by polls
-
నాటకీయ పరిణామాల మధ్య స్వతంత్ర అభ్యర్థి అరెస్ట్
జైపూర్: రాజస్థాన్‌లోని డియోలీ-యునియారా నియోజవర్గానికి బుధవారం ఉప ఎన్నిక పోలింగ్ జరిగింది.అయితే.. ఈ నియోజక వర్గంలో సంరవత పోలింగ్ కేంద్రంలో సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్ (ఎస్డీఎం)గా అధికారి అమిత్ చౌదరీ ఎన్నికల పోలింగ్‌ను పర్యవేక్షించారు. ఈ క్రమంలో అమిత్ చౌదరీపై ఈనియోజకర్గంలోస్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన నరేష్ మీనా చెంపదెబ్బ కొట్టడం కలకలం రేపింది. ఉప ఎన్నికలో ఎన్నికల అధికారిని చెంపదెబ్బ కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా హై డ్రామా మధ్య గురువారం నరేష్ మీనా పోలీసులు అరెస్టు చేశారు. పోలీసు బృందం ‘వ్యూహాత్మక’ ఆపరేషన్ చేపట్టి అతన్ని అరెస్టు చేశారు. పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకోవడానికి ముందు నరేష్ మీనా మీడియాతో మాట్లాడారు. ‘‘ నేను లొంగిపోను. నా మద్దతుదారులంతా పోలీసులను చుట్టుముట్టండి. ట్రాఫిక్ జామ్ చేయండి’’అని అనుచరులకు పిలుపునిచ్చారు.‘‘ భారీగా పోలీసులు.. లాఠీలు, షీల్డ్‌లను ధరించి.. మేము వ్యూహాత్మకంగా అతను ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు. మేం అతన్ని లొంగిపోవాలని అభ్యర్థించాం. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు’’ అని చెప్పామని టోంక్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ వికాస్ సంగ్వాన్ తెలిపారు.మరోవైపు.. పోలింగ్ బూత్‌లో మూడు అదనపు ఓట్లను చేర్చేందుకు చౌదరి కుట్ర పన్నారని మీనా ఆరోపించారు. అయితే పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ‘‘ కొందరు ఎన్నికలను బహిష్కరిస్తున్నారు. ఎస్డీఎం, తహసీల్ అధికారులు వారిని ఒప్పించేందుకు వెళ్లారు. చర్చల సమయంలో స్వతంత్ర అభ్యర్థి (నరేష్ మీనా) ఎస్డీఎంను చెప్పుతో కొట్టారు’’ అని ఎస్పీ సాంగ్వాన్ వెల్లడించారు. గుర్తుతెలియని వ్యక్తులు (మీనా మద్దతుదారులు), పోలీసుల మధ్య చెలరేగిన హింసాకాండలో పోలీసు వాహనాలతో సహా ఎనిమిది కార్లు, 10పైగా మోటార్‌సైకిళ్లకు నిప్పు పెట్టారు. శాంతిభద్రతలను పునరుద్ధరించడానికి పోలీసులు అదనపు బలగాలను మోహరించారు. -
Rajasthan Bypoll: రెబల్ నేతను సస్పెండ్ చేసిన కాంగ్రెస్
రాజస్థాన్‌లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు మరో వారం రోజుల్లో (నవంబర్ 13న) ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన పార్టీ రెబల్ నేత నరేష్ మీనాను కాంగ్రెస్ గురువారం సస్పెండ్ చేసింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర ఇన్చార్జి సుఖ్జీందర్ సింగ్ రంధావా ఉత్తర్వులు జారీ చేశారు.ఉప ఎన్నికల్లో డియోలి-ఉనియారా అసెంబ్లీ స్థానం నుంచి నరేష్ మీనా పోటీ చేయాలని భావించారు. కానీ అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ కేసీ మీనాను బరిలోకి దింపింది. దీంతో పార్టీ టికెట్‌నిరాకరించడంతో తీవ్ర అసంతృప్తి చెందిన నరేష్ మీనా.. భారత్ ఆదివాసీ పార్టీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన హస్తం పార్టీ నరేష్ మీనాపై సస్పెండ్ వేటు వేసింది .ఇదిలా ఉండగా కాగా రాజస్థాన్‌తోపాటు తొ మ్మిది రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న48 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 13, 20న ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు. -
మెరుగైన ఫలితాలు సాధిస్తాం: అఖిలేశ్
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో జరగబోయే 10 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో సమాజ్‌వాదీ మెరుగైన ఫలితాలు సాధిస్తుందని ఆ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ బుధవారం విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అధికార బీజేపీలో అంతర్గత పోరు ఉందని, అధికారం కోసం వారి కుమ్ములాటలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. ఇంతకుముందు ఇతర పార్టీల్లో చీలిక రాజకీయాలు చేసిన బీజేపీ ఇప్పుడు సొంత పార్టీలోనూ చీలికలకు పాల్పడుతోందన్నారు. -
ఉప ఎన్నికల్లో ఎన్డీయేకు షాక్.. ఇండియా కూటమి జోరు
ఢిల్లీ, న్యూఢిల్లీ: ఏడు రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి భారీ విజయాన్ని అందుకుంది. ఏకంగా 10 స్థానాల్లో ఇండియా కూటమి విజయం సాధించగా.. కేవలం రెండు స్థానాల్లోనే ఎన్డీయే కూటమి విజయాన్ని అందుకుంది. మరో స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించారు. కాగా, ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం నుంచే ఇండియా కూటమి అభ్యర్థులు లీడింగ్‌లో కొనసాగారు. ఇక, బెంగాల్ తృణముల్ కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. నాలుగు స్థానాల్లో ఉప ఎన్నికలు జరుగగా అన్ని స్థానాల్లో టీఎంసీ అభ్యర్థులు గెలుపొందారు. బెంగాల్‌లోని రాయిగంజ్ (కృష్ణ కల్యాణి), రణఘాట్ సౌత్ (ముకుత్ మణి అధికారి), బాగ్ద (మధుపర్ణ ఠాకూర్), మాణిక్తలా(సప్తి పాండే) విజయం సాధించారు. ఇక్కడ బీజేపీకి గట్టి షాక్ తగింది. మరోవైపు.. హిమాచల్ ప్రదేశ్‌లోని డెహ్ర, నలగార నియోజకవర్గాల్లో కాంగ్రెస్ విజయం సాధించగా.. హమీర్పూర్ స్థానంలో బీజేపీ గెలుపొందింది. ఇక, మధ్యప్రదేశ్‌లోని అమర్వర అసెంబ్లీలో బీజేపీ అభ్యర్ధి కమలేష్ ప్రతాప్ సింగ్ విజయం సాధించారు. పంజాబ్‌లోని జలంధర్ వెస్ట్ స్థానం నుంచి ఆమ్ ఆద్మీ అభ్యర్థి మోహిందర్ భగత్ విజయం అందుకున్నారు. తమిళనాడులోని విక్రవండి అసెంబ్లీ స్థానంలో డీఎంకే అభ్యర్థి అన్నియుర్ శివ ఘన విజయం సాధించారు. ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ (లాక్ పత్ సింగ్), మంగళూర్(క్వాజి మొహమ్మద్ నిజాముద్దిన్) కాంగ్రెస్ విజయభేరి మోగించింది. కాగా, బీహార్‌లోని రూపౌలి స్థానంలో స్వతంత్ర అభ్యర్థి శంకర్ సింగ్ గెలుపొందడం ఆసక్తికరంగా మారింది. మొత్తంగా.. ఉప ఎన్నికల ఫలితాలు ఇండియా కూటమి బూస్ట్ ఇవ్వగా, ఎన్డీయే కూటమికి షాకిచ్చాయి.సీఎం సతీమణి విజయం..హిమాచల్ ప్రదేశ్‌లోని దేహ్రాలో రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు సతీమణి, కాంగ్రెస్ అభ్యర్థి కమలేశ్ ఠాకుర్ విజయం సాధించారు. తన సమీప భాజపా అభ్యర్థిపై 9వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. నాలాగఢ్ స్థానంలో కాంగ్రెస్ నేత హర్దీప్ సింగ్ బవా 8,990 ఓట్ల తేడాతో భాజపా అభ్యర్థిపై విజయం సాధించారు. ఇక, హమీర్పుర్ స్థానంలో భాజపా అభ్యర్థి ఆశీష్ శర్మ గెలుపొందారు.బెంగాల్లో తృణమూల్ క్లీన్‌స్వీప్..పశ్చిమ బెంగాల్లో ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుపొంది జోరుమీదున్న తృణమూల్ కాంగ్రెస్.. తాజా ఉప ఎన్నికల్లోనూ హవా కొనసాగించింది. ఇక్కడ రాయ్‌గంజ్, రాణాఘాట్, బాగ్దా, మాణిక్తలా.. నాలుగు స్థానాల్లోనూ టీఎంసీ అభ్యర్థులు విజయం సాధించారు. ఇక, ఉత్తరాఖండ్‌లో మంగలౌర్, బద్రీనాథ్ స్థానాలను కాంగ్రెస్ దక్కించుకుంది.పంజాబ్ బైపోల్ ఆప్‌దే..పంజాబ్‌లోని జలంధర్ స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి మోహిందర్ భగత్ విజయం సాధించారు. తన సమీప భాజపా అభ్యర్థి షీతల్‌పై 37వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తమిళనాడులోని విక్రావండి స్థానంలో డీఎంకే అభ్యర్థి అన్నియుర్ శివ విజయం సాధించారు. మధ్యప్రదేశ్‌లోని అమర్వాడాలో భాజపా నేత కమలేశ్ షా గెలుపొందారు. బిహార్‌లోని రూపౌలి స్థానంలో స్వతంత్ర అభ్యర్థి శంక్ సింగ్ జయకేతనం ఎగురవేశారు. Assembly by-elections: Out of 13 Assembly seats, Congress won four seats. TMC won 4 seats. AAP won the Jalandhar West seat in Punjab. BJP won 2 seats, DMK won 1 seat. Independent candidate Shankar Singh won on Rupauli seat of Bihar. pic.twitter.com/lJWtsVWI46— ANI (@ANI) July 13, 2024 -
ఏపీలో 2 ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల
సాక్షి, ఢిల్లీ/విజయవాడ: ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. సి.రామచంద్రయ్య, షేక్ మహ్మద్ ఇక్బాల్‌పై మండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది.ఏపీతో పాటు కర్ణాటక(జగదీష్ శెట్టర్-రాజీనామా), బీహార్(రామ్‌బాలి సింగ్-అనర్హత వేటు), ఉత్తరప్రదేశ్(స్వామి ప్రసాద్ మౌర్య-రాజీనామా) మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 25వ తేదీన ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల కానుంది.నామినేషన్ల దాఖలుకు ఆఖరు తేదీ జులై 2 కాగా, ఆ మరుసటి రోజే నామినేషన్ల పరిశీలన ఉండనుంది. జులై 12వ తేదీన ఉదయం 9గం. నుంచి సాయంత్రం 4గం. దాకా పోలింగ్ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం ఫలితాలు వెల్లడిస్తారు. -
దేశవ్యాప్తంగా ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల
న్యూఢిల్లీ, సాక్షి; సార్వత్రిక ఎన్నికల హడావిడి ముగియగానే మరో ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఏడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఉప ఎన్నికలకు సంబంధించి తేదీలను బుధవారం విడుదల చేసింది. పశ్చిమ బెంగాల్లో 4, హిమాచల్ ప్రదేశ్‌లో 3, ఉత్తరాఖండ్‌లో 2, బీహార్ తమిళనాడు, మధ్యప్రదేశ్, పంజాబ్ ఒక్కొ అసెంబ్లీ స్థానం.. మొత్తం 13 స్థానాల్లో ఉప ఎన్నికకు తేదీల్ని ప్రకటించింది. అంతేకాదు.. ఆ సీట్లు ఎందుకు ఖాళీ అయ్యాయనే కారణాలను కూడా వివరించింది. ఏడు రాష్ట్రాల అసెంబ్లీ స్థానాల బై పోలింగ్ జులై 10వ తేదీన పోలింగ్ జరగనుంది. అలాగే.. జులై 13వ తేదీన కౌంటింగ్.. అదే రోజు సాయంత్రం ఫలితాల్ని వెల్లడిస్తారు.ఇదీ చదవండి: మూడోసారి ప్రధానిగా మోదీ, తొలి సంతకం దేనిమీద అంటే.. -
కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేశ్ విజయం
updates... సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ విజయం13206 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేశ్ గెలుపొందారు.బీజేపీ అభ్యర్థికి 40,445 ఓట్లు వచ్చాయి.బీఆర్ఎస్ 34462 ఓట్లు వచ్చాయి.బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. కాంటోన్మెంట్ ఉప ఎన్నికల కౌంటింగ్‌లో కాంగ్రెస్ ఆధిక్యంకాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేష్ 8779 ఓట్లతో లీడింగ్బీజేపీ 22887 ఓట్లుబీఆర్ఎస్-21489 ఓట్లు కంటోన్మెంట్ ఉప్ప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ ముందంజలో ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్ధి నివేదిత సాయన్న రెండోస్థానంలో కొనసాగుతున్నారు..కాంగ్రెస్- శ్రీగణేష్ -18140బీఆర్ఎస్-నివేదిత- 11739బీజేపీ-వంశీ తిలక్-9160కాంగ్రెస్ అభ్యర్ధి 6401 ఓట్ల ఆధిక్యంలో కొనసాగున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక మొదటి రౌండ్ ఫలితాలుమొదటి రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ 855 ఓట్ల మెజారిటీకాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ 3995టిఆర్ఎస్ అభ్యర్థి నివేధిత 3140 బిజెపి అభ్యర్థి తిలక్ 2666 సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్ధి శ్రీ గణేష్ ముందంజసాక్షి, హైదరాబాద్: తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నిక ఫలితం కూడా మరికొద్ది గంటల్లో రానుంది. ఈ రోజు ఉదయం 8 గంటలకే కౌంటింగ్ ప్రారంభం అయింది. మొత్తం 17 రౌండ్లలో ఓట్లు లెక్కింపులో భాగంగా 14 టేబుళ్లు ఈసీ ఏర్పాటు చేసింది. అయితే లోక్‌సభ ఫలితాల కంటే ముందే కంటోన్మెంట్ ఉపఎన్నికల ఫలితం వెలువడే అవకాశం ఉంది. మధ్యాహ్నం 3 గంటలల్లోపు కంటోన్మెంట్ విజేత ఎవరనే విషయం తెలిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.బీఆర్ఎస్ ఎమ్మెల్యే మృతితో ఉపఎన్నికకంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మృతితో 2023లో జరిగిన ఎన్నికల్లో ఆయన కుమార్తె లాస్య నందిత బీఆర్ఎస్ తరుఫున పోటీ చేసి విజయం సాధించారు. అయితే కొన్ని నెలలకే ఆమె రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఈ ఉప ఎన్నిక జరిగింది. బీఆర్ఎస్ తరఫున సాయన్న చిన్న కుమార్తె నివేదిత బరిలో నిలిచింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి స్వల్వ తేడాతో ఓడిన శ్రీగణేష్ ఈ సారి కాంగ్రెస్ నుంచి రంగంలోకి దిగారు. బీజేపీ తరపున వంశతిలక్ పోటీ చేశాడు. వీరితో మరో 12 మంది ఈ ఉప ఎన్నికలో పోటీ చేశారు. మే 13న ఎన్నికలు జరిగాయి. అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 2,53,706 మంది ఓటర్లు ఉంటే 1,30,929 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బోణీ కొట్టాలని కాంగ్రెస్.. పట్టు కోల్పోవద్దని బీఆర్ఎస్కంటోన్మెంట్ ఉప ఎన్నికను అటు అధికార పార్టీ కాంగ్రెస్‌తో ఆటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అలాగే బీజేపీ కూడా ఈ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు తీవ్రంగా కృషి చేసింది. అధికార కాంగ్రెస్‌కి గ్రేటర్ హైదరాబాద్‌లో ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన వారు ఒక్కరు కూడా గెలవలేదు. ఈ ఉప ఎన్నికలో గెలిచి బోణీ కొట్టాలని కాంగ్రెస్ భావించింది. ఆ దిశగానే విస్తృత ప్రచారం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనతో పాటు అనేక హామీలు గుప్పించారు. పట్టు కోల్పోరాదని బీఆర్ఎస్ తీవ్రంగా ప్రయత్నించింది. దేశవ్యాప్తంగా భాజపా గాలి వీస్తుందనే సంకేతాలతో ఆ పార్టీ విస్తృతంగా ప్రచారం చేసింది. మరి కంటోన్మెంట్ ప్రజలు ఎవరికి అధికారం కట్టబెట్టారనేది మరికొద్ది గంటల్లో తేలనుంది. -
కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్ధిగా నివేదిత
సాక్షి, హైదరాబాద్: కంటోన్మెంట్ ఉప ఎన్నికలకు బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదిత పేరు ఖరారైంది. దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు నివేదితను కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ ప్రకటించారు. బుధవారం పార్టీ ముఖ్య నేతలతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన లాస్య నందిత ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయంలో తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో లాస్య నందిత సోదరి నివేదితను బీఆర్ఎస్ బరిలోకి దింపింది. లోక్‌సభ ఎన్నికలతోపాటు మే 13న కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి. చదవండి: రేవంత్ ఐదేళ్లు సీఎంగా ఉండాలని కోరుకుంటున్నా: కేటీఆర్ -
కాంగ్రెస్ రెబల్‌కు బీజేపీ టికెట్.. మాజీ మంత్రి రాజీనామా
హిమాచల్‌ప్రదేశ్ మాజీ మంత్రి, లాహౌల్ - స్పితి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బీజేపీ నేత రామ్‌లాల్ మార్కండ పార్టీకి రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఓడించిన కాంగ్రెస్ రెబల్‌కు తాజా అసెంబ్లీ ఉప ఎన్నకల్లో బీజేపీ టికెట్ ఇవ్వడంతో పార్టీ నుంచి రామ్ లాల్ మార్కండ వైదొలిగారు. అనర్హత వేటు పడిన ఆరుగురు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ టికెట్లు ప్రకటించిన గంటల వ్యవధిలోనే రామ్‌లాల్ మార్కండ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. లాహౌల్- స్పితి నుంచి ఉప ఎన్నికలో పోటీ చేస్తానని ప్రకటించారు. అది కూడా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు సంకేతాలివ్వడం గమనార్హం. జై రామ్ ఠాకూర్ నేతృత్వంలోని గత బీజేపీ ప్రభుత్వంలో రామ్ లాల్ మార్కండ వ్యవసాయ, గిరిజనాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌లో ఉన్న ఠాకూర్ చేతిలో 1542 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ ఉప ఎన్నికల్లో లాహౌల్- స్పితి నుంచి బీజేపీ టికెట్ ఆశించారు. అయితే బీజేపీ అభ్యర్థుల జాబితాలో కాంగ్రెస్ రెబల్ ఠాకూర్ పేరు రావడంతో రామ్ లాల్ మార్కండ బీజేపీకి రాజీనామా చేశారు. రాష్ట్రంలోని నాలుగు లోక్‌సభ స్థానాలైన హమీర్పూర్, సిమ్లా, మండి, కాంగ్రా స్థానాలతో పాటు హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి జూన్ 1న ఉప ఎన్నికలు జరగనున్నాయి. లాహౌల్- స్పితి నుండి ఠాకూర్‌తో పాటు, ధర్మశాల నుండి సుధీర్ శర్మ, సుజన్పూర్ నుండి రాజిందర్ రాణా, బర్సార్ నుండి ఇందర్ దత్ లఖన్‌పాల్, గాగ్రెట్ నుండి చెతన్య శర్మ, కుట్లేహార్ నుండి దేవిందర్ కుమార్ భుట్టోలను బీజేపీ అభ్యర్థులుగా ప్రకటించింది. -
యెల్లో బ్యాచ్ ఏడుపే.. వైఎస్సార్సీపీ ఎదుగుదల
సాక్షి, అమరావతి/నెట్వర్క్: ఎన్నిక ఏదైనా, ఎప్పుడొచ్చినా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీ విజయ పరంపర కొనసాగుతుందని మరోమారు రుజువైంది. ప్రతిపక్షం ఎన్ని కూతలు కూసినా.. యెల్లో మీడియా ఎన్ని విషపు రాతలు రాసినా.. జనాదరణ సంక్షేమ ప్రభుత్వానిదేనని తేలింది. రాష్ట్రంలో ఫ్యాన్ స్పీడ్‌కు ప్రత్యర్థి పార్టీలు పత్తాలేకుండా పోయాయి. పంచాయతీ ఉప ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీ మద్దతుదారులు విజయ దుందుభి మోగించారు. రాష్ట్రంలో మొత్తం 66 గ్రామాల సర్పంచ్ పదవులకు గాను 64 గ్రామాల్లో ఎన్నికలు జరిగాయి. వాటిలో ఏకగ్రీవమైన 30 సర్పంచ్ పదవులు వైఎస్సార్సీపీ మద్దతుదారులకే దక్కాయి. మిగిలిన 34 సర్పంచ్ పదవుల ఎన్నికల్లో 23 చోట్ల వైఎస్సార్సీపీ మద్దతుదారులు విజయ కేతనం ఎగురవేశారు. 10 స్థానాల్లో టీడీపీ మద్దతుదారులు, ఒక స్థానం జనసేన మద్దతుదారుకు దక్కింది. మొత్తం 1,062 వార్డుల్లో 63 స్థానాల్లో ఎన్నికలు జరగలేదు. ఎన్నికలు జరిగిన 243 వార్డుల్లో 149 వైఎస్సార్సీపీ, 90 టీడీపీ, 4 జనసేన మద్దతుదారులు దక్కించుకున్నారు. మొత్తంగా ఏకగ్రీవాలతో కలిపి 810 చోట్ల వైఎస్సార్సీపీ మద్దతుదారులు, 182 వార్డుల్లో టీడీపీ మద్దతుదారులు, 7 వార్డుల్లో జనసేన మద్దతుదారులు గెలుపొందారు. తాజా గెలుపుపై వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలోని చలివెందుల పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులు విజయం సాధించారు. తాడిపత్రి నియోజకవర్గంలోని జేసీ బ్రదర్స్ సొంత మండలం పెద్దపప్పురులో వైఎస్సార్సీపీ మద్దతు దారులు గెలుపొందారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయ అధికారులు వెల్లడించారు. ఆయా గ్రామాల్లో ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా, మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కొనసాగింది. రెండు గంటల అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టి రాత్రి ఏడు గంటలలోపే విజేతలను ప్రకటించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇలాఖా కుప్పంలో మరోసారి ఆ పార్టీకి తీవ్ర భంగపాటు ఎదురైంది. జిల్లాల వారీగా ఎన్నికలు జరిగిన స్థానాల్లో ఫలితాలు ఇలా.. ► శ్రీకాకుళం జిల్లాలో నాలుగు సర్పంచ్ స్థానాలకుగాను వైఎస్సార్సీపీ మద్దతుదారులు మూడు చోట్ల, టీడీపీ మద్దతుదారు ఒక చోట గెలుపొందారు. ఎన్నికలు జరిగిన 10 వార్డు సభ్యులకుగాను వైఎస్సార్సీపీ మద్దతుదారులు ఆరుచోట్ల, టీడీపీ సానుభూతిపరులు నాలుగు చోట్ల విజయం సాధించారు. ► పార్వతీపురం మన్యం జిల్లాలో ఒక సర్పంచ్ స్థానాన్ని వైఎస్సార్సీపీ బలపర్చిన అభ్యర్థి కైవసం చేసుకున్నారు. రెండు వార్డు సభ్యులకుగాను వైఎస్సార్సీపీ, టీడీపీ బలపర్చిన అభ్యర్థులు చెరో స్థానాన్ని దక్కించుకున్నారు. ► విజయనగరం జిల్లాలో మూడు సర్పంచ్ స్థానాలను వైఎస్సార్సీపీ బలపర్చిన అభ్యర్థులు కైవసం చేసుకోగా.. వైఎస్సార్సీపీ, టీడీపీ మద్దతుదారు చెరో స్థానంలో గెలుపొందారు. ఎనిమిది వార్డు సభ్యులకు గాను వైఎస్సార్సీపీ మద్దతుదారులు ఆరుచోట్ల, టీడీపీ మద్దతుదారులు రెండుచోట్ల విజయం సాధించారు. ► అల్లూరి సీతారామరాజు జిల్లాలో మూడు స్థానాలకుగాను వైఎస్సార్సీపీ బలపర్చిన అభ్యర్థులు రెండు చోట్ల, టీడీపీ మద్దతుదారు ఒకచోట విజయం సాధించారు. ఇక్కడ 14 వార్డు సభ్యులకుగాను 11 మంది వైఎస్సార్సీపీ, ఇద్దరు టీడీపీ మద్దతుదారులు, ఇతరులు ఒకరు గెలుపొందారు. ► అనకాపల్లి జిల్లాలో ఎన్నిక జరిగిన ఒక సర్పంచ్ స్థానంలో టీడీపీ మద్దతుదారుడు గెలుపొందారు. ఈ జిల్లాలో ఏడు వార్డు సభ్యులకుగాను ఐదుచోట్ల వైఎస్సార్సీపీ, రెండుచోట్ల టీడీపీ మద్దతుదారులు విజయం సాధించారు. ► విశాఖ జిల్లాలో ఎన్నిక జరిగిన రెండు వార్డులనూ వైఎస్సార్సీపీ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. ► కాకినాడ జిల్లాలో ఒక సర్పంచ్ స్థానంలో టీడీపీ బలపర్చిన అభ్యర్థి గెలుపొందారు. ఇక్కడ ఆరు వార్డు సభ్యుల స్థానాల్లో వైఎస్సార్సీపీ ఒకటి, టీడీపీ–3, జనసేన మద్దతుదారు ఒకచోట, ఇతరులు ఒక చోట విజయం సాధించారు. ► డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఎన్నిక జరిగిన ఒక సర్పంచ్ స్థానాన్ని వైఎస్సార్సీపీ మద్దతుదారుడు విజయం సాధించారు. ఆరు వార్డు సభ్యులకు గాను ఐదుచోట్ల వైఎస్సార్సీపీ మద్దతుదారులు.. ఇతరులు ఒకచోట గెలుపొందారు. ► తూర్పుగోదావరి జిల్లాలో ఎనిమిది వార్డు సభ్యుల స్థానాలకుగాను నాలుగింటిని వైఎస్సార్సీపీ, మూడింటిని టీడీపీ, ఒక చోట జనసేన మద్దతుదారులు గెలుపొందారు. ► పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక సర్పంచ్ స్థానంలో టీడీపీ బలపర్చిన అభ్యర్థి గెలుపొందారు. 10 వార్డు సభ్యులకుగాను ఆరుచోట్ల వైఎస్సార్సీపీ, నాలుగింటిలో టీడీపీ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించారు. ► ఏలూరు జిల్లాలో మూడు సర్పంచ్ స్థానాలనూ వైఎస్సార్సీపీ బలపర్చిన అభ్యర్థులే గెలుపొందారు. ఈ జిల్లాలో 21 వార్డు సభ్యుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో చెరో పది స్థానాల్లో వైఎస్సార్సీపీ, టీడీపీ మద్దతుదారులు, ఒకచోట జనసేన సానుభూతిపరుడు విజయం సాధించారు. ► కృష్ణా జిల్లాలో ఒక సర్పంచ్ స్థానంలో వైఎస్సార్సీపీ సానుభూతిపరుడు విజయం సాధించారు. ఇక్కడ మొత్తం ఎనిమిది వార్డు సభ్యుల స్థానాల్లో చెరో నాలుగింటిలో వైఎస్సార్సీపీ, టీడీపీ మద్దతుదారులు గెలుపొందారు. ► ఎన్టీఆర్ జిల్లాలో రెండు సర్పంచ్ స్థానాలనూ వైఎస్సార్సీపీ బలపర్చిన అభ్యర్థులే కైవసం చేసుకున్నారు. ఈ జిల్లాలో మూడు వార్డు సభ్యులకు జరిగిన ఉప ఎన్నికల్లో రెండింటిని వైఎస్సార్సీపీ, ఒకటి టీడీపీ సానుభూతిపరుడు దక్కించుకున్నారు. ► గుంటూరు జిల్లాలో ఒక్క సర్పంచ్ స్థానంలో టీడీపీ సానుభూతిపరుడు గెలుపొందారు. ఇక్కడ ఏడు వార్డు సభ్యులకుగాను రెండుచోట్ల వైఎస్సార్సీపీ, నాలుగుచోట్ల టీడీపీ, ఒకచోట జనసేన బలపర్చిన అభ్యర్థులు గెలుపొందారు. ► పల్నాడులో ఎన్నికలు జరిగిన 14 వార్డుల్లో 8 చోట్ల వైఎస్సార్సీపీ, ఆరుచోట్ల టీడీపీ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించారు. ► బాపట్ల జిల్లాలో రెండుచోట్ల సర్పంచ్ ఎన్నికలు జరగ్గా.. వైఎస్సార్సీపీ, జనసేన బలపర్చిన అభ్యర్థులు చెరో స్థానాన్ని చేజిక్కించుకున్నారు. జిల్లాలో మొత్తం 11 వార్డు స్థానాల్లో ఆరింటిని వైఎస్సార్సీపీ, ఐదింటిని టీడీపీ బలపర్చిన అభ్యర్థులు దక్కించుకున్నారు. ► ప్రకాశం జిల్లాలో ఒక సర్పంచ్ స్థానంలో టీడీపీ బలపర్చిన అభ్యర్థి విజయం సాధించారు. ఇక్కడ 15 వార్డు సభ్యుల స్థానాల్లో ఎనిమిదింటిని వైఎస్సార్సీపీ, ఏడుచోట్ల టీడీపీ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందారు. ► నెల్లూరు జిల్లాలో ఒక సర్పంచ్ స్థానంలో టీడీపీ మద్దతుదారుడు గెలుపొందారు. 11 వార్డు సభ్యులకుగాను 6 చోట్ల వైఎస్సార్సీపీ, ఐదుచోట్ల టీడీపీ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించారు. ► తిరుపతిలో ఒక సర్పంచ్ స్థానాన్ని వైఎస్సార్సీపీ బలపర్చిన అభ్యర్థి కైవసం చేసుకున్నారు. ఈ జిల్లాలో ఏడు వార్డు సభ్యులకుగాను ఆరుచోట్ల వైఎస్సార్సీపీ, ఒకచోట టీడీపీ మద్దతుదారు గెలుపొందారు. ► చిత్తూరు జిల్లాలో ఏడు వార్డు సభ్యులకుగాను ఆరింట వైఎస్సార్సీపీ, ఒకచోట టీడీపీ బలపర్చిన అభ్యర్థి గెలుపొందారు. ► కర్నూలులో ఒక సర్పంచ్ స్థానాన్ని వైఎస్సార్సీపీ మద్దతుదారుడు కైవసం చేసుకున్నారు. ఈ జిల్లాలో మొత్తం 15 వార్డు సభ్యులకుగాను తొమ్మిది చోట్ల వైఎస్సార్సీపీ, ఆరుచోట్ల టీడీపీ మద్దతుదారులు విజయం సాధించారు. ► అనంతపురంలో టీడీపీ సానుభూతిపరుడు ఒక సర్పంచ్ స్థానంలో గెలుపొందారు. ఇక్కడ 11 వార్డు సభ్యుల స్థానాలకుగాను ఆరింట వైఎస్సార్సీపీ, ఐదుచోట్ల టీడీపీ మద్దతిచి్చన అభ్యర్థులు విజయం సాధించారు. ► నంద్యాల జిల్లాలో వైఎస్సార్సీపీ బలపర్చిన అభ్యర్థి ఒక సర్పంచ్ స్థానంలో విజయం సాధించారు. ఇక్కడ మొత్తం 19 వార్డు సభ్యుల స్థానాలకుగాను 16 చోట్ల వైఎస్సార్సీపీ, మూడుచోట్ల టీడీపీ మద్దతుదారులు గెలుపొందారు. ► శ్రీసత్యసాయి జిల్లాలో ఎన్నిక జరిగిన సర్పంచ్ స్థానాన్ని వైఎస్సార్సీపీ బలపర్చిన అభ్యర్థి కైవసం చేసుకున్నారు. మొత్తం 13 వార్డు సభ్యుల స్థానాలకుగాను ఆరుచోట్ల వైఎస్సార్సీపీ బలపర్చిన అభ్యర్థులు, ఏడుచోట్ల టీడీపీ మద్దతుదారులు గెలుపొందారు. ► వైఎస్సార్ జిల్లాలో ఒక సర్పంచ్ స్థానంలో వైఎస్సార్సీపీ మద్దతుదారుడు గెలుపొందారు. ఈ జిల్లాలో మూడు వార్డు స్థానాల్లో రెండు చోట్ల వైఎస్సార్సీపీ, ఒకచోట టీడీపీ బలపర్చిన అభ్యర్థి గెలుపొందారు. ► అన్నమయ్య జిల్లాలో మూడు వార్డుల్లో రెండింటిని వైఎస్సార్సీపీ, ఒకటి టీడీపీ బలపర్చిన అభ్యర్థి కైవసం చేసుకున్నారు. కుప్పంలో చంద్రబాబుకు పరాభవం చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో ఆరు వార్డు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అందులో ఐదుగురు వైఎస్సార్సీపీ మద్దతుదారులు విజయదుందుభి మోగించారు. చంద్రబాబు ఇల్లు కట్టుకుంటున్న వార్డులో కూడా వైఎస్సార్సీపీ మద్దతుదారు గెలుపొందడం విశేషం. ఒక్క స్థానంలో మాత్రమే టీడీపీ మద్దతుదారు విజయం సాధించారు. -
ఏపీ పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయకేతనం
సాక్షి, గుంటూరు: పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయకేతనం ఎగురవేసింది. టీడీపీ బోల్తా పడింది. ఎన్నికలు జరిగిన జిల్లాల్లో అత్యధిక స్థానాలు వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. మొత్తం 34 సర్పంచ్, 245 వార్డు మెంబర్ల స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. నెల్లూరు: మనుబోలు మండలం,బండేపల్లి మూడో వార్డులో ఒక్క ఓటుతో వైఎస్సార్ సీపీ మద్దతు అభ్యర్థి ఆవుల పొలమ్మ విజయం. చేజర్ల మండలం పాతపాడు లో రీకౌంటింగ్ లోను సమాన ఓట్లు రావడంతో లాటరీ నిర్వహించిన అధికారులు. లాటరీలో వైసీపీ అభ్యర్థి షేక్.మస్తాన్ బి విజయం ఏలూరు: దెందులూరు మండలం,కొవ్వలి గ్రామంలో జరిగిన 11వ వార్డు ఎన్నికలలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మొండి శ్రీను 288 ఓట్ల మెజారిటీతో విజయం. పెదపాడు మండలం, పాత ముప్పర్రు గ్రామంలో జరిగిన 10వ వార్డు ఎన్నికలలో వైఎస్సార్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గొట్టపు సోమేశ్వరి 26 ఓట్ల మెజారిటీతో విజయం. జీలుగుమిల్లి గ్రామంలో 6వ వార్డు ఉప ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన మడకం ధనరాజు 42ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ► పెదపాడు మండలం వీరమ్మ కుంట గ్రామ పంచాయతీ ఉప ఎన్నికల్లో వైస్సార్సీపీ బలపరిచిన అభ్యర్థి గెలుపు. మరడాని వెంకట లక్ష్మణ సోమేశ్వరరావు 286 ఓట్ల మెజారిటీతో టీడీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మరడన నాగబాబును ఓడించారు. ►వణుదుర్రు సర్పంచ్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారుడు గెలుపు పశ్చిమగోదావరి: పాలకొల్లు మండలం గోరింటాడా గ్రామపంచాయతీ ఆరో వార్డు వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్థి పీతల యమున దుర్గ చంద్రకళ 15 ఓట్ల మెజారిటీతో గెలుపు. పాలకొల్లు మండలం చింతపర్రు గ్రామంలో ఆరో వార్డుకు జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్థి అంగర రామలక్ష్మి 10 ఓట్ల మెజారిటీతో గెలుపు. వీరవాసరం మండలం మత్యపురి గ్రామం ఒకటో వార్డు లో వైఎస్సార్సీపీ బలపరిచిన కారేంపల్లి విజయలక్ష్మి 167 ఓట్ల మెజారిటీతో గెలుపు. కృష్ణా: బంటుమిల్లి 4 వ వార్డుకి వైఎస్సార్సీపీ బలపర్చిన గొల్ల సృజన విజయం ఎన్టీఆర్: తిరువూరు మండలం ఎర్రమాడు ఉప ఎన్నికలో ఏడో వార్డు అభ్యర్థిగా YSRCP బలపరిచిన చలివేంద్ర హరిబాబు విజయం. తూర్పు గోదావరి: రాజానగరం మండలం పల్ల కడియం గ్రామంలో జరిగిన వార్డు సభ్యుల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ బలపరిచిన పెండ్యాల అరుణ సమీప అభ్యర్థి చేవా ప్రమీలపై విజయం సాధించారు. రాజానగరం మండలం కలవచర్ల గ్రామంలో జరిగిన వార్డు సభ్యుల ఎన్నికలో వైఎస్సార్సీపీ బలపరిచిన తాతపూడి సత్యవతి విజయం సాధించారు. అనంతపురం: తాడిపత్రి నియోజకవర్గం లో వైఎస్సార్ సీపీ హవా. టీడీపీ కి జేసీ బ్రదర్స్ కు ఎదురుదెబ్బ. జేసీ సొంత మండలం పెద్దపప్పూరు లో టీడీపీకి చేదు అనుభవం తాడిపత్రి నియోజకవర్గం లో ఐదు వార్డుల్లో వైఎస్సార్ సీపీ మద్దతుదారుల ఘన విజయం ► దేవునుప్పలపాడు పంచాయతీ లో వైఎస్సార్ సీపీ మద్దతుదారు కాటమయ్య సర్పంచ్ గా ఎన్నిక ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కి మెజారిటీ స్థానాలు చలివెందుల, దేవునుప్పలపాడు పంచాయతీ స్థానాల్లో వైఎస్సార్ సీపీ విజయం 33 వార్డుల్లో వైఎస్సార్ సీపీ విజయం 21 వార్డుల్లో టీడీపీ మద్దతుదారుల గెలుపు తాడిపత్రి, శింగనమల, గుంతకల్లు, పెనుకొండ, రాయదుర్గం నియోజకవర్గాల్లో సత్తా చాటిన వైఎస్సార్ సీపీ మద్దతుదారులు శ్రీసత్యసాయి జిల్లా: హిందూపురం లో ఎమ్మెల్యే బాలకృష్ణకు ఎదురుదెబ్బ ► హిందూపురం మండలం చలివెందుల పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ మద్దతుదారు ఉపేంద్ర రెడ్డి 337 ఓట్లతో విజయం చిత్తూరు జిల్లా కుప్పం నియోజకర్గంలో కొనసాగుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ ఆధిపత్యం ► శాంతిపురం మండలం కడపల్లి పంచాయితీ 10 వార్డుకు జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ మద్దతు దారుడు సుధాకర్ ప్రత్యర్థి ప్రకాష్ పై 47 ఓట్లుమెజారిటీతో గెలుపు అనకాపల్లి జిల్లా: నక్కపల్లి మండలంలో రేబాక చిన దొడ్డిగల్లులలో రెండు వార్డులకు జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులు విజయం శ్రీకాకుళం జిల్లా: ►టెక్కలి మండలం నరసింగపల్లి పంచాయతీ జగన్నాధపురం ఏడో వార్డుకు జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్థి పావని 124 ఓట్లు మెజారిటీతో గెలుపొందారు. మొత్తం 219 ఓట్లు గాను 156 ఓట్లు పోలయ్యాయి. ఇందులో వైసీపీ బలపరిచిన అభ్యర్థి పావనికు 124 ఓట్లు రాగా టీడీపీ బలపరిచిన అభ్యర్థి సింగపురం మోహిని కు 28 ఓట్లు వచ్చాయి. నాలుగు ఓట్లు చెల్లనివిగా గుర్తించారు. ►నరసన్నపేట మండలం కొమర్థి లో వైసీపీ బలపరిచిన అభ్యర్థి. లబ్బ రాజారావు 24 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. టీడీపీ బలపరిచిన అభ్యర్థికి 50 ఓట్లు రాగా వైసీపీ బలపరచిన అభ్యర్థికి 74 ఓట్లు వచ్చాయి. ►సారవకోట మండలం బద్రి సర్పంచ్ ఉప ఎన్నికల్లో వైసీపీ బలపర్చిన అభ్యర్థి మజ్జి అసిరమ్మ గెలుపు సాధించారు. ►నందిగాం మండలం అన్నపురం పంచాయతీ సర్పంచ్ పదవికి జరిగిన ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ బలపర్చిన అభ్యర్ధి బార్నాన ఇంద్రవేణి 89 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మొత్తం 775 ఓట్లకు 633 ఓట్లు పాలయ్యాయి. ఇందులో వైఎస్సార్సీపీ బలపర్చిన అభ్యర్ధి ఇంద్రవేణికు 353, టీడీపీ బలపర్చిన అభ్యర్ధి బర్నాన తిరుపతిరావు కు 264 ఓట్లు వచ్చాయి ►బూర్జ మండలం పెదలంకాం సర్పంచ్ ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థి కాకితాపల్లి గోవిందరావు గెలుపు సాధించారు. -
నేడు ‘స్థానిక’ ఉప ఎన్నికలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పలుచోట్ల గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో పరోక్ష పద్ధతిన ఎన్నిక జరిగే పలు పదవులకు గురువారం ఉప ఎన్నికలు జరగనున్నాయి. గతంలోనే ఎన్నికలు జరిగి రాజీనామా చేయడం, మరణించడం వంటి కారణాలతో ఖాళీ అయిన పదవులకు ఈ ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మచిలీపట్నం నగరపాలక సంస్థలో రెండు డిప్యూటీ మేయర్ పదవులు, పెడన మున్సిపాలిటీలో చైర్పర్సన్, మాచర్ల మున్సిపాలిటీలో ఒకటి, ధర్మవరం మున్సిపాలిటీలో రెండు వైస్ చైర్మన్ పదవులకు, 13 మండలాల్లో నాలుగు ఎంపీపీ, ఏడు ఉపాధ్యక్ష, మూడు కో–ఆప్షన్ పదవులకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేసింది. 12 పంచాయతీల్లో 12 ఉప సర్పంచి పదవులకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల నిర్వహణ కోసం ఉదయం 11 గంటలకు ఆయా స్థానికసంస్థల ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు. ఉప ఎన్నికలు జరగనున్న స్థానిక సంస్థలు, పదవుల వివరాలు పట్టణ ప్రాంతాల్లో.. ► మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (కృష్ణా జిల్లా)– రెండు డిప్యూటీ మేయర్ పదవులు ► పెడన మున్సిపాలిటీ (కృష్ణా)– చైర్పర్సన్ ► మాచర్ల మున్సిపాలిటీ (పల్నాడు)– వైస్ చైర్మన్ ► ధర్మవరం (శ్రీసత్యసాయి)– రెండు వైస్ చైర్మన్ పదవులు . గ్రామీణ ప్రాంతాల్లో.. ► ఎంపీపీ ఎన్నికలు జరిగే మండలాలు (4): రామకుప్పం (చిత్తూరు జిల్లా), తొండంగి (కాకినాడ), వత్సవాయి (ఎన్టీఆర్), చేజర్ల (నెల్లూరు) ► ఉపాధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగే మండలాలు (7): రామకుప్పం, విజయాపురం(చిత్తూరు), రాపూరు (నెల్లూరు), గాలివీడు (అన్నమయ్య), పార్వతీపురం (పార్వతీపురం మన్యం), పెదకడబూరు (కర్నూలు), రాయదుర్గం (అనంతపురం) ► కో–ఆప్షన్ మెంబర్ ఎన్నిక జరిగే మండలాలు (3): చిత్తూరు (చిత్తూరు), బి.మఠం (వైఎస్సార్), రాజంపేట (అన్నమయ్య) ► ఉపసర్పంచి ఎన్నికలు జరిగే పంచాయతీలు (12): అనకాపల్లి, బాపట్ల, అన్నమయ్య జిల్లాల్లో రెండేసి పంచాయతీలు, శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా, పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాలో ఒక్కొక్క పంచాయతీ -
ఉప ఎన్నికలు.. ఏడులో మూడు అక్కడే!
న్యూఢిల్లీ: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో ఫేజ్ పోలింగ్.. దేశ ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. అదే సమయంలో ఏడు చోట్ల సైతం ఉప ఎన్నికల పోలింగ్ ఇవాళే(డిసెంబర్ 5, సోమవారం) జరగనున్నాయి. ఇందులో ఒక లోక్‌సభ స్థానం సైతం ఉంది. రాజస్థాన్(సర్దార్‌షాహర్), ఛత్తీస్‌గఢ్(భానుప్రతాప్‌పూర్), ఒడిశా(పదంపూర్)లలో సిట్టింగ్ క్యాండిడేట్ల మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక బీహార్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అనర్హత వేటు కారణంగా ఖుర్‌హని స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఎన్డీయే కూటమికి సీఎం నితీశ్‌కుమార్ గుడ్ బై చెప్పిన తర్వాత జరుగుతున్న.. మొదటి ఎన్నిక ఇది. ఇక మూడు అసెంబ్లీ స్థానాలు, ఒక లోక్‌సభ స్థానం ఎన్నికతో ఉత్తర ప్రదేశ్ ప్రధాన చర్చకు దారి తీసింది. సమాజ్‌వాదీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ మరణంతో ఆయన ప్రాతినిధ్యం వహించిన మెయిన్‌పురి లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. ములాయం కంచుకోట అయినప్పటికీ.. కిందటిసారి జరిగిన ఎన్నికలో తక్కువ మార్జిన్‌తో గెలుపుతో గెలుపొందారు ములాయం. దీంతో ఎస్పీ గెలుపు అంత ఈజీ కాదనే చర్చ నడుస్తోంది. ఎస్పీ తరపున అఖిలేష్ యాదవ్ భార్య, ఆయన కోడలు డింపుల్ యాదవ్ పోటీలో దిగారు. ఇక బీజేపీ మాజీ ఎంపీ రఘురాజ్ సింగ్ శక్య ఈసారి బరిలో నిల్చున్నారు. యూపీలోనే రాంపూర్ సదర్, ఖతౌలీ అసెంబ్లీ స్థానాలకు ఎన్నిక జరగబోతోంది. డిసెంబర్ 8వ తేదీన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటే ఈ ఉప ఎన్నికల ఫలితాలను సైతం వెల్లడించనుంది ఎన్నికల సంఘం. -
మునుగోడులో పోస్టర్ వార్
చౌటుప్పల్ మండలంలో ఫ్లోరైడ్ రీసెర్చ్ అండ్ మిటిగేషన్ సెంటర్ ఏర్పాటుకు 2016లోనే హామీ ఇచ్చినా ఇప్పటివరకు అమలు చేయలేదంటూ.. ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఫ్లెక్సీ పెట్టి, దాని ముందు సమాధిలా ఏర్పాటు చేశారు. అంతకుముందు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రూ.18 వేల కోట్లకు అమ్ముడు పోయారంటూ పోస్టర్లు వేశారు. సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఉప ఎన్నికల నేపథ్యంలో మునుగోడు నియోజకవర్గంలో ఫ్లెక్సీలు, బ్యానర్ల వార్ ఉధృతమైంది. మొన్నటివరకు ప్రజా సమస్యలను పరిష్కరించాలని, రోడ్డు వేస్తేనే మా ఊళ్లో ఓట్లు అడగాలని గ్రామాల్లో ప్రజలు ఫ్లెక్సీలు పెట్టారు. ఇప్పుడు రాజకీయ పార్టీల కార్యకర్తలు, నేతలు పరస్పర విమర్శలు, ఆరోపణలతో పోస్టర్లు వేసుకుంటున్నారు. మొన్నటివరకు బీజేపీ నేతలు, ఆ పార్టీ అభ్యర్థిని ఉద్దేశిస్తూ పోస్టర్లు వెలియగా.. తాజాగా టీఆర్ఎస్ నేతలను ఉద్దేశిస్తూ పోస్టర్లు పడ్డాయి. ఆగస్టు నుంచే పోస్టర్ల గోల షురూ.. మునుగోడు నియోజకవర్గంలో ఆగస్టు నెల నుంచే పోస్టర్ల గోల మొదలైంది. ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందే కొన్ని గ్రామాల్లో సమస్యలు పరిష్కరించాలని బ్యానర్లు పెట్టగా.. మరికొన్ని గ్రామాల్లో మాకు డబ్బులు వద్దు రోడ్డే కావాలి అంటూ ఫ్లెక్సీలు కట్టారు. మరోచోట రోడ్డు వేస్తేనే మా గ్రామంలోకి రావాలంటూ ఊరి బయట ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తర్వాత రాజగోపాల్‌రెడ్డిని విమర్శిస్తూ పోస్టర్లు వెలిశాయి. ‘మునుగోడు ప్రజలారా మేం మోసపోయాం.. మీరూ మోసపోకండి.. ఇట్లు దుబ్బాక, హుజూరాబాద్ ప్రజలు’అంటూ సెప్టెంబర్ 15న పోస్టర్లు కనిపించాయి. తర్వాత ‘రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు పే’అంటూ రాజగోపాల్‌రెడ్డిపై పోస్టర్లు వేశారు. ఆ తర్వాత ఫ్లెక్సీలు, బొమ్మలతో సమాధులు, కాష్టాల వంటివీ జరిగాయి. తాజాగా శనివారం నాంపల్లి మండల కేంద్రం శివారులో కల్వకుంట్ల కుటుంబం పేరుతో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత బొమ్మలతో ఫ్లెక్సీ పెట్టి.. కాష్టాన్ని పేర్చి తగలబెట్టారు. ఇదీ చదవండి: ఇదేందయ్యా ఇది.. మద్యం మత్తులో రెచ్చిపోయిన మునుగోడు యూత్.. వీడియో వైరల్ -
‘దుబ్బాకలో రూ.10వేలు, హుజురాబాద్‌లో 20వేలు, మునుగోడులో 40వేలు’
సాక్షి, వరంగల్: మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణ భవిష్యత్తుతో ముడిపడి ఉందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు ఒకటేనని ఆరోపించారు. ఇటీవల హనుమకొండలో మృతి చెందిన ఏబీవీపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు గుజ్జుల నర్సయ్య సంస్మరణ సభకు హాజరైన సందర్భంగా మాట్లాడారు బండి సంజయ్. మునుగోడు ఉప ఎన్నికలో గెలిచేందుకు బీఆర్ఎస్ అనేక అక్రమాలకు పాలుపడుతుందని ఆరోపించారు. ‘ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ కుట్రలకు కాంగ్రెస్ సహకరిస్తోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీల అక్రమాలను అడ్డుకుంటాం. దుబ్బాకలో ఓటుకు రూ. 10వేలు, హుజురాబాద్ రూ. 20 వేలు పంచిన బీఆర్ఎస్ ఇప్పుడు మునుగోడులో ఓటుకు రూ. 40వేలు పంచేందుకు సిద్ధమైంది. అధికార యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో వాడుకుంటూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. అనుకూలమైన అధికారులను బదిలీ చేయించుకున్నారు. పెద్ద ఎత్తున మంత్రులు, ఎమ్మెల్యేలను, మద్యం మునుగోడుకు పంపించడం చూస్తే సీఎం కేసీఆర్ ఎంత డిప్రెషన్లో ఉన్నారో అర్థమవుతుంది.’ అని దుయ్యబట్టారు బండి సంజయ్. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మా కోసం రాజీనామా చేశాడని మునుగోడు ప్రజలు ఆలోచిస్తున్నారని, ఎవరెన్ని కుట్రలు పన్నినా మునుగోడులో బీజెపీ భారీ మెజార్టీతో గెలుస్తుందనే ధీమా వ్యక్తం చేశారు బండి సంజయ్ కుమార్. ఫోన్ల ట్యాపింగ్ కోసం ఇజ్రాయిల్ టెక్నాలజీతో ఒప్పందం చేసుకుంది కేసీఆరేనని ఆరోపించారు. రాష్ట్ర మంత్రులు ఆ పార్టీ నేతలు బాహాటంగా చెబుతున్నారని తెలిపారు. నీచమైన, దుర్మార్గమైన ఆలోచన కేసీఆర్‌దేనని, బీజేపీపై విమర్శలు చేయడానికి సిగ్గుండాలన్నారు బండి సంజయ్. ఇదీ చదవండి: మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన సీఎం కేసీఆర్ -
మోగిన ఎన్నికల నగారా.. 6 రాష్ట్రాల్లో 7 సీట్లకు ఉప ఎన్నిక
సాక్షి న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉప ఎన్నికలకు నగారా మోగింది. 6 రాష్ట్రాల్లోని 7 ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించి ఎన్నికల నిర్వహణకు సోమవారం షెడ్యూల్ విడుదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం.. అక్టోబర్ 7న నోటిఫికేషన్ విడుదలవుతుంది. అక్టోబర్ 14న నామినేషన్లు. అక్టోబర్ 15న నామినేషన్ల పరిశీలన ప్రక్రియ. అక్టోబర్ 17 నామినేషన్ల ఉప సంహరణకు చివరి తేదీ, నవంబర్ 3న పోలింగ్, నవంబర్ 6న ఓట్ల లెక్కింపు. ఉప ఎన్నికలు జరిగే స్థానాలు (7) మహారాష్ట్ర-తూర్పు అంధేరి బిహార్-మోకమ బిహార్- గోపాల్‌గంజ్ హరియాణ-అదంపూర్ తెలంగాణ-మునుగోడు ఉత్తర్‌ప్రదేశ్- గోల గోకరన్నాథ్ ఒడిశా- ధామ్‌నగర్ -
Sangrur By-Poll Results: పంజాబ్‌లో ఆప్‌కు బిగ్ షాక్.. ఇది అస్సలు ఊహించలేదు!
చంఢీగడ్: పంజాబ్‌లో అధికారం దక్కించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీకి లోక్‌సభ ఉప ఎన్నికల్లో గట్టి షాక్ తగిలింది. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఖాళీ చేసిన సంగ్రూర్ లోక్ సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఆప్ ఓటమి పాలైంది. ఆదివారం వెలువడిన ఫలితాల్లో.. శిరోమణి అకాళిదల్ అభ్యర్థి సిమ్రన్ జిత్ మాన్ .. ఆప్ అభ్యర్థి గుల్మైర్‌పై 8 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. సంగ్రూర్ నుంచి వరుసగా 2014, 2019 ఎన్నికల్లో భగవంత్ ఎంపీగా గెలుపొందారు. ఇటీవల జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించింది. దీంతో సీఎంగా భగవంత్ పదవీ బాధ్యతలు చేపట్టడంతో ఆయన గెలుపొందిన సంగ్రూర్ ఎంపీ స్థానానికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో సంగ్రూర్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే సార్వత్రిక ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా పంజాబ్‌లో గెలిచిన ఆప్ ఉపఎన్నికలో విజయం ఖాయమనుకున్నారు. కానీ అలా పంజాబ్‌లో అధికారం చేపట్టిందో లేదో.. అంతలోనే ఇలా ఓటమి పాలవడం ఆప్‌కు పెద్ద షాక్ అనే చెప్పాలి. చదవండి: మహారాష్ట్రలో ఊహించని మరో ట్విస్ట్.. రంగంలోకి దిగిన రష్మీ థాక్రే -
ఉత్తరాఖండ్ ఉప ఎన్నికలో సీఎం పుష్కర్ సింగ్ ధామి ఘన విజయం
Bypoll Results: చంపావత్ ఉప ఎన్నికల్లో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఘన విజయం సాధించారు. శుక్రవారం జరిగిన ఓట్ల లెక్కింపులో ప్రత్యర్థి పై 55 వేలకు పైగా ఓట్లతో విజయకేతనాన్ని ఎగురవేశారు. కాంగ్రెస్ అభ్యర్థి నిర్మలా గహ్తోరి డిపాజిట్ కోల్పోయారు. కాగా ఫిబ్రవరిలో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఖతిమా నియోజకవర్గం నుంచి పుష్కర్ సింగ్ ఓడిపోవడంతో ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు ఈ ఉప ఎన్నికల్లో గెలవడం తప్పనిసరి అయ్యింది. కాగా మే 31న ఉత్తరాఖండ్, ఒడిశా, కేరళలోని మూడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ఫలితాలు జూన్ 3న వెలువడ్డాయి. ధామి గెలుపుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. చంపావత్ నియోజకవర్గంలో రికార్డు విజయాన్ని నమోదు చేసినందుకు అభినందనలు తెలిపారు. అలాగే బీజేపీకి ఘన విజయాన్ని అందించిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. ఉత్తరాఖండ్ అభివృద్ధికి మరింత కష్టపడి పని చేస్తారని ఆశిస్తున్నట్లు మోదీ ట్వీట్ చేశారు. అలాగే ‘‘చంపావత్ ఉపఎన్నికలో ఓట్ల ద్వారా మీరు కురిపించిన ప్రేమ, ఆశీర్వాదాలతో నా హృదయం చాలా ఉద్వేగానికి లోనైంది. నేను మాట్లాడలేకపోతున్నాను’’ అని తన విజయం తర్వాత ముఖ్యమంత్రి ధామి ట్వీట్ చేశారు. కేరళలోని త్రిక్కాకర నిజయోకవర్గంలో యూడీఎఫ్ అభ్యర్థి ఉమా థామస్ విజయం సాధించారు. ఒడిశాలోని బ్రజరాజ్నగర్లో బీజేడీ అభ్యర్థి అలకా మొహంతి గెలుపొందారు. ఉత్తరాఖండ్, ఒడిశాలో అధికార పార్టీ అభ్యర్ధులే విజయం సాధించగా.. కేరళలో ప్రతిపక్ష యూడీఎఫ్‌కు విజయం దక్కింది. గత సాధారణ ఎన్నికల్లో ఉత్తరాఖండ్‌లో 70 స్థానాలకు గాను 47 చోట్ల బీజేపీ జయకేతనం ఎగరేసి రెండోసారి అధికారం చేజిక్కించుకుంది. కాంగ్రెస్ కేవలం 19 స్థానాలకు పరిమితమైంది. ఖతిమా స్థానం నుంచి పోటీ చేసిన సీఎం పుష్కర్ సింగ్ ధామికి మాత్రం ఓటమి పాలయ్యారు. ఖతిమా స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగిన భువన చంద్ర కప్రీ విజయం సాధించారు. అయినప్పటికీ పుష్కర్ సింగ్ ధామి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఆరు నెలల్లో రాష్ట్రంలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటి చేసి గెలుపొందాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ధామి కోసం చంపావత్ స్థానం నుంచి విజయం సాధించిన హేమేష్ కర్క్‌వాల్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దాంతో అక్కడ ఉప ఎన్నికలు వచ్చాయి. -
యడ్డీని ఎవరూ టార్గెట్ చేయలేరు
సాక్షి, గంగావతి (కర్ణాటక): మాజీ సీఎం యడియూరప్పను టార్గెట్ చేసే శక్తి ఎవరికీ లేదని ఆయన కుమారుడు బీ.వై. విజయేంద్ర అన్నారు. ఆయన సింధగి ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్తూ మార్గం మధ్యలో కొప్పళ గవిమఠాన్ని సందర్శించి గవిసిద్దేశ్వర స్వామీజీ ఆశీర్వాదం తీసుకున్న అనంతరం పాత్రికేయులతో మాట్లాడారు. సింధగి, హానగల్ ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమన్నారు. చంద్రశేఖర్ పాటిల్, కనకగిరి ఎమ్మెల్యే ధడేసూగూరు బసవరాజ్, అమరేష్ కరడి పాల్గొన్నారు. -
కాంగ్రెస్‌కు షాక్: బీజేపీలోకి చేరిన మాజీ ఎమ్మెల్యే
భోపాల్: మధ్యప్రదేశ్ కాంగ్రెస్ రాజకీయాల్లోను అనూహ్యమార్పులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సులోచనా రావత్, తన కుమారుడితో కలిసి భారతీయ జనతా పార్టీలోకి చేరారు. కాగా, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆధ్వర్యంలో ఆమె.. బీజేపీ కండువ కప్పుకున్నారు. సులోచనా రావత్... జోబాత్ (ఎస్టీ) రిజర్వుడ్ నియోజక వర్గం నుంచి 1998, 2008లలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. బీజేపీ అందిస్తున్న పారదర్శక పాలన, గిరిజనుల అభివృద్ధి చేస్తున్న కృషి, పార్టీ సిద్ధాంతాలకు ఆకర్శించబడి పార్టీలో చేరినట్లు సులోచనా రావత్ తెలిపారు. కాగా, కేంద్ర ఎన్నికల సంఘం మధ్యప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న మూడు అసెంబ్లీ, ఒక లోకసభ స్థానానికి అక్టోబరు 30న ఎన్నికల షెడ్యుల్‌ను ప్రకటించనుంది. అయితే, జోబాట్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేసిన కళావతి భూరియా ఆకస్మిక మరణం వలన ఆ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమయింది. జోబాట్ స్థానానికి బీజేపీ నుంచి.. సులోచన రావత్ బరిలో ఉండవచ్చని పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అదే విధంగా నివారీపూర్లోని పృథ్వీపూర్ నుంచి కాంగ్రెస్ నేత నితేంద్ర సింగ్ రాథోడ్ బరిలో ఉన్నారు. ఈయన తండ్రి బ్రిజేంద్ర సింగ్ రాథోడ్ మరణంతో ఇక్కడ ఖాళీ ఏర్పడింది. అదే విధంగా, సత్నాజిల్లాలోని రాయగావ్ ఎమ్మెల్యే జుగల్ కిషోర్ మరణంతో ఖాళీ ఏర్పడింది. ఖాండ్వా లోక్‌సభ నుంచి కేంద్ర మంత్రి అరుణ్‌యాదవ్ ఎంపీ పదవికి బరిలో నిలబడనున్నారు. చదవండి: Bhabanipur Bypoll:భారీ మెజార్టీతో మమతా బెనర్జీ విజయం -
హుజురాబాద్ లో అభ్యర్థి కోసం కాంగ్రెస్ అన్వేషణ
-
Huzurabad: ఓట్ల కోసం కుట్రలు చేయడం సిగ్గుచేటు
సాక్షి, కరీంనగర్: హుజూరాబాద్‌లో అమలు చేస్తున్న దళిత బంధు పథకాన్ని మంత్రులు తమ నియోజకవర్గాల్లో అమలు చేయించుకునే దమ్ము, ధైర్యం ఉంటే స్పష్టం చేయాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జిల్లా ఇన్చార్జి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. సోమవారం కరీంనగర్లో ఏర్పాటు చేసిన విలేకరులతో మాట్లాడారు. మంత్రులు తమ నియోజకవర్గాలు, మంత్రిత్వశాఖలను గాలికి వదిలి హుజూరాబాద్ రాజకీయం కోసం ఉరుకులు పరుగులు పెడుతున్నారని, ఓటర్లను మభ్యపెట్టడానికి అనేక కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా మంత్రులు గంగుల కమలాకర్, హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు తమ నియోజకవర్గాల్లోని దళితులకు మూడెకరాల భూమి, అర్హులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు, ఎస్సీసబ్ ప్లాన్ నిధులతో ఎంతమందిని ఆదుకున్నారో ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. ఒక్క ఈటల రాజేందర్‌ను ఓడించడానికి టీఆర్ఎస్ యంత్రాంగం, ప్రభుత్వం సర్వశక్తులూ ఒడ్డుతున్నా నేటికీ ఆశించిన ఫలితం రాలేదన్నారు. సర్వేలన్నీ ఈటల రాజేందర్‌కు అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మత రాజకీయాలకు అలవాటు పడిపోయి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించలేని దుస్థితిలో ఉందని దుయ్యబట్టారు. మజ్లిస్ చేతిలో కీలుబొమ్మగా మారిందని, నాటి నిజాం సర్కారుకు నేటి కేసీఆర్ ప్రభుత్వానికి పెద్దగా తేడా ఏమీ లేదని మండిపడ్డారు. హుజూరాబాద్ ఎన్నికల అనంతరం టీఆర్ఎస్కు కౌంట్‌డౌన్ మొదలవుతుందని తెలిపారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్ళపల్లి శ్రీనివాస్‌గౌడ్, ఉపాధ్యక్షుడు కన్న కృష్ణ, జిల్లా కార్యదర్శి రాపర్తి ప్రసాద్, కార్పొరేటర్లు కొలగాని శ్రీనివాస్, రాపర్తి విజయ, కచ్చు రవి, పెద్దపల్లి జితేందర్, మీడియా ఇన్చార్జి కటకం లోకేశ్, ఉమామహేశ్వర్ పాల్గొన్నారు. చదవండి: ప్రజల దృష్టిలో చిల్లర కావద్దు -
మమతా బెనర్జీపై పోటీకి ప్రియాంకా
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ఉప ఎన్నికల్లో రసవత్తర పోరుకు తెరలేచింది. బెంగాల్ ముఖ్యమంత్రి టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీపై పోటీకి బీజేపీ తన అభ్యర్థిని ఖరారు చేసింది. ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న భవానీపూర్ ఉపఎన్నిక పోరులో న్యాయవాది ప్రియాంకా టిబ్రేవాల్‌ను బరిలోకి దింపింది. మరోవైపు ఈ రోజు (సెప్టెంబర్ 10 శుక్రవారం ) మమత తన నామినేషన్‌ను దాఖలు చేయనున్నారు. ఈ నెల 30వ తేదీన జరగనున్న ఉప ఎన్నికలో సీఎం మమతా బెనర్జీ భవానిపుర్ నుంచి పోటీ చేయనున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీఎంసీ ఘన విజయం సాధించి బీజేపీకి భారీ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే నందీగ్రామ్ అసెంబ్లీ స్థానానికిగాను దీదీ, బీజేపీ సువేందు అధికారి మధ్య హోరా హోరీగా సాగిన పోరులో చివరికి మమత ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం సీఎంగా ఉన్న మమతా బెనర్జీ ఆ పదవిలో కొనసాగాలంటే, నిర్దేశిత గడువులోగా అసెంబ్లీకి ఎన్నిక కావాల్సి ఉంది. ఈ ప్రత్యేక పరిస్థితుల్లో సెప్టెంబర్ 30న ఎన్నిక జరగనుంది. అక్టోబర్ 3న కౌంటింగ్ జరగనుంది. చదవండి : Ganesh Chaturthi 2021-Mangli Songs: ‘లంబోదరా’ మంగ్లీ మరో అద్భుత గీతం ఎవరీ ప్రియాంక టిబ్రేవాల్ 1980, జూలై 7న కోల్‌కతాలో జన్మించిన ప్రియాంకా న్యాయ పట్టాను పొందారు. థాయిలాండ్ వర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. బాబుల్ సుప్రియోకు లీగల్ అడ్వైజర్‌గా పనిచేశారామె. గత ఆరేళ్ల కాలంలో బీజేపీలో కీలక హోదాల్లో పనిచేస్తూ ప్రస్తుతం బెంగాల్ బీజేవైఎం ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. 2014లో కాషాయ కండువా కప్పుకున్న ఆమె 2015లో కోల్‌కతా మున్సిపల్ ఎన్నికల్లో రంగ ప్రవేశం చేశారు. అయితే తృణమూల్ అభ్యర్థి చేతిలో ఓటమి చవిచూశారు. అలాగే 2021 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎదురుదెబ్బ తప్పలేదు. 2011 నుండి రెండుసార్లు భవానీపూర్ సీటును గెలుచుకున్న మమతపై రెండుసార్లు టీఎంసీ చేతిలో ఓటమి పాలైన ప్రియాంక తాజాగా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించు కోనున్నారు. మరోవైపు 2021 అసెంబ్లీ ఎన్నికల తరువాత చోటు చేసుకున్న హింసపై కోల్‌కతా హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన వారిలో ప్రియాంకా ఒకరు. దీనిపై కోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. హింసాత్మక రాజకీయాలకు ముగింపు పలకాలని, అప్రజాస్వామిక పాలనకు వ్యతిరేకంగా పోరాటాన్ని సాగిస్తామంటూ ఇప్పటికే టీఎంసీపై యుద్ధం మొదలుపెట్టిన ప్రియాంక ఈ కీలక పోరులో మమతకు ధీటుగా ప్రియాంక నిలబడగలరా? కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై విరుచుకు పడే మమతకు సరిజోడిగా నిలవగలరా? సుదీర్ఘ అనుభవానికి తోడు, ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోతూ ప్రత్యర్థులకు చుక్కలు చూపించే దీదీని నిలువరించడం ప్రియాంకకు సాధ్యమేనా? భవానీపూర్ ప్రజలు ఎవరికి పట్టం కడతారు? ఈ ప్రశ్నలన్నింటికీ మరికొన్ని రోజుల్లోనే సమాధానం దొరకనుంది. -
రాజ్యసభ ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదల
సాక్షి, న్యూఢిల్లీ: ఆరు రాష్ట్రాల్లో రాజ్యసభ ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ఖరారు చేసింది. 6 రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికలతోపాటు బిహార్‌లో ఒక శాసనమండలి స్థానానికి కూడా ఉప ఎన్నిక జరగనుంది. అలాగే ఇటీవల ప్రకటించిన పశ్చిమ బెంగాల్, ఒడిశాలో నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల నోటిఫికేషన్‌ను కూడా ఈసీ జారీ చేసింది. అసోం, తమిళనాడు (2), మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఖాళీ అయిన 6 రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఈసీ షెడ్యూల్ ప్రకారం.. అక్టోబర్ 4న ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల (సెప్టెంబర్) 15న జారీ కానుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఒక ప్రకటన జారీ చేసింది. ఇక పుదుచ్చేరి రాజ్యసభ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎన్ గోకులకృష్ణణ్ పదవీకాలం అక్టోబర్ 6 తో ముగియనుంది. ఈ స్థానానికి కూడా ఉప ఎన్నికలతో పాటే ఎన్నిక నిర్వహిస్తామని ఈసీ తాజా షెడ్యూల్లో పేర్కొంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. అలాగే ఓట్ల లెక్కింపు కూడా అక్టోబర్ 4న ఉంటుంది. కాగా రాజ్యసభ ఎన్నికల్లో ఆయా రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారన్ సంగతి విదితమే. రాష్ట్ర అసెంబ్లీలోనే ఓటింగ్ జరుగుతుంది. దీనికి సంబంధించి కట్టుదిట్టమైన భద్రతతో పాటు కరోనా మార్గదర్శకాల మధ్య ఉప ఎన్నికలు నిర్వహించనుంది. -
Etela Rajender: అందరి దృష్టి కమలాపూర్పైనే...
సాక్షి , వరంగల్ : అధికార టీఆర్ఎస్లో మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రస్తానం ముగిసినట్లయింది. ఆయన బీజేపీలో చేరడం లాంఛనమే కాగా ఈనెల 14న ముహూర్తం ఖరారైంది. భూఆక్రమణల వివాదంలో చిక్కుకున్న ఈటల మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన విషయం తెలిసిందే. గతనెల 1వ తేదీ నుంచి మొదలైన ఈ వివాదం చినికిచినికి గాలివానగా మారింది. దీంతో ఆయన రాజకీయ భవితవ్యంపై అనేక ఊహాగానాలు వినిపించాయి. అన్ని పార్టీల నాయకులు, జేఏసీ నేతలను రాజేందర్ కలిసిన సందర్భంగా కొత్తగా పార్టీ పెడతారా.. కాంగ్రెస్ లేదా బీజేపీలో చేరతారా అన్న చర్చ సాగింది. చివరకు బీజేపీ కీలక నేతలతో భేటీ అయిన ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ ఆయన స్వగ్రామం కాగా.. ఇక్కడి నుంచే తన కొత్త ప్రస్తానాన్ని తాజాగా మొదలుపెట్టారు. దీనికి తోడు టీఆర్ఎస్ అగ్రనేతలు సైతం కమలాపూర్ నేతలతో నిత్యం టచ్‌లో ఉంటూ ఎవరు కూడా రాజేందర్ వెంట వెళ్లకుండా కట్టడి చేస్తుండడంతో ఉప ఎన్నికలు వస్తే కనక ఈ మండల కేంద్రమే కార్యక్షేతంగా మారనుందని చెప్పొచ్చు. ఎమ్మెల్యే పదవికి గుడ్ బై టీఆర్ఎస్తో 19 ఏళ్ల అనుబంధానికి మాజీ మంత్రి ఈటల రాజేందర్ తెగదెంపులు చేసుకున్నారు. ఇప్పటికే రెండు దఫాలుగా బీజేపీ కేంద్ర నాయకులతో భేటీ అయిన ఆయన ఆ పార్టీలో చేరడానికి ముహూర్తం ఖరారు చేసుకున్నారు. శనివారం ఉదయం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈనెల 14 న ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో రాజేందర్ కాషాయ కండువా కప్పుకోనున్నారని వెల్లడించాయి. అందరి దృష్టి కమలాపూర్పైనే... మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురైనప్పటి నుంచే ఈటల రాజేందర్‌పై టీఆర్ఎస్ అధిష్టానం నజర్ పెట్టింది. మంత్రి హరీష్‌రావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బి.వినోద్‌కుమార్, మంత్రి గంగుల కమలాకర్ కమలాపూర్ నుంచే ‘ఆపరేషన్’ మొదలెట్టారు. కమలాపూర్‌కు చెందిన ముఖ్య అనుచరులైన జెడ్పీటీసీ మొదలు సర్పంచ్, ఎంపీటీసీలు, నాయకులు ఎవరూ ఆయన వెంట వెళ్లకుండా చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయి. చదవండి: ‘స్వార్థం కోసమే ఈటల రాజీనామా చేశారు’ Huzurabad: ఈటలను దెబ్బకొట్టేందుకు టీఆర్ఎస్ రోడ్‌మ్యాప్ -
నిరుద్యోగ భృతి ఏమైంది?.. టీఆర్ఎస్ పార్టీపై ఈటల ఫైర్
సాక్షి, కరీంనగర్: అధికార టీఆర్ఎస్ పార్టీపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ తీవ్రంగా మండిపడ్డారు. టీఆర్ఎస్ కుట్రలను హుజూరాబాద్ ప్రజలు తిప్పికొడతారని విమర్శించారు. నాయకుడంటే అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల హృదయాల్లో నిలిచి పోవలసి వస్తుందని హితవు పలికారు.ఈ మేరకు ఇల్లందకుంటలో ఈటల రాజేందర్ బుధవారం పర్యటించారు. నియోజకవర్గంలోని సమస్యలపై ప్రెస్ మీట్ పెట్టి టీఆర్ఎస్పై విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపఎన్నిక వస్తుందంటే అక్కడ కేసీఆర్ వరాలు ప్రకటిస్తారని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్ నిరుద్యోగ భృతి హామీ ఏమైందని ప్రశ్నించారు. తన రాజీనామాతో సీఏం కొత్త రేషన్ కార్డు మంజూరు చేశారని ఆదే విధంగా రెండేళ్లుగా నిలిచిపోయిన కొత్త పెన్షన్లు, తెల్లరేషన్ కార్డులు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. 57 సంవత్సరాలు నిండిన వారికి తక్షణమే పెన్షన్ మంజూరు చేయాలని తెలిపారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని వావిలాల, చల్లూరు కొత్త మండలాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.గతంలో హుజూరాబాద్ జిల్లా కావాలని కోరినట్లు గుర్తు చేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన సౌలభ్యం కోసం కొత్త మండలాలతో పాటు జిల్లా ఏర్పాటు అవకాశాన్ని పరిశీలించాలని సూచించారు. ఎక్కడ ఉప ఎన్నిక వచ్చిన వరాల జల్లు కురిపించే సీఎం కేసీఆర్, హుజురాబాద్‌కు విరివిగా నిధులు, పనులు మంజూరు చేయాలని ఈటల డిమాండ్ చేశారు. చిన్న గ్రామాలకు 50 లక్షలు, పెద్ద గ్రామాలకు కోటి రూపాయల చొప్పున వెంటనే మంజూరు చేయాలని పేర్కొన్నారు. గొర్రెల మందపై తోడేలు పడ్డట్లు కొందరు వ్యవహరిస్తూ పచ్చని సంసారంలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. నంగనాచి మాటలతో నియోజకవర్గ ప్రజలను ప్రలోభ పెడుతున్నారని, రాజభక్తి చాటుకుంటే చాటుకొని కానీ తనపై విమర్శలు చేస్తే ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు. ప్రభుత్వం ప్రకటించే తాయిలాలకు డబ్బు సంచులకు ప్రజలు లొంగరని, ప్రజల గుండెల్లో తాను ఉన్నానని ఈటల పేర్కొన్నారు. ధర్మ యుద్ధం కురుక్షేత్రం జరుగుతుందని, ఆనాడు పాండవులు గెలిచినట్లు రాబోయే ఉప ఎన్నికలో హుజూరాబాద్ ప్రజలు గెలుస్తారని అన్నారు. పిడికెడు మంది కల్లబొల్లి మాటలు చెప్పినా, హుజూరాబాద్ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయమని హెచ్చరించారు. భావజాలం, ఆత్మ గౌరవం ఎవరికీ ఉందో హరీష్ రావే చెప్పాలని, తాను అక్రమంగా ఒక్క ఎకరం ఆక్రమించుకున్న ముక్కు నేలకు రాస్తానని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. చదవండి: హుజూరాబాద్ నుంచే మరో ఉద్యమం Etela Rajender: రాజీనామా ప్రకటన తరువాత తొలిసారి.. -
సాగర్ ఉప ఎన్నిక: టీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు!
-
సాగర్ ఉప ఎన్నిక: టీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు!
-
సాగర్ ఉప ఎన్నిక: టీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు!
సాక్షి, నల్గొండ: నాగర్జున సాగర్ ఉప ఎన్నికకు టీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిని ఖరారు చేసింది. నోముల నర్సింహయ్య కుమారుడు భగత్‌కు టీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. కాసేపట్లో భగత్‌కు సీఎం కేసీఆర్ బీ-ఫామ్ అందజేయనున్నారు. రేపు ఉదయం భగత్ తన నామినేషన్ వేయనున్నారు. కాగా నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య గతేడాది డిసెంబర్లో మృతి చెందడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా కుందూరు జానారెడ్డిని ప్రకటించింది. ఇక బీజేపీ తమ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. సాగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నామినేషన్ల దాఖలుకు ఈ నెల 30 వరకు గడువు ఉంది. ఈనెల 31న నామినేషన్ల పరిశీలన.. ఏప్రిల్ 3 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంది. కాగా ఏప్రిల్ 17న నాగార్జున సాగర్ ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుండగా, మే 2న ఫలితాలు వెలువడనున్నాయి. ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య(టీఆర్ఎస్) ఆకస్మిక మరణంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైన విషయం విదితమే. చదవండి: ఇలాంటి సవాల్ చేసిన చరిత్ర దేశంలో నా ఒక్కడిదే -
29న నామినేషన్ వేస్తా: డాక్టర్ గురుమూర్తి
సాక్షి, తిరుపతి : ఈ నెల 29న తిరుపతి ఉప ఎన్నికకు నామినేషన్ వేస్తానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి పేర్కొన్నారు. తనకు పార్టీ నాయకులు, కార్యకర్తల సపోర్ట్ బాగా ఉందని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తనకు ఇంత మంచి అవకాశం ఇస్తారని అసలు ఊహించలేదని, సీఎం ప్రోత్సాహంతోనే తాను రాజకీయాలలోకి వచ్చానని తెలిపారు. ఆ కుటుంబాన్ని నమ్ముకున్న వారికి ఎప్పుడూ మంచే జరుగుతుందని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించి ఓట్లడుగుతానని తెలిపారు. రాష్ట్ర సమస్యలపై పార్లమెంటులో పోరాడుతానని అన్నారు. మెజారిటీ ఎంతనేది ఓటరు దేవుళ్లే నిర్ణయిస్తారురని పేర్కొన్నారు. చదవండి: సోమిరెడ్డి.. ఓడగొడతావేంటి! -
ఫలించిన పవన్ ఆశలు.. ఎట్టకేలకు నడ్డాతో భేటీ
న్యూఢిల్లీ : జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఎదురు చూపులు ఫలించాయి. బీజేపీ జాతీయ నాయకులతో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించేందుకు నవంబర్ 23న ఢిల్లీ వెళ్లిన పవన్ ఎట్టకేలకు బీజేపీ జాతీయ అధ్యకుడు జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. జేపీ నడ్డా నివాసంలో బుధవారం సమావేశమైన పవన్.. తిరుపతి ఎంపీ టికెట్‌తోపాటు పలు విషయాలపై చర్చించారు. భేటీ ముగిసిన అనంతరం మీడియాతో పవన్ కల్యాణ్ మాట్లాడారు. చదవండి: ప్రాపకం కోసం బీజేపీ, జనసేన మధ్య అంతర్యుద్ధం నడ్డాతో వివిధ అంశాలపై చర్చించినట్లు తెలిపారు. ఉప ఎన్నిక కోసమే రాలేదని, రాష్ట్ర ప్రయోజనాల కోసం వచ్చినట్లు పేర్కొన్నారు. ఏపీలోని తాజా పరిస్థితులపై నడ్డాకు వివరించినట్లు తెలిపారు. తిరుపతి ఉప ఎన్నిక అభ్యర్థిపై చర్చించామని, జనసేన అభ్యర్ధా, బీజేపీ అభ్యర్ధా అన్న విషయం కమిటి నిర్ణయిస్తుందన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిపై కమిటి వేసినట్లు తెలిపారు. -
ఎమ్మెల్యేగా రఘునందన్ రావు ప్రమాణ స్వీకారం
సాక్షి, హైదరాబాద్ : దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలుపొందిన బీజేపీ నేత రఘునందన్ రావు బుధవారం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ ఛాంబర్లో మధ్యాహ్నం ఒంటి గంటకు అతికొద్ది మంది సమక్షంలో దుబ్బాక శాసనసభ సభ్యుడిగా రఘునందన్ రావు ప్రమాణ స్వీకారం చేశారు. రఘునందన్ చేత అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, బీజేపీ నేతలు, ఎమ్మెల్సీ రామచందర్ రావు, ఎమ్మెల్యే రాజసింగ్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి హాజరయ్యారు. చదవండి: రఘునందన్‌పై ఫిర్యాదు: మహిళ ఆత్మహత్యాయత్నం కాగా నవంబర్ 10న దుబ్బాక ఉప ఎన్నికల ఫలితం వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఉపఎన్నికలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరా హోరి పోరు సాగింది. మొత్తం 23 రౌండ్లలో సాగిన దుబ్బాక లెక్కింపులో రఘనందన్‌రావుకు 62, 772 ఓట్లు రాగా.. సోలిపేట సుజాతకు 61, 302 ఓట్లు వచ్చాయి. దీంతో బీజేపీ అభ్యర్థి రఘనందన్‌రావు మొదటి సారిగా అసెంబ్లీలో అడుగు పెట్టనున్నాడు. అత్యల్ప ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించారు. -
వాపునే బలంగా భావిస్తున్న బీజేపీ
ఉట్టికెగరలేనమ్మ.. స్వర్గానికెగిరినట్టు .. రాష్ట్రంలో ఒక్క అసెంబ్లీ సీటు లేదు.. ఏకంగా పార్లమెంట్ స్థానానికే పోటీ చేస్తామని బీజేపీ నేతలు బీరాలు పలుకుతున్నారు. క్షేత్ర స్థాయిలో సత్తా లేకపోయినా జనసేనతో కలిసి పోటీ చేస్తామని జబ్బలు చరుస్తున్నారు. తెలంగాణలోని దుబ్బాక వాపుతో ఇక్కడా బలిసినట్లు భ్రమపడుతున్నారు. గత ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లు పొందిన ఘనులు.. తిరుపతి ఉప పోరులో తమదే విజయమని ప్రకటనలు గుప్పిస్తున్నారు. గత సంప్రదాయాలను తుంగలో తొక్కి పోటీకి దిగాలను కోవడం సిగ్గుచేటని పలువురు విమర్శిస్తున్నారు. సాక్షి, తిరుపతి: దుబ్బాక విజయంతో బీజేపీ తిరుపతి పార్లమెంట్ ఉప పోరుకు రెడీ అయ్యింది. అది కూడా జనసేనతో కలిసి పోటీ చేయాలని నిర్ణయించింది. తిరుపతి వైఎస్సార్సీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌రావు ఆకస్మిక మృతితో ఆ స్థానానికి ఎన్నిక అనివార్యమైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేయడానికి బీజేపీ ఇప్పటినుంచే కార్యాచరణ రూపొందిస్తోంది. అందులో భాగంగా గురువారం తిరుపతిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు, పార్టీ వ్యవహారాల ఇన్చార్జి సునీల్థియోదర్ ఆధ్వర్యంలో పార్లమెంట్ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఇందులో తిరుపతి పార్లమెంట్ పరిధిలోని తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాలతోపాటు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పరిధిలోని సూళ్లూరుపేట, వెంకటగిరి, గూడూరు, సర్వేపల్లె నియోజకవర్గాల నేతలు పాల్గొన్నారు. చదవండి: శ్రీవారిని దర్శించుకున్న సోము వీర్రాజు సంప్రదాయానికి నీళ్లు ఎవరైనా ప్రజాప్రతినిధి ఆకస్మికంగా మరణిస్తే వారి కుటుంబ సభ్యుల్లో ఒకరిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ఆంధ్రప్రదేశ్‌లో సంప్రదాయంగా వస్తోంది. ఇప్పటి వరకు జిల్లాలో ఆ సంప్రదాయాన్ని రాజకీయ పారీ్టలు పాటిస్తూ వచ్చాయి. గతంలో తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ ఆకస్మిక మృతితో ఆ స్థానానికి ఖాళీ ఏర్పడింది. అప్పట్లో ఎన్నికలు జరిగినా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంప్రదాయాన్ని గౌరవిస్తూ పోటీకి దూరంగా నిలిచింది. ఇప్పుడు బీజేపీ–జనసేన, కాంగ్రెస్, టీడీపీ అత్యుత్సాహంతో పోటీకి సిద్ధమవుతున్నాయి. చదవండి: నీరు–చెట్టు, అమరావతి పేరిట రూ.2,300 కోట్ల స్కామ్ పార్టీకి దూరం.. టీవీ సమీక్షలకు పరిమితం తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీలో చెప్పుకోదగ్గ ప్రజానాయకుడు లేరు. కీలక పదవిలో ఉన్న నాయకుల అనుచరులుగా చెలామణి అవుతున్నవారే ఎక్కువగా ఉన్నారన్న వి మర్శలున్నాయి. పార్టీ అండతో గత ప్రభుత్వంలో టీటీడీలో కీలక పదవి దక్కించుకున్న నాయకుడు ఒకరు దాన్ని అడ్డం పెట్టుకుని సొంతింటిని చక్కదిద్దుకున్నారే ప్రచారం ఉంది. పార్టీని బలోపేతం చేసేందుకు ఏనాడూ ప్రయతి్నంచలేదని సొంత పార్టీ శ్రేణులే విమర్శలు గుప్పిస్తున్నారు. తిరుమల దర్శనానికి వచ్చే బీజేపీ అగ్రనేతలకు స్వాగతం పలికేందుకు, ఆ తర్వాత దేవుని దర్శనం పేరుతో వీఐపీలతో కలిసి తిరుమలలో చక్కర్లు కొట్టడం తప్ప చేసేదేమీ లేదనే ప్రచారం ఉంది. వీళ్లను చూడాలంటే టీవీల్లో లేదా పత్రికల్లో తప్ప మామూలుగా కనిపించకపోవడం గమనార్హం. తిరుపతి.. ఎవరికెంత పరపతి తిరుపతి పార్లమెంట్ స్థానానికి 1952లో మొదటిసారి ఎన్నికలు జరిగాయి. అప్పటి నుంచి 2019 వరకు 16 సార్లు ఎన్నికలు నిర్వహించగా, అందులో కాంగ్రెస్ 12, రెండు పర్యాయాలు వైఎస్సార్సీపీ, ఒకసారి టీడీపీ, మరొకసారి బీజేపీ గెలుపొందాయి. 2014 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కారుమంచి జయరాం టీడీపీ పొత్తులో భాగంగా పోటీ చేశారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాద్‌రావు 37,425 ఓట్ల మెజారీ్టతో గెలుపొందారు. 2019లో వైఎస్సార్సీపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్‌రావు తన సమీప టీడీపీ అభ్యర్థి పనబాక లక్షి్మపై 2,28,376 ఓట్ల మెజారీ్టతో గెలుపొందారు. 2019లో బీజేపీ ఒంటరిగా పోటీ చేసింది. ఈ ఎన్నికలో బీజేపీ అభ్యర్థి బి.శ్రీహరిరావుకు 16,125 ఓట్లు రాగా.. నోటాకు 25,781 ఓట్లు పడ్డాయి. నాడు జనసేన మిత్రపక్షమైన బీఎస్పీ అభ్యర్థి దగ్గుమాటి శ్రీహరిరావుకు 20,971 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి చింతామోహన్‌కు 24,039 ఓట్లు రావడం గమనార్హం. -
నా బలం.. స్పూర్తి నువ్వే: సీఎం
భోపాల్: ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఆనందంలో ఉన్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తన భార్య సాధ్నాను పొగడ్తలతో ముంచెత్తారు. ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిచిన నేపథ్యంలో ‘విజయం సాధించినందుకు అభినందనలు’ అంటూ సాధ్నా బుధవారం తెల్లవారుజామున ట్వీట్ చేశారు. తన భర్తకు స్వీట్ తినిపిస్తున్న ఫోటోను దీనికి జత చేశారు. ‘నీవేనా బలం, నా ప్రేరణకు మూలం నువ్వే. నా జీవితంలో ప్రతీ విజయంలో నీ సహకారం ఉంది. నీవు నాతో ఉంటే ఎల్లప్పుడు నాదే విజయం’ అంటూ భార్య ట్వీట్‌కు శివరాజ్ సింగ్ సమాధానమిచ్చారు. అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలంటే తప్పక గెలవాల్సిన ఉప ఎన్నికల్లో బీజేపీ 28 సీట్లకు గానూ 19 స్థానాల్లో గెలిచి, ప్రభుత్వం కూలిపోకుండా కాపాడుకోగలిగింది. కాంగ్రెస్ పార్టీ చావు దెబ్బతిని 8 సీట్లకే పరిమితమైంది. 25 మంది శాసన సభ్యుల రాజీనామా, ముగ్గురు సభ్యుల మరణంతో ఈ ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. 28 శాసన సభ స్థానాలకు నవంబర్ 3న జరిగిన పోలింగ్ జరిగింది. మంగళవారం ఉదయం మొదలైన కౌంటింగ్ బుధవారం తెల్లవారు జామున ముగిసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చౌహాన్ మాట్లాడుతూ.. ఉప ఎన్నికల్లో విజయాన్నిమధ్యప్రదేశ్ ప్రజల విజయంగా అభివర్ణించారు. అభివృద్ధికి, ప్రభుత్వంపై గల విశ్వాసానికి, ప్రజాసౌమ్యానికి ప్రతీకగా ఈ విజయాన్ని పేర్కొన్నారు. బీజేపీ పైగల విశ్వాసంతో ఓట్ల రూపంలో మధ్యప్రదేశ్ ప్రజలు దీవించారన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రజల సంక్షేమానికి కృషి చేస్తానని శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రతిజ్ఞ చేశారు. (చదవండి: బీజేపీకే ఎందుకు పట్టంగట్టారు!?) -
ఈవీఎంలతోనే బీజేపీ గట్టెక్కింది : దిగ్విజయ్ సింగ్
భోపాల్ : మధ్యప్రదేశ్‌లో 28 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో మెజారిటీ స్ధానాలను బీజేపీ కైవసం చేసుకుని కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ ఇచ్చింది. కాషాయ పార్టీ విజయంతో రాష్ట్రంలో పాలనా పగ్గాలు చేపట్టాలని కాంగ్రెస్ పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి. అయితే ఈవీఎంల మాయాజాలంతోనే బీజేపీకి భారీ విజయం దక్కిందని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. చిప్‌తో కూడిన ఎలాంటి మిషన్‌ను అయినా హ్యాక్ చేయవచ్చని వ్యాఖ్యానించారు. అగ్రదేశాలు సైతం బ్యాలెట్ పేపర్లనే వాడుతున్నాయని, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇంకా కొన్ని రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ సాగుతోందని దిగ్విజయ్ పేర్కొన్నారు. విపక్షాలు సాధించిన విజయాలు చూపుతూ ఈవీఎంల పనితీరును బీజేపీ సమర్ధించుకుంటోందని, ఈవీఎంలను ఎంపిక చేసిన ప్రాంతాల్లోనే తారుమారు చేస్తారని తాను చెప్పగలనని ఆయన ఆరోపించారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు కమల్ నాథ్, దిగ్విజయ్ సింగ్ రాష్ట్ర ప్రజలను వంచించారని మధ్యప్రదేశ్ బీజేపీ చీఫ్ వీడీ శర్మ మండిపడ్డారు. ఇక మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఇప్పటివరకూ 9 స్ధానాల్లో గెలుపొందిన బీజేపీ మరో పదిస్ధానాల్లో ఆధిక్యంలో ఉండగా, కేవలం ఒక స్ధానంలో విజయం సాధించిన కాంగ్రెస్ మరో ఏడు స్ధానాల్లో ఆధిక్యంలో ఉంది. మొరెనా స్ధానంలో బీఎస్పీ అభ్యర్ధి ఆధిక్యంలో ఉన్నారు. ఇక కాంగ్రెస్ తిరుగుబాటు నేత జోతిరాధిత్య సింధియా తన పట్టును నిలుపుకున్నారు. తన వెంట వచ్చిన ఎమ్మెల్యేలంతా గెలుపు దిశగా పయనిస్తున్నారు. కాగా తమ పార్టీ నేతల సమిష్టి కృషితోనే ఈ విజయం సాధ్యమైందని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యాఖ్యానించారు. చదవండి : ఉప ఎన్నికల్లో బీజేపీ హవా -
‘మోదీ విజన్‌తోనే మెరుగైన ఫలితాలు’
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో కాషాయ పార్టీ బిహార్ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు రాబట్టిందని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ అన్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ బిహార్‌లో ఘన విజయం సాధించిందని అన్నారు. ఆర్జేడీ సారథ్యంలోని మహాకూటమిపై విస్పష్ట ఆధిక్యం కనబరిచిందని చెప్పారు. చదవండి : కోవిడ్-19 : ప్రపంచానికి భారత్ బాసట ఇక 243 స్ధానాలు కలిగిన బిహార్ అసెంబ్లీలో ఎన్డీయే కూటమి 123 స్ధానాల్లో ఆధిక్యంతో మేజిక్ మార్క్‌కు చేరువ కాగా, మహాకూటమి 112 స్ధానాల్లో ముందంజలో ఉండగా ఇతరులు 8 స్ధానాల్లో ఆధిక్యం కనబరుస్తున్నారు. మరోవైపు యూపీలో జరిగిన ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో ఆరు స్ధానాల్లో బీజేపీ విజయదుంధుభి మోగించడం పట్ల పార్టీ కార్యకర్తలను యోగి ఆదిత్యానాథ్ అభినందించారు. ఇక మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో బీజేపీ మెరుగైన ఫలితాలు సాధించింది. -
బై పోల్స్: ఫలితం ప్రభుత్వాన్ని కూల్చుతుందా?
సాక్షి, న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జరుగుతున్న ఉప ఎన్నికలు ప్రధాన పార్టీల నడుమ మరోసారి రాజకీయ వేడిని పుట్టిస్తున్నాయి. 94 అసెంబ్లీ స్థానాలకు బిహార్‌లో రెండోదశ పోలింగ్ ప్రారంభమవ్వగా.. ఈ స్థానాలు జేడీయూ, ఆర్జేడీకి ఎంతో ముఖ్యమైనవి. ఎన్డీయే తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌తో పాటు కేంద్రమంత్రులు సైతం ఆయా నియోజకవర్గల్లో సుడిగాలి పర్యటన చేశారు. జేడీయూ-బీజేపీ అభ్యర్థుల విజయానికి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన ఆర్జేడీకి రెండోదశ పోలింగ్ అత్యంత కీలమైనది. కూటమి తరుఫున తేజస్వీ అన్నీ తానై ప్రచార బాధ్యతలను నిర్వర్తించారు. ఇక 243 అసెంబ్లీ స్థానాలున్న బిహార్ అసెంబ్లీకి ఇప్పటికే తొలిదశ పోలింగ్ పూర్తయిన విషయం తెలిసిందే. మరోవైపు మధ్యప్రదేశ్‌లో 28 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికలు జాతీయ స్థాయిలో ప్రత్యేక దృష్టికి ఆకర్షించాయి. కమల్‌నాథ్ సర్కార్‌ను కూల్చి బీజేపీ గూటికి చేరిన 25 మంది ఎమ్మెల్యే రాజీనామాతో ఈ ఎన్నికలు అనివార్యం అయ్యాయి. మరో మూడు స్థానాలు కలుపుకుని మొత్తం 28 స్థానాలకు పోలింగ్ ఇదివరకే మొదలైంది. ఈ ఎన్నికను అధికార బీజేపీతో పాటు విపక్ష కాంగ్రెస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మొత్తం 28 స్థానాల్లో తొమ్మిదింటిలో గెలిస్తే శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. లేకపోతే ప్రభుత్వం మైనార్టీలో పడే అవకాశం ఉంటుంది. అలాగే కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి ఫిరాయించిన జ్యోతిరాధిత్య సింధియాకూ ఈ ఎన్నిక కీలకమైనది. ఆయన వర్గంగా భావిస్తున్న ఎమ్మెల్యేలంతా పోటీలో ఉండటంతో బీజేపీ నాయకత్వంలో వారి గెలుపు బాధ్యతను యువ నేతపై మోపింది. కాంగ్రెస్ నుంచి అవమానానికి గురై తిరుగుబాటు చేసిన సింధియా ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపించుకుని హస్తం పార్టీని కోలుకోలేని దెబ్బ తీయాలని కసితో రగిలిపోతున్నారు. అదే స్థాయిలో బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం సైతం జోరుగా నిర్వహించారు. మరోవైపు చేతిలో ఉన్న అధికారాన్ని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. ఉప ఎన్నికలు జరుగుతున్న 28 సీట్లు గెలిచినా మ్యాజిక్ ఫిగర్‌కు ఒక్క అడుగు దూరంలో ఆ పార్టీ నిలిచిపోతుంది. అయినప్పట్టికీ స్వతంత్రుల మద్దతులో మరోసారి తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కమల్‌నాథ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఉప ఎన్నికలు మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని మారుస్తాయా? లేక ఏకపక్ష తీర్పు రానుందా అనేది వేచి చూడాలి. కాంగ్రెస్‌పై తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలే ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులుగా బరిలోకి దిగటం గమనార్హం. మరోవైపు గుజరాత్(8), కర్ణాటక(2), చత్తీస్‌గఢ్(1), ఉత్తర ప్రదేశ్(7), జార్ఖండ్(2), నాగాలాండ్(2), హరియాణా(1), ఒడిశా(2), తెలంగాణ (దుబ్బాక)ల్లోనూ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. -
ఉద్రిక్తత..పలువురు బీజేపీ నేతల అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా ప్రచారానికి తెర పడటంతో రాజకీయ వేడి మరింత పెరిగింది. విధ్వంసం సృష్టిస్తారన్న ముందస్తు సమాచారంతో బీజేపీ కార్యాలయం వద్ద పోలీసులు మోహరించారు. బీజేపీ శ్రేణుల ఆందోళనల సమాచారంతో ప్రగతిభవన్, టీఆర్ఎస్ ఆఫీస్ వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ముందు జాగ్రత్తచర్యగా పలువురు బీజేపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. ఎల్బీనగర్, హయత్‌నగర్, శేరిలింగంపల్లిలో ఇప్పటికే పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్ జిల్లా వేములవాడలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ హౌస్ అరెస్ట్ చేశారు. (రక్తపాతం జరిగేలా బీజేపీ ప్రోత్సహిస్తుంది : కేటీఆర్ ) హయత్‌నగర్‌లో బీజేపీ ధర్నా... హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో బీజేపీ నాయకులు ఆందోళన నిర్వహిస్తున్నారు. డీజీపీ ఆఫిస్, ప్రగతిభవన్ ముట్టడిస్తామని తమపై కేసీఆర్ అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ నేతలు భైటాయించారు. నేతలను అరెస్ట్ చేసి తమ హక్కులను కాలరాస్తున్నారంటూ మండిపడ్డారు. ఇలాగే కొనసాగితే టీఆర్ఎస్ నాయకులు ఎక్కడ తిరగకుండా అడ్డుకుంటామని బీజేపీ రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షుడు సామ రంగారెడ్డి హెచ్చరించారు. ఇప్పటికే సామ రంగారెడ్డితో పాటు సీనియర్ నాయకులు కళ్లెం రవీందర్ రెడ్డి 20మంది కార్యకర్తలను హయత్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. -
బీజేపీ నేతలకు నిజంగా దమ్ముంటే..
సాక్షి, సిద్దిపేట : దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నేతల అసత్య ప్రచారాలపై ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. దుబ్బాకలో బీజేపీ పార్టీ జూటా మాటలు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. బీజేపీ జూటా మాటలు ప్రజలకు తెలియజేసేందుకే ఈ రోజు(శుక్రవారం) మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. వెనుకటికి వేయి అబద్దాలు ఆడిన ఒక పెళ్లి చేయాలని అనే వారని, ఇప్పుడు బీజేపీ వాళ్ళు వేయి అబద్దాలు ఆడైన ఒక ఎన్నిక గెలవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్దాలే ఆయుధంగా చేసుకుని, అబద్ధాల పునాదుల మీద దుబ్బాకలో బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారన్నారు. బీజేపీ నేతలు సత్యమేవ జయతే అనే నానుడిని మార్చి అసత్యమేవ జయతేగా మార్చివేశారని విమర్శనాస్త్రాలు సంధించారు.చదవండి: దుబ్బాక ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తుకు నాంది బీడీ కార్మికులకు కాంగ్రెస్ పార్టీ పుర్రె గుర్తును బహుమతిగా ఇస్తే, బీజేపీ వాళ్ళు 18 శాతం జీఎస్టీని కానుకగా ఇచ్చారని మంత్రి ఎద్దేవా చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బీడీ కార్మికులను మోసం చేస్తే, కేసీఆర్ పెన్షన్ ఇచ్చి వారిని ఆదుకున్నారని గుర్తు చేశారు. కేసీఆర్ కిట్ పథకంలో బీజేపీ ప్రభుత్వ వాటా ఉందని బీజేపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. కేసీఆర్ కిట్‌లో కేంద్రానిది నయా పైసా లేదని స్పష్టం చేశారు. గొర్రెల యూనిట్లలో 50 వేలు బీజేపీ ప్రభుత్వం ఇస్తుందని గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని అన్న మంత్రి హరీష్‌రావు గొర్రెల యూనిట్లలో నూటికి నూరు శాతం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందని పేర్కొన్నారు. చేగుంటలో మంజూరైన ఈఎస్ఐ ఆసపత్రిని గజ్వేల్‌కు తరలించారని బీజేపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. బీజేపీ నేతలకు నిజంగా దమ్ముంటే చేగుంటకు మంజూరు ఆయునట్లు ఆధారాలు చూపాలని సవాల్ విసిరారు. చదవండి: దుబ్బాక ఎన్నికలపై కేంద్రానికి కాంగ్రెస్ ఎంపీ లేఖ ‘ఆఖరికి ప్రజలు తినే అన్నం పైన బీజేపీ నేతలు అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. రేషన్ బియ్యంపై కేంద్రం 29 రూపాయలు ఇస్తుంటే, టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రూపాయి ఇస్తోందని ప్రచారం చేస్తున్నారు. కేంద్రం కేవలం సగం కార్డులకే సబ్సిడీ ఇస్తే మిగతా సగం కార్డులకు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది. దుబ్బాకలో మంజూరైన పాలిటెక్నిక్ కాలేజ్‌ను సిద్దిపేటకు తరలించారని గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. అసలు దుబ్బాకకు పాలిటెక్నిక్ కళాశాలనే మంజూరు కాలేదు. కేసీఆరే బోరు మోటార్లకు మీటర్ పెడుతుందని ఉల్టా ప్రచారం చేస్తున్నారు. చదవండి: దుబ్బాక ఎన్నికపై కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు వరి ధాన్యం మద్దతు ధర కోసం రూ. 5,500 కోట్లు కేంద్రం విడుదల చేసిందని పచ్చి అబద్దాలు ఆడుతున్నారు. కేంద్రం ఒక్క రూపాయి విడుదల చేయలేదు. డబ్బులు దొరికిన ఇల్లు మా వాళ్లది కాదంటున్న బీజేపీ అభ్యర్థి పోలీసులు తనిఖీలు చేస్తున్నారు అని తెలియగానే ప్రచారం ఆపేసి ఎందుకు ఆగమేఘాల మీద పరుగెత్తుకు వచ్చిండు? హడావుడి ఎందుకు చేసిండు? దుబ్బాకలో రఘునందన్ రావు అసత్యాలు ప్రచారం చేసే జూటా స్టార్‌గా మారాడు. దుబ్బాక ప్రజలు బీజేపీ నేతల మాటలు విని మోసపోవద్దు’. అని మంత్రి బీజేపీ ప్రచారం చేస్తున్న అబద్దాలపై నిప్పులు చెరిగారు. -
‘సుజాతక్క తోటి ఏం పని అయితదని అనుకోవద్దు’
సాక్షి, సిద్ధిపేట : దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా ఆర్థికశాఖ మంత్రి హారీష్ రావు ప్రతిపక్షాలను టార్గెట్ చేసి విమర్శలు ఎక్కుపెట్టారు. తెలంగాణ కోసం టీఆర్ఎస్ ఎంతో పాటు పడిందని చెప్పిన మంత్రి కాంగ్రెస్ బీజేపీపై మండిపడ్డారు. ఒక్క ఓటు రెండు రాష్ట్రాలు అని చెప్పిన బీజేపీ మోసం చేసింది నిజం కాదా అని మంత్రి హారీష్ రావు ప్రశ్నించారు. ఆనాడు విద్యార్థి మిత్రుల చావులకు ఈ కాంగ్రెస్ కారణం కాదా అని నిలదీశారు. తొగుల మండల కేంద్రంలో మంగళవారం యువజన బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, పెద్ద సంఖ్యలో యువకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. రాదనుకున్న తెలంగాణ తెచ్చిన ఘనత కేసీఆర్‌ది అని తెలిపారు. డిసెంబర్ 9న వచ్చిన తెలంగాణ వెనక్కి పోతే తామంతా రాజీనామా చేస్తే, బీజేపీ కిషన్ రెడ్డి రాజీనామా చేశాడా అని ప్రశ్నించారు. చదవండి: బీజేపీ నేతల ఆరోపణలు అవాస్తవం: సీపీ నీళ్లు, నిధులు, నియమకాలు టీఆర్ఎస్ నినాదమని, ఈ రోజు కాళేశ్వరం ద్వారా సాగు నీరు తెచ్చుకుంటున్నామన్నారు. మన నిధులు దక్కాయి కాబట్టే రైతు బంధు, రైతు బీమా, వచ్చాయన్నారు. తెలంగాణ వస్తే లక్ష ఉద్యోగాలు అని చెప్పామని, 1,24,990 ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. కేసీఆర్ పారిశ్రామిక విధానంతో 8 వేల పరిశ్రమలు వచ్చాయని పేర్కొన్నారు. బీజేపీ వస్తే నల్లధనం తెస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షలు వేస్తామన్నారు. వచ్చాయా అని ప్రశ్నించారు. వారు వస్తే ఏటా కోటి ఉద్యోగాలన్నారు. మరి ఇచ్చారా అని ప్రశ్నించారు. డీమానిటైజేషన్‌తో ఉన్న ఉద్యోగాలు ఊడబీకారని ఎద్దేవా చేశారు. నిజామాబాద్‌లో అర్వింద్ కుమార్ తాను గెలిస్తే... పసుపు బోర్డు తెస్తా అని బాండ్ పేపర్ మీద రాసిచ్చాడని, వచ్చిందా పసుపు బోర్డు అని నిలదీశారు. చదవండి: సీపీని సస్పెండ్ చేయాలి: బండి సంజయ్ ‘బీహార్‌లో బీజేపీ, ఢిల్లీలో బీజేపీ ఉంటేనే అభివృద్ధి జరుగుతదని మోడీ అంటున్నాడు. గట్లనే హైదరాబాద్‌లో కారు ఉంది. దుబ్బాకలో కూడా కారు ఉంటే అభివృద్ధి జరుగుతది. ముత్యంరెడ్డి బాగా అభివృద్ధి చేశాడని అంటున్న కాంగ్రెస్, 2018లో ఎందుకు టిక్కెట్టు ఇవ్వలేదు. కాంగ్రెస్ అంటే కాలిపోయే మోటార్లు, బీజేపీ అంటే బాయికాడ మీటర్లు, టిఆర్ఎస్ అంటే 24 గంటల కరెంట్. కన్న తండ్రి క్షోభకు కారణమైన శ్రీనివాస్ రెడ్ది, ప్రజలకేం సేవ చేస్తాడు. మల్లన్నసాగర్ ముంపు బాధితులకు రావాల్సిన ప్రతి పైసా ఇప్పిస్తాం. ఆలస్యం కావడానికి కాంగ్రెస్ కేసులు వేయడమే. దేశంలో బీహార్, ఉత్తరాఖండ్, యూపీ రాష్ట్రాల్లో కంటే నిరుద్యోగిత సగానికి సగం తక్కువ. తెలంగాణలో కేవలం 3.6 శాతమే. బీజేపీ కుడితులో పడ్డ ఎలుకల మారింది.. డబ్బులతో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది.’ అని మంత్రి హరీష్‌రావు విమర్శించారు. చదవండి: 'అల్లుడిని ముందు పెట్టి కేసీఆర్ నడిపిస్తున్నారు' దుబ్బాకలో టీఆర్ఎస్ గెలిచేది ఖాయమని ఎంపీ ప్రబావకర్రెడ్డి తెలిపారు. ‘బీజేపీ, కాంగ్రెస్‌లు వెంటిలేటర్ మీద ఉన్నాయి. దుబ్బాకకు ఎప్పుడైనా కిషన్ రెడ్ది వచ్చారా. నిన్నటి నుంచి బీజేపీ కొత్త నాటకం మొదలు పెట్టింది. పైసలు పట్టుకుంటున్నారు. ఇంకా పంపించాలని అమిత్‌షాను అడుగుతున్నరు. ఆరడుగుల పిచ్చోడు ఇష్టమైనట్లు మాట్లాడుతున్నారు. స్టాంప్ పేపర్ మీద హామీ ఇచ్చి, రైతులను మోసం చేసిన ఘనత ఎంపీ అర్వింద్‌ది. అయ్యా టీఆర్ఎస్లో ఉండి బీజేపీలో ఉన్న కొడుకుకు సపోర్ట్ చేస్తున్నాడు. ప్రజలను మోసం చేసిన ఇద్దరు కూడా రాజీనామా చేయాలి’ అని తెలిపారు. దివంగత సోలిపేట రామలింగారెడ్డి దుబ్బాకకు ఎన్నో సేవలు అందించారని టీఆర్ఎస్ అభ్యర్థి సుజాత అన్నారు, దుబ్బాకను ఎంతో అభివృద్ధి చేశారని, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ దుబ్బాక అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. సిద్దిపేట వారికి దుబ్బాకతో పని లేదు కానీ, రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ లీడర్లకు ఇక్కడేం పని అని ప్రశ్నించారు. సీఎం కేసీఆఆర్‌కు ముఖ్యమైన నియోజకవర్గం దుబ్బాక అని, సీఎం ఆశీస్సులతో, హరీశ్ రావు సహకారంతో దుబ్బాకలో అభివృద్ధి చేస్తానని భరోసా ఇచ్చారు. సుజాతక్క తోటి ఏం పని అయితదని అనుకోవద్దు, అన్ని చేయగల సమర్థత ఉందని స్పష్టం చేశారు. కన్నతల్లి లాగా నియోజకవర్గ యువతను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటానని తెలిపారు. -
దుబ్బాక: బీజేపీ అభ్యర్థి ఇంట్లో సోదాలు
సాక్షి, సిద్ధిపేట : దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా బీజేపీ అభ్యర్థి బంధువుల ఇంట్లో, కార్యాలయాల్లో పోలీసులు సోమవారం సోదాలు చేపట్టారు. రఘునందన్ రావు అత్తగారిల్లు, సమీప బంధువుల ఇళ్లతో సహా ఎనిమిది చోట్ల ఏక కాలంలో సోదాలు చేస్తున్నారు. ఈ సోదాల్లో రఘునందరన్‌రావు మామ ఇంట్లో రూ. 18 లక్షల 65 వేలు స్వాధీనం చేసుకున్నారు. ఇదిలావుండగా పోలీసుల చర్యలకు వ్యతిరేకంగా బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు, కార్యకర్తలు నిరసనకు దిగారు. మరోవైపు సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ రాజనర్స్ ఇంట్లో పోలీసులు సోదా చేస్తున్నారు. చదవండి: దుబ్బాక అభివృద్ధి బాధ్యత నాది: హరీశ్ రావు -
ఎన్నికల వ్యయం 10 శాతం పెంపు
న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికలు, ఇతర రాష్ట్రాల్లో ఉప ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎన్నికల వ్యయాన్ని 10 శాతం పెంచుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎన్నికల సంఘంతో విస్తృతంగా చర్చించిన తర్వాత కేంద్ర న్యాయశాఖ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు ఎన్నికల్లో వ్యయ పరిమితిని మరో 10శాతం పెంచుతూ కొత్తగా ఉత్తర్వులు జారీచేసింది. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఇన్నాళ్లూ రూ.70 లక్షల వరకు ఖర్చు పెట్టుకోవచ్చు. ఇప్పుడు దానిని రూ.77 లక్షలు చేశారు. అదే చిన్న రాష్ట్రాల లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే వారి ఖర్చుని రూ.54 లక్షల నుంచి రూ. 59 లక్షలకి పెంచారు. ఇక అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చుని రూ.28 లక్షల నుంచి రూ.30.8 లక్షలకి పెంచారు. చిన్న రాష్ట్రాల్లో ఇప్పటివరకు ఉన్న రూ.20 లక్షల వ్యయం పరిమితిని రూ.22 లక్షలకి పెంచారు. కరోనా సంక్షోభం నేపథ్యంలోనే ఎన్నికల వ్యయ పరిమితిని పెంచినట్టుగా తెలుస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం 10శాతం వరకు ఎన్నికల వ్యయాన్ని పెంచుకోవడానికి సిఫారసు చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. పోలింగ్ ముందు రోజు నుంచే రాజకీయ ప్రకటనలపై నిషేధం బిహార్ అసెంబ్లీ ఎన్నికలు, వాల్మీకి లోక్‌సభ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికల్లో పోలింగ్ రోజు, అంతకు ముందు రోజు అభ్యర్థులు ఎటువంటి రాజకీయ పరమైన ప్రకటనలు ఇవ్వకూడదని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324ని అనుసరించి ఎన్నికల కమిషన్ ఈ ప్రకటనలపై నిషేధం విధించింది. 2015 బిహార్ ఎన్నికల సందర్భంగా ఈసీ తొలిసారి ఇలాంటి నిర్ణయం తీసుకుంది. పోలింగ్ రోజు, దానికి ముందు రోజు ప్రకటనల్ని శాశ్వతంగా నిషేధించాలన్న ప్రతిపాదనలు ఏళ్ల తరబడి న్యాయమంత్రిత్వ శాఖ దగ్గర పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో ఎన్నికల సంఘం తనకున్న అధికారాలను ఉపయోగించి తాజాగా ఆదేశాలు జారీ చేసింది. -
వెంటాడుతున్న గతం.. ఓటమి తప్పదా?
సాక్షి, హైదరాబాద్ : దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికతో తెలంగాణలో మరోసారి రాజకీయ వేడి మొదలైంది. టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. నవంబర్ 3న జరిగే ఈ ఎన్నిక కోసం ప్రధాన పార్టీలైన అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ గెలుపే లక్క్ష్యంగా బరిలో నిలిచాయి. అంతేకాకుండా మూడు పార్టీలు ఈ స్థానాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. చుట్టపక్కల సిరిసిల్ల, గజ్వేల్, సిద్దిపేట లాంటి టీఆర్ఎస్ కంచుకోటలు ఉండటంతో దుబ్బాకలో తొలినుంచి టీఆర్ఎస్ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. అక్కడి నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి రామలింగారెడ్డి ఇప్పటి వరకు నాలుగుసార్లు విజయం సాధించారు. అయితే తాజాగా జరుగుతున్న ఉప ఎన్నికలో పోటీ భిన్నంగా ఉండబోతుందని స్థానిక రాజకీయ విశ్లేషకుల మాట. (ముచ్చటగా మూడోసారి: విజయం దక్కుతుందా?) గతంలో కాంగ్రెస్ (చెరుకు ముత్యంరెడ్డి) ఇక్కడ బలమైన నేతగా పేరొందినా.. ప్రస్తుతం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆ స్థానం బీజేపీ ఆక్రమించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఎన్నికల్లో టీఆర్ఎస్కు కాంగ్రెస్ నుంచి కంటే బీజేపీ నుంచే తీవ్రమైన పోటీ ఎదురైయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన రఘునందన్ గతంలో ఇదే స్థానం నుంచి రెండుసార్లు పోటీ చేసి ఓటమి చెందారు. ముచ్చటగా మూడోసారి బరిలోకిదిగి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. ఎలానైనా విజయం సాధించాలని పట్టుదలతో ఉన్న రఘునందన్.. ప్రచారంలో ఇరు పార్టీల కంటే ఓ అడుగు ముందే ఉన్నారు. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన చెరుకు శ్రీనివాసరెడ్డి హస్తం పార్టీ తరఫున, రామలింగారెడ్డి సతీమణి సుజాత టీఆర్ఎస్ తరఫున బరిలో నిలిచారు. స్థానికతతో పాటు, సానుభూతి కూడా తోడవుతుంది భావించిన టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సుజాతను బరిలోకి దింపారు. (కాంగ్రెస్‌లో చేరిక.. టికెట్ కన్ఫాం) సానుభూతి పనికొస్తుందా..? ఎన్నికల్లో సానుభూతి పనికొస్తుది? అనేది గత అనుభవాలు స్పష్టంగా చెబుతున్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఉమ్మడి మెదక్ జిల్లా నారాయణ్‌ఖేడ్ ఎమ్మెల్యే పీ. కిృష్టారెడ్డి అనారోగ్యం కారణంగా మృతిచెందారు. కాంగ్రెస్ పార్టీ సాంప్రదాయం ప్రకారం సిట్టింగ్ ప్రజాప్రతినిధి చనిపోతే రాబోయ్యే ఉప ఎన్నికల్లో వారి కుటుంబంలోనే ఒకరికి సీటును కేటాయిస్తారు. లేకపోతే విపక్షాలు ఒప్పుకుంటే కుటుంబ సభ్యుడిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు. ఈ క్రమంలో నారాయణ్‌ఖేడ్ ఎన్నికల్లో కిృష్టారెడ్డి కుటుంబసభ్యుడినే కాంగ్రెస్ అధిష్టానం బరిలో నిలపగా.. ఆయనపై అధికార టీఆర్ఎస్ పార్టీ భూపాల్‌రెడ్డిని పోటీకి నిలిపి విజయం సాధించింది. సిట్టింగ్ అభ్యర్థి మరణంతో సానుభూతి కలిసొచ్చిందనుకున్న కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బే తగిలింది. రికార్డు మెజార్టీతో కారుపార్టీ విజయం సాధించింది. సీను రిపీటైతే టీఆర్ఎస్కు ఓటమి తప్పదు.. కొంతకాలానికే ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీమంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డి అనారోగ్యంతో మృతిచెందారు. అక్కడ కూడా తన భార్య సుచరితా రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం బరిలో నిలబెట్టింది. 2016లో ఉప ఎన్నిక జరిగిన ఈ స్థానానికి అప్పటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావును టీఆర్ఎస్ అధిష్టానం పోటీకి ఆదేశించింది. అప్పటికే మండలిలో సభ్యుడిగా ఉండి.. కేసీఆర్ మంత్రివర్గంలో కొనసాగుతున్న తుమ్మలకు పాలేరు ప్రజలు భారీ మెజార్టీ కట్టబెట్టారు. దాదాపు 47వేలకు పైగా ఆధిక్యంతో తుమ్మల నాగేశ్వరరావు విజయం సాధించారు. సిట్టింగ్ స్థానం అయిన్పటికీ కాంగ్రెస్ అభ్యర్థి దారుణ పరాజయం మూటగట్టకున్నారు. ఈ రెండు ఉప ఎన్నికల్లో ఏ ఒక్కచోటైనా సానుభూతి పనికొస్తే కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధించాలి. కానీ అలా జరుగలేదు. తాజాగా దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో సానుభూతి అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఆ రెండు స్థానాల్లో వచ్చిన ఫలితమే దుబ్బాకలోనూ పునరావృత్తమైతే అధికార టీఆర్ఎస్కు ఓటమి తప్పదు. టీఆర్ఎస్ నేతలను సైతం ఇదే వెంటాడుతోంది. అయితే స్థానికంగా పార్టీ బలంగా ఉండటంతో పాటు మంత్రి హరీష్ రావు ప్రచారాన్ని ముందుండి నడిపిస్తున్నారు. దుబ్బాక ప్రజలు సానుభూతికి ఓటేస్తారా లేక, విపక్షాలను ఎన్నుకుంటారా అనేది నవంబర్ 10న తేలనుంది. దుబ్బాక ఉప ఎన్నిక షెడ్యూల్.. నామినేషన్ల దాఖలు ప్రారంభం: అక్టోబర్ 9 నామినేషన్ల చివరి తేదీ : అక్టోబర్ 16 నామినేషన్ల పరిశీలన : అక్టోబర్ 17 ఉపసంహరణ చివరి తేదీ: అక్టోబర్ 19 పోలింగ్ తేదీ : నవంబర్ 3 కౌంటింగ్ తేదీ నవంబర్: 10 కేసీఆర్‌ను వెంటాడుతున్న గతం.. ఓటమి తప్పదా? -
టీఆర్ఎస్కు సవాల్ విసిరిన పొన్నం ప్రభాకర్
సాక్షి, హైదరాబాద్: దుబ్బాకలో టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చేసి ఉంటే కాంగ్రెస్‌ను చూసి హరీష్ రావు ఎందుకు భయపడుతున్నారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. హరీష్‌రావు లాంటి అబద్ధాల కోరును నమ్మనుకుంటే మునిగిపోతారని హితవు పలికారు. గతంలో హరీష్‌రావు ప్రచారం చేసిన ఉప ఎన్నికల నియోజక వర్గాలను పరిశీలిస్తే తన గురించి తెలుస్తుందని సూచించారు. చదవండి: దుబ్బాకలో కాంగ్రెస్‌కు బిగ్ షాక్! ‘దుబ్బాకకు కేసీఆర్ ఎన్ని సార్లు వచ్చారు. సిద్ధిపేట పైన ఉన్న ప్రేమ దుబ్బాక పైన ఎందుకు లేదు. దుబ్బాకలో ఏ గ్రామనికైనా వెళ్దాం. ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయా, డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఉన్నాయా చూద్దాం. ఇందిరమ్మ ఇళ్ళు ఉన్న గ్రామాలకు మీరు రావొద్దు, డబల్ బెడ్ రూమ్ ఉన్న గ్రామాలకు మేము రాము. దుబ్బాకలో టిఆర్ఎస్ గెలిచే అవకాశాలు ఉంటే కాంగ్రెస్ నాయకులను ఎందుకు చేర్చుకుంటున్నారు. బీజేపీ ప్రభావం దుబ్బాకలో లేదు’. అని పొన్నం ప్రభాకర్ తెలిపారు. చదవండి: ఆ బిడ్డను ఒక్కరైనా పరామర్శించారా? -
కాంగ్రెస్‌లో చేరిక.. టికెట్ కన్ఫాం
సాక్షి, హైదరాబాద్ : చెరుకు ముత్యం రెడ్డి ఉమ్మడి మెదక్ జిల్లాలోనే గొప్ప నాయకుడని టీపీసీసీ ఛైర్మన్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు. మాజీమంత్రి ముత్యం రెడ్డి కుమారుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి మంగళవారం గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన శ్రీనివాస్ రెడ్డికి ఉత్తమ్ కుమార్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. ఉత్తమ్ మాట్లాడుతూ.. చెరుకు శ్రీనివాస్ రెడ్డిని మనస్ఫూర్తిగా కాంగ్రెస్‌లోకి అహ్వానిస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఆయనకు మంచి భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు. చెరుకు ముత్యం రెడ్డి దుబ్బాకకే కాకుండా తెలంగాణ మొత్తానికి ఆదర్శ నాయకులని కొనియాడారు. దుబ్బాక-దొమ్మట అభివృద్ధి కోసం ముత్యం రెడ్డి నిరంతరం కృషిచేసిన మంచి వ్యక్తి అని పేర్కొన్నారు. చదవండి: (దుబ్బాక ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల) అదే విధంగా చెరుకు శ్రీనివాస్ రెడ్డికి కాంగ్రెస్‌లో మంచి రాజకీయ భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నట్లు ఉత్తమ్ వెల్లడించారు. కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని మండిపడ్డారు. దుబ్బాక నియోజకవర్గం సిద్దిపేట-గజ్వేల్‌కు మధ్యలో ఉందని, టీఆర్ఎస్ దుబ్బాకకు ఎం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. దుబ్బాకలో టీఆరెస్ తరపున తనే అభ్యర్థిని అని హరీష్ అంటున్నారని, మరి అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థికి పలుకుబడి ఉండదా అని ప్రశ్నించారు. దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థిని అధికారికంగా రేపు ఏఐసీసీ ప్రకటన చేస్తుందని వెల్లడించారు. తనతో సహా కాంగ్రెస్ నాయకత్వం అంతా నవంబర్ 1వ తేదీ వరకు దుబ్బాకలోనే ఉంటుందని, ఈ ఎన్నికల తరువాత సైతం దుబ్బాక అభివృద్ధికి కాంగ్రెస్ అండగా ఉంటూ కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. దుబ్బాకలో ఎవరు పైసలు ఇచ్చిన మద్యం పంచినా ఓటు మాత్రం కాంగ్రెస్‌కే వేయాలని కోరారు. (రేపటి నుంచి దుబ్బాకలోనే ఉంటా : ఉత్తమ్) టీఆర్ఎస్ నైతికంగా ఓడిపోయింది నిజాయితీకి మారుపేరు రైతు, ఎమ్మెల్యే చెరుకు ముత్యం రెడ్డి అని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘చెరుకు ముత్యం రెడ్డి సీఎం క్యాంప్ కార్యాలయంలో, సెక్రటేరియట్లో, తన నియోజవర్గాల్లో నిరంతరం కృషి చేశారు. రేపు చెరుకు శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటన చేస్తుంది. నాలుగు కోట్ల ప్రజల కోసం సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే.. ఇవ్వాళ నలుగురు మాత్రమే తెలంగాణను ఏలుతున్నారు. కేసీఆర్ పాలనలో సామాజిక న్యాయం లేదు. శ్రీనివాస్ రెడ్డి 14 సంవత్సరాలు అమెరికాలో ఉన్నారు. చెరుకు ముత్యం రెడ్డి మంత్రిగా ఉంటే శ్రీనివాస్ రెడ్డి పైరవీలు చెయ్యలేదు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక కేటీఆర్ ఎం చేస్తుండో తెలంగాణ సమాజం గమనిస్తోంది. 142 గ్రామాలకు 142 మంది సీనియర్ నాయకులు ప్రజలకు అండగా ఉన్నాము. దుబ్బాకలో టీఆర్ఎస్ నైతికంగా ఓడిపోయింది. టీఆర్ఎస్ రెండేళ్లలో ఒక్క రూపాయి కొత్త పెన్షన్స్ ఇవ్వలేదు.ఎన్నికలు ఉన్నాయని 9వేల కొత్త పెన్షన్స్ ఇచ్చారు. హరీష్ రావు ప్రకటనలు చూస్తుంటే నవ్వు వస్తోంది. సిద్దిపేట-దుబ్బాక హరీష్ రావుకు రెండు కళ్ళు అంటుండు..మరి ఇన్నేళ్లు దుబ్బాకను ఎందుకు పట్టించుకోలేదు.’ అని అధికార టీఆర్ఎస్ను ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ భయపడదు దుబ్బాకలో టీఆర్ఎస్ సెంటిమెంట్ డ్రామా ఆడుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి దుయ్యబట్టారు. రాంలింగారెడ్డి చనిపోవడం బాధాకరమే.. కానీ ఆయన సెంటిమెంట్ ఆలోచిస్తే ముత్యం రెడ్డి గారు చనిపోయిన సెంటిమెంట్ ఏం కావాలని ప్రశ్నించారు. దుబ్బాకకు ఎనలేని సేవలు అందించిన ముత్యం రెడ్డి కుమారుడే బరిలోకి దిగుతున్నారున్నారు. పోలీసులు ఎన్ని ఇబ్బందులు పెట్డినా కాంగ్రెస్ పార్టీ భయపడదని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా దుబ్బాక టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగరెడ్డి అనారోగ్య కారణాలతో ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. దీంతో దుబ్బాక అసెంబ్లీ నియోజక వర్గానికి నవంబర్ 3న ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించి శ్రీనివాస్ రెడ్డికి అవకావం దక్కలేదు. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సతీమణికే టికెట్ ఇచ్చేందుకే టీఆర్ఎస్ అధిష్టానం మొగ్గుచూపుతోంది. దీంతో శ్రీనివాస్‌రెడ్డి నేడు హస్తం గూటికి చేరారు. దుబ్బాక అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీనివాస్‌రెడ్డి బరిలో నిలవడం పూర్తిగా ఖరారు అయినట్లే. -
కమలనాథుల్లో కొత్త ఉత్సాహం
న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ అగ్రనేతలు, హిందూత్వవాదులు నిర్దోషులుగా బయటపడడం కాషాయం కూటమిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. వివాదాస్పద కట్టడాన్ని కుట్ర ప్రకారం కూల్చలేదని, అప్పటికప్పుడు జరిగిపోయిన సంఘటన అంటూ పదే పదే చెబుతూ వస్తున్న బీజేపీ నాయకులు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తున్నారు. బిహార్ ఎన్నికలు, వివిధ రాష్ట్రాల్లో 56 అసెంబ్లీ స్థానాలు, ఒక లోక్ సభ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బాబ్రీ తీర్పుతో మరో భావోద్వేగ అంశాన్ని ఎన్నికల్లో ప్రచారం చేసుకునే అవకాశం బీజేపీకి వచ్చింది. కమలనాథులు రామ మందిర నిర్మాణాన్ని తమ ఖాతాలో వేసుకుంటూనే మసీదు కూల్చివేతతో అంటిన మట్టిని వదిలించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. గత ఏడాది మందిర నిర్మాణానికి అనుకూలంగా తీర్పు రావడం, ఇప్పుడు మసీదు కూల్చివేతలో బీజేపీ ప్రమేయం లేదని కోర్టు తేల్చి చెప్పడంతో రాజకీయంగా తమకు బాగా లబ్ధి చేకూరుతుందని బీజేపీ వర్గాలు యోచిస్తున్నాయి. కోర్టు తీర్పుని జై శ్రీరామ్ నినాదాలతో స్వాగతించామని అగ్రనేత ఎల్కే అడ్వాణీ వ్యాఖ్యానించారు. అటు రాముడికి గుడి కడుతున్నారన్న పేరు ప్రతిష్టలు రావడంతో పాటు, మసీదు కూల్చివేత అప్రతిష్ట కూడా పార్టీకి అంటకుండా తీర్పు వెలువడడం బీజేపీలో మంచి ఉత్సాహాన్ని నింపింది. మొత్తమ్మీద రామజన్మభూమి ఉద్యమం పార్టీకి అన్ని రకాలుగా కలిసొచ్చిందనే విశ్లేషణలు వినబడుతున్నాయి. తీర్పుపై ఎవరేమన్నారు.. ► సీబీఐ కోర్టు తీర్పు చరిత్రాత్మకం. ‘జై శ్రీరామ్.. అందరికీ మంచి బుద్ధి ప్రసాదించాలని దేవుడిని వేడుకుంటున్నాను. –మురళీ మనోహర్ జోషి, బీజేపీ ► కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాను. ఆలస్యమైనా చివరికి న్యాయమే గెలిచింది. –రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర మంత్రి ► 472 ఏళ్లుగా సాగిస్తున్న పోరాటానికి ఎట్టకేలకు తెరపడింది. ఆలయాల రక్షణకు, వాటి ఆస్తుల పరిరక్షణకు పోరాటం కొనసాగిస్తాం. –వినోద్ బన్సల్, విశ్వహిందూ పరిషత్ ప్రతినిధి ► రాజ్యాంగ స్ఫూర్తికి 2019నాటి సుప్రీంకోర్టు తీర్పుకు ఈ తీర్పు విరుద్ధం. –రణ్‌దీప్ సూర్జేవాలా, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి ► ప్రభుత్వాలు పక్షపాత ధోరణితో వ్యవహరించరాదు. న్యాయం పూర్తిగా వక్రీకరించబడింది. –సీతారాం ఏచూరి, సీపీఎం ప్రధాన కార్యదర్శి ► సీబీఐ కోర్టు తీర్పు దురదృష్టకరం. దీనిపై ప్రభుత్వం కోర్టులో సవాల్ చేయాలి. –ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్ ► ఈ కుట్రలో భాగస్వాములెవరన్నదీ బహిరంగ సత్యం. దీనిపై సీబీఐ అప్పీలుకు వెళ్లాలి. –వలీ రహ్మానీ, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ప్రధాన కార్యదర్శి ► పట్టపగలే జరిగిన మసీదు విధ్వంసాన్ని ప్రపంచమంతా చూసింది. ఎవరి ప్రోద్బలంతో ఈ ఘటన జరిగిందో అందరికీ తెలుసు. –మౌలానా అర్షద్ మదానీ, జమైత్ ఉల్ ఉలేమా ఇ హింద్ అధ్యక్షుడు ► ఆ నిర్మాణాన్ని కూల్చివేశారనడానికి సంబంధించి ఎన్నో సాక్ష్యాలున్నా కోర్టు పట్టించుకోలేదు. దీనిపై ముస్లింలు హైకోర్టుకు వెళ్లవచ్చు. దీనిపై అంగీకారం కుదిరితే బోర్డు కూడా పార్టీగా చేరవచ్చు. బాధితులు, తనవంటి ఎందరో సాకు‡్ష్యలు కూడా అవసరమైతే అప్పీలుకు వెళ్లే హక్కుంది. –జఫర్యాబ్ జిలానీ, ఏఐఎంపీఎల్బీ సభ్యుడు, సీనియర్ లాయర్ ► చారిత్రక మసీదు ధ్వంసానికి బాధ్యులైన వారిని నిర్దోషులుగా పేర్కొనడం సిగ్గు చేటు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం. భారత ప్రభుత్వం మైనారిటీలకు, వారి ప్రార్థనా స్థలాలకు రక్షణ కల్పించాలని కోరుతున్నాం. –పాకిస్తాన్ విదేశాంగ శాఖ ► కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేతిలో సీబీఐ పంజరంలో చిలక మాదిరిగా మారిపోయింది. బాబ్రీ కేసులో నిజాయతీగా వ్యవహరించడంలో సీబీఐ విఫలమైంది. –ఎంకే స్టాలిన్, డీఎంకే అధ్యక్షుడు -
‘కన్నడ నాట ఇక సుస్థిర సర్కార్’
బెంగళూర్ : కర్ణాటక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ప్రజలు తమకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం పట్ల సంతోషంగా ఉన్నానని సీఎం బీఎస్ యడియూరప్ప హర్షం వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయంతో ఇప్పుడు తమకు ఎలాంటి సమస్యలూ లేవనీ, ఇక ప్రజా అనుకూల, సుస్ధిర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలకు అందిస్తామని స్పష్టం చేశారు. కాగా, కర్ణాటకలో ఇటీవల జరిగిన 15 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఆరు స్ధానాలను ఇప్పటికే కాషాయపార్టీ దక్కించుకోగా మరో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముందంజలో ఉంది. విపక్ష కాంగ్రెస్ కేవలం రెండు స్ధానాల్లోనే ఆధిక్యంలో కొనసాగుతోంది. కాగా, ఉప ఎన్నికల్లో కాషాయ ప్రభంజనంతో కన్నడ రాజకీయాల్లో ఏర్పడిన సంక్షోభం సమసిపోయినట్టయింది. అసెంబ్లీలో ప్రస్తుతం మైనార్టీ ప్రభుత్వాన్ని నెట్టుకొస్తున్న ముఖ్యమంత్రి యడియూరప్ప సర్కార్‌కు ఉప ఎన్నికల ఫలితాలు మంచి జోష్‌ను నింపాయని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. యడ్డీ సర్కార్ మనుగడ కోసం ఉప ఎన్నికలు జరిగిన 15 స్థానాల్లో కనీసం ఆరు స్థానాల్లో అధికార పార్టీ సభ్యులు విజయం సాధించాల్సి ఉండగా అంతకుమించిన సీట్లు కాషాయ ఖాతాలో పడనుండటంతో బీజేపీ శ్రేణుల్లో ఉత్తేజం నెలకొంది. -
బీజేపీని పట్టి పీడిస్తున్న రెబెల్స్ బెడద
సాక్షి, బెంగళూరు: కచ్చితంగా సగానికిపైగా సీట్లు గెలవాల్సిన ఉప ఎన్నికల్లో బీజేపీకి పలుచోట్ల రెబెల్స్ బెడద పీడిస్తోంది. డిసెంబరు 5న జరగబోయే 15 అసెంబ్లీ సీట్ల ఉప ఎన్నికల నామినేషన్ల పర్వం సమాప్తం కాగా, ప్రచారం ఆరంభమైంది. మూడు ప్రధాన పార్టీలు త్రిముఖ పోటీలో తలపడుతున్నాయి. నేటితో (బుధవారం)తో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుంది. సముదాయింపులు బీజేపీ అధికారంలోకి రావడానికి కారణమైన అనర్హత ఎమ్మెల్యేలకు టికెట్ ఇచ్చి గెలిపించుకుంటామని సీఎం యడియూరప్ప పదేపదే ప్రకటించారు. ఆ నియోజకవర్గాల్లో బీజేపీ నాయకులకు ఇది మింగుడుపడలేదు. పార్టీని నమ్ముకుని ఇన్నేళ్ల నుంచి పనిచేస్తుంటే కొత్తగా వచ్చిన వారికి టికెట్లు ఎలా ఇస్తారంటూ రెబెల్స్ ప్రశ్నిస్తున్నారు. కొంతమంది స్వతంత్ర అభ్యర్థులుగా ఈ ఉప ఎన్నికల్లో నామినేషన్లు కూడా వేశారు. వీరిని ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప దగ్గరి నుంచి పార్టీలోని సీనియర్ నేతలంతా సముదాయించే పనిలో పడ్డారు. మరికొందరు నాయకులు సహాయ నిరాకరణ బాటలో ఉన్నారు హెచ్చరికలు జారీచేసినా రెబెల్స్ అభ్యర్థులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని యడియూరప్ప హెచ్చరించినా హొసకోట నుంచి స్వతంత్ర అభ్యర్థి శరత్ బచ్చేగౌడ వంటివారు వెనకడుగు వేయడం లేదు. హొసపేటలో కవిరాజ్ అరస్ రెబెల్‌గా పోటీలో ఉన్నారు. హీరేకరూర్‌లో జేడీఎస్ అభ్యర్థిగా మఠాధిపతి శివలింగ శివాచార్య స్వామీజీ బరిలో నిలవడంతో ఓట్ల చీలికకు అవకాశం ఏర్పడింది. బెళగావి జిల్లా గోకాక్ నియోజకవర్గంలో జారికిహోళి కుటుంబం నుంచి ఇద్దరు సోదరులు పరస్పరం ప్రత్యర్థులుగా బరిలో నిలిచారు. బీజేపీ అభ్యర్థిగా రమేశ్ జారకిహోళి, కాంగ్రెస్ అభ్యర్థిగా లఖన్ జారకిహోళి నువ్వానేనా అన్నట్లు తలపడుతున్నారు. శివాజీనగర అనర్హత మాజీ ఎమ్మెల్యే రోషన్ బేగ్‌కు బీజేపీ మొండిచేయి చూపడంతో కంగుతిన్నారు. ఆయన పోటీలోనే లేరు. ఐఎంఏ కేసులో నిందితునిగా ఉండడం ఆయనను ఒంటరి చేసింది. ఆయన చివరకు జేడీఎస్ టికెట్ ఆశించినా ఫలితం లేకుండా పోయింది. -
యూపీ బైపోల్స్‌లో బీజేపీ ఆధిక్యం
లక్నో : ఉత్తర్ ప్రదేశ్‌లో జరిగిన 11 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో పాలక బీజేపీ ముందంజలో ఉంది. బీజేపీ ఆరు స్ధానాల్లో ఆధిక్యం కనబరుస్తుండగా విపక్ష ఎస్పీ రెండు స్ధానాల్లో బీఎస్పీ, కాంగ్రెస్‌లు ఒక్కో స్ధానంలో ముందంజలో ఉన్నాయి. ఉప ఎన్నికలు జరిగిన 11 స్ధానాల్లో ఎనిమిది స్ధానాలు బీజేపీ ప్రాతినిథ్యం వహిస్తున్నవే కావడం గమనార్హం. ఎస్పీ, బీఎస్పీలు చెరోస్ధానంలో ప్రాతినిథ్యం వహిస్తున్నాయి. ఎస్పీ రాంపూర్ స్ధానాన్ని, బీఎస్పీ జబల్పూర్ స్ధానాన్ని నిలబెట్టుకునేందుకు ప్రతిష్టాత్మకంగా పోరాడుతున్నాయి. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 300కిపైగా స్ధానాలతో క్లీన్‌స్వీప్ చేసిన బీజేపీ ఈనెల 21న జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో మొత్తం 11 స్ధానాలను గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేసింది. 11 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలకు బీజేపీ 10 స్ధానాల్లో పోటీచేయగా, ఒక స్ధానం మిత్రపక్షం అప్నాదళ్‌కు కేటాయించింది. -
రెబల్ ఎమ్మెల్యేలకు రిలీఫ్
సాక్షి, న్యూఢిల్లీ : కర్ణాటకలో 15 అసెంబ్లీ స్ధానాలకు జరిగే ఉప ఎన్నికల్లో తమను కూడా పోటీకి అనుమతించాలని కోరుతూ అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు సర్వోన్నత న్యాయస్ధానం అంగీకరించింది. వీరి పిటిషన్‌కు సంబంధించి కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ సహా రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. రెబెల్ ఎమ్మెల్యేలు అనర్హత వేటుకు గురవడంతో ఖాళీ అయిన 15 అసెంబ్లీ స్ధానాల్లో వచ్చే నెల 21న జరిగే ఉప ఎన్నికల్లో తమనూ పోటీకి అనుమతించాలని కోరుతూ వారు దాఖలు చేసిన పిటిషన్‌పై ఈనెల 25న విచారణ చేపడతామని జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీం బెంచ్ స్పష్టం చేసింది. మరోవైపు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తూ స్పీకర్ జారీ ఉత్తర్వులు వారిని ఉప ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధించలేవని ఈసీ తరపు న్యాయవాది కోర్టుకు నివేదించారు. రెబెల్ ఎమ్మెల్యేలను స్పీకర్ అనర్హులుగా ప్రకటించడంతో హెచ్డీ కుమారస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్-జేడీ(ఎస్) సంకీర్ణ సర్కార్ పతనమైన సంగతి తెలిసిందే. -
మహారాష్ట్ర, హరియాణాల్లో ఎన్నికల నగారా
సాక్షి, న్యూఢిల్లీ: మహారాష్ట్ర, హరియాణా రాష్ట్రాల శాసనసభ ఎన్నికలతో పాటు వివిధ రాష్ట్రాల్లో లోక్‌సభ, శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) షెడ్యూలు విడుదల చేసింది. దీంతోపాటు తెలంగాణలోని హుజూర్నగర్ శాసనసభ నియోజకవర్గానికి కూడా ఉప ఎన్నిక జరగనుంది. ఎన్నికల షెడ్యూలు విడుదలైన మరుక్షణం నుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా మీడియాకు వెల్లడించారు. ఈ రెండు రాష్ట్రాలకు ఒకే విడతలో ఎన్నికలు జరపనున్నట్లు ప్రకటించారు. కాగా, హరియాణాలోని 90 అసెంబ్లీ స్థానాల్లో 17 స్థానాలు షెడ్యూలు కులాలకు రిజర్వ్ అయి ఉన్నాయి. ఇక్కడ ఎస్టీ నియోజకవర్గాలేవీ లేవు. మహారాష్ట్రలో మొత్తం 288 నియోజకవర్గాలకు గాను 29 ఎస్సీ, 25 ఎస్టీ రిజర్వు అయి ఉన్నాయి. మహారాష్ట్ర అసెంబ్లీ 2014 నవంబరు 10వ తేదీన కొలువుదీరగా శాసనసభ కాల పరిమితి 2019 నవంబరు 9వ తేదీతో ముగియనుంది. అలాగే, హరియాణా శాసనసభ 2014, నవంబరు 3వ తేదీన కొలువుదీరగా 2019, నవంబరు 2న ముగియనుంది. 64 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక దేశవ్యాప్తంగా ఒక లోక్‌సభ స్థానం, వివిధ రాష్ట్రాల్లోని 64 శాసనసభ స్థానాలకు ఉప ఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలు విడుదల చేసింది. ఎంపీ రామచంద్ర పాశ్వాన్ మరణించడంతో బిహార్‌లోని సమస్తిపూర్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. సమస్తిపూర్ లోక్‌సభ నియోజకవర్గంతో పాటు హుజూర్నగర్ సహా దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 64 శాసన సభ స్థానాలకూ అక్టోబరు 21న ఎన్నిక జరగనుంది. ప్రధానంగా కర్ణాటకలో 15, యూపీలో 11, బిహార్, కేరళ రాష్ట్రాల్లో 5, అస్సాం, గుజరాత్‌లలో 4 చొప్పున స్థానాల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటకలో ఫిరాయింపు నిరోధక చట్టం పరిధిలో ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడడంతో అక్కడ ఎక్కువ స్థానాల్లో ఉప ఎన్నిక జరుగుతోంది. ఉప ఎన్నిక జరిగే నియోజకవర్గాల్లో ఎన్నికల నిబంధనావళి తక్షణం అమల్లోకి వస్తుంది. సుప్రీంను ఆశ్రయిస్తాం: కర్ణాటక ఎమ్మెల్యేలు సాక్షి, బెంగళూరు: ఎన్నికల సంఘం ప్రకటనపై అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలు బెంగళూరులో మాట్లాడుతూ.. తమపై అనర్హత పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉండగా ఎన్నికలు జరపాలన్న ఈసీ నిర్ణయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు. ఈసీ నిర్ణయంపై స్టే కోరుతామన్నారు. మొత్తం 17 మందిపై అనర్హత వేటు పడగా ఈసీ 15 స్థానాలకు మాత్రమే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం గమనార్హం. మిగతా ఇద్దరి ఎన్నికకు సంబంధించిన పిటిషన్లు హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున నిర్ణయం తీసుకోలేదని ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా అన్నారు. వీరికి అనర్హత వేటు పడిన వారితో సంబంధం లేదని వివరించారు. జూలైలో కర్ణాటకలో జరిగిన వివిధ రాజకీయ పరిణామాల మధ్య కాంగ్రెస్, జేడీఎస్‌కు చెందిన 17 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి గైర్హాజరు కావడంతో హెచ్డీ కుమారస్వామి సంకీర్ణ ప్రభుత్వం కూలిపోగా, బీజేపీ పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. -
కాంగ్రెస్‌తో కటీఫ్.. ఒంటరిగానే బరిలోకి
సాక్షి, బెంగళూరు: అసెంబ్లీ ఉప ఎన్నికలకు నగారా మోగడంతో కర్ణాటకలో ఎన్నికల వేడి మొదలైంది. పొత్తులపై అధికార, విపక్షాలు పార్టీలు దూకుడుపెంచాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌తో పొత్తుపై జేడీఎస్ కీలక ప్రకటన చేసింది. కర్ణాటక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఏ ఒక్కరితోనూ పొత్తు పెట్టుకునేది లేదని పార్టీ తెగేసి చెప్పింది. తాము ఒంటరిగానే బరిలోకి దిగుతామని జేడీఎస్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. జేడీఎస్ అభ్యర్థులు 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పోటీ చేస్తారని, కుమారస్వామి ప్రభుత్వాన్ని కుప్పకూల్చిన వారికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ట్వీట్లో జేడీఎస్ పేర్కొంది. దీంతో ఉప ఎన్నికల పోరు మూడు పార్టీల మధ్య రసవత్తరంగా జరగనుంది. కాగా జేడీఎస్ ప్రకటనపై కాంగ్రెస్ ఇప్పటి వరకు స్పందించలేదు. కర్ణాటకలోని 15 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 21న ఉప ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే . అక్టోబర్ 21న ఎన్నికలు జరుగనుండగా, 24న ఫలితాలు వెల్లడవుతాయి. కాగా, కర్ణాటకలో మధ్యంతర ఎన్నికలు జరుగుతాయని జేడీఎస్ అధినేత దేవెగౌడ గతంలో జోస్యం చెప్పిన విషయం తెలిసిందే. ఈసారి ఎన్నికల్లో తాము ఒంటిరిగానే పోటీ చేస్తామని, ఎవరితోనూ పొత్తు ప్రసక్తే ఉండదని కూడా తేల్చిచెప్పారు. జనవరి, ఫిబ్రవరిలో మధ్యంతర ఎన్నికలు ఉండొచ్చని, ఈసారి మాత్రం చేతులు కాల్చుకునేది లేదని, పొత్తు మాటే తలెత్తదని ఆయన చెప్పారు. చదవండి: మోగిన ఎన్నికల నగారా -
ముగిసిన ప్రచార పర్వం
న్యూఢిల్లీ: లోక్‌సభ తుది విడత ఎన్నికల ప్రచారానికి గడువు శుక్రవారం సాయంత్రంతో ముగిసింది. పశ్చిమ బెంగాల్లో నిన్న సాయంత్రమే ముగిసింది. ఈ నెల 19న తుది దశ ఎన్నికల పోలింగ్ జరగనుంది. 8 రాష్ట్రాల్లోని 59 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఉత్తరప్రదేశ్ 13, పంజాబ్ 13, బెంగాల్ 9, బిహార్ 8, మధ్యప్రదేశ్ 8, హిమచల్‌ప్రదేశ్ 4, జార్ఖండ్ 3, చండీగఢ్‌లో ఒక స్థానానికి పోలింగ్ జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ, రవిశంకర్ ప్రసాద్, శత్రుఘ్న సిన్హా, కిరణ్‌ఖేర్ తదితర ప్రముఖులు పోటీ చేస్తున్న స్థానాలు ఇందులో ఉన్నాయి. ఉప ఎన్నికలకు ముగిసిన ప్రచారం తమిళనాడులో నాలుగు అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఉప ఎన్నికల ప్రచారం కూడా ముగిసింది. 19న నాలుగు స్థానాలలో పోలింగ్ జరగనుంది. 1300 మంది సీఆర్పీఎఫ్, 15,939 పోలీసులతో భద్రతకట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అరవంకుర్చిలో అత్యధికంగా 64 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్‌ను సీసీ కెమెరాలతో పర్యవేక్షించనున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సత్యబ్రతా సాహూ తెలిపారు. -
ఉప ఎన్నికల్లో సీఎం భార్య, కుమారుడు..!
సాక్షి, బెంగళూరు : కర్ణాటకలో ఖాళీ అయిన మూడు పార్లమెంట్ స్థానాలతో పాటు, రెండు అసెంబ్లీ స్థానాలకు కూడా ఉప ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన కన్నడ అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నపట్నం, రామ్‌నగర స్థానాల్లో నుంచి కుమార స్వామి పోటీ చేసి విజయం సాధించారు. రెండు స్థానాల్లో ఆయన విజయం సాధించడంతో రామ్‌నగర స్థానానికి రాజీనామా చేయక తప్పలేదు. రాష్ట్రంలో ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ మద్దతుతో కుమార స్వామి ముఖ్యమంత్రి అయ్యారు. కాగా ఉప ఎన్నికలు జరగాల్సిన బళ్ళారి, శివమెగ్గ, మండ్యా లోక్‌సభ స్థానాలతో పాటు, రామ్‌నగర, జంఖాడీ అసెంబ్లీ స్థానాల కోసం రాజకీయ పార్టీలు అభ్యర్థుల వేటలో పడ్డాయి. కుమార స్వామి భార్య పోటీ.. కుమారస్వామి రాజీనామా చేసిన రామ్‌నగర స్థానం నుంచి ఆయన సతీమణి అనిత కుమారస్వామి పోటీ చేస్తారనే ఊహాగానాలు కన్నడనాట కోడైకూస్తున్నాయి. ఖాళీ అయిన స్థానాలకు ఎన్నికల ప్రకటన విడుదలైన మరునాడే ఆమె రామ్‌నగర నియోజకవర్గంలో పర్యటించడంతో ఈ వార్తలకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అనితనే ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని కొంతమంది ఆమె మద్దతుదారులు ఇదివరికే ప్రకటించారు. ఈ వార్తలను జేడీఎస్ ఖండిచకపోగా.. మరో రెండో రోజుల్లో అభ్యర్థిని ప్రకటిస్తామని తెలిపింది. ఇదిలా వుండగా జేడీఎస్ నేత సీఎస్ పుట్టరాజు ప్రాతినిథ్యం వహించిన మండ్యా లోక్‌సభ స్థానం నుంచి కుమారస్వామి కుమారుడు నిఖిల్ పోటీ చేస్తారని సమాచారం. నిఖిల్ ఇప్పటికే పలు చిత్రాల్లో హీరోగా నటించి గుర్తింపు పొందారు. ఆయన జాగ్వార్ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. లోక్‌సభ సీటుకు కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇస్తుండడంతో ఆ స్థానంలో జేడీఎస్ విజయం నల్లేరుమీద నడకే. ఇక బీజేపీ సీనియర్ నేత రాములు ప్రాతినిథ్యం వహించిన బళ్లారి లోక్‌సభ స్థానం నుంచి ఆయన సోదరి శాంతను బరిలో నిలపే అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రీరాములు ఇటీవల ఎంపీకి రాజీనామా చేసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి విజయం సాధించడంతో ఆ స్థానం ఖాళీ అయ్యింది. ఇప్పుడు ఎన్నికలేంటీ.. మూడు లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరపాలన్న ఎన్నికల సంఘం నిర్ణయంపై ప్రధాన పార్టీలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికలకు సమయం ఇంకా కేవలం నాలుగు నెలలే ఉన్నందుకు వాటికి ఉప ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏంటని నేతలు ప్రశ్నిస్తున్నారు. కాగా లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు నవంబర్ మూడున ఎన్నికల నిర్వహించి నవంబర్ 6 ఫలితాలను విడుదల చేస్తామని ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ చేసిన విషయం తెలిసిందే. -
పరాజయం తెచ్చిన ప్యాకేజీలు!
ఉత్తరప్రదేశ్‌లో చెరకు విస్తారంగా పండించే ప్రాంతంలోని కైరానా ఉప ఎన్నికలో బీజేపీ ఓడిపోయిన వారం రోజులకే కొత్త ప్యాకేజీ ప్రకటించారు. వ్యవసాయ అర్థశాస్త్రానికి బదులు రాజకీయాలే చెరకు లేదా చక్కెర విధానాలను శాసిస్తున్నాయి. 2014లో బీజేపీకి ఓటేసిన చెరకు రైతులే ఆగ్రహంతో ఉప ఎన్నికలో ఓడించారు. ఓటమి చవిచూసిన వెంటనే బీజేపీ హడావుడిగా మిత్రపక్షాలను దువ్వి బుజ్జగించే ప్రయత్నాలు ప్రారంభించింది. చక్కెర పరిశ్రమ కోసం రూ.7,000 కోట్ల ప్యాకేజీని మోదీ ప్రభుత్వం కిందటివారం ప్రకటించడం కూడా ఎన్నికల ప్యాకేజీల్లో భాగమే. ఉప ఎన్నికల్లో వరుస పరాజయాలు నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని భయాందోళనలోకి నెట్టాయి. వర్తమాన ఘటనలకు స్పందనగా బీజేపీ సర్కారు తన కార్యాచరణను రూపొందించడం విశేషం. చక్కెర పరిశ్రమ కోసం రూ.7,000 కోట్ల ప్యాకేజీని మోదీ ప్రభుత్వం కింద టివారం ప్రకటించింది. ఈ సాయం సమస్యను పరి ష్కరిస్తుందా, కనీసం వాయిదా వేస్తుందా? అంటే జవాబు లేదనే చెప్పాలి. పంచదారతో సమస్య ఏమంటే, ఇండియాలో మాదిరిగానే ప్రపంచంలోనూ దీని ఉత్పత్తి చాలా ఎక్కువ. ప్రభుత్వం ఆదేశించనట్టు చెరకు రైతులకు చక్కెర మిల్లులు కనీస మద్దతు ధర చెల్లిస్తే వాటికి ఖర్చులు కూడా గిట్టవు. రైతులకు ‘మరింత గిట్టుబాటు’ ధరలు దక్కాలని సర్కారు కోరుకుంటే ముందు చక్కెర దిగుమతులు నిషేధిం చాలి. ప్రభుత్వం ఆ పని చేసింది కూడా. అయినా, మిల్లులకు చక్కెర ధరలు ‘గిట్టుబాటు’ కాకుంటే ప్రభుత్వం చక్కెరకు గరిష్ట చిల్లర ధర(ఎమార్పీ) నిర్ణయించాల్సి ఉంటుంది. ఇది గత కాలపు లైసెన్స్– కోటా పద్ధతి అవశేషంగా కనిపిస్తుంది. 2019 లో ఓటేసే 80 శాతం ప్రజలకు ఇంతకు ముందు చెప్పిన 1960 నాటి ధర నిర్ణయ విధానంగాని, పనికిమాలిన రాజకీయాలుగాని అర్ధం కావు. దేశంలో చెరకు పండించే రైతుల సంఖ్య రోజు రోజుకు పెరుగు తోంది. అవసరానికి మించి చక్కెర ఉత్పత్తి అవు తోంది. ప్రపంచ మార్కెట్లో ప్రస్తుత ధరలను బట్టి చూస్తే దేశం నుంచి పంచదార ఎగుమతి చేయలేం. అయితే, చెరకు పంట వేయకుండా రైతులకు ప్రోత్సా హకాలు ఇస్తే మంచిది. ముఖ్యంగా నీటి కొరత ఉన్న మహారాష్ట్రలో రైతులకు చెరకు సాగు చెడు అలవా టుగా మారి, పర్యావరణ సంక్షోభానికి దారితీస్తున్న నేపథ్యంలో అక్కడ రైతులకు చెరకు వేయవద్దని నచ్చజెప్పాలి. రైతులు చెరకుకు బదులు పళ్ల తోటలు పెంచితే ఎంతో బాగుపడతారు. ఇలాంటి సాగు మార్పు కోసం రూ.20,000 కోట్లు ఖర్చు చేస్తే మెరు గైన ఫలితాలు వస్తాయి. కాని, చెరకు సాగు తగ్గించి, పళ్ల తోటల పెంపకం ప్రారంభిస్తే ఎన్నికలు జరిగే 2019 మే నాటికి రైతులకు లాభాలు కనిపించవు. అందుకే చెరకు పంట విషయంలో విధానాలేవీ తక్ష ణమే మారవు. మితిమీరిన చెరకు దిగుబడి కొన సాగక తప్పదు. కైరానా ఉప ఎన్నిక తెచ్చిన మార్పు ఉత్తరప్రదేశ్‌లో చెరకు విస్తారంగా పండించే ప్రాంతం లోని కైరానా ఉప ఎన్నికలో బీజేపీ ఓడిపోయిన వారం రోజులకే కొత్త ప్యాకేజీ ప్రకటించారు. వ్యవ సాయ అర్థశాస్త్రానికి బదులు రాజకీయాలే చెరకు లేదా చక్కెర విధానాలను శాసిస్తున్నాయి. 2014లో బీజేపీకి ఓటేసిన చెరకు రైతులే ఆగ్రహంతో ఉప ఎన్నికలో ఓడించారు. తాము ఘర్షణ పడిన ముస్లిం లతో కలసి రైతులు తమను ఓడించారనే విషయం బీజేపీకి అర్థమైంది. రైతులకు వచ్చిన కోపం ముస్లిం లతో ఉన్న కలహాన్ని మర్చిపోయేలా చేసింది. అయితే, ఓటర్లను రెండు మత వర్గాలుగా చీల్చి ఉప ఎన్నికలో లబ్ధిపొందడానికి యూపీ సీఎం యోగీ ఆది త్యనాథ్ చేసిన చౌకబారు ఎత్తుగడ ఫలించలేదు. ఎప్పుడో మరణించిన పాకిస్తాన్ స్థాపకుడు జిన్నా పేరు ఉచ్చరిస్తూ హిందుల ఓట్లను రాబట్టడానికి చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. బీజేపీ నేతలు జిన్నా పేరు చెప్పి రైతులను లొంగదీయాలని చూస్తే, ప్రతిపక్షం గన్నా(హిందీలో చెరకు) పేరుతో రైతులను ఆకట్టుకుంది. చివరికి ఓటమి చవిచూసిన వెంటనే బీజేపీ హడావుడిగా మిత్రపక్షాలను దువ్వి బుజ్జగించే ప్రయత్నాలు ప్రారంభించింది. కైరానాలో ఓడిపో యిన మరుసటి రోజే పంజాబ్‌లో మిత్రపక్షమైన శిరో మణి అకాలీదళ్ ఎప్పటి నుంచి చేస్తున్న డిమాండ్‌ను ఆమోదించింది. అదేమంటే– సిక్కు గురుద్వారాల్లో సమూహిక భోజనాలకు (లంగర్లు) వాడే ఆహార పదార్థాలపై జీఎస్టీని కేంద్రసర్కారు రద్దు చేసింది. అలాగే, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, బీజేపీ జాతీ యాధ్యక్షుడు అమిత్‌షా మధ్య శత్రుత్వమే ఉందనే విషయం తెలిసిందే. మహారాష్ట్రలో సంకీర్ణ భాగస్వా మిని బుజ్జగించడానికి అదే వారం అమిత్‌షా, తను ఎంపికచేసిన సీఎంను వెంటపెట్టుకుని ఉద్ధవ్ ఇంటికి వెళ్లారు. తండ్రి బాల్ ఠాక్రే తెలివితేటలు పుణికి పుచ్చుకున్న ఉద్ధవ్ బీజేపీ నేతలకు కొత్త గుణపాఠం చెప్పారు. రాష్ట్రప్రభుత్వాన్ని నడిపే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను ఉద్ధవ్ బయటే వేచి ఉండేలా చేశారు. సీఎం ఇంతటి అవమానం ఎందుకు భరిం చాలి? మెజారిటీతో మరుగున పడిన సంకీర్ణధర్మం నాలుగేళ్ల క్రితం బీజేపీకి మిత్రపక్షాలపై ఆధారపడా ల్సిన అవసరం లేకుండా పూర్తి మెజారిటీ దక్కింది. సంకీర్ణ ధర్మం పాటిస్తానని బీజేపీ చెప్పినాగాని అధికారం, జనాదరణ ఈ తరంలో ఎవరికీ లేనం తగా ప్రధానికి ఉండడంతో ఆయన ముందు మిత్ర పక్షాలన్నీ సాగిలపడ్డాయి. పరిస్థితి గమనించిన ‘వాతావరణ నిపుణుడు’ బిహార్ సీఎం నితీశ్‌కుమార్ లౌకిక కూటమిని వదలి అవినీతి వ్యతిరేక పంథాతో బీజేపీ శిబిరంలో చేరారు. ఇప్పుడేమో ఆయన బిహా ర్లో ఎన్డీఏ అంటే స్థానిక ఎన్డీఏ అనే రీతిలో మాట్లా డుతున్నారు. మగ్గురు ఎంపీలున్న చిన్న బీహార్ పార్టీ ఆరెలెస్వీ నేత, కేంద్ర మంత్రి అయిన ఉపేంద్ర కుశ్వాహా పట్నాలో జరిగిన ఎన్డీఏ విందుకు హాజరు కాకుండా బీజేపీ నేతలకు పరోక్షంగా హెచ్చరించారు. ‘మీకు మెజారిటీ ఉన్నా మీరు బలహీనపడ్డారు. కాబట్టి మేం గట్టిగానే బేరమాడతామనే విషయం గుర్తించండి,’ అనేది ఈ మిత్రపక్షాల సందేశంగా కని పిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో కొద్ది నెలల క్రితం బీజేపీకి కంచుకోటలని భావించిన గోరఖ్‌పూర్, ఫూల్పూర్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో పాలకపక్షం ఓడిపోయిన ప్పుడే మోదీ సర్కారు వేగానికి మొదటి దెబ్బతగి లింది. బీజేపీని ఎన్నికల్లో ఓడించడం సాధ్యమయ్యే పనేననే సూచనలు అందరికీ కనిపించాయి. అప్పటి నుంచి బీజేపీ కంగారుతో అనేక తప్పులు చేసింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో అవినీతిపై యుద్ధం ప్రక టించిన ఈ పార్టీ కర్ణాటకలో బళ్లారి సోదరులతో చేతులు కలిపింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామనే భయమే బీజేపీతో ఈ పని చేయించింది. వాస్తవానికి కర్ణాటకలో శాసనసభ ఎన్నికల నాటికి నరేంద్రమో దీకి ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. బీజేపీకి సాధా రణ మెజారిటీ సాధించిపెట్టే స్థాయిలో మోదీకి జనా కర ్షణ శక్తి ఉంది. అయితే, బళ్లారి సోదరుల రంగ ప్రవేశంతో ఓటర్లలో అనుమానాలు రేకెత్తాయి. ఫలి తంగా, వారు తమ పలుకుబడితో 15 సీట్లు బీజేపీ ఖాతాలో పడేలా చేస్తారని అంచనావేయగా, చివరికి కమలం పార్టీకి మూడు సీట్లే లభించాయి. దీంతో 2019 ఎన్నికల్లో బీజేపీ అవినీతికి వ్యతిరేకంగా ప్రచారం చేసే అవకాశం కోల్పోయింది. కేంద్ర వ్యవ సాయ మంత్రిగా నియమించిన బీజేపీ నేతకు ఆ పదవి ఆయన తెలివితేటల వల్ల రాలేదు. ఫలితంగా, నాలుగేళ్లలో దేశ వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు యూపీఏ పదేళ్ల అభివృద్ధితో పోల్చితే దాదాపు సగా నికి పడిపోయింది. యూపీఏ హయాంలో 3.7 వార్షిక సగటు వృద్ధిరేటు ఉన్నాగాని అప్పుడు కూడా వ్యవ సాయంలో సంక్షోభం కొనసాగింది. వ్యవసాయశాఖ కొత్త తరహా సేంద్రియ ఎరువును రైతులకు అంద జేస్తోంది. మనమంతా ‘మాత’గా పిలిచే దేశవాళీ ఆవు పేడలో మాత్రమే లభించే మంచి బాక్టీ రియా(సూక్ష్మజీవులు)తో ఈ ఎరువు రూపొందించి కేంద్ర వ్యవసాయశాఖ నామమాత్రపు ధరకు రైతు లకు సరఫరా చేస్తోంది. ఈ రకమైన వినూత్న ఎరు వులు ఉపయోగించి 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయడం సాధ్యమా? అంటే, అనుమానమే. చెరకు లేదా చక్కెర సమస్య హఠాత్తుగా ఊడిపడినది కాదు. గత నాలుగేళ్లుగా నానుతూ ఇప్పటికి ముదిరి పోయింది. ఇంతకు ముందే ఈ సమస్యను గుర్తించి, పరిష్కరించే తీరిక పాలకులకు లేకపోయింది. రెండోది.. పెద్దగా విలువ లేని కొత్త ముఖ్యమంత్రుల నిర్లక్ష్యపూరితమైన ఎంపిక. వీరిలో ప్రతిఒక్కరూ ఇప్పుడు తమను తాము నిరూపించుకోవల్సి ఉంది. తమ తమ రాష్ట్రాలలో అన్ని స్థానాల్లోనూ ప్రజామోదాన్ని గెల్చుకున్న ఈ ముగ్గురు ముఖ్యమంత్రులు ఒకప్పుడు పూర్తి నిర్లక్ష్యానికి గురైనవారే. ఇక మూడో అంశం ఏదంటే, పరమ అహంభావపూరిత వైఖరితో మిత్రపక్షాలతో వ్యవహరించినందుకు అది చెల్లిస్తున్న మూల్యం. ఈ తరం రాజకీయనేతలు పూర్తి మెజారిటీతో పాలన సాగించే అనుభవాన్ని కోల్పోయారని మనకు బాగా తెలుసు. ప్రజలు రాజకీయాల్లో ఎందుకు చేరుతున్నారనే కారణానికి సంబంధించిన వాస్తవాన్ని బీజీపే ఇప్పుడైనా నమ్రతతో అంగీకరించాలి. అధికార కుమ్ములాటలో తమకూ వాటా కావాలని అందరూ కోరుకుంటున్నారు. మిత్రపక్షాలకు ఎలాంటి మంత్రిపదవులనూ బీజేపీ ఇవ్వలేదు. అకాలీలు బీజేపీకి చాలా విశ్వసనీయమైన మిత్రపక్షం. ఆ పార్టీలోని పాలకకుటుంబానికి చెందిన ఒక కోడలికి మాత్రమే మంత్రివర్గంలో కేబినెట్ ర్యాంక్ కల్పించారు. అది కూడా ఫుడ్ ప్రాసెసింగ్ శాఖను కట్టబెట్టారు. ఆమె స్వరాష్ట్రంలో ఆమెను చట్నీ, జామ్ మురబ్బాలు వడ్డించే మంత్రిగా పేరుపడింది. శివసైనికుడైన అనంత్ గీతే పోర్ట్ ఫోలియో మీకు తెలుసా? ఏ మిత్రపక్షానికీ తమ స్వంత విశ్వాసంతో పాలించగలిగే అవకాశం దక్కలేదు. బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతోంది కానీ ఆ పార్టీ మాత్రమే పాలనా పగ్గాలను గుప్పిట్లో పెట్టుకుంది. దాని చర్యలే దాని ఫలితాలను నేడు నిర్దేశిస్తున్నాయంటే ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. ఈ పరిస్థితులలో పరిణిత రాజకీయ పార్టీలాగా కాకుండా శైశవదశలో మరో అతిపెద్ద విజయాన్ని సాధించడానికి అది కృషి చేస్తున్నట్లు కనిపిస్తోంది. శేఖర్ గుప్తా వ్యాసకర్త దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
టీడీపీ పోటీ.. వైఎస్సార్ సీపీ అదృష్టం : వైఎస్ జగన్
మోర్తా, పశ్చిమ గోదావరి : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేసిన ఐదుగురు ఎంపీలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సెల్యూట్ చేశారు. బుధవారం పశ్చిమగోదావరి జిల్లా మోర్తాలో కొనసాగుతున్న 182వ రోజు ప్రజాసంకల్పయాత్రలో హోదా కోసం రాజీనామా చేసిన ఎంపీల గురించి ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. పదవులకు ఇంకా 14 నెలలు గడువున్నా రాష్ట్రం కోసం చిత్తశుద్ధితో రాజీనామాలు చేసిన వారికి తాను సెల్యూట్ చేస్తున్నానని చెప్పారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ సీపీకి చెందిన ఐదుగురు ఎంపీలు ఎలాంటి భయం లేకుండా రాజీనామాలు సమర్పించారని, అదే రాష్ట్రానికి చెందిన 25 మంది ఎంపీలు రాజీనామాలు చేసివుంటే కేంద్రంపై ఆ ప్రభావం తీవ్రంగా ఉండేదని పేర్కొన్నారు. ఎంపీలతో రాజీనామాలు చేయించేందుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు భయపడ్డారని ఆరోపించారు. ఉప ఎన్నికలు వస్తే ధైర్యంగా ఎదుర్కొంటామని వెల్లడించారు. ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేసిన వారు ఉప ఎన్నికల్లో పోటీ చేస్తే బుద్ధి ఉన్నా పార్టీ ఏదీ ప్రత్యర్థులుగా బరిలోకి నిలపదని అన్నారు. అలా అభ్యర్థులను పెడితే ప్రత్యేక హోదాకు వారు అనుకూలమా? లేక వ్యతిరేకమా? అనే ప్రశ్న వస్తుందని చెప్పారు. అయినా, సిగ్గుమాలిన తెలుగుదేశం పార్టీ పోటీకి దిగితే అది వైఎస్సార్ సీపీ అదృష్టంగా భావిస్తుందని చెప్పారు. ఉప ఎన్నికల్లో పోటీ చేస్తే టీడీపీకి కనీసం డిపాజిట్లు కూడా దక్కవని అన్నారు. ఉప ఎన్నికలు కచ్చితంగా వస్తాయా? ఉప ఎన్నికలు కచ్చితంగా వస్తాయా? అని ప్రశ్నించిన ఓ జర్నలిస్టును ఉద్దేశించి సార్వత్రిక ఎన్నికలకు ఇంకా 14 నెలల సమయం ఉందని వైఎస్ జగన్ చెప్పారు. ఉప ఎన్నికలు కచ్చితంగా వస్తాయని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా విషయంలో తప్పు చేశానని సీఎం చంద్రబాబుకు తెలుసని, అందుకే ఆయన మంచి చేస్తున్నవారిపై బురదజల్లేందుకు యత్నిస్తున్నారని అన్నారు. ప్రతి పార్లమెంటు సమావేశాల సమయంలో పార్టీ ఫిరాయించిన ఎంపీలపై వేటు వేయాలని స్పీకర్‌ను కోరుతూనే ఉన్నామని ఈ సందర్భంగా వైఎస్ జగన్ గుర్తు చేశారు. అయినా వారిపై వేటు పడకుండా చంద్రబాబు మేనేజ్ చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ గుర్తుపై గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరారని, వారితో రాజీనామాలు చేయించేందుకు చంద్రబాబు భయపడుతున్నారని చెప్పారు. వారిని తిరిగి గెలిపించుకునే సత్తా లేకనే చంద్రబాబు ఇలా చేస్తున్నారని అన్నారు. ఇని చేస్తున్న చంద్రబాబు చివరకు రాజ్యాంగం అపహస్యం అవుతుందని మాట్లాడతాడంటూ మండిపడ్డారు. -
లోక్‌సభలో బీజేపీ మైనార్టీలో పడబోతుందా?
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభలో బీజేపీ మైనార్టీలో పడబోతుందా? ప్రస్తుత పరిస్థితి చూస్తే అలానే ఉంది. 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 282 సీట్లతో భారీ మెజార్టీలో ఉన్న బీజేపీ ప్రస్తుతం 273 స్థానాలతో మైనార్టీకి ఒక్క స్థానం దూరంలో ఉంది. ఇటీవల దేశ వ్యాప్తంగా జరిగిన లోక్‌సభ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధులు వరుసగా ఓటమి చవిచూస్తున్నారు. 13 లోకసభ స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా ఎనిమిది స్థానాల్లో బీజేపీ పరాజయం పాలైంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఎస్ యడ్యూరప్ప, బీ శ్రీరాములు ఎంపీ పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్యేగా ఎన్నికవ్వడంతో లోక్‌సభలో బీజేపీ ఎంపీల సంఖ్య 273కి చేరింది. మరో 12 మంది కూటమి సభ్యుల మద్దతు బీజేపీకి ఉంది. బీజేపీకి ఎంతో పట్టున్న గోరఖ్‌పూర్ స్థానంలో బీజేపీ అభ్యర్ధి ఓడిపోవడంతో 2019లో జరిగే ఎన్నికల్లో ఆ పార్టీ గెలుపుపై అనుమానాలు రెకేత్తిస్తున్నాయి. యూపీలో గత ఎన్నికల్లో 71 సీట్లు గెలుచుకున్న కాషాయ దళం గోరఖ్‌పూర్‌తో సహా, పూల్పుర్, కైరానా స్థానాల్లో ఘోర పరాభావం పాలైంది. మధ్యప్రదేశ్, పంజాబ్‌లో సిట్టింగ్ స్థానాలను కోల్పోయింది. ఆ స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. రాజస్తాన్‌లో సిట్టింగ్ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు కాంగ్రెస్ చేతిలో ఓటమి చవిచూశారు. కర్ణాటక అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించినా విపక్షాల మద్దతు కూడగట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో బీజేపీ ఘోరంగా విఫలమైంది. ఇన్ని పరాజయాల మధ్య 2019 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించడం అంత సులువు కాదని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. -
బీజేపీ, కాంగ్రెస్ మధ్య మరో కీలక పోరు
-
బీజేపీకి మరో షాక్ ఇవ్వనున్న అఖిలేశ్..!
లక్నో : గోరఖ్‌పూర్, ఫూల్పూర్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో బీజేపీకి షాక్ ఇచ్చిన మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ రానున్న కాలంలో అదే జోరును కొనసాగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో బీఎస్పీ మద్దతుతో ఎస్పీ అభ్యర్థులు విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో సీఎం, డిప్యూటీ సీఎంలు యోగి, మౌర్య ఈ స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఉప ఎన్నికల్లో మాత్రం అధికార పార్టీ సిట్టింగ్ స్థానాల్లో ఎస్పీ అభ్యర్థులు గెలుపొందడం ఆ పార్టీలో నూతన ఉత్సహాన్ని నింపింది. అదే స్ఫూర్తిగా కైరానా లోక్‌సభ, నూర్పూర్ అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఉప ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సాధారణ ఎన్నికల్లో ఈ స్థానాల్లో గెలుపొందిన బీజేపీ నాయకలు మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. గత ఉప ఎన్నికల్లో ప్రతిపక్షాలను ఏకం చేసి విజయం సాధించిన అఖిలేశ్ అదే వ్యుహాన్ని మళ్లీ రచిస్తున్నారు. అందులో భాగంగా రాష్ట్రీయ్ లోక్ దళ్‌తో జట్టు కట్టారు. కైరానా లోక్‌సభ స్థానానికి ఎస్పీ నేతను ఆర్ఎల్డీ పార్టీ తరఫున పోటీ చేయించనున్నారు. అదేవిధంగా నూర్పూర్ అసెంబ్లీ స్థానానికి ఆర్ఎల్డీ అభ్యర్థిని ఎస్పీ తరఫున నిలుపనున్నారు. దీనిద్వారా ఇరు పార్టీల కార్యకర్తలు విజయం కోసం శ్రద్ధగా పనిచేస్తారని అఖిలేశ్‌తోపాటు, ఆర్ఎల్డీ ఉపాధ్యక్షుడు జయంత్ చౌదరి భావిస్తున్నారు. ముస్లిం, దళితుల ఓట్లు కీలకంగా ఉన్న కైరానా లోక్‌సభ స్థానంలో 2009లో ఎస్పీ తరఫున విజయం సాధించిన తబుసమ్ హసన్‌ను ఎస్పీ-ఆర్ఎల్డీ కూటమి తమ అభ్యర్థిగా ప్రకటించింది. అయితే మాయావతి మాత్రం ఇక్కడ ఎస్పీ అభ్యర్థికి మద్దతు తెలిపేది లేదని చెప్పడం, కాంగ్రెస్ కూడా ఆర్ఎల్డీ అభ్యర్థికైతేనే మద్దతు తెలుపుతామని చెప్పడంతో అఖిలేశ్ తమ పార్టీ అభ్యర్థిని ఆర్ఎల్డీ తరఫున బరిలోకి దింపనున్నట్టు తెలుస్తోంది. బీజేపీ తరఫున చనిపోయిన హుకుమ్ సింగ్ కుమార్తె మ్రింగాక సింగ్‌ను ఆ స్థానంలో బరిలోకి దించారు. మే 28న జరగనున్న ఈ ఉప ఎన్నికల్లో విజయం ద్వారా బీజేపీకి గట్టి షాక్ ఇవ్వడంతోపాటు, కార్యకర్తల్లో నూతన ఉత్తేజం తీసుకురావచ్చని అఖిలేశ్ భావిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ మద్దతు పొందిన ఎస్పీ-ఆర్ఎల్డీ కూటమికి ఒకవేళ మాయావతి మద్దతు తెలిపితే విజయం సులువవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
బీజేపీని హెచ్చరించిన శివసేన!
ముంబై: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ స్థానాలు వందకు పైగా తగ్గిపోతాయని శివసేన నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల యూపీ, బిహార్ ఉప ఎన్నికల ఫలితాలతో పోల్చి వచ్చే లోక్‌సభ ఎన్నికల పరిణామాలపై శివసేన పత్రిక సామ్నా ఓ కథనాన్ని ప్రచురించింది. బీజేపీ నేతలకు ఈ కథనంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 100 నుంచి 110 స్థానాలు కోల్పోనుందన్నది శివసేన అభిప్రాయం. త్రిపురలో కమ్యూనిస్ట్ కంచుకోటను బద్దలుకొట్టిన తర్వాత బీజేపీ ప్రాబల్యం దేశంలో మరింత పెరిగిపోయిందని ఆ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. కానీ యూపీలో సీఎం, డిప్యూటీ సీఎంల రాజీనామాలతో ఖాళీ అయిన గోరఖ్‌పూర్, ఫూల్పుర్ లోక్‌సభ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఓటమి బీజేపీకి షాకివ్వడం శివసేనకు హాట్ టాపిక్‌గా. 2014లో కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక 23 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కేవలం 4 సీట్లు మాత్రమే బీజేపీ నెగ్గి, 19 స్థానాల్లో ఓటమి చవిచూసింది. త్రిపురలో విజయం అనంతరం దేశ వ్యాప్తంగా బీజేపీ హవా నడుస్తుందని, ప్రజలు ఎన్డీఏ పాలనకు పట్టం కట్టారని చెప్పి ఆ పార్టీ నేతలు.. కీలకమైన యూపీ రెండు లోక్‌సభ స్థానాల్లో ఓటమి తర్వాత ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. కానీ బీజేపీ మాత్రం ఓట్ల శాతం తగ్గడం, ఎస్పీ-బీఎస్పీలు కలిసి బరిలోకి దిగడం కొంప ముంచిందంటూ వేరే సాకులు చెబుతున్నారని సంపాదకీయం ద్వారా శివసేన తమ అభిప్రాయాన్ని, 2019 లోక్‌సభ ఎన్నికలపై జోస్యం చెప్పింది. అత్యధిక లోక్‌సభ స్థానాలుండే యూపీ, బిహార్ లాంటి రాష్ట్రాల్లో ఓటు బ్యాంకు తగ్గితే బీజేపీ సీట్లు కూడా తగ్గుతాయని హెచ్చరించింది. బిహార్‌లో ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ జైలుకు వెళ్లిన నేపథ్యాన్ని ఉపయోగించుకుని నితీశ్, బీజేపీలు ఓటర్లను ఆకర్షించుకోలేక పోడం ఎన్డీఏ పాలనకు ఆ రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పుగా భావించవచ్చునని శివసేన నేతలు చెబుతున్నారు. -
‘బీజేపీ ఓటమి రుచిని చూడబోతోంది’
లక్నో : బీజేపీకి ఓటమి రుచి ఎలా ఉంటుందో చూపిస్తామని సమాజ్ వాదీ పార్టీ చెబుతోంది. ఉత్తర ప్రదేశ్ లో త్వరలో రెండు లోక్ సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీని మట్టి కరిపిస్తామని ఎస్పీ ప్రకటించింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్, డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యలు రాజీనామాలతో గోరఖ్‌పూర్, ఫూల్పూర్ లోక్‌సభ స్థానాలకు ఖాళీలు ఏర్పడ్డాయి. దీంతో ఎన్నికలు అనివార్యం అయ్యాయి. బీజేపీని చిత్తు చేసే ఉద్దేశంతో ఎన్నడూ లేని విధంగా ఈ ఉప ఎన్నికల కోసం ఎస్పీ-బీఎస్పీలు చేతులు కలపటం విశేషం. ఎస్పీ అధికార ప్రతినిధి గోవింద్ చౌదరి నేడు మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమన్నారు. కమలం పార్టీ పతనం ఇక్కడి నుంచే ప్రారంభం కాబోతుందని ఆయన జోస్యం పలికారు. ఇక 2019 ఎన్నికల్లో బీఎస్పీతో పొత్తు ఉంటుందా? అన్న ప్రశ్నకు.. ఆ నిర్ణయం పార్టీ చీఫ్‌లు అఖిలేశ్, మాయావతి చేతుల్లోనే ఉంటుందని బదులిచ్చారు. మరోవైపు గోరఖ్‌పూర్ యోగి కంచుకోట కావటంతో ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలన్న లక్ష్యంతో బీజేపీ కనిపిస్తోంది. -
రాజస్థాన్‌లో ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభం
జైపూర్: రాజస్థాన్ రాష్ట్రంలోని అల్వార్, అజ్మీర్ లోక్‌సభ స్థానాలకు, మందల్‌గర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక పోలింగ్ సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మరో సంవత్సరం(2019)లో లోక్‌సభకు సాధారణ ఎన్నికలు జరగనున్న సందర్భంగా ఈ ఉప ఎన్నికలకు ప్రాధాన్యత ఏర్పడింది. బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్యనే ప్రధాన పోటీ నెలకొనగా సుమారు 40 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అజ్మీర్‌లో బీజేపీ నేత సన్వర్‌లాల్ జాట్ కుమారుడు రామ్‌స్వరూప్ లాంబా కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే రఘుశర్మపై పోటీలో ఉన్నారు. అలాగే అల్వార్‌లో రాజస్థాన్ మంత్రి జశ్వంత్ యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎంపీ కరణ్‌సింగ్ యాదవ్‌పై పోటీ చేస్తున్నారు. మందల్‌గర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి శాంతిసింగ్ హడా, కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ ధాకడ్‌ల మధ్య పోటీ ఉండనుంది. ప్రతి రెండు గంటలకోసారి పోలింగ్ తీరుపై వివరాలందించేందుకు ప్రిసైడింగ్ అధికారుల ఫోన్ నెంబర్లతో కూడిన కొత్త పోర్టల్‌ను ఏర్పాటు చేశారు. -
ఉప ఎన్నికల ఫలితాలపై స్పందించిన మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవల దేశవ్యాప్తంగా 5 స్థానాలకు గానూ జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ మూడింట విజయం సాధించింది. ఈ విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ లోని సికందరా ప్రజలు మరోసారి బీజేపీకి మద్ధతు తెలిపడం ఆనందదాయకమంటూ మోదీ వరుస ట్వీట్లు చేశారు. గ్రామాల అభివృద్ధికి కృషి చేసిన కారణంగానే ఇక్కడ తమ పార్టీ విజయం సాధించిందన్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, రాష్ట్ర బీజేపీ యూనిట్‌కు అభినందనలు తెలిపారు. అదే విధంగా అరుణాచల్ ప్రదేశ్‌లోని పక్కే కేసాంగ్, లికాబలి ప్రజలు బీజేపీపై నమ్మకాన్ని మరోసారి నిలబెట్టారు. ఈశాన్య రాష్టాల పురోగతికి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ కృషి చేస్తుందని మోదీ ట్వీట్ చేశారు. పశ్చిమ బెంగాల్ లోని సబాంగ్‌లో పార్టీ ఓటమి పాలైనా, గతంలో కంటే బీజేపీకి అధికంగా ఓటు శాతం నమోదుకావడం సంతోషంగా ఉందన్నారు. పశ్చిమ బెంగాల్ బీజేపీ నేతలు, కార్యకర్తలు తమ వంతు పాత్ర పోషించారని ప్రధాని మోదీ కొనియాడారు. ఉప ఎన్నికల్లో విజేతలు వీరే.. అరుణాచల్ ప్రదేశ్‌లో బీజేపీ తరఫున పక్కే కేసాంగ్ నుంచి బీఆర్ వాగే, లికాబలి నుంచి కర్డో నైగోర్ విజయం సాధించగా, యూపీలోని సికందరా నుంచి అజిత్ పాల్ సింగ్ విజయ కేతనం ఎగురవేశారు. తమిళనాడులోని ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో స్వతంత్ర్య అభ్యర్తి టీటీవీ దినకరన్ 40వే పైచిలుకు ఓట్ల మెజార్టీతో నెగ్గారు. పశ్చిమ బెంగాల్‌లోని సబాంగ్ నుంచి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి గీతా భునియా గెలుపొందారు. -
ఉప ఎన్నికలు: అధికారానిదే హవా!
ఉప ఎన్నికల్లో సాధారణంగా పాలకపక్షానికే మొగ్గు 2014 నుంచి జరిగిన ఉప ఎన్నికలు చెబుతున్నదిదే.. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉప ఎన్నికల్లో అధికారపక్షమే గెలుపొందడం రివాజుగా వస్తోంది.ఏవైనా ప్రత్యేక సందర్భాలు, డిమాండ్ల నేపథ్యంలో వచ్చిన ఉప ఎన్నికలు మినహా సాధారణంగా అధికార పార్టీలే నెగ్గుతున్నాయి. నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నిక సహా దేశవ్యాప్తంగా మూడు రాష్ట్రాల్లోని నాలుగు స్థానాలకు సోమవారం వెల్లడైన ఫలితాలు కూడా ఇదే తరహాలో ఉన్నాయి. అయితే ఇలా ఉప ఎన్నికల్లో గెలిచిన అధికారపక్షాలు ఆ తర్వాత వచ్చే సాధారణ ఎన్నికల్లో భిన్నమైన ఫలితాలనే చవి చూస్తుండటం గమనార్హం. 2014 సెప్టెంబర్‌లో ఉత్తరప్రదేశ్‌లో 11 అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నికలు జరగగా.. అధికార సమాజ్‌వాదీ పార్టీ ఏకంగా 9 సీట్లను గెలుపొందింది. ఈ అన్ని స్థానాలూ అప్పుడు ఆ రాష్ట్రంలో విపక్షంలో ఉన్న బీజేపీ, దాని మిత్రపక్షాలే కావడం గమనార్హం. కానీ 2017లో జరిగిన సాధారణ ఎన్నికలకు వచ్చే సరికి అఖిలేశ్ ఆధ్వర్యంలోని సమాజ్‌వాదీ పార్టీ దారుణంగా ఓటమి పాలైంది. ఇక ప్రత్యేక పరిస్థితులు, డిమాండ్లతో ఉప ఎన్నికలు వచ్చినప్పుడు విపక్షంలో ఉన్న పార్టీలు ఎక్కువ సంఖ్యలో సీట్లు గెలుచుకున్నా.. తర్వాతి సాధారణ ఎన్నికల్లో విజయం సాధించలేకపోయాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ వరుసగా విజయం సాధిస్తూ వచ్చినా.. సాధారణ ఎన్నికల్లో మాత్రం గెలుపొందలేకపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2012లో జరిగిన ఉప ఎన్నికలలో విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏకంగా 15 స్థానాల్లో గెలుపొందింది. కానీ తర్వాత జరిగిన సాధారణ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి పాలైంది. సానుకూలతలన్నీ అధికార పక్షానికే..! మొత్తంగా చూస్తే మాత్రం దేశవ్యాప్తంగా జరి గిన ఉప ఎన్నికలలో అధికారపక్షాలే ఎక్కువగా విజయం సాధించాయి. 2014 జనవరి నుంచి ఇప్పటిదాకా పరిశీలిస్తే.. దేశంలో 134 ఉప ఎన్నికలు జరగ్గా 95 చోట్ల అధికారపక్షమే గెలిచింది. అంటే 70 శాతానికిపైగా స్థానాల్లో అధికారపక్షాలే విజయం సాధించాయి. ఇందుకు చాలా కారణాలున్నాయి. ఉప ఎన్నికలంటే సాధారణ ఎన్ని కలకు సంబంధం లేకుండా, దాదాపుగా ప్రభుత్వం మార్పు జరిగే అవకాశ మేమీ లేకుండా జరుగుతాయి. అంతేగాకుండా అధికారపక్షాలు నయానో, భయానో తమ అభ్యర్థికి ఓట్లు పడే పరిస్థితిని కల్పిస్తుంటాయి. పోలీసులను, ఇతర ప్రభుత్వ విభాగాలను ఉపయోగించుకుని విపక్షాల నేతలు, కార్య కర్తలను తమ దారికి తెచ్చుకోవడం.. అధికార పక్షానికి ఓటేయకపోతే అభివృద్ధి పనులు నిలిపేస్తామన్న హెచ్చరికలు చేయడం జరుగు తుంటాయి. దీంతో ఎలాగూ రాష్ట్రంలో ప్రభు త్వం మారదు కాబట్టి.. అధికారపక్షానికి కోపం తెప్పించడం ఎందుకన్న ధోరణితో ఓటర్లు వ్యవహరించే అవకాశాలు ఎక్కువ. ఇక అధి కారపక్షాలకు ఉన్న మరో సానుకూలాంశం.. అప్పటికప్పుడు ప్రాజెక్టులు, పథకాలను ప్రక టించి జనాన్ని తమవైపునకు తిప్పుకోవడం. అవసరమైతే వెంటవెంటనే శంకుస్థాపనలు చేయడం కూడా అందులో భాగమే. సాధారణ ఎన్నికల్లో మారే పరిస్థితి అధికారపక్షానికి ఎన్ని సానుకూలత లున్నా.. ఎన్ని తాయిలాలూ చూపించినా.. సాధారణ ఎన్నికలకు వచ్చేసరికి పరిస్థితులు మారిపోతుంటాయి. ప్రజలు మాత్రం తాము కోరుకున్న పార్టీకే ఓటేయడానికి మొగ్గుచూపుతారు. ప్రభుత్వంపై సహజంగా వచ్చే వ్యతిరేకత, అధికారపక్ష ఒంటెత్తు పోకడలకు చెక్ పెట్టే అవకాశం, ప్రభుత్వం మారిపోయి తాము కోరుకున్న పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం, విపక్షాలు కూడా తమ శక్తులన్నీ ఒడ్డి పోరాడటం వంటివి ఇందుకు కారణమవుతాయి. అన్ని వనరులనూ ఉపయోగించుకుని.. సాధారణంగానే అధికారపక్షానికి ఆర్థిక, అంగబలాలు ఎక్కువగా ఉంటాయి. ఉప ఎన్నికలు జరిగే కొద్ది నియోజకవర్గాల్లోనే ఆ వనరులన్నింటినీ కేంద్రీకరించడం, నేరుగా ముఖ్యమంత్రి, మంత్రులు ప్రచారం చేస్తూ హామీలు గుప్పించడం కూడా ఓటర్లపై ప్రభావం చూపుతుంటుంది. దీనికితోడు డబ్బు, ఇతర ‘బహుమతు’లతో ఓటర్లను ప్రలోభపెట్టే అవకాశం అధికారపక్షాలకే ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య సహజంగానే అధికార పక్షాలు ఉప ఎన్నికల్లో గెలుపొందుతుంటాయి. 2008లో తెలంగాణ సెంటిమెంటును బలపర్చడానికి 16 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. దాంతో వచ్చిన ఉప ఎన్నికల్లో ఏడుగురే నెగ్గారు. జనంలో సెంటి మెంటు బలంగా ఉన్నా.. అప్పటి అధికార పార్టీ కాంగ్రెస్ 5 స్థానాల్లో నెగ్గింది. తమిళనాడులో 1980 నుంచి 2012 వరకు తీసుకుంటే మొత్తం 44 ఉప ఎన్నికలు జరిగితే... ఎనిమిదింటిలో మాత్రమే విపక్షాలు గెలిచాయి. మిగతా 36 స్థానాల్లో అధికార పక్షమే నెగ్గింది. సోమవారం 3 రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరగగా... గోవాలో పనాజీ, వాల్పోయి స్థానాల్లో అధికార బీజేపీ, ఢిల్లీలోని బవానా నియోజక వర్గంలో అధికార ఆప్, ఏపీలోని నంద్యాలలో అధికార టీడీపీ నెగ్గాయి. 2014 నుంచి జరిగిన ఉప ఎన్నికలు, ఫలితాలను పరిశీలిస్తే.. 2014 ఏకంగా 65 స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. ఆ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో చాలామంది ఎమ్మెల్యేలు ఎంపీలుగా గెలవడంతో పెద్ద సంఖ్యలో సీట్లు ఖాళీ అయి.. ఉప ఎన్నికలు వచ్చాయి. ఈ 65 స్థానాల్లో 44 చోట్ల ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలే నెగ్గాయి. 21 చోట్ల విపక్షాలు గెలిచాయి. 2015లో 23 స్థానాల్లో ఉప ఎన్నికలు జరగగా.. 18 స్థానాల్లో అధికారపక్షమే నెగ్గింది. 5 స్థానాల్లో విపక్షాలు గెలిచాయి. 2016లో 24 అసెంబ్లీ స్థానాలు, నాలుగు లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ 28 స్థానాల్లో 21 చోట్ల అధికార పక్షమే నెగ్గింది. అంటే 75 శాతం అధికారపక్షానిదే విజయం. ఏడుచోట్ల విపక్షాలు నెగ్గాయి. అధికారపక్షాలు నెగ్గిన 21 స్థానాల్లో ఐదుసీట్లు ఇతర పార్టీల నుంచి గెల్చుకున్నవి కావడం గమనార్హం. తెలంగాణలోని పాలేరు, నారాయణ్‌ఖేడ్ అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్వికాగా.. ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ వాటిని కైవసం చేసుకుంది. అలాగే త్రిపురలోని బర్జాలా, గుజరాత్‌లోని తలాలా, మధ్యప్రదేశ్‌లోని మైహర్, కర్ణాటకలోని బీదర్‌లలో విపక్షాల సీట్లను అధికారంలో ఉన్న పార్టీలు గెల్చుకున్నాయి. ఈ ఏడాది(2017)లో ఇప్పటివరకు ఢిల్లీతోపాటు 12 రాష్ట్రాల్లో కలిపి.. రెండు లోక్‌సభ సీట్లు, 16 శాసనసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఆయా రాష్ట్రాల పాలకపక్షాలే అత్యధిక సీట్లు కైవసం చేసుకున్నాయి. గోవా, నాగాలాండ్, ఢిల్లీ, సిక్కిం, జార్ఖండ్, మధ్యప్రదేశ్, అసోం, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని 16 అసెంబ్లీ సీట్లకుగాను.. పాలకపక్షాలు 12 సీట్లు గెల్చుకున్నాయి. ప్రతిపక్షాలకు నాలుగు స్థానాలు మాత్రమే దక్కాయి. జమ్మూ కశ్మీర్, కేరళలోని ఒక్కో లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో మాత్రం ప్రతిపక్షాలు గెలిచాయి. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఉప ఎన్నికల్లో ఉద్రిక్తత: పోలీసుల కాల్పులు
-
ఉప ఎన్నికల్లో ఉద్రిక్తత: పోలీసుల కాల్పులు
జమ్ముకాశ్మీర్: శ్రీనగర్ లోక్‌సభ స్థానానికి జరుగుతున్న ఉపఎన్నికల్లో ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఆందోళన కారులు రాళ్లు రువ్వడంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మృతిచెందారు. దేశవ్యాప్తంగా నేడు పది అసెంబ్లీ స్థానాలకు, శ్రీనగర్ లోక్ సభ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. శ్రీనగర్ లోక్‌సభ పరిధిలోకి వచ్చే బుద్గాం, గండేర్బల్, శ్రీనగర్‌లలో ఎన్నికల నేపథ్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కానీ బుద్గాం, గండేర్బల్లోని పలు పోలింగ్ కేంద్రాలపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. పోలింగ్ పై తీవ్ర ప్రభావం చూపిస్తున్న అల్లరిమూకలపై కాల్పులు జరపగా ఇద్దరు వ్యక్తులు మహ్మద్ అబ్బాస్, ఫైజాన్ అహ్మద్ రాథోడ్ చనిపోగా, మరికొందరు గాయపడినట్లు సమాచారం. ఎంపీలో కాంగ్రెస్ నేత కారుపై దాడి మధ్యప్రదేశ్ లోని బంధవ్ గఢ్ నియోజవర్గంలో పలు పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రశాంతంగా జరగడం లేదని అధికారులు చెప్పారు. భింద్ ఏరియాలో కాంగ్రెస్ నేత కారుపై ఇద్దరు ఆందోళనకారులు వాహనం అద్దాలు ధ్వంసం చేశారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. బీజేపీ నేతలు ఈ పని చేయించారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. నాలుగు ఈ ఈవీఎంలు మోరాయిస్తుంటే వాటి స్థానంలో కొత్తవి అమర్చడంతో ఓటింగ్ తిరిగి ప్రారంభమైంది. మిగతా అన్ని ప్రాంతాల్లో ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతుందని ఎన్నికల కమిషన్ అధికారులు చెబుతున్నారు. Bhind(MP): Car of Congress candidate vandalised, 2 people beaten up& booth captured.Congress blames BJP supporters for the incident. #bypoll pic.twitter.com/vqAhtBHlyz — ANI (@ANI_news) 9 April 2017 -
ఏప్రిల్ 9న ఉప ఎన్నికలు
హిందూపురం అర్బన్ : మున్సిపాల్టీలోని 9వ వార్డు ఉపఎన్నికలు ఏప్రిల్ 9న జరుగనున్నట్టు ఎన్నికల అధికారి, మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ స్పష్టం చేశారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తొమ్మిదోవార్డు కౌన్సిలర్ ఆకస్మిక మరణంతో ఖాళీ ఏర్పడిన ఈ వార్డుకు రాష్ట్ర ఎన్నికల అధికారి ఆదేశాలతో నిర్వహిస్తున్నామన్నారు. ఈనెల 20 నుంచి 23 వరకు నామినేషన్ల స్వీకరణ, 24న నామినేషన్ల పరిశీలన, 27న ఉపసంహరణ, అదేరోజు మ««ధ్యాహ్నం 3 గంటలకు అభ్యర్థుల జాబితా విడుదల ఉంటుంది. ఏప్రిల్ 9న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఏప్రిల్ 11న ఓట్ల లెక్కింపు ఉంటుందని వివరించారు. ఎన్నికల కోడ్ అమలు ఎన్నికల కోడ్ గురువారం నుంచే అమలులోకి వచ్చిందని కమిషనర్ చెప్పారు. రాజకీయ పార్టీలు సభలు, సమావేశాలు, లౌడ్ స్పీకర్లు, ఫ్లెక్సీల ఏర్పాటుకు అనుమతులు తప్పనిసరి అన్నారు. 9వ వార్డులో మొత్తం ఓటర్లు 2,565 ఉండగా ఇందులో పురుçషులు 1303, 1262 మంది స్త్రీలు ఉన్నారు. కాగా ఎన్నికల అధికారిగా కమిషనర్, సహాయ ఎన్నికల నిర్వాహణాధికారులుగా ఈఈ రమేష్, టీపీఓ తులసీరాం వ్యవహరిస్తారన్నారు. అలాగే ఎన్నికల కోడ్ అమలు నిర్వహణాధికారిగా సోమశేఖర్, ఎన్నికల వ్యయగణాంకాధికారిగా డీఈ ప్రసాద్ వ్యవహరిస్తారని చెప్పారు. -
తాయిలాల కోసమే వెళుతున్నారు
* ముఖ్యమంత్రి పనితనం చూసి కాదు * పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి * వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ ధ్వజం సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చే తాయిలాల కోసమే కొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారని వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. సీఎం పనితనం, అభివృద్ధిని చూసి కాదని చెప్పారు. బొత్స బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అభివృద్ధి కోసమే తన వైపు ఎమ్మెల్యేలు వస్తున్నారంటున్న చంద్రబాబు ఈ రెండేళ్లలో ఏం అభివృద్ధి సాధించారో గుండెపై చెయ్యి వేసుకొని చిత్తశుద్ధితో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. డబ్బును ఎరగా చూపి ఎమ్మెల్యేలను లాక్కుంటున్నారే తప్ప ప్రజలకు ఏమీ చేయడం లేదని ఆరోపించారు. తాయిలాలు ఇస్తే ఎమ్మెల్యేలకు అందుతాయి కానీ ప్రజలకు ఒరిగేది ఏమిటో చెప్పాలన్నారు. చంద్రబాబుకు ఏమాత్రం నైతిక విలువలున్నా తన వైపు వచ్చిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, టీడీపీ టికెట్‌పై పోటీ చేయించాలన్నారు. వారు గెలిస్తే నిజంగా చంద్రబాబుకు ప్రజాదరణ ఉన్నట్లు అంగీకరిస్తామని ఆయన పేర్కొన్నారు. నీతిమంతుడినని, నిబద్ధత గలవాడిననీ సొంత డబ్బా కొట్టుకునే చంద్రబాబు ఇలాంటి అనైతిక చర్యలకు ఎందుకు పాల్పడుతున్నారని బొత్స ప్రశ్నించారు. నలుగురో ఐదుగురో ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకున్నంత మాత్రాన వైఎస్సార్సీపీ బలహీనపడదని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీలో ఉంటే మైలేజీ ఉండదని భూమా నాగిరెడ్డి చెప్పడాన్ని విలేకరులు ప్రస్తావించగా... మైలేజీ అంటే ఏమిటి? ధనమా? అధికారమా? అభివృద్ధా? అని ప్రశ్నించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఏ ఒక్క ఎమ్మెల్యేకు పదవిలో ఉండగా కాంగ్రెస్ కండువా కప్పి ఆహ్వానించలేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దానం నాగేందర్ టీడీపీ తరపున ఎన్నికైతే రాజీనామా చేయించి కాంగ్రెస్‌లో చేర్చుకున్నారని గుర్తుచేశారు. ప్రజా సమస్యలపై చర్చేది? విజయవాడలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో ప్రజా సమస్యలపై, సంక్షేమ పథకాల అమలుపై చర్చ ఏమాత్రం జరగలేదని బొత్స దుయ్యబట్టారు. సమావేశమంతా ఆత్మస్తుతి, పరనిందలతో సాగిందన్నారు. ప్రభుత్వాన్ని పడగొడతానని జగన్ అన్నట్లు వీడియోలో చూపిస్తే తాను రాజకీయాల నుంచి విరమించుకుంటానని బొత్స సవాలు విసిరారు. -
వ్యక్తిగత దూషణలకు మూలవిరాట్ కేసీఆర్
-
వరంగల్ ఉప ఎన్నికకు సర్వం సిద్ధం
-
వరంగల్ ప్రచారంలో మంత్రి కేటీఆర్
-
'వరంగల్ సీటు బీజేపీకే ఇవ్వండి'
వరంగల్: వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలో బీజేపీకే సీటు కేటాయించాలని ఆ పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ టి. రాజేశ్వరరావు అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. వరంగల్‌లో బీజేపీ అభ్యర్థి గెలిస్తే కేంద్రంలో మంత్రి పదవి వస్తుందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్కు బీజేపీయే ప్రత్యమ్నాయమన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు సెలవు ప్రకటించారని.. ఆ పార్టీ ఇక విశ్రాంతి తీసుకోవాల్సిందేనని ఎద్దేవా చేశారు. రేవంత్ తీరు సరైంది కాదు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వ్యవహరించిన తీరు సరైంది కాదని రాజేశ్వర్‌రావు అభిప్రాయపడ్డారు. బీజేపీ ఓటుకు నోటును వ్యతిరేకిస్తుందని ఆయన అన్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకొన్న టీఆర్ఎస్కు ఓటుకు నోటుపై మాట్లాడే అర్హత లేదన్నారు. టెక్నికల్‌గా ఇతర పార్టీ ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్న వారిని ఎలా మంత్రులుగా సాగిస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వానికి కావాల్సిన మెజారిటీ ఉన్నప్పటికీ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను లోబరుచుకొందని రాజేశ్వరరావు దుయ్యబట్టారు. -
ఆళ్లగడ్డ ఎన్నికల్లో పోటీ చేయం: టీడీపీ
హైదరాబాద్: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ శాసనసభ స్థానం ఉప ఎన్నికల్లో పోటీ చేయరాదని అధికార టీడీపీ నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సోమవారం ఈ విషయాన్ని వెల్లడించారు. పాత సంప్రదాయాన్ని అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యే మృతితో జరిగిన కృష్ణా జిల్లా నందిగామ ఉప ఎన్నికల సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని నిలబెట్టలేదు. దీంతో టీడీపీ ఇదే సంప్రదాయాన్ని పాటించనున్నట్టు కేఈ తెలిపారు. అభ్యర్థిని నిలపాలని కర్నూలు జిల్లా నేతలు కొందరు ప్రతిపాదించినా టీడీపీ నాయకత్వం తిరస్కరించింది. గత ఎన్నికల సందర్భంగా ప్రచారంలో ఉన్న శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. అప్పుడు నిర్వహించిన ఎన్నికల్లో ఆమె మరణానంతరం గెలిచినట్లు ప్రకటించారు. దాంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భూమా అఖిలప్రియ నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల షెడ్యూలు : నామినేషన్లు - ఈ నెల 14 నుంచి 21వ తేదీ వరకు పరిశీలన - ఈనెల 22న ఉపసంహరణ - ఈనెల 24న పోలింగ్ - నవంబర్ 8న ఓట్ల లెక్కింపు - నవంబర్ 12న -
యూపీ అంటేనే ఉల్టా పల్టా
ఉప ఎన్నికల ఫలితాలతో యూపీలో కమలనాధులు నిరసపడిపోయారు. రాష్ట్రంలో ఓ పార్లమెంట్ స్థానానికి,11 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కేవలం మూడంటే మూడే సీట్లు కమలనాథుల దక్కించుకున్నారు. మొత్తం 11 స్థానాలలో కమలం వికసిస్తుందని ఆ పార్టీ నేతలు అంతా ఎంతో ఆశపడ్డారు. కానీ ఆ ఆశలపై సమాజవాదీ పార్టీ (ఎస్పీ) సైకిల్ రూపంలో దూసుకువెళ్లి మరీ కమలాన్నీ ఢీ కొట్టింది. దాంతో కమలం రేకులు ఊడిపోయాయి. ఈ ఉప ఏన్నికల్లో 8 అసెంబ్లీ స్థానాలతోపాటు రాష్ట్రంలో జరిగిన ఒకే ఒక్క లోక్‌సభ స్థానాన్ని కూడా ఎస్పీ సైకిల్ చక్కగా ఎక్కించుకుని యమ స్పీడుగా వెళ్లి పోయింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలోని 71 సీట్లు కైవసం చేసుకుంది. దాంతో ప్రధానిగా నరేంద్రమోడీ ఢీల్లీ పీఠం చకచక ఎక్కెశారు. పార్టీకి అన్నీ సీట్లు రావడం కోసం ఆ రాష్ట్ర ఇన్ఛార్జ్ అమిత్ షా అపర చాణుక్యుడిలా వ్యవహారించారు. దాంతో ఆయనను పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నియమించి పార్టీ రుణం తీర్చుకుంది. అయితే ఇదే తరహాలో ఉప ఎన్నికల్లో కూడా గెలుస్తామని కమలదళం భావించినట్లుంది. అందుకే ఆ పార్టీ నాయకులు కూడా ఊహాల్లో విహారించినట్లు ఉన్నారో లేక అధికారంలో ఉండి కూడా సాధారణ ఎన్నికల్లో లోక్‌సభ స్థానాలు సింగిల్ డిజిట్ తెచ్చుకున్నామని కసి ఎస్పీ నాయకుల్లో పేరుకుపోయిందో ఏమో. కానీ ఉప ఎన్నికల్లో గెలిచి తీరాలని ఎస్పీలో మాత్రం కసి అంతకంతకు పెరిగింది. అందుకు తగ్గట్లుగానే ఆ పార్టీ నాయకులు వ్యవహారించారు. దాంతో ఉప ఎన్నికల్లో కమలం కళ తప్పింది. అందుకే మూడే స్థానాలను సరిపెట్టుకోవలసి వచ్చింది. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ అటు మెయిన్పూరీ ఇటు అజాంఘడ్ లోక్‌సభ స్థానాల నుంచి పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఆయన మెయిన్పూరీ స్థానానికి రాజీనామా చేశారు. దాంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆ స్థానం నుంచి బరిలో దిగిన ములాయం మేనల్లుడు తేజ్ ప్రతాప్ యాదవ్ మూడు లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అన్ని స్థానాలు గెలుచుకుని వంద రోజుల తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో కమలం వాడిపోడం ఏంటని కమలనాథులు తలలు పట్టుకుంటున్నారు. యూపీ అంటే ఉల్టా పల్టానేగా అని సరిపుచ్చుకుంటున్నారు. -
మెదక్,నందిగామలో మైదలైన ఓట్ల లెక్కింపు
-
రేపే మెదక్, నందిగామ ఫలితాలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ లోక్‌సభ, ఆంధ్రప్రదేశ్‌లోని నందిగామ అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి. వీటితో పాటు జరిగిన దేశ వ్యాప్తంగా జరిగిన 3 లోక్ సభ, 33 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఇందులో వడోదర, మొయిన్‌పురి లోక్‌సభ స్థానాలు, గుజరాత్లో 9 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మెదక్ ఫలితంపై ఆసక్తి నెలకొంది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు జరిగాయి. -
ఈ నెల 16వ తేదీన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా 9 రాష్ట్రాల్లో శనివారం జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపును ఈ నెల 16 వ తేదీన నిర్వహించనున్నారు. దేశంలోని తొమ్మిది రాష్ట్రాల్లో శనివారం జరిగిన ఉప ఎన్నికలు ఉదయం 7 గంటలకు ఆరంభమయ్యాయి. దేశం మొత్తం మీద 3 లోక్‌సభ, 33 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహించారు. అస్సాంలో 70 శాతం ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోగా, సిక్కింలో 79 శాతంపైగా పోలింగ్ శాతం నమోదైంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 50శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్రంలో మెదక్ లోక్‌సభ, ఆంధ్రప్రదేశ్‌లో నందిగామ అసెంబ్లీ స్థానాలకు ఈ రోజే ఉప ఎన్నికలు జరిగాయి. మెదక్ లోక్ సభకు 65 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. ఈ నెల 16 వ తేదీన పోలింగ్ జరిగిన స్థానాలకు ఎన్నికల లెక్కింపు నిర్వహిస్తారు.ఇప్పటివరకూ ఈశాన్య రాష్ట్రాల్లో పోలింగ్ మాత్రమే ముగిసినట్లు తెలుస్తోంది. -
నందిగామ అసెంబ్లీ ఎన్నికల విశేషాలు
నందిగామ: కృష్ణా జిల్లా నందిగామ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. శనివారం సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 1.84 లక్షల మంది ఓటర్లున్నారు. 200 పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మరిన్ని విశేషాలు.. తంగిరాల సౌమ్య (టీడీపీ), బోడపాటి బాబూరావు (కాంగ్రెస్) ఎన్నికల బరిలో ఉన్నారు. తంగిరాల సౌమ్య, బోడపాటి బాబూరావు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ మందకొడిగా సాగుతోంది. నందిగామ 80వ పోలింగ్ కేంద్రంలో మొరాయించిన ఈవీఎం, నిలిచిపోయిన పోలింగ్ -
మెదక్ ఎన్నికల ముచ్చట్లు
మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికలు శనివారం ఉదయం 7 గంటలకు ఆరంభమయ్యాయి. కొన్ని చోట్లు ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆగిపోయింది. మరికొన్ని చోట్ల గ్రామస్తులు ఓటేయడానికి నిరాకరించారు. మొత్తమ్మీద ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. విశేషాలు.. మొత్తం ఓటర్లు-15.43 లక్షల మంది 1,101 గ్రామాల్లో 1,817 పోలింగ్ కేంద్రాలు 7,500 మంది పోలీసులతో భారీ బందోబస్తు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు స్వగ్రామం చింతమడకలో ఓటు వేశారు. సంగారెడ్డిలో ఓటు హక్కు వినియోగించుకున్న బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డి శివంపేట మండలం గోమారంలో కాంగ్రెస్ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి ఓటు వేశారు. సిద్దిపేటలో ఓటే వేసిన మంత్రి హరీష్ రావు దంపతులు రామాయంపేట మండలం కోనాపూర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పాపన్నపేట మండలం కొత్తపల్లి పోలింగ్ కేంద్రంలో ఓటు వేయటానికి పిట్స్ వచ్చిన ఓ మహిళ పిట్స్ రావడంతో కింద పడిపోయింది. ములుగు మండలం జంగాపూర్లో పోలింగ్‌కు నిరాకరించిన గ్రామస్తులు వెల్దుర్తి మండలం నెల్లూరు, పెద్దాపూర్ గ్రామాల్లో ఓటుహక్కును నిరాకరించిన గ్రామస్తులు సిద్దిపేట భరత్ నగర్, మార్కెట్ యార్డు పోలింగ్ స్టేషన్లో ఈవీఎంల మొరాయింపు రామాయంపేట మండలం ఝాన్సీలింగాపూర్లోఈవీఎం మొరాయింపు మెదక్ మండలం తిమ్మానాగర్లో మొరాయించిన ఈవీఎం నంగనూరు మండలం బద్దిపడగలో ఈవీఎంల మొరాయింపు -
మెదక్ ఎన్నికల్లో ఈవీఎంల మొరాయింపు
మెదక్: మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో పలు చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. శనివారం ఉదయం పోలింగ్ ఆరంభమైన కాసేపటికే సిద్దిపేటలోని భరత్ నగర్, మార్కెట్ యార్డు పోలింగ్ స్టేషనల్లో ఈవీఎంలు పనిచేయకపోవడంతో పోలింగ్ నిలిచిపోయింది. మెదక్ మండలం తిమ్మాపూర్‌లో ఈవీఎం మొరాయించడంతో పోలింగ్ ప్రారంభంకాలేదు. రామాయంపేట మండలంలోనూ ఓ పోలింగ్ స్టేషన్లో ఈవీఎం మొరాయించింది. ములుగు మండలం జంగాపూర్లో గ్రామస్తులు పోలింగ్‌ను బహిష్కరించారు. గ్రామాభివృద్దిని పట్టించుకోలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.