
సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ కార్యదర్శి విష్ణుపై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మండిపడ్డారు. ఇన్‌ఛార్జ్‌లు పార్టీని చంపేయాలని చూస్తున్నారా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత రాత్రి ఓ ఫంక్షన్‌లో ఏఐసీసీ కార్యదర్శిపై ఆయన మాటల దాడి చేశారు. ఇంతకీ మీరు ఏఐసీసీ కార్యదర్శిగా ఉన్నారా..? వేరే రాష్ట్రం వెళ్ళిపోయారా..? అంటూ జగ్గారెడ్డి ప్రశ్నించారు.
మెదక్ జిల్లా కూడా నేనే చూస్తున్నానంటూ విష్ణు చెప్పగా, పార్టీ ఇన్‌ఛార్జ్ దీపా దాస్ మున్షీ కూడా ఉన్నారా.. వేరే రాష్ట్రం పోయారా..?. అధికార పార్టీ అంటే ఎలా ఉండాలి? మీరేం చేస్తున్నారో అర్థం అవుతుందా? అంటూ జగ్గారెడ్డి నిలదీశారు. కొత్త వాళ్లకు పదవులు సిఫార్సు చేస్తున్నారు. వారు ఫైనల్ అయ్యే వరకు కూడా మాకు తెలియడం లేదంటూ కార్యదర్శికి జగ్గారెడ్డి ధ్వజమెత్తారు.

ఇదీ చదవండి: లగచర్ల రైతుకు సంకెళ్లు.. సీఎం రేవంత్ సీరియస్
Comments
Please login to add a commentAdd a comment