
సాక్షి, హైదరాబాద్: లగచర్లకు చెందిన రైతు హీర్యానాయక్ ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చికిత్స కోసం రైతుకు బేడీలు వేసి సంగారెడ్డి ఆసుపత్రికి పోలీసులు తీసుకెళ్లడంపై సీరియస్ అయ్యారు. ఘటనపై అధికారులతో ఆరా తీసిన సీఎం. వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ప్రజా ప్రభుత్వం ఇలాంటి చర్యలను సహించదని రేవంత్ హెచ్చరించారు.

ఇదెక్కడి పాలన?: హరీష్‌రావు
మరోవైపు, రేవంత్ సర్కార్‌పై మాజీ మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. లగచర్ల రైతు ఉగ్రవాదా? లేక దోపిడీ దొంగా?. ఇదెక్కడి పాలన అంటూ నిప్పులు చెరిగారు. చేతికి బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకెళ్తారా. రైతుల పట్ల ఇంత కర్కశంగా వ్యవహరిస్తారా?. భూములు గుంజుకొని తిరగబడితే అరెస్ట్ చేశారు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం, ఇదేనా ప్రజాపాలన’ అంటూ హరీష్‌రావు ట్వీట్ చేశారు.
దేశానికి అన్నం పెట్టే రైతన్న చేతికి బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ దుర్మార్గ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం.
అనారోగ్యంతో బాధపడుతున్న లగచర్ల రైతుకు బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకువెళ్లడం హేయమైన చర్య.
ఇంత కంటే దారుణం ఏముంటుంది. రైతు హీర్యా నాయక్ ఉగ్రవాదా..? లేక దోపిడీ దొంగనా..?… pic.twitter.com/qJQG14Cbwq— Harish Rao Thanneeru (@BRSHarish) December 12, 2024
Comments
Please login to add a commentAdd a comment