dubbaka
-
కోతులతో భయం.. కొండముచ్చుతో ఉపాయం
చిట్యాల: కోతుల బెడదను నివారించేందుకు.. కొండముచ్చుల ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకున్నారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో కోతుల నుంచి రక్షణ పొందేందుకు ఆ గ్రామానికి చెందిన అవనగంటి మహేశ్ వినూత్నంగా ఆలోచించారు. తన ఇంటిపై కొండముచ్చు(కొండెంగ) ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకున్నారు. రూ.2 వేల ఖర్చుతో ఎనిమిది కొండముచ్చు (Kondamuchu) బొమ్మలతో ఫ్లెక్సీలు చేయించి తన ఇంటి చుట్టూ ఏర్పాటు చేసుకున్నారు. కొండముచ్చు బొమ్మలను చూసిన కోతులు (Monkeys) ఇంట్లోకి రావడం లేదు.పొలాల్లో వానర దండు సిద్దిపేట జిల్లా దుబ్బాక (Dubbaka) పట్టణ శివారులోని పొలాల్లో వందలాది వానరాలు తిష్టవేశాయి. చాలా సేపటికి కోతుల దండు పంటపొలాల నుంచి దుబ్బాక పట్టణంలోకి రోడ్డుపై వెళ్తుండగా వాహనాలు నిలిచిపోయాయి. కోతులు పెద్ద సంఖ్యలో ఇళ్లపై తిరుగుతుండటంతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. – దుబ్బాక‘భౌ’బోయ్.. మందలు మందలుగా రోడ్లపై తిరుగుతున్న కుక్కల్ని (Dogs) చూసి హడలిపోయారు. వచ్చిపోయే వారిని వెంబడిస్తున్న శునకాలతో భయాందోళనకు గురయ్యారు. పెద్దపల్లి రాజీవ్ రహదారిపై బుధవారం ఉదయం కుక్కలతో పాదచారులు, వాహనదారులు ఎదుర్కొన్న తిప్పలకు దృశ్యరూపమిది. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి. చుట్టూ పచ్చదనం.. పల్లెటూరు రమణీయం చుట్టూ పచ్చదనం.. మధ్యలో పల్లెటూరు.. ప్రకృతి రమణీయ దృశ్యం చూపరులను ఆకట్టుకుంటోంది. నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని పెద్దగుట్ట (దర్గా) కింద ఏర్పడిన ఈ గ్రామాన్ని పెద్దగుట్ట గ్రామంగా పిలుస్తారు. చుట్టూ దట్టమైన అడవి (Forest) ఉంది. పెద్దగుట్టకు వెళ్లే భక్తులు ఇక్కడి ప్రకృతిని ఆస్వాదిస్తారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్. చదవండి: ఏకచక్రపురం.. నవనాథపురం -
27 ఏళ్ల దాకా అమ్మాయే..ఇపుడు అబ్బాయి!
దుబ్బాక: ఆ దంపతులకు తొలి సంతానంగా పండంటి ఆడబిడ్డ పుట్టింది. సాక్షాత్తూ లక్ష్మీదేవే ఇంటికి వచ్చిందని ఆ జంట మురిసిపోయింది. కావ్యశ్రీ అని చక్కని పేరుపెట్టి అల్లారు ముద్దుగా పెంచుకొన్నారు. కూతురిని పాఠశాలకు, కళాశాలకు పంపి చక్కగా చదివించారు. కానీ, కావ్యశ్రీ వయసు పెరుగుతున్నాకొద్ది ఆమె శరీరంలో మార్పులు రావటం మొదలైంది. యుక్త వయసు వచ్చేసరికి అబ్బాయిలా గడ్డం, మీసాలు వచ్చాయి. మొదట పెద్దగా పట్టించుకోలేదు. కానీ, 26 ఏళ్ల వయసు వచ్చేనాటికి ఆమె.. అతడిలా మారటం స్పష్టంగా తెలిసిపోయింది. ఆరోగ్య పరంగా కూడా కావ్యశ్రీ ఇబ్బందులు ఎదుర్కొన్నది. కంగారుపడిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించగా, కావ్యశ్రీ ఆడపిల్ల కాదని.. మగపిల్లాడని డాక్టర్లు తేల్చారు. దీంతో 27 ఏళ్ల వయసులో కావ్యశ్రీ కాస్తా.. కార్తికేయగా మారాడు. సిద్దిపేట జిల్లాలో ఈ అరుదైన ఘటన జరిగింది. అనారోగ్యంతో బయటపడిన నిజం.. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామక్కపేటకు చెందిన దొంతగౌని రమేశ్, మంజుల మొదటి సంతానం కావ్యశ్రీ 1996 అక్టోబర్ 30న జన్మించింది. కావ్యశ్రీకి 2018 నుంచి శరీరంలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. మగవారిలాగా గడ్డం, మీసాలు పెరగడం ప్రారంభమైంది. విపరీతమైన కడుపు నొప్పి, ఆరోగ్యపరమైన సమస్యలు రావడంతో తల్లిదండ్రులు రెండు నెలల క్రితం హైదరాబాద్‌లో వైద్యులను సంప్రదించారు. వారు ప్రత్యేక వైద్య నిపుణులను కలవాలని సూచించటంతో రెండు నెలల క్రితం బెంగళూరుకు చెందిన డాక్టర్లను కలిశారు. అక్కడి వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో నమ్మ లేని నిజాలు బయట పడ్డాయి. కావ్యశ్రీకి కడుపు కింది భాగంలో పురుషుల మాదిరిగా వృషణాలు ముడుచుకుని ఉండడంతోపాటు, 2.5 ఇంచుల అంగం బయటకు రావడం గమనించారు. ముడుచుకున్న వృషణాలను శస్త్ర చికిత్స చేసి సరి చేయాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. ఛాతీ భాగం సైతం అబ్బాయిదేనని, అధిక కొవ్వు కారణంగా ఎత్తుగా కనపడిందని తేల్చారు. ఇలా ఛాతీ ఎత్తుగా పెరగడాన్ని గైనాకో మాస్టియో అంటారని వైద్యులు తెలిపారు. దీంతో ఇప్పటి వరకు కావ్యశ్రీ అని పిలుచుకున్న తమ సంతానానికి కార్తికేయ అని పేరు మార్చామని తల్లిదండ్రులు తెలిపారు. మూడు వారాల క్రితం ఆధార్ కార్డులో సైతం కార్తికేయగా పేరు మారి్పంచారు. కావ్యశ్రీ విద్యార్హతల సర్టిఫికేట్లలో సైతం పేరు మార్చాల్సి ఉంది. 2014 నుంచే కార్తికేయ బైక్, కారు సైతం నడుపుతున్నాడు. ప్రస్తుతం కార్తికేయ ఫ్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్‌గా, సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు.అబ్బాయిగా జీవించటం ఆనందంగా ఉంది నాకు టీనేజ్ వచ్చేసరికి అబ్బాయిలాగా గడ్డం, మీసాలు రావడం మొదలైంది. డాక్టర్లను సంప్రదించగా అసంకల్పిత రోమాలు అని చెప్పారు. కడుపు నొప్పి తరచుగా వస్తుండడంతో హైదరాబాద్‌లో నిపుణులను కలిశాం. దీంతో నాకు అసలు విషయం తెలిసింది. ఇప్పుడు అబ్బాయిగా జీవించడం నాకెంతో ఆనందంగా ఉంది. –దొంతగౌని కార్తికేయజన్యు లోపాల వల్లే.. కార్తికేయ విషయంలో క్రోమోజోమ్‌ల లోపంతో ఇలా జరిగింది. కొన్ని క్రోమోజోమ్‌లు ఎక్కువగా డామినేట్ చేయడం వల్ల వృషణాలు చిన్నగా పెరిగాయి. వృషణాలు కొంత భాగం కడుపులో ముడుచుకొని ఉండటాన్ని గుర్తించాం. తదుపరి వైద్య పరీక్షలకు నిపుణులను సంప్రదించాలని సూచించాం. అతడు అమ్మాయి కాదు అబ్బాయే. టెస్టిక్యులర్ ఫెమినైజేషన్ సిండ్రోమ్ కారణంగా బయటకు అమ్మాయిలా కనిపించినా అంతర్గతంగా మొత్తం పురుష లక్షణాలే ఉన్నాయి. ఇది చాలా అరుదైన లక్షణం. –డాక్టర్ హేమారాజ్ సింగ్, సర్జన్, దుబ్బాక ఆస్పత్రి సూపరింటెండెంట్కార్తికేయను అబ్బాయిలాగే గుర్తించండి నా కొడుకులో జన్యు మార్పుల వల్ల మేము ఇన్నాళ్లు అమ్మాయిగా భ్రమపడ్డాం. యుక్త వయస్సు వచ్చేసరికి వాడికి గడ్డం, మీసాలు రావడం గమనించాం. ఈ క్రమంలో కడుపు నొప్పి రావడంతో వైద్యులను సంప్రదించాం. అమ్మాయి కాదని అబ్బాయి అని నిర్థారించారు. సమాజం తప్పుగా అర్థం చేసుకోవద్దు. మా అబ్బాయిని అబ్బాయిలాగే గుర్తించండి. –మంజుల–రమేష్ గౌడ్, కార్తికేయ తల్లిదండ్రులు -
Congress Vs BRS: దుబ్బాకలో ఉద్రిక్తత..
సాక్షి, దుబ్బాక: సిద్దిపేట జిల్లాలోని దుబ్బాకలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కాన్వాయ్‌ను కాంగ్రెస్ నేతలు అడ్డుకోవడంతో ఘర్షణ నెలకొంది.దుబ్బాకలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. దుబ్బాక నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కాన్వాయ్ మున్సిపల్ కార్యాలయానికి వెళ్తుండగా కాంగ్రెస్ పార్టీ నాయకుల అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కొత్త ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో, ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అక్కడే ఉన్న పోలీసులు ఇరు వర్గాలను కట్టడి చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణసిద్దిపేట - దుబ్బాక నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కాన్వాయ్ మున్సిపల్ కార్యాలయానికి వెళ్తుండగా కాంగ్రెస్ పార్టీ నాయకుల అడ్డుకున్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య… pic.twitter.com/CjFwzzeKsF— Telugu Scribe (@TeluguScribe) October 3, 2024Video Credit: Telugu Scribeఇది కూడా చదవండి: కూల్చి వేతలపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు -
వెన్నుపోట్లు.. కత్తిపోట్లు! ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆసక్తికర రాజకీయం..
సంగారెడ్డి: 'ఈ ఏడాది ఉమ్మడి మెదక్ జిల్లా రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. ఇటీవల జరిగిన హోరాహోరీగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లాలోనూ తన బలాన్ని పెంచుకుంది. ఈసారి రెండు మంత్రి పదవులు కూడా దక్కడం గమనార్హం. బీఆర్ఎస్ పార్టీ కూడా తన పట్టును నిలుపుకుంది. బీజేపీ ఈసారి ఉన్న ఒక్క ఎమ్మెల్యే స్థానం కూడా కోల్పోయింది. పలు పార్టీ నేతలు ఒక పార్టీ నుంచి మరోపారీ్టకి మారడంపోటీలో నిల్చున్న అభ్యర్థులు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం చూశాం. ఎమ్మెల్యేగా బరిలో నిలిచిన కొత్త ప్రభాకర్‌రెడ్డిపై జరిగిన కత్తిదాడి రాష్ట్రంలో సంచలంగా మారింది.' – సాక్షిప్రతినిధి, సంగారెడ్డి ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రేసులోకి వచి్చంది. 11 అసెంబ్లీ స్థానాలకు నాలుగు ఎమ్మెల్యే సీట్లను గెలుచుకొని నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది. అందోల్, నారాయణఖేడ్, మెదక్, హుస్నాబాద్‌లలో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. అంతకు ముందు కేవలం ఒక్క సంగారెడ్డిలోనే కాంగ్రెస్ ప్రాతినిధ్యం వహించింది. బీఆర్ఎస్ కూడా ఏడు చోట్ల విజయం సాధించింది. సంగారెడ్డి, పటాన్చెరు, జహీరాబాద్, నర్సాపూర్, గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక స్థానాల్లో గులాబీ జెండా రెపరెపలాడింది. ‘స్థానిక'ంలో అవిశ్వాసాల జోరు.. స్థానిక సంస్థల్లో అవిశ్వాసాల రగడ ఈ ఏడాదే షురువైంది. మున్సిపాలిటీలు, సహకార సంఘాల చైర్మన్ పదవులపై సభ్యులు అవిశ్వాస తీర్మాణాల నోటీసులు ఇచ్చారు. సంగారెడ్డి, అందోల్, సదాశివపేట్, నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్లపై అవిశ్వాసం పెడుతూ కౌన్సిలర్లు నోటీసులు ఇచ్చారు. ఎన్నికల ముందు ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే ఆయా చైర్మన్లు రాష్ట్ర అత్యున్నత న్యాయాస్థానాన్ని ఆశ్రయించడంతో అవిశ్వాసాల రగడం కొన్ని నెలలు సద్దుమనిగింది. ఎన్నికల అయిన వెంటనే మళ్లీ బల్దియాల్లో అవిశ్వాసాల లొల్లి షురువైంది. ఈసారి రాష్ట్రంలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఈ అవిశ్వాసాల తీర్మాణాలు నెగ్గుతాయా? లేదా? అనే దానిపై కొత్త సంవత్సం 2024లో తేలనుంది. పార్టీలు మారిన నేతలు.. ఎన్నో ఏళ్లుగా ఆయా పార్టీల్లో కొనసాగిన నేతలు ఈ ఏడాది జరిగిన ఎన్నికల వేళ పార్టీలు మారారు. రాత్రికి రాత్రే కండువాలు మర్చారు. ప్రధానంగా కాంగ్రెస్ నుంచి ఎక్కువ మంది నేతలు బీఆర్ఎస్లో చేరారు. పార్టీలు మారిన ముఖ్యనేతల్లో టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా ఉన్న గాలి అనిల్‌కుమార్, మెదక్ డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, జహీరాబాద్‌కు చెందిన నరోత్తం, టీపీసీసీ కార్యదర్శి మ్యాడం బాలకృష్ణ వంటి నాయకులంతా ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ను వీడారు. రెండు మంత్రి పదవులు.. కొత్తగా కొలువు దీరిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉమ్మడి జిల్లాకు రెండు మంత్రి పదవులు దక్కాయి. అందోల్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న సిలారపు దామోదర రాజనర్సింహకు అమాత్య పదవి వరించింది. గత ప్రభుత్వ హయాంలో సిద్దిపేట నుంచి ప్రాతినిథ్యం వహించిన హరీశ్‌రావు మంత్రిగా కొనసాగిన విషయం విధితమే. అయితే మాజీ మంత్రి హరీశ్ రావు పోర్టు పోలియో వైద్యారోగ్యశాఖ ప్రస్తుత మంత్రి దామోదర రాజనర్సింహకు దక్కడం గమనార్హం. ఉమ్మడి జిల్లా నుంచి సీఎం పదవి చేజారిపోయింది. గజ్వేల్ నుంచి రెండు పర్యాయాలు ప్రాతినిథ్యం వహించిన కేసీఆర్ ఇప్పుడు బీఆర్ఎస్ఎల్పీ నేతగా కొనసాగే అవకాశాలున్నాయి. రెండు చోట్ల పోటీ చేయగా గజ్వేల్‌లో గెలిచారు. హుస్నాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొందిన పొన్నం ప్రభాకర్‌కు క్యాబినేట్లో చోటు దక్కింది. గతంలో సీఎం కేసీఆర్ మంత్రిగా పనిచేసిన రవాణాశాఖ ఈసారి పొన్నంకు దక్కడం గమనార్హం. ఉన్న ఒక్క స్థానాన్ని కోల్పోయిన బీజేపీ గత ఎన్నికల్లో దుబ్బాక నుంచి గెలుపొందిన బీజేపీ నేత రఘునందన్‌రావు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. దీంతో ఆ పారీ్టకి ఉన్న ఒక్క ఎమ్మెల్యే స్థానం కోల్పోవాల్సి వచ్చింది. 2020లో జరిగిన ఉప ఎన్నికల్లో రఘునందన్‌రావు బీజేపీ అభ్యరి్థగా గెలుపొందిన విషయం విదితమే. మరోవైపు ఉమ్మ డి జిల్లాలో ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు ఘోర పరాజయం పాలైన విషయం విదితమే. ఒకరిద్దరు మినహా మిగిలిన అందరికి కనీసం డిపాజిట్లు రాకపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ప్రజల్లో కనీసం పట్టులేని అభ్యర్థులను బరిలోకి దించడంతో కనీసం వార్డు కౌన్సిలర్‌కు వచ్చే ఓట్లన్ని కూడా ఆయా నియోజకవర్గాల్లో సాధించలేకపోయింది. కొత్త ప్రభాకర్‌రెడ్డిపై కత్తిదాడి! రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం.. అక్టోబర్ 30న మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో ఉన్న అప్పటి మెదక్ ఎంపీ, ప్రస్తుత దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డిపై దుండగుడు కత్తితో దాడి చేయడంతో ఆయన తీవ్ర గాయాలయ్యాయి. దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థిగా నియోజకవర్గంలోని సూరంపల్లిలో ఎన్నికల ప్రచారం చేస్తున్న కొత్త ప్రభాకర్‌రెడ్డి దగ్గరికి నమస్తే సార్ అంటు మిరుదొడ్డి మండలం చేప్యాలకు చెందిన గటాని రాజు వచ్చి ఒక్కసారిగా కత్తితో పొడిచాడు. వెంటనే అక్కడున్న పోలీసులు, ప్రజలు రాజును పట్టుకొని దేహశుద్ధి చేశారు. కత్తి దాడిలో గాయపడ్డ ప్రభాకర్‌రెడ్డిని హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సమయంలో సంచలనంగా మారింది. కత్తి దాడిలో గాయపడ్డ ప్రభాకర్‌రెడ్డి ప్రత్యేక అంబులెన్స్‌లో డాక్టర్ల పర్యవేక్షణలో దుబ్బాకకు వచ్చి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్న ప్రభాకర్‌రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యేగా 53 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇవి చదవండి: వైద్యుడి నుంచి.. శాసన సభ్యుడి వరకు.. -
గ్రూపు విభేదాలే కారణమా? ఓటమిపై అధిష్టానం ఆరా..
సంగారెడ్డి: రాష్ట్రంలో కాంగ్రెస్ హవా కొనసాగి అధికారంలోకి వస్తే.. దుబ్బాక నియోజక వర్గంలో మాత్రం పార్టీ ఘోరపరాజయం చవిచూసింది. మొదటి నుంచి గ్రూపు విభేదాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న దుబ్బాకలో ఈసారి కచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగురుతుందని భావించిన అధిష్టానానికి నిరాశే మిగిలింది. గెలుపు కాదు కదా కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. ఓటమికి నేతల మధ్య నెలకొన్న గ్రూపు విభేదాలే కారణమా ఇంకా ఏమైనా ఉన్నాయా అన్న దానిపై పార్టీ అధిష్టానం ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు విశ్వసనీయ సమాచారం. టికెట్ దక్కకపోవడంతో.. మొదటి నుంచి దుబ్బాక కాంగ్రెస్‌లో గ్రూపు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో గ్రూపు విభేదాలు నెలకొనడంతో ఎన్నిసార్లు అధిష్టానం సమన్వయం కోసం ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. ఎన్నికల ముందు దుబ్బాక టికెట్ కోసం మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి తనయుడు శ్రీనివాస్‌రెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ పన్యాల శ్రావణ్ కుమార్ రెడ్డి, కత్తి కార్తీక తీవ్ర స్థాయిలో పోటీ పడ్డారు. ఆఖరికి చెరుకు శ్రీనివాస్‌రెడ్డికే టికెట్ దక్కింది. దీంతో కత్తి కార్తీక ఎన్నికలకు నాలుగురోజుల ముందు బీఆర్ఎస్ చేరి కొత్త ప్రభాకర్‌రెడ్డికి మద్దతుగా ప్రచారం చేపట్టారు. ఇక టికెట్ రాకపోవడంతో శ్రావణ్ కుమార్‌రెడ్డి దుబ్బాక వైపే చూడకపోవడం తన అనుచరులు సైతం శ్రీనివాస్‌రెడ్డికి ఎన్నికల్లో సహకరించకపోవడం కనిపించింది. డిపాజిట్ దక్కని పరిస్థితి! దుబ్బాకలో ఈసారి కాంగ్రెస్ జెండా ఎగురతుందని అధిష్టానం ధీమాగా ఉండగా నియోజకవర్గంలో సైతం శ్రీనివాస్‌రెడ్డికి టికెట్ కేటాయిస్తే తప్పకుండా గెలుస్తాడని సర్వేల్లో తేలింది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ త్రిముఖ పోటీలో ఎవరు గెలుస్తారో ఓ దశలో అంతు చిక్కని పరిస్థితి కనబడింది. తీరా ఎన్నికల ఫలితాలు వెలువడడంతో కాంగ్రెస్‌కు కనీసం డిపాజిట్ కూడా దక్కకపోవడం శోచనీయం. చెరుకు శ్రీనివాస్‌రెడ్డికి కేవలం 25,235 ఓట్లు మాత్రమే వచ్చాయి. డిపాజిట్ కు కావాల్సిన 28,894 ఓట్లకు 3,500 పై చిలుకు ఓట్లు దూరంగా ఉండడం ఆశ్చర్యం కలిగించింది. దుబ్బాకలో ఓటమిపై కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇవి కూడా చదవండి: సారూ..! మా గ్రామాలకు 'మహాలక్ష్మి' కరుణించేదెలా? -
అన్నీ పార్టీలకు ప్రధాన అస్త్రం ఇదే..
సాక్షి, సిద్ధిపేట/దుబ్బాక: అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అస్త్రం దుబ్బాక రెవెన్యూ డివిజనే. 2020 ఉపఎన్నికల సమయంలోనే డివిజన్‌గా ఏర్పాటవుతుందని ఆశించినా ప్రజలకు నిరాశే ఎదురైంది. ప్రస్తుత ఎన్నికల నేపథ్యంలో దుబ్బాకను రెవెన్యూ డివిజన్ చేయాలంటూ అన్నివర్గాల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. రాష్ట్రం ఆవిర్భావం తర్వాత జిల్లాల పునర్విభజన సమయంలో సిద్దిపేట జిల్లాగా, దుబ్బాకను రెవెన్యూ డివిజన్‌గా చేస్తారని ఈ ప్రాంతం వారు ఎదురుచూశారు. కానీ అలా జరగలేదు. పాత సమితి కేంద్రంగా, తాలుకాగా, నియోజకవర్గ కేంద్రంగా మున్సిపాలిటీగా ఉన్న దుబ్బాకకు రెవెన్యూ డివిజన్‌కు కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయి. 2016లో రెవెన్యూ డివిజన్ చేయాలంటూ దుబ్బాక పట్టణంలో 45 రోజుల పాటు ఉద్యమం జరిగింది. అప్పటి నుంచి నిరంతరం ఉద్యమాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ప్రజల ఆకాంక్ష దుబ్బాక రెవెన్యూ డివిజన్ చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి. సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట జిల్లా కేంద్రంగా ఉండడంతో పాటు నియోజకవర్గ కేంద్రాలైన గజ్వేల్, హుస్నాబాద్‌లను రెవెన్యూ డివిజన్లుగా చేసి నియోజకవర్గ కేంద్రమైన దుబ్బాకను డివిజన్ చేయకపోవడం శోచనీయం. ఆరు మండలాలతో దుబ్బాక డివిజన్! దుబ్బాక నియోజక వర్గంలో ప్రస్తుతం 8 మండలాలు ఉండగా చేగుంట, నార్సింగ్ మండలాలు తూప్రాన్ డివిజన్లో ఉన్నాయి. దుబ్బాక, మిరుదొడ్డి, తోగుట, దౌల్తాబాద్, రాయపోల్, భూంపల్లి–అక్భర్పేట మండలాలతో డివిజన్ చేస్తే ప్రజలకు అనుకూలంగా ఉంటుంది. 26న ప్రకటిస్తారని ప్రచారం.. దుబ్బాక రెవెన్యూ డివిజన్ డిమాండ్‌ను సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు దృష్టికి ఇప్పటికే ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి తీసుకెళ్లాడని, ఈ నెల 26 న దుబ్బాకలో జరిగే బహిరంగ సభలో డివిజన్‌గా చేస్తున్నట్లు ప్రకటిస్తారని బీఆర్ఎస్ వర్గాలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. హరీశ్ సైతం కొత్త ప్రభాకర్‌రెడ్డిని గెలిపించండి దుబ్బాక డివిజన్ చేస్తామని రోడ్ షోల్లో హామీలు ఇస్తున్నారు. రేవంత్ నోటా దుబ్బాక డివిజన్.. దుబ్బాకలో గురువారం జరిగిన బహిరంగ సభలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సైతం కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డిని గెలిపించండి దుబ్బాక రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది దుబ్బాక డివిజన్‌ను చేస్తామని రేవంత్‌రెడ్డి ప్రకటించారు. బీజేపీ సైతం దీనిపైనే ఫోకస్! దుబ్బాకలో మళ్లీ బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావును గెలిపిస్తే తప్పకుండా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అవుతుందని ఆ పార్టీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే రఘునందన్‌రావు సైతం భూంపల్లి–అక్భర్పేట కొత్త మండలం ఏర్పాటు చేశానని, దుబ్బాకను రెవెన్యూ డివిజన్ చేస్తానంటూ ప్రచారంలో ప్రజలకు వివరిస్తున్నారు. ఇవి కూడా చదవండి: బడా నేతల ఆగమనం! -
దుబ్బాకలో కేటీఆర్ ఎన్నికల ప్రచారం
-
దుబ్బాక అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం: రఘునందన్
-
ఎంపీపై దాడి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలకు భద్రత పెంపు
సాక్షి, సిద్దిపేట: దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి పై దాడి నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలకు ప్రభుత్వం భద్రతను పెంచింది. 2+2 ఉన్న భద్రతను 4+4గా పెంచుతూ అన్ని జిల్లా అధికారులకు ఇంటలిజెన్స్ అడిషనల్ డీజీ ఆదేశాలు జారీ చేశారు.పెంచిత భద్రత నిన్నటి నుంచి రిపోర్ట్ చేయాలని సర్కులర్ లో పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలకు భద్రత పెంపు పై విపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తమకు కూడా భద్రత పెంచాలని విపక్ష పార్టీల పలువురు ఎమ్మేల్యేలు, నాయకులు డీజీపీకి విజ్ఞప్తి చేసుకున్నారు. విపక్ష నేతల ఫిర్యాదులను పరిగణలోకి తీసుకోలేదని ఎన్నికల సంఘానికి బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఫిర్యాదు చేశారు. ఇప్పటికైనా పోలీసులు స్పందించకపోతే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఇదీ చదవండి: పార్టీల వైఖరిపై ప్రజలు చర్చ జరపాలి: సీఎం కేసీఆర్ -
ఎంపీ ప్రభాకర్ మరో 4 రోజులు ఐసీయూలోనే.. దర్యాప్తు వేగవంతం
సాక్షి, హైదరాబాద్: మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై హత్యాయత్నం కేసులో సిద్ధిపేట పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. రాజకీయ కుట్ర కోణంలో విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే ఎంపీపై దాడి చేసిన నిందితుడు రాజు కుటుంబ సభ్యులను చేప్యాలలో పోలీసులు విచారించారు. నిందితుడు రాజు కాల్‌డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు రాజుకి హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అతడు కోలుకున్న తర్వాత కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. నాలుగు రోజులు ఐసీయూలోనే.. కత్తిపోటుతో ప్రభాకర్‌రెడ్డి చిన్నపేగుకు గాయం కావడంతో సోమవారం యశోద ఆసుపత్రిలో వైద్యులు నాలుగు గంటలపాటు శ్రమించి ఆపరేషన్ చేశారు. చిన్న పేగును 10 సె.మీ మేర వైద్యులు తొలగించారు. ప్రస్తుతం ఆయనను ఐసీయూలో చికిత్స అందిస్తుండగా మరో నాలుగు రోజులు ఐసీయూలోనే ఉండనున్నారు. మరోవైపు కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి నేపథ్యంలో దుబ్బాక నియోజకవర్గంలో బంద్‌కు పిలిపునిచ్చారు బీఆర్ఎస్ కార్యకర్తలు.వర్తక వ్యాపారులు స్వచ్చందంగా బంద్ పాటిస్తున్నారు. అదే విధంగా ఎంపి ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని మెదక్ చర్చిలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అసలేం జరిగిందంటే.. దుబ్బాకలో బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్న ప్రభాకర్‌రెడ్డి.. సోమవారం సిద్దిపేట జిల్లా సూరంపల్లిలో ప్రచారం నిర్వహించారు. తిరిగొస్తూ వాహనం వైపు వెళ్తుండగా ఓ వ్యక్తి కడుపులో కత్తితో పొడిచాడు. దీంతో ప్రభాకర్ రెడ్డిని మొదట గజ్వేల్‌కు, అక్కడి నుంచి హైదరాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు. దగ్గరుండి ఎంపీని ఆస్పత్రికి తీసుకొచ్చారు మంత్రి హరీశ్‌రావు. శస్త్రచికిత్స చేసిన వైద్యులు.. గాయమైన చోట చిన్నపేగు భాగం తొలగించారు. సీఎం కేసీర్, మంత్రులు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. చదవండి: Miryalaguda: ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోట.. ఇప్పుడు అనాథగా.. -
దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం
-
మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై హత్యాయత్నం
సాక్షి, సిద్దిపేట: మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. కత్తితో ఓ వ్యక్తి ఆయనపై దాడి చేయగా.. కడుపులో గాయం అయ్యింది. దీంతో ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. సూరంపల్లి ఎన్నికల ప్రచారంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం మెదక్ లోక్‌సభ ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్‌రెడ్డి.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. ఈ క్రమంలో దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో ఓ దుండగుడు కత్తితో దాడి చేశాడు. కత్తితో దాడి చేసిన నిందితుడ్ని బీఆర్ఎస్ కార్యకర్తలు చితకబాది పోలీసులకు అప్పగించారు. నిందితుడ్ని మిరుదొడ్డి మండలం చెప్పాల గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది. హుటాహుటిన బయల్దేరిన హరీష్‌రావు కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి సంగతి తెలియగానే మంత్రి హరీష్‌రావు ఫోన్లో పరామర్శించారు. మెదక్ హుటాహుటిన బయల్దేరారు. అవసరం అయితే హైదరాబాద్ కు తీసుకురావాలని బీఆర్ఎస్ నేతలకు హరీష్‌రావు సూచించారు. -
TS Election 2023: నాడు 'దొమ్మాట' నుంచి.. నేడు 'దుబ్బాక' నియోజకవర్గంగా..
సాక్షి, సంగారెడ్డి: తెలంగాణ రాష్ట్రంలోనే ఉద్యమాల ఖిల్లాగా దుబ్బాక నియోజకవర్గం పేరుగాంచింది. మొదటి నుంచి విప్లవోద్యమాలకు అడ్డాగా గుర్తింపు పొందింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు నక్సలైట్ దళాలు ఈ నియోజకవర్గంలో పనిచేయడంతో దేశవ్యాప్తంగా దుబ్బాక పేరు మార్మోగింది. మూడు జిల్లాల సరిహద్దుల్లో ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణలను కలుపుతూ మధ్యలో ఉండే నియోజకవర్గం దుబ్బాక. రాజకీయంగా ఎంతో చైతన్యవంతమైనది కావడంతో నియోజకవర్గం నుంచి శాసనసభ్యులుగా ఎన్నికై న చాలామంది ఉన్నత పదవులు పొందారు. మంత్రి పదవితో పాటు, డిప్యూటీ స్పీకర్, శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్లు, టీటీడీ బోర్డు మెంబర్లుగా ఉన్నత బాధ్యతలు చేపట్టి దుబ్బాక నియోజకవర్గానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. 1957లో దొమ్మాట నియోజకవర్గంగా.. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తొలిదశలో రాజగోపాలపేటగా ఉన్న ఈ నియోజకవర్గంలో దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాల్లోని పలు మండలాలు ఉండేవి. ఆ తర్వాత 1957లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో భాగంగా రాజగోపాలపేట స్థానంలో దొమ్మాట నియోజకవర్గంగా ఏర్పాటు చేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన దొమ్మాట నియోజక వర్గంలో దుబ్బాక, మిరుదొడ్డి, దౌల్తాబాద్, కొండపాక మండలాలు ఉండేవి. 2001లో అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న చెరుకు ముత్యంరెడ్డి మిరుదొడ్డి, కొండపాక మండలాల నుంచి 17 గ్రామపంచాయతీలను కలిపి కొత్తగా తొగుట మండలంను ఏర్పాటు చేశారు. దీంతో అప్పటి నుంచి ఐదు మండలాలతో దొమ్మాట నియోజకవర్గం ముఖ చిత్రంగా ఏర్పడింది. 2009లో దుబ్బాక నియోజకవర్గంగా.. 2009 ఎన్నికల ముందు నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. ఆ సమయంలో దొమ్మాట నియోజకవర్గం కాస్త దుబ్బాక నియోజకవర్గంగా అవతరించింది. దుబ్బాకలో కొండపాక మండలంను కలపకుండా గజ్వేల్ నియోజకవర్గంలో చేర్చి.. అప్పటి రామాయంపేట నియోజకవర్గంలో ఉన్న చేగుంట మండలాన్ని దుబ్బాకలో చేర్చారు. అంతేగాకుండా అప్పటి వరకు దుబ్బాక మండలంలోని 11 గ్రామాలు, మిరుదొడ్డి మండలంలోని ధర్మారం గ్రామం సిద్దిపేట నియోజకవర్గంలో ఉండగా వాటిని దుబ్బాక నియోజకవర్గంలో కలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా మండలాలు ఏర్పర్చడంతో కొత్తగా రాయపోల్, నార్సింగ్, భూంపల్లి–అక్బర్పేట మండలాలు ఏర్పాటయ్యాయి. ప్రస్తుతం దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట, దౌల్తాబాద్, రాయపోల్, చేగుంట, నార్సింగ్, భూంపల్లి–అక్బర్పేట మండలాలతో పాటుగా గజ్వేల్ మండలంలోని ఆరపల్లి గ్రామంతో కలిసి దుబ్బాక నియోజకవర్గంగా ఉంది. రాజకీయంగా ఎన్నో మార్పులు.. రాజకీయంగా దుబ్బాక నియోజకవర్గంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. 1952లో తొలిసారి రాజగోపాలపేట నియోజకవర్గం పేరిట జరిగిన ఎన్నికల్లో ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ కే.వీ.నారాయణరెడ్డి కమ్యూనిస్టుల మద్దతుతో గెలిచారు. 1957 ఎన్నికల్లో వంగ హనుమంతరెడ్డి అలియాస్ ఆశిరెడ్డి పీడీఎఫ్ తరఫున విజయం సాధించారు. 1962 ఎన్నికల్లో ఎంకే మోహినొద్దీన్ కాంగ్రెస్ తర ఫున గెలిచారు. 1967 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన ఎం.భీంరెడ్డి తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. 1972 ఎన్నికల్లో దుబ్బాక మండలం చిట్టాపూర్‌కు చెందిన సోలిపేట రాంచంద్రారెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచారు. 1978లో దుబ్బాకకు చెందిన ఐరేని లింగయ్య కాంగ్రెస్ నుంచి గెలిచి శాసనసభ ఉపసభాపతి పదవిని పొందారు. 1988లో టీడీపీ ప్రభంజనంతో రాష్ట్రంలో కాంగ్రెస్ కొట్టుకుపోయిన దొమ్మాటలో కాంగ్రెస్ నుంచి ఐరేని లింగయ్య విజయం సాధించారు. 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో కొండపాకకు చెందిన డి. రాంచంద్రారెడ్డి టీడీపీ నుంచి గెలుపొందారు. 1989,1994,1999 లో టీడీపీ నుంచి చెరుకు ముత్యంరెడ్డి వరుసగా హ్యాట్రిక్ విజయం సాధించారు. 2004 ఎన్నికల్లో తొలిసారిగా ఎన్నికల బరిలో దిగిన బీఆర్ఎస్ తరఫున జర్నలిస్టుగా ఉన్న సోలిపేట రామలింగారెడ్డి పోటీచేసి వరుస విజయాలతో ఉన్న ముత్యంరెడ్డిపై గెలుపొందారు.అనంతరం తెలంగాణ ఉద్యమపరిణామాల్లో భాగంగా 2008 లో జరిగిన ఉప ఎన్నికల్లో సోలిపేట రామలింగారెడ్డి మళ్లీ బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో దుబ్బాక నియోజకవర్గంకు జరిగిన మొదటి ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి చెరుకు ముత్యంరెడ్డి గెలుపొందారు. 2014 తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తొలి ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి సోలిపేట రామలింగారెడ్డి ఘనవిజయం సాధించారు. 2018లో నాలుగోసారి బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా సోలిపేట 66వేల పై చిలుకు ఓట్లతో రాష్ట్రంలోనే 7వ రికార్డు మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత 2020 ఆగస్టులో రామలింగారెడ్డి అనారోగ్యంతో మరణించారు. అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ నుంచి మాధవనేని రఘునందన్‌రావు వెయ్యికి పై చిలుకు ఓట్లతో రామలింగారెడ్డి సతీమణి సోలిపేట సుజాతపై గెలుపొందారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి నియోజకవర్గంలో ఇప్పటి వరకు 16 పర్యాయాలు శాసనసభ ఎన్నికలు జరిగాయి. అందులో 5 సార్లు కాంగ్రెస్, 4 సార్లు టీడీపీ, 4 పర్యాయాలు బీఆర్ఎస్, ఒకసారి బీజేపీ విజయం సాధించడం విశేషం. కమ్యూనిస్టు, పీడీఎఫ్, ఇండిపెండెంట్లు ఒక్కోసారి గెలుపొందారు. కీలక పదవులు.. నియోజకవర్గం నుంచి ఎన్నికై న ఎమ్మెల్యేలు రాష్ట్ర కేబినేట్లో ఎన్నో కీలకమైన పదవులు చేపట్టారు.1978లో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐరేని లింగయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ పదవిని అలంకరించారు. 1994లో టీడీపీ నుంచి రెండోసారి గెలుపొందిన చెరుకు ముత్యంరెడ్డి రాష్ట్ర శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్‌గా, 1999లో టీడీపీ నుంచి హ్యాట్రిక్ విజయం సాధించిన చెరుకు ముత్యంరెడ్డి రాష్ట్ర పౌరసరఫరాల శాఖమంత్రిగా పనిచేశారు. 2009లో కాంగ్రెస్ నుంచి గెలుపొందిన చెరుకు ముత్యంరెడ్డి టీటీడీ బోర్డు మెంబర్‌గా పనిచేశారు. 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన సోలిపేట రామలింగారెడ్డి రాష్ట్రశాసన సభ అంచనాల కమిటీ చైర్మన్‌గా ఉన్నతమైన పదవులు చేపట్టారు. చదవండి: శ్రీమిస్ క్వీన్ ఆఫ్ ది వరల్డ్ ఇండియా–2023 'రన్నరప్' గా నిర్మల్ యువతి -
TS Election 2023: మూడు ముక్కలాట! టికెట్ కోసం త్రిముఖ పోటీ..
సంగారెడ్డి: దుబ్బాక నియోజకవర్గం మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో గ్రూపు విభేదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. పాతతరం మారినా గ్రూపుల లొల్లి మారడంలేదు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ ఉన్నప్పటికీ గ్రూపు రాజకీయాల వల్ల ప్రతిసారి పరాభవం ఎదుర్కొంటుందని పలువురు నేతలు అంటున్నారు. మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి తనయుడు శ్రీనివాస్‌రెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ పన్యాల శ్రావణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధికార ప్రతినిధి కత్తి కార్తీక గ్రూపుల మధ్యన పచ్చి గడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో విభేదాలు చోటుచేసుకుంటున్నాయి. అధిష్టానానికి తలనొప్పిగా.. ఈ నేపథ్యంలో దుబ్బాక టికెట్ కేటాయింపు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా తయారైంది. అయితే ప్రజల్లో ఏ నాయకుడికి ఆదరణ ఉందన్న దానిపై అధిష్టానం ఇప్పటికే సర్వే చేయించిందని, ఆ సర్వే ఆధారంగానే టికెట్ కేటాయించాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. కానీ ఆ ముగ్గురు నేతలూ మాత్రం తమకే టికెట్ వస్తుందని తమ అనుచరులతో సమావేశాలు నిర్వహిస్తూ గ్రామాల్లో హడావుడి చేస్తున్నారు. 2020లో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో చెరుకు శ్రీనివాస్‌రెడ్డికి టికెట్ కేటాయించగా.. పోటీ మాత్రం బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు, బీఆర్ఎస్ సోలిపేట సుజాత మధ్యనే నడిచి చివరకు వెయ్యికి పైగా ఓట్లతో బీజేపీ గెలుపొందడం తెలిసిందే. చెరుకు శ్రీనివాస్‌రెడ్డి ప్రచారం.. పరిస్థితి అలా ఉంటే చెరుకు శ్రీనివాస్‌రెడ్డి మరో అడుగు ముందుకేసి 106 రోజులుగా నియోజకవర్గంలో ఆత్మగౌరవ యాత్ర చేపడుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పర్యటిస్తున్నారు. ఇటీవల నాలుగైదు రోజుల నుంచి ఏకంగా ప్రచారం మొదలుపెట్టారు. చేతి గుర్తుకు ఓటు వేయాలని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెబుతున్నారు. ఈ ప్రచారం చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా దుబ్బాక కాంగ్రెస్ టికెట్ ముగ్గురిలో ఎవరిని వరిస్తుందో అన్నది రెండు మూడు రోజుల్లో తేలిపోనుంది. టికెట్ కోసం త్రిముఖ పోటీ.. దుబ్బాక కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం చెరుకు శ్రీనివాస్‌రెడ్డి, శ్రావణ్‌కుమార్‌రెడ్డి, కత్తి కార్తీకతో పాటు పీసీసీ సీనియర్ నాయకుడు మద్దుల సోమేశ్వర్‌రెడ్డి తనయుడు గాల్‌రెడ్డి దరఖాస్తులు చేసుకున్నారు. శ్రీనివాస్‌రెడ్డి, శ్రావణ్, కార్తీక కొన్ని నెలలుగా తమకే టికెట్ వస్తుందంటూ ఎవరికి వారు తమ అనుచరులతో గ్రామాల్లో పర్యటిస్తూ ధీమాగా ఉన్నారు. పోటాపోటీగా కార్యక్రమాలు చేపడుతున్నారు. దీంతో క్యాడర్లో అయోమయం నెలకొంది. ముగ్గురిలో ఎవరికి టికెట్ వచ్చినా మిగతా ఇద్దరు సహకరిస్తారా అన్నది పెద్ద ప్రశ్నగా మిగిలింది. -
ఢిల్లీ లీడర్స్ రాకతో.. కేడర్‌లో జోష్
కె.రాహుల్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనసంఘ్ (బీజేపీగా ఏర్పడడానికి ముందు) తరఫున ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గెలుస్తూ వచ్చారు. 1982కు ముందు కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనా తీరు, రాజకీయాలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్న సందర్భంలో బీజేపీ సొంతంగా రాష్ట్రంలో ఓ రాజకీయశక్తిగా ఎదిగేందుకు సానుకూల పరిస్థితులున్నట్టు పార్టీ నేతలు అంచనా వేశారు. అయితే టీడీపీ ఆవిర్భావం, ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించడం వంటి పరిణామాలు, టీడీపీతో పొత్తు, 1995లో ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేసి చంద్రబాబు సీఎం అయ్యాక, ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లో వచ్చిన మార్పుచేర్పులు, టీడీపీతో పొత్తుల కొనసాగింపు వంటివి రాష్ట్రంలో బీజేపీకి నష్టం చేశాయని చెప్పొచ్చు. తర్వాత 1998 లోక్‌సభ మధ్యంతర ఎన్నికల్లో ఉమ్మడి ఏపీలో బీజేపీ ఒంటరిగా పోటీచేసి 4 ఎంపీ సీట్లు గెలుపొంది సత్తా చాటింది. అయితే ఆ వెంటనే 1999లో జరిగిన లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు కుదుర్చుకోక తప్పలేదు. ఆ పరిస్థితి తెలంగాణ ఏర్పడేదాకా కొనసాగడం రాజకీయంగా బీజేపీకి తీరని నష్టం చేసిందని ఆ పార్టీ అగ్రనేతలే చెబుతుండడం గమనార్హం. 12 సీట్ల నుంచి ఒక్క సీటుకు.. ఉమ్మడి ఏపీలో..1999లో జరిగిన సాధారణ ఎన్నికల్లో టీడీపీతో పొత్తుతో పోటీచేసి బీజేపీ 12 అసెంబ్లీ స్థానాలు గెలిచింది. ఉమ్మడి ఏపీ, ఆ తర్వాత తెలంగాణలో అవే కమలదళం గెలిచిన అత్యధిక సీట్లు. అయితే తెలంగాణ ఏర్పడ్డాక 2014లో తొలిసారి ఐదు సీట్లు సాధించినా, 2018లో రెండోసారి జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు లేకుండా సొంతంగా పోటీ చేసినప్పుడు కేవలం 8 శాతం ఓట్లతో ఒక్క స్థానానికే పరిమితమైంది. కానీ అనూహ్యంగా 2019 ఏప్రిల్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగానే 4 సీట్లు గెలుచుకోవడంతో పాటు ఓటింగ్ శాతాన్ని ఒక్కసారిగా 20 శాతానికి పెంచుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్తో నువ్వా నేనా అన్నట్టుగా జరిగిన పోటీలో విజయం సాధించడం, ఈ రెండు ఉప ఎన్నికల మధ్య జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏకంగా 48 సీట్లు (దీనికి ముందు 4 సీట్లే) గెలుపొందడంతో ఒక్కసారిగా బీజేపీపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ పరిస్థితుల్లో జరిగిన మునుగోడు ఉపఎన్నికలో రాజగోపాల్‌రెడ్డి విజయం సాధించడం ఖాయమని పార్టీ వర్గాలు అంచనా వేసినా, 12 వేల ఓట్ల తేడాతో బీఆర్ఎస్చేతిలో ఆయన ఓటమి చవిచూశారు. అయితే అంతకు ముందు అంటే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి పడిన 13 వేల ఓట్లు 90 వేల ఓట్లకు పెరగడం బీజేపీకి కొంత ఊరటనిచ్చింది. ఈ విధంగా ఈ అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మూడో స్థానానికే పరిమితం చేయడం విశేషం. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన కుందూరు జానారెడ్డి రెండో స్థానంలో నిలిచారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ముచ్చటగా మూడోసారి జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భవితవ్యం ఎలా ఉంటుందో చూడాలి. మూడు వేర్వేరు గుర్తులపై జంగారెడ్డి విజయదుందుభి 1967లో భారతీయ జన సంఘ్ (బీజేఎస్) దీపం గుర్తుపై ఉమ్మడి ఏపీలో మూడుసీట్లు గెలవగా అందులో ఒక స్థానంలో తెలంగాణ నుంచి చందుపట్ల జంగారెడ్డి గెలు పొందారు. ఎమర్జెన్సీ తర్వాత ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో జాతీయ స్థాయిలో ఇందిరతో విభేదించి బయటకు వచ్చిన లోక్‌నాయక్ జయప్రకాష్ నారాయణ్ నేతృత్వంలో బీజేఎస్, ఇతర పార్టీలు కలిపి జనతా పార్టీ ఏర్పడింది. 1978లో ఉమ్మడి ఏపీలో జనతా పార్టీ నాగలిపట్టిన రైతు గుర్తుపై 60 మంది గెలుపొందగా, వారి లో తెలంగాణ నుంచి జంగారెడ్డి ఉన్నారు. ఇక 1980లో బీజేపీ ఏర్పడ్డాక ఇందిరాహత్యానంతరం జరిగిన 1984 లోక్‌సభ మధ్యంతర ఎన్నికల్లో దేశవ్యాప్తంగా వీచిన కాంగ్రెస్ ప్రభంజనాన్ని తట్టుకుని ఏపీలో టీడీపీ 30 సీట్లు గెలిచింది. ఆ ఎన్నికల్లో జాతీయ స్థాయిలో బీజేపీ రెండే రెండు సీట్లు గెలవగా అందులో ఒకటి హన్మకొండ. ఇక్కడ కమలం గుర్తుపై పోటీ చేసిన జంగారెడ్డి నాటి కేంద్రమంత్రి పీవీ నరసింహారావును ఓడించి చరిత్ర సృష్టించారు. బండి సంజయ్ మార్పుతో.. రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ ఏడాది మార్చిలో మూడేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న బండి సంజయ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ముగిసే దాకా పదవిలో కొనసాగుతారని అంతా భావించారు. కానీ కొన్నాళ్లకే సంజయ్‌ను మారుస్తున్నారంటూ ప్రచారం మొదలై రెండు, మూడు నెలలు కొనసాగింది. ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ కేంద్రమంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డిని నాలుగోసారి (ఉమ్మడి ఏపీలో రెండు సార్లు, ఈ విడత కలుసుకుని తెలంగాణలో రెండోసారి) రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీ నియమించింది. దీంతో కేడర్‌లో స్తబ్దత, కొంత అయోమయ వాతావరణం ఏర్పడింది. మోదీ సభలతో నయా జోష్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడే లోగానే ప్రధాని మోదీ ఈ నెల 1న మహబూబ్‌నగర్, 3న నిజామాబాద్‌లలో జరిపిన పర్యటన పార్టీలో కొత్త ఉత్సాం నింపిందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ల వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు తొమ్మిదేళ్లలో బీజేపీ చేసిన అభివృద్ధిని ప్రధాని వివరించడం ప్రజల్లో సానుకూలత పెరగడానికి దోహదపడిందని అంటు న్నారు. ఇక షెడ్యూల్ వెలువడిన మరుసటి రోజే బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆదిలాబాద్‌లో జనగర్జన సభ నిర్వహించారు. ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడాల్సి ఉండగా, ఎన్నికల ప్రచార గడువు ముగిసే నాటికి పది ఉమ్మడి జిల్లాల పరిధిలో మూడేసి చొప్పున మోదీ, అమిత్‌షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాల బహిరంగ సభలు నిర్వహించే అవకాశాలున్నాయి. ఈ సభల విజయవంతం, వీటిలో ప్రస్తావించే అంశాలు, ఇచ్చే హామీలు పార్టీకి మరింత మేలు చేస్తాయని బీజేపీ నేతలు ఆశిస్తున్నారు. బీజేపీ విజయం ఇలా.. 1980లో పార్టీ ఏర్పడ్డాక ఉమ్మడి ఏపీలో, ఆ తర్వాత తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన ఎమ్మెల్యే సీట్ల వివరాలు ఇలా ఉన్నాయి. 2018లో కేవలం ఒకేఒక్క సీటు టి.రాజాసింగ్ గెలుపొందగా..అంతకుముందు వరుసగా మూడుసార్లు గెలిచిన జి.కిషన్‌రెడ్డి ఈ ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. ఆ తర్వాత జరిగిన రెండు ఉప ఎన్నికల్లో దుబ్బాక నుంచి ఎం.రఘునందన్‌రావు, హుజూరాబాద్ నుంచి ఈటల రాజేందర్ గెలుపొందారు. 1983 నుంచి వరుసగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బలం పెరుగుతూ... తగ్గుతూ వచ్చింది. -
TS Election 2023: ఎన్నికలు సమీపిస్తుండగా.. డివిజన్ల పోరు!
మెదక్: సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్‌లను రెవెన్యూ డివిజన్లు చేసి దుబ్బాకను డివిజన్ చేయకపోవడంతో సాధన సమితి నాయకులు పోరుబాట పట్టారు. రెవెన్యూ డివిజన్‌కు అన్ని విధాలుగా అర్హత ఉన్నప్పటికీ ఏర్పాటు చేయకపోవడంతో 2016లో దుబ్బాక పట్టణంలో 45 రోజుల పాటు ఉద్యమం తీవ్రంగా జరిగింది. జిల్లాల పునర్విభజన సమయంలో దుబ్బాక డివిజన్ ఆలోచన ఉన్నప్పటికీ చివరి నిమిషంలో కరీంనగర్ జిల్లాలో ఉన్న హుస్నాబాద్, కోహెడ మండలాలను సిద్దిపేట జిల్లా లో కలిపి హుస్నాబాద్‌ను రెవెన్యూ డివిజన్ చేశారు. 6 మండలాలతో దుబ్బాక డివిజన్.. దుబ్బాక నియోజకవర్గంలో ప్రస్తుతం 8 మండలాలు ఉన్నాయి. దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట, దౌల్తాబాద్, రాయపోల్, భూంపల్లి–అక్బర్పేట మండలాలు సిద్దిపేట జిల్లా పరిధిలో, అలాగే.. చేగుంట, నార్సింగ్ మండలాలు మెదక్ జిల్లా పరిధిలో ఉన్నాయి. నియోజకవర్గంలోని దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట, భూంపల్లి అక్బర్పేట మండలాలు సిద్దిపేట రెవెన్యూ డివిజన్లో, దౌల్తాబాద్, రాయపోల్ మండలం గజ్వేల్ డివిజన్లో చేగుంట, నార్సింగ్ మండలాలు తూప్రాన్ డివిజన్లో ఉన్నాయి. దీంతో నియోజకవర్గంలోని మండలాలు రెండు జిల్లాల్లో మూడు డివిజన్లలో ఉండటంతో ప్రజలకు ఇబ్బందిగా మారింది. మిరుదొడ్డి, తొగుట, దౌల్తాబాద్, రాయపోల్ మండలాలతో పాటు కొత్తగా ఏర్పాటు చేసిన అక్బర్పేట–భూంపల్లి మండలాలను కలిపి ఆరు మండలాలతో దుబ్బాక రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని , అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందనే ఆలోచనతో ఉద్యమానాకి కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఈ అంశం సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లేందుకు డివిజన్ సాధన సమితి నాయకులు యత్నిస్తున్నారు. -
బీజేపీలోనే ఉంటా.. పోటీ చేసేది అక్కడి నుంచే: రఘునందన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో కొందరు నేతలు పార్టీలు మారుతున్నారు. ఇక, మరికొందరు నేతలు పార్టీ మారుతున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా పార్టీ మారుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో, రఘునందన్ ఈ వార్తలపై స్పందించారు. పార్టీ మార్పు వార్తపై తాజాగా రఘునందన్ ఘాటు విమర్శలు చేశారు. తాజాగా రఘునందన్ మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు. తాను పార్టీ మారడం లేదని.. వచ్చే ఎన్నికల్లో దుబ్బాకలో బీజేపీ నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ గత పదేళ్లలో గజ్వేల్‌లో ఏం అభివృద్ధి చేశారో చూద్దామని పిలుపునిస్తే ముందురోజే తమను అరెస్ట్ చేసి బిచ్కుంద పోలీసు స్టేషన్ తీసుకెళ్లారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అక్కడ ఎలాంటి కేసు నమోదు చేయలేదన్నారు. కామారెడ్డి నుంచి బస్సులు పెట్టుకుని గజ్వేల్ వస్తే భయం ఎందుకని ప్రశ్నించారు. ఇక, ఏదోఒక రోజు సమయం చూసుకుని, డేట్ చెప్పకుండా గజ్వేల్‌కు వస్తానని ఆసక్తికర కామెంట్స్ చేశారు. గజ్వేల్ బస్ స్టాండ్ ఎలావుందో.. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎలా ఉన్నాయో చూస్తామన్నారు. ఎప్పుడూ బీఆర్ఎస్ మాత్రమే అధికారంలో ఉండదు. ఈ విషయంలో పోలీసులు జాగ్రత్తగా ఉండాలని హాట్ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: రేవంత్ Vs కవిత.. మాటల వార్తో దద్దరిల్లిన ట్విట్టర్ -
అప్పుడు తల్లి.. ఇప్పుడు తండ్రి.. చివరికి అనాథలైన పిల్లలు!
సంగారెడ్డి: తల్లిదండ్రుల మృతితో ఆ పిల్లలను రోడ్డున పడేశాయి. అనారోగ్యంతో రెండేళ్ల కిందట తల్లి చనిపోగా.. అదే అనారోగ్యం తండ్రినీ పొట్టనపెట్టుకుంది. దీంతో ముగ్గురు చిన్నారుల పరిిస్థితి అగమ్యగోచరంగా మారింది. వివరాలిలా ఉన్నాయి. దౌల్తాబాద్ మండలం ఇందుప్రియాలకు చెందిన దొడ్డి యాదగిరి (42), రేణుక (35)లకు ముగ్గురు ఆడపిల్లలు. 2021లో రేణుక అనారోగ్యంతో మృతిచెందింది. అప్పటి నుంచి పిల్లల బాగోగులు తండ్రి చూసుకునేవాడు. అంతలోనే యాదగిరి తల్లి బాల ఎల్లవ్వ కూడా మృతిచెందింది. కాగా కొద్దిరోజులుగా యాదగిరి కూడా మంచం పట్టాడు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 18న మృతిచెందాడు. శనివారం గ్రామంలో అంత్యక్రియలు జరిగాయి. తల్లిదండ్రులతో పాటు నానమ్మ కూడా మృతిచెందడంతో చిన్నారులు అనాథలయ్యారు. శిరీష 8వ తరగతి, శ్రావణి నాలుగు, రిషిక రెండో తరగతి చదువుతున్నారు. పిల్లల రోదనలు గ్రామస్తులను కంటతడి పెట్టించాయి. ఎవరూ లేని ఈ పిల్లలను ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. దాతలు సాయం అందించాలనుకుంటే 9550940672లో సంప్రదించాలని తెలిపారు. -
దుబ్బాక: ఓటర్ల తీర్పెటు? బీఆర్ఎస్లో హైటెన్షన్
దుబ్బాక నియోజకవర్గంలో నాల్గవసారి సోలిపేట రామలింగారెడ్డి విజయం సాదించినప్పటికి ఆయన అనారోగ్యంతో 2020లో కన్నుముశారు. ఆ కారణంగా జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి రఘునందన్‌రావు టీఆర్ఎస్ అభ్యర్ధి, దివంగతుడు అయిన రామలింగారెడ్డి సతీమణి సుజాతను కేవలం 1,079 ఓట్ల తేడాతో ఓడించి సంచలన విజయం అందుకున్నారు. ఎమ్. రఘునందన్‌రావుకు 63352 ఓట్లు రాగా, సుజాతకు 62273 ఓట్లు వచ్చాయి. దుబ్బాక నియోజకవర్గం నుండి పోటీలో ఉండొచ్చు అని భావిస్తున్న అభ్యర్థులు: బీజేపీ పార్టీ: మాధవనేని రఘునందన్ రావు (ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే) బీఆర్ఎస్ పార్టీ కొత్త ప్రభాకర్ రెడ్డి (ప్రస్తుత మెదక్ ఎంపీ) కాంగ్రెస్ పార్టీ: చెరుకు శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి ముత్యం రెడ్డి కుమారుడు కత్తి కార్తీక డాక్టర్ శ్రావణ్ కుమార్ రెడ్డి ఎన్నికలలో ప్రభావితం చేసే అంశాలు: దుబ్బాక నియోజకవర్గం లో మహిళా ఓటర్ల సంఖ్య పురుష ఓటర్ల సంఖ్య కంటే ఎక్కువగా ఉంది. కావున వచ్చే ఎన్నికల్లో మహిళ ఓట్లే కీలకం కానున్నాయి.. నిత్యవసర వస్తువుల ధరలు, సిలిండర్ ధరలు, బస్సు చార్జీలు, కరెంటు బిల్లులు విపరీతంగా పెరగడంతో ఇల్లు గడపడం కుటుంబ ఖర్చులు కొనసాగించడం కష్టంగా ఉందని మహిళలు భావిస్తున్నారు. మహిళలకు డ్వాక్రా రుణాలు, అర్హులందరికీ రెండు పడకల గదుల ఇల్లు నిర్మించి ఇవ్వాలని ఆశిస్తున్నారు. ప్రభుత్వం ఇవ్వదలచిన మూడు లక్షలు ఇల్లు నిర్మాణానికి సరిపోవని మహిళలు భావిస్తున్నారు. నూతన మండలాలైన భూంపల్లి,రాయపొల్ మండలాల్లో ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించాలని, మెరుగైన రోడ్డు రవాణా సౌకర్యాలు కల్పించాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. ఆయా వర్గాలకు కులస్తులకు ఇస్తున్న ఆర్థిక సహాయం పథకాలు అన్ని వర్గాలకు వర్తింపజేయాలని అన్ని కులస్తులకు వర్తింపజేయాలని కోరుతున్నారు. విద్యాలయాలు, ఆసుపత్రులు నూతన భవనాలు నిర్మించి వాటిలో సిబ్బందిని పెంచాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు సామాన్యులకు విద్యా వైద్యం అందాలని కోరుతున్నారు. ధరణి లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని లేదా నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాల కల్పన చేయాలని ఈ ప్రాంత నిరుద్యోగులు కోరుతున్నారు. దుబ్బాక నియోజకవర్గం లోని ఆయా మండల కేంద్రాల్లో డిగ్రీ కళాశాలలు నెలకొల్పాలని ఈ ప్రాంత ప్రజలు ఆశిస్తున్నారు -
తీవ్ర విషాదం.. మైనర్ ప్రేమజంట ఆత్మహత్య
సాక్షి, సిద్దిపేట: జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని లచ్చపేటలో మైనర్ ప్రేమజంట ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. లచ్చపేటకు చెందిన కూరపాటి భగీరథ(17), అదే గ్రామానికి చెందిన తోట్ల నేహా(16) దుబ్బాకలో ఇంటర్మీడియట్ చదువుకుంటున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఒకరినొకరు ఇష్టపడుతూ ప్రేమాయణం కొనసాగించారు. ఇంట్లో వారికి తెలిస్తే విడదీస్తారనే భయంతో భగీరథ ఇంట్లోనే గత రాత్రి ఎవరూ లేని సమయంలో ఇద్దరు చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. చదవండి: ‘బతకాలని ఉన్నవారు వెళ్లిపోండి.. ఇక నుంచి ఇలాంటివే జరుగుతాయి’ అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలు ఉరి వేసుకుని విగత జీవులుగా మారడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. క్షణికావేశంలో మైనర్ ప్రేమికులు తీసుకున్న నిర్ణయం రెండు కుటుంబాలలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన దుబ్బాక పోలీసులు.. మృత దేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
మంత్రి కేటీఆర్‌కు ఎమ్మెల్యే రఘునందన్ సవాల్
హైదరాబాద్: మంత్రి కేటీఆర్‌కు ఎమ్మెల్చే రఘునందనరావు సవాల్ విసిరారు. తాను సూచించిన రెండు పథకాల్ని దుబ్బాక నియోజకవర్గంలో అమలు చేస్తే తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ఛాలెంజ్ చేశారు రఘునందన్.దుబ్బాక నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు దళితబంధు ఇవ్వడంతో పాటు సొంత స్థలంలో ఇళ్లు కట్టుకునే వారికి రూ. 7.5 లక్షలు ఇవ్వాలని రఘునందన్ డిమాండ్ చేశారు. ఈ రెండు పథకాల్ని అమలు చేస్తే తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని మంత్రి కేటీఆర్‌కు ఓపెన్ చాలెంజ్ చేశారు రఘునందన్. కాగా, 2020 ఆఖరులో జరిగిన ఉప ఎన్నికతో దుబ్బాక నియోజకవర్గం పేరు రాష్ట్రం అంతా తెలిసింది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఈ నియోజకవర్గం ఒకప్పుడు టీఆర్ఎస్ కంచుకోటగా ఉండేది. కాని ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రఘునందనరావు విజయంతో పెద్ద సంచలనమే కలిగింది. అప్పటి వరకు కారు స్పీడ్‌కు ఎక్కడా బ్రేకులు పడలేదు. ప్రతి ఉప ఎన్నికలోనూ గెలిచింది. కాని దుబ్బాకలో సిట్టింగ్ సీటును గులాబీ పార్టీ కమలం పార్టీకి వదిలేసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఊపు తెచ్చింది మాత్రం కచ్చితంగా దుబ్బాక ఎమ్మెల్యే సీటు అనే చెప్పాలి. -
Monkey Food Court: కోతుల కోసం మూడు ఎకరాల్లో పండ్ల మొక్కలు
సాక్షి, దుబ్బాక(సిద్ధిపేట): కోతుల బెడదతతో ప్రజలు నానా అవస్థలుపడుతున్నారు. అడవుల్లో ఉండాల్సిన కోతులు గుంపులు గుంపులుగా గ్రామాలకు చేరాయి. అక్కడ వాటికి సరిపడా ఆహారం లేకపోవడంతో గ్రామాలు, పట్టణాలకు వస్తున్నాయి. ఏకంగా ఇళ్లలోకి చోరబడి తినుబండారాలను ఎత్తుకెళ్లుతున్నాయి. ఇండ్ల పైకప్పులను ధ్వంసం చేస్తున్నాయి. రైతులు పండించి కూరగాయలను, ఇతర ఆహార పంటలను నాశనం చేస్తున్నాయి. దీంతో రైతులు తీవ్రస్థాయిలో నష్ట పోతున్నారు. కోతుల బెడద నుంచి పంటలను రక్షించుకోవడానికి వాయిస్ అలారం ఏర్పాటు చేశారు. కొంత మంది రైతులు డప్పు చప్పుడు, టపాసులు కాల్చుతున్నారు. కోతులను బెదర కొట్టేందుకు కొన్ని గ్రామాల రైతులు ఇతర జిల్లాల నుంచి రూ.30 వేలు ఖర్చు పెట్టి కొండెంగలను కొనుగోలు చేసి తిప్పుతున్నారు. వాటి సంరక్షులకు ప్రతీ నెల జీతం ఇస్తున్నారు. పద్మనాభునిపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం కోతుల బెడదను తప్పించడానికి అవి ఊర్లలోకి రాకుండా, పంట పొలాలను నష్టం చేయకుండా దుబ్బాక మండలం పద్మనాభునిపల్లి గ్రామంలోని గ్రామ శివారులో ప్రత్యేకించి ‘మంకీ ఫుడ్‌కోర్టు’ ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో మూడు ఎకరాలను చదును చేసి అందులో పలు రకాల పండ్ల మొక్కలు నాటారు. అవి నాటి మూడు సంవత్సరాలైంది. మామిడి, జామ, దానిమ్మ, సపోట, సీతాఫలం, రేగుపండ్లు, బొప్పాయి, సంత్ర, అరటి, బత్తాయి, అల్లనేరేడు, వెలగ పండ్లు, ఖర్బూజ, దోస పండ్ల మొక్కలను పెంచుతున్నారు. రాజక్కపేటలో కొండెంగలను తిప్పుతున్న గ్రామస్తులు -
పంచుడు బీఆర్ఎస్ వంతు.. పెంచుడు బీజేపీ వంతు: మంత్రి హరీష్ రావు
సాక్షి, సిద్ధిపేట: దుబ్బాకలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే లేకపోయినా నియోజకవర్గ ప్రజలపై కేసీఆర్‌కు ఎంతో ప్రేమ ఉందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే బీజేపీ వ్యక్తి అయినా.. ప్రజలు మాత్రం తెలంగాణ వారు అని తెలిపారు. దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా దుబ్బాకలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. దుబ్బాక పట్టణంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారంలో మంత్రి హరీష్ రావు పాల్గొని ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ.. దుబ్బాక బస్టాండ్ చూస్తుంటే కడుపు నిండిందన్నారు. ఇక్కడ బస్టాండ్, తిరుపతి బస్సు కోసం ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కష్టడ్డారని గుర్తు చేశారు. అయితే కొబ్బరికాయ కొట్టేందుకు వచ్చింది ఇంకోకరు అని విమర్శించారు. బీజేపీ, ఎమ్మెల్యేలను కొనే కుట్ర చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సైనికులను, గోవులను రాజకీయాలకు వాడుకుని మలినం చేసే చరిత్ర బీజేపీదంటూ ధ్వజమెత్తారు. ఓట్ల కోసం బీజేపీ వాళ్లు ఏదైనా చేస్తారని మండిపడ్డారు. బీజేపీ చేరికల కమిటీ పార్టీలు చీల్చే కమిటీగా మారిందన్నారు. పక్క పార్టీలను బెదిరించి గుంజుకునే పార్టీ బీజేపీ అని దుయ్యబట్టారు. 400 ఉన్న సిలిండర్‌ను 1200కు పెంచారన్నారు. పెంచిన సిలిండర్ ధర ఎప్పుడు తగ్గిస్తారని ప్రశ్నించారు. పంచుడు బీఆర్ఎస్ వంతు అయితే.. పెంచుడు బీజేపీ వంతు అని అన్నారు. దేశంలో బీజేపీ వాళ్లు బీడీ కార్మికులకు పెన్షన్ ఇచ్చారా అని మంత్రి ప్రశ్నించారు. 30 సీట్లు రావని బీజేపీ నేత సంతోష్ చెప్పకనే చెప్పారు.. అంటే వాళ్లు తెలంగాణలో అధికారంలోకి రారని విమర్శించారు. ఉన్న ఉద్యోగాలను తీసేసి, ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు చేయడం తప్ప బీజేపీ చేసిందేమీ లేదన్నారు. జన్ ధన్ యోజన ద్వారా డబ్బులు ఇస్తామని ఇంతవరకు ఒక్క రూపాయి వేయలేదన్నారు. మాయమాటలు చెప్పితే మోసపోవడం ఇక కుదరదన్నారు. చదవండి: అయ్యప్పస్వామిపై భైరి నరేష్ వివాదాస్పద వ్యాఖ్యలు.. పరిగెత్తించి కొట్టిన స్వాములు -
దుబ్బాకలో ఉద్రిక్తతకు దారితీసిన బస్టాండ్ ప్రారంభం
-
దుబ్బాకలో టెన్షన్ వాతావరణం
-
దుబ్బాకలో ఉద్రిక్తత.. బస్టాండ్ ప్రారంభోత్సవంపై రగడ..
సాక్షి, సిద్దిపేట: దుబ్బాక మండలం హబ్సిపూర్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గోడౌన్ ప్రారంభోవోత్సవలో బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు పోటాపోటీ నినాదాలు చేసుకున్నారు. దీంతో పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. రెండు పార్టీల కార్యకర్తలకు మంత్రి హరీష్ రావు సర్దిచెప్పారు. బస్టాండ్ వేదికగా దుబ్బాకలో రాజకీయాలు వేడేక్కాయి. ఉప ఎన్నిక సమయంలో కొత్త బస్టాండ్ నిర్మిస్తామని బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు అప్పట్లో హామీ ఇచ్చాయి. అనుకున్నట్లుగానే సకల హంగులతో రూ. 4కోట్ల వ్యయంతో ఏడాదిన్నర కాలంలోపే నిర్మాణం పూర్తి చేశారు. దుబ్బాక బస్టాండ్‌ను మంత్రి హరీష్ రావు శుక్రవారం ప్రారంభించారు. ఈ క్రమంలో బస్టాండ్ క్రెడిన్‌ను తమ ఖాతాలో వేసుకునేందుకు ఇరు పార్టీలు యత్నిస్తున్నాయి. ఉప ఎన్నికలో ఇచ్చిన హామీని నెరవేర్చామని బీఆర్ఎస్ నేతలు చెబుతుంటే.. తాను అసెంబ్లీలో ప్రస్తావించడం వల్లే బస్టాండ్ పూర్తైందని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలిపారు. దుబ్బాక బస్టాండ్ ప్రారంభోత్సవంపై రగడ నెలకొంది. ఎమ్మెల్యే రఘునందన్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సవాళ్లతో పొలిటికల్ హీట్ రాజుకుంది. బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు పోటాపోటీగా ర్యాలీకి సిద్దమయ్యారు. ఈ నేపథ్యంలో నూతన బస్టాండ్ వద్ద పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బస్టాండ్‌లోకి బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలకు ప్రవేశం నిషేధించారు. బస్టాండ్ ప్రాంగణంలోకి ఎవ్వరిని అనుమతించలేదు. సిద్ధిపేట సీపీ శ్వేతా దుబ్బాక పరిస్థితిని సమీక్షిస్తున్నారు. బస్టాండ్ చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. కార్పొరేటర్లకు డ్రెస్‌కోడ్ పెట్టారు పోలీసులు. చదవండి: Hyderabad: నిప్పంటించుకుని ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య చదవండి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న రాష్ట్రపతి -
కొత్త ప్రభాకర్ రెడ్డి, రఘునందన్ రావు మధ్య సవాళ్ల పర్వం
-
‘అవసరమైతే ఒక కౌన్సిలర్‌తో రాజీనామా చేయిస్తా.. గెలిచి చూపించు’
మెదక్: దుబ్బాక ఎమ్మెల్యే రఘునందరన్రావుకు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఒక చాలెంజ్ విసిరారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న రఘునందన్‌రావును కౌన్సిలర్‌గా గెలిచి చూపించాలంటూ సవాల్ చేశారు. దమ్ము, ధైర్యం ఉంటే రఘునందన్ సిద్ధిపేటలో రఘునందన్ కౌన్సిలర్‌గా గెలవాలన్నారు. రఘునందన్ కౌన్సిలర్‌గా పోటీకి దిగుతానంటే ఒక కౌన్సిలర్‌తో రాజీనామా చేయిస్తానని, సత్తా ఏంటో చూపించాలన్నారు కొత్త ప్రభాకర్‌రెడ్డి ఈ క్రమంలోనే బీజేపీపై కొత్త ప్రభాకర్‌రెడ్డి మండిపడ్డారు. తప్పుడు ప్రచారం చేయడం బీజేపీకి అలవాటుగా మారిపోయిందని ధ్వజమెత్తారు. నీ రాజీనామాను ఆమోదింప జేస్కో.. చూస్కుందాం ముందు మెదక్ ఎంపీకి రాజీనామా చేసి నీ సత్తా ఏంటో చూపించాలని ప్రతి సవాల్ చేశారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు. ‘నువ్వు రాజీనామా చేసి ఆమోదింప చేసుకుంటే అప్పుడు చూద్దాం మెదక్‌లో బీజేపీ గెలుస్తుందో.. బీఆర్ఎస్ గెలుస్తుందో’ అని ఘాటుగా కౌంటర్ ఇచ్చారు రఘునందన్‌రావు. -
అయ్యబాబోయ్ దుబ్బాకనా? ఆ పోస్టింగ్ మనకొద్దు.!
ఆ నియోజకవర్గంలో ప్రభుత్వాధికారుల పరిస్థితి దయనీయంగా తయారైంది. అక్కడ పనిచేయాలంటేనే జంకుతున్నారు అధికారులు. ఒకరు ఎంపీ, మరొకరు ఎమ్మెల్యే.. రాష్ట్రంలో అధికార పార్టీ ఎంపీ, కేంద్రంలో అధికార పార్టీ ఎమ్మెల్యే. ఇద్దరి మధ్యా నలిగిపోతున్నారు అధికారులు. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరు? రీడ్ దిస్ స్టోరీ.. పచ్చగడ్డి వేసినా భగ్గే సిద్ధిపేట జిల్లా దుబ్బాకలో కారు, కమలం పార్టీల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. రెండు పార్టీల మధ్య వైరం నానాటికి పెరుగుతోంది. టీఆర్ఎస్ ఎంపీ, బీజేపీ ఎమ్మెల్యే మాటల ఈటెలు విసురుకుంటున్నారు. నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యక్రమం ఏది జరిగినా ప్రోటోకాల్ పేరుతో రగడ సృష్టిస్తున్నారు. వీరిద్దరి వ్యవహారంతో ఏం చేయాలో తోచక అధికార యంత్రాంగం తల బాదుకుంటోంది. దుబ్బాక నియోజకవర్గానికే చెందిన టీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకరరెడ్డి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నారు. అందుకే నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినా హాజరవుతున్నారు. అలాగే అక్కడ ఉప ఎన్నికల్లో బీజేపీకి చెందిన రఘునందనరావు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. దీంతో ఇద్దరి మధ్యా తీవ్రస్థాయిలో వర్గ పోరు సాగుతోంది. ప్రోటోకాల్ వ్యవహారంతో ప్రారంభమై... పరస్పరం దిష్టి బొమ్మల దహనం వరకు నిరంతర ప్రక్రియగా మారింది. చదవండి: బీఆర్ఎస్గా మారిన టీఆర్ఎస్.. కేసీఆర్‌కు లేఖ పంపిన ఈసీ కార్యక్రమం ఏదైనా సీన్ సితారే నియోజకవర్గంలో జరుగుతున్న అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఎంపీ, ఎమ్మెల్యేలు.. దుబ్బాక అభివృద్ధి మా పార్టీయే చేసిందంటూ ఇద్దరూ ప్రజలకు చెప్పుకుంటున్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ, మోదీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఎంపీ కొత్త ప్రభాకరరెడ్డి మాట్లాడుతున్నారు. అదేవిధంగా మోదీ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ..కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఎమ్మెల్యే రఘునందనరావు ఉపన్యాసాలిస్తున్నారు. దీంతో ఇద్దరి మధ్యా మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా నియోజకవర్గంలోని అక్బర్ పేట, భూంపల్లి నూతన మండలాల కార్యాలయాలను ప్రారంభించడానికి వచ్చిన మంత్రి హరీష్ రావు సమక్షంలో సైతం టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు మంత్రి చూస్తుండగానే పరస్పరం తోపులాటకు దిగారు. ఈ ఘర్షణ చూస్తూ..ఎవరికి ఎలా సర్దిచెప్పాలో తోచక అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. ఇద్దరు ప్రజా ప్రతినిధుల మధ్య తరుచుగా జరుగుతున్న గొడవలు చూసి ప్రజలు కూడా చికాకు పడుతున్నారు. వీరిద్దరి వల్ల తమ నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకపడిపోతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
అభిమాని లేఖకు మంత్రి హరీశ్ రావు ఫిదా..
సాక్షి, సిద్దిపేట: హరీశ్‌రావు తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆరోగ్య బాధ్యతలు చూసే కీలక మంత్రిగా ఉన్నారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కృషిచేస్తున్నారు. ప్రజలను అప్రమత్తం చేస్తుంటారు. ప్లాస్టిక్ వాడకంతో భయంకరమైన కేన్సర్ బారినపడే ఆవకాశాలు ఉన్నాయని వారిని జాగృతం చేస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో మరో మార్గం లేక మంత్రి కూడా ప్లాస్టిక్ వాటర్ బాటిల్ దప్పిక తీర్చుకొనే అత్యవసర పరిస్థితి ఏర్పడుతోంది. దీనిని గుర్తించిన ఓ వీరాభిమాని అమాత్యుడు హరీశ్‌రావు ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలంటూ శుక్రవారం దుబ్బాక పర్యటనలో మంత్రికి లేఖ అందించారు. మీ ఆరోగ్యమే మాకు మహాభాగ్యం..మీరు తప్పని పరిస్థితుల్లో ప్లాస్టిక్ వాటర్ బాటిల్ వాడుతున్నారని, ఈ నీరు తాగడం వల్ల భయంకరమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నదన్నారు. ఇటీవల అంతర్జాతీయ ప్రముఖ రేడియాలజిస్టు డాక్టర్ విమల్ సోమేశ్వర్ ఇంటర్వ్యూలో చెప్పారని లేఖలో వివరించారు. దయచేసి ఇకపై కాపర్ వాటర్ బాటిల్ వినియోగించాలని మంత్రికి దుబ్బాక పరిధి మల్లాయపల్లికి చెందిన ఎంబీఏ విద్యార్థి కీసరి ప్రవీణ్ లేఖ అందించాడు. ప్రవీణ్ రాసినలేఖను చదివి తన ఆరోగ్యం పట్ల ఎంతో తపనతో రాశాడంటూ ఫిదా అయ్యాడు. ప్రవీణ్ కు మంత్రి ప్రత్యేకంగా ఫోన్ చేసి ధన్యవాదాలు తెలిపారు. సోషల్ మీడియాలో లేఖ హల్చల్ అవుతోంది. చదవండి: చివరిశ్వాస వరకూ ‘అమ్మవారి’తోనే.. -
పూజారిని మాటల్లో పెట్టి బండి కొట్టేసిన బుడ్డోడు
-
డబుల్ బెడ్రూం ఇళ్లకు గృహ ప్రవేశాలు చేయించిన రఘునందన్‌రావు
దుబ్బాక టౌన్: దుబ్బాకలో శుక్రవారం ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ల ప్రారంభోత్సవం జాప్యం అవుతుండటంతో స్థానిక బీజేపీ ఎమ్మెల్యే ఎం. రఘునందన్‌రావు స్వయంగా రంగంలోకి దిగి పలువురు లబ్ధిదారులతో శుక్రవారం గృహప్రవేశాలు చేయించారు. అయితే ఎమ్మెల్యే చర్యపై అధికార టీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. ఇంకా అర్హుల గుర్తింపు ప్రక్రియ పూర్తి కాకుండా... ఇళ్ల వద్ద పనులు పెండింగ్‌లో ఉండగానే ఎలా గృహప్రవేశాలు చేయిస్తారని సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. ఉదయమే వందలాది మందితో కలిసి... శుక్రవారం ఉదయాన్నే డబుల్ బెడ్రూం ఇళ్ల వద్దకు వందలాది మంది బీజేపీ నాయకులు, కార్యకర్తలతో చేరుకున్న ఎమ్మెల్యే రఘునందన్‌రావు కొంద రు లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు చేయించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ పేదలకు ఇళ్లు కేటాయించకుండా ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యేగా పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించడం, లబ్ధిదారులతో కలసి గృహప్రవేశాలు చేయించడం తప్పా అని ప్రశ్నించారు. ఏళ్లుగా ఎదురుచూస్తున్న పేదల సొంతింటి కలను సాకారం చేసినందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని రఘునందన్‌రావు చెప్పారు. తొలి విడతగా ఎంపిక చేసిన 180 మంది లబ్ధిదారులకు ఇళ్లను ఇస్తున్నట్లు చెప్పారు. లబ్ధిదారులంతా శనివారంలోగా గృహప్రవేశాలు చేసుకోవాలని సూచించారు. శనివారం కూడా కొందరు లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయిస్తానన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ల వద్ద పెండింగ్‌లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. భారీ పోలీసు బందోబస్తు.. డబుల్ బెడ్రూం ఇళ్ల వద్ద ఎటువంటి ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్ నాయకులు అక్కడికి వస్తే గొడవలు జరిగే ఆస్కారం ఉందని గ్రహించి పట్టణంలోని పలు ప్రధాన చౌరస్తాలలో భారీగా మోహరించారు. -
సౌదీలో దుబ్బాక వాసి మృతి.. మమ్మీ నాన్న రాడా అంటూ..
దుబ్బాకటౌన్ (మెదక్): సౌదీ అరేబియాలో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో దుబ్బాక మండలం రాజక్కపేటకు చెందిన మొగుల్ల మధు(35) అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మధు ఉన్నత విద్య పీజీ, బీఈడీ చదివాడు. ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినా రాకపోవడం.. ఉన్న ఊళ్లో సైతం ఎలాంటి ఉపాధి లేకపోవడంతో గత్యంతరం లేక పని కోసం 2009లో గల్ఫ్ బాట పట్టాడు. 13 ఏళ్లుగా అక్కడ డీసీఎం డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మూడు నెలల క్రితమే సౌదీ నుంచి సెలవులపై స్వదేశానికి వచ్చాడు. కుటుంబ సభ్యులతో సరదాగా గడిపి వారం క్రితం(జూన్ 1న) మళ్లీ సౌదీకి తిరిగి వెళ్లి నాలుగు రోజుల క్రితమే డ్యూటీలో చేరాడు. ఈ క్రమంలో బుధవారం ఉదయం 8 గంటలకు తాను నడుపుతున్న డీసీఎంను మరో వాహనం ఢీ కొట్టడంతో జరిగిన ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయాన్ని సౌదీలో ఉంటున్న ఆయన పెద్దన్న నర్సింలు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మధుకు భార్య లావణ్యతో పాటు కొడుకు అశ్విత్(10), కూతరు వేదశ్రీ(2), వృద్ధులైన తల్లిదండ్రులు బాలయ్య, లక్ష్మి ఉన్నారు. చదవండి: (మల్లేశంతో ప్రేమ వివాహం.. ఐదేళ్లయినా..) మమ్మీ .. నాన్న రాడా మధు మృతిచెందాడన్న విషయం తెలియడంతో కుటింబీకులు, బంధువులు, గ్రామస్తులు రోదించడాన్ని చూస్తూ ఆయన పిల్లలు నాన్నకు ఏమైంది.. నాన్న ఇంటికి రాడా? అంటూ ఏం అర్థం గాక అమాయకత్వంతో బంధువులను అడుగడం అక్కడున్న వారిని తీవ్రంగా కలచివేసింది. తల్లి ఏడస్తుంటే నాన్న ఎప్పడోస్తడు మమ్మీ అంటూ అడగడంను చూసి ప్రతి ఒక్కరూ కన్నీరు పెట్టారు. శోక సంద్రమైన రాజక్కపేట అందరితో కలిసి మెలిసి ఉండే మధు.. సౌదీలో మృతిచెందడంతో రాజక్కపేటలో తీవ్ర విషాదం అలుముకుంది. ఉన్నత చదువులు చదివి ఉద్యోగం రాక గల్ప్ పోయిండు. వారం క్రితమే పోతున్నా అంటూ అందరినీ కలిసి చెప్పి పోయిండు ఇంతలోనే ఈఘోరం జరిగిందంటూ అతని స్నేహితులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు. చదవండి: (నిశ్చితార్థం జరిగినా.. వీడియోలతో భయపెడుతూ పలుమార్లు అత్యాచారం) -
సిద్దిపేట జిల్లాలో ఘోరం.. ఎలక్ట్రిక్ వాహనం పేలి ఇల్లు దగ్దం
సాక్షి, సిద్ధిపేట: తెలంగాణలో వరుసగా ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీల పేలుళ్లు కలకలం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే పేలుళ్ల కారణంగా వెహికిల్స్ కాలిపోవడమే కాకుండా వ్యక్తులు ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. ఈ ఘటనలు పెట్రోల్ ధరలు మండిపోతుండటంతో ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాలనుకున్న వారిలో వణుకు పుట్టిస్తున్నాయి. తాజాగా సిద్ధిపేట జిల్లాలో చార్జింగ్‌పెట్టిన ఓ ఎలక్ట్రిక్ వాహనంలో బ్యాటరీ పేలింది. ఈ ఘటనలో ఎవరికీ ఏ ప్రమాదం జరగకపోయినా ఇల్లు పూర్తిగా దగ్దమైంది. దుబ్బాక మండలం పెద్దచీకోడు గ్రామంలో పుట్ట లక్ష్మీ నారాయణ అనే వ్యక్తి మంగళవారం రాత్రి తన ఎలక్ట్రిక్ వాహనాన్ని ఇంటి ముందు చార్జింగ్‌లో పెట్టాడు. అయితే అనూహ్యంగా బైక్ బ్యాటరీ పేలడంతో ఇల్లు పూర్తి కాలి దగ్దమైంది. చదవండి: ట్యాంక్‌బండ్‌పై నిర్లక్ష్యంగా బండి పెడితే రూ. 1000 పడుద్ది! -
Amnesia Pub Case: ఎమ్మెల్యే రఘునందర్‌రావుపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్‌లో మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ఫోటోలు, వీడియోలు బహిర్గతం చేయడంపై ఎమ్మెల్యే రఘునందన్‌రావుపై అబిడ్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 228(a) సెక్షన్ కింద కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. చదవండి: (అన్యాయం జరిగితే ఆత్మహత్యే.. ఎంపీ కేశినేని నానిని హెచ్చరించిన నాగయ్య) -
నాడు హరీశ్‌రావుకు పెట్రోల్ దొరికింది కానీ అగ్గిపెట్టె దొరకలేదు: రఘునందన్‌రావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఒక న్యాయవ్యాదిగా ఉద్యమంలో వెళ్తున్నప్పుడు తోటి మిత్రులు మీకెందుకు ఇదంతా అన్నారంటూ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు ఆనాటి రోజుల్ని గుర్తుచేసుకున్నారు. తెలంగాణ సాధనలో చురుకుగా పాల్గొన్న నాపై అనేక కేసులున్నాయని అన్నారు. ఈ మేరకు రఘునందనరావు మీడియాతో మాట్లాడుతూ.. నాకు ఉద్యమంలో పని చేసే అవకాశం లభించింది. అనేక మంది మిత్రులు నాతో తెలంగాణ వచ్చేదా సచ్చేదా ఎందుకు ఉద్యమంలో పాల్గొంటున్నావు అన్నారు. స్వామి గౌడ్, విఠల్, నాలాంటి ఎంతో మంది నాయకులు కొట్లాడితే వచ్చిన తెలంగాణలో ఇప్పుడు ఉద్యమ ద్రోహులు పదవులు అనుభవిస్తున్నారు. పార్టీలకతీతంగా పని చేశాం తెలంగాణ ఉద్యమంలో అనేక మంది అమరులయ్యారు కానీ వారెవరికీ సరైన గౌరవం లభించలేదు. 1969 ఉద్యమంలో అమరులైన వారికి అమరవీరుల స్థూపం చెక్కిన యాదగిరిని కూడా పట్టించుకోలేదు. కేసీఆర్ కనీసం అమరవీరుల స్థూపం ప్రారంభించేందుకు రాలేదు. నేడు దాన్ని వదిలేసి కొత్తగా కోట్లు పెట్టి స్థూపం పెడుతున్నారు. తెలంగాణలో చెక్కిన స్థూపం పనికి రాదు కానీ చైనాకు డిజైన్ అప్పజెప్పారు. తెలంగాణ సాధన కోసం పార్టీలకతీతంగా పని చేశామని రఘునందన్‌రావు అన్నారు. చదవండి: (Hyderabad: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు) శ్రీకాంతాచారి చెప్పిన మాటలు ఇంకా గుర్తున్నాయి ఉద్యమ సమయంలో హరీశ్‌రావుకు పెట్రోల్ దొరికింది తప్ప అగ్గిపెట్టె దొరకలేదు. ఇది చూసి శ్రీకాంతా చారి నిజంగా హరీశ్‌రావు ఆత్మహత్య చేసుకుంటాన్నాడేమో అని శ్రీకాంతాచారి అమరుడాయ్యాడు. చివరి క్షణాల్లో శ్రీకాంతాచారి చెప్పిన మాటలు ఇంకా గుర్తున్నాయి. నాటి శ్రీకాంతాచారి మొదలు కొని దాదాపు 1200 మంది అమరులయ్యారు. రంగారెడ్డికి చెందిన యాదిరెడ్డి ఢిల్లీలో ఉరి వేసుకొని అమరుడయ్యాడు. సోనియా గాంధీ 2004 ఎన్నికలకు ముందు ప్రత్యేక తెలంగాణ ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టి 10 ఏళ్ల తర్వాత ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేశారు. ఈ 10 ఏళ్లలో ఎంతో మంది అమరులయ్యారు. అనేక రంగాలకు చెందిన చాలా మంది ఈ ఉద్యమంలో అమరులయ్యారు. నాడు అసెంబ్లీలో ప్రకటించిన కేసీఆర్ మాటలు ఏమయ్యాయి? ఉద్యమంలో అమరుడైన శ్రీకాంతాచారి తల్లికి ఒక ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ ఇవ్వలేదు. ఆనాడు ఉద్యమ ద్రోహులు ఈరోజు కేసీఆర్ పక్కన ఉన్నారు. మీరు ఆత్మబలిదానాలు ఆపాలని అనాడు సుష్మ స్వరాజ్ చెప్పింది. బీజేపీ అధికారంలోకి వచ్చాక తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చారు. అమర వీరుల కుటుంబాలను ఆదుకుంటామన్నారు. తెలంగాణలో జనాభా ప్రాతిపదికన పదవులు ఇస్తామని మొదటి అసెంబ్లీలో ప్రకటించిన కేసీఆర్ మాట ఏమైంది?. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఎక్కా యాదగిరి చెక్కిన అమరవీరుల స్థూపాన్ని వీలయితే ప్రధానమంత్రితో ప్రారంభించేందుకు కృషి చేస్తాం' అని ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. -
యువతి నుంచి ఫోన్.. కొరియర్ ఓపెన్ చేస్తే స్వీట్ బాక్స్.. అసలేం జరిగింది?
సాక్షి, మెదక్:(దుబ్బాక): సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ ప్రభుత్వం, పోలీసులు చెబుతున్నా అమాయక ప్రజలు మోసపోతూనే ఉన్నారు. అపరిచిత వ్యక్తి నుంచి వచ్చిన ఫోన్‌కు స్పందించి ఓ వ్యక్తి మోసపోయిన ఘటన తొగుట మండలంలోని వెంకట్రావుపేటలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన తుప్పటి కనకయ్యకు రెండు రోజుల క్రితం ఓ అపరిచిత యువతి ఫోన్ చేసింది. మీ సెల్ నంబర్‌కు ఆఫర్ వచ్చిందని, రూ.1600లు చెల్లిస్తే రూ.7500 విలువచేసే స్మార్ట్‌ఫోన్ ఇస్తామని చెప్పింది. కొరియర్ ద్వారా మీ ఇంటికి ఫోన్ వచ్చాకే డబ్బులు చెల్లించమంటూ నమ్మకం కలిగించడంతో కనకయ్య ఇంటి అడ్రస్ తెలిపాడు. గురువారం మధ్యాహ్నం పోస్ట్ రావడంతో డబ్బులు చెల్లించి పార్సిల్‌ను తీసుకున్నాడు. ఓపెన్ చేసి చూడగా స్మార్ట్ ఫోన్ బదులు స్వీట్ బాక్స్, హనుమాన్ చాలీసా, యంత్రం ఉండడంతో ఖంగు తిన్నాడు. మోసపోయానని గ్రహించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. చదవండి: ఆదిలాబాద్: మారుమూల గ్రామ సర్పంచ్‌కి ఢిల్లీ నుంచి ఆహ్వానం -
‘ప్రేమించి పెళ్లి.. అమ్మ, నాన్న మిస్ యూ.. నా చావుకు వారే కారణం’
తన చావుకు భర్త, అత్తింటి వారే కారణమని.. అదనపు కట్నం తీసుకురావాలని వేధించే వారని, తనకు న్యాయం జరగాలని, అమ్మా నాన్న మిస్ యూ అంటూ’ ప్రవళిక సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకుంది. సాక్షి, నిజామాబాద్: వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు.. పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. ఐదేళ్ల వరకు వారి దాంపత్యం సాఫీగానే సాగింది. కొద్ది రోజులుగా అదనపు వరకట్నం కోసం అత్తింటి వారు వేధించడంతో వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన శుక్రవారం దుబ్బాకలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని దుబ్బాక గ్రామానికి చెందిన దోర్ల శోభ– వెంకట్ రెడ్డిల కూతురు ప్రవళికను(28) బోర్గాం(పి) గ్రామానికి చెందిన చామకూర మహేశ్‌కు ఇచ్చి ఐదేళ్ల క్రితం వివాహం జరిపించారు. వీరిద్దరూ చదువుతున్న సమయంలో ప్రేమించుకోవడంతో ఇరువైపులా పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. పెళ్లి సమయంలో కట్నకానుకలతో పాటు బంగారు ఆభరణాలు, ఇతర సామగ్రి ఇచ్చారు. కొన్నేళ్ల పాటు వారి కాపురం సజావుగానే సాగింది. మహేశ్ నిర్మల్‌లో మిషన్ భగీరథలో అవుట్ సోర్సింగ్‌లో ఉద్యోగం చేసేవాడు. ఉద్యోగం పోవడంతో ఇంటి వద్దనే ఉంటున్నాడు. అయితే అదనపు కట్నం తీసుకురావాలని భర్త, అత్త వారి దగ్గర బంధువులు ప్రవళికను వేధించారు. సుమారు ఆరు నెలల క్రితం కూతురి బాధను చూడలేని తల్లిదండ్రులు రూ. నాలుగు లక్షల వరకు డబ్బులు ఇచ్చినట్లు ప్రవళిక బంధువులు తెలిపారు. అయితే మళ్లీ అదనపు కట్నం తీసుకురావాలని భర్త, అత్త, వారి బంధువులు వేధించడంతో భరించలేక పుట్టింటికి వచ్చిన ప్రవళిక శుక్ర వారం తెల్లవారుజామున ఆమె ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. చదవండి: భర్త వివాహేతర సంబంధం.. మహిళా డాక్టర్ ఏం చేసిందంటే..? ఆమె తల్లి ఫిర్యాదు మేరకు భర్త చామకూర మహేశ్, అత్త చామకూర రాజవ్వ, సమీప బంధువులైన మేనమామలు, మేనత్తపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వంశీకృష్ణ రెడ్డి తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని సీఐ శ్రీశైలంతో పాటు నిజామాబాద్ ఏసీపీ వెంకటేశ్వర్లు పరిశీలించారు. భర్త, అత్తతో పాటు వారి సమీప బంధువులపై వరకట్నం కేసు నమోదు చేసినట్లు, బాధితుల ఫిర్యాదు, సాక్ష్యాధారాలతో నిందితులను అరెస్టు చేసి శిక్షపడేలా చేస్తామని నిజామాబాద్ ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. చదవండి: సాయం చేస్తానని చెప్పి ... వ్యభిచార గృహానికి విక్రయించేందుకు యత్నం -
టైరు పేలి బావిలో పడిన కారు.. ఊపిరాడక తల్లీతనయుడి మృతి
బంధువుల ఇంట్లో బారసాలకని హుస్నాబాద్‌కు వెళ్లేందుకు ప్రశాంత్ తన స్నేహితుడి కారు తీసుకున్నాడు. తల్లి లక్ష్మితో కలిసి నిజాంపేట మండలం నందిగామలోని ఇంటి నుంచి బయలుదేరాడు. మార్గమధ్యలో దుబ్బాక మండలం చిట్టాపూర్ సమీపంలో ఒక్కసారిగా కారు ముందుభాగంలోని టైరు పేలింది. అంతే.. కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న బావిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో తల్లీకొడుకు సజీవసమాధి అయ్యారు. సాక్షి, దుబ్బాకటౌన్, నిజాంపేట(మెదక్): కారులో ఊరికి బయలుదేరిన తల్లీతనయుడిని విధి వక్రించింది. టైరు పేలడంతో కారు వెళ్లి నిండుగా నీళ్లున్న బావిలో పడిపోయి మృతిచెందారు. వాళ్లను ప్రాణాలతో బయటకు తీయడానికి వెళ్లిన ఓ గజ ఈతగాడు కూడా ఆ కారులోనే నీళ్లలో ఇరుక్కుపోయాడు. విగతజీవిగా మిగిలాడు. ఒకే ప్రమాదం రెండు ఇళ్లల్లో తీవ్ర విషాదం నింపింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండంలో బుధవారం ఈ ప్రమాదం జరిగింది. కారును పైకి లాగుతున్న దృశ్యం కారు పల్టీలు కొడుతూ.. మెదక్ జిల్లా నిజాంపేట మండలం నందిగామకు చెందిన తల్లీకొడుకు ఆకుల లక్ష్మి (45), ప్రశాంత్ (26) బుధవారం కారులో హుస్నాబాద్ బయల్దేరారు. చిట్టాపూర్ శివారుకు రాగానే మధ్యాహ్నం 1.13కి కారు టైరు పేలి రోడ్డు పక్కన 20 మీటర్ల దూరంలో ఉన్న బావిలో పడిపోయింది. పెద్ద శబ్దం రావడంతో బైక్‌పై అటుగా వెళ్తున్న వాహనదారుడు వెనక్కి చూసేసరికి కారు పల్టీలు కొడుతూ బావిలో పడింది. అతనితో పాటు మరికొందరు వాహనదారులు వెంటనే భూంపల్లి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలం భూంపల్లి పోలీస్ స్టేషన్‌కు కిలోమీటరు దూరంలోని కూడవెల్లి పెద్ద వాగు దాటాక చిట్టాపూర్ శివారులో ఉంది. మధ్యాహ్నం 2 గంటల్లోపే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. నీళ్లు ఎక్కువగా ఉండటంతో..: పోలీసులు ఫైర్, రెవెన్యూ, విద్యుత్ సిబ్బంది సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఎమ్మెల్యే రఘునందన్‌రావు, ఏసీపీ చల్లా దేవారెడ్డి కూడా అక్కడకు చేరుకున్నారు. అధికారులు, చిట్టాపూర్ సర్పంచ్ పోతనక రాజయ్య, ఎంపీటీసీ సభ్యుడు కనకయ్య, సమీప రైతులతో బావి వివరాలు సేకరించారు. సుమారు 16 గజాల లోతు బావి పూర్తిగా నీటితో నిండి ఉండటంతో ఫైర్ సిబ్బంది, పోలీసులు ముందు గజ ఈతగాళ్లతో కలిసి పాతాల గరిగెల (హ్యాంగర్స్)తో గాలింపు చేపట్టారు. కారుకు, తాళ్లకు మధ్యలో చిక్కుకున్న నర్సింహులు మృతదేహం.. పైకి తీస్తున్న క్రమంలో మళ్లీ బావిలోకి జారిపడిపోయింది. కానీ ఫలితం లేదు. నీరు ఎక్కువగా ఉండటంతో రెండు పెద్ద జనరేటర్లు పెట్టి ఎత్తిపోయడం మొదలుపెట్టారు. సాయంత్రం 4 గంటల కల్లా 2 గజాల వరకు నీటినే తోడేయగలిగారు. దీంతో చేగుంట, సిద్దిపేటల నుంచి రెండు భారీ క్రేన్లు తెప్పించారు. వాటి సాయంతో గజ ఈతగాళ్లు మళ్లీ గాలింపు మొదలుపెట్టారు. క్రేన్ల కొండి బావి లోపల ఉన్న కారుకు చిక్కుకున్నా నీరు ఎక్కువగా ఉండటంతో పైకి లేస్తున్న క్రమంలో కొండ్లు జారుతూ ఇబ్బందిగా తయారైంది. నీటిని తోడుతూ.. గాలిస్తూ..: మరో 4 మోటార్లు పెట్టి బావిలోని నీటిని తొలగిస్తూ క్రేన్లతో కారు వెలికితీతను అధికారులు కొనసాగించారు. సుమారు 7 గంటలు శ్రమించి రాత్రి 8.20కి కారును పైకి తీశారు. కారు నుంచి రెండు మృతదేహాలను వెలికి తీశారు. మెదక్ జిల్లా నిజాంపేట మండలం నందిగామకు చెందిన తల్లీకొడుకు ఆకుల లక్ష్మి, ప్రశాంత్‌గా గుర్తించారు. రాములు లారీ డ్రైవర్ కాగా భార్య లక్ష్మి రోజువారీ పనులకు వెళ్లేది. ప్రశాంత్ ఐటీఐ పూర్తి చేసి రామాయంపేట మండలంలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. కూతురు రేవతి డైట్ సెట్‌కు ప్రిపేర్ అవుతోంది. కారులో ఇరుక్కుపోయిన గజ ఈతగాడు బావిలోంచి కారు తీసే క్రమంలో దుబ్బాక మండలం ఎనగుర్తికి చెందిన గజ ఈతగాడు బండకాడి నర్సింహులు (40) మృతి చెందాడు. బుధవారం సాయంత్రం 3 గంటలకు తోటి గజ ఈతగాళ్లతో కలిసి నర్సింహులు గాలింపు చర్యల్లో పాల్గొన్నాడు. బావిలో నీరు ఎక్కువగా ఉండటంతో చాలాసార్లు క్రేన్ కొండిని తగిలించేందుకు ప్రయత్నించినా కుదరలేదు. మోటార్లతో రాత్రి 8 గంటల వరకు 5 గజాలకు పైగా నీటిని తోడారు. తర్వాత క్రేన్ కొండిని కారుకు తగిలించేందుకు బావి లోపలికి వెళ్లాడు. కారుకు కొండిని తగిలించి అందులోనే ఇరుక్కుపోయాడు. క్రేన్ సాయంతో కారును పైకి తీస్తుండగా కారుకు, తాళ్లకు మధ్య చిక్కుకొని అపస్మారక స్థితిలో కనిపించాడు. తాళ్లను కొంత పైకి లాగాక ఒక్కసారిగా నీటిలో పడిపోయాడు. బావిలో పడి మృతి చెందిన గజ ఈత నర్సింలు మృతదేహాన్ని గురువారం అధికారులు బయటకు తీశారు. నర్సింలు కుటుంబానికి న్యాయం చేయాలని మృతదేహంతో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. రోదిస్తున్న నర్సింలు కుటుంబ సభ్యులు సాయం చేయడానికి వచ్చి... శవంగా మారడంతో అక్కడి వారంతా శోకసంద్రంలో మునిగిపోయారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నర్సింహులుది నిరుపేద కుటుంబమని, ఆయన కుటుంబసభ్యులను ఆదుకోవాలని ఇనగుర్తి సర్పంచ్ శంకర్ డిమాండ్ చేశాడు. నర్సింహులు చనిపోయిన వెంటనే సంఘటన స్థలం నుంచి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు, ఏసీపీ ఎందుకు వెళ్లిపోయారని ఆయన ప్రశ్నించారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే: పోలీసులు, ఫైర్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే నర్సింహులు మృతి చెందాడంటూ అతని కుటుంబీకులు, బంధువులు రామాయంపేట–సిద్దిపేట రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. పోలీసులు బావిలో దిగకుండా ప్రైవేట్ వ్యక్తులను బావిలోకి దింపి చంపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోదిస్తున్న ప్రశాంత్ కుటుంబ సభ్యులు దావత్ ఉందని కారు తీసుకెళ్లాడు హుస్నాబాద్‌లో దావత్‌కు పోతానని ప్రశాంత్ నా కారుని తీసుకెళ్లాడు. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో నందిగామ నుంచి కారులో వెళ్లిన అరగంటకే ఇలా జరిగింది. చిట్టాపూర్ వద్ద కారు బావిలో పడిందని టీవీలో రావడంతో చూసి ప్రశాంత్‌కు ఫోన్ చేశాను. కానీ కలవలేదు. దీంతో భయంతో హుటాహుటిన సంఘటన స్థలానికి వచ్చాను. తీరా ఇక్కడికి వచ్చాక టైరు, అద్దంను చూసి బావిలో పడింది నా కారే అని గుర్తించాను. – హరికృష్ణ, ప్రశాంత్ స్నేహితుడు -
టైరు పేలి కారు బావిలోకి.. తల్లీతనయుడి సహా మరొకరి మృతి
దుబ్బాక టౌన్: కారులో ఊరికి బయలుదేరిన తల్లీతనయుడిని విధి వక్రించింది. టైరు పేలడంతో కారు వెళ్లి నిండుగా నీళ్లున్న బావిలో పడిపోయి మృతిచెందారు. వాళ్లను ప్రాణాలతో బయటకు తీయడానికి వెళ్లిన ఓ గజ ఈతగాడు కూడా ఆ కారులోనే నీళ్లలో ఇరుక్కుపోయాడు. విగతజీవిగా మిగిలాడు. ఒకే ప్రమాదం రెండు ఇళ్లల్లో తీవ్ర విషాదం నింపింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండంలో బుధవారం ఈ ప్రమాదం జరిగింది. కారు పల్టీలు కొడుతూ.. మెదక్ జిల్లా నిజాంపేట మండలం నందిగామకు చెందిన తల్లీకొడుకు ఆకుల లక్ష్మి (45), ప్రశాంత్ (26) బుధవారం కారులో హుస్నాబాద్ బయల్దేరారు. చిట్టాపూర్ శివారుకు రాగానే మధ్యాహ్నం 1.13కి కారు టైరు పేలి రోడ్డు పక్కన 20 మీటర్ల దూరంలో ఉన్న బావిలో పడిపోయింది. పెద్ద శబ్దం రావడంతో బైక్‌పై అటుగా వెళ్తున్న వాహనదారుడు వెనక్కి చూసేసరికి కారు పల్టీలు కొడుతూ బావిలో పడింది. అతనితో పాటు మరికొందరు వాహనదారులు వెంటనే భూంపల్లి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలం భూంపల్లి పోలీస్ స్టేషన్‌కు కిలోమీటరు దూరంలోని కూడవెల్లి పెద్ద వాగు దాటాక చిట్టాపూర్ శివారులో ఉంది. మధ్యాహ్నం 2 గంటల్లోపే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. నీళ్లు ఎక్కువగా ఉండటంతో..: పోలీసులు ఫైర్, రెవెన్యూ, విద్యుత్ సిబ్బంది సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఎమ్మెల్యే రఘునందన్‌రావు, ఏసీపీ చల్లా దేవారెడ్డి కూడా అక్కడకు చేరుకున్నారు. అధికారులు, చిట్టాపూర్ సర్పంచ్ పోతనక రాజయ్య, ఎంపీటీసీ సభ్యుడు కనకయ్య, సమీప రైతులతో బావి వివరాలు సేకరించారు. సుమారు 16 గజాల లోతు బావి పూర్తిగా నీటితో నిండి ఉండటంతో ఫైర్ సిబ్బంది, పోలీసులు ముందు గజ ఈతగాళ్లతో కలిసి పాతాల గరిగెల (హ్యాంగర్స్)తో గాలింపు చేపట్టారు. కానీ ఫలితం లేదు. నీరు ఎక్కువగా ఉండటంతో రెండు పెద్ద జనరేటర్లు పెట్టి ఎత్తిపోయడం మొదలుపెట్టారు. సాయంత్రం 4 గంటల కల్లా 2 గజాల వరకు నీటినే తోడేయగలిగారు. దీంతో చేగుంట, సిద్దిపేటల నుంచి రెండు భారీ క్రేన్లు తెప్పించారు. వాటి సాయంతో గజ ఈతగాళ్లు మళ్లీ గాలింపు మొదలుపెట్టారు. క్రేన్ల కొండి బావి లోపల ఉన్న కారుకు చిక్కుకున్నా నీరు ఎక్కువగా ఉండటంతో పైకి లేస్తున్న క్రమంలో కొండ్లు జారుతూ ఇబ్బందిగా తయారైంది. నీటిని తోడుతూ.. గాలిస్తూ..: మరో 4 మోటార్లు పెట్టి బావిలోని నీటిని తొలగిస్తూ క్రేన్లతో కారు వెలికితీతను అధికారులు కొనసాగించారు. సుమారు 7 గంటలు శ్రమించి రాత్రి 8.20కి కారును పైకి తీశారు. కారు నుంచి రెండు మృతదేహాలను వెలికి తీశారు. మెదక్ జిల్లా నిజాంపేట మండలం నందిగామకు చెందిన తల్లీకొడుకు ఆకుల లక్ష్మి, ప్రశాంత్‌గా గుర్తించారు. రాములు లారీ డ్రైవర్ కాగా భార్య లక్ష్మి రోజువారీ పనులకు వెళ్లేది. ప్రశాంత్ ఐటీఐ పూర్తి చేసి రామాయంపేట మండలంలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. కూతురు రేవతి డైట్ సెట్‌కు ప్రిపేర్ అవుతోంది. కారులో ఇరుక్కుపోయిన గజ ఈతగాడు బావిలోంచి కారు తీసే క్రమంలో దుబ్బాక మండలం ఎనగుర్తికి చెందిన గజ ఈతగాడు బండకాడి నర్సింహులు (40) మృతి చెందాడు. బుధవారం సాయంత్రం 3 గంటలకు తోటి గజ ఈతగాళ్లతో కలిసి నర్సింహులు గాలింపు చర్యల్లో పాల్గొన్నాడు. బావిలో నీరు ఎక్కువగా ఉండటంతో చాలాసార్లు క్రేన్ కొండిని తగిలించేందుకు ప్రయత్నించినా కుదరలేదు. మోటార్లతో రాత్రి 8 గంటల వరకు 5 గజాలకు పైగా నీటిని తోడారు. తర్వాత క్రేన్ కొండిని కారుకు తగిలించేందుకు బావి లోపలికి వెళ్లాడు. కారుకు కొండిని తగిలించి అందులోనే ఇరుక్కుపోయా డు. క్రేన్ సాయంతో కారును పైకి తీస్తుండగా కారుకు, తాళ్లకు మధ్య చిక్కుకొని అపస్మారక స్థితిలో కనిపించాడు. తాళ్లను కొంత పైకి లాగాక ఒక్కసారిగా నీటిలో పడిపోయాడు. అతడి మృతదేహాన్ని బయటకు తీసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అప్పటివరకు సహాయక చర్యలో ఉన్న గజ ఈతగాళ్లు కూడా వెళ్లిపోయారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే: పోలీసులు, ఫైర్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే నర్సింహులు మృతి చెందాడంటూ అతని కుటుంబీకులు, బంధువులు రామాయంపేట–సిద్దిపేట రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. పోలీసులు బావిలో దిగకుండా ప్రైవేట్ వ్యక్తులను బావిలోకి దింపి చంపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
భార్య కోసం గుడికట్టిన భర్త
-
మల్లన్న సాగర్‌లోకి గోదారి ట్రయల్‌రన్ విజయవంతం
దుబ్బాకటౌన్/తొగుట: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. గోదావరి జలాలు కొమురవెల్లి మల్లన్నసాగర్ రిజర్వాయర్‌లోకి అడుగుపెట్టాయి. ప్రాజెక్టు ఈఎన్సీ హరిరాం, ఎస్ఈ వేణు, ఈఈ వెంకటేశ్వర్రావు ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటలకు సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్ పంపుహౌస్ వద్ద ప్రత్యక పూజలు నిర్వహించి మోటార్లను ప్రారంభించారు. పంపుల నుంచి దూసుకెళ్లిన గోదావరి నీళ్లు.. గలగలమంటూ కొద్దిసేపట్లోనే మల్లన్నసాగర్‌లోకి అడుగుపెట్టాయి. మల్లన్నసాగర్ రిజర్వాయర్‌లో నీటిని నింపాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో.. అధికారులు కొద్దిరోజులుగా రాత్రింబవళ్లు కష్టపడ్డారు. ట్రయల్‌రన్ విజయవంతం అవడంతో సంబురాలు జరుపుకొన్నారు. 10 టీఎంసీలు నింపేందుకు.. మల్లన్నసాగర్లో ప్రస్తుతం 10 టీఎంసీల నీటిని నింపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తుక్కాపూర్ పంపుహౌజ్‌లోని మొత్తం ఎనిమిది పంపులకుగాను.. మూడు పంపుల (రెండో, ఆరో, ఏడో నంబర్ పంపుల) ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నారు. ఒక్కో మోటార్ ద్వారా రోజుకు (24 గంటల్లో) 1.5 టీఎంసీల నీటిని పంపింగ్ చేసే అవకాశం ఉంది. ఈ లెక్కన మూడింటిని పూర్తిస్థాయిలో నడిపితే.. రెండు, మూడు రోజుల్లోనే మల్లన్నసాగర్లో 10 టీఎంసీలు చేరే అవకాశం ఉంది. భారీగా బందోబస్తు మల్లన్నసాగర్లో నీళ్లు నింపుతున్న నేపథ్యంలో పోలీసులు శనివారం మధ్యాహ్నమే రిజర్వాయర్ పరిధిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తుక్కాపూర్, రాంపురం వాగుగడ్డ, ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామాలకు వెళ్లే రహదారిపై పికెట్లు ఏర్పాటు చేశారు. ఎవరినీ కట్ట వద్దకు వెళ్లనీయడం లేదు. గ్రామస్తులను కూడా పూర్తి వివరాలు అడిగి నిర్ధారించుకున్నాకే వెళ్లనిస్తున్నారు. అర్ధరాత్రి గ్రామాలు ఖాళీ మల్లన్నసాగర్ ముంపు గ్రామాల్లోని కుటుంబాలను రెవెన్యూ అధికారులు శనివారం అర్ధరాత్రి ఖాళీ చేయించారు. వేములఘాట్, ఏటిగడ్డ కిష్టాపూర్, పల్లెపహాడ్, బి.బంజేరుపల్లి గ్రామాల నుంచి అందరినీ బయటికి తరలించారు. నిజానికి ఈ గ్రామాలను ఖాళీ చేయాలని అధికారులు గతంలోనే ఆదేశించారు. కానీ ఆర్అండ్ఆర్ ప్యాకేజీకి సంబంధించి కొందరు ఖాళీ చేయలేదు. వారిని ఇప్పుడు బయటికి తరలించారు. గట్టు గుట్ట పూజారి అక్కడే..! వేములఘాట్ శివారు అటవీప్రాంతంలోని గట్టు గుట్టపై దీకొండ మైసమ్మ, ఆంజనేయస్వామి ఆలయాలు ఉన్నాయి. ఏటిగడ్డ కిష్టాపూర్ తండాకు చెందిన మంగీలాల్.. ఆలయంలోనే నివసిస్తూ పూజారిగా పనిచేస్తున్నారు. ముంపు గ్రామాలన్నీ పూర్తిగా ఖాళీ చేస్తుండటంతో.. ఏటిగడ్డ కిష్టాపూర్ సర్పంచ్ ఆయనతో మాట్లాడి బయటికి రావాలని కోరారు. కానీ మంగీలాల్ తిరస్కరించారు. అధికారులు ఆయనను బయటికి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కేసీఆర్ స్వప్నం సాక్షాత్కారం: మంత్రి హరీశ్ ‘కేసీఆర్ స్వప్నం సాక్షాత్కారం.. తెలంగాణకు అమృత జలాభిషేకం’ అని పేర్కొంటూ రిజర్వాయర్‌లోకి నీటి విడుదల ఫొటోలను ట్విట్టర్లో మంత్రి హరీశ్‌రావు పోస్టు చేశారు. ‘సాకారమైన సాగరం.. అనుమానాలు, అపశకునాలు, అవరోధాలు తలవంచి తప్పుకున్నాయి.కుట్రలు, కుహానా కేసులు, వందల విమర్శలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. గోదారి గంగమ్మ మల్లన్నసాగరాన్ని ముద్దాడింది. తెలంగాణ రైతాంగం ఆనందంతో మురిసింది. పట్టుదలతో పనిచేస్తే కానిదేదీ లేదని తెలంగాణ ప్రభుత్వం ప్రపంచానికి చాటింది..’’ అని పేర్కొన్నారు. -
రాజమౌళన్నా.. కూర ప్రభాకర్ ఏం జేస్తుండు: సీఎం కేసీఆర్
సాక్షి, దుబ్బాక టౌన్: ‘దుబ్బాకకు రాక చాలా రోజులు అవుతోంది. మనోల్లంతా బాగున్నరా రాజమౌళన్నా.. కూర ప్రభాకర్ ఏం జేస్తుండు.. మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. బాలాజీ ఆలయ ప్రారంభోత్సవంలో తప్పకుండా పాల్గొంటా.. ఆ రోజు అందరినీ కలుస్తా..’అంటూ ఆహ్వాన పత్రిక అందజేయడానికి ప్రగతి భవన్‌కు వచ్చిన దుబ్బాక నాయకులతో సీఎం కేసీఆర్ ముచ్చటించారు. శుక్రవారం ప్రగతి భవన్లో మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలసి దుబ్బాక బాలాజీ ఆలయ కమిటీ బాధ్యులు ముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఆగస్టు 20న ఆలయ ప్రారంభోత్సవానికి రావాలంటూ ఆహ్వాన పత్రిక అందించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఆలయ నిర్మాణ చిత్రాలు చూశానని, చాలా అద్భుతంగా ఉన్నాయన్నారు. దుబ్బాక బాలాజీ ఆలయం గొప్ప పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధిగాంచుతుందని చెప్పారు. నిర్మాణం పూర్తయ్యాక చినజీయర్ స్వామితో కలసి ప్రారంభోత్సవాన్ని వైభవంగా నిర్వహించుకుందామని సీఎం వివరించారు. ఈ సందర్భంగా వారిని పేరుపేరున పలకరించడంతో పాటు దుబ్బాకలో తన చిన్ననాటి మిత్రుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ బాధ్యులు వడ్లకొండ సుభద్ర శ్రీధర్, చింత రాజు, రొట్టె రాజమౌళి, మధు, కూర వేణుగోపాల్, శ్రీనివాస్ తదితరులున్నారు. -
రిసెప్షన్ ఫంక్షన్: నూతన దంపతులపై కేసు
తొగుట(దుబ్బాక): తొగుట మండలం చందాపూర్‌లో లాక్డౌన్, కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి రిసెప్షన్ నిర్వహించిన పది మందిపై గురువారం కేసు నమోదు చేసినట్టు తొగుట ఎస్సై శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలో పెళ్లి రిసెప్షన్ నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు ఎస్సై, పోలీసులు సిబ్బంది అక్కడికి వెళ్లారు. రిసెప్షన్ నిర్వహించుకుంటున్న పెళ్లి కుమారుడు, పెళ్లి కూతురుతోపాటు మరో పది మందిపై కేసు నమోదు చేశామన్నారు. నూనె మహేశ్ (26) ఎ1, నూనె మౌనిక (25) ఎ2, టెంట్ హౌజ్ నిర్వాహకుడు నర్సెట్టి ఎల్లం (28) ఎ3, ఆత్మకూరి శ్రీనివాస్ (35) ఎ4, పాడలా విజయ (28) ఎ5, నూనె సుబధ్ర (60) ఎ6, జనగామ సుభాష్‌గౌడ్ ఎ7. బొడ్డు స్వామి (38) ఎ8, బొడ్డు భూమయ్య (42) ఎ9, నర్సెట్టి సురేష్ (35) ఎ10 పై క్రైం నంబర్ 82/2021 యూ/ ఎస్ 341, 186, 188, 269 మరియు డిసాస్టర్ మేనేజ్మెంట్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్టు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెళ్లిళ్లు తప్ప రిసెప్షన్, పుట్టిన రోజు ఇతర ఫంక్షన్లకు ఎలాంటి అనుమతి లేవన్నారు. లాక్డౌన్ మరియు కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి ఫంక్షన్లు చేసుకునే వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. చదవండి: పెళ్లైన గంటల వ్యవధిలో వరుడి అరెస్ట్.. కారణం ఏంటంటే -
మావోయిస్టు కీలకనేత లొంగుబాటు: రూ.20 లక్షలు ఆయనకే
సాక్షి, అమరావతి/ దుబ్బాక టౌన్: మావోయిస్టు కీలక నేత, ప్రస్తుతం మావోయిస్టు ఆంధ్రా-ఒడిశా సరిహద్దు స్పెషల్ జోన్ కమిటీ (ఏఓబీ ఎస్జెడ్సీ) సభ్యుడిగా ఉన్న ముత్తన్నగారి జలంధర్‌రెడ్డి అలియాస్ కృష్ణ అలియాస్ మారన్న, అలియాస్ కరుణ, అలియాస్ శరత్.. మంగళవారం ఆంధ్రప్రదేశ్ డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ ఎదుట లొంగిపోయాడు. ఇతను 22 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్నాడు. నలభై ఏళ్ల జలంధర్‌రెడ్డి స్వస్థలం తెలంగాణలోని సిద్దిపేట జిల్లా (పూర్వపు మెదక్ జిల్లా) దుబ్బాక నియోజకవర్గంలోని మిరుదొడ్డి మండలం భూంపల్లి గ్రామం. డిగ్రీ చదువుతుండగా మావోయిస్టు పార్టీలో చేరి, వివిధ హోదాల్లో పనిచేసిన ఇతనిపై రూ.20 లక్షల రివార్డు ఉంది. కాగా జలంధర్ లొంగుబాటు పురస్కరించుకుని ఏపీ డీజీపీ సవాంగ్ పోలీస్ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల వల్లే.. మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావాలని డీజీపీ విజ్ఞప్తి చేశారు. లొంగిపోయే మావోయిస్టులకు చట్టపరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సహాయ పునరావాస ఏర్పాట్లు చేస్తామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో ఆదివాసీ గిరిజనులు చైతన్యవంతమై మావోయిస్టులకు దూరమవుతున్నారని చెప్పారు. దీంతో ఏఓబీలో మావోయిస్టులు పట్టు కోల్పోయారని, గడిచిన రెండేళ్లలో అనేక మంది లొంగిపోయారని వివరించారు. జలంధర్‌పై ఉన్న రూ.20 లక్షల రివార్డు మొత్తాన్ని ఆయన సహాయ పునరావాస కార్యక్రమానికి వినియోగిస్తామని డీజీపీ చెప్పారు. భూస్వామ్య కుటుంబంలో పుట్టి అడవి బాట.. రిటైర్డ్ వీఆర్వో ముత్తన్నగారి బాలకృష్ణారెడ్డి, సులోచన దంపతుల ముగ్గురు కుమారుల్లో జలంధర్ చివరివాడు. ఇతని తాత పద్మారెడ్డి పోలీస్ పటేల్. 50 ఎకరాలకు పైగా భూమి ఉంది. గ్రామంలో పేరున్న ఉన్నత కుటుంబంలో జన్మించినప్పటికీ పేద ప్రజల కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం అడవి బాట పట్టాడు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళశాలలో డిగ్రీ చదువుతుండగా ఉద్యమం పట్ల ఆకర్షితుడయ్యాడు. 1999–2000లో అప్పటి పీపుల్స్‌వార్ అనుబంధ సంస్థ రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ (ఆర్ఎస్యూ)లో పనిచేస్తూ పూర్తిస్థాయి అజ్ఞాతంలోకి వెళ్లాడు. తెలంగాణ, ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లో çవివిధ హోదాల్లో, పలు పేర్లతో పనిచేశాడు. 19 ఎదురుకాల్పుల సంఘటనలు, పలు పోలీస్స్టేషన్లపై దాడులతో పాటు 2008లో సంచలనం సృష్టించిన బలిమెల సంఘటనలోనూ జలంధర్ కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు వెల్లడించారు. ఇతని ఇద్దరు సోదరుల్లో ఒకరు వ్యవసాయం చేస్తుండగా, మరొకరు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉన్నారు. బతికుండగా తమ కొడుకును చూస్తామనుకోలేదంటూ జలంధర్ లొంగుబాటుపై తల్లిదండ్రులు బాలకృష్ణారెడ్డి, సులోచన ఆనందం వ్యక్తం చేశారు. చదవండి: కరోనా టీకా.. జనాభాలో యవ్వనులే అధికం చదవండి: బొల్లినేని శ్రీనివాస గాంధీ అరెస్ట్ -
ఊరితో బంధం తెంచుకుంటూ.. కన్నీళ్లు పెడుతూ
తొగుట(దుబ్బాక): కొమురవెల్లి మల్లన్నసాగర్ నిర్వాసిత కటుంబాలు గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని ఆర్అండ్ఆర్ కాలనీకి బుధవారం తరలివెళ్లారు. ముంపు గ్రామాలైన వేములఘాట్, పల్లేపహడ్ గ్రామాల ప్రజలు తమ కుటుంబాలతో కలిసి వెళ్లిపోయారు. ఆరు నెలల క్రితం లక్ష్మాపూర్ ప్రజలు గ్రామాన్ని ఖాళీచేసి వెళ్లిన విషయం తెలిసిందే. రిజర్వాయర్ కట్ట మధ్యలో ఉన్న లక్ష్మాపూర్, రాంపూర్ గ్రామాలను అధికారులు ఖాళీ చేయించారు. కాగా సంగాపూర్‌లోని ఆర్అండ్ఆర్ కాలనీలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను లక్ష్మాపూర్ వాసులకు ప్రభుత్వం తాత్కాలికంగా కేటాయించింది. కాగా ప్రస్తుతం వేములఘాట్, పల్లేపహడ్ గ్రామాల ప్రజలు వారం రోజుల నుంచి వారికి కేటాయించిన ఇళ్లలోకి వెళ్తున్నారు. ఈ క్రమంలో, వేములఘాట్ నుంచి 140 కుటుంబాలు, పల్లేపహడ్ నుంచి 103 కుటుంబాలు బుధవారం వెళ్లారు. నిర్వాసిత కుటుంబాలను తరలించేందుకు ప్రభుత్వం వాహనాలను ఏర్పాటు చేసింది. దీంతో పలు కుటుంబాలు నేడు గజ్వేల్‌కు తరలివెళ్లాయి. గ్రామాన్ని వదిలి వెళ్తున్న క్రమంలో మహిళలు, పురుషులు భావోద్వేగానికి గురయ్యారు. ఇన్నాళ్లుగా గ్రామంతో ఉన్న అనుబంధాన్ని తెంచుకొని వెళ్తున్న క్రమంలో మహిళలు ఒకరిపై ఒకరు పడి బోరున విలపించారు. పుట్టి పెరిగిన ఊరి జ్ఞాపకాలను వదిలివెళ్లి పోతున్నామంటూ ఆవేదన వ్యక్తంచేశారు. గ్రామంలో ఇన్నాళ్లుగా కష్టసుఖాల్లో అందరం అండగా ఉండేవారమని తలుచుకుంటూ విలపించారు. ఆర్అండ్ఆర్ కాలనీకి చేరుకున్న గ్రామస్తులు గజ్వేల్‌రూరల్: మల్లన్నసాగర్ ప్రాజెక్టు ముంపు బాధితులు వేములఘట్ గ్రామస్తులు గజ్వేల్ మున్సిపాలిటీ పరిధి ముట్రాజ్‌పల్లి ఆర్అండ్ఆర్ కాలనీలోకి చేరుకుంటున్నారు. ఈ సందర్భంగా బుధవారం వేములఘట్‌కు చెందిన బాధిత కుటుంబాలు డీసీఎం వాహనాల్లో తీసుకువచ్చిన సామగ్రిని ఆర్అండ్ఆర్ కాలనీలో తమకు కేటాయించిన ఇళ్లలోకి తరలించారు. -
ఇంటికి వస్తున్నానని చెప్పి అంతలోనే దారుణం..
దుబ్బాక టౌన్: ‘అమ్మా నేను ఇంటికొస్తున్నా.. బాధపడకు.. హైదరాబాద్‌లో దోస్తుల వద్దకు వెళ్లా.. ఈ రోజు వస్తున్నా’ అని తల్లికి ఫోన్ చేసి చెప్పిన కాసేపటికే ఓ కొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొడుకు విగతజీవిగా మారిన విషయం తెలిసిన ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణానికి చెందిన శ్రీరాం రవిశేఖర్, జ్యోతి దంపతుల కుమారుడు నవకాంత్ ఈ నెల 3న ఇంట్లో ఎవరికీ చెప్ప కుండా వెళ్లిపోయాడు. తల్లిదండ్రులు ఎంత వెతికి నా అతని ఆచూకీ దొరకలేదు. ఈ క్రమంలో 5 రో జుల తర్వాత ఆదివారం అతను తల్లికి ఫోన్ చేశాడు. ఇంటికి వస్తున్నా ఏం ఆందోళన చెందొద్దంటూ చెప్పడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, సాయంత్రానికే అతను కామారెడ్డి శివారులోని రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు. జేబులో దొరికిన ఆధార్ కార్డ్ ఆధారంగా రైల్వే పోలీసులు నవకాంత్ తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. ఇంటికొస్తున్నా అని చెప్పిన కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో ‘అయ్యో ఎంత పని చేస్తివి కొడుకా’ అంటూ ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. (చదవండి: చిత్తూరు యువకుడి విషాదాంతం ) -
ఫోర్బ్స్ జాబితాలో తెలంగాణ ‘కీర్తి’
సాక్షి, దుబ్బాక: ప్రముఖ అంతర్జాతీయ పత్రిక ఫోర్బ్స్ ప్రచురించే ప్రతిభాశీలుర జాబితాలో తెలంగాణకు చెందిన కీర్తిరెడ్డికి చోటు లభించింది. 30 ఏళ్ల లోపు ఉండి ఉన్నతంగా రాణిస్తున్న 30 మందితో ఫోర్బ్స్ పత్రిక ఈ జాబితాను ప్రచురిస్తుంటుంది. ఈసారి ఆ జాబితాలో సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పోతారం ముద్దుబిడ్డ కొత్త కీర్తిరెడ్డి నిలిచారు. 24 ఏళ్ల వయసులోనే ఈ ఘనత సాధించిన కీర్తిరెడ్డి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి కూతురు. చిన్ననాటి నుంచే వినూత్న ఆలోచనలతో ముందుకు వెళ్లే కీర్తిరెడ్డి.. కరోనా వ్యాక్సిన్ నిల్వకు సంబంధించిన కంపెనీని నిర్వహిస్తున్నారు. తాజాగా ఫోర్బ్స్ పత్రిక ప్రతినిధులు హైదరాబాద్‌లోని ఆమె కంపెనీని పరిశీలించి ఈ విషయంలో చేస్తున్న కృషికి గుర్తింపుగా 30 ఏళ్లలోపు అత్యంత ప్రతిభాశీలుర జాబితాలో చోటు కల్పించారు. చిన్ననాటి నుంచే చురుగ్గా.. కీర్తిరెడ్డి చిన్ననాటి నుంచే చురుకైన విద్యార్థిగా గుర్తింపు తెచ్చుకున్నారు. పదో తరగతి వరకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, ఇంటర్ చిరెక్ కళాశాలలో చదివింది. సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాల నుంచి బీబీఎం పట్టా పొందారు. అలాగే ఆమె ‘లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ మేనేజ్మెంట్’లో గ్లోబల్ మాస్టర్ పట్టాను పొందారు. ప్రస్తుతం ఆమె స్టాట్విగ్ అనే బ్లాక్ చైన్ సాంకేతికత ఆధారిత వ్యాక్సిన్ సరఫరా నిర్వహణ ఫ్లాట్ ఫాం కంపెనీకి సహ వ్యవస్థాపకురాలు (సీఓఓ)గా వ్యవహరిస్తున్నారు. వ్యాక్సిన్లు, ఆహారం వృథాను అరికట్టేందుకు అవసరమైన వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. పలువురి ప్రశంసలు స్వతహాగా ఏదైనా కంపెనీని స్థాపించాలన్న ఆలోచనతో ఆమె హైదరాబాద్‌లో స్టాట్విగ్ అనే వ్యాక్సిన్ సరఫరా, నిర్వహణ ఫ్లాట్ ఫాం కంపెనీని ఏర్పాటు చేశారు. కోవిడ్ వ్యాక్సిన్‌ను ఎలా నిల్వ చేయాలి.. ఎంత ఉష్ణోగ్రతల్లో ఉంచాలి.. నాణ్యతా ప్రమాణాలు, నిర్దేశిత ప్రదేశాలకు వ్యాక్సిన్ సరఫరా కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మొదలైన అంశాల్లో ఆమె ప్రతిభను ఫోర్బ్స్ పత్రిక గుర్తించింది. కాగా, తన కూతురు ప్రఖ్యాత ఫోర్బ్స్ పత్రిక ప్రకటించిన అత్యంత ప్రతిభాశీలుర జాబితాలో నిలవడం సంతోషంగా ఉందని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. అలాగే ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు, పలువురు ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయ ప్రముఖులు కీర్తిరెడ్డిని అభినందించారు. -
సాఫ్ట్వేర్ ఇంజనీర్ బలవన్మరణం
సాక్షి, తొగుట (దుబ్బాక) : ‘అమ్మా, నాన్న.. నన్ను క్షమించండి.. నా చావుకు ఎవరూ కారణం కాదు’అని లేఖ రాసి ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా తొగుట మండలం పెద్ద మాసాన్‌పల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పన్యాల భాస్కర్‌రెడ్డి, కవిత దంపతుల పెద్ద కుమారుడు నవీన్‌రెడ్డి (23) బీటెక్ పూర్తి చేసి ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం సంపాదించాడు. రెండున్నరేళ్లుగా ఉద్యోగం చేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలిచాడు. లాక్డౌన్ సమయంలో కంపెనీ వర్క్ ఫ్రం హోం ఇవ్వడంతో ఇంటి వద్ద నుంచి విధులు నిర్వహిస్తున్నాడు. చదవండి: (ఘోర రోడ్డు ప్రమాదం.. సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి) ఈ క్రమంలో గ్రామంలో సరిగా సిగ్నల్ రాకపోవడంతో వ్యవసాయ బావి వద్ద గదిలో ఉండి ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు అక్కడే పనిచేస్తున్నాడు. రోజురోజుకూ పనిభారం పెరగడంతో మానసిక ఆందోళనకు గురయ్యాడు. ఉద్యోగం మానేస్తానని తల్లిదండ్రులతో చెప్పాడు. దీంతో వారు నీకు ఎలా నచ్చితే అలా చేయమని సర్దిచెప్పారు. రెండు రోజుల క్రితం ఉద్యోగానికి రాజీనామా చేశాడు. విషయం తల్లిదండ్రులకు చెబితే బాధ పడతారని చెప్పకుండా దాచాడు. రాజీనామా చేశాక తీవ్ర మానసిక వేదనకు గురైన నవీన్‌రెడ్డి.. శుక్రవారం ఉదయం తండ్రితో పాటు ఉదయం పని ఉందంటూ వ్యవసాయ బావి వద్ద వెళ్లాడు. తండ్రి గేదెల పాలు తీసుకొని ఇంటికి వచ్చాడు. ఉదయం 8.30 గంటల సమయంలో రెండో కుమారుడు అజయ్ వ్యవసాయ బావి వద్దకు వెళ్లి చూడగా పట్టు పురుగుల షెడ్లో ప్లాస్టిక్ తాడుతో ఉరి వేసుకుని కనిపించాడు. తొగుట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కామారెడ్డి: పెళ్లి బృందం ట్రాక్టర్ బోల్తా
సాక్షి, కామారెడ్డి: దోమకొండ శివారులో చింతామన్ పల్లి గ్రామానికి చెందిన పెళ్లి బృందం ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో పది మందికి గాయాలు కాగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాలు.. చింతామన్ పల్లి గ్రామానికి చెందిన సార్ల సంతోష్ వివాహం ఈ నెల 28న సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం బలవంతపుర్ గ్రామానికి చెందిన అమ్మాయితో జరిగింది. ఈ క్రమంలో పెళ్లి కూతురు ఇంట్లో బుధవారం ఫంక్షన్ ఉండటంతో ఉదయం పెళ్ళికొడుకు తరఫున సుమారు 25 మంది ట్రాక్టర్లో చింతామన్ పల్లి గ్రామం నుంచి బయలుదేరారు. శుభకార్యం ముగించుకుని తిరుగు ప్రయాణంలో మార్గమధ్యలో దోమకొండ శివారులోని దొంగల మర్రి ప్రాంతంలో ట్రాక్టర్ అదుపుతప్పింది.(చదవండి: అత్యాచారం.. ఆపై భయంతో ఆత్మహత్య ) ఈ ఘటనలో చింతామన్ పల్లి గ్రామానికి చెందిన సార్ల ప్రమీల, సాయవ్వ, యశోద, నడిపి రాజవ్వ, ఎల్లయ్య, దేవలక్ష్మి, శివరాజు, రాజయ్య, లింగం కాచాపూర్ కు చెందిన గంగవ్వలకు బలమైన గాయాలయ్యాయి. వీరిలో రాజయ్య, లింగంల పరిస్థితి విషమంగా ఉండటంతో 108 అంబులెన్స్‌లో కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిని దోమకొండ ఆస్పత్రికి తరలించి చికిత్స నిర్వహించారు. సామచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి పరిస్థితి సమీక్షించారు. డ్రైవర్ శ్రీనివాస్ అజాగ్రత్తగా ట్రాక్టర్ నడపడంతో ఈ ప్రమాదం జరిగిందని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఎమ్మెల్యేగా రఘునందన్ రావు ప్రమాణ స్వీకారం
సాక్షి, హైదరాబాద్ : దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలుపొందిన బీజేపీ నేత రఘునందన్ రావు బుధవారం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ ఛాంబర్లో మధ్యాహ్నం ఒంటి గంటకు అతికొద్ది మంది సమక్షంలో దుబ్బాక శాసనసభ సభ్యుడిగా రఘునందన్ రావు ప్రమాణ స్వీకారం చేశారు. రఘునందన్ చేత అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, బీజేపీ నేతలు, ఎమ్మెల్సీ రామచందర్ రావు, ఎమ్మెల్యే రాజసింగ్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి హాజరయ్యారు. చదవండి: రఘునందన్‌పై ఫిర్యాదు: మహిళ ఆత్మహత్యాయత్నం కాగా నవంబర్ 10న దుబ్బాక ఉప ఎన్నికల ఫలితం వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఉపఎన్నికలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరా హోరి పోరు సాగింది. మొత్తం 23 రౌండ్లలో సాగిన దుబ్బాక లెక్కింపులో రఘనందన్‌రావుకు 62, 772 ఓట్లు రాగా.. సోలిపేట సుజాతకు 61, 302 ఓట్లు వచ్చాయి. దీంతో బీజేపీ అభ్యర్థి రఘనందన్‌రావు మొదటి సారిగా అసెంబ్లీలో అడుగు పెట్టనున్నాడు. అత్యల్ప ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించారు. -
రఘునందన్‌పై ఫిర్యాదు: మహిళ ఆత్మహత్యాయత్నం
సాక్షి, సిద్దిపేట: బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుపై అత్యాచార సంచలన ఆరోపణలు చేసిన రాజా రమణి మంగళవారం ఆత్మహత్యాయత్నం చేశారు. రఘునందన్‌తో పాటు పలువురు పోలీసులు తనను వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. అత్యాచారం కేసులో న్యాయం చేయాలని 20 ఏళ్లుగా తిరుతున్నా ఎవరూ స్పందించడం లేదని సెల్ఫీ వీడియోలో వాపోయారు. న్యాయం జరక్కపోగా.. వేధింపులకు గురిచేస్తున్న అధికారులు, ఎమ్మెల్యే రఘునందన్, ఆర్సీ పురం పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు. న్యాయం జరగడం లేదనే ఆవేదన, నిరసనతోనే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు చెప్పారు. (చదవండి: హైకోర్టును ఆశ్రయించిన రఘునందన్‌రావు) రాజా రమణి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేయగా.. ఆర్సీ పురం పోలీసులు ఆమెకు పటాన్‌చెరులోని ఓ ఆస్పత్రిలో రహస్యంగా చికిత్స చేయించి ఇంటికి తరలించినట్టు సమాచారం. కాగా, న్యాయవాది అయిన రఘునందన్‌ను ఒక కేసు విషయమై ఆశ్రయించగా, కాఫీలో మత్తు మందు కలిపి తనపై అత్యాచారం చేశాడంటూ రాజా రమణి గతంలో ఆరోపించిన విషయం తెలిసిందే. కేసుల పరిష్కారం కోసం వచ్చే మహిళల్ని రఘునందన్ భయపెట్టి లొంగదీసుకుంటాడని కూడా రాజా రమణి అప్పటల్లో సంచలన ఆరోపణలు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర మానవ హక్కుల సంఘాన్ని కూడా ఆమె ఆశ్రయించారు. (చదవండి: విలేకరి నుంచి ఎమ్మెల్యే వరకు..) -
‘హైదరాబాద్‌ను ఆదుకోవాలనే సోయిలేదు’
సాక్షి, వరంగల్: దుబ్బాకలో తప్పుడు ప్రచారాలు చేసి.. ఓ కార్యకర్తను బలిచేసి.. ప్రజలను మోసం చేసి గెలిచారు. బీజేపీ నేతలు తెలంగాణ రాష్ట్రానికి ఏం తెచ్చారో సాక్షాలతో చూపండి అని మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు సవాల్ చేశారు. హన్మకొండలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ‘బీజేపీ నేతలు తప్పుడు ప్రచారాలతో తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేస్తున్నారు. బీజేపీకి చెందిన నలుగురు ఎంపీలు ఏం చేశారో శ్వేత పత్రం విడుదల చేయండి. వర్షాలతో రాష్ట్రం అల్లకల్లోలం అయినా పట్టించు కోలేదు. పేదల సంక్షేమంలో మీ పాత్ర ఏంటి? మిషన్ భగీరథకు కేంద్రం 10 అవార్డులు ఇచ్చి ప్రశంసించింది. కానీ ఒక్క రూపాయి కూడా కేటాయించ లేదు. హైదరాబాద్ నగరం వరదలకు కొట్టుకుపోతే ఆదుకోవాలనే సోయి లేదు అని మండిపడ్డారు ఎర్రబెల్లి. (చదవండి: ‘కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వడం లేదు’) ఆయన మాట్లాడుతూ.. ‘బీజేపీ నేతలు ప్రజలను పచ్చి మోసం చేస్తున్నారు. బీజేపీ - కాంగ్రెస్ పార్టీలకు బహిరంగ సవాల్... దేశంలో ఏ రాష్ట్రంలోనైనా రైతు బంధు ఇస్తున్నారా.. ఇస్తే రుజువు చేయాలి. తెలంగాణ రైతులకు మీ మోసాలపై అవగాహన కల్పిస్తాం. త్వరలో రైతులు బీజేపీ నేతలను తరిమికొడతారు. బీజేపీ నేతలవన్నీ బోగస్ మాటలు. కార్పోరేట్ శక్తుల చేతుల్లో కీలుబొమ్మగా మారి రైల్వేను ప్రయివేటీకరణ చేసిన చరిత్ర బీజేపీది. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలకు తెలంగాణ ప్రజలు- రైతులు సిద్ధం కావాలి. బీజేపీ నేతలు సిగ్గులేకుండా రైతుల పట్ల కపట నాటకాలు ప్రదర్శిస్తున్నారు’ అని మండిపడ్డారు ఎర్రబెల్లి. -
సంక్రాంతికి ‘జీహెచ్ఎంసీ’ గిఫ్ట్ ఇస్తారు..
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్‌కు దుబ్బాక ప్రజలు దీపావళి గిఫ్ట్ ఇచ్చారని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సంక్రాంతి గిఫ్ట్ ఇస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి ఆన్లైన్ ద్వారా బుధవారం కేంద్ర హోంశాఖ సహా య మంత్రి కిషన్‌రెడ్డితో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. అసలు బీజేపీ ఎక్కడ ఉందని కేసీఆర్ అన్నారని, ఆయన సొంత జిల్లాలోనే బీజేపీ ఉందని ఇప్పుడు చెబుతున్నానన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ ఆత్మ విమర్శ చేసుకోవాలని హితవు పలికారు. ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజలను దోచుకుంటున్నారని మండిపడ్డారు. పాతబస్తీలో పన్నులు ఎంత వసూలు చేస్తున్నారో ప్రభుత్వం లెక్కలు చెప్పట్లేదన్నారు. ఓట్ల కొనుగోలు కోసమే జీహెచ్ఎంసీలో రూ.10 వేల నగదు పంచుతున్నారని విమర్శించారు. వచ్చేది బీజేపీ ప్రభుత్వమే.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఓడిస్తామని, 2023లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతుందని సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. ఓటర్ల విషయంలో బీజేపీ అభ్యంతరాలను ఎన్నికల కమిషన్ పరిశీలించి పరిష్కరించాలన్నారు. హైదరాబాద్ అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం వల్లే సాధ్యమైందని చెప్పారు. తమపై దుబ్బా క ప్రజలు గురుతర బాధ్యత పెట్టినట్లుగా భావిస్తున్నామన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. అధికార దుర్వినియోగం చేశారు..: కిషన్‌రెడ్డి దుబ్బాకలో కేసీఆర్ ప్రభుత్వం అధికారిక దుర్వినియోగానికి పాల్పడిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. చట్ట వ్యతిరేకంగా బీజేపీ నేతల ఫోన్లను ట్యాప్ చేశారని మండిపడ్డారు. మహిళా మోర్చా అధ్యక్షురాలిని జైల్లో పెట్టారన్నారు. ఫోన్ ట్యాపింగ్‌పై కేంద్ర అధికారులతో చర్చించి ఏమి చేయాలనే దానిపై యోచి స్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ ఎదిగేందుకు పని చేస్తామని తెలిపారు. బీజేపీ రాష్ట్ర శాఖ చొరవతో కేంద్ర బృందాలు తెలంగాణలో పర్యటించాయని, పంట నష్టంపై కేంద్ర బృందాలకు ఇప్పటివరకు రాష్ట్ర సర్కార్ నివేదిక ఇవ్వలేదన్నారు. సీఎం కేసీఆర్ వెంటనే పంట నష్టంపై అధికారులతో సమీక్ష చేసి రిపోర్ట్ పంపించాలని సూచించారు. (ఒక ఎన్నిక.. అనేక సంకేతాలు!) -
దుబ్బాక ఫలితం.. గందరగోళంలో కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం కాంగ్రెస్ నాయకత్వాన్ని గందరగోళంలో పడేసింది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న ఆ పార్టీ కీలక నేతలంతా ఎన్నికల క్షేత్రంలో విస్తృతంగా పనిచేసినా ఫలితం అనుకూలంగా రాకపోవడం వారిని తీవ్ర నైరాశ్యంలోకి నెట్టింది. పీసీసీ చీఫ్ మొదలు మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి నేతల వరకు దుబ్బాకలో మకాం వేసి ఓటర్లను ఆకట్టుకొనేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడం, బీజేపీ గెలుపొందడంతో కాంగ్రెస్ నేతల్లో అయోమయం నెలకొంది. అంచనాలు తారుమారు 2018 ముందస్తు ఎన్నికల్లో దుబ్బాకలో తమకు 26 వేల పైచిలుకు ఓట్లు వచ్చాయని, ఈసారి అంతకన్నా ఎక్కువ వస్తాయనే ధీమాతో టీఆర్ఎస్ నుంచి వచ్చిన చెరుకు శ్రీనివాస్‌రెడ్డిని బరిలోకి దింపింది కాంగ్రెస్. గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లకు తోడు చెరుకు ముత్యంరెడ్డిపై నియోజకవర్గ ప్రజల్లో ఉన్న సానుకూలత మరికొన్ని ఓట్లు రాలుస్తుందని ఆశలు పెట్టుకుంది. కానీ ఆ ఆశలు అడియాశలయ్యాయి. కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. ఓట్లను రాబట్టుకొనేందుకు పని విభజన చేసుకొని మరీ టీపీసీసీలోని మహామహులంతా దుబ్బాకలోనే మకాం వేసి ఎన్నికల ప్రచారం నిర్వహించినా ఆశించిన ఫలితం రాలేదు. ‘మా పార్టీకి చెందిన దాదాపు 150 మంది ముఖ్య నాయకులంతా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గ్రామాలు, మండలాలవారీగా బాధ్యతలు తీసుకొని పనిచేశాం. రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత మాకే లాభిస్తుందని అంచనా వేశాం. కానీ మా వ్యూహం ఫలించలేదు. దుబ్బాక ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మలేదు. ఉత్తమ్‌తోపాటు రేవంత్, భట్టి లాంటి నాయకులకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించిన చోట్ల కూడా పార్టీకి లీడ్ రాలేదు. కేవలం పార్టీ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డి సొంత మండలంలో ఒక రౌండ్లోనే లీడ్ వచ్చింది’అని పీసీసీ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. ‘హుజూర్నగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్, టీఆర్ఎస్ల మధ్య పోటీ జరిగినప్పుడు బీజేపీకి కనీస స్థాయిలో ఓట్లు రాలేదు. దుబ్బాకలో మాత్రం టీఆర్ఎస్, బీజేపీ ల మధ్య జరిగిన పోటీలో మాకు గౌరవప్రదమైన స్థాయిలో 22 వేల ఓట్లు వచ్చాయి. మమ్మల్ని ప్రజలు తిరస్కరించారు కానీ, చెప్పుకోదగిన స్థాయిలోనే ఓట్లు వచ్చాయి. దుబ్బాక ఫలితాన్ని ఎలా అంచనా వేయాలో అర్థం కావడం లేదు’అని మరో కాంగ్రెస్ నేత అభిప్రాయపడ్డారు. తదుపరి ఎన్నికల్లో ఏమవుతుందో..? దుబ్బాకలో మూడో స్థానానికి పడిపోవడం, త్వరలో జరిగే ఎన్నికల్లో ఏమవుతుందోననే ఆందోళన కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమవుతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఈ ప్రభావం ఉంటే మళ్లీ అవే ఫలితాలు పునరావృతమవుతాయని, మరోసారి టీఆర్ఎస్–బీజేపీల మధ్యే పోటీ జరిగిందనే వాతావరణం ఏర్పడితే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఇదే ధోరణిలో ఎన్నికలు జరుగుతాయని అనుమానిస్తున్నారు. ఆ ధోరణి అలాగే కొనసాగితే తాము పెట్టుకొనే మిషన్–2023 లక్ష్యానికి గండిపడినట్టేననే అభి ప్రాయం కాంగ్రెస్ నేతల్లో వ్యక్తవుతోంది. టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకొనే పరిస్థితి లేకుండా పోతే పార్టీ భవిష్యత్తుకు ప్రమాదకరమని,అధిష్టానం తీరు మారి రాష్ట్ర పార్టీని గాడిన పెట్టకపోతే మున్ముందు మరిన్ని నష్టాలు జరుగుతాయని హెచ్చరిస్తున్నారు. చదవండి: దుబ్బాక ఫలితంపై టీఆర్ఎస్లో అంతర్మథనం -
దుబ్బాకలో కమలం
-
దుబ్బాక ఫలితంపై టీఆర్ఎస్లో అంతర్మథనం
సాక్షి, హైదరాబాద్: ఏమిటిది? ఎందుకిలా జరిగింది? కారణాలేంటి? పెట్టని కోట లాంటి దుబ్బాకలో ఎదురుదెబ్బ తగలడమేమిటి? ఏయే అంశాలు ప్రభావం చూపాయి? ఎక్కడ లెక్క తప్పింది?.... ఎన్నో, ఎన్నెన్నో ప్రశ్నలు ఇప్పుడు టీఆర్ఎస్ను వేధిస్తున్నాయి. పార్టీ ఆవిర్భావం నుంచి తమకు బలమైన పట్టున్న దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో ఓటమికి దారితీసిన పరిస్థితులపై టీఆర్ఎస్లో అంతర్మథనం జరుగుతోంది. 2009లో మినహా 2004 నుంచి 2018 వరకు జరిగిన అన్ని ఎన్నికల్లోనూ పార్టీ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి విజయం సాధిస్తూ వచ్చారు. ఆయన మరణంతో జరిగిన ఉప ఎన్నికలో రామలింగారెడ్డి భార్య సోలిపేట సుజాత టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగినా స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. 2018 ఎన్నికల్లో 62.5 వేల ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించిన టీఆర్ఎస్ ప్రస్తుతం ఓటమి పాలవడానికి అనేక అంశాలు దోహదం చేసినట్లు పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. (బీజేపీకి బూస్టే) ఈ ఏడాది ఆగస్టు 6న ఎమ్మెల్యే రామలింగారెడ్డి మరణించిన నాటి నుంచే ఉపఎన్నిక లక్ష్యంగా బీజేపీ పావులు కదపింది. క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్ శ్రేణులను కొంతమేర అయోమయానికి గురిచేసింది. రామలింగారెడ్డి మరణంతో ఏర్పడిన ఖాళీ పార్టీలో అంతర్గత సమన్వయాన్ని దెబ్బతీసింది. దివంగత ఎమ్మెల్యేపై అసంతృప్తి ఉన్న నేతలు ఆయన కుటుంబసభ్యులకు టికెట్ ఇవ్వొద్దంటూ బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు దివంగత మాజీమంత్రి చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి టీఆర్ఎస్ టికెట్‌ను ఆశించడం వంటి పరిణామాలు కూడా టీఆర్ఎస్ పార్టీ కేడర్ని గందరగోళంలో పడేశాయి. ఉపఎన్నిక షెడ్యూలు వెలువడిన తర్వాతే పార్టీ అభ్యర్థిని ప్రకటించడం, అప్పటికే చీలికలు, పేలికలుగా ఉన్న మండల, గ్రామ స్థాయి నాయకులు ఒకతాటిపైకి రావడానికి సమయం పట్టింది. ఇలా మొదట్లోనే అవాంతరాలు ఎదురయ్యాయి. టీఆర్ఎస్ టికెట్ దక్కని చెరుకు శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరి పోటీ చేయడం కూడా కొంతమేర ప్రభావం చూపింది. హరీష్.. అంతా తానై వ్యవహరించినా..! దుబ్బాక నియోజకవర్గానికి పొరుగునే ఉన్న సిద్దిపేటకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు ఉపఎన్నిక షెడ్యూలు వెలువడిన తర్వాత కరోనా బారినపడటంతో సుమారు పది రోజులు క్వారంటైన్లో గడపాల్సి వచ్చింది. మండలాల వారీగా ఇన్చార్జిలను నియమించి సమన్వయం చేసినా యువత, నిరుద్యోగులు అప్పటికే బీజేపీ వైపు మొగ్గు చూపినట్లు గుర్తించారు. మరోవైపు టీఆర్ఎస్లో ఉన్న అంతర్గత కలహాలు, సమన్వయ లోపాన్ని గుర్తించిన బీజేపీ ప్రచార వేగాన్ని పెంచింది. (మూడు సార్లు ఓడినా.. పట్టు వదల్లేదు.. ) కరోనా నుంచి కోలుకున్న మంత్రి హరీష్‌రావు దుబ్బాకపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టినా పార్టీ కేడర్‌లో అంతర్గత సమన్వయం కోసమే ఎక్కువ సమయం వెచ్చించాల్సి వచ్చింది. బీజేపీ, కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం మొత్తం దుబ్బాకలో మోహరించడం ద్వారా టీఆర్ఎస్ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించినట్లు తాజా ఫలితాలు వెల్లడించాయి. ప్రచారభారాన్ని మొత్తం మంత్రి హరీష్‌రావుపై వేసి పార్టీ అధినేత, సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు మంత్రులెవరూ ప్రచారానికి వెళ్లకపోవడం కూడా ప్రభావం చూపిందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. యువత, నిరుద్యోగులదే కీలకపాత్ర తొలుత నిరుద్యోగులు, యువతను ప్రభావితం చేసిన బీజేపీ ఆ తర్వాత టీఆర్ఎస్ సాంప్రదాయ ఓటు బ్యాంకును సొంతం చేసుకోవడంపై దృష్టి కేంద్రీకరించింది. 2018లో కేవలం 22వేలకు పైగా ఓట్లు సాధించిన బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు ప్రస్తుతం 63వేలకు పైగా ఓట్లు సాధించారు. బీజేపీకి క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగం పెద్దగా లేనప్పటికీ యువత, నిరుద్యోగులు కాషాయ అనుకూల ఓటింగ్‌ను పెంచడంలో కీలకంగా వ్యవహరించారు. టీఆర్ఎస్ అసంతృప్త నేతల వలసలకు మంత్రి హరీష్ అడ్డుకట్ట వేసినా, వీరు పార్టీ అభ్యర్థికి పూర్తిస్థాయిలో సహకరించలేదని బూత్‌ల వారీగా పోలైన ఓట్ల సంఖ్య వెల్లడిస్తోంది. ఆరున్నరేళ్లలో నియోజకవర్గంలో రూ.7వేల కోట్లతో అభివృద్ది చేయగా, 1.69 లక్షల మంది రైతుబంధు, ఆసరా పించన్లు, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ తదితర ప్రభుత్వ పథకాల లబ్దిదారులు ఉన్నారు. వీరందరినీ టీఆర్ఎస్ తమ సాంప్రదాయ ఓటు బ్యాంకుగా భావించినా, ఓటింగ్ మాత్రం భిన్నంగా జరిగినట్లు వెల్లడైంది. తమ కుటుంబసభ్యులను బీజేపీకి అనుకూలంగా మలచడంలో యువత, నిరుద్యోగులు కీలకపాత్ర పోషించినట్లు టీఆర్ఎస్ అం చనాకు వచ్చింది. సరిహద్దుల్లో ఉన్న గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాలతో దుబ్బాక అభివృద్ధిని ఓటర్లు పోల్చుకోవడం కూడా టీఆర్ఎస్కు నష్టం చేసింది. దుబ్బాక లో అధ్వానంగా ఉన్న రోడ్ల పరిస్థితిని కాంగ్రెస్, బీజేపీ బలంగా ఎత్తి చూపాయి. పూర్తిగా గ్రామీణ వాతావరణం ఉన్న దుబ్బాకలో చేగుంటను మున్సిపాలిటీగా మార్చకపోవడం, బీడీ కార్మికుల పింఛన్లు, ఆసరా పింఛన్‌దారుల వయోపరిమితి కుదించకపోవడం వంటి అనేక అంశాలు టీఆర్ఎస్పై ప్రభావం చూపించాయి. (గులాబీ తోటలో కమల వికాసం) సోషల్ మీడియాలో బీజేపీది పైచేయి ‘బీజేపీ సమాజంలో తక్కువ.. సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ’ అని కేటీఆర్ వ్యాఖ్యానించినా, బీజేపీ మాత్రం సోషల్ మీడియాను తనకు అనుకూలంగా ఉపయోగించుకోవ డంలో సఫలమైందని టీఆర్ఎస్ అంగీకరిస్తోంది. రఘునందన్‌రావు బంధువుల ఇంట్లో డబ్బులు పట్టుబడిన ఘటన వాస్తవమైనా బీజేపీ నేతలు మాత్రం పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ విషయంలో బీజేపీ సోషల్ మీడియాలో చేసిన ప్రచారాన్ని తిప్పికొట్టడంలో టీఆర్ఎస్ విఫలమైం దనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పోలింగ్ ముందు రోజు సిద్దిపేటలో ఎమ్మెల్యే క్రాంతిపై దాడి ఘటన, పోలింగ్ రోజున కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరారంటూ జరిగిన ప్రచారం వెనుక బీజేపీ హస్తం ఉందని టీఆర్ఎస్ ఆరోపించింది. తాము సర్వశక్తులు ఒడ్డటం వల్లే.. బీజేపీ దుష్ప్రచారాన్ని తట్టుకుని గెలుపు అంచుల దాకా వెళ్లగలిగామని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. -
దుబ్బాకలో టీఆర్ఎస్ ఓటమి తట్టుకోలేక..
కాల్వశ్రీరాంపూర్ (పెద్దపల్లి): దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఓటమిని తట్టుకోలేక ఆ పార్టీ నేత మృతి చెందారు. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. కాల్వశ్రీరాంపూర్ సింగిల్ విండో డైరెక్టర్ పులి సత్యనారాయణరెడ్డి, పార్టీ నాయకులతో కలసి ఉత్కంఠగా సాగుతున్న దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలను టీవీల్లో వీక్షిస్తున్నారు. సాయంత్రం టీఆర్ఎస్ అభ్యర్థి సుజాత ఓడిపోయిందని ప్రకటించడంతో తీవ్రకలత చెందారు. ఇక బీజేపీ వారు హుషారై బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకుంటారంటూ అక్కడే ఉన్న సహచరులకు చెబుతూనే ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే అతడిని పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో తుదిశ్వాస విడిచారు. ఈ హఠాత్పరిణామానికి అక్కడున్న వారంతా షాక్‌కు గురయ్యారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. (కారును పోలిన రోటీ మేకర్) -
కారును దెబ్బతీసిన రోటీ మేకర్
సిద్దిపేటజోన్ : దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గుర్తు కారును పోలిన రోటీ మేకర్ (చపాతీ పీట, అప్పడాల కర్ర) గుర్తు స్వతంత్ర అభ్యర్థికి అనూహ్యంగా ఓట్లు తెచ్చిపెట్టింది. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన బండారి నాగరాజుకు రోటీమేకర్ గుర్తురాగా, ఆయనకు 3,570 ఓట్లు పోల్ అయ్యాయి. సూర్యాపేట జిల్లా మునగాల మండలం బరాఖత్‌గూడేనికి చెందిన నాగరాజు దుబ్బాక ఎన్నికల్లో పోటీకి దిగారు. ఈ ఎన్నికల్లో 23 మంది బరిలో ఉండడంతో పోలింగ్ రోజు రెండు ఈవీఎంలను వినియోగించారు. మొదటి ఈవీఎంలో 3వ నంబర్లో టీఆర్ఎస్ అభ్యర్థి (కారు గుర్తు) ఉండగా, రెండో ఈవీఎంలో అచ్చంగా కారును పోలిన రోటీ మేకర్ గుర్తు కూడా పైన ఉండటం ఓటర్లను అయోమయానికి గురిచేసింది. చాలామంది కారు గుర్తుగా పొరపడి రెండో ఈవీఎంలోని రోటీ మేకర్‌పై ఓటు వేయడంతో స్వతంత్ర అభ్యర్థి నాగరాజుకు 3,570 ఓట్లు వచ్చి ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
మూడు సార్లు ఓడినా.. పట్టు వదల్లేదు..
సాక్షి, సిద్దిపేట : పత్రికా విలేకరి నుంచి ఉద్యమకారుడిగా, న్యాయవాదిగా, రాజకీయ నాయకుడిగా అంచలంచెలుగా ఎదుగుతూ వచ్చిన మాధవనేని రఘునందన్‌రావు తాజాగా దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో విలేకరుల స్థాయి నుంచి పలువురు రాజకీయ నాయకులుగా ఎదిగిన చరిత్ర ఉంది. ఇప్పటివరకు ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి సత్యనారాయణ ఎమ్మెల్సీగా, దుబ్బాక నుంచి దివంగత సోలిపేట రామలింగారెడ్డి ఎమ్మెల్యేగా, ఉమ్మడి మెదక్ జిల్లాలోని అందోల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన క్రాంతికిరణ్ పాత్రికేయ వృత్తి నుంచి వచ్చిన వారే. అదే కోవలో రఘునందన్‌రావు సైతం చేరారు. సోలిపేట రామలింగారెడ్డి ప్రాతినిధ్యం వహించిన స్థానాన్ని ఆయన మరణం తర్వాత మరోసారి ఒక జర్నలిస్టుగా పనిచేసిన రఘునందన్‌రావు గెలుచుకోవడం విశేషం. (గులాబీ తోటలో కమల వికాసం) రాజకీయాలపై ఆసక్తితో... దుబ్బాక మండలం బొప్పాపూర్‌కు చెందిన భగవంతరావు, భారతమ్మ దంపతులకు రఘునందన్‌రావు 1968 మార్చి 23న సిద్దిపేటలో జన్మించారు. డిగ్రీ (బీఎస్సీ) వరకు సిద్దిపేటలోనే చదువుకున్న ఆయన.. ఉస్మానియా వర్సిటీ నుంచి న్యాయవాద పట్టా పొందా రు. అనంతరం 1991లో తన మకాంను పటాన్‌చెరుకు మార్చారు. అప్పటి నుంచి దాదాపు ఐదేళ్లపాటు ఓ తెలుగు దినపత్రికలో విలేకరిగా పనిచేశారు. ఆ తర్వాత హైకోర్టు న్యాయవాదిగా పనిచేస్తూనే రాజకీయాలపై ఆసక్తితో 2001లో టీఆర్ఎస్ ఆవిర్భావ సమయంలో అందులో చేరారు. అయితే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై 2013లో టీఆర్ఎస్ ఆయన్ను సస్పెండ్ చేసింది. దీంతో బీజేపీలో చేరి 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి దుబ్బాక, మెదక్ స్థానాల నుంచి పోటీ చేశారు. మూడుసార్లు ఓటమిపాలైనా పట్టువీడకుండా సోలిపేట మరణంతో వచ్చిన ఉప ఎన్నికలో పోటీ చేసి విజయం సాధించారు. చివరిశ్వాస వరకు ప్రజలతోనే... తన చివరి శ్వాస వరకు దుబ్బాక ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటానని దుబ్బాక ఎమ్మెల్యేగా ఎన్నికైన రఘునందన్‌రావు పేర్కొన్నారు. మంగళవారం దుబ్బాక ఉప ఎన్నికలో గెలుపొందినట్లు రిటర్నింగ్ అధికారి నుంచి ధ్రువీకరణ పత్రం అందుకున్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తన గెలుపు చరిత్రాత్మకమని, టీఆర్ఎస్కు గుణపాఠమని పేర్కొన్నారు. ప్రగతి భవన్‌కు వినపడేలా దుబ్బాక ప్రజలు తీర్పు ఇచ్చారని, ముఖ్యమంత్రికి విద్య నేర్పిన దుబ్బాకే, ఉప ఎన్నిక ద్వారా మళ్లీ విద్య నేర్పిందని వ్యాఖ్యానించారు. ఉప ఎన్నిక కారణంగా అనేక మందిపై అక్రమ, నిర్బంధ కేసులు పెట్టారని, వారందరినీ సంగారెడ్డి జైలుకు తరలించడం, వారు ఈ విజయోత్సవంలో లేకపోవడం బాధాకరమన్నారు. ఈ అరాచక, అప్రజాస్వామ్య, నియంత్రిత్వంపై పోరాటం చేస్తామన్నారు. తన విజయానికి సహకరించిన సిద్దిపేట సీపీ, హైదరాబాద్ సీపీలకు కృతజ్ఞతలతోపాటు తన గెలుపును సిద్దిపేట సీపీ జోయల్ డేవిస్‌కు అంకితం ఇస్తున్నట్లు రఘునందన్‌రావు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు తన గెలుపును ఆకాంక్షించారన్నారు. తన గెలుపునకు ప్రత్యక్షంగా, పరోక్షంగా కృషి చేసిన రాష్ట్ర నాయకత్వం, కార్యకర్తలకు రుణపడి ఉంటానన్నారు. ప్రధాని మోదీతోపాటు బీజేపీ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎంపీ అర్వింద్, ఇతర నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తనకు అండగా నిలిచారని, వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. అనంతరం ఇందూరు ఇంజనీరింగ్ కళాశాల నుంచి పార్టీ జిల్లా కార్యాలయం వరకు విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు. -
గులాబీ తోటలో కమల వికాసం
సాక్షి, సిద్దిపేట : దుబ్బాక దంగల్‌లో అధికార టీఆర్ఎస్కు నిరాశే మిగిలింది. గులాబీ కోటలో కమలం వికసించింది. ప్రధాన పార్టీలన్నీ సర్వశక్తులు ఒడ్డి తలపడ్డ దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. క్షణక్షణానికి ఆధిక్యం మారుతూ... విజయం బీజేపీ, టీఆర్ఎస్లతో ఆఖరి వరకు దోబూచులాడింది. తీవ్ర ఉత్కంఠను రేపిన పోరులో చివరకు కాషాయదళ అభ్యర్థి మాధవనేని రఘునందన్‌రావు 1,079 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. తెలంగాణ ఉద్యమకాలం నుంచి గులాబీ దళానికి కంచుకోటగా ఉన్న దుబ్బాక నియోజకవర్గ ఉప ఎన్నికలో ఓటరు టీఆర్ఎస్కు షాకిచ్చాడు. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణం తాలూకు సానుభూతి, అధికారపార్టీకి ఉండే అనుకూలత... ఇవేవీ టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతను గట్టెక్కించలేకపోయాయి. గతంలో వరుస ఓటములు చవిచూసిన రఘునందన్‌రావు ఎట్టకేలకు ప్రతిష్టాత్మక పోరులో విజయతీరాన్ని చేరారు. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం అందరి దృష్టి దుబ్బాకపైనే కేంద్రీకృతమైంది. మొదటి రౌండ్ నుంచి చివరి రౌండ్ వరకు విజయం దోబూచులాడింది. రౌండ్‌రౌండ్‌కూ ఆధిక్యం మారుతూ నరాలుతెగే ఉత్కంఠ నెలకొంది. నువ్వా..? నేనా..? అన్నట్లుగా సాగిన హోరాహోరీ పోరులో చివరి నాలుగు రౌండ్లలో అధిక్యం సాధించి బీజేపీ గెలుపొందింది. దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట, దౌల్తాబాద్, రాయపోలు, నార్సింగి, చేగుంట మండలాల పరిధిలో ఉన్న నియోజకవర్గంలో 1,98,807 ఓట్లకు గాను.. 1,64,192 మంది ఓటర్లు నేరుగా ఓటు హక్కును వినియోగించుకోగా... పోస్టల్ బ్యాలెట్ ద్వారా 1,453 మంది ఓటు హక్కును వినియోగించకున్నారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుకు 63,352 ఓట్లు , టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతకు 62,273 ఓట్లు , కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డికి 22,196 ఓట్లు వచ్చినట్లు జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి భారతీ హోళికేరి ప్రకటించారు. రఘునందన్‌రావు విజయాన్ని ధృవీకరించారు. నాలుగో స్థానంలో నిలిచిన స్వతంత్ర అభ్యర్థి బండారు నాగరాజుకు 3,489 ఓట్లు రావడం గమనార్హం. రౌండ్‌రౌండ్‌కూ ఉత్కంఠ ఉపఎన్నికల ఓట్ల లెక్కింపులో రౌండ్ రౌండ్‌కూ ఉత్కంఠ నెలకొంది. మొత్తం 315 పోలింగ్ బూత్‌లు ఉండగా... రెండు గదుల్లో 14 టేబుల్స్‌పై ఓట్లను లెక్కించారు. మొత్తం 23 రౌండ్లు లెక్కింపు ప్రక్రియ సాగింది. మొదట దుబ్బాక రూరల్, తర్వాత దుబ్బాక మున్సిపాలిటీ, ఆపై వరుసగా మిరుదొడ్డి, తొగుట, దౌల్తాబాద్, రాయపోలు, నార్సింగి మండలాల ఓట్లను లెక్కించారు. చేగుంట మండలంతో కౌంటింగ్ ముగిసింది. దుబ్బాక, మిరుదొడ్డి మండలాల్లో బీజేపీ మెజారిటీతో సాధించగా.. దౌల్తాబాద్, రాయపోలు మండలాల్లో టీఆర్ఎస్కు మెజారిటీ వచ్చింది. తొగుట మండలం తప్ప ఎక్కడ కూడా కాంగ్రెస్ చెప్పుకోదగిన ఓట్లు సాధించలేదు. చివరినిమిషం వరకు నువ్వా..? నేనా..? అన్నట్లు టీఆర్ఎస్, బీజేపీ పోటీపడగా... చేగుంట మండలంలో బీజేపీ ఆధిక్యం చూపడంతో రఘునందన్‌రావు విజయం ఖరారైంది. రఘునందన్‌రావు విజయంతో తెలంగాణవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయాయి. కమలదళంలో ఫుల్‌జోష్ కనిపించగా.... టీఆర్ఎస్ శ్రేణులు నైరాశ్యంలో మునిగిపోయాయి. తారుమారైన అంచనాలు ఎన్నికల ఫలితాలపై అందరి అంచనాలు తారుమారయ్యాయి. 3వ తేదీన ఎన్నిక ముగిసిన నాటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ చూసినా.. ఎవరి నోట విన్నా.. ఈ ఫలితాలపైనే చర్చ సాగింది. కొన్ని ఎగ్జిట్‌పోల్స్ బీజేపీకి అనుకూలంగా రాగా... మరికొన్ని టీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పాయి. ముందుగా 30, 40 వేల మెజార్టీతో టీఆర్ఎస్ గెలుస్తుందని ఆ పార్టీ నాయకులు చెప్పినప్పటికీ... క్షేత్రస్థాయిలో వచ్చిన మార్పులు, యువత ప్రభావం జయాపజయాలను తారుమారు చేశాయి. ఎవరునెగ్గినా సుమారు 10 వేల ఓట్లతోనేనని బెట్టింగ్‌లు కూడా కాశారు. చివరకు 1,079 ఓట్ల మెజారిటీ బీజేపీ గెలిచి అందరి అంచనాలను తారుమారు చేసింది. ఫలించని కాంగ్రెస్ వ్యూహం ఈ ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ ఢిల్లీ నుంచి గల్లీ వరకు ముఖ్య నాయకులను దుబ్బాక నియోజకవర్గంలో మోహరించింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ స్వయంగా రంగంలోకి దిగారు. దుబ్బాకలో రెండు రోజులు మకాం పెట్టి మరీ దిశానిర్దేశం చేశారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఇతర హేమాహేమీలంతా మండలాలు, గ్రామాలను పంచుకొని ప్రచారం చేశారు. గెలుపు ఓటమిల విషయం పక్కన పెట్టినా... గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లైనా సాధించి రెండో స్థానాన్ని పదిలపరుచుకోవాలన్న వ్యూహం బెడిసికొట్టింది. గత ఎన్నికల్లో 26,691 ఓట్లు సాధించిన కాంగ్రెస్ ఈ దఫా 22,196 ఓట్లతో డిపాజిట్‌ను కోల్పోయింది. -
దుబ్బాక విజయంతో బీజేపీ సంబరాలు
-
తీర్పు చారిత్రాత్మకం : రఘునందన్
సాక్షి, సిద్దిపేట : ఉత్కంఠ బరితంగా సాగిన దుబ్బాక ఉప ఎన్నికల పోరులో బీజేపీ అభ్యర్థ రఘునందన్‌రావు విజయం సాధించడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. అధికార టీఆర్ఎస్పై అనుహ్య రీతిలో గెలుపొంది.. గులాబీ దళానికి సవాలు విసురుతున్నారు. రానున్న ఎన్నికల్లోనూ దుబ్బాక ఫలితమే పునరావృత్తం అవుతుందని గట్టి హెచ్చరికలు పంపుతున్నారు. అధికార పార్టీ నేతలు ఎన్ని అవాంతరాలు, అడ్డంకులు సృష్టించినా.. దుబ్బాకలో కాషాయ జెండా ఎగరేశామని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. (తొలిదెబ్బ.. ఫలించని హరీష్ ఎత్తుగడలు) ఇక ఈ ఫలితాలు ఎంతో చారిత్రాత్మకమైనవని విజేత రఘునందన్‌రావు అన్నారు. తనకు విజయాన్ని అందించిన దుబ్బాక ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ విజయం నియోజకవర్గ ప్రజలకు అంకితమన్నారు. ఫలితాల అనంతరం సిద్దిపేటలో ఇందూరు కాలేజీ వద్ద రఘునందన్‌రావు సాక్షితో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో తన గెలుపును అడ్డుకోవాడానికి టీఆర్ఎస్ నేతలు అన్ని విధాల ప్రయత్నించారని విమర్శించారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, అసెంబ్లీ వేదికగా వారి తీరును ఎండగడతానని అన్నారు. అక్రమ కేసులు, నిర్బంధాలను తట్టుకుంటూ పోరాటం సాగిస్తామన్నారు. (దుబ్బాకలో బీజేపీ సంచలన విజయం) ‘దుబ్బాక ప్రజానీకానికి శిరస్సు వంచి నమస్సులు తెలుపుతున్నా . ఈ విజయం దుబ్బాక ప్రజలకు అంకితం . ఏ గడ్డ నుంచి అయితే తెలంగాణ ఉద్యమం ప్రారంచించామో గొంతె త్తామో అదే గడ్డ ఇచ్చిన తీర్పు ప్రగతి భవన్ వరకూ పోవాలి. రాష్ట్రంలో నిరంకుశ నియంత్రుత్వ పాలనకు చరమ గీతం పాడేలా రీ సౌండ్ ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా, బండి సంజయ్‌కు ధన్యవాదములు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ఊదిన నాయకుల్లా రా కలిసి రండి. ఏకమై పోరాడుదాం’ అని వ్యాఖ్యానించారు. -
దుబ్బాకలో ఓటమి.. హరీష్ రావు స్పందన
సాక్షి, సిద్దిపేట: దుబ్బాకలో ప్రజా తీర్పును శిరసా వహిస్తామని మంత్రి హరీష్ రావు అన్నారు. ఉప ఎన్నిక ఓటమికి తానే బాధ్యత వహిస్తానని పేర్కొన్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు జయకేతనం ఎగురవేసిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత 1079 ఓట్ల తేడాతో ఆయన చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ విషయంపై స్పందించిన మంత్రి హరీష్ రావు విలేకరులతో మాట్లాడుతూ.. ఓటమికి గల కారణాలు పూర్తి స్థాయిలో సమీక్షించుకుంటామని, లోపాలను సరిచేసుకుంటామని పేర్కొన్నారు. (చదవండి: దుబ్బాక ఫలితం మమ్మల్ని అప్రమత్తం చేసింది: కేటీఆర్) అదే విధంగా టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసిన దుబ్బాక ప్రజలకు, ఎన్నికల్లో కష్టపడ్డ ప్రతి ఒక్క కార్యకర్తకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఓటమి పాలైనప్పటికీ నిరంతం ప్రజాసేవకే అంకితమవుతామని, ప్రజలకు అన్నిరకాలుగా అండగా ఉంటామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతానని హరీష్‌రావు హామీ ఇచ్చారు. కాగా టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణంతో దుబ్బాకలో ఉప ఎన్నిక అనివార్యమైంది. నవంబర్ 3న జరిగిన ఈ ఎన్నికలో విజయం సాధించిన బీజేపీ, టీఆర్ఎస్ కంచుకోట అయిన సిద్ధిపేట జిల్లాలో కాషాయ జెండా ఎగురవేసి భారీ షాకిచ్చింది. -
దుబ్బాకలో బీజేపీ విజయం అద్భుతం: మాధవ్
సాక్షి, విశాఖపట్నం: హోరాహోరిగా సాగిన దుబ్బాక ఉప ఎన్నికలో చివరకు బీజేపీ విజయం సాధించింది. ఈ సందర్భంగా విశాఖపట్నం బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దుబ్బాకలో బీజేపీ అద్భుతమైన విజయం సాధించింది. అనంతరం బీజేపీ అభ్యర్థి రఘునందన్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ కార్యకర్తలను ఎన్నో విధాలుగా అధికార పార్టీ టీఆర్ఎస్ ఇబ్బందులకు గురిచేసిందిని, తమ పార్టీ నేతలపై తప్పుడు కేసులు పెట్టిందని ఆరోపించారు. ఎన్నికల్లో గెలవడం కోసం టీఆర్ఎస్ అడ్డదారులు తొక్కిందన్నారు. దక్షిణాదిలో బీజేపీకి బలం లేదన్న వారికి దుబ్బాక ఫిలితమే ఒక నిదర్శనం అన్నారు. బీహార్‌లో కూడా ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని, బీజీపీ విజయం సాధించడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పనితిరే నిదర్శనం అని ఎమ్మెల్సీ పేర్కొన్నారు. -
టీఆర్ఎస్కు ‘మెజారిటీ’ గుబులు!
సాక్షి, హైదరాబాద్: దుబ్బాకలో సిట్టింగ్ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకుంటామని అధికార టీఆర్ఎస్ గట్టిగా చెబుతున్నా మెజారిటీ విషయంలో మాత్రం ఆ పార్టీ గుబులు చెందుతోంది. ఎన్నికల ప్రక్రియ మొదట్లో మెజారిటీ పెంచుకోవడంపైనే దృష్టి సారించిన టీఆర్ఎస్... ఇప్పుడు గెలిస్తే చాలు అన్న స్థాయిలో ఉంది. కనీసం 25 వేల మెజారిటీ వస్తుందని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నా పోలింగ్ తరువాత వెలువడుతున్న అంచనాలు వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో బీజేపీ ఓటు శాతం గణనీయంగా పెరిగిందన్న అంచనాలను కూడా టీఆర్ఎస్ విశ్లేషిస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికలు జనవరి మూడో వారంలో జరుగుతాయనే సంకేతాలు రావడం, జీహెచ్ఎంసీ ఎన్నికల సన్నాహాలను బీజేపీ ఇప్పటికే ప్రారంభించిన నేపథ్యంలో దుబ్బాక ఫలితం కమలదళానికి ఆయుధంగా మారకూడదనే అభిప్రాయం టీఆర్ఎస్లో కనిపిస్తోంది. 90 వేల ఓట్లపై ధీమా... ఈ నెల 3న దుబ్బాక ఉప ఎన్నిక ముగిశాక పోలింగ్ సరళితోపాటు తమకు పోలయ్యే ఓట్లపై టీఆర్ఎస్ అంచనాకు వచ్చినట్లు సమాచారం. 1.64 లక్షల ఓట్లు పోలవగా సుమారు 90 వేల ఓట్లు టీఆర్ఎస్ అభ్యర్థి సాధిస్తారని పార్టీ నేతలు భావిస్తున్నారు. మిగతా సుమారు 74 వేల ఓట్లలో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు సాధించే ఓట్ల సంఖ్యపైనే మెజారిటీ ఆధారపడి ఉంటుందని విశ్లేషిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో బీజేపీ హడావుడి చేసినా దుబ్బాక నియోజకవర్గంలో ఆ పార్టీకి ఓటింగ్ అదే స్థాయిలో జరగలేదని క్షేత్రస్థాయిలో పనిచేసిన టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. నియోజకవర్గంలోని ఏడు మండలాలకుగాను 2 లేదా 3 మండలాల పరిధిలోనే బీజేపీ కొంతమేర ప్రభావం చూపిందనే ప్రాథమిక అంచనాకు టీఆర్ఎస్ వచ్చింది. భారీ మెజారిటీ పరిస్థితి నుంచి... రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో దుబ్బాక నుంచి వరుసగా నాలుగోసారి పోటీ చేసిన టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు ముత్యంరెడ్డిపై సుమారు 37 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మద్దుల నాగేశ్వర్‌రెడ్డిపై సోలిపేట రామలింగారెడ్డి 62,500పైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2014, 2018లోనూ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎం. రఘునందన్‌రావు మూడో స్థానంలో నిలిచి డిపాజిట్ కూడా కోల్పోయారు. అయితే తాజాగా జరిగిన ఉప ఎన్నికలో మాత్రం ఆయన తీవ్ర పోటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్లో క్షేత్రస్థాయి అంతర్గత విభేదాలు, పార్టీ అభ్యర్థి విద్యార్హత, ప్రభుత్వ వ్యతిరేకత, యువతలో అసంతృప్తి వంటి కారణాలతోపాటు బీజేపీ, కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం దుబ్బాకలోనే మకాం వేయడంతో పోటాపోటీ ప్రచారం జరిగింది. ఈ పరిణామం తమ అనుకూల ఓటింగ్‌కు దారితీసినట్లు బీజేపీ అంచనా వేస్తోంది. జీహెచ్ఎంసీలో పునరావృతం కాకుండా... రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు కేంద్ర నిధుల విషయంలో దుబ్బాకలో బీజేపీ చేసిన ప్రచారం జీహెచ్ఎంసీలో పునరావృతం కాకుండా చూడాలనే అభిప్రాయం టీఆర్ఎస్లో కనిపిస్తోంది. దుబ్బాకలో బీజేపీకి ఓట్ల శాతం పెరిగితే జీహెచ్ఎంసీపై ప్రభావం చూపే అవకాశముందని భావిస్తున్న టీఆర్ఎస్... వీలైనంత మేర ఆ పార్టీకి అడ్డుకట్ట వేసే వ్యూహాలకు పదును పెడుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలో బలమైన బీజేపీ నేతలను పార్టీలోకి ఆకర్షించాలనే వ్యూహంలో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఇన్చార్జితోపాటు పలువురు డివిజన్ స్థాయి నేతలు గులాబీ గూటికి చేరుకున్నారు. మరోవైపు జీహెచ్ఎంసీలో డివిజన్లవారీగా ఇప్పటికే పార్టీ బలం అంచనాకు వచ్చిన టీఆర్ఎస్... విపక్ష పార్టీల పరిస్థితిని కూడా అంచనా వేసింది. జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందే నగర శివార్లలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలనే యోచనలో పార్టీ అధినేత కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. మాకు ప్రజల మద్దతు పెరుగుతోంది: కె. లక్ష్మణ్ సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణకు నిధుల కేటాయింపు విషయంలో భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధిని ఎవరూ శంకించాల్సిన అవసరం లేదని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ స్పష్టం చేశారు. వరద బాధితులను ఆదుకునేం దుకు తెలంగాణకు కేంద్రం నిధులు కేటాయిం చిందని ఆయన తెలిపారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా బీజేపీకి ప్రజల్లో మద్దతు పెరుగుతున్న కారణంగా, తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకు నేందుకే మంత్రి కేటీఆర్ తమపై ఎదురుదాడి చేస్తున్నారని లక్ష్మణ్ మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో టీఆర్ఎస్ ప్రజలను తప్పు దోవ పట్టిస్తోందని, త్వరలో హైదరాబాద్‌లో ‘బడుగుల సభ’ ఏర్పాటు చేసి టీఆర్ఎస్– ఎంఐఎం నిజస్వరూపాన్ని బట్టబయలు చేస్తామని హెచ్చరించారు. వరద సాయం పేరుతో ప్రభుత్వ ధనాన్ని టీఆర్ఎస్ తమ స్వార్థ రాజకీయాల కోసం వాడుకుంటోందని లక్ష్మణ్ దుయ్యబట్టారు. కేంద్ర నిధులపై చర్చకు సిద్ధం: హైదరాబాద్ అభివృద్ధికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనేక నిధులు కేటాయించిందని లక్ష్మణ్ తెలిపారు. కేంద్రం కేటాయించిన నిధులపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని కేటీఆర్‌కు సవాల్ విసిరారు. -
దుబ్బాక తీర్పు నేడే
సాక్షి, సిద్దిపేట : దుబ్బాక ఉప ఎన్నిక విజేతలెవరో నేడు తేలిపోనుంది. ఫలితం కోసం అన్ని పార్టీలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నా యి. ఈ నెల 3న పోలింగ్ జరగ్గా మంగళవా రం ఓట్ల లెక్కింపు కోసం సిద్దిపేట సమీపంలోని పొన్నాల ఇందూరు ఇంజనీరింగ్ కళాశాలలో అధికారులు ఏర్పాట్లు చేశారు. 315 పోలింగ్ స్టేషన్ల పరిధిలో ఉప ఎన్నిక జరిగింది. మొత్తం 23 మంది పోటీ చేశారు. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని అధికారులు తెలిపారు. మొత్తం రెండు గదుల్లో ఒక్కో గదిలో 7 టేబుల్స్ చొప్పున 14 టేబుల్స్ వేశారు. 27 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. మధ్యాహ్నం 12 గంటల వరకు ఫలితం వెలువడనుంది. రసవత్తరంగా పోటీ... అధికార టీఆర్ఎస్తోపాటు ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ కూడా దుబ్బాక ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పోటీ రసవత్తరంగా మారింది. ప్రభుత్వ పనితీరు, ప్రజల్లో ఉన్న నమ్మకానికి ఈ ఎన్నిక రెఫరెండంగా ఉంటుం దని రాజకీయ వర్గాలు చెబుతుండగా తెలంగాణలో బలం పుంజుకుంటోందని రుజువు చేసుకొనేందుకు బీజేపీకి, క్షేత్రస్థాయిలో తమ బలం చెక్కు చెదరలేదని చాటేందుకు కాంగ్రెస్ పార్టీకి ఈ ఫలితం కీలకంగా మారింది. నేతల లెక్కలు.. ఫలితంపై వివిధ ఏజెన్సీలు, రాజకీయ ప్రముఖులు, సోషల్ మీడియా ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వేలు అభ్యర్థులతోపాటు రాజకీయ నాయకుల్లో దడ పుట్టిస్తున్నాయి. ఎన్నికలకు ముందుగా ఒక రకమైన వాతావరణం ఉండగా పోలింగ్ తర్వాత మరో తీరుగా మారినట్లు ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత గెలుపు తథ్యమని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంకన్నా మెజారిటీ కాస్త తగ్గొచ్చని భావిస్తున్నారు. 15 వేలలోపు మెజారిటీతో గెలుస్తామని టీఆర్ఎస్లోని కీలక నాయకులు పేర్కొనడం గమనార్హం. మరోవైపు సర్వేలన్నీ తమకు అనుకూలంగానే ఉన్నాయని తమ పార్టీ అభ్యర్థి రఘునందన్‌రావు గెలుపు ఖాయమని కమలదళం నేతలు అంటున్నారు. ఇక కాంగ్రెస్ సైతం తమ ఓటు బ్యాంకు తమకుందని చెబుతోంది. ముత్యంరెడ్డిపై సానుభూతి అనుకూలించిందని, గతంతో పోలిస్తే మెజారిటీ ఓట్లు పడ్డాయని కాంగ్రెస్ నాయకులు పేర్కొంటున్నారు. రెండో స్థానం కీలకమై.. దుబ్బాక ఉప ఎన్నికలో గెలుపు ఎంత కీలకమో రెండో స్థానం కూడా అంతే కీలకంగా మారింది. గతంలో రెండుసార్లు జరిగిన ఎన్నికల్లో దుబ్బాక ప్రజలు భిన్నమైన తీర్పు ఇచ్చారు. 2009లో సోలిపేట రామలింగారెడ్డి, చెరుకు ముత్యంరెడ్డి నువ్వా నేనా అన్నట్లు తలపడ్డారు. చివరకు 2,640 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి ముత్యంరెడ్డి గెలిచారు. 2014లో టీఆర్ఎస్ అభ్యర్థి రామలింగారెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి ముత్యంరెడ్డిపై 37,925 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2018లో టీఆర్ఎస్ అభ్యర్థి రామలింగారెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి మద్దుల నాగేశ్వర్‌రెడ్డిపై 62,500 ఓట్ల తేడాతో గెలిచారు. ఇలా మూడు పర్యాయాలు పోటీ టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య జరిగింది. మూడో స్థానంలో ఉన్న బీజేపీ ఇప్పుడు మెజారిటీ ఓట్లు సాధిస్తుందనే ప్రచారం సాగుతోంది. ఉపఎన్నికలో టీఆర్ఎస్ గెలిస్తే రెండో స్థానాన్ని పదిలపరుచుకోవడం కోసం కాంగ్రెస్, సత్తా చాటి ముందు వరుసలో ఉండేందుకు బీజేపీ నాయకులు ఉవ్విళ్లూరుతున్నారు. -
దుబ్బాక ఉపఎన్నిక కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి
సాక్షి, దుబ్బాక: కౌంటింగ్ దగ్గర పడుతున్న కొద్దీ దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. ప్రజా తీర్పు ఎలా ఉండబోతోందని ఉత్కంఠ నెలకొంది. టీవీల ముందుకూర్చున్న నేతలు, ప్రజలు ఎన్నికల కౌంటింగ్ బ్రేకింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే దుబ్బాక ఉప ఎన్నిక కౌంటింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లును అధికారులు పూర్తిచేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి చెన్నయ్య, జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి, సీపీ జోయల్ డేవిస్‌లు కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించారు. చదవండి: (దుబ్బాక: అందరూ ఆశల పల్లకీలో!) 10వ తేదీ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలు కాగా, మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపు ఆ తర్వాత 8.30 నుంచి ఈవీఎంలు లెక్కింపు మొదలుకానుంది. ఈ ప్రక్రియలో14 టేబుల్స్ ఏర్పాటు చేసి 14 రౌండ్లలో అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో కౌంటింగ్ ప్రారంభించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో రికార్డ్ చేస్తూ లెక్కింపు చేపట్టనున్నారు. సిద్దిపేట జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉంది. పాసులు ఉన్నవారికి మాత్రమే కౌంటింగ్ కేంద్రం ఇందూర్ కాలేజి వరకు అనుమతి ఇస్తున్నారు. కోవిడ్ నేపథ్యంలో 14 టేబుళ్ల మధ్య 6 అడుగల భౌతిక దూరం ఉండే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు. -
సీఎం కేసీఆర్ మాట తప్పారు: ఎంపీ అరవింద్
సాక్షి, నిజామాబాద్: రైతులను సన్న రకం సాగు చేయమని, మంచి ధర ఇప్పిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ మాట తప్పారని బీజేపీ ఎంపీ ఆరవింద్ పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రైతులను ఆందోళనకు గురిచేస్తున్నారన్నారు. దుబ్బాక ఎన్నికల కోసం మక్కలకు 100 రూపాయల నుంచి 150 రూపాయల వరకు ఇప్పిస్తామని అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. దీంతో ఆయన తీరుకు రైతులు ఆవేదన చెందున్నారని, కేంద్రం ఇస్తున్న ఎంఎస్పీకి ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇవ్వటం లేదన్నారు. కడ్త పేరుతో 9 శాతం తరుగు తీస్తున్నారని, పాల్ట్రీ యజమానుల కోసం మక్క రైతులకు, రైస్ మిల్లర్ల కోసం వరి రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రైస్ మిల్లర్లు రైతులను దోచుకుంటున్నారని, కేసీఆర్ తీరుతో రైతులకు ప్రభుత్వాలపై నమ్మకం పోతుందన్నారు. ముస్లింలకు కేంద్రం అన్ని ఇస్తున్నా కేసీఆర్ వాటిని తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. పసుపు బోర్డు కన్న మంచి వ్యవస్థను కేంద్రం ఇచ్చినా కూడా రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపారు. రాష్ట్రాన్ని అన్ని రకాలుగా కేసీఆర్ భ్రష్టు పట్టించారని, రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచింది కేసీఆర్ సర్కార్‌యే అన్నారు. విద్యుత్ బకాయిలు ఎగ గొట్టేందుకు విద్యుత్ బిల్లుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, రైతులను ఆదుకోవటంలో రాష్ట్ర సర్కారు విఫలమైందన్నారు. కొత్త రాష్ట్రంలో ఒక్క కొలువు కూడా ఇవ్వలేదని, హెల్త్, ఎడ్యుకేషన్ విభాగాలు నాశనం అయ్యాయి.. రాష్ట్ర అడ్మినిస్ట్రేషన్ కూడా ఫెయిల్ అయిందని ఆయన ధ్వజమెత్తారు. ఇక దుబ్బాక ఎన్నికలో బీజేపీ గెలుస్తుందని ఎంపీ ధీమా వ్యక్తం చేశారు. -
దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతం
-
దుబ్బాక: అందరూ ఆశల పల్లకీలో!
సాక్షి, హైదరాబాద్: గత నెల 9న నామినేషన్ల స్వీకరణతో ప్రారంభమైన దుబ్బాక శాసనసభ స్థానం ఉప ఎన్నిక ప్రక్రియలో మంగళవారం జరిగిన పోలింగ్‌తో కీలక ఘట్టం ముగిసింది. ఈ నెల 10న ఓట్ల లెక్కింపు జరగనుండగా ప్రచారం తీరుతెన్నులను పోలింగ్ సరళి, గెలుపోటములపై ప్రధాన రాజకీయ పక్షాలు విశ్లేషణ జరుపుకుంటున్నాయి. సిట్టింగ్ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకుంటామనే ధీమా టీఆర్ఎస్ శిబిరంలో కనిపిస్తుండగా బీజేపీ, కాంగ్రెస్‌లు ఫలితం తమకు అనుకూలంగా ఉంటుందని అంచనా వేసుకుంటున్నాయి. ఈ ఏడాది ఆగస్టు 6న టీఆర్ఎస్ ఎమ్మెల్యే, అసెంబ్లీ అంచనాల కమిటీ చైర్మన్ సోలిపేట రామలింగారెడ్డి అనారోగ్యంతో మరణించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. టీఆర్ఎస్ అభ్యర్థిగా సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాత, కాంగ్రెస్ నుంచి దివంగత మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఎం. రఘునందన్‌రావు సహా మొత్తం 23 మంది అభ్యర్థులు ఉప ఎన్నిక బరిలోకి దిగారు. నామినేషన్ల షెడ్యూల్‌కు ముందే టీఆర్ఎస్తోపాటు బీజేపీ పోటాపోటీ ప్రచారపర్వంలో అడుగుపెట్టగా కాంగ్రెస్ మాత్రం అభ్యర్థి ఖరారులో కొంత ఆలస్యం చేసింది. టీఆర్ఎస్ ప్రచార బాధ్యతలను ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఒంటిచేత్తో నిర్వహించగా కాంగ్రెస్ నుంచి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, బీజేపీ నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రచార సారథ్యం వహించారు. గెలుపు తథ్యం: టీఆర్ఎస్ టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీ కంచుకోటగా ఉన్న దుబ్బాక నియోజకవర్గంలో 2014 మినహా వరుస ఎన్నికల్లో పార్టీ విజయం సాధిస్తూ వచ్చింది. ప్రస్తుత ఉప ఎన్నికలో పార్టీ సంస్థాగత నిర్మాణం, ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తమకు ఓటింగ్ రూపంలో కలిసి వచ్చాయని టీఆర్ఎస్ శిబిరం అంచనా వేస్తోంది. లక్ష ఓట్ల మెజారిటీ సాధిస్తామని పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించినా ప్రచారం సందర్భంగా బీజేపీ నుంచి టీఆర్ఎస్ గట్టి పోటీ ఎదుర్కొంది. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉప ఎన్నిక ప్రచారానికి దూరంగా ఉండగా మంత్రి హరీశ్‌రావు ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్యేల సాయంతో ప్రచారంలో అంతా తానై వ్యవహరించారు. ఆరేళ్లలో దుబ్బాక నియోజకవర్గంలో రూ. 7 వేల కోట్ల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, 78 వేల మంది ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల కుటుంబాలు తమకు అనుకూలంగా ఓటు వేశాయని టీఆర్ఎస్ లెక్కలు వేసుకుంటోంది. కాంగ్రెస్, బీజేపీ రాష్ట్రస్థాయి నేతలు దుబ్బాకలో మకాం వేసినా క్షేత్రస్థాయిలో తమకు ఉన్న పార్టీ యంత్రాంగం కలసి వచ్చిందని టీఆర్ఎస్ భావిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో బీజేపీ చేసిన హడావుడి ఎంతమేర ప్రభావం చూపిందనే అంశాన్ని టీఆర్ఎస్ విశ్లేషించుకుంటోంది. నియోజకవర్గం పరిధిలోని ఏడు మండలాల్లోనూ తమదే పైచేయిగా ఉంటుందని అంచనాకు వచ్చింది. విజయం నల్లేరు మీద నడక: బీజేపీ ఉప ఎన్నిక షెడ్యూల్ వెలువడక ముందే ప్రచార పర్వంలోకి దిగిన బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుకు తర్వాతి కాలంలో పార్టీ రాష్ట్రస్థాయి యంత్రాంగం కూడా తోడైంది. చాలా గ్రామాల్లో కనీస స్థాయిలో కేడర్ కూడా లేని బీజేపీ ప్రచారపర్వంలో మెరుగైనట్లు లెక్కలు వేసుకుంటోంది. తొలుత యువత తమకు అనుకూలంగా ఉందనే లెక్కలతో బరిలోకి దిగిన బీజేపీ... ప్రచారపర్వంలో బీడీ కార్మికులు, మహిళలు, మధ్యతరగతి వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని చేపట్టిన ప్రచారం అనుకూలిస్తుందనే అంచనాలో ఉంది. గతంలో రెండు పర్యాయాలు ఓటమి చవిచూసిన రఘునందన్... ఈసారి ఓటర్లలో తనపై కొంత సానుభూతి ఉంటుందని లెక్కలు వేసుకుంటున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్, సిద్దిపేట, హైదరాబాద్‌లో డబ్బు పట్టుబడటం వంటి పరిణామాలతో పార్టీపై సానుభూతి పెరిగిందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ప్రచారం ప్రారంభంలో రెండో స్థానానికి పరిమితమవుతామని భావించిన బీజేపీ... మంగళవారం జరిగిన పోలింగ్ సరళి తమకు పూర్తి అనుకూలంగా జరిగిందని, ప్రభుత్వ వ్యతిరేకత వెల్లువెత్తిందని భావిస్తూ గెలుపుపై పూర్తి ధీమా వ్యక్తం చేస్తోంది. చాప కింద నీరులా ఫలితం: కాంగ్రెస్ దుబ్బాకలో తాము చాప కింద నీరులా చేసిన ప్రచారం కలిసి వస్తుందని, 2018 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే మెరుగైన ఫలితం సాధిస్తామని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ సహా పార్టీ ముఖ్య నేతలందరూ నియోజకవర్గంలో మకాం వేసి చేసిన ప్రచారం కలసి వస్తుందనే ధీమాతో ఉంది. అయితే అధికార టీఆర్ఎస్కు ఉండే అనుకూలత, బీజేపీ దూకుడుకు తగ్గట్టు తాము హడావుడి చేయలేకపోయామనే చర్చ కూడా కాంగ్రెస్‌లో జరుగుతోంది. టీఆర్ఎస్ వైఫల్యాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి ఆ పార్టీకి తామే ప్రత్యామ్నాయమనే అంశాన్ని చెప్పగలిగామని, కానీ బీజేపీ మాత్రం హడావుడికి మాత్రమే పరిమితం అయిందని చెబుతున్నారు. గ్రామాలకు వెళ్లి కాంగ్రెస్ కేడర్‌ను పదిలపరచుకోవడంతోపాటు తటస్థ ఓటర్లను ఆకట్టుకోవాలన్న తమ వ్యూహం ఫలించినట్టేనన్న ధీమా వారిలో వ్యక్తమవుతోంది. పోలింగ్ రోజున ఏకంగా పార్టీ అభ్యర్థి టీఆర్ఎస్లోకి వెళ్లిపోతున్నారంటూ సోషల్ మీడియా వేదికగా జరిగిన ప్రచారాన్ని తిప్పికొట్టడంలో సఫలీకృతం అయ్యామన్న ధీమా కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తోంది. -
దుబ్బాక పోలింగ్ 82.61%
సాక్షి, సిద్దిపేట: దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్ మంగళవారం ప్రశాంతంగా ముగిసింది. 82.61% పోలింగ్ నమోదైంది. నియోజకవర్గంలో మొత్తం 1,98,807 ఓటర్లు ఉండగా.. ఇందులో 1,64,192 మంది (82.61%) తమ ఓటు హక్కును విని యోగిం చుకున్నారు. 2018లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 1,90,463 మంది ఓటర్లు ఉండగా 1,64,280 మంది (86.24%) తమ ఓటు హక్కును వినియోగించు కున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి 3.63% పోలింగ్ తగ్గింది. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీ లన్నీ దుబ్బాక ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకు న్నాయి. ప్రతీ ఓటు కీలకంగా భావించాయి. ఈ నేపథ్యంలో పోలింగ్ శాతం పెరుగుతుందని అం దరూ భావించారు. కానీ కోవిడ్ నేపథ్యంలో గతం కన్నా పోలింగ్ శాతం తగ్గిందని అధి కారులు చెబుతున్నారు. ఇది ఎవరికి నష్టమనే చర్చ రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది. రాజకీయంగా ఉద్రిక్తతలకు తావిచ్చిన దుబ్బాక ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగియడంతో పోలీసు సిబ్బంది, అధికార యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది. అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు చిన్న చిన్న సంఘటనలు మినహా నియోజకవర్గమంతటా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగినట్లు పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ వెల్లడించారు. –దౌల్తాబాద్ మండలం ఇందూప్రియాల్, శేరుపల్లి బంధారం, తొగుట మండలం పెద్దమాసాన్ పల్లి, ఇందిరానగర్లలో పోలీసులకు, రాజకీయ పార్టీల కార్యకర్తలకు వాగ్వాదం చోటు చేసుకుంది. –రాయపోల్ మండలం మంతూర్, బేగంపేట, దుబ్బాక రూరల్ మండలం బొప్పాపూర్, రామక్కపేట, చేగుంట మండలం కర్నాలపల్లి పోలింగ్ స్టేషన్లలో ఈవీఎంలు మొరాయించడంతో ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత చిట్టాపూర్‌లో, బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు బొప్పాపూర్‌లో ఓటు వేయగా, కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి తొగుట మండలం తుక్కాపూర్‌లో ఓటు చేశారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి పర్యవేక్షణ దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్ సరళి, ఏర్పాట్లను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) శశాంక్ గోయల్ పరిశీలించారు. దుబ్బాక ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను, తర్వాత చేగుంట మండలం వడియారం పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పీవో, ఏపీవో, ఇతర పోలింగ్ సిబ్బందితో మాట్లాడి సమాచారం తెలుసుకున్నారు. కోవిడ్ నిబంధనల అమలు, శాంతి భద్రతలపై ఆయన ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ భారతి హోళికేరి, పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ జిల్లాలోని పోలింగ్ తీరుపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వివరించారు. కాంగ్రెస్ అభ్యర్థి టీఆర్ఎస్లో చేరాడని ప్రచారం పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్లో చేరాడని సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం తీవ్ర కలకలం రేపింది. విషయం తెలుసుకున్న శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రజల మద్దతు తనకే ఉందని గ్రహించిన ప్రత్యర్థి పార్టీలు కుట్ర చేసి సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా తన ప్రతిష్టకు భంగం కల్గించిన వారిపై చర్యలు తీసుకోవాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్‌కు ఫిర్యాదు చేశారు. -
'దుబ్బాకలో బీజేపీ విజయం ఖాయం'
సాక్షి, హైదరాబాద్ : దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ ముగిసిన తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. 'దుబ్బాక నుంచి నాయకులు ,కార్యకర్తలు ఇచ్చిన సమాచారం ప్రకారం టీఆర్ఎస్ అహంకారాన్ని దెబ్బకొట్టాలనే 81 శాతం ఓటింగ్ పొలైంది. దుబ్బాక లో బీజేపీ విజయం సాధించబోతుంది.ఇన్ని రోజులు అవస్తవాలను వాస్తవాలుగా చిత్రికరిస్తూ టీఆర్ఎస్ అబద్ధాలు చెప్తూ వచ్చింది. అసలు దుబ్బాకలో అభివృద్ధి జరగలేదు. టీఆర్ఎస్ పార్టీ పై ప్రజా వ్యతిరేక విధానాలు కూడా ఓటర్లు ఆలోచించరు. నరేంద్ర మోదీ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు కూడా బీజేపీకి కలిసి వస్తుంది. ఒక కార్యకర్త తెలిసీ తెలియక ఆత్మహత్య చేసుకుంటే మంత్రులు ఏమాత్రం బుద్ధి లేకుండా 'వాడు' అనే మాటలు మాట్లాడుతున్నారు.హోటల్ లో జరిగింది తోపులాట మాత్రమే ఒక శాసన సభ్యుడు ఇలా పిర్యాదు చేయడం మంచిది కాదు. నిన్న జరిగిన ఘటనను టీఆర్ఎస్ అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేసింది. దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎన్నో కుట్రలు,కుతంత్రాలు పాల్పడడంతో పాటు డబ్బులు కూడా విచ్చలవిడిగా పంచారు ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో సానుభూతి, సెంటిమెంట్ అబద్ధాలతోనే గెలిచింది. (చదవండి : ముగిసిన దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్) దుబ్బాకకు రావాల్సిన నిధులు దారి మళ్లించారు. దుబ్బాక ప్రజలంతా రఘునందన్ రావునే ఎమ్మెల్యేగా కోరుకుంటున్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు దుబ్బాక లో ఓటుకు 5వేల నుంచి 10 వేల వరకు టార్గెట్ పెట్టుకొని మరీ పంచినట్లు సమాచారం అందింది. దుబ్బాక ప్రజలు నిజాయితీ పరులు.. వారు ఇచ్చిన డబ్బు తీసుకున్న బీజేపీకే ఓట్లు వేశారు. ఆత్మహత్యాయత్నం చేసిన శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. ప్రత్యేక డాక్టర్ల బృందం శ్రీనివాస్ బతికించడం కోసం కృషి చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ వాటా తెలంగాణ పథకాల్లో సీఎం కేసీఆర్ ఎన్ని అమలు చేస్తున్నారని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా. గతంలో హైదరాబాద్‌ను ఇస్తాంబుల్ చేస్తా అన్నారు. జీహెచ్ఎంసీ పన్నుల విషయంలో ఓల్డ్ సిటీ లో వసూలు చేయడానికి ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఈ ఆరు సంవత్సరాల్లో రైతులకు నష్టపరిహారం ఇచ్చారా...? అంటూ బండి సంజయ్ ధ్వజమెత్తారు. -
దుబ్బాక ఎన్నికలు: డీజీపీకి కాంగ్రెస్ ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: దుబ్బాక ఎన్నికలలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారుతున్నట్లు తప్పుడు వార్తలు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు డీజీపీ మహేందర్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై ఫిర్యాదు చేయడానికి కాంగ్రెస్ నేతలు మంగళవారం డీజీపీ కార్యాలయానికి చేరుకున్నారు. టీపీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, పలువురు కాంగ్రెస్ నేతలు డీజీపీకి ఫిర్యాదు చేశారు. అనంతరం టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, దుబ్బాక లో పోలింగ్ మొదలు కాగానే సోషల్ మీడియాలో టీఆర్ఎస్ ,బీజేపీలు దుష్ప్రచారం మొదలు పెట్టాయి. కాంగ్రెస్ అభ్యర్ధి టీఆర్ఎస్లో చేరినట్లు ప్రముఖ టీవీ ఛానెల్లో బ్రేకింగ్ నడిచినట్లు ఒక వీడియో సృష్టించి సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. దీనిపై స్పందించిన ఆ టీవీ ఛానెల్ కూడా మేము ప్రసారం చేయలేదని చెప్పింది. ఓటమి భయం తో హరీష్ రావు, రఘనందన్ చేసిన కుట్రే ఇది. ఈ కుట్రపై డీజీపీ కి ఫిర్యాదు చేశాం. కేరళలో ఇదేవిధంగా దుష్ప్రచారం చేస్తే ఎన్నికల కమిషన్ గెలిచిన అభ్యర్థిని డిస్ క్వాలిఫై చేసింది. కేరళ హైకోర్టు జడ్జి ఇచ్చిన తీర్పును ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకువెళ్తాం’ అని అన్నారు. మరో కాంగ్రెస్ నాయకుడు, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ‘దుబ్బాక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందనే సంకేతాలు రావడంతోనే టీఆర్ఎస్, బీజేపీలు సరికొత్త కుట్రకు తెరతీశాయి. కాంగ్రెస్ అభ్యర్థి చెరకు శ్రీనివాసరెడ్డి టీఆర్ఎస్లో చేరుతున్నాడని తమకు అనుకూలమైన మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నాయి. అసలు ఈ ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదు. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఉన్నది లేన్నట్టు.. లేనిది ఉన్నట్టు గోబెల్స్ ప్రచారం చేయడంలో టీఆర్ఎస్, బీజేపీలు దిట్ట. ఈ ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దు. ప్రజల గొంతు వినిపించాల్సిన ఛానల్స్ కొన్ని పార్టీలే నడిపించడం వల్లే ఈ అవాస్తవాలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఇలాంటి ఛానల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’ అని కోరారు. చదవండి: దుబ్బాక పోలింగ్: చేగుంటలో కలకలం -
ప్రారంభమైన దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్
-
ముగిసిన దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్
దుబ్బాక ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగింది. సాయంత్రం 6 గంటల తర్వాత కూడా క్యూ లైన్లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. దీంతో ఉప ఎన్నికలో మొత్తం 82.61 శాతం నమోదైంది. 2018 ఎన్నికల్లో దుబ్బాక నియోజకవర్గంలో 86 శాతం పోలింగ్ నమోదైంది. కాగా దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం నవంబర్ 10న వెలువడనుంది. కాగా సాయంత్రం చూసుకుంటే 81.14 శాతం పోలింగ్ నమోదైంది. అయితే చివరిగంటలో కోవిడ్ బాధితులకు అవకాశం కల్పించడంతో పీపీఈ కిట్లు ధరించి పోలింగ్‌లో పాల్గొన్నారు. కాగా పోలింగ్ సమయం ముగిసినా క్యూలో నిల్చున్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ పరిశీలించారు. దీంతో పోలింగ్ శాతం మరోసారి 85శాతంకు పైగా నమోదయ్యే అవకాశం ఉంది. హరీష్‌రావు సమీక్ష దుబ్బాకలో పోలింగ్ సరళిని సిద్దిపేట తన నివాసం నుంచి మంత్రి హరీష్ రావు సమీక్షిస్తున్నారు. ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, చింత ప్రభాకర్, దేవందర్ రెడ్డి వివిధ మండలాల ఇంచార్జ్‌లు ఆయనతో పాటు ఉన్నారు. కాగా, తొగుట మండలం వెంకట్రావుపేట పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలు మొరాయించాయి. సాంకేతిక సిబ్బంది లోపాన్ని సరిచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. చేగుంటలో దొంగ ఓటు.. చేగుంటలో దొంగ ఓటు నమోదయ్యింది. అసలు ఓటరు రావడంతో అధికారులు గుర్తించారు. తన ఓటు వేరేవారు వేశారని అసలు ఓటరు ఆందోళన వ్యక్తం చేశారు. తమ్ముడి ఓటు అన్న వేసి వెళ్లారు. పోలింగ్ ఏజెంట్‌కి తెలిసే జరిగిందని అసలు ఓటరు ఆరోపించారు. ఓటరు ఆందోళనతో టెండర్ ఓటుకు ప్రిసైడింగ్ ఆఫీసర్ అనుమతి ఇచ్చారు. పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్.. లచ్చపేటలోని దుబ్బాక జిల్లా పరిషత్ హైస్కూలోని పోలింగ్ కేంద్రంలో జరుగుతున్న పోలింగ్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భారతి హోళ్ళీకేరి పరిశీలించారు. ఈ మేరకు కోవిడ్ నిబంధనల మేరకు ప్రతీ ఓటరుకు థర్మల్ స్క్రీనింగ్ చేసి, శానిటైజరు అందిస్తూ.. చేతికి గ్లౌజు ఇవ్వడంతో పాటు సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్న ఎన్నికల అధికారుల పనితీరును కలెక్టర్ అభినందించారు. ఓటు వేసిన కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి ఫిర్యాదు.. తాను పార్టీ మారుతున్నట్లుగా, టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్టుగా అసత్య ప్రచారాలు చేస్తున్న టీవీ ఛానళ్లపై చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చెరుకు శ్రీనివాసరెడ్డి తోగుట మండల కేంద్రంలోని స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఓటు వేసిన బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. దుబ్బాక మండలం బొప్పాపూర్ గ్రామంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు తన ఓటు హక్కు వినియోగించారు. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సోలిపేట సుజాత.. దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. మాస్క్,గ్లౌస్ లు ధరించి భౌతిక దూరం పాటిస్తూ ఓటు వేస్తున్నారు. దుబ్బాక మండలం పోతారంలో కుటుంబసభ్యులతో కలిసి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఓటు వేశారు. ఓటు వేసిన టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సోలిపేట సుజాత దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమయిన పోలింగ్.. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు కోవిడ్ బాధితుల కోసం ప్రత్యే సమయం కేటాయించారు. 148 గ్రామాల్లో 315 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. 89 సమస్యాత్మక కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. 23 మంది బరిలో ఉన్నా.. ప్రధాన రాజకీయ పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్యే పోటీ ఉంది. ఇంటింటి ప్రచారంలో ప్రతీ ఓటరును నేరుగా కలిసి, ఫోన్లు చేసి తమ పార్టీకి ఓటు వేయాలని అభ్య ర్థించారు. రాజ కీయ పార్టీలు ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో పోలింగ్ శాతం గతంలో కన్నా పెరిగే అవ కాశముందని భావిస్తున్నారు. దుబ్బాకలో మొత్తం ఓటర్లు 1,98,807 మంది కాగా, పురుష ఓటర్లు 98,028 మంది.. మహిళా ఓటర్లు 1,00,719 మంది ఉన్నారు. -
దుబ్బాక దంగల్ నేడే
సాక్షి, సిద్దిపేట: రాజకీయంగా తీవ్ర వేడిని పుట్టించి... కాకరేపిన దుబ్బాక ఉప ఎన్నికలో మంగళ వారం ఓటరు తీర్పు నిక్షిప్తం కానుంది. పోలింగ్ సరళి ఎలా ఉం టుంది, ఎంతశాతం ఓటింగ్ జరుగుతుందనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. పోలింగ్ శాతం ఎంతుంటే ఎవరికి లాభమని పార్టీలు లెక్కలేసుకుంటున్నాయి. కరోనా భయం పూర్తిగా వీడనం దున ఎంతమంది ఓటర్లు పోలింగ్ స్టేషన్లకు వస్తార నేది చూడాలి. 23 మంది బరిలో ఉన్నా.. ప్రధాన రాజకీయ పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్యే పోటీ ఉంది. ఇంటింటి ప్రచారంలో ప్రతీ ఓటరును నేరుగా కలిసి, ఫోన్లు చేసి తమ పార్టీకి ఓటు వేయాలని అభ్య ర్థించారు. రాజ కీయ పార్టీలు ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో పోలింగ్ శాతం గతంలో కన్నా పెరిగే అవ కాశముందని భావిస్తున్నారు. పోటాపోటీగా ఓటర్లను పోలింగ్ బూత్‌లకు తరలించేందుకు పార్టీలు ప్రయత్నిస్తాయి. అయితే కరోనా భయం పూర్తిస్థాయిలో వీడలేదు కాబట్టి పోలింగ్ శాతం తగ్గుతుందా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. 2018లో జరిగిన ఎన్నికల్లో నియోజకవర్గంలో మొత్తం 1,90,483 మంది ఓటర్లు ఉండగా 1,63,658 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 85.92% ఓటింగ్ నమోదైంది. ఈసారి 1,98,807 మంది ఓటర్లు ఉండగా ఏ మేరకు పోలింగ్ నమోదవుతుందో వేచి చూడాలి. మొత్తం ఏడు మండలాల్లోని 148 గ్రామాల్లో 315 పోలింగ్ స్టేషన్లలో ఎన్నికలు జరగనున్నాయి. ఎవరి లెక్క వారిది... దుబ్బాక నియోజకవర్గంలో దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట, రాయపోలు, దౌల్తాబాద్, నార్సింగి, చేగుంట మండలాల పరిధిలో ఇప్పటివరకు 78,187 మంది రైతులు రైతుబంధు, 52,823 మంది వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, నేత, గీత, బీడీ కార్మికులకు ఆసరా పెన్షన్లు పొందుతున్నారు. 5,599 మందికి కల్యాణలక్ష్మి, 322 మందికి షాదీ ముబారక్ చెక్కులతోపాటు, 30,732 మందికి కేసీఆర్ కిట్స్ అందజేశారు. ఇలా నియోజకవర్గంలో 1,67,663 మందికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా అందాయని, వీరందరి ఓట్లు తమకే పడతాయనే ధీమాతో అధికార టీఆర్ఎస్ పార్టీ ఉంది. నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో ఏ కులం వారివి ఎన్ని ఓట్లు ఉన్నాయి అనే అంచనాలు వేశారు. అత్యధికంగా ముదిరాజులు 41,214 మంది, గొల్ల కురుమలు 16,190, గీత కార్మికులు 22,512, మాదిగ 23 వేల మంది, 11 వేల మంది మాల, 13 వేల మంది చేనేత కార్మికులు, 7 వేల మంది రజకులు, 6వేల మంది మున్నూరు కాపులు, 10,012 మంది రెడ్లు ఉన్నారు. ముస్లిం, దూదేకుల, బ్రాహ్మణ, వెలమ, బుడిగ జంగాలు, క్రిస్టియన్ మైనార్టీలు, లంబాడీలు కూడా ఉన్నారు. సామాజికవర్గాల వారీగా ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని పార్టీల నాయకులు ప్రయత్నాలు చేశారు. కుల సంఘాలకు భవనాలు, ఇతర హామీలిచ్చారు. యువత ఓట్లు కీలకం యువత ఎటువైపు ఓటు వేస్తుందో అనేది అంతుపట్టకుండా ఉంది. నియోజకవర్గంలో మొత్తం ఓటర్లలో 25 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవారు 30 వేలకు పైగా ఉన్నారు. వీరిపై ఆశలు పెట్టుకున్న ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు బైక్ ర్యాలీలు, యువజన సదస్సులు నిర్వహించాయి. యువతను మచ్చిక చేసుకునేందుకు పలు తాయిలాలు కూడా అందజేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో యువత ఎటువైపు మొగ్గు చూపుతుందనేది విజయావకాశాలను ప్రభావితం చేస్తుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. -
సిద్దిపేటలో ఉద్రిక్త వాతావరణం
సాక్షి, సిద్ధిపేట: మరికొన్ని గంటల్లో దుబ్బాక ఉప ఎన్నికకు పోలింగ్ జరగనున్న నేపథ్యంలో సిద్ధిపేటలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం దాడులకు దిగారు. పలువురు కార్యకర్తలు గాయపడ్డారు. కాగా స్థానికంగా ఉన్న స్వర్ణా ప్యాలెస్ హోటల్లో డబ్బులు పంచుతున్నట్లు సమాచారం ఉందంటూ బీజేపీ నేతలు అక్కడకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో అదే హోటల్లో బస చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్, బీజేపీ నేతల మధ్య తోపుటలా జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చేందుకు యత్నిస్తున్నారు. బీజేపీ కార్యకర్తలు గూండాల్లా ప్రవర్తించారని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అన్నారు. శాంతిభద్రతల సమస్య సృష్టించాలని చూస్తున్నారని, తనను కొట్టే ప్రయత్నం చేస్తుంటే టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారని తెలిపారు. బీజేపీ దాడిలో టీఆర్ఎస్ కార్యకర్త గాయపడ్డారని పేర్కొన్నారు. దళిత ఎమ్మెల్యేపై దాడి హేయమైన చర్య మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. పథకం ప్రకారమే బీజేపీ కార్యకర్తలు దాడి చేశారని అన్నారు. దుబ్బాక ఉపఎన్నికల్లో ఓటమి తప్పదని తెలుసుకున్న బీజేపీ నాయకులు దళిత బిడ్డలైన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంపై సిద్దిపేటలోనీ స్వర్ణ ప్యాలెస్‌లో దాడికి పాల్పటం హేయమైన చర్య అని ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు. ఈ దాడికి పాల్పడిన బీజేపీ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ కమీషన్, పోలీసు డిపార్టుమెంట్‌ను కోరుతున్నామన్నారు. -
రేపు దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్
-
ఉద్రిక్తత..పలువురు బీజేపీ నేతల అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా ప్రచారానికి తెర పడటంతో రాజకీయ వేడి మరింత పెరిగింది. విధ్వంసం సృష్టిస్తారన్న ముందస్తు సమాచారంతో బీజేపీ కార్యాలయం వద్ద పోలీసులు మోహరించారు. బీజేపీ శ్రేణుల ఆందోళనల సమాచారంతో ప్రగతిభవన్, టీఆర్ఎస్ ఆఫీస్ వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ముందు జాగ్రత్తచర్యగా పలువురు బీజేపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. ఎల్బీనగర్, హయత్‌నగర్, శేరిలింగంపల్లిలో ఇప్పటికే పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్ జిల్లా వేములవాడలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ హౌస్ అరెస్ట్ చేశారు. (రక్తపాతం జరిగేలా బీజేపీ ప్రోత్సహిస్తుంది : కేటీఆర్ ) హయత్‌నగర్‌లో బీజేపీ ధర్నా... హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో బీజేపీ నాయకులు ఆందోళన నిర్వహిస్తున్నారు. డీజీపీ ఆఫిస్, ప్రగతిభవన్ ముట్టడిస్తామని తమపై కేసీఆర్ అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ నేతలు భైటాయించారు. నేతలను అరెస్ట్ చేసి తమ హక్కులను కాలరాస్తున్నారంటూ మండిపడ్డారు. ఇలాగే కొనసాగితే టీఆర్ఎస్ నాయకులు ఎక్కడ తిరగకుండా అడ్డుకుంటామని బీజేపీ రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షుడు సామ రంగారెడ్డి హెచ్చరించారు. ఇప్పటికే సామ రంగారెడ్డితో పాటు సీనియర్ నాయకులు కళ్లెం రవీందర్ రెడ్డి 20మంది కార్యకర్తలను హయత్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. -
హైదరాబాద్: బీజేపీ కార్యాలయం వద్ద పోలీసుల మోహరింపు
-
దుబ్బాక దంగల్
-
మైకులు బంద్.. అందరి దృష్టి దుబ్బాకపైనే..
సాక్షి, సిద్దిపేట: నెల రోజులుగా మైకుల మోతలు, నాయకుల ప్రచారాలు... ఆరోపణలు– ప్రత్యారోపణలు, సవాళ్లతో హోరెత్తిన దుబ్బాక నియోజకవర్గం ఆదివారం సాయంత్రానికి ఒక్కసారిగా మూగబోయింది. 3న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఆదివారంతో ప్రచార పర్వానికి తెరపడింది. చివరి రోజు కావడంతో అన్ని పార్టీల నాయకులు నియోజకవర్గవ్యాప్తంగా పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు. సభలు, సమావేశాలు, రోడ్‌షోలు, మోటారు సైకిల్ ర్యాలీలు, ధూంధాం కార్యక్రమాలు నిర్వహించారు. టీఆర్ఎస్ ప్రచారసారథి, మంత్రి హరీశ్‌రావు ఉదయం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి 18 ప్రశ్నలతో కూడిన లేఖను సంధించారు. వీటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం నియోజకవర్గం అంతా కలియతిరిగి సభలు, సమావేశాలు, రోడ్ షోల్లో మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఫేస్ బుక్, జూమ్ ద్వారా కార్యకర్తలతో మాట్లాడారు. కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి దుబ్బాకలో విలేకరుల సమా వేశంలో టీఆర్ఎస్, బీజేపీలను దుయ్యబట్టారు. ఈ రెండు పార్టీల నాయకలు ఒకే గూటి పక్షులని విమర్శించారు. కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డికి మద్దతుగా రోడ్‌షోలు నిర్వహించారు. టీఆర్ఎస్, బీజేపీలను ఓడించి రాష్ట్రానికి పట్టిన శని వదిలించాలని ఎంపీ రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. అదేవిధంగా బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుతోపాటు, నిజామాబాద్ ఎంపీ అరవింద్ రోడ్‌షోలు నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేగుంట మండలంలో రోడ్‌షో నిర్వహించి టీఆర్ఎస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు చేశారు. ఆఖరిరోజు కావడంతో నాయకులు ఒక్క నిమిషం కూడా వృథా చేయకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రచారంలో నిమగ్నమయ్యారు. 2,500 మంది పోలీసులు దుబ్బాక ఉప ఎన్నికపై మొత్తం రాష్ట్రం దృష్టి కేంద్రీకృతమైంది. ఈ నేపథ్యంలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. గత నెల 26న సిద్దిపేటలో నోట్ల కట్టల లొల్లి సంఘటనతో తలెత్తిన ఉద్రిక్తతలను దృష్టిలో ఉంచుకొని బందోబస్తు పెంచారు. రెండు బెటాలియన్ల సీఆర్పీఎఫ్ బలగాలు, ఏపీఎస్పీ బెటాలియన్లతోపాటు రాష్ట్రంలోని పది జిల్లాల నుంచి పోలీసులకు దుబ్బాక నియోజకవర్గంలో డ్యూటీలు వేశారు. హోంగార్డు నుంచి ఉన్నత స్థాయి అధికారుల వరకు మొత్తం 2,500 మంది పోలీసులను మోహరించారు. 89 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రచారానికి వచ్చిన స్థానికేతరులు అందరూ ఆదివారం సాయంత్రం 6 గంటల తర్వాత నియోజకవర్గం వదిలి వెళ్లిపోవాలని ఆదేశించారు. -
బీజేపీవి చిల్లర ప్రయత్నాలు
సాక్షి, హైదరాబాద్: దుబ్బాక శాసనసభ ఉప ఎన్నికలో నాలుగు ఓట్లు సంపాదించేందుకు భారతీయ జనతా పార్టీ చిల్లర ప్రయత్నాలన్నీ చేస్తోందని టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ విమ ర్శించారు. ఇప్పటికే డబ్బుల డ్రామా ఫెయిలైందని, సామాజిక మాధ్యమాల్లో విషప్రచారం, మితిమీరిన అబద్ధాలను ప్రచారం చేసి ప్రజల దృష్టిని మళ్లించేం దుకు చేసిన ప్రయత్నాలు కూడా సఫలం కాలే దన్నారు. దీంతో చివరగా హైదరాబాద్‌లో కార్యకర్త లను రెచ్చగొట్టి చివరి దశ డ్రామాకు తెరలేపుతోం దని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా కార్యక్రమాలు రచిస్తున్నారని ఆరోపించారు. ఆదివారం టీఆర్ఎస్ భవన్లో మంత్రులు శ్రీనివాస్‌యాదవ్, శ్రీనివాస్‌గౌడ్ తది తరులతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ ప్రచారం దారుణం..: దుబ్బాక సెగ్మెంట్ పరిధిలో టీఆర్ఎస్ పార్టీ నేతల ఇళ్లలో కూడా సోదాలు జరిగాయని, కానీ కేవలం బీజేపీ నేతల ఇళ్లపైనే దాడులు జరుగుతున్నాయనే ప్రచారాన్ని సామాజిక మాధ్యమాల్లో చేయడం దారుణమని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. అయితే బీజేపీ నేతల ఇళ్లలో పెద్ద ఎత్తున నగదు దొరకడం వాస్తవమని, ఆ ఇంటి ఆడపడుచులే ఈ విషయాన్ని బహిరంగంగా చెబుతున్నారన్నారు. తాజాగా హైదరాబాద్‌లో రూ.కోటి నగదు పట్టుబడిందని వెల్లడించారు. బీజేపీ అధ్యక్షుడిపై దాడి జరిపినట్లు, ఎమ్మెల్యే అభ్యర్థి చెయ్యి విరిగినట్లు సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలు జరగడం సహజమని, కానీ ఈ ఎన్నికల్లో గెలుపొందేందుకు తప్పుదారి పట్టడం సరికాదని హితవు పలికారు. బీజేపీదీ హింసాత్మక మార్గం.. ప్రజల మద్దతు సాధించేలా కార్యక్రమాలు ఉండాలని, బీజేపీ అలాంటి దారి కాకుండా హింసాత్మక మార్గాన్ని ఎంచుకుందని కేటీఆర్ దుయ్యబట్టారు. బీజేపీ పార్టీ కార్యాలయం ఎదుట ఓ కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి ఒడికట్టినట్లు తమకు సమాచారం ఉందని, దీన్ని ఆసరాగా చేసుకుని సోమవారం హైదరాబాద్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా కార్యక్రమాలు రచిస్తున్నారని ఆరోపించారు. ఈ అంశంపై ఇప్పటికే కార్యకర్తలకు సమాచారాన్ని చేరవేశారన్నారు. సోమవారం నాటి కుట్రకు సంబంధించిన సమాచారం బీజేపీ క్యాంపు నుంచే తమకు లీకైందని కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్‌లో డీజీపీ కార్యాలయం లేదా ప్రగతిభవన్, తెలంగాణ భవన్ ముట్టడి పేరుతో బీజేపీ సోమవారం కార్యచరణకు సిద్ధం చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా లాఠీచార్జ్ జరిగేలా అవసరమైతే ఫైరింగ్ జరిగేలా ఆందోళన చేపట్టాలని నిర్ణయించారన్నారు. దీంతో వచ్చే సానుభూతిని దుబ్బాక ఎన్నికల్లో ఓట్లుగా మలుచుకునేందుకు చూస్తోందని విమర్శించారు. కార్యకర్తల ప్రాణాలను పణంగా పెట్టి ఓట్లు రాబట్టాలనుకోవడం అత్యంత దుర్మార్గమన్నారు. ఆ కుట్రలను టీఆర్ఎస్ ఎదుర్కొంటుంది.. బీజేపీ చేసే కుట్రలను టీఆర్ఎస్ పార్టీ గట్టిగా ఎదుర్కొంటోందని, ఈ అంశాలపై సమాచారాన్ని ఎప్పటికప్పుడు టీఆర్ఎస్ బాధ్యులు, ప్రచారకర్తలు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తున్నారని కేటీఆర్ చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను విఘాతం కలిగించే ఏ కార్యక్రమాన్ని ఉపేక్షించొద్దని టీఆర్ఎస్ కోరుకుంటోందన్నారు. బీజేపీ చేసే కుట్రను భగ్నం చేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. ఇటు డీజీపీకి తమ పార్టీ తరఫున వినతిపత్రాన్ని కూడా ఇచ్చామన్నారు. అలాగే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి సైతం వినతి పత్రం ఇస్తామని తెలిపారు. బీజేపీలాంటి రాజకీయ శక్తి పట్ల దుబ్బాక ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కేటీఆర్ సూచించారు. డీజీపీకి వినతిపత్రం ఇచ్చిన వారిలో చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు ఆనంద్, వెంకటేశ్, గోపీనాథ్ తదితరులున్నారు. -
రూ. కోటితో చిక్కిన రఘునందన్ బావమరిది
సాక్షి, హైదరాబాద్: దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారం ముగియడానికి కొన్ని గంటల ముందు ఆ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఎం.రఘునందన్ రావు బావమరిది సురభి శ్రీనివాసరావు రూ.కోటి నగదుతో చిక్కారు. పెద్దపల్లి మాజీ ఎంపీకి చెందిన, బేగంపేటలోని విశాఖ ఇండ స్ట్రీస్ నుంచి ఈ నగదును తీసుకున్న శ్రీనివాస రావు దుబ్బాకకు తరలించే ప్రయత్నాల్లో ఉండగా పట్టుకున్నామని హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ ఆది వారం ప్రకటించారు. ఈ డబ్బుకు, దుబ్బాక ఉప ఎన్నికకు మధ్య సంబంధం ఉన్నట్లు ఆధారాలు సైతం లభించాయని ఆయన స్పష్టం చేశారు. టాస్క్‌ఫోర్స్ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావుతో కలసి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అంజనీకుమార్ వివరాలు వెల్లడించారు. సీపీ తెలిపిన వివరాలు... సిద్దిపేటకు చెందిన శ్రీనివాసరావు పటాన్చెరులో దాదాపు పదేళ్లుగా ఏ టు జెడ్ సొల్యూషన్స్ పేరుతో టెక్నికల్, మ్యాన్‌పవర్ సరఫరా వ్యాపారం చేస్తున్నారు. ఈయన ఆదివారం మధ్యా హ్నం తన కారు డ్రైవర్ టి.రవికుమార్‌తో కలిసి బేగంపేటకు వచ్చారు. విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థ మేనేజర్ నుంచి రూ.కోటి తీసుకున్నారు. ఈ మొత్తాన్ని తన కారులో పెట్టుకుని దుబ్బాకకు తీసుకువెళ్లడానికి సిద్ధమయ్యారు. ఈ విషయంపై పోలీసులకు ఉప్పందింది. దీంతో నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్కు కె.నాగేశ్వరరావు నేతృత్వంలో ఎస్సై థక్రుద్దీన్‌తో కూడిన బృందం రంగంలోకి దిగింది. బేగంపేట ప్రాంతంలో శ్రీనివాస రావు ప్రయాణిస్తున్న కారును ఆపింది. అందులో ఉన్న రూ.కోటి నగదుతోపాటు ఆయన ఫోన్‌ను స్వాధీనం చేసుకుంది. ఈ ఫోన్లో లభించిన ఫేస్‌టైమ్ కాల్స్ వివరాలు, వాట్సాప్‌లో ఉన్న సందేశాలు, ఇతర అంశాలు పరిశీలించిన నేపథ్యంలో ఈ నగదు రఘునందన్‌రావు సూచనల మేరకు దుబ్బాకకు తీసుకువెళ్తున్నారని, అక్కడ ఓటర్లకు పంచిపెట్టడానికి పథకం వేశారని అనుమానిస్తున్నామని అంజనీకుమార్ పేర్కొన్నారు. నిందితుడు తమ అదుపులో ఉండగా అనేకసార్లు రఘునందర్రావు నుంచి అతడి ఫోన్‌కు కాల్స్ వచ్చాయని చెప్పారు. ఈ కేసును బేగంపేట పోలీసులు ప్రత్యేక ఏజెన్సీ సహకారంతో దర్యాప్తు చేస్తారని తెలిపారు. పదిరోజుల్లో రూ.2.34 కోట్లు స్వాధీనం ఎన్నికల సంఘం ఆదేశాలు, సూచనల మేరకు స్వేచ్ఛాయుత వాతావరణంలో, ప్రలోభాలకు తావు లేకుండా ఎన్నికలు నిర్వహించడానికి పోలీసు విభాగం కట్టుబడి ఉంది. గత కొన్ని రోజులుగా నగరవ్యాప్తంగా హవాలా దందాపై నిఘా ముమ్మరం చేశాం. ఫలితంగా పది రోజుల వ్యవధిలో రూ.2.34 కోట్లు స్వాధీనం చేసుకుని పలువురిని అదుపులోకి తీసుకున్నాం. దీనికి ప్రజలిచ్చిన సహకారం, సమాచారమే కీలకంగా మారింది. ఇంకా ఇలాంటి లావాదేవీలపై సమాచారం ఉన్నవారు పోలీసులకు తెలపాలి. – అంజనీకుమార్, హైదరాబాద్ పోలీసు కమిషనర్ -
రణరంగం ముగిసింది.. తీర్పే మిగిలింది..
సాక్షి, హైదరాబాద్ : దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచార రణరంగం ముగిసింది. ఓటర్ల తీర్పు మాత్రమే మిగిలివుంది. చెదురుమదురు సంఘటనలు మినహా ఆదివారం సాయంత్రం అయిదు గంటలతో ఎన్నికల ప్రచారం ప్రశాంతంగా ముగిసింది. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికకు జోరుగా సాగిన ప్రచారం, నాయకుల ఉపన్యాసాలు, డప్పు చప్పుళ్లు, ఊరేగింపులు, మైక్ శబ్దాలు, అభ్యర్థుల హామీలు, వాగ్దానాలు మాటల తూటాల ప్రచార పర్వం ముగిసింది . జోరు వాన కురిసి వెలిసినట్లు పోటాపోటీగా సాగిన ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రంతో సమాప్తం అయింది. (చదవండి : రక్తపాతం జరిగేలా బీజేపీ ప్రోత్సహిస్తుంది : కేటీఆర్) లక్షా 98 వేల ఓటర్లు ఉన్న దుబ్బాక నియోజకవర్గంలో అధికార టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతోపాటు, స్వతంత్ర పార్టీల అభ్యర్థులు కూడా పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు. తాము గెలుస్తామని ఒకరు, తామే గెలుస్తామని మరొకరు ఎవరికి వారు ధీమా వ్యక్తం చేశారు. తమని గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధిని పరిగెత్తిస్తామని అధికార టీఆర్ఎస్, తమను గెలిపిస్తే నియోజకవర్గాన్ని సిద్దిపేట, గజ్వేల్ తరహాలో అభివృద్ధి చేస్తామని బీజేపీ, తమకు ఓటు వేసి గెలిపిస్తే నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటూ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తామని కాంగ్రెస్, ఇలా ఎవరికి వారే ప్రచారం కొనసాగిస్తూ నియోజకవర్గంలోని దాదాపు అన్ని గ్రామాలను కలియతిరిగారు. దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆగస్టు 6న అకాల మరణంతో అనివార్యమైన ఉప ఎన్నిక కోసం అధికార పార్టీ అభ్యర్థిగా ఆయన సతీమణి సోలిపేట సుజాత, బీజేపీ నుంచి మాధవనేని రఘునందన్ రావు, కాంగ్రెస్ తరపున దివంగత మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి తనయుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి బరిలోకి ఉన్నారు. మొత్తం దుబ్బాక బరిలో 23 మంది పోటీ చేస్తున్నారు. అన్ని ప్రధాన పార్టీల ప్రచారానికి సంబంధించి ఇప్పటికే నియోజకవర్గంలో అన్ని పార్టీల ప్రధాన నాయకులు ప్రచారాన్ని హోరెత్తించారు. దుబ్బాక నియోజక వర్గానికి అధికార పార్టీ చేసిన నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమదైన శైలిలో ప్రచారాన్ని నిర్వహించాయి. (చదవండి : 'బీజేపీ అడుగడుగునా తెలంగాణకు అన్యాయం చేస్తోంది') ఒక రకంగా చెప్పాలంటే దుబ్బాక ఉప ఎన్నికను అన్ని ప్రధాన పార్టీలు ఒక సవాలుగా తీసుకున్నాయి. ఉప ఎన్నికలలో తమ పార్టీ అభ్యర్థి గెలుపొందాలని రాష్ట్ర,కేంద్ర స్థాయిలోని పార్టీ ముఖ్య నేతలు ప్రచారాన్ని నిర్వహించి ఎవరికి వారే తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. దుబ్బాక ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ప్రచార సరళిని పర్యవేక్షించారు. ఇక బీజేపీ తరఫున కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్, డీకే అరుణ ప్రచారాన్ని నిర్వహించగా, కాంగ్రెస్ తరఫున పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి, పొన్నాం ప్రభాకర్, హనుమంత రావు, గీతరెడ్డి, దామోదర్ రాజనర్సింహ, ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. (చదవండి : రఘునందన్‌రావు బావమరిది అరెస్ట్) అయితే సిద్దిపేటలో సోమవారం (23వ తేదీ) జరిగిన నోట్ల కట్టల లొల్లి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. బీజేపీ– టీఆర్ఎస్ల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.టీఆర్ఎస్ ప్రోద్బలంతో పోలీసులే డబ్బు తెచ్చిపెట్టి తమను ఇరికించే ప్రయత్నం చేశారని బీజేపీ ఆరోపిస్తే, డబ్బులతో అడ్డంగా దొరికిపోయిన బీజేపీ అసత్య ప్రచారం చేస్తోందని, కపట నాటకాలాడు తోందని టీఆర్ఎస్ ధ్వజమెత్తింది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఆగడాలను అడ్డుకోవాలంటూ ఎన్నికల కమిషన్‌ను బీజేపీ ఆశ్రయించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం తమిళనాడు నుంచి ఒక ఐఏఎస్ అధికారిని కూడా ప్రత్యేక ఎన్నికల పరిశీలకుడిగా నియమించింది. మరోవైపు దుబ్బాక ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకొని తనిఖీలు నిర్వహిస్తున్నారు. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికకు సంబంధించి కేవలం తెలంగాణనే కాకుండా ఇతర రాష్ట్రాలు కూడా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాయి. ఈ నెల 3న పోలింగ్‌లో దుబ్బాక నియోజకవర్గ ప్రజలు ఎవరికి పట్టం కడతారో అన్న విషయం నవంబర్ 10న తేట తెల్లం కానుంది. హోరా హోరీగా సాగిన ఉప ఎన్నిక ప్రచారం సోలిపేట సుజాత (టీఆర్ఎస్) రఘునందన్ రావు (బీజేపీ) చెరుకు శ్రీనివాస్‌రెడ్డి (కాంగ్రెస్) ఎల్లుండి దుబ్బాక ఉపఎన్నిక పోలింగ్, 10న ఫలితాలు దుబ్బాక ఉపఎన్నికకు అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు ఎన్నికల విధుల్లో 2వేల మంది పోలీస్ సిబ్బంది ఈనెల 4 వరకు దుబ్బాక నియోజకవర్గంలో 144 సెక్షన్ దుబ్బాక నియోజకవర్గంలో మొత్తం 315 పోలింగ్ కేంద్రాలు దుబ్బాక నియోజకవర్గంలో 89 సమస్యాత్మక ప్రాంతాలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎన్నికల ఏర్పాట్లు ఒక్కో కేంద్రానికి వెయ్యి మంది ఓటర్లు వృద్ధులు, దివ్యాంగులు, కరోనా రోగులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం -
రఘునందన్‌రావు బావమరిది అరెస్ట్
-
హైదరాబాద్‌లో అల్లర్లకు బీజేపీ కుట్ర?
సాక్షి, హైదరాబాద్ : దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాలంటూ డీజీపీ మహేందర్‌రెడ్డిని టీఆర్ఎస్ నేతలు కోరారు. ఆదివారం సాయంత్రం డీజీపీని కలిసిన టీఆర్ఎస్ నేతలు... హైదరాబాద్‌లో విధ్వంసానికి బీజేపీ పెద్ద ఎత్తున కుట్ర చేస్తోందని, దీనిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేష్, సైదిరెడ్డి, మెతుకు ఆనంద్ తదితరులు డీజీపీని కలిశారు. అనంతరం ఈసీ అదనపు సీఈఓ బుద్ధ ప్రకాష్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. అంతకు ముందునగరంలో అల్లర్లు సృష్టించి ద్వారా వచ్చే సానుభూతితో దుబ్బాక ఉపఎన్నికలో కొన్ని ఓట్లు సాధించాలని బీజేపీ అనుకుంటోందని, ఆ పార్టీ నాయకుల నుంచే తమకు విశ్వసనీయ సమాచారం ఉందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. (రక్తపాతం జరిగేలా బీజేపీ ప్రోత్సహిస్తుంది : కేటీఆర్) -
రక్తపాతం జరిగేలా బీజేపీ ప్రోత్సహిస్తుంది : కేటీఆర్
-
రక్తపాతం జరిగేలా బీజేపీ ప్రోత్సహిస్తుంది : కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా ప్రచారానికి నేడు(ఆదివారం) ఆఖరిరోజు కావడంతో రాజకీయ వేడి మరింత పెరిగింది. దుబ్బాక ఉప ఎన్నికలో గెలవడానికి గత 22 రోజులుగా బీజేపీ ఎన్నో కుట్రలు, కుతంత్రాలకు పాల్పడిందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. 'దుబ్బాక ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవాలని నీచమైన రాజకీయాలకు పాల్పడుతోంది. గత 22 రోజులుగా ఎన్నో కుట్రలు, పన్నాగాలు పన్నిన బీజేపీ చివరికి డబ్బు పంచడానికి కూడా సిద్ధమైంది. ఉప ఎన్నిక సందర్భంగా బీజేపీ వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు దొరికాయి. తాజగా నేడు దుబ్బాక వెళ్తున్న కోటి రూపాయల నగదును హైదరాబాద్‌లో పట్టుబడ్డాయి. ఈ డబ్బులు ఎవరివి అనేవి పోలీసులు ఇప్పటికే నిర్థారించారు. అంతేకాదు బీజేపీ అభ్యర్థి చేయి విరిగిందని అసత్య ప్రచారాలు మొదలుపెట్టారు. తిమ్మిని బమ్మి చేయడం బీజేపీకి బాగా అలవాటు. దుబ్బాక బీజేపీ అభ్యర్థి ఇంట్లోనే డబ్బులు దొరికాయన్నది అందరికి తెలిసిన విషయమే. ఈ విషయంపై గోబెల్స్ ఇష్టారాజ్యంగా ప్రచారం చేస్తూ ప్రజలను ఆగమాగం చేయాలని చూస్తున్నారు. (చదవండి : బండి సంజయ్ అరెస్ట్.. పెట్రోల్ పోసుకున్న కార్యకర్త) నేడు బీజేపీ కార్యలయం ముందు ఎవరో వ్యక్తి ఆత్మహత్యహత్నం చేసుకున్నాడని ప్రచారం మొదలుపెట్టారు. ఇలా ఉప ఎన్నిక ముగిసేవరకు ప్రగతి భవన్,తెలంగాణ భవన్,డీజీపీ కార్యాలయం లాంటివి ఎంచుకొని ముట్టడి కార్యక్రమాలు చేపట్టనున్నారని మాకు విశ్వసనీయ సమాచారం. శాంతి భద్రతల విఘాతం కలిగేలా రక్తపాతం,లాఠీచార్జ్, ఫైరింగ్‌కు బీజేపీ ప్రోత్సహిస్తుంది. ఈ విషయంలో మేము చీఫ్ ఎలక్షన్ కమిషన్‌ను కలవాలని నిర్ణయించాం. ఇప్పటికే చీఫ్ ఎలక్షన్ కమిషన్ కు లేఖను కూడా రాశాము.. అలాగే ఇక్కడ సీఈఓని కూడా కలవనున్నాం అని కేటీఆర్ పేర్కొన్నారు. కాగా దుబ్బాక ఉప ఎన్నిక నవంబర్ 3న జరగనుంది. ఉప ఎన్నిక ఫలితాలు నవంబర్ 10న వెలువడనుంది. (చదవండి : హైదరాబాద్‌లో భారీగా నగదు స్వాధీనం) -
రఘునందన్‌రావు బావమరిది అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : నగరంలో పెద్ద మొత్తంలో పట్టుకున్న హవాలా నగదుకు సంబంధించి ఇద్దరు వక్తులను అరెస్ట్ చేసినట్లు సీపీ అంజనీకుమార్ తెలిపారు. ఇన్నోవా కారుతో పాటు రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ‘పట్టుబడ్డ నగదు దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు బావమరిది సురభి శ్రీనివాస్‌రావుది గుర్తించాం. శ్రీనివాస్‌రావుతో పాటు కారు డ్రైవర్ రవి కుమార్‌ను అరెస్ట్ చేశాం. బేగంపేట ఫ్లైఓవర్ సమీపంలో ఈ నగదును పట్టుకున్నాం. స్వాధీనం చేసుకున్న ఫోన్లో చాలా కీలక సమాచారం సేకరించాం. కాల్ లిస్ట్‌లో రఘనందన్‌రావుకు నేరుగా శ్రీనివాస్ ఫోన్ చేశాడు. కోటి రూపాయిలకు పైగా హవాలా నగదును పట్టుకున్నాం. ఈ నగదును విశాక ఇండస్ట్రీ నుంచి దుబ్బాకకు వెళుతున్నట్లు గుర్తించాం. ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పోలీసులు ఎప్పుడు కృత నిశ్చయంతో ఉంటారు’ అని సీపీ అంజనీకుమార్ తెలిపారు. (దుబ్బాక రాజకీయం.. నోట్లకట్టల లొల్లి) కాగా దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారం నేటితో ముగియనుంది. కాగా దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారం నేటితో ముగియనుంది. దీంతో అన్ని రాజకీయ పార్టీలో ప్రచార వేగం పెంచాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలతో పాటు ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కూడా ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. మరోవైపు దుబ్బాక ఉప ఎన్నికలు ఈ నెల 3న జరగనున్న దృష్ట్యా పోలింగ్‌కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేర మేరకు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వెయ్యిమంది ఓటర్లను ప్రమాణికంగా తీసుకుని అదనపు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. -
హైదరాబాద్‌లో భారీగా నగదు స్వాధీనం
సాక్షి, హైదరాబాద్ : నగరంలో భారీగా హవాలా నగదును నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు కోటి రూపాయలకు పైగా హవాలా నగదును సీజ్ చేశారు.ఇందుకు సంబంధించి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేశారు. కాగా దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఈ నగదును తరలిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలోనూ ఓ పార్టీకి చెందిన నగదును పోలీసులు ఇలానే పట్టుకున్నారు. కాగా ఇంత పెద్ద మొత్తంలో హవాలా సొమ్మును తరలించడంపై పోలీసులు విచారణ చేపట్టారు. -
ఆరేళ్లుగా బీజేపీ అన్యాయం చేస్తోంది: హరీష్
సాక్షి, సిద్దిపేట : గత ఆరేళ్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడుగడుగునా తెలంగాణకు అన్యాయం చేస్తోందని మంత్రి హరీశ్ రావు అన్నారు. బీజేపీ నుంచి బహిష్కరణకు గురైన తోట కమలాకర్ రెడ్డి ఆదివారం మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేశారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. 'బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి నిజాయతీ, చిత్తశుద్ధి ఉంటే ఈ 18 ప్రశ్నలకు సమాధానం చెప్పి బీజేపీ చిత్త శుద్ధిని నిరూపించుకోవాలి. బీజేపీ నాయకులకు నైతిక విలువలు ఉన్నాయా..?. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మంజూరైన ప్రాజెక్టులను రద్దు చేసి తీరని అన్యాయం చేసింది. మేం తెలంగాణకు అన్యాయం చేస్తూనే ఉంటాం. మీరు మాత్రం మా పల్లకి మోయాలన్నట్లు ఉన్నది బీజేపీ వైఖరి. వ్యక్తిగత ఘర్షణలు, దూషణలకు బీజేపీ నేతలు పాల్పడుతున్నారు. తెలంగాణ ఏర్పడగానే 7 మండలాలను ఆంధ్రలో కలిపింది అన్యాయం కాదా..?. సీలేరు పవర్ ప్రాజెక్టు ను ఆంధ్రలో కలపడం ద్వారా ఏటా 500 కోట్ల నష్టం మీ వల్ల కాదా..?. బయ్యారం, ఐటీఐఆర్ రద్దు చేసింది మీరు కాదా..?. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రద్దు మీ పాపం కాదా ?. నీటి కేటాయింపుల్లో అన్యాయం చేయడం లేదా ?. తెలంగాణకు జాతీయ ప్రాజెక్టు ఎందుకు ఇవ్వరు. పోలవరంకు ఇచ్చి కాళేశ్వరానికి ఎందుకు ఇవ్వరు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు 24 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ సూచిస్తే ఎందుకు ఇవ్వలేదు. (వారి తిప్పలన్నీ నాలుగు ఓట్ల కోసమే) తెలంగాణకు 3,155 కిలోమీటర్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించి 1,300 కే పరిమితం చేయలేదా..?. బీజేపీ ప్రభుత్వం వరంగల్ విమానాశ్రయాన్ని ఎందుకు పునరుద్దరించడం లేదు. దేశంలోని టెక్స్టైల్ పార్కులకు సాయం చేస్తున్న కేంద్రం వరంగల్ టెక్స్ టైల్ పార్కుకు ఎందుకు సాయం చేయదు. ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లలో అన్యాయం చేయడం లేదా..?. తెలంగాణలో జిల్లాకో నవోదయ పాఠశాలలు ఎందుకు ఇవ్వడం లేదు. గంగ, నర్మదా నదుల ప్రక్షాళన చేస్తున్న కేంద్రం మూసి ప్రక్షాళనకు ఎందుకు నిధులు ఇవ్వదు. కేంద్రం నుంచి 12 వేల కోట్లు రావాల్సి ఉంది. అది ఎందుకు ఇవ్వరు. తెలంగాణ ప్రజలపై సంజయ్‌కి ప్రేమ ఉంటే కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సినవి సాధించి చిత్తశుద్ధి నిరూపించుకోవాలి' అంటూ 18 ప్రశ్నలతో కూడిన బహిరంగ లేఖకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమాధానం చెప్పాలని కోరారు. -
సిద్దిపేటలాగా.. దుబ్బాక ఎందుకు లేదు?
సాక్షి, హైదరాబాద్: గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లను అభివృద్ధి చేసుకున్న కేసీఆర్, హరీశ్, కేటీఆర్‌లు దుబ్బాకను ఎందుకు పట్టించు కోలేదని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. రామలింగా రెడ్డి దుబ్బాకలో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా చేశారని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయ లేకపోతున్నానని ఆయనే అసెంబ్లీ సాక్షిగా చెప్పారని గుర్తు చేశారు. శనివారం దుబ్బాక నుంచి జూమ్ యాప్ ద్వారా విలేకరులతో మాట్లాడుతూ.. అధికార పార్టీలో ఉన్నా అధి కారులు తనకు సహకరించడం లేదని రామ లింగారెడ్డి అసెంబ్లీలోనే ఆవేదన వ్యక్తం చేశా రని చెప్పారు. నాలుగుసార్లు గెలిచిన రామలింగారెడ్డికి మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని, హరీశ్‌రావు ఎందుకు తప్పుకోలేదని ప్రశ్నించారు. అలాంటి హరీశ్ ఏం మొహం పెట్టుకుని దుబ్బాకలో ఓట్లు అడుగుతున్నారని నిలదీశారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుపై రేప్ కేసు ఆరోపణలు ఉన్నాయని, సొంత పార్టీ నేతలే ఈ ఆరోపణలు చేస్తున్నారన్నారు. హరీశ్‌రావు–రఘునందన్‌రావు ఒకే సామాజిక వర్గం వారని, ఇద్దరూ బంధువులని తెలిపారు. రఘునందన్ గెలిస్తే టీఆర్ఎస్లోకి వెళ్తారని చెప్పారు. దుబ్బాకను అభివృద్ధి చేసిన ఏకైక నాయకుడు చెరుకు ముత్యంరెడ్డి అని, ఏ గ్రామానికి వెళ్లినా ముత్యంరెడ్డి చేసిన అభివృద్ధి మాత్రమే కనిపిస్తోందని ఉత్తమ్ పేర్కొన్నారు. 2014 నుంచి కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో వైఫల్యం చెందాయని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చెరకు శ్రీనివాస్‌రెడ్డిని గెలిపించి ఆ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు.. శ్రవణ్‌కుమార్ అనే డాక్టర్ తన సొంత వ్యాపారం నిమిత్తం డబ్బులు తీసుకెళ్తుంటే పట్టుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఉత్తమ్ అన్నారు. తనిఖీలు, సోదాల పేరుతో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులను వేధిస్తున్నారని ఆరోపించారు. ప్రగతిభవన్, కేసీఆర్ ఫామ్‌హౌస్, టీఆర్ఎస్ నేతల ఇళ్లలో పోలీసులు ఎందుకు సోదాలు చేయడం లేదని ప్రశ్నించారు. ఓ రిటైర్డ్ అధికారికి ప్రత్యేక బృందం ఇచ్చి తమ ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని, దీనిపై లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఒక సామాజిక వర్గం వారు రిటైర్ అయినా మళ్లీ పదవులు ఇస్తూ రాష్ట్ర నిధులన్నీ వారి చేతుల్లో పెడుతున్నారని, దీనిపై న్యాయపోరాటం చేస్తామని వెల్లడించారు. టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి కాంగ్రెస్ కార్యకర్తలు వెనక్కు తగ్గరని ధీమా వ్యక్తం చేసిన ఉత్తమ్ ఆదివారం సాయంత్రం వరకు ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త విశ్రమించకుండా పని చేయాలని పిలుపునిచ్చారు. నో ఎల్ఆర్ఎస్... నో టీఆర్ఎస్ నో ఎల్ఆర్ఎస్– నో టీఆర్ఎస్ అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఉత్తమ్ కోరారు. రాష్ట్రంలో 13 లక్షల ఎకరాల పంట నష్టం జరిగితే ఒక్క రూపాయి పరిహారం ఇవ్వలేదని చెప్పారు. పంట బీమా కల్పించకపోవడంతో రైతులకు అన్యాయం జరిగిన విషయాన్ని ప్రజలకు చెప్పాలని టీపీసీసీ చీఫ్ సూచించారు. -
వారి తిప్పలన్నీ నాలుగు ఓట్ల కోసమే
సాక్షి, హైదరాబాద్: ‘అసంబద్ధ హామీలు, ప్రలోభాలు, అబద్ధాల పునాదుల మీద కాంగ్రెస్, బీజేపీ పార్టీలు దుబ్బాక ఉపఎన్నికలో డిపాజిట్లు తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. మేం మాత్రం మా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓటేయమని అడుగుతున్నాం. ప్రజల్లో నాకున్న విశ్వసనీయతను దెబ్బకొట్టేలా విపక్షాలు అబద్ధాలు, అసత్యాలు ప్రచారం చేస్తున్నాయి. సోషల్ మీడియాలో ఎదుటి వారిని మానసికంగా బలహీన పరిచి నాలుగు ఓట్లు పొందాలనుకునే వారి కుట్ర లను ప్రజాక్షేత్రంలోనే ఛేదిస్తాం. పార్టీ అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ నామీద పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా దుబ్బాక ఉపఎన్నికలో విజ యం సాధిస్తాం’ అని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. దుబ్బాక ఉపఎన్నికలో టీఆర్ఎస్ ప్రచార సారథి హరీశ్‌తో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ పూర్తి పాఠం.. 17 రాష్ట్రాల్లో చేయలేదెందుకో? కాంగ్రెస్, బీజేపీ రాష్ట్ర నాయ కులందరూ ఇక్కడ ప్రచారం చేస్తూ డబ్బు, మద్యంతో పాటు గుళ్లకు, గోపురాలకు డబ్బులు ఇస్తామంటూ ప్రలోభాలకు గురిచేస్తున్నారు. బీజేపీ పుకార్ల పుట్ట, అబద్ధాల గుట్టలా మారి పోయింది. దేశంలో బీజేపీ 17, కాంగ్రెస్ 4 రాష్ట్రాల్లో అధి కారంలో ఉన్నాయి. అక్కడ చేయని సంక్షేమం, అభివృద్ధి వారికి ఇక్కడ ఎలా సాధ్య మవుతుంది? దుబ్బాకలో వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కోసం టీఆర్ ఎస్ ప్రభుత్వం గత ఆరేళ్లలో రూ. 7 వేల కోట్లు ఖర్చు చేసింది. మేం ప్రజాక్షేత్రంలో తిరుగుతూ టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ఓటేయమని అడుగుతున్నాం. దుబ్బాక చైతన్యవంతమైన నియోజకవర్గం. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు కాబట్టే ఇన్నేళ్లుగా టీఆర్ఎస్ను ఆదరిస్తూ వస్తు న్నారు. కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న గోబెల్స్ ప్రచారం, అబద్ధాలను ఎప్పటికప్పుడు ప్రజలకు విడమరిచి చెప్తున్నాం. ఈ రోజు కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో లేదు. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన కేసీఆర్ వైపు ప్రజలు చూస్తున్నారు. బీజేపీ ప్రధాన ప్రత్యర్థి కాదు బీజేపీని ప్రధాన ప్రత్యర్థిగా భావించడం లేదు. ఆ పార్టీ అబద్ధాల పునాదుల మీద రాజకీయం చేస్తూ, చేయనిదానిని చేసినట్లుగా గోబెల్స్ ప్రచారం చేస్తోంది. వాళ్ల రాష్ట్ర నాయకులు ఇక్కడ కూర్చుని ఒక అబద్దాన్ని పదేపదే చెపితే నిజం అవుతుందనే రీతిలో పనిచేస్తున్నారు. ప్రభుత్వంగా మేం విఫలమయ్యాయని బీజేపీ ఒక వేలు మా వైపు చూపిస్తే, వారివైపు రెండు వేళ్లు చూపిస్తాయి. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు చేయలేదు. మేం మాత్రం మా మేనిఫెస్టోలో చెప్పినవి 75 శాతం నెరవేర్చాం. మరో 25 శాతం అమలు దిశగా సాగుతున్నాం. పార్టీకి నా మీద ఉన్న విశ్వాసానికి ప్రతీక దుబ్బాకలో ప్రచార సారథ్య బాధ్యతలు నాకు అప్పగించడం... పార్టీకి నా మీద ఉన్న విశ్వాసాన్ని సూచిస్తోంది. మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు కూడా స్పష్టంగా ఇదే విషయాన్ని చెప్పారు. నాతో మాట్లాడినపుడు సీఎం కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. నేను ఎంతగా ప్రజల్లో తిరిగితే మా పార్టీకి అంతగా ఓట్లు వస్తాయి కనుక విశ్వసనీయతను దెబ్బతీయాలని చూస్తున్నారు. ప్రజల్లో అపోహలు, అనుమానాలు సృష్టించి నాలుగు ఓట్లు పొందాలనేది వారి ప్రయత్నం. వారి తిట్లను కూడా దీవెనలుగా భావిస్తా. నిజం నిలకడ మీద తెలుస్తుంది. నా రాజకీయ జీవితం తెరచిన పుస్తకం నా రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం. ఆరుసార్లు సిద్దిపేటలో గెలిచా. నా పనితీరు ఏంటో ఈ ప్రాంత ప్రజలకు తెలుసు. గతంలో దుబ్బాకలోని పలు గ్రామాలు సిద్దిపేట నియోజకవర్గం పరిధిలో ఉండేవి కాబట్టి వారికి నా మీద పూర్తి విశ్వాసం ఉంది. విపక్షాలు ఎంతగా దూషించినా దుబ్బాకలో టీఆర్ఎస్ మీద, మా నాయకుడు కేసీఆర్ మీద ప్రజలకు నమ్మకం ఉంది. మరో మూడేళ్ల పాటు నేనే అభివృద్ది బాధ్యతలు తీసుకుంటా అని చెప్పాను కాబట్టి నా మీద విశ్వాసం పెడతారనే పూర్తి నమ్మకం ఉంది. ఎన్నికల సమయంలో పోలీసుల మీద, అధికారుల మీద పిర్యాదులు చేయడం విపక్షాలకు అలవాటుగా మారింది. జనంలో పలుకుబడి లేక అధికారుల మీద పడుతున్నారు. గతంలో పాలేరు ఉప ఎన్నికలోనూ కలెక్టర్‌ను బదిలీ చేయించారు. అక్కడ 45 వేల మెజారిటీతో గెలుపొందాం. బీజేపీ ఉద్దేశపూర్వక దాడి సోషల్మీడీయాలో బీజేపీ పథకం ప్రకారం మా మీద దాడి చేస్తోంది. కిరాయి మనుషులను పెట్టుకుని ఎదుటి వారిని మానసికంగా బలహీనపరచాలనే కుట్రలకు సోషల్ మీడియాను వేదికగా వాడుకుంటున్నారు. ‘ప్రజల్లో తక్కువ... సోషల్ మీడియాలో ఎక్కువ’అన్నట్లు ఉంది వారి పరిస్థితి. మేం ప్రజల్లోనే ఉంటూ వారి విషప్రచారాన్ని తిప్పికొడతాం. -
దుబ్బాక నిధులు సిద్దిపేటకు తరలించారు
సిద్దిపేట : దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దగుండవెళ్లి గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపి రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. చింతమడకలో చదువుకున్న అని చెప్పుకునే కెసిఆర్..చింతమడక తరహా పది లక్షలు పెద్దగుండవెళ్లిలో ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. దుబ్బాకకు సిద్దిపేట నుంచి 40 సంవత్సరాల నుండి దాయాదుల పోరు ఉందని, దుబ్బాకకు వచ్చిన అనేక నిధులు సిద్దిపేటకు తరలించారని ఆరోపణలు గుప్పించారు. మూడు నియోజకవర్గాల మద్య ఉన్న దుబ్బాక ఎందుకు అభివృద్ధి చెందలేదు. నాలుగు సార్లు ఎమ్మెల్యే గా గెలిపిస్తే రామలింగారెడ్డి మీ చేతిలో చిప్ప పెట్టిండు. హరీష్ రావు సిద్దిపేట నుండి వచ్చి ఏ మోహం పెట్టుకొని ఓట్లడుగుతుండు. నాలుగు సార్లు గెలిపిస్తే చేయని అభివృద్ధిని మళ్లీ చేస్తాడంటే నమ్ముతమా. దుబ్బాక అభివృద్ధి జరగాలంటే టిఆర్ఎస్ ను 100 అడుగుల లోతుకు పాతిపెట్టాలి అంటూ రేవంత్ విమర్శనస్ర్తాలు సంధించారు. (దుబ్బాక ఉప ఎన్నిక: ఎవరి ధీమా వారిదే) కల్వకుంట్ల మాటలు నమ్మి మోసపోయారు నవంబర్3న జరిగే ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కోరారు. ఇప్పటికే ఈ ప్రాంత ప్రజలు కల్వకుంట్ల మాటలు నమ్మి అనేకసార్లు మోసపోయారని, మరోసారి అలా జరగకూడదన్నారు. ముత్యంరెడ్డి , రామలింగారెడ్డి ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందో పోల్చి చూడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. స్వయానా రామలింగారెడ్డి అసెంబ్లీలో నేనేమి చేయలేకపోతున్న అన్నారని, మరి ఆయన సతీమణితో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందా అంటూ ప్రశ్నించారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్ గెలిస్తే టిఆర్ఎస్లోకి పోతాడని, రఘునందన్, హరీష్ రావు బంధువులని పేర్కొన్నారు. బిజెపికి ఓటేస్తే వృధా అవుతుందని, దుబ్బాక దెబ్బకు కల్వకుంట్ల కుటుంబం దిగిరావాలన్నారు. -
వాళ్లకు కిరాయి మనుషులే దిక్కు: హరీశ్
సాక్షి, సిద్దిపేట: బీజేపీ వాళ్లు వంద కార్లేసుకుని ఊర్లలోకి వస్తున్నరు, కానీ ఊరోళ్లు వంద మంది ఉంటలేరని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. పరాయి నాయకులు, కిరాయి మనుషులే వారికి దిక్కని విమర్శించారు. మిరుదొడ్డి మండలంలోని మోతె గ్రామంలో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతతో పాటు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీలు.. అభివృద్ధిని కళ్లుండి చూడలేని గుడ్డి పార్టీలుగా అభివర్ణించారు. వాళ్లు సీసాలను, పైసలను, అబద్ధాలను నమ్ముకున్నారన్నారు. కాంగ్రెస్ పాలనలో దొంగరాత్రి కరెంట్ వచ్చేదని మంత్రి విమర్శలు గుప్పించారు. వారి మాటలకు మోసపోతే గోసపడతమని జనాలను హెచ్చరించారు. టీఆర్ఎస్.. చేసేది చెబుతుందని, చెప్పిందే చేస్తున్నామని తెలిపారు. లక్ష రూపాయల రుణమాఫీ కచ్చితంగా చేస్తామని మరోసారి హామీ ఇచ్చారు. దీనికోసం అసెంబ్లీ ఆమోదం కూడా ఇదివరకే తీసుకున్నామని స్పష్టం చేశారు. నిజానికి రుణమాఫీ ఇదివరకే బ్యాంకుల్లో జమ అయ్యేవన్నారు. ఈసారి రుణమాఫీ చెక్కులను నేరుగా రైతులకే అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించినట్లు పేర్కొన్నారు. (బీజేపీని 300 ఫీట్ల లోతులో పాతి పెట్టాలి ) -
అదే టీఆర్ఎస్ పెద్దల ప్లాన్!
సిద్దిపేట : కాంగ్రెస్ పార్టీకి ఆదరణ కరువైందని, తెలంగాణలో కాంగ్రెస్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అమ్మేశారని బీజేపీ కేంద్ర ఉపాధ్యక్షురాలు డీకే అరుణ వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ ప్రజల్లో కనిపించడం లేదని, కాంగ్రెస్ భూస్థాపితం అయిందని ఆమె అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని పలు గ్రామాల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుతో కలసి డీకే అరుణ ప్రచారం నిర్వహించారు. ( బీజేపీ రైతు వ్యతిరేక పార్టీ: ఉత్తమ్ ) ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీలో ఉన్న శ్రీనివాస్ రెడ్డికి కాంగ్రెస్ నుండి టికెట్ ఇచ్చి బీజేపీని అడ్డుకోవాలని టీఆర్ఎస్ పెద్దల ప్లాన్. టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందని భయంతోనే ఇలా చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మోరిలో వేసినట్లే. టీఆర్ఎస్ పార్టీని ఓడించే దమ్ము ఒక్క కమలం పువ్వు గుర్తుకే ఉంది. టీఆర్ఎస్కు ప్రజలను ఓటు అడిగే హక్కు లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత ఏం అభివృద్ధి జరిగిందో చెప్పాల’’ని ప్రశ్నించారు. -
టీఆర్ఎస్ నాయకుల ఇళ్లలో పోలీసుల సోదాలు
సాక్షి, సిద్ధిపేట జిల్లా: దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో శనివారం పోలీసులు టీఆర్ఎస్ నాయకుల ఇళ్లలో సోదాలు చేపట్టారు. ఏక కాలం లో 8 మంది టీఆర్ఎస్ నేతల ఇళ్లలో సోదాలు చేశారు. వీరితోపాటు పలువురు రాజకీయ నాయకుల ఇళ్లలో కూడా తనిఖీచేశారు. దుబ్బాక జడ్పీటీసీ రవీందర్ రెడ్డి , ఎంపీపీ పుష్ప లత కిషన్ రెడ్డి , దుబ్బాక మార్కెట్ కమిటీ చైర్మన్ బండి శ్రీలేఖ రాజు , ఆర్య వైశ్య సమాజ అధ్యక్షుడు చింత రాజు , సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ రాజనర్సు , సూడా చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి , కౌన్సిలర్ మచ్చ వేణుగోపాల్ రెడ్డి ,సిద్దిపేట పట్టన పార్టీ అధ్యక్షులు కొండం సంపత్ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించారు. ప్రస్తుతం వారి ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. చదవండి: దుబ్బాక ఉప ఎన్నిక: ఎవరి ధీమా వారిదే -
దుబ్బాక ఉప ఎన్నిక: ఎవరి ధీమా వారిదే
మేమే గెలుస్తాం.. ప్రస్తుతం దుబ్బాకలో ప్రధాన పార్టీల నాయకుల నోట ఇదే మాట. ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు.. రామలింగారెడ్డి చేసిన సేవలు తన విజయానికి సోపానాలని, అధిక మెజార్టీతో విజయం సాధిస్తానని టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత, బీజేపీపై సానుకూలత నియోజకవర్గంలో నిశ్శబ్ద విప్లవంగా వ్యాప్తి చెందుతోందని, ఈసారి విజయం బీజేపీదేనని ఆ పార్టీ అభ్యర్థి రఘునందన్‌రావు అంటున్నారు. ఇక్కడ జరిగిన అభివృద్ధి కాంగ్రెస్ హయాంలోనే అంటూ తమ పార్టీకి బలమైన క్యాడర్ ఉందని, టీఆర్ఎస్, బీజేపీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లను బేరీజు వేసుకుంటూ.. గెలుపుపై అభ్యర్థులు అంచనాలు వేసుకుంటున్నారు. 2018లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 1,90,483 ఓట్లు ఉండగా.. 1,63,658 ఓట్లు పోలయ్యాయి. ఇందులో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డికి 89,112 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థి మద్దుల నాగేశ్వర్‌రెడ్డికి 26,691, బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుకు 22,595 ఓట్లు వచ్చాయి. – సాక్షి, సిద్దిపేట భారీ మెజార్టీ సాధిస్తాం ప్రజలకు టీఆర్ఎస్పై నమ్మకం ఉంది. భారీ మెజార్టీతో విజయం సాధిస్తాను. దుబ్బాక ప్రాంతం అంటేనే వెనుకబడిన ప్రాంతంగా ఉండేది. తాగునీరు, సాగునీటికి ప్రజలు ఇబ్బందులు పడేవారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో నా భర్త ప్రజల దాహార్తిని తీర్చారు. గోదావరి జలాల తరలింపుతో సాగునీటి ఇబ్బందులు తొలగనున్నాయి. ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతీ ఇంటి తలుపు తట్టాయి. ప్రజల కష్టాలు తీర్చిన పార్టీగా టీఆర్ఎస్ వెంట ప్రజలు ఉన్నారు. మంత్రి హరీశ్‌రావు సహకారంతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తున్నా. రామలింగారెడ్డి చేసిన సేవలు చూసి ప్రజలు నన్ను ఆశీర్వదిస్తున్నారు. నా విజయాన్ని ఎవరూ ఆపలేరు. – సోలిపేట సుజాత (టీఆర్ఎస్ అభ్యర్థిని) ఓటు బ్యాంకు ఉంది నియోజకవర్గంలో మా తండ్రి ముత్యంరెడ్డి చేసిన అభివృద్ధి కళ్ల ముందు కన్పిస్తోంది. నాడు వెంట ఉండి నాలుగు పర్యాయాలు అసెంబ్లీకి పంపించిన ప్రజలు ఇప్పుడు ఆయన వారసుడిగా.. నన్ను ఆదరిస్తున్నారు. దీనికి తోడు కాంగ్రెస్ అంటే ప్రజలకు అపారమైన నమ్మకం ఉంది. బీజేపీ, టీఆర్ఎస్ నాయకులను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల నుంచి ఇప్పటి వరకు మా పార్టీ రాష్ట్ర నాయకత్వం అంతా దుబ్బాకలో ఉండి ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇప్పటికీ ప్రజలు మర్చిపోలేదు. కాంగ్రెస్‌కు బలమైన ఓటు బ్యాంకు ఉంది. ఇలా ప్రతీ అంశం మా విజయానికి దోహద పడుతుంది. – చెరుకు శ్రీనివాస్‌రెడ్డి (కాంగ్రెస్ అభ్యర్థి) మార్పు ఖాయం అబద్ధాలకోరు టీఆర్ఎస్తో విసిగి పోయిన దుబ్బాక ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. ప్రజల్లో నిశ్శబ్ద విప్లవం వచ్చింది. ఈ విప్లవమే బీజేపీ విజయానికి సోపానం అవుతుంది. రాష్ట్రం కోసం చేసిన పోరాటంలో దుబ్బాక ప్రాంతానికి ప్రత్యేకత ఉంది. కానీ రాష్ట్ర ఫలాలు మాత్రం సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్లకు అందుతున్నాయి. ఆ మూడు నియోజకవర్గాలను చూసిన వారెవ్వరూ దుబ్బాకలో టీఆర్ఎస్కు ఓటు వేయరు. దుబ్బాక నియోజకవర్గంలో 99 శాతం పల్లెలు ఉన్నాయి. పల్లెల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం విరివిరిగా నిధులు ఇస్తుంది. దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ చరిష్మా సిద్దిపేటలో కూడా పనిచేస్తుంది. గెలిచినా..? ఓడినా..? దుబ్బాక ప్రజల మధ్యనే ఉన్నా..? ఈ సారి దుబ్బాక గడ్డపై బీజేపీ జెండా ఎగరడం ఖాయం. నా విజయం దాదాపు ఖాయమైంది. – రఘునందన్‌రావు (బీజేపీ అభ్యర్థి) -
కాంగ్రెస్ పోటీలో ఉన్నా.. లేకున్నా ఒకటే!
సాక్షి, సిద్దిపేట : దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇవ్వనున్నారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఈ తీర్పు తెలంగాణ రాజకీయాలను మలుపు తిప్పనుందని పేర్కొన్నారు. సిద్ధిపేట మండల కేంద్రలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. గతంలో ఉద్యమ సమయంలో బీజేపీ మహబూబ్‌నగర్‌లో గెలిచినట్లే దుబ్బాకలో కూడా గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు, బీజేపీకి అనుకూలంగా ఓటింగ్ సరళి ఉండనుందని అభిప్రాయపడ్డారు. అధికార టీఆర్ఎస్ పార్టీ కుట్రలు, దుర్వినియోగంతో గెలవాలని చూస్తుందని కిషన్‌రెడ్డి విమర్శించారు. బీజేపీ నేతలకు నిజంగా దమ్ముంటే.. ప్రజల్లో అధికార పార్టీపై వ్యతిరేకత వస్తుందని కేంద్ర మంత్రి అన్నారు. కింద పడ్డ మాదే పైచేయి అన్నట్లు అధికార పార్టీ వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ అధికార దుర్వినియోగం చేస్తుందని మండిపడ్డారు. బీజేపీపై విషప్రచారం చేస్తున్నారని, కేంద్ర నిధుల విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. 1200 మంది ఆత్మహత్య చేసుకున్నది ఒక కుటుంబం కోసం కాదని, దుబ్బాకపై టీఆర్ఎస్ సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని అన్నారు. ప్రభుత్వ యంత్రాంగం ఓటర్లను ప్రలోభ పెట్టకుండా చూడాలని కోరారు. కాంగ్రెస్ పోటీలో ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటేనని, కాంగ్రెస్ తరుపున సగం మందికి పైగా ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు ఓటు అడిగే నైతిక హక్కు లేదన్న కిషన్‌రెడ్డి టీఆర్ఎస్, కాంగ్రెస్ బొమ్మా, బొరుసు లాంటి వారేనని, దొందూ దొందేనని ఎద్దేవా చేశారు. చదవండి: దుబ్బాక ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తుకు నాంది -
బీజేపీ నేతలకు నిజంగా దమ్ముంటే..
సాక్షి, సిద్దిపేట : దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నేతల అసత్య ప్రచారాలపై ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. దుబ్బాకలో బీజేపీ పార్టీ జూటా మాటలు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. బీజేపీ జూటా మాటలు ప్రజలకు తెలియజేసేందుకే ఈ రోజు(శుక్రవారం) మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. వెనుకటికి వేయి అబద్దాలు ఆడిన ఒక పెళ్లి చేయాలని అనే వారని, ఇప్పుడు బీజేపీ వాళ్ళు వేయి అబద్దాలు ఆడైన ఒక ఎన్నిక గెలవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్దాలే ఆయుధంగా చేసుకుని, అబద్ధాల పునాదుల మీద దుబ్బాకలో బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారన్నారు. బీజేపీ నేతలు సత్యమేవ జయతే అనే నానుడిని మార్చి అసత్యమేవ జయతేగా మార్చివేశారని విమర్శనాస్త్రాలు సంధించారు.చదవండి: దుబ్బాక ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తుకు నాంది బీడీ కార్మికులకు కాంగ్రెస్ పార్టీ పుర్రె గుర్తును బహుమతిగా ఇస్తే, బీజేపీ వాళ్ళు 18 శాతం జీఎస్టీని కానుకగా ఇచ్చారని మంత్రి ఎద్దేవా చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బీడీ కార్మికులను మోసం చేస్తే, కేసీఆర్ పెన్షన్ ఇచ్చి వారిని ఆదుకున్నారని గుర్తు చేశారు. కేసీఆర్ కిట్ పథకంలో బీజేపీ ప్రభుత్వ వాటా ఉందని బీజేపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. కేసీఆర్ కిట్‌లో కేంద్రానిది నయా పైసా లేదని స్పష్టం చేశారు. గొర్రెల యూనిట్లలో 50 వేలు బీజేపీ ప్రభుత్వం ఇస్తుందని గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని అన్న మంత్రి హరీష్‌రావు గొర్రెల యూనిట్లలో నూటికి నూరు శాతం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందని పేర్కొన్నారు. చేగుంటలో మంజూరైన ఈఎస్ఐ ఆసపత్రిని గజ్వేల్‌కు తరలించారని బీజేపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. బీజేపీ నేతలకు నిజంగా దమ్ముంటే చేగుంటకు మంజూరు ఆయునట్లు ఆధారాలు చూపాలని సవాల్ విసిరారు. చదవండి: దుబ్బాక ఎన్నికలపై కేంద్రానికి కాంగ్రెస్ ఎంపీ లేఖ ‘ఆఖరికి ప్రజలు తినే అన్నం పైన బీజేపీ నేతలు అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. రేషన్ బియ్యంపై కేంద్రం 29 రూపాయలు ఇస్తుంటే, టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రూపాయి ఇస్తోందని ప్రచారం చేస్తున్నారు. కేంద్రం కేవలం సగం కార్డులకే సబ్సిడీ ఇస్తే మిగతా సగం కార్డులకు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది. దుబ్బాకలో మంజూరైన పాలిటెక్నిక్ కాలేజ్‌ను సిద్దిపేటకు తరలించారని గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. అసలు దుబ్బాకకు పాలిటెక్నిక్ కళాశాలనే మంజూరు కాలేదు. కేసీఆరే బోరు మోటార్లకు మీటర్ పెడుతుందని ఉల్టా ప్రచారం చేస్తున్నారు. చదవండి: దుబ్బాక ఎన్నికపై కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు వరి ధాన్యం మద్దతు ధర కోసం రూ. 5,500 కోట్లు కేంద్రం విడుదల చేసిందని పచ్చి అబద్దాలు ఆడుతున్నారు. కేంద్రం ఒక్క రూపాయి విడుదల చేయలేదు. డబ్బులు దొరికిన ఇల్లు మా వాళ్లది కాదంటున్న బీజేపీ అభ్యర్థి పోలీసులు తనిఖీలు చేస్తున్నారు అని తెలియగానే ప్రచారం ఆపేసి ఎందుకు ఆగమేఘాల మీద పరుగెత్తుకు వచ్చిండు? హడావుడి ఎందుకు చేసిండు? దుబ్బాకలో రఘునందన్ రావు అసత్యాలు ప్రచారం చేసే జూటా స్టార్‌గా మారాడు. దుబ్బాక ప్రజలు బీజేపీ నేతల మాటలు విని మోసపోవద్దు’. అని మంత్రి బీజేపీ ప్రచారం చేస్తున్న అబద్దాలపై నిప్పులు చెరిగారు. -
దుబ్బాక ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తుకు నాంది
సాక్షి, సిద్దిపేట: ఈ ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తుకు నాంది పలికే ఎన్నికలు కావాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. మిరదొడ్డి మండలం భూపల్లిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శుక్రవారం ఎన్నికల సభలో మాట్లాడుతూ, తెలంగాణా పోరాటంలో దుబ్బాక కీలకపాత్ర పోషించిందని అన్నారు. తెలంగాణా వస్తే తొలి ముఖ్యమంత్రి దళితుడు అవుతాడని చెప్పిన కేసీఆర్ మాట తప్పారని ధ్వజమెత్తారు. వేయి మంది కేసీఆర్‌లు ఉన్నా తెలంగాణ వచ్చేది కాదని, ఆనాడు పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు బీజేపీ మద్దతు తెలపడం ద్వారానే వచ్చిందన్నారు. తెలంగాణ వచ్చిన యువకులకు ఉద్యోగాలు లేకుండాపోయాయన్నారు. కేసీఆర్ ఇచ్చిన అన్ని హామీలను తప్పారని, టీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ కుటుంబానికి బుద్ధి చెప్పే అవకాశం దుబ్బాక ఉప ఎన్నిక ద్వారా వచ్చిందన్నారు. పంటల బీమా పథకం నరేంద్ర మోదీ తెచ్చారని,దీనిని తెలంగాణా ప్రభుత్వం సక్రమంగా అమలు చేయడం లేదన్నారు కిషన్ రెడ్డి మండిపడ్డారు. హరీష్ రావు అన్నీ అబద్దాలాడుతున్నారని ,రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలలో కేంద్రం ఇస్తున్న నిధులు ఏమి లేవనడాన్ని ప్రశ్నించండి అని కోరారు. కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భవ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తే మోదీకి,కేంద్ర ప్రభుత్వానికి పేరొస్తుందని దానిని నీరుగార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ కనుసన్నలో నడుస్తోందని, అందుకే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దు అని కోరారు. అట్లా వేస్తే టీఆర్ఎస్కు ఓటు వేసినట్లే అని అన్నారు. తెలంగాణాలో కుటుంబ పాలన నడుస్తుందని,అవినీతి పాలన నడుస్తుందని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ ఎంఐఎంను పెంచిపోషిస్తుందన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో రఘునందన్ రావును మిగతా పార్టీల అభ్యర్థులను చూడండి అని విజ్ఞప్తి చేశారు. రఘునందన్‌రావు ఒక ప్రశ్నించే గొంతుగా అసెంబ్లీలో ఉండాలంటే భారీ మెజార్టీతో గెలిపించండి అని కోరారు. ఇక బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ, దుబ్బాక లో జరిగేది ఎన్నికలు కాదని ఒక యుద్ధం అని అన్నారు. రఘునందన్ రావుపై ఎన్ని కుట్రలు చేశారో అందరికి తెలుసు అని చెప్పారు. కేంద్రం నుంచి రూపాయి రాకుంటే మీరు చెప్పిన మాటపై నిలబడే వారైతే తాము ఎక్కడికి రావాలో చెప్పాలన్నారు. తండ్రి, కొడుకు, అల్లుడు తెలంగాణను నాశనం చేస్తున్నారన్నారని నిప్పులు చెరిగారు. బంగారు తెలంగాణ కాలేదు కానీ మత్తు తెలంగాణ అయింద్యని ఎద్దేవా చేశారు. తెలంగాణ కోసం ఎంతో మంది యువకులు ప్రాణాలు త్యాగం చేశారని, తనకు తోడుగా రఘునందన్ ను అసెంబ్లీకి పంపిస్తే టీఆర్‌ఎస్‌నఆడుకుంటామని, తామిద్దరం కలిసి తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేస్తాం అని అన్నారు. చదవండి:దుబ్బాక ఎన్నికలపై కేంద్రానికి భువనగరి ఎంపీ లేఖ -
దుబ్బాక ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తుకు నాంది
-
దుబ్బాక ఎన్నికలపై కేంద్రానికి భువనగరి ఎంపీ లేఖ
సాక్షి, భువనగిరి: దుబ్బాక ఉప ఎన్నికలు స్వేచ్చగా.. పారదర్శకంగా జరిగేలా చూసేందుకు కేంద్ర బలగాలను పంపాల్సిందిగా కోరుతూ భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర ఎన్నికల కమిషన్‌కు శుక్రవారం లేఖ రాశారు. టీఆర్ఎస్, బీజేపీ ఎన్నికల నియమ నిబంధనలు తుంగలో తొక్కి అక్రమ మార్గంలో గెలిచేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాయని ఆయన లేఖలో పేర్కొన్నారు. బీజేపీ అభ్యర్ధి బంధువు ఇంట్లో డబ్బులు దొరికాయని... మంత్రి హరీశ్ రావు తన అధికారాన్ని ఉపయోగించి ప్రత్యర్థి పార్టీ నాయకులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. స్వేచ్ఛగా ఎన్నికలు జరిపేందుకు తక్షణమే కేంద్ర ఎన్నికల సంఘం దుబ్బాక ఉప ఎన్నికల విషయంలో జోక్యం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎన్నికల నిబంధనలు అతిక్రమించి అక్రమాలకు పాల్పడుతున్న వారిపై మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా దుబ్బాకకు కేంద్ర బలగాలను పంపాలని, ప్రతి మండలానికి కనీసం ఒక కేంద్ర పరిశీలకుడిని కూడా పంపి ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలన్నారు. అంతేగాక రాష్ట్ర పోలీసులు, జిల్లా అధికారులను తక్షణమే దుబ్బాక నుంచి తరలించేలా చూడాలన్నారు. అదే విధంగా ఇతర జిల్లాల అధికారులను దుబ్బాకకు పంపి ఎన్నికలు స్వేచ్ఛగా.. పారదర్శకంగా నిర్వహించేలా చేయాలని కేంద్ర ఎన్నికల కమిషనర్‌ను కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. హరీశ్ వ్యాఖ్యలపై పలు అనుమానాలు: విజయశాంతి -
దుబ్బాక ఎన్నికపై కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్ : దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు ధీమా వ్యక్తం చేశారు. భారీ మెజార్టీతో విజయం సాధిస్తామని ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్ గురువారం మీడియాతో చిట్‌చాట్‌లో ... దుబ్బాక గెలుపు ఎప్పుడో డిసైడ్ అయింది. గ్రౌండ్ చాలా క్లియర్‌గా ఉంది. ఈ ఎన్నికలు మాకు లెక్కే కాదు. మంచి మెజార్టీతో గెలుస్తాం. ఇప్పటికే గెలుపు ఖాయం. అప్పటి వరకూ ఈ తతంగాలు నడుస్తూనే ఉంటాయి’ అని అన్నారు. హైడ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు... ‘రాబోయే 15 రోజుల్లో వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభం అవుతాయి. ప్రతి ఓపెన్ ప్లాట్ దారుడు నాన్ అగ్రికల్చర్ ఆస్తిగా నమోదు చేసుకోవాలి. ప్లాట్ల వివరాలు వెబ్సైట్లో కనిపించవద్దనుకుంటే హైడ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. పూర్తి టైటిల్ విషయంలో ఓనర్ నష్టపోతే ప్రభుత్వమే నష్టపరిహారం ఇస్తుంది. ధరణి పోర్టల్ బ్యాకప్ అంతా రహస్యంగా ఉంటుంది’ అని చెప్పారు -
బీజేపీ గోబెల్స్ ప్రచారం తప్ప మరేమీ లేదు..
సాక్షి, సిద్దిపేట: నాటి నైజం పాలన నుంచి నిన్నటి సమైక్యాంధ్ర పాలన వరకు ప్రతి ఒక్కరు భూమి ఉన్నవారి వద్ద శిస్తు వసూలు చేశారు.. కానీ ఒక్క కేసీఆర్ మాత్రం చరిత్ర తిరగరాసి భూమి ఉన్న ప్రతి ఒక్కరికి రైతుబంధు పథకం ద్వారా డబ్బులు ఇస్తున్నారని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. దుబ్బాక నియోజకవర్గం ఘనపూర్, గుడికందుల గ్రామాల్లో టీఆర్ఎస్ అభ్యర్ది సోలిపేట సుజాతకు మద్దతుగా మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌లు గురువారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుడికందుల గ్రామంలోని కాలభైరవ స్వామి ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... తెలంగాణ రాక ముందు రాష్ట్రంలో రైతుల పరిస్థితి అత్యంత దుర్భరంగా ఉండేదని, కాంగ్రెస్, తెలుగుదేశం పాలనలో రైతుల ఆత్మహత్యలే మిగిలాయని మండిపడ్డారు. తెలంగాణ వచ్చాక రైతుల పరిస్థితి మారిందా లేదా? ప్రజలు ఆలోచించాలన్నారు. రైతుల బతుకుల్లో మార్పు రావాలనే సీఎం కేసీఆర్, 24 గంటల ఉచిత కరెంట్, రైతు బంధు ఇస్తున్నారన్నారు. (చదవండి: అప్పుడే బాయి కాడ మీటర్ల జోలికి రారు: హరీశ్) బీజేపీ పాలిస్తున్న 17 రాష్ట్రాల్లో, కాంగ్రెస్ పాలిస్తున్న అయిదు రాష్ట్రాల్లో ఎక్కడైనా 24 గంటల ఉచిత కరెంట్, ఎకరాకు 10 వేలు ఇస్తున్నారా అనేదానికి సమాధానం ఇచ్చి , ఆ తర్వాత వాళ్ళు ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. వచ్చే మూడేళ్లు అధికారంలో ఉండేది తామేనని, అభివృద్ధి తమతోనే అని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ చేతిలో నెత్తి లేదు.. కత్తి లేదు.. వాళ్లెం చేస్తరని, ఇక బీజేపీ గోబెల్స్ ప్రచారం తప్ప మరేమీ లేదని ఎద్దేవా చేశారు. వాళ్లు పైసలో.. సీసాలో ఇస్తారు.. లేదంటే హరీశ్ రావును తిడుతరని, వాళ్ల తిట్లకు భయపడను.. దీవెనలుగా తీసుకుంటా.. ఇంకా బలపడతానని అన్నారు. బీజేపీ ఫారిన్ మక్కలు తెచ్చి తెలంగాణ కోళ్లకు పోస్తే.. మన మక్కలు ఎవడు బుక్కాలి? బీజేపీ ఎవరి ప్రయోజనాల కోసం పని చేస్తుందని ప్రశ్నించారు. మార్కెట్లను ప్రైవేటు పరం చేసి రైతులకు మద్దతు ధర లేకుండా చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాదనుకున్న తెలంగాణను, కాదనుకున్న కాళేశ్వరం నీళ్లను తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే అన్నారు. బిహార్‌లో మోదీ డబుల్ ఇంజన్ గ్రోత్ అంటున్నారని, ఇక్కడ కూడా అధికారంలో టీఆర్ఎస్ ఉన్నదని.. దుబ్బాకలోనూ టీఆర్ఎస్ గెలిస్తేనే అభివృద్ధి ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. (చదవండి: హరీశ్ వ్యాఖ్యలపై పలు అనుమానాలు: విజయశాంతి) -
‘దుబ్బాకలో ఇంటింటికి పది లక్షలు ఇప్పిస్తాం’
సాక్షి, సిద్ధిపేట: ఏదేమైనా దుబ్బాకలో కాషాయ జెండా ఎగురుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. జిల్లాలో మిరుదొడ్డి మండలం మోతె గ్రామం ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్, అభ్యర్థి రఘునందన్ రావు, మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ పాల్గొన్నారు. ఈ సందర్బంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. సిద్దిపేట సీపీ ప్రవర్తన చూస్తే అమరులైన పోలీసులు, తెలంగాణ ఉద్యమ అమరుడు శ్రీకాంత్‌చారి ఆత్మలు ప్రశాంతంగా ఉండవని వ్యాఖ్యానించారు. తప్పుడు ప్రచారం చేస్తున్న టీఆర్ఎస్కు ఈ ఎన్నికలో గుణపాఠం చెబుతామని పిలుపునిచ్చారు. కేసీఆర్ దొడ్డు వడ్లు పండించి.. రైతులను సన్న వడ్లు పండించమనడం సరైంది కాదన్నారు. దుబ్బాక ప్రజల తీర్పు ముఖ్యమంత్రి అహంకారానికి ప్రతీక కావాలని ఆయన పిలుపునిచ్చారు. దుబ్బాక నియోజకవర్గానికి కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చిందో తేల్చుకుందామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఐదు సంవత్సరాల నుంచి ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని అన్నారు. (చదవండి: బండి సంజయ్ అరెస్ట్; సీఎస్, డీజీపీకి నోటీసులు) రఘునందన్ గెలిచిన వారం రోజుల్లో మల్లన్నసాగర్ బాధితులకు పూర్తి న్యాయం చేస్తామని బండి సంజయ్ హామీ ఇచ్చారు. మంత్రి పదవి కాపాడుకోడానికే హరీష్ రావు ఓట్లడుగుతున్నారని, కరీంనగర్ తరహాలో యువత ఒక్కటై టీఆర్ఎస్ను ఓడించాలని పిలుపునిచ్చారు. కమలం గుర్తుకు ఓటేసి బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అనంతరం దుబ్బాక అభ్యర్థి రఘునందన్ రావు మాట్లాడుతూ... దేశంలో రామరాజ్యం నడిస్తే.. తెలంగాణలో రజాకార్ల రాజ్యం నడుస్తుందని ధ్వజమెత్తారు. దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు కేసీఆర్, హరీష్‌రావు అహంకార పతనానికి నాంది కావాలన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే అది మురిగిపోయినట్టే.. టీఆర్ఎస్కు పోయినట్టేనని, బీజేపీని గెలిపిస్తే చింతమడక తరహాలో దుబ్బాకలో ఇంటింటికి పది లక్షలు ఇప్పిస్తామని ఆయన వ్యాఖ్యానించారు. (చదవండి: దుబ్బాక రాజకీయం.. నోట్లకట్టల లొల్లి) దుబ్బాక నుంచే యుద్ధం మొదలు: బండి సంజయ్ దుబ్బాక నియోజకవర్గం కాసులాబాద్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ చీఫ్ బండి సంజయ్ మాట్లాడుతూ.. ‘సీపీ టీఆర్ఎస్ కార్యకర్త. అతడి సంగతి ఎన్నికల తర్వాత చెప్తాం. అందుకే ఇక్కడికి ఎవరిని తేవాలో వారిని తెచ్చాం. సిద్దిపేట సీపీ జోయల్ డేవిస్ ఎమ్మెల్యే అవుదాం అనుకుంటున్నారా? వార్డ్ మెంబర్ కూడా కాలేరు. మానసిక క్షోభతో రామలింగారెడ్డి చనిపోయారు. రామలింగారెడ్డి కొడుకును ఎందుకు దాచి పెట్టారు? ఇక్కడ టీఆర్ఎస్ గెలిస్తే ముగ్గురు ఎమ్మెల్యేలు అవుతారు. దుబ్బాక నిర్లక్ష్యానికి ఎందుకు గురి అయింది? టీఆర్ఎస్పై యుద్ధం దుబ్బాక నుంచే మొదలవ్వాల’ని పిలుపునిచ్చారు. (చదవండి: నోటీసులు ఇచ్చే... తనిఖీలు చేశాం) -
వేడెక్కిన దుబ్బాక రాజకీయం
-
అప్పుడే బాయి కాడ మీటర్ల జోలికి రారు
సాక్షి, మెదక్: బాయి కాడ మీటర్ల పేరుతో కేంద్రం బిల్లు తెచ్చిందని.. బోర్ల వద్ద మీటర్లు వద్దనే రైతులు.. బీజేపీని 300 ఫీట్ల లోతులో పాతి పెట్టాలని ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు పిలుపునిచ్చారు. దుబ్బాక ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ జిల్లా చేగుంటలో రోడ్‌షో, రైతు సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో కాలిపోయే మోటార్లు, పైసలు ఉంటేనే ట్రాన్స్ఫార్మర్లు వచ్చేవని, బీజేపీ ప్రభుత్వం ఏకంగా వ్యవసాయ బోర్లకు మీటర్లు బిగించేందుకు చట్టం తీసుకొచ్చిందన్నారు. ఏప్రిల్ 27న కేంద్ర ప్రభుత్వం ఉచిత కరెంటు, సబ్సిడీ కరెంటు ఇవ్వొద్దని, వ్యవసాయ మీటర్లు పెడితే రూ.2,500 కోట్లు ఇస్తామని కేంద్రం మే 17న లేఖ రాసిందన్నారు. అయినప్పటికీ.. రైతులకు ఉచిత కరెంటు అందిస్తామని కేంద్రానికి సీఎం కేసీఆర్ తేల్చి చెప్పారన్నారు. కాళేశ్వరం నీళ్లు దుబ్బాక వరకు వచ్చాయని.. త్వరలోనే చేగుంట, శంకరంపేట మీదుగా మెదక్ వరకు అందిస్తామన్నారు. మార్కెట్ కమిటీలను ప్రైవేట్ పరం చేస్తే రైతులు ఆగమవుతారని మంత్రి తెలిపారు. వ్యవసాయాన్ని ఉపాధిహామీ పథకానికి అనుసంధానం చేయమంటే కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. తోకముడిచిన బీజేపీ నేతలు టీఆర్ఎస్ మాత్రం బీడీ కార్మికులకు ఒక్కొక్కరికి నెలకు రూ.2 వేల పింఛన్ అందిస్తోందని చెప్పారు. కేంద్రం దేనికోసం నిధులు ఇచ్చిందో నిరూపించమంటే బీజేపీ నేతలు తోకముడిచారని ఎద్దేవా చేశారు. బీజేపీ, కాంగ్రెస్ ప్రచారంలో పరాయి నాయకులు, కిరాయి జనాలే కనిపిస్తున్నారని విమర్శించారు. దుబ్బాకలో సుజాతక్కను గెలిపిస్తే మనకు సీఎం నిధులు ఇస్తారన్నారు. వృద్ధులు, దివ్యాంగులకు పోస్టల్ బ్యాలెట్ సాక్షి, సిద్దిపేట: కరోనా భయం నేపథ్యంలో దుబ్బాక ఉపఎన్నికల్లో ఓటు వేయాలనుకునే వృద్ధులు, దివ్యాంగులకోసం భారత ఎన్నికల సంఘం ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. గతంలో ఎన్నికల డ్యూటీలో ఉన్న ఉద్యోగులకు కల్పించిన పోస్టల్ బ్యాలెట్ మాదిరిగానే.. పోలింగ్ కేంద్రాలకు వెళ్లలేమని ముందుగా తెలిపిన వృద్ధులు, దివ్యాంగులకు పోస్టల్ బ్యాలెట్ పేపర్లు ఇచ్చి ఓటు వేసిన తర్వాత సీల్డ్ కవర్లను స్వీకరిస్తున్నారు. కాగా, ‘నవంబర్ మూడో తేదీన ఎన్నికలు ఉండగా.. పోలింగ్‌కు ముందే ఈ పోలింగ్ ఏంది.. ఎవరికీ సమాచారం లేకుండా ఎలా ఓట్లు వేయిస్తున్నారు’అని పలువురు నాయకులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. నార్సింగి మండల కేంద్రంలో పోస్టల్ బ్యాలెట్లను స్వీకరిస్తున్న అధికారులను ఇలానే వెనక్కి పంపించారు. అయితే భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకే ఈసారి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు సేకరిస్తున్నామని, ఈ విషయం రిటర్నింగ్ అధికారి నిర్వహించిన అన్ని పార్టీల సమావేశంలో వివరించామని అధికారులు చెబుతున్నారు. 1,553 మంది పోస్టల్ బ్యాలెట్‌కు అంగీకారం దుబ్బాక నియోజకవర్గంలో 1,084 మంది వృద్ధులు, 469 మంది దివ్యాంగులు మొత్తం 1,553 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓట్లు వేసేందుకు సిద్ధమయ్యారు. వంద మంది ఓటర్లకు ఒక బృందం చొప్పున మొత్తం 15 టీమ్‌లను ఎంపిక చేశారు. 15 బ్యాలెట్ బాక్స్‌లు వీరికి అందజేశారు. ఇద్దరు ఎన్నికల నిర్వహణ ఉద్యోగులు, ఇద్దరు పోలీసులు కలిసి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసిన వారినుంచి సీల్డ్ కవర్‌ను సేకరిస్తున్నారు. సమాచారం లేదని అడ్డుకున్న యువకులు చెప్పాపెట్టకుండా బ్యాలెట్ బాక్సులతో వచ్చి ఓట్లు వేయించుకుంటున్నారని బీజేపీతోపాటు ఇతర పార్టీలకు చెందిన కొందరు యువకులు, నాయకులు బ్యాలెట్ బాక్సులతో వచ్చిన అధికారులను వెనక్కి పంపిన సంఘటన మంగళవారం నార్సింగి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. రిటర్నింగ్ అధికారి ఆదేశాల మేరకు ఎన్నికల అధికారి శ్యామల బృందం నార్సింగి మండల కేంద్రంలోని గుర్రాల చంద్రయ్య ఇంటికి వెళ్లింది. 80 సంవత్సరాలకు పైబడిన ఆయన తల్లికి ఇచ్చిన బ్యాలెట్ పేపర్‌ను తీసుకుంటుండగా.. అక్కడికి వచ్చిన పలువురు యువకులు.. ఎవరికీ చెప్పకుండా వచ్చారు. ఎన్నికలకు ముందు ఈ ఓటింగ్ ఏమిటని ప్రశ్నించారు. ఈ విషయంపై అధికారులు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా వినకుండా అక్కడి నుంచి పంపించారు. రాజకీయ పార్టీల సమావేశంలోవివరించాం భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కోవిడ్ నేపథ్యంలో 80 సంవత్సరాలకు పైబడిన వారికి, దివ్యాంగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించాం. పోలింగ్ స్టేషన్‌కు రాలేమని ముందుగా చెప్పిన వారికి బ్యాలెట్ పత్రాలను అందజేశాం. ఈ విషయం రాజకీయ పార్టీల సమావేశంలో కూడా చెప్పాం. గ్రామాల్లోకి వచ్చే పోలింగ్ అధికారులకు సహకరించాలి. సీల్డ్ కవర్లలోనే బ్యాలెట్ పత్రాన్ని స్వీకరించి సిబ్బంది బాక్స్‌లలో వేస్తున్నారు. – చెన్నయ్య, రిటర్నింగ్ అధికారి -
‘వారిద్దరూ తోడు దొంగలు’
దుబ్బాక రూరల్: మంత్రి హరీశ్‌రావు, బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు తోడు దొంగలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. వారిద్దరూ బంధువులేనని, ఓటర్లను ఆగం చేసేందుకు డ్రామాలు ఆడుతున్నారని చెప్పారు. బుధవారం దుబ్బాక మండలంలో కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డితో కలసి పలుచోట్ల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌కు ఉన్న ప్రజాదరణ చూసి ఓటర్లను తికమక పెట్టేందుకు వారిద్దరూ కలసి అద్భుతమైన స్క్రిప్టు తయారు చేశారని విమర్శించారు. ప్రజలెవరూ గందర గోళం పడాల్సిన అవసరం లేదన్నారు.బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుపై అత్యాచారం కేసులు ఉన్నాయని, అలాంటి వ్యక్తికి ఓట్లు ఎలా వేస్తారని ప్రశ్నించారు. ఆయన విపరీతంగా డబ్బులు పంచుతున్నారని ఆరోపించారు. దుబ్బాక, సిద్దిపేట తనకు రెండు కళ్లు అని హరీశ్‌రావు చెప్పుకోవడం తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు. రూ.లక్ష వరకు రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చిన ప్రభుత్వం.. ఇంత వరకు అమలు చేయలేదని విమర్శించారు. రుణమాఫీ, డబుల్ బెడ్ రూం ఇళ్లు రావాలంటే టీఆర్ఎస్ను ఓడించాలని, అప్పుడే ముఖ్యమంత్రి కేసీఆర్ కిందికి దిగి వస్తారన్నారు. నిరుద్యోగులతో చెలగాటం ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఉత్తమ్ విమర్శించారు. నెలకు మూడు వేలు నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదని, కానీ తన కుటుంబంలో కుమారు డు, అల్లుడికి మంత్రి పదవులు కట్ట్టబెట్టారని ఆరో పించారు. నిరుద్యోగులకు మాత్రం మొండిచెయ్యి చూపారని దుయ్యబట్టారు. తమ పార్టీ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. -
హరీష్ రావు అంటే తెరిచిన పుస్తకం
సిద్దిపేట : దేశంలో రైతులు 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చింది కేసీఆర్ మాత్రమేనని మంత్రి హరీష్ రావు అన్నారు. దుబ్బాక మండలం గుండవెళ్లి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పరిపాలించే రాష్ట్రాల్లో రైతులకు ఉచిత కరెంటు ఇస్తున్నారా అంటూ ప్రశ్నించారు. కాలిపోయే మోటర్లు.. బాయికాడ మీటర్లు.. 24 గంటల ఉచిత కరెంటుకు పోటీ.. ఎటుండాలో మీరే తేల్చుకోండి అంటూ ఓటర్లకు పిలుపునిచ్చారు. (నా తోబుట్టువు సుజాత అక్కని గెలిపిద్దాం: హరీష్ రావు ) మార్కెట్లను ప్రైవేటు చేయబోతున్నారని, అలాంటి బిల్లుకు వ్యతిరేకంగా రేపు పోరాటం చేస్తామని హరీష్ అన్నారు. గుండవెళ్లి గ్రామంలో అన్ని కుల సంఘాలకు భవనాలు కట్టిస్తామని, అక్కడి గ్రామ ప్రజలకు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కాల్వల కింద భూములు కోల్పోయిన రైతులకు రూపాయి తక్కువలేకుండా సిద్దిపేట తరహా ఇస్తామన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చేసే ఆరోపణలు, సవాళ్లకు తాను భయపడనని అన్నారు. 'హరీష్ రావు అంటే తెరిచిన పుస్తకం లాంటిది. నన్ను తిట్టిన మీకు, మీ విజ్ఞతకే వదులుతున్న. మీకే నాలుగు ఓట్లు తక్కువైతాయి' అని హరీష్ ప్రసంగంలో పేర్కొన్నారు. (కేసీఆర్ ఫామ్ హౌస్‌లో ఓట్లు లెక్కిస్తారేమో : విజయశాంతి ) -
హరీశ్ వ్యాఖ్యలపై పలు అనుమానాలు: విజయశాంతి
సాక్షి, హైదరాబాద్ : దుబ్బాక ఉప ఎన్నికలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట్ కూడా రాదని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలు పలు అనుమానాలకు తావిస్తున్నాయని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్పర్సన్ విజయశాంతి అన్నారు. హరీశ్‌రావు మాటలు వింటుంటే.. దుబ్బాకలో పోలింగ్ జరిగిన తర్వాత, కేసీఆర్ ఫామ్ హౌస్‌లో ఈవీఎం మిషన్లు పెట్టి ఓట్లను లెక్కిస్తారేమో అనే అనుమానం కలుగుతోందని సందేహం వ్యక్తం చేశారు. అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే మరణించడంతో జరిగే ఉప ఎన్నిక విషయంలో టీఆర్ఎస్ పార్టీ, ముఖ్యంగా హరీశ్‌రావు ఎందుకు ఇంత హైరానా పడుతున్నారో ఎవరికి అంతుబట్టడం లేదని ఫేస్బుక్లో ఆమె తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. కాంగ్రెస్, బీజేపీలకు గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఉప ఎన్నికలో ఎక్కువ ఓట్లు వస్తే.. దాని ప్రభావం హరీశ్ రావు మంత్రి పదవి మీద పడుతుందని సీఎం కేసీఆర్ ఏదన్నా అల్టిమేటం జారీ చేశారేమోనన్న చర్చ కూడా జరుగుతోందని విజయశాంతి చెప్పుకొచ్చారు. అందుకే తెలంగాణ ఆర్థికశాఖ మంత్రిగా ఉన్న హరీశ్ రావు, కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు మెదక్ జిల్లాకు కేటాయించిన నిధుల కంటే.. దుబ్బాకలో ఓటర్లను కొనేందుకు ఖర్చు చేస్తున్న డబ్బు ఎక్కువగా ఉందని స్థానికులు చర్చించుకుంటున్నారని విజయశాంతి ఎద్దేవా చేశారు. -
దుబ్బాక ఉప ఎన్నికకు ప్రత్యేక పరిశీలకుడు
-
దుబ్బాక ఉప ఎన్నికపై ఈసీ స్పెషల్ ఫోకస్
సాక్షి, హైదరాబాద్ : దుబ్బాక ఉప ఎన్నికపై ఎన్నికల కమిషన్ ప్రత్యేక దృష్టి పెట్టింది. రాజకీయ నేతల ఫిర్యాదుతో ఈ ఎన్నికలకు ప్రత్యేక పరిశీలకుడిని నియమించింది. శాంతి భద్రతల పరిశీలకుడిగా తమిళనాడుకు చెందిన ఐపీఎస్ అధికారి సరోజ్ కుమార్ నియమితులయ్యారు. కాగా దుబ్బాక ఉప ఎన్నిక రాజకీయం జోరందుకున్నది. బీజేపీ వర్సెస్ అధికార పార్టీ టిఆర్ఎస్ నువ్వా నేనా అన్నట్టుగా ఓట్లు రాబట్టేందుకు ఆరోపణలు, ప్రత్యారోపణలతో ప్రచారం కొనసాగిస్తున్నాయి. దీంతో దుబ్బాక నియోజకవర్గంలో ఉప పోరు రోజు రోజుకు రసవత్తరంగా మారుతున్నది. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాష్ట్ర నేతలంతా దుబ్బాకలో మకాం వేసి ప్రచారం చేస్తున్నారు. నవంబర్ 3న దుబ్బాక ఉప ఎన్నిక జరగనుండగా, 10న ఓట్ల లెక్కింపు, విజేతను ప్రకటిస్తారు. (చదవండి : ఉపఎన్నిక.. ‘దుబ్బాక’ కాక) -
మీ కష్టసుఖాల్లో నేనెప్పటికీ ఉంటా: హరీష్ రావు
సాక్షి, సిద్ధిపేట: దుబ్బాక ఉపఎన్నిక సందర్భంగా హసన్మీరాపూర్లో మంత్రి హరీష్ రావు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేను ఎప్పుడు అందుబాటులో ఉంటాను. కష్టం, సుఖం, ఆపదలో ఎప్పటికి ఉంటాను. మీ కోసం నా తలుపులు ఎప్పటికి తెరచి ఉంటాయి. ఈ ఎన్నికలు సోలిపేట లింగన్న మరణంతో వచ్చాయి. నా తోబుట్టువు సుజాత అక్కని గెలిపిద్దాం. పట్టుబట్టి రమ్మని పిలిస్తే కలసి దండం పెట్టి పోదామని వచ్చాను. ఈ గ్రామంలో సీఎం కేసీఆర్ 15 రోజులు ఇక్కడే ఉండి రోడ్డు వేయించి బస్సు తెప్పించారు. మీరు కోరిన విధంగా సీఎం కేసీఆర్ అభివృద్ధి చేశారు. ఇప్పుడు నేను హసన్మీర్, అప్పనపల్లికి రోడ్డు వేయిస్తాను. ఎస్సీ, బీసీ కాలనీలలో సీసీ రోడ్లు, మోరీలు, ఖాళీ స్థలంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మాణం కోసం నిధులు ఇస్తాను. ఇంటి అడుగు జాగాలో డబుల్ బెడ్ రూమ్ నిర్మాణం కోసం అసెంబ్లీలో ఆమోదం కూడా వచ్చింది. మీ గ్రామానికి 50 డబుల్ బెడ్ రూమ్స్ మంజూరు చేస్తాను. కరోనాతో కొంత ఇబ్బంది అయింది. ఆదాయం తగ్గింది. ఇలాంటి కష్టసమయంలో కూడా ఉచితంగా రేషన్, పప్పులు, సరుకులు పంపిణీ చేశాం. గ్రామంలో 182 మందికి పెన్షన్లు ఇస్తున్నాం. పేదింటి ఆడపడచు పెళ్లికి లక్ష పదహారు రూపాయలు ఇస్తున్నాం. బీడీ పెన్షన్లు ఇస్తున్నాం. రైతులకు పెట్టు బడి ఇస్తున్నాం. ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. ఇందులో బీజేపీ, కాంగ్రెస్‌వి ఒక్క పైసా కూడా లేదు. గ్రామంలో ముదిరాజ్, యాదవ సంఘాల భవనాలు నిర్మిస్తాం, గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని మంత్రి హరీష్ రావు తెలిపారు. (‘సుజాతక్క తోటి ఏం పని అయితదని అనుకోవద్దు’) -
దుబ్బాక దంగల్
-
నోటీసులు ఇచ్చే... తనిఖీలు చేశాం
సాక్షి, సిద్దిపేట: దుబ్బాక ఉపఎన్నికల కోసం అక్రమంగా నగదు నిల్వ ఉంచారనే సమాచారం మేరకు సిద్దిపేట పట్టణంలో మూడుచోట్ల తనిఖీలు నిర్వహించగా... సురభి అంజన్‌రావు ఇంట్లో రూ.18.67 లక్షల నగదు గుర్తించామని, ముందుగా ఆయనకు నోటీసులు ఇచ్చిన తర్వాతనే ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ (తహసీల్దార్), ఏసీపీ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించామని సిద్దిపేట పోలీసు కమిషనర్ జోయల్ డేవిస్ మంగళవారం తెలిపారు. సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉందని, ఎవరు సమాచారం ఇచ్చినా, అనుమానం ఉన్న ప్రతి ఇంటిని తనిఖీ చేస్తామన్నారు. సోమవారం నాలుగు ప్రదేశాల్లో సోదాలు చేయగా అంజన్‌రావు ఇంట్లో రూ. 18.67 లక్షల నగదును దొరికిందని, సోదాల సమయంలో ప్రతి అంశాన్ని ఫోటోలు, వీడియో తీయడం జరిగిందని తెలిపారు. అంజన్‌రావు సమక్షంలోనే సోదాలు నిర్వహించామన్నారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే పోలీసులతో గొడవకు దిగి సీజ్ చేసిన డబ్బులను లాక్కున్నారన్నారు. వీరిలో ఐదుగురిని గుర్తించి అరె స్టు చేశామని, రూ. 27,500 స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మరో 22 మందిపై కేసు లు నమోదు చేశామన్నారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సిద్దిపేట సంఘటనపై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కి ఫోన్లో వివరించామని, సిద్దిపేటకు వస్తే శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని, రావొద్దని ఆయనకు ముందుగానే చెప్పా మన్నారు. అయినా ఎంపీ సిద్దిపేటకు వచ్చే ప్రయత్నం చేయగా అదుపులోకి తీసుకుని తి రిగి కరీంనగర్ పంపించామన్నారు. ఉపఎన్నికల ప్రచారం కోసం వచ్చే ఎవరినీ అడ్డుకోవడం లేదన్నారు. ఇతర పార్టీల నాయకుల వా హనాలను కూడా తనిఖీ చేస్తున్నామన్నారు. పోలీసులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, పకడ్బందీగా దుబ్బాక ఉపఎన్నికలు నిర్వహించేలా జిల్లా యంత్రాంగం పని చేస్తోందన్నారు. ప్రజలు ప్రశాంతమైన వాతావరణం లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. -
ఉపఎన్నిక.. ‘దుబ్బాక’ కాక
సాక్షి, సిద్దిపేట:దుబ్బాక రాజకీయం రసకందాయంలో పడింది. సిద్దిపేటలో సోమవారం జరిగిన నోట్ల కట్టల లొల్లి రాష్ట్ర్రవ్యాప్తంగా సంచలనం రేపింది. బీజేపీ– టీఆర్ఎస్ల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఉపఎన్నిక వేడి కాక పుట్టిస్తోంది. టీఆర్ఎస్ ప్రోద్బలంతో పోలీసులే డబ్బు తెచ్చిపెట్టి తమను ఇరికించే ప్రయత్నం చేశారని బీజేపీ ఆరోపిస్తోంది. డబ్బులతో అడ్డంగా దొరికిపోయిన బీజేపీ అసత్య ప్రచారం చేస్తోందని, కపట నాటకాలాడు తోందని టీఆర్ఎస్ ధ్వజమెత్తింది. మొత్తా నికి సోమవారం హైడ్రామాతో ఎవరికెంత మైలేజీ వచ్చిందనే లెక్కలు ఇరుపార్టీలు వేసుకుంటున్నాయి. సోషల్ మీడియాను వాడుకొని అనూహ్యంగా బీజేపీ లబ్ది పొందిందనే ప్రచారం జరుగుతోంది. దీనికి జవాబుగా అన్నట్లు టీఆర్ఎస్ మంగళవారం బలప్రదర్శనకు దిగింది. దుబ్బాక నియోజకవర్గంలో తొగుటలో యువజన సదస్సు నిర్వహించి భారీగా జనసమీకరణ చేసింది అధికార పార్టీ. అదే విధంగా పోలీసుల తప్పేమీలేదని చెప్పు కొనేందుకు పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ సోదాలకు సంబంధించిన ఫుటేజీలు బయటపెట్టారు. మరోవైపు బీజేపీ కూడా తమ నాయకుడు బండి సంజయ్‌ని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ.. జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. సోదాల ఫుటేజీ విడుదల సిద్దిపేటలో సోమవారం అసలేం జరిగిం దనే విషయాన్ని తెలిపేందుకు మంగళవారం సిద్ది పేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవీస్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అంజన్ రావు ఇంటిని సోదా చేసిన తీరు, అక్కడ డబ్బులు దొరకడం, అంజన్‌రావు కుటంబసభ్యుల సమక్షంలో లెక్కించడం, డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయనే విషయాలను ఆరాతీయడానికి సంబంధించిన వీడియో పుటేజీలను మీడియాకు అందజేశారు. గతంలో సోదాలు చేస్తే ప్రజలు సహకరించారని, సోమవారం వందలాది మంది బీజేపీ కార్యకర్తలు వచ్చి శాంతిభద్రతలకు భంగం కలిగించారని ఆరోపించారు. దొంగలకు సద్దికట్టేందుకు వచ్చారు: హరీశ్ సిద్దిపేటలోని లెక్చలర్స్ కాలనీలోని అంజన్‌రావు ఇంటిలో దొరికిన రూ.18.67 లక్షల రూపాయలను... పోలీసులే తెచ్చి పెట్టి సోదాలు చేస్తున్నారని ఆరోపిస్తూ బీజేపీ నాయకులు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో వందలాదిగా యువకులు అంజన్‌రావు ఇంటి వద్దకు వచ్చి పోలీసులు, ప్రభుత్వానికి వ్యతి రేకంగా నినాదాలు చేసిన విషయం విది తమే. యువత బీజేపీ వైపు ఉందనే సంకేతాలు పోతాయని భావించిన టీఆర్ఎస్ దీనికి విరుగుడుగా.. తొగుట మండలంలో వేలాది మంది యువకులతో మంగళవారం భారీ మోటారు సైకిల్ ర్యాలీ నిర్వహించింది. తొగుట గాంధీ సెంటర్లో మంత్రి హరీశ్‌రావు ప్రసంగిస్తూ కమలనాథులపై విరుచుకుపడ్డారు. బీజేపీ అక్రమాలకు పాల్పడుతోందని, అడ్డంగా దొరికినా బుకాయిస్తోందని అన్నారు. ఎన్నడూ కానరాని కిషన్‌రెడ్డి దొంగలకు సద్దికట్టేందుకు వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్‌కి గతంలో విసిరిన సవాల్‌ను స్వీకరించకుండా దాక్కున్నాడన్నారు. ఇప్పుడు అక్రమంగా డబ్బులు పంచిపెట్టేందుకు సిద్ధమైన రఘునందన్‌రావుకు మద్దతు ఇచ్చేందుకు రావడం శోచనీయం అన్నారు. బీజేపీ ఆందోళనలు.. సిద్దిపేట ఘటనతో నెలకొన్న ఉద్రిక్తతలు రెండోరోజూ కొనసాగాయి. సంజయ్‌ని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ.. మంగళవారం బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. పోలీసుల తీరును నిరసిస్తూ.. నినాదాలు చేశారు. ప్రధాన పట్టణాలు, మండల కేంద్రాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు, ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. కోహెడ, చేర్యాల, హుస్నాబాద్, సిద్దిపేట, మద్దూరు, కొమురవెల్లి ప్రధాన రహదారులపై బీజేపీ కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. పోలీస్ అధికారులు టీఆర్ఎస్కు తొత్తులుగా మారారని ఆరోపించారు. ఈ సందర్భంగా పలుచోట్ల బీజేపీ కార్యకర్తలకు, పోలీసుల మధ్య తోపులాటలు జరిగాయి. పలువురిని అరెస్టు చేశారు. -
బండి సంజయ్ అరెస్ట్; సీఎస్, డీజీపీకి నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ అరెస్ట్‌పై జాతీయ బీసీ కమిషన్ స్పందించింది. సంజయ్ మీద పోలీసుల దురుసు ప్రవర్తనపై సుమోటోగా కేసు నమోదు చేయాలని తెలంగాణ సీఎస్, డీజీపీకి నోటీసులు జారీ చేసింది. నవంబర్ 5లోగా నివేదిక ఇవ్వాలని జాతీయ బీసీ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని, ఎంపీనని కూడా చూడకుండా తనపై పోలీసులు దాడి చేశారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై పార్లమెంటు ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు. సిద్ధిపేట సీపీ, సీఎం కేసీఆర్ సంగతి తేలుస్తానని హెచ్చరించారు. తనపై దాడికి పాల్పడిన సీపీపై క్రిమినల్ కేసులు పెట్టాలని, సస్పెండ్ చేయాలని ట్విటర్ వేదికగా కోరారు. చదవండి: దుబ్బాక రాజకీయం.. నోట్లకట్టల లొల్లి కాగా దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా సోమవారం సిద్దిపేటలోని లెక్చరర్స్ కాలనీ బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు మామ సురభి రాంగోపాల్‌రావు, పక్కనే ఉన్న సురభి అంజన్‌రావు ఇంటిలో సిద్దిపేట అర్బన్ తహసీల్దార్ (ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్) ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో అంజన్‌రావు ఇంట్లో రూ.18.67 లక్షలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ డబ్బులు పోలీసులే తీసుకొచ్చి అక్కడ పెట్టి డబ్బులు దొరికాయని ప్రచారం చేస్తున్నారంటూ... బీజేపీకి చెందిన పలువురు సంఘటనా స్థలానికి చేరుకుని నినాదాలు చేశారు. బీజేపీ నేతల ఆరోపణలు అవాస్తవం: సీపీ ఈ క్రమంలో సిద్దిపేటలో రఘునందన్ రావు ఇంట్లో జరిగిన సోదాల గురించి తెలుసుకున్న బండి సంజయ్ సిద్దిపేటకు బయలుదేరారు. అయితే సిద్దిపేటలో సంజయ్‌ని అడ్డుకున్న పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ సమయంలో పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. అయితే అరెస్ట్ చేసిన బండి సంజయ్‌ని సిద్దిపేట నుంచి కరీంనగర్‌కి తీసుకెళ్లారు. సిద్దిపేటలో పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆయన సోమవారం రాత్రి దీక్ష చేపట్టారు. చదవండి: సీపీని సస్పెండ్ చేయాలి: బండి సంజయ్ -
ప్రజలకు క్లారిటీ వచ్చింది
-
దుబ్బాకలో పూర్తి మెజార్టీతో గెలుస్తాం : తలసాని
-
దుబ్బాకలో పూర్తి మెజార్టీతో గెలుస్తాం : తలసాని
సాక్షి, హైదరాబాద్ : దుబ్బాక ఉప ఎన్నికల్లో పూర్తి మెజార్టీతో గెలుస్తామన్న విశ్వాసం ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తోన్న అభివృద్ధే పార్టీని గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దుబ్బాక, సిధ్దిపేట ఎపిసోడ్ అంతా చూశామని, డబ్బులు దొరికిన విషయం స్పష్టమైందన్నారు. బీజేపీ నేతల తీరు దొంగతనం చేసి దొంగ-దొంగ అని అరిచినట్లుందని ఆరోపించారు. వాస్తవాలు తెలుసుకోకుండా బీజేపీ నేతలు సిద్దిపేట వెళ్లారని పేర్కొన్నారు. నిన్నటి హై డ్రామాలో జితేందర్ రావు సహా హరీష్ రావు,పద్మా దేవేందర్ రెడ్డి,సుజాత ఇంట్లో కూడా సోదాలు జరిగాయని స్పష్టం చేశారు. (‘కన్న తల్లిలాగా కడుపులో పెట్టుకుని కాపాడుకుంటా’ ) బీజేపీ నేతలు నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీకి ఉన్న సంఖ్యాబలం ఎంత అంటూ ప్రశ్నించారు. మా క్యాడర్‌కి ఉన్న బలం 60 లక్షలు. తెలంగాణలో బీజేపీకి ఉన్న సంఖ్యాబలం ఎంత? మీలాగే ముట్టడి చేస్తాం అని మా వాళ్లు అంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఎంపీ,కేంద్ర మంత్రి కూడా వెళ్లి నానా హైరానా చేశారు అని మండిపడ్డారు. పోలీసుల సెర్చ్‌లో బీజేపీ నేతల ఇళ్లలో డబ్బులు దొరికిన మాట వాస్తవం కాదా అంటూ ప్రశ్నించారు. బీజేపీ నేతలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని, హైదరాబాద్ వరదలతో ప్రజలు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడ్డారని, ఇప్పటివరకు కేంద్రం నుంచి ఎలాంటి సహాయం అందలేదని వ్యాఖ్యానించారు. (ఎంపీ ఆరోపణలపై స్పందించిన సిద్దిపేట సీపీ ) -
‘సుజాతక్క తోటి ఏం పని అయితదని అనుకోవద్దు’
సాక్షి, సిద్ధిపేట : దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా ఆర్థికశాఖ మంత్రి హారీష్ రావు ప్రతిపక్షాలను టార్గెట్ చేసి విమర్శలు ఎక్కుపెట్టారు. తెలంగాణ కోసం టీఆర్ఎస్ ఎంతో పాటు పడిందని చెప్పిన మంత్రి కాంగ్రెస్ బీజేపీపై మండిపడ్డారు. ఒక్క ఓటు రెండు రాష్ట్రాలు అని చెప్పిన బీజేపీ మోసం చేసింది నిజం కాదా అని మంత్రి హారీష్ రావు ప్రశ్నించారు. ఆనాడు విద్యార్థి మిత్రుల చావులకు ఈ కాంగ్రెస్ కారణం కాదా అని నిలదీశారు. తొగుల మండల కేంద్రంలో మంగళవారం యువజన బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, పెద్ద సంఖ్యలో యువకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. రాదనుకున్న తెలంగాణ తెచ్చిన ఘనత కేసీఆర్‌ది అని తెలిపారు. డిసెంబర్ 9న వచ్చిన తెలంగాణ వెనక్కి పోతే తామంతా రాజీనామా చేస్తే, బీజేపీ కిషన్ రెడ్డి రాజీనామా చేశాడా అని ప్రశ్నించారు. చదవండి: బీజేపీ నేతల ఆరోపణలు అవాస్తవం: సీపీ నీళ్లు, నిధులు, నియమకాలు టీఆర్ఎస్ నినాదమని, ఈ రోజు కాళేశ్వరం ద్వారా సాగు నీరు తెచ్చుకుంటున్నామన్నారు. మన నిధులు దక్కాయి కాబట్టే రైతు బంధు, రైతు బీమా, వచ్చాయన్నారు. తెలంగాణ వస్తే లక్ష ఉద్యోగాలు అని చెప్పామని, 1,24,990 ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. కేసీఆర్ పారిశ్రామిక విధానంతో 8 వేల పరిశ్రమలు వచ్చాయని పేర్కొన్నారు. బీజేపీ వస్తే నల్లధనం తెస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షలు వేస్తామన్నారు. వచ్చాయా అని ప్రశ్నించారు. వారు వస్తే ఏటా కోటి ఉద్యోగాలన్నారు. మరి ఇచ్చారా అని ప్రశ్నించారు. డీమానిటైజేషన్‌తో ఉన్న ఉద్యోగాలు ఊడబీకారని ఎద్దేవా చేశారు. నిజామాబాద్‌లో అర్వింద్ కుమార్ తాను గెలిస్తే... పసుపు బోర్డు తెస్తా అని బాండ్ పేపర్ మీద రాసిచ్చాడని, వచ్చిందా పసుపు బోర్డు అని నిలదీశారు. చదవండి: సీపీని సస్పెండ్ చేయాలి: బండి సంజయ్ ‘బీహార్‌లో బీజేపీ, ఢిల్లీలో బీజేపీ ఉంటేనే అభివృద్ధి జరుగుతదని మోడీ అంటున్నాడు. గట్లనే హైదరాబాద్‌లో కారు ఉంది. దుబ్బాకలో కూడా కారు ఉంటే అభివృద్ధి జరుగుతది. ముత్యంరెడ్డి బాగా అభివృద్ధి చేశాడని అంటున్న కాంగ్రెస్, 2018లో ఎందుకు టిక్కెట్టు ఇవ్వలేదు. కాంగ్రెస్ అంటే కాలిపోయే మోటార్లు, బీజేపీ అంటే బాయికాడ మీటర్లు, టిఆర్ఎస్ అంటే 24 గంటల కరెంట్. కన్న తండ్రి క్షోభకు కారణమైన శ్రీనివాస్ రెడ్ది, ప్రజలకేం సేవ చేస్తాడు. మల్లన్నసాగర్ ముంపు బాధితులకు రావాల్సిన ప్రతి పైసా ఇప్పిస్తాం. ఆలస్యం కావడానికి కాంగ్రెస్ కేసులు వేయడమే. దేశంలో బీహార్, ఉత్తరాఖండ్, యూపీ రాష్ట్రాల్లో కంటే నిరుద్యోగిత సగానికి సగం తక్కువ. తెలంగాణలో కేవలం 3.6 శాతమే. బీజేపీ కుడితులో పడ్డ ఎలుకల మారింది.. డబ్బులతో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది.’ అని మంత్రి హరీష్‌రావు విమర్శించారు. చదవండి: 'అల్లుడిని ముందు పెట్టి కేసీఆర్ నడిపిస్తున్నారు' దుబ్బాకలో టీఆర్ఎస్ గెలిచేది ఖాయమని ఎంపీ ప్రబావకర్రెడ్డి తెలిపారు. ‘బీజేపీ, కాంగ్రెస్‌లు వెంటిలేటర్ మీద ఉన్నాయి. దుబ్బాకకు ఎప్పుడైనా కిషన్ రెడ్ది వచ్చారా. నిన్నటి నుంచి బీజేపీ కొత్త నాటకం మొదలు పెట్టింది. పైసలు పట్టుకుంటున్నారు. ఇంకా పంపించాలని అమిత్‌షాను అడుగుతున్నరు. ఆరడుగుల పిచ్చోడు ఇష్టమైనట్లు మాట్లాడుతున్నారు. స్టాంప్ పేపర్ మీద హామీ ఇచ్చి, రైతులను మోసం చేసిన ఘనత ఎంపీ అర్వింద్‌ది. అయ్యా టీఆర్ఎస్లో ఉండి బీజేపీలో ఉన్న కొడుకుకు సపోర్ట్ చేస్తున్నాడు. ప్రజలను మోసం చేసిన ఇద్దరు కూడా రాజీనామా చేయాలి’ అని తెలిపారు. దివంగత సోలిపేట రామలింగారెడ్డి దుబ్బాకకు ఎన్నో సేవలు అందించారని టీఆర్ఎస్ అభ్యర్థి సుజాత అన్నారు, దుబ్బాకను ఎంతో అభివృద్ధి చేశారని, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ దుబ్బాక అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. సిద్దిపేట వారికి దుబ్బాకతో పని లేదు కానీ, రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ లీడర్లకు ఇక్కడేం పని అని ప్రశ్నించారు. సీఎం కేసీఆఆర్‌కు ముఖ్యమైన నియోజకవర్గం దుబ్బాక అని, సీఎం ఆశీస్సులతో, హరీశ్ రావు సహకారంతో దుబ్బాకలో అభివృద్ధి చేస్తానని భరోసా ఇచ్చారు. సుజాతక్క తోటి ఏం పని అయితదని అనుకోవద్దు, అన్ని చేయగల సమర్థత ఉందని స్పష్టం చేశారు. కన్నతల్లి లాగా నియోజకవర్గ యువతను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటానని తెలిపారు. -
బీజేపీ నేతల ఆరోపణలు అవాస్తవం: సీపీ
సాక్షి, సిద్దిపేట: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సిద్దిపేట పోలీసులపై చేసిన ఆరోపణలపై పోలీసు కమిషనర్ జోయల్ డేవిస్ స్పందించారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పోలీసులపై బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని, పోలీసులే డబ్బు పెట్టారని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఎన్నికల నియమావళి ప్రకారం నోటీసులు ఇచ్చాకే సోదాలు నిర్వహించామని తెలిపారు. సోదాలపై అధికారులు పంచనామా కూడా నిర్వహించారన్నారు. సురభి అంజన్రావుకు నోటీసులు ఇచ్చాకే సోదాలు చేశామని, మొత్తం వీడియోలో చిత్రీకరించినట్లు చెప్పారు. బయట నుంచి వచ్చిన కార్యకర్తలు తమపై దాడి చేశారని, ఎన్నికల నియమావళి జిల్లా మొత్తానికి వర్తిస్తుందన్నారు. ఎన్నికల సమయంలో సీజ్ చేసిన డబ్బును ఎత్తుకెళ్లడం నేరమన్నారు. (చదవండి: పోలీసులే ఆ డబ్బు పెట్టారు: సంజయ్) శాంతి భద్రతల నేపథ్యంలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ను జిల్లాకు రావొద్దని కోరినట్లు ఆయన పేర్కొన్నారు. ఆయనకు రక్షణ కల్పించే పంపామని, ఎలాంటి దాడి జరగేదని సీపీ వెల్లడించారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు, ఆయన బంధువుల ఇళ్లలో పోలీసులు సోమవారం సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. దీంతో ఎంపీ బండి సంజయ్ పోలీసులే డబ్బులు పెట్టి దొరికినట్లు చూపించారని ఆరోపించారు. ఇక రెచ్చగొట్టే చర్యలకు దిగినా, కార్యకర్తలు సమన్వయం పాటించి దుబ్బాక నియోజకవర్గంలోని బూత్ లెవల్ కార్యకర్తలు యథావిధిగా ప్రచారం కొనసాగించాలని సంజయ్ కోరారు. సిద్దిపేట సంఘటనపై ఎన్నికల సంఘం స్పందించాలని, కేంద్ర బలగాలను పంపించి ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చూడాలని బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. (చదవండి: ఓటమి భయంతో అడ్డదారులు) -
'అల్లుడిని ముందు పెట్టి కేసీఆర్ నడిపిస్తున్నారు'
సాక్షి, కరీంనగర్: దుబ్బాక సీపీని సస్పెండ్ చేయాలనే డిమాండ్‌తో నిరాహారదీక్షకు దిగిన బండి సంజయ్‌ను మంగళవారం రోజున బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘తెలంగాణ రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై దాడి హేయమైన చర్య. టీఆర్ఎస్ ఓటమి భయం, అధికార దాహంతో బీజేపీ నేతలపై దాడులకు తెగబడుతున్నారు. క్షేత్ర స్థాయిలో బీజేపీ గెలుపు ఖాయం అయిన నేపథ్యంలో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. టీఆర్ఎస్కు ఓటు వేయకుంటే సంక్షేమ పథకాలు రావని ప్రజల్ని బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఓటమి భయంతోనే ఇలాంటి అలజడులు రేపుతున్నారు. (పోలీసులే ఆ డబ్బు పెట్టారు: సంజయ్) దుబ్బాకలో టీఆర్ఎస్ పార్టీని ఓడించాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. అల్లున్ని ముందు పెట్టి కేసీఆర్ వెనుకుండి నడిపిస్తున్నారు. హరీష్ రావు కేంద్రం మీద ఏడవడం తప్ప, రాష్ట్రానికి ఏం చేశారో ప్రజలకు చెప్పాలి. కేంద్రం ఇచ్చిన నిధులతోనే రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్‌కు అబద్ధాల విషయంలో డాక్టరేట్లు ఇవ్వొచ్చు. మీ పునాదులు దుబ్బాక ఫలితంతో కదలబోతున్నాయి' అని డీకే అరుణ టీఆర్ఎస్పై విమర్శలు సంధించారు. సిద్దిపేట జిల్లా బీజేపీ అధ్యక్షుడితో పాటు మరో కార్యకర్తను అరెస్టు చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. వారిని పోలీసులు వెంటనే విడుదల చేయాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. (భయపడొద్దు.. ఎదుర్కొందాం : కిషన్‌రెడ్డి) బీజేపీ నేత, మాజీ మంత్రి బాబు మోహన్ మాట్లాడుతూ.. 'దుబ్బాక ఉపఎన్నికతో సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావుకు ముచ్చెమటలు పడుతున్నాయి. బీజేపీ గెలుస్తుందనే భయంతో హరీష్ రావు అలజడి సృష్టిస్తున్నారు. మామ అల్లుళ్ళ మెప్పుకోసం సీపీ ఏదైనా చేస్తాడు. సచ్చిపోయే వరకు అధికారంలో ఉంటామనే మామ అల్లుళ్ళ కళలు నిజం కావు. కార్యకర్తలు మనోధైర్యంతో ఉండాలి' అని బాబు మోహన్ అన్నారు. (డీకే అరుణ ఇంటి వద్ద హైడ్రామా) -
డీకే అరుణ ఇంటి వద్ద హైడ్రామా
సాక్షి, హైదరాబాద్: సిద్ధిపేట ఘటనకు నిరసనగా అధికార టీఆర్ఎస్ పార్టీ తీరును వ్యతిరేకిస్తూ బీజేపీ ఆందోళనలు చేపట్టింది. ఇందులో భాగంగా ఏబీవీపీ, బీజేవైఎం ‘ఛలో ప్రగతిభవన్’కు పిలుపునిచ్చాయి. దీంతో ముందస్తు చర్యలు చేపట్టిన పోలీసులు ప్రగతిభవన్ వద్ద భారీ స్థాయిలో పోలీసులను మోహరించారు. అదే విధంగా పలువురు బీజేపీ నేతలను హౌజ్అరెస్ట్ చేశారు. ఎమ్మెల్సీ రామచంద్రరావు, ఎమ్మెల్యే రాజాసింగ్, మోత్కుపల్లి నరసింహులు ఇంటి వద్ద పోలీసులను మోహరించారు. హైడ్రామా.. ప్రగతి భవన్‌కు వెళ్లవద్దు ఈ నేపథ్యంలో బీజేపీ నాయకురాలు డీకే అరుణ ఇంటి వద్ద హైడ్రామా చోటుచేసుకుంది. దుబ్బాక ప్రచారానికి వెళ్లాలని అరుణ పట్టుబట్టగా.. ఇంటిని వీడే బయటకు వెళ్లేందుకు వీల్లేదంటూ అడ్డుకున్నారు. అయితే ఆమె ఏమాత్రం వెనక్కితగ్గలేదు. ప్రచారానికి వెళ్లకుండా ఎందుకు ఆపుతున్నారంటూ ప్రశ్నించారు. ఈ క్రమంలో ఎట్టకేలకు దిగి వచ్చిన పోలీసులు, దుబ్బాక ఎన్నికల ప్రచారానికి వెళ్లేందుకు డీకే అరుణకు అనుమతినిచ్చారు. ప్రగతి భవన్‌కు వెళ్లవద్దని సూచిస్తూ.. ఎస్కార్ట్ వాహనం ఇచ్చి పంపించారు.(చదవండి: సీపీని సస్పెండ్ చేయాలి: బండి సంజయ్ ) అదే విధంగా మోత్కుపల్లికి కూడా దుబ్బాక వెళ్లేందుకు అనుమతినిచ్చారు. మరోవైపు.. దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో నోట్లకట్టల కలకలం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అరెస్టు ఘటనలపై టీఆర్ఎస్, బీజేపీ నేతలు ఫిర్యాదు చేసేందుకు ఎన్నికల కమిషన్‌ను కలవనున్నారు. సిద్ధిపేట ఘటనపై పరస్పర ఫిర్యాదులకు సిద్ధమయ్యారు. -
దుబ్బాక కాక
-
సీపీని సస్పెండ్ చేయాలి: బండి సంజయ్
సాక్షి, కరీంనగర్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ నిరసన దీక్ష కొనసాగిస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో సిద్దిపేటలో పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆయన సోమవారం రాత్రి దీక్ష చేపట్టారు. ఎంపీ కార్యాలయంలోనే దీక్షకు ఉపక్రమించిన సంజయ్, రాత్రి నేలపై పడుకొని తన నిరసనను తెలిపారు. సంజయ్ దీక్షకు సంఘీభావంగా బయట కార్యకర్తలు బైఠాయించి ఆందోళన కొనసాగించారు. పోలీసుల వ్యవహార శైలి గురించి బండి సంజయ్ మాట్లాడుతూ.. తాను సిద్దిపేటకు వెళ్తే, సీపీ జోయల్ డేవిస్ తనపై దాడి చేసి అక్రమంగా కరీంనగర్‌కు తరలించారని ఆరోపించారు. సీపీని వెంటనే సస్పెండ్ చేసి క్రిమినల్ చర్యలు చేపట్టే వరకు దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేశారు. దుబ్బాకలో ప్రశాంతంగా ఎన్నికలు జరిగితే, బీజేపీ గెలుపు తథ్యమని భావించిన అధికార టీఆర్ఎస్ పార్టీ, అధికారులను ఉసిగొలిపి అరాచకాలకు పాల్పడుతుందని విమర్శించారు. (చదవండి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్) సిద్దిపేటలో బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు, ఆయన వారి బంధువుల ఇళ్లలో పోలీసులు అక్రమంగా సోదాలు నిర్వహించారని, పోలీసులు డబ్బులు పెట్టి దొరికినట్లు చూపించారని ఆరోపించారు. ఇక రెచ్చగొట్టే చర్యలకు దిగినా, కార్యకర్తలు సమన్వయం పాటించి దుబ్బాక నియోజకవర్గంలోని బూత్ లెవల్ కార్యకర్తలు యథావిధిగా ప్రచారం కొనసాగించాలని సంజయ్ కోరారు. సిద్దిపేట సంఘటనపై ఎన్నికల సంఘం స్పందించాలని, కేంద్ర బలగాలను పంపించి ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా.. ఎంపీ బండి సంజయ్‌పై పోలీసుల దాడికి నిరసనగా బీజేపీ అనుబంధ విద్యార్థి సంస్థ ఏబీవీపీ, బీజేవైఎం ప్రగతి భవన్ ముట్టడికి నేడు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రగతి భవన్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. -
ఓటమి భయంతో అడ్డదారులు
కరీంనగర్ టౌన్: దుబ్బాక ఎన్నికల్లో ఓటమి భయంతోనే తెలంగాణ ప్రభుత్వం అడ్డదారులు తొక్కే ప్రయత్నం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కరీంనగర్‌లోని ఎంపీ కార్యాలయంలో సోమవారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ రాచరిక, నియంతృత్వ పాలన కొనసాగిస్తున్నారని, ఇందుకు సిద్దిపేట సంఘటనే నిదర్శనమన్నారు. ఫాంహౌస్‌కు పరిమితమైన సీఎం కేసీఆర్ ఆదేశాలతోనే పోలీసులు అరాచకం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం లాగానే మంత్రులు సైతం బరితెగించి ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. దుబ్బాక ఎన్నికల్లో గెలిచేందుకు కార్యకర్త కారులో డబ్బుపెట్టి రికవరీ అంటూ రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారని, సిద్దిపేటలో బీజేపీ అభ్యర్థి ఇంట్లో తనిఖీలకు వెళ్లిన పోలీసులు మహిళలు, చిన్నపిల్లల పట్ల సంస్కారహీనంగా వ్యవహరించారని ఆరోపించారు. దుబ్బాక ఎన్నికలకు సిద్దిపేటకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. సిద్దిపేటకు వెళ్తున్న తన కారును అడ్డగించి అరెస్ట్ చేసే సమయంలో గొంతు పట్టి కారులో పడేశారని తెలిపారు. ప్రశాంతంగా ఎన్నికలు జరగాలని తాము కోరుకుంటే.. ప్రభుత్వం మాత్రం శాంతిభద్రతల సమస్య సృష్టించాలని చూస్తోందని పేర్కొన్నారు. సిద్దిపేట సీపీని సస్పెండ్ చేసి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఎలక్షన్ కమిషన్ ఉందో లేదో కూడా తెలియడం లేదన్నారు. ప్రజాస్వామ్యబద్ధం గా ఎన్నికలు నిర్వహించకుంటే ఫాంహౌస్, ప్రగతిభవన్‌పై సైతం దాడి చేస్తామని హెచ్చరించారు. సీపీని సస్పెండ్ చేయాలనే డిమాండ్‌తో ఎంపీ కార్యాలయంలోనే సంజయ్ నిరాహారదీక్షకు దిగారు. -
దుబ్బాక రాజకీయం.. నోట్లకట్టల లొల్లి
సాక్షి, సిద్దిపేట/ సిద్దిపేట కమాన్: సిద్దిపేట పట్టణంలో సోమవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు నోట్ల కట్టలపై హైడ్రామా కొనసాగింది. పోలీసుల సోదాలు, బీజేపీ కార్యకర్తల హల్చల్, తోపులాట, డబ్బులు లూటీ, పోలీసుల లాఠీచార్జి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అడ్డగింపుతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల కోడ్ సందర్భంగా అక్రమంగా నిల్వ ఉంచిన డబ్బులను సోదాచేసి పట్టుకున్నామని పోలీసులు చెప్పగా.. పోలీసులే డబ్బులు తెచ్చిపెట్టి సోదాల్లో దొరికాయని చెబుతున్నారని బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు. విమర్శలు, ప్రతివిమర్శలు, నినాదాలతో సిద్ది్దపేట పట్టణం హోరెత్తింది. దుబ్బాక ఉప ఎన్నికలు వేడెక్కుతున్నాయి. సోమవారం మధ్యాహ్నం సిద్దిపేటలోని లెక్చరర్స్ కాలనీ బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు మామ సురభి రాంగోపాల్‌రావు, పక్కనే ఉన్న సురభి అంజన్‌రావు ఇంటిలో సిద్దిపేట అర్బన్ తహసీల్దార్ (ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్) ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేశారు. నోట్ల కట్టలతో ఉన్న బ్యాగుతో పోలీసు ఈ సందర్భంగా అంజన్‌రావు ఇంట్లో రూ.18.67 లక్షలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ డబ్బులు పోలీసులే తీసుకొచ్చి అక్కడ పెట్టి డబ్బులు దొరికాయని ప్రచారం చేస్తున్నారంటూ... బీజేపీకి చెందిన పలువురు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో వందలాది మంది కార్యకర్తలు వచ్చి అంజన్‌రావు ఇంట్లోకి వెళ్లారు. అక్కడ పోలీసుల వద్ద ఉన్న డబ్బులను బలవంతంగా లాక్కొని ఈ డబ్బు పోలీసులే తీసుకువచ్చారని ప్రదర్శించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ డబ్బుతో తమకు సంబంధం లేదని రఘునందన్‌రావు, అంజన్‌రావు, రాంగోపాల్‌రావులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అదనపు పోలీసు బలగాలు అక్కడికి చేరుకొని లాఠీచార్జి చేసి బీజేపీ కార్యకర్తలను చెదరగొట్టడంతో పరిస్థితి సద్దుమణిగింది. గొడవ విషయం తెలిసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిì సంజయ్ కరీంనగర్ నుంచి బయలుదేరి వస్తుండగా... సిద్దిపేట శివారులో పోలీసులు అడ్డుకున్నారు. పక్కనే ఉన్న కార్యకర్తలు పోలీసులతో వాగ్వావాదానికి దిగారు. అనంతరం సంజయ్‌ని తిరిగి కరీంనగర్ పంపించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి పరిస్థితిని వివరిస్తున్న రఘునందన్‌రావు, ఆయన సతీమణి నాకు సంబంధం లేదు: రఘునందన్‌రావు మా అత్తగారి ఇంటిపక్కనే ఉన్న ఇంట్లో డబ్బులు దొరికితే తనకేం సంబంధమని దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు అన్నారు. దసరా సందర్భంగా తన భార్య, కూతురు, మనువరాలు అత్తగారి ఇంటికి వచ్చారని చెప్పారు. ప్రచారంలో ఉన్న తాను మధ్యాహ్నం భార్యకు ఫోన్ చేశానని, తీయకపోవడంతో అనుమానం వచ్చి సిద్దిపేటకు రాగా పోలీసుల సందడి కనిపించిందని చెప్పారు. మహిళలు, చిన్న పిల్లలు అని కూడా చూడకుండా పోలీసులు ఇల్లంతా చిందరవందర చేశారని ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్దంగా ప్రచారం చేసుకుంటున్న తనపై తప్పుడు కేసులు పెట్టేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. అంజన్‌రావు ఇంట్లో పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట తనిఖీల్లో డబ్బు దొరికింది: పోలీస్ కమిషనర్ దుబ్బాక ఉపఎన్నికల్లో నిబంధనలకు విరుద్దంగా డబ్బులు ఖర్చు చేసేందుకు సిద్దిపేటలో డబ్బు నిల్వ చేస్తున్నారనే సమాచారం మేరకు సోమవారం మూడు చోట్ల సోదాలు నిర్వహించగా డబ్బులు దొరికాయని సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ విలేకరుల సమావేశంలో తెలిపారు. సిద్దిపేట ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ విజయ్ సాగర్, పోలీసు సిబ్బంది కలిసి... మున్సిపల్ చైర్మన్ కడవెర్గు రాజనర్సుతోపాటు రఘునందన్‌రావు బంధువులు సురుభి అంజన్‌రావు, సురభి రాంగోపాల్‌రావు ఇళ్లలో సోదాలు చేశామని చెప్పారు. ఈ సందర్భంగా అంజన్‌రావు ఇంట్లో రూ. 18.67 లక్షలు ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. ఈ సోదాల్లో ప్రతీది రికార్డు చేశామన్నారు. అయితే విషయం తెలుసుకున్న దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు 250 మంది అనుచరులతో పోలీసులపై దాడి చేసి రూ. 12.80 లక్షలు తీసుకెళ్లారని చెప్పారు. వీడియో ఫుటేజీల ద్వారా వీరిని గుర్తించి రికవరీ చేస్తామని, నిందితులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. డబ్బు విషయంపై ప్రశ్నించగా జితేందర్‌రావు డ్రైవర్ తెచ్చి ఇచ్చాడని, ఈ డబ్బులను కొద్దికొద్దిగా దుబ్బాకకు పంపించేందుకు ఇక్కడ పెట్టామని స్వయంగా అంజన్‌రావు చెప్పిన వాగ్మూలం రికార్డు చేశామని సీపీ జోయల్ డేవిస్ వివరించారు. లెక్చరర్స్ కాలనీలోని రఘునందన్‌రావు మామ ఇంటి పక్కన ఉన్న అంజన్‌రావు నుంచి వాంగ్మూలం రికార్డు చేస్తున్న సిద్దిపేట ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ విజయ్ సాగర్, సీపీ జోయల్ బీజేపీ గుండాగిరీ: హరీశ్‌రావు దుబ్బాక ఉపఎన్నికల్లో గెలువలేమని తెలుసుకున్న బీజేపీ నాయకులు అడ్డదారిలో వెళ్లి ప్రజల సానుభూతి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేటలో డబ్బుల లొల్లిపై దుబ్బాక ప్రచారంలో ఉన్న ఆయన మాట్లాడారు. బీజేపీ అసత్య ప్రచారానికి దిగుతోందని ఆరోపించారు. మొన్నటికి మొన్న శామీర్‌పేట సమీపంలో బీజేపీ నాయకుల దగ్గర డబ్బులు దొరికాయన్నారు. అనుమానంతో సోమవారం రఘునందన్‌రావు బంధువు ఇంటిని తనిఖీ చేశారని, డబ్బు దొరికితే తమ తప్పులు బయటపడతాయనే ఆలోచనతో బీజేపీ కార్యకర్తలు గుండాల్లా ప్రవర్తించి పోలీసుల వద్దనున్న డబ్బులు గుంజుకపోయారన్నారు. దౌర్జన్యం చేసి, ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారన్నారు. అమిత్ షా ఆరా.. సాక్షి, హైదరాబాద్: సిద్దిపేట ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరా తీశారు. ఎంపీ బండి సంజయ్‌ని ఫోన్లో వివరాలు అడిగి తెలుసుకున్నారు. తన గొంతు పట్టుకొని వాహనంలో కుక్కారని అమిత్ షాకు సంజయ్ వివరించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. బీజేపీ అభ్యర్థి ఇల్లు, బంధువుల ఇళ్లలో సోదాల గురించి వివరించినట్లు తెలిపాయి. కమలం పార్టీది కపట నాటకం ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు సిద్దిపేటజోన్: గత రెండు పర్యాయాలు ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయిన బీజేపీ గోబెల్స్ ప్రచారం, అభూత కల్పనలతో రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. అందులో భాగంగానే పట్టుబడిన డబ్బుల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు కమలం పార్టీ నానా యాగీ చేస్తూ కపట నాటకం ఆడుతోందన్నా రు. సిద్దిపేటలో జరిగిన పరిణామాలపై సోమ వారం రాత్రి హరీశ్ స్పందించారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు బంధువు ఇంట్లో రెడ్‌హ్యాండెడ్‌గా, తహసీల్దార్ సమక్షంలో వీడి యో చిత్రీకరణల మధ్య డబ్బులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారులే స్పష్టం చేశారన్నారు. సోమవారం బీజేపీకి సంబంధించిన ఇద్దరి ఇళ్లతో పాటు టీఆర్ఎస్కు చెందిన సిద్ది పేట మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, చేగుంట మండలంలో టీఆర్ఎస్ నేత ఇంట్లో కూడా సోదాలు జరిగాయన్నారు. రఘునందన్ ఎన్ని కల్లో ఖర్చు చేసేందుకే డబ్బు నిల్వ చేశామని బంధువు ఇచ్చిన వాంగ్మూలం వీడియో రికా ర్డు ఉందన్నారు. దీన్ని ఎన్నికల అధికారులు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఇలా దిగజారుడు రాజకీయాలు చేస్తున్న బీజేపీకి ప్రజలు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలన్నారు. వాస్తవాలు తెలియకుండా బండి సంజయ్, కిషన్‌రెడ్డిలు ట్రాప్‌లో పడ్డారన్నారు. -
భయపడొద్దు.. ఎదుర్కొందాం : కిషన్‌రెడ్డి
ప్రశాంత్‌నగర్ (సిద్దిపేట): రాష్ట్రంలో అధికార పార్టీ నాయకులకు, వారి బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదని, దుబ్బాక ఉప ఎన్నికలను ధైర్యంగా ఎదుర్కొని విజయం సాధిద్దామని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి బీజేపీ శ్రేణులకు ధైర్యం చెప్పారు. సిద్దిపేట పట్టణంలో దుబ్బాక బీజే పీ అభ్యర్థి మామ ఇంట్లో పోలీసులు, రెవెన్యూ సిబ్బంది తనిఖీల అనంతరం రఘునందన్‌రావును సోమవారం రాత్రి కిషన్‌రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఇంట్లో చిందరవందరగా ఉన్న వస్తువులను పరిశీలించారు. రఘనందన్‌రావు కుటుంబసభ్యులను వివరా లు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ప్రతిపక్షాలపై అధికారులతో నిర్బంధం విధించడం సరికాదన్నారు. సెర్చ్‌వారెంట్ లేకుండా పోలీసులు ఇళ్లంతా చిందరవందర చేసి, మహిళల పట్ల అమర్యాదగా ప్రవర్తించారన్నారు. ఎన్నికల ఇన్చార్జిలుగా వ్యవహరిస్తున్న జితేందర్‌రెడ్డి, వివేక్‌లను హైదరాబాద్‌కు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను కరీంనగర్‌కు బలవంతంగా తరలించారన్నారు. అధికారం శాశ్వతం కాదనేది టీఆర్ఎస్ గుర్తించాలి నియంతృత్వ పరిపాలనను తెలంగాణ ప్రజ లు తిప్పికొడతారన్నారు. అధికారం శాశ్వతం కాదనే విషయం గుర్తించాలన్నారు. ఇందిరాగాంధీ, ఎన్టీఆర్, చెన్నారెడ్డి లాంటి హేమాహేమీలను ఓడించిన ఘన చరిత్ర ప్రజలకు ఉందన్నారు. అధికారం మా కుటుంబానికి మాత్రమే శాశ్వతం అనే పద్ధతి సరికాదన్నారు. రఘునందన్‌రావుకు ప్రచారం నిర్వహించుకు నే హక్కు ఉందన్నారు. తెలంగాణతో సహా అనేక ఉద్యమాల్లో పాల్గొన్న రఘునందన్‌రావును ప్రభుత్వం నిర్బంధం చేయడం సరికాదన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర, కేంద్ర ఎన్నికల సంఘాల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. కార్యకర్తలు శాంతియుతంగా గ్రామాల్లో ప్రచా రం నిర్వహించాలన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలువబోతోందని, అందుకే అధికార పార్టీ అక్రమ కేసులు పెట్టాలని ప్రయత్నం చేస్తోందన్నారు. -
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్
సాక్షి, దుబ్బాక : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సిద్ధిపేట వెళుతున్న ఆయనను పోలీసులు మధ్యలోనే బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా కొద్దిసేపు వాగ్వివాదం చోటుచేసుకుంది. కాగా దుబ్బాక ఉప ఎన్నిక బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు బంధువుల ఇళ్లపై పోలీసులు దాడి చేయడం, సోదాలు నిర్వహించడం అప్రజాస్వామికమని బండి సంజయ్‌కుమార్ ఆరోపించారు. ఈ అనైతిక దాడులను రాష్ట్ర బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. దుబ్బాక శాసనసభకు ఎన్నిక జరుగుతుంటే సిద్దిపేటలో దాడులు, సోదాలు చేయడం ఎన్నికల నియమావళికి విరుద్ధమని పేర్కొన్నారు. దీన్ని తెలంగాణ ప్రభుత్వపు దుందుడుకు చర్యగా అభివర్ణించారు. మరోవైపు రఘునందన్‌రావు మామ గోపాల్‌రావుతో పాటు బంధువుల ఇళ్లలో పోలీసుల సోదాలు చేశారు. ఈ సందర్భంగా రూ.18.65 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న నగదును బీజేపీ కార్యకర్తలు బలవంతంగా లాక్కెళ్లారు. వీడియో ఫుటేజ్ ఆధారంగా డబ్బులు లాక్కెళ్లిన యువకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనపై సిద్ధిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిడ్ మాట్లాడుతూ నగదు దొంగిలించినవారిని గుర్తించి త్వరలోనే అరెస్ట్ చేస్తామన్నారు. -
దుబ్బాక: బీజేపీ అభ్యర్థి ఇంట్లో సోదాలు
సాక్షి, సిద్ధిపేట : దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా బీజేపీ అభ్యర్థి బంధువుల ఇంట్లో, కార్యాలయాల్లో పోలీసులు సోమవారం సోదాలు చేపట్టారు. రఘునందన్ రావు అత్తగారిల్లు, సమీప బంధువుల ఇళ్లతో సహా ఎనిమిది చోట్ల ఏక కాలంలో సోదాలు చేస్తున్నారు. ఈ సోదాల్లో రఘునందరన్‌రావు మామ ఇంట్లో రూ. 18 లక్షల 65 వేలు స్వాధీనం చేసుకున్నారు. ఇదిలావుండగా పోలీసుల చర్యలకు వ్యతిరేకంగా బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు, కార్యకర్తలు నిరసనకు దిగారు. మరోవైపు సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ రాజనర్స్ ఇంట్లో పోలీసులు సోదా చేస్తున్నారు. చదవండి: దుబ్బాక అభివృద్ధి బాధ్యత నాది: హరీశ్ రావు -
దుబ్బాక అభివృద్ధి బాధ్యత నాది: హరీశ్ రావు
సాక్షి, సిద్దిపేట: దసరా సందర్భంగా సోమవారం దుబ్బాక ఆర్యవైశ్య సంఘం వారు అలాయ్ బలాయ్ కార్యక్రమం నిర్వహించారు. ఆర్శవైశ్య భవన్లో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. దుబ్బాకకు ఇప్పుడు వచ్చే వారు కేవలం ఓట్ల కోసమే వస్తున్నారు. ఉత్తమ్‌కు దుబ్బాక ఎలా ఉంటదో తెలియదు. మంత్రిగా ఉన్నప్పుడు ఒక్క సారి దుబ్బాకకు రాలేదు. హుజూర్ నగర్లో టీఆర్ఎస్ గెలిస్తే ఏమొస్తది అని ఉత్తమ్ అన్నారు. కానీ మేం గెలిచాక.... కేసీఆర్ ఆ నియోజకవర్గానికి వెళ్లి 300 కోట్ల రూపాయల పనులు మంజూరు చేశారు. రేపు దుబ్బాక కూడా అదే రీతిలో అభివృద్ధి అవుతుంది. దుబ్బాక అభివృద్ధి బాధ్యత నాదే.. అనుమానం అవసరం లేదు. సుజాతక్క నా తోబుట్టువు. నేను జిల్లా మంత్రిని. కేసీఆర్ ఆశీస్తులతో దుబ్బాకను అభివృద్ధి చేస్తా’ అని స్పష్టం చేశారు హరీశ్ రావు. (చదవండి: ‘కేసీఆర్‌ను ఓడిస్తేనే అన్ని అమలు అవుతాయి’) ‘సీఎం ఆశీస్సులతో నారాయణ ఖేడ్‌ను నేను అభివృద్ధి చేశాను. 200 వందల కోట్ల రూపాయలు పైగా ఖర్చు పెట్టి రోడ్లు వేయించా. ఎన్నికల వరకే కాంగ్రెస్, బీజేపీ నేతలు ఉంటారు. ఆ తర్వాత కూడా నేను, సూజాతక్క ఉంటాము. ఓసీ పేదలకు సహాయం అందుతుందంటే అదీ తెలంగాణ రాష్ట్రంలోనే... దేశంలో ఈ విధానం ఎక్కడా లేదు. ఆర్య వైశ్య కార్పోరేషన్‌ను తప్పకుండా ఏర్పాటు చేస్తాం’ అన్నారు హరీశ్ రావు. -
‘కేసీఆర్‌ను ఓడిస్తేనే అన్ని అమలు అవుతాయి’
సాక్షి, దుబ్బాక: తెలంగాణ ఆడపడుచులకు సద్దుల బతకమ్మ పండుగ సందర్బంగా టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు ఆనందోత్సాహాలతో, సంప్రదాయ బద్దంగా పండుగ జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దుబ్బాకలో టీఆర్ఎస్ను ఒడిస్తే కేసీఆర్‌కు హామీలన్నీ గుర్తొస్తాయి. కేసీఆర్ మొక్కజొన్నలు మద్దతు ధరలకు కొంటామని, ఉద్యోగులకు డీఏ ఇస్తామని ప్రకటించడం దుబ్బాక ప్రజల నైతిక విజయం. మొన్నటి వరకు కుక్క తోక అంటూ ఉద్యోగులను అవహేళనగా మాట్లాడిన కేసీఆర్ నేడు డీఏ ప్రకటించారు. మొక్కజొన్న పంటలే వేయొద్దని 1200 రూపాయలకు క్వింటాలు దేశమంతా దొరుకుతున్నయని మాట్లాడిన కేసీఆర్ నేడు గ్రామాలలో మీ దగ్గరే వచ్చి మొక్కజొన్నలు 1850 మద్దతు ధరకు కొంటామని అంటున్నారు. రైతులకు, ఉద్యోగులకు హామీలు అమలు చేసిన కేసీఆర్, మనం దుబ్బాకలో ఓడగొడితే ఇక అన్ని చేస్తారు. దళితులకు భూమి వస్తుంది, డబల్ బెడ్ రూమ్ ఇల్లు వస్తుంది. ఆరోగ్య శ్రీ వస్తుంది. ఇంటికో ఉద్యోగం వస్తుంది, ముస్లింలకు, గిరిజనులకు రిజర్వేషన్ల్ వస్తాయి, కేజీ నుంచి పీజీ దాకా ఉచిత నిర్బంధ విద్య వస్తుంది, అన్ని వస్తాయి. కేసీఆర్ దుబ్బాకలో ఓట్ల కోసమే రైతులకు, ఉద్యోగులకు మంచి చేస్తున్నట్లు నటిస్తున్నాడు. ఇక్కడ కార్‌ను గెలిపిస్తే మళ్ళీ లెక్కలు ఓట్లు అయ్యాక మోసం చేస్తారు. అదే ఈ ఎన్నికలలో కాంగ్రెస్‌ను గెలిపిస్తే ప్రజల కోపాన్ని చూసి అన్ని చేస్తారు. దుబ్బాకలో కాంగ్రెస్ గెలుపు రాష్ట్ర రాజకీయాలకు మలుపు అవుతుంది. ఉద్యోగులకు ఇంకా రెండు డీఏలు ఇవ్వలేదు. పీఆర్సీ ఇవ్వలేదు. రైతులకు రుణ మాఫీ ఇవ్వలేదు. పంటలు పాడైతే నష్ట పరిహారం ఇవ్వలేదు. కౌలు రైతులకు రైతు బంధు రావాలి. అన్ని పంటలను గిట్టుబాటు ధరలకు కొనాలి. ఇవన్నీ అమలు కావాలంటే దుబ్బాకలో కార్‌ను ఓడించాలి. కాంగ్రెస్‌ను గెలిపిస్తే తెలంగాణ అంతటా ప్రజలకు న్యాయం జరుగుతుంది’ అని అన్నారు. చదవండి: రైతుల ధర్నా.. దిగి వచ్చిన సర్కారు! -
కాక రేపుతున్న దుబ్బాక
సాక్షి, సిద్దిపేట: దుబ్బాక ఉప ఎన్నిక అన్ని రాజకీయ పార్టీల్లో కాక పుట్టిస్తోంది. రాష్ట్రం మొత్తం దుబ్బాక వైపే చూస్తుండటంతో అన్ని పార్టీల నాయకులు తమ సత్తా చాటుకునేందుకు శ్రమపడుతున్నారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఎన్నికల వేడి పుట్టిస్తున్నారు. ప్రజల్లో క్రేజ్ పెరిగేలా ప్రచారంలో దూసుకుపోతున్నారు. కాంగ్రెస్, బీజేపీల విధానాలపై టీఆర్ఎస్ విమర్శలు చేస్తుండగా.. టీఆర్ఎస్ పార్టీపై కాకుండా మంత్రి హరీశ్‌రావుపై విపక్ష పార్టీల నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలా ఒకరిపై ఒకరు సవాల్ విసురుతుండటంతో దుబ్బాక ఉప ఎన్నిక కాస్త వేడెక్కింది. కాంగ్రెస్, బీజేపీలు అసత్య ప్రచారం చేస్తున్నారని టీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. దుబ్బాక నియోజకవర్గంలో 20 వేలకు పైగా బీడీ కార్మికులకు పెన్షన్లు వస్తున్నాయి. ఈ ప్రాంతానికి చెందిన కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండటంతోనే బీడీ కార్మికుల కష్టాలు నేరుగా చూసి వారికి నెలకు రూ.2వేల పెన్షన్ ఇస్తున్నారని మంత్రి హరీశ్‌రావుతోపాటు, టీఆర్ఎస్ నాయకులు మహిళలకు చెప్పి బీడీ కార్మికుల ఓట్లు తమ ఖాతాలో వేసుకునేలా చూస్తున్నారు. అయితే బీడీ కార్మికుల ఓట్లు తమ ఖాతాలో వేసుకునేందుకు బీజేపీ నాయకులు బీడీ కార్మికులకు ఇచ్చే పెన్షన్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రూ.1,600 ఇస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. అదేవిధంగా ఇతర పథకాలకు కూడా కేంద్రం డబ్బులు ఇస్తోందని బీజేపీ నేతలు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి. బీడీ కార్మికులకు ఇచ్చే పెన్షన్‌లో ఎవ్వరు ఎన్ని డబ్బులు ఇస్తున్నారో తేల్చేందుకు తాను సిద్ధమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సవాలు విసిరితే.. రుజువు చేస్తే తన ఎమ్మెల్యే పదవికి, మంత్రి పదవికి రాజీనామా చేస్తానని, లేకపోతే ముక్కునేలకు రాసి ఎంపీ పదవి, పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయడంలేదని ప్రశ్నించారు. బీజేపీ నాయకులు చేస్తున్న ప్రచారం అంతా బూటకం అని విమర్శిస్తున్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి చేసింది మాజీ మంత్రి ముత్యం రెడ్డి అని కాంగ్రెస్ నాయకులు చెబుతుండగా.. అసలు గులాబీ జెండా లేనిదే తెలంగాణ వచ్చేదా, అరవై ఏళ్లలో జరగని అభివృద్ధి ఆరేళ్లలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి చేశారని ఎవరి వాదనను వారి వినిపిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. హరీశ్‌రావుపై విపక్షాల విమర్శలు టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్, బీజేపీలు అనుసరిస్తున్న విధానాలపై విమర్శలు చేస్తుండగా.. వారు మాత్రం హరీశ్‌రావును కేంద్రగా చేసుకొని ప్రచారం చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ప్రధానంగా దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న మంత్రి హరీశ్‌రావు ఇంతకాలం ఈ నియోజకవార్గన్ని ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నిస్తున్నారు. సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాలతో పోలిస్తే దుబ్బాక వెనకబడి ఉందని ఆరోపిస్తున్నారు. హరీశ్‌రావుకు తమ పార్టీలోనే ప్రాధాన్యత తగ్గిందని, ఇక్కడికి విచ్చి ఏం చేస్తారని కాంగ్రెస్ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్‌రెడ్డి, బీజేపీ నాయకులు రఘునందన్ రావు, బండి సంజయ్‌లు విమర్శలు చేస్తున్నారు. అదేవిధంగా కేంద్రం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టంతో రైతులకు ఇబ్బందులు ఉన్నాయని, మోటార్లకు మీటర్లు పెట్టేందుకు కేంద్రం కుట్ర పన్ని రైతులను మోసం చేస్తోందని టీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ప్రచారం అసత్యమని బీజేపీ నాయకులు చెబుతున్నారు. ఇలా ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ప్రతీ చిన్న విషయాన్ని కూడా తమ ఎన్నికల ప్రచారఅస్త్రంగా మార్చుకొని ఎదుటి పార్టీలకు సవాళ్లు, ప్రతి సవాళ్లు, విమర్శలతో దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారం హోరెత్తి పోతోంది. కాంగ్రెస్, బీజేపీలవి దొంగనాటకాలు దుబ్బాక: తెలంగాణ ఉద్యమానికి అడ్డా దుబ్బాక గడ్డ మీద పగటి వేషాలు, పరాయి నాయకులు, కిరాయి మనుషులతో ఆడే దొంగనాటకాలు సాగవని.. చిత్తు చిత్తుగా కాంగ్రెస్, బీజేపీ పార్టీలను దుబ్బాక ప్రజలు ఓడిస్తారని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం దుబ్బాక మండలం రాజక్కపేట, బల్వంతాపూర్ గ్రామాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతకు మద్దతుగా మంత్రి హరీశ్‌రావు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎండమావులాంటి కాంగ్రెస్, బీజేపీ వెంట వెళ్తే మోసపోతామన్నారు. పోరాటాల గడ్డ దుబ్బాక చరిత్ర ఉత్తమ్, బండి సంజయ్‌లకు ఏం తెలుసని, దుబ్బాక గడ్డ మీద పుట్టి పెరిగి విద్యాబుద్ధులు నేర్చిన సీఎం కేసీఆర్‌కు ఈ ప్రాంతం అణువణువు తెలుసని, చేనేతలు, బీడీ కార్మికులు, రైతుల కష్టాలు తెలుసని పేర్కొన్నారు. బీజేపీ సోషల్ మీడియా అబద్దాల పుట్టగా మారిందన్నారు. తుది శ్వాస విడిచేంత వరకు ప్రజల మధ్యనే ఉన్న రామలింగన్న ఆశయాల సాధనకు పుట్టెడు దుఃఖంలో ఉండి కూడా మనముందుకు వచ్చిన సుజాతక్కకు అండగా ఉంటామని పెద్ద సంఖ్యలో వచ్చిన జనంను చూస్తుంటే లక్ష మెజార్టీతో గెలుపొందడం ఖాయమైపోయిందన్నారు. చర్చకు రమ్మంటే సంజయ్ పత్తా లేడు దుబ్బాక తెలంగాణ తల్లి చౌరస్తాలో చర్చకు రమ్మంటే బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పటివరకు పత్తా లేడని మంత్రి ఆరోపించారు. బీడీ కార్మికులకిచ్చే పింఛన్లలో కేంద్రం రూ.1,600 ఇస్తుందంటు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. అందులో కనీసం రూ.16 ఇచ్చినట్లు నిరూపించినా మంత్రి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తానని, లేకుంటే నువ్వు ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చెయాలని సవాల్ విసిరారు. లేదంటే ముక్కు నేలకు రాసి ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, నాయకులు కోమటిరెడ్డి వెంకటనర్సింహారెడ్డి, ఎంపీపీ కొత్త పుష్పలతకిషన్‌రెడ్డి, జెడ్పీటీసీ రవీందర్‌రెడ్డి, సర్పంచ్‌లు పెరుగు పద్మపర్వతాలు, చౌడు బాల్‌లక్ష్మి, ఎంపీటీసీ రాధామనోహర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. జూటాబాజీ మాటలు బీజేపీకే చెల్లుతాయ్ మిరుదొడ్డి(దుబ్బాక): పొద్దుగాల లేచిన నుంచి నుంచి పొద్దుపోయే దాకా జాటాబాజీ డోకాబాజీ మాటలు మాట్లాడే పార్టీ ఏదైతే ఉందో అది ఒక్క బీజేపీకే చెల్లుతుందని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మండల కేంద్రమైన మిరుదొడ్డిలో శుక్రవారం వివిధ పార్టీకు చెందిన కార్యకర్తలు హరీశ్‌రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. రామలింగారెడ్డి ఆశయ సాధనకు అభ్యర్థి సోలిపేట సుజాతను ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్, ఎంపీపీ గజ్జెల సాయిలు, డీసీసీబీ డైరెక్టర్ బక్కి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. గులాబీ వైపు ముంపు గ్రామాల ప్రజలు సిద్దిపేట: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో రిజర్వాయర్ల కోసం ఆనాడు భూమి ఇచ్చి స్ఫూర్తిగా నిలిచిన ముంపు గ్రామాల ప్రజలు నేడు దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ వైపు నిలబడడం సంతోషంగా ఉందని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ముంపు గ్రామం ఎటిగడ్డ కిష్టాపూర్ ప్రజలు శుక్రవారం సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావును సర్పంచ్ ప్రతాప్‌రెడ్డి సమక్షంలో కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మొన్న పల్లెపహాడ్, నిన్న వేములఘట్, నేడు ఏటిగడ్డ కిష్టాపూర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలపడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే క్రాంతికిరణ్, జెడ్పీటీసీ ఇంద్రాసేనారెడ్డి, శ్రీకాంత్ ఉన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లు దొందూ దొందే.. రాయపోలు(దుబ్బాక): కాంగ్రెసోళ్లకు ఓటేస్తే కాలిపోయే మోటార్లు దిక్కయినయి.. ఇప్పుడు బీజేపోళ్లకు ఓటేస్తే మోటార్ల కాడ మీటర్లు పెడ్తమంటున్నరు.. మరి ఎవరికేద్దాం ఓటు.. అని ఆర్థిక శాఖామంత్రి తన్నీరు హరీశ్‌రావు ఓటర్లను ప్రశ్నించారు. రాయపోలు మండలం రామారంలో శుక్రవారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాయపోలు మాజీ ఎంపీపీ వైస్ చైర్మన్ తలారి నర్సింలుతో సహా 50 మంది వరకు మంత్రి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లో చేరారు. ‘టీఆర్ఎస్కు అండగా ఉంటాం’ దుబ్బాక: దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతకు అండగా ఉంటామని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం దుబ్బాకలో నియోజకవర్గంలోని అన్ని మండలాల మాదిగ సంఘం ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మాదిగల సంక్షేమానికి కృషి చేసిందేమి లేదన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి డప్పు శివరాజ్, మాదిగల రాష్ట్ర కార్యదర్శి రాజేందర్, రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు సాంబయ్య, స్వామి, రాంచంద్రం, బెల్లె బాల్‌నర్సయ్య, స్వామి, చరణ్ తేజ, తదితరులు పాల్గొన్నారు. -
ధోకాబాజీలను నమ్మొద్దు
సాక్షి, సిద్దిపేట: దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట్లు గల్లంతవుతాయని ఆర్థిక మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం దుబ్బాకలో రోడ్ షో నిర్వహించారు. ఈ సంద ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీల మోసపూరిత మాటలను నమ్మవద్దని కోరారు. ఎన్నికలు వచ్చినప్పుడే ఆ పార్టీలకు ప్రజలు గుర్తుకొస్తారని ఎద్దేవా చేశారు. కల్లబొల్లి మాటలను దుబ్బాక ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. ఎక్కడో పట్నంలో ఉండి పిలుపునిస్తే వచ్చి ఓట్లు వేసే రోజులు పోయాయని, ఇక్కడి ప్రజలు అమాయకులేం కాదన్నారు. ప్రజల మధ్య ఉంటూ.. వారి కష్ట, సుఖాల్లో పాలుపంచుకునే వారినే తమ నాయకుడిగా ఎన్నుకుంటున్నారని హరీశ్ పేర్కొన్నారు. సోలిపేట రామలింగారెడ్డి మృతితో ఈ ప్రాంతం ప్రజలు మంచి నాయకుడిని కోల్పోయారన్నారు. చింతమడకలో పుట్టి, దుబ్బాకలో చదువుకున్న సీఎం కేసీఆర్‌కు దుబ్బాక ప్రాంతం, ఇక్కడి ప్రజలు అంటే ఎంతో ఇష్టం అని పేర్కొన్నారు. అందుకోసమే అడగకుండానే నిధులు మంజూరు చేస్తున్నారని చెప్పారు. బుధవారం దుబ్బాకలో జరిగిన రోడ్ షోలో పాల్గొన్న జనం బీజేపీ తోక ముడిచింది దుబ్బాక ప్రాంతంలో బీడీ కార్మికులు ఎక్కువగా ఉన్నారని హరీశ్‌రావు తెలిపారు. ఈ ప్రాంతం మహిళల ఇబ్బందులను నేరుగా చూసిన ముఖ్యమంత్రి కేసీఆర్.. బీడీ కారి్మకులకు పింఛన్లు అందిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం బీడీ కారి్మకులకు నెలకు రూ.2,016 ఇస్తుంటే.. వాటిలో రూ. 1,600 కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని బీజేపీ నేతలు అసత్యపు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాపై బహిరంగ చర్చకు రమ్మని సవాల్ చేస్తే బీజేపీ నేతలు తోక ముడిచారని విమర్శించారు. ఒకవేళ బీడీ కారి్మకులకు కేంద్రం నిధులు ఇస్తే ప్రధానమంత్రి మోదీ సొంత రాష్ట్రంలో పింఛన్లు కేవలం రూ. 500లే ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు. పనులు చేయకుండానే బీజేపీ నాయకులు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సూట్‌కేసులతో వచ్చిన కాంగ్రెస్ నేతలు ఎక్కువ కాలం రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ నాయకులకు ఈ ప్రాంతం ప్రజల కష్టాలు కని్పంచలేదా అనిహరీశ్ నిలదీశారు. ఏనాడు ప్రజల కష్టాలను చూడని కాంగ్రెస్ నాయకులు ఇప్పుడూ సూట్‌కేసులు సర్దుకొని దుబ్బాకలో మకాం వేసి.. మీటింగ్‌లు పెట్టుకుంటున్నారని ఆరోపించారు. దుబ్బాక నియోజకవర్గ చరిత్రలో తొలిసారిగా మహిళా అభ్యర్థి పోటీ చేయడాన్ని హర్షిస్తూ.. నియోజకవర్గంలోని మహిళలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. అందుకోసమే ఈ సమావేశానికి మహిళలు దండుగా కదలి వచ్చారన్నారు. ప్రజల స్పందన, చూస్తుంటే..టీఆర్ఎస్ అభ్యర్థి లక్షకు పైగా మెజారీ్టతో గెలుస్తుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. రెండో స్థానం కోసం బీజేపీ, కాంగ్రెస్ నాయకులు పోటీ పడుతున్నారని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత, మాజీ మంత్రి సునితా లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. -
బండి సంజయ్‌కు మంత్రి హరీష్ సవాల్
-
‘ఈ ఎన్నికలో ఓడిస్తే సీఎం వందమెట్లు దిగివస్తారు’
సాక్షి, దుబ్బాక(సిద్దిపేట): ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ డబ్బు, పోలీసులను విచ్చలవిడిగా వాడుతుందని, కలెక్టర్ కూడా వారికే సపోర్టు కాబట్టి గెలిచినట్లుగా భావిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... రామలింగారెడ్డి చనిపోవడం బాధాకరమే అయినప్పటికీ దుబ్బాక ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిస్తే అది రాష్ట్ర ప్రజలకు శాపమన్నారు. మూడు పార్టీల అభ్యర్థులు బలంగానే ఉన్నప్పటికీ టీఆర్ఎస్కు మాత్రం డబ్బు, పోలీసుల బలం ఉందన్నారు. జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి కేసీఆర్‌కు పెద్దకొడుకులా పనిచేస్తున్నారని, అందువల్లే ఎన్నిక జరగక ముందే గెలిచినట్లుగా హరీశ్ రావు భావించి మెజారిటీ గురించి మాట్లాడుతున్నారన్నారు. లక్ష రూపాయల రూణమాఫీ, 57 ఏళ్లకే పెన్షన్, 12 శాతం రిజర్వేషన్లు, ఎస్సీలకు 12 రిజర్వేషన్లు, డబుల్ బెడ్రూం ఇళ్లు, దళితులకు 3 ఎకరాల భూమి, నిరుద్యోగ భృతి, కేజీ టూ పీజీ, ఇంటికో ఉద్యోగం ఇవ్వకపోయినా మళ్లీ ఎలక్షన్లో గెలిచినందుకు సీఎం కేసీఆర్ గల్లా ఏగిరేస్తున్నాడన్నారు. అంటే భవిష్యత్తులో కూడా ఇవేమీ ఇవ్వకపోయిన గెలుస్తామనే థీమా వాల్లకు వస్తే ప్రజలు నష్టపోతారని పేర్కొన్నారు. పంటలు మొత్తం మునిగిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. యూనివర్శిటీ పిల్లలంతా టీఆర్ఎస్కు వ్యతిరేకంగా దుబ్బాకలో పని చేయాలని పిలుపునిచ్చారు. దుబ్బాక ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని ఓడిస్తే సీఎం వంద మెట్లు దిగివస్తారని, కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తేనే రాష్ట్ర ప్రజలకు లాభమని ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. -
బండి సంజయ్‌కు మంత్రి హరీష్ సవాల్
సిద్దిపేట : దుబ్బాకలో టిఆర్ఎస్కు మద్దతుగా మహిళలతో సంఘీబావ ర్యాలీ నిర్వహించారు. దుబ్బాక బస్ డిపో నుంచి అంబేద్కర్ సర్కిల్ మీదుగా తెలంగాణ తల్లి విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది. మంగళ హరతులు, డప్పు చప్పుళ్లతో మహిళలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు మంత్రి హరీష్ రావు, టిఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి, సహా పలువురు టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. బీడి పెన్షనర్లకు 1600 రూపాయలు ఇస్తున్నామని బీజేపీ చేస్తోందంతా పచ్చి అబద్దమని మంత్రి హరీష్ రావు అన్నారు. బీడీ కార్మికులకు 1600 పెన్షన్ ఇస్తున్నట్లు సాక్ష్యాలు, ఆధారాలతో నిరూపిస్తే మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అని హరీష్ రావు అన్నారు. ఒకవేళ ఇవ్వకపోతే నువ్వు రాజీనామాకు సిద్దామా అంటూ బండి సంజయ్‌కి సవాల్ విసిరారు. చింతమడక ల పుట్టిదుబ్బాకలో చదువుకున్న కేసీఆర్‌కు దుబ్బాక పైన ప్రేమ ఉంటది కానీ.. పరాయి నాయకులకు ప్రేమ ఉంటాదా అని ప్రశ్నించారు. సోలీపేట సుజాతక్క గెలుపు మహిళలు గెలుపన్నారు. మోదీ సొంత రాష్ట్రంలో 500 రూపాయల పెన్షన్ ఇస్తే కేసీఆర్ 2000 రూపాయలు ఇస్తున్నారని, బీజేపీ, కాంగ్రెస్ చేసే అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మరని తెలిపారు. రాష్ర్ట ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ కార్యక్రమాలకు కేంద్రమే నిధులు ఇస్తోందని బీజేపీ దుష్ప్రచారం చేస్తోందని మంత్రి హరీష్ అన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా రైతులకు ఉచిత కరెంట్, బీడీ పెన్షన్లు, రైతు బంధు, కళ్యాణలక్ష్మీ స్కీము ఇస్తోందా అని ప్రశ్నించారు. 'బీజేపీ ఏమి చేస్తామని ప్రచారం చేస్తారు ? విద్యుత్ మీటర్లు పెడతామని ఓట్లు అడుగుతారా ? విదేశీ మక్కలు తెచ్చి రైతుల పొట్టలు కొడతామని అడుగుతారా ? ఎవరి ప్రయోజనాల కోసం విదేశీ మక్కలు తెస్తున్నారో బీజేపీ చెప్పాలి' అని మంత్రి హరీష్ డిమాండ్ చేశారు. దుబ్బాక ప్రజలు అభివృద్ధిని, సంక్షేమాన్ని కోరుకుంటున్నారని కాంగ్రెస్, బీజేపీలను నమ్మితే మోసపోతామని తెలిపారు. రామలింగారెడ్డి తన చివరి శ్వాస వరకు ప్రజాసేవలోనే గడిపారని అభ్యర్థి సోలీపేట సుజాత అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక తండ్రి లాగా నన్ను ఆశీర్వదించి మీ సేవ కోసం పంపారు. దుబ్బాక ప్రజల ఆశీస్సులతో రామలింగారెడ్డి అడుగుజాడల్లో నడిచి ఆయన ఆశయాలను కొనసాగిస్తాను అని పేర్కొన్నారు. -
దుబ్బాక: కనుమరుగైన టీడీపీ
సాక్షి, సిద్దిపేట: దుబ్బాక నియోజకవర్గంలో గతంలో ఓ వెలుగు వెలిగిన తెలుగుదేశం పార్టీ నేడు కనుమరుగైంది. మాజీ మంత్రి ముత్యంరెడ్డి ఆ పార్టీని వీడిన తర్వాత దుబ్బాక నియోజకవర్గం నుంచి పోటీ చేసేవారు సైతం కరువయ్యారు. గతంలో పొత్తుల కారణంగా ఇతర పార్టీలకు టికెట్ కేటాయించినా ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నికలో పోటీలో దింపేందుకు టీడీపీకి అభ్యర్థి కూడా లేకుండా పోయారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన సీపీఎం, టీజేఎస్ కూడా ఈ ఎన్నికల్లో పోటీలో లేకపోవడం గమనార్హం. జిల్లాలో తెలుగు దేశం పార్టీ కనీస ఉనికి కూడా లేకుండా పోయింది. పార్టీ ఆవిర్భావం తర్వాత 1985లో డి.రామచంద్రారెడ్డి అప్పటి దొమ్మాట నియోజకవర్గం నుంచి గెలుపొందారు. తర్వాత 1989, 1994, 1999 వరకు వరుసగా మూడు సార్లు మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి గెలిచారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే లక్ష్యంగా టీఆర్ఎస్ ఆవిర్భవించింది. తర్వాత 2004లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో ఎమ్మెల్యేలు రాజీనామాతో జరిగిన 2008 ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన ముత్యంరెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. వరుసగా రెండు సార్లు ఓటమి చవిచూసిన ముత్యంరెడ్డి 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీచేశారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభంజనంలో దుబ్బాక నియోజకవర్గం నుంచి ఆయన విజయం సాధించారు. ఇంతటి చరిత్ర ఉన్న టీడీపీకి ప్రస్తుతం జరుగుతున్న ఉపఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టలేని దుస్థితికి చేరుకుంది. టీజేఎస్, సీపీఎం కూడా దూరమే గత సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులు, ఎత్తులతో దుబ్బాక టికెట్ కైవసం చేసుకున్న తెలంగాణ జన సమితి, అప్పుడు పోటీలో ఉన్న సీపీఎం ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. గత ఎన్నికల్లో కాంగ్రెస్, టీజేఎస్, టీడీపీ పొత్తులో భాగంగా దుబ్బాక అసెంబ్లీ టికెట్ టీజేఎస్‌కు దక్కింది. దీంతో మనస్తాపానికి గురైన ముత్యంరెడ్డి ఎన్నికల ముందు తమ అనుచరులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. అదేవిధంగా పొత్తుల్లో భాగంగా టీజేఎస్ నుంచి చిన్నం రాజ్‌కుమార్ పోటీలో నిలిచినా.. అనూహ్య పరిణామాల నేపథ్యంలో చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీ బీ ఫాంతో మద్దుల నాగేశ్వర్‌రెడ్డి పోటీలో నిలిచారు. దీంతో పొత్తుల్లో టికెట్ తెచ్చుకున్న టీజేఎస్ అభ్యర్థి కన్నా.. బీజేపీ అభ్యర్థి కన్నా ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న నాగేశ్వర్‌రెడ్డి రెండో స్థానంలో నిలిచారు. అయితే కాంగ్రెస్ నుంచి పోటీచేసిన నాగేశ్వర్‌రెడ్డి, టీజేఎస్ నుంచి పోటీ చేసిన చిన్నం రాజ్‌కుమార్‌లు టీఆర్ఎస్లో చేరగా.. అప్పుడు టీఆర్ఎస్ తరుఫున ప్రచారం చేసిన ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో నిలిచారు. -
చర్చకు రెడీ: హరీష్ రావుకు ప్రతి సవాల్
సాక్షి, కరీంనగర్: మంత్రి హరీష్ రావు విసిరిన సవాల్‌ను తాను స్వీకరిస్తున్నానని, చర్చకు ఎక్కడికి రావాలో చెప్పాలంటూ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు యెండల లక్ష్మీ నారాయణ చాలెంజ్ చేశారు. రేషన్ బియ్యం, అంగన్ వాడీ పౌష్టికాహారంలో కేంద్రం వాటా ఎంత.. రాష్ట్ర వాటా ఎంతో చర్చిద్దామా అంటూ ప్రశ్నలు సంధించారు. దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో మంత్రి హరీష్ రావు, బీజేపీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన విషయం తెలిసిందే. బీజేపీ నాయకుల గోబెల్స్ ప్రచారానికి అడ్డు అదుపు లేకుండా పోతుందని, ప్రజలను మభ్యపెట్టేలా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. (చదవండి: మంత్రి హరీశ్‌రావుకు డీకే అరుణ సవాల్) అదే విధంగా, బీడీ కార్మికులకు కేంద్రం ఏం సాయం చేస్తుందో చర్చకు ఎక్కడైనా సిద్ధమే అని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు సవాల్ విసిరారు. రూ.1600 కాదు, పదహారు పైసలు కూడా కేంద్రం ఇవ్వడంలేదుని తెలిపారు. రూ.1600 ఇస్తున్నట్లు రుజువు చేస్తే సిద్ధిపేట ఎమ్మెల్యే, మంత్రి పదవులకు రాజీనామా చేస్తానని అన్నారు. రుజువు చేయలేకపోతే కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ రాజీనామా చేయాలన్నారు. ఈ విషయంపై తాజాగా స్పందించిన యెండల లక్ష్మీ నారాయణ.. కేంద్ర ఆవాసయోజన, కృషి వికాస్ యోజన కింద కేంద్రం ఇచ్చిన నిధులు ఏం చేశారో చెప్పాలని హరీష్‌ను ప్రశ్నించారు. ‘‘క్రిష్ వికాస్ యోజన కింద కేంద్రం 850 కోట్ల రూపాయలిస్తే.. వాటిని ట్రాక్టర్ల రూపంలో టీఆర్ఎస్ కార్యకర్తలకు ఇచ్చిన వాటిపైన చర్చిద్దామా?. ప్రతి అంశంలో కేంద్రం వాటా ఏంటో చెప్పేందుకు నేను సిద్ధం, హరిష్ రావు సిద్ధమా? కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఒక ఎకరాకు నీళ్ళు ఇస్తే ఎంత ఖర్చు అవుతుందో హరీష్ రావు చెప్పాలి. గ్రామ పంచాయితీలకు 10 వేల ట్రాక్టర్ లు కొంటె అందులో ఎక్కువశాతం మహేంద్ర ట్రాక్టర్లు ఎందుకు ఉన్నాయో హరీష్ రావు చెప్పాలి’’ అని ప్రశ్నల వర్షం కురిపించారు. ‘‘బీజేపి కార్పొరేటర్ ఎక్కడో ప్రెజెంటేషన్‌లో తప్పుదొర్లితే, దాన్ని పట్టుకుని రాష్ట్ర ఆర్ధిక మంత్రిగా హరీష్ రావు మాట్లాడమేమిటి.. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు, సీఎం స్వంత జిల్లాలో సరైన గుణపాఠం ఎదురు కాబోతోంది’’ అని చురకలు అంటించారు. ఆర్థిక మంత్రి హరీష్ రావు సౌమ్యంగా.. కూల్‌గా సవాళ్లు విసిరారు.. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఆయనను చర్చకు రమ్మని ప్రతిసవాల్ విసురుతున్నా అని యెండల పేర్కొన్నారు.(చదవండి: బీజేపీ దివాలాకోరు రాజకీయాలకు పరాకాష్ట) -
మంత్రి హరీశ్‌రావుకు డీకే అరుణ సవాల్
సాక్షి, హైదరాబాద్ : బీడీ కార్మికులకు కేంద్రం ఏం సాయం చేస్తుందో చర్చకు ఎక్కడైనా సిద్ధమే అని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సవాల్ విసిరిన విషయం తెలిసిందే. ఈ సవాల్‌పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ స్పందించారు. కేంద్రం నిధులపై కేసీఆర్‌తో చర్చకు బండి సంజయ్ వస్తారని ప్రకటించారు. ఆర్థికమంత్రి హరీశ్‌రావుకు దమ్ముంటే, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను బండి సంజయ్‌తో చర్చకు ఒప్పించాలని సవాల్ చేశారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర నిధులపై తెలంగాణ ఆర్థికమంత్రి హరీశ్‌రావుకు స్పష్టత లేకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. (చదవండి : బండి సంజయ్‌తో చర్చకు ఎక్కడైనా సిద్ధమే..) దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో హారీశ్‌రావు ఓటర్లను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ కార్యకర్తల జోలికొస్తే టీఆర్ఎస్ అంతు చూస్తామని హెచ్చరించారు. ఓటమి భయంతో చెరుకు శ్రీనివాసరెడ్డిని కాంగ్రెస్‌లోకి పంపించి హరీశ్‌రావే టికెట్ ఇప్పించారని ఆరోపించారు. టీఆర్ఎస్పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, దుబ్బాకలో తప్పకుండా బీజేపీ గెలుస్తుందని డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు. కాగా, నవంబర్ 3న దుబ్బాక ఉప ఎన్నిక జరగనుండగా, 10న ఓట్ల లెక్కింపు, విజేతను ప్రకటిస్తారు. -
దుబ్బాకలో మంత్రి ఎందుకు భయపడుతున్నారు..?
సాక్షి, దుబ్బాక: దుబ్బాక ఉపఎన్నిక నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘సోమవారం రోజున తూప్రాన్ వద్ద మూడు గంటల వరకు వాహనం తనిఖీ చేయకుండా నిలిపేశారు. ఫోన్ లాక్కోని వాహనాన్ని తనిఖీ చేస్తున్న వీడియోలను తొలగించారు. నిన్న రాత్రి అదే వాహనాన్ని 8 గంటల సమయంలో తనిఖీ పేరుతో ఆపారు. అనంతరం ఫోన్ తీసుకొని అందులోని డాటా అంతా ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. (బండి సంజయ్‌తో చర్చకు ఎక్కడైనా సిద్ధమే) రాత్రి ఒంటి గంట వరకు కూడా వాహనాన్ని తనిఖీ చేసే టీమ్ రాలేదు. తర్వాత పోలీసులు అక్కడకు చేరుకొని కారును మొత్తం క్షుణ్ణంగా తనిఖీ చేశారు. జిల్లా మంత్రి పోలీసులను నడిపిస్తూ.. కుట్రపూరిత వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. దుబ్బాకలో బీజేపీకి మంత్రిగారు ఎందుకు భయపడుతున్నారు..?. 2014 నుంచి ఇప్పటిదాకా సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్‌కి ఇచ్చిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయండి. మంత్రి హరీష్ రావు ఎల్కల్ గ్రామ సర్పంచ్‌తో మాట్లాడిన ఆడియో మా దగ్గర ఉంది. ఇవన్నీ కూడా రాష్ట్ర, కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తాం' అని రఘనందన్‌రావు తెలిపారు. -
దుబ్బాక ఉపఎన్నిక అభ్యర్థులు వీరే!
సాక్షి, సిద్ధిపేట: దుబ్బాక ఉప ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగిసింది. ఇప్పటివరకు అక్కడ మొత్తం 46 నామినేషన్లు దాఖలు కాగా, 11 మంది ఉపసంహరించుకున్నారు. స్క్రూటినీలో 12 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. దీంతో మొత్తంగా 23 మంది దుబ్బాక ఉప ఎన్నిక బరిలో నిలిచారు. వీరిలో ఎనిమిది మంది పార్టీ గుర్తులతో పోటీ చేస్తున్నవారు ఉండగా, 15 మంది స్వతంత్ర అభ్యర్థులుగా రంగంలోకి దిగుతున్నారు. (చదవండి: 'అబద్ధాలతో అధికారంలోకి వస్తే ఎండమావే') పార్టీ గుర్తులతో పోటీ చేస్తున్నవారు 1. టీఆర్ఎస్ పార్టీ- సోలిపేట సుజాత 2. కాంగ్రెస్ పార్టీ- చెరుకు శ్రీనివాస్‌రెడ్డి 3. బీజేపీ- రఘు నందన్ రావు 4. అల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్- కత్తి కార్తీక 5. జై స్వరాజ్- గౌట్ మల్లేశం 6. శ్రమజీవిపార్టీ- జాజుల భాస్కర్ 7. ఇండియా ప్రజా బంద్ పార్టీ- సునీల్ 8. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా- సుకురి అశోక్ స్వతంత్ర అభ్యర్ధులు 9. అండర్ఫ్ సుదర్శన్ 10.అన్న బుర్ర రవి తేజ గౌడ్ 11 అన్న రాజ్ 12. కంటే సాయన్న 13. కొట్టాల యాదగిరి ముదిరాజ్ 14. కోట శ్యామ్ కుమార్ 15. విక్రమ్ రెడ్డి వేముల 16. బండారు నాగరాజ్ 17. పీఎం .బాబు 18.బుట్టన్నగారి మాధవ రెడ్డి 19.మోతె నరేష్ 20. రణవేని లక్ష్మణ్ రావు 21. రేపల్లె శ్రీనివాస్ 22 .వడ్ల మాధవాచారి 23. సిల్వెరి శ్రీకాంత్ -
బండి సంజయ్‌తో చర్చకు ఎక్కడైనా సిద్ధమే..
సాక్షి, సిద్దిపేట: దుబ్బాకలో బీజేపీ నాయకుల గోబెల్స్ ప్రచారానికి అడ్డు అదుపు లేకుండా పోతుందని, ప్రజలను మభ్యపెట్టేలా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ప్రజాస్వామ్యానికి ఇది ఏమాత్రం మంచిది కాదన్నారు. ఆయన సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దుబ్బాకలో టీఆర్ఎస్ జెండా, గద్దె కూలగొట్టినట్లు, టీఆర్ఎస్ నాయకులపై ప్రజలు ఎదురు తిరిగినట్లు బీజేపీ నేతలు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. గతంలో ఎన్నికల సమయంలో కల్వకుర్తిలో జరిగిన సంఘటనను దుబ్బాకలో జరిగినట్లు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద దుబ్బాకకు ముఖ్యమంత్రి ఇచ్చిన నిధులు దుర్వినియోగం అయినట్లు సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామని తెలిపారు. సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వ్యక్తిని అరెస్టు చేసి పోలీసులు జైలుకు తరలించారని తెలిపారు. దుబ్బాక ప్రజలు ఈ విషయాలన్నీ గమనించాలని విజ్ఞప్తి చేశారు. రూ.3కోట్ల నిధులు స్వాహా అయినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని తలిపారు. చదవండి: 'అబద్ధాలతో అధికారంలోకి వస్తే ఎండమావే' దుబ్బాకలో టౌన్‌హాల్ నిర్మాణానికి ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల కాలేదని స్పష్టం చేశారు. రహదారుల టెండర్ ఫైనల్ కాకముందే డబ్బులు ఇచ్చినట్లు సోషల్ మీడియాలో తప్పుడు పోస్టింగ్‌లు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. బీజేపీ దివాలాకోరు రాజకీయాలకు ఇది పరాకాష్ట అని అన్నారు. బీడీ కార్మికులకు కేంద్రం ఏం సాయం చేస్తుందో చర్చకు ఎక్కడైనా సిద్ధమే అని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఆర్థిక మంత్రి హరీష్‌రావు సవాల్ విసిరారు. రూ.1600 కాదు, పదహారు పైసలు కూడా కేంద్రం ఇవ్వడంలేదుని తెలిపారు. రూ.1600 ఇస్తున్నట్లు రుజువు చేస్తే సిద్ధిపేట ఎమ్మెల్యే, మంత్రి పదవులకు రాజీనామా చేస్తానని అన్నారు. రుజువు చేయలేకపోతే కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ రాజీనామా చేయాలన్నారు. ప్రజల దృష్టి మరల్చేందుకే బీజేపీ కుటిల రాజకీయాలు చేస్తోందని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. హుజూర్నగర్ ఉపఎన్నికలో ఇదే విధంగా బీజేపీ నేతలు గోబెల్స్ ప్రచారం చేశారని, ఆ ఎన్నికల్లో చపాతీ మేకర్ గుర్తు ఉన్న అభ్యర్థి కన్నా తక్కువ ఓట్లు బీజేపీకి వచ్చాయని ఎద్దేవా చేశారు. దుబ్బాకలో అదే విధమైన గోబెల్స్ ప్రచారాలు చేస్తున్నారని, హుజూర్‌నగర్‌లో బీజేపీకి జరిగిన పరాభవమే దుబ్బాకలో జరుగుతుందన్నారు. బీజేపీ నాయకులకు నిజమైన చిత్త శుద్ధి ఉంటే కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులకు జాతీయ హోదా తీసుకురావాలన్నారు. ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేసి, రాష్ట్రానికి రావాల్సిన నిధులను, రాజ్యాంగ బద్దంగా, హక్కుగా రావాల్సిన పన్ను బకాయిలను రప్పించాలన్నారు. అంతే తప్ప అబద్ధపు, అసత్యపు ప్రచారాలను మానుకోవాలని హితవు పలికారు. దుబ్బాక ప్రజలను ముమ్మాటికీ మీ మాటను నమ్మరని, బీజేపీకి హుజూర్నగర్, నిజామాబాద్‌లో ఎదురైన ఫలితమే దుబ్బాకలో పునరావృతం కానుందని హరీశ్‌రావు తెలిపారు. -
'అబద్ధాలతో అధికారంలోకి వస్తే ఎండమావే'
సాక్షి, సిద్దిపేట(దుబ్బాక) : దుబ్బాక ఉపఎన్నిక సందర్భంగా మంత్రి హరీష్‌రావు ప్రచారంలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హరీష్ రావు బీజేపీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీ రోజు రోజుకు ఖాళీ అవుతోంది. గోబెల్స్ ప్రచారాన్ని నమ్ముకొని బీజేపీ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోంది.బీడీ కార్మికులకు 1600 రూపాయలు ఇస్తున్నట్లు బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు.16 పైసలు బీడీ కార్మికులకు నరేంద్ర మోదీ ఇస్తున్నట్లు ఆధారాలు చూపాలి.గుజరాత్ సహా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బీడీ కార్మికులకు ఎందుకు పెన్షన్లు ఇవ్వడం లేదు.అబద్ధాలతో అధికారంలోకి బీజేపీ రావాలనుకుంటే అది ఎండమావే అవుతుంది. యూపీలో వృద్ధులకు,వితంతువులకు 500 రూపాయలు ఇస్తున్న బీజేపీ ప్రభుత్వం.. అదే కర్ణాటకలో 400 రూపాయలు పెన్షన్ ఇస్తుంది.తెలంగాణలో మాత్రం మన ప్రభుత్వం రూ. 2 వేలు పెన్షన్‌గా అందిస్తున్నాం. బీజేపీదంతా దోఖేబాజీ మాటలు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్ లో రూ. 500 మాత్రమే పెన్షన్ ఇస్తున్నారు. రెండు వేల రూపాయల పెన్షన్ ఇచ్చే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్, బీజేపీలు ఎలా విమర్శిస్తున్నాయి. బీజేపీ అధికారంలో ఉన్న యూపీలో బోర్లు, బావుల దగ్గర యూనిట్ కు 4 రూపాయలచొప్పున రైతుల నుంచి చార్జీలు వసూలు చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. కాగా టీఆర్ఎస్ తరపున దుబ్బాక ఉపఎన్నికలో సోలిపేట సుజాత బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. కాగా దుబ్బాక ఉపఎన్నిక నవంబర్ 3న జరగనుంది.. ఉపఎన్నిక ఫలితం నవంబర్ 10న రానుంది. -
దుబ్బాక ఉప ఎన్నిక: యువతకు గాలం
దుబ్బాక ఉప ఎన్నిక అన్ని రాజకీయ పార్టీలకు ఇజ్జత్‌కా సవాల్‌గా మారింది. పార్టీ బలాబలాలు ఎలా ఉన్నా ఎన్నికల్లో సందడి చేయాలంటే యువత పాత్ర కీలకం. వయసు మళ్లిన వారి ఓటింగ్ సైలెంట్‌గా జరగుతుందని గమనించిన నాయకులు యువకులను ఆకర్షించే పనిలో పడ్డారు. వీరిని మచ్చిక చేసుకుంటే.. ఈ నాలుగు రోజులు ప్రచారానికి పనికి రావడంతోపాటు ఓట్లు కూడా వస్తాయని అంచనా వేస్తున్నారు. దీంతో యువకులతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి తాయిలాలు ప్రకటిస్తున్నారు. సాక్షి, సిద్దిపేట: నియోజకవర్గంలో 18 నుంచి 25 ఏళ్ల వయస్సు ఉన్న యువతీ, యువకులు 10 శాతం మంది ఉన్నారు. నియోజకవర్గంలో మొత్తం 1,97,468 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో 20 వేల మేరకు యువత ఓట్లు ఉన్నాయి. ఇందులో ఇటీవల కాలంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కొత్తగా ఓటు పొందిన వారు 5 వేల మేరకు ఉన్నారు. ఇందులో విద్యార్థులు, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులతో పాటు, వ్యవసాయం, ఇతర పనులు చేసుకునే వారు ఉన్నారు. ఇలా మొత్తం ఓటర్లు, యువకులు, యువతులతోపాటు, వారు చేసే పనులను ఆధారంగా విభజించి వారి అవసరాలను గుర్తించి హామీలుస్తూ దగ్గరకు చేర్చుకుంటున్నారు. ఎటు మొగ్గు చూపుతారో.. టీఆర్ఎస్ పార్టీ ఇటీవల దౌల్తాబాద్‌లో రెండు వేల మంది యువకులతో బైక్‌ర్యాలీ నిర్వహించారు. అదేవిధంగా పార్టీ అనుబంధ తెలంగాణ విద్యార్థి సంఘం నాయకులను నియోజకవర్గంలో తిప్పి యువతను గ్యాదర్ చేస్తున్నారు. అదేవిధంగా విద్యార్థి, యువజన సంఘాల సమావేశాలు, సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇంతటితో ఆగకుండా వారికి కావాల్సిన ఆటవస్తువులు, కిట్లు, జిమ్ములు ఏర్పాటు చేస్తామని హామీలు ఇచ్చి ఆకర్షిస్తున్నారు. అయితే యువతే ఆధారంగా బీజేపీ ప్రచారం ముందుకు వెళ్తుంది. ప్రధానంగా బీజేపీ అనుబంధ ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్, భజరంగదల్, మహిళా మోర్చ ఇలాంటి సంఘాల్లోని యువతను ప్రధాన ప్రచార అస్త్రంగా మార్చుకుంటున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా అనుబంధ ఎన్ఎస్యూఐ, యువజన కాంగ్రెస్ క్యాడర్‌ను పెంచుకుంటూ ప్రచారంలో పాల్గొంటున్నారు. అయితే నియోజకవర్గంలోని యువతే కాకుండా ప్రచారం కోసం జిల్లా వ్యాప్తంగా ఉన్న యువకులను సైతం నియోజకవర్గానికి పిలిపించుకొని ప్రచారంలో భాగస్వాములను చేస్తున్నారు. లాక్ డౌన్‌తో కళాశాలలు ఇంకా తెరవకపోవడం, ఇతర పనులు కూడా లేకపోవడంతో దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రచారం చేస్తున్న వారిలో యువత ఎక్కువగా కన్పిస్తోంది. అయితే పోలింగ్ నాటికి ఏ పరిణామాలు చోటు చేసుకుంటాయో.. యువత ఓట్లు ఎటు మొగ్గుచూపుతాయో వేచి చూడాల్సి ఉంది. 46 మంది అభ్యర్థులు.. 103 నామినేషన్లు దుబ్బాకటౌన్: దుబ్బాక ఉప ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం శుక్రవారంతో ముగిసింది. 9 వ తేదీ నుంచి నేటి వరకు మొత్తం 46 మంది అభ్యర్థులు 103 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. చివరిరోజైన శుక్రవారం 34 మంది అభ్యర్థులు 48 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. దాఖలు చేసిన అభ్యర్థులు.. సోలిపేట సుజాత(టీఆర్ఎస్), మాధవనేని రఘునందన్‌రావు(బీజేపీ), చెరుకు శ్రీనివాసురెడ్డి(కాంగ్రెస్), కత్తి కార్తీక బీఆర్ఎం(ఆల్ ఇండియా ఫార్వర్డు బ్లాక్), గౌటి మల్లేశ్ ( జై స్వరాజ్), లొంగరి రమేశ్ (బహుజన రాష్ట్ర సమితి), సుకూరి అశోక్( రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా), మైసంగారి సునీల్(ఇండియన్ ప్రజాబంధు) సుదర్శన్ ఆడెపు (శివసేన), జాజుల భాస్కర్ (శ్రమజీవి పార్టీ), ఎం.జగదీష్ రరాజ్ (ఇండియన్ ప్రజా కాంగ్రెస్), వడ్ల శ్యాం ( అన్న వైఎస్సార్ కాంగ్రెస్), చెరుకు విజయలక్ష్మి (ఇండియన్ నేషనల్ కాంగ్రెస్), జై.భరసింహరాయుడు (తెలంగాణ జగ్ హీర్), ఇండిపెండెంట్లుగా బుర్ర రవితేజ, రేవు చిన్న ధన్‌రాజ్, శ్రీకాంత్ సిలివేరు, మోతె నరేష్, మీసాల రాజాసాగర్, కోట శ్యాంకుమార్, షేక్ సర్వర్ హుస్సెన్, పెద్దలింగన్నగారి ప్రసాద్, పోసానిపల్లి మహిపాల్‌రెడ్డి, దొడ్ల వెంకటేశం, కొల్కూరి ప్రసాద్, అడ్ల కుమార్, గొంది భుజంగం, కొట్టాల యాదగిరి, జక్కుల నర్సింలు, మద్దెల నర్సింలు, పెద్దమ్యాతరి బాబు, వడ్ల మాధవచారి, వర్కోలు శ్రీనివాసు, ఉడుత మల్లేశం, కంటె సాయన్న, రణవేని లక్ష్మణ్, బుట్టంగారి మాధవరెడ్డి, వేముల విక్రంరెడ్డి, రేపల్లి శ్రీనివాసు, పెంటం మల్లికార్జున్, పిడిశెట్టి రాజు, బండారు నాగరాజు, కొల్లూరు జగన్మోహన్రావు ముదిరాజ్, జక్కుల రాధారమణి, అల్వాల కృష్ణస్వామి, డి.కిషన్‌రావు లు నామినేషన్లు దాఖలు చేశారు. ఉపఎన్నిక టీఆర్ఎస్కు గుణపాఠం కావాలి మిరుదొడ్డి(దుబ్బాక): దుబ్బాక ఉపఎన్నికలో ఓటర్లు ఇచ్చే తీర్పుతో టీఆర్ఎస్ పార్టీకి ఒక గుణపాఠం కావాలని మాజీ మంత్రి, ప్రముఖ హాస్య సినీనటుడు బాబూమోహన్ అన్నారు. మండల కేంద్రమైన మిరుదొడ్డిలో శుక్రవారం విశ్వకర్మ కర్మ సంఘం సభ్యులతోపాటు వివిధ పార్టీలకు చెందిన పలువురు బాబూమోహన్, బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాదవనేని రఘునందన్‌రావు సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దుబ్బాకలో బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే తలబిరుసుతో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి కనువిప్పు కలుగుతుందన్నారు. వజ్రాయుధం కంటే విలువైన ఓటును సందించి బీజేపీ అభ్యర్థికి పట్టం కట్టేందుకు నియోజకవర్గ ప్రజలు సిద్ధమవుతున్నారన్నారు. బీజేపీకి జనాల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే గెలుపు ఖాయమైందని ధీమా వ్యక్తం చేశారు. అవినీతి డబ్బుతో ప్రలోభాలకు గురిచేస్తున్నారు తొగుట(దుబ్బాక): కొమురవెల్లి మల్లన్నసాగర్ అవినీతి డబ్బులతో ప్రతిపక్ష పార్టీల నాయకులను ప్రలోభాలకు గురిచేస్తున్నారని మాజీ మంత్రి పల్లి బాబూమోహన్ ఆరోపించారు. మండల కేంద్రమైన తొగుటలో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుతో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాలు చేసిన వారికి టీఆర్ఎస్లో గౌరవంలేదన్నారు. ఉద్యమమే ఊపిరిగా పోరాటం చేసిన రఘునందన్‌రావు లాంటి వారిని పార్టీ నుంచి బయటకు పంపించారని విమర్శించారు. దుబ్బాక ఎమ్మెల్యేగా బీజేపీ అభ్యర్ది రఘునందన్‌రావును గెలిపించాలని ప్రజలను కోరారు. లక్ష ఓట్లు లక్ష్యంగా యువత కృషి చేయాలి తొగుట(దుబ్బాక): దుబ్బాక ఉప ఎన్నికలో యువత కీలకంగా వ్యవహరించాలని తొగుట ఇన్చార్జి, అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. మండలంలోని కాన్గల్ గ్రామంలో టీఆర్ఎస్ యువత, విద్యార్థి విభాగం ముఖ్య నాయకులతో శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోలిపేట సుజాతమ్మను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించి సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రతి ఒక్కరికి వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడుమెరుగు మహేష్, మండల అద్యక్షుడు అనిల్ కుమార్, సోషల్ మీడియా మండల కో–ఆర్డినేటర్ బండారు రమేష్ గౌడ్, నాయకులు పరమేశ్వర్‌రెడ్డి, నరేష్, కుమార్, మహేష్, ఆబిద్, ప్రశాంత్ పాల్గొన్నారు. -
దుబ్బాకలో నిశ్శబ్ద విప్లవం
సాక్షి, సిద్దిపేట: దుబ్బాక ఉప ఎన్నికల్లో నిశ్శబ్ద విప్లవం వ్యాపిస్తోందని పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తోందని, టీఆర్ఎస్ పతనం ఇక్కడి నుంచే ప్రారంభమైందని చెప్పారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ వస్తే తమ బతుకులు బాగు పడుతాయని యువకులు, విద్యార్థులు ఉద్యమంలో పాల్గొని బంగారు భవిష్యత్‌ను ఫణంగా పెట్టారన్నారు. తీరా రాష్ట్రం ఏర్పాటు తర్వాత కల్వకుంట్ల కుటుంబమే బాగు పడిందన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో మాజీ మంత్రి ముత్యం రెడ్డి చేసిన అభివృద్ధే కన్పిస్తుందని, ఆయన కుమారుడు శ్రీనివాస్‌కు పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అక్రమ సంపాదన డబ్బులు ఎన్నికల్లో ఖర్చు చేయడం టీఆర్ఎస్కు రివాజుగా మారిందన్నారు. తమ ప్రాంతంలో అభివృద్ధి పనులు జరగడం లేదని, నిధులు ఇవ్వాలని ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అసెంబ్లీలో చెప్పిన విషయం ఆయన గుర్తు చేశారు. 2014, 2018 అసెంబ్లీ, 2019 పార్లమెంట్ ఎన్నిక సందర్భంగా కేసీఆర్ ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు. అబద్ధాలకోరు టీఆర్ఎస్ పార్టీని ఓడించాలని పిలుపు నిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని, ఎల్ఆర్ఎస్ను రద్దు చేసి అర్హులైన వారందరి స్థలాలను ఉచితంగా క్రమబద్ధీకరిస్తామని చెప్పారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. దుబ్బాక ఫలితాల వైపు రాష్ట్రం మొత్తం చూస్తోందని, సంచలన తీర్పు ఇవ్వాలని ప్రజలను కోరారు. బీజేపీకి గ్రామాల్లో ఓటర్లే లేరన్నారు. మూడో స్థానంలో నిలిచే బీజేపీకి ఓటు వేయడం వృథా అన్నారు. శుక్రవారం దుబ్బాక మండలం పెద్ద చీకోడులో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు. చిత్రంలో పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాత, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి రైతుల్లో పెరిగిన ఆత్మవిశ్వాసం సాక్షి, సిద్దిపేట: రాష్ట్రం ఏర్పాటు తర్వాత రైతుల ఆత్మహత్యలు తగ్గాయని ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. రైతుల్లో ఆర్థికంగా బలోపేతం అవుతామనే ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు. దుబ్బాక నియోజకవర్గం పరిధిలోని పెద్ద చీకోడు, రామక్కపేట గ్రామాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతతో కలసి శుక్రవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. దుబ్బాక ఉప ఎన్నికల కోసం కాంగ్రెస్ నాయకులు సూట్‌కేసులు సర్దుకొని వచ్చారని, అయితే ఇక్కడ క్యాడర్ లేకపోవడంతో దారి చూపించే నాథుడే కరువయ్యారని విమర్శించారు. గతంలో మంత్రిగా పనిచేసిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎప్పుడైనా దుబ్బాకకు వచ్చారా? అని ప్రశ్నించారు. ఏనాడూ రాని నాయకులు ఇప్పుడు ఓట్ల కోసం వస్తే ప్రజలు ఎలా నమ్ముతారని నిలదీశారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు చేస్తుండటంతో తాము ప్రజలకు చేరువయ్యామని పేర్కొన్నారు. ఇక్కడ అభివృద్ధిని చూసి ఏం చేయాలో అర్థంకాని కాంగ్రెస్ నేతలు మాయ మాటలతో ప్రజలను నమ్మించాలని చూస్తున్నారన్నారు. ఆపదలో, సంపదలో అందుబాటులో ఉండే నాయకుడికి ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కేంద్ర నిధులు ఏవీ? రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుందని చెబుతున్న బీజేపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆసరా పెన్షన్లలో వారు ఇచ్చే వాటా ఎంత? అని ప్రశ్నించారు. ఒక వేళ ఈ పథకాలకు కేంద్రమే నిధులు ఇస్తే.. బీజేపీ పాలిత 17 రాష్ట్రాలలో ఇక్కడి పథకాలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. గ్లోబల్ ప్రచారంలో బీజేపీకి నోబెల్ బహుమతి ఇవ్వొచ్చని ఎద్దేవా చేశారు. ఎవరు ఎన్ని చెప్పినా దుబ్బాక ఉప ఎన్నికల్లో లక్ష మెజార్టీతో టీఆర్ఎస్ గెలుస్తుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రచార సభలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు. దుబ్బాకలో ముగిసిన నామినేషన్ల ఘట్టం దుబ్బాక టౌన్: దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రధానమైన నామినేషన్ల ఘట్టం శుక్రవారంతో ముగిసింది. 9వ తేదీ నుంచి నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమైన విషయం విదితమే. మొత్తం 46 మంది అభ్యర్థులు 103 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. చివరి రోజైన శుక్రవారం 34 మంది అభ్యర్థులు 48 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.