కేసీఆర్ పెట్టించే కేసులు.. వెంట్రుక కూడా పీకలేవు | Revanth redddy takes on kcr | Sakshi
Sakshi News home page

కేసీఆర్ పెట్టించే కేసులు.. వెంట్రుక కూడా పీకలేవు

Published Sun, Sep 7 2014 3:17 PM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM

కేసీఆర్ పెట్టించే కేసులు.. వెంట్రుక కూడా పీకలేవు - Sakshi

కేసీఆర్ పెట్టించే కేసులు.. వెంట్రుక కూడా పీకలేవు

హైదరాబాద్: మెదక్ ఉప ఎన్నికల ప్రచారంలో విమర్శల పర్వం తారస్థాయికి చేరుకుంది. నాయకులు విమర్శలు, సవాళ్లతో ఎన్నికల వాతావారణాన్ని వేడిక్కిస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

ఆదివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి.. కేసీఆర్ పెట్టించే అక్రమ కేసులకు భయపడేవారు ఎవరూ లేరని, ఆ కేసులతో వెంట్రుక కూడా పీకలేవని అన్నారు. అవినీతిపై బహిరంగ విచారణకు సిద్ధమా అని కేసీఆర్కు సవాల్ విసిరారు. మెదక్ ఎన్నికల ప్రచారంలోనే ఇంతకుముందు బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డి, రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ నాయకులపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. తమను మరోసారి సమైక్యాంధ్ర మద్దతుదారులని అంటే చెప్పుతో కొడతామంటూ వ్యాఖ్యానించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement