Netherland
-
ఇక్కడి అమ్మాయి.. అక్కడి అబ్బాయి (ఫొటోలు)
మైసూరు: ప్రేమ ఎల్లలు దాటింది. మైసూరుకు చెందిన యువతి, నెదర్లాండ్‌కు చెందిన యువకుడి మధ్య చిగురించిన ప్రేమ ఫలించింది. దీంతో పెద్దల సమక్షంలో హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. నగరంలోని హూటగళ్లికి చెందిన విద్య, నెదర్లాండ్‌కు చెందిన యువకుడు రుటైర్ పరస్పరం ప్రేమించుకున్నారు. ఈ విషయాన్ని ఇరు కుటుంబాల పెద్దలకు తెలియపరచగా వారి పెళ్లికి అంగీకరించారు. దీంతో నగరంలోని కల్యాణ మండపంలో చెన్నగిరి తాలూకాలోని పాండోమట్టి విరక్త మఠం డాక్టర్ గురుబసవ స్వామీజీ నేతృత్వంలో విద్యా మెడలో రుటైర్ తాళి కట్టాడు. అనంతరం పెళ్లికి వచ్చిన అతిథులు వారిని ఆశీర్వదించి శుభాశీస్సులు పలికి విందు భోజనం ఆరగించారు. -
డచ్ కార్యాలయంలో భారతీయ వంటకాలు..వీడియో వైరల్!
భారతదేశ సంస్కృతిలానే ఇక్కడ ఆహారం కూడా సంప్రదాయనుగుణంగా, ఆరోగ్యకరంగా ఉంటుంది. ప్రస్తుతం ఈ సోషల్ మీడియా పుణ్యమా అని భారతీయ వంటకాల గురించి ఖండాంతరాలకు వ్యాప్తి అవుతోంది. విలక్షణమైన స్వీట్స్, మసాలాతో కూడిన వంటకాలు చూసి విదేశీయలు సైతం టేస్ట్ చేసేందుకు ముందుకు వస్తున్నారు. పైగా వాళ్లు కూడా ఈ వంటకాలను చేసేందుకు రెడీ అవుతున్నారు కూడా. ఇప్పడు ఇదంత ఎందుకంటే..మన భారతీయ వంటకాలను ఓ డచ్ కంపెనీ తన ఉద్యోగులకు సర్వ్ చేస్తోంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నెదర్లాండ్‌లో అనువింద్ కన్వాల్ అనే భారతీయుడు తన ఆఫీస్‌లో ఉద్యోగులుకు భారతీయ ఆహరం పేరుతో మన సంప్రదాయ వంటకాలు సర్వ్ చేసిన వీడియోని పంచుకున్నారు. ఇది ]ప్రశ్నించగదిగినది' అనే క్యాప్షన్ జోడించి మరీ ఈ వీడియోని పోస్ట్ చేశారు. అంతేగాదు కన్వాల్ పోస్ట్‌లో తన కార్యాలయంలో భారతీయ ఆహారం అనేది కొంచెం సందేహాస్పదంగా ఉన్నప్పటికీ.. ఎలా ఈ వంటకాలను వండారు అనేదాని గురించి తాను తెలుసుకోవాలనుకోవడం లేదని అన్నారు. అలాగే తన కార్యాలయంలో బెల్ పెప్పర్ పడిమా చట్నీ, నాన్స్ తదితర భారతీయ వంటకాలను సర్వ్ చేసినట్లు కూడా తెలిపారు. ఈ వీడియోకి ఒక మిలియన్‌కి పైగా వ్యూస్, లైక్‌లు వచ్చాయి. నెటిజన్లు మాత్రం ఇలా వైవిధ్యంగా ఉండేందుకు ప్రయత్రిస్తున్న సదరు కంపెనీని ప్రశంసించగా, మరికొందరూ భారతీయ వంటకాలు ఖండాంతారాలకు చేరుకోవడం విశేషమే కాకుండా టేస్టే చేయాలనే వారి ధైర్యాన్ని కూడా మెచ్చుకోవాల్సిందేనని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Anuvind Kanwal (@anuvindkanwal) (చదవండి: టేస్ట్ అట్లాస్ మెచ్చిన డెజర్ట్‌తో గుండె ఆరోగ్యం పదిలం..!) -
Euro Cup 2024: సెమీస్‌లో నెదర్లాండ్స్‌కు షాక్.. ఫైనల్లో ఇంగ్లండ్
యూరో కప్-2024 ఫైనల్లో ఇంగ్లండ్ అడుగుపెట్టింది. డార్ట్మండ్ వేదికగా జరిగిన నెదర్లాండ్స్‌తో జరిగిన రెండో సెమీఫైనల్లో 2-1 తేడాతో విజయం సాధించిన ఇంగ్లీష్ జట్టు.. రెండో సారి ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. ఆద్యంతం తీవ్ర ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో ఆఖరి నిమిషం గోల్ సాధించిన ఇంగ్లండ్ ప్లేయర్ ఓలీ వాట్కిన్స్.. తన జట్టుకు సంచలన విజయాన్ని అందించాడు.ఈ సెమీస్ పోరులో ఫస్ట్‌హాఫ్ తొలి 10 నిమిషాల్లో ఇంగ్లండ్‌పై నెదర్లాండ్స్ ఆధిపత్యం చెలాయించింది. తొలి ఆర్ధబాగం 7వ నిమిషంలో డచ్ మిడ్ ఫీల్డర్ క్జేవీ సైమన్స్ తమ జట్టుకు మొదటి గోల్‌ను అందించాడు. దీంతో ఆరంభంలోనే డచ్ జట్టు 1-0 ఆధిక్యంలో దూసుకెళ్లింది. అయితే కొద్దిసేపటికే ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ కేన్ పెనాల్టీ గోల్‌తో స్కోర్‌ను సమం చేశాడు. ఫస్ట్ హాఫ్ ముగిసే సమయానికి ఇరు జట్లు చెరో గోల్‌తో సమంగా నిలిచాయి.ఇక సెకెండ్ హాఫ్ ప్రారంభమైన తర్వాత ఇరు జట్లు కొన్ని వ్యూహాత్మక మార్పులు చేశాయి. డచ్ తరుపున డోనియెల్ మాలెన్ స్ధానంలో వుత్ వెఘోర్స్ట్ సబ్‌స్ట్యూట్‌గా రాగా.. మరోవైపు త్రీ లయన్స్ జట్టుకు కీరన్ ట్రిప్పియర్ స్థానంలో ల్యూక్ షా వచ్చాడు. అయినప్పటికీ ఫలితం మాత్రం శూన్యం. ఈ క్రమంలో ఇంగ్లండ్ ఆఖరి 20 నిమిషాలకు ముందు తమ జట్టులో మరో రెండు మార్పులు చేసింది. స్టార్ ప్లేయర్లు హ్యారీ కేన్, ఫిల్ ఫోడెన్లు బయటకు వెళ్లగా.. వారిస్ధానాల్లో ఒల్లీ వాట్కిన్స్ , కోల్ పామర్ మైదానంలో వచ్చారు. అయితే సెకెండ్ హాఫ్ సమయం ముగుస్తున్నప్పటికి గోల్ మాత్రం ఇరు జట్లు సాధించలేకపోయాయి. దీంతో పెనాల్టీ షుటౌట్ తప్పదని అంతా భావించారు. కానీ మ్యాచ్ ఆఖరి నిమిషం(90వ మినిట్)లో సబ్‌స్ట్యూట్‌గా వచ్చిన వాట్కిన్స్ అద్భుతం చేశాడు. సంచలన గోల్‌తో వాట్కిన్స్ తన జట్టును రెండో సారి ఫైనల్‌కు చేర్చాడు. ఇక జూలై 15న జరగనున్న ఫైనల్లో స్పెయిన్‌తో ఇంగ్లండ్ తలపడనుంది. -
జంటగా చేతిలో చేయి వేసుకుని మరణించటం మాటలు కాదు..!
వృద్ధాప్యంలోకి వచ్చాక..భార్యాభర్తల్లో ఎవరో ఒకరు ముందు చనిపోవడం సహజం. మిగిలిని వారు ఆ విరహాన్ని తట్టుకోవడం కూడా అసాధ్యమే. చాలామటుకు ఆ బెంగతో మిగిలినవారు మహా అయితే ఆరు నెలలు లేదా ఏడాదిలోపు చనిపోవడం జరుగుతుంది. అయితే కొందరూ మరణంలోకూడా జంటగా కలిసే చనిపోవాలనుకుంటారు. అలాంటి అవకాశం అందరికీ రాదు కూడా. బహుశా అందువల్లే వృధాప్యంలో ఉన్న వాళ్లను ఒంటరిగా వదిలేయరేమో!. కానీ ఇక్కడొక వ్యక్తి ఓ దేశానికి ప్రధానిగా విజయవంతంగా బాధ్యతలు నిర్వర్తించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక వృధాప్యంలోకి చేరిన అతను మరణంలో కూడా భార్యని విడిచిపెట్టకూడదనుకున్నాడు. అందుకోసం వాళ్లేం ఏం చేశారో వింటే..కన్నీళ్లు ఆగవు.! వివరాల్లోకెళ్తే..డ్రైస్ వాన్ అగ్ట్ అనే వ్యక్తి నెదర్లాండ్ మాజీ ప్రధాని. అతను ప్రధానిగా 1977 నుంచి 1982 మధ్య కాలంలో ప్రధానిగా పనిచేశాడు. క్రిస్టియన్ డెమోక్రటిక్ అప్పీల్ అనే పార్టీని కూడా స్థాపించాడు. 2009లో 2009లో పాలస్తీనా హక్కుల కోసం వాదించేందుకు ది రైట్స్ ఫోరం అనే సంస్థను ఏర్పాటు చేశాడు. అధ్యక్షుడిగా ఉన్నంతసేపు నెదర్లాండ్ దేశంలో విలువలను కాపాడాడు. నిబద్ధమైన రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందాడు. అక్కడి రాజకీయాలను శాసించాడు. ఆయనకు యూజీనీ అనే భార్య ఉంది. ప్రస్తుతం అగ్ట్కి 93 ఏళ్లు కాగా, అతడి భార్యకు కూడా ఇంచుమించుగా అంతే వయసు ఉంటుంది. ఇరువురు వృధాప్యంలోకి చేరిపోయారు. అయితే డ్రైస్కి 2019 నుంచి బ్రెయిన్ హేమరేజ్‌తో బాధపడుతున్నాడు. అప్పటి నుంచి అతను మంచం మీదే ఉన్నాడు. ఇక అతని భార్య కూడా గత కొంతకాలం నుంచి అనారోగ్యానికి గురై మంచానికే పరిమితమయ్యింది. ఇద్దరూ మంచానికే పరిమితమయ్యారు, పైగా ఇరువురిలో ఎవరూ ముందు చనిపోయినా తట్టుకునే లేదు. దీంతో ఇరువురు జంటగా మరణించాలనే ఉద్దేశ్యంతో ద్వంద్వ అనాయాస మరణాన్ని ఆశ్రయించారు. అలా ఫిబ్రవరి 5న డ్రైస్ వాన్ అగ్ట్, యూజీనీ తమ స్వస్థలమైన నిజ్ మెగన్ లో ఒకరి చేతిలో ఒకరు చేయి వేసుకుని కన్నుమూశారు. ఈ విషయాన్ని దీ రైట్స్ ఫోరం ధృవీకరించింది.”మా వ్యవస్థాపకుడు, గౌరవ చైర్మన్ డ్రైస్ వాన్ అగ్ట్ ఫిబ్రవరి 5, నిజ్ మెగన్ లో తన భార్యతో కలిసి మరణించారు. వారిద్దరూ 70 సంవత్సరాల పాటు వైవాహిక జీవితాన్ని గడిపారు. డ్రైస్ వాన్ అగ్ట్ తన భార్యను నా అమ్మాయి అని సంబోధించేవాడు. ఇద్దరు చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని” ది రైట్స్ వింగ్ డైరెక్టర్ గెరాడ్ జొంక్ మన్ తెలిపారు. ఇదిలా ఉండగా, నెదర్లాండ్‌లో "ద్వంద అనాయాస" లేదా ఇద్దరు వ్యక్తులు ఏకకాలంలో ప్రాణాంతక ఇంజెక్షన్‌ను తీసుకును చనిపోలానుకోనే ధోరణి ఎక్కువగా ఉంది. ఇలానే 2021లో 13 జంటలు, 2022లో ఏకంగా 29 జంటలు ప్రాణాలు పోగొట్టుకున్నట్లు తెలిపారు. నిజానికి దీన్ని ఇంగ్లీష్‌లో “duoEuthanasia” అంటారు.. తెలుగులో అయితే “అనాయాస మరణం” అని అంటారు. అయితే నెదర్లాండ్ దేశంలో ప్రతి ఏడాది దాదాపు వెయ్యి మంది వ్యక్తులు అనాయాస మరణం కోసం సంప్రదిస్తున్నట్లు ఎక్స్ పర్టి సెంట్రమ్ యుతనాసి ప్రతినిధి ఎల్కే స్వార్డ్ చెబుతున్నారు. ముఖ్యంగా నెదర్లాండ్ దేశం 2002 నుంచి ఈ అనాయాస మరణాన్ని చట్టం చేసింది. దీన్ని ఆరు షరతులతో అమలు చేశారు. అయితే ఇలా కారుణ్య మరణం కావాలనుకునేవారు అందుకు తగ్గ కారణాలు చూపించాల్సి ఉంటుంది. భరించలేని బాధలు, అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందలేకపోవడం వంటివి ఇందులో ఉంటాయి. అనుమతి పొందిన వారికి వైద్యులు విషపూరిత ఇంజెక్షన్‌ను ఇస్తారు. మరోవైపు ఇలాంటి మరణాలను ప్రోత్సహించేది లేదంటూ అమెరికా, ఆసియా, యూరప్ లోని కొన్ని దేశాలు చట్టాలు రూపొందించాయి. కాగా, నెదర్లాండ్ మాజీ ప్రధాని, ఆయన భార్య అనాయస మరణం పొందడం పట్ల ప్రపంచ దేశాల అధిపతులు సంతాపం వ్యక్తం చేశారు. (చదవండి: 1700 ఏళ్ల నాటి పురాతన గుడ్డు..ఇప్పటికీ లోపల పచ్చసొన..!) -
ఆ గ్రామం పూల రాజధాని! అక్కడ ఎటు చూసినా..
ఆ గ్రామంలో ఎటు చూసినా రంగు రంగుల పూలు కనువిందు చేస్తాయి. ఏ వీథిలోకి వెళ్లినా పూల పరిమళాలు మనసును ఆహ్లాదపరుస్తాయి. ప్రపంచ పూల రాజధానిగా పేరు పొందిన ఆ గ్రామం నెదర్లాండ్స్‌లో ఆమ్స్టర్డామ్కు చేరువలో హార్లెమ్ సరస్సు తీరంలో ఉంది. ఆల్స్మీర్ అనే ఈ ఊరు నలువైపులా పూలతోటలు, వీథుల్లో పూల దుకాణాలు కనిపిస్తాయి. ఇక్కడి నుంచి పూలు భారీ ఎత్తున దేశ దేశాలకు ఎగుమతి అవుతుంటాయి. ఈ గ్రామస్థుల్లో అత్యధికులు పూలరైతులు. గిట్టుబాటు ధర కోసం ప్రతిరోజూ వేలం నిర్వహిస్తుంటారు. ‘రాయల్ ఫ్లోరా హాలండ్ ఫ్లవర్ ఆక్షన్’ కేంద్రంగా ఈ పూల వేలంపాటలు జరుగుతుంటాయి. దేశ విదేశాలకు చెందిన వర్తకులు ఇక్కడి నుంచి పూలను టోకున తీసుకువెళుతుంటారు. గత శతాబ్ది తొలినాళ్లలోనే ఆల్స్మీర్ పూలసాగుకు ప్రధాన కేంద్రంగా మారింది. ఈ గ్రామంలో దాదాపు 250 ఎకరాల విస్తీర్ణంలో పూల వేలంశాల ఉంది. ఇక్కడ ముప్పయివేలకు పైగా పూల రకాలు దొరుకుతాయి. ప్రతిరోజూ సగటున 48 లక్షల పూలమొక్కలు ఇక్కడి నుంచి విదేశాలకు ఎగుమతి అవుతుంటాయి. ఇక్కడ ఏటా జరిగే ఫ్లవర్ పరేడ్‌ను తిలకించడానికి పెద్దసంఖ్యలో విదేశీ పర్యాటకులు వస్తుంటారు. (చదవండి: నేలమీది తారక: పువ్వు కాదు.. పుట్టగొడుగు!) -
మానవ అవయవాల గురించి తెలుసుకోవాలంటే?ఈ మ్యూజియంకు వెళ్లాల్సిందే!
ఇంతవరకు ఎన్నో రకాల మ్యూజియంలను చూసుంటారు. ఆర్ట్‌కి సంబంధించి, డిఫెరెంట్ ఫోటోలు, లేదా పురాతన వస్తువులు, మమ్మీలు, కొన్ని రకాల వజ్రాలు తదితర విభిన్న మ్యూజియంలు గురించి మాత్రమే విన్నాం. కానీ ఇది అన్నింటికంటే విభిన్నమైన మానవ శరీర అవయవాలకు సంబంధించిన మ్యూజియం. మనిషి శరీరంలోని అవయవాల గురించి సబ్జెక్ట్ పరంగానో వైద్యుల ద్వారానో విని ఉంటాం. కానీ వాటి పనితీరుని ప్రత్యక్షంగా చూడాలనుకుంటే ఈ మ్యూజియంకు వెళ్లాల్సిందే. ఇందులో మానవుని తల నుంచి కాలి వరకు ఉన్న అంతర్గత అవయవాల పనితీరుని నేరుగా చూడొచ్చు తెలుసుకోవచ్చు. ఇది నిజంగా మంచి థ్రిల్లింగ్ ఫీల్‌ని కలుగజేసే మ్యూజియం అనే చెప్పాలి. ఇది ఎక్కడ ఉంది? ఆ మ్యూజియం ఎప్పుడు ఏర్పాటు చేశారు? తదితర విశేషాల గురించే ఈ కథనం.! ఈ అసాధారణ మ్యూజియం నెదర్లాండ్స్‌లోని లైడెన్ నగరంలో ఉంది. ఆ మ్యూజియం భవనంలో మొదట సుమారు 35 మీటర్ల పొడవైన ఉక్కు కొలోసన్(మనిషి విగ్రహం) ఉండగా, మరోవైపు ఏడు అంతస్తుల భవనం కనిపిస్తుంది. ఈ మ్యూజియం ఎంట్రీ టికెట్ పెద్దలకు సుమారు రూ. 1300/- వరకు ఉంటుంది. చిన్నపిల్లలు అయితే ఆరేళ్లు దాటిని వారికే అనుమతి ఉంటుంది. ఈ మ్యూజియం సైన్స్ పట్ల తెలియకుండానే ఆసక్తి పెరిగేలే చేస్తుంది. నెదర్లాండ్స్‌లో ఉన్న ఈ మ్యూజియం ప్రపంచంలోనే తొలి ఇంటరాక్టివ్ మ్యూజియం అఫ్ హ్యూమన్ బయాలజీ. మానవుని లోపల అవయవాల పనితీరుని విజ్యువల్గా చూడొచ్చు. మీకు వాటి గురించి అర్థమయ్యేలా వివరించేలా వివిధ భాషల్లో గైడ్ చేసే ఆడియాలు కూడా ఉంటాయి. మీరు ఎంట్రీకి ముందే మీకు నచ్చిన భాషను ఎంచుకోవాలి. మీరు ఏ ఫ్లోర్లో ఏ గదికి వెళ్తారో.. అక్కడ ఆ గదికి ఎంట్రవ్వగానే ఆ భాష ఆటోమేటిక్‌గా ప్లే అవుతుంది. మొట్టమొదటగా చర్మంతో మొదలై.. కాలి వరకు ప్రతి భాగాన్ని సందర్శిస్తూ వెళ్తాం. మనం ఆయా రూంలకు సమీపించగానే ఆ గదిలోని అవయవం నిలబడి వివరిస్తున్నట్లు అనిపిస్తుంది. మన శరరీంలోని ఈ భాగం పని ఇదా? అని ఒకరకమైన ఫీల్ కలుగుతుంటుంది. ముఖ్యంగా మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థను చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. కొన్ని వ్యవస్థల పనితీరు చూసేందకు త్రీ డీ గ్లాస్లు ఉపయోగించాల్సి ఉంటుంది. ఆఖరికి రక్తం సరఫరా అయ్యే విధానం కూడా ఉంటుంది. అలాగే ఊపిరితిత్తులు ఆక్సిజన్ తీసుకోగానే రక్తం ఎలా కదులుతుందో కళ్లకు కట్టినట్లు కనిపించడమే కాదు ఆడియోలో వివరిస్తారు కూడా. ఇలా.. అన్నవాహిక, గుండె, కాలేయం, మూత్రపిండాలు, ప్రేగులు, కండరాలు, ఎముకలు, కళ్లు ,చెవులు, ఇతర అంతర్గత అన్ని అవయవాలను చూడొచ్చు. అలాగే శరీరానికి ఏదైన గాయం అయ్యితే కనిపించే మార్పులు కూడా చూపిస్తుంది. వైద్యులుగా ట్రైయిన్ అయితే చూసే వాటన్నింటిని మనం కూడా నేరుగా చూడటమే గాక తాకడం, తెలుసుకోవడం వంటివన్నీ చేస్తాం ఈ మ్యూజియంలో. ఇక్కడ ఉన్న ఇంకో సదుపాయం ఏంటంటే..ముందుగానే మీ పేరు, పుట్టిన తేది తదితరాలు నోట్ చేస్తారు కాబట్టి మ్యూజియం జర్నీ ముగియగానే మీ అంతర్గత వ్యవస్థ గురించి కూడా వివరించి మరీ రిపోర్ట్ అందజేస్తారు నిర్వాహకులు. కాగా, ఈ మ్యూజియాన్ని మార్చి 14, 2008న అప్పటి ఇంగ్లాండ్ రాణి బీట్రిక్స్ ప్రారంభించారు. ఈ మ్యూజియం నిర్మాణం 2006 చివరిలో ప్రారంభమైంది. దీన్ని సుమారు 27 మిలియన్ డాలర్ల వ్యయంతో నిర్మించారు. ఈ మ్యూజియం ప్రపంచంలోని అత్యంత ప్రత్యేకమైన మ్యూజియంలలో ఒకటి. ఈ మ్యూజియంని నిర్వాహకులు దీన్ని సందర్శించే వ్యక్తులు వారి శరీర నిర్మాణం, సంబంధిత సమస్యల గురించి క్లియర్‌గా తెలుసుకుంటారు కాబట్టి వారి ఆరోగ్యాన్ని ఎలా సంరక్షించుకోవాలి అనే దానిపై అవగాహనే గాక ఒక గొప్ప పరిజ్ఞానాన్ని కూడా పొందుతారని అన్నారు.. (చదవండి: ఇదేం స్టయిలిష్ కాస్ట్యూమ్! కానీ ధర వింటే షాకవ్వడం ఖాయం!) -
పాక్ స్టార్ బౌలర్‌ను కొట్టిన బాబర్ ఆజం.. వీడియో వైరల్
వన్డే ప్రపంచకప్-2023లో పాకిస్తాన్ జట్టుకు మంచి ఆరంభం లభించింది. హైదరాబాద్ వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన తమ మొదటి మ్యాచ్‌లో 81 పరుగుల తేడాతో పాకిస్తాన్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్.. మహ్మద్ రిజ్వాన్(68), సౌధ్ షకీల్(68) అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడటంతో 286 పరుగులు సాధించింది. అనంతరం బౌలింగ్‌లో హారీస్ రవూఫ్, హసన్ అలీ చెలరేగడంతో డచ్ జట్టు 205 పరుగులకు ఆలౌటైంది. రవూఫ్‌ను కొట్టిన బాబర్.. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ సందర్భంగా ఓ ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం సరదగా పేసర్ హ్యారీస్ రవూఫ్ చెంపపై కొట్టాడు. రవూఫ్ తన ఓవర్ వేసేందుకు సిద్దమవుతుండగా బాబర్ ఏదో చెప్పడానికి వెళ్లి నవ్వుతూ చెంపపై టచ్ చేశాడు. దీంతో రవూఫ్ కూడా నవ్వుతూ ఎదో అన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో రవూఫ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. 9 ఓవర్లలో 43 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. చదవండి: థాంక్యూ హైదరాబాద్.. చాలా సంతోషంగా ఉంది! క్రెడిట్ మొత్తం వాళ్లకే: బాబర్ pic.twitter.com/R2yqeleKPj — cricbaaz2 (@cricbaaz2) October 6, 2023 -
హవ్వ.. గన్ను కొనడం ఇంత సులభమా?
నెదర్లాండ్స్‌కు చెందిన ఒక మహిళ ఇటీవల తన చిన్న కుమారుడు తనకు తెలియకుండానే డార్క్ వెబ్‌లో ఎకె-47ను కొనుగోలు చేశాడని వెల్లడించింది. ‘నా కుమారుడు ఎనిమిదేళ్ల వయసులోనే హ్యాకింగ్ ప్రారంభించాడు. వాడు తుపాకీని ఆర్డర్ చేసినప్పుడు ఈ విషయాన్ని గ్రహించానని బార్బ్రా జెమెన్ అనే నెదర్లాండ్ మహిళ యూరోన్యూస్కు తెలిపారు. ‘మా వాడు కంప్యూటర్లో అధిక సమయం గడపడం ప్రారంభించాడు ఇంటర్నెట్లో ఉచితంగా లభించే వస్తువులను ఆర్డర్ చేయడం మొదలు పెట్టాడన్నారు. డార్క్ వెబ్‌లో కొనుగోళ్లు అనేవి ఉచిత పిజ్జా వంటి చిన్న వాటితో మొదలవుతాయని, క్రమంగా ఈ డెలివరీలు మరింత భయంకరంగా మారుతాయని’ ఆమె తెలిపింది. ‘మనీ లాండరింగ్ చేయడానికి ఉపయోగించారు’ జెమెన్ తెలిపిన వివరాల ప్రకారం ఆమె కుమారుడు ఇంటర్నెట్లో పలు రకాల కోడ్ పదబంధాలను ఉపయోగిస్తాడు. ఆన్లైన్ గేమ్‌ల ద్వారా మోసగాళ్లతో కమ్యూనికేట్ అవుతూ, వివిధ వ్యవహారాలను కొనసాగిస్తాడు. హ్యాకర్లు తన కుమారుడిని మనీ లాండరింగ్ చేయడానికి ఉపయోగించారని జెమెన్ ఆరోపించింది. మందుగుండు సామాగ్రితో పాటు ఆటోమేటిక్ తుపాకీ ఆమె ఇంటి గుమ్మం వద్ద కనిపించే సరికి ఆమె తన కుమారుడు ఏమి చేస్తున్నాడో గ్రహించింది. తుపాకీని ఎలా ఆర్డర్ చేయాలో.. దానిని ఇంటికి ఎలా తెప్పించాలో తెలుసుకునేందుకు తన కుమారుడు ఒక నెల రోజులు వెచ్చించాడని అనుకుంటున్నానని జెమెన్ పేర్కొన్నారు. తన కుమారుడు పోలాండ్ నుండి బల్గేరియాకు తుపాకీని తెప్పించాడని ఆమె తెలిపింది. తన కుమారుడు ఇంటికి వచ్చిన పార్సిల్ తెరిచాడు. ఇంటికి తుపాకీని డెలివరీ చేయగలిగానని సంతోషపడ్డాడని ఆమె తెలిపింది. వాడి తీరు చూసి షాక్ అయ్యానని, వెంటనే ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుని, తుపాకీని స్థానిక పోలీసు విభాగానికి అప్పగించానని, దీంతో తన కుమారునిపై ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోలేదని జెమెన్ చెప్పారు. అంతర్జాతీయ హ్యాకర్ల బృందంతో.. జెమెన్ తన కుమారుని వ్యక్తిత్వంలో వచ్చిన మార్పును గమనించింది. వాడు కంప్యూటర్ ముందు అత్యధిక సమయం కూర్చోవడంతోపాటు రాత్రంతా మేల్కోవడాన్ని ఆమె గుర్తించింది. తన కుమారుడు ఒత్తిడికి గురయ్యాడని, అంతర్జాతీయ హ్యాకర్ల బృందంతో కలిసి పని చేస్తున్నాడని జెమెన్ తెలుసుకుంది. తన కుమారుని నేరపూరిత జీవితాన్ని నిలువరించేందుకు కుమారుడు చదువున్న పాఠశాలను సంప్రదించింది. అక్కడ ఆమెకు ఆశించిన ఫలితం కనిపించలేదు. జెమెన్ తన కుమారుని బ్రౌజింగ్ హిస్టరీని చూసి, ఈ విషయాన్ని సైబర్ సెక్యూరిటీకి తెలియజేయాలని నిర్ణయించుకుంది. ‘తప్పుదారి పట్టేందుకు అవకాశాలు అనేకం’ కంపెనీలను హ్యాక్ చేయడానికి, దొంగిలించిన సమాచారాన్ని వారికి పంపడానికి సహాయం చేయాలని తన కుమారుడిని అతని హ్యాకర్ స్నేహితులు అడిగారని జెమెన్ తెలిపింది. వెంటనే ఆమె తన కుమారునికి రక్షణ కల్పిస్తూ, వారితో సంబంధాన్ని తెంచుకోవడంలో అతనికి సహాయపడింది. ఈ రోజుల్లో చాలా మంది పిల్లలు ల్యాప్‌టాప్‌లు,సెల్ ఫోన్లను కలిగి ఉన్నారని, వారు తప్పుదారి పట్టేందుకు అవకాశాలు అనేకం ఉన్నాయని ప్రస్తుతం డచ్ పోలీసులతో సైబర్ స్పెషల్ వాలంటీర్‌గా పనిచేస్తున్న జెమెన్ తెలిపారు. చాలామందికి ఏది చట్టపరమైనది.. ఏది చట్టవిరుద్ధమో తెలియదని ఆమె తెలిపింది. జెమెన్ ఇటీవలే ప్రారంభమైన సైబర్ అఫెండర్ ప్రివెన్షన్ స్క్వాడ్ అనే డచ్ టాస్క్‌ఫోర్స్‌తో కలిసి పనిచేస్తోంది. ఇది కూడా చదవండి: ఈ దేశాల్లో విడాకుల కేసులు అధికం! -
మంగళూరు అబ్బాయి, నెదర్లాండ్స్ అమ్మాయి
సాక్షి, యశవంతపుర: నెదర్లాండ్‌కు చెందిన అమ్మాయితో మంగళూరుకు చెందిన యువకుడు పెళ్లి చేసుకున్నాడు. సురత్కల్‌కు చెందిన ముస్లిం యువకుడు నెదర్లాండ్స్ అమ్మాయిని ప్రేమించటంతో ఇద్దరి వివాహం ఇటీవల సురత్కల్‌లో జరిగింది. ముస్లిం సంప్రదాయం ప్రకారం ఇద్దరూ ఒక్కటయ్యారు. (చదవండి: బిడ్డలతో సెల్ టవర్ ఎక్కిన తండ్రి ) -
వారెవ్వా.. కరోనా టైంలో పుట్టిన ఆలోచనే ఫ్యాషన్‌గా! (ఫొటోలు)
-
T20 WC BAN vs NED: నెదర్లాండ్స్‌పై బంగ్లాదేశ్ ఘన విజయం
ICC Mens T20 World Cup 2022- Bangladesh vs Netherlands- Updates: సూపర్-12లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది. 145 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ 135 పరుగులకే ఆలౌటౌంది. బంగ్లా బౌలర్ టాస్కిన్ అహ్మద్ నాలుగు వికెట్లతో డచ్ పతానన్ని శాసించగా.. హసన్ మహ్మద్ రెండు, షకీబ్, సర్కార్ తలా ఒక్క వికెట్ సాధించారు. డచ్ బ్యాటర్లలో కోలిన్ అకెర్మాన్ 62 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. బంగ్లా బ్యాటర్లలో అఫిఫ్ హొసేన్ 38, షాంటో 25 పరుగులతో రాణించారు. నెదర్లాండ్స్ బౌలర్లలో వాన్ మీకెరెన్, బాస్ డి లీడ్ చెరో రెండు వికెట్లు సాధించారు. ఐదో వికెట్ కోల్పోయిన నెదర్లాండ్స్ 59 పరుగుల వద్ద నెదర్లాండ్స్ ఐదో వికెట్ కోల్పోయింది. 16 పరుగులు చేసిన ఎడ్వర్డ్స్.. షకీబ్ ఆల్ హసన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు 15 పరుగులకే నాలుగు వికెట్లు 145 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ 15 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. తొలి ఓవర్లోనే రెండు వికెట్లు.. 145 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ తొలి ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయింది. టాస్కిన్ ఆహ్మద్.. వరుసగా వి సింగ్,బాస్ డి లీడ్‌ను పెవిలియన్‌కు పంపాడు. రాణించిన నెదర్లాండ్స్ బౌలర్లు.. టార్గెట్ 145 పరుగులు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. బంగ్లా బ్యాటర్లలో అఫిఫ్ హొసేన్ 38 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. నెదర్లాండ్స్ బౌలర్లలో వాన్ మీకెరెన్, బాస్ డి లీడ్ చెరో రెండు వికెట్లు సాధించారు. 19 ఓవర్లకు బంగ్లాదేశ్ స్కోర్: 139/8 వరుస క్రమంలో బంగ్లాదేశ్ రెండు వికెట్లను కోల్పోయింది. 19 ఓవర్లకు బంగ్లాదేశ్ స్కోర్: 139/8 ఆరో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్ 121 పరుగులు వద్ద బంగ్లాదేశ్ ఆరో వికెట్ కోల్పోయింది. 13 పరుగులు చేసిన నూరల్ హసన్.. బాస్ డి లీడ్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. 16 ఓవర్లకు బంగ్లాదేశ్ స్కోర్: 110/5 16 ఓవర్లు ముగిసే సరికి బంగ్లాదేశ్ 5 వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసింది. అఫిఫ్ హొసేన్, నూరుల్ హసన్ ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. 5 వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ నెదర్లాండ్స్ బౌలర్ల ధాటికి బంగ్లాదేశ్ బ్యాటర్లు నిలవలేకపోతున్నారు. 11వ ఓవర్ ముగిసే సరికి 76 పరుగులకే 5 వికెట్లు బంగ్లా కష్టాల్లో పడిపోయింది. అఫిఫ్ హొసేన్, నూరుల్ హసన్ ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్ 47 పరుగులు వద్ద బంగ్లాదేశ్ రెండో వికెట్ కోల్పోయింది. 25 పరుగులు చేసిన హొస్సేన్ శాంటో.. ప్రింగిల్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. తొలి వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్ 43 పరుగుల వద్ద బంగ్లాదేశ్ తొలి వికెట్ కోల్పోయింది. 14 పరుగులు చేసిన సర్కార్.. పాల్ వాన్ మీకెరెన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 4 ఓవర్లకు బంగ్లాదేశ్ స్కోర్: 35/0 4 ఓవర్లు ముగిసే సరికి బంగ్లాదేశ్ వికెట్ నష్టపోకుండా 33 పరుగులు చేసింది. క్రీజులో నజ్ముల్ హొస్సేన్ శాంటో(15), సౌమ్య సర్కార్(13) పరుగులతో ఉన్నారు. టీ20 ప్రపంచకప్ సూపర్-12(గ్రూప్-2)లో భాగంగా హోబర్ట్ వేదికగా నెదర్లాండ్స్, బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన నెదర్లాండ్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. తుది జట్లు: నెదర్లాండ్స్: మాక్స్ ఓడౌడ్, విక్రమ్‌జిత్ సింగ్, బాస్ డి లీడ్, కోలిన్ అకెర్మాన్, టామ్ కూపర్, స్కాట్ ఎడ్వర్డ్స్(కెప్టెన్/వికెట్ కీపర్), టిమ్ ప్రింగిల్, లోగాన్ వాన్ బీక్, షరీజ్ అహ్మద్, ఫ్రెడ్ క్లాసెన్, పాల్ వాన్ మీకెరెన్ బంగ్లాదేశ్: నజ్ముల్ హొస్సేన్ శాంటో, సౌమ్య సర్కార్, లిట్టన్ దాస్, షకీబ్ అల్ హసన్(కెప్టెన్), అఫీఫ్ హొస్సేన్, యాసిర్ అలీ, నూరుల్ హసన్(వికెట్ కీపర్), మొసద్దెక్ హొస్సేన్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్, హసన్ మహమూద్ చదవండి: T20 World Cup 2022: సచిన్ రికార్డు బద్దలు కొట్టిన కోహ్లి.. తొలి ఆటగాడిగా -
నెదర్లాండ్ జట్టు సలహాదారుడిగా టీమిండియా మాజీ కోచ్
టీ20 ప్రపంచకప్-2022కు ముందు నెదర్లాండ్ క్రికెట్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు సలహాదారులుగా టీమిండియా మాజీ కోచ్, దక్షిణాఫ్రికా దిగ్గజం గ్యారీ కిర్‌స్టన్, ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ డేన్ క్రిస్టియన్‌ను నెదర్లాండ్ క్రికెట్ నియమించింది. కాగా నెదర్లాండ్స్ ఆటగాళ్ళు ఆస్ట్రేలియాకు వెళ్లేముందు కేప్ టౌన్‌లోని గ్యారీ కిర్‌స్టన్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందారు. ఈ క్రమంలో మళ్లీ అతడు జట్టుతో సలహారుడిగా జతకట్టనున్నాడు. అదే విధంగా ఆడిలైడ్‌లో నెదార్లాండ్ ట్రైనింగ్ క్యాంప్‌లో జట్టుతో క్రిస్టియన్ కలవనున్నాడు. వీరిద్దరూ నెదర్లాండ్ హెడ్ కోచ్ ర్యాన్ కూక్‌తో కలిసి పనిచేయనున్నారు. "టీ20 ప్రపంచకప్ కోసం మా జట్టు కోచింగ్ స్టాప్‌లో గ్యారీ కిర్‌స్టన్, డాన్ క్రిస్టియన్ చేరడం మాకు చాలా సంతోషంగా ఉంది. వారి అనుభవంతో జట్టును విజయ పథంలో నడిపిస్తారని ఆశిస్తున్నాను" అని నెదర్లాండ్ క్రికెట్ బోర్డు హై పెర్ఫార్మెన్స్ మేనేజర్ రోలాండ్ లెఫెబ్రే పేర్కొన్నారు. కాగా కిర్‌స్టన్ 2011లో వన్డే వరల్డ్‌కప్ సొంతం చేసుకున్న భారత జట్టు హెడ్ కోచ్‌గా కిర్‌స్టన్ పనిచేశాడు. ఇక నెదర్లాండ్ ఈ మెగా ఈవెంట్లో తొలుత క్వాలిఫియర్ మ్యాచ్‌లు ఆడనుంది. డచ్ జట్టు తమ తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్16న యూఏఈతో తలపడనుంది. చదవండి: R Ashwin Vs Ramiz Raja: పీసీబీ చైర్మన్ రమీజ్ రాజాకు అశ్విన్ దిమ్మతిరిగే కౌంటర్ -
దిండు 45,00,000 రూపాయలు
అంత డబ్బు పెడితే... ఓ హైఎండ్ కార్ కొనేయొచ్చు. ఓ మోస్తరు ఇల్లు కొనుక్కోవచ్చు. అలాంటిది ఓ మెత్తకు అంత ధర ఉంటుందా? అని నమ్మలేకపోతున్నారు కదూ! కానీ నిజం. దాని విలువ రూ. 45 లక్షలు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దిండు ఇది. నెదర్లాండ్స్‌కు చెందిన ఓ ఫిజియోథెరపిస్ట్ దీన్ని డిజైన్ చేశాడు. ఎంత థెరపిస్ట్ డిజైన్ చేసినా అంత రేటెందుకు అంటే? దాని ధర వెనుక 15 ఏళ్ల కఠోర శ్రమ ఉంది. అంతేకాదు అందులో ఉన్న దూదిని రోబోటిక్ మిల్లింగ్ మెషీన్‌తో తయారు చేశారు. నిద్రరాకుండా బాధపడేవారు, వివిధ రకాల మెడ నొప్పులతో ఇబ్బందులు పడేవాళ్లను సైతం ఈజీగా నిద్రపుచ్చేస్తుందీ మెత్త. అంత సౌకర్యంగా ఉంటుంది మరి. అలాగే ఈ దిండును బంగారం, నీలమణులను పొదిగి మరీ తయారు చేశారు. మెత్త కవర్ జిప్ డిజైన్‌కు నాలుగు వజ్రాలను ఉపయోగించారు. ఇక సాధారణ మాల్స్‌లో ఇచ్చినట్టుగా దీన్ని కవర్లో పెట్టి ఇవ్వరు. దానికోసమే ప్రత్యేకంగా రూపొందించిన బ్రాండెడ్ బాక్స్‌లో ప్యాక్‌చేసి మరీ ఇస్తారట. -
నెదర్లాండ్స్‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్.. సిరీస్ కైవసం
ఆదివారం ఆమ్స్టెల్వీన్ వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన రెండో వన్డేలో 6 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తేడాతో ఇంగ్లండ్ కైవసం చేసుకుంది. 236 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ నాలుగు వికెట్లు కోల్పోయి 36.1 ఓవర్లలోనే ఛేదించింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో జాసన్ రాయ్(73), ఫిలిప్ సాల్ట్(77) పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. కాగా కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మరోసారి నిరాశపరిచాడు. ఈ మ్యాచ్‌లో మెర్గాన్ డకౌట్‌గా వెనుదిరిగాడు, ఇక డచ్ బౌలర్లలో ఆర్యన్ దత్ రెండు, టామ్ కూపర్, ప్రింగల్ తలా వికెట్ సాధించారు. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 41 ఓవర్లకు కుదించారు. అయితే తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న నెదర్లాండ్స్ 41ఓవర్లలలో 7 వికెట్లు కోల్పోయి 235 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో డేవిడ్ విల్లీ, రషీద్ చెరో రెండు వికెట్లు, బ్రైడన్ కార్స్, లివింగ్ స్టోన్ తలా వికెట్ సాధించారు. ఇరు జట్లు మధ్య అఖరి వన్డే బుధవారం జరగనుంది. చదవండి: ENG vs NED: ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్.. నెదర్లాండ్స్ కెప్టెన్ సంచలన నిర్ణయం..! -
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్.. నెదర్లాండ్స్ కెప్టెన్ సంచలన నిర్ణయం..!
నెదర్లాండ్స్ కెప్టెన్ పీటర్ సీలార్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు సీలార్ ఆదివారం రిటైర్మెంట్ ప్రకటించాడు. వెన్ను గాయం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అతడు తెలిపాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతోన్న వన్డే సిరీస్‌లో నెదర్లాండ్స్ కెప్టెన్ పీటర్ సీలార్ ఉన్నాడు. అయితే గాయం కారణంగా ఆదివారం జరిగిన రెండో వన్డేకు దూరమయ్యాడు. దీంతో అతడి స్థానంలో వికెట్ కీపర్-బ్యాటర్ స్కాట్ ఎడ్వర్డ్స్ సారథ్య బాధ్యతలు చేపట్టాడు. కాగా పీటర్ బోరెన్ 2018లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో సీలార్ నెదర్లాండ్స్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. 2006 లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన సీలార్ దాదాపు 16 ఏళ్ల పాటు నెదర్లాండ్స్ క్రికెట్‌కు సేవలు అందించాడు. "2020 ఏడాది తర్వాత నా వెన్నునొప్పి మరింత తీవ్రమైంది. కాబట్టి అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించకున్నాను. నాకు ఇన్నాళ్లు మద్దుతుగా నిలిచిన అభిమానులకు,నెదర్లాండ్స్ క్రికెట్ బోర్డ్‌కు ధన్యవాదాలు" అని సీలార్ పేర్కొన్నాడు. చదవండి: Wriddhiman Saha: త్రిపుర జట్టుకు మెంటార్‌గా వృద్ధిమాన్ సాహా..! -
ప్రొ హాకీ లీగ్.. మూడో స్థానంతో బారత్ ముగింపు
రోటర్‌డామ్: ప్రొ హాకీ లీగ్ 2021–2022 సీజన్‌ను భారత పురుషుల జట్టు మూడో స్థానంతో ముగించింది. నెదర్లాండ్స్‌తో ఆదివారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 1–2 గోల్స్‌తో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో విజయంతో నెదర్లాండ్స్ చాంపియన్‌గా నిలిచింది. భారత్ తరఫున అభిషేక్ తొలి నిమిషంలోనే గోల్ చేయగా... ఏడో నిమిషంలో నెదర్లాండ్స్ జట్టుకు జాన్సెన్ గోల్ అందించి స్కోరును సమం చేశాడు. 45వ నిమిషంలో జోరిట్ క్రూన్ గోల్‌తో నెదర్లాండ్స్ విజయాన్ని ఖాయం చేసుకుంది. తొమ్మిది జట్ల మధ్య రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరిగిన ఈ టోర్నీలో భారత్ మొత్తం 16 మ్యాచ్‌లు ఆడి 30 పాయింట్లతో మూడో స్థానం దక్కించుకుంది. ఎనిమిది మ్యాచ్‌ల్లో నిర్ణీత సమయంలోపు గెలిచిన భారత్, రెండింటిలో ‘షూటౌట్’ ద్వారా విజయం అందుకుంది. ‘షూటౌట్’లో రెండు మ్యాచ్‌ల్లో, నిర్ణీత సమయంలోపు నాలుగు మ్యాచ్‌ల్లో భారత్ ఓటమి పాలైంది. మరోవైపు మహిళల ప్రొ హాకీ లీగ్‌లో అర్జెంటీనాతో మ్యాచ్ లో భారత్ 2–3తో ఓడిపోయింది. ఈ విజయంతో అర్జెంటీనా టైటిల్‌ను ఖరారు చేసుకుంది. చదవండి: Matteo Berrettini: 'నన్ను పెళ్లి చేసుకుంటావా'.. టెన్నిస్ స్టార్‌కు వింత అనుభవం -
వన్డేల్లో చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్.. 498 పరుగుల భారీ స్కోర్
వన్డేల్లో ఇంగ్లండ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక స్కోర్‌ను ఇంగ్లండ్ నమోదు చేసింది. ఆమ్స్టెల్వీన్ వేదికగా నెదర్లాండ్స్‌తో జరగిన తొలి వన్డేలో ఇంగ్లండ్ 4 వికెట్లు కోల్పోయి 498 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. తద్వారా వన్డే క్రికెట్ చరిత్రలో తన పేరిట ఉన్న అత్యధిక స్కోర్ రికార్డును ఇంగ్లండ్ అధిగమించింది. అంతకుముందు 2018లో ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్‌పై 481 పరుగులు చేసింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ ఆదిలోనే ఓపెనర్ రాయ్(1) వికెట్ కోల్పోయింది. అనంతరం ఫిలిప్ సాల్ట్(122), డేవిడ్ మలాన్(125)తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. మలన్, సాల్ట్ రెండో వికెట్‌కు 170 బంతుల్లో 222 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. సాల్ట్ ఔటయ్యక క్రీజులోకి వచ్చిన బట్లర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సిక్సర్లు, ఫోర్లతో ప్రత్యర్ధి బౌలర్లపై విరుచకుపడ్డాడు. ఈ క్రమంలోనే బట్లర్ కేవలం 47 బంతులలోనే సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో 70 బంతులలో 162 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు,14 సిక్స్‌లు ఉన్నాయి. అదే విధంగా విడ్ మలన్ (125) పరుగులతో రాణించాడు. ఇక అఖరిలో లివింగ్ స్టోన్(66 నాటౌట్; 22 బంతుల్లో 6x4, 6x6) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఇక ఈ మ్యాచ్‌లో మొత్తం 26 సిక్సర్లు, 36 బౌండరీలు నమోదయ్యాయి. చదవండి: Tim Paine Thanks Rahane: 'థాంక్యూ రహానే.. కోహ్లిని రనౌట్ చేయకుంటే గెలిచేవాళ్లం కాదు' -
తన రికార్డు తానే బద్దలుకొట్టిన తెలుగుతేజం..
Jyothi Yarraji Breaks Down Her National Record: తెలుగుతేజం యర్రాజీ జ్యోతి వేగానికి రికార్డులే పరుగు పెడుతున్నాయి. 16 రోజుల వ్యవధిలోనే ఆమె 100 