చిట్యాల: కోతుల బెడదను నివారించేందుకు.. కొండముచ్చుల ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకున్నారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో కోతుల నుంచి రక్షణ పొందేందుకు ఆ గ్రామానికి చెందిన అవనగంటి మహేశ్ వినూత్నంగా ఆలోచించారు.
తన ఇంటిపై కొండముచ్చు(కొండెంగ) ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకున్నారు. రూ.2 వేల ఖర్చుతో ఎనిమిది కొండముచ్చు (Kondamuchu) బొమ్మలతో ఫ్లెక్సీలు చేయించి తన ఇంటి చుట్టూ ఏర్పాటు చేసుకున్నారు. కొండముచ్చు బొమ్మలను చూసిన కోతులు (Monkeys) ఇంట్లోకి రావడం లేదు.
పొలాల్లో వానర దండు
సిద్దిపేట జిల్లా దుబ్బాక (Dubbaka) పట్టణ శివారులోని పొలాల్లో వందలాది వానరాలు తిష్టవేశాయి. చాలా సేపటికి కోతుల దండు పంటపొలాల నుంచి దుబ్బాక పట్టణంలోకి రోడ్డుపై వెళ్తుండగా వాహనాలు నిలిచిపోయాయి. కోతులు పెద్ద సంఖ్యలో ఇళ్లపై తిరుగుతుండటంతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు.
– దుబ్బాక
‘భౌ’బోయ్..
మందలు మందలుగా రోడ్లపై తిరుగుతున్న కుక్కల్ని (Dogs) చూసి హడలిపోయారు. వచ్చిపోయే వారిని వెంబడిస్తున్న శునకాలతో భయాందోళనకు గురయ్యారు. పెద్దపల్లి రాజీవ్ రహదారిపై బుధవారం ఉదయం కుక్కలతో పాదచారులు, వాహనదారులు ఎదుర్కొన్న తిప్పలకు దృశ్యరూపమిది.
– సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి.
చుట్టూ పచ్చదనం.. పల్లెటూరు రమణీయం
చుట్టూ పచ్చదనం.. మధ్యలో పల్లెటూరు.. ప్రకృతి రమణీయ దృశ్యం చూపరులను ఆకట్టుకుంటోంది. నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని పెద్దగుట్ట (దర్గా) కింద ఏర్పడిన ఈ గ్రామాన్ని పెద్దగుట్ట గ్రామంగా పిలుస్తారు. చుట్టూ దట్టమైన అడవి (Forest) ఉంది. పెద్దగుట్టకు వెళ్లే భక్తులు ఇక్కడి ప్రకృతిని ఆస్వాదిస్తారు.
– సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్.
చదవండి: ఏకచక్రపురం.. నవనాథపురం
Comments
Please login to add a commentAdd a comment