి నుంచి గెలవకపోయి ఉంటే ఈ సంస్థలు సాధ్యామయ్యేవా? ►తెలంగాణ దగ్గర డబ్బు ఉన్నప్పుడు కేసీఆర్ తనకునచ్చింది చేశారు. ►ఈ ప్రభుత్వం సంస్థలను ఆమ్మేస్తుంది ►తెలంగాణలో ప్రతీ ఒక్కరిపై 5 లక్షల అప్పు ఉంది ►కాంగ్రెస్ పేదల కోసం ఆలోచిస్తుంది. ►బ్యాంకులను జాతీయం చేసింది కాంగ్రెస్. ►రైతు కూలీల కోసం ఉపాధి హామీ పథకం తెచ్చాం. ►తెలంగాణ దగ్గర డబ్బు ఉన్నప్పుడు కేసీఆర్ తనకునచ్చింది చేశారు. ►మేము ఆరు గ్యారంటీలను ఇస్తున్నాం. ►మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతినెల మహిళలకు రూ. 2500 ఇస్తాం. ►రైతులకు రైతు భరోసా కింద 15 వేలు ఇస్తాం. ►ఓట్ల కోసం ఈ పథకాలు కాదు, అన్ని ఆలోచించి ఈ నిర్ణయాలు తీసుకున్నాం. ►మేం అన్నది చేసి చూపిస్తాం, మీరు హామిలిచ్చి వదిలేస్తారు. ►రేవంత్ రెడ్డి మీ దోస్తులకు చెప్పు, నేను బస్సు ఏర్పాటు చేస్తా. ►కర్ణాటకలో హామీలు అమలు అవుతున్నాయో లేదో బీఆర్ఎస్ నేతలను తీసుకెళ్లి చూపించండి. ►ప్రతి ఏడాది రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామి ఇచ్చారు. ►తొమ్మిదేళ్లలో 18 లక్షల ఉద్యోగాలు రావాలి. వచ్చాయా? ►ఏ ఒఒక్కరితోనూ కాంగ్రెస్ అధికారంలోకి రాదు. అందరూ కలిసి పనిచేయాలి. ►సంగారెడ్డిలోని గంజి మైదాన్‌లో కాంగ్రెస్ కార్నర్ మీటింగ్ ప్రారంభమైంది. ఈ సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొన్నారు. సంగారెడ్డి సభ అనంతరం మల్లికార్జున ఖర్గే మెదక్ వెళ్లనున్నారు. సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డిలో కాంగ్రెస్ భారీ ర్యాలీ నిర్వహించింది.. ఈ ర్యాలీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. తారా డిగ్రీ కాలేజీ నుంచి గంజి మైదాన్ వరకు ర్యాలీ కొనసాగింది. -
అందరూ సీఎం లే..?
-
సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
-
బీఆర్ఎస్ Vs కాంగ్రెస్.. నేతల మధ్య పొలిటికల్ వార్
సాక్షి, సూర్యాపేట: తెలంగాణ పొలిటికల్ వాతావరణం మరోసారి హీటెక్కింది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేతలు పార్టీలపై విమర్శలు చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్‌ను మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించగా.. బీజేపీ, బీఆర్ఎస్ను కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. ఇక, మంత్రి జగదీష్ రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ హామీలన్నీ భోగస్. ఆచారణ సాధ్యం కాని హమీలను తెలంగాణ ప్రజలు నమ్మరు. కాంగ్రెస్ నాయకుల మాటలు సినిమా పాత్రల్లో వేసే బఫ్యూన్ల పాత్రలాగా ఉన్నాయి. కాంగ్రెస్ నాయకులు రాసి ఇచ్చిన స్క్రిప్టును సోనియా, రాహుల్ చదివి వినిపించారు. హామీలు నెరవేర్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి లేదు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి హామీలు ఇవ్వలేదు. కర్ణాటక పరిస్థితేంటి? గతంలో 2 లక్షల రుణమాఫీ అన్నా ప్రజలు నమ్మలేదు. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇవ్వకుండా ఇక్కడికి వచ్చి మాట్లాడితే తెలంగాణ ప్రజలు నమ్మరు. తెలంగాణతో సమానంగా బడ్జెట్ ఉన్న కర్ణాటకలో రైతుబంధు ఎందుకు ఇవ్వట్లేదు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ మీద ఉన్న నమ్మకం కాంగ్రెస్ నాయకులపై లేదు. ఇచ్చిన హామీలు మాత్రమే కాకుండా ఇవ్వని హామీలను కూడా నెరవేర్చిన ఘనత కేసీఆర్‌కే దక్కింది. కేసీఆర్ హామీలను కాపీ కొట్టి పథకాలు ఇస్తామంటే ప్రజలు నమ్మే స్థితిలో లేరు అంటూ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా ప్లాన్.. మరోవైపు, జగ్గారెడ్డి మాట్లాడుతూ.. మొదటి సారి CWC సమావేశాలు హైదరాబాద్‌లో జరిగాయి. బీఆర్ఎస్కు అండగా బీజేపీ, ఎంఐఎం పనిచేస్తున్నాయని రాహుల్ గాంధీ నిన్నటి సభలో స్పష్టంగా చెప్పారు. ఈ మూడు పార్టీలు కలిసి కాంగ్రెస్‌ను అధికారంలోకి రానివ్వకుండా కుట్రలు చేస్తున్నాయి. దేశ ప్రజలు సంక్షేమం కోసం CWC సమావేశాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. బీజేపీ మత రాజకీయాలు చేస్తూ దేశాన్ని కలుషితం చేస్తోంది. కాంగ్రెస్ సెక్యూలర్ పార్టీ. అన్ని మతాలకు సమాన గౌరవం ఇస్తుంది. మతాలను రెచ్చగొడుతూ అధికారాన్ని కాపాడుకోవాలని బీజేపీ చూస్తోంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: సోనియా గాంధీ అంటే అభిమానం, గౌరవం: విజయశాంతి కామెంట్స్ -
ఆపకపోతే నా అనుచరులకి అప్పగిస్తా: జగ్గారెడ్డి ఫైర్
సాక్షి, హైదరాబాద్: పార్టీ మారడం లేదని నిన్ననే క్లారిటీ ఇచ్చా. మీడియా సమావేశం పెట్టినా.. ఇంకా పుకార్లు ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఆ గుసగుసలు ఇప్పటికైనా బంద్ కావాలి అని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సొంత పార్టీలోనే నేతలు చేస్తున్న ప్రచారంపై ఫైర్ అయ్యారు. తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న పుకార్లపై మండిపడ్డ ఆయన.. ‘‘మళ్లీ చెప్తున్నా.. పార్టీ మారే ఉద్దేశం లేదు. నా గురించి నెగెటివ్‌గా ప్రచారం చేస్తే.. పార్టీలో ఫిర్యాదు చేస్తా. పరువునష్టం దావా వేస్తా. లీగల్ నోటీసు ఇస్తా. అయినా మారకపోతే నా అనుచరులకి అప్పగిస్తా’’ అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు జగ్గారెడ్డి. ‘‘మీడియా సమావేశంలో నేను చెప్పినప్పటికి కొంతమంది గుసగుసలు పెడుతున్నారు. అనుమానం క్లియర్ చేశాను.. మళ్ళీ ఇంకో అనుమానం అంటే ఎలా?. అనుమానించే వారికీ పనేం లేదా? 41 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నా. నేను కస్టపడి రాజకీయాల్లో ఉన్నా. కొంతమంది గుసగుసలు ఇప్పటికైనా బంద్ చేయాలి. అప్పు చేసి 3సార్లు ఎమ్మెల్యే అయ్యాను. ఏం సంపాదించుకోలేదు. నా మీద నిరాధార ఆరోపణలు చేస్తే పీసీసీకి, సీఎల్పీకి పిర్యాదు చేస్తా. రేవంత్, భట్టి లతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయించి.. క్రిమినల్ కేసులు పెట్టిస్తా. పార్టీకి డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి, పరువు నష్టం దావా వేస్తా. ఇప్పటికీ నాకు స్వంత ఇల్లు లేదు. నాకు ఆస్తులు ఉన్నాయని ఒక్కటి నిరూపించండి.. అది వారికే ఇచ్చేస్తా. ధరణి లో ఒక్క ఎకరా భూమి ఉన్నట్లు చూపితే.. వారికే ఇస్తా. 90 శాతం అహింస వాదిని.. 10 శాతం భగత్ సింగ్ లాగా వేరే పాత్ర పోషిస్తా. నేను పూర్తిగా పబ్లిక్ మనిషిని అంటూ వ్యాఖ్యలు చేశారాయన. ఇదీ చదవండి: కేసీఆర్ దృష్టిలో కమ్యూనిస్ట్ పార్టీ కరివేపాకు! -
కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్...బీఆర్ఎస్ వైపు జగ్గారెడ్డి చూపు
-
కాంగ్రెస్‌కు షాక్.. బీఆర్ఎస్లోకి జగ్గారెడ్డి?
సాక్షి, సంగారెడ్డి: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో తెలంగాణలో కూడా హస్తం నేతలు స్పీడ్ పెంచారు. రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలో కొందరు సీనియర్లను కూడా పార్టీలోకి ఆహ్వానించింది. మరోవైపు.. కొంత మంది హస్తం నేతలు కాంగ్రెస్‌ను వీడుతున్నారు. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. బీఆర్ఎస్లో చేరునున్నట్టు తెలుస్తోంది. కేసీఆర్ సర్కార్ వైపు జగ్గారెడ్డి మొగ్గుచూపుతున్నట్టు సమాచారం. ఇక, కొంతకాలంగా జగ్గారెడ్డి.. బీఆర్ఎస్ నేతలతో సఖ్యతగా ఉండటం విశేషం. ఇదే సమయంలో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి జగ్గారెడ్డి సంగారెడ్డి బరిలోకి దిగే అవకాశం ఉన్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాగా, పార్టీ మార్పు వార్తలు రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నా.. వాటిని జగ్గారెడ్డి ఖండించకపోవడం ఆసక్తికరంగా మారింది. ఇదే, పార్టీ మార్పు అంశానికి మరింత బలాన్ని చేకూర్చుతోంది. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిని టీపీసీసీ చీఫ్‌గా నియమించినప్పటి నుంచే జగ్గారెడ్డి సీరియస్‌గా ఉన్నారు. ఈ క్రమంలో బహిరంగంగానే తీవ్ర విమర్శలు చేశారు. ఇక, కాంగ్రెస్ హైకమాండ్‌కు కూడా పలు సందర్భాల్లో జగ్గారెడ్డి లేఖలు రాశారు. రేవంత్‌ను టీపీసీసీ చీఫ్‌గా నియమించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక, ఇటీవల కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న పలు కార్యక్రమాల్లో కూడా జగ్గారెడ్డి యాక్టివ్‌గా కనిపించకపోవడం గమనార్హం. ఒకానొక సమయంలో కేసీఆర్ సర్కార్ అమలు చేస్తున్న పథకాలపై కూడా జగ్గారెడ్డి సానుకూలంగా స్పందించి.. గులాబీ సర్కార్‌ను అభినందించడం విశేషం. ఇది కూడా చదవండి: కేసీఆర్ సార్ ‘మదిలో’ ఎవరు..? అందరిలోనూ హై టెన్షన్..! -
జగ్గారెడ్డి బీఆర్ఎస్లో చేరుతున్నారా? ‘చింతా’ కోసం అత్యవసర సమావేశం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి బీఆర్ఎస్ లో చేరుతారనే ఊహాగానాల నేపథ్యంలో ఆ పార్టీ నేతలు అప్రమత్తమయ్యారు. బుధవారం సంగారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో అత్యవసరంగా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, అన్ని గ్రామాల సర్పంచ్‌లు, నామినేటెడ్ పదవులు పొందిన నాయకులు, పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు సుమారు 200 మంది అత్యవసరంగా భేటీ అయ్యారు. ఈ సమావేశానికి డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, సంగారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి వంటి ఇద్దరు ముగ్గురు మినహా మిగిలిన ముఖ్యనేతలంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా నేతలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. చింతాకే అవకాశం ఇవ్వండి పార్టీలోకి వలస వచ్చే వారికి కాకుండా, పార్టీ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్‌కే అవకాశం కల్పించాలని ఎక్కువ మంది నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో ఓటమి పాలైనా ప్రజలకు అందుబాటులో ఉంటున్న చింతాకు తమ మద్దతు ఉంటుందని సుమారు 80 శాతం మంది ముఖ్యనేతలు స్పష్టం చేశారు. ఈ మేరకు తమ అభిప్రాయాన్ని పార్టీ అధినాయకత్వానికి విన్నవించాలని నిర్ణయించారు. మంత్రి హరీశ్‌రావు వద్దకు వెళ్లి తమ అభిప్రాయాన్ని పంచుకోవాలని అన్నారు. కాగా కొందరు నేతలు ఇందుకు భిన్నంగా తమ అభిప్రాయం వెల్లడించారు. పార్టీ అధినాయకత్వం ఎవరికి అభ్యర్థిత్వం ఖరారు చేస్తే వారి గెలుపు కోసమే తాము పనిచేస్తామని కొండాపూర్ ఎంపీపీ మనోజ్‌రెడ్డి, గుంతపల్లి సర్పంచ్ అనంత్‌రెడ్డి తదితర నేతలు స్పష్టం చేశారు. ఈ క్రమంలో పార్టీ టికెట్ కోసం తమ పేరును కూడా పరిశీలించాలని డాక్టర్ శ్రీహరి విజ్ఞప్తి చేశారు. సంగారెడ్డిలో అత్యవసర సమావేశం నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్యనేతలు సమావేశం ఆర్గనైజ్ చేసిందెవరు? సంగారెడ్డిలో బీఆర్ఎస్ ముఖ్యనేతల అత్యవసర సమావేశం నిర్వహించడం రాజకీయ వర్గాల్లో ఒకింత కలకలం రేపింది. ఈ సమావేశాన్ని ఆర్గనైజ్ చేసిందెవరనే అంశంపై చర్చ జరుగుతోంది. కాగా పార్టీ మండల, పట్టణ కార్యవర్గం అధ్యక్షులు, కార్యదర్శులు ముఖ్య నాయకులందరికీ ఫోన్లు చేసి సమావేశానికి హాజరుకావాలని కోరినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు మంగళవారం రాత్రే సమాచారం ఇచ్చినట్లు పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. ఇది ఒక మేలు కలయికే: చింతా ప్రభాకర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బీఆర్ఎస్ ముఖ్యనేతల అత్యవసర సమావేశం నేపథ్యంలో సాక్షి ప్రతినిధి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్‌ను ఫోన్లో సంప్రదించగా నాయకులంతా అత్యవసరంగా సమావేశం నిర్వహించినట్లు నాకు ఫోన్ చేసి చెప్పారు. జగ్గారెడ్డి అనుచరులు, కాంగ్రెస్ నుంచి గెలుపొందిన ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు ఆయనతో విభేదించి బీఆర్ఎస్లో చేరారు. ఇప్పుడు జగ్గారెడ్డి బీఆర్ఎస్లోకి వచ్చిన పక్షంలో తమ పరిస్థితి ఏమిటనే అభద్రతా భావంతో ఉన్నారు. అందుకోసమే ఈ అత్యవసర సమావేశం నిర్వహించుకుని ఉంటారని నేను అనుకుంటున్నాను అని పేర్కొన్నారు. -
కోమటిరెడ్డి వ్యాఖ్యలతో నష్టం లేదు: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఎంపీ కోమటిరెడ్డి ఒక టి మాట్లాడితే మరో విధంగా మీడియాలో వచ్చిందని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి అన్నారు. కోమటిరెడ్డి పార్టీకి నష్టం కలిగించేలా మాట్లాడలేదని స్పష్టం చేశారు. జగ్గారెడ్డి గురువారం ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మా ణిక్రావ్ ఠాక్రేను మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, రానున్న ఎన్నికల సన్నద్ధతలపై చ ర్చించారు. అనంతరం జగ్గారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ తాను కూడా త్వరలో నే పాదయాత్ర మ్యాప్‌ను ప్రకటిస్తానని చెప్పారు. -
సంగారెడ్డికి మెట్రో వేయండి..
సాక్షి, హైదరాబాద్: మియాపూర్ నుంచి సంగారెడ్డి రాంమందిర్ మీదుగా సదాశివపేట వరకు మెట్రో రైలును మంజూరు చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సీఎం కేసీఆర్‌ను కోరారు. ఈ మేరకు ఆయన ఆదివారం శాసనసభలో కేసీఆర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. తన వినతి పట్ల సీఎం సానుకూలంగా స్పందించారని, ఈ మెట్రోలైన్ సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారని జగ్గారెడ్డి విలేకరులకు తెలిపారు. అదే విధంగా గ్రూప్–1 మెయిన్స్‌కు 1:50 కాకుండా 1:100 నిష్పత్తిలో అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలని సీఎంను కోరగా, ఇందుకు కూడా ఆయన సానుకూలంగా స్పందించారని ఆయన వెల్లడించారు. సంగారెడ్డి నియోజకవర్గంలో బాలురు, బాలికల ఉన్నత పాఠశాలలు, కళాశాలలు, హాస్టల్ భవనాల నిర్మాణానికి నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి కోరారు. ఈ మేరకు అసెంబ్లీ లాబీల్లోని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చాంబర్లో ఆదివారం ఆమెను కలిసి వినతిపత్రం అందజేశారు. -
పంటలకు సకాలంలో కరెంట్ ఇవ్వాలి
సాక్షి, హైదరాబాద్: పంటలు కాపాడుకోవడానికి రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం గొప్పలు చెప్పకుండా సకాలంలో పంటలకు కరెంట్ ఇవ్వాలని టీపీసీసీ నేతలు డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగానికి విద్యుత్ సరఫరా అంశంపై అసెంబ్లీలో చర్చించాలన్న తమ విజ్ఞప్తిని స్పీకర్ మన్నించనందుకు నిరసనగా గురువారం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భట్టి విక్రమార్క, డి.శ్రీధర్‌బాబు, సీతక్క, జగ్గారెడ్డి సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద నిరసన తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ఉచితంగా 24 గంటలు కరెంట్ ఇస్తున్నామని ప్రభుత్వం డాంబికాలు చెబుతున్నా.. కనీసం 4–5 గంటలు కూడా కరెంట్ ఇవ్వట్లేదని ధ్వజమెత్తారు. ఆ కరెంట్ కూడా ఎప్పుడు ఏ సమయానికి ఇస్తున్నారో చెప్పలేని పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఇబ్బందుల గురించి మాట్లాడటానికి సమయం ఇవ్వాలని సభలో పదేపదే కోరినా పట్టించుకోలేదన్నారు. తమ వైపు స్పీకర్ కనీసం చూడకుండా వాయిదా తీర్మానాన్ని తిరస్కరించినందుకు బయటకు వచ్చామన్నారు. వ్యవసాయానికి 24 గంటల పాటు నిరవధికంగా ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని, విద్యుత్ కోతలపై సభలో చర్చ జరగాలన్నారు. -
సీఎం కేసీఆర్‌తో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి భేటీ
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి భేటీ అయ్యారు. గురువారం అసెంబ్లీ హాల్లో సీఎంను కలసి మాట్లాడిన ఆయన.. ఆ తర్వాత లాబీల్లోని సీఎం చాంబర్లోనూ కలిశారు. కాగా, ఈ భేటీ రాజకీయ చర్చకు దారితీసింది. సీఎంను కలసిన అనంతరం ఆయన మీడియా పాయింట్లో మాట్లా డుతూ తాను దొంగచాటుగా ముఖ్యమంత్రిని కలవలేదని పేర్కొన్నారు. తాను సీఎం కేసీఆర్‌ను అసెంబ్లీ హాల్లోనే కలిశానని, ఆ తర్వాత ఆయన చాంబర్లో టైం ఇవ్వడంతో అక్కడకు వెళ్లి నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడానని జగ్గారెడ్డి చెప్పారు. ప్రధానమంత్రిని కాంగ్రెస్ ఎంపీలు కలుస్తారని, అలాగే ఎమ్మెల్యేగా తాను కూడా సీఎంను కలిశానని అన్నారు. మియాపూర్ నుంచి సంగారెడ్డి, సదాశివపేట వరకు మెట్రో రైలు మంజూరు చేయాలని వినతిపత్రం ఇచ్చానని, దళితబంధు పథకం కోసం తన నియోజకవర్గంలోని 550 మంది అర్హుల జాబితా ఇచ్చానని, మహబూబ్ సాగర్ చెరువును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని, ఇందుకోసం రూ.200 కోట్లు కేటాయించాలని అడిగానని చెప్పారు. అలాగే సిద్ధాపూర్లో 5వేల మందికి, కొండాపూర్ ఆలియాబాద్‌లో 4వేల మందికి ఇళ్లను అప్పగించాలని కూడా సీఎంను కోరినట్టు చెప్పారు. ఇవే వినతిపత్రాలను మంత్రి కేటీఆర్‌కు కూడా ఇచ్చానని తెలిపారు. తన వినతులపై సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారని చెప్పిన జగ్గారెడ్డి, నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించేందుకు మరోమారు టైం ఇవ్వాలని సీఎంను కోరానని, ప్రగతిభవన్‌లో సమయం ఇస్తే వచ్చి కలుస్తానని చెప్పానని వెల్లడించారు. చదవండి: టీఎస్ అసెంబ్లీ: కేటీఆర్ Vs శ్రీధర్ బాబు హీటెక్కిన సభ -
చంద్రబాబు తెలంగాణకు రావడానికి కేసీఆరే అవకాశమిచ్చారు: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పేరుతో సీఎం కేసీఆర్ తెలంగాణను వదిలి జాతీయ రాజకీయాల్లోకి వెళుతు న్నారు కాబట్టే ఏపీకి చెందిన టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణకు వచ్చారని సంగారెడ్డి ఎమ్మెల్యే టి. జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణలో స్తబ్దుగా ఉన్న టీడీపీని తిరిగి గాడినపెట్టడం కోసం చంద్రబాబు రాష్ట్రానికి రావడానికి కేసీఆరే అవకాశమిచ్చారని అన్నారు. తెలంగాణ అనే పదాన్ని తన పార్టీ నుంచి తొలగించడంతోనే కేసీఆర్ బలం పోయిందని ఆయన అభిప్రాయ పడ్డారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్లో జగ్గారెడ్డి విలేకరు లతో మాట్లాడుతూ కేసీఆర్ తన పార్టీ నుంచి టీ అనే అక్షరాన్ని తొలగించి తెలంగాణను అవమా నించారని విమర్శించారు. కేసీఆర్‌లో ఎక్కడో మూలన సమైక్య భావన నెలకొందని, అందుకే తెలంగాణ వాదాన్ని ఆయన చంపేశారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్తో కేసీఆర్ సక్సెస్ కాలేరన్న జగ్గారెడ్డి... తెలంగాణలో ఇకపై సీరి యస్ పాలిటిక్స్ నడుస్తాయని, పొత్తుల గురించి ముందుముందు తెలుస్తుందని వ్యాఖ్యానించారు. రూ. 120 కోట్లు ఏ మూలకు? కాంగ్రెస్ హయాంలో చిరు వ్యాపారులకు 100 శాతం సబ్సిడీతో రుణాలు ఇచ్చామని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మైనారిటీలకు స్వయం ఉపాధి రుణాలు ఇవ్వట్లేదని జగ్గారెడ్డి విమర్శించారు. ప్రభుత్వం ఇటీవల మైనారిటీ కార్పొరే షన్‌కు ఇచ్చిన రూ. 120 కోట్లు ఏ మూలకు సరిపోతాయని ఆయన ప్రశ్నించారు. మైనారిటీ కార్పొరేషన్‌కు కనీసం రూ. 1,500 కోట్లు కేటాయించడంతోపాటు రుణాలదరఖాస్తు గడువును జనవరి 5 నుంచి మరో నెలపాటు పొడిగించాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. -
మైనారిటీ వెల్ఫేర్ లోన్స్ గురించి సీఎం కేసీఆర్‌కు జగ్గారెడ్డి లేఖ
-
Telidevara Bhanumurthy: కొంపలు ముంచే కొత్త దుక్నాలు
తెలంగానకు బోక శానొద్దు లైంది. ఒక్కపారి గా రాస్ట్రంకు బోయొస్తె బాగుంటదని నారదుడు అనుకుండు. తిట్టేటి నోరు, తిరిగేటి కాలు ఊకుండయి. నారదుడు తంబూర దీస్కుండు. ఒకపారి టింగ్ టింగ్ మన్నడు. చిర్తలు గొట్టుకుంట నారాయన, నారాయన అనుకుంట మొగులు మీది కెల్లి ఎల్లిండు. పట్నం దిక్కు గాయిన రాబట్టిండు. నడ్మల నర్కం దిక్కు బోతున్న యముని దున్నపోతు ఎదురైంది. ‘‘యాడికి బోతున్నవ్ నారదా’’ అని అడిగింది. ‘‘తెలంగాణల ఏమైతున్నదో ఎర్క జేస్కునే తంద్కు బోతున్న. నా సంగతి కేంగని నువ్వు పట్నం ఎందుకు బోయినవు’’ అని నారదుడు అడిగిండు. ‘‘మా దున్నపోతుల సంగం ఎలచ్చన్లు ఉంటె ఒక్క తీర్గ రమ్మని నన్ను బిలిస్తె బోయుంటి.’’ ‘‘మీ సంగం ఎలచ్చన్లు ఎట్లయినయి?’’ ‘‘సూద్దామని బోయిన నన్ను సుట్ట కుదురును జేసినయి. దున్నపోతుల సంగం ప్రెసిడెంటును జేసినయి.’’ ‘‘నర్క లోకం దున్నపోతును ప్రెసిడెంట్ నెట్ల జేస్తరని తెలంగాన దున్నపోతులు లొల్లి బెట్టలేదా?’’ ‘‘లొల్లి బెట్టెతంద్కు మా దున్నపోతులేమన్న కాంగ్రెస్ పార్టీయా?’’ ‘‘కాంగ్రెస్, బీఆర్ఎస్ అసువంటి రాజకీయ పార్టీల గాలి దాక్తె దున్నపోతులల్ల గుడ్క రాజకీయాలు షురువైతయేమో!’’ అని నారదుడు అన్నడు. ‘‘నువ్వు తక్వోనివి గావు నారదా! మా దాంట్ల రాజకీయాలు షురువైతె మేము మేము కొట్లాడు కుంటుంటె సూసి మురుద్దామనుకుంటున్నవు. గీ నడ్మ కాంగ్రెస్, బీఆర్ఎస్ కొత్త దుక్నాలు దెర్సినయి. ఇంతకుముందు తెలంగానల టీఆర్ఎస్ అనేటి కిరాన దుక్నముండేది. గా దుక్నంను హోల్‌సేల్ దుక్నం జేసి డిల్లిల దెర్సిండ్రు. బీఆర్ఎస్ అని పేరు బెట్టిండ్రు. దుక్నంల కేసీఆర్ గూసుండు. వాస్తు జూసి మంచి మూర్తంల దుక్నం దెర్వబట్కె గిరాకి మంచి గైతదని గాయిన అనుకుండు. గని గాయిన ఒకటను కుంటె ఒకటైంది. కుమార స్వామి, అఖిలేశ్ యాద వ్లే దుక్నం కాడ్కి వొచ్చిండ్రు. గాల్లది ఉద్దెర బ్యారమే. గాల్లు దప్పిడ్సి డిల్లిల ఎవ్వలు గా దుక్నం గురించి ముచ్చట బెట్టలే.’’ ‘‘కాంగ్రెస్ దుక్నాల సంగతేంది?’’ అని నారదుడు అడిగిండు. ‘‘గిప్పుడున్న అంగడిల ఒకల్లను జూసి ఒకల్లు ఓరుస్త లేరు. కండ్లల్ల మన్ను బోసుకుంటున్నరు. భారత్ జోడో యాత్ర జేస్కుంట ప్రేమ దుక్నాలు దెరుస్తున్న. గీ దుక్నాలు కడ్మ దుక్నాల సుంటియి గాదు. గిన్వి ఎవ్విటిని అమ్మయి, కొనయి. అందర్కి ప్రేమను పంచిస్తయి. బువ్వబెడ్తె అర్గిపోతది. బట ్టలిస్తె చిన్గిపోతయి. గని నా ప్రేమ అర్గేది గాదు అని రాహుల్ గాంధి అన్నడు.’’ ‘‘ఇంతకు గాయిన ప్రేమ నెట్ల పంచుతున్నడు?’’ ‘‘కాంగ్రెస్సోల్లు గండ్లబడ్తె గాలియెంబడి ముద్దు లిస్తున్నడు. చిన్న పోరనికి చెప్పులేస్తున్నడు. బుడ్డ పోరగాన్ని ఎత్తుకోని ముక్కు చీమిడి దీస్తున్నడు. కాలేజి పోరగాల్లకు సేకెండిస్తున్నడు. ఛాయ్ దాక్కుంట ముసలోల్ల మంచి చెడ్డ లర్సుకుంటు న్నడు. రాహుల్ గాంధి భారత్ జోడో అన్కుంట పాదయాత్ర జేస్తుంటే పార్టీ తోడో అన్కుంట తెలం గానల కాంగ్రెస్ లీడర్లు కొట్లాడుకుంటున్నరు’’ అని దున్నపోతు అన్నది. ‘‘ఎందుకు కొట్లాడుకుంటున్నరు?’’ అని నార దుడు అడిగిండు. ‘‘రేవంత్ రెడ్డి టీపీసీసీ ప్రెసిడెంట్ అయిన కాడికెల్లి తెలంగాన సీనియర్ కాంగ్రెస్ లీడర్లు లోపట లోపట మండుతున్నరు. మునుగోడుల కాంగ్రెస్ ఓడిపోంగనే గాయిన మీద్కి లేసిండ్రు. టీపీసీసీ కమిటీలు ఎయ్యంగనే రేవంత్‌ను తిట్టుకుంట గాల్లు శిగమూగ బట్టిండ్రు. భట్టి విక్రమార్క ఇంట్ల కాంగ్రెస్ ఎంపి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మధుయాష్కి, దామోదర్ రాజ నర్సింహ, జగ్గారెడ్డి, కోదండరెడ్డి, ప్రేంసాగర్ రావు అసువంటి కాంగ్రెస్ సీనియర్ లీడర్లు మీటింగ్ బెట్టిండ్రు. టీడీపీకెల్లి కాంగ్రెస్లకొచ్చిన రేవంత్ రెడ్డి టీపీసీసీ కమిటీలల్ల టీడీపీలకెల్లి వొచ్చి నోల్లకే మోక ఇచ్చిండు. ముంగటి సంది కాంగ్రెస్‌ల ఉన్నోల్లను పక్కకు బెట్టిండు. సేవ్ కాంగ్రెస్ అన్కుంట గాల్లు లొల్లిబెట్టబట్టిండ్రు. ‘హాత్ సే హాత్’ ప్రోగ్రాంకు డుమ్మాగొట్టిండ్రు. ఇగ దాంతోని టీపీసీసీ కుర్సిలకు సీతక్కనే గాకుంట పన్నెండుమంది కాంగ్రెస్ లీడర్లు రాజినామ జేసిండ్రు. కొట్లాడుకుంటున్న కాంగ్రెస్ లీడర్లల్ల కొంతమందిని గుంజి గాల్ల చేతులల్ల తామర పువ్వులు బెట్టెతంద్కు బీజేపీ రడీగున్నది.’’ ‘‘బీఆర్ఎస్ దుక్నం సంగతేంది?’’ ‘‘డిల్లిల బీఆర్ఎస్ హోల్‌సేల్ దుక్నం బెట్టినంక కేసీఆర్ పట్నమొచ్చిండు. రొండు మూడు దినా లైనంక పంజాబ్ సీఎం భగవంత్ మాన్ గాయినను గల్సిండు. ఆంద్రప్రదేస్, పంజాబ్, హర్యానా, మహా రాస్ట్ర, ఒడిసా, కర్నాటక రాస్ట్రాలల్ల బీఆర్ఎస్ దుక్నాలు దెరుస్తమని కేసీఆర్ జెప్పిండు. ఆ దుక్నాల ముంగట ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అని రాసిన బోర్డులు బెడ్తమని అన్నడు. మల్ల గలుస్త’’ అన్కుంట దున్నపోతు నర్కం దిక్కుబోయింది. నారాయన, నారాయన అన్కుంట నారదుడు వైకుంటం బోయిండు. (క్లిక్ చేయండి: మందల బడి మురుస్తాంది గొర్రె) - తెలిదేవర భానుమూర్తి సీనియర్ జర్నలిస్ట్ -
ధరణిని ఏం చేద్దాం?
సాక్షి, హైదరాబాద్: రైతులను ఇబ్బందిపెడుతున్న ధరణి పోర్టల్‌ను ఎలా మార్చాలన్న దానిపై ప్రజలు, రైతుల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ధరణి పోర్టల్ పనితీరుపై పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు ఇచ్చిన సమాచారంతోపాటు క్షేత్రస్థాయి నుంచి సమాచారం తీసుకుని అధికారికంగా పార్టీ వైఖరిని వెల్లడించాలని భావిస్తోంది. తద్వరా వరంగల్ డిక్లరేషన్‌కు అనుగుణంగా ముందుకెళ్లే దిశగా కార్యాచరణ మరింత ఉధృతం చేయాలని యోచిస్తోంది. ఈ మేరకు శుక్రవారం సీఎల్పీ కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, సీనియర్ నాయకులు కొప్పుల రాజు, మల్లురవి, ధరణి కమిటీ సభ్యులు హర్కర వేణుగోపాల్, ఈరవత్రి అనిల్, చెరుకు సుధాకర్, ప్రీతం తదితరులు హాజరయ్యారు. గంటన్నరపాటు సమావేశమైన వీరు ధరణి పోర్టల్ వల్ల రైతులకు కలుగుతున్న ఇబ్బందులు, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన రైతు సంక్షేమ కార్యక్రమాల గురించి చర్చించారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణిని కొనసాగించాలా లేదా కొత్త పద్ధతిలో తీసుకెళ్లాలా అనే దానిపై చర్చించారు. దీనిపై మండలానికి ఐదుగురిని నియమించి వారితో డేటా సేకరించాలని, ఆ తర్వాత 3వేల మందితో సమావేశం నిర్వహించి అందులో వెల్లడైన సమాచారం ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని తీర్మానించారు. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుతో రాష్ట్రంలో రిజర్వేషన్లు 50 శాతం దాటాయని, ఈ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్ తరహాలో రిజర్వేషన్లు అమలు చేస్తే ఎలా ఉంటుందన్న దానిపైనా చర్చించారు. మాది తోడికోడళ్ల పంచాయితీ: రేవంత్, జగ్గారెడ్డి ధరణిపై సీఎల్పీలో జరిగిన సమావేశానికి ముందు అసెంబ్లీ ఆవరణలో ఎదురుపడిన రేవంత్‌రెడ్డి, జగ్గారెడ్డి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఇద్దరూ ఒకరినొకరు పలకరించుకున్న తర్వాత తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పే ప్రయత్నం చేశారు. తమది తోడికోడళ్ల పంచాయతీ అని, పొద్దున తిట్టుకున్నా మళ్లీ కలిసిపోతామని చెప్పారు. రేవంత్ పాదయాత్రకు తన మద్దతు ఉంటుందని చెప్పిన జగ్గారెడ్డి.. రేవంత్‌రెడ్డిని ఆ పదవి నుంచి దింపి పీసీసీ అధ్యక్షుడు కావాలన్నది తన అభిమతం కాదని స్పష్టంచేశారు. ఆయన దిగిన తర్వాతనే తాను పీసీసీ అధ్యక్షుడిని అవుతానని పేర్కొన్నారు. నాపై కుట్రలు కొత్త కాదు: దామోదర నేను ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుడు సింహయాజిని ఎప్పుడూ కలవలేదు. ఎవరో కావాలని తనకు నష్టం కలిగించేలా ప్రచారం చేస్తున్నారు. ఈ కుట్రలు నాకు కొత్తకాదు. గతంలోనూ చాలాసార్లు జరిగాయి. కవిత, సంతోష్‌ను అరెస్టు చేయాలి: జగ్గారెడ్డి ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితతోపాటు ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ కీలక నేత బీఎల్ సంతోష్ నేరస్తులేనని... వారిని అరెస్టు చేయాలని ఎమ్మెల్యే టి. జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంతోశ్‌ను ముందుపెట్టి తెలంగాణలోని వివిధ పార్టీల నేతలను కొనేందుకు యత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. అసెంబ్లీ మీడియా హాల్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరడం ఒక స్కీం అని, వివిధ పార్టీల ఎమ్మెల్యేలు, ఇతర నేతలను బీజేపీలో చేర్చుకోవాలనుకోవడం ఒక స్కాం అని అన్నారు. -
తెలంగాణ: అసెంబ్లీ ఆవరణలో సరదా సన్నివేశం
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ చీఫ్, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డికి.. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డికి మధ్య నడిచే మాటల యుద్ధం గురించి ప్రత్యేకంగా తెలియంది కాదు. ఒకే ఇంట్లో సాగే టామ్ అండ్ జెర్రీ గోలలాగా.. ఒకేపార్టీలో ఉంటూ వీళ్లు ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు ఈ ఫైర్‌బ్రాండ్స్. ఈ క్రమంలో.. ఇవాళ(శుక్రవారం) ఆసక్తికర ఘటన ఒకటి చోటు చేసుకుంది. అసెంబ్లీ అవరణలో రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి ఎదురు పడ్డారు. సీఎల్పీకి వచ్చిన వీళ్లు తారసపడడంతో మీడియా ఆసక్తిగా వీళ్ల కలయికను చిత్రీకరించే యత్నం చేసింది. అది గమనించిన ఇద్దరూ చేతిలో చెయ్యేసుకుని సరదాగా సంభాషించారు. మా ఇద్దరి మద్య ఉంది తోటికోడలు పంచాయితీనే అంటూ చమత్కరించారు వాళ్లు. ‘మా ఇద్దరి మధ్య ఎలాంటి విబేధాలు లేవు. మాది తోడికోడళ్ళ పంచాయితీ. పొద్దున తిట్టుకుంటాం.. సాయంత్రానికి మళ్లీ కలిసిపోతాం’ అని కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. కలిసి నప్పుడు నవ్వుకొవ్వొద్దా.. కాంగ్రెస్‌ల ఒకరిని గుంజి గద్దె ఎక్కడం కుదరదు. టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ యాత్రకు మద్దతు ఇస్తానని చెప్పిన కదా అంటూ ఈ సందర్భంగా జగ్గారెడ్డి గుర్తు చేశారు. ఇంకా పదేళ్లు ఐనా.. రేవంత్ రెడ్డి దిగిపోయిన తర్వాతనే తాను పీసీసీ అధ్యక్షుడిని అవుతానని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ఈ సమయంలో రేవంత్, చుట్టుపక్కల ఉన్నవాళ్లంతా నవ్వులు చిందించారు. #jaggannamla #Revanthreddy pic.twitter.com/4xuXbzqY4m — S-Punna Reddy (@125PunnaReddy) December 2, 2022 -
కవిత, బీఎల్ సంతోష్ లను వెంటనే అరెస్ట్ చేయాలి - జగ్గారెడ్డి
-
‘బీఎల్ సంతోష్, కవితను వెంటనే అరెస్ట్ చేయాలి’
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు, ఎమ్మెల్యేల కొనుగోలు కేసు తెలంగాణలో పొలిటికల్ హీట్‌ను పెంచింది. లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక పాత్ర ఉన్నట్టు ఈడీ అధికారులు నోటీసుల్లో పేర్కొన్న విషయం తెలిసిందే. ఎమ్మెల్యేల ఎపిసోడ్లో బీఎల్ సంతోష్‌కు సిట్ నోటీసులు పంపి విచారణకు రావాలని కోరిన ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. కాగా, లిక్కర్ స్కాం, ఎమ్మెల్యేల ఎపిసోడ్ వ్యవహారంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జగ్గారెడ్డి స్పందించారు. ఈ క్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ కవితను, బీజేపీ నేత బీఎల్ సంతోష్‌ను వెంటనే అరెస్ట్ చేయాలి. బీఎల్ సంతోష్‌ను కాపాడేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. టీఆర్ఎస్, బీజేపీ నేతలు డ్రామాలు చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద స్కాంలు చేశాయి. వారిద్దరినీ తక్షణమే అరెస్ట్ చేసి, వాస్తవాలు వెలికితీయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు. ఈ క్రమంలోనే బీఎల్ సంతోష్‌ను తెలంగాణ ప్రభుత్వం అరెస్ట్ చేస్తే మరిన్ని విషయాలు బయటికొస్తాయని కామెంట్స్ చేశారు. -
పేదలందరికీ ఇళ్ల స్థలాలివ్వాలి.. లేకపోతే ఉద్యమమే: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్న పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సంగారెడ్డి ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయంపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని అడుగుతానని, ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తానని చెప్పారు. బుధవారం అసెంబ్లీ మీడియా హాల్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సంగారెడ్డి నియోజకవర్గంలోని సదాశివపేట, సిద్ధాపూర్‌లలోని పేదలకు 5వేల ప్లాట్లు, కొండాపూర్, ఆలియాబాద్‌లలో 4వేల ప్లాట్లు ఇచ్చామని, అయితే అక్కడ స్థలాలు ఉన్నాయి కానీ పేదలను మాత్రం పంపించి వేశారని చెప్పారు. వెంటనే వారికి పొజిషన్ ఇవ్వాలని, ఇదే విషయమై సీఎం కేసీఆర్‌కు లేఖ రాశానని వెల్లడించారు. రాష్ట్రంలో రాజకీయం అంతా గందరగోళంగా ఉందని, అన్నీ అండర్స్టాండింగ్ పాలిటిక్స్ నడుస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం నిద్రలో ఉంది కానీ కాంగ్రెస్ లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణ రావడం వల్ల ప్రజలకు ఏం లాభం జరిగిందో అర్థం కాదు కానీ కాంగ్రెస్‌ను మాత్రం ఔట్ చేయాలని చూస్తున్నారని చెప్పారు. పడుకున్న కేసీఆర్‌ను లేపి మా వాళ్లు తన్నించుకున్నారు పడుకున్న కేసీఆర్‌ను లేపి తన్నించుకున్నది కాంగ్రెస్ పార్టీ వాళ్లేనని అన్న జగ్గారెడ్డి బీజేపీకి రాజకీయం తప్ప సమస్యలపై పోరాటం చేయడం తెలియదని విమర్శించారు. వైఎస్ షర్మిల పాదయాత్రను అడ్డుకునే హక్కు ఎవరికీ లేదన్నారు. చదవండి: కేసీఆర్.. అసెంబ్లీలో లెంపలేసుకో.. బండి సంజయ్ ధ్వజం.. -
ఎన్నికల వరకు రేవంత్‌నే కొనసాగించాలి
సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికలు ముగి సేంతవరకు టీపీసీసీ అధ్య క్షుడిగా రేవంత్‌రెడ్డినే కొన సాగించాలని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి అన్నారు. ఇప్పటికిప్పుడు రేవంత్‌రెడ్డిని దించేయాలని పార్టీలో ఎవరూ కోరుకోవడం లేదని చెప్పారు. సోమవారం అసెంబ్లీ మీడియా హాల్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. పీసీసీ అధ్యక్షు డిగా ఎవరున్నా పార్టీలోని నేతలందరినీ కలుపుకొని పనిచేయాల్సిన బాధ్యత వారిపై ఉంటుందని పేర్కొన్నారు. పాదయాత్ర చేయాలనే అభిప్రాయం పార్టీలో ఎవరికైనా ఉండవచ్చని, కానీ పీసీసీ అధ్య క్షుడికే ప్రథమ ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. రేవంత్‌రెడ్డి పాదయాత్ర చేస్తే మనస్ఫూర్తిగా సహ కరిస్తానని తెలిపారు. అయితే రేవంత్ ఏ నిర్ణయం విషయంలోనూ తమను సంప్రదించడం లేదని విమర్శించారు. రేవంత్ ఇటీవల చేసిన కొన్ని తొందరపాటు వ్యాఖ్యల గురించి పార్టీ భేటీలో అడుగు తానని చెప్పారు. సీఎల్పీ నేత భట్టి ఒక నటుడని, ఆయన గురించి అర్ధం కాదని జగ్గారెడ్డి అన్నారు. డ్రామాలు ఓటు బ్యాంకును మార్చవు రాష్ట్రంలో టీఆర్ఎస్ మొదటి స్థానంలో ఉంటే, కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో ఉందని జగ్గారెడ్డి అభి ప్రాయపడ్డారు. వచ్చే ఎన్నికల్లో తాము మొదటి స్థానానికి వెళ్లి అధికారంలోకి రావాలని, ప్రజలకు మరింత సేవ చేయాలని, టీఆర్ఎస్ రెండో స్థానా నికి వెళ్లాలన్నదే తమ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో బీజేపీ హడావుడి చేస్తున్నా, హైటెక్ డ్రామాలు ఓటు బ్యాంకును మార్చలేవని పేర్కొన్నారు. సంగారెడ్డి రాంనగర్ వరకు మెట్రోరైల్ మెట్రో రైలును మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు పొడిగించాలని జగ్గారెడ్డి కోరారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌కు లేఖ రాసినట్టు తెలిపారు. బీహెచ్ఈఎల్, పటాన్చెరు, పోతిరెడ్డిపల్లి మీదుగా సంగారెడ్డిలోని రాంనగర్ వరకు మెట్రో రైల్ పొడి గించాలని కోరారు. అలాగే ఉప్పల్ మీదుగా యాద గిరిగుట్ట వరకు మెట్రో రైలును పొడిగించాలని, తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన గుట్ట వరకు ఈ రైలును పొడగించడం వల్ల పెద్ద ఎత్తున భక్తు లకు సౌకర్యంగా ఉంటుందని జగ్గారెడ్డి చెప్పారు. -
బీజేపీ, టీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలు
సాక్షి, హైదరాబాద్: ప్రజల కష్టాలను గాలికి వదిలి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దౌర్భాగ్య పరి పాలన అందిస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ , ఎమ్మెల్యే జగ్గారెడ్డి ధ్వజమెత్తారు. గాంధీభవన్‌లో గురువారం మీడియాతో ఆయన మాట్లా డుతూ మోదీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. రెండు కోట్ల ఉద్యోగాలు, నల్లధనం దేశానికి తెస్తానన్న హామీలు పత్తా లేకుండా పోయాయని విమర్శించారు. పెరిగిన ధరలకు సమాధానం లేదని, ఎన్నికలప్పుడు మతాన్ని రెచ్చ గొట్టి లబ్ధిపొందడం ఒక్కటే బీజేపీకి తెలుసని నిందించారు. ఇక రాష్ట్రంలో ఉద్యోగాల హామీ నెరవేరలేదని, 57 ఏళ్లకు పెన్షన్ ఇస్తానన్న వాగ్దానాలు అమలు కావడం లేదని ఆరోపించారు. ప్రజలు కూడా కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ మోసపూరిత మాటలను పట్టించుకోకపోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు. బీజేపీ, టీఆర్ఎస్ అవగాహనతోనే రాష్ట్రంలో చెత్త రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. అమిత్‌షా, కేసీఆర్‌లు ప్లాన్ ప్రకారమే రెండు పార్టీల పంచాయితీ పెట్టుకొంటూ కాంగ్రెస్‌ను రాష్ట్రంలో లేకుండా చేయడానికి కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు. ఈడీ, ఐటీలకు బండి చీఫ్లా మాట్లాడుతున్నారు ఈడీ, ఐటీ అధికారులు మాట్లాడాల్సిన మాటలు కూడా బండి సంజయ్ మాట్లాడుతున్నారని, ఈ రెండు విభాగాలకు బండి సంజయ్ చీఫ్ అయ్యారా అనేది అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. మంత్రి మల్లారెడ్డి టీడీపీలో ఉన్నప్పటి నుంచే డబ్బులు సంపాదించారని, 8 ఏళ్లుగా లేని దాడులు ఇప్పుడే ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. బీజేపీ ఈడీ, ఐటీలను వాడుతుంటే కేసీఆర్ ఏసీబీని వాడుకుంటున్నారని , రెండు పార్టీలదీ రాజకీయమేనని అన్నారు. డబ్బులు ఇస్తే కాంగ్రెస్ లో పదవులు రావని, రాహుల్ గాంధీ పై మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడటం తప్పని జగ్గారెడ్డి ఖండించారు. మర్రి చెన్నారెడ్డి సీఎం అయ్యారని, ఆయన కూడా డబ్బులు ఇచ్చి సీఎం అయ్యారా అని ప్రశ్నించారు. తాను రాహుల్ గాంధీ, ఠాగూర్లకే జవాబుదారీ అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మంచి ఆర్గనైజర్ అని కొనియాడారు. -
TS Raids: బీజేపీ టార్గెట్‌గా జగ్గారెడ్డి సంచలన కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఈడీ, ఐటీ దాడుల నేపథ్యంలో పొలిటికల్ హీట్ పీక్ స్టేజ్‌కు చేరుకుంది. ఈ క్రమంలో రాజకీయ నేతలు టీఆర్ఎస్, బీజేపీ సర్కార్లను టార్గెట్ చేసి సంచలన కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా ఈ దాడులపై స్పందించారు. కాగా, జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఈడీ, ఐటీని బీజీపీ వాడుతోంది. కేసీఆర్ ఏసీబీని వాడుకుంటున్నారు. వీరిద్దరి మధ్య దాడుల వల్ల ప్రజలు జరిగే లాభమేంటి?. మా దగ్గర ఏ శాఖ లేదు.. మేమేమీ చేయలేము. టీడీపీలో ఉన్నప్పటి నుంచే మంత్రి మల్లారెడ్డి సంపాదించాడు. గత ఎనిమిదేళ్లలో లేని దాడులు ఇప్పుడే ఎందుకు చేస్తున్నారు. గోవాలో క్యాసినో ఫ్రీ.. అక్కడ బీజేపీనే కదా అధికారంలో ఉంది. గోవాలో ఆడించేది మీరే.. ఇక్కడ దాడులు చేసేది కూడా మీరేనా అంటూ బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ తెలంగాణలో కాంగ్రెస్ మనుగడ దెబ్బతీయాలని చూస్తోంది. మీడియాను అడ్డంపెట్టుకుని కుట్ర పన్నుతోంది. లైమ్‌లైట్‌లో ఉంచడానికే టీఆర్ఎస్ మంత్రులపై దాడులు జరుపుతోంది అంటూ సంచలన కామెంట్స్ చేశారు. -
మోదీ చిత్రపటాన్ని చీపుళ్లతో కొట్టి నిరసన.. కాంగ్రెస్ నేతల కౌంటర్
సాక్షి, హైదరాబాద్: ఆర్ఎస్ఎస్ నేత సావర్కర్‌ను ఉద్దేశించి రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యల మంటలు మండుతూనే ఉన్నాయి. రాహుల్ వ్యాఖ్యలకు నిరసనగా ఆయన చిత్రపటాన్ని చెప్పులతో కొడుతూ బీజేపీ నేతలు మహారాష్ట్రలో నిరసన వ్యక్తం చేయగా, రాహుల్ గాంధీకి మద్దతుగా తెలంగాణలో కాంగ్రెస్ నేతలు మోదీ చిత్రపటాన్ని చెప్పులు, చీపుర్లతో కొడుతూ కౌంటర్ ఇచ్చారు. ఆదివారం గాంధీభవన్‌లో సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి నేతృత్వంలో జరిగిన ఆందోళనలో ఈ మేరకు ప్రతి నిరసన చేపట్టారు. గాంధీభవన్ వెలుపలికి వచ్చేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు, పోలీసులకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది. ఆ తర్వాత గాంధీభవన్ ప్రాంగణంలోనే కాంగ్రెస్ నేతలు చీపుర్లు, చెప్పులతో మోదీ చిత్రపటాన్ని కొడుతూ రాహుల్‌కి మద్దతుగా, సావర్కర్, బీజేపీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉన్నది అంటే ఉలుకెందుకు: జగ్గారెడ్డి సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం హిందూ, ముస్లింలు కలిసి పనిచేశారనీ కానీ, ఆర్ఎస్ఎస్కు చెందిన సావర్కర్ మాత్రం బ్రిటిష్ పాలకులను క్షమాభిక్ష కోరాడని ఆరోపించారు. ఉన్నది అంటే ఉలుకు ఎందుకని పశ్న్రించారు. కార్యక్రమంలో యూత్‌కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి, ఫిషర్మెన్ కమిటీ చైర్మన్ మెట్టు సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
రేవంత్ ఫెయిల్
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ నాశనమవుతోందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. పార్టీలో ఏ పరిణామం జరిగినా పీసీసీ అధ్యక్షుడే బాధ్యత వహించాలని చెప్పారు. పార్టీని నడిపించడంలో రేవంత్ ఫెయిల్ అయ్యాడని, ఆయనతోపాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పార్టీ రాష్ట్ర ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్, తాను కూడా ఫెయిలేనని పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నా.. ప్రజా సమస్యలపై పోరాడే శక్తి ఉన్నా.. వ్యవస్థ బాగోలేదని, అంతా గాడి తప్పిందని వ్యాఖ్యానించారు. పార్టీలో ఉన్న పది మంది కూడా ఒక్క దగ్గర కూర్చునే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. శనివారం సీఎల్పీ కార్యాలయంలో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. రేవంత్ వన్‌మ్యాన్ షో ప్రయత్నం వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగబోతుంటే రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం ఏం చేస్తోందో అర్థం కావడం లేదని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ఇంట్లో కూర్చుని జూమ్ సమావేశాలు పెడితే సరిపోదని.. పీసీసీ అధ్యక్షుడు గ్రామగ్రామానికి వెళ్లాలని పేర్కొన్నారు. రేవంత్ పాదయాత్రతో వన్ మ్యాన్ షో చేద్దామనుకుంటున్నారని, అలా చేస్తే పార్టీ అధికారంలోకి వస్తుందా అని ప్రశ్నించారు. గతంలో వారానికో మీటింగ్ అని చెప్పారని, పీసీసీ సమావేశాలు ఎక్కడ జరుగుతున్నాయని ప్రశ్నించారు. పీసీసీ, సీఎల్పీ మధ్య సమన్వయం లేదని, ఈ విషయంలో ఇన్చార్జిది కూడా తప్పేనని వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ముందు పీసీసీ అధ్యక్షుడిని మార్చాలని తాను చెప్పబోనన్నారు. అయితే పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే మెడిసిన్ తన దగ్గర ఉందని, భవిష్యత్తులో తనకు పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే ఆ మందు బయటకు తీస్తానని పేర్కొన్నారు. నేతలు వెళ్తుంటే ఏం చేస్తున్నారు? శశిధర్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడటం పార్టీకి నష్టమని, ఇందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితోపాటు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ సంస్థాగత ఇన్చార్జి, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ బాధ్యత వహించాలని జగ్గారెడ్డి పేర్కొన్నారు. శశిధర్‌రెడ్డి పార్టీ వదిలి వెళ్లే పరిస్థితి ఏర్పడితే ఈ ముగ్గురూ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అందరూ వెళ్లిపోయిన తర్వాత రేవంత్, భట్టి ఏం చేస్తారని నిలదీశారు. టీఆర్ఎస్, బీజేపీ బయట వాళ్ల ఆట వారు ఆడుతుంటే.. రేవంత్, భట్టి ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో వాళ్ల ఆట ఆడుతున్నారని వ్యాఖ్యా నించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో తానొక్కడినే పనిచేశానని రేవంత్ చెప్పడం సరికాదని జగ్గారెడ్డి అన్నారు. మునుగోడు ఓటమి బాధ్యతల నుంచి రేవంత్ తప్పించుకోలేడన్నారు. పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే అన్ని ఖర్చులు తానే పెట్టుకుంటానని రేవంత్ చెప్పాడని.. మునుగోడు ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ చెరో రూ.100 కోట్లు పెడితే, రేవంత్ కనీసం రూ.50 కోట్లయినా ఖర్చు పెట్టి ఉండాల్సిందని వ్యాఖ్యానించారు. జనాల కాళ్లు మొక్కితే ఓట్లు పడే రోజులు పోయా యన్నారు. పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేత ఇద్దరూ పార్టీ నాయకులందరినీ పట్టించుకోకపోయినా, అసంతృప్తితో ఉన్న నాయకులతో అయినా మాట్లాడాలని సూచించారు. రాష్ట్ర పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఏఐసీసీకి లేఖ రాశానని చెప్పిన జగ్గారెడ్డి.. ఆ లేఖ వివరాలను వెల్లడించేందుకు మాత్రం నిరాకరించారు. బీజేపీ, టీఆర్ఎస్లది కుక్కల కొట్లాట రాష్ట్రంలో బీజేపీ, టీఆర్ఎస్ పొలిటికల్ డ్రామా ఆడుతున్నాయని, వారిది కుక్కల కొట్లాట అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ‘‘టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, బీజేపీ ఎంపీ అర్వింద్ రైతుల సమస్యలపై కొట్లాడుతున్నారా? ప్రజల సమస్యలు వదిలేసి సొంత దుకాణాలు పెట్టుకుంటున్నారు. టీఆర్ఎస్, బీజేపీ నేతలు ఒకరినొకరు గిచ్చుకుంటున్నారు. కాంగ్రెస్ ఉనికి లేకుండా చేసేందుకే ఆట ఆడుతున్నారు’’అని మండిపడ్డారు. కాంగ్రెస్‌లో కలకలం.. ఆరా తీసిన అధిష్టానం మునుగోడు ఉప ఎన్నిక, భారత్‌జోడో యాత్ర, పార్టీ నుంచి మర్రి శశిధర్‌రెడ్డి నిష్క్రమణ తదితర అంశాలపై జగ్గారెడ్డి చేసిన వ్యా ఖ్యలు కాంగ్రెస్‌లో కలకలం రేపాయి. దీనిపై ఏఐసీసీ కార్యదర్శి నదీమ్ జావేద్ ఆరా తీసి నట్టు తెలిసింది. శనివారం సాయంత్రం జగ్గారెడ్డికి ఫోన్ చేసిన ఆయన.. ఏం మాట్లాడారు? ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందనే అంశాలపై వివరణ కోరినట్టు సమాచారం. ఇక పార్టీ నేతలు జూమ్ సమావేశాలతో ఏం చేస్తారని వ్యాఖ్యానించిన జగ్గారెడ్డి.. శనివారం సాయంత్రం జూమ్ ద్వారా జరిగిన పీసీసీ కీలక సమావేశానికి హాజరుకాకపోవడం గమనార్హం. -
రేవంత్, భట్టి టార్గెట్‌గా జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి టీపీసీసీపై సంచలన కామెంట్స్ చేశారు. జగ్గారెడ్డి శనివారం మీడియాతో మాట్లాడుతూ.. గాంధీభవన్‌లో మీటింగ్ పెట్టాల్సిందిపోయి ఇళ్లల్లో కూర్చుని జూమ్ మీటింగ్ ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. జూమ్ మీటింగ్ పెట్టడానికి ఇదేమైనా కంపెనీనా?. ఉన్న 10 మంది కూడా గాంధీభవన్‌లో కూర్చోలేని పరిస్థితి. కొన్ని ఛానళ్ల భజనతోనే రేవంత్‌కు పీసీసీ దక్కింది. కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి పార్టీ మారే పరిస్థితి ఉంటే రేవంత్, భట్టి విక్రమార్క, మహేష్ గౌడ్ ఏం చేస్తున్నారు. నేతలు పార్టీ మారకుండా చూడాల్సిన బాధ్యత పీసీసీకి లేదా?. అందరూ పార్టీ నుంచి వెళ్లిపోయాక గాంధీభవన్‌లో ఏం చేస్తారు?. మర్రి శశిథర్ రెడ్డి లాంటి వారు పార్టీ నుంచి మారితే కాంగ్రెస్ చాలా నష్ట పోతుంది. 12 మంది ఎమ్మెల్యేల ను కాపాడుకోవడం లో ఉత్తమ్ , భట్టి ఫెయిల్ అయ్యారు. మునుగోడులో ఓటమిని రేవంత్ అంగీకరించాలి. పార్టీ గెలిస్తే క్రెడిట్ రేవంత్‌కు, ఓడితే మిగలిన వారికి ఇస్తారా?. మాణిక్యం ఠాగూర్ వ్యవస్థను సెట్ చేయడం లేదు. పార్టీలో చాలా ప్రక్షాళన చేయాలి. టీఆర్ఎస్ వ్యతిరేక ఓటు కాంగ్రెస్‌కు వస్తుంది అనుకోవడం తప్పు. తెలంగాణలో బలమైన శక్తిగా ఉన్న కాంగ్రెస్‌ను బలహీనపరచేందుకే టీఆర్ఎస్, బీజేపీ పొలిటికల్ డ్రామాలు చేస్తున్నాయి. మీడియాన డైవర్ట్ చేసేందుకే రెండు పార్టీలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయి. నిరుదోగ్యులకు ఉద్యోగాలు, రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి వంటి హామీలను టీఆర్ఎస్ మరిచిపోయింది. బీజేపీ, టీఆర్ఎస్ ల మధ్య దాడుల వల్ల ప్రజలకు వచ్చే లాభం ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. -
నిత్యం పొడవాటి గడ్డంతోనే..! ఈ ఫొటోలో ఉన్న వ్యక్తిని గుర్తు పట్టారా?
తెలంగాణకు చెందిన ఆ కాంగ్రెస్ నేత స్టైలే వేరు. రాజకీయాలపై మాట్లాడితే మాటల తూటాలే. చూడటానికి కూడా గంభీరంగా ఉంటారు. ఆయనకంటూ ప్రత్యేక హెయిర్ స్టైల్, గడ్డం, నడక తీరు ఉంటుంది. ఎప్పుడూ బారెడు గడ్డం, పొడవాటి మీసంతో జనాల్లో కనిపించే ఆ కాంగ్రెస్ నేత ఒక్కసారిగా మారిపోయారు. నిత్యం గడ్డం, మీసాలు పెంచుతూ ఉండే ఆయన ఉన్నట్టుండి క్లీన్‌షేవ్‌తో దర్శనమిచ్చారు .దీంతో ఆయనను గుర్తుపట్టడం కొందరికి కష్టమైపోయింది. తిరుపతి వెంకన్న భక్తుడైన ఆ కాంగ్రెస్ నేత ఎవరో కాదు.. మన సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి. ఆయన తిరుమల శ్రీవారిని సతీసమేతంగా దర్శించుకున్నారు. తలనీలాలు సమర్పించి మొక్కుతీర్చుకున్నారు. దీంతో జగ్గారెడ్డిని గడ్డం మీసాలు లేకుండా గుర్తుపట్టలేకపోతున్నారు కొందరు. అసలు ఆయనేనా అని పరీక్షించి చూస్తున్నారు. ప్రస్తుతం జగ్గారెడ్డి కొత్త లుక్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, జగ్గారెడ్డికి దైవ భక్తి ఎక్కువ. తరుచూ పూజల్లో పాల్గొంటారు. పండుగల సందర్భంగా చందాల కోసం వచ్చిన భక్తులకు తనకు తోచిన సాయాన్ని చేస్తూనే ఉంటారు.. ఇటీవల రాహుల్ భారత్ జోడో యాత్ర ఆయన నియోజకవర్గంలో (సంగారెడ్డి) ప్రవేశించిన సందర్భంగా జగ్గారెడ్డి కొరడాలతో కొట్టుకుంటూ పోతురాజులను అనుకరించిన విషయం తెలిసిందే. చదవండి: ED Raids Telangana: గ్రానైట్ కంపెనీల్లో సోదాలపై ఈడీ కీలక ప్రకటన -
60వేల మందితో రాహుల్‌కు స్వాగతం
కొండాపూర్(సంగారెడ్డి): నవంబర్ 3న సంగారెడ్డిలో ప్రారంభమయ్యే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు 60వేల మందితో స్వాగతం పలుకు తామని సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి తెలిపారు. సోమవారం మల్కాపూర్‌లో కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నెహ్రూ ప్రధాని అయ్యాక రాంచంద్రాపూర్‌లో బీహెచ్ఈఎల్, ఇందిరా గాంధీ మెదక్ నుంచి ఎంపీగా గెలిచి ప్రధాని అయ్యాక బీడీఎల్, ఓడీఎఫ్ వంటి పరిశ్రమలు, సోనియాగాంధీ హయాంలో సంగారెడ్డిలో ఐఐఐటీ ఏర్పాటయ్యాయని గుర్తుచేశారు. సంగారెడ్డి నియోజకవర్గంలో 25 కి.మీ మేర రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగతుందని, యాత్రను విజయవంతం చేయాలని కోరారు. మండలాల అధ్యక్షులు ప్రభు, బుచ్చిరాములు, రాంరెడ్డి, ప్రకాష్ చెర్యాల ఆంజనేయులు, ప్రభుదాసు, రఘు గౌడ్, వెంకటేశం గౌడ్, సునీల్ పాల్గొన్నారు. -
తండ్రి లాంటి సీఎంకు కోపమేల: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: తల్లిదండ్రులకు కోపం వచ్చినా వెంటనే తమ పిల్లలను దగ్గరకు తీసుకుంటారని, అలాగే ఈ రాష్ట్రానికి తండ్రి లాంటి సీఎం పోస్టులో ఉన్న కేసీఆర్‌కు వీఆర్ఏలపై కోపం తగదని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. మూడు నెలలుగా వీఆర్ఏలకు జీతాలు లేవని, వారంతా ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దసరా పండుగ సందర్భంగా అయినా వారి సమస్యలను పరిష్కరించి దసరా కానుక ఇవ్వాలని ఆదివారం మీడియా సమావేశంలో జగ్గారెడ్డి అన్నారు. సమ్మెలో ఉన్న వారంతా జీతాలు లేక అవస్థల పాలవుతున్నారని, ఈ సమ్మె కాలంలోనే 28 మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తంచేశారు. వీఆర్ఏలకు అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చిన విధంగా పేస్కేల్ అమలు చేయాలని, పదోన్నతులు, వారసులకు ఉద్యోగాలిచ్చే జీవోలను విడుదల చేయాలని కోరారు. సీఎం పెద్ద మనసుతో ఆలోచించి వీఆర్ఏల సమస్యల పరిష్కారానికి పూనుకోవాలని జగ్గారెడ్డి విజ్ఞప్తిచేశారు. చదవండి: బీజేపీకి కొత్త పేరు చెప్పిన కేటీఆర్ -
జగ్గారెడ్డి ఏ పార్టీలో ఉంటారో తెలియదు: షర్మిల
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మంత్రి కేటీఆర్ కోవర్టు అని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. గాంధీ భవన్లో అంతా ఇదే విషయాన్ని చెప్పుకుంటున్నారన్నారు. ప్రజాప్రస్థానం పాదయాత్ర సోమవారం సంగారెడ్డి నియోజకవర్గంలో కొనసాగింది. కంది మండలం ఆరుట్లలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ వైఎస్ఆర్ కూడా పార్టీ మారారంటూ జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలను షర్మిల తీవ్రంగా ఖండించారు. జగ్గారెడ్డి మాదిరిగా వైఎస్ఆర్ ఎప్పుడూ రాజకీయ వ్యభిచారం చేయలేదన్నారు. వైఎస్ఆర్ గెలిచిన పార్టీ కాంగ్రెస్‌లో కలిసిపోయిందనే విషయాన్ని గుర్తుచేశారు. సంతల్లో పశువులను కొనుగోలు చేసినట్టు జగ్గారెడ్డిని టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పారీ్టలు కొనుగోలు చేస్తున్నాయని నిప్పులు చెరిగారు. ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉన్న జగ్గారెడ్డి రేపు ఏ పార్టీలో ఉంటారో తెలియదన్నారు. సంగారెడ్డి నియోజకవర్గానికి ఒక్క ఎకరానికైనా సాగు నీరందించని టీఆర్ఎస్ను జగ్గారెడ్డి ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. చదవండి: ప్రాజెక్టులకు సహకరించని రాష్ట్ర సర్కారు..కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శ -
రూ.3వేల పింఛన్.. భార్యాభర్తలిద్దరికీ ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: పండుటాకులు తమ జీవిత చరమాంకంలో ప్రశాంతంగా జీవించేలా మానవతా హృదయంతో ఆలోచించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని వృద్ధులకు ప్రస్తుతం ఇస్తున్న పింఛన్‌ను రూ.2,016 నుంచి రూ.3,016కు పెంచాలని, 57 ఏళ్ల వయసున్న వారికి కూడా పెంచిన పింఛన్‌ను అమలు చేయాలని ఆదివారం ఒక ప్రకటనలో ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం కుటుంబంలో ఒకరికి మాత్రమే పింఛన్ ఇచ్చే విధానం అమల్లో ఉందని, దాన్ని సవరించి అర్హులైన భార్యాభర్తలిద్దరికీ పింఛన్ ఇవ్వడం ద్వారా వృద్ధాప్యంలో ఆ దంపతులు మరొకరిపై ఆధారపడకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆధార్ కార్డులో నమోదైన వయసు కారణంగా చాలా మంది వృద్ధులు పింఛన్‌కు అర్హత పొందలేకపోతున్నారని వెల్లడించారు. అనేక మంది వయసు 60–70 ఏళ్ల వరకు ఉన్నా ఆధార్‌కార్డుల్లో 55 ఏళ్లుగానే నమోదైందని, దీంతో వారు పింఛన్ పొందలేకపోతున్నారని విచారం వ్యక్తం చేశారు. వెంటనే మున్సిపాలిటీల్లో వార్డు సభలు, గ్రామాల్లో గ్రామసభలు ఏర్పాటు చేసి స్థానికంగా విచారణ చేయడం ద్వారా వారి వయసును ఆధార్‌కార్డుల్లో మార్చి అర్హులైన వారందరికీ పింఛన్ వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు. -
రాష్ట్రాన్ని మీరే సంతోషంగా ఏలుకోండి
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్రంలో అన్ని కులాలవారికి దళితబంధు తరహాలో బంధు పథకాలు ప్రకటించాలని సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. రెడ్లు, బ్రాహ్మణులు, వైశ్యుల్లోనూ నిరుపేదలున్నారని..రాష్ట్రంలోని నాలుగు కోట్ల మందికి ఈ బంధు పథకాన్ని అమలు చేసి..రాష్ట్రాన్ని సంతోషంగా ఏలుకోవాలన్నారు. మంగళవారం సంగారెడ్డిలో మీడియాతో మాట్లాడారు. ముస్లింలకు 12% రిజర్వేషన్లు అమలు చేస్తామని సీఎం కేసీఆర్ హామీ అమలుకు నోచుకోలేదన్నారు. ఎస్టీలకు పది శాతం రిజర్వేషన్లు ఎన్నికలోపు అమలు చేయకపోతే ప్రశ్నిస్తామన్నారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టడం మంచి నిర్ణయమని అదేవిధంగా పార్లమెంట్ భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేయాలని కోరారు. ఏఐసీసీ అధ్యక్షపదవి కోసం అశోక్ గెహ్లోట్, శశిథరూర్ పేర్లు విన్పిస్తున్నాయని, సోనియా, రాహుల్ నిర్ణయాన్ని కాదనలేమని చెప్పారు. -
టీషర్ట్ రాజకీయం స్థాయికి బీజేపీ దిగజారింది
సాక్షి, హైదరాబాద్: భారత్ జోడో యాత్రలో రాహుల్‌గాంధీ ధరించిన టీషర్ట్ గురించి రాజకీయం చేసే స్థాయికి బీజేపీ దిగజారిందని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. రాహుల్‌గాంధీపై ఏ విమర్శలు చేయాలో ఆ పార్టీకి అర్థం కావడం లేదన్నారు. అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు, ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాల గురించి రాహుల్ అడిగే ప్రశ్నలకు సమాధానం లేకనే బీజేపీ టీషర్ట్ రాజకీయం చేస్తోందన్నారు. మరి పూటకో డ్రస్ మార్చే ప్రధాని మోదీ గురించి ఏం చెబుతారని బీజేపీ నేతలను ప్రశ్నించారు. రాహుల్‌గాంధీ రూ.40వేల టీషర్ట్ ధరించారని, మోదీ రోజూ వేసుకుని తిరిగే రూ.60లక్షల విలువైన డ్రెస్‌ల గురించి బీజేపీ నేతలు ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. రాహుల్ యాత్ర రూట్ మార్పుపై చర్చిస్తా.. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తన నియోజకవర్గంలో కూడా 30 కిలోమీటర్ల మేర ఉంటుందని జగ్గారెడ్డి చెప్పారు. సంగారెడ్డిలో ప్రవేశించి నియోజకవర్గం దాటి వెళ్లేంతవరకు అన్ని కులాలు, మతాలకు చెందిన ప్రజలను ఈ యాత్రలో భాగస్వాములను చేస్తామని తెలిపారు. స్థానిక నేతలతో సమన్వయం చేసుకుని రాహుల్ యాత్రను విజయవంతం చేస్తామని పక్రటించారు. అయితే, ఓఆర్ఆర్ మీదుగా జరిగే పాదయాత్రతో ప్రయోజనం ఉండదని, అందుకే దీనిపై పీసీసీ నాయకత్వంతో చర్చిస్తానని, శంషాబాద్ నుంచి రాజేంద్రనగర్, మెహిదీపట్నం, గచ్చిబౌలి, లింగంపల్లిల మీదుగా సంగారెడ్డికి వచ్చేలా రూట్ మార్చాలని పీసీసీని కోరతానని జగ్గారెడ్డి వెల్లడించారు. -
కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం లేదని వెల్లడించారు. తన స్థానంలో ఈ సారి సంగారెడ్డి కార్యక్తనే నిలబెట్టనున్నట్లు తెలిపారు. క్యాడర్ వద్దంటే.. తన భార్య నిర్మలను బరిలోకి దింపుతానని పేర్కొన్నారు. మళ్లీ 2028 ఎన్నికట్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు. అయితే జగ్గారెడ్డి వచ్చే ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయనంటున్నారనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. ఇదిలా ఉండగా ప్రతి రాజకీయ పరిణామంపై వేగంగా స్పందించే కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ జగ్గారెడ్డి ఈ మధ్య కాలంలో మౌనంగా ఉంటున్నారు. సొంత పార్టీ లో కల్లోలం లాంటి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కూడా ఆయన నోరెత్తడం లేదు. నెలరోజులకుపైగా గాంధీభవన్‌కు కూడా రావడం లేదు. దీంతో ఆయన అసలు ఏం చేయాలనుకుంటున్నారనే విషయాలు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. బీజేపీ, టీఆర్ఎస్లలో పనిచేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన జగ్గారెడ్డి తనదైన శైలిలో రాజకీయం నెరుపుతుంటారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయి, 2018లో సంగారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వేదికగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. తన ఆహార్యంతోనే విలక్షణంగా కనిపించే జగ్గారెడ్డి ఏది చేసినా చర్చకు దారితీస్తుందనేది రాజకీయవర్గాల అభిప్రాయం. ముఖ్యంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యవహారశైలిపై అనేక సందర్భాల్లో విమర్శలు చేసిన ఆయన పార్టీకి నష్టం కలిగిస్తున్నారనేంతవరకు వెళ్లారు. అయినా వెనక్కు తగ్గని జగ్గారెడ్డి తాను పార్టీ మంచి కోసమే చెబుతున్నానంటూ తనదైన శైలిలోనే ముందుకెళ్లారు. -
కాంగ్రెస్‌లో రాజీనామాలు.. నోరు మెదపని జగ్గా రెడ్డి అందుకేనా..?
-
జగ్గారెడ్డి మౌనం వెనుక ‘వ్యూహం’?
సాక్షి, హైదరాబాద్: ప్రతి రాజకీయ పరిణామంపై వేగంగా స్పందించే కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్, సంగారెడ్డి ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి మౌనంగా ఎందుకు ఉంటున్నారు? సొంత పార్టీ లో కల్లోలం లాంటి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కూడా ఆయన ఎందుకు నోరెత్తడం లేదు? నెలరోజులకుపైగా గాంధీభవన్‌కు రాని ఆయన అసలేం చేయాలనుకుంటున్నారు... అనే విషయాలు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమ య్యాయి. జగ్గారెడ్డి సన్నిహితులు మాత్రం ఆయన వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నారని అంటున్నారు. నెల రోజులుగా మౌనవ్రతం చేస్తున్న జగ్గారెడ్డి నవంబర్ వరకు ఇదే వైఖరి కొనసాగిస్తారని, అప్పటివరకు పూర్తిస్థాయిలో నియోజకవర్గానికే పరిమితం అవుతారని, ఆ తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ పరిస్థితిలో మార్పు రాకపోతే కొత్త మార్గాన్ని ఎంచుకుంటారని చెబుతున్నారు. ఏకంగా కాంగ్రెస్ పార్టీకి పోటీగా కొత్తపార్టీ పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ మేరకు తెరవెనుక చేయాల్సిన పనులన్నింటినీ ఆయన చక్కబెట్టుకుంటున్నారని సమాచారం. మార్పు వస్తే ఓకే... లేదంటే ‘కొత్తపార్టీ’? జగ్గారెడ్డి మౌనం వెనుక కారణమేంటన్న దానిపై ‘సాక్షి’ఆరా తీయగా ఆయన కావాలనే రాజకీయ వ్యాఖ్యలు చేయడం లేదని తెలిసింది. పార్టీ పరిస్థితుల్లో మార్పు కోసం అటు అధిష్టానంతోపాటు ఇటు పార్టీ సీనియర్లతో ఆయన చర్చలు జరుపుతున్నారని, అదే సమయంలో పార్టీ పరిస్థితుల్లో మార్పు రాకపోతే కాంగ్రెస్‌కు పోటీగా మరో పార్టీ పెట్టేందుకు కూడా ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నారని సమాచారం. ఇందుకోసం ప్రయత్నాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, అలవికాని పరిస్థితుల్లో ఆయన సొంత పార్టీ ఏర్పాటు ఖాయమని తెలుస్తోంది. తాను ఆశించిన మార్పు పార్టీలో వస్తే కాంగ్రెస్‌లో ఉంటానని, లేదంటే దసరా తర్వాత కీలక నిర్ణయం తీసుకుంటానని అనుచరులతో చెబుతున్నట్లు తెలుస్తోంది. అప్పటి నుంచీ నిందలే.. బీజేపీ, టీఆర్ఎస్లలో పనిచేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన జగ్గారెడ్డి తనదైన శైలిలో రాజకీయం నెరుపుతుంటారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయి, 2018లో సంగారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వేదికగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. తన ఆహార్యంతోనే విలక్షణంగా కనిపించే జగ్గారెడ్డి ఏది చేసినా చర్చకు దారితీస్తుందనేది రాజకీయవర్గాల అభిప్రాయం. అప్పట్లో తెలంగాణ ప్రజలంతా ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమిస్తుంటే జగ్గారెడ్డి మాత్రం ‘జై సమైక్యాంధ్రప్రదేశ్’అని విమర్శల పాలయ్యారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఇదే విషయాన్ని ఆయన పలుమార్లు మీడియా సమావేశాల్లో వెల్లడించారు కూడా. రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాల్లో కూడా ఆయన పలుమార్లు వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ముఖ్యంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యవహారశైలిపై అనేక సందర్భాల్లో విమర్శలు చేసిన ఆయన పార్టీకి నష్టం కలిగిస్తున్నారనేంతవరకు వెళ్లారు. అయినా వెనక్కు తగ్గని జగ్గారెడ్డి తాను పార్టీ మంచి కోసమే చెబుతున్నానంటూ తనదైన శైలిలోనే ముందుకెళ్లారు. ఉన్నట్టుండి ఏమైందో కానీ... ఆయన మౌనం దాల్చారు. -
Jagga Reddy: రేవంత్‌రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు.. జగ్గారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు!
సాక్షి,హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై చేసిన ఘాటు వ్యాఖ్యలు అధిష్టానం దృష్టికి వెళ్లినట్టు తెలిసింది. పదేపదే పార్టీ లైన్ దాటుతూ వ్యవహరిస్తున్న జగ్గారెడ్డిపై చర్యలు కఠినంగా ఉంటాయనే చర్చ జరుగుతోంది. రెండు నెలల క్రితం రాష్ట్ర పర్యటనలో భాగంగా గాంధీభవన్‌కు వచ్చిన ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ కీలక సూచనలు చేశారు. పార్టీ లైన్ దాటి ఎవరూ మీడియా ముందు మాట్లాడకూడదని, పార్టీ నేతల గురించి వ్యాఖ్యలు చేయకూడదని హెచ్చరించారు. అప్పటి నుంచి ఎక్కడా వివాదాస్పద వ్యాఖ్యలు చేయని జగ్గారెడ్డి శనివారం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన తీరు పార్టీ ఇన్చార్జిలను ఆగ్రహానికి గురిచేసినట్టు తెలుస్తోంది. రేవంత్‌రెడ్డి చేసిన ‘గోడకేసి కొడతాం..’ వ్యాఖ్యలపై పార్టీలో చర్చిస్తామని చెప్పాల్సింది పోయి నోటికి వచ్చినట్టు మాట్లాడటంపై సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయనపై చర్యలకు సిఫారసు చేస్తూ పార్టీ రాష్ట్ర ఇన్చార్జితో పాటు పొలిటికల్ కన్సల్టెంట్‌గా ఉన్న సునీల్ కనుగోలు సైతం నివేదిక అందించినట్టు తెలుస్తోంది. ఆయనతోపాటు పార్టీకి సమాచారం లేకుండా యశ్వంత్‌సిన్హాకు బేగంపేట ఎయిర్‌పోర్టులో టీఆర్ఎస్తో కలిసి స్వాగతం పలికిన వి.హనుమంతరావుకు సైతం షోకాజ్ నోటీసులివ్వాలని అధిష్టానం ప్రాథమికంగా నిర్ణయించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో.. ‘పార్టీ లైన్ దాటి మాట్లాడనని రాహుల్‌గాంధీకి ఇచ్చిన మాట తప్పినం’దుకు తానే సొంతంగా నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్టు చెబుతున్న జగ్గారెడ్డి.. దీనిపై సోమవారం సంచలన ప్రకటన చేయబోతున్నట్టు చెప్పారు. -
ఇది నీ జాగీర్ కాదు.. మేం నీ నౌకర్లం కాదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ పర్యటన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో దుమారం రేపింది. మాజీ ఎంపీ వి.హనుమంతరావు బేగం పేట ఎయిర్‌పోర్టులో సిన్హాను కలవడం వివాదాస్పదమైంది. వీహెచ్ వ్యవహారం తన దృష్టికి రాలేదని, పార్టీ నిబంధనలు దాటితే ఎంతటి వారినైనా గోడకేసి కొడతామంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించడం కలకలం రేపింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. ‘అసలు రేవంత్ ఎవడు? ఎవరిని కొడతావో కొట్టు చూద్దాం’అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘కాంగ్రెస్ పార్టీని కొనుక్కున్నావా?.. పార్టీలో ఎమ్మెల్యేలు, ఎంపీలు నీ నౌకర్లమేమీ కాదు..’అని మండిపడ్డారు. రేవంత్ వ్యాఖ్యల నేపథ్యంలో జగ్గారెడ్డి శనివారం మీడియాతో మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. సంబంధిత వార్త: కాంగ్రెస్‌లో కల్లోలం: వీహెచ్ వ్యవహారంపై రేవంత్‌రెడ్డి సీరియస్ మళ్లీ మాట్లాడాల్సి వస్తోంది ‘టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో ఉండి రేవంత్ అలా ఎలా మీడియా ముందు టెంప్ట్ అయ్యారు. నేను గతంలో టెంప్ట్ అ యితే అనేక పంచాయితీలు వచ్చాయి. రాహుల్ గాంధీతో సమావేశం తర్వాత నేను ఎక్కడా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు. కానీ ఇప్పుడు రేవంత్ మళ్లీ మా ట్లాడాల్సిన పరిస్థితి తెచ్చాడు. సీనియర్ నాయకులను కొడతా అని వ్యాఖ్యానిం చిన వ్యక్తి పీసీసీ పదవిలో కొనసాగకూడదు. దిగిపోవాలి. దీనిపై సోనియాగాంధీ, రాహుల్ గాం ధీలకు లేఖ రాసి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరతా..’అని జగ్గారెడ్డి తెలిపారు. సీఎల్పీని డమ్మీ చేశాడు... ‘పీసీసీ, సీఎల్పీ కాంగ్రెస్ పార్టీకి రెండు కళ్లు. కానీ సీఎల్పీ పోస్టును రేవంత్ రెడ్డి డమ్మీ చేశాడు. ఏమాత్రం విలువ ఇవ్వ కుండా ప్రవర్తిస్తున్నాడు. భట్టి విక్రమార్క ను ఆగం చేస్తున్నాడు. రేవంత్ చేస్తున్న తప్పులన్నీ పార్టీకి లేఖ ద్వారా వివరిస్తా..’అని తెలిపారు. మాపై కోవర్టులని ముద్రవేశాడు.. ‘గతంలో కోవర్టులని నా మీద, వీహెచ్ మీద ముద్రవేసి హైకమాండ్‌కు రేవంత్‌రెడ్డి అనేకసార్లు లేఖలు రాయించాడు. మాపై విషప్రచారం చేశాడు. అసమ్మతి వర్గానికి, కోవర్టులకు తేడా తెలియని వ్యక్తి రేవంత్‌రెడ్డి..’అని జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెందుకు? ‘రేవంత్‌రెడ్డి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే పడేవాడు ఎవడూ లేడు. ఇది రేవంత్ జాగీర్ కాదు. మీడియా ముందు ఎలా నోరు పారేసుకుంటావు. నాకు వార్నింగ్ ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి ఎవడు? రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు, ఆహ్వానంపై ఇప్పటివరకు టీపీసీసీ సమావేశం కానీ సీఎల్పీ సమావేశం కానీ ఏర్పాటు చేయలేదు. యశ్వంత్ సిన్హాను కలవాలని గానీ, కలవకూడదని గానీ ఎవరికీ ఎలాంటి సమాచారం లేదు. ఢిల్లీలో యశ్వంత్‌సిన్హా నామినేషన్ కార్యక్రమంలో రాహుల్‌గాంధీ, కేటీఆర్ పాల్గొంటే లేని అభ్యంతరం ఇప్పుడెందుకు? రేవంత్ తాను చేసిన వ్యాఖ్యలపై బహిరంగ క్షమాపణ చెప్పాలి’అని డిమాండ్ చేశారు. చదవండి: డైనమిక్ సిటీ హైదరాబాద్‌కు చేరుకున్నా: తెలుగులో మోదీ ట్వీట్ -
కన్ఫ్యూజన్లో పడ్డ ఎమ్మెల్యే జగ్గారెడ్డి..
-
బీజేపీ నేతలకు ధైర్యముంటే రాకేశ్ ఇంటికి రావాలి: జగ్గారెడ్డి
బీజేపీ నేతలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సవాల్ విసిరారు. జగ్గారెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కాల్పులకు బాధ్యులు ఎవరూ అంటూ ప్రశ్నించారు. బీజేపీ నేతలకు ధైర్యం ఉంటే వరంగల్ రాకేశ్ ఇంటికి రావాలని సవాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్ రద్దు అయ్యే వరకు బండి సంజయ్, కిషన్‌రెడ్డిని అడ్డుకుంటామన్నారు. రాకేశ్ మృతదేహంపై టీఆర్ఎస్ జెండా ఎందుకు కప్పారు?. బీజేపీ ప్రభుత్వం రాకేశ్ మృతికి కారణమైతే.. టీఆర్ఎస్ శవయాత్ర రాజకీయం చేసింది’’ అని విమర్శించారు. ఇది కూడా చదవండి: బాసర ట్రిపుల్ ఐటీ వద్ద టెన్షన్.. టెన్షన్ -
ఆర్మీ ఉద్యోగార్థుల పోరాటంలో న్యాయముంది
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆర్మీ ఉద్యోగార్థుల పోరాటంలో న్యాయం ఉందని సంగారెడ్డి ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. కేసులు పెట్టి వారి బంగారు భవిష్య త్ను నాశనం చేయొద్దని రైల్వేశాఖకు విజ్ఞప్తి చేశారు. బీజేపీ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయమే యువకుల కోపానికి కారణమైందని, తప్పుడు విధానాలతో యువకుల భవి ష్యత్తును అదానీ, అంబానీలకు అమ్మివేయొద్దంటూ శుక్ర వారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాజకీయ పార్టీల మద్దతు తీసుకోకుండా ఉద్యోగాల కోసం రాష్ట్ర రాజధానిలో ఇంత పెద్ద ఉద్యమం జరగడం ఇదే తొలిసారన్నారు. కేంద్రంతో మాట్లాడి సమస్యను పరిష్కరిం చా ల్సిన బీజేపీ నేతలు బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని మండిపడ్డారు. కిషన్‌రెడ్డి చేతులెత్తేస్తే, బండి సంజయ్ పెద్ద పెద్ద మాటలు నరికాడని ఎద్దేవా చేశారు. -
రాజకీయంగా ఎదుర్కోలేకనే ఈడీ దాడులు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కొనే శక్తి లేకనే బీజేపీ తన అధికారాన్ని ఉపయోగించుకుని ఈడీని ఉసిగొలుపుతోందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా పాదయాత్ర చేసి బీజేపీ వైఫల్యాలను నిలదీసేందుకు రాహుల్‌గాంధీ సిద్ధమవుతున్న తరుణంలో బీజేపీ ఆయన పాదయాత్రను అడ్డుకునే కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసులో రాహుల్‌గాంధీని ఈడీ విచారించడాన్ని నిరసిస్తూ వరుసగా మూడోరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగింది. బుధవారం ఉదయం నుంచే కాంగ్రెస్ శ్రేణులు, నేతలు గాంధీభవన్‌కు చేరుకుని దీక్షా శిబిరంలో కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్‌గాంధీని ప్రజల నుంచి దూరం చేయాలన్నదే బీజేపీ ఉద్దేశమని చెప్పారు. ఏఐసీసీ కార్యాలయంలోకి చొరబడి పోలీసులు తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, పార్టీ నేతలు నిరంజన్, అంజన్‌కుమార్ యాదవ్, రాములు నాయక్ మల్లు రవి, శివసేనారెడ్డి, నాగరిగారి ప్రీతం, నూతి శ్రీకాంత్‌గౌడ్, మెట్టు సాయికుమార్, వరలక్ష్మి, నీలం పద్మతో పాటు పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
హైదరాబాద్ ఈడీ ఆఫీస్ ముందు ఉద్రిక్తత
-
HYD: ఈడీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఈడీ విచారించడంపై పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలు ఆందోళనలు చేస్తున్నారు. ఇక, హైదరాబాద్‌లో కూడా కాంగ్రెస్ నేతలు ఈడీ కార్యాలయం ఎదుట నిరసనలు చేపట్టారు. ఈ సందర్భంగా మంగళవారం నిరసనల్లో భాగంగా.. ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు జగ్గారెడ్డి ప్రయత్నించారు. కాంగ్రెస్ కార్యకర్తలు పెట్రోల్ బాటిల్స్‌తో వచ్చారు. ఈ క్రమంలో పోలీసులు.. జగ్గారెడ్డిని అడ్డుకున్నారు. అనంతరం కాంగ్రెస్ నేతలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. దీంతో ఈడీ ఆఫీసు ఎదుట ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
ఈడీ విచారణపై.. కాంగ్రెస్ నిరసనలు
సాక్షి, హైదరాబాద్: నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారించడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ శ్రేణులు కదం తొక్కాయి. రాహుల్ విచారణ సందర్భంగా దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేయాలన్న ఏఐసీసీ పిలుపు మేరకు హైదరాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహించాయి. సోమవారం నెక్లెస్‌రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం వద్దకు పార్టీ జెండాలు చేతబూని పెద్దఎత్తున చేరుకున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హల్చల్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి, ఈడీకి వ్యతిరేకంగా సోనియా, రాహుల్‌కు మద్దతుగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. టీపీసీసీ పిలుపు మేరకు ఉదయం 10 గంటల నుంచే కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో నెక్లెస్‌రోడ్డుకు చేరుకున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితోపాటు పార్టీ స్టార్ క్యాంపెయినర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, సీతక్క, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు గీతారెడ్డి, మహేశ్‌కుమార్‌గౌడ్, అంజన్‌కుమార్ యాదవ్, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, షబ్బీర్‌అలీ, జెట్టి కుసుమకుమార్, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు సునీతారావు, బల్మూరి వెంకట్రావు, నూతి శ్రీకాంత్‌గౌడ్, మెట్టు సాయికుమార్‌లతో పాటు జిల్లా పార్టీ అధ్యక్షులు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఇందిరాగాంధీ విగ్రహం నుంచి ర్యాలీగా బయలుదేరిన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి చేరుకుని అక్కడ మూడు గంటలకు పైగా బైఠాయించారు. కాంగ్రెస్ అంటే భయంతోనే నోటీసులు: రేవంత్‌రెడ్డి గాంధీ కుటుంబానికి ఆస్తులు, పదవులు అక్కర్లేదని, ఆ కుటుంబం త్యాగాల కుటుంబమని అనేకమార్లు రుజువైందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చెప్పారు. ఈడీ కార్యాలయం ముందు జరిగిన ఆందోళనలో ఆయన ప్రసంగిస్తూ రాహుల్, సోని యాలకు కావాలంటే రూ.50లక్షలు కాదని, రూ.5 వేల కోట్లయినా 24 గంటల్లో కాంగ్రెస్ కార్యకర్తలే సమకూరుస్తారని చెప్పారు. ‘ఇప్పటికే పలు చోట్ల జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతోంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందనే భయంతోనే అక్రమంగా ఈడీ నోటీసులిచ్చింది. ఏదైనా కేసులో పోలీ స్ స్టేషన్‌కు పిలిపించాలన్నా ఎఫ్ఐఆర్ నమోదై ఉం డాలని, నేషనల్ హెరాల్డ్ కేసులో కనీసం ఎఫ్ఐఆర్ కూడా లేకుండానే ఈడీ ఏకంగా విచారణకు పిలిపించడమంటే గాంధీ కుటుంబ ప్రతిష్టను దిగజార్చే యత్నమే’అని పేర్కొన్నారు. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియాను ఈడీ విచారణకు పిలిస్తే ఊరుకోని, సోనియా ఈడీ కార్యాలయంలో అడుగుపెడితే మోదీ పునాదులు కదులుతాయని హెచ్చరించారు. కాంగ్రెస్ భయపడదు: భట్టి సోనియా, రాహుల్ ఈడీ నోటీసులకు భయపడే వ్యక్తులు కాదని సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. 1980లో ఇందిరాగాంధీని కూడా అక్రమంగా జైలుకు పంపిస్తే ఏం జరిగిందో అందరికీ తెలుసునని, దేశ ప్రజలు అప్పటి జనతాపార్టీకి బుద్ధి చెప్పి ఇందిరాగాంధీని ప్రధానిని చేశారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. ఈ దేశం నుంచి బీజేపీని తరిమికొట్టేంతవరకు పోరాడతామని, రాహుల్, సోనియాలను కాంగ్రెస్ కార్యకర్తలే కాపాడుకుంటామని చెప్పారు. జగ్గారెడ్డి హల్చల్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆందోళనలో ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి హల్చల్ చేశారు. అందరికంటే ముందుగా నెక్లెస్‌రోడ్డుకు చేరుకున్న ఆయన చాలాసేపు ఇందిరాగాంధీ విగ్రహం ముందే బైఠాయించి నేతలతో కలిసి నినాదాలు చేశారు. అనంతరం ఇందిరాగాంధీ విగ్రహం ఫ్లాట్‌ఫారం వరకు ఎలాంటి నిచ్చెనా లేకుండా ఎక్కి తన నిరసన తెలిపారు. బీజేపీ అక్రమాలను ప్రశ్నిస్తూ ప్లకార్డులను ప్రదర్శించిన ఆయన ఆ తర్వాత కాంగ్రెస్ జెండాను పట్టుకుని కొంతసేపు హల్చల్ చేశారు. -
కాంగ్రెస్ ఉనికి లేదనడం అనాలోచితం: జగ్గారెడ్డి
సాక్షి,హైదరాబాద్: జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ఉనికి లేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించడం అనాలోచితమని, ఇదే విషయాన్ని రాజకీయ నేతలైన శరద్‌పవార్, దేవెగౌడ, మమతాబెనర్జీ, స్టాలిన్, ఉద్ధవ్ ఠాక్రేల పక్కన ఆయన కూర్చొని మాట్లాడ గలరా అని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశ్నించారు. ఎనిమిది మంది ఎంపీలున్న టీఆర్ఎస్ పార్టీ నేతలు 57 మంది ఎంపీలున్న కాంగ్రెస్ పార్టీకి ఉనికేలేదని మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. గాంధీభవన్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ లేదా ప్రపంచ పార్టీ అయినా పెట్టుకోవచ్చని, అది ఆయన ఇష్టమని వ్యాఖ్యానించారు. కేసీఆర్ చేస్తున్న ప్రకటనలు, అస్పష్ట రాజకీయాలతో ఆయన ప్రజల్లో చులకనవడమే కాకుండా రాష్ట్రంలో బీజేపీకి ప్రాణం పోస్తున్నట్లుందని అభిప్రాయపడ్డారు. బీజేపీకి కేసీఆర్ వ్యతిరేకమా కాదా అన్నది త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో తేలిపోతుందన్నారు. మతతత్వ పార్టీ బీజేపీతో లౌకిక భావజాలం ఉన్న కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. -
గవర్నర్ పిలిస్తే సీఎస్, డీజీపీలే వెళ్లరు.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నిర్వహిస్తున్న మహిళాదర్బార్ బీజేపీ డైరెక్షన్లో ఉందని ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి ఆరో పించారు. రాజకీయంలో భాగంగా ఈ దర్బార్ ఏర్పాటు చేస్తున్నారే తప్ప దీంతో ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ సమ్మక్క, సారలమ్మ జాతరలో గవర్నర్‌కు సంబంధించిన ప్రొటోకాల్ పాటించకుండా అవమానపర్చిన అధికారులపై చర్యలు తీసుకోలేకపోయిన తమిళిసై ఇప్పుడు మహిళలకు, రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేయగలరని ప్రశ్నించారు. గవర్నర్ కు ఎలాంటి ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదని, గవర్నర్ పిలిస్తే సీఎస్, డీజీపీలు వెళ్లరని, అలాంటప్పుడు తమిళిసైకి ఫిర్యాదు చేస్తే ఏం ప్రయోజనమని అన్నారు. కాగా, టీఆర్ఎస్–బీజేపీల రాజకీయ సంబం ధం ఏమిటో రాష్ట్రపతి ఎన్నికతో తేలిపోతుందని, తటస్థంగా ఉంటామని ప్రకటిస్తే బీజేపీకి అనుకూలంగా ఉన్నట్లేనని అన్నారు. -
గవర్నర్ తమిళిసైపై జగ్గారెడ్డి సంచలన కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరారాజన్, టీఆర్ఎస్పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విరుచుకుపడ్డారు. జగ్గారెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీ డైరెక్షన్లో గవర్నర్ తమిళిసై మహిళా దర్బార్పెట్టారు. ఈ దర్బార్ పెట్టడం వల్ల గవర్నర్‌కు వచ్చే లాభమేమీ లేదు. మహిళా దర్బార్ పెట్టడం రాజకీయమే. మహిళా దర్బార్తో మహిళలకు ఒరిగేదేమీ లేదు. గవర్నర్ తమిళిసై జిల్లాల్లో పర్యటిస్తే ప్రొటోకాల్ లేదు. ప్రొటోకాల్ ఉల్లగించిన వారిపై చర్యలే తీసుకోలేదు. గవర్నర్ పరిపాలన వస్తే.. బీజేపీ పాలనే సాగుతుంది. బీజేపీ పాలన కావాలి అనుకునేవారు గవర్నర్ పాలన కోరుకుంటారు. ప్రభుత్వం సమస్యలు వినట్లే కాబట్టే ప్రజలు గవర్నర్‌ను కలిసి దరఖాస్తులు ఇస్తున్నారు. తాను ఏమీ చేయలేనని గవర్నర్‌కు కూడా తెలుసు. బీజేపీ నేతలు రాసిచ్చిన స్క్రిప్ట్.. గవర్నర్ అమలు చేస్తున్నారు. గవర్నర్ పిలిస్తే.. చీఫ్ సెక్రటరీ, డీజేపీ రాలేదు. తనకు జరిగిన అవమానంపై ఇంత వరకీ చర్యలు తీసుకోలేదు. ఇంకా ప్రజల సమస్యలను ఎలా పరిష్కరిస్తారు అని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే తన మాటలు కేవలం తన వ్యక్తిగతమేనని క్లారిటీ ఇచ్చారు. టీఆర్ఎస్ వ్యతిరేక ఓటు బ్యాంక్ కాంగ్రెస్ రాకుండా గులాబీ పార్టీ ప్రయత్నిస్తోంది. మత విద్వేషాలతో ఓట్లు రాబట్టుకోవాలని బీజేపీ చూస్తోంది. వ్యూహాత్మకంగానే గవర్నర్‌తో టీఆర్ఎస్ పార్టీ గ్యాప్‌ను మెయింటెయిన్ చేస్తోంది. రానున్న రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ వ్యూహం తెలిసిపోతుంది. కాంగ్రెస్ నిలబెట్టే సెక్యులర్ రాష్ట్రపతి అభ్యర్థికి టీఆర్ఎస్ ఓటు వేస్తేనే గులాబీ పార్టీ సెక్యులర్ పార్టీ అని నిరూపితం అవుతుంది అని వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: ఒకరికి పబ్‌లు తప్పా ఏం తెల్వదు.. ఇంకొకరు విచిత్రమైన మనిషి: కేటీఆర్ -
ఆలయాల అభివృద్ధికి ఎన్ని నిధులు తెచ్చారు
సాక్షి, హైదరాబాద్: ‘మసీదులు తవ్వితే శివలింగాలు వచ్చే విషయం పక్కన పెట్టండి. భూమిలోపల తవ్వకాలు అటుంచి భూమిపై ఉన్న శివాలయాల అభివృద్ధికి రాష్ట్ర బీజేపీ నేతలు ఏం చేశారో చెప్పాలి. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు తీసుకువచ్చి రాష్ట్రంలో ఎన్ని పురాతన దేవాలయాల జీర్ణోద్ధరణ చేశారో చెప్పండి’ అని సంగారెడ్డి ఎమ్మెల్యే టి. జగ్గారెడ్డి ప్రశ్నించారు. సోమ వారం ఆయన గాంధీభవన్‌లో ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ తో కలసి విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని దేవాలయాల వివరాలన్నింటినీ సేకరించి బీజేపీ ఆఫీసు ముందు కూర్చుంటానని, నిజంగా బీజేపీ నేతలు భగవంతుని భక్తులే అయితే ఆ దేవాలయాల అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులిప్పించాలని కోరారు. మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలను మానుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు హితవు పలికారు. సంజయ్ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతుంటేపై ఆయనపై సీఎం కేసీఆర్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. -
మోదీని నిలదీసే అవకాశం కోల్పోయారు: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: ప్రధాని మోదీ రాష్ట్రానికి వచ్చిన సమయంలో సీఎం కేసీఆర్ ఉండి ఉంటే తమిళనాడు సీఎం స్టాలిన్ లాగా తన రాష్ట్ర అవసరాలను, ప్రజల సమస్యలను ప్రధానికి చెప్పి ఉండేవారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. అలాంటి మంచి అవకాశాన్ని కేసీఆర్ కోల్పోయారన్నారు. స్టాలిన్ దమ్మున్నోడని, సీఎం అంటే అలా ఉండాలని పేర్కొన్నారు. దేశంలో కాంగ్రెస్, బీజేపీలను కాదని కేసీఆర్ ఏమీ చేయలేడని, దేశ రాజకీయాల్లో కేసీఆర్ ఫెయిలయ్యారని అన్నారు. జగ్గారెడ్డి శుక్రవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌ను మోదీ, మోదీని కేసీఆర్ తిట్టుకుంటే రాష్ట్రంలోని ప్రజల కడుపు నిండుతుందా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలకు ఏమీ చేయలేకనే ఈ రెండు పార్టీలు లోపాయికారీ ఒప్పందాలతో తిట్ల జపం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రధాని హోదాలో తెలంగాణకు వచ్చిన మోదీ రాష్ట్రానికి ఎలాంటి హామీ ఇవ్వకుండా కేవలం రాజకీయ విమర్శలు చేసి వెళ్లిపోవడం సరైంది కాదన్నారు. ఇదంతా చూస్తుంటే రెండు పార్టీలు అండర్స్టాండింగ్ రాజకీయాలతో ముందుకెళ్తున్నట్లు, ఆ రెండు పార్టీల మధ్య చీకటి సంబంధాలున్నట్లు అర్థమవుతోందని చెప్పారు. ప్రతి పేదవాడి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షల జమ, రెండు కోట్ల ఉద్యోగాలు లాంటి అంశాలపై ప్రధానిని అడగలేని రాష్ట్ర బీజేపీ నేతలు మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని జగ్గారెడ్డి విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ముస్లింలను వేరుచేస్తూ హిందువులను రెచ్చగొట్టే యత్నం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. మీకో దండం... నన్ను అడగొద్దు : రెడ్డి, వెలమ సామాజిక వర్గాలనుద్దేశించి ï రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అభిప్రాయం చెప్పాలని విలేకరులు జగ్గారెడ్డిని కోరగా.. ఆయన రెండు చేతులెత్తి దండం పెట్టారు. తాను అన్ని వర్గాలకు చెందిన నాయకుడినని, తనను ఇలాంటి విషయాల్లోకి లాగవద్దని అన్నారు. -
సీఎం అయ్యాక ‘ఆరోగ్య’ హామీలు మర్చిపోయారు
సాక్షి, హైదరాబాద్: ఇంకో సంవత్సరం అయితే రాష్ట్రంలో ఎన్నికలు వస్తాయని, ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరోగ్య రక్షణ హామీలు ఏమయ్యాయని సీఎం కేసీఆర్‌ను కాంగ్రెస్ ప్రశ్నించింది. జిల్లాకో మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తా మని, ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ పెడతా మని ఇచ్చిన హామీలను మర్చిపోయారా? అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు జె.గీతారెడ్డి, టి.జగ్గారెడ్డి ప్రశ్నించారు. బుధవారం గాంధీభవన్‌లో వారు విలేకరులతో మాట్లాడారు. ఆర్థిక, ఆరోగ్య శాఖలు రెండూ మంత్రి హరీశ్‌రావు దగ్గరే ఉన్నాయని, ప్రతి మండలానికి 100 పడకల ఆసుపత్రులు ఏమయ్యాయని గీతారెడ్డి ప్రశ్నించా రు. ఢిల్లీలో బస్తీ దవాఖానాలు బాగున్నా యని కేసీఆర్ అంటున్నారంటే తెలంగాణ లో బాగా లేవనేనా అని ఎద్దేవా చేశారు. అయినా, పన్ను నొప్పికి ఢిల్లీ, ఛాతీ నొప్పికి యశోదకు వెళ్లే కేసీఆర్‌కు బస్తీ దవాఖానాల గురించి ఏం తెలుస్తుందన్నారు. ప్రజల ఆరోగ్యం గాలికొదిలి దేశ రాజకీయాలా? తెలంగాణ ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలిన సీఎం కేసీఆర్, దేశ రాజకీయాల్లో బిజీ అయ్యారని జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలు.. హామీలుగానే మిగిలిపోయాయని, సీఎం అయ్యాక ఆయన ఆరోగ్య మేనిఫెస్టోను మర్చిపోయారని వ్యాఖ్యానించారు. సమైక్య రాష్ట్రంలో ఉన్న ఆసుపత్రుల్లోనే తెలంగాణ ప్రజలు ఆరోగ్య సేవలు పొందుతున్నారని చెప్పారు. కేసీఆర్ సీఎం అయ్యాక కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కనుమరుగైందని పేర్కొన్నారు. అందుకే సీఎం కేసీఆర్‌కు ప్రజలకిచ్చిన ఆరోగ్య హామీలను మరోమారు గుర్తు చేస్తున్నామని అన్నారు. -
బతుకుకు ధీమా లేదు.. చస్తే బీమా ఇస్తారా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం లో అమలవుతున్న పథకాలు ఒంటె పెదవులకు నక్కలు ఆశపడ్డట్టుగా ఉన్నాయని సంగారెడ్డి ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. ఈ రాష్ట్రంలోని రైతాంగం బతకడానికి ధీమా లేదు కానీ చనిపోతే మాత్రం బీమా ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీభవన్‌లో మంగళవారం విలేకరులతో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పాజి అనంత కిషన్‌తో కలిసి ఆయన మాట్లాడారు. రైతును బతికించేందుకు ప్రభుత్వాలు పనిచేయాలి కానీ చనిపోతే బీమా డబ్బులు ఇప్పించడమే గొప్పనుకుంటే ఎలా అని ప్రశ్నించారు. నకిలీ విత్తనాలు, ప్రకృతి వైపరీత్యాలతో రైతులు పెట్టుబడులు నష్టపోతే రైతాంగా నికి పంటల బీమా అమలు చేయాలని, రాష్ట్రంలో ఆ పథకమే అమల్లో లేదని విమర్శించారు. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయినా ఇంతవరకు రూ.లక్ష రుణమాఫీ చేయలేదని, ‘రైతుబంధు’డబ్బులను బ్యాంకర్లు ఆ రుణాల కింద జమ చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత రాష్ట్ర రైతాంగంపై కేసీఆర్ సవతి తల్లి ప్రేమ చూపుతున్నారని, రాజకీయాల కోసం పక్క రాష్ట్రాలకు వెళుతున్నారని విమర్శించారు. ఎనిమిదేండ్లలో రాష్ట్రంలో ఏ ఒక్క రైతు వద్దకు వెళ్లని కేసీఆర్.. పంజాబ్, హరియాణా రైతాంగాన్ని ఆదుకునేందుకు వెళ్లడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్నిస్తున్న టీఆర్ఎస్ నేతలకు మతి ఉందో లేదో అర్థం కావడం లేదని, దివంగత వైఎస్సార్ అధికారంలోకి రాగానే సంతకం చేసిన రైతులకు ఉచిత విద్యుత్ పథకాన్నే టీఆర్ఎస్ కొనసాగిస్తోందని గుర్తుంచుకోవాలన్నారు. -
‘అసద్‌పై హైదరాబాద్‌లో పోటీ చేస్తా.. అల్లా దయ ఉంటే ఓడించి తీరుతా’
సాక్షి, హైదరాబాద్: ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌పై హైదరాబాద్ లోక్‌సభ స్థానంలో పోటీ చేస్తానని సంగారెడ్డి ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి వెల్లడించారు. రాహుల్‌గాంధీని హైదరాబాద్‌లో పోటీ చేయాలని అసదుద్దీన్ సవాల్ చేయడం బేకార్ అని, ఆయనపై పోటీకి తానే వస్తానని వ్యాఖ్యానించారు. పోటీ చేయడమే కాదని, అల్లా దయ ఉంటే ఓడించి తీరుతానని ధీమా వ్యక్తం చేశారు. శనివారం గాంధీభవన్‌లో మీడియాతో జగ్గారెడ్డి మాట్లాడుతూ రాహుల్ ఏమన్నారని అసదుద్దీన్ సవాల్ చేశారని ప్రశ్నించారు. ‘తెలంగాణ ఇచ్చిన నాయకుడిగా ఇక్కడి ప్రజలు, రైతులు, విద్యార్థులు ఎలా ఉన్నారో తెలుసుకునేందుకు రాహుల్ వచ్చారు. దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన కుటుంబం గాంధీలది. కనీసం మైనార్టీల కోసం కూడా పోరాటం చేయలేని కుటుంబం ఒవైసీలది. కేసీఆర్ ఇస్తానన్న 12 శాతం రిజర్వేషన్ల గురించి ఏరోజైనా అసద్ అడిగారా?’ అని అన్నారు. పాతబస్తీ ముస్లింలు ఎంఐఎం గుండాయిజం చూసి భయపడి బయటకు రావడం లేదు. అసదుద్దీన్‌కు దమ్ముంటే హైదరాబాద్ వదిలి బయటకు రాగలరా’ అని ప్రశ్నించారు. ‘ప్రధాని మోదీ వచ్చే సమయంలో రాష్ట్రంలో లేకుండా సీఎం కేసీఆర్ ఏ ధైర్యంతో వెళ్లారో చెప్పాలి. తెలంగాణ అమరవీరుల కుటుంబాల్లో ఒకరికి రాజ్యసభ సభ్యులుగా ఎందుకు అవకాశం ఇవ్వలేదో కేసీఆర్ సమాధానం చెప్పాలి’ అని జగ్గారెడ్డి నిలదీశారు. చదవండి: కాంగ్రెస్ ‘రైతు రచ్చబండ’ షురూ -
Rahul Gandhi: అసదుద్దీన్ ఒవైసీకి కాంగ్రెస్ నేత సవాల్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్‌కు కోపం తెప్పించాయి. రాహుల్‌కు దమ్ముంటే.. హైదరాబాద్ ఎంపీ సీటుకు పోటీ చేయాలంటూ సవాల్ విసిరారు అసదుద్దీన్. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి స్పందించారు. అసదుద్దీన్ ఓవైసీపై మండిపడ్డారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ‘‘అసదుద్దీన్.. నువ్వు ఎప్పుడైనా ప్రజా పోరాటాలు చేశావా? రైతుల కోసం గానీ, 12 శాతం రిజర్వేషన్ కోసం గానీ కేసీఆర్‌తో ఎప్పుడైనా కొట్లాడావా? హైదరాబాద్‌లో నీ మీద పోటీకి రాహుల్ అవసరం లేదు.. నేను వస్తా. కాంగ్రెస్ పార్టీ గనుక అవకాశం ఇస్తే.. నేను హైదరాబాద్ నుంచి పోటీ చేసి నిన్ను ఓడిస్తా. మరి మెదక్ నుంచి పోటీ చేసే దమ్ము నీకు ఉందా?’’ అని అసదుద్దీన్‌ను ప్రశ్నించారు జగ్గారెడ్డి. చదవండి: కేసీఆర్‌పై జగ్గారెడ్డి ప్రశంసలు.. తప్పుగా అనుకోవద్దని వ్యాఖ్యలు -
నెల రోజులపాటు ’పల్లె పల్లెకు కాంగ్రెస్’
సాక్షి, హైదరాబాద్: వరంగల్ డిక్లరేషన్‌పై గంపెడాశలతో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ప్రజల్లోకి వెళుతున్నారు. శనివారం నుంచి నెల రోజులపాటు ‘పల్లె పల్లెకు కాంగ్రెస్’పేరుతో ఈ డిక్లరేషన్ గురించి ప్రజలకు వివరించేందుకు అన్ని నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు రూట్‌మ్యాప్‌లు సిద్ధం చేసుకున్న కాంగ్రెస్ నాయకులు, ఆయా గ్రామాల్లో రైతు రచ్చబండలు ఏర్పాటు చేసి రాష్ట్రంలో రైతులకు జరుగుతున్న అన్యాయం, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవసాయరంగ వ్యతిరేక విధానాలను వెల్లడించనున్నారు. అలాగే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే తాము రైతాంగానికి ఏం చేయబోతున్నామన్న అంశాలను కూడా వివరించనున్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ స్వగ్రామమైన హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గం ఆత్మకూరు మండలంలోని అక్కంపేటలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. రాజీవ్‌గాంధీ వర్ధంతి సందర్భంగా ఉదయం గాంధీభవన్‌లో ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించి రేవంత్ అక్కంపేటకు బయలుదేరుతారని, మధ్యాహ్నం ఒంటిగంటకు అక్కంపేట చేరుకుని అక్కడి రైతులతో ముచ్చటిస్తారని గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. అలాగే ఇతర నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు నేతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జయశంకర్‌తో పాటు తెలంగాణకు చెందిన పలువురు ప్రముఖుల గ్రామాల్లో రైతు రచ్చబండలు ఏర్పాటు చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించవచ్చని టీపీసీసీ నాయకత్వం భావిస్తోంది. మైకులు పెట్టొద్దు... సన్మానాలు చేయొద్దు: ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఈనెల 27 నుంచి సంగారెడ్డి నియోజకవర్గంలో రైతు డిక్లరేషన్ సభల ఏర్పాట్లు చేసుకుంటున్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి శుక్రవారం విడుదల చేసిన ప్రకటన ఆసక్తిని రేకెత్తిస్తోంది. తాను గ్రామాలకు వచ్చే సమయంలో టెంట్లు, మైకులు, భోజనాల ఏర్పాట్లు చేయవద్దని, ఊరేగింపులు, శాలువాలు, సన్మానాలు వద్దని నియోజకవర్గ నేతలను కోరుతూ ఆయన ప్రకటన విడుదల చేశారు. రోజుకు 4 గ్రామాలు పర్యటిస్తానని, ప్రతి గ్రామంలో 2 గంటలు ఉండి రైతులు, ప్రజలతో మాట్లాడి రాహుల్ గాంధీ సూచనల మేరకు వరంగల్ రైతు డిక్లరేషన్‌ను ప్రజలకు వివరిస్తానని తెలిపారు. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా నేరుగా గ్రామాలకు వెళ్లి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఆయా గ్రామాల ప్రజలు, రైతులతో చెట్టు కింద కూర్చుని మాట్లాడే ప్రయత్నం చేద్దామని ఆ ప్రకటనలో జగ్గారెడ్డి వెల్లడించడం గమనార్హం. -
Sakshi Cartoon: అవున్సార్! ..తిడితేనే తప్పు!
అవున్సార్! ..తిడితేనే తప్పు! -
కేసీఆర్‌పై జగ్గారెడ్డి ప్రశంసలు.. తప్పుగా అనుకోవద్దని వ్యాఖ్యలు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తన నియోజ కవర్గానికి మెడికల్ కాలేజీని మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌ను పొగడక తప్పదని, దాన్ని తప్పుగా అనుకోవద్దని పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న మెడికల్ కాలేజీ భవన నిర్మాణ పనులను బుధవారం జగ్గారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘సంగారెడ్డికి నేను ఎమ్మెల్యేను. కాంగ్రెస్ ఎమ్మెల్యేను. అలా అని నేను ఎందుకు చెబుతున్నానంటే.. ఎమ్మెల్యేకు కొంత బాధ్యత ఉంటుంది. పార్టీ అంటే పోరాటం. ఎమ్మెల్యే అంటే ఆరాటం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఓ రకంగా ఉంటుంది. ప్రభుత్వం లేకుంటే రిక్వెస్ట్ చేసి పనులు చేసుకోవాల్సి వస్తుంది. ఎమ్మెల్యే బాధ్యతాయుత పదవి కావడంతో స్థానిక ప్రజల డిమాండ్‌ను నెరవేర్చాల్సిన బాధ్యత నాపై ఉంది. ఇందుకోసం సంగారెడ్డి మెడికల్ కాలేజీ ఆవశ్యకతను అసెంబ్లీలో పలుమార్లు ప్రస్తావించా. కాలేజీ పనులను వెంటనే పూర్తి చేసి సీఎం చేతుల మీద ప్రారంభించాలని మంత్రి హరీశ్‌ను కోరాను’అని చెప్పారు. చదవండి👇 పంజగుట్ట: మేనేజర్ ఏటీఎం కార్డు నుంచి డబ్బులు డ్రా చేసుకొని.. ప్రగతిభవన్‌కు తిమ్మక్క.. సమీక్ష సమావేశానికి తీసుకెళ్లి సత్కరించిన సీఎం కేసీఆర్ సమయం లేదు గణేశా!.. జీహెచ్ఎంసీ యాక్షన్ ప్లాన్ ఏమిటో? -
పెండ్లి దావత్‌కు రాహుల్ వెళ్తే తప్పా?
సాక్షి, హైదరాబాద్: ‘రాహుల్‌గాంధీ ఏదో చేసినట్టు వీడియోను వైరల్ చేస్తున్నారు. అసలు ఆ వీడియోలో ఏముంది? రాహుల్ పెండ్లి దావత్‌కు వెళ్తే కూడా తప్పు అన్నట్టు మాట్లాడుతున్నారు’అని సంగారెడ్డి ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మండిపడ్డారు. టీఆర్ఎస్ నేతలు రాత్రిపూట ఎక్కడకు వెళ్తారో కెమెరాలు పెడితే తెలుస్తుందన్నారు. టీఆర్ఎస్ నేతల్లా తమకు పార్క్ హయత్‌లో సూట్లు లేవని, వాటిల్లో ఆడే తందనాలు అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. రైతులకు ఏం చేశారో ప్రభుత్వాన్ని నిలదీసేందుకే రాష్ట్రానికి రాహుల్ వస్తున్నారని చెప్పారు. రైతులను ముంచడంలో కేసీఆర్, మోదీలు అన్నదమ్ములని, వారి పాలనను ఎండగట్టేందుకే పర్యటిస్తున్నారని తెలిపారు. రైతులకు 5 రూపాయలు.. ప్రచారానికి 95 రూపాయలు రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాకే అన్నీ చేసినట్టు.. విద్యుత్ బల్బులు, కేబుల్, స్తంభాలు కూడా వాళ్లే వేసినట్టు ప్రచారం చేసుకుంటున్నారని జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ది గ్రాఫిక్స్ పాలన అని, ఆయన పాలన శివాజీ సినిమాలో రజనీకాంత్ స్టైల్లా ఉందని అన్నారు. ‘కాంగ్రెస్ ఉచిత విద్యుత్ ఇచ్చి రూపాయి ప్రచారం చేసుకుంది. కేసీఆర్ మాత్రం ఆ విద్యుత్‌కు అయ్యేంత ఖర్చును ప్రచారానికి వాడుతున్నారు. మేం రూ. లక్ష రుణమాఫీ చేశాం. కేసీఆర్ చేయకపోయినా చేసినట్టు ప్రచారం చేసుకుంటున్నారు. చేసేది పది రూపాయల పని, రైతులకు ఇచ్చేది 5 రూపాయలు. ప్రచారానికి మాత్రం 95 రూపాయలు’అని విమర్శించారు. -
ఓయూకొచ్చి నైట్ క్లబ్ గురించి చెప్తారా?
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నైట్ క్లబ్లో ఉన్న పర్సనల్ వీడియో ఒకటి రాజకీయ దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. నేపాల్ ఖాట్మాండులో ఓ వివాహ వేడుకకు హాజరైన రాహుల్.. పబ్‌లో ఉన్న వీడియో బయటకు వచ్చింది. ఈ తరుణంలో.. తెలంగాణలో ఆయన టూర్ దగ్గరపడుతున్న వేళ.. ఈ వీడియోను విమర్శనాస్త్రంగా చేసుకుంది టీఆర్ఎస్. ‘‘ఓయూ వెళ్లి నైట్ క్లబ్లో పార్టీ గురించి చెప్తారా? అంతకు మించి ఏం మాట్లాడతారు? రాహుల్ ఓయూకి వస్తే విద్యార్థులు చెడిపోతారు’’ అంటూ తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ సెటైర్లు వేశారు. అటు గతంలో కాంగ్రెస్ పాలన.. ఇటు బీజేపీ పాలన దేశాన్ని నాశనం చేశాయంటూ విమర్శించారు. ఇక రాహుల్ పర్యటనకు అనుమతుల విషయంలో ఓయూ వీసీదే తుది నిర్ణయమని మంత్రి ఎర్రబెల్లి మంగళవారం మీడియా సమక్షంలో స్పష్టం చేశారు. తప్పేముంది?: జగ్గారెడ్డి ఇదిలా ఉండగా.. రాహుల్ గాంధీ నైట్ క్లబ్ వీడియోపై వస్తున్న విమర్శలపై తెలంగాణ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. రాహుల్ గాంధీ నైట్ క్లబ్ వెళ్తే తప్పేంటని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశ్నిస్తున్నారు. రాహుల్ గాంధీ ఫంక్షన్ పోతే తప్పేంటి?. పెళ్లికి వెళ్తే రాజకీయం చేయడం చీప్ ట్రిక్స్. కావాలని బురద చల్లుతున్నారు. బీజేపీ, టీఆర్ఎస్ వాళ్లకు కామన్ సెన్స్ లేదా? మీ నాయకుల వెనకాల కెమెరాలు పెట్టి చూడాలా? ఏం చేస్తున్నారో. టీఆర్ఎస్ నేతలకు హయత్ హోటల్స్‌లో సెపరేట్ రూల్స్ ఉన్నాయి. బీజేపీ నాయకులకు కూడా సూట్ రూమ్స్ ఉన్నాయి. వీటన్నింటిని ఏమనాలి? మరి అంటూ జగ్గారెడ్డి మండిపడ్డారు. చదవండి: రాహుల్ నైట్ క్లబ్ వీడియో కాంగ్రెస్ స్పందన ఇది! -
ఓయూ రగడ.. ఆగని అరెస్టులు
సాక్షి, హైదరాబాద్, ఉస్మానియా యూనివర్శిటీ/ చంచల్‌గూడ: ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ రాష్ట్ర పర్యటన వివాదం రోజురోజుకు పెద్దదవుతోంది. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఆయన సభ విషయమై విద్యార్థులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. సోమవారం సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. మరోవైపు ఆదివారం పోలీసులు అరెస్టు చేసిన ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌తో పాటు మరో 17 మంది నేతల విషయంలో ఏం చేయాలనే అంశంపై కాంగ్రెస్ రాష్ట్ర నేతలు సోమవారం సమావేశమై చర్చలు జరిపారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ సహా పలువురు నేతలు చంచల్‌గూడ జైల్లో ఉన్న వెంకట్ తదితరులను పరామర్శించారు. ఓయూలో విద్యార్థుల అరెస్టు బల్మూరి వెంకట్ తదితరుల అరెస్టుపై రాష్ట్ర వ్యాప్తం గా నిరసన తెలియజేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పిలుపు ఇచ్చారు. ఈ నేపథ్యంలో సోమ వారం ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఎదుట సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను విద్యార్థులు దహనం చేశారు. వీసీ రవీందర్, సీఎం కేసీఆర్‌లకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వారిని బలవంతంగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగ ఫ్రంట్ చైర్మన్, ఓయూ పరిశోధక విద్యార్థి చనగాని దయాకర్‌గౌడ్, నవ తెలంగాణ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడు బైరు నాగరాజు ఈ సందర్భంగా మాట్లాడారు. ఓయూ పాలక మండలి చేసిన నిబంధనలు కేవలం కాంగ్రెస్ పార్టీకేనా? టీఆర్ఎస్, బీజేపీలకు వర్తించవా? అని ప్రశ్నించారు. ఓయూలో 7న రాహుల్ కార్యక్రమాన్ని నిర్వహించి తీరుతామని నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మానవతరాయ్, అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ తదితరులు స్పష్టం చేశారు. కాగా ఓయూలో రాహుల్‌గాంధీ పర్యటనకు ఎలాంటి అనుమతి లేదని వీసీ సోమవారం మరోమారు తేల్చి చెప్పారు. క్యాంపస్‌లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండ పోలీసులు భారీగా మోహరించారు. రాహుల్ ఓయూ వెళతారు: రేవంత్‌రెడ్డి సోమవారం ఉదయం సీఎల్పీలో సమావేశమైన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి ఎస్.సంపత్‌కుమార్‌లు బల్మూరి వెంకట్ తదితరుల అరెస్టుపై చర్చించారు. తర్వాత పార్టీ నేతలు అంజన్‌కుమార్ యాదవ్, గీతారెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎం.ఆర్.జీ.వినోద్‌రెడ్డి, అనిల్‌కుమార్‌యాదవ్, ఫిరోజ్ఖాన్లతో కలిసి చంచల్‌గూడ జైలుకు వెళ్లి వెంకట్ తదితరులతో ములాఖత్ అయ్యారు. ఈనెల 7వ తేదీని ములాఖత్ కోసం రాహుల్ గాంధీ వస్తారని, సమయం ఇవ్వాలని కోరుతూ జైలు సూపరింటెండెంట్ శివకుమార్‌గౌడ్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం రేవంత్ మాట్లాడుతూ రాహుల్‌గాంధీ ఓయూకు ఖచ్చితంగా వెళ్తారని చెప్పారు. అలాగే విద్యార్థి నేతలతో ములాఖత్ కోసం జైలుకు కూడా వస్తారని తెలిపారు. రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ఉస్మానియా యూనివర్సీటీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ వర్సిటీని సందర్శించి అక్కడి విద్యార్థులతో మమేకం కావాలని నిర్ణయిం చుకున్నారని తెలిపారు. ఉద్యోగ నియామకాలకు సంబంధించిన సమాచారం సేకరించి రానున్న పార్లమెంట్ సమావేశాల్లో చర్చించాలని భావిం చినట్లు తెలిపారు. అయితే సీఎం కేసీఆర్ ఒత్తిడితోనే ఓయూలో రాహుల్ పర్యటనకు వీసీ అనుమతి నిరాకరిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా రాహుల్‌ను ఓయూకి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లేందుకు భయపడుతున్న కేసీఆర్ కుట్రపూరి తంగానే రాహుల్ గాంధీ పర్యటనను అడ్డుకుం టున్నారని విమర్శించారు. -
కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ అరెస్ట్‌కు సంఘీభావం తెలిపేందుకు వెళ్లగా.. అక్కడ ఎమ్మెల్యేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఓయూలో రాహుల్ పర్యటనకు అనుమతి ఇవ్వాలంటూ కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తోంది. గేట్లు ఎక్కి ఓయూ ఆడ్మినిస్ట్రేషన్ భవనాన్ని ధ్వంసం చేశారు. అద్దాలు పగలగొట్టి లోపలికి వెళ్లిన నాయకులు వీసీ వైఖరికి నిరసనగా గాజులు, చీరలు పెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఓయూ ముట్టడికి యత్నించిన ఎన్ఎస్యూఐ నాయకులను అరెస్ట్ చేశారు. దీనిపై జగ్గారెడ్డి మాట్లాడుతూ.. రాహూల్ ఓయూ పర్యటనకు అనుమతి ఇవ్వకపోవడం వల్లే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆందోళన చేశారని తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ కష్టం అంత ఆవిరి అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉస్మానియాలో చదివిన వారు చాలా మంది ఎమ్యెల్యేలు అయ్యారని, ఒక్కరు కూడా కేసీఆర్‌ను యూనివర్సిటీకి ఎందుకు తీసుకుపోలేదని ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లో రాహుల్ గాంధీని ఓయూకి తీసుకెళ్తామని, ఈ అంశంపై సోమవారం 3 గంటలకు ఉస్మానియా యూనివర్సిటీ వరకు వెళ్లి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. ‘వీసి గారు ఇది ముగింపు కాదు. సందర్శన మాత్రమే. ఓ ఎంపీగా చూడటానికి వస్తున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ విశిష్టతను తెలుసుకునేందుకు వస్తే అడ్డుకునేందుకు ఎవరు మీరు? ఉమ్మడి రాష్ట్రంలో లేని జీఓలు ఎలా తీస్తారు. కృతజ్ఞత లేని రాష్ట్రంగా తెలంగాణ ఎందుకు చేస్తున్నారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ ప్రజలు అవమానాలకు గురి కావాలా. రాహుల్‌తో ముగ్గురు ఎంపీలు, ఆరుగురు ప్రజా ప్రతినిధులం ఉస్మానియాలో సందర్శిస్తాం. ఈ నెల 7న ఎట్టిపరిస్థితిలో రాహుల్ గాంధీని ఉస్మానియాకు తీసుకెళ్దాం.’ అని జగ్గారెడ్డి తెలిపారు. చదవండి: రోజుకు 10 నిమిషాలు నవ్వితే.. ఎన్ని కేలరీల కొవ్వు కరుగుతుందో తెలుసా! -
రాహుల్‌ను అనుమతించండి..లేదంటే కేసీఆర్‌ను తీసుకెళ్లండి
సాక్షి, హైదరాబాద్: మే 7వ తేదీన ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లేం దుకు అనుమతి ఇవ్వాలని, లేదంటే సీఎం కేసీ ఆర్‌ను అయినా అక్కడకు తీసుకెళ్లాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే టి.జగ్గా రెడ్డి డిమాండ్ చేశారు. ఉస్మానియాలోకి ఎవరూ రాకూడదంటూ 2021లో సర్క్యులర్ ఇచ్చామని చెపుతున్న వర్సిటీ వర్గాలు.. ఆ సర్క్యులర్‌ను ఇన్నాళ్లూ బయటపెట్టకుండా ఇప్పుడు రాహుల్ పర్యటన అనగానే ఎందుకు విడుదల చేశారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రం ఇచ్చిన రాహుల్ గాంధీని ఓయూ సందర్శనకు అనుమతించకపోవ డం దురదృష్టకరమని, ఇది తాము అవమానంగా భావిస్తున్నామని శనివారం గాంధీభవన్‌లో విలేక రులతో మాట్లాడుతూ ఆయన పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తుపై స్పష్టత వచ్చేది ఉస్మానియాలో తాము రాజకీయం చేయబోమని, పార్టీ కండువాలు, జెండాలు లేకుండా వస్తామని, రాహుల్‌గాంధీ కేవలం విద్యార్థులతో మాట్లాడి వెళ్లిపోతారని చెప్పినా అనుమతి ఇవ్వలేదని జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ ఓయూకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడి ఉం టే వారి భవిష్యత్తుపై మరింత స్పష్టత వచ్చేదని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో సీఎంలు యూని వర్సిటీలకు వెళ్లారని, ఇప్పుడు వెళ్లడంలో ఇబ్బంది ఏంటో అర్థం కావడం లేదని అన్నారు. ఉస్మాని యాతో పాటు ఇతర వర్సిటీల్లో పరిస్థితి సజావుగా ఉంటే కేసీఆర్ ఓయూకి ఎందుకు వెళ్లడం లేదని, అక్కడి నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్లు ఎందుకు తీసుకెళ్లడం లేదని ప్రశ్నించారు. తాను సమైక్యవాదినని బహిరంగంగా అప్పుడే చెప్పానని, కానీ తెలంగాణ ఏర్పాటయ్యాక సమైక్యవాదులను కేసీఆర్ తన పక్కన పెట్టుకున్న విషయం తనను విమర్శించే వారికి కనిపించడం లేదా అని నిలదీశారు. కేసీఆర్‌ను ఉరికించి కొడతానన్న తలసాని, చంద్రబాబు ఫాలోవర్ దయాకర్‌రావు, దానం నాగేందర్, పువ్వాడ అజయ్, తుమ్మల నాగేశ్వరరావు లాంటి వారిని సంకలో పెట్టుకున్నా రని ఎద్దేవా చేశారు. తనను కొడతామని అంటున్నా రని, యూనివర్సిటీకి తాను ఒక్కడినే వస్తానని చేత నైతే వచ్చి కొట్టాలని జగ్గారెడ్డి సవాల్ చేశారు. తాను బూతులు తిట్టడం మొదలుపెడితే టీవీల్లో వేయ లేరని, వినేవాడు చావాల్సి వస్తుందని అన్నారు. -
విద్యార్థుల కోసం కొట్లాడతావా? కేసీఆర్ భజన చేస్తావా..
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ రాజకీయ జీవితం తన గడ్డంలో ఉన్న ఒక వెంట్రుకతో సమానమని సంగారెడ్డి ఎమ్మెల్యే, టీపీ సీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.జగ్గారెడ్డి వ్యాఖ్యానిం చారు. సుమన్‌కు దూకుడు బాగా ఎక్కువైందని, కేసీఆర్ మెప్పు కోసం చేస్తున్న ఓవరాక్షన్ తగ్గించుకోవాలన్నారు. ఆయన గాంధీభవన్‌లో గురువారం మీడియాతో మాట్లాడారు. ‘ఓయూలో ఇద్దరు ముగ్గురు విద్యా ర్థులను చంపి, ఆ మృత దేహాల చేతుల్లో సుమన్ లేఖలు పెట్టినట్టు నాకు సమాచారం ఉంది. సుమన్‌ను విడిచిపెట్టేది లేదు. మా పార్టీ అధికా రంలోకి వచ్చాక ఈ విషయంలో విచారణ జరిపి స్తాం’ అని అన్నారు. కేసీఆర్ మెప్పు కోసం స్థాయి మరిచి మాట్లాడుతున్న సుమన్‌కు దమ్ముంటే ఆర్ట్స్ కాలేజీ ముందుకు గన్మెన్లు లేకుండా రావాలని సవాల్ విసిరారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి గురించి సుమన్‌కు అవసరం లేదని, రేవంత్‌కు కూడా అభిమాన సంఘాలు ఉన్నాయన్న విష యాన్ని ఆయన గుర్తు పెట్టుకోవాలని సూచించారు. విద్యార్థి నాయకుడిగా వచ్చిన సుమన్ విద్యార్థుల కోసం కొట్లాడుతాడో, కేసీఆర్‌కు భజన చేస్తాడో తేల్చుకోవాలని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. అనుమతి కోసం ఐదు రోజులా? ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్‌గాంధీ పర్య టన కోసం అనుమతి అడిగి ఐదు రోజులవుతున్నా ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదని జగ్గారెడ్డి విమర్శిం చారు. రాహుల్ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని టీఆర్ఎస్ నేతలు, కొందరు ఎమ్మెల్యేలు వీసీని బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. రాహుల్ పర్యటనపై చర్చించేందుకు ఈనెల 30న విద్యార్థి సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తు న్నట్టు జగ్గారెడ్డి తెలిపారు. సమావేశంలో ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్, మానవ తా రాయ్, చెనగోని దయాకర్ పాల్గొన్నారు. -
రాహుల్ గురించి మాట్లాడే స్థాయి నీకు లేదు
సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ గురించి మాట్లాడే స్థాయి టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు లేదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి అన్నారు. ‘తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు రాహుల్‌గాంధీ క్షమాపణలు చెప్పాలా?’ అని ప్రశ్నించిన ఆయన ఒకరి గురించి మాట్లాడే ముందు తానేంటో ఆలోచించుకోవాలని సుమన్‌కు హితవు పలికారు. టీఆర్ఎస్ నేతలందరూ సోనియా, రాహుల్‌ల కాళ్లు కడిగి నీళ్లు నెత్తిన పోసుకున్నా రుణం తీర్చుకోలేరన్నారు. గాంధీభవన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ కోసం కేసీఆర్ పోరాటాన్ని ఎవరూ కాదనలేరని, కానీ సోనియా తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వకపోతే వీరి రాజకీయ జీవితం ఎలా ఉండేదో అర్థం చేసుకోవాలన్నారు. ఉస్మానియాలో ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల శవాల మీద ఎంపీ, ఎమ్మెల్యే అయిన సుమన్.. తెలంగాణలో ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించాడో చెప్పాలని సవాల్ విసిరారు. ఉద్యమంలో త్యాగాలు చేసినవాళ్లు కనుమరుగైతే, సుమన్ లాంటి వాళ్లు ఎమ్మెల్యేలు, ఎంపీలయ్యారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం రాకపోతే సుమన్ గ్రామ పంచాయతీ సభ్యుడు కూడా కాలేడన్నారు. ఓయూలో రాహుల్‌గాంధీ పర్యటనకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే టీఆర్ఎస్ పార్టీకి కృతజ్ఞతాభావం లేదని తేలిపోతుందని, రాష్ట్రం ఇచ్చినందుకు కృతజ్ఞత తెలుపుతారో, కృతజ్ఞతా హీనులుగా మిగులుతారో టీఆర్ఎస్ నేతలే తేల్చుకోవాలని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. -
రాహుల్ సభ.. రైతుల కోసమే
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రంలోని రైతాంగానికి భరోసా కల్పించి వారిలో ధైర్యం నింపేందుకే వచ్చే నెల 6న వరంగల్‌కు రాహుల్‌గాంధీ వస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నించి రైతుల్లో ధైర్యం నింపుతారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు వ్యవసాయ ఆధారిత వర్గాలకు ఎలాంటి పథకాలు అమలు చేస్తున్నాయో వరంగల్ రైతు సంఘర్షణ సభలో వెల్లడిస్తారు. భవిష్యత్తులో వ్యవసాయ రంగానికి కాంగ్రెస్ ఏం చేయనుందో కూడా చెబుతారు’ అని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు తెలిపారు. రాహుల్ సభ విజయవంతం కోసం పార్టీ నేతలందరమూ కృషి చేస్తున్నామని, రాజకీయాలకు అతీతంగా రైతులందరూ సభకు వచ్చి రాహుల్ ఏం చెప్తారో వినాలని కోరారు. ఆదివారం అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయంలో విలేకరులతో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీపీసీసీ స్టార్ క్యాంపెయినర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, శ్రీధర్‌బాబు, టీపీసీసీ ప్రచార, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్లు మధుయాష్కీగౌడ్, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు ఎం. కోదండరెడ్డి మాట్లాడారు. రైతులకు రుణమాఫీ ఏది?: భట్టి కాంగ్రెస్‌కు పోటీగా టీఆర్ఎస్ రుణమాఫీ ప్రకటించినా అమలు చేయకపోవడంతో రూ. లక్ష రుణానికి వడ్డీలు పెరిగి రూ.4 లక్షలు అయ్యాయని, ఇప్పుడు ఆ రుణం తీర్చడం రైతులకు కష్టంగా మారిందని భట్టి అన్నారు. కాంగ్రెస్ హయాంలో రైతులకు రూ.లక్ష లోపు వడ్డీలేని రుణం, రూ. 3 లక్షల వరకు పావలా వడ్డీ, సబ్సిడీపై ఎరువులు, విత్తనాలు, ట్రాక్టర్లు వ్యవసాయ యంత్ర పరికరాలు డ్రిప్స్, స్ప్రింకర్లతో పాటు పందిరి సాగు కోసం 100 శాతం సబ్సిడీ ఇచ్చామని గుర్తు చేశారు. కాంగ్రెస్ హయాంలో పేదలకు వ్యవసాయం కోసం అసైన్ చేసిన భూములను టీఆర్ఎస్ సర్కారు లాక్కుని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇచ్చే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. రైతులను కేసీఆర్, మోదీ ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని ఉత్తమ్ ఆరోపించారు. కేసీఆర్ చేతకానితనంతోనే వరి రైతులు నష్టపోయారన్నారు. మూడేళ్ల క్రితమే ఉచితంగా ఎరువులు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా యేటా ఎరువుల ధరలు పెంచుతున్నారని మండిపడ్డారు. రైతులకు కూలి కూడా గిట్టట్లేదు: కోమటిరెడ్డి సీఎం కేసీఆర్ రైతులను మోసం చేశారని, ఆయన ఇచ్చే మద్దతు ధరతో కూలి కూడా గిట్టడం లేదని కోమటిరెడ్డి చెప్పారు. రుణమాఫీ ఊసే ఎత్తకపోవడం దురదృష్టకరమన్నారు. ఓట్ల కోసం రాహుల్ వరంగల్‌కు రావట్లేదని, రైతుల కోసం వస్తున్నారని చెప్పారు. వరంగల్ సభ ఏర్పాట్ల నుంచి అన్ని అంశాలపై స్పష్టంగా ముందుకెళ్తామన్నారు. ప్రశాంత్ కిశోర్, టీఆర్ఎస్ నేతల భేటీ గురించి విలేకరులు ప్రశ్నించగా పీకే గురించి పార్టీ నుంచి తమకు ఎలాంటి వివరణ అందలేదని, ఊహాగానాలపై చర్చ అవసరం లేదని, మీడియా కథనాలపై స్పందించలేమని కాంగ్రెస్ నేతలు చెప్పారు. పార్టీ అధిష్టానం తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటామన్నారు. మీడియాతో మాట్లాడుతున్న ఉత్తమ్. చిత్రంలో కోదండరెడ్డి, జగ్గారెడ్డి, భట్టి, కోమటిరెడ్డి, శ్రీధర్‌బాబు -
రామాయంపేటలో బంద్ ప్రశాంతం
రామాయంపేట (మెదక్)/సాక్షి, కామారెడ్డి: గంగం పద్మ, ఆమె కుమారుడు సంతోష్ ఆత్మహత్యలకు సంబంధించిన కేసులో పోలీసులు నిందితులను అరెస్టు చేయనందుకు నిరసనగా మంగళవారం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బంద్‌కు పిలుపునిచ్చాయి. వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. రెండు పార్టీల కార్యకర్తలు పట్టణంలో వేర్వేరుగా బైక్ ర్యాలీ నిర్వహించారు. తూప్రాన్ డీఎస్పీ కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో అదనపు బలగాలతో బందోబస్తు నిర్వహించడంతో బంద్ ప్రశాంతంగా ముగిసింది. హోం శాఖ ఏం చేస్తోంది?: జగ్గారెడ్డి తల్లీకొడుకు ఆత్మహత్యల ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిందని.. డీజీపీ, రాష్ట్ర హోంశాఖ ఏం చేస్తోందని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశ్నించారు. మంగళవారం ఆయన రామాయంపేటలో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. తర్వాత మాట్లాడుతూ.. ‘తల్లీకొడుకు ఆత్మహత్యకు పాల్పడితే డీజీపీ, హోం శాఖ మంత్రి స్పందించరా’ అని ప్రశ్నించారు. కేసుతో సంబంధం ఉన్న వారిని అరెస్టు చేయకపోతే బుధవారం రామాయంపేట పోలీస్ స్టేషన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఇవి ప్రభుత్వ హత్యలే: ఈటల తల్లీకొడుకుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు, మాజీ ఎంపీ వివేక్ తదితరులతో కలిసి రామాయంపేటలో బాధిత కుటుంబాన్ని మంగళవారం ఆయన పరామర్శించారు. ఈ హత్యలకు ప్రధాన కారణం ప్రభుత్వం, సీఎం కేసీఆర్ అని ఆరోపించారు. సుదీర్ఘమైన అనుభవమున్న డీజీపీ ఐపీసీకి లోబడి పనిచేయట్లేదని, అయన సీఎం దగ్గర గులాంగిరి చేస్తున్నట్టు ప్రజలు భావించే పరిస్థితి వచ్చిందన్నారు. దహన సంస్కారాలకు వచ్చిన వాళ్లను బెదిరిస్తున్నారు: కుటుంబీకులు అధికార పార్టీకి చెందిన నేతలను కేసు నుంచి తప్పించడానికి ప్రభుత్వ పెద్దలు ప్రయత్నిస్తున్నారని సంతోష్, పద్మ కుటుంబీకులు ఆరోపించారు. అందుకే పోలీసులు పట్టించుకోవట్లేదన్నారు. కారకులను పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదని, పదవి నుంచి తొలగించలేదని చెప్పారు. పద్మ భర్త అంజయ్య, కుమారులు శ్రీధర్, శ్రీనివాస్, కూతురు పావని, అల్లుడు తాటికొండ సతీశ్‌కుమార్ సాక్షితో మాట్లాడారు. ‘నేతల భయంతో మా సామాజిక వర్గానికి చెందిన సభ్యులు కూడా పరామర్శకు రావడానికి జంకుతున్నారు. దహన సంస్కారం రోజు వచ్చిన వారిని ఫోన్ల ద్వారా బెదిరిస్తున్నారు. టీఆర్ఎస్ నాయకులు కొందరు బహిరంగంగానే బెదిరింపులకు దిగుతున్నారు. ఈ విషయం తెలిసినా పోలీసులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు’ అని చెప్పారు. తమను పరామర్శించేందుకు లోకల్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి కూడా రాలేదన్నారు. తమకు జరిగిన అన్యాయం మరెవరికీ జరగొద్దని.. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించాలని కుటుంబీకులు డిమాండ్ చేశారు. చైర్మన్లు ఇద్దరినీ పార్టీ నుంచి బహిష్కరించాలని, దీనిపై టీఆర్ఎస్ అధిష్టానం ప్రకటన చేయాలని అన్నారు. అదుపులో ఆరుగురు తల్లీ కొడుకుల ఆత్మహత్య కేసులో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నామని కామారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. అధికార పార్టీకి చెందిన నేతలు నిందితులు కావడంతో పట్టుకోవడంలో పోలీసులు నిర్లక్ష్యం చేశారని మంగళవారం రామాయంపేట బంద్ పాటించడం, విషయం రాజకీయ రంగు పులుముకోవడంతో ప్రభుత్వ పెద్దలు నష్టనివారణ చర్యలు చేపట్టారు. వెంటనే నిందితులు లొంగిపోయేలా ఆదేశాలివ్వడంతో వారు సరెండర్ అయినట్టు తెలుస్తోంది. నిందితులను కామారెడ్డి పట్టణ పోలీసు స్టేషన్‌కు తీసుకురాగా మీడియా పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆరుగురిని వేరే ప్రాంతానికి తరలించారు. బుధవారం ఉదయం రిమాండ్‌కు పంపుతామని డీఎస్పీ సోమనాథం పేర్కొన్నారు. -
నేరాలు, ఘోరాల రాష్ట్రంగా తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నేరాలు, ఘోరాల రాష్ట్రంగా మారిపోయిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే టి. జగ్గారెడ్డి విమర్శించారు. సినిమాల్లో చూపినట్లుగా రాష్ట్రం లో ప్రస్తుతం నేరాలు, ఘోరాలు జరుగుతున్నాయన్నారు. ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ వేధింపులకు తాళలేక బీజేపీ కార్యకర్త సాయిగణేశ్ ఆత్మహత్య, అధికార పార్టీ నేతల వేధింపులు భరించలేక రామాయంపేటకు చెందిన తల్లీకొడుకులు ఆత్మాహుతికి పాల్పడటం ఇందుకు నిదర్శనమన్నారు. సోమవారం గాంధీ భవన్లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నా సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించట్లేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి మౌనంతో ప్రభుత్వమే ఇప్పుడు దోషిగా నిలబడాల్సి వచ్చిందన్న విషయాన్ని గ్రహించాలన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయని, పోలీసులు రాక్షసులుగా మారుతున్నారని ఆరోపించారు. మంత్రి అజయ్ కుమార్‌ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడంతోపాటు బీజేపీ కార్యకర్త ఆత్మహత్యకు కారణమైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. అలాగే రామాయంపేట ఘటనకు బాధ్యులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఆర్ఎస్ నేతలను అరెస్టు చేయాలన్నారు. -
హస్తినలో ‘కురుక్షేత్రం’!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అసమ్మతి, అసంతృప్తుల వ్యవహారం ఢిల్లీకి చేరింది. అధిష్ఠానం పిలుపుతో కీలక ‘హస్తం’నేతలందరూ హస్తినబాట పట్టారు. ఓవైపు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దూకుడు, మరోవైపు రోజురోజుకూ సీనియర్ల రూపంలో చాపకింద నీరులా పేరుకుపోతున్న అసమ్మతి. వెరసి ‘హస్త’వ్యస్తంగా సాగిపోతున్న టీపీసీసీకి అధిష్టానం దిశానిర్దేశం చేయనుంది. రాష్ట్రానికి చెందిన 38 మంది ముఖ్యనేతలు ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీతో సోమవారం సమావేశం కానున్నారు. దీంతో అసలు ఈ సమావేశంలో ఏం జరుగుతుంది.. ఏయే అంశాలపై పార్టీ నేతలతో రాహుల్ చర్చిస్తారు.. పార్టీలో విభేదాలు ప్రస్తావనకు వస్తాయా.. విభేదాలతో ఉడికిపోతున్న నేతల మధ్య సమన్వయం కుదురుతుందా.. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్‌ను టార్గెట్ చేసి ఢిల్లీబాట పట్టిన సీనియర్లు ఏం మాట్లాడనున్నారు. తెరవెనుక ఉండి అసమ్మతిని పర్యవేక్షిస్తున్న ముఖ్య నేతలు ఏమంటారు.. ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టి మాట్లాడే నేతలకు రాహుల్ సమక్షంలో నోరు విప్పే అవకాశం వస్తుందా.. అసలు సమావేశపు ఎజెండా ఏంటి.. సమావేశం ముగిసిన తర్వాత ఏమవుతుంది.. అనే ఉత్కంఠ, ఆసక్తి రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణుల్లో నెలకొంది. కాగా, రాహుల్‌తో సమావేశమయ్యేందుకు ఆహ్వానం అందిననేతల్లో చాలామంది ఆదివారమే ఢిల్లీ వెళ్లగా, మరికొందరు సోమవారం ఉదయాన్నే బయలుదేరనున్నారు. ఇటీవల ఫైర్‌బ్రాండ్‌గా మారిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆదివారం ఉదయమే సతీమణి, కుమారుడు, కుమార్తెతో కలసి రైలులో ఢిల్లీకి పయనమయ్యారు. అందరికీ ‘భరోసా’ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న విభేదాలపై ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశముందని తెలుస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నియామకం తర్వాత జరిగిన అన్ని పరిణామాలు పార్టీ అధిష్టానానికి స్పష్టంగా తెలుసునని, ఏ నాయకుడి మనసులో ఏముందనే విషయాన్ని కూడా అధిష్టానం గ్రహించిందని, ఈ నేపథ్యంలో అందరు నేతలకు రాహుల్‌గాంధీ స్పష్టమైన భరోసా ఇస్తార ని గాంధీభవన్ వర్గాలు చెపుతున్నాయి. ముఖ్యంగా రేవంత్ వ్యవహారశైలిపై విమర్శలు చేసే నేతలతోపాటు వారిని కలుపుకుని ముందుకెళ్లే విషయంలో రేవంత్‌రెడ్డికి కూడా రాహుల్ మార్గనిర్దేశనం చేస్తారనే చర్చ జరుగుతోంది. పార్టీ స్థితిగతులను పరిశీలించడంతోపాటు ఎన్నికల కోణంలో టీపీసీసీని ముందుకు నడిపించే బాధ్యతలు తీసుకున్న ప్రశాంత్ కిశోర్ మాజీ అనుచరుడు సునీల్ కనుగోలును రాష్ట్ర పార్టీ నేతలందరికీ రాహుల్ పరిచయం చేస్తారని తెలుస్తోంది. దీంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై సునీల్ కనుగోలు ఇచ్చిన సమాచారాన్ని రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో పంచుకుంటారని, పార్టీ ఏయే ప్రాంతాల్లో, ఏయే అంశాల్లో బలంగా ఉంది, ఎక్కడెక్కడ బలహీనంగా ఉందనే విషయాలను ముఖ్య నాయకులందరికీ వివరించి 2023 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేసే విధంగా సిద్ధం చేసి పంపుతారని సమాచారం. ఆహ్వానం అందింది వీరికే...! టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితోపాటు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంపీలు ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీఎల్పీ మాజీ నేత కె. జానారెడ్డి, ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు డి.శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, సీతక్క, రాజగోపాల్‌రెడ్డి, పొదెం వీరయ్య, పీఏసీ కన్వీనర్ షబ్బీర్‌అలీ, పార్టీ కమిటీల చైర్మన్లు మధుయాష్కీగౌడ్, దామోదర రాజనర్సింహ, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, సీనియర్ నేతలు వి. హనుమంతరావు, రేణుకాచౌదరి, బలరాం నాయక్, పొన్నాల లక్ష్మయ్య, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు మహేశ్‌కుమార్‌గౌడ్, అంజన్‌కుమార్‌యాదవ్, అజారుద్దీన్, గీతారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు సంపత్, చిన్నారెడ్డి, వంశీచంద్‌రెడ్డి, శ్రీనివాస కృష్ణన్, బోసు రాజు, ఏఐసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్‌కుమార్, ఏఐసీసీ కిసాన్ సెల్ వైస్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి, మాజీమంత్రులు మర్రి శశిధర్‌రెడ్డి, సంబాని చంద్రశేఖర్, కొండా సురేఖ, సుదర్శన్‌రెడ్డి, ఆర్. దామోదర్‌రెడ్డి, గడ్డం వినోద్, గడ్డం ప్రసాద్‌కుమార్‌లకు రాహుల్‌తో సమావేశానికి రావాలంటూ ఆహ్వానాలు అందాయి. వీరితోపాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. -
దైవ సాక్షిగా అంతా నిజమే చెబుతున్నా
సాక్షి, హైదరాబాద్: ‘ముత్యాలముగ్గు సినిమాలో హీరోయిన్లా మారిపోయింది నా పరిస్థితి. ఆ సీన్లో నేను హీరోయిన్ అయితే హీరో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు. విలన్ రేవంత్‌రెడ్డి’అని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పారు. సీతమ్మ తరహాలోనే తనకు అగ్ని పరీక్ష చేసుకునే సమయం వచ్చిందని, అగ్నిపరీక్ష చేసుకుంటే కాలిపోతాను కనుక శీల పరీక్ష చేసుకుంటున్నానని అన్నారు. పరీక్షలో భాగంగానే తనకు, రేవంత్ మధ్య జరిగిన విషయాలను.. రేవంత్, జగ్గారెడ్డి గుణగణాలను ప్రజలకు చెపుతున్నానని చెప్పారు. తాను చెబుతున్న విషయాలకు, పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో మంగళవారం మీడియాతో జగ్గారెడ్డి మాట్లాడారు. ‘కాంగ్రెస్‌కు నేను నష్టం చేస్తున్నానని కొన్ని రోజులుగా కొందరు సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు. నేను సోషల్ మీడియాలో వీక్ గనుక నా ఆవేదన, బాధ ప్రజలకు చెప్పుకోవాలి. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలకు అర్థం కావాలి. దైవ సాక్షిగా చెపుతున్నా. నేను చెపుతున్నవన్నీ నిజాలే’అని చెప్పారు. సంగారెడ్డి వెళ్తానని నాకు చెప్పనేలేదు ఈ నెల 6న సీఎల్పీ సమావేశం జరిగిన రోజున రేవంత్ సంగారెడ్డికి వెళ్లి అక్కడి నుంచి మెదక్ వెళ్లారని, ఆ విషయం తనకు చెప్పలేదని జగ్గారెడ్డి అన్నారు. అంతకుముందు రోజు ఫోన్ చేసి తాను మెదక్ చర్చికి వెళ్తున్నానని, అక్కడి కార్యకర్తలకు చెప్పాలని చెప్పారే తప్ప తనను రమ్మనలేదని, సంగారెడ్డి వెళ్తున్నానని తనతో ప్రస్తావించలేదని అన్నారు. ఈ విషయాన్ని సీఎల్పీ సమావేశంలో రేవంత్‌తో మాట్లాడదామని అనుకున్నానని, కానీ కుసుమకుమార్ అక్కడేం మాట్లాడొద్దనడంతో సమావేశం నుంచి వెళ్లిపోయానని చెప్పారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న తనకే రేవంత్ ఇలా చేశారంటే కార్యకర్తలు, ఇతర నాయకుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలన్నారు. సీఎల్పీ కార్యాలయంలో జరిగింది వేరు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు అనుకోకుండా సీఎల్పీ కార్యాలయానికి రేవంత్ వచ్చారని, ‘జగ్గన్నా’అని పలకరించడంతో తానూ ఆత్మీయంగా పలకరించానని జగ్గారెడ్డి చెప్పారు. ఆ తర్వాత ఇద్దరం ఏకాంతంగా మాట్లాడుకున్నామన్నారు. తర్వాతి రోజు పేపర్లలో తామిద్దరం కలిసినట్టు వార్తలు వచ్చాయని, కానీ లోపల జరిగింది వేరని చెప్పారు. మెదక్ విషయం, పార్టీ అంశాలేవీ తనతో రేవంత్ చర్చించలేదన్నారు. సీఎం కేసీఆర్ ఆరోగ్యం బాగాలేదని, ఏ క్షణమైనా ఏదైనా జరుగుతుందన్న సమాచారం ఉందని, అలర్ట్‌గా ఉండాలని రేవంత్ చెప్పారన్నారు. సీఎం ఆరోగ్య పరిస్థితి అలా ఉంటే అసెంబ్లీ సజావుగా జరుగుతుందా అని ప్రశ్నించారు. రేవంత్ ఆలోచన అలా ఉంటుందని.. ఆయన పీసీసీ అధ్యక్ష పదవికి ఎలా అర్హుడవుతారో చెప్పాలన్నారు. సస్పెండ్ చేసినా పార్టీపై గౌరవంతోనే ఉంటా కాంగ్రెస్‌పై అభిమానం, గాంధీ కుటుంబంపై గౌరవంతోనే తాను పార్టీలో కొనసాగుతున్నానని, జీవితాంతం పార్టీలోనే ఉండాలని తాను కోరుకుంటున్నానని జగ్గారెడ్డి చెప్పారు. తనను సస్పెండ్ చేయించినా కాంగ్రెస్‌పై గౌరవంతోనే ఉంటానన్నారు. తనపై ఇతర కండువాలు కప్పుతూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే బాధపడనని చెప్పారు. శ్రీధర్‌బాబు, జీవన్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లాంటి నేతలకూ వేరే పార్టీల కండువాలు కప్పుతున్నారని.. అలా చేసి ఏం చేయదల్చుకున్నారని ప్రశ్నించారు. మంత్రి హరీశ్‌రావును కాంగ్రెస్ నేత వీహెచ్ కలిస్తే తప్పేంటని, ఆయనకూ అవినీతి మరకలు అంటిస్తున్నారని అన్నారు. ‘అరే, తురే’అని సంబోధించింనందుకే తనకున్న పదవుల్లో కోత పెడితే సోనియాను తిట్టిన రేవంత్‌కు పీసీసీ అధ్యక్ష పదవి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. రేవంత్ టీడీపీలో ఉండగా సోనియాను విమర్శించిన వీడియోను ప్రదర్శించారు. -
20 రోజుల క్రితం రేవంత్‌రెడ్డి నాకు ఫోన్ చేశారు: ఎమ్మెల్యే జగ్గారెడ్డి
-
నేను కూడా పీసీసీ చీఫ్ పదవి ఆశించా.. కానీ: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్లోకి వెళ్తున్నట్లు తన ఫోటోలు మార్ఫింగ్ చేసి ట్రోల్ చేస్తున్నారని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్‌మీడియలో తనపై చేస్తున్న అసత్య ప్రచారాలను జగ్గారెడ్డి ఖండించారు. కొందరు కావాలనే తన ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. తాను కూడా పీసీసీ చీఫ్ పదవి ఆశించానని, అయితే రాహుల్‌తో పోట్లాడే స్థాయి తనది కాదని అందుకు మౌనంగా ఉన్నట్లు చెప్పారు. తన పంచాయితీ రేవంత్‌తో మాత్రమేనని కాంగ్రెస్‌తో కాదని చెప్పారు. అందర్నీ కలుపుకుని పోయే తత్వం రేవంత్‌కు ఉందా అని ప్రశ్నించాడు. 20 రోజుల క్రితం రేవంత్ ఫోన్ చేశారని, మెదక్ సీఎస్ఐ చర్చికి వెళ్తన్నట్లు చెప్పినట్లు తెలిపారు. కానీ దామోదర రాజనర్సింహతో మరో రకంగా చెప్పారని అన్నారు. -
నేను ఎవరి మాట వినను నాది బిజినెస్ మైండ్ కాదు.. పొలిటికల్ మైండ్
-
ఢిల్లీకి చేరిన తెలంగాణ కాంగ్రెస్ నేతల పంచాయతీ
-
జగ్గారెడ్డి ప్రెస్‌మీట్‌పై పార్టీలో చర్చ
-
జగ్గారెడ్డికి బిగ్ షాక్.. బాధ్యతల నుంచి తొలగింపు
-
జగ్గారెడ్డి బాధ్యతల్లో కోత...
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో విభేదాలు రోజురోజుకూ ముదురుతున్నాయి. సీనియర్లు వర్సెస్ పీసీసీ అధ్యక్షుడు అన్నట్టుగా చోటు చేసుకుంటున్న పరిణామాల పరంపర సోమవారం కూడా కొనసాగింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డికి ఉన్న పార్టీ బాధ్యతల్లో కోత పడింది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఆయన ఇన్చార్జిగా వ్యవహరిస్తోన్న ఖమ్మం, వరంగల్, భువనగిరి, కరీంనగర్ లోక్‌సభ స్థానాలతో పాటు మహిళా కాంగ్రెస్, ఐఎన్టీయూసీ, ఇతర సంఘాల ఇన్చార్జి బాధ్యతలను ఇతర వర్కింగ్ ప్రెసిడెంట్లకు అప్పగిస్తూ రేవంత్ ఉత్తర్వులు జారీ చేశారు. తాను వర్కింగ్ ప్రెసిడెంట్‌గానే కొనసాగుతానని, ఇతర బాధ్యతలు వద్దని తెలియజేస్తూ గతంలో జగ్గారెడ్డి పార్టీకి రాసిన లేఖ ఆధారంగా ఆయన్ను ఆ బాధ్యతల నుంచి తొలగించినట్టు గాంధీ భవన్ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు రాష్ట్ర మంత్రి హరీశ్‌రావును కలిసిన అంశంపై వివరణ కోరుతూ త్వరలోనే మాజీ ఎంపీ, సీనియర్ నేత వి. హనుమంతరావుకు షోకాజ్ నోటీసు జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. జగ్గారెడ్డి బాధ్యతల తొలగింపు, వీహెచ్‌కు షోకాజ్ నోటీసు జారీ చేయడం ద్వారా ఇతర అసంతృప్త నేతలను కూడా అధిష్టానం దారిలోకి తీసుకురావాలని టీపీసీసీ నాయకత్వం భావిస్తున్నట్టు గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఢిల్లీ వెళ్లిన రేవంత్‌రెడ్డి జగ్గారెడ్డి మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు సీఎల్పీలో విలేకరులతో మాట్లాడాలని నిర్ణయించుకున్నారు. ఇటీవలి, ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఆయన ఏం మాట్లాడతారన్నది కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. మరోవైపు పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యేందుకు సోమవారం ఢిల్లీ వెళ్లిన రేవంత్‌రెడ్డి.. మంగళవారం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్‌తో భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్‌లో మరేమైనా ఇతర పరిణామాలు చోటు చేసుకుంటాయా అనే చర్చ కూడా జరుగుతోంది. పార్టీకి నష్టం కలిగితే వారిదే బాధ్యత: మహేశ్‌కుమార్ గౌడ్ టీపీసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్ సోమవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. పార్టీలో ప్రజాస్వామ్యం ఉంది కదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఎంతటి సీనియర్లు అయినా ఊరుకునేది లేదని అన్నారు. సీనియర్లంటే తమకు గౌరవం ఉందని, వారికి వ్యక్తిగతంగా ఏవైనా సమస్యలు ఉంటే అధిష్టానానికి చెప్పుకోవాలని, పార్టీని నష్టపరిచే వ్యవహారాలు మంచివి కావని సూచించారు. పార్టీకి నష్టం కలిగితే వారిదే బాధ్యత అని పేర్కొన్నారు. -
తెలంగాణ కాంగ్రెస్‌లో అసలేం జరుగుతోంది? ఎవరేం మాట్లాడుతున్నారు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్‌లో రచ్చ తారాస్థాయికి చేరింది. ఆదివారం పొద్దంతా పోటాపోటీ భేటీలు, ప్రెస్మీట్లు, విమర్శలతో హైడ్రామా నడిచింది. పార్టీ సీనియర్లు కొందరు విధేయుల ఫోరం పేరుతో భేటీ కావడం.. సమావేశం కావొద్దంటూ అధిష్టానం నుంచి ఒత్తిడి వచ్చినా కొనసాగించడం, ఈ భేటీకి కౌంటర్‌గా గాంధీభవన్‌లో కొందరు అధికార ప్రతినిధుల ప్రెస్‌మీట్.. పార్టీ గురించి బయట మాట్లాడేవారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేయడం.. తర్వాత వారే సీనియర్ల సమావేశానికి వచ్చి మాట్లాడేందుకు ప్రయత్నించడం.. సీనియర్లు నిరాకరించడం.. వంటి పరిణామాలు రోజంతా చర్చనీయాంశంగా మారాయి. విధేయుల ఫోరం సమావేశానికి వెళ్లిన నేతలు కొందరే అయినా.. ఆ భేటీ అనంతరం సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు మరింత వేడి పుట్టించాయి. పార్టీ బలోపేతం కోసమంటూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతంపై చర్చించేందుకంటూ.. ‘కాంగ్రెస్ విధేయుల ఫోరం’పేరిట కొందరు పార్టీ సీనియర్లు ఓ ప్రైవేటు హోటల్లో సమావేశమయ్యారు. వేదికపై మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. సోనియా, రాహుల్, ప్రియాంక ఫోటోలతో ఉన్న ఫ్లెక్సీని కట్టారు. మాజీ ఎంపీ వీహెచ్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి, కమలాకర్‌రావు, శ్యాంమోహన్ తదితర నేతలు దీనికి హాజరయ్యారు. అయితే ఈ సమావేశం విషయం తెలుసుకున్న అధిష్టానం పెద్దలు వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. పార్టీలో సమస్యలుంటే అంతర్గత వేదికలపై మాట్లాడుకుందామని, ఇలా ప్రత్యేకంగా సమావేశాలు పెట్టవద్దంటూ ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు సీనియర్ నేతలకు ఫోన్ చేసినట్టు తెలిసింది. అయితే తమది అసమ్మతి సమావేశం ఏమీ కాదని, రాష్ట్రంలో పార్టీ భవిష్యత్తుపై చర్చించేందుకే భేటీ అవుతున్నామని సీనియర్లు చెప్పినట్టు సమాచారం. ఈ క్రమంలోనే యథాతథంగా సమావేశం కొనసాగించి, పలు అంశాలపై చర్చించారు. అశోకా హోటల్లో భేటీ అయిన వీహెచ్,జగ్గారెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి ఎవరైనా సరే.. సస్పెండ్ చేయాలి.. ఇటు పార్టీ సీనియర్ల భేటీ జరుగుతున్న సమయంలోనే.. మరోవైపు గాంధీభవన్‌లో టీపీసీసీ అధికార ప్రతినిధులు అద్దంకి దయాకర్, బెల్లయ్య నాయక్, ఈరవత్రి అనిల్, మానవతారాయ్‌లు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రేవంత్ నేతృత్వంలో కాంగ్రెస్ బలోపేతం అవుతోందని.. ఇలాంటి తరుణంలో సీనియర్ల పేరిట సమావేశాలు ఏర్పాటు చేయడం సరికాదని, దీనివల్ల కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటివరకు పదవులు అనుభవించిన వారే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఎలాగని ప్రశ్నించారు. వీహెచ్, జగ్గారెడ్డి, రాజగోపాల్‌రెడ్డి వంటి కొందరు నాయకులు రేవంత్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని.. పార్టీ బలోపేతం కోసం పనిచేస్తున్న వారికి వ్యతిరేకంగా మాట్లాడొద్దని కోరారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించే వారు ఎంతటి వారైనా సరే.. పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వీహెచ్ ఒక ఎమ్మెల్సీని వెంటబెట్టుకుని రహస్యంగా మంత్రి హరీశ్‌రావును కలవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. కోవర్టులకు బుద్ధి చెప్పేంతవరకు పోరాటం చేస్తామని వ్యాఖ్యానించారు. వ్యక్తిగత పనిమీద వెళ్లా..! వీహెచ్ హరీశ్‌రావు ఇంటికి వెళ్లి ఎందుకు కలిశారన్న దానిపై సీనియర్ల సమావేశంలోనూ చర్చకు వచ్చినట్టు సమాచారం. వైద్యశాఖలో పనిచేస్తున్న తన కుమార్తె విషయంగా మాట్లాడానని పార్టీ నేతలతో వీహెచ్ చెప్పినట్టు తెలిసింది. దీనిపై మీడియా కూడా ప్రశ్నించగా.. వ్యక్తిగత పనిమీద హరీశ్‌ను కలిశానే తప్ప వేరే ఉద్దేశం లేదని వీహెచ్ చెప్పారు. తర్వాత ఈ విషయంపై జగ్గారెడ్డి మాట్లాడుతూ.. సీఎం, మంత్రులను ఇతర పార్టీల నేతలు కలిసే సంప్రదాయం ఇప్పుడే కొత్తగా వచ్చిందేమీ కాదన్నారు. వ్యక్తిగత పనుల మీద తాము కూడా చాలా మందిని కలుస్తుంటామని, అలాంటప్పుడు వీహెచ్ హరీశ్‌రావును కలవడంలో తప్పేంటని ప్రశ్నించారు. చర్యలా.. రాజీలా..? రేవంత్ వర్సెస్ సీనియర్లుగా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న జగడం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనే దానిపై ఆ పార్టీ కేడర్‌లో చర్చ జరుగుతోంది. రేవంత్ దూకుడుగా ముందుకెళ్తుండటం, ఆయన వన్ మ్యాన్ షో చేస్తున్నారని, పార్టీ లైన్లో లేడని సీనియర్లు విమర్శిస్తుండటం ఆసక్తికరంగా మారింది. ఈ విషయంపై అధిష్టానం కూడా దృష్టి సారించింది. తమ సూచనను కాదని భేటీ అయిన సీనియర్ల విషయంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తమ వాదన వివరించేందుకు ఢిల్లీ వెళ్లాలని ‘విధేయుల ఫోరం’నేతలు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుంది? సీనియర్లు తగ్గుతారా? రేవంత్ వర్గం రాజీకి వస్తుందా? కాంగ్రెస్ అడుగులు ఎటువ వైపు అన్నది ఇటు కాంగ్రెస్ పార్టీలో అటు రాష్ట్ర రాజకీయాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది. పార్టీ కష్టకాలంలో ఉంది: మర్రి శశిధర్‌రెడ్డి గత రెండు ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీకి ఈసారి ఎన్నికలు చాలా కీలకమని, భవిష్యత్తులో పార్టీకి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే అంశంపై తాము చర్చించామని మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ సీనియర్ల భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తాము అసమ్మతి వాదులం కాదని, ఎవరికీ వ్యతిరేకంగా సమావేశం నిర్వహించలేదని చెప్పారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓడిపోయామని, హుజూరాబాద్‌లో పరాభవం జరిగిందని.. భవిష్యత్తులో అలా జరగకుండా ఏం చేయాలన్న దానిపై సీనియర్లుగా మాట్లాడుకున్నామని వివరించారు. పార్టీ కష్టకాలంలో ఉందని, పొరపాట్లను సరిదిద్దుకోవాలన్నదే తమ అభిప్రాయమని చెప్పారు. పార్టీ ఎవరిని సీఎం చేసినా, ఏ పదవి ఇచ్చినా తమకు సమ్మతమేనని.. అధిష్టానం తీసుకునే నిర్ణయంపై నమ్మకముందని వ్యాఖ్యానించారు. రేవంత్ పార్టీని చెడగొడుతున్నాడు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పార్టీ లైన్లో లేడని, ఆయన పార్టీని చెడగొడుతున్నాడని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు. తాము కాంగ్రెస్‌కు, సోనియా, రాహుల్, ప్రియాంకలకు వ్యతిరేకం కాదని.. తాము పార్టీ లైన్లోనే ఉన్నామని చెప్పారు. ఆదివారం సీనియర్ల భేటీ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రేవంత్ పర్సనల్ షో చేస్తున్నాడు కనుకనే నేనూ పర్సనల్ షో చేస్తున్నా. అంతా ఆయనొక్కడే అన్నట్టు రేవంత్ భజన మండలి మాట్లాడుతోంది. మేమంతా లేకుండా రేవంత్ ఒక్కడే పార్టీని అధికారంలోకి తెస్తాడా? నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. రేవంత్ అక్కడ నాపై తన మనిషిని నిలబెట్టి గెలిపించుకోవాలి. నేను స్వతంత్రంగా పోటీ చేస్తా. నేను గెలిస్తే హీరోని. రేవంత్ గెలిస్తే ఆయన హీరో. ఇక ఆయన ఎలా చెప్తే అలా. అదే రేవంత్ ఓడిపోతే ఏం చేస్తాడో సవాల్ చేయమనండి. ఇద్దరం ఓడిపోతే ఇద్దరం జీరోలమవుతాం. గెలిచిన వాడు హీరో అవుతాడు’ అని జగ్గారెడ్డి పేర్కొన్నారు. రేవంత్ ఒక్కడే అధికారంలోకి తెచ్చేందుకు ఇదేమైనా పిల్లల ఆటనా అని ప్రశ్నించారు. షోకాజ్ నోటీసులిచ్చి పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే తానేంటో చూపిస్తానని హెచ్చరించారు. -
రేవంత్‌రెడ్డికి జగ్గారెడ్డి సవాల్
సాక్షి, హైదరాబాద్: తెంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి ఆ పార్టీ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సవాల్ విసిరారు. సంగారెడ్డి ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా చేస్తానని అన్నారు. అయితే రేవంత్‌రెడ్డికి దమ్ముంటే తనకు వ్యతిరేకంగా ఒక అభ్యర్థిని నిలబెట్టి గెలిపించాలని చాలెంజ్ చేశారు. తనను సస్పెండ్ చేసే దమ్ము ఎవరికీ లేదన్నారు. షోకాజ్ నోటీసు ఇస్తే.. సమాధానం చేబుతానని అన్నారు. తనను సస్పెండ్ చేస్తే.. రోజుకో బండారం బయటపెడతానని ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి పార్టీ లైన్లో పనిచేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి పర్సనల్ షో చేస్తున్నారని, అందుకే తాను కూడా పర్సనల్ షో చేస్తున్నానని అన్నారు. -
జగ్గారెడ్డి ఫైర్.. ఆ ఇద్దరు నాపై నెగెటివ్ రిపోర్ట్
-
రాహుల్ సారథ్యం వహించాలి
సాక్షి. హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సారథ్య బాధ్యతలను అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టాలని కాంగ్రెస్ శాసనసభా పక్షం (సీఎల్పీ) తీర్మానించింది. సోనియా, రాహుల్‌ల నాయకత్వమే అటు దేశా నికి, ఇటు పార్టీకి శ్రీరామరక్ష అని, గాంధీ–నెహ్రూ ల కుటుంబమే పార్టీ బాధ్యతలు తీసుకుని కేడర్‌ను ముందుకు నడపాలని కోరింది. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన బుధవారం అసెంబ్లీ ప్రాంగణంలోని సీఎల్పీ కార్యాలయంలో ఆ పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, పొదెం వీరయ్య, సీతక్కలు హాజ రు కాగా, నియోజకవర్గ పర్యటనలో ఉన్న మరో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి హాజరు కాలేదు. సమావేశంలో భాగంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరిగిన తీరు, ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, సీడబ్ల్యూసీ సమావేశంలో జరిగిన చర్చ, జీ–23 నేతల వ్యాఖ్యలు, రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఈ చర్చ అనంతరం సోనియా, రాహుల్‌ల నాయకత్వంపై విశ్వాసం ప్రకటిస్తూ తెలంగాణకు చెందిన పార్టీ ఎమ్మెల్యేల పక్షాన తీర్మానం చేశారు. ఈ తీర్మాన ప్రతిపై భట్టి విక్రమార్క, టి.జీవన్‌రెడ్డిలు సంతకాలు చేశారు. అసెంబ్లీలో సమయం ఇవ్వలేదు బడ్జెట్ సమావేశాలపై చర్చిస్తూ.. ప్రజల పక్షాన మాట్లాడేందుకు కాంగ్రెస్ పార్టీకి తగిన సమయం ఇవ్వలేదని, అటు స్పీకర్ సహకరించలేదని, ఇటు మంత్రులు సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని రెచ్చగొట్టేలా వ్యవహరించారని అభిప్రాయపడ్డారు. ఇటీవల మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి నివాసంలో సీనియర్లు భేటీ కావడం, ఈ భేటీకి ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డిలు హాజరుకావడంపై ఎమ్మెల్యే సీతక్క ఆరా తీసినట్టు తెలిసింది. సోనియా, రాహుల్‌పై విమర్శలు తగవు: భట్టి సమావేశం అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతో కలిసి భట్టి విలేకరులతో మాట్లాడారు. ప్రధాని పదవి చేపట్టే అవకాశాలు వచ్చినా సోనియా, రాహుల్‌లు ఆ పదవిని వద్దనుకుని దేశం కోసం నిలబడ్డారని చెప్పారు. కపిల్ సిబాల్ లాంటి నాయకులు సోనియా, రాహుల్‌లపై విమర్శలు సరికావన్నారు. 1970లో అధికారాన్ని కోల్పోయి 1980లో పూర్వ వైభవం సంతరించుకున్న తరహాలోనే 2014లో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ హవా 2023– 24లో దేశంలో వీస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 2023 ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని చెప్పారు. -
టీఆర్ఎస్లో చేరిక! జగ్గారెడ్డి ఏమన్నారంటే..
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి టీఆర్ఎస్ పార్టీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉద్యమంలో పనిచేసిన జర్నలిస్ట్‌లకు ఇళ్లు, జాగ్వార్ కార్ ఇస్తే.. తాను కార్ పార్టీ( టీఆర్ఎస్) లోకి రావడానికి రెడీ అని అన్నారు. ఇళ్ల గృహ ప్రవేశం కాగానే టీఆర్ఎస్ పార్టీలో వస్తానని అసెంబ్లీ ఆవరణంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, జర్నలిస్ట్‌లతో సరదా సంభాషించారు జగ్గారెడ్డి. అవసరం అనుకుంటే ఒక టర్మ్ అసెంబ్లీ ఎన్నికలకు సైతం పోటీ కూడా చేయనని అన్నారు. తన అసెంబ్లీ సెగ్మెంట్లోని ప్రజలకు చెబుతానని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్‌పై వ్యతిరేకతతో కాంగ్రెస్‌లో చేరలేదని గుర్తు చేశారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి సరదా సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
మా ఇద్దరిదీ ఒకటే సిలబస్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయం వేదికగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం సీఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఉన్న సమయంలో అక్కడకు టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి వచ్చారు. అనుకోకుండా తారసపడ్డ ఇద్దరూ కరచాలనం చేసుకుని పలకరించుకున్నారు. వీరిద్దరూ చేతులు కలపడంతో మీడియా ప్రతినిధులు వారిని చుట్టుముట్టారు. ఫొటోలకు ఫోజులి వ్వాలని కోరడంతో ఇద్దరు నేతలు నవ్వుతూ సీఎల్పీ కార్యాలయం లోపల ఫోటోలు దిగారు. ఆ తర్వాత ఇద్దరూ కూర్చుని కొద్దిసేపు మీడియాతో సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ ‘జగ్గన్నదీ... నాదీ ఒక్కటే సిలబస్. మీడియా వాళ్లకే ఇది అర్థం కావడం లేదు. జెమిని సినిమాలో హీరో, విలన్ పాత్రల్లాంటివే మా పాత్రలు కూడా. మేమిద్దరం ఒకటే.’అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఇరువురు ఒకేపార్టీ నేతలు కలిసినా హల్చల్ అ య్యే పరిస్థితి అని విలేకరులు వ్యాఖ్యానించారు. దీం తో రేవంత్ స్పందిస్తూ ఇది మీడియా చేసిన పనేనన్నారు. జగ్గారెడ్డి మాట్లాడుతూ..తామింకా విడాకు లు తీసుకోలేదని, విడాకులు తీసుకున్న తర్వాత కలి స్తే తప్పని, ఇప్పుడేం ఉంటుందని సరదాగా అన్నా రు. ఆ తర్వాత ఇద్దరు ఏకాంతంగా 15 నిమిషాలు మాట్లాడుకున్నారు. అనంతరం ఉద్యోగాల భర్తీపై సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన గురించి మాట్లాడుకున్నామని చెప్పినా అంతర్గతంగా పలు రాజకీయ అంశాలు మాట్లాడుకున్నట్టు సమాచారం. అయితే, ఈ విషయంపై ఇద్దరు నేతలూ నోరు విప్పలేదు. -
ప్రజాసమస్యలే ‘ఎజెండా’
సాక్షి, హైదరాబాద్: ప్రజాసమస్యల పరిష్కారంలో విఫలమైన అధికార టీఆర్ఎస్ను అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో నిలదీయాలని కాంగ్రెస్ శాసనసభాపక్షం(సీఎల్పీ) నిర్ణయించింది. ఎనిమిదేళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు, ఎన్నికల వాగ్దానాల విస్మరణ, బడ్జెట్ అసమానతలు, అవినీతి, కరెంటు చార్జీల పెంపు, ఉద్యోగ నోటిఫికేషన్లు, నిరుద్యోగభృతి, రైతు రుణమాఫీ, నకిలీ విత్తనాలతో రైతులకు నష్టం, అభయహస్తం, మహి ళలకు వడ్డీలేని రుణాలు, డబుల్ బెడ్రూం ఇళ్లు, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల మళ్లింపు, దళితబంధు వంటి అంశాలపై ప్రభుతాన్ని ప్రశ్నించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు నిర్ణయించారు. ఆదివారం హైదరాబాద్‌లోని తాజ్‌దక్కన్‌లో సీఎల్పీనేత భట్టి అధ్యక్షతన దాదాపు ఆరున్నర గంటలపాటు సీఎల్పీ సమావేశం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్న సీఎల్పీ నేత భట్టి నేటి నుంచి జరగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వారితో చర్చించారు. నీళ్లు, నిధులు, నియా మకాల కోసం తెచ్చుకున్న తెలంగాణలో నెరవేరని ప్రజల ఆకాంక్షల గురించి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో నిలదీస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చెప్పారు. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకపోతే ప్రభుత్వ ప్రోగ్రెస్ రిపోర్టు ఎలా తెలుస్తుందని, ఇది సభ్యుల హక్కులను హరించడమేనని అన్నారు. కొత్త రాజ్యాంగం రాయాలంటున్న కేసీఆర్ ఇప్పుడు బడ్జెట్ సమావేశంలో గవర్నర్ ప్రసంగం లేకుండా రాజ్యాంగాన్ని చట్టవిరుద్ధంగా అమలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్: రేవంత్ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మాట్లాడు తూ కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే చివరి బడ్జెట్ ఇదేనని వ్యాఖ్యానించారు. ఈ ఏడాది డిసెంబర్లో ప్రభుత్వం రద్దవుతుందని, మరో 12 నెలల్లో రాష్ట్రంలో సోనియా గాంధీ రాజ్యం వస్తుందని చెప్పారు. ప్రభు త్వ లోటుపాట్లను కాంగ్రెస్ నిలదీస్తుందనే దుర్మార్గపు ఆలోచనతోనే గవర్నర్ ప్రసంగం లేకుండా చేశారని ఆరోపించారు. అసెంబ్లీ లో తమ పార్టీ ఎమ్మెల్యేలను మాట్లాడకుం డా అడ్డుకుంటే రాష్ట్రం నలుమూలల నుంచి కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగుతాయని హెచ్చరించారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాల వంటివి దేశంలో ఎక్కడ అమలవుతున్నాయో చూపిస్తారా.. అని మంత్రి కేటీఆర్ చేసిన సవాల్‌ను తాను స్వీకరిస్తున్నానని, ఆయనకు 30 రోజుల సమయం ఇస్తున్నానని రేవంత్ చెప్పారు. నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసం గం లేకపోవడంపై పార్లమెంటులోనూ ప్రస్తావిస్తానని చెప్పారు. సమన్వయం ఏదీ : సంపత్ మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ మాట్లాడు తూ పార్టీనేతల్లో సమన్వయం ఎక్కడుంద ని ప్రశ్నించారు. సీఎల్పీ సమావేశం పెట్టుకు ని పీసీసీ అధ్యక్షుడు వేరే జిల్లాలకు వెళ్లడమేంటని ప్రశ్నించిన సంపత్ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై హత్యాయత్నం ఘటనను పార్టీ పరంగా ఉపయోగించుకోలేకపోయా మని అభిప్రాయపడ్డారు. సమావేశానికి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి హాజ రు కాలేదు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తన నియోజకవర్గానికి వెళ్లి కూడా తనకు సమాచారం ఇవ్వలేదన్న కారణంతో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సమావేశంలోంచి వెళ్లిపోయారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మె ల్యే ఈరవత్రి అనిల్ కూడా పార్టీ నేతల ఐక్యతపై మాట్లాడినట్టు సమాచారం. సమావేశానికి ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, సీతక్క, పొదెం వీరయ్యలతో పాటు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్, మాజీ మంత్రి షబ్బీర్‌అలీ, వి.హనుమంతరావు, చిన్నారెడ్డి, నాగం జనార్దనరెడ్డి, అంజన్‌కుమార్‌యాదవ్, డీసీసీ అధ్యక్షులు, గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, పార్టీ అనుబంధ సంఘాల చైర్మన్లు హాజరయ్యారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు: ఉత్తమ్ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జోస్యం చెప్పారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన సీఎల్పీ సమావేశానికి హాజరైన ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రంతో పాటు మనకు కూడా ఎన్నికలు వస్తాయని చెప్పారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలందరూ హైదరాబాద్‌ను వదిలేసి నియోజకవర్గాలకు వెళ్లాలని, ఆయా నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని సూచించారు. అయితే, రానున్న ఎన్నికల్లో తాను ఎక్కడ పోటీ చేసేది ఇప్పుడే స్పష్టంగా చెప్పలేనని, తాను ఎక్కడ పోటీ చేయాలన్న విషయాన్ని సోనియాగాంధీ నిర్ణయిస్తారని ఉత్తమ్ అన్నారు. -
రాజీనామా నిర్ణయాన్ని మార్చుకున్న జగ్గారెడ్డి.. ‘అప్పటి దాకా ఆగుతా’
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించిన ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కలిసే వరకు తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. రాజీనామా చేయాలా? సొంత పార్టీ పెట్టాలా..? అని జగ్గారెడ్డి కార్యకర్తలను అడగ్గా, కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలని వారు సూచించడం గమనార్హం. అయితే రానున్న రోజుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో తాను తీసుకునే నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలని కోరుకోవడం లేదని జగ్గారెడ్డి కార్యకర్తలు, అనుచరులనుద్దేశించి వ్యాఖ్యానించారు. సంబంధిత వార్త: తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు శుక్రవారం సంగారెడ్డిలోని ఓ ఫంక్షన్‌హాలులో ఆయన నియోజకవర్గ కార్యకర్తలతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ తాను టీఆర్ఎస్ పార్టీలో చేరుతానని కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. అలాగే బీజేపీలోకి వెళ్లే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. బయటవారి కంటే కాంగ్రెస్ పార్టీ నేతలే ఈ అసత్య ప్రచారం చేస్తు న్నారని ఆరోపిం చారు. కాగా, తన నియోజ కవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని జగ్గారెడ్డి నిర్ణయించారు. డిజిటల్ సభ్యత్వ నమోదు తన నియోజకవర్గంలో తక్కువగా ఉందని, ఈసారి 75 వేల కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాలను నమోదు చేయించాలని అనుచరులు, కార్యకర్తలను కోరారు. వచ్చేనెల 10న సభ్యత్వ నమోదుపై సమీక్ష ఉంటుందని, కార్యకర్తలు 75 వేల కంటే తక్కువ సభ్యత్వం నమోదు చేస్తే తనను అవమానించినట్లే అవుతుందని, ఈ సభ్యత్వ నమో దును బట్టి తన రాజకీయ భవిష్యత్ ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. 21న సోనియా, రాహుల్‌లతో బహిరంగ సభ కాగా, మార్చి 21న సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో సంగారెడ్డిలో భారీ బహిరంగసభ నిర్వహిస్తానని జగ్గారెడ్డి ప్రకటించారు. తన భవిష్యత్ ఏంటో ఆ సభలో వెల్లడిస్తానన్నారు. యూపీ ఎన్నికల తర్వాతే! సాక్షి, హైదరాబాద్: సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డికి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అపాయింట్మెంట్ లభించాలంటే మరో 10 రోజుల సమయం పడుతుందని గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఢిల్లీ పెద్దలు ఐదు రాష్ట్రాల ఎన్నికలు, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ ఎన్నికల హడావుడిలో ఉన్నందున అవి ముగిసిన తర్వాతే జగ్గారెడ్డికి 10 జన్‌పథ్ నుంచి పిలుపు రావచ్చని తెలుస్తోంది. ఇదిలా ఉండగా, జగ్గారెడ్డికి అపాయింట్మెంట్ కోసం ఇప్పటికే రాహుల్ కార్యాలయానికి సమాచారం వెళ్లగా, నేడో రేపో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా హైకమాండ్‌కు లేఖ రాయనున్నారు. పార్టీ ఎమ్మెల్యేకు సోనియా, రాహుల్, ప్రియాంకలతో భేటీ అయ్యేందుకు అవకాశం ఇప్పించాలని కోరు తూ సీఎల్పీ పక్షాన ఆయన లేఖ రాయనున్నట్టు సమాచారం. అయితే, 15 రోజుల పాటు వేచి చూస్తానని చెప్పిన జగ్గారెడ్డి.. తన మనసు మార్చుకున్నారని ఆయన వ్యాఖ్యలు చెపుతున్నాయి. శుక్రవారం సంగారెడ్డిలో జరిగిన కార్యకర్తల సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ సోనియా, రాహుల్, ప్రియాంకాగాంధీలను కలిసేంతవరకు రాజీనామా చేసే ప్రసక్తే లేదని వెల్లడించారు. అయితే, సమావేశం ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత కొందరికి అనుకున్న పదవులు రాకపోతే, మళ్లీ పార్టీని చీల్చే కార్యక్రమం చేస్తారని, అప్పుడు కాంగ్రెస్‌నే నమ్ముకున్న తనలాంటి వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించడం ఆసక్తిని కలిగిస్తోంది. ఎవరిని ఉద్దేశించి జగ్గారెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారన్నది ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. -
తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి వెళ్లొద్దని సంగారెడ్డి ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కోరారు. కాంగ్రెస్ పార్టీని విడిచి వెళ్లాలనుకుంటున్నానని ప్రకటించి సంచలనం సృష్టించిన జగ్గారెడ్డితో గురువారం భట్టి సమావేశమయ్యారు. సీఎల్పీ కార్యాలయ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం... సీఎల్పీ కార్యాలయానికి రావాలని జగ్గారెడ్డికి భట్టి ఫోన్ చేసి ఆహ్వానించారు. శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కూడా ఉంటారని, కూర్చుని మాట్లాడుకుందామని చెప్పడంతో జగ్గారెడ్డి గురువారం మధ్యాహ్నం సీఎల్పీ కార్యాలయానికి వచ్చారు. అప్పటికే అక్కడ ఉన్న భట్టి, శ్రీధర్‌బాబులతో సమావేశమయ్యారు. కొద్దిసేపటి తర్వాత ఈ భేటీకి రాజగోపాల్‌రెడ్డి కూడా హాజరయ్యారు. పార్టీలో జరుగుతున్న అంతర్గత పరిణామాలపై నలుగురు నేతలు మాట్లాడుకోవడంతోపాటు వ్యక్తిగతంగా తమ అభిప్రాయాలను కూడా పంచుకున్నారు. జగ్గారెడ్డి స్పందిస్తూ పార్టీ లో కొన్ని ఇబ్బందులున్నాయని చెప్పుకొచ్చారు. ఇబ్బందులతోపాటు తన ఆవేదనను కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంకాగాంధీలతో చెప్పుకుంటానని, వారి అపాయింట్మెంట్ లభించే వరకు ఆగుతానని స్పష్టం చేశారు. అయితే, వీరి అపాయింట్మెంట్ బాధ్యతను సీఎల్పీ నేతగా భట్టి తీసుకోవాలని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు సూచించగా కచ్చితంగా పార్టీ అధిష్టానంతో మాట్లాడి అపాయింట్మెంట్ ఖరారు చేయిస్తానని భట్టి హామీ ఇచ్చారు. ఒకవేళ కాంగ్రెస్‌ను వీడితే వేరే పార్టీలోకి వెళ్లే ఆలోచన ఏమైనా ఉందా అని ముగ్గురు ఎమ్మెల్యేలు జగ్గారెడ్డిని ప్రశ్నించగా అలాంటిదేమీలేదని ఆయన స్పష్టం చేశారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడి వెళితే మాత్రం కొత్త పార్టీ పెట్టుకుంటానని వారికి చెప్పారు. నేడు కార్యకర్తలతో భేటీ కానున్న జగ్గారెడ్డి జగ్గారెడ్డి శుక్రవారం సంగారెడ్డి నియోజకవర్గంలోని కార్యకర్తలతో భేటీ కానున్నారు. సంగారెడ్డిలోని ఓ ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో కార్యకర్తలు, నేతల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత వచ్చే నెలలో నిర్వహించిన బహిరంగ సభ తేదీ, స్థలాన్ని ఖరారు చేయనున్నట్టు సమాచారం. -
ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యవహారం.. రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యవహారంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగ్గారెడ్డి తమ నాయకుడని, ఆయనకు పార్టీ నేతలందరం అండగా ఉంటామన్నారు. సోమవారం గాంధీ భవన్లో రేవంత్ విలేకరులతో మాట్లాడుతూ జగ్గారెడ్డి వ్యవహారం తమ కుటుంబ సమస్య అని, అందరం కలసి మాట్లాడుకుంటామన్నారు. ఆయనపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం గురించి సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. సోషల్ మీడియాలో వ్యతిరేకంగా పోస్టులు వచ్చా యని కుంగిపోవద్దని, తనపైనా గతంలో ఇలాంటి పోస్టులు వచ్చాయన్నారు. జగ్గారెడ్డి రాజకీయాల్లో రాకముందు నుంచే ఆయనతో పరిచయం ఉందని, ఆయన మంచి స్నేహితుడన్నారు. జగ్గారెడ్డి పార్టీ అధిష్టానం అపాయింట్మెంట్ కోరారని, ఆయనతో పార్టీ పెద్దలు మాట్లాడుతున్నారని వివరించారు. కాగా, జగ్గారెడ్డి 2, 3 రోజుల్లో నియోజకవర్గ కార్యకర్తలతో భేటీ కావాలని నిర్ణయించారు. నలుగురు మహిళలకు మంత్రి పదవులు... రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే నలుగురు మహిళా నేతలకు కీలక మంత్రి పదవులు కేటాయిస్తామని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఏఐసీసీ మహి ళా కాంగ్రెస్ పిలుపునిచ్చిన ‘లడ్కీ హూ... లడ్ సక్తీ హూ’కార్యక్రమం గాంధీ భవన్లో జరిగింది. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా రేవంత్‌రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, అంతకుముందు గాంధీ భవన్ నుంచి నాంపల్లి వరకు పార్టీ మహిళా నేతలు ర్యాలీ చేపట్టారు. -
కోపం లేదు.. ఆవేదనే!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోని యా గాంధీ, రాహుల్‌ల అపాయింట్మెంట్ లభిస్తే ఢిల్లీ వెళ్లి వారికే తన ఆవేదనను చెప్తానని, తనకు అపాయింట్మెంట్ ఇప్పించే బాధ్యత పార్టీ పెద్ద లదేనని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఆదివారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ పార్టీలో జరుగు తున్న పరిణామాలకు మనస్తాపం చెంది తాను రో డ్డు మీదకు వచ్చానని చెప్పారు. జగ్గారెడ్డి రోడ్డు మీ దకు ఎందుకు వచ్చాడో.. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ తేల్చాలని పేర్కొన్నా రు. తనకు కాంగ్రెస్ పార్టీపై, పార్టీ నాయకత్వంపై కోపం లేదని, తన ఆవేదన చెప్పుకోవాలనేదే ప్రధా న ఉద్దేశమని స్పష్టం చేశారు. ఇంకెవరితో సమావే శమయ్యేది లేదని, తన ఆట ప్రారంభమయిందని, సింగిల్‌గా ఆడడం తనకు ఇష్టమని, తన ఆట ఎలా ఉంటుందో చూపిస్తానని వ్యాఖ్యానించారు. తన సమస్య టీకప్పులో తుపాన్ లాంటిదని పీసీసీ అధ్యక్షుడు వ్యాఖ్యానించడంలో తప్పు లేదని, కానీ తన పంచాయ తీకి మూలం ఎక్కడ ఉందో వెతకడం లేదని అన్నారు. తాను పార్టీలో ఉన్నా.. వెళ్లిపోయినా ఇబ్బంది లేదని పీసీసీ ప్రధాన కార్యదర్శి హర్కర వేణుగోపాల్ మాట్లాడినట్టు తన దృష్టికి వచ్చిందని, తన సమస్య గురించి కాంగ్రెస్ పార్టీలోని ఎవరూ సిల్లీగా మాట్లాడవద్దని సూచించారు. దమ్మున్నోడు ఎవరు పార్టీ పెట్టినా తెలంగాణలో పొలిటికల్ స్పేస్ ఉందని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. అందుకే కాంగ్రెస్ మిత్రపక్షాలను కలుస్తున్నారు యూపీఏ అనుబంధ పార్టీల నేతలను కలవడం ద్వారా తాను బీజేపీ మనిషిననే అభిప్రాయం పోగొ ట్టుకోవాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారని జగ్గారెడ్డి అన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలను కలుస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీతో నేరుగా కొట్లాడుతున్నది కేవలం స్టాలిన్, మమతా బెనర్జీలే అని చెప్పారు. రైతు ఉద్యమకారుడు టికాయత్ కూడా కేసీఆర్ బీజేపీ మనిషే.. అని చెప్పిన విష యాన్ని జగ్గారెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. -
రాజీనామాపై జగ్గారెడ్డి దిమ్మతిరిగే ట్విస్ట్
-
పార్టీని వీడొద్దని జగ్గారెడ్డిని బుజ్జగిస్తున్నపార్టీ సీనియర్ నేతలు
-
వెళ్తారా.. ఉంటారా?
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి రాజీనామా ఉదంతంతో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా ఉలికిపాటుకు గురైంది. ఇలాంటి సీనియర్ నేత వెళ్లిపోతే పార్టీకి నష్టమని, రాజకీయంగా పలుచన అవుతామని ముఖ్య నాయకుల్లో అభిప్రాయం వ్యక్తమైంది. టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీనియర్ నేతలు దామోదర రాజనర్సింహ, పొన్నాల, శ్రీధర్‌బాబు, గీతారెడ్డి, వీహెచ్, సంపత్, దాసోజు శ్రవణ్, మర్రి శశిధర్‌రెడ్డి, సర్వే సత్యనారాయణ తదితర నేతలు జగ్గారెడ్డికి ఫోన్‌చేసి రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. వీహెచ్, పీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్ జగ్గారెడ్డిని కలిసి బుజ్జగించే ప్రయత్నం చేశారు. బొల్లు కిషన్ ఏకంగా జగ్గారెడ్డి కాళ్లు పట్టుకుని పార్టీని వీడొద్దని కోరారు. ముఖ్య నేతల విజ్ఞప్తితో జగ్గారెడ్డి కొంత మెత్తబడ్డారని పార్టీ వర్గాలు చెప్తున్నా.. తాను త్వరలో రాజీనామా చేస్తానంటూ సోనియా, రాహుల్‌లకు లేఖ రాయ డం గమనార్హం. మరోవైపు శనివారం రాత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో జగ్గారెడ్డి భేటీ అయ్యారు. ఈ సంద ర్భంగా పార్టీలోనే కొనసాగాలని ఉత్తమ్ కోరారు. అధిష్టానం ఆరా.. జగ్గారెడ్డి ఉదంతంపై ఏఐసీసీ కూడా ఆరా తీస్తోంది. రేవంత్‌రెడ్డితో విభేదాలున్నంత మాత్రాన రాజీనామా చేసేంతవరకు విషయం ఎందుకు వెళ్లిందన్న దానిపై ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి కేసీ వేణుగోపాల్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్‌లు ముఖ్య నాయకులతో మాట్లాడినట్టు సమాచారం. హైకమాండ్ జోక్యం చేసుకుని పరిష్కరిస్తే జగ్గారెడ్డి పార్టీలో కొనసాగతారని వారు పెద్దలకు వివరించినట్టు తెలిసింది. అయితే పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మాత్రం ఈ వివాదం టీకప్పులో తుపాను వంటిదేనని వ్యాఖ్యానించడం గమనార్హం. మీడియాలో వద్దు: మాణిక్యం ఠాగూర్ ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నిర్ణయం మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులెవరూ మీడియా ద్వారా అధిష్టానానికి ఫిర్యాదు చేయడంగానీ, అభిప్రాయాలను చెప్పడంగానీ చేయవద్దని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ స్పష్టం చేశారు. ఎవరైనా పార్టీ అంతర్గత సమావేశాల్లో స్వేచ్ఛగా తమ అభిప్రాయం వ్యక్తం చేయవచ్చని.. సమష్టి నిర్ణయాలనే మీడియాకు వెల్లడించాలని ట్విట్టర్లో సూచించారు. బయటికెళ్తే పార్టీ పెడతా: జగ్గారెడ్డి తాను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వెళితే కొత్త రాజకీయ పార్టీ పెడతానని జగ్గారెడ్డి ప్రకటించారు. శనివారం తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడారు. తనవల్ల పార్టీకి నష్టం జరుగుతుందనే ప్రచారానికి ఫుల్స్టాప్ పెట్టేందుకే రాజీనామా నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. సొంత పార్టీలోవారే తనపై బురద జల్లుతున్నా కనీసం ఖండించేవారు లేకపోవడం మనస్తాపం కలిగించిందన్నారు. తాను పార్టీని వీడితే కాంగ్రెస్‌కు వచ్చే నష్టమేమీ లేదని, తనను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్న వారికి ఇదే విషయాన్ని వివరిస్తున్నానని చెప్పారు. అయి తే తన రాజీనామా నిర్ణయంపై ఢిల్లీ వెళ్లి వచ్చాక నిర్ణయం తీసుకుంటానని జగ్గారెడ్డి శనివారం రాత్రి తెలిపారు. పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ నివాసంలో పలువురు కాంగ్రెస్ నేతలతో భేటీ అనంతరం ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందులతోనేనా? జగ్గారెడ్డి ప్రస్తుతం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్టు ఆయన సన్నిహితులు చెప్తున్నారు. తనకు అప్పులు పుట్టడం లేదంటూ స్వయంగా జగ్గారెడ్డి పలుమార్లు బహిరంగంగానే పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన కాంగ్రెస్‌ను వీడినా.. టీఆర్ఎస్లో చేరకుండా, తటస్థంగా ఉంటూ ప్రభుత్వంలో తన పనులు చేసుకునే యోచనలో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. సంగారెడ్డి జిల్లా పరిధిలో సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాల పనులను ప్రారంభించేందుకు సీఎం కేసీఆర్ సోమవారం వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో జగ్గారెడ్డి రాజీనామా ప్రకటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జగ్గారెడ్డి రాజీనా మా చేస్తే.. టీఆర్ఎస్లో చేరుతారా? తటస్థం గా కొనసాగుతారా? అన్న చర్చ జరుగుతోంది. -
నా వల్లే ప్రాబ్లమ్ అయితే నేను వెళ్లిపోతా..
-
కాంగ్రెస్‌కు జగ్గారెడ్డి గుడ్‌బై?
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి కాంగ్రెస్‌ను వీడాలని నిర్ణయించుకున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవితోపాటు ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేయనున్నారు. దీనిపై శనివారం అధికారిక ప్రకటన విడుదల చేయనున్నారు. ఈ మేరకు సంగారెడ్డి నియోజకవర్గ ముఖ్య నాయకులు, తన అనుచరులకు జగ్గారెడ్డి సమాచారం ఇచ్చారని.. అయితే ఇప్పటికిప్పుడు వేరే పార్టీలో చేరే ఆలోచనలో లేరని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీని వీడనున్న అంశాన్ని జగ్గారెడ్డి కూడా ధ్రువీకరించారు. శనివారం వివరాలను వెల్లడిస్తామన్నారు. రేవంత్‌రెడ్డితో పొసగకనే..! టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో పొసగకపోవడం తోపాటు.. ముక్కుసూటిగా మాట్లాడే తనను కోవర్టుగా చిత్రీకరించారనే మనస్తాపంతోనే జగ్గారెడ్డి రాజీనామా నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ నియామకాన్ని వ్యతిరేకించిన జగ్గారెడ్డి.. అధిష్టానం తనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించడంతో సర్దుకుపోవాలని భావించారు. కానీ హుజూరాబాద్ ఉప ఎన్నిక సహా పలు అంశాలపై రేవంత్ వైఖరిని బహిరంగంగానే తప్పుపట్టారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో తనకు సమాచారం ఇవ్వకుండా రేవంత్ పర్యటించడంపై తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు. రేవంత్‌ను తప్పించాలంటూ పార్టీ అధిష్టానానికి లేఖలు రాశారు. ఈ విషయం మీడియాలో రావ డంతో పార్టీ అధిష్టానం జగ్గారెడ్డిని మందలించింది. దీనికితోడు రాష్ట్ర నేతలు కూడా జోక్యం చేసుకుని సర్దిచెప్పడంతో.. తాను రేవంత్ గురించి మాట్లాడబోనని జగ్గారెడ్డి ప్రకటించారు. అయితే.. రేవంత్‌ను వ్యతిరేకిస్తుండటం, పలు అంశాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణయాలకు అనుకూలంగా మాట్లాడటం తో.. సోషల్ మీడియాలో జగ్గారెడ్డిపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆయన టీఆర్ఎస్ కోవర్టు అన్నట్టుగా ప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్ని జగ్గారెడ్డి ఖండించారు. ఇలా చాలా అంశాల్లో రేవంత్ వర్గంతో ఆయనకు విభేదాలు కొనసాగుతూ వచ్చాయి. భార్య చెప్పిన విషయంతో.. రేవంత్‌రెడ్డితో మనస్పర్థలు, ఇతర విభేదాలు ముందునుంచే ఉన్నా.. గురువారం సాయంత్రం జగ్గారెడ్డికి ఆయన సతీమణి నిర్మలారెడ్డి చేసిన ఫోన్‌కాల్ తాజా నిర్ణయానికి కారణమైనట్టు వారి సన్నిహితులు చెప్తున్నారు. గురువారం నిర్మలారెడ్డి దగ్గరి బంధువు వివాహం జరిగింది. సాయంత్రం 4 గంటల సమయంలో హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి.. తర్వాత సంగారెడ్డికి వెళ్లి.. స్థానికంగా పలు కార్యక్రమాల్లో పాల్గొ న్నారు. నిర్మలారెడ్డి బంధువు వివాహానికి మాత్రం వెళ్లలేకపోయారు. ఆ సమయంలో జగ్గారెడ్డికి నిర్మలారెడ్డి ఫోన్ చేశారు. ఈ సందర్భంగా ఆమె చెప్పిన విషయమే.. కాంగ్రెస్‌కు జగ్గారెడ్డి రాజీనామా నిర్ణయానికి కారణమైందని సన్నిహితులు చెప్తున్నారు. సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ చేపట్టిన నిరసనలను జగ్గారెడ్డి తప్పుపట్టిన నేపథ్యంలో.. నియోజకవర్గంలోని ఇద్దరు కీలక అనుచరులు నిర్మలారెడ్డికి ఫోన్‌చేసి మాట్లాడారని, జగ్గారెడ్డి తీరు సరికాదన్నట్టుగా మాట్లాడారని అంటున్నారు. ‘‘మేడమ్.. మన సార్ మాట్లాడుతున్నది వాస్తవమే. అయినా కొన్ని విషయాలు ప్రచారంలోకి వస్తున్నాయి. జగ్గారెడ్డి టీఆర్ఎస్ కోవర్టు అనే ప్రచారం ఎక్కువ అవుతోంది. ఇది మంచిది కాదు. పార్టీ కోసం మాట్లాడి నిందల పాలవుతున్నారు. కష్టకాలంలోనూ జగ్గారెడ్డి పార్టీ కోసం ఉన్నారు. ఏదైనా మాట్లాడాలనుకుంటే ఆయన్ను పార్టీ నుంచి బయటకు వచ్చి మాట్లాడాలని చెప్పండి’’ అని అనుచరులు పేర్కొ న్నట్టు చెప్తున్నారు. నిర్మలారెడ్డి ఈ విషయాన్ని జగ్గారెడ్డికి వివరించారని ఆయన సన్నిహితులు అంటున్నారు. తన నియోజకవర్గంలోనే ఇలాంటి అభిప్రాయం ఉన్నందున.. తాను కాంగ్రెస్‌లో కొనసాగి పార్టీకి నష్టం చేయడం మంచిది కాదని జగ్గారెడ్డి అభిప్రాయానికి వచ్చారని చెప్తున్నారు. -
విలువల్లేని బీజేపీకి విమర్శించే అర్హత లేదు
సాక్షి, హైదరాబాద్: ‘గాంధీ, నెహ్రూ, ఇందిర, రాజీవ్ గాంధీలతో దేశ ప్రజలకు రాజకీయ బంధం కంటే రక్త సంబంధంతో సమానమైన అవిభాజ్య బంధం ఉంది. కాంగ్రెస్ పార్టీ త్యాగధనుల పార్టీ. పదవులను త్యాగం చేసి మన్మోహన్‌ను ప్రధానిని చేసిన ఘనత గాంధీ కుటుంబానిది. బీజేపీలో అద్వానీని ప్రధానమంత్రిగా చేయగలరా? విలువల్లేని బీజేపీకి కాంగ్రెస్ పార్టీని విమర్శించే అర్హత లేదు’అని సంగారెడ్డి ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం అసెంబ్లీ మీడియా హాల్లో ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్, బీజేపీ సహా ఏ పార్టీ నేతలైనా కాంగ్రెస్‌ను విమర్శిస్తే ఊరుకునేది లేదని, రాహుల్, ప్రియాంకలను ఎవరు విమర్శించినా కడిగి పారేస్తామని పేర్కొన్నారు. ఈసారి కూడా తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయని, కేసీఆర్ ముందస్తు ఎన్నికలకే వెళ్తారని భావిస్తున్నానని అన్నారు. సాధారణ ఎన్నికలకు వెళ్తే ఎమ్మెల్యే, ఎంపీలకు ఒకేసారి పోలింగ్ ఉంటుందని, ఈ కోణంలో 2023 ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో ఎన్నికలకు వెళ్తారని అనుకుంటున్నానని చెప్పారు. దేశంలో ఎన్ని ఫ్రంట్లు వచ్చినా వాటికి కాంగ్రెస్ పార్టీ మద్దతు అవసరమని అన్నారు. రాహుల్ గాంధీని ఉద్దేశించి అస్సాం సీఎం చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ స్పందించడంలో తప్పేమీ లేదని, గాంధీ కుటుంబం దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబమని, అందుకే ఆ కుటుంబాన్ని విమర్శించినందుకు కేసీఆర్ స్పందించి ఉంటారని అభిప్రాయపడ్డారు. నిరుద్యోగానికి, పుట్టిన రోజుకు ఏం సంబంధం? సీఎం కేసీఆర్‌కు జగ్గారెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి తన పుట్టినరోజును జరుపుకోవడంలో తప్పేమీ లేదని, నిరుద్యోగానికి, పుట్టినరోజుకు ఏం సంబంధమని ప్రశ్నించారు. అయితే ఉద్యోగాలు ఇస్తానని చెప్పి కేసీఆర్ మాట తప్పారని, తెలంగాణ నిరుద్యోగ యువతను కేసీఆర్ మోసం చేశారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ధర్నాల గురించి తనకు తెలియదని, తాను ఈ మధ్యకాలంలో ఎక్కువగా నియోజకవర్గానికే పరిమితం అవుతున్నందున ఆ విషయం తనకు తెలియలేదని చెప్పారు. రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కలసిపోవడం కాంగ్రెస్ పార్టీకి మంచి పరిణామమని జగ్గారెడ్డి పేర్కొన్నారు. -
శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వ వైఫల్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని, పోలీసులు పోలీసుల్లాగా పనిచేయకపోవడంతో ప్రజల్లో రక్షణ భావం లేకుండా పోతోందని కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) ఆరోపించింది. వెంటనే గవర్నర్ జోక్యం చేసుకుని టీఆర్ఎస్ నేతల ఒత్తిళ్లకు తలొగ్గకుండా రాష్ట్రంలోని పోలీసులు ప్రజల పక్షాన పనిచేసేలా చూడాలని కోరింది. ఈ మేరకు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, సీతక్కలు మంగళవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. పాల్వంచకు చెందిన రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య, వామనరావు, నాగమణి అడ్వొకేట్ దంపతుల హత్య, నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య, దిశ అత్యాచార ఘటన, హాజీపూర్‌కు చెందిన శ్రీనివాస్‌రెడ్డి అనే వ్యక్తి మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడడం, హన్మకొండలో 9 నెలల బాలికపై అత్యాచారం, మరియమ్మ లాకప్‌డెత్, శీలం రంగయ్య లాకప్‌డెత్ లాంటి అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు. 2021లో కేసుల సంఖ్య పెరిగిందని స్వయంగా డీజీపీ మహేందర్‌రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గణాంకాలతో సహా వెల్లడించారని గుర్తుచేశారు. గత కొన్ని నెలలుగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనేక ఆందోళనలకు పిలుపునిస్తే హౌస్ అరెస్టులు చేసి పార్టీ నేతలను బయటకు రానీయకుండా చేస్తున్నారని, ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో మభ్యపెడుతూ పోలీసులు ప్రతిపక్ష నేతలు, ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. -
బీజేపీకి లేని కోవిడ్ ఆంక్షలు కాంగ్రెస్‌కేల?
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ సర్కారు ద్వం ద్వ నీతిని పాటిస్తోందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహా రాల ఇంచార్జి మాణిక్యం ఠాగూర్ విమర్శించారు. సంఘ్ పరివార్ సమావే శానికి 300 మంది నేతలు హాజరైతే వారికి రక్షణ కల్పించి మరీ అనుమతినిచ్చారని, తాము 120– 150 మంది నాయకులకు శిక్షణ కార్యక్రమం కోసం దరఖాస్తు చేసుకుంటే అనుమతి నిరాకరించారని శుక్రవారం ట్వీట్ చేశారు. ఢిల్లీలో దోస్తీ చేస్తున్న టీఆర్ఎస్, బీజేపీలు ఇప్పుడు గల్లీలో కూడా దోస్తీ చేస్తున్నాయని అన్నారు. కాగా, మాణిక్యం ఠాగూర్ ట్వీట్‌పై రాష్ట్ర డీజీపీ స్పందించాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. సంఘ్ పరివార్ కార్య కర్తల సమావేశానికి అనుమతిచ్చి తమకెందుకు ఇవ్వరని ప్రశ్నించారు. -
రాజీనామా చేస్తా.. జగ్గారెడ్డి సంచలన ప్రకటన
-
ఆ వార్తల్లో ఏది నిజం, ఏది అబద్దమో నేను చెప్పను: ఎమ్మెల్యే జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: పార్టీలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయంటూ కొన్ని రోజులుగా పార్టీ నేతలపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గురువారం మీడియా ముందుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'మీడియాకు ఎవరు ఏం చెప్తున్నారో నాకు తెలియదు. పీఏసీ మీటింగ్‌లో ఏం జరిగిందో నేను చెప్పను. నా ఆవేదనను ఇంఛార్జ్ ఠాగూర్‌కు తెలియజేశా. నాపై వస్తున్న వార్తల్లో ఏది నిజం, ఏది అబద్దమో నేను చెప్పను. సోనియా, రాహుల్ గాంధీలను కలవడానికి అపాయింట్మెంట్ అడుగుతా. సోనియా, రాహుల్ గాంధీల నాయకత్వంలో జీవితాంతం పనిచేస్తా. నా వల్ల పార్టీలో ఎవరైనా ఇబ్బందులు పడితే.. ఇండిపెండెంట్‌గా ఉంటా తప్పితే.. మరో పార్టీలోకి వెళ్ళను. పార్టీని డ్యామేజ్ చేయాలనే ఆలోచన నాకు లేదు. నన్ను ఎవరు డ్యామేజ్ చేయాలని చూసినా కాంగ్రెస్‌ను వీడాలని నాకు లేదు. నా రాజీనామాపై వస్తున్న వార్తలను సమర్థించను, ఖండించను. నాతో వీహెచ్, భట్టి, శ్రీధర్ బాబు, మహేశ్వర్ రెడ్డి మాట్లాడారు.. కానీ ఆ విషయాలు బయటకు చెప్పను. కాంగ్రెస్నా జాగిరి కాదు. రేవంత్ రెడ్డి జాగిరి కాదు. సోనియా జాగిరి. ఈ నెల 20 తర్వాత భవిష్యత్ కార్యచరణ ఉంటుంది. గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ప్లాట్లను, పర్మిషన్లేని ఇళ్లను రెగ్యులరైజ్ చేయాలని గతంలో సీఎంకు లేఖ రాశా. పాత లే అవుట్లను రెగ్యులరైజ్ చేయండి.. కొత్త లేఅవుట్ లు చేయకుండా చర్యలు తీసుకోండి అని కోరా. ప్రభుత్వం నుంచి ఎటువంటి నిర్ణయం రాలేదు. ఈ నెల 8న ఉదయం 10 నుంచి 4 గంటల వరకు ఇందిరాపార్కులో దీక్ష చేస్తా. కోవిడ్ నిబంధనలకు లోబడి దీక్ష చేస్తా. పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకున్నా దీక్ష చేస్తాను' అని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. -
కోటి హోం ఐసోలేషన్ కిట్లు.. రెండు కోట్ల టెస్టింగ్ కిట్లు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఒమిక్రాన్ వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు వైద్య, ఆరోగ్యశాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోందని ఆ శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. కోటి హోం ఐసోలేషన్ కిట్ల(ఎనిమిది రకాల మందుల)ను పీహెచ్‌సీల్లో అందుబాటులో ఉంచుతామని చెప్పారు. ఎంతమందికైనా కరోనా నిర్ధారణ పరీక్షలు చేసేందుకు రెండు కోట్ల కరోనా టెస్టింగ్ కిట్లు కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. మంగళవారం జరిగిన సంగారెడ్డి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి హరీశ్‌రావు హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ ఫస్ట్‌వేవ్‌లో కరోనా కేసుల సంఖ్య తారాస్థాయికి చేరడానికి 8 నెలలు పడితే, రెండో వేవ్‌లో నాలుగు నెలలే సమయం పట్టిందని, ఈ థర్డ్ వేవ్‌లో రెండు నెలల్లోనే కేసులు భారీ స్థాయికి చేరుతాయని వైద్యనిఫుణులు అంచనా వేస్తున్నారని వివరించారు. అరవై ఏళ్లు దాటినవారికి బూస్టర్ డోసు ఇచ్చే ప్రక్రియను ఈ నెల 10 నుంచి ప్రారంభిస్తామని మంత్రి హరీశ్ ప్రకటించారు. మాతాశిశు మరణాల రేటు తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ మూడో స్థానంలో ఉందని పేర్కొన్నారు. దశలవారీగా సబ్సెంటర్లలో వైద్యులను నియమించి పల్లె దవాఖానాలుగా మార్చుతామన్నారు. బంగారు తెలంగాణలో ఆరోగ్య తెలంగాణ ఒక భాగమని మంత్రి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 66 ఒమిక్రాన్ కేసులు నమోదుకాగా, అందులో 44మంది వ్యాక్సిన్ వేసుకోనివారేనని తెలిపారు. జగ్గారెడ్డి వచ్చారు.. వేదికపై కుర్చీ వేయండి.. రాజకీయ ప్రత్యర్థులుగా పేరున్న మంత్రి హరీశ్‌రా వు, సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డిల మధ్య ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. జెడ్పీ సమావేశం కొనసాగుతుండగా జగ్గారెడ్డి సమావేశం హాలులోకి రాగా.. ‘‘ఎమ్మెల్యే వచ్చారు.. వేదికపై కుర్చీ వేయండి’’అని హరీశ్‌రావు అన్నారు. అభివృద్ధి పనులు ప్రారంభ కార్యక్రమాలకు స్థానిక ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వాలని మంత్రి అధికారులను ఆదేశించారు. తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని హరీశ్‌రావుకు జగ్గారెడ్డి వినతిపత్రం అందజేశారు. ఏఎన్ఎంల పట్ల మంత్రి అసహనం.. ఉద్యోగుల కేటాయింపుల్లో తమను ఇతర జోన్లోకి మార్చారని, న్యాయం చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ ఏఎన్ఎంలు మంత్రి హరీశ్‌కు వినతిపత్రం అందజేయగా ఆయన తీవ్ర అసహనానికి లోనయ్యారు. వారి ముందే వినతిపత్రాన్ని చింపివేశారు. -
బానిసను కాను... నన్నెవరూ కొనలేరు
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్‌కు తాను కోవర్టునని, అందుకే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డినుద్దేశించి మాట్లాడుతున్నానని కొందరు చేస్తున్న ప్రచారంలో వాస్తవంలేదని సంగారెడ్డి ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి స్పష్టం చేశారు. కోవర్టునయితే ఇటీవలి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన భార్య నిర్మలను పోటీ చేయించి టీఆర్ఎస్పై ఎందుకు కొట్లాడతానని ప్రశ్నించారు. రాష్ట్రంలో పార్టీ నాయకత్వాన్ని దారిలో పెట్టేందుకే మాట్లాడుతున్నానని, ఎవరికీ బానిసను కాదని, తననెవరూ కొనలేరని జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇతరపార్టీల నేతలను కలిసినంత మాత్రాన వారి పార్టీ కండువాలు కప్పుకున్నట్టుగా మాట్లాడటం సరైంది కాదన్నారు. అదే నిజమైతే అసెంబ్లీలో మంత్రి కేటీఆర్, రేవంత్ ప్రేమికుల్లా చేతులు లాక్కుంటున్న ఫొటోలు మీడియాలో వచ్చాయని, వాటి సంగతేంటని ప్రశ్నించారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, కేటీఆర్‌లు చేతిలో చేయివేసుకుని మాట్లాడుకునే ఫొటోలు దేనికి సంకేతమని వ్యాఖ్యానించారు. ఇటీవల సంగారెడ్డిలో జరిగిన అధికారిక కార్యక్రమంలో తన నియోజకవర్గానికి నిధులివ్వాలని మంత్రి కేటీఆర్‌ను అడిగానని, ఇస్తారో ఇవ్వరో వాళ్ల ఇష్టమని అన్నారు. అందరిలా కేసీఆర్‌ను తాను తిట్టలేనని పేర్కొన్నారు. పీసీసీ అధ్యక్షుడంటే బస్సు డ్రైవర్లాంటివాడని, అలాంటి డ్రైవర్ బస్సును సరిగా నడపడం లేదని చెప్పడం కూడా తప్పేనా అని ప్రశ్నించారు. అన్ని విషయాలు ఈ నెల 5న జరిగే పార్టీ సమావేశంలో మాట్లాడతానని జగ్గారెడ్డి తెలిపారు. అనుమానాలు అవసరం లేదని, తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని స్పష్టం చేశారు. -
‘నేను కోవర్ట్ అయితే.. రేవంత్ కూడా కోవర్టే’
సాక్షి, హైదరాబాద్: మంత్రి కేటీఆర్‌కు కొవర్ట్ అంటూ తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. కొద్దిరోజుల క్రితం తన నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారని తెలిపారు. ఆ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ను నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కావాలని కోరినట్లు పేర్కొన్నారు. తన నియోజకవర్గ అధికార కార్యక్రమానికి వచ్చిన మంత్రితో తాను మాట్లాడిన అంశాన్ని కొందరు పనిగట్టుకొని నెగిటివ్ చేస్తున్నారని మండిపడ్డారు. నియోజకవర్గ అధికార కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఏ పార్టీ వారైనా సక్యతతో మెలగాల్సిందేని తెలిపారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు అధికార పార్టీ మంత్రులను నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు అడగకూడదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో చిల్లర బ్యాచ్ ఒకటి తయారైందని, టీఆర్ఎస్ పార్టీలోకి పోవాలంటే నేరుగా వెళ్తానని తప్పుడు ప్రచారం చేయొద్దని హెచ్చరించారు. పీసీసీలో నచ్చని అంశాలను సరిచేసుకోవాలని చెప్పడం తప్పా? అని నిలదీశారు. సీఎం కేసీఆర్‌ను చాలా విషయాల్లో వ్యతిరేకించినా.. పార్టీ మారుతున్నానని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను కోవర్ట్ అయితే.. రేవంత్ కూడా కోవర్టే అని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. -
కాంగ్రెస్‌లో జగ్గారెడ్డి ‘జగడం’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే జగ్గారెడ్డి దుమారం కొనసాగుతోంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యవహారశైలిని తప్పుపడుతూ ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీకి జగ్గారెడ్డి రాసిన లేఖ మీడియాకు లీకవడంపై పార్టీలో అంతర్గతంగా రచ్చ అవుతోంది. ఇది క్రమశిక్షణ ఉల్లంఘనని, జగ్గారెడ్డిని క్రమశిక్షణ కమిటీ ముందుకు పిలుస్తార ని వార్తలు ఓ వైపు.. అసలు రేవంత్‌నే క్రమశిక్షణ కమిటీకి ముందుకు పిలవాలన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలు మరోవైపు పార్టీలో మంటలు రేపుతున్నాయి. అసలేం జరిగింది?: రైతులతో రచ్చబండ కార్యక్రమంతో రాష్ట్ర కాంగ్రెస్‌లో చిచ్చు మొదలైంది. కిసాన్ సెల్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆ కార్యక్రమంలో భాగంగా సీఎం కేసీఆర్ ఫాంహౌస్ ఉన్న ఎర్రవెల్లికి వెళ్తానని రేవంత్ ప్రకటించారు. జిల్లాకు చెందిన నేతలకు కనీస సమాచారం ఇవ్వకుండా, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తనకు తెలియకుండా పీసీసీ చీఫ్ ఎర్రవెల్లికి ఎలా వెళ్తారని జగ్గారెడ్డి బాహాటంగా నిలదీశారు. తర్వాత రేవంత్ వ్యవహారశైలి మార్చాలని, లేకుంటే పీసీసీ చీఫ్‌నే మార్చాలని కోరుతూ పార్టీ అధినేత్రి సోని యాకు లేఖ రాశారు. ఆ లేఖ మీడియాకు లీకవడం పార్టీలో దుమారం రేపింది. దీనిని రేవంత్ సీరియస్‌గా తీసుకున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. క్రమశిక్షణా కమిటీ భేటీ అయి..: జగ్గారెడ్డి వ్యాఖ్యలు, లేఖ నేపథ్యం లో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ శుక్రవారం గాంధీభవన్‌లో సమావేశమై చర్చించింది. అనంతరం కమిటీ చైర్మన్ జి.చిన్నారెడ్డి మీడియాతో మాట్లాడారు. విభేదాలుంటే పార్టీలో అంతర్గతంగా చర్చించాలని, ఇన్చార్జులకు లేఖలు రాయవచ్చని, కానీ బహిర్గతం చేయడం సరికాదని పేర్కొన్నారు. సోనియాకు రాసిన లేఖ లీకవడాన్ని క్రమశిక్షణ ఉల్లంఘనగానే భావిస్తున్నామని, జగ్గారెడ్డిని పిలిచి వివరణ కోరుతామని చెప్పారు. ఇతర అంశాలపై జనగామ జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి, మంచిర్యాల డీసీసీ అధ్యక్షుడు ప్రేమ్‌సాగర్‌రావుతోనూ మాట్లాడతామన్నారు. పార్టీలో కొన్నిచోట్ల గ్రూపు రాజకీయాలు నడుస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, ఆయా ప్రాంతాల్లో కమిటీ పర్యటించి సమస్యల పరిష్కరిస్తుందని వెల్లడించారు. రేవంత్‌వి క్రమశిక్షణ కిందికి రావా?: జగ్గారెడ్డి పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి మీడియాతో మాట్లాడిన తర్వాత.. జగ్గారెడ్డి మీడియాకు విడుదల చేసిన ప్రకటన మరింత కాక రేపింది. ‘‘నా గురించి చిన్నారెడ్డి మాట్లాడినందునే.. నేను కూడా మీడియాకు ప్రకటన ఇస్తున్నాను. నేను సోనియాకు రాసిన లేఖ మీడియాకు లీకైతేనే క్రమశిక్షణ ఉల్లంఘన అయితే.. హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారం సమయంలో పార్టీ నియమాలను ఉల్లంఘించి మరీ పెద్దపల్లి అభ్యర్థిని ప్రకటించిన పీసీసీ అధ్యక్షుడు క్రమశిక్షణ పరిధిలోకి రారా? నా సొంత ఉమ్మడి జిల్లాలోని ఏకైక ఎమ్మెల్యే, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన నాకు చెప్పకుండా పార్టీ కార్యక్రమాన్ని ప్రకటిస్తే క్రమశిక్షణ కిందకు రాదా? వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం ఇన్‌చార్జినైన నాకు తెలియకుండా భూపాలపల్లిలో రచ్చబండకు వెళ్తున్నట్టు ప్రకటించడం ఏమిటి? అసలు క్రమశిక్షణ పాటించని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి క్రమశిక్షణ గురించి చెప్పాలి. మొదట రేవంత్‌రెడ్డిని పిలిచి మాట్లాడాలి.’’ అని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. ఆ తర్వాత తానూ కమిటీ ముందు హాజరవుతానని పేర్కొన్నారు. -
విద్యుత్ చార్జీల పెంపుపై వెనక్కి తగ్గాలి: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ చార్జీల పెంపు నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సంగారెడ్డి ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ యూనిట్‌కు 50 పైసలు పెంచి పేదలపై భారం వేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత డీజిల్, పెట్రో భారం పెరిగిందని, దీంతో అన్ని రకాల నిత్యావసరాలపై ప్రభావం పడిందని విమర్శించారు. దీనిపై పార్లమెంట్లో సోనియాగాంధీ నిలదీశారని జగ్గారెడ్డి గుర్తుచేశారు. కాగా, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పార్టీ పరంగా మంచి పనులు చేస్తే ప్రశంసిస్తానని, పొరపా టు చేస్తే ప్రశ్నిస్తానని జగ్గారెడ్డి తేల్చి చెప్పారు. సోనియాగాంధీకి తాను రాసిన లేఖ ఎలా లీక్ అయిందో తెలియదని, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని చెప్పారు. ఇంటర్ బోర్డు ముందు ధర్నా ఎట్లా చేశావు అంటే.. హైదరాబాద్ ఎవరి జాగీరు కాదని, వర్కింగ్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఎక్కడికైనా వెళ్తానని తేల్చి చెప్పారు. కాంగ్రెస్‌లో అంతర్గత పంచా యితీ కామన్ అని, పంచాయితీ లేకుంటే కాం గ్రెస్ వాళ్లంతా సైలెంట్‌గా ఉంటున్నారని ప్రజ లు అనుకుంటారని జగ్గారెడ్డి చమత్కరించారు -
అధిష్టానికి జగ్గారెడ్డి లేఖ.. మైండ్‌సెట్ మార్చండి.. లేదంటే ఆయన్నే మార్చండి
రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయడంలేదు. కార్పొరేట్ ఆఫీస్ తరహాలో పార్టీని నడుపుతున్నారు. దీనిలో ఏదో మతలబు ఉంది. పార్టీ నేతలందరినీ కలుపుకొని పోయి కార్యక్రమాలు నిర్వహించకుండా, వ్యక్తిగత ప్రతిష్ట కోసమే రేవంత్ ఆలోచిస్తున్నారు. దీనివల్ల రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ నేతలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పార్టీకి కూడా ప్రమాదకర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకోసం అందరినీ కలుపుకొని పోయి పనిచేసేలా పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మైండ్‌సెట్ మార్చాలని లేదంటే కాంగ్రెస్ లైన్లో పనిచేసే మరో నాయకుడిని కొత్త అధ్యక్షుడిగా నియమించాలని సంగారెడ్డి ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరారు. ఈ మేరకు ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీకి సోమవారం ఆయన లేఖ రాశారు. కాం గ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ, పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్‌లకు కూడా ఈ లేఖ ప్రతులను పంపారు. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయడం లేదని, కార్పొరేట్ ఆఫీస్ తరహాలో పార్టీని నడుపుతున్నారని సోనియాకు రాసిన లేఖలో జగ్గారెడ్డి పేర్కొన్నారు. దీనిలో ఏదో మతలబు ఉం దని అనుమానం వ్యక్తంచేశారు. పార్టీ నేతలందరినీ కలుపుకొని పోయి కార్యక్రమాలు నిర్వహించకుండా, తన వ్యక్తిగత ప్రతిష్ట కోసం మాత్రమే రేవంత్ ఆలోచిస్తున్నారని ఆరోపించారు. దీనివల్ల రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ నేతలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, పార్టీకి కూడా ప్రమాదకర పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ఏకైక ఎమ్మెల్యేగా ఉన్న తనకు కనీస సమాచారం ఇవ్వకుండానే రైతులను కలిసేందుకు వస్తానని మీడియాను ఇంటికి పిలిపించుకుని ప్రకటన చేశారని, ఈ విషయంలో జిల్లా నాయకులకు ఎవరినీ ఆయన సంప్రదించలేదని వివరించారు. ఇటీవల జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఆయన నాయకత్వంలో పార్టీ అభ్యర్థికి కేవలం 3 వేల ఓట్లు మాత్రమే వచ్చాయని, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఆయన పార్లమెంటు సభ్యుడిగా ఉన్న నియోజకవర్గంలో కూడా పోటీ చేయకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవని, కేవలం పార్టీ కోణంలో మాత్రమే ఆలోచించి ఈ విషయాలను అధిష్టానం దృష్టికి తీసుకువస్తున్నానని వెల్లడించారు. తాను ప్రస్తావించిన అంశాలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని, పార్టీ కోసం అందరినీ కలుపుకొని పోయి పనిచేయాల్సిందిగా రేవంత్‌కు సూచించాలని జగ్గారెడ్డి కోరారు. -
రేవంత్‌రెడ్డిని తప్పించండి.. జగ్గారెడ్డి లేఖ
హైదరాబాద్:తెలంగాణ కాంగ్రెస్‌లో లుకలుకలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై ఫిర్యాదు చేస్తూ సోనియా గాంధీ,రాహుల్ గాంధీలకు జగ్గారెడ్డి ఓ లేఖ రాశారు. రేవంత్ రెడ్డి పార్టీ నేతలను కలుపోకోపోకుండా వ్యక్తి గత ఇమేజ్ కోసం పాకులాడుతున్నాడని, పార్టీ నేతలతో చర్చించకుండా పార్టీ ప్రోగ్రామ్స్ అనౌన్స్ చేస్తున్నాడని జగ్గారెడ్డి ఆ లేఖలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఎర్రవల్లి ప్రోగ్రామ్ గురించి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న తనతో చర్చించలేదని జగ్గారెడ్డి ఆ లేఖలో అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. రేవంత్ రెడ్డి అందరినీ కలుపుకొని పోయేలా ఆదేశాలు ఇవ్వండి.. లేదంటే పీసీసీ చీఫ్ పదవి నుంచి రేవంత్ ను తొలగించి అందరినీ కలుపుకొనిపోయే మరోకరికి అవకాశం ఇవ్వండంటూ కాంగ్ అధిష్టానాన్ని లేఖలో జగ్గారెడ్డి కోరినట్లు సమాచారం. జగ్గారెడ్డికి సమాచారం ఇవ్వకపోవడాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంత రావు కూడ తప్పుబట్టారు. ఇదిలా ఉంటే గజ్వేల్ జిల్లా ఎర్రవెల్లి గ్రామంలో రచ్చబండకు వెళ్తుండగా పోలీసులు భారీ బందోబస్తుతో అడ్డుకొని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. -
2021: ఏడాదంతా రంజుగా రాజకీయం!
