monkeys
-
కోతులతో భయం.. కొండముచ్చుతో ఉపాయం
చిట్యాల: కోతుల బెడదను నివారించేందుకు.. కొండముచ్చుల ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకున్నారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో కోతుల నుంచి రక్షణ పొందేందుకు ఆ గ్రామానికి చెందిన అవనగంటి మహేశ్ వినూత్నంగా ఆలోచించారు. తన ఇంటిపై కొండముచ్చు(కొండెంగ) ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకున్నారు. రూ.2 వేల ఖర్చుతో ఎనిమిది కొండముచ్చు (Kondamuchu) బొమ్మలతో ఫ్లెక్సీలు చేయించి తన ఇంటి చుట్టూ ఏర్పాటు చేసుకున్నారు. కొండముచ్చు బొమ్మలను చూసిన కోతులు (Monkeys) ఇంట్లోకి రావడం లేదు.పొలాల్లో వానర దండు సిద్దిపేట జిల్లా దుబ్బాక (Dubbaka) పట్టణ శివారులోని పొలాల్లో వందలాది వానరాలు తిష్టవేశాయి. చాలా సేపటికి కోతుల దండు పంటపొలాల నుంచి దుబ్బాక పట్టణంలోకి రోడ్డుపై వెళ్తుండగా వాహనాలు నిలిచిపోయాయి. కోతులు పెద్ద సంఖ్యలో ఇళ్లపై తిరుగుతుండటంతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. – దుబ్బాక‘భౌ’బోయ్.. మందలు మందలుగా రోడ్లపై తిరుగుతున్న కుక్కల్ని (Dogs) చూసి హడలిపోయారు. వచ్చిపోయే వారిని వెంబడిస్తున్న శునకాలతో భయాందోళనకు గురయ్యారు. పెద్దపల్లి రాజీవ్ రహదారిపై బుధవారం ఉదయం కుక్కలతో పాదచారులు, వాహనదారులు ఎదుర్కొన్న తిప్పలకు దృశ్యరూపమిది. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి. చుట్టూ పచ్చదనం.. పల్లెటూరు రమణీయం చుట్టూ పచ్చదనం.. మధ్యలో పల్లెటూరు.. ప్రకృతి రమణీయ దృశ్యం చూపరులను ఆకట్టుకుంటోంది. నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని పెద్దగుట్ట (దర్గా) కింద ఏర్పడిన ఈ గ్రామాన్ని పెద్దగుట్ట గ్రామంగా పిలుస్తారు. చుట్టూ దట్టమైన అడవి (Forest) ఉంది. పెద్దగుట్టకు వెళ్లే భక్తులు ఇక్కడి ప్రకృతిని ఆస్వాదిస్తారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్. చదవండి: ఏకచక్రపురం.. నవనాథపురం -
థాయ్‌లాండ్‌లో కోతులకు ఒక రోజు
-
అమెరికా పోలీసుల కోతుల వేట
పోలీసులేంటి? కోతులను వెదకడమేంటని? ఆశ్చర్యపోకండి. అవి మామూలు కోతులు కాదు. పరిశోధన కేంద్రం నుంచి తప్పించుకున్నవి. సౌత్ కరోలినాలోని ఎమసీ పట్టణంలో ఓ రీసెర్చ్ ఫెసిలిటీ సెంటర్ ఆల్ఫా జెనెసిస్ ఉంది. ఇక్కడ వైద్య పరీక్షలు, పరిశోధనల కోసం కోతులను పెంచుతుంటారు. ప్రస్తుతం సంస్థలో 50 కోతులున్నాయి. అయితే బుధవారం దేశమంతా ఎన్నికల హడావిడిలో ఉండగా.. కోతులు మాత్రం తప్పించుకున్నాయి. బయటి ఎన్‌క్లోజర్ తలుపులు తెరిచి ఉండటంతో 43 కోతులు బయటికి పారిపోయాయని అధికారులు వెల్లడించారు. తప్పించుకున్నాయని, ప్రజలంతా తమ ఇళ్ల తలుపులు, కిటికీలను సురక్షితంగా మూసివేయాలని, ఎక్కడైనా కోతులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని అధికారులు కోరారు. తప్పించుకున్నవి 3.2 కిలోల బరువున్న ఆడ కోతులని పోలీసులు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటి దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేయొద్దని సూచించారు. అయితే వర్షం పడుతుండటంతో గాలింపు చర్యలకు కొంత అంతరాయం ఏర్పడింది. కోతులు ఫెసిలిటీలో ఆపిల్స్ వంటి ఆహారాన్ని తిని పెరిగాయని, అడవిలో ఆకులు, అలములు తప్ప ఏమీ దొరకవు కాబట్టి అవి తిరిగి వచ్చే అవకాశం ఉందని ఆల్ఫా జెనెసిస్ సీఈఓ గ్రెగ్ వెస్టర్‌గార్డ్ చెబుతున్నారు. ఈ కేంద్రం నుంచి కోతులు తప్పించుకోవడం ఇదే మొదటిసారి కాదు. 2016లో 19 కోతులు తప్పించుకుని ఆరు గంటల తర్వాత తిరిగొచ్చాయి. రెండేళ్ల కిందట 26 కోతులు తప్పించుకున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
జూపార్కులో 10 రోజుల్లో 12 కోతుల మృతి
హాంకాంగ్: హాంకాంగ్ జూ పార్కులో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కారణంగా 10 రోజుల వ్యవధిలో 12 కోతులు మృతిచెందాయి. కొద్ది రోజుల క్రితమే జూపార్కులో ప్రమాదకర బ్యాక్టీరియా విస్తరణను అధికారులు గుర్తించారు.మృతిచెందిన కోతులకు నిర్వహించిన పోస్ట్‌మార్టంలో జూ ఎన్క్లోజర్ల మట్టిలో ఒక రకమైన బ్యాక్టీరియా అధికంగా ఉన్నట్లు కనుగొన్నారు. తద్వారా ఇన్ఫెక్షన్ సోకింది. అనంతరం కోతులు సెప్సిస్ బారిన పడి మృతిచెందాయి. ఇన్ఫెక్షన్ వల్ల ఆ కోతులలోని కణాలు దెబ్బతిన్నాయి. ఫలితంగా అవయవాలు పనిచేయడం ఆగిపోయి, అవి మృతిచెందాయి. జూ కార్మికుల బూట్ల ద్వారా కలుషితమైన మట్టి జంతువుల ఎన్క్లోజర్లకు చేరిందని అధికారులు భావిస్తున్నారు. జంతువుల కోసం గుహలు, ఇతర ఆవాసాల నిర్మాణ పనుల సమయంలో కోతుల సామూహిక మరణాలు సంభవించాయి.అంతర్జాతీయ మీడియా నివేదికల ప్రకారం మట్టి ద్వారా అంటువ్యాధులు సంక్రమించడమనేది సాధారణమే. కానీ జంతుప్రదర్శనశాలలలో ఇటువంటి సంఘటనలు చాలా అరుదు. బ్యాక్టీరియా సంక్రమణ కారణంగా కాటన్ టాప్ టామరిన్, వైట్-ఫేస్డ్ సాకి, కామన్ స్క్విరెల్ మంకీ, డి బ్రజ్జాతో సహా పలుకోతులు మృతిచెందాయి. మెలియోయిడోసిస్ అనేది కలుషితమైన మట్టి, గాలి లేదా నీటితో సంపర్కం ద్వారా వ్యాపించే ఒక అంటు వ్యాధి. ఇదే కోతుల ప్రాణాలను తీసింది. హాంకాంగ్ జూ పార్కు నగరం నడిబొడ్డున 14 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇన్ఫెక్షన్ కారణంగా కోతులు చనిపోవడంపై జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇది కూడా చదవండి: ఈ ఐదు నగరాల్లో.. మిన్నంటే దీపావళి సంబరాలు -
Delhi High Court: సంక్షేమం కాదు.. సంఘర్షణ
జనావాసాల మధ్య సంచరించే వానరాలకు ఆహారం అందుబాటులో ఉంచడం జంతు సంక్షేమం కిందికి రాదని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. ఇది ఒక రకంగా మనుషులతో వాటి సంఘర్షణకు దారి తీస్తోందని తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్మోహన్, జస్టిస్ తుషార్ రావు గేదెల ధర్మాసనం సెప్టెంబర్ 30వ తేదీన వెలువరించిన తీర్పులో కీలక వ్యాఖ్యలు చేసింది. అడవుల్లో చెట్లపై సంచరిస్తూ కాయలు, పండ్లు లాంటివి తినే వానరాలు సహజ ఆవాసాలను వదిలి జనాల మధ్యకు, వీధుల్లోకి రావడానికి కారణం మనమేనని పేర్కొంది. బ్రెడ్, చపాతీ, అరటి పండ్లులాంటివి ఇస్తూ వాటికి హానిని, ప్రజలతో ఘర్షణ పడే స్థితికి వాటిని తీసుకొస్తున్నామని వ్యాఖ్యానించింది. ‘పబ్లిక్ పార్కులు, హోటళ్లు, క్యాంటీన్లలో పోగయ్యే చెత్తను బహిరంగ ప్రదేశాల్లో పడేస్తుండటంతో కోతులు అక్కడ పోగవుతున్నాయి. కోతులకు ఆహారం ఇవ్వడం వల్ల అవి మనుషులపై ఆధారపడటాన్ని పెంచుతుంది. ఆహారం దొరకని సందర్భాల్లో అవి హాని కలిగిస్తాయి. ఈ పరిణామం మనుషులతో జంతు సంఘర్షణకు దారి తీస్తుంది. పౌర సంస్థలు దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలి. సురక్షితంగా ఉండాలనుకునే వారు ఆహార వ్యర్థాలను ఎక్కడిపడితే అక్కడ పడేయడం మానుకోవాలి’అని హితవు పలికింది. -
Ind vs Ban: అక్కడ కొండముచ్చులే కాపలా!
‘‘ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ కొండముచ్చుల(Langurs) ‘సాయం’ కోరింది. ప్రేక్షకులు, తమ కెమెరాల భద్రతకై కాపలాగా ఉండేందుకు వాటి యజమానులను ఒప్పించింది’’.. ఏంటీ విడ్డూరం అనుకుంటున్నారా? మీరు చదివింది నిజమే!.. అసలు విషయం ఏమిటంటే..!?కాన్పూర్‌లో రెండో టెస్టుటీమిండియాతో రెండు టెస్టులు, మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లు ఆడేందుకు బంగ్లాదేశ్ భారత్‌కు వచ్చింది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య తొలుత చెన్నైలో టెస్టు జరుగగా.. రోహిత్ సేన 280 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. అనంతరం రెండో టెస్టు కోసం ఇరుజట్లు ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు వచ్చాయి.ఇక్కడి గ్రీన్ పార్క్ స్టేడియంలో భారత్- బంగ్లా మధ్య శుక్రవారం మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుని.. బంగ్లాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అయితే, వర్షం కారణంగా 35 ఓవర్లకే తొలి రోజు ఆట ముగిసిపోయింది. బంగ్లాదేశ్ మూడు వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. భారత బౌలర్లలో పేసర్ ఆకాశ్ దీప్ రెండు, స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఒక వికెట్ పడగొట్టారు.ఇదిలా ఉంటే.. టీమిండియా- బంగ్లా మధ్య రెండో టెస్టుకు వేదికైన గ్రీన్ పార్క్ స్టేడియం అంటే కోతులకు బాగా ఇష్టమట. గ్రౌండ్ ఖాళీగా ఉన్నపుడు గుంపులుగా అక్కడికి వచ్చి ఆటలాడుతాయని స్థానికులు అంటున్నారు. అంతేకాదు.. మ్యాచ్ సమయంలోనూ ప్రేక్షకుల వద్దకు వచ్చి తినుబండారాలు, వాటర్ బాటిల్స్ ఎత్తుకెళ్లిన సందర్భాలు ఉన్నాయట. అందుకే కొండముచ్చులను తీసుకువచ్చాంఈ నేపథ్యంలో భారత్ మ్యాచ్‌కు ముందు ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ కొండముచ్చులను హ్యాండిల్ చేసే వ్యక్తులను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి గ్రీన్ పార్క్ స్టేడియం డైరెక్టర్ సంజయ్ కపూర్ మాట్లాడుతూ.. ‘‘కోతులు ఇక్కడ భయానక వాతావరణం సృష్టిస్తున్నాయి. అందుకే వాటిని కట్టడి చేసేందుకు, ఇక్కడికి వచ్చే వాళ్లకు భద్రత కల్పించేందుకు కొండముచ్చులను తీసుకువచ్చాం’’ అని ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో పేర్కొన్నాడు. కాగా గ్రీన్ పార్క్ స్టేడియంలో అంతర్జాతీయ మ్యాచ్‌లకు కొండముచ్చులు కాపలా కాయడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ చాలా సందర్భాల్లో ముఖ్యంగా బ్రాడ్‌కాస్టింగ్ కెమెరా పర్సన్ దగ్గర కోతుల బెడదను నివారించేందుకు వీటిని అక్కడ మోహరించేవారు. అదీ సంగతి!!చదవండి: జడేజా ప్రపంచ రికార్డు.. 147 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి -
కామాంధుడి చెర నుంచి రక్షించిన కోతులు!!
దేశంలో అఘాయిత్యాలకు అంతే లేకుండా పోతోంది. కఠిన చట్టాలు.. శిక్షలు అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి. పసికందుల నుంచి పండు ముసలి దాకా.. హత్యాచారాలకు బలైపోవడం నిత్యకృత్యంగా మారిపోయింది. అయితే.. కోతుల గుంపు ఓ అఘాయిత్యాన్ని నిలువరించాయన్న వార్త ఇప్పుడు నెట్టింట ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఉత్తర ప్రదేశ్ భాగ్పట్లో ఆసక్తికరమైన ఘటన చేసుకుంది. ఆరేళ్ల చిన్నారిని ఓ మానవ మృగం చిదిమేందుకు ప్రయత్నించగా.. హఠాత్తుగా హీరో మాదిరి ఎంట్రీ ఇచ్చిన కోతుల గుంపు అతనిపై దాడి చేసి ఆ ఘోరాన్ని ఆపాయి!!.బాలిక చెప్పిన వివరాల ప్రకారం.. దౌలా గ్రామంలో సెప్టెంబర్ 20వ తేదీన ఇంటి బయట ఆడుకుంటున్న బాలికను నిందితుడు బలవంతంగా ఎత్తుకెళ్లాడు. పాడుబడ్డ ఓ భవనంలోకి తీసుకెళ్లి బెదిరించి అఘాయిత్యానికి ప్రయత్నించబోయాడు. అయితే ఎక్కడి నుంచి వచ్చిందో ఓ కోతుల గుంపు.. నిందితుడిని బెదరగొట్టి అక్కడి నుంచి తరిమి కొట్టాయి. అయితే ఈ క్రమంలో ఆ చిన్నారిని మాత్రం అవి గాయపర్చలేదు.అక్కడి నుంచి పరిగెత్తి ఇంటికి చేరుకున్న చిన్నారి.. జరిగిన ఘటనను.. కోతులు తననెలా రక్షించాయో తల్లిదండ్రులకు చెప్పింది. ఘటనపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ద్వారా నిందితుడిని గుర్తించారు. పరారీలో ఉన్న అతన్ని పట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. మరోవైపు.. కోతుల గుంపు రాకపోయి ఉంటే తమ బిడ్డ పరిస్థితి ఏమైపోయేదో అని ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు. -
ఈ చెట్టుని కోతులు కూడా ఎక్కలేవు! ఎందుకో తెలుసా?
కోతులు ఏ చెట్టు మీదకైనా ఇట్టే ఎక్కేస్తాయి. ఈ చెట్టు మీద మాత్రం కోతులు అడుగుపెట్టవు. దీనిని ‘శాండ్బాక్స్ ట్రీ’ అంటారు. దీని కాండం నిండా పదునైన విషపు ముళ్లు ఉంటాయి.దాదాపు రెండువందల అడుగు ఎత్తు వరకు పెరిగే ఈ చెట్ల ఆకులు రెండడుగుల పరిమాణంలో ఉంటాయి. ఈ చెట్లకు చిన్నసైజు గుమ్మడికాయల వంటి కాయలు కాస్తాయి. ఇవి పూర్తిగా పండిపోయాక పేలిపోతాయి. ఈ పండ్ల పేలుడు ధాటికి వాటి నుంచి గింజలు 250 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తాయి. ఈ చెట్లు ఉష్ణమండల ప్రాంతాల్లోని తడినేలల్లో పెరుగుతాయి.ఇవి చదవండి: ఈ 'బంగారు తేనీరు'.. ధర ఎంతంటే? అక్షరాలా.. -
మనుషుల్లో ఇన్ని వ్యాధులెందుకు.. వానర రహస్యం రట్టయ్యిందా?
మన జన్యువుల్లో ఒక చిన్న మార్పు ఉన్నా ఏదో ఒక రకమైన వ్యాధికి గురికావడం ఖాయం. కానీ మనిషికి అతిదగ్గరి చుట్టంగా చెప్పుకొనే వానరాల్లో మాత్రం ఇలా ఉండదు. జన్యుపరమైన మార్పులు ఎన్ని ఉన్నా వాటికి మనలా వ్యాధులు అంటవు. ఎందుకిలా? ఈ విషయాన్ని తెలుసుకొనేందుకే హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) సహా అంతర్జాతీయ శాస్త్రవేత్తలు ఓ భారీ అధ్యయనాన్ని చేపట్టి పూర్తి చేశారు. ఇందులో భాగంగా సుమారు 233 వానర జాతులకు చెందిన 809 జన్యుక్రమాలను మానవ జన్యుక్రమాలతో పోల్చి చూశారు. భారత్‌లోని 19 వానర జాతులకు సంబంధించిన 83 నమూనాల జన్యుక్రమ నమోదు, విశ్లేషణ బాధ్యతలను సీసీఎంబీ చేపట్టింది. అంతరించిపోతున్న వానర జాతుల సంరక్షణకు, జన్యుపరమైన వ్యాధులను మరింత లోతుగా అర్థం చేసుకునేందుకు ఈ అధ్యయనం ఉపయోగపడుతుందని అంచనా.. సాక్షి, హైదరాబాద్: మానవ, వానర జన్యుక్రమాలను పోల్చి చూసినప్పుడు రెండింటిలోనూ సుమారు 43 లక్షల మిస్‌సెన్స్ జన్యుమార్పులు ఉన్నట్లు స్పష్టమైంది. ఈ ప్రత్యేకమైన జన్యు మార్పులు శరీరానికి అవసరమైన అమైనోయాసిడ్ల రూపు రేఖలను మార్చేస్తాయి. ఫలితంగా ఈ అమైనో యాసిడ్లతో తయా రయ్యే ప్రొటీన్లు కూడా సక్రమంగా పనిచేయకుండా మనం వ్యాధుల బారిన పడుతూంటాం. అయితే ప్రస్తుతం ఏ మార్పుల కారణంగా మనకు వ్యాధులు వస్తున్నాయన్నది గుర్తించడంలో చాలా పరిమితులున్నాయి. జన్యు మార్పులు వందలు, వేల సంఖ్యలో ఉండటం దీనికి కారణం. మధుమేహం, గుండె జబ్బుల్లాంటి ప్రాణాంతక ఆరోగ్య సమస్యలకూ జన్యుపరమైన మూలకారణం ఇప్పటివరకూ తెలియకపోవడానికి కూడా జన్యుమార్పులకు సంబంధించిన సమా చారం లేకపోవడమూ ఒక కారణం. ఈ నేపథ్యంలోనే శాస్త్రవేత్తలు... వాన రులు, మనుషుల జన్యుక్రమాలను సరి పోల్చే పరిశోధన చేపట్టారు. కొన్ని వ్యాధులు ఒకటి కంటే ఎక్కువ జన్యు వుల్లో వచ్చిన మార్పుల వల్ల పుడతాయని... మొదట్లో వాటి ప్రభావం తక్కువగానే ఉన్నా క్రమక్రమంగా ఈ జన్యు మార్పులన్నీ కలసికట్టుగా పనిచేయడం మొదలు పెట్టి మధుమేహం, కేన్సర్ వంటి వ్యాధులుగా పరిణమిస్తాయని అంచనా. కొన్నింటిని గుర్తించాం.. మానవులు, వానరాలను వేరు చేసే 43 లక్షల ప్రత్యేకమైన జన్యుమార్పులు (మిస్‌సెన్స్ మ్యుటేషన్స్)లలో ఆరు శాతం వాటిని ఇప్పటికే గుర్తించామని, ఇవి మనుషుల కంటే వానరాల్లోనే చాలా ఎక్కువగా ఉన్నాయని కృత్రిమ మేధ కంపెనీ ఇల్యూమినా ఉపాధ్యక్షుడు కైల్ ఫార్ తెలిపారు. ఈ ఆరు శాతం జన్యుమార్పులు మానవ వ్యాధులు వానరాలకు అంటకుండా కాపాడుతున్నట్లు భావిస్తున్నామని ఆయన చెప్పారు. వ్యాధికారక జన్యుమార్పులను గుర్తించేందుకు తాము ప్రైమేట్ ఏఐ–3డీ అనే డీప్ లెర్నింగ్ అల్గారిథమ్‌ను ఉపయోగించామని చెప్పారు. ఈ అల్గారిథమ్ జన్యుశాస్త్రానికి సంబంధించిన చాట్‌జీపీటీ అనుకోవచ్చు. చాట్‌జీపీటీ మనుషుల భాషను అర్థం చేసుకుంటే ప్రైమేట్ ఏఐ–3డీ జన్యుక్రమాన్ని అర్థం చేసుకోగలదు. అంతే తేడా! విస్తృత స్థాయిలో వానర జన్యుక్రమం నమోదు.. ఈ అధ్యయనంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేకానేక వానర జాతుల జన్యుక్రమాలను నమోదు చేశారు. ‘‘ఐదు గ్రాముల బరువుండే చిన్న కోతి మొదలుకొని చింపాంజీల వరకూ.. భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రమే కనిపించే వెస్టర్న్ హూలాక్ గిబ్బన్, పశ్చిమ కనుమల్లో నివసించే లయన్ టెయిల్డ్ మకాక్ వరకు అనేక వానర రకాల జన్యుక్రమాలను ఇందులో నమోదు చేశారు. ఈ స్థాయిలో వానర జన్యుక్రమ నమోదు జరగడం ఇదే మొదటిసారి’’అని సీసీఎంబీ శాస్త్రవేత్త డాక్టర్ గోవింద స్వామి ఉమాపతి ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. భూమ్మీద ఉన్న మొత్తం వానర జాతుల్లో దాదాపు సగం జాతుల జన్యుక్రమం ఇప్పుడు అందుబాటులో ఉందని అంచనా. ఈ విస్తృతస్థాయి జన్యుక్రమం ఫలితంగా వానరాల జన్యుక్రమాలను పోల్చి చూడటం సాధ్యమైందని, తద్వారా పరిణామ క్రమంలో వాటిలో వచ్చిన మార్పులను కూడా పరిశీలించే అవకాశం దక్కిందని డాక్టర్ ఉమాపతి తెలిపారు. అంతేకాకుండా వానరాలను మనుషులను వేరు చేసే అంశాలేమిటన్నది కూడా మరింత స్పష్టమవుతుందన్నారు. జన్యుక్రమాలు అందుబాటులోకి రావడం పరిణామ క్రమాన్ని అర్థం చేసుకోవడానికి మాత్రమే కాకుండా.. మనకు వచ్చే వ్యాధుల వివరాలు తెలుసుకోవడానికి, వానరాల సంరక్షణకూ ఉపయోగపడుతుందని వివరించారు. ‘‘వానర జన్యుక్రమ నమోదు.. వాటిని సంరక్షించాల్సిన అవసరాన్ని మరింత గట్టిగా చెబుతున్నాయి’’అని సీసీఎంబీ డైరెక్టర్ వ్యాఖ్యానించారు. ఈ అధ్యయనం ఫలితం ఇంకొకటి కూడా ఉంది. మనిషికి మాత్రమే ప్రత్యేకమనుకున్న జన్యుపరమైన అంశాలు దాదాపు సగం తగ్గాయి! అంటే మనిషికి.. వానరానికి మధ్య ఉన్న అంతరం మరింత తగ్గిందన్నమాట!. ఇది కూడా చదవండి: కిలో రూ.100 దాటిన టమాట ధరలు.. -
కొండముచ్చు అంటే హీరో లెక్క.. కానీ, వాటికి ఎంత కష్టమొచ్చింది!
కొండముచ్చు అంటే హీరో లెక్క.. ఇంతోటి మనం కూడా ఏమీ చేయలేని కోతుల సమస్యకు అది చిటికెలో పరిష్కారం చూపేది.. రంగంలోకి దిగిందంటే.. ఎలాంటి అల్లరి కోతులైనా తోకలు ముడిచి, పారిపోవాల్సి వచ్చేది.. ఇదంతా నిన్నమొన్నటి సంగతి.. మరి ఇప్పుడు.. సీను రివర్సైంది.. కొండముచ్చులకే కష్టమొచ్చింది.. వీటిని చూస్తే భయపడే కోతులే.. వీటిని భయపెట్టడం మొదలుపెట్టాయి.. సాక్షి, హైదరాబాద్: కొండెంగలు, కోతులు ఒకే రకం జాతికి చెందినవైనా... కొండమచ్చులు అడవుల్లోపలే ఉంటే.. కోతులు మాత్రం రహదారులకు దగ్గరగా ఉండడంతో పాటు ఊర్లు, పట్ట ణాల్లో ఎక్కువగా సంచరిస్తాయి. ఈ రెండింటి మధ్య జాతివైర మనేది ఏదీ లేకపోయినా కోతుల కంటే ఎక్కువ బరువు, సైజులో రెండు, మూడింతలు పెద్దగా ఉండే.. కొండముచ్చులు నల్లటి ముఖాలు, పొడవాటి తోకలతో ఒకింత భయం గొలి పేలా ఉంటాయి. దీంతో వీటికి కోతులు భయపడతాయనే అభి ప్రాయం ఎప్పటి నుంచో స్థిరపడింది. దీనికి తగ్గట్టుగానే గతంలో చాలా సందర్భాల్లో ఊళ్లలో కోతులను భయపెట్టి తరిమేసేందుకు కొండముచ్చులను ఉపయోగించారు. ఇప్పుడూ రాష్ట్రంలో కోతుల బెడద ఎక్కువున్న గ్రామాల్లో అదే పద్ధతిని ఉపయోగి స్తున్నారు. అయితే, మొదట్లో కొండముచ్చులను చూసి కొన్ని చోట్ల కోతులు వెనక్కు తగ్గినా.. మారిన కాలమాన పరిస్థితులు, మారిన కోతుల ఆహార అలవాట్లు, సొంతంగా కష్టపడకుండానే ఆహారం సంపాదించే మార్గాల కోసం జనావాసాలపై పడడం వంటి పరిణామాలతో వాటి స్వభావా ల్లోనూ మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో కోతులు వాటికి భయపడడం మానే శాయి. ఇంతటితో ఆగకుండా కొండ ముచ్చులనే భయపెట్టే పరిస్థితులు ఏర్పడడంతో గ్రామ స్తులు తలలు పట్టుకుంటు న్నారు. పైగా.. కొన్ని చోట్ల రెండింటి మధ్య ‘ఫ్రెండ్షిప్’ మొద లవడంతో సమస్య సంక్లిష్టంగా మారింది. కోతులకు తోడు కొత్తగా కొండెంగలు కూడా తిష్ట వేయడంతో ఈ రెండింటి బారి నుంచి ఎలా బయటపడాలో తెలియక గ్రామప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉండగా.. కోతులను భయ పెట్టేందుకు కొండెంగలను తీసుకురావడాన్ని వన్యప్రాణి హక్కుల కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వన్య ప్రాణి చట్టాలను ఉల్లంఘించి వాటిని తీసుకురావడానికి బదులు కోతుల బెడద నివారణకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని సూచిస్తున్నారు. ఈ జిల్లాల్లో సమస్య ఎక్కువ.. కోతులతో వివిధ రకాల పంటలకు నష్టం వాటిల్లడంతో పాటు, ఇళ్లపైకి గుంపులుగా దాడి చేస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్య ప్రధానంగా...ఉమ్మడి మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ తదితర జిల్లాల్లో ఉంది. వివిధ గ్రామపంచాయతీల పరిధిలో కోతుల నియంత్రణకు కొండెంగలను ఉపయోగిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి లో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో కొండముచ్చులను పెంచారు. కోతుల సమస్య కొంత నియంత్రణలోకి రావడంతో చుట్టుపక్కల ఊళ్ల వారు కూడా వాటిని తీసుకెళ్లి కొంతకాలం ఆయా ఊళ్లలో తిప్పుకున్న సందర్భాలున్నాయి. కరీంనగర్ జిల్లాలో పలుచోట్ల పాఠశాలల్లో విద్యార్థులకు రక్షణగా కొండముచ్చులను పెంచారు. కరీంనగర్ జిల్లా అల్గునూరులోని తెలంగాణ సాంఘిక సంక్షేమ ప్రతిభా గురుకుల కేంద్రం కాలేజీలో వీటి సేవలను వినియోగించారు. వాటిని తేవడం చట్టవిరుద్ధం... ‘‘వన్యప్రాణి సంరక్షణ చట్టంలో భాగంగా షెడ్యూల్–1 జాతికి చెందిన కొండముచ్చులను (లంగూరు) తీసుకురావడం చట్టవ్యతిరేకం. అడవుల్లోని కొండెంగలను పట్టి జనావాసాల్లోకి తీసుకురావడాన్ని చట్టం అనుమతించదు. వాటిని తీసుకొస్తే కోతుల సమస్య పరిష్కారమవుతుందని ప్రజలు భావించడం హేతుబద్ధం కాదు. బలవంతంగా తీసుకొచ్చి బంధించి పెడితే తప్ప. మనుషులున్న చోట అవి ఎక్కువగా ఉండవు’’ – అటవీశాఖ వైల్డ్ లైఫ్ విభాగం ఓఎస్డీ ఎ.శంకరన్ -
నంద్యాల: కోతుల పోట్లాట.. మనిషి ప్రాణం పోయింది
క్రైమ్: నంద్యాల జిల్లా వెలుగోడులో విషాదం చోటు చేసుకుంది. కోతుల పోట్లాటలో ఓ వ్యక్తి బలయ్యాడు. నిర్మాణంలో ఉన్న ఓ భవనంపై రెండు కోతులు పోట్లాడుకోగా.. ఒక కోతి మరో కోతిపైకి ఇటుకను విసిరింది. అది కిందపడి అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి మృతి చెందాడు. బాధితుడ్ని రఫీగా గుర్తించారు పోలీసులు. కూరగాయల కోసం ఇంటి నుంచి మార్కెట్‌కు వెళ్తున్న సమయంలో రఫీపై కోతి విసిరిన ఇటుక పడింది. రఫీకి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించగా.. అక్కడే అతను చికిత్స పొందుతూ మృతి చెందాడు. -
విమానంలో తరలించిన అరుదైన జాతి కోతులు
తిరువొత్తియూరు: మలేషియా నుంచి చైన్నెకి విమానంలో అక్రమంగా తీసుకొచ్చిన అరుదైన జాతికి చెందిన నాలుగు కోతులను అధికారులు తిరిగి బుధవారం అదే విమానంలో మలేషియాకు పంపించారు. చైన్నె మీనంబాక్కం అంతర్జాతీయ విమానాశ్రయానికి మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి ప్రయాణికుల విమానం వచ్చింది. కస్టమ్స్ అధికారులు ప్రయాణికులను తనిఖీ చేశారు. ఇద్దరు ప్రయాణికులపై అనుమానం రావడంతో విచారణ చేపట్టారు. వారి దుస్తులను తనిఖీ చేశారు. గంపలో మధ్య ఆఫ్రికాలోని పొడి అడవుల్లో ఉండే టీ ప్రిస్పా జాతి కోతులు, నైజీరియా, కెన్యా, ఉగాండా తదితర దేశాల్లో నివసించే మాంటా క్రోసా జాతి కోతులను గుర్తించారు. అరుదైన జాతులకు చెందిన నాలుగు కోతులకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవు. వాటిని పెంచుకోవడానికి తీసుకువచ్చామని ప్రయాణికులు చెప్పారు. ఎటువంటి ఆధారాలు లేకుండా, వైద్యపరీక్షలు లేకుండా తీసుకుని వెళుతున్నట్టు గుర్తించి వాటిని తిరిగి అదే విమానంలో మలేషియాకు పంపించారు. కోతులను తీసుకువచ్చిన ఇద్దరిని విచారిస్తున్నారు. -
కోతుల కథ.. జనం వ్యథ!
విపరీతంగా సంతతి.. అడవుల్లో పండ్ల చెట్లు తగ్గడం, కోతుల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో జనావాసాలపై పడుతున్నాయి. దాదాపు 25–30 ఏళ్లు జీవించే ఆడ కోతి మూడేళ్ల వయసు నుంచే గర్భం దాలుస్తుంది. ఏడాదికోసారి చొప్పున తన జీవితకాలంలో అటూఇటూగా 20–22 పిల్లలను కంటుంది. ఇలా వాటి సంతతి వేగంగా పెరుగుతోంది. ఒకప్పుడు అటవీ ప్రాంతాలున్న జిల్లాలకే పరిమితమైన కోతులు.. ఇప్పుడు మైదాన ప్రాంతాల్లోనూ గుంపులుగా ఉంటున్నాయి. ఆహారం, నీళ్ల కోసం జనావాసాలపైకి దండెత్తుతున్నాయి. ఎవరైనా వాటిని అదిలిస్తే.. వెళ్లగొట్టేందుకు ప్రయత్నిస్తే గుంపులుగా దాడికి పాల్పడుతున్నాయి. ‘హిమాచల్’ప్రయోగం మొదలుపెట్టినా.. ఇంతగా ఇబ్బందిపెడుతున్న కోతులను చంపేందుకు చట్టాలతోపాటు నమ్మకాలు కూడా అడ్డువస్తున్నాయి. హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితే ఉండటంతో.. ఆ రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని అమలు చేసింది. కోతులను పట్టుకుని ట్యూబెక్టమీ, వేసెక్టమీ ఆపరేషన్లు చేసి వదిలేసి.. వాటి సంతతిని నియంత్రణలో ఉంచేందుకు చర్యలు చేపట్టింది. దీనిని స్టడీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా నిర్మల్ జిల్లా కేంద్రం సమీపంలోని గండిరామన్న హరితవనంలో 2020 డిసెంబర్లో ‘మంకీ రిహాబిలిటేషన్ సెంటర్’ను ఏర్పాటు చేసింది. ఇందులో కోతులకు ట్యూబెక్టమీ, వేసెక్టమీ ఆపరేషన్లు చేయడం మొదలుపెట్టారు. ఈ చిత్రంలో విరిగిన చేయితో, పక్కనే కర్ర, గులేర్ పెట్టుకుని పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయుడి పేరు ధనుంజయ్. నిర్మల్ జిల్లా కేంద్రం సమీపంలోని ఎల్లారెడ్డిపేట ప్రాథమిక పాఠశాలలో టీచర్. రోజూ మధ్యాహ్న భోజన సమయంలో కోతులు విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నాయి. వంటలు, భోజనం చేసేప్పుడు ఒకరిద్దరు విద్యార్థులు పొడవాటి కర్రలను పట్టకుని కాపలా ఉండాల్సి వస్తోంది. ఇటీవల అలా వచ్చిన కోతుల గుంపును తరిమేసేందుకు ధనుంజయ్ ప్రయత్నించారు. కానీ అవి ఒక్కసారిగా ఆయనపై దాడికి రావడంతో కిందపడ్డారు. చేయి విరిగింది. ఇప్పటికీ ఇలా భయంభయంగానే పాఠాలు బోధిస్తున్నారు. ఈ చిత్రంలోని వృద్ధురాలి పేరు చాతరబోన నర్సవ్వ (70). కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రానికి చెందిన ఆమె ఈనెల 2న మధ్యాహ్నం ఇంట్లోనే వంట పాత్రలు కడుగుతోంది. అక్కడ పడేసిన అన్నం మెతుకులను చూసిన కోతుల మంద ఒక్కసారిగా ఆమెపై దాడిచేసింది. ఇష్టారీతిన ముఖం, గొంతు, మెడ, నడుము భాగంలో రక్కాయి. చుట్టుపక్కల ఉన్న ఒకరిద్దరు మహిళలు భయపడి ఇళ్లలోకి వెళ్లిపోయారు. కోతుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ నర్సవ్వను ఆస్పత్రికి తీసుకెళ్లినా బతకలేదు. .. ఇలాంటి ఒకటి రెండు ఘటనలు కాదు. రాష్ట్రంలో చాలా చోట్ల ఇదే పరిస్థితి. ‘‘అరె.. ఇవేం కోతులు పొద్దున లేచినప్పటి నుంచే పరేషాన్ చేస్తున్నయ్. బయటికి అడుగు పెట్టనిస్తలేవు. పిల్లలను బడికి పంపుదామంటే మందలకు మందలు తిరుగుతున్నాయ్. ఏమైనా అంటే మీదికి వస్తున్నయ్..’’అనుకుంటూ జనం పరేషాన్ అవుతున్నారు. గుంపుగా మీదపడి రక్కుతుండటంతో భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. కుక్కల దాడులపై అంతంత మాత్రమైనా స్పందిస్తున్న ప్రభుత్వం.. కోతుల బాధను మాత్రం అసలే పట్టించుకోవడం లేదని జనం వాపోతున్నారు. ఊరిపైకి కోతులదండు వచ్చిందని తెలిస్తే.. పనులు మానుకొని మరీ, ఇళ్లలో తలుపులు వేసుకుని ఉండిపోతున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. నామ్‌కే వాస్తేగానే చర్యలు.. మంకీ రిహాబిలిటేషన్ సెంటర్లో ఒక పశువైద్యాధికారి, ఒక అసిస్టెంట్‌తోపాటు నలుగురు అటవీశాఖ సిబ్బంది ఉన్నారు. ఈ కేంద్రానికి తీసుకువచ్చిన కోతులకు వారు ఆపరేషన్లు చేస్తున్నారు. కానీ ఇక్కడికి కోతులను తీసుకురావడం దగ్గరే సమస్య నెలకొంది. ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. కోతులను పట్టుకుని ఇక్కడి తీసుకువచ్చే బాధ్యతను స్థానిక సంస్థలకే అప్పజెప్పింది. మొదట్లో కొన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు అలా కోతులను తెచ్చాయి. అయితే కోతులను పట్టుకోవడం, వాటిని అంతదూరం తరలించడం ఇబ్బందిగా మారిందంటూ తర్వాత పట్టించుకోవడం మానేశారు. దీనితో ఇప్పటివరకు 1,176 కోతులకు మాత్రమే ఆపరేషన్లు చేయడం గమనార్హం. కోతుల బెడద నివారణలో ఎంతోకొంత ఫలితమిచ్చే ఈ అంశాన్ని సర్కారు నిర్లక్ష్యం చేస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. అంతేకాదు హిమాచల్‌ప్రదేశ్ 8 కేంద్రాలను ఏర్పాటు చేయగా.. రాష్ట్రంలో ఒక్కటే పెట్టి వదిలేశారు. ఇక కోతుల బెడదను తప్పించేందుకు పండ్ల చెట్లతో ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినా.. ఆ దిశగా పెద్దగా చర్యలు లేవని జనం వాపోతున్నారు. కోతులను తేవాలన్నా.. స్పందన తక్కువగానే.. మా కేంద్రానికి తెచ్చిన కోతులకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు చేస్తున్నాం. ఇప్పటివరకు దాదాపు 528 ఆడ కోతులకు ఆపరేషన్ చేశాం. అవి మరో పదేళ్ల వరకు పిల్లలు కనే వయసు ఉన్నవే. అంటే దాదాపు 5,280 కోతులు పుట్టకుండా చేయగలిగాం. గ్రామాల్లో కోతులను పట్టి తీసుకురావాలని సూచిస్తూనే ఉన్నాం. కానీ స్పందన తక్కువగానే ఉంటోంది. – డాక్టర్ శ్రీకర్రాజు, మంకీ రిహాబిలిటేషన్ సెంటర్ -
పిల్లల కథ: ఏయ్ ఉడుతా.. నీకేం పనీ పాట లేదా?
వంశీ పెరట్లో నిల్చుని చూస్తున్నాడు. జామచెట్టు మీద ఉడుత అటూ ఇటూ పరుగులు తీస్తోంది. మధ్యలో ఆగి కాయనందుకుకుని, కాసేపు కొరికి కింద పడేసింది. ఆ తర్వాత ఎక్కడి నుంచో ఓ కాకి రివ్వున వచ్చింది. దాంతో ఉడుత కొమ్మల చాటుకు మాయమైపోయింది. కాకి చెట్టు కొమ్మ మీద దర్జాగా వాలింది. వెంటనే ఠాప్ మని ఏదో పడ్డ చప్పుడు. కిందకు చూస్తే సగం కొరికిన బాదం కాయ. కాకి కాసేపు నాలుగు దిక్కులా పరిశీలనగా చూసి, స్నేహితులకు తన ఉనికి తెలియజేస్తూ మళ్లీ కావ్ కావ్ అంటూ ఎగిరిపోయింది. ‘ఎవరింట్లోని బాదం చెట్టు కాయో.. ఈ పక్షులు, జంతువులు అన్నీ ఇలా పాడుచేస్తున్నాయి. కష్టపడి చెట్లను పెంచుకుంటే మధ్యలో ఇవొచ్చి అన్నిటినీ తిన్నంత తిని, పారేస్తుంటాయి’ కోపంగా అనుకున్నాడు. అంతలో రెండు కోతులు వచ్చాయి. వంశీ భయంతో వెనక్కు నడిచి, లోపలికి వెళ్ళాడు. అయినా ఆ కోతుల్ని చూడాలనే కుతూహలంతో మెష్ తలుపు వేసి, అక్కడ నిలబడి చూస్తున్నాడు. ‘అయ్యో! ఆకుల చాటు జామకాయల్ని చూడనే చూశాయి. తీరిగ్గా కొరుక్కు తింటున్నాయి. తను తినాల్సిన జామకాయల్ని ఈ కోతులు తింటున్నాయి’ కోపంగా అనుకున్నాడు. అటువైపు పావురాలు కూడా సపోటా చెట్టు మీద వాలుతూ, ఎగురుతూ విన్యాసాలు చేస్తున్నాయి. తన జామకాయల్ని తినేసిన కోతుల మీద పట్టరాని కోపం వచ్చింది. తలుపు వెనక ఉన్న కర్ర తీసుకుని వాటిని బెదిరించాడు. అవి వంశీ వంక గుర్రుగా చూస్తూ, తమ భాషలో వంశీపై అరచి వెళ్లిపోయాయి. హమ్మయ్య అనుకున్నాడు వంశీ. ఆ వెంటనే ఉడుత బయటికి వచ్చింది. వంశీకి మళ్లీ కోపం వచ్చింది. ‘ఏయ్ ఉడుతా.. నీకేం పనీ పాట లేదా? నీకు తోడు ఆ కాకులు, పావురాలు, కోతులు.. మీరంతా చెట్లకు శత్రువులు. అన్ని కాయల్ని నాశనం చేస్తారు. మీరు తిండికి తప్ప ఎందుకూ పనికిరారు’ అని విసుక్కుంటూ పెరట్లోకి నడిచి, ఉష్ ఉష్ అంటూ ఉడుతను తోలాడు. అది చటుక్కున మరో కొమ్మ మీదకు చేరి ‘మిత్రమా.. వంశీ!’ అనడంతోనే ఆశ్చర్యంతో నోరు తెరుచుకుని అలాగే ఉండిపోయాడు. ‘ఏమన్నావు, మాకు పనీ పాట లేదా? జంతువులు.. పక్షులు కాయలు, పళ్లను కొరికేసే మాట నిజమే. కానీ అలా కొరికి పడేయడం వల్ల ఆ గింజలు, విత్తనాలుగా నేలలో చేరి, మళ్లీ మొలకెత్తి.. మొక్కలై, క్రమంగా చెట్లై, మహావృక్షాలవుతున్నాయని, పూలు, కాయలు, పండ్లను ఇస్తున్నాయని నువ్వు తెలుసుకోవాలి. పైగా మా ఉడుత జాతి అయితే మంచుకురిసే ప్రాంతాల్లో, చలికాలం కోసం ముందు చూపుతో గింజల్ని పోగుచేసి వేర్వేరు చోట్ల, గుంతల్లో దాచిపెట్టుకుంటుంది. కానీ మాకు, మీకు మాదిరే కాస్తంత మతిమరుపు. దాంతో ఆ తర్వాత గింజల్ని ఎక్కడ దాచుకున్నదీ మర్చిపోవటంతో ఆ గింజలన్నీ మొలకెత్తి, చెట్లుగా ఎదుగుతాయి. పక్షి జాతులయితే దూర దూర ప్రాంతాలకు విత్తనాలను ఎంతగా వ్యాప్తి చేస్తాయో! అంతేనా, మా విసర్జనల ద్వారా కూడా రకరకాల విత్తనాలు నేలకు చేరి, మొలకెత్తి, మొక్కలుగా ఎదుగుతున్నాయి తెలుసా? నిజానికి మానవులు, అంటే మీరు నాటే చెట్ల కన్నా మేం నాటే చెట్లే ఎక్కువ. మేం తినేది గోరంత, నాటే చెట్లు కొండంత. ఆవిధంగా మేం, మీకు ఎంతో సేవ చేస్తున్నాం. పర్యావరణ పరిరక్షణకు చెట్లు అధికంగా పెంచాలని నువ్వు చదువుతుంటావుగా! మేం ఆ పని చేస్తున్నాం. పర్యావరణం బాగుండాలంటే సకల జీవుల ఉనికి అవసరమే. అదే.. జీవ వైవిధ్యం ఉండడం ప్రధానం. మరి, మేం మీ మిత్రులమని ఇప్పటికైనా ఒప్పుకుంటావా? ’ అంది ఉడుత. అంతా విన్న వంశీ ‘ఉడుతా! నన్ను క్షమించు. ఇన్ని రోజులూ నీ సేవలు తెలుసుకోలేక పోయాను. ఇవాళ్టి నుంచి మనం స్నేహితులం. ఒట్టు’ అంటుంటే.. ‘ఒరే వంశీ! ఎంత ఆదివారమైనా మరీ ఇంత పొద్దెక్కేదాకా పడుకుంటావా? పైగా కలలొకటి.. ఎవరితో క్షమించు, ఒట్టు.. అని ఏదేదో అంటున్నావు’ అంటూ అమ్మ అరవడంతో వంశీ ఉలిక్కిపడి లేచాడు. ఏమీ అర్థం కాలేదు. ‘పెరట్లో ఉడుత, కాకి, కోతులు మాట్లాడడం అంతా కలా? ఎంత బాగుంది కల’ అనుకుంటూ ఒక్క ఉదుటున లేచి పెరట్లోకి పరుగుతీశాదు. జామచెట్టు మీద ఉడుత ఏదో కొరుకుతూ కనిపించింది. ‘అమ్మ దొంగా! కల్లో మేం కూడా విత్తనాలు నాటుతాం అని పాఠం చెప్పి, ఇప్పుడేమో ఏమీ తెలీనట్లు అమాయకంగా చూస్తావా?’ అని వంశీ అంటుంటే వెనకే ఉన్న అమ్మ నవ్వింది. -
శివయ్య ప్రసాదం.. మూగజీవులకు ఆహారం
రాజంపేట టౌన్ (అన్నమయ్య జిల్లా): కార్తీక మాసం సందర్భంగా వందలాది మంది భక్తులు శివాలయాలకు తరలి వచ్చి దీపాలను వెలిగించి స్వామివారికి పండ్లను ప్రసాదంగా ఉంచుతారు. ఆ పండ్లను భక్తులు తమ వెంట తీసుకెళ్లకుండా అక్కడే ఉంచి వెళ్లిపోతారు. వందలాది మంది భక్తులు వదిలి వెళ్లే వివిధ రకాల పండ్లు పెద్ద సంఖ్యలో ఉంటాయి. ప్రధానంగా భక్తులు దీపాలను వెలిగించాక స్వామివారికి అరటి పండ్లను ప్రసాదంగా పెడతారు. ఒక్క రాజంపేట పట్టణంలోని శివాలయంలోనే కార్తీక సోమవారం రోజు ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులు స్వామివారికి ప్రసాదంగా పెట్టే అరటి పండ్లు వేల సంఖ్యలో ఉంటాయి. ఈ కారణంగా కొన్ని గంటల వ్యవధిలోనే ఆలయ ప్రాంగణమంతా వేల సంఖ్యలో అరటి పండ్లు పడి ఉంటాయి. అయితే ఈ పండ్లు నిరుపయోగమవుతున్నాయని పట్టణంలోని ఈడిగపాళెంకు చెందిన నరసింహా అనే ఎలక్ట్రీషియన్ గుర్తించాడు. పండ్లను మూగజీవులకు ఆహారంగా పెడితే ఒక రోజు అయినా అవి కడుపు నింపుకోగలవన్న ఆలోచన ఆయనలో తట్టింది. అనుకున్నదే తడవుగా తన షాపునకు చుట్టుపక్కల ఉండే చిరు వ్యాపారులు, దినసరి కూలీల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లి, భక్తులు శివాలయ ప్రాంగణంలో ఎక్కడ పడితే అక్కడ వదిలిన అరటి పండ్లను ఏరుకొని మూగజీవులకు ఆహారంగా పెడతామని చెప్పాడు. వారు కూడా నరసింహా ఆలోచన సరైనదేనని భావించి కార్తీక మాసంలో భక్తులు శివాలయంలో స్వామివారికి ప్రసాదంగా పెట్టే అరటి పండ్లతో పాటు కొబ్బెర చిప్పలను మూగజీవులకు ఆహారంగా పెట్టేందుకు ముందుకు వచ్చారు. 2016వ సంవత్సరం నుంచి కరోనా సమయంలో మినహా ప్రతి ఏడాది కార్తీక మాసంలో నరసింహాతో పాటు చిరువ్యాపారులు, దినసరి కూలీలైన వెంకటనరసయ్య, రమణ, బీవీ సురేంద్ర, ఉమాశంకర్‌లు శివాలయంలోని అరటి పండ్లను గోతాల్లో వేసుకొని ప్రత్యేక వాహనంలో రాపూరు ఘాట్‌లో ఉండే కోతులకు ఆహారంగా పెడుతున్నారు. కార్తీక మాసంలో ప్రతి మంగళవారం ఈ చిరు వ్యాపారులు, దినసరి కూలీలు తమ పనులను సైతం మానుకొని ఆటో బాడుగను కూడా వారే భరించి మూగజీవులకు చేస్తున్న సేవకు పట్టణ వాసులచే ప్రసంశలు, అభినందనలు అందుకుంటున్నారు. రాపూరు ఘాట్‌లో కోతులు పెద్ద సంఖ్యలో ఉంటాయని, వాటికి ఎవరు కూడా ఆహారం పెట్టే పరిస్థితి ఉండదని అందువల్ల ప్రతి ఏడాది కార్తీకమాసంలో ఈసేవా కార్యక్రమం చేపడుతున్నట్లు వారు తెలిపారు. (క్లిక్ చేయండి: వెయ్యేళ్ల అన్నమయ్య ‘కాలి’బాట.. ఎక్కడుందో తెలుసా!) -
వైరల్ వీడియో: కార్ పై ప్రయోగం చేస్తున్న కోతులు
-
Telangana: కోతుల బెడద మార్చిన పంట విధానం
తెలంగాణ రాష్ట్రంలో కోతుల బెడదతో ఏటా వేలకోట్ల విలువగల పంటలకు నష్టం వాటిల్లుతోంది. కోతులకు భయపడి రైతులు కొన్ని పంటలు వేయడం లేదు. ముఖ్యంగా వేరుశనగ, మొక్కజొన్న వంటి పంటలూ, కొన్ని చోట్ల వరిపంటలు కూడా వేయడం లేదు. పండ్ల తోటలు, కూరగాయల పంటల సంగతి ఇక చెప్పవలసిన పనే లేదు. పంట పూర్తిగా కోతకు రాకముందే కోతుల మందలు వచ్చి నాశనం చేస్తున్నాయి. రాష్ట్రంలో కోతులవల్ల ఏకంగా పంటల విధానమే మారిపోయిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ఊహించవచ్చు. వరి, పత్తి మినహా మరే పంట పండించే పరిస్థితి లేదు. పప్పుధాన్యాలు, నూనెగింజలు కోతుల బెడదతో విస్తీర్ణం తగ్గాయి. కోతులు ఏడాదికి 2 లేదా 3 పిల్లలకు జన్మనిస్తాయి. అందువల్ల వీటి సంఖ్య వేగంగా పెరుగు తోంది. ఆహారం కొరకు మందలు మందలుగా వచ్చి ఎంతకైనా తెగబడతాయి. ఇంట్లో దూరి ఆహార వస్తువు లతోపాటు ఇతర వస్తువులను కూడా నాశనం చేస్తున్నాయి. మనుషులపై దాడిచేసి, గోళ్ళతో గీకి, పండ్లతో కొరికి గాయపరుస్తున్నాయి. వీటితో గాయాలపాలైన వారు కోలుకోవడం ఖర్చుతో కూడిన పని. రాష్ట్ర ప్రభుత్వం నిర్మల్‌లో కోతుల రక్షణ కేంద్రం ఏర్పాటుచేసి వాటి పుట్టుకను నియం త్రిస్తున్నామని ప్రకటించింది. కానీ ఇప్పుడు ఆ కేంద్రం పనిచేయడం లేదు. సర్వే చేసి రూ. 2.25 కోట్లు వ్యయం చేసి కోతులను పట్టుకొని వాటికి పిల్లలు పుట్టకుండా స్టెరిలైజ్ చేస్తున్నామనీ, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, నిర్మల్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ల్యాబ్స్ ఏర్పాటు చేస్తామనీ అటవీశాఖా మంత్రి చెప్పారు. కోతులను అడవుల్లోకి పంపడానికి పండ్ల చెట్లను నాటుతామనీ, తద్వారా వీటి బాధను తగ్గిస్తామనీ 2017 నవంబర్‌లో ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. కానీ ఇది ఆచరణలోకి రాలేదు. కోతులు హైదరాబాద్‌లో అనేక ఇండ్లల్లోకి దూరి నష్టాలు కలిగి స్తున్నాయి. ముఖ్యంగా స్లవ్‌ు ఏరియాల్లో పేదల ఇండ్లల్లో తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. వీటిద్వారా కొత్త జబ్బులు కూడా ప్రజలకు సోకు తున్నాయి. ఒక సర్వేలో 50 శాతం కోతులకు జబ్బులున్నాయనీ, అవి గ్రామాల్లో, పట్టణాల్లో తిరగడం ద్వారా ఆ జబ్బులు మనుషులకు వ్యాపింప చేస్తున్నాయనీ తేలింది. ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం కోతుల బెడదను నివారించడనికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించలేదు. రోడ్లపక్కన చెట్లునాటడం, గ్రామాల్లో హరితహారం పేరుతో చెట్లు నాట డానికి వందలకోట్లు ఖర్చు చేస్తున్నారు. ఆ నాటిన చెట్లు కూడా ఎందుకూ ఉపయోగం కానివి. అవి ఎలాంటి కాయలుగానీ, పండ్లుగానీ చివరకు పూలుగానీ ఇచ్చేవికావు. వీటివల్ల కోతులు వెళ్తాయని ప్రభుత్వం చేస్తున్న ప్రచారం హాస్యాస్పదంగా వుంది. రాష్ట్రంలో 62 లక్షల ఎకరాల్లో అడవులున్నాయి. ఈ అడవుల్లో 40 శాతం భూమిలో ఎలాంటి చెట్లు చేమా లేవు. విలువైన టేకు, నల్లమద్ది లాంటి చెట్లను నరికివేసి స్మగ్లర్లు పట్టణాలకు అమ్ముకున్నారు. అడవిలో ఉన్న విప్ప, తునికి, అడవి మామిడి, పరికి, ఉసిరికాయల చెట్లు వంటి వాటిని పూర్తిగా లేకుండా చేశారు. కోతులకే గాక ఏ అడవి జంతువులకూ ఆహారం దొరకకుండా చేశారు. అందువల్ల అడవి పందులు, చివరికి చిరుతపులులు కూడా గ్రామాల్లోకి వస్తున్నాయి. దశాబ్దం క్రితంవరకు ఏ అడవి జంతువులు గ్రామాల్లోకి రాలేదు. కోతులపై పరిశోధ నలు చేసే పేరుతో, వాటి రక్తం సేకరించే పేరుతో కొన్ని ప్రైవేటు కంపెనీలు అడవుల్లో కోతులను పట్టి మందలకు మందలు పట్టణా లకు తెచ్చారు. ఇక్కడ పరిశోధన జరిగిన తర్వాత వాటిని తిరిగి అడవుల్లో విడిచిపెట్టమని చెప్పినప్పుడు... వాటిని తీసుకెళ్లే వ్యక్తులు అడవిదాకా వెళ్లకుండానే, గ్రామాల్లోనే విడిచిపెట్టారు. అవి సంతాన వృద్ధి చేసుకొని గ్రామాలు వదిలిపెట్టకుండా వుంటున్నాయి. ఇది రైతులకు, గ్రామస్థులకు శాపంగా మారింది. (క్లిక్: డియాగేట్‌కు గుమ్మడికాయ కడదాం!) రైతులు ధైర్యంగా వచ్చే వానాకాలం నాటికి అన్ని రకాల పంటలు వేసేవిధంగా అవకాశం కల్పించాలంటే కోతులు, పందుల బెడదను పూర్తిగా నివారించాలి. ఆ హామీ ప్రభుత్వం ఇవ్వాలి. కోతుల బెడదతో ప్రాథమిక రంగమైన వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతింటున్నది. ఇందువల్ల మొత్తం పారిశ్రామిక, సేవారంగాలు దెబ్బతింటాయన్న ఆర్థిక సూత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి. (క్లిక్: ఆహార స్వావలంబన విధాన దిశగా...) - సారంపల్లి మల్లారెడ్డి ఉపాధ్యక్షులు, అఖిల భారత కిసాన్ సభ -
‘పునరుత్పత్తి’ అధ్యయనానికి...అంతరిక్షంలోకి కోతులు
బీజింగ్: అంతరిక్ష ప్రయోగాల విషయంలో ఇప్పటిదాకా ఏ దేశమూ చేయని ప్రయత్నాన్ని డ్రాగన్ దేశం చైనా చేస్తోంది. గురుత్వాకర్షణ రహిత స్థితిలో జీవుల పునరుత్పత్తి జరుగుతుందా? అసలు అంతరిక్షంలో సంభోగం సాధ్యమేనా? అనేది తెలుసుకోవడానికి సన్నద్ధమవుతోంది. ఇందుకోసం కోతులను అంతరిక్షంలోకి పంపించాలని నిర్ణయించింది. ‘చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్’ ఈ ప్రయోగాన్ని పర్యవేక్షిస్తోంది. చైనా సొంతంగా ‘తియాంగాంగ్’ పేరిట స్పేస్ స్టేషన్‌ను నిర్మించుకున్న సంగతి తెలిసిందే. ఈ స్టేషన్‌లోని వెంటియన్ మాడ్యుల్‌లోకి కోతులను పంపించనున్నారు. గురుత్వాకర్షణ శక్తి ఏమాత్రం లేనిచోట వాటి ప్రవర్తనను అధ్యయనం చేస్తారు. భార రహిత స్థితిలో వాటి మధ్య సంభోగం, ఆడ కోతుల్లో పునరుత్పత్తి జరుగుతాయో లేదో తెలుసుకుంటారు. చంద్రుడు, అంగారకుడిపై నివాసాలు ఏర్పాటు చేసుకొనే దిశగా ఇప్పటికే పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అంతరిక్షంలో కోతుల పునరుత్పత్తిపై చైనా చేస్తున్న ప్రయోగాల ఫలితాలు కీలకంగా మారుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. చైనా తియాంగాంగ్ స్పేస్ స్టేషన్ ప్రస్తుతం భూమి నుంచి 388.9 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. ఇందులోని వెంటియన్ మాడ్యుల్లో ప్రస్తుతం ఆల్గే, చేపలు, నత్తలు వంటి చిన్న జీవులు జీవించడానికి అవకాశం ఉంది. కానీ, అవసరమైతే పెద్ద జీవులకు తగ్గట్లుగా పరిణామం పెంచుకొనేలా మాడ్యూల్‌ను డిజైన్ చేశారు. స్పేస్ స్టేషన్లోకి కోతులను పంపించగానే సరిపోదు, వాటికి ఆహారం అందజేయడం, ఆరోగ్యాన్ని కాపాడడం, వాటి వ్యర్థాలను నిర్వీర్యం చేయడం పెద్ద సవాలేనని చెప్పొచ్చు. -
గుట్టలు గుట్టలుగా కోతుల మృతదేహాలు.. అసలు ఏం జరిగింది?
కవిటి(శ్రీకాకుళం జిల్లా): కవిటి మండలంలోని శిలగాం వద్ద అల్లేరు కాలనీ సమీపంలో మంగళవారం ఉదయం 45 వానరాల(కోతులు) కళేబరాలు కనిపించడం స్థానికంగా కలకలం సృష్టించింది. ఇక్కడికి సమీపంలోని ఉద్దానం ప్రాంతంలో సాధారణంగా కొండముచ్చులు ఎక్కువగా తిరుగుతుంటాయి. కోతుల సంచారం తక్కువగా ఉంటుంది. అలాంటిది శిలగాం గ్రామం వెలుపల ముళ్లపొదల్లో ఒకేచోట 45 వానరాల మృతదేహాలు గుట్టగా కనిపించడంతో స్థానికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. చదవండి: విజయవాడ మీదుగా 100 ప్రత్యేక రైళ్లు గ్రామ సచివాలయ ఉద్యోగులు ఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించారు. ఈ కోతులను చనిపోయాక ఎవరో సోమవారం అర్ధరాత్రి తీసుకువచ్చి పడేసినట్లుగా ఉందని స్థానికులు చెబుతున్నారు. మండల పశువైద్యాధికారి డాక్టర్ బి.శిరీష బృందం వానర కళేబరాలకు పోస్టుమార్టం నిర్వహించింది. నమూనాలను ప్రయోగశాలకు పంపించినట్లు డాక్టర్ తెలిపారు. వానరాల శరీరం అంతా తీవ్రగాయాలతో ఉన్నాయని, వాటిలో గర్భం దాల్చినవి కూడా ఉన్నాయని చెప్పారు. చాలావరకు వానరాల పిల్లలే మృత్యువాత పడ్డాయన్నారు. -
Bio Fence: అప్పుడు ఖర్చు 40 వేలు.. ఇప్పుడు 1500.. కోతుల బెడద లేదు! అదనపు ఆదాయం..
కోతుల నుంచి, అడవి పందుల నుంచి లేదా సాధారణ పశువుల నుంచి పంటలను రక్షించుకోవటం తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో రైతులకు కత్తి మీద సాములా మారింది. ఈ సమస్యకు ఇనుప కంచెలు, సోలార్ విద్యుత్ కంచెలు ఏర్పాటు చేసుకొని రైతులు పంటలను కాపాడుకునే ప్రయత్నం చేస్తుంటారు. అయితే, వాటి కన్నా బంజరు భూముల్లో పెరిగే బ్రహ్మజెముడు జాతికి చెందిన ముళ్ల మొక్కలను పొలం చుట్టూతా కంచెగా నాటుకుంటే మేలని మహారాష్ట్రకు చెందిన జగన్ ప్రహ్లాద్ భగడే అనుభవపూర్వకంగా చెబుతున్నారు. ఆయనది అకోలా జిల్లాలోని ఖపర్వాది బద్రుక్ గ్రామం. ఆయనకు 30 ఎకరాల సాగు భూమి ఉంది. ‘ఏ పంట వేసినా నీల్గాయ్, దుప్పులు, అడవి పందులు, కోతులు, పశువులు పాడు చేస్తూ ఉండేవి. ఎకరం పొలం చుట్టూ ఇనుప కంచె వేశాను. ఏడేళ్ల క్రితమే రూ. 40 వేలు ఖర్చయ్యింది. ఇక మొత్తం పొలం చుట్టూ కంచె వెయ్యాలంటే ఉన్న భూమిలో కొంత భాగాన్ని అమ్ముకోవటం తప్ప వేరే మార్గం లేదు. బంజరు భూముల్లో కనిపించే కాక్టస్/బ్రహ్మజెముడు జాతి (యుఫోర్బియా లాక్టియా)కి చెందిన మొక్కల్ని పొలం చుట్టూ నాటాను. ఎకరానికి మహా అయితే రూ. 1,500 ఖర్చయ్యింది. అది కూడా కూలీలకు మాత్రమే. ఏడేళ్ల తర్వాత ఇప్పుడు మా పొలం చుట్టూ దట్టంగా అల్లుకున్న ఆకుపచ్చని ముళ్ల కంచె దుర్భేద్యమైన కోటలాగా నిలబడి ఉంది. కోతులు, అడవి జంతువుల బెడద అన్న మాటే లేదిప్పుడు. ఏ పంటైనా చేతికొస్తుందో లేదన్న బెంగ లేదు. అందరూ ఆశ్చర్యపడేంత స్థాయిలో పంటల దిగుబడి వస్తోంది. అంతేకాదు, బలమైన గాలుల నుంచి, చీడపీడల నుంచి పంటలను, మట్టిని రక్షించుకోగలుగుతున్నాను’అంటున్నారు బగడే సగర్వంగా. చుట్టుపక్కల బంజరు భూముల్లో నుంచి కాక్టస్ జాతి ముళ్ల మొక్కల కాండాలను కోసి ట్రాక్టర్ ట్రక్కులో వేసుకొని తెచ్చి.. 2 అడుగుల పొడవు ముక్కలను కత్తిరించి.. అడుగుకు ఒకటి చొప్పున పొలం చుట్టూతా నాటారు. మొదట్లో అందరూ అతన్ని పిచ్చోడు అని ఎగతాళి చేశారు. ఇప్పుడు నిశ్చింతగా పంట చేతికివస్తుంటే ఎంత తెలివైన పని చేశాడని పొగుడుతున్నారు. కట్టెలతో, బార్బ్‌డ్ వైర్‌తో లేదా రాళ్లతో కంచెను ఏర్పాటు చేసుకోవటం కన్నా దట్టంగా అల్లుకుపోయి 12 అడుగుల ఎత్తు వరకు ఎదిగిన ఈ జీవ కంచే (బయో ఫెన్స్) ఎంతో బాగుందని అందరూ అంటున్నారు. కాక్టస్ జాతి ముళ్ల మొక్కల కాండాల 2 అడుగుల ముక్కలను నాటి.. తొలి దశలో శ్రద్ధ తీసుకోవాలి. అప్పుడప్పుడూ ఎరువు వేస్తూ ఉంటే చాలు. ఒకటి రెండు ఏళ్లలో దాదాపుగా 5 అడుగుల ఎత్తు పెరుగుతాయి. ఆ తర్వాత ఇక వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం గాని, నీరు పెట్టాల్సిన అవసరం గానీ ఉండదు. ‘పొలంలో, పరిసర ప్రాంతాల్లో వాన నీటి సంరక్షణ పనులు గ్రామస్తులం కలసి చేసుకున్నాం. భూగర్భ జలమట్టం బాగా పెరిగింది. ఇప్పుడు నీటికి కరువు లేదు. దానితో పాటు జీవ కంచె కూడా విజయవంతం కావటంతో రైతులకు మా పొలం దర్శనా స్థలంగా మారిపోయింది..’ అంటున్నారు బగడే ఆనందంగా. తలవని తలంపుగా మరో ఉపయోగం కూడా చేకూరింది. జీవ కంచె పైకి కాకర, చిక్కుడు, సొర, బీర వంటి తీగజాతి కూరగాయ మొక్కల్ని పాకించి అదనపు ఆదాయం పొందే అవకాశం కూడా అందివచ్చింది! నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
పోలీసులకు రక్షణగా ‘పాములు’!! ఎక్కడంటే..
ఇడక్కి(కేరళ): సమాజంలో శాంతిభద్రతలను కాపాడే రక్షక భటులను వానర దండు నుంచి కాపాడేవారే లేరు. తమిళనాడు సరిహద్దు ప్రాంతం వెంట కేరళలోని అటవీప్రాంతంలోని కుంబుమెట్టు పోలీస్ స్టేషన్‌పై కోతుల గుంపులు దూసుకొచ్చి నానా హంగామా చేయడం అక్కడ నిత్యకృత్యమైంది. ప్రజల సమస్యలకు పరిష్కారం చూపే పోలీసులకు తమ సమస్యకు ఎలా చెక్ పెట్టాలో తెలియక తెగ హైరానా పడ్డారు. వీరికి స్థానికంగా యాలకులు సాగు చేసే ఒక రైతు చక్కని ఉపాయం చెప్పి ఆదుకున్నాడు. చైనా తయారీ రబ్బర్ పాములను రంగంలోకి దించారు. కోతుల గుంపులు బీభత్సం సృష్టిస్తున్న పోలీస్‌స్టేషన్ పై కప్పుపై, స్టేషన్ ప్రాంగణంలోని కూరగాయల తోటలో, స్టేషన్ గ్రిల్స్‌కు, చెట్లకు ఇలా పలు చోట్ల రబ్బర్ పాములను ఉంచారు. దీంతో పాములను చూసి హడలిపోయిన కోతులు స్టేషన్ పరిసరాలకు రావడం మానేశాయని పోలీస్‌స్టేషన్ సబ్–ఇన్స్పెక్టర్ పీకే లాల్‌భాయ్ ఆనందం వ్యక్తంచేశారు. చాలా సంవత్సరాలుగా స్టేషన్‌ను వేధిస్తున్న ఈ సమస్యకు సర్పాల రూపంలో పరిష్కారం దొరకడం సంతోషకరమని సునీశ్ అనే పోలీసు అన్నారు. అడవి జంతువులను హడలగొట్టేందుకే తమ సాగుభూమిలో అమలుచేస్తున్న చిట్కానే వీరికి చెప్పానని ఉదంబన్చోళ తాలూకాకు చెందిన ఒక రైతు వెల్లడించారు. చదవండి: 70 ఏళ్ల తర్వాత భారత గడ్డపై.. -
రైతు వేసిన కొత్త ఎత్తు.. ఉస్కో ఉస్కో.. అదిగోరా కోతి.. ఇదంతా ఏంటీ?
పిఠాపురం(కాకినాడ జిల్లా): ఆ పొలంలోకి వెళితే ఉస్కో ఉస్కో.. అదిగోరా కోతి.. అలా రా.. అలా రా...! అంటూ మనిషి కేకలు వినిపిస్తుంటాయి. అలాగని ఎంత వెతికినా ఒక్క మనిషీ కనిపించడు. తీరా చూస్తే అక్కడ ఒక కర్రకు కట్టిన లౌడ్ స్పీకర్ నుంచి ఆ కేకలు వినిపిస్తుంటాయి. ఇదంతా ఏంటా? అని అనుకుంటున్నారా! కోతుల నుంచి పంటలను రక్షించుకునేందుకు రైతులు వేసిన కొత్త ఎత్తు. గొల్లప్రోలు మండలం చెందుర్తిలో ఒక రైతు తన మొక్క జొన్న పంటకు రక్షణగా ఏర్పాటు చేసిన లౌడ్ స్పీకర్. (అంతర చిత్రం) అరుపులకు భయపడి పొలానికి దూరంగా ఉన్న షెడ్ పైనే ఉండి పోయిన కోతులు ఇప్పటి వరకు రేకు డబ్బాలు, ఫ్యాన్లు వంటివి ఉపయోగించే రైతులు ప్రస్తుతం బ్యాటరీతో పని చేసే లౌడ్ స్పీకర్లను వాడుతూ తమ పంటలను రక్షించుకుంటున్నారు. ఇది చూసిన స్థానికులు ఔరా! అంటున్నారు. తాను పొలంలో ఉన్నంత సేపు చార్జింగ్ పెట్టి తాను ఇంటికి వెళ్లేటప్పుడు ఆన్ చేసి వదిలేస్తే మళ్లీ తాను తిరిగొచ్చే వరకు ఇది అరుస్తూ తన పంటను కాపాడుతోందంటున్నాడు రైతు. చదవండి: యువతిపై అత్యాచారం.. సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటపెడతానంటూ.. -
UP News: కటౌట్ చూసి పరిగెత్తాలి డ్యూడ్
కటౌట్లంటే రాజకీయ నాయకులకు, సినిమా వాళ్లకు భారీ ప్రచారమనే విషయం చెప్పనక్కర్లేదు. కానీ, వైవిధ్యమైన ఆలోచనలు ఎప్పుడూ జనాల ఆసక్తిని తమ వైపు మళ్లించుకుంటాయి. ఉత్తర ప్రదేశ్‌లో తాజాగా అలాంటి దృశ్యమే ఒకటి కనిపించింది. యూపీ మీరట్‌లో కోతులను తరిమేందుకు అటవీ అధికారులు.. కొండముచ్చుల (కొండెంగల) కటౌట్లను ఉంచారు. మరి ఈ ఐడియా ఫలితం ఇచ్చిందా?.. ఇచ్చిందనే అంటున్నారు డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ రాజేశ్ కుమార్. ప్రయోగం మంచి ఫలితాన్ని ఇచ్చిందని, చిన్నచిన్న మార్పులతో ముందుకు వెళ్తామని ఆయన తెలిపారు. కోతుల బెడదతో ఇళ్ల నుంచి బయట అడుగు పెట్టేందుకే జనాలు వణికిపోయిన రోజులున్నాయి. ఈ తరుణంలో అధికారులు ఇలా కటౌట్ల ప్రయోగంతో కోతుల్ని తరమడం విశేషం. ఇదివరకు లక్నో మెట్రో స్టేషన్లో ఇలా కొండముచ్చుల Langoor Cutouts కటౌట్లతో ఫలితం రాబట్టారు అధికారులు. అదే చూసే మీరట్ అధికారులు ఈ పని చేశారు. అఫ్కోర్స్.. ఇదేం కొత్త ఐడియా కాదు.. చాలా చోట్ల చూసే ఉంటారు. -
అంతా మా ఇష్టం.. ఎయిర్పోర్ట్ దగ్గర వానరాల హల్చల్
-
వినూత్నం.. కోతులు ‘బేర్’మన్నాయి!
కోహెడ రూరల్ (హుస్నాబాద్): ఓ వైపు ప్రకృతి వైపరీత్యాలు, మరోవైపు వన్య ప్రాణుల దాడులు. రైతు తమ పంటను కాపాడుకోడానికి నానా తంటాలు పడుతున్నారు. ఇలాగే కోతులు, అడవి పందుల నుంచి తన పంటను కాపాడు కోవడానికి ఓ రైతు వినూత్నంగా ఆలోచించాడు. ఎలుగుబంటి వేషధారణ ద్వారా పంటలను కాపాడుకోవచ్చని గుర్తించాడు. కోహెడ మండలం నాగసముద్రాల గ్రామానికి చెందిన రైతు భాస్కర్‌రెడ్డి కోతుల బెడద ఎక్కువ కావడంతో హైదరాబాద్‌లో రూ.10 వేలు వెచ్చించి ఎలుగుబంటి వేషధారణను తయారు చేయించాడు. పంట రక్షణగా ఉదయం, సాయంత్రం కోతుల గుంపు, అడవి పందులు రాకుండా ఎలుగుబంటి వేషధారణ కోసం కూలీని పెట్టుకుని రోజుకు అతనికి రూ.500 చెల్లిస్తూ పంటకు కాపలా కాయిస్తున్నాడు. ఒకసారి ఎలుగుబంటి వేషధారణతో కోతులను తరిమితే పది రోజుల వరకు పంటల వైపు రావడం లేదని రైతులు చెబుతున్నారు. (చదవండి: అకాల వర్షంతో పంట నష్టం) -
హరహర మహదేవ!‘మహా’ ప్రసాదం (ఫోటోలు)
-
కోతిపిల్లను వేటాడి చంపిన కుక్కలు, ప్రతీకారంతో 250 కుక్కల్ని..
కోతులే కదా అని తీసిపారేస్తే ఏం చేస్తాయో చూపిస్తున్నాయి వానరాలు. తమకు పగ ఏర్పడితే ఎంత దూరమైనా వెళ్తామని జబ్బలు చరుస్తున్నాయి. ప్రాణమున్న ప్రతిజీవికి కోపం రావడం, దానికి కారకులపై పగ కలగడం సహజం. కానీ అన్ని పగాప్రతీకారాలు ఒకేలా ఉండవు. సదరు జీవి శక్తిని బట్టి, అవకాశాన్ని బట్టి, కలిగిన దుఃఖ బాధ తీవ్రతను బట్టి ప్రతీకార విస్తృతి మారుతుంది. ఉదాహరణకు రాముడి పగ రావణ సంహారంతో ఆగలేదు. రాక్షస వంశాన్ని దాదాపు తుడిచి పెట్టింది. ఆయనంటే సర్వసమర్థుడు కాబట్టి ఆ స్థాయిలో పగ తీర్చుకున్నాడు. కానీ సాధారణ ప్రాణికి దుఃఖం, కోపం కలిగించినా ప్రతీకారం తీర్చుకునే శక్తిలేక ఊరుకోవడమే ఎక్కువగా కనిపిస్తుంది. కానీ రామ బంట్లుగా భావించే కోతులు మాత్రం తమకు కలిగిన బాధకు గట్టిగా ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఎంతైనా మనకు పూర్వీకులు కదా! వాటికి తెలివితేటలు ఎక్కువే. అందుకే పక్కాగా తమ ప్రత్యర్ధి వర్గంపై దాడులు చేసి వంశనాశనానికి పూనుకున్నాయి. ఇంతకూ ఇవి పగ తీర్చుకున్నది ఎవరిమీదన్నదే డౌటు కదా! వీటి వర్గ శత్రువులు కుక్కలే! ఫ్యాక్షన్ సినిమా స్టోరీని తలపించే ఈ కథ మహారాష్ట్రలోని బీడ్ జిల్లా మజల్గావ్లో జరిగింది. ఏం జరిగింది? కోతులు వర్సెస్ కుక్కల పోరాటానికి కొన్నాళ్ల క్రితం జరిగిన ఘటన బీజం వేసిందని మజల్గావ్ గ్రామస్తులు తెలిపారు. గతనెల్లో కొన్ని కుక్కలు ఒక కోతిపిల్లను వేటాడి చంపాయి. ఇది కోతుల మందలన్నింటినీ బాధించిందని, దీంతో అప్పటి నుంచి అవి కుక్కలపై మెరుపుదాడులకు దిగాయని తెలిపారు. ముఖ్యంగా కుక్కపిల్లలు కనిపిస్తే వెంటనే వాటిని ఎత్తుకుపోయి ఎత్తైన బిల్డింగ్ లేదా చెట్ల మీద నుంచి చచ్చేలా విసిరికొట్టడం ఆరంభించాయన్నారు. అలాగే పెద్ద కుక్కలు ఒంటరిగా కనిపిస్తే మందగా వెళ్లి దాడి చేసి చంపేస్తున్నాయన్నారు. వీటి దెబ్బకు దాదాపు 250 కుక్కలు ప్రాణాలు పోగొట్టుకున్నాయని, గ్రామంలో కుక్క అన్నది కనిపించకుండా పోయిందన్నారు. కోతుల అరాచకంపై అటవీశాఖకు ఫిర్యాదు చేశామని, వారు వచ్చి పరిస్థితి చూసినా, కోతులను పట్టడంలో విఫలమై వెనుదిరిగారని గ్రామస్తులు వివరించారు. క్రమంగా కోతులు కేవలం కుక్కలపైనే కాకుండా గ్రామస్తుల పిల్లలపై దాడులకు దిగుతున్నాయని వాపోయారు. లాక్డౌన్ కారణంగా వీటికి సరైన తిండి దొరకకపోవడంతో కోతుల్లో ఆగ్రహం పెరిగి ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత సెప్టెంబర్‌లో కర్ణాటకలో ఒక గ్రామంపై పగపట్టిన కోతి 22 కి.మీ.లు ప్రయాణించి ఆ ఊరికి చేరుకొని బీభత్సం సృష్టించింది. -
కోతులకు ఆహారం పెట్టొద్దు!
కొరాపుట్: కోతులకు ఆహారం పెట్టొద్దంటూ కొరాపుట్-జయపురం ఘాటీలో జిల్లా అధికార యంత్రాంగం సైన్ బోర్డులు ఏర్పాటు చేసింది. కలెక్టర్ మహ్మద్ అబ్దుల్ అక్తార్ ఆదేశాల మేరకు వీటిని సోమవారం ఏర్పాటు చేశారు. ఇదే మార్గంలోని మలుపుల వద్ద వాహనదారులు తమ వాహనాలను నిలిపి, ఇక్కడి కోతులకు ఆహారం ఇస్తుండడంతో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, వీటిని నివారించేందుకే బోర్డులు ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. -
మన తోకలకు కత్తెర పడిందెలా?
మనిషికి, కోతికి పోలికలు ఎన్ని ఉన్నా.. ప్రధానమైన తేడా.. తోక! పూర్వీకులు ఒకరే అయినా.. మనిషి తోకలేకుండా ఎదిగితే.. కోతులు అలాగే ఉండిపోయాయి ఇది అందరికీ తెలిసిన విషయమే.. కానీ ఈ మార్పు జరిగిందెలా? యాభై కోట్ల ఏళ్ల క్రితం మన పూర్వీకులకు పొడవాటి తోక ఉండేది. చేపల మాదిరిగా ఈ తోకలను సముద్రాల్లో సులువుగా ఈదేందుకు వాడేవారు. కొన్నికోట్ల ఏళ్ల తర్వాత ఈ తోకలే.. చెట్టు కొమ్మలపై సమతులంగా నడిచేందుకు సాయపడ్డాయి. మరికొంత కాలం గడిచిన తరువాత అంటే.. సుమారు రెండున్నర కోట్ల ఏళ్ల క్రితం ఆ తోకలు మాయమైపోయాయి! ఈ విషయాన్ని అందరికంటే ముందుగా గుర్తించింది పరిణామ సిద్ధాంతకర్త చార్లెస్ డార్విన్. కానీ ఓ జన్యుమార్పు కారణంగా మన తోకలు మాయమైపోయాయని గుర్తించింది మాత్రం న్యూయార్క్‌కు చెందిన శాస్త్రవేత్తల బృందం. రెండు వారాల క్రితం ఈ పరిశోధన వివరాలు ఆన్లైన్లో ప్రచురితమయ్యాయి. ఆ వివరాలివీ.. మనిషి తన తోకను వదిలించుకోవడం పరిణామ క్రమంలో చాలా ముఖ్యమైన ఘట్టం. కోతులకు తోకలు ఉన్నా చింపాంజీలు, ఒరాంగ్ ఊటాన్ వంటి వానర జాతుల్లో మాత్రం తోకలు లేవు. కాకపోతే వాటిలో, మనలోనూ తోక తాలూకు అవశేషం కటి వలయం మధ్యన కొన్ని ఎముకల నిర్మాణం రూపంలో ఉంటుంది. ఇంగ్లిష్‌లో ఈ అవశేషాన్ని కోసిక్స్ అని పిలుస్తారు. ఇది తోక అవశేషం అనడంలో ఎలాంటి సందేహం లేదని డార్విన్ స్వయంగా స్పష్టం చేశారు కూడా. అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఆ తోక తొలగిపోయిందెలా? అన్న అంశంపై పరిశోధనలు జరిగాయి, జరుగుతున్నాయి కూడా. పలుచోట్ల తవ్వకాల్లో బయటపడ్డ పురాతన శిలాజాల ఆధారంగా చూస్తే.. కనీసం 6.6 కోట్ల ఏళ్ల క్రితం అన్ని వానర జాతుల్లో పూర్తిస్థాయిలో తోక వంటి నిర్మాణం ఉంది. కానీ రెండు కోట్ల ఏళ్ల క్రితం నాటి శిలాజాల్లో మాత్రం తోకల స్థానంలో కోసిక్స్ కనిపించాయి. ఈ పరిణామం ఎలా జరిగిందో తెలుసుకునేందుకు నూయార్క్ యూనివర్సిటీ శాస్త్రవేత్త బో షియా గత ఏడాది కొన్ని పరిశోధనలు చేపట్టారు. కొన్నిరకాల జంతువుల్లో తోకలు ఎలా ఏర్పడుతున్నాయో గుర్తించేందుకు ప్రయత్నించారు. పిండంగా ఉన్నప్పుడే కొన్ని మాస్టర్ జన్యువులు చైతన్యవంతం కావడం వల్ల వెన్నులోని భాగాలు మెడ, లంబార్ ప్రాంతంగా విడిపోతాయని.. పిండం ఒక చివరలో కనిపించే బొడిపెలాంటి నిర్మాణంలో ఎముకలు, కండరాలు, నాడులు అభివృద్ధి చెంది తోకలుగా మారతాయని బో గుర్తించారు. తోక ఏర్పడటంలో దాదాపు 30 జన్యువులు పనిచేస్తున్నట్టు గుర్తించారు. ఈ ముప్పై జన్యువుల్లో ఏదో ఒక జన్యువులో వచ్చిన మార్పుల ప్రభావం వల్లనే మనిషి తోకను కోల్పోయి ఉంటాడని అంచనా కట్టిన బో.. దాన్ని గుర్తించే ప్రయత్నం చేశారు. తోకల్లేని వానరాలు ఆరింటి డీఎన్ఏను, తోకలున్న తొమ్మిది రకాల కోతుల డీఎన్ఏతో పోల్చి చూసినప్పుడు ‘టీబీఎక్స్‌టీ’ అనే జన్యువులోని మార్పులు కారణమైనట్టు గుర్తించారు. ఈ మార్పులు మనుషులు, చింపాంజీల్లాంటి వానరాల్లో కనిపించగా.. తోకలున్న కోతుల్లో మాత్రం లేకపోవడం గమనార్హం. – సాక్షి, హైదరాబాద్ ఎలుకలపై ప్రయోగాలతో.. ‘టీబీఎక్స్‌టీ’ జన్యువులో వచ్చిన మార్పుల కారణంగానే మనకు తోకలు లేకుండా పోయాయా? అన్న విషయాన్ని స్పష్టంగా తెలుసుకునేందుకు బో షియా.. జన్యుమార్పులు చేసిన పలు ఎలుకలపై ప్రయోగాలు చేశారు. మనుషుల టీబీఎక్స్‌టీ జన్యువులో ఉన్న మార్పులే కలిగి ఉన్న ఎలుకల పిండాలు అభివృద్ధి చెందినప్పుడు.. చాలా వాటిలో తోకలు వృద్ధి చెందలేదు. కొన్నింటిలో తోకలు పెరిగినా వాటి సైజు చాలా చిన్నగా ఉండిపోయింది. ఈ ప్రయోగాల ఆధారంగా బో చెప్పేది ఏమిటంటే.. సుమారు రెండు కోట్ల ఏళ్ల క్రితం ఈ జన్యుమార్పు వానరాల్లో యాదృచ్ఛికంగా జరిగి ఉంటుందని, తర్వాత వారసత్వంగా కొనసాగడం వల్ల తోకలు లేకుండా పోయాయి అని!! కొసమెరుపు ఏమిటంటే.. తోకలు ఎలా పోయాయో తెలిసింది కానీ.. దీనివల్ల వచ్చిన లాభమేమిటన్న ప్రశ్నకు ఇంకా సమాధానం దొరకలేదు. -
మరికొద్ది గంటల్లో పెళ్లి, 5 తులాల నగలతో ఉడాయించిన కోతులు
సాక్షి, నర్సాపూర్(మెదక్): పెళ్లికి వెళ్లాలన్న హడావిడిలో ఐదు తులాల నగలను కోల్పోయిన ఉదంతమిది. శనివారం నర్సాపూర్ పట్టణానికి చెందిన బాధితుడు వడ్ల నర్సింలు స్థానిక విలేకరులతో మాట్లాడి తన బాధను వివరించారు. ఈ నెల 23న తన మేనకోడలు వివాహం మండలంలోని ఆద్మాపూర్ గ్రామంలో ఉండగా అదే రోజు ఉదయం తాను వెళ్లేందుకు పెళ్లికూతురుకు చెందిన రెండున్నర లక్షల రూపాయల విలువ చేసే ఐదు తులాల బంగారు నగలు ఒక కవరులో పెట్టి దానిని దుస్తుల సంచిలో పెట్టుకుని బైక్‌పై బయలు దేరానని చెప్పారు. కొంత దూరం వెళ్లాక మరికొన్ని వస్తువులు గుర్తుకురావడంతో వెనుదిరిగి వచ్చినట్లు చెప్పారు. బైక్‌ను ఇంటికి కొద్దిదూరంలో నిలిపి ఇంట్లోకి వెళ్లి వచ్చే సరికి కోతులు బైక్‌పై ఉన్న కవర్‌ను చిందర వందర చేశాయన్నారు. హడావిడిలో దుస్తుల కవర్‌ను సర్దుకొని ఆద్మాపూర్‌కు వెళ్లిన తర్వాత బంగారు నగల కోసం సంచిలో పరిశీలించగా అందులో లేవని తెలిపారు. దీంతో రెడిమేడ్ నగలతో పెళ్లి జరిపించామని నర్సింలు చెప్పారు. కోతులు బంగారు నగల కవరును ఎత్తుకుపోయి కవరును చించితే ఆ ముక్కలు దొరికేవని, చుట్టుపక్కల వెతికినా జాడా దొరకలేదని ఆయన చెప్పారు. 24న తమ ఇంటికి సమీపంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా తాను బైక్‌పై వెళ్లగానే ఓ ప్రభుత్వ శాఖకు చెందిన కొంతమంది సిబ్బంది అక్కడికి వచ్చి తచ్చాడారని, వారిపైన అనుమానంగా ఉందని నర్సింలు అన్నారు. 25న స్థానిక ఎస్ఐ గంగరాజుకు జరిగిన ఘటనను వివరించగా నీ అజాగ్రత్తగా నగలు పోగొట్టుకున్నందున కేసు నమోదు చేయలేనని చెప్పారని ఆయన తెలిపారు. సీసీ కెమెరాలలో రికార్డు అయిన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకుపోగా సంబధితశాఖ అధికారిని పిలిపించి మాట్లాడగా ఆ అధికారి తమ సిబ్బంది నగలు ఎత్తుకుపోలేదని చెబుతూ నన్నే అనుమానిస్తూ మాట్లాడారని నర్సింలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్ఐ వివరణ.. వడ్ల నర్సింలు బంగారు నగలు పోగొట్టుకున్న విషయాన్ని స్థానిక ఎస్ఐ గంగరాజుతో ప్రస్తావించగా అతను అజాగ్రత్తగా నగలు పోగొట్టుకున్నందున కేసు నమోదు చేయలేనని చెప్పానన్నారు. నగలు జాగ్రత్తగా పెట్టుకోవాల్సిందని ఆయన చెప్పారు. చదవండి: గదిలో మూత్రం పోశాడని తిట్టింది.. పగ పెంచుకుని -
Photo Feature: ‘సూపర్’ వ్యాక్సినేషన్ కంటిన్యూ
సూపర్ స్ప్రెడర్లుగా పేర్కొన్న వారికి తెలంగాణలో కోవిడ్ వ్యాక్సిన్లు వేస్తున్నారు. మే 28 నుంచి ఈ కార్యక్రమం కొనసాగుతోంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. కరోనా నుంచి కోలుకునే వారి సంఖ్య పెరుగుతోంది. అంతరిక్ష కేంద్రం ఏర్పాటుకు చైనా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. -
కోతుల కోసం విజయ్ ఫ్యాన్స్ ఏం చేశారో తెలిస్తే మెచ్చుకోకుండా ఉండరు..
చెన్నై : కరోనా సెకండ్ వేవ్ కారణంగా సామాన్య ప్రజలే కాదు..జంతువులు కూడా అల్లాడిపోతున్నాయి. సరైన ఆహారం అందక విలవిల్లాడిపోతున్నాయి. ఇప్పటికే కొందరు సెలబ్రిటీలు జంతువులు, పక్షుల సంరక్షణకు జాగ్రత్తలు వహించాలని సోషల్ మీడియా వేదికగా విఙ్ఞప్తులు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ అభిమానులు చేసిన ఓ మంచి పని ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే..దళపతి విజయ్ విజయ్ అభిమాన సంఘం మక్కల్ ఇయక్కం అనే పేరుతో తమిళనాడులో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాజాగా పుదుకోట్టై ప్రాంతంలో కోతుల కోసం ఓ వాటర్ ట్యాంక్ సహా అరటిపళ్లను ఏర్పాటు చేశారు. పుదుకోట్టై హనుమాన్ టెంపుల్‌కి సమీపంలో దాదాపు 300 కోతులు ఉన్నాయని, అయితే లాక్డౌన్ కారణంగా భక్తులు లేక కోతులకు ఆహారం అందడం లేదని సమాచారం. అంతేకాకుండా ఇదే ప్రాంతానికి దగ్గర్లో ఓ అటవీ ప్రాంతం ఉందని, అయితే వేసవి కావడంతో కోతులకు నీటి సదుపాయం లేక అల్లాడిపోతున్నాయని, అందుకే కోతుల కోసం ప్రత్యేకంగా దీన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. చదవండి : కరోనా విలయ తాండవం.. తళపతి విజయ్ ఔదార్యం కొంతమందిని కోల్పోయా: సోనూసూద్ భావోద్వేగం -
మానవత్వాన్ని చాటుకున్న తోట సురేష్
-
పంట చేలకు కోతుల బెడదా? ఇలా చేయండి
సాక్షి, గంభీరావుపేట(సిరిసిల్ల): పొట్టదశకొచ్చిన వరి చేలను కోతులు పీల్చి పడేస్తున్నాయి. పొలం గట్లపై గుంపులు గుంపులుగా తిరుగుతూ వరి కంకులను చిన్నాభిన్నం చేస్తున్నాయి. వెళ్లగొట్టడానికి ఎంత ప్రయత్నించినా మళ్లీ మళ్లీ వచ్చి పంటను నాశనం చేస్తున్నాయి. ఈ క్రమంలో గంభీరావుపేట మండలం నర్మాల గ్రామానికి చెందిన రాజబోయిన ఆంజనేయులు అనే యువ రైతు తన పొలంలో కొండెంగ బొమ్మను కాపలా పెట్టాడు. కొండెంగగా భావిస్తున్న కోతులు భయంతో అటు వైపు రావడం మానేశాయి. ఆంజనేయులు ఆలోచనను పలువురు అభినందిస్తున్నారు. తమ పొలంలోనూ అలాగే ఏర్పాటు చేసుకుంటామంటున్నారు. చదవండి: ప్రకృతి సేద్యం: పల్లెబాట పట్టిన సాఫ్ట్వేర్ యువ జంట -
బ్యాగులో కోతుల కళేబరాలు: మాంసం కోసం..
భువనేశ్వర్ : వన్యప్రాణుల సంరక్షణకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా..వేటగాళ్ల దుశ్చర్యలు ఆగడం లేదు. రాయిఘర్ సమితి టిమరపూర్ పంచాయతీ బినయపూర్ అటవీ ప్రాంతంలో వేటగాళ్లకు రెండు కోతులు బలైపోయాయి. ఫారెస్ట్ సిబ్బంది శుక్రవారం సాయంత్రం పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా కొందరు వ్యక్తులు వన్యప్రాణులను వేటాడుతూ కనిపించారు. వారిని పట్టుకునేందుకు సిబ్బంది ప్రయత్నించగా తప్పించుకుని పారిపోయారు. ఆ ప్రాంతంలో ఒక బ్యాగు, మోటారు బైక్‌ను విడిచిపెట్టి వెళ్లడంతో ఫారెస్ట్ అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. బ్యాగును పరిశీలించగా అందులో రెండు కోతుల కళేబరాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి కేసు నమోదు చేశారు. వారి సూచనల మేరకు మృతి చెందిన కోతులకు శనివారం అంత్యక్రియలు నిర్వహించారు. కోతి మాంసం విక్రయించేందుకే వాటిని చంపినట్లు ఫారెస్ట్ సిబ్బంది అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఫారెస్ట్ అధికారి శ్రీ దుక్కు తెలిపారు. -
తిండి కోసం కోతి తిప్పలు
సాక్షి, బాన్సువాడ: ఎండలు తీవ్ర రూపం దాల్చడంతో మూగజీవులకు అటవీ ప్రాంతంలో ఆహారం లభించక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. తాగడానికి నీరు లేక, పండ్లు ఫలాలు లేక మూగజీవులు రోడ్లపైకి వస్తున్నాయి. బాన్సువాడ–గాంధారిల మధ్య దట్టమైన అడవులు ఉండగా, ప్రస్తుతం ఆకులన్నీ రాలిపోయి, చెట్లు నీరు లేక ఎండిపోతున్నాయి. దీంతో ఈ అడవిలో ఉన్న వానరాలన్నీ నిత్యం కామారెడ్డి–బాన్సువాడ రోడ్డుపైనే కనిపిస్తున్నాయి. రహదారి వెంబడి వెళ్లే వారెవరైనా ఆహార వస్తువులను, పండ్లు ఫలాలను పడేస్తేనే తింటాయి. అలాగే ప్రస్తుతం వరి కోతలు ప్రారంభమవడంతో రైతులు రోడ్డుపై పంట నూర్పిళ్లను చేస్తున్నారు. నూర్పిళ్లు చేసిన పంటను రైతులు ఇంటికి తీసుకుపోతుండగా, రోడ్డు పక్క పడిన గింజలను తింటున్నాయి. అటవీ ప్రాంతాల్లో చెట్లు ఎండిపోవడంతో మూగజీవాలకు నిలువ నీడ లేకుండా పోయింది. బాన్సువాడ–నిజామాబాద్, బాన్సువాడ–కామారెడ్డి రోడ్లపై ఇరువైపులా ఉన్నమర్రి చెట్లపై వానరులు నివాసముంటూ, నిత్యం ఆహారం కోసం పడరాని పాట్లు పడడం గమనార్హం. స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో వానరాలకు ఆహారం ఇదిలాఉండగా, గత ఏడాది వానరాలు పడుతున్న పాట్లను చూసి చలించిన బాన్సువాడలోని పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ప్రతి ఆదివారం ప్రత్యేకంగా పండ్లు, ఫలాలను వానరాలకు అందజేశారు. ప్రత్యేక ఆటోల్లో వీరు పండ్లను తీసుకెళ్ళి వాటికి వేశారు. నీటి ప్యాకెట్లను సైతం అందజేశారు. వారాంతపు సంతలో కుళ్లిపోయిన కూరగాయలు, వృథాగా ఉన్న కూరగాయలను సైతం అడవులకు తరలించి వానరాలకు అందజేసే విధంగా స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ముందుకు రావాలి. చదవండి: ఉయ్యాలపై వృద్దుడి స్టంట్.. నెటిజన్లు ఫిదా! -
దక్షిణ భారతదేశంలో తొలిసారి..
సాక్షి, నిర్మల్ : కనిపించిన చెట్టునల్లా మనిషి నరుక్కుంటూ పోవడంతో వానరానికి తీరని కష్టమొచ్చింది. వనాలు అంతరించి పోతుండటంతో అవి జనాల్లోకి వచ్చాయి. ఒకప్పుడు పచ్చని చెట్లపై.. నచ్చిన పండ్లు తింటూ అడవుల్లో హాయిగా బతికిన కోతులు.. ఇప్పుడు ఇళ్ల ముందు పడేసిన ఎంగిలి మెతుకులను ఏరుకుని తింటున్నాయి. ఆకలికి తాళలేక కొన్నిచోట్ల ఇళ్లలోకి చొరబడుతున్నాయి. పంటచేలపైనా దాడి చేస్తున్నాయి. దీనిపై నాలుగేళ్ల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. సాక్షాత్తు సీఎం కేసీఆర్ పలు సభలు, సమావేశాల్లో కోతుల వల్ల దెబ్బతింటున్న పంటలపైన మాట్లాడారు. ఇల్లు పీకి పందిరి వేసినట్లే అటవీశాఖ 2016లో నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలోని చించోలి(బి) శివారులోని అటవీ ప్రాంతంలో పైలట్ ప్రాజెక్టుగా కోతుల సంతాన నియంత్రణ కేంద్రానికి స్థల నిర్ధారణ చేసింది. ఆ కేంద్రం ఎట్టకేలకు ఈ నెల 8న(మంగళవారం) రాష్ట్ర అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఇది దక్షిణ భారత్‌లోనే తొలి కేంద్రం కానుంది. ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే.. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో వీటి సంఖ్య విపరీతంగా ఉంది. ఒక్కో జిల్లాలో ప్రతీ సీజన్లో దాదాపు 200–300 ఎకరాల వరకు పంట నష్టం చేస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. పెంకులు ఉన్న ఇంటిపై కోతులు పడ్డాయంటే ఇక ఇల్లు పీకి పందిరి వేసినట్లే. కూరగాయలు, పండ్ల తోటలకు కోతులతో మరింత నష్టం జరుగుతోంది. దేశంలో రెండో రాష్ట్రం.. మన రాష్ట్రంలో ఉన్నట్లే దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో కోతుల సంఖ్య విపరీతంగా ఇబ్బంది పెడుతోంది. విరివిగా ఆపిల్‌పండ్లను పండించే హిమాచల్‌ప్రదేశ్‌లో వానరాలతో నష్టాలు పెరగడంతో అక్కడి ప్రభుత్వం వాటి సంతానోత్పత్తి నియంత్రణకు కేంద్రాలను ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే విధానాన్ని అనుసరించాలని నిర్ణయించింది. నిర్మల్ జిల్లా కేంద్రానికి సమీపంలో సారంగపూర్ మండలం చించోలి(బి) వద్ద అటవీ ప్రాంతంలో 2016లో మంకీ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్(ఎంఆర్‌ఆర్‌సీ) ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ఎట్టకేలకు ఈ ఏడాది పూర్తయ్యాయి. కేంద్రంలో ఏర్పాట్లు ఇలా.. చించోలి(బి) వద్ద ఉన్న గండిరామన్న హరితవనంలో నిర్మించిన ఈ కేంద్రం లో ఒకేసారి 50 కోతులను ఉంచేలా ఎన్‌క్లోజర్స్‌ను ఏర్పాటు చేశారు. వారం పది రోజులుగా ట్రయల్స్‌లో భాగంగా 27 కోతులకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు. ఆపరేషన్ చేసిన తర్వాత మూడు రోజుల వరకు కేంద్రంలో ఉంచి, మళ్లీ అటవీ ప్రాంతంలో వదిలేస్తారు. ప్రస్తుతానికి కోతులను ఇక్కడికి తీసుకురావాలి్సన బాధ్యత సంబంధిత గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలదే. ట్రయల్స్ ప్రారంభించాం ఇప్పటికే కోతుల ట్యూబెక్టమీ, వేసక్టమీ ఆపరేషన్ ట్రయల్స్ ప్రారంభించాం. రోజుకు ఆడ కోతులైతే 25–30 వరకు, మగ కోతులైతే 50 వరకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయవచ్చు. మూడు రోజుల వరకు కేంద్రంలోనే ఉంచి, ఆ తర్వాత అటవీ ప్రాంతంలో వదిలివేయవచ్చు. ఈనెల 8న అధికారికంగా ప్రారంభమైన తర్వాత రోజూ ఆపరేషన్లు కొనసాగిస్తాం. – డాక్టర్ శ్రీకర్రాజు, ఏడాదికి రెండు కాన్పులు... కోతులతో ఇబ్బందులు తగ్గాలంటే.. ముందుగా వాటి సంతతిని నియంత్రించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కోతుల గర్భధారణ కాలం (గర్భం నుంచి ప్రసవం వరకు) 164 రోజులు. అంటే సగటున ఐదు నెలలకో వానరం పుడుతోంది. మన ప్రాంతాల్లో నివసించే కోతుల జీవితకాలం 15–20 ఏళ్ల మధ్య ఉంటుంది. ఈ లెక్కన ఒక్కో ఆడ కోతి ఏడాదికి రెండు చొప్పున పిల్లలకు జన్మనిస్తూ పోతుండటంతో వాటి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. వెటర్నరీ డాక్టర్, ఎంఆర్‌ఆర్‌సీ -
వైరల్: కోతుల్ని తరిమి కొట్టండి: సీటు గెలవండి!
తిరువనంతపురం : తమను కోతుల బెడద నుంచి తప్పించిన అభ్యర్థికే మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేస్తామంటున్నారు కేరళలోని వయనాద్ ప్రజలు. కోతుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన వారికి మాత్రమే ఓట్లేస్తామంటున్నారు. ఈ మేరకు కాల్పెట్ట మున్సిపాలటీలోని హరితగిరి రెసిడన్స్ అసోసియేషన్ ఆదివారం తీర్మానం చేసింది. రాజకీయ పార్టీ బ్యానర్ల ముందు తమ గోడును వెల్లబోసుకుంటూ వీరు కూడా బ్యానర్లు ఉంచారు. కాల్పెట్ట మహిళ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ నా వయస్సు 62 సంవత్సరాలు. ప్రతీ ఏటా నేను మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేస్తూ వస్తున్నాను. కానీ, ఈ సారి అలా కాదు! కోతుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన వారికి మాత్రమే ఓటేస్తా. ( వైరల్: మరీ ఇంత పిరికి పులిని చూడలేదు ) మా ఏరియాలో కోతులు నానాబీభత్సం చేస్తున్నాయి. ఇళ్లపై పెంకులు తీసేస్తున్నాయి. వంటగదిలోకి ప్రవేశించి ఆహారాన్ని దొంగలిస్తున్నాయి. వాటికి భయపడి ఆహారాన్ని పడకగదిలో దాచుకుంటున్నాం. కోతుల సమస్యను పరిష్కరించటానికి ఇప్పటివరకు ప్రజా ప్రతినిధులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని’’ తెలిపారు. పోస్టుమాస్టర్ రాకేశ్ మాట్లాడుతూ.. ‘‘నేను ఏ ఇంటికైనా వెళ్లిన ప్రతీసారి, ఆ ఇంటివారు కోతుల్ని దూరంగా తరమాల్సిన పరిస్థితి వస్తుంది. కొన్నిసార్లు అవి నాపై దాడికి ప్రయత్నించేవి. ఇక్కడి ప్రజలు కోతుల కారణంగా చాలా ఇబ్బందులు పడుతున్నార’’ని అన్నారు. Kerala: People in Kalpetta, Wayanad say that they will decide their votes for local body election based on candidate's solution to monkey menace. A local says, “This time I have decided to vote only if a candidate assures to solve the menace. Monkeys enter houses & steal food.” pic.twitter.com/t2CdzKrPIw — ANI (@ANI) November 15, 2020 -
మానవత్వాన్ని చాటుకున్న సీఎం కేసీఆర్
సాక్షి, యాదాద్రి: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం యాదాద్రిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. దర్శనానంతరం లంచ్ ముగించుకొని సీఎం కేసీఆర్ తన వాహనంలో కొండ కిందికి వెళ్తున్న సమయంలో దారికి కోతులు అడ్డురావడంతో కారుదిగి వాటికి అరటిపండ్లు అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సంఘటన యాదాద్రి టూరిజం హోటల్ వద్ద జరిగింది. (స్మార్ట్ సిటీ తెచ్చిన ఘనత వినోద్ కుమార్‌దే) -
వీళ్లు మనుషులు కాదు రాక్షసులు
సాక్షి, ఖమ్మం : మూగ జీవాల పట్ల ప్రేమగా వ్యవహరించాల్సింది పోయి దాహార్తిని తీర్చుకునేందుకు వచ్చిన కోతిని చంపిన ఘటనలో ముగ్గురిపై కేసు నమోదైంది. వివరాలిలా ఉన్నాయి.. మండల పరిధిలోని అమ్మపాలెం గ్రామంలో సాదు వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఇంటి ముందు ఉన్న తొట్టిలో నీటిని తాగేందుకు వచ్చిన కోతి ప్రమాదవశాత్తు అందులో పడిపోగా దానిని రక్షించాల్సింది పోయి రాళ్లతో, కర్రలతో కొట్టి చంపి బయట పడేశారు. సమీపంలోనే ఉన్న కోతుల గుంపు అక్కడకు రాగా వాటిని పారదోలేందుకు మరో కోతిని పట్టుకొని చెట్టుకు ఉరివేసి, కుక్కలను వదిలి దారుణంగా హింసించి చంపారు. ( సింహం ఘటనపై దేశాధ్యక్షుడి ఆగ్రహం! ) ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాల్లో వైరల్‌గా మారింది. దీంతో జంతు ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఫారెస్ట్ అధికారులు గ్రామంలో విచారణ నిర్వహించి సాదు వెంకటేశ్వరరావు, జోసెఫ్‌రాజా, జి.గణపతి అనే ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు మండల అటవీశాఖ సెక్షన్ అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. ( కొండెంగకు గోరుముద్దలు తినిపించిన మహిళ) -
కరోనా వచ్చే కోతులకు కష్టం తెచ్చే
లోప్‌బురి: పర్యాటక ప్రేమికులకు థాయ్‌లాండ్‌లోని లోప్‌బురి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. లోప్‌బురిలోని సాన ఫ్రా కాన, ఫ్రా ప్రాంగ్ సామ్ అనే పురాతన ఆలయాల ప్రాంగణంలో వేల కోతులు సందడి చేస్తుంటాయి. ఇక్కడి కోతులకు ఆహారం అందిస్తే సకల శుభాలు, ఐశ్వర్యం సిద్దిస్తుందని అక్కడి ప్రజల నమ్మకం. అంతేకాకుండా ప్రతీ ఏడాది ‘మంకీ బఫెట్ ఫెస్టివల్’అనే వినూత్న వేడుకను ఏర్పాటు చేసి అక్కడి కోతులకు పెద్ద మొత్తంలో ఆహారాన్ని అందిస్తారు. ఈ వేడుకకు వివిధ దేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. దీంతో లోప్‌బురి పర్యాటకంగా అభివృద్ది చెందడంతో పాటు కోతులకు కావాల్సినంత ఆహారం లభించేది. అయితే లాక్‌డౌన్‌తో సీన్ రివర్సయింది. (క్షణాల్లో ప్రాణం పోయే పరిస్థితి.. కానీ..) ఇక పర్యాటకుల స్వర్గధామం అయిన థాయ్‌లాండ్‌పై కరోనా ప్రభావం భారీగానే పడింది. కరోనా లాక్డౌన్ కారణంగా పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గడంతో ఆదాయం పూర్తిగా పడిపోయింది. ఇక లోప్‌బురిలో నివసించే వేల కోతుల కష్టాలు వర్ణనాతీతం. పర్యాటకులు లేకపోవడంతో వీటికి ఆహార కొరత ఏర్పడింది. దీంతో రోడ్లపైకి వచ్చి ఆహారం కోసం వెతుకులాట ప్రారంభించాయి. అక్కడి ప్రజలపై, దుకాణాదారులపై ఆహారం కోసం దాడి చేస్తున్నాయి. కొంత మంది వీటి దయనీయ పరిస్థితిని గమనించి కడుపు నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో కోతుల దయనీయ పరిస్థితి అద్దం పట్టే ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ‘ఓ మై గాడ్ కరోనా లాక్‌డౌన్‌తో ప్రజలే కాదు పశుపక్ష్యాదులు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. (అద్భుతమైన వీడియో.. థాంక్యూ!) -
13 కోతులు మృతి: విషం పెట్టి చంపారా?
దిస్పూర్: మానవ మృగాల చేతిలో వన్యప్రాణులు ప్రాణాలు విడుస్తున్నాయి. కేరళలో గర్భిణీ ఏనుగు హత్యోదంతం మరువకముందే అస్సాంలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. కచార్ జిల్లాలోని ఓ గ్రామంలో తాగునీటిని సరఫరా చేసే రిజర్వాయర్‌లో సోమవారం 13 కోతుల మృతదేహాలు వెలుగు చూశాయి. తాగునీటి అవసరాల కోసం నిర్మించిన ప్లాంటులో ఎవరో దుండగులు కావాలనే ఈ పని చేసినట్లు అధికారులు అభిప్రాయపడుతున్నారు. నీటిలో విషం కలిపి వాటిని చంపివేసి ఉండొచ్చని భావిస్తున్నారు. (వైరల్: చిరుతను చంపి ఊరేగించారు) మరోవైపు కోతుల మృత దేహాలను అటవీశాఖ అధికారులు పోస్టుమార్టమ్‌కు తరలించారు. దాని ఫలితాలు వచ్చాకే కోతుల మృతిపై పూర్తి స్పష్టత రానుంది. ఈ ఘటనపై పశువైద్య అధికారి రుబెల్ దాస్ మాట్లాడుతూ.. "తాగునీటి ప్లాంట్‌లో 13 కోతులు విగతజీవులుగా తేలాయి. వాటి శరీరంలో విషపు అవశేషాలున్నట్లు తెలుస్తోంది" అని పేర్కొన్నారు. ఇక తాగునీటి కోసం జలాశయంపై ఆధారపడ్డ స్థానికులు ఈ ఘటనతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. (వన్యప్రాణులు గజ గజ!) -
అద్భుతమైన వీడియో.. థాంక్యూ!
ఒక్క ఆత్మీయ ఆలింగనం చాలు లక్ష భావాలు పలికించడానికి... ఎదుటి వ్యక్తి పట్ల ఉన్న ప్రేమను వ్యక్తపరిచేందుకు. నీకు నేనున్నానే భరోసానిచ్చే అమృతమంత్రం అలయ్ బలయ్. మనుషులకే కాదు మాకు కూడా ఇలాంటి ఎమోషన్స్ ఉన్నాయంటున్నాయి గోల్డెన్ మంకీస్. ‘‘అందరికీ ప్రేమ కావాలి. ప్రమాదం పొంచి ఉందని భావించిన రెండు గోల్డెన్ మంకీలు ఇలా ఒకటినొకటి హత్తుకున్నాయి. ఆ శబ్దాలే అక్కడేం జరిగిందో చెబుతున్నాయి. మనుషుల వలె అవి కూడా ఇలా భావోద్వేగాలు పలికించాయి’’ అంటూ అటవీ శాఖ అధికారి సుసాంటా నందా షేర్ చేసిన వీడియో నెటిజన్ల మనసు దోచుకుంటోంది. ‘‘కరోనా కాలంలో ఇలాంటి వీడియో షేర్ చేసి.. సాటివారికి అండగా నిలబడాల్సిన ఆవశ్యకతను ఈ కోతులు ఎంతో హృద్యంగా చెప్పాయి. ఆ రెండు కోతులను చూస్తుంటే మాటలు రావడంలేదు. అద్భుతమైన వీడియో షేర్ చేసినందుకు ధన్యవాదాలు’’ అని కామెంట్లు చేస్తున్నారు. -
కోతులకు సోకితే అంతే
సాక్షి, హైదరాబాద్: కోతులకి మనుషుల ద్వారా కరోనా వైరస్ వ్యాపించే అవకాశాలున్నాయని జీవ శాస్త్రవేత్తలు, నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఈ మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో వాటికి మనుషులు ఆహారం, పండ్లు నేరుగా అందించడం ప్రమాదకరమని చెబుతున్నారు. మనుషుల నుంచి లేదా వారు పెట్టే ఆహారం నుంచి ఈ వైరస్ కోతులకు సోకితే సార్స్–సీవోవీ–2 వైరస్ మ్యుటేటయ్యేందుకు దోహదపడటంతో పాటు అడవు ల్లోని ఇతర జంతువులకు ఇది వ్యాపిస్తే దీర్ఘకాలం దుష్పరిణామాలు ఉండే అవకాశాలున్నాయని అంటున్నారు. తాజాగా తమిళనాడులోని సలీం అలీ సెంటర్ ఫర్ ఒరింతోలజీ, నేచురల్ హిస్టరీ ప్రిన్సిపల్ సైంటిస్ట్ హోన్నవల్లి ఎం.కుమార తమ అధ్యయన పత్రంలో ఆయా అంశాలను ప్రస్తావించారు. వైరస్లు, ఎండో పారాసైట్లు మనుషులు, జంతువుల మధ్య సోకే, వ్యాప్తి చెందే అవకాశాలున్నాయ ని ఆయన స్పష్టం చేశారు. కోతులు, అడవి జంతువులకు మనుషులు నేరుగా ఆహారం పెట్టే అలవాటును మార్చుకోవాల్సి ఉందని మరో శాస్త్రవేత్త పేర్కొన్నారు. ఒకవేళ సార్స్–సీవో వీ–2 వైరస్ మ్యుటేట్ అయ్యి ఇతర జం తువులకు సోకితే మొత్తం వన్యప్రాణులపైనే దాని ప్రభావం పడుతుందని తమిళనాడుకు చెందిన మరో జీవశాస్త్రవేత్త హెచ్చరిస్తున్నా రు. ఈ క్రమంలో గతంలో కోతులపై పరిశోధనతో పాటు వివిధ అంశాలపై అధ్యయనం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రిన్సిపల్ సైం టిస్ట్, ఆల్ఇండియా నెట్వర్క్ ప్రాజెక్ట్ ఆన్ వెర్టేట్రేట్ పెస్ట్ మేనేజ్మెంట్ హెడ్ డాక్టర్ వి.వాసుదేవరావు ‘సాక్షి’కి పలు విషయా లు వెల్లడించారు. ‘జంతువుల కు, ముఖ్యంగా కోతులకు రెడీమేడ్ ఆహారం అందించాల్సిన అవసరం లేదు. పబ్లిక్ ఫీడిం గ్ వల్ల వాటికి ఇన్ఫెక్షన్లు వ్యాపించే అవకా శాలున్నాయి. వాటికి ఆహారం, పండ్లు పెట్టి ఇన్ఫెక్షన్లను వ్యాప్తి చెం దేలా చేయడం సమంజసం కాదు. వైరస్ ఎలా మ్యుటేట్ అవుతుందో తెలియదు. కాబట్టి జాగ్రత్త అవసరం. జంతువుల నుంచి వైరస్లు, బ్యాక్టీరియా వ్యాపించే అవకాశాలెక్కువ. పైగా అవి స్వతహాగా ఆహారం సంపాదించుకోవాలన్న గుణాన్ని మార్చుకుని, ఆహారం పెట్టనపుడు దాడులకు దిగుతాయి. పైగా కోతుల్లో టీబీ లక్షణాలు ఎక్కువ. అవి మనుషులకు సోకే ప్రమాదం ఉంది’. అడవుల్లోకి తిరిగి వెళ్లేలా చేయాలి సమన్వయ చర్యలతో కోతులకు ఫీడింగ్ కంట్రోల్ చేయాలి. అవి తమంతట తామే అడవుల్లోకి తిరిగెళ్లేలా చూడాలి. ఇందుకు ప్రభుత్వ పరంగా చర్యలు చేపడుతున్నాం. మంకీ ఫుడ్‌కోర్టుల ఏర్పాటు ద్వారా కోతులకు పండ్లు అం దుబాటులోకి వచ్చేలా చూస్తున్నాం. ప్రస్తుతం అడవుల్లో వాటికి పండ్లు,ఫలాలు దొరకట్లేదు. కోతుల జనాభా నియంత్రణకు ఆపరేషన్ల ద్వారా అడ్డుకట్ట వేసేందుకు నిర్మల్‌లో సంతాన నిరోధక కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటుచేసింది. – వైల్డ్‌లైఫ్ ఓఎస్డీ శంకరన్ -
హ్యాట్యాఫ్ పోలీస్ సాబ్..
-
'కోతుల జలకాలాటలు చూసి తీరాల్సిందే'
ముంబై : కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించిన సంగతి తెలిసందే. ఈ నేపథ్యంలో జనాలు ఇళ్లకే పరిమితం కావడంతో ఎప్పుడు అడవుల్లో కనిపించే జంతువులు జనసంచారంలోకి వచ్చేస్తున్నాయి. రోడ్లపై మనుషులెవరు కనిపించకపోవడంతో ఈ జనాలకు ఏమైయుంటదబ్బా అని బహుశా జంతువులు అనుకొని ఉంటుండొచ్చు. అయినా లాక్డౌన్ మనుషులకే కానీ మాకు కాదన్నట్లు అడవుల్లో ఉండాల్సిన జంతువులు జనావాసంలోకి వస్తున్నాయి. మొన్నటికి మొన్న నొయిడాలోని ఒక ప్రాంతంలో ఆహార అన్వేషణకు నీల్గాయ్ రోడ్డుమీదకు రావడం, ఉత్తారఖండ్‌లో సాంబార్ డీర్లు యదేచ్చగా సంచరిస్తున్న వీడియోలు వెలుగుచూసిన సంగతి తెలిసిందే. తాజాగా ముంబైలోని ఒక అపార్ట్మెంట్ జలకాలటలు ఆడుతున్న కోతుల వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముంబైకి చెందిన తిస్కా చోప్రా అనే అమ్మాయి కోతులు స్విమ్మింగ్ ఫూల్లో దిగి ఈత కొడుతున్న వీడియోనూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. 'లాక్డౌన్ నేపథ్యంలో జనాలు ఇళ్లకే పరిమితమవడంతో జంతువులు యదేచ్చగా తిరుగుతున్నాయి. కోతులు స్విమ్మింగ్ ఫూల్లో ఎంజాయ్ చేసిన విధానం చూసి చాలా సంతోషించాను. ఈరోజు ఆ కోతులకు ఒక ప్రత్యేక రోజుగా మిగిలిపోతుందనడంలో సందేహం లేదు. నేను మాత్రం కోతుల స్విమ్మింగ్‌ను చూస్తూ ఉండిపోయానంటూ ' క్యాప్షన్ షేర్ చేశారు. అయితే ఆ వీడియోలో మొదట ఒక కోతి బాల్కని నుంచి కిటికి రెయిలింగ్ వద్దకు చేరుకొని అమాతంగా స్విమ్మింగ్ ఫూల్లోకి దూకేసి సరదాగా కొద్దిసేపు ఈత కొట్టింది. ఆ తర్వాత అటు ఇటూ కలియతిరుగుతూ ..చివరకు స్విమ్మింగ్ ఫూల్ ఒడ్డుకు చేరుకుని అక్కడ కాసేపు కూర్చొంది. అనంతరం మిగతా కోతులు కూడా స్విమ్మింగ్ ఫూల్లోకి దూకి జలకాలాడుతూ ఎంజాయ్ చేశాయి. కాగా ఈ వీడియో షేర్ చేసిన కాసేపటికే లక్షకు పైగా వ్యూస్ వచ్చాయి. -
బంగారం ఎత్తుకెళ్లిన కోతులు
రెబ్బెన (ఆసిఫాబాద్): దొంగలు ఇంట్లో చొరబడి బంగారం ఎత్తుకెళ్లినట్లు సాధారణంగా వింటుంటాం. కానీ.. కోతులు ఇంట్లో చొరబడి బంగారు నగలు ఎత్తికెళ్లిన విచిత్ర సంఘటన కుమురంభీం జిల్లా రెబ్బెన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఓ ఉద్యోగి ఇంట్లో సోమవారం మధ్యాహ్నం కోతులు చొరబడి వంట గదిలో ఉన్న పప్పు డబ్బాలతో ఉడాయించాయి. అయితే.. ఆ డబ్బాలో సదరు ఉద్యోగి తల్లికి చెందిన రెండు తులాలు, కూతురుకు చెందిన తులం బంగారం చైన్ ఉన్నాయి. స్థానికుల సాయంతో చుట్టుపక్కల గాలించినా డబ్బాలు లభించలేదని వాపోయింది. -
కోతుల ఆహారశాల
కొత్తరేమల్లె గ్రామస్తులు పొలం పనులతోపాటు, కొత్తగా వచ్చిన ఫ్యాక్టరీలలో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఒకప్పుడు ఆ గ్రామం చుట్టూ మామిడి తోటలుండేవి. ఆ మామిడి చెట్ల మీద ఆటలాడుకుంటూ, పండ్లు తింటూ కోతులు జీవనం సాగించేవి. గ్రామానికి దూరంగా తిరిగే కోతులు ఈమధ్య కాలంలో ఇళ్ళల్లోకి ప్రవేశించడం మొదలెట్టాయి. కోతుల ఆగడాలు తట్టుకోలేక ఊరి పెద్దలు పంచాయితీ ప్రెసిడెంట్‌ను కలిశారు. ‘‘అయ్యా..! ఊళ్ళో కోతుల బెడద తట్టుకోలేకపోతున్నాం. అవి ఇంటి దగ్గరుండే చెట్లపైనే మకాం వేసి ఇళ్ళల్లో వండుకునే అన్నం, కూరల్ని లాగేస్తున్నాయి. ఇంట్లో ఆడవాళ్ళు బయట స్వేచ్ఛగా తిరగడానికి భయపడుతున్నారయ్యా. నాలా కూలి పనులకెళ్ళే వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉందయ్యా. చేతి సంచిలో అన్నం బాక్సులు పెట్టుకుని పొలం పనులకు వెళ్ళేటప్పుడు వారి వెనకే కోతులు వస్తూ ఆ సంచుల్ని లాక్కుంటున్నాయి. అన్నం నేలపాలైపోతుందయ్యా! వాటినుంచి మమ్మల్ని రక్షించండయ్యా’’ అంటూ మొరపెట్టుకున్నారు. కొత్తరేమల్లె గ్రామం నుండే కాకుండా చుట్టుపక్కల నాలుగు గ్రామాల నుండీ ఇవే ఫిర్యాదులు అందడంతో వాటి నుంచి గ్రామస్తులకు ఉపశమనం కలిగించాలని పై అధికారులతో మాట్లాడి కోతులను పట్టే వాళ్ళను, వాటిని అడవులలో వదలడానికి తీసుకెళ్ళే ఒక పెద్ద వాహనాన్ని గ్రామానికి పిలిపించారు అధికారులు. వారం రోజులపాటు ఆపసోపాలు పడి, కోతుల్ని పట్టుకుని అడవిలో వదిలి వచ్చారు. జనాలందరూ జై కొట్టారు. కొన్నాళ్ళు ఎప్పటిలానే స్వేచ్ఛగా తిరిగారు. ఒక నెల రోజులు కూడా గడవకుండానే మళ్ళీ కోతులు గ్రామంలోకి ప్రవేశించాయి. మళ్ళీ తీసుకెళ్ళి అడవిలో వదిలిపెట్టారు. మరలా నెల రోజుల తర్వాత అవి తిరిగొచ్చేశాయి. ఎన్నిసార్లు పంపిస్తున్నా కోతులు మరలా తిరిగొచ్చేయ్యడంతో విషయం కలెక్టర్ దృష్టికి వెళ్ళింది. కొత్తరేమల్లె గ్రామాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించాలని అధికారులను ఆదేశించి, కలెక్టర్ ఆ గ్రామానికి విచ్చేశారు. గ్రామస్తులతో చర్చించి, రెండు గంటలు ఊరంతా కారులో తిరిగి చూశాక ఒక విషయం ఆయనకు అర్థమైంది. అడవుల విస్తీరం తగ్గిపోవడంతో కోతులు తల దాచుకోవడానికి చోటు దొరక్క, ఆహారం కరువై ఇలా గ్రామాల్లోకి వచ్చేస్తున్నాయని, పంటలను నాశనం చేస్తున్నాయని నిర్ధారణ కొచ్చారు కలెక్టర్‌గారు. రచ్చబండ దగ్గరకొచ్చి ప్రజలను ఉద్దేశించి ‘‘ఒకప్పుడు మీ గ్రామం చుట్టూ పచ్చని పొలాలు ఉండేవి. గ్రామానికి ఆనుకుని ఉన్న చెరువు ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆ రెండు ఫ్యాక్టరీల కారణంగా కలుషితమయ్యింది. చెరువునే ఆధారం చేసుకుని పండే భూములు పండట్లేదు. దాంతో కొంతమంది పంటలు వేయడం లేదు. వర్షాలు సరిగ్గా కురవడం లేదని వర్షాధార పంటలు వేయడం మానేశారు. ఇక మిగిలిన ఒకే ఒక అవకాశం ఫ్యాక్టరీలలో పని చేయడం. మున్ముందు ఇక్కడ మరిన్ని ఫ్యాక్టరీలు రాబోతున్నాయని తెలిసి, వారికి ఈ భూములు అమ్ముకోవచ్చని మామిడి తోటలను కూడా నరికేశారు. ఇక కోతులు ఉండడానికి చోటెక్కడ ఉంటుంది చెప్పండి? అందుకే అవి ఇలా ఇళ్ళల్లోకి చొరబడుతున్నాయి. ఆహారాన్ని దొంగిలిస్తున్నాయి. మీరెన్నిసార్లు తీసుకెళ్ళి అడవిలో వదిలేసొచ్చినా ఆహారం కోసం అవి మరలా మరలా తిరిగొస్తూనే ఉంటాయ్’’ అంటూ కలెక్టర్ చెబుతున్నారు. అంతలో గ్రామపెద్ద కల్పించుకుని ‘‘అలాగయితే ఎలాగయ్యా! మీరే ఏదన్నా చేయాలి’’ అంటూ రెండు చేతులు పైకెత్తాడు. వెంటనే ఇంకొంతమంది గ్రామ ప్రజలూ అతనికి తోడయ్యారు. కలెక్టర్ గారు వాళ్ళందరినీ చూస్తూ ‘‘దీనికి మీ అందరి సహకారం ఉంటే నేనో ఉపాయం చెప్తాను’’ అన్నారు. ‘‘మళ్ళా మళ్ళా అవి రాకుండా ఉంటాయంటే మీరేం చెప్తే అది చేస్తాం సార్’’ ముక్తకంఠంతో పలికారు ప్రజలు. ‘‘కోతులకు ఆహారశాల ఏర్పాటు చేద్దాం’’ అన్నారు కలెక్టర్. జనమంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ‘‘కోతుల ఆహారశాల అంటే వాటికి మనం వండి పెట్టడం కాదు. ఇంగ్లీష్‌ల్లో దీన్ని మంకీ ఫుడ్ కోర్ట్స్ అంటారు. ఖాళీగా ఉన్న స్థలాలలో పండ్ల మొక్కలైన జామ, సీతాఫలం, ఉసిరి, నేరేడు మొదలైనవి నాటాలి. మీరందరూ కలిసి మీ వంతుగా వాటికి నీళ్ళు పోసి పెంచాలి. ఇలా చేయడం వలన చెట్ల సంఖ్య పెరుగుతుంది. మొక్కలు పెరిగి వాటికి కాసిన కాయల్ని కోతులు తింటూ ఇక్కడే ఉండిపోతాయ్. వాటికి ఈ ఆహారశాలలో ఆహారం దొరుకుతున్నప్పుడు ఇళ్ళల్లోకి రావు. ఏమంటారు.?’’ అంటూ అందరి అంగీకారాన్ని కోరారు. అడవులశాతం తగ్గిపోవడం కారణంగా ఇన్ని ఇబ్బందులు తలెత్తుతాయని గ్రహించిన గ్రామస్తులు వెంటనే అంగీకారం తెలిపారు. తాను రూపకల్పన చేసిన ఈ వినూత్న కార్యక్రామాన్ని జనాల్లో స్థిరంగా నిలబడిపోవాలని పనులను వెంటనే ప్రారంభించమని అధికారులను ఆదేశించారు కలెక్టర్. గ్రామస్తుల సహకారంతో కొన్నాళ్ళలోనే మొక్కలు చెట్లుగా మారి ఫలాలను అందించాయి. కోతుల బెడద పూర్తిగా తగ్గిపోయింది. కోతులకు ఆహారశాల ఏర్పాటు చేసి గ్రామ సమస్యను తీర్చినందుకు కలెక్టర్‌ను అభినందించారు గ్రామస్తులు. - దొండపాటి కృష్ణ -
విమానాశ్రయంలో ఊసరవెల్లి, కోతులు స్వాధీనం
చెన్నై,అన్నానగర్: థాయ్‌ల్యాండ్ నుంచి చెన్నైకి బుధవారం విమానంలో అక్రమంగా తీసుకొచ్చిన కోతులు, ఉడత, తొండలను విమానాశ్రయ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని థాయ్‌ల్యాండ్ దేశానికి తిరిగి పంపించడానికి అధికారులు చర్యలు తీస్తున్నారు. చెన్నై మీనమ్‌బాక్కమ్ విమానాశ్రయానికి బుధవారం థాయ్‌ల్యాండ్ నుంచి వచ్చిన విమానంలో ప్రయాణం చేసిన చెన్నైకి చెందిన సురేష్ (28) మీద అనుమానం చెందిన విమానాశ్రయ అధికారులు విచారణ చేపట్టారు. అతను పొంతనలేని సమాధానం చెప్పడంతో అతని లగేజ్‌ని పరిశీలించారు. అందులో ఉన్న నాలుగు ప్లాస్టిక్ పెట్టెలను విప్పి చూడగా అమెరికా దేశాలలో నివసించే 12 ఊసరవెల్లులు, తొండలు, రెండు చిన్న కోతులు, థాయ్‌ల్యాండ్, మలేషియా దేశాలలో నివసించే రెండు జాతుల ఉడతలు ఉన్నాయి. అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. వాటిని థాయ్‌ల్యాండ్ దేశానికి తిరిగి పంపించడానికి చర్యలు తీసున్నారు. . -
బంగారు కోతులు అతని పంట పండించాయి
95 దేశాల నుంచి 45 వేల ఫొటోలు.. అందులోంచి ఎంపిక చేశారు.. ఈ ఒక్క చిత్రాన్ని.. 2018 వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ పురస్కారం నెదర్లాండ్స్‌కు చెందిన మార్సల్కు దక్కింది.. గోల్డెన్ కపుల్ పేరిట ఆయన తీసిన ఈ బంగారు కోతుల చిత్రానికి గ్రాండ్ ప్రైజ్ వరించింది. దీన్ని చైనాలోని కిన్‌లింగ్ పర్వత ప్రాంతంలో తీశారు. ఈ కోతులు అంతరించిపోతున్న జీవజాతుల జాబితాలో ఉన్నాయి. అది కూడా ఈ పర్వత ప్రాంతంలోనే ఉన్నాయట. ఒకచోట స్థిరంగా ఉండకుండా అటూ ఇటూ దూకుతూ ఉన్నాయని.. ఈ ఫొటో తీయడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందని మార్సల్ తెలిపారు. ఏటా ఈ పోటీలను లండన్‌లోని ప్రఖ్యాత నేచురల్ హిస్టరీ మ్యూజియం నిర్వహిస్తోంది. -
పక్కనే వుంటే పోయేదేముంది?
ఒక అడవిలో కోతుల గుంపు ఒకటి ఉండేది. ఒకరోజు అవన్నీ కలిసి ఏకాదశీ వ్రతం చేసుకోవాలనుకున్నాయి. ఆ ప్రకారం ఆ తర్వాత వచ్చే ఏకాదశినాడు కోతులన్నీ ఒక చెట్టుకింద సమావేశమై ఉపవాసాన్ని ప్రారంభించాయి. కాసేపటికి ఒక కోతి అంది– ఇలా ఎంతసేపని కింద కూర్చుంటాం? చెట్లకొమ్మల మీద ఉండటమే మనకు అలవాటు కాబట్టి చెట్లెక్కి కొమ్మల మొదట్లోనే కూర్చుందాం’’ అంది. ఆ మాటలు మిగతా కోతులకు నచ్చాయి. వెంటనే అమలు పరిచాయి. అలా కొంతసేపు గడిచింది. అప్పుడు మరోకోతి ఇలా సూచించింది– మనం కొమ్మలమీద కూర్చుంటే చెట్లెక్కగలిగిన ఏ చిరుతపులో వస్తే మన పరిస్థితి ఏమిటి? అందువల్ల ఇంకొంచెం పైకెళ్తే మంచిది. దానివల్ల నేలమీదకు చూస్తూ, శత్రువులు రాకుండా జాగ్రత్త పడడానికి వీలవుతుంది– అంది. ఈ ఆలోచన కూడా నచ్చడంతో వెంటనే అమలు పరిచాయి. మరికొంతసేపు గడిచింది. ఇంకొక కోతి అంది– నేలచూపులు ఎంతసేపు చూస్తాం... పండ్లవైపు చూస్తే మాత్రం ఉపవాస వ్రతానికి నష్టం ఏంటి– అని. వెంటనే ఆ సలహా కూడా అమలులోకి వచ్చేసింది. మరోకోతికి మరో ఆలోచన వచ్చింది. ఉపవాసం కారణంగా మనకు ఆకలి ఎక్కువగా ఉండి, మంచి పండ్లను ఏరుకునే సమయం ఉండకపోవచ్చు. అందువల్ల రేపటికి తినడానికి వీలుగా ఏం పండ్లు ఉంటాయో, ఇప్పుడే పరీక్షించి పెట్టుకుంటే బాగుంటుంది కదా– అని. ఇంకేం... కోతులన్నీ మంచి మంచి పండ్లను ఏరుకోవడం మొదలెట్టాయి. ‘రేపు మనకు ఎంత నీరసంగా ఉంటుందో ఏమో, కొన్ని పండ్లు పైకి బాగున్నా, లోపల పురుగులుండవచ్చు. కాబట్టి ఇప్పుడే వాటిని కొద్ది కొద్దిగా రుచి చూసి పక్కన పెట్టుకుంటే మన ఉపవాస వ్రతానికి నష్టం ఏమైనా వాటిల్లుతుందా ఏమిటి? మనుషులు కూడా అలాగే పొద్దున ఉపవాసం ఉంటూనే, రాత్రి పలహారానికి కావలసిన ఏర్పాట్లు చేసుకుంటూనే ఉంటారు’’ అంటూ అనుభవజ్ఞురాలైన ఓ వృద్ధ వానర ం తనలో తాను గొణుక్కుంటున్నట్లుగా అంది. అన్నింటికంటే ఈ సలహా కోతులన్నిటికీ బాగా నచ్చింది. కోతులన్నీ ఆవురావురుమని పండ్లన్నీ ఆరగించేయడం మొదలెట్టేశాయి. చివరికి వాటి ఉపవాస వ్రతం అలా ముగిసింది. మనం ఏదైనా ఒక పని ప్రారంభిద్దాం అనుకోగానే ఇలాగే నలుగురూ వచ్చి నాలుగు సలహాలు చెబుతారు. దాంతో మనం అనుకున్న పని కాస్తా అటక ఎక్కుతుంది. ఒకవేళ వాళ్లు చెప్పిన సలహాలు మంచివే అనుకోండి, వాటిని పాటించేందుకు తగిన సమయం సందర్భం, వాటిని పాటించే క్రమంలో నిగ్రహం, నిక్కచ్చితనం అవసరం. – డి.వి.ఆర్. -
కోతులకు కు.ని. ఆపరేషన్లు
సాక్షి, హైదరాబాద్: కోతుల బెడదను నివారించేందుకు ప్రభుత్వం సరికొత్త ఉపాయం కనిపెట్టింది. దశలవారీగా కోతులకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయాలని నిర్ణయించింది. హిమాచల్ ప్రదేశ్ మాదిరిగా కోతులకు ఇంజెక్షన్లు ఇచ్చి సంతతి పెరగకుండా నివారించే విధానం చర్చకు వచ్చింది. ఈ మేరకు సోమవారం ఇక్కడ కోతుల బెడద నివారణపై నిపుణుల కమిటీ అరణ్యభవన్‌లో సమావేశమైంది. పంటలను ధ్వంసం చేయటం, గ్రామాల్లో వీటి ఆగడాలు పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు నిపుణుల కమిటీని నియమించారు. అటవీ, వ్యవసాయ, మున్సిపల్, హార్టికల్చర్, అధికారులతోపాటు అటవీ జంతువులపై పరిశోధనలు చేస్తున్న సంస్థల ప్రతినిధులకు కమిటీలో చోటు కల్పించారు. వ్యవసాయ శాఖ క్షేత్రస్థాయి సిబ్బంది సహకారంతో రానున్న నెల రోజుల్లో కోతుల బెడద, తీవ్రతపై అధ్యయనం చేయాలని నిర్ణయించారు. ఏఏ ప్రాంతాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి.. ఏ రకమైన పంటలను కోతులు నాశనం చేస్తున్నాయి.. వాటి నివారణ, మానవ ఆవాసాలపై కూడా కోతుల బెడద ఏ మేరకు ఉందన్న విషయాల ఆధారంగా స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేయాలని నిర్ణయించారు. అటవీ ప్రాంతంతోపాటు, జనావాసాల్లో కూడా కోతులకు తినే పదార్థాలు పెట్టడం వల్ల అడవులను వదిలి బయటకు వచ్చేందుకు మక్కువ చూపుతున్నాయని, ప్రజలు కోతులకు ఫీడింగ్ పెట్టకుండా ఉండటం మంచిదని నిపుణులు అభిప్రాయపడ్డారు. కోతులపై అధ్యయనం, కుటుంబ నియంత్రణ చర్యలకు ఉద్దేశించిన ప్రత్యేక సెంటర్ నిర్మల్‌లో త్వరలోనే ప్రారంభమౌతుందని, స్టెరిలైజేషన్ చేసిన కోతులను విడతలవారీగా అడవుల్లోకి వదిలిపెట్టేలా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. తదుపరి కార్యాచరణపై మరో వారం, పదిరోజుల్లో మరోసారి కమిటీ సమావేశం జరగనుంది. సమావేశంలో ప్రధాన అటవీ సంరక్షణ అధికారి పి.కె.ఝా, పీసీసీఎఫ్‌లు పృథ్విరాజ్, పశు సంవర్థక శాఖ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, జీహెచ్ఎంసీ చీఫ్ వెటర్నిటీ అధికారి వెంకటేశ్వర రెడ్డి, సీసీఎంబి డైరెక్టర్ డాక్టర్ ఉమాపతి, వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి డాక్టర్ వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు. -
కోతులతో తాజ్‌మహల్‌కి ముప్పు!
ఆగ్రా: ప్రపంచ పాలరాతి అద్భుత కట్టడం పరిసరాల్లో పచ్చదనం క్షీనించిపోతుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే దీనికి కొంత కారణం కోతులని వారు పేర్కొవడం గమనార్హం. మార్చి 21 అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని పురస్కరించుకుని పర్యావరణ వేత్తలు బుధవారం రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ.. ‘తాజ్ పరిరక్షణ కోసం ఏం చర్యలు తీసుకుంటున్నారంటూ 1996 నుంచి సుప్రీంకోర్టు ప్రభుత్వాలను ప్రశ్నిస్తూనే ఉంది. అయినప్పటికీ ప్రభుత్వాలలో చలనం కనిపించడంలేదు. ప్రస్తుతం పచ్చని అడవులు పోయి.., కాంక్రీటు అరణ్యాలు ఏర్పడుతున్నాయి. బర్జా ప్రాంతంలో బృందావనం నుంచి ఆగ్రా వరకు 12 పెద్ద అడవులు ఉండేవి. ఇప్పుడు వాటిపేర్లే మిగిలాయి. ఆకుపచ్చని ప్రాంతాలన్నీ గోధుమ, పసుపు, బూడిద రంగులోకి మారిపోతున్నాయి. బిల్డర్లు, అవినీతి ప్రభుత్వాలు కలిసి అటవీ భూములను అనైతికంగా వాడుతున్నారు. యమునా నదివరకు చెట్లను నాశనం చేశారు. హోటళ్లు, రెస్టారెంట్లు, రోడ్ల నిర్మాణం వంటిపేర్లతో పచ్చని చెట్లను నరికేశారు. జాతీయ ప్రమాణాల ప్రకారం 33 శాతం అడవులు ఉండాలి, కానీ అది ఇక్కడ 7 శాతానికి పడిపోయింది. ఈ కారణాలన్నింటికి తోడు.. నాటిన మొక్కలను కోతులు వేళ్లతో సహా పీకేస్తున్నాయి. అటవీ సంరక్షణ చర్యలతోపాటు కోతుల సంఖ్యను నియంత్రించాల్సిన అవసరం కూడా ఉంద’ని పేర్కొన్నారు. -
వానర ప్రీతి.. సంభావన చేసి..
ద్వారకాతిరుమల : కార్తీక మాసంలో వన భోజనాలు చేస్తే పుణ్యఫలాలు దక్కుతాయని భక్తుల విశ్వాసం. ఇది మనందరికీ తెలిసిందే. మనమంతా ఒకచోట చేరి ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతాం. ఇదీ సాధారణమే. అయితే వనాల్లో తిరిగే మూగజీవాలైన వానరాల (కోతులు) కోసమే కార్తీక వన సమారాధన చేస్తే..? ఈ ఆలోచనే వచ్చింది జంగారెడ్డిగూడేనికి చెందిన ఎ.శ్రీరంగరాజ అనే వ్యక్తికి. వెంటనే ఆ ఆలోచనను ఆచరణలో పెట్టారు. ఈ వానర కార్తీక వన సమారాధన ద్వారకాతిరుమల మండలంలోని జి.కొత్తపల్లిలో కార్తీక మాస చివరిరోజైన శుక్రవారం జరిగింది. వనాల్లోంచి వందలాదిగా రహదారిపైకి వచ్చిన వానరాలకు ఫలాలు, తినుబండారాలను అందించి ఆయన తన దాతృత్వాన్ని చాటుకున్నారు. మూగజీవాలు బతకాలని.. జంగారెడ్డిగూడెంకు చెందిన వ్యాపారి శ్రీరంగరాజ ఆంజనేయ స్వామి భక్తుడు. వానరాలంటే ఆయనకు ఎంతో ఇష్టం. అడవులు నశించిపోతుండటం వల్ల మూగజీవాలన్నీ రోడ్డున పడుతున్నాయి. సరైన ఆహారం దొరక్క అలమటిస్తున్నాయి. దీన్ని చూసి ఆవేదనకు గురైన శ్రీరంగరాజ ఒక్కరోజైనా వాటికి కడుపునిండా ఆహారాన్ని అందించాలనుకున్నారు. ప్రస్తుతం కార్తీక వన సమారాధనలతో అన్ని కుల, మత వర్గాల వారు హడావుడిగా ఉన్నారు. వీటిని చూసింది తడవు ఆయన ఇలా జి.కొత్తపల్లిలోని అటవీ ప్రాంతం వద్ద వానర కార్తీక వస నమారాధనను జరిపారు. దాతకు జంగారెడ్డిగూడెంకు చెందిన కుక్కునూరి కృష్ణకుమార్, కోడూరి ఆంజనేయశర్మలు సహకరించి, వానరాలకు తినుబండారాలను అందించారు. ఆహారం పెడుతున్నారని తెలిసి.. తినుబండారాలను తీసుకొచ్చిన దాత ముందుగా కారు వద్ద ఆంజనేయుని చిత్రపటానికి పూజలు నిర్వహించారు. తరువాత పండ్లు, తినుబండారాలను వానరాలకు అందించడాన్ని మొదలు పెట్టారు. దీన్ని గ్రహించిన వానరాలు రోడ్డుపైకి పరుగులు తీస్తూ వచ్చాయి. మొదట నాలుగైదు వచ్చినా తరువాత వాటి సంఖ్య వంద వరకు వెళ్లింది. అవన్నీ పండ్లను అందుకున్నాయి. రోడ్డు వెంబడి మూడు నాలుగు ప్రాంతాల్లో ఈ తినుబండారాలను అందించారు. రహదారిపై వెళుతున్న ఆ కారు హారన్ విన్న వానరాలు.. పరుగు పరుగున కారు దగ్గరకు వచ్చి, వారందించిన పదార్థాలను ఒకదాని తరువాత మరొకటి అందుకున్నాయి. వాటిని ఆరగించిన తరువాత అడవిలోకి పరుగులు తీశాయి. ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి చాలా మంది మూగజీవాలను పట్టించుకోరు. మానవ మనుగడకు అవి ఎంతగానో దోహద పడతాయి. ముఖ్యంగా జంతువులకు సేవ చేస్తే నేరుగా ఆ భగవంతుడికి సేవ చేసినట్లే. నానాటికీ అడవులు నశించి పోతున్నాయి. ఉన్న కొద్ది పాటి అటవీ ప్రాంతాలను ప్రభుత్వం ప్రైవేటు కంపెనీలకు ఇస్తోంది. దీని వల్ల మూగజీవాల మనుగడ ప్రశ్నార్ధకంగా మారింది. అటవీశాఖ అధికారులు దీన్ని గ్రహించాలి. మూగజీవాలకు ఆహారాన్ని అందించేందుకు ఎవరికి వారు ముందుకు రావాలి. అదే నా ఆశయం. – ఎ.శ్రీరంగరాజ, జంగారెడ్డిగూడెం, దాత వానరాలకు సేవ చేయడం ఆనందం మూగజీవాలైన వానరాలకు ఇలా ఆహార పదార్థాలు అందించడం నాకెంతో ఆనందంగా ఉంది. కార్తీక మాసంలో ఇలా వీటికి సేవ చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎంతో ఆకలితో అవి పరుగు పరుగున వచ్చి తినుబండారాలను అందుకున్నాయి. – కుక్కునూరి కృష్ణకుమార్, జంగారెడ్డిగూడెం నరుడా నీ ఉనికి తెలుసుకో మనం వానర జాతి నుంచి ఉద్భవించి, నరుడిగా జ్ఞానోదయం పొంది, సమాజంలో జీవిస్తున్నాం. కానీ చాలా మంది వానరాలపై ప్రేమ చూపకుండా కఠినంగా వ్యవహరిస్తున్నారు. వానరులు వనాధిపతులు. అవి తల్లిదండ్రులతో సమానం. వాటిని మనం రక్షించుకోవాలి. వాటికి ఆహారాన్ని అందించే మంచి కార్యక్రమాన్ని తలపెట్టాం. ప్రతి ఒక్కరూ మూగజీవాలపై ప్రేమ చూపి, వాటికి ఆహారాన్ని అందించాలి. – కోడూరి ఆంజనేయ శర్మ, జంగారెడ్డిగూడెం -
రాజధాని వానరాలకు ఐడీలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో వానరాలకు ఇక విశిష్ట గుర్తింపు కార్డులు రానున్నాయి. కోతుల జనాభా విచ్చలవిడిగా పెరగడాన్ని నియంత్రించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఢిల్లీ హైకోర్టు అధికారులను ఆదేశించింది. కోతుల స్టెరిలైజేషన్ ఎలా చేపట్టాలనే దానిపై కసరత్తు చేయాలని ఎన్జీవో వైల్డ్ లైఫ్ ఎస్ఓఎస్, మున్సిపల్ కార్పొరేషన్, అటవీ శాఖలను కోరింది. కోతుల సంఖ్యను నిరోధించేందుకు వాక్సినేషన్, స్టెరిలైజేషన్‌లో భాగంగా వాటికి శాశ్వత, విశిష్ట గుర్తింపు సంఖ్యలను (ఐడీ) ఇవ్వాలని ఎన్జీవో వైల్డ్‌లైఫ్ ఎస్ఓఎస్ సూచించింది. ఈ సంస్థ గతంలో ఆగ్రా డెవలప్మెంట్ అథారిటీతో కలిసి ఈ తరహా ప్రాజెక్టును విజయవంతంగా చేపట్టింది. దీంతో ఈ ప్రాజెక్టును ఢిల్లీలో అమలు చేసేలా అధికారులు కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ అంశంపై తదుపరి విచారణను నవంబర్ 7కు వాయిదా వేసింది. -
భయంతో 12 కోతులు మృతి
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర భారతదేశంలోని ఓ అటవీ ప్రాంతంలో 12 కోతులు మృతి చెందడం కలకలం రేపింది. గుట్టగా కోతుల మృతదేహాలు పడి ఉండటాన్ని గమనించిన గిరిజనులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. కోతులకు ఎవరో విషమిచ్చి చంపి ఉంటారని తొలుత అధికారులు భావించారు. కానీ వైద్య పరీక్షల ఫలితాలను చూసిన అధికారులు ఆశ్చర్యపోయారు. భయం వల్ల కలిగిన గుండెపోటుతో కోతులు మరణించాయని రిపోర్టులో ఉంది. దీంతో పులి గాండ్రింపు శబ్దం విని కోతులు మరణించి ఉంటాయని భావిస్తున్నారు. -
కోతుల తాత ఎవరో తెలియనుంది
లండన్ : మనుషులు, కోతులకు మధ్య పోలికలు ఎందుకు ఉన్నాయి? మిగతా జంతువుల మాదిరిగా మనుషులు ఎందుకు ఉండడం లేదు ? ఈ ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించేందుకు లండన్ యూనివర్సిటీ కాలేజీ అధ్యాపకులు సిద్ధమవుతున్నారు. కెన్యాలో 1.3 కోట్ల ఏళ్ల క్రితం నివసించినట్టుగా భావిస్తున్న అలేసి అనే కోతి మృతదేహాన్ని (జీవస్థశిల) పరిశోధించడం ద్వారా విలువైన సమాచారం సేకరించవచ్చని భావిస్తున్నారు. కోతి జాతికి చెందిన చింపాంజీలు, గొరిల్లాలు, ఒరంగుటాన్లు, గిబ్బన్లు మనుషుల మాదిరే ఉంటాయి. అయితే వీటి మూలపురుషుడు ఎవరనేది మాత్రం ఇంత వరకు తెలియదు. ఈ కళేబరాన్ని అధ్యయనం చేయడం ద్వారా ఆఫ్రికాలో మానవుడి ఎదుగుల క్రమాన్ని కూడా అంచనా వేయవచ్చని యూనివర్సిటీ పరిశోధకుడు ఫ్రెడ్ స్పూర్ అన్నారు. ఇందుకోసం జీవస్థశిలను ఫ్రాన్స్‌కు తీసుకెల్లి 3డీ ఎక్స్–రే ద్వారా పరిశోధిస్తారు. -
పెద్ద మాఫియాను నడుపుతున్నకోతులు
జకార్తా: అక్కడ కోతులే గ్రూపులుగా మారి పెద్ద మాఫియాను నడుపుతున్నాయి. విలువైన వాటిని ఎత్తుకుపోయి వాటికి కావాల్సిన ఆహారాన్ని దర్జాగా రాబట్టుకుంటున్నాయి. ఇండోనేషియాలోని ఓ ఆలయంలో ఈ విడ్డూరం నడుస్తోంది. ఆలయానికి వచ్చే యాత్రికుల నుంచి గ్లాసులు, టోపీలు, కెమెరాలు, నగదు ఇతర విలువైన వస్తువులను ఎత్తుకుపోతున్న కోతులు తమకు కావాల్సిన ఆహార పదార్థాల కోసం వాటిని బేరానికి పెడుతున్నాయి. బాధితులు తాము పోగొట్టుకున్న వాటిని తిరిగి రాబట్టుకోవాలంటే కోతులతో బేరమాడక తప్పటం లేదు. ఈ బేరం గనక వాటికి నచ్చితే ఆహార పదార్థాలను తీసుకుని, అందుకు బదులుగా తమ వద్ద ఉన్న వస్తువులను తిరిగి ఇచ్చేస్తున్నాయి. ఈ రకమైన మాఫియాను అక్కడి కోతుల గుంపు కొంతకాలంగా నిర్విఘ్నంగా నడిపిస్తోంది. ఈ వింత ఇండోనేసియా బాలి దీవిలోని ఉలువాతు ఆలయ పరిసరాల్లో జరుగుతోందని బెల్జియంలోని లీజ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకురాలు ఫేనీ బ్రొట్కార్న్తేల్చారు. ఉలువాతు ఆలయ పరిసరాల్లో ఉండే నాలుగు కోతుల గుంపు చేస్తున్న చేష్టలను ఫేజీ బ్రొట్కార్న్ ఆధ్వర్యంలోని పరిశోధకుల బృందం నాలుగు నెలల పాటు అధ్యయనం చేసింది. ఇది ఇక్కడి కోతులకు మాత్రమే ఉన్న ప్రత్యేక అలవాటుగా పరిశోధకులు చెబుతున్నారు. సమూహాలుగా తిరిగే కోతులు కేవలం పరిశీలన ద్వారానే తమ పూర్వీకుల నుంచి ఇలాంటి ప్రక్రియను అలవాటు చేసుకుని ఆవలంభిస్తున్నట్లు గుర్తించారు. వస్తుమార్పిడి, వ్యాపార మెళకువలు మానవులకు మాత్రమే ప్రత్యేకమైన నైపుణ్యాలు. కాగా కోతులు కూడా ఇటువంటి మెలకువలు అలవాటు చేసుకోవటంపై మరింత పరిశోధన సాగిస్తే ఆది మానవుల గురించి మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. -
వానరాల కేరింత..
లేపాక్షి (హిందూపురం) : నిప్పుల కుంపటిని తలపించే ఎండల నుంచి ఉపశమనం పొందాలంటే శరీరం చల్లబడాలి. అందుకు ఏకైక మార్గం ఈత. మనుషులే కాదు వానరాలు సైతం తామేమీ తక్కువ కాదన్నట్టు నీటిలో ఈత కొడుతూ సేదదీరుతున్నాయి. లేపాక్షి వీరభద్రస్వామి దేవాలయం ముందుభాగంలోని పార్కులో పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన నీటి కొలనులో దాదాపు 15 వానరాలు మనుషుల మాదిరే ఈతలో రకరకాల విన్యాసాలు చేస్తున్నాయి. వానరాల కేరింతలు చూసి ఆశ్చర్యపోవడం జనం వంతైంది. -
'మోగ్లీ గర్ల్ మా పాపే'
లఖింపూర్ ఖేరి: ఉత్తరప్రదేశ్ లోని ఓ అడవిలో కోతులతో పాటు జీవిస్తూ పోలీసుల కంటపడిన ఎహ్సాస్ అలియాస్ 'మోగ్లీ గర్ల్' తమ బిడ్డేనంటూ ఓ జంట పోలీసులను ఆశ్రయించింది. ఎహ్సాస్ అసలు పేరు లక్ష్మీ అని 2012లో ఆమె తప్పింపోయిందని వారు చెబుతున్నారు. ఈ మేరకు 2012 నవంబర్ లో పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు పత్రాన్ని ఆధారంగా చూపారు. తమకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించి లక్ష్మీని అప్పగించాలని కోరుతున్నారు. రోటిన్ పెట్రోలింగ్ కు వెళ్లిన పోలీసులకు అడవిలో కోతులతో ఆడుకుంటూ ఓ అమ్మాయి కనిపించింది. దీంతో ఆమె కాపాడి స్ధానిక ఆసుపత్రిలో చేర్పించారు పోలీసులు. ఇందుకు సంబంధించి ఓ కేసును కూడా నమోదు చేశారు. అడవిలో ఏర్పాటు చేసిన కెమెరాలకు చిక్కలేదని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. కాగా, మోగ్లీ గర్ల్ తమ బిడ్డేనని జంట చూపుతున్న ఫిర్యాదు పత్రాన్ని పరిశీలించిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటామని పోలీసులు తెలిపారు. -
ఉత్తర ప్రదేశ్‌లో మోగ్లీ పాప
-
కోతులతో సావాసం.. మనుషులంటే వణుకు
బహ్రెయిక్: కోతులతో కలిసి ఉంటున్న ఓ ఎనిమిదేళ్ల బాలికను ఉత్తరప్రదేశ్ బాలికలు రక్షించారు. పెద్ద మొత్తంలో గుంపులుగుంపులుగా ఉన్న కోతుల మధ్య ఆ బాలిక ఎలా ప్రమాదం లేకుండా ఉండగలిగిందో అని ఆశ్చర్యపోతున్నారు. ఆ బాలిక కనీసం మనుషుల్లాగా మాట్లాడటంగానీ, ప్రవర్తించడంగానీ చేయడం లేదు. పైగా మనుషులను చూసి తెగ భయపడుతోంది. ఈ వింత పరిస్థితుల్లో ఉన్న ఆ బాలికను ప్రస్తుతం జిల్లా ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే.. బహ్రెయిక్ ప్రాంతంలో రోజువారి మాదిరిగానే సురేశ్ యాదవ్ అనే సబ్ ఇన్స్పెక్టర్ మోతిపూర్ ప్రాంతంలో కటార్నియాఘాట్ వైల్డ్ లైఫ్ సాంక్చూరీలో పెట్రోలింగ్ చేస్తుండగా అతడికి కోతుల మధ్య ఉన్న ఓ ఎనిమిదేళ్ల బాలిక కనిపించింది. అది చూసి అతడు ఆశ్చర్యపోయాడు. ఇతర అధికారులకు కూడా సమాచారం ఇచ్చి ఆ బాలికను తీసుకొచ్చేందుకు వెళ్లగా కోతులు అతడిపై దాడి చేసేందుకు ప్రయత్నించాయి. వాటితోపాటు ఆ బాలిక కూడా కోతుల మాదిరిగానే చేయబోయింది. అతి కష్టం మీద ఆ బాలికను రక్షించిన పోలీసులు ఆస్పత్రికి తరలించారు. అయితే, వైద్యానికి ఆ బాలిక స్పందిస్తోందని, అప్పుడప్పుడు మాత్రం హింసాత్మక ధోరణితో ప్రవర్తిస్తోందని చెబుతున్నారు. అయితే, మెల్లగా మార్పు వస్తుందని అంటున్నారు. ప్రస్తుతం నడవడం కూడా నేర్పిస్తున్నామని, అచ్చం జంతువుల మాదిరిగానే కాళ్లు చేతులను కలిపి ఆ బాలిక నడుస్తోందని తెలిపారు. -
కోతుల లొల్లిని పట్టించుకోరేం..?
అసెంబ్లీలో మంత్రిని నిలదీసిన అధికారపక్ష సభ్యులు ⇒ పంటలు ధ్వంసం చేస్తున్నా చర్యలు చేపట్టకపోవడంపై ఆగ్రహం ⇒ ఒక్క ఫిర్యాదూ రాలేదన్న మంత్రి జోగు రామన్న ⇒ దైవస్వరూప భావన వల్ల ఏం చేయలేకపోతున్నామని వ్యాఖ్య ⇒ సమస్య పరిష్కారానికి త్వరలో ఎమ్మెల్యేలతో భేటీ అవుతానని వెల్లడి సాక్షి, హైదరాబాద్: శాసనసభలో మరోసారి కోతుల లొల్లిపై తీవ్ర చర్చ జరిగింది. ప్రతి అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై పార్టీలకతీతంగా సభ్యులు ప్రశ్నిస్తున్నా ప్రభుత్వం నుంచి సరైన స్పందన కనిపించకపోవటంపట్ల సభ్యులు మండిపడ్డారు. మంగళవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశాన్ని అధికార పార్టీ సభ్యుడు జలగం వెంకట్రావు ప్రస్తావించారు. కోతులు పంటలకు తీవ్ర నష్టం కలిగిస్తున్నా ప్రభుత్వం సమస్య పరిష్కారానికి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. దీనిపై అటవీశాఖ మంత్రి జోగు రామన్న స్పందిస్తూ కోతులు, పాములను దైవస్వరూపంగా భావించే సంప్రదాయం ఉన్నందున వాటి విషయంలో కఠినంగా వ్యవహరించే వీలు లేదని వణ్యప్రాణుల చట్టం చెబుతోందన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం గతంలో విడుదల చేసిన ఉత్తర్వులో ఈ రెండింటినీ మినహాయించినట్లు సభ దృష్టికి తెచ్చారు. అయితే కోతులను జాబితా నుంచి మినహాయించామని చేయి దులుపుకొంటే ఎలా అని ప్రశ్నించిన వెంకట్రావు... వాటిని కూడా చేరుస్తూ మరో ఉత్తర్వు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమయంలో అధికార పార్టీకి చెందిన మరో సభ్యుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు జోక్యం చేసుకుని కోతులు పంటలకు నష్టం చేస్తుండటం వల్ల కొందరు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని, ఇది చాలా తీవ్రమైన విషయమన్నారు. కోతులను తరిమేందుకు కనీసం కొండెంగలనైనా సరఫరా చేయాలని కోరారు. కొండెంగలతో ప్రయోజనం లేదని, వాటిని కోతులు కరిచి తరిమేస్తున్నాయని స్పీకర్ మధుసూదనాచారి పేర్కొన్నారు. కోతులను పట్టుకుంటే రూ. 300 చొప్పున చెల్లిస్తాం: జోగు రామన్న గతంలో హిమాచల్‌ప్రదేశ్ లాంటి రాష్ట్రాలు చేపట్టిన కోతుల నియంత్రణ చర్యలను పరిశీలించామని, కానీ అవి ఆశాజనకంగా లేవని ఆ రాష్ట్రాలే ప్రకటించాయని మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లో మూడు లక్షల కోతులుంటే కేవలం 9 వేల కోతులనే పట్టుకోగలిగారన్నారు. ప్రస్తుతం కోతులను పట్టడంలో నైపుణ్యం ఉన్నవారూ దొరకడం లేదన్నారు. ఎవరైనా కోతులను పట్టుకుంటే రూ. 300 చొప్పున చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కోతుల వల్ల పంట నష్టం జరుగుతోందన్న ఫిర్యాదు ఇప్పటివరకు రాలేదని, సమస్య పరిష్కారానికి త్వరలో ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. కోతుల గురించి శాసనసభలో మాట్లాడుతుంటే తమాషా అనుకుంటున్నారేమో... ఇది చాలా తీవ్రమైన సమస్య. కానీ మంత్రిగారు అసలు సమస్యే లేదన్నట్టు స్పందించడం సరికాదు – అధికారపక్ష సభ్యుడు జలగం వెంకట్రావు కోతుల బెడదతో రైతులు ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తోంది. పంట చేతికందే సమయంలో దాడి చేస్తున్న కోతులు రైతును తీవ్ర నష్టాలకు గురిచేస్తున్నాయి. దీన్ని అటవీశాఖ మంత్రి ఎందుకు తీవ్రంగా పరిగణించడంలేదో అర్థంకావట్లేదు – అధికారపక్ష సభ్యుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు కోతుల వల్ల పంట నష్టం జరిగినట్టు ఒక్క ఫిర్యాదూ అందలేదు. అయినా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం – అటవీశాఖ మంత్రి జోగు రామన్న -
పంతం నీదా..నాదా..సై!
సింగరాయకొండ: ఏరా ఆంజనేయులూ మా లక్ష్మిని ఏదో కామెంట్ చేశావంటా! జాగ్రత్త తాట తీస్తా ఏందిరా హనుమంతూ నాతోనే పెట్టుకుంటావా.. నీ కూతురు జోలికి నేను రాలా. ఆమె అబద్ధం చెబుతోంది. నేను కూడా మా అమ్మానాన్నను తీసుకొస్తా అంటూ వేగంగా వెళ్లిపోయాడు ఆంజనేయులు. సీన్ కట్ చేస్తే.. ఆటువైపు 25 వానరాలు.. ఇటు వైపు పాతికవానరాలు సింగరాయకొండ రైల్వేస్టేషన్ రోడ్డులో గురువారం యుద్ధానికి సన్నద్ధం అయ్యాయి. ఒకవర్గంపై మరో వర్గం కాలు దువ్వాయి.. పళ్లు ఇకిలించాయి.. దుమ్ము లేపాయి..తొడకొట్టాయి! రేయ్ కాంతారావూ నీ కొడిక్కి చెప్పు.. హద్దుల్లో ఉండకపోతే కొరికి పారేస్తా వార్నింగు ఇచ్చాడు హనుమంతుని పేరుతో ఉన్న వానరం కాంతారావు కూడా రెచ్చిపోయాడు తన సైన్యంతో అటువైపు దూకాడు. ఇదంతా చూస్తున్న జనం నిశ్చేష్టులయ్యారు. ఎప్పుడు వాటిమధ్య భీకర యుద్ధం జరుగుతుందోనని టెన్షన్ పడ్డారు. చివరకు వాటి మధ్య కాంప్రమైజ్ కుదిరింది. ఏ కోతి దారిన ఆ కోతి వెళ్లింది. –సింగరాయకొండ -
ఎడాపెడా కరిచేస్తున్న కోతులు
సైదాబాద్‌లో కిష్కింధకాండ ఎడాపెడా కరిచేస్తున్న కోతులు 80కి చేరిన బాధితుల సంఖ్య బయటకు రావాలంటేనే జంకుతున్న జనం వానరాల బెడదతో చెన్నై రెలైక్కిన మహిళ ‘సైదాబాద్ పరిధి కల్యాణ్‌నగర్ కాలనీకి చెందిన సత్యవతి ఇంట్లో వంట చేస్తుండగా.. ప్రధాన ద్వారం గుండా వచ్చిన ఓ కోతి వెనకాల నుంచి ఆమె చెరుు్య పట్టుకుని గట్టిగా కొరికింది. భయంతో బయటకు పరుగులు తీసిన ఆమె...వెంటనే ఓ ఆస్పత్రికి వెళ్లి రూ.40 వేలు ఖర్చు చేసి వైద్యం చేరుుంచుకుంది. కోతి కరిచిన విషయాన్ని చెన్నైలో ఉండే కుమారుడికి ఫోన్ ద్వారా తెలిపింది. వెంటనే అతను శుక్రవారం టికెట్ బుక్ చేయగా ఇక్కడి కోతుల భయానికి బాధితురాలు చెన్నైకి బయలుదేరి వెళ్లింది’...ఇది వినడానికి వింతగా ఉన్నా నిజం. సైదాబాద్ ప్రాంతంలో కోతులు ప్రజలను హడలెత్తిస్తున్నారుు. ఇప్పటి వరకు దాదాపు 80 మందిని కరిచి గాయపర్చారుు. - సైదాబాద్ సైదాబాద్: సైదాబాద్ స్థానిక ప్రజలను ఇప్పుడు కోతులు బెంబేలెత్తిస్తున్నారుు. స్థానికంగా కోతుల సమూహంలో ఉన్న రెండు కోతులు మతిస్థిమితం కొల్పోరుు కనిపించిన వారిపై పడి కరిచి పారిపోతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఉదయాన్నే పాల ప్యాకెట్లు తెచ్చేందుకు బయటకు వచ్చిన వారిపైన, వాకింగ్‌కు వెళ్లే వారు కోతుల దాడిలో గాయపడి ఆసుపత్రుల్లో చేరుతున్నారు. కుక్క కాటు కంటే ఎక్కువగా కోతులు కరుస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. స్థానికంగా ఓ మతిస్థిమితం లేని కోతి ఎప్పుడు ఎటువైపు నుంచి దాడి చేస్తుందోనని స్థానికులు భయం భయంగా గడుపుతున్నారు. స్కూల్‌కు వెళ్లే విద్యార్థులను కూడ పిచ్చెక్కిన కోతి వదలడం లేదు. తలపైకి ఎక్కి ముఖాన్ని గోళ్లతో గీరుతూ, నోటితో కొరికి పారిపోతోందని స్థానికులు చెబుతున్నారు. సైదాబాద్ డివిజన్ వీకేదాగ్‌నగర్‌లో శుక్రవారం ఒక్క రోజే 20 మందిని కోతి కరవడం గమనార్హం. కళ్యాణ్‌నగర్‌లో 30, ఎస్బీహెచ్ ఏ, బీ, సీ కాలనీలో 30 మందిని గాయపర్చింది. ఇప్పటికే బాధితుల సంఖ్య 80కి చేరిందని స్థానికులు చెబుతున్నారు. కోతి కరిచిన వెంటనే బాధితులను కార్పొరేటర్ సింగిరెడ్డి స్వర్ణలత శ్రీనివాస్‌రెడ్డి వైద్యం కోసం నారాయణగూడ ఆసుపత్రికి తరలిస్తున్నారు. స్థానికంగా కోతి కాటుకు సంబంధించి వైద్య సదుపాయాలు అందుబాటులో లేవని చెబతున్నారు. చేసేది లేక చాలా మంది ప్రరుువేటు ఆస్పత్రులకు వెళ్లి రూ.వేలు ఖర్చు చేసి వైద్య పరీక్షలు, చికిత్సలు చేరుుంచుకుంటున్నామని బాధితులు వాపోతున్నారు. జాలీల ఏర్పాటు కోతుల పట్టుకోడానికి రంగంలోకి దిగిన జూ సిబ్బంది కల్యాణ్‌నగర్, వీకేదాగ్‌నగర్, సీ కాలనీలో పార్కులు, ఇళ్లపైన జాలీలను ఏర్పాటు చేశారు. నిన్న రెండు కోతులను పట్టుకున్నప్పటికీ మతిస్థిమితం లేని కోతి జాడ దొరక్కపోవడంతో దాని కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కార్పొరేటర్ స్వర్ణలతరెడ్డి ప్రత్యేక శ్రద్ధపెట్టి ఎప్పటికప్పుడు అధికారులు, ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అరుునా ఆ కోతి దోరక్కపోవడంతో అందరు భయంభయంగానే రాకపోకలు సాగిస్తున్నారు. ఒక్క రోజులోనే 50 మంది బాధితులు పెరిగారు. పరిస్థితి ఇలాగే ఉంటే జనం భయటకు రావాలంటేనే జంకే దుస్థితి నెలకొంది. కోతులను పట్టుకోవాలి సైదాబాద్ డివిజన్లో సంచరిస్తున్న కోతులను పట్టుకోడానికి జూ సిబ్బందితో పాటు ఫారెస్ట్, జీహెచ్ఎంసీ సిబ్బంది సమిష్టిగా కృషి చేయాలి. లేదంటే ఇక్కడి జనం కోతుల బారిన పడి మరింత మంది గాయాలపాలయ్యే ప్రమాదం ఉంది. కోతులను పట్టడంలో నేర్పరిలను తీసుకొచ్చి ఇక్కడి కోతులను తీసుకెళ్లే పయత్నం చేయాలి. బాధితుల కోసం వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండే విధంగా చూడాలి. - సింగిరెడ్డి స్వర్ణలతరెడ్డి, కార్పొరేటర్ వెంటనే చర్యలు తీసుకోవాలి కోతుల బారి నుంచి సైదాబాద్ డివిజన్ ప్రజలను రక్షించే ఏర్పాట్లు చేయాలి. ఇప్పటికే ఎంతో మందిని కరిచివెళ్లింది. వైద్యం చేరుుంచుకోవాలంటే రూ. వేలు ఖర్చు చేయాల్సి వస్తుంది. రాజేష్ అనే వ్యక్తి వైద్యానికి ఇప్పటికే రూ. 5 వేలు దాటింది. జూ అధికారులు వెంటనే చర్యలు తీసుకుని కోతులను పట్టుకునే విధంగా కృషి చేయాలి. - కిష్టయ్య, బ్యాంకు కాలనీ -
కోతుల కట్టడి ఇలాగా.. ?
తెనాలి: జంతు సంరక్షణ చట్టాల్లో కాలానుగుణంగా మార్పులు తెస్తూ తగిన ప్రచారం చేస్తున్నా అమలు చేయాల్సిన ప్రభుత్వ శాఖలకు మాత్రం అవి చెవికెక్కటం లేదు. జంతువులను ప్రేమగా చూడాలని, హింసించవద్దనీ దేశవ్యాప్తంగా జంతు ప్రేమికులు పోరాడుతున్నారు. మూడు చిన్న బోనుల్లో గురువారం తెనాలి పట్టణానికి చెందిన మున్సిపాలిటీ సిబ్బంది 96 కోతుల్ని ఇలా కిక్కిరిసేలా ఉంచారు. పట్టణంలోని వివిధ ప్రదేశాల్లో సంచరిస్తున్న కోతులను అదుపులోకి తీసుకొని ఇలా చాలీచాలని బోనుల్లో బంధించారు. ఆ మూగజీవుల బాధను కళ్లారా చూసి చలించిన ఓ పౌరుడు తన స్మార్ట్‌ఫోనులో ఫొటో తీసి మీడియాకు పంపించారు. ఈ విషయం తర్వాత మున్సిపాలిటీ వారికి తెలిసిందో ఏమో? సాయంత్రానికల్లా టాటా ఏస్ వాహనం తీసుకొచ్చి కోతులను చిలకలూరిపేట వద్ద కొండల్లో వదిలేందుకు సిద్ధమయ్యారు. -
ఐఐటీ-బీ హాస్టళ్లలో కోతుల బీభత్సం
ముంబై: ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-బొంబాయి(ఐఐటీ-బీ) విద్యార్ధులు ఇప్పుడు చదువుకు భయపడటం లేదు. రోజూ తమ హస్టళ్లపై దాడి చేసి విధ్వసం సృష్టిస్తున్న కోతులను చూస్తే బెంబేలెత్తిపోతున్నారు. క్యాంపస్ లోని నాలుగు హస్టళ్ల పరిస్థితి అయోమయంగా ఉంది. తలుపు తీస్తే ఎప్పుడు ఏ కోతి గదిలోకి వచ్చి దాడి చేస్తుందో తెలీక విద్యార్ధులు బిక్కుబిక్కుమంటున్నారు. విద్యార్థుల చేతుల్లోని తినుబండారాలను లాక్కోవడమే కాకుండా, తాళం వేయని గదుల్లోకి ప్రవేశించి ఎలక్ట్రానిక్ వస్తువులను నాశనం చేస్తున్నాయి. అక్కడితో ఆగకుండా గదిలోని మంచాలపై పడుకుని నిద్రపోతున్నాయి. దాదాపు 10 నుంచి 15కోతులు ఎప్పటినుంచో క్యాంపస్ లో ఉంటున్నాయి. వాటి వల్ల చాలా మంది విద్యార్ధులు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చివరి సంవత్సర విద్యార్ధి ఒకరు చెప్పారు. ఇందుకు సంబంధించిన వివరాలను క్యాంపస్ మేగజీన్ లో విద్యార్ధులు ప్రచురించారు. దీంతో విద్యార్ధులు హాస్టళ్లకు నడిచివెళ్లేటప్పుడు చేతిలో చిన్న కర్రను ఉంచుకోవాలని, హాస్టల్ ప్రాంగణంలో టపాకాయలు కాల్చుతుండాలని క్యాంపస్ కోరింది. క్యాంపస్ అడవికి దగ్గరగా ఉండటం వల్లే కోతుల బెడద ఎక్కువగా ఉందని ఓ ప్రొఫెసర్ అన్నారు. తరచూ క్యాంపస్ లో గందరగోళాన్ని సృష్టిస్తూ ఉంటాయని పేర్కొన్నారు. కేవలం హాస్టళ్ల మీదే కాక, గతంలో ఆఫీసుల మీద కూడా కోతులు దాడి చేసిన ఘటనలు ఉన్నాయని వివరించారు. జంతురక్షణ సంస్థలు తరచూ కోతులను సురక్షిత ప్రాంతాలకు పంపుతున్నా అవి మళ్లీ మళ్లీ తిరగి వస్తూనే ఉన్నాయని విద్యార్ధుల డీన్ తెలిపారు. విద్యార్ధులు వారి వస్తువులను జాగ్రత్త చూసుకోవాలని సూచించారు. -
‘కస్తూర్బా’లో కోతుల బాధ
నిజాంసాగర్ : అటవీ ప్రాంతాల్లో సంచరించాల్సిన వానరసైన్యం జనారణ్యంలో స్వైరవిహారం చేస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నియోజకవర్గంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లోకి కోతులు వెళ్తున్నాయి. ఈ పాఠశాలలు మండల కేంద్రానికి దూరంగా ఉండడంతోపాటు ప్రహరీలూ లేవు. వంటశాలలతో పాటు స్నానపుగదులు, మూత్రశాలలు, తరగతి గదుల్లోకి కోతులు వస్తున్నాయి. విద్యార్థులు భోజనం చేస్తున్న సమయంలో వారిపై దాడులకు దిగుతున్నాయి. చేతుల్లో ఉన్న వస్తువులతో పాటు ప్లేట్లల్లో ఉన్న ఆహారాన్ని ఎత్తుకెళ్తున్నాయని విద్యార్థులు పేర్కొంటున్నారు. దీంతో విద్యార్థులు భయాందోళనలకు గురవుతున్నారు. ఇటీవల నిజాంసాగర్ కేజీబీవీలో సుమలత, శ్రావణి అనే విద్యార్థినులపై కోతులు దాడి చేశాయి. మండలకేంద్రంలోని బీసీ, ఎస్సీ వసతి గృహాలు, నవోదయ విద్యాలయంలోనూ కోతుల బెడద ఉంది. కోతుల బెడద ఎక్కువగా ఉంది మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఈ ఏడాది కోతుల బెడద ఎక్కువైంది. అటవీ ప్రాంతానికి ఆనుకుని విద్యాలయం ఉండడంతో కోతులు ఇక్కడికి వస్తున్నాయి. విద్యార్థులపై దాడులు చేస్తున్నాయి. దీంతో విద్యార్థులు భయపడుతున్నాం. కోతుల బెడద విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. – సరోజన, కేజీబీవీ ప్రిన్సిపాల్, నిజాంసాగర్ -
ఇళ్లు పీకి పందిరేస్తున్నాయి..
నగరంలో బెంబేలెత్తిస్తున్న వానర సైన్యం ఆందోళనలో మహా నగర వాసులు గ్రేటర్ ఇంజినీరింగ్, ప్రజారోగ్య విభాగాల నడుమ సమన్వయ లోపం కాంట్రాక్టర్‌కు రూ.4లక్షల బిల్లుల చెల్లింపులో జాప్యం వరంగల్ అర్బన్ : అడవుల శాతం తగ్గిపోవడంతో ఊర్లలోకి కోతులు వచ్చేశాయి.. అయితే, వచ్చిన కోతులు ఊరికే ఉంటాయా? నగరంలోని పలు ఇళ్లను పీకి పందిరేస్తున్నాయి. ఒకటి కాదు రెండు కాదు వందలాది కోతులు నగరంలో సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. కోతులు పట్టే పని అప్పగించిన కాంట్రాక్టర్‌కు బిల్లులు మాత్రం చెల్లించకపోవడంతో చేతులెత్తేశాడు. ఫలితంగా నెల రోజుల నుంచి కోతుల కారణంగా ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మహా నగర పాలక సంస్థ పరిధిలో ఒక కోతిని పట్టుకున్నందుకు గాను రూ. 450 చెల్లించే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. పొరుగు రాష్ట్రంలోని నెల్లూరుకు చెందిన ఓ వ్యక్తి కోతులు, కుక్కలను పట్టే కాంట్రాక్టు తీసుకున్నారు. దీనికోసం సదరు కాంట్రాక్టర్ వద్ద పనిచేసే వారు బాగా సమస్య ఉన్న ప్రాంతాల్లో బోన్లు ఏర్పాటుచేసి అందులో అరటి పండ్లు, పల్లీలు ఎరగా వేస్తారు. వరుసగా రెండు రోజులపాటు వీటిని తినేందుకు కోతులు వస్తాయి. మూడోరోజు బోనులో కోతులు చిక్కుతాయి. ఇలా పట్టుకున్న కోతులను వారానికికోసారి నగరానికి దూరంగా భూపాలపల్లి, కాళేశ్వరం, ఏటూరునాగారం, పాఖాల కొత్తగూడెం అడవుల్లోకి తరలిస్తారు. అందుకోసం బల్దియా ప్రత్యేకంగా వాహనాన్ని సమకూరుస్తుంది. ఎప్పటికప్పుడు ఆ కాంట్రాక్టర్ కోతికి రూ.450 చొప్పున బల్దియా నుంచి బిల్లులు చెల్లించాలి. కానీ కొన్నిరోజులుగా బిల్లులు చెల్లించని కారణంగా సమస్య మళ్లీ మెుదటికొచ్చింది.] నాలుగు నెలలు.. 900 కోతులు గత నాలుగు నెలల కాలంలో పదమూడు వందల కోతులు పట్టుకున్నట్లు బల్దియా రికార్డులు చెబుతున్నాయి. ఇందులో గత రెండు నెలల కాలంగా 900 పైగా కోతులు పట్టుకున్నట్లు వివరాలు ఉన్నాయి. ఒక కోతిని పట్టుకుని బల్దియా వాహనంలో ఏటూరునాగారం అడవుల్లో వదిలేసినందుకు కాంట్రాక్టర్‌కు రూ.450 చొప్పన చెల్లిస్తున్నారు. గత రెండు నెలలుగా 900 కోతులకు సంబంధించిన రూ.4.05లక్షల సొమ్మును సదరు కాంట్రాక్టర్‌కు చెల్లించలేదు. దీంతో నెల రోజులుగా ఆ కాంట్రాక్టర్ కోతులు పట్టుకోవడం మానేశారు. దీంతో నగరంలో కోతుల సమస్య జఠిలంగా తయారైంది. ఇది పక్కన పెడితే కోతులను ఎప్పటికప్పుడు అడవుల్లో వదిలేస్తుండగా.. కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లిస్తున్నారు. అయినా, మళ్లీ కోతులు పెద్దసంఖ్యలో ఎలా వస్తున్నాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇకనైనా ఉన్నతాధికారులు సమస్యల మూలాలపై దృష్టి సారించడంతో పాటు కాంట్రాక్టర్‌కు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తూ కోతుల బెడద నుంచి తమను రక్షించాలని నగర వాసులు కోరుతున్నారు. ఏ కాలనీలో చూసినా కోతుల గుంపులే... వానర సేనలు గుంపులు గుంపులుగా నగరంలో సంచరిస్తున్నాయి. పాఠశాలకు వెళ్లే పిల్లలు కోతుల భయంతో వణికిపోతున్నారు. బజారుకు వెళ్లి కూరగాయలు, పండ్లు తీసుకుని వచ్చే సమయంలో మీద పడి చేతుల్లో ఉన్న కవర్లు, సంచులను లాక్కుంటున్నాయని నగర వాసులు వాపోతున్నారు. ఒకటో, రెండో కాకుండా పదుల సంఖ్యలో వానరాలు ప్రత్యక్షమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక కోతులు ఆకలి, దప్పిక సమయాల్లో ఇళ్లల్లోకి చొరబడి ఇంటిలో ఉన్న పండ్లు, కూరగాయల తదితర సామాగ్రిలు ఎత్తుకుపోతున్నాయని చెబుతున్నారు. ఎక్కడెక్కడ అంటే.. ట్రైసిటీ పరిధిలో కోతుల సమస్య తీవ్రంగా ఉంది. వరంగల్‌లోని గిర్మాజీపేట, గోవిందరాజుల గుట్ట, చౌర్బౌళి, పిన్నవారి వీధి, రామన్నపేట, పాపయ్యపేట చమన్, పోచమ్మమైదాన్, ఎల్బీ నగర్, కాశిబుగ్గ, క్రిస్టియన్ కాలనీ, గాంధీనగర్, అబ్బనికుంట, చింతల్, ఏ.సీ.రెడ్డి నగర్, శివనగర్, పెరకవాడ, ఖిలా వరంగల్, కరీమాబాద్, ఎస్ఆర్ఆర్.తోట, ఉర్సు, రంగశాయిపేట, వరంగల్ రైల్వేస్టేçÙన్, ఎల్లంబజార్, ప్రాంతాల్లో కోతుల బెడద విపరీతంగా ఉంది. ఇంకా హన్మకొండలోని కాకాజీ కాలనీ, పింజర్ల వీధి, శ్రీనివాస కాలనీ, లక్ష్మీపురం, బ్రాహ్మణవాడ, పద్మాక్ష్మి కాలనీ, న్యూశాయంపేట, దీన్‌దయాళ్ నగర్, నాగేంద్ర నగర్, రాయపురతో పాటు కాజీపేట రైల్వే స్టేషన్, విష్ణుపురి, సిద్ధార్థనగర్ తదితర ప్రాంతాల్లో కోతులు భయాందోళనకు గురిచేస్తున్నాయి. వారం రోజులుగా పట్టుకోవడం లేదు.. కాంట్రాక్టర్‌కు బిల్లుచెల్లింపులో జాప్యమైన విషయం వాస్తవమే. దీంతో సదరు కాంట్రాక్టరు గత పక్షం రోజులుగా కోతులను పట్టుకోవడం లేదు. దీంతో ఫిర్యాదులు పెరిగాయి. నాలుగైదు రోజుల్లో కాంట్రాక్టర్‌కు రూ.4లక్షల చెక్కు ఇప్పిస్తాం. ఆ వెంటనే కోతులు పట్టుకునేలా చర్యలు వేగవంతం చేస్తాం. – బాలముని, బల్దియా ఈఈ -
వానరానికి తీరని కష్టం
రాష్ట్రంలో పెలైట్ ప్రాజెక్ట్‌గా జిల్లా ఎంపిక చించోలి(బి) వద్ద ఏర్పాటుకు ఆదేశాలు రూ.2 కోట్లు కేటాయిస్తూ సర్కారు ఉత్తర్వులు నెలలు గడుస్తున్నా ప్రారంభం కాని పనులు నిర్మల్‌రూరల్ : కనిపించిన చెట్టునల్లా నరుడు నరుక్కుంటూ పోవడంతో వానరానికి తీరని కష్టం వచ్చింది. వనాలు అంతరించి పోతుండటంతో అవి జనావాసాల బాట పట్టాయి. ఒకప్పుడు పచ్చని చెట్లపై.. నచ్చిన పండ్లు ఫలాలు తింటూ అడవుల్లో హాయిగా బతికిన కోతులు.. ఇప్పుడు ఇన్ని మెతుకుల కోసం ఎదురు చూస్తున్నాయి. ఎక్కడ ఒక్క మెతుకు దొరికినా ఏరుకు తింటున్నాయి. సరిపడా ఆహారం దొరకక తమలో ఘర్షణ పడుతున్నాయి. ఆకలికి తాళలేకనే ఇళ్లలోకి చొరబడుతున్నాయి.. మనుషులపై దాడికి దిగుతున్నాయి. ఈ వానర కష్టం.. వాటితో మనిషికి కలుగుతున్న నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. వానరజాతిని మళ్లీ వనాలబాట పట్టించాలని నిర్ణయించింది. ఇందుకు పెద్దఎత్తున హరితహారం చేపడుతోంది. దీనికి తోడు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న వానర జాతిని అరికట్టేందుకు, వాటి సమస్యలను తీర్చేందుకు మన జిల్లాకు పునరావాస కేంద్రాన్ని మంజూరు చేసింది. అయితే.. ఉత్తర్వులు జారీ అయి దాదాపు మూడునెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఈ కేంద్రం ఏర్పాటు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. చించోలి(బి) వద్ద ఏర్పాటుకు.. అడవుల జిల్లాగా.. కోతుల ఖిల్లాగా పేరొందిన ఆదిలాబాద్ జిల్లాను పునరావాస కేంద్రానికి పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. సారంగాపూర్ మండలం చించోలి(బి) సమీపంలో కోతులకు పునరావాస, రక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు మేలోనే ఉత్తర్వులు జారీ చేసింది. రూ.2 కోట్ల వరకు కేటాయించింది. ప్రభుత్వం చించోలి(బి)ని ఎంచుకోవడానికి సహేతుక కారణాలు ఉన్నాయి. నిర్మల్ నుంచి ఆదిలాబాద్ వెళ్లే మార్గంలో గల ఈ గ్రామానికి సమీపం నుంచే మహబూబ్ ఘాట్స్ ప్రారంభమవుతాయి. ఇక్కడ దట్టమైన అటవీప్రాంతంతో పాటు నీటి లభ్యత కూడా బాగానే ఉంటుంది. ఈ ప్రాంతంలోనే కోతులు అధికంగా ఉన్నాయి. వానరాల సంఖ్య అధికంగా ఉన్న నిర్మల్ నుంచి ఇక్కడికి వాటిని సులువుగా తరలించవచ్చు. నిర్మల్‌లోనే ఎక్కువ.. తినడానికి తిండి లేక.. తాగడానికి నీళ్లు లేక వనవాసం వదిలిన కోతులు కొన్నేళ్ల కిందటే జనావాసాల్లోకి వచ్చి చేరాయి. జిల్లాలో వీటి సంఖ్య నిర్మల్ ప్రాంతంలోనే ఎక్కువగా ఉంది. ఇక్కడ కోతులు జీవనం సాగించడానికి అనువైన గుట్టలు, సమీపంలోనే అడవులు ఉండటంతో పట్టణంలోనే స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నాయి. మొదట్లో ఇళ్లలో తినగా మిగిలిన పదార్థాలను చెత్తకుండీల్లో పడేస్తే ఏరుకుని తింటూ జీవనం సాగించాయి. కాలక్రమంలో వాటి సంఖ్య విపరీతంగా పెరిగింది. రానురాను ఆహారం దొరకడం కష్టంగా మారడంతో వాటి తీరు కూడా మారింది. ఆహార పదార్థాల కోసం ఇళ్లల్లో దూరడం, మనుషులపై దాడులు చేయడం మొదలు పెట్టాయి. ఇక గ్రామాల్లో పంటపొలాలను నాశనం చేయడం, ఇళ్లపై పెంకులు తొలగించడం చేస్తున్నాయి. దీంతో నిర్మల్‌తోపాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకూ కోతులు సమస్యగా మారాయి. కొంతకాలంగా వాటిని అడవుల్లోకి తరలించాలంటూ అధికారులకు వినతిపత్రాలను కూడా సమర్పించారు. ఈ నేపథ్యంలో నిర్మల్ మున్సిపాలిటీ పాలకవర్గం దాదాపు 2500 కోతులను పట్టుకుని జన్నారం అటవీ ప్రాంతానికి తరలించింది. అప్పట్లో అటవీశాఖ మంత్రి జోగురామన్న దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకెళ్లారు. కేంద్రం ఏర్పాటయితే.. రక్షణతోపాటు పునరావాస కేంద్రం ఏర్పాటయితే వానరాలతో మనుషులకు సమస్య తీరడంతో పాటు.. వాటి సమస్యలూ తీరనున్నాయి. ఈ కేంద్రంలో వెటర్నరి వైద్యశాలను ఏర్పాటు చేస్తారు. కోతులకు వచ్చే వ్యాధులను నయం చేసే వైద్యులు నిరంతరం అందుబాటులో ఉంటారు. ఇందుకో సిబ్బందికి అక్కడే క్వార్టర్స్‌ను నిర్మిస్తారు. అలాగే విపరీతంగా పెరిగిపోతున్న వానరాల సంతతిని అరికట్టేందుకు ఇక్కడ ప్రత్యుత్పత్తి చికిత్సలూ చేస్తారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల ద్వారా కోతుల సంఖ్యను తగ్గించే చర్యలు చేపడతారు. ఇక కోతులకు ఇష్టమైన పండ్ల చెట్లను కూడా ఈ కేంద్రంలో పెంచుతారు. పునరావాసం ఇంకెప్పుడు.. వానరాల కోసం ప్రభుత్వం ప్రత్యేక పునరావాస, రక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామనడంతో జంతుప్రేమికులు హర్షం వ్యక్తం చేశారు. తమకు బాధ తప్పడంతోపాటు వాటిని సరైన ఆవాసం దొరకనుందని భావించారు. అయితే.. ఇది గడిచి ఇప్పటికే దాదాపు మూడునెలలు కావస్తోంది. కానీ.. ఇంకా పునరావాస కేంద్రానికి సంబంధించిన పనులు ప్రారంభం కాలేదు. ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిన తర్వాత అటవీశాఖ ఉన్నతాధికారులు వచ్చి చించోలి(బి)లో స్థలాన్ని మాత్రం పరిశీలించి వెళ్లారు. మరోవైపు నిర్మల్‌తోపాటు చుట్టుపక్కల వానరాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. నిర్మల్ నుంచి ఆదిలాబాద్ వెళ్లే మార్గంలో రోడ్డుకు ఇరువైపులా కొన్ని వేలాది కోతులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కోతులను ఇంకెప్పుడు వనాలకు తరలిస్తారని, పునరావాస కేంద్రం ఎప్పుడు ప్రారంభిస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. హరితహారం సీజన్ పూర్తికాగానే పునరావాస కేంద్రంపై దృష్టి పెడతామని అధికారులు చెబుతున్నారు. -
కోతులకు ఫ్యామిలీ ప్లానింగ్!
ఆగ్రా: స్వల్ప వ్యవధిలోనే కోతుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటం ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా వాసులకు సమస్యగా మారింది. పట్టణంలో ఎక్కువ సంఖ్యలో ఉన్న దేవాలయాలు, భక్తుల ఉదార స్వభావం కోతుల పాలిట వరంగా మారింది. ఇప్పటికే పట్టణంలో సుమారు 8,000 కోతులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటిని అలాగే వదిలేస్తే రానున్న ఆరేళ్లలో వీటి సంఖ్య 2.16 లక్షలకు చేరుతుందని అంచనా వేసిన.. అధికారులు, వైల్డ్ లైఫ్ ఎన్జీవోలు కోతుల్లో ఫ్యామిలీ ప్లానింగ్(కుటుంబ నియంత్రణ) అమలు చేయాలని నిర్ణయించారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే 317 కోతుల్లో వ్యాక్సిన్ల ద్వారా ఫ్యామిలీ ప్లానింగ్‌ను అమలు చేశారు. దీని ద్వారా రానున్న ఆరేళ్లలో 7,200 కోతుల సంఖ్య పెరగకుండా నిర్మూలించినట్లు వైల్డ్ లైఫ్ ఎన్జీవో 'ఎస్ఓఎస్' సహ వ్యవస్థాపకుడు సత్యనారాయణ వెల్లడించారు. అయితే మరికొన్ని కోతుల్లో సైతం ఈ ప్రక్రియ చేపట్టాల్సి ఉందని ఆయన తెలిపారు. రీసస్ మకాక్స్ సంతతికి చెందిన ఈ కోతుల్లో.. ప్రతీ ఆడకోతి 18 నెలలకు ఒకసారి మూడు పిల్లలకు జన్మనిస్తుందని తెలిపారు. -
బీభత్సమే..
పల్లెలపై వానర మూకల దాడులు విసిగి వేసారిన జనం ఇళ్లు, దుకాణాలు, పంటల పొలాలపై దాడులు రోడ్డు వెళ్తున్నా ఊరుకోవు వీరవిహారం చేస్తున్న కోతులు బెంబేలెత్తిపోతున్న జనం వామ్మో, కోతులు.. అడవులను వదిలి జనారణ్యంలోకి చొరబడ్డాయి. వానర మూకల వీరవిహారానికి జనం బెంబేలెత్తిపోతున్నారు. ఇళ్లు, పొలాలు, దుకాణాలపై దాడులకు దిగుతున్నాయి. రోడ్డున వెళ్లే వారిని సైతం భయపెడుతున్నాయి. ఇళ్లపై పెంకులను ధ్వంసం చేస్తున్నాయి. ఇళ్లు, దుకాణాల్లోకి చొరబడి బీభత్సం సృష్టిస్తున్నాయి. పంటలను నాశనం చేస్తున్నాయి. ఇలా ఎవరికీ కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వాటిని బంధించి అటవీ ప్రాంతంలో వదిలిపెడుతున్నా మళ్లీ గ్రామాల్లోకి చొరబడుతున్నాయి. - మిరుదొడ్డి మండలంలోని అందె, అల్వాల, చెప్యాల, లింగుపల్లి, మల్లుపల్లి, రుద్రారం, వీరారెడ్డిపల్లి, అల్మాజీపూర్, జంగపల్లి, ఖాజీపూర్, బేగంపేట, భూమపల్లి, అక్బర్పేట, కూడవెల్లి, మోతె, కాసులాబాద్, మిరుదొడ్డి, ఆరెపల్లి, ధర్మారం, కొండాపూర్ తదితర గ్రామాల్లో వానర మూకలు సంచరిస్తున్నాయి. విద్యార్థులు పాఠశాలలకు వెళ్తున్న క్రమంలో వెంటపడి భయపెడుతున్నాయి. ఎవరి చేతిలోనైనా తినుబండారాలు కనిపిస్తే చాలు అదరగొట్టి బెదరగొట్టి ఎత్తుకెళ్తున్నాయి. ఇళ్లల్లోకి చొరబడి నిత్యావసర సరుకులను చిందరవందర చేస్తున్నాయి. పెరట్లో పెరిగే చిన్నచిన్న పూల మొక్కలను నాశనం చేస్తున్నాయి. కిరాణా దుకాణాల్లో చిరుతిళ్ల డబ్బాలను ఎత్తుకెళ్లడం పరిపాటిగా మారింది. ఇక చేసేది లేక ఇంటి యజమానులు, దుకాణాదారులు కర్రలు పట్టుకుని నిత్యం కాపలా కాస్తున్నారు. ఇంత చేసినా వానర మూకలు గుంపులు గుంపులుగా వచ్చి ఎదురు తిరుగుతున్నాయి. దీంతో జనాలు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఇళ్లపైకెక్కి కూన పెంకులను ధ్వంసం చేస్తున్నాయి. ఇక పొలాలల్లో పడి రైతుల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. పంటలపై పడి నానా బీభత్సం సృష్టిస్తున్నాయి. చేసేది లేక రైతులు పంట పొలాల్లోనే కాపలా ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అటవీ ప్రాంతం నుంచి జనారణ్యంలోకి.. మండలంలోని కొండాపూర్, అందె, మిరుదొడ్డి శివారుతో పాటు కాసులాబాద్, లక్ష్మీనగర్, మోతె గ్రామాలను ఆనుకుని విశాలమైన అటవీ ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలో గత రెండేళ్ల నుంచి కరువు తాండవిస్తుండటంతో వానర మూకలకు ఆహారం దొరకడం లేదని పలు గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు. అటవీ ప్రాంతంలో ఆహారం దొరక్క వానర మూకలు జనారణ్యంలోకి అడుగు పెడుతున్నాయి. తిండి కోసం నానా హైరానా చేస్తున్నాయి. కోతుల బెడద నివారణకు... పంటలపై పడి తీవ్ర నష్టం కల్గించడంతోపాటు, ఇళ్లల్లో చొరబడి నానా హంగామా సృష్టిస్తున్న వానరాల నుంచి విముక్తి పొందడానికి మహారాష్ట్ర వాసులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఒక్కో గ్రామం నుంచి వానర మూకలను పట్టి దూరంగా ఉన్న అటవీ ప్రాంతంలో వదిలేయడానికి మహారాష్ట్రకు చెందిన వారితో రూ.4 లక్షల వరకు ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిసింది. ఒప్పందం ప్రకారం కోతులను బంధించి అటవీ ప్రాంతంలో వదిలి వేసినా... తిరిగి అవి జనారణ్యంలోకి వస్తున్నాయి. ఇప్పటికైనా కోతుల బెడద నుంచి విముక్తి కల్పించడానికి అధికారులు చర్యలు చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు. వెంటబడుతున్నాయి.. పాఠశాలకు వెళ్లేదారిలో కోతులు వెంటబడుతున్నాయి. దారిలో అడ్డగించి ముప్పు తిప్పలు పెడుతున్నాయి. చేతిలో ఏది కనబడినా భయపెట్టి లాక్కెళ్తున్నాయి. పాఠశాలకు వెళ్లాలంటేనే భయమేస్తోంది. - మద్దెల ప్రవీణ్, విద్యార్థి ఇళ్లల్లోకి చొరబడుతూ... ఇళ్లల్లోకి చొరబడి సామన్లను చిందరవందర చేస్తున్నాయి. తినే వస్తువులు ఉంటే చాలు ఎత్తుకుపోతున్నాయి. వెళ్లగొట్టడానికి ప్రయత్నిస్తే ఎదురు తిరిగి భయపెడుతున్నాయి. కోతి చేష్టలతో వేగలేక పోతున్నాం. - అనసూయ, మహిళ పంట పొలాలను నాశనం చేస్తున్నాయి.. పంట పొలాలపై కోతుల మూకలు పడి సర్వనాశనం చేస్తున్నాయి. పంటలను కోతుల నుండి రక్షించుకోవడానికి రోజుల తరబడి కాపలా ఉంటున్నాం. అధికారులు స్పందించి కోతుల బెడద నుంచి రక్షించేలా చర్యలు తీసుకోవాలి. - రాజు, రైతు -
దానం చెయ్యబోతే.. దాడి జరిగింది!
పుణ్యక్షేత్రం వీదుల్లో నడుస్తూ వెళుతున్నాడో భక్తుడు. రోడ్డు పక్కనే కూర్చున్న కోతి ఆర్తితో అతనివైపు చూసింది. 'పాపం.. ఆకలితో అలమటిస్తుందేమో' అనుకుని చేతిలో ఉన్న అరటి పండును కోతికి అందించాడు. అంతే.. ఒక్క గంతులో పదుల కోతులు అతణ్ని చుట్టుముట్టాయి. నాకంటే నాకంటూ పోటీపడి పైపైకి ఎక్కేశాయి. ఈ దృశ్యాన్ని ఓ వ్యక్తి ఫొటో తీసి ప్రఖ్యాత న్యూస్ నెట్ వర్కింగ్ సైట్ రెడిట్ లో పోస్ట్ చేశాడు. సదరు సంఘటనను వేరొక అంశానికి ముడిపెడుతూ కొందరు నెటిజన్లు తమ ఫొటోషాప్ ప్రతిభ చూపారు. ఈ ఫొటో చూసిన తర్వాతైనా కోతులు నివసించే క్షేత్రాల్లో జాగ్రత్తగా ఉంటారు కదా! (చదవండి: పాప భయంపై ఫొటోషాప్ పోట్లాట) కోతుల దాడిని ఆక్స్ ప్రకటనతో పోల్చుతూ.. డోనాల్డ్ ట్రంప్ అభిమానులను కోతులతో పోల్చుతూ.. -
మంత్రిగారికి కోతుల బెంగ!
షిమ్లా: హిమాచల్ ప్రదేశ్ మంత్రి ఒకరు కోతుల విషయంలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ పంటలను నాశనం చేసి అవి రాష్ట్రానికి తీరని నష్టం కలిగిస్తున్నాయని, ఆర్థికంగా కోట్లలో నష్టాన్ని కలిగిస్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అసలు వాటిని ఎలా కట్టడి చేయాలో తమకు సలహాలు, సూచనలు ఇవ్వాలంటూ ఆయన బహిరంగంగా ప్రకటించారు. హిమాచల్ ప్రదేశ్ లో అటవీ శాఖమంత్రిగా ఠాకూర్ సింగ్ భార్మౌరి పనిచేస్తున్నారు. ఆయన ఓ మీడియాతో మాట్లాడుతూ తమ రాష్ట్రంలో కోతుల బెడద ఎక్కువైందని చెప్పారు. ప్రజలు, రైతులు, జంతు హక్కుల ఉద్యమకారులు, చట్టప్రతినిధులు ఎవరైనా సరే తమకు కోతుల కట్టడి విషయంలో సలహాలు సూచనలు ఇవ్వొచ్చని అన్నారు. 1990లో 61 వేల కోతులు ఉండగా.. 2004లో అవి 3,17,000 పెరిగాయని అన్నారు. స్టెరిలైజేషన్ ప్రోగ్రాం ద్వారా వాటి సంఖ్యను 2,07,614కు తగ్గించగలిగామని చెప్పారు. ఇవి పంటపొలాలను ధ్వంసం చేయడం కారణంగా కోట్లలో నష్టం వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. -
కోతులకూ కుర్రాళ్ల ప్రవర్తన..
వాషింగ్టన్: మనుషుల్లానే కోతులు కూడా తమ జీవితకాలం పాటు ఇతరుల చూపులను అర్థం చేసుకుంటాయని శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. హార్వర్డ్ వర్సిటీ, పెనోస్లోవియా వర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల బృందం 481 రైసిస్ కోతుల మీద ఈ అధ్యయనం నిర్వహించారు. శిశువులతో పోలిస్తే కాస్త ముందుగానే బాల్య దశలో ఉన్న కోతులు శాస్త్రవేత్తల చూపులకు చురుగ్గా స్పందించాయని, పైకి చూడగానే ఇవి కూడా చూపును పైకి మరల్చాయని వివరించారు. ఇక కుర్రాళ్లలా యవ్వనంలో ఉన్న మగ కోతులు ఆడ కోతుల వైపు అధికంగా చూసేవని తెలిపారు. వృద్ధాప్యంలో సైతం మనుషుల్లానే తమ చూపులను తిప్పాయన్నారు. చూసి నేర్చుకోవడం అనేది భాష, సామాజిక అవగాహన, జ్ఞానాన్ని పెంచుకునేందుకు పునాదని, ఇది మానవ జీవితంలో కీలక పాత్ర పోషిస్తుందని వాల్ యూనివర్సిటీ చెందిన లారీ సాన్టోస్ తెలిపారు. -
కోతుల కోసం 'ప్రభుత్వ' ఫుడ్ స్టేషన్లు
సిమ్లా: మారిన కోతుల ఆహారపు అలవాట్లతో మనుషులకు చచ్చేంత చావొచ్చిపడింది. వంటగదులు, కిరాణం షాపులపై దాడులు చేస్తుండటంతోపాటు కొన్నిసార్లు పిల్లల్ని కరిచిన ఉదంతాలు తెలిసినవే. కోతుల బెడదను అధికంగా ఎదుర్కొంటున్న రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్ ఒకటి. ఆ రాష్ట్రంలోని ప్రముఖ జక్కూ హనుమంత ఆలయం వద్ద రికార్డు సంఖ్యలో కోతులు నివసిస్తుంటాయి. భక్తుల నుంచి తినుబండారాలను బలవంతంగా లాక్కొని తింటుంటాయి. ఈ క్రమంలో వాటి ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు అక్కడి కోతులు ఆహారం కోసం పూర్తిగా మనుషుల మీద ఆధారపడి బతుకుతున్నాయి. ఈ నేపథ్యంలో వాటి అలవాట్లను మార్చేందుకు త్వరలోనే వైల్డ్ లైఫ్ వింగ్ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో కోతులకు ప్రత్యేకంగా ఫుడ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు హిమాచల్ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. జియోగ్రాఫికల్ ఇంన్ ఫర్మేషన్ సిస్టం ద్వారా కోతుల సంఖ్యను లెక్కగట్టిన వైల్డ్ లైఫ్ డిపార్ట్ మెంట్ ఒక్క సిమ్లాలోనే కోతుల సంఖ్య 2,500 గా ఉన్నట్టు నిర్ధారించింది. -
నీటి కోసం కోతి తిప్పలు..
వేసవికి ముందే ఎండలు మండుతున్నాయి. జనానికే కాదు.. జంతుజాలానికీ గొంతులు ఎండుతున్నాయి. సోమవారం నర్సాపూర్ ఐబీ వద్ద తాగునీటి కోసం మర్కటాలు నానా తంటాలు పడ్డాయి. అక్కడున్న పైప్‌లైన్ నుంచి లీక్ అవుతున్న నీటి చుక్కలతో నోరు తడుపుకొనేందుకు క్యూ కట్టాయి. ఒకదాని తరువాత ఒకటి గొంతు తడుపుకొని వెళ్లిపోయాయి. - నర్సాపూర్ -
కోతుల దాడి: గుండెపోటుతో వ్యక్తి మృతి
రామగుండం: కరీంనగర్ జిల్లా రామగుండం రైల్వే స్టేషన్లో కోతుల దాడితో భయపడిపోయిన ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందారు. రైల్వే మాజీ ఉద్యోగి అయిన అమీరుద్దీన్ ఖాజేపేటలో నివాసం ఉంటారు. రామగుండంలో ఓ వేడుకకు కుటుంబ సభ్యులతో కలసి హాజరైన ఆయన శుక్రవారం రాత్రి తిరుగు ప్రయాణం అయ్యారు. రామగుండం రైల్వే స్టేషన్లో రెండో ప్లాట్‌ఫామ్‌కి వెళ్లేందుకు ఫుట్ఓవర్ బ్రిడ్జి వెళ్తుండగా ఒక్కసారిగా కోతుల మంద దాడి చేసింది. ఆయన చేతిలో అరటి పండు ఉండడంతో అమీరుద్దీన్పై దాడికి దిగాయి. భయంతో పరుగు పెడుతూ గుండెపోటు రావడంతో ఆయన కుప్పకూలి పోయారు. ఆసుపత్రికి తీసుకుని వెళ్లే లోపలే ఆయన ప్రాణాలు వదిలారు. -
‘కోతి’ పనులు చేయవు!
ఎవరైనా పిల్లలు అల్లరి చేస్తే కోతి పనులు చేయకండంటూ తిడతారు.. కానీ ఈ కోతులు చూడండి.. ఎంత బాగా బుద్ధిమంతుల్లా కూర్చున్నాయో..! అంతేకాదు వాళ్ల టీచర్ ఏం చెప్పినా చేసేస్తాయి. ఇంతకీ ఈ కోతుల స్కూల్ ఏంటి.. దాని ప్రత్యేకత ఏంటనుకుంటున్నారా..? చైనాలో ప్రతి 12 ఏళ్లకోసారి మర్కట నామ సంవత్సరం వస్తుంటుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 8న ప్రారంభం కానున్న కొత్త సంవత్సర వేడుకల కోసం కోతులకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. చైనాలోని షాండాంగ్ ప్రావిన్స్‌లో ఉన్న డాంగ్‌యింగ్ జూపార్క్‌లోని కోతుల స్కూల్లో వాటికి ఓ టీచర్ శిక్షణ ఇస్తుండగా తీసిన ఫొటో ఇది. -
పాఠశాలలో కోతులకు శిక్షణ!
చైనా: ‘ప్రెజెంట్ సార్’.. అంటూ చేయి పెకైత్తుతున్న ఈ కోతి నిజంగానే పాఠశాలలో శిక్షణ తీసుకుంటోంది. ఈ ఏడాదిని మర్కటనామ సంవత్సరంగా ప్రకటించిన చైనా.. ఫిబ్రవరి 8 నుంచి వేడుకలు నిర్వహిస్తుండడంతో అందులో పాల్గొనేందుకు ఈ కోతులు చైనాలోని డాంగ్యుంగ్ జూలోని ఓ పాఠశాలలో ఇలా శిక్షణ పొందుతున్నాయి.