Revanth redddy
-
‘మూసీ బాధితుల ఆక్రందనలు ఇప్పుడు గుర్తొచ్చాయా?’
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి రక్షణ కవచంగా కమలదళం వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. దోస్తును కాపాడేందుకు చీకటి రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ఈ మేరకు కేటీఆర్ ఆదివారం ‘ఎక్స్’ వేదికగా కాంగ్రెస్-బీజేపీలపై మండిపడ్డారు.‘ వారెవా తోడు దొంగల నాటకం. కిషన్ రెడ్డి గారూ.. ఇప్పుడు మూసీ బాధితుల ఆక్రందనలు గుర్తొచ్చాయా?,లగచర్ల ఘటన డైవర్షన్ కోసం కాదా మీ మూసీ నిద్ర?,హైడ్రాను మొదట స్వాగతించింది మీరైతే..బుల్డోజర్ లను అడ్డుకుంటామన్నది మేము!,రేవంత్‌ను మొదటి అభినందించింది మీరైతే.. మూసీ బాధితులకు భరోసానిచ్చింది మేము. అకస్మాత్తుగా మూసీ బాధితులు గుర్తుకు రావడానికి వెనుకున్న మతలబేంటి?, ఎవరిని కాపాడటం కోసం? ఎవరిని ముంచడం కోసం? మరెవరిని వంచించడం కోసం? ,రేవంత్‌ను కాపాడటం కోసమే ఈ డైవర్షన్ డ్రామాలు. లగచర్ల రైతులకు తెలంగాణ బీజేపీ పంగానామాలు.. మీ పాలి'ట్రిక్స్' ను గమనిస్తోంది తెలంగాణ..ఆట కట్టిస్తుంది సరైన వేళ’ అంటూ ట్వీట్ చేశారు.రేవంత్ రెడ్డికి రక్షణ కవచంగా కమలదళం దోస్తును కాపాడేందుకు 'చీకటి' రాజకీయంవారెవా తోడు దొంగల నాటకం!కిషన్ రెడ్డి గారూ..ఇప్పుడు మూసీ బాధితుల ఆక్రందనలు గుర్తొచ్చాయా?లగచర్ల ఘటన డైవర్షన్ కోసం కాదా మీ మూసీ నిద్ర?హైడ్రాను మొదట స్వాగతించింది మీరైతే..బుల్డోజర్ లను అడ్డుకుంటామన్నది…— KTR (@KTRBRS) November 17, 2024 -
‘రెడ్డి పేరు మీద ఉన్న వారంతా నా బంధువులు కాదు’
ఢిల్లీ: రెడ్డి పేరు మీద ఉన్న వారంతా తన బంధువులు కాదని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. సృజన్‌రెడ్డికి బీఆర్ఎస్ హయాంలోనే వేల కోట్ల కాంట్రాక్టులు వచ్చాయని, దీనిపై ఇప్పుడు రాద్దాంతం చేస్తున్నారని విమర్శించారు.కలెక్టర్ దాడిపై సైతం సీఎం రేవంత్ స్పందించారు. ‘ దాడులను తీవ్రంగా ఖండిస్తున్న. దాడుల వెనుక ఎంతవారు ఉన్నా ఊసలు లెక్క పెట్టాల్సిందే. దాడులు చేయించిన వారిని చేసిన వారిని ఎవరిని వదలము. ఇలాంటి దాడులు బిఆర్ఎస్ పార్టీ జరిగితే కేటీఆర్ సమర్థిస్తారా?, అధికారులపై దాడులను బిఆర్ఎస్ ఎందుకు ఖండించదు. దాడి చేసిన వారిని ఎలా పరామర్శిస్తారు..అంటే దాడులను ప్రోత్సహించేందుకె పరామర్శలా?, కేటీఆర్ ఈ రేస్ స్కామ్ నుంచి తప్పించుకునేందుకే ఢిల్లీ వచ్చారు. గవర్నర్ అనుమతి రాగానే కేటీఆర్ పై చర్యలు ఉంటాయి. అవినీతి పార్టీ అయిన బిజెపిని అంతం చేస్తామన్న కేటీఆర్ ఇప్పుడు ఎలా బిజెపి నేతలను కలుస్తున్నారు మహారాష్ట్రలో కాంగ్రెస్‌కు ఓటు వేయొద్దని చెప్పడం బీజేపీకి సహకరించినట్లు కాదా? ’ అని రేవంత్ ప్రశ్నించారు. -
యాద్రాది కాదు.. యాదగిరిగుట్ట: సీఎం రేవంత్
యాదాద్రి భువనగిరి జిల్లా: ఇక నుంచి యాదాద్రి బదులుగా అన్ని రికార్డుల్లో యాదగిరిగుట్టగా వ్యవహారికంలోకి తీసుకురావాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం ఆయన యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. యాదగిరిగుట్ట ఆలయ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. టెంపుల్ బోర్డు ఏర్పాటు చేసేందుకు కావాల్సిన చర్యలు చేపట్టాలన్న సీఎం.. టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఉండేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. టీటీడీ స్థాయిలో బోర్డుకు ప్రాధాన్యత ఉండేలా పూర్తి అధ్యయనంతో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డును ఏర్పాటు చేయాలన్న సీఎం.. గోశాలలో గోసంరక్షణకు ఒక ప్రత్యేక పాలసీని తీసుకురావాలని అధికారులకు సూచించారు. గోసంరక్షణకు అవసరమైతే టెక్నాలజీని ఉపయోగించుకోవాలన్న సీఎం.. గతంలో కొండపై నిద్ర చేసేందుకు భక్తులకు అవకాశం ఉండేదని గుర్తు చేశారు.కొండపై నిద్ర చేసి మొక్కులు తీర్చుకునేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలి. విమాన గోపురానికి బంగారు తాపడం పనులను వేగవంతం చేయాలి. బ్రహ్మోత్సవాల నాటికి బంగారు తాపడం పనులు పూర్తి చేయాలి. ఆలయ అభివృద్ధికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న భూసేకరణను పూర్తి చేయాలి. అవసరమైన నిధులను మంజూరు చేయాలి’’ అని అధికారులకు రేవంత్‌రెడ్డి సూచించారు.‘‘ఆలయానికి సంబంధించి పెండింగ్ పనులు పూర్తి చేయాల్సిందేనని స్పష్టం చేసిన సీఎం రేవంత్.. మరో వారంరోజుల్లో పూర్తి వివరాలు, ప్రపోజల్స్‌తో రావాలన్నారు. ఆలయానికి సంబంధించి అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని.. పెండింగ్ పనులు, ఇతర అంశాలపై పూర్తిస్థాయి నివేదిక అందించాలి’’ అని సీఎం రేవంత్ ఆదేశించారు.ఇదీ చదవండి: కేసు పెడితే పెట్టుకో.. దేనికైనా రెడీ!: కేటీఆర్ -
మాటల సీఎం.. చేతలు శూన్యం
సాక్షి, హైదరాబాద్/ సిద్దిపేటరూరల్: సీఎం రేవంత్‌రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి కాని... చేతలు దాటడం లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. సిద్దిపేట జిల్లా రూరల్ మండలం రాఘవాపూర్‌లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ధాన్యాన్ని తీసుకొచ్చిన రైతులతో మాట్లాడి ఎదుర్కొంటున్న సమస్యలను గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ . గొప్పలకు పోయిన రేవంత్‌రెడ్డి నేటికి పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ, రైతు భరోసా వంటివి అందించలేదని, బోనస్ కాస్త బోగస్ చేసి రైతులను మోసం చేశాడన్నారు. మంత్రి ఉత్తమ్ రాష్ట్ర వ్యాప్తంగా 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తానని చెప్పారన్నారు. కానీ ఇప్పటికే 30 శాతం ధాన్యాన్ని దళారులకు తక్కువ ధరకు అమ్ముకుంటున్నారని చెప్పారు. ప్పటికైనా కళ్లు తెరిచి వెంటనే పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. చదువుకునేందుకు వెళితే ప్రాణాలు పోతున్నాయి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునేందుకు వెళుతున్న విద్యార్థుల ప్రాణాలు కోల్పోయే దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నాయని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుకుల పాఠశాలల్లో ‘విష పూరిత ఆహారం’ఘటనలు చోటు చేసుకోవడంపై బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన మండిపడ్డారు. వాంకిడి ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని 60 మంది విద్యార్థులు ఆస్పత్రి పాలైన ఘటన మరువకముందే.. మరో ఘటన జరగటం దారుణమని పేర్కొన్నారు. మంచిర్యాల గిరిజన ఆశ్రమ పాఠశాలకు చెందిన 12 మంది విద్యార్థులు అస్వస్తతకు గురై ఆస్పత్రి పాలుకావడం బాధాకరమని చెప్పారు. విషపూరిత ఆహారం ఘటనలు పదేపదే జరుగుతున్నా.. ప్రభుత్వం మొద్దునిద్ర వీడటం లేదని, గురుకుల విద్యాసంస్థల్లో ఏం జరుగుతుందని ప్రశ్నించారు. -
కుల గణనపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడుతుందని సామాజిక, ఆర్థిక, రాజకీయ కులగణన చేస్తామని రాహుల్ గాంధీ మాట ఇచ్చారని.. గాంధీ భవన్లో కుల గణనపై జరిగిన అవగాహన సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. సెప్టెంబర్ 17న తుక్కుగూడ సభలో సోనియాగాంధీ కూడా తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చారని ఆయన గుర్తు చేశారు.పార్టీ ఎజెండాతోనే ప్రజల్లోకి వెళ్లాం.. పార్టీ విధానాన్ని అమలు చేయడమే మన ప్రభుత్వ విధానం. అందుకే కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీతో సంబంధం ఉన్న నిరంజన్ను బీసీ కమిషన్ చైర్మన్‌గా నియమించుకున్నామని రేవంత్ అన్నారు. పని చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నా.. ప్రతీ క్షణం సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యతకాంగ్రెస్ క్యాడర్, నేతలపై ఉంది. కుల గణనపై సమన్వయం చేసుకునేందుకు 33 జిల్లాలకు 33 మంది పరిశీలకులను నియమించాలని సూచిస్తున్నా. బాధ్యతగా పని చేయండి.. మీ కష్టానికి ఫలితం తప్పకుండా ఉంటుంది’’ అని రేవంత్ చెప్పారు.‘‘దేశానికి తెలంగాణ ఒక మోడల్‌గా మారాలి.. ఆ దిశగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలి. నవంబర్ 31లోగా కులగణన పూర్తి చేసి భవిష్యత్ యుద్ధానికి సిద్ధం కావాలి. తెలంగాణ నుంచే నరేంద్ర మోదీపై యుద్ధం ప్రకటించాలి. కులగణన ఎక్స్ రే మాత్రమే కాదు.. ఇది మెగా హెల్త్ చెకప్ లాంటిది. ప్రభుత్వ ఆదాయాన్ని సామాజిక న్యాయం ప్రకారం పంచడమే కాంగ్రెస్ విధానం. భవిష్యత్‌లో కేంద్ర ప్రభుత్వం చేపట్టే జనగణనలో మన మోడల్‌ను పరిగణనలోకి తీసుకునేలా మోడల్ డాక్యుమెంట్‌ను కేంద్రానికి పంపుతాం. ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా డీఎస్సీ పూర్తి చేసి ఉద్యోగ నియామక పత్రాలు అందించాం. రాజకీయ మనుగడ కోసం అడ్డంకులు సృష్టించినా 10 నెలల్లో 50వేల ఉద్యోగ నియామక పత్రాలు అందించాం.’’ అని రేవంత్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: దీపావళి పండుగవేళ.. జీహెచ్ఎంసీ ఉద్యోగులకు శుభవార్తగ్రూప్ 1 విషయంలోనూ ప్రతిపక్షాలు రకరకాల అపోహలు సృష్ఠించి అడ్డుకోవాలని చూశాయి. జీవో ఇచ్చినపుడు, నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు, ప్రిలిమ్స్ ఫలితాలు ఇచ్చినపుడు కోర్టుకు పోలేదు. కానీ మెయిన్స్ నిర్వహించే సందర్భంలో జీవో 29పై కోర్టుకు వెళ్లి అడ్డుకోవాలని చూశారు. సుప్రీంకోర్టు కూడా వారి పిటిషన్‌ను కొట్టేసింది. కొంతమంది అగ్రవర్ణాల కోసమే గ్రూప్ 1 నిర్వహిస్తున్నారని, బలహీన వర్గాలకు అన్యాయం చేస్తున్నారని ఒక వాదన తీసుకొచ్చారు. సెలక్ట్ అయిన 31,383 మందిలో 10 శాతం లోపు మాత్రమే అగ్రవర్ణాలు ఉన్నారు. 57.11 శాతం బీసీలు,15.38 శాతం ఎస్సీలు, 8.87 శాతం ఎస్టీలు, 8.84 ఈడబ్ల్యూఎస్ కోటాలో సెలక్ట్ అయ్యారు. స్పోర్ట్స్ కోటాలో 20 మంది సెలక్ట్ అయ్యారు.’’ అని రేవంత్ వివరించారు.పార్టీకి నష్టం చేకూర్చేలా ఎవరైనా ఇష్టానుసారంగా మాట్లాడితే పార్టీ సహించదు. రేవంత్‌రెడ్డి చట్టాన్ని అమలు చేస్తాడు తప్ప... వ్యక్తిగత ఎజెండాతో పనిచేయడు ప్రతిపక్షాల కుట్రలను ప్రతీ ఒక్కరు తిప్పికొట్టాలి’’ అని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. -
రేవంత్ పాపం.. ఆయనకు శాపం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి చేసిన పాపం.. రైతు మహేందర్‌రెడ్డి పాలిట శాపమైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. సంపూర్ణంగా రైతు రుణమాఫీ చేస్తామని దేవుడిపై ఒట్లు వేసినా..రైతులకు తప్పని పాట్లు!! అంటూ ట్వీట్ చేశారు.‘‘కాంగ్రెస్ వచ్చి.. మార్పు తెచ్చిందంటే ఏమో అనుకున్నాం..రైతుల చేతుల్లోకి పురుగుల మందు డబ్బా తెచ్చి పెట్టింది! రైతు బంధు రాలేదు.. రుణమాఫీ కాలేదు.. తెలంగాణలో బక్కచిక్కిన రైతు పరిస్థితి ఏమాత్రం బాగోలేదు.. దీనికంతటికీ కారణం అబద్దాలతో అధికారం చేపట్టిన రేవంత్ సర్కార్ కాదా?’’ అంటూ నిలదీశారు.‘‘ఎంతమంది రైతుల ఉసురు తీసుకుంటారు? ఇంకెంతమంది రైతుల చేతుల్లో పురుగుల మంది డబ్బా పెడతారు?. రైతులకు అభయం ఇచ్చేందుకు వెళ్తే అరెస్టులు చేసేందుకు మంత్రుల ఆదేశాలు.. ఇదేనా ప్రజా ప్రభుత్వం!! ఏమైంది మీ రైతు డిక్లరేషన్ రాహుల్ గాంధీ గారు!!. ఆరు గ్యారంటీలకు మాది పూచి అన్న గాంధీ ఫ్యామిలీ ..ఈ రైతుల చావులకు బాధ్యత వహించాలి!!. ఇది ఆత్మహత్య కాదు.. కాంగ్రెస్ సర్కార్ చేసిన హత్య!!’’ అంటూ దుయ్యబట్టారు. ఇదీ చదవండి: 7 పేజీలు.. 54 ప్రశ్నలు -
రేవంత్, బండి సంజయ్‌లది డ్రామా: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్:గ్రూప్ 1పై సీఎం రేవంత్, బండి సంజయ్ డ్రామా ఆడుతున్నారని, బండి సంజయ్‌కి భద్రత ఇచ్చి రేవంత్ రోడ్లపైకి పంపారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.గ్రూప్-1 పరీక్షపై బండి సంజయ్‌ని సీఎం రేవంత్ చర్చలకు పిలవడంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.బండి సంజయ్‌ని చర్చలకు పిలిస్తే ఏం లాభం అని ప్రశ్నించారు. పేపర్ లీక్ చేసిన ఆయనను చర్చలకు ఎలా పిలుస్తారని ఎద్దేవా చేశారు.ఇదీ చదవండి: గ్రూప్ 1 రగడ.. సచివాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత -
కేటీఆర్,హరీశ్‌రావులకు సీతక్క కౌంటర్
సాక్షి,హైదరాబాద్:కేటీఆర్,హరీశ్‌రావు వ్యాఖ్యలపై మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. మూసీ ప్రక్షాళన పేరుతో సీఎం రేవంత్ రియల్ఎస్టేట్ చేస్తున్నారన్న కేటీఆర్,హరీశ్‌రావు వ్యాఖ్యలపై సీతక్క అక్టోబర్ 18(శుక్రవారం) మీడియాతో మాట్లాడారు.‘హైదరాబాద్ చుట్టూ రియల్ ఎస్టేట్ పేరుతో కేటీఆర్ ప్లాట్లు అమ్ముకున్నారు. అప్పుడు ఫ్లాట్లు అమ్ముకోవడం వల్లే ఇప్పుడు రియల్ ఎస్టేట్ అని వ్యాఖ్యలు చేస్తున్నారు. తెలంగాణ పునర్జీవనం అని మాట్లాడినటువంటి హరీశ్‌రావు అది ఎక్కడ చేశారో చెప్పాలి.హరీష్ రావు ఏ చెరువుకు పునర్జీవనం పోశారో చూపించాలి. పేద ప్రజలకు న్యాయం జరుగుతుంటే బీఆర్ఎస్ నాయకులు తట్టుకోలేకపోతున్నారు.సీఎం రేవంత్ ఏం చూపించినా ఏం చేసినా పేదల కోసమే ఆలోచిస్తారు’అని సీతక్క అన్నారు.ఇదీ చదవండి: సెక్యూరిటీ లేకుండా రండి: హరీశ్‌రావు సవాల్ -
ఆ రూ.77 వేల కోట్లు ఎటు వెళ్లాయి?: కేటీఆర్
హైదరాబాద్, సాక్షి: కరెంటు కోతల కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వాతలు పెట్టేందుకు సిద్ధమవుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. విద్యుత్ సరఫరాకు గ్యారెంటీ లేదు. కానీ విద్యుత్ షాకులు మాత్రం గ్యారెంటీ అని ‘ఎక్స్’ వేదికగా దుయ్యబట్టారు.‘‘కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చి ఏడాది కాకముందే పవర్ చార్జీలు పెంచి జనం మీద భారం మోపడానికి సిద్ధమయ్యారు. ఫ్రీ కరెంట్ అమలు అంతంత మాత్రమే.. గృహజ్యోతి పథకం ఇంకా గ్రహణంలోనే ఉంది. జీరో బిల్లుల కోసం ఎదురు చూస్తుంటే గుండె గుభిల్లు మనేలా కొత్త బాదుడు షురూ చేస్తారా?. ఒక్క గ్యారెంటీ సక్కగా అమలు చేసింది లేదు.. 420 హామీలకు అతీ గతీ లేదు. మరి ఖజానా ఖాళీ చేసి ఏం చేస్తున్నారు?. 9 నెలల్లో ఎడాపెడా అప్పులు చేసి తెచ్చిన రూ.77 వేల కోట్లు ఎటుబాయే? మళ్లీ ఈ నడ్డి విరిగే వడ్డనలు ఎందుకు?. అసమర్థుల పాలనలో ఆఖరికి మిగిలేది కోతలూ వాతలే’’ అని అన్నారు.కరెంటు కోతల కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వాతలు పెట్టేందుకు రెడీ అవుతున్నది ! విద్యుత్ సరఫరా కు గ్యారెంటీ లేదు కానీ విద్యుత్ షాకులు మాత్రం గ్యారెంటీ !పవర్ లోకి వచ్చి ఏడాది కాకముందే పవర్ చార్జీలు పెంచి జనం మీద భారం మోపడానికి సిద్ధమయ్యారు !ఫ్రీ కరెంట్ అమలు అంతంత మాత్రమే..… pic.twitter.com/hqiKkXIFrn— KTR (@KTRBRS) October 15, 2024చదవండి: ఓ వైపు మరణ శాసనం..! మరోవైపు సుందరీకరణా? -
సీఎం హోదాలో తొలిసారి స్వగ్రామానికి.. అభివృద్ధి పనులకు రేవంత్ శంకుస్థాపన
సాక్షి నాగర్ కర్నూలు: కొండాపల్లిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం పర్యటించారు. సీఎం హోదాలో తొలిసారి స్వగ్రామానికి వచ్చారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామపంచాయితీ కార్యాలయం, గ్రంథాలయం, పశువైద్యశాల, బీసీ కమ్యూనిటీ హాల్‌ను ఆయన ప్రారంభించారు. నాలుగు వరుసల బీటీ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, మిల్క్ బల్క్ కూలింగ్ సెంటర్ పనులకు కూడా సీఎం శంకుస్థాపన చేశారు.కాగా, సీఎం రేవంత్‌రెడ్డి గత 20 ఏళ్లుగా దసరా పండుగ రోజు స్వగ్రామమైన కొండారెడ్డిపల్లిలో గ్రామస్తులతో కలిసి జమ్మికి వెళ్లడం ఆనవాయితీగా వస్తుంది. ఈసారి వేడుకలకు ముఖ్యమంత్రి హోదాలో రావడం విశేషం. సీఎం సొంత ఇంటి నుంచి జమ్మి చెట్టు వరకు రోడ్డును ఏర్పాటు చేయడంతోపాటు విద్యుత్ లైట్లను అమర్చారు. -
‘మూసీ’ వెనక దాక్కున్న ముసుగు దొంగ ఎవరు? కేటీఆర్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: మూసీ సుందరీకరణ పేరిట అవినీతి ఆలోచనలు మానుకొని ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలపై సీఎం రేవంత్‌రెడ్డి దృష్టి పెట్టాలంటూ లేఖ రాసిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. కాంగ్రెస్ సర్కార్‌ను టార్గెట్ చేస్తూ.. మరోసారి ఎక్స్ వేదికగా ప్రశ్నలు సంధించారు.‘‘మూసీ వెనక దాక్కున్న ముసుగు దొంగ ఎవరు? రైతు రుణ మాఫీ ఎగ్గొట్టి, మూసీలో మురికి రాజకీయాలు చేస్తున్న మురికి దొంగ ఎవరు?. రైతు బంధు ఎగ్గొట్టి, మూసీ పేదల ఉసురు పోసుకుంటున్న దుర్మార్గుడు ఎవరు?. మహిళలకు వంద రోజుల్లోనే నెలకు 2500 ఇస్తా అని చెప్పి తప్పించుకు తిరుగుతున్న మోసగాడు ఎవరు?. అవ్వ, తాతలకు నెలకు 4000 ఇస్తా అని చెప్పి ఎగ్గొట్టిన నయవంచకుడు ఎవరు?. ఆడబిడ్డల పెళ్లిళ్లకు తులం బంగారం ఇస్తా అని మాట తప్పిన దగావీరుడు ఎవరు?. మూసి బ్యూటిఫికేషన్ పేరిట 1,500,000,000 కోట్ల లూటిఫికేషన్‌కి తెరతీసిన ఘనుడు ఎవరు?’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.కాగా, మూసీ ప్రక్షాళన కోసం రూ. లక్షన్నర కోట్లు ఖర్చు పెడతామంటున్న ముఖ్యమంత్రికి రైతు భరోసా, దొడ్డు వడ్లకు బోనస్ ఇచ్చేందుకు డబ్బులు లేవా? అంటూ ప్రభుత్వానికి లేఖ రాశారు. రాష్ట్ర రైతాంగానికి ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ దుయ్యబట్టారు. సీఎం నిర్వహించిన వ్యవసాయ సమీక్షలో దొడ్డు వడ్లకు రూ. 500 బోనస్, వర్షాకాలంలో రైతు భరోసా వంటి అంశాలపై చర్చించలేదని విమర్శించారు.ఇదీ చదవండి: సర్కార్‌పై సమరానికి సై!గత సీజన్లోనూ రైతులకు వరి ధాన్యంపై బోనస్ చెల్లించకుండా ప్రభుత్వం మోసగించిందని ఆరోపించారు. కేవలం సన్న వడ్లకే బోనస్ ఇస్తామనే ప్రకటనతో రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. 80 శాతం మంది రైతులు దొడ్డు వడ్లు పండిస్తారని తెలిసి కూడా కేవలం సన్న వడ్లకే ప్రభుత్వం బోనస్ ఇస్తామని ప్రకటించడం సరికాదన్నారు. దొడ్డు వడ్లకు కూడా బోనస్ ఇవ్వకుంటే రైతుల తరఫున బీఆర్ఎస్ పోరాడుతుందని కేటీఆర్ హెచ్చరించారు. -
రాహుల్ ఇంటిని ముట్టడిస్తాం: హరీష్‌రావు
సాక్షి, సూర్యాపేట: వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీ ఇచ్చిన రుణమాఫీ హామీ ఏమైందని మాజీ మంత్రి హరీష్‌రావు ప్రశ్నించారు. దసరాలోపు రైతులకు రుణమాఫీ చేయకపోతే ఢిల్లీలో రాహుల్ ఇంటి ముందు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తా.. దసరాలోపు రైతు బంధు పడకపోతే నిన్ను రైతులు వదలరంటూ హరీష్ హెచ్చరించారు. రేవంత్‌రెడ్డికి ప్రజలపై పట్టింపు లేదు.. రైతంటే లెక్క లేదు. దేవుళ్ల మీద ఒట్లు వేసి మాటతప్పాడు. రేవంత్ రెడ్డి మొనగాడు కాదు.. మోసగాడు. 31 కుంటి సాకులు పెట్టి రుణమాఫీ ఎగ్గొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. కర్ణాటకలో ఐదు.. తెలంగాణలో ఆరు.. హర్యానాలలో ఏడు గ్యారెంటీలతో ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తుంది. ఒక చేతిలో రాజ్యాంగం.. మరో చేతిలో రౌడీయిజం. హెడ్రా పేరుతో పేదల ఇండ్లు కూలగొట్టి హక్కు మీకు ఎవరిచ్చారు’’ అంటూ హరీష్‌రావు ప్రశ్నించారు.జూటా మాటలు మానుకోక పోతే నిన్ను వదలం. నిన్ను అడుగుతాం.. కడుగుతాం.. అసెంబ్లీలో నిలదీస్తాం. ఒక్క బస్సు తప్ప.. మీ హామీలు అన్నీ తుస్సే.. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కానీ సీఎంకి కనికరం లేదు. కేసిఆర్‌ది రైతు గుండె.. రేవంత్‌ది రాతి గుండె.. ప్రజల నుండి తిరుగుబాటు రాగానే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. ఏదో ఒక వివాదం సృష్టిస్తున్నారు’’ అని హరీష్‌రావు మండిపడ్డారు.ఇదీ చదవండి: తప్పని తేలితే కూల్చేస్తా.. సీఎం రేవంత్‌కి కేవీపీ లేఖ -
సీఎం రేవంత్ బండారం బయటపడింది:కేటీఆర్
సాక్షి,హైదరాబాద్:20 లక్షల మందికి రుణమాఫీ కానే కాలేదన్న వ్యవసాయ మంత్రి ప్రకటనతో సీఎం బండారం మరోసారి బట్టబయలైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.ఈ మేరకు కేటీఆర్ శుక్రవారం(అక్టోబర్4)ఎక్స్(ట్విటర్)లో పోస్టు చేశారు.‘వందశాతం రుణమాఫీ పూర్తిచేశామని విర్రవీగిన ముఖ్యమంత్రివన్నీ డొల్లమాటలేనని ఇంకోసారి తేలిపోయింది.ఓవైపు డిసెంబర్ 9న ఏకకాలంలో చేస్తామని దగా చేశారు.మరోవైపు 10 నెలలైనా 20 లక్షల మందికి మోసం చేశారు.రూ.2 లక్షల రుణమాఫీ పూర్తయిపోయిందన్న సన్నాసి మాటలు నయవంచన కాక మరేంటి ?అధికారిక లెక్కల ప్రకారమే.. 20 లక్షల మంది అన్నదాతలకు అన్యాయం జరిగితే అనధికారికంగా రుణమాఫీ కాని రైతులందరో ?? రేవంత్ చేతకానితనం.. అన్నదాతలకు కోలుకోని శాపంగా మారింది’అని కేటీఆర్ ట్వీట్లో పేర్కొన్నారు. ఇదీ చదవండి: టీజీపీఎస్సీ ఆఫీసు ముందు పోస్టర్ల కలకలం -
వారి బతుకులు ఏమైపోవాలి?.. సీఎం రేవంత్‌కు కిషన్‌రెడ్డి లేఖ
సాక్షి, హైదరాబాద్: హైడ్రాతో ఏకపక్షంగా ముందుకెళ్తున్నారని.. ప్రభుత్వాలే అనుమతులిచ్చి ఇప్పుడు అక్రమం అంటే ఎలా? అంటూ ప్రశ్నిస్తూ.. సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి లేఖ రాశారు. పేద, మధ్య తరగతి ప్రజలు ఏమైపోవాలి?. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ ఇచ్చిన అనుమతులు తప్పు అని హైడ్రా ఎలా చెబుతుంది. కూల్చివేతలకు ముందు బాధితులతో చర్చించాలి’’ అని లేఖలో కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.‘‘హైడ్రా దూకుడు పేదలపై కాకుండా బాధితులతో చర్చించండి. ఇతర భాగస్వామ్య పక్షాలను పరిగణనలో తీసుకోండి. 30 ఏళ్ల క్రితం నిర్మించుకున్న ఇళ్లు అక్రమమని సర్కార్ కూల్చివేస్తే వారి బాధ ఎవరికి చెప్పుకోవాలి. అక్రమంగా భూములు అమ్మిన వారిని బాధ్యులను చేయాలి. రాత్రికి రాత్రి కట్టుబట్టలతో రోడ్డున పడేస్తే వాళ్ల బతుకులు ఏమైపోతాయి.’’ అంటూ లేఖలో కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.‘‘పాలకుల, అధికారుల అవినీతి, ఓటుబ్యాంకు రాజకీయాల కారణంగా పేదలు, మధ్యతరగతి ప్రజల నుంచి దళారులు దోచుకున్నారు. అన్ని అనుమతులున్న భవనాలను నేలమట్టం చేయడం బాధకరం. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ ఇచ్చే అనుమతులను తప్పు అని హైడ్రా ఎలా నిర్ణయిస్తుంది. మూసీ పరివాహ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వేలాది మంది జీవనోపాధి ఇక్కడే ఉంటుంది. దుందుడుకు విధానాలతో ముందుకు వెళ్లవద్దు’’ అని లేఖలో రేవంత్‌కు కిషన్‌రెడ్డి సూచించారు.ఇదీ చదవండి: తస్మాత్ జాగ్రత్త..! కనిపించని కన్ను చూస్తోంది..!బ్యాంకులకు, బ్యాంకింగ్యేతర ఆర్థిక సంస్థలు రుణ నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోవద్దు. కూల్చివేతలతో ప్రజలు ఆందోళనలో ఉన్నారని లేఖలో పేర్కొన్న కిషన్‌రెడ్డి.. ప్రభుత్వ అధికారుల వ్యవహార శైలితో గందరగోళానికి గురవుతున్నారన్నారు. అధికారులు ఎలాంటి ప్రకటనలు జారీ చేయకుండా ఆదేశాలివ్వాలని కిషన్‌రెడ్డి కోరారు. మీరు తీసుకునే నిర్ణయం అందరికీ న్యాయం జరిగేలా ఉండాలని సీఎంకు కిషన్‌రెడ్డి సూచించారు.‘‘ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందని పక్షంలో అవకాశం ఉన్నచోట పేదలు తమ కష్టాన్ని దారబోసి ఇళ్లను నిర్మించుకున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు చేసిన మోసానికి గురయ్యారు. సహజ న్యాయ సూత్రాలను ప్రభుత్వం పాటించడం లేదు. ఆక్రమణలను, అక్రమ నిర్మాణాలను మేం సమర్థించం. ఆక్రమణలపై, ఆక్రమ నిర్మాణాలపై చట్టబద్దంగా, న్యాయబద్దంగా చర్యలు ఉండాలన్నదే మా ఉద్దేశ్యం. హడావుడి చేసి, నిత్యం వార్తల్లో ఉండేందుకే ప్రభుత్వం అక్రమ నిర్మాణాల కూల్చివేత’’ అంటూ లేఖలో కిషన్‌రెడ్డి నిలదీశారు. -
పరువు నష్టం కేసు.. విచారణకు సీఎం రేవంత్ గైర్హాజరు
సాక్షి,హైదరాబాద్:సీఎం రేవంత్‌రెడ్డిపై పరువునష్టం కేసు విచారణ వాయిదా పడింది. బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు వేసిన పరువు నష్టం కేసు విచారణను నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు అక్టోబర్16కు వాయిదా వేసింది.పార్లమెంటు ఎన్నికల సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి తమ పార్టీపై తప్పుడు ప్రచారం చేశారని ఆరోపిస్తూ బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు పరువు నష్టం కేసు వేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఎస్సీ,ఎస్టీ రిజర్వేషన్లు ఎత్తేస్తుందని రేవంత్ ప్రచారం చేశారని పిటిషన్లో తెలిపారు. ఈ కేసులో సెప్టెంబర్ 25వ తేదీన విచారణకు హాజరు కావాలని రేవంత్‌రెడ్డికి కోర్టు ఇప్పటికే సమన్లు జారీ చేసింది.అధికారిక కార్యక్రమాల్లో సీఎం తీరిక లేకుండా ఉన్నారని రేవంత్‌రెడ్డి న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో పర్సనల్ బాండ్, రూ.15వేల పూచీకత్తు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.ఇదీ చదవండి: మరో 35 వేల పోస్టులకు నోటిఫికేషన్: సీఎం రేవంత్ -
మరో 35 వేల పోస్టులకు నోటిఫికేషన్: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అన్ని శాఖల్లో ఖాళీలను భర్తీ చేస్తామని.. మరో 35 వేల పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడించారు. బుధవారం ఆయన మాసబ్‌ట్యాంక్‌లో బీఎఫ్ఎస్ఐ స్కిల్ ప్రోగ్రామ్‌ను సీఎం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, ఉద్యోగాల కోసం విద్యార్థులు పోరాటాలు చేశారని.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో విద్యార్థులకు అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్రంలో 60 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. తెలంగాణలో మధ్య తరగతి కుటుంబాలు ఎక్కువ. తెలంగాణ ఏర్పడిన పదేళ్ల తర్వాత కూడా నిరుద్యోగం ఎక్కువగా ఉంది’’ అని సీఎం రేవంత్ అన్నారు.‘‘నిరుద్యోగుల దశ, దిశ నిర్దేశించడానికి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ కోసం కార్పొరేషన్ సోషల్ రెస్పాన్సిబులిటీ కింద నిధులు ఇస్తున్నాం. ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా నిరుద్యోగులకు శిక్షణ ఇస్తారు. ఉద్యోగాలు రాక తెలంగాణ యువత డ్రగ్స్, గంజాయిలకు బానిసలుగా మారుతున్నారు. పరిశ్రమలకు, నిరుద్యోగులకు మధ్య గ్యాప్ ఉంది.’’ అని సీఎం రేవంత్ తెలిపారు.ఇదీ చదవండి: నా కాలేజీలు కాంగ్రెస్ హయాంలో కట్టినవే: మాజీ మంత్రి మల్లారెడ్డి‘‘ప్రతిభ ఉన్నా.. నైపుణ్యం లేకపోతే ఉద్యోగ అవకాశాలు రావు. అందుకే ఈ సమస్యను గుర్తించి నైపుణ్య శిక్షణ అందించే చర్యలు చేపట్టాం. తెలంగాణలో ప్రతీ ఏటా 3 లక్షల మంది డిగ్రీ పట్టాలు పొంది బయటకు వస్తున్నారు. కానీ వారికి ఇండస్ట్రీ అవసరాలకు సంబంధించి నైపుణ్యం లేకపోవడంతో ఉద్యోగాలు పొందలేకపోతున్నారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాన్ని అందించాలనే బీఎఫ్ఎస్ఐ తో మాట్లాడాం. బీఎఫ్ఎస్ఐ ఇచ్చిన ప్రతిపాదనలతో ఒక ప్రణాళిక రూపొందించాం. డిగ్రీ పట్టా పొందేనాటికి విద్యార్థులకు నైపుణ్యాన్ని అందించాలనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి అవసరమైన నిధులను కూడా వాళ్లే సమకూర్చారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా.ఈ శిక్షణ తరువాత బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీస్, ఇన్సూరెన్స్ సెక్టార్స్ లో ఉద్యోగాలు పొందుతారు. ప్రపంచానికి నైపుణ్యం కలిగిన యువతను అందించాలనేదే మా లక్ష్యం. గత పదేళ్లలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక కొంతమంది తెలంగాణ యువత గంజాయి, డ్రగ్స్‌కు బానిసలయ్యారు. ఇటీవల పట్టుబడినవారిలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఉండటం ఆందోళనకరమైన విషయం. డ్రగ్స్, గంజాయి నియంత్రించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. వ్యసనాల నుంచి యువతను బయటపడేయాలంటే ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉంది.65 ఐటీఐలను అప్‌గ్రేడ్ చేసి టాటా టెక్నాలజీస్ సహకారంతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మారుస్తున్నాం.. రాబోయే రెండేళ్లలో అన్ని ఐటీఐలను ఏటీసీలుగా మారుస్తాం.. ఇంజనీరింగ్ కాలేజీలపైనా ప్రత్యేక దృష్టి సారించాం. కనీస ప్రమాణాలు లేకపోతే ఇంజనీరింగ్ కాలేజీల అనుమతులు రద్దు చేయడం ఖాయం. పాలిటెక్నిక్ కాలేజీలను అప్ గ్రేడ్ చేస్తున్నాం.యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ద్వారా విద్యార్థులకు నైపుణ్యం అందించబోతున్నాం. హైదరాబాద్ ను ఎడ్యుకేషన్ హబ్ గా మార్చడమే కాదు.. నైపుణ్యం అందించడంలోనూ హైదరాబాద్ కేరాఫ్ గా మార్చనున్నాం. సాంకేతిక నైపుణ్యానికి హైదరాబాద్ డెస్టినేషన్ కావాలి. ప్రపంచ వేదికపై హైదరాబాద్‌ను విశ్వనగరంగా నిలబెట్టాలి. అందుకు మీ అందరి సహకారం అవసరం.రాబోయే ఏడాదిలో స్పోర్ట్స్ యూనివర్సిటీ, అకాడమీ ఏర్పాటు చేస్తాం. తెలంగాణను దేశానికి రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతాం. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివిన వారు ప్రపంచంలోనే పెద్ద సంస్థలకు సీఈవోలుగా ఉన్నారు. అలాంటి వారి సహకారం తీసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళతాం’’ అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. -
ఒవైసీ కాలేజీ కూలిస్తే రేవంత్ హీరో..లేదంటే: రాజాసింగ్
సాక్షి,హైదరాబాద్: హైడ్రా కూల్చివేతలపై గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం(సెప్టెంబర్8) ఈ విషయమై రాజాసింగ్ మీడియాతో మాట్లాడారు. ఒవైసీ కాలేజీ ఎప్పుడు కూలుస్తున్నారో సీఎం రేవంత్, హైడ్రా కమిషనర్ తేదీ ప్రకటించాలని డిమాండ్ చేశారు.ఒవైసీ కాలేజీ కూల్చకపోతే హైడ్రా విఫలమైనట్లేనన్నారు. ఒకవేళ కూలిస్తే రేవంత్ హీరో అవుతారన్నారు. ఒవైసీ కాలేజీ కూల్చివేతపై జాప్యం చేస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారని చెప్పారు.ఇదీ చదవండి.. హైడ్రా కూల్చివేతలు.. మాదాపూర్‌లో ఉద్రిక్తత -
హైడ్రా పేరుతో వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు: సీఎం వార్నింగ్
హైదరాబాద్, సాక్షి: నగరంలో ఇప్పుడు ఎటు చూసినా.. హైడ్రా పేరే వినిపిస్తోంది. చెరువుల్ని మింగి అక్రమ నిర్మాణాలు చేపట్టిన వాళ్లంతా.. నోటీసులు, కూల్చివేతల ఆందోళనలో ఉన్నారు. ఈ క్రమంలో.. హైడ్రా పేరు చెప్పి భయపెట్టి.. బెదిరించి కొందరు అధికారులు డబ్బులు వసూళ్లు చేస్తున్నారు. ఈ క్రమంలో.. ఫిర్యాదులు వెల్లువెత్తడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. అటువంటి అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇలాంటి వసూళ్లకు పాల్పడే వారిపై ఫోకస్ పెట్టాలని ఏసీబీ, విజిలెన్స్ అధికారులను ముఖ్యమంత్రి అప్రమత్తం చేశారు.గతంలో ఇచ్చిన నోటీసులు, రెండు మూడేళ్ల కిందటి ఫిర్యాదులను అడ్డంగా పెట్టుకొని కొన్ని చోట్ల రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు సీఎంవోకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ సీరియస్‌గా స్పందించారు.ఇదీ చదవండి: హైడ్రా అంటే ఒక డ్రామా: ఎంపీ ఈటల ఫైర్ -
రవ్వంత చేసి కొండంత డబ్బా
హైదరాబాద్, సాక్షి: రైతుల రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు మండిపడ్డారు. రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ జరగలేదని, అందుకు మంత్రుల మాటలే సాక్ష్యం అని చెబుతూ.. బుధవారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. రుణమాఫీ పేరుతో తెలంగాణ రైతులకు టోపీ పెట్టారు. రుణమాఫీ పచ్చి బూటకమనేది అర్థమవుతోంది. రవ్వంత చేసి కొండంత డబ్బా కొట్టుకుంటున్నారు. రుణమాఫీ విషయంలో వాళ్లలో వాళ్లకే సమన్వయం లేనట్లుంది. అందుకే ముఖ్యమంత్రి, మంత్రులు తలోమాట చెబుతున్నారు. రుణమాఫీ విషయంలో కాంగగ్రెస్ ఘోరంగా విఫలమైంది. అందుకే.. అబద్ధాల ముఖ్యమంత్రి నిజస్వరూపం బయటపడింది. తెలంగాణ రైతాంగం రగిలిపోతోంది. రైతులకు ఈ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలి. రేపు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాల్లో ధర్నా చేపడతాం అని కేటీఆర్ అన్నారు. -
సీఎం కుర్చీపై పొంగులేటి కన్ను: బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి
సాక్షి,హైదరాబాద్: కర్ణాటకలో డీకేశివకుమార్‌లా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలంగాణలో కీలక పాత్ర పోషిస్తున్నాడని బీజేపీ శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. ‘పొంగులేటి ఇక్కడ డీకే శివకుమార్ పాత్ర పోషిస్తున్నాడు. ఢిల్లీలో కదిపే పావులు చూస్తే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంకేదో పదవి ఆశిస్తున్నాడనిపిస్తోంది.పొంగులేటి శ్రీనివాసరెడ్డి కన్ను సీఎం పదవిపై పడింది. సీఎంను కాదని కొడంగల్ అబివృద్ధి కాంట్రాక్టు పొంగులేటికి వచ్చింది. భట్టి ఉపముఖ్యమంత్రిగా సెకండ్ ప్లేస్‌లో లేరు. అమెరికా పర్యటనలో రేవంత్ తీసుకొచ్చిన వేల కోట్లు ఎప్పుడు వస్తాయి? ఎంత మందికి ఉద్యోగాలు వస్తాయి? సీఎం కుటుంబ సభ్యుల్లో ఎవరెంత పెట్టుబడి పెడుతున్నారు. వీటన్నింటిపై స్పష్టత ఇవ్వాలి. మంత్రిగా ఉన్న వ్యక్తి కంపెనీకి ప్రభుత్వ కాంట్రాక్టు రావడం చరిత్రలో లేదు. ఎస్కేలేషన్, ప్రైస్ హైక్ మీద మాకు అనుమానం ఉంది. తన వెంట కొంత మంది ఎంఎల్ఏలు ఉన్నారని భయపడి పొంగులేటి కి కాంట్రాక్టు ఇచ్చారా? సీఎం సమాధానం చెప్పాలి. కొంత మంది ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని పొంగులేటి సీఎంను బ్లాక్మెయిల్ చేస్తున్నారు’అని మహేశ్వర్‌రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. -
TG: సీఎల్పీ సమావేశం.. రేపు రాజ్యసభ అభ్యర్థిగా సింఘ్వీ నామినేషన్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యకతన సీఎల్పీ సమావేశం జరిగింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరయ్యారు. సమావేశంలో రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ సింఘ్వీని సీఎం రేవంత్ పరిచయం చేశారు.కాగా, తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా సీనియర్ కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ రేపు(సోమవారం) తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇందుకోసం ఆయన ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు వచ్చారు. కాంగ్రెస్ శాసనసభాపక్షం సమావేశానికి హాజరయ్యారు. అభిషేక్ సింఘ్వీ నామినేషన్ ప్రక్రియ, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. -
సీఎం అపాయింట్మెంట్ కోసం యత్నించాం: టాలీవుడ్ నిర్మాత కామెంట్స్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టాలీవుడ్ దర్శక, నిర్మతా తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. తాము సీఎం అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించామని వెల్లడించారు. కానీ సీఎంఓ ఆఫీస్ నుంచి తమకు ఎలాంటి పిలుపు రాలేదని స్పష్టం చేశారు. అందువల్లే సీఎంను కలిసే అవకాశం దక్కలేదని తమ్మారెడ్డి తెలిపారు.గద్దర్ పేరుతో అవార్డ్స్ తీసుకోవడానికి తమకెలాంటి అభ్యంతరం లేదని తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇప్పటికే సీఎం అపాయింట్మెంట్ కోసం రెండు, మూడుసార్లు కాల్ చేసినా ఎవరూ స్పందించలేదన్నారు. మీరు ఎప్పుడు రమ్మంటే.. అప్పుడు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మిస్ కమ్యూనికేషన్ లోపం వల్ల ఇలా జరిగిందని ఆయన క్లారిటీ ఇచ్చారు.ఎలాంటి రెస్పాన్స్ రాలేదు.. సీఎం రేవంత్ రెడ్డికాగా.. అంతకుముందే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గద్దర్ అవార్డులపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు టాలీవుడ్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంపై తన అసహనాన్ని బయటపెట్టారు. సి.నారాయణ రెడ్డి 93వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ కామెంట్స్ చేశారు.కాగా.. ఈ ఏడాది జనవరిలో ప్రతిష్టాత్మక నంది అవార్డులని.. గద్దర్ అవార్డులతో భర్తీ చేయాలనే కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ కొత్త కార్యక్రమాన్ని సమర్థవంతంగా ఎలా అమలు చేయాలనే విషయమై అభిప్రాయాలు, సూచనలు అందించాలని తెలుగు సినీ ఇండస్ట్రీని కోరారు. అయితే దీని గురించి టాలీవుడ్ నుంచి ఎలాంటి స్పందన లేకపోయేసరికి.. సినీ పరిశ్రమ మౌనంగా ఉంది, తెలుగు చిత్ర పరిశ్రమలో చేసిన కృషికి, విజయాలకు గౌరవంగా గద్దర్ అవార్డులని ప్రకటించామని, కానీ ఇండస్ట్రీ పెద్దల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరమని రేవంత్ రెడ్డి అన్నారు. -
ఈసారి అప్పులు రూ.62,012కోట్లు
సాక్షి, హైదరాబాద్: ఈసారి బడ్జెట్లో అప్పుల పద్దు అదిరిపోయింది. గత ఏడాది కంటే దాదాపు రూ.10 వేల కోట్లు ఎక్కువగా, మొత్తం రూ.62,012 కోట్లు రుణ సమీ కరణ జరగనుంది. గురువారం అసెంబ్లీలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదన గణాంకాలు ఈ మేరకు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది బహిరంగ మార్కెట్లో రూ.57,112 కోట్లు, కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.3,900 కోట్లు, ఇతర రుణాల రూపంలో రూ.1,000 కోట్లు సేకరించనున్నట్టు ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. ఇక గతంలో తీసుకున్న అప్పులకు అసలు, వడ్డీల చెల్లింపు కోసం రూ.30 వేల కోట్లు కేటాయించడం గమనార్హం. ఇందులో రుణం చెల్లింపుల కోసం రూ.13,117.60 కోట్లు, వడ్డీ చెల్లింపులకు రూ.17,729 కోట్లు ప్రతిపాదించారు. మొత్తం రూ.62 వేల కోట్ల రుణ సమీకరణ చేస్తే,అందులో దాదాపు సగం అంటే రూ.30,846 కోట్లు గతంలో తీసుకున్న అప్పులకు గాను అసలు, వడ్డీల చెల్లింపులకే సరిపోతుందని కేటాయింపులు చెబుతున్నాయి. ఇవి పోగా మిగతా రూ.31,166 కోట్ల రుణాలను ఈ ఏడాది వినియోగించుకుంటామని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. పెరుగుతున్నఅప్పులు, చెల్లింపులుఏటేటా అప్పుల చిట్టా పెరిగిపోతుందని గత గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2022–23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రాబడుల్లో రూ.44,060 కోట్లు రుణాల కింద వస్తే, 2023–24లో రూ.52,576 కోట్లు తీసుకున్నారు. ఈ ఏడాది రూ.62 వేల కోట్లను అప్పుల పద్దు కింద ప్రతిపాదించడం గమనార్హం. అయితే తీసుకునే అప్పుల కంటేచెల్లింపులు ఎక్కువ చేస్తున్నామని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అనంతరంఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఇదే విషయాన్ని వెల్లడించారు. ఈ ఏడాది జూలై 24నాటికి రూ.35,118 కోట్లు అప్పుగాతీసుకుంటే.. గతంలో ఉన్న అప్పులకు అసలు, వడ్డీ చెల్లింపుల కింద రూ.42,892 కోట్లు కట్టామని చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి ఏటా రూ.6,050 కోట్లు అప్పులకు అసలు, వడ్డీ కింద చెల్లించాల్సి ఉండేదని, కానీ ఇప్పుడు నెలకు రూ.5,365 కోట్లు చెల్లిస్తున్నామని వివరించారు. హైదరాబాద్అభివృద్ధిపైప్రభుత్వానిదిస్పష్టమైన విజన్నగర అభివృద్ధికికేటాయింపులపై మంత్రిఉత్తమ్ కుమార్ రెడ్డి హర్షంసాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా మార్చేందుకు తెలంగాణ వార్షిక బడ్జెట్లో రూ.10 వేల కోట్లు కేటాయించడంతో ప్రభుత్వానికి స్పష్టమైన విజన్ ఉందని పౌరసరఫరాల, నీటిపారుదల శాఖమంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గురువారం శాసనసభలో తెలంగాణ బడ్జెట్ 2024–25 ప్రవేశపెట్టిన అనంతరం ఉత్తమ్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ బడ్జెట్ హైదరాబాద్ వాసుల జీవన నాణ్యతను పెంపొందించడానికి, ఆర్థిక, సాంస్కృతిక కేంద్రంగా దాని స్థానాన్ని పటిష్టం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తోందని తెలిపారు. ‘మెట్రో విస్తరణ ఓల్డ్ సిటీ–శంషాబాద్ విమానాశ్రయంతో సహా కీలక ప్రాంతాలను కలుపుతుంది. నాగోల్, ఎల్బీ నగర్, చాంద్రాయణగుట్ట స్టేషన్లను ఇంటర్ చేంజ్లుగా అభివృద్ధి చేయాలని, కనెక్టివిటీని మరింత పెంచాలని బడ్జెట్లో ప్రతిపాదించారు. లండన్‌లోని థేమ్స్ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టు తరహాలో మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌గా మార్చడానికి రూ.1,500 కోట్లు కేటాయించింది. హైడ్రా ఏర్పాటు దేశానికే ఆదర్శం’ అని ఉత్తమ్ తెలిపారు. నీటి పారుదల శాఖకు రూ.22,301 కోట్లు కేటాయించారని, ఈ నిధులతో పెండింగ్‌లో ఉన్న 6 నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తయ్యేలా చూస్తామని వెల్లడించారు. ఆరు గ్యారంటీలకు హామీపత్రం: రేవంత్సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2024–25 వార్షిక బడ్జెట్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరు గ్యారంటీలకు హామీపత్రంగా అభివర్ణించారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమన్వయం చేసుకొని బడ్జెట్‌కు రూపకల్పన చేశామన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ గురువారం సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ‘ప్రజల ఆకాంక్షలు, రాష్ట్రాభివృద్ధి, పేదల సంక్షేమాన్ని సమన్వయం చేసుకొని రూపొందించిన బడ్జెట్ ఇది. ఆరు గ్యారంటీలకు హామీ పత్రం ఈ బడ్జెట్. ఆర్భాటపు అంకెలు కాదు, వాస్తవిక లెక్కల బడ్జెట్ ఇది. కేంద్ర వివక్ష.. గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసాల మధ్య తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చేలా ఈ బడ్జెట్‌ను రూపొందించిన డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖామాత్యులు మల్లు భట్టి విక్రమార్క, ఆయనబృందానికి నా అభినందనలు’ అని రేవంత్ పోస్ట్ చేశారు. -
నీతిఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్లో తెలంగాణ పట్ల వివక్ష చూపడానికి, నిధుల కేటాయింపులో అన్యాయానికి నిరసనగా ఈ నెల 27న జరిగే నీతిఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు నిరసన వ్యక్తం చేస్తోందని తెలిపారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై బుధవారం అసెంబ్లీలో ప్రత్యేక చర్చ నిర్వహించారు. అనంతరం దీనిపై సీఎం రేవంత్ తీర్మానం ప్రవేశపెట్టి మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..‘‘2014లో కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టిననాటి నుంచి రాష్ట్రానికి నిధుల కేటాయింపులో, విభ జన హామీల అమల్లో కక్షపూరిత వైఖరినే అవలంబిస్తున్నారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ అధికారంలో ఉన్న పదేళ్లు విభజన చట్టంలోని అంశాలేవీ అమలు కాలేదు. మేం అధికారం చేపట్టాక రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో సఖ్యతగా వ్యవహరిస్తున్నాం. కేంద్ర పెద్దలను కలసి సాయం కోసం విజ్ఞప్తులు చేశాం. స్వయంగా నేను మూడు సార్లు ప్రధానిని.. 18 సార్లు కేంద్ర మంత్రులను కలిశా. తెలంగాణకు నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశా. మేం ప్రజాస్వామ్య స్ఫూర్తితోనే కలిశాం తప్ప.. ఎవరి దగ్గరో వంగిపోవడానికో.. లొంగిపోవడానికో కాదు. రాష్ట్రానికి వచ్చిన ప్రధానిని కలసి ఓ మెట్టు దిగి.. పెద్దన్నగా సంబోధించి రాష్ట్రానికి మేలు చేయాలని కోరాను. ప్రధానిని పెద్దన్న అన్నందుకు కొందరు నన్ను విమర్శించారు. నాకు సీఎం పదవి ఎవరి దయా దాక్షిణ్యాలతోనో రాలేదు. ప్రజల వల్ల, మా పార్టీ వల్ల, 64 మంది ఎమ్మెల్యేలు నన్ను నాయకుడిగా ఎన్నుకోవడం వల్ల వచ్చింది. ఎవరినో పెద్దన్న అన్నందుకు రాలేదు. బడ్జెట్లో అన్యాయాన్ని సరిదిద్దాలని కేంద్రాన్ని కోరేందుకే శాసనసభలో చర్చ లేవనెత్తాం. కానీ కొందరు సభ్యులు రాష్ట్ర ప్రభుత్వాన్నే దోషిగా నిలబెట్టాలని, ప్రధాని మోదీని కాపాడాలని ప్రయత్నించడం రాష్ట్రమంతా చూసింది.అది కక్షపూరిత వైఖరిదేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి అన్ని రాష్ట్రాల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కృషి చేసింది. తొలి ప్రధాని నెహ్రూ అభివృద్ధికి బాటలు వేస్తే.. ఆయన స్ఫూర్తితో ఇందిరాగాంధీ ఎన్నో సరళీకృత విధానాలను తీసుకొచ్చారు. తర్వాత సోనియాగాంధీ నేతృత్వంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా దేశాన్ని ప్రపంచానికి ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేశారు. తెలంగాణ అభివృద్ధికి కావాల్సినవన్నీ విభజన చట్టంలో పొందుపరిచి సోనియా తెలంగాణ ఇచ్చారు. కానీ 2014లో అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం.. ఆ హామీల అమల్లో నిర్లక్ష్యం వహించింది. తెలంగాణపై కేంద్రానిది వివక్ష మాత్రమే కాదు.. కక్షపూరిత వైఖరి.రూపాయి చెల్లిస్తే.. వస్తున్నది 43 పైసలేరాష్ట్రం నుంచి ఒక రూపాయిని పన్నులుగా చెల్లిస్తే కేంద్రం తెలంగాణకు తిరిగిస్తున్నది 43 పైసలే. బిహార్‌కు రూపాయికి రూ.7.26 అందుతున్నాయి. యూపీకి కూడా అంతే. ఐదేళ్లలో తెలంగాణ నుంచి రూ.3.68లక్షల కోట్లు పన్నుల రూపంలో కేంద్రానికి వెళితే.. రాష్ట్రానికి ఇచ్చేది రూ.1.68లక్షల కోట్లు మాత్రమే. మోదీ ఏమైనా గుజరాత్‌లోని ఎస్టేట్లు అమ్మి తెలంగాణకు ఇచ్చారా? ఆయన జాగీర్దారు అమ్మి ఇచ్చారా? మన హక్కులు మనకు ఇవ్వకపోవడం వల్లే ఈ అంశంపై సభలో చర్చించాల్సిన పరిస్థితి. ఐదు దక్షిణాది రాష్ట్రాలు పన్నుల రూపంలో కేంద్రానికి చెల్లిస్తున్నది రూ.22.26 లక్షల కోట్లు అయితే.. కేంద్రం వీటికి తిరిగి ఇచ్చింది రూ.6.42 లక్షల కోట్లు మాత్రమే. అదే యూపీ పన్నుల రూపంలో కేంద్రానికి ఇచ్చినది రూ.3.41 లక్షల కోట్లు అయితే.. కేంద్రం యూపీకి తిరిగిచ్చింది రూ.6.91 లక్షల కోట్లు. ఐదు దక్షిణాది రాష్ట్రాలకు ఇచ్చిన నిధుల కంటే ఒక్క యూపీకి ఇచ్చినది ఎక్కువ. ఇదీ కేంద్రం వివక్ష కాదా.. దేశం 5 ట్రిలియన్ ఎకానమీ సాధించాలంటే హైదరాబాద్ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని ప్రధానికి స్పష్టంగా చెప్పాం. అందరం ఏకతాటిపై ఉంటే కేంద్రం మెడలు వంచి నిధులు సాధించుకోవటం పెద్ద కష్టం కాదు..’’ అని రేవంత్ పేర్కొన్నారు. -
రాచకొండలో ఫిలింసిటీ: సీఎం రేవంత్
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘ఎత్తైన కొండలు, గుట్టలు, ఎటుచూసినా పచ్చని చెట్లతో ఎంతో ఆహ్లాదంగా కనిపించే రాచకొండ గుట్టల్లో అంతర్జాతీయ హంగులతో ఫిలింసిటీని ఏర్పాటు చేస్తాం. ఫార్మాసిటీ కోసం సేకరించిన 20 వేల ఎకరాల్లో అంతర్జాతీయ ఐటీ పార్కులు, కాలుష్య రహిత ఫార్మాస్యూటికల్ కంపెనీలు, స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఎలక్ట్రిక్ కార్ల తయారీ పరిశ్రమలు, బ్యాటరీ తయారీ కంపెనీలు ఏర్పాటు చేస్తాం. న్యూయార్క్ తరహాలో మహేశ్వరంలో మరో విశ్వనగరాన్ని తీర్చిదిద్దుతాం..’ అని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లష్కర్‌గూడలో ‘కాటమయ్య రక్షణ కవచం పథకం’ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. కల్లు గీత కార్మీకుల రక్షణ కోసం ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులు (ఎవరెస్ట్ అధిరోహించిన మాలోతు పూర్ణతో కూడిన బృందం) రూపొందించిన కిట్లను ఈ సందర్భంగా కల్లు గీత కార్మీకులకు అందజేశారు. కిట్ల పనితీరును పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పర్యాటక ప్రదేశంగా రంగారెడ్డి జిల్లా ‘దేశంలోనే ఎక్కడా లేని విధంగా రంగారెడ్డి జిల్లాలో భూముల ధరలు ఉన్నాయి. ఎకరం రూ.100 కోట్లకు పైగా పలుకుతోంది. రాబోయే రోజుల్లో జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. ప్రపంచంలోనే ఉత్తమ పర్యాటక క్షేత్రంగా విరాజిల్లుతుంది. అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు కొత్తగా రాబోతున్న రీజనల్ రింగ్ రోడ్డు తెలంగాణకు ఓ మణిహారంగా నిలుస్తుంది. దాని చుట్టూ కొత్తగా పరిశ్రమలు వస్తాయి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇటు హయత్‌నగర్, అటు శంషాబాద్ వరకు మెట్రో రైలు విస్తరిస్తాం..’ అని రేవంత్ చెప్పారు. వెంచర్లలోనూ ఈత, తాటి చెట్లు ‘వృత్తిదారులకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. వీరి కోసం ప్రభుత్వ ఖాళీ భూముల్లో, రీజనల్ రింగ్ రోడ్డు చుట్టూ, చెరువులు, కుంటలు, కాలువగట్లు, జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయి రహదారులకు ఇరువైపులా ఈత, తాటి చెట్లు నాటిస్తాం. వన మహోత్సవంలో భాగంగా ఈ చెట్లను పెద్ద సంఖ్యలో నాటాల్సిందిగా ఎక్సైజ్, అటవీ శాఖలకు ఇక్కడి నుంచే ఆదేశాలు జారీ చేస్తున్నా. కొత్తగా పుట్టుకొచ్చే రియల్ ఎస్టేట్ వెంచర్లతో పాటు గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాల్లోనూ ఈత, తాటి చెట్లకు ప్రాధాన్యత ఇచ్చేలా నిబంధనలు తీసుకొస్తాం. చేతి వృత్తులకు సమ న్యాయం కల్పిస్తాం. ప్రభుత్వాన్ని నిలబెడతామంటూ పార్టీలో చేరుతున్నారు! ‘కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా ఎన్నికలే. ఇటీవలే ఎన్నికలు ముగిశాయి. ప్రభుత్వం పాలనపై దృష్టి పెట్టింది. సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వస్తోంది. ఈ లోపే బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు పన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వం కూలిపోతుందని విష ప్రచారం చేస్తున్నారు. ఫాంహౌస్‌లలో పడుకున్నోళ్లు ప్రభుత్వాన్ని కూలుస్తామంటుంటే.. ప్రజాక్షేత్రంలో తిరిగే వారి ఎమ్మెల్యేలు మాత్రం నిలబెడతామంటూ వచ్చి పార్టీలో చేరుతున్నారు. వచ్చే పదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది. ప్రజలు ఆశించే అన్ని పనులు పూర్తి చేసి తీరుతుంది. పోటీ పరీక్షల షెడ్యూల్‌పై నిరుద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రతిపక్ష నేతల మాటలు విని భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు. అయినదానికి, కాని దానికి ఆవేశపడి రోడ్లెక్కొద్దు. ఏదైనా ఉంటే మంత్రులు, ఎమ్మెల్యేలను కలిసి మాట్లాడండి. అంతా కలిసి సమస్యను పరిష్కరించుకునేందుకు కృషి చేద్దాం..’ అని సీఎం చెప్పారు. కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, డి.శ్రీధర్‌బాబు, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్ ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, ప్రకాశ్‌గౌడ్, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం, జిల్లా కలెక్టర్ శశాంక తదితరులు పాల్గొన్నారు. కల్లెంత?..నీళ్లెంత? – గీత కార్మికులతో సీఎం సరదా సంభాషణ అబ్దుల్లాపూర్‌మెట్: ‘ఏం లక్ష్మయ్యా..రోజుకు ఎన్ని చెట్లు ఎక్కుతావ్? ఎన్ని సీసాల కల్లు తీస్తావ్? తీసేదాంట్లో కల్లెంత.. నీళ్లెంత..? రోజుకు కనీసం రూ.వెయ్యి అయినా మిగులుతుందా? ఊళ్లో బెల్ట్ షాపులు ఏమైనా ఉన్నాయా..?’ ‘ఏం రంగయ్యా.. ఏం కిష్టయ్యా.. ప్రభుత్వం ఇచ్చిన రక్షణ కిట్టు మంచిగుందా? పనిచేస్తోందా? కిట్టును కనిపెట్టినోళ్లకు ఏమైనా దావత్ ఇచ్చారా..?’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి లష్కర్‌గూడలో కల్లుగీత కార్మీకులతో కొద్దిసేపు ముచ్చటించారు. వృత్తిపరంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు స్పీకర్, మంత్రులతో కలిసి వన మహోత్సవంలో భాగంగా ఈత మొక్కలు నాటారు. గీత కార్మీకులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. వైఎస్సార్ హయాంలో అనేక సంక్షేమ పథకాలు 2004 నుంచి 2014 మధ్య కాలంలో దివంగత నేత వైఎస్సార్ నాయకత్వంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం, రాజీవ్ ఆరోగ్యశ్రీ వంటి పథకాలు కాంగ్రెస్ సృషే్ట. గత ప్రభుత్వం చనిపోయిన గీత కార్మీకులకు రూ.7.90 కోట్లు బకాయిపడింది. పెండింగ్‌లో ఉన్న ఈ బకాయిలను తక్షణమే విడుదల చేస్తాం..’ అని ముఖ్యమంత్రి తెలిపారు.