రాష్ట్ర రాజకీయాలు ఈ ఏడాది (2021) మరింత రంజుగా సాగాయి. ఒకట్రెండు ఎదురుదెబ్బలు తగిలినా అధికార టీఆర్ఎస్ హవా కొనసాగడం ఓవైపు.. కొత్త పీసీసీ చీఫ్ రాకతో కాంగ్రెస్‌లో ఉత్సాహం, అధిష్టానం అండతో రాష్ట్ర బీజేపీ దూకుడు మరోవైపు వేడి పుట్టించాయి. నాగార్జునసాగర్, హుజూరాబాద్ ఉప ఎన్నికలు, మినీ మున్సిపోల్, ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఇలా ఏడాదంతా జరిగిన ఎన్నికల ప్రక్రియ ఈ వేడిని ఎక్కడా తగ్గనివ్వలేదు. దాదాపు అన్ని ఎన్నికల్లో గులాబీ పార్టీ హవానే కొనసాగినా.. హుజూరాబాద్ ఉప ఎన్నిక మాత్రం షాకిచ్చింది. ఈ ఏడాది ద్వితీయార్ధంలో కొత్త అధ్యక్షుడి రాకతో పుంజుకున్న కాంగ్రెస్ పార్టీ అడపాదడపా వివిధ కార్యక్రమాలు, పోరాటాలతో తామూ ఆప్షన్‌గా ఉన్నామని చెప్పుకొనే ప్రయత్నం చేసింది. కానీ ప్రతి ఎన్నికలోనూ ఓటమి ఆ పార్టీని ఎదురుదెబ్బ తీసింది. గత ఏడాది చివరలో దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల విజయాలతో బీజేపీలో వచ్చిన జోష్ ఈ ఏడాదీ కనిపించింది. పాదయాత్రలు, బహిరంగ సభలు, ఆందోళనలు, ఇతర కార్యక్రమాలు చేపట్టింది. రాష్ట్రంలో ఈ మూడు ప్రధానపక్షాలు పోగా.. మిగతా పార్టీల ప్రభావం నామమాత్రంగానే మారిపోయింది. టీటీడీపీ ఉనికి కోల్పోయే పరిస్థితికి చేరగా.. తెలంగాణ జన సమితి, సీపీఐ, సీపీఎం, ఇతర వామపక్షాల కార్యకలాపాలేమీ పెద్దగా కనిపించలేదు. అయితే 2021లో కొత్త రాజకీయ పార్టీ తెరపైకి వచ్చింది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల నేతృత్వంలో వైఎస్సార్టీపీ ఏర్పాటైంది. – సాక్షి, హైదరాబాద్ టీఆర్ఎస్ అన్నింటా కారే.. గత ఏడాది చివర్లో దుబ్బాక ఉప ఎన్నికలో ఓటమి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు చవిచూసిన టీఆర్ఎస్.. 2021లో ఒక్క హుజూరాబాద్ ఉప ఎన్నిక మినహా ఏడాదంతా హవా చూపింది. పార్టీని గాడినపెట్టి, మరింత బలోపేతం చేయడంపై టీఆర్ఎస్ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. సభ్యత్వ నమోదు, సంస్థాగత కమిటీల ఏర్పాటు, ప్లీనరీ వంటి కార్యాచరణ అమలు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్యవర్గం, ముఖ్య నేతలతో అడపాదడపా సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం చేశారు. పార్టీకోసం కృషి చేస్తున్న నేతలకు వరుసగా నామినేటెడ్ పదవులు ఇచ్చారు. పలు అంశాల్లో స్వయంగా తానే ముందుండి పార్టీని నడిపించారు. దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయం ‘తెలంగాణ భవన్’కు శంకుస్థాపన చేశారు. ఊరూరా పార్టీ జెండా పండుగ నిర్వహించి సంస్థాగత కమిటీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. కరోనా నేపథ్యంలో రెండేళ్లపాటు ఆవిర్భావ వేడుకలు, ప్లీనరీకి దూరంగా ఉన్న టీఆర్ఎస్.. అక్టోబర్ 25న హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో ఘనంగా ప్లీనరీ నిర్వహించుకుంది. కేసీఆర్ పార్టీ అధ్యక్షుడిగా వరుసగా 9వసారి ఎన్నికయ్యారు. గత ఏడాది చివర్లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు సాధించినా.. మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఫిబ్రవరి 11న జరిగిన ఎన్నికలో మేయర్‌గా గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌గా మోతె శ్రీలత ఎంపికయ్యారు. ఇక ఏప్రిల్‌లో వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతోపాటు మరో ఐదు మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో మొత్తం మేయర్, చైర్మన్ స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. వరంగల్ మేయర్‌గా మాజీ ఎంపీ గుండు సుధారాణి, ఖమ్మం మేయర్‌గా పునుకొల్లు నీరజ ఎన్నికయ్యారు. ‘సాగర్’లో నిలబడి.. నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అనారోగ్యంతో మరణించడంతో.. ఆ స్థానానికి ఈ ఏడాది ఏప్రిల్ 17న ఉప ఎన్నిక జరిగింది. నోముల నర్సింహయ్య కుమారుడు నోముల భగత్‌ను టీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ ఎంపిక చేశారు. తాను స్వయంగా ఒక సభలో పాల్గొని ప్రచారం చేశారు. అక్కడ కాంగ్రెస్ తరఫున సీనియర్ నేత జానారెడ్డి పోటీలో ఉండటంతో కొంత ఉత్కంఠ నెలకొంది. కానీ పక్కా వ్యూహంతో వ్యవహరించిన కేసీఆర్.. నోముల భగత్‌ను 18,872 ఓట్ల తేడాతో గెలిపించుకున్నారు. ‘ఎమ్మెల్సీ’లన్నీ క్లీన్‌స్వీప్ చేసి.. ఈ ఏడాది ఫిబ్రవరి మొదలుకుని డిసెంబర్ దాకా వేర్వేరు సందర్భాల్లో జరిగిన శాసనమండలి ఎన్నికల్లో టీఆర్ఎస్ క్లీన్‌స్వీప్ చేసింది. ఎన్నిక జరిగిన 21 సీట్లనూ కైవసం చేసుకుంది. రెండు పట్టభద్రుల కోటా సీట్లకు మార్చిలో ఎన్నిక నిర్వహించగా.. ‘నల్లగొండ– వరంగల్– ఖమ్మం’స్థానంలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ‘హైదరాబాద్– రంగారెడ్డి– మహబూబ్‌నగర్’స్థానంలో మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కుమార్తె సురభి వాణీదేవి విజయం సాధించారు. తర్వాత నవంబర్‌లో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను టీఆర్ఎస్ క్లీన్‌స్వీప్ చేసింది. మరోవైపు స్థానికసంస్థల కోటా ఎమ్మెల్సీల్లో 12 మంది సభ్యులు 2022 జనవరి 4న పదవీ విరమణ చేయనుండటంతో.. ఎన్నికల సంఘం డిసెంబర్లో ఎన్నిక నిర్వహించింది. టీఆర్ఎస్ ఇందులో ఆరు సీట్లను ఏకగ్రీవంగా.. మరో ఆరు సీట్లను పోలింగ్‌లో గెలుచుకుని.. మరోసారి క్లీన్‌స్వీప్ చేసింది. టీడీపీని ఖాళీ చేసి.. తెలంగాణ అసెంబ్లీకి టీడీపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు ఎన్నికవగా.. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గతంలోనే టీఆర్ఎస్లో చేరారు. టీటీడీపీకి మిగిలిన ఏకైక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర్రావు (అశ్వారావుపేట) ఏప్రిల్ 7న టీఆర్ఎస్లో చేరారు. సండ్ర, మెచ్చా లేఖ ఇవ్వడంతో టీడీపీ శాసనసభాపక్షం టీఆర్ఎస్లో విలీనమైంది. ఇక టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ కూడా టీఆర్ఎస్లో చేరారు. సీనియర్ నేతలు ఇనుగాల పెద్దిరెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, కాంగ్రెస్ నేతలు పాడి కౌశిక్‌రెడ్డి, చల్మెడ లక్ష్మీనర్సింహారావు కూడా గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. మరోవైపు వివిధ సందర్భాల్లో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, తుల ఉమ, గట్టు రామచందర్‌రావు తదితరులు టీఆర్ఎస్ను వీడారు. ‘మరో పదేళ్లూ నేనే సీఎం’ దుబ్బాక, జీహెచ్ఎంసీ ఫలితాల నేపథ్యంలో.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారంటూ వార్తలు వచ్చాయి. ఫిబ్రవరి 7న తెలంగాణభవన్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కీలక ప్రజాప్రతినిధులు, నేతలతో నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశం సందర్భంగా సీఎం కేసీఆర్ ఆ ప్రచారానికి స్వయంగా చెక్ పెట్టారు. ‘‘శారీరకంగా, ఆలోచనాపరంగా పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను. మరో పదేళ్లూ నేనే సీఎంగా ఉంటా.. ఏదైనా ఉంటే అందరితో చెప్పి నిర్ణయం తీసుకుంటా. పార్టీలో ఎవరైనా సీఎం మారుతారంటూ కామెంట్లు చేస్తే తోలుతీస్తా. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే బయటికి పంపిస్తా’’అని స్పష్టం చేశారు. ‘ఈటల’ఎపిసోడ్‌తో కుదుపు ఆవిర్భావం నాటి నుంచీ టీఆర్ఎస్లో కొనసాగి కీలక నేతగా ఎదిగిన ఈటల రాజేందర్ ఎపిసోడ్ టీఆర్ఎస్లో భారీ కుదుపునకు కారణమైంది. ‘గులాబీ జెండాకు మేమే ఓనర్లం’ అంటూ ఈటల చేసిన వ్యాఖ్య లు వివాదాస్పదమయ్యాయి. తర్వాత ఈటల, ఆయన కుటుంబ సభ్యులు భూఆక్రమణలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో కేసీఆర్ మే 1న ఈటలను మంత్రివర్గం నుంచి తప్పించారు. జూన్‌లో ఈటల టీఆర్ఎస్కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దీంతో అప్రమత్తమైన కేసీఆర్ హుజూరాబాద్‌లో పార్టీ కేడర్ చేజారకుండా చర్యలు చేపట్టారు. కానీ హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటల 23,855 ఓట్ల తేడాతో గెలుపొందారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో ఢీ ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంలోని బీజేపీతో టీఆర్ఎస్ ఢీ అంటే ఢీ అన్నట్టుగా వ్యవహరించింది. నవంబర్ 1న మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధర్నాలు చేశారు. తర్వాత సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. కొనుగోళ్లపై కేంద్రం స్పష్టత ఇవ్వాలంటూ నవంబర్ 18న ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేశారు. భారత రైతాంగ సమస్యలపై పోరాటానికి టీఆర్ఎస్ నాయకత్వం వహిస్తుందని ప్రకటించారు. కేంద్రం వైఖరిని నిరసిస్తూ డిసెంబర్ 20న ఊరూరా చావుడప్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ ఊపొచ్చినా రూపురాలే..! కొన్నేళ్లుగా స్తబ్దుగా ఉండిపోయిన కాంగ్రెస్ పార్టీలో 2021 కొంత కదలిక తెచ్చింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నియామకం ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ ఏడాది జూలై 7న రేవంత్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పార్టీ పక్షాన విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టి.. కేడర్‌లో కదలిక తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే సీనియర్ల సహాయ నిరాకరణ, అంతర్గత కలహాలు, సర్దుబాట్లతో కాంగ్రెస్ నావ ఎటూ కదలకుండా చిక్కుబడిపోయిందన్న అభిప్రాయాలు ఆ పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి గత ఏడేళ్లుగా ఎదురవుతున్న ఎన్నికల ఫలితాలే 2021లోనూ పునరావృతం అయ్యాయి. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో ఆ పార్టీ సీనియర్ నేత కె.జానారెడ్డి ఓడిపోగా.. హుజూరాబాద్ ఉప ఎన్నికలో నిర్లక్ష్యం గట్టిదెబ్బ తీసింది. ఇక్కడ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్‌కు 3 వేల ఓట్లు మాత్రమే రావడంతో కేడర్ నిరాశలో పడింది. అంతకుముందు మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఆశించిన ఫలితాలను రాబట్టలేకపోయింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ పరాజయం పాలైంది. అయితే ఇటీవలి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం.. తాము పోటీచేసిన రెండు చోట్లా తమకు ఉన్న ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు సాధించి ఊరట పొందింది. ధర్నాలు, నిరసనలతో జనంలోకి.. 2021లో కాంగ్రెస్ పలు కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేసింది. దళితబంధు పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని, గిరిజనులకు కూడా ఆ పథకాన్ని వర్తింపజేయాలనే డిమాండ్‌తో ఆగస్టు 9న ఇంద్రవెల్లి వేదికగా దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా మోగించింది. ఇదే కార్యక్రమాన్ని కొనసాగిస్తూ సెప్టెంబర్ 17న సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ వేదికగా భారీ సభ నిర్వహించింది. పోడు భూములపై అక్టోబర్ 5న భారీ రాస్తారోకో, 20 నియోజకవర్గాల్లోని పోడు రైతులతో ఆందోళన చేసింది. అంతకుముందు సెప్టెంబర్ 22న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ.. ఇందిరాపార్కు వద్ద కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. సీపీఎం, సీపీఐ, టీజేఎస్, ఇంటిపార్టీ, న్యూడెమొక్రసీ పార్టీలతోపాటు పలు ప్రజా, కుల సంఘాలు కూడా ఆ ఆందోళనలో పాల్గొన్నాయి. ఇక నిరుద్యోగ, విద్యార్థి జంగ్ సైరన్ పేరుతో ఉద్యోగాలు, స్కాలర్‌షిప్‌ల కోసం అక్టోబర్ 2న ఎల్బీనగర్లోని శ్రీకాంతాచారి విగ్రహం వద్ద కాంగ్రెస్ చేపట్టిన కార్యక్రమం ఉద్రిక్తతలకు దారి తీసింది. తర్వాత ఒకట్రెండు యూనివర్సిటీల్లో ఇదే అంశంపై సదస్సులు నిర్వహించారు. అయితే డిసెంబర్ 9న రాహుల్‌గాంధీతో పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించాలనుకున్న సభ సాధ్యం కాలేదు. ఏడాది చివరిలో రాష్ట్ర రాజకీయాల్లో రచ్చరేపిన ధాన్యం కొనుగోళ్ల అంశంలోనూ కాంగ్రెస్ క్రియాశీలకంగానే వ్యవహరించింది. ఇందిరాపార్కు వేదికగా రెండ్రోజుల పాటు దీక్ష చేసిన ఆ పార్టీ నేతలు.. అటు బీజేపీకి, ఇటు టీఆర్ఎస్కు దీటుగానే కౌంటర్ ఇచ్చారు. తప్పని అసమ్మతి, అలకలు కాంగ్రెస్ పార్టీలో తరచూ కనిపించే అసమ్మతి, అలకలు 2021లోనూ ఎదురయ్యాయి. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ నియామకాన్ని ఇష్టపడని పలువురు నేతల నుంచి సహాయ నిరాకరణ ఎదురైంది. ఆయా నేతలను రేవంత్ బుజ్జగించినా పరిస్థితిలో మార్పు రాలేదు. దీనిపై చర్చించేందుకు టీపీసీసీ ముఖ్య నేతలను పార్టీ అధిష్టానం ఢిల్లీకి పిలిపించాల్సి వచ్చింది. పార్టీ కోర్ కమిటీ స్థానంలో ఈ ఏడాది సెప్టెంబర్ 12న టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీని ఏర్పాటు చేసి.. షబ్బీర్ అలీని కన్వీనర్‌గా నియమించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలందరికీ అందులో స్థానం కల్పించింది. ఇక ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఈ ఏడాది ఎక్కువగా వార్తల్లో నిలిచారు. పీసీసీ అధ్యక్ష పదవి అడిగి వర్కింగ్ ప్రెసిడెంట్‌తో సరిపెట్టుకున్న ఆయన.. తనదైన శైలిలో రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు. రేవంత్ పట్ల తన అభిప్రాయాన్ని బాహాటంగా చెప్తూ వచ్చారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం సభ్యత్వ నమోదులో బిజీగా ఉంది. బీజేపీ మరింత జోష్ 2020 చివరిలో వచ్చిన గెలుపుతో 2021లోకి ప్రవేశించిన బీజేపీ.. అదే ఊపును కొనసాగించింది. జాతీయ నాయకత్వం మద్దతు ఓవైపు.. రాష్ట్రంలో సమకూరుతున్న బలం మరోవైపు ఆ పార్టీకి మరింత జోష్‌ను ఇచ్చాయి. అదే క్రమంలో వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఏడాది పొడవునా ఆందోళనలు, ఉద్యమాలు, వివిధ కార్యక్రమాలు చేపట్టింది. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, వైఫల్యాలను లక్ష్యంగా చేసుకుంది. సై అంటే సై అంటూ పోటాపోటీ కార్యక్రమాలు చేపట్టింది. రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీనే అంటూ జనంలోకి వెళ్లింది. ఆయా కార్యక్రమాలకు జాతీయ నేతలను రప్పించింది. హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని సెప్టెంబర్ 17న అధికారికంగా నిర్వహించాలనే డిమాండ్‌తో టీఆర్ఎస్ సర్కార్‌పై ఒత్తిడి పెంచేందుకు, రాష్ట్రంలో మెజారిటీ వర్గం ఓటు బ్యాంకును కొల్లగొట్టేందుకు బీజేపీ అగ్రనేత అమిత్‌షాతో నిర్మల్‌లో సభ నిర్వహించింది. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేసింది. బీజేపీ ఈ ఏడాది రాజకీయంగా పలు ఎత్తుపల్లాలు చవిచూసింది. మొదట్లో నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో ఓటమి, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోవడం, మున్సిపల్ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు సాధించలేకపోవడం వంటి ఎదురుదెబ్బలు తగిలాయి. అయితే ఆగస్టు చివరిలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో చేపట్టిన ‘ప్రజా సంగ్రామ యాత్ర’కేడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. సీఎం కేసీఆర్, మంత్రులపై బండి సంజయ్, ఇతర ముఖ్య నేతలు నేరుగా విమర్శలు, ఆరోపణలు సంధిస్తూ, సవాళ్లు విసురుతూ.. టీఆర్ఎస్ నాయకత్వం తప్పనిసరిగా స్పందించాల్సిన పరిస్థితులు కల్పించారు. తద్వారా జనంలో బీజేపీ వైపు దృష్టి మరలేలా చేయగలిగారు. ఇకముందు కూడా ఇదే ఊపు కొనసాగించేందుకు బీజేపీ ఏర్పాట్లు చేసుకుంది. 2022 ఏడాది మొదట్లోనే రెండో విడత పాదయాత్ర చేపట్టి.. పెట్రోల్‌పై రాష్ట్ర వ్యాట్ తగ్గింపు, దళితబంధు అమలు, ఎస్టీలకు రిజర్వేషన్లు పెంపు, ఉద్యోగ నోటిఫికేషన్లు, నిరుద్యోగ భృతి అంశాలపై పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాలని నిర్ణయించింది. హుజూరాబాద్ గెలుపు నుంచి.. టీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చిన ఈటల రాజేందర్.. బీజేపీ తరఫున బరిలోకి దిగి హుజూరాబాద్‌లో విజయం సాధించడంతో ఆ పార్టీలో నూతనోత్సాహం నెలకొంది. టీఆర్ఎస్ పెద్దలు సర్వశక్తులూ ఒడ్డినా, భారీగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు చేసినా ఈటల విజయం సాధించడాన్ని అనుకూలంగా మల్చుకోవడంపై దృష్టిపెట్టింది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీనే అనే ప్రచారం మొదలుపెట్టింది. ఇందుకు బీజేపీ జాతీయ నాయకత్వం కూడా అండదండలు అందించడంతో.. కొత్త కార్యక్రమాలపై దృష్టి కేంద్రీకరించింది. కిషన్‌రెడ్డికి కేబినెట్ హోదాతో.. కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా ఉన్న జి.కిషన్‌రెడ్డికి ఈ ఏడాది కేంద్ర కేబినెట్ మంత్రి హోదా లభించింది. పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖలను ఆయనకు అప్పగించారు. తెలంగాణ ఏర్పడ్డాక, అంతకు ముందు కూడా తెలంగాణ ప్రాంతానికి చెందిన బీజేపీ నేతలెవరికీ ఇలా కేంద్ర కేబినెట్ హోదా లభించలేదు. దీనిని బట్టి రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి ఇస్తున్న ప్రాధాన్యత ఏమిటో స్పష్టమైంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాషాయజెండా ఎగరవేయాలనే లక్ష్యంతో బీజేపీ జాతీయ నాయకత్వం ముందుకు వెళుతోంది. వైఎస్సార్టీపీ కొత్త ఆశలతో.. తెలంగాణలో ఈ ఏడాది మరో కొత్త పార్టీ తెరపైకి వచ్చింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల తానూ రంగంలో ఉన్నానంటూ ‘వైఎస్సార్టీపీ’పార్టీని స్థాపించారు. పార్టీని ప్రారంభించినప్పటి నుంచీ ఆమె ప్రజల్లోనే ఉంటూ వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. నిరుద్యోగ దీక్షలు, పాదయాత్రలు, రైతు ఆవేదన దీక్షలు నిర్వహిస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతులు, ఇతర బాధితుల కుటుంబాలను పరామర్శించి ఓదార్చుతున్నారు. తాను అండగా నిలుస్తానంటూ భరోసా ఇస్తున్నారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, ప్రభుత్వ పెద్దల తీరుపై గట్టి విమర్శలు గుప్పిస్తున్నారు. ఇతర పార్టీల నుంచి ఆశించినమేర చేరికలు లేకపోయినా.. మెల్లగా ప్రస్థానాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. -
‘రచ్చబండ’కు నేను పోను: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం ఉన్న ఎర్రవెల్లి గ్రామంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సోమవారం చేపట్టిన ‘రచ్చబండ’కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నానని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రకటించారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన ఈ కార్యక్రమం గురించి ఆ జిల్లాలో ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యేనైన తనతో చర్చించకుండానే రేవంత్ ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించడానికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నానని ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ‘గతంలో ఇలాంటి విషయాలు మీడియా ముందు మాట్లాడొద్దని చెప్పేవారు. కానీ ఇలాంటి కార్యక్రమాల గురించి అందరితో చర్చించి నిర్ణయం తీసుకోకుంటే పార్టీకి నష్టం జరుగుతుంది. అందుకే నేను మీడియా ముందు ప్రకటన చేయాల్సి వచ్చింది’అన్నారు. ‘నాకు తెలియకుండా ప్రకటించిన రచ్చబండలో నేను కనపడకపోతే నా పట్ల రాంగ్ సిగ్నల్ పోతుంది. ఈ హక్కు రేవంత్‌కు ఎవరిచ్చారు’అని ప్రశ్నించారు. పీసీసీ అంటే అందరినీ విడదీసే పోస్టు కాదు పీసీసీ అంటే అందరినీ కలుపుకొనిపోయే పోస్టని, విడదీసే పోస్టు కాదని జగ్గారెడ్డి విమర్శించారు. ఇలాంటి కార్యక్రమాలు పీఏసీ మీటింగ్‌లో చర్చించకుండానే ప్రకటిస్తున్నాడని రేవంత్‌పై మండిపడ్డారు. ‘నిలదీస్తే అందరేమో బాధపడుతున్నారు. అంతర్గతంగానేమో ఇలాంటి విషయాలు జరుగుతున్నాయి’అన్నారు. పార్టీ అంతర్గత విషయాలు మీడియా ముందు ఇలా ప్రకటించడానికి చాలా బాధగా ఉందని చెప్పారు. ఇలాంటి నిర్ణయాలను తీవ్రంగా ఖండిస్తూ రేపు అధిష్టానానికి లేఖ రాస్తున్నట్టు వెల్లడించారు. తాను ఇన్చార్జిగా ఉన్న కరీంనగర్, వరంగల్, ఖమ్మం, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని నాయకులతో మాట్లాడి ఎక్కడైనా మిగిలిన వరి ధాన్యాల కుప్పలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. -
ఎండలో రైతులు.. ఏసీలో కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: రైతులు తాము పండించిన ధాన్యాన్ని పెట్టుకుని రోడ్లపై పడుకుంటే ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌లు హాయిగా ఇంట్లో పడుకుంటున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యా ఖ్యానించారు. రైతులు ఎండల్లో ఎండుతుంటే, కేసీఆర్ మాత్రం ఏసీలో ఉంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ ధాన్యం సమస్య టీఆర్ఎస్, బీజేపీలు కలిసి సృష్టించిందే అని ఆరోపించారు. దేశంలోని ప్రజలందరికీ ఆహారభద్రత కల్పించాలనే ఉద్దేశంతో నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఎఫ్‌సీఐ ద్వారా ధాన్యం కొనుగోలు ఏర్పాటు చేశారని చెప్పారు. కానీ, ఇప్పుడు రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకునేందుకు రోడ్లపై పడాల్సి రావడానికి బీజేపీ, టీఆర్ఎస్లే కారణమని విమర్శించారు. సీఎం ఢిల్లీ వెళ్తేనే పరిష్కారం కాని సమస్య, మంత్రులు వెళ్తే అవుతుందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులు తాము ఇష్టం వచ్చిన పంటను పండించుకునే వెసులుబాటు కల్పిస్తామని హామీ ఇచ్చారు. -
మాకు 400 ఓట్లు ఖాయం
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి మెదక్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిర్మలకు 400 ఓట్లు వస్తాయని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ తమ పార్టీకి చెందిన 230 మంది ఓటర్లతో పాటు ఇతర పార్టీలకు చెందిన 170 మంది తమకు ఓటేశారని అంచనా వేస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 230 ఓట్లు తమ అభ్యర్థినికి రాకపోతే అందుకు తానే బాధ్యత వహిస్తానన్నారు. ఫలితాలను చూశాక టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేయాలా వద్దా అనేది స్పందిస్తానని చెప్పారు. మంత్రి హరీశ్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికను ఏకగ్రీవం కాకుండా చేయడమే తమ మొదటి విజయమని చెప్పారు. ఈ ఎన్నికల ఫలితాలతో ట్రబుల్ షూటర్ హరీశ్‌రావు ట్రబుల్లో పడటం ఖాయమని వ్యాఖ్యానించారు. హరీశ్‌తో క్యాంపులు పెట్టించి టూరిస్ట్ బస్సు దగ్గరుండి ఎక్కించే పరిస్థితి తీసుకొచ్చామని జగ్గారెడ్డి చెప్పారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన వరి రైతు లేఖ రాసి ఆత్మహత్య చేసుకోవడం బాధ కలిగిస్తోందన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, వారి కోసం గాంధీభవన్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. -
కాంగ్రెస్‌లో ప్రతిఒక్కరం ప్రశాంత్‌కిశోర్‌లమే..
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి ప్రశాంత్‌కిశోర్ అవసరమే లేదని, గాంధీభవన్‌కు వచ్చి చూస్తే అక్కడ ఎంతమంది ప్రశాంత్‌కిశోర్‌లు ఉన్నారో తెలుస్తుందని సంగారెడ్డి ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం అసెంబ్లీ మీడియాహాల్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరు ఒక్కో ప్రశాంత్‌కిశోర్‌తో సమానమన్నారు. ప్రశాంత్‌కిశోర్ కనీస పరిజ్ఞానం లేకుండా తమ పార్టీ నేత రాహుల్‌గాంధీ గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్, టీఆర్ఎస్ల మధ్యే పోటీ ఉంటుందని, బీజేపీది మూడోస్థానమేనని అన్నారు. బీజేపీనే కాదు బీఎస్పీ కూడా తెలంగాణలో అధికారంలోకి వస్తానని చెప్పుకుంటోందని ఎద్దేవా చేశారు. జాతీయ రాజకీయాలెలా ఉన్నా తెలంగాణలో మాత్రం టీఆర్ఎస్తో కాంగ్రెస్‌కు దోస్తానా ఉండదని, ఉండేది కొట్లాటేనని స్పష్టం చేశారు. మెదక్ జిల్లాలో 230 ఓట్లున్న తమను చూసి టీఆర్ఎస్ భయపడుతోందని, అందుకే తామేదో చేస్తున్నామంటూ ఫిర్యాదు చేస్తోందని అన్నారు. -
యార్డుల్లో ఆకస్మిక తనిఖీలు చేయండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల లో ఎదురవుతున్న ఇబ్బందులను స్వయంగా తెలుసుకునేందుకు సీఎం కేసీఆర్ మార్కెట్ యార్డులను, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేయాలని సంగారెడ్డి ఎమ్మె ల్యే జగ్గారెడ్డి సూచించారు. ‘రాష్ట్రంలో ఇప్పటివరకు 40 శాతం ధాన్యమే కొన్నారు. ఇంకా 60 శాతం కొనాల్సి ఉంది. గోనె సంచులు, రవాణాకోసం లారీలులేక రైతులు రోజుల తర బడి వరి కుప్పల మీదే నిద్రించాల్సి వస్తోంది. మీరు ఆకస్మిక తనిఖీలు చేసి నేరుగా రైతులతో మాట్లాడితే క్షేత్రస్థాయి సమస్యలేంటో తెలుస్తాయి. రైతాంగ సమస్యలను పరిష్కరిస్తే మీకే మంచి పేరు వస్తుంది’అని అసెంబ్లీ మీడియా పాయింట్లో విలేకరులతో మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్పిన వారి ధాన్యాన్నే అధికారులు కొంటున్నారని, మిగిలిన రైతు లను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. -
‘ఓటు’ బదలాయింపునకు బాధ్యులెవరు?
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఘోర పరాభవం కాంగ్రెస్‌కు ఒకదాని మీద మరో సమస్యను తెచ్చిపెడుతోంది. ఈ ఎన్నికల్లో ఓటమిపై ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ నేతలతో ఏఐసీసీ జరిపిన సమీక్షకు కరీంనగర్ పార్లమెంట్ ఇన్చార్జి జగ్గారెడ్డిని ఆహ్వానించకపోవడం మరో జగడానికి తెరతీసింది. మూడుసార్లు ఎమ్మెల్యేగా, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, అనుబంధ సంఘాల ఇన్చార్జిగా, 4 పార్లమెంట్ స్థానాలకు ఇన్చార్జిగా ఉన్న తనకు శనివారం ఢిల్లీలో జరిగిన భేటీ గురించి కనీస సమాచారం ఇవ్వలేదంటూ ఆయన శనివారం ఏఐసీసీకి లేఖ రాయడం చర్చనీయాంశమైంది. ఈ భేటీకి తనను ఆహ్వానించకపోవడం బాధ కలిగించిందని, అందుకే లేఖ రాస్తున్నానని తెలిపారు. ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జీ కేసీ.వేణుగోపాల్‌తో పాటు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, మాణిక్యం ఠాగూర్, బోసురాజు, శ్రీనివాసకృష్ణన్‌కు పంపిన ఈ లేఖలో హుజూరాబాద్ ఉప ఎన్నికకు సంబంధించిన పలు అంశాలను లేవనెత్తారు. ఈ ఎన్నికల్లో స్థానిక అభ్యర్థిని పోటీకి ఎందుకు దింపలేదని, చివరి నిమిషంలో బల్మూరి వెంకట్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన నేతలు 3 నెలల ముందు ఆ పని ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఆర్థికంగా బలహీనంగా ఉన్న అభ్యర్థిని నిలబెట్టి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టిలు ఆయనకు సాయం ఎందుకు చేయలేదని, కాంగ్రెస్ పార్టీ ఓట్లు బీజేపీకి, ఈటల రాజేందర్‌కు ఎలా బదిలీ అయ్యాయో చెప్పాలన్నారు. దీనికి బాధ్యులెవరని ఆ లేఖలో ఆయన ప్రశ్నించారు. తాను ఇదే విషయాన్ని ఫలితం వచ్చిన రోజు మీడియాతో మాట్లాడానని, ఆ తర్వాతి రోజు జరిగిన పీఏసీ సమావేశంలో కూడా లేవనెత్తానని లేఖలో వెల్లడించారు. మీడియాతో ఎందుకు మాట్లాడతారని కొందరు నేతల అభిమాన సంఘాలు సోషల్‌మీడియాలో తనను ఆ రోజు ప్రశ్నించాయని, మరి ఢిల్లీలో శనివారం జరిగిన సమావేశం గురించి మీడియాకు లీకులు ఎలా వచ్చాయని, అలా రావడం తప్పు కాదా అని ప్రశ్నించారు. ఆవేదనతోనే కొన్ని విషయాలను పంచుకుంటూ ఈ లేఖను రాస్తున్నట్లు జగ్గారెడ్డి ఏఐసీసీకి వెల్లడించారు. -
ఈ రోజు లాస్ట్ మీటింగ్.. గాంధీ భవన్లో మాట్లాడాలా వద్దా అనేది తేల్చుకుంటా
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాలు కాంగ్రెస్ పార్టీలో చిచ్చు రాజేశాయి. హుజూరాబాద్ ఉపఎన్నిక ఘోర పరాజయం నేపథ్యంలో బుధవారం గాంధీభవన్‌లో కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశమైంది. ఆ సమావేశంలో.. క్యాడర్‌ను కూడా కాపాడుకోలేని స్థితిలో పార్టీ ఉందంటూ పలువరు సీనియర్లు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ సమక్షంలో భేటీ కొనసాగుతోంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2023 వరకు పార్టీ వ్యవహారాలకు, కార్యాక్రమాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. ఇవాళ్టి సమావేశంలో చివరి సారిగా తాను మాట్లాడతానని చెప్పారు. చదవండి: (నాలాంటి కష్టం శత్రువుకి కూడా రావొద్దు: ఈటల) 'నాకు ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం అలవాటు. వాస్తవాలు చెప్తే.. నాపై అబాండాలు వేస్తున్నారు. ఓ సెక్షన్ మీడియా నన్ను టార్గెట్ చేసింది. వాస్తవాలు చెప్తే నేరమన్నట్లుగా తప్పుపడుతున్నారు. ఒక్కోసారి మాట్లాడక పోవడమే మంచిదనిపిస్తుంది. ఈ రోజు లాస్ట్ మీటింగ్‌లో ఏదోటి తేల్చుకుంటా. గాంధీ భవన్లో మాట్లాడాలా వద్దా అనేది ఈ రోజు డిసైడ్ అవుద్ది. నేను మాట్లాడకపోతే పోయేదేంలేదు. నా సీటు నేను ఎలా గెలవాలా అని ఆలోచిస్తున్నా. ఇక నుంచి అంతర్గత వ్యవహారాలపై మాట్లాడను. షోకాజ్ నోటీసులు ఇస్తారా అనేది చూద్దాం. మాణిక్కం ఠాగూర్‌కు ఏం తెలియదు. మంచి చెప్తే వినకపోతే నాదేం పోతుంది. అన్ని విషయాలు లోపల మాట్లాడ్తా. నా బలహీనతే ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం. హుజూరాబాద్‌కు స్టార్లు, సూపర్ స్టార్లు పోతేనే దిక్కు లేదు నేను పోతే ఓట్లు పడతాయా..?' అని జగ్గారెడ్డి అన్నారు. చదవండి: (Huzurabad Bypoll: కాంగ్రెస్‌లో కాక రేపుతున్న ‘హుజురాబాద్’ ఫలితం) -
గాంధీభవన్‌లో ‘సదర్’ వేడుకలు
సాక్షి, హైదరాబాద్: దీపావళి సందర్భంగా యాదవ కులస్తులు ఘనంగా జరుపుకునే సదర్ పండుగ వేడుకలను సోమవారం గాంధీభవన్‌లో నిర్వహించారు. యూత్‌కాంగ్రెస్ ఆలిండియా కార్యదర్శి ఎం.అనిల్‌కుమార్ యాదవ్ నేతృత్వంలో పెద్దఎత్తున యాదవులు గాంధీభవన్‌కు వచ్చారు. దున్నపోతుల ప్రదర్శనతో వచ్చిన యాదవులకు కాంగ్రెస్ నేతలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిలు దున్నపోతులపై ఎక్కి అభివాదం చేస్తూ సందడి చేశారు. పెద్ద సంఖ్యలో యాదవులు, కాంగ్రెస్ కార్యకర్తలు తరలిరావడంతో సోమవారం మధ్యాహ్నం సమయంలో కొంతసేపు గాంధీభవన్‌లో సదర్ కోలాహలం కనిపించింది. -
గాంధీభవన్‌లో బతుకమ్మ సంబురాలు
సాక్షి, హైదరాబాద్: గాంధీభవన్‌లో బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో శనివారం మధ్యాహ్నం బతుకమ్మలు పేర్చి మహిళలు ఆటలు ఆడి, పాటలు పాడి సందడి చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ, తెలంగాణ ఆడపడుచుల పూల పండుగను ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళా సోదరీమణులు ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ అందరి కుటుంబాల్లో సంతోషం నింపాలని కోరారు. సంగారెడ్డి ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి తన సతీమణి, సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు నిర్మలారెడ్డితో కలిసి బతుకమ్మ ఆడి ఉత్సాహాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు, కోఆర్డినేటర్ నీలం పద్మతో పాటు పలువురు మహిళా నేతలు పాల్గొన్నారు. -
ఆయన ఓ హెడ్మాస్టర్.. మేం విద్యార్థులం
సాక్షి, హైదరాబాద్: ముఖ్య మంత్రి కేసీఆర్‌ను అసెంబ్లీ హెడ్మాస్టర్గా కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అభి వర్ణించారు. సభసమ యంలో శుక్రవారం సీఎల్పీకి వచ్చిన జగ్గారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ‘‘అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఓ హెడ్మాస్టర్. మేమంతా ఆయన విద్యా ర్థులం. సీఎం సాబ్ అసెంబ్లీలో పాఠాలు చెబుతున్నారు కానీ మాకు అర్థం అయ్యేలా కానీ, మేం పాసయ్యేలా కానీ బోధించడంలేదు. మాకే దైనా డౌట్ వచ్చినా ఆ హెడ్మాస్టర్ని అడగ డానికి అవకాశం లేదు. నిండుసభలో ఇదీ మా పరిస్థితి. ప్రజలు అర్థం చేసుకోవాలి మరి’’అని సరదాగా వ్యాఖ్యానించారు.