సాక్షి, హైదరాబాద్: కలెక్టర్‌ను చంపాలని బీఆర్‌ఎస్ కుట్ర చేసిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. కలెక్టర్ డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి ఆయనన కాపాడారన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పథకం ప్రకారమే కలెక్టర్‌పై దాడి జరిగిందన్నారు. పదేళ్ల అధికారంలో ఉన్నప్పుడు పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రజలపై బీఆర్ఎస్ దాడులు చేసిందన్నారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి బీఆర్ఎస్ కార్యకర్తలతో అధికారులపై దాడులు చేస్తున్నారు. దాడులకు ప్రతి దాడులు ఉంటాయి. అభివృద్ధిని అడ్డుకుంటే ఊరుకునేది లేదు. బీఆర్ఎస్ నేతలకు మా తడాకా ఏంటో చూపిస్తాం’’ అంటూ హెచ్చరించారు.
మరోవైపు, బీఆర్‌ఎస్ అరాచక శక్తులతో కలిసి కుట్రపూరితంగా దళిత, గిరిజన రైతులను రెచ్చగొట్టి లగచర్లలో జిల్లా కలెక్టర్, ఆర్డీవో స్థాయి అధికారిపై దాడి చేయించిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు తలకిందులుగా తపస్సు చేసినా ఈ ప్రభుత్వాన్ని అస్థిరపర్చలేరని చెప్పారు. లగచర్ల ఘటనలో నిందితుల కాల్ డేటాను సేకరించగా, బీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసిన అభ్యర్థి ఉన్నట్టు తేలిందన్నారు. దీని వెనుక ఎంతటి పెద్దవారున్నా ఉపేక్షించేది లేదని, చట్టప్రకారం కఠినంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఏ కేసులోనైనా అరెస్ట్ కావొచ్చు.. పోరాటాలకు సిద్ధమవ్వండి: కేటీఆర్
Comments
Please login to add a commentAdd a comment