బంగారు కోతులు అతని పంట పండించాయి | Netherland Photographer Won Award For Golden Monkeys Photo | Sakshi
Sakshi News home page

బంగారు కోతులు అతని పంట పండించాయి

Published Mon, Oct 22 2018 11:46 AM | Last Updated on Tue, Sep 3 2019 8:43 PM

Netherland Photographer Won Award For Golden Monkeys Photo - Sakshi

బహుమతి పొందిన బంగారు కోతులు చిత్రం, ఫోటోగ్రాఫర్‌ మార్సల్‌

95 దేశాల నుంచి 45 వేల ఫొటోలు.. అందులోంచి ఎంపిక చేశారు.. ఈ ఒక్క చిత్రాన్ని.. 2018 వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ పురస్కారం నెదర్లాండ్స్‌కు చెందిన మార్సల్‌కు దక్కింది.. గోల్డెన్‌ కపుల్‌ పేరిట ఆయన తీసిన ఈ బంగారు కోతుల చిత్రానికి గ్రాండ్‌ ప్రైజ్‌ వరించింది. దీన్ని చైనాలోని కిన్‌లింగ్‌ పర్వత ప్రాంతంలో తీశారు. ఈ కోతులు అంతరించిపోతున్న జీవజాతుల జాబితాలో ఉన్నాయి. అది కూడా ఈ పర్వత ప్రాంతంలోనే ఉన్నాయట. ఒకచోట స్థిరంగా ఉండకుండా అటూ ఇటూ దూకుతూ ఉన్నాయని.. ఈ ఫొటో తీయడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందని మార్సల్‌ తెలిపారు.  ఏటా ఈ పోటీలను లండన్‌లోని ప్రఖ్యాత నేచురల్‌ హిస్టరీ మ్యూజియం నిర్వహిస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement