
(ఫైల్ ఫోటో)
సాక్షి, సిద్ధిపేట : దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా బీజేపీ అభ్యర్థి బంధువుల ఇంట్లో, కార్యాలయాల్లో పోలీసులు సోమవారం సోదాలు చేపట్టారు. రఘునందన్ రావు అత్తగారిల్లు, సమీప బంధువుల ఇళ్లతో సహా ఎనిమిది చోట్ల ఏక కాలంలో సోదాలు చేస్తున్నారు. ఈ సోదాల్లో రఘునందరన్‌రావు మామ ఇంట్లో రూ. 18 లక్షల 65 వేలు స్వాధీనం చేసుకున్నారు. ఇదిలావుండగా పోలీసుల చర్యలకు వ్యతిరేకంగా బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు, కార్యకర్తలు నిరసనకు దిగారు. మరోవైపు సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ రాజనర్స్ ఇంట్లో పోలీసులు సోదా చేస్తున్నారు. చదవండి: దుబ్బాక అభివృద్ధి బాధ్యత నాది: హరీశ్ రావు