సాక్షి, తెలంగాణభవన్: తనను ఏదో ఒక కేసులో అరెస్ట్ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఈ నేపథ్యంలో పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉండాలని బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులకు కేటీఆర్ సూచించారు.
మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తెలంగాణభవన్‌లో నేడు పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు. లగచర్ల ఘటనకు సంబంధించిన రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరు ఉండటంతో దీనిపై పార్టీ నేతలు చర్చించారు. ఒకవేళ కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తే భవిష్యత్ కార్యచరణపై చర్చించారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్‌ఎస్ నేతలను టార్గెట్ చేసింది. నన్ను అరెస్ట్ చేసేందుకు పలు డ్రామాలకు తెరలేపుతున్నారు. ఏదో ఒక కేసులో నన్ను అరెస్ట్ చేసేందుకు రేవంత్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. పోరాటం చేసేందుకు బీఆర్‌ఎస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలి. పోరాటాలు మనకేమీ కొత్త కాదు అని నేతలకు సూచించారు.
మరోవైపు.. లగచర్ల కేసులో అరెస్టయిన కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని హరీశ్‌రావు పరామర్శించారు. ఈ సందర్భంగా హరీష్ మీడియాతో మాట్లాడుతూ.. కుట్రపూరితంగా నరేందర్‌రెడ్డిని అరెస్ట్ చేయించారు. కొడంగల్ నుంచే ప్రజాపాలన మీద తిరుగుబాటు మొదలైంది. ఈ అరెస్ట్ ప్రభుత్వ దిగజారుడుతనానికి ఇదే నిదర్శనం. మీకు ఓటేస్తే మేలు జరుగుతుందనుకుంటే పాపానికి.. లగచర్ల గ్రామం భూములను గుంజుకోవడమే నువ్వు చేసే మేలా?. కాంగ్రెస్ నాయకులు అబద్దాలు వల్లే వేస్తున్నారు. ఎక్కడ ఏం జరిగినా బీఆర్‌ఎస్‌పై పెడుతున్నారన్నారు. రేవంత్ సొంత నియోజకవర్గంలో తమ భూముల కోసం గిరిజనులు పోరాటం చేస్తే అది కూడా బీఆర్‌ఎస్ చేసిందనే అంటున్నారన్నారు. ప్రజలకు అన్యాయం జరిగితే పోరాడడం ప్రతిపక్షాలుగా మా బాధ్యత అన్నారు. మాపై కోపం ఉంటే మమ్మల్ని అరెస్ట్ చేయండి.. కానీ అమాయక గిరిజన రైతులపై కేసులెలా పెడతారని ప్రశ్నించారు. వెంటనే గిరిజన రైతులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా? అని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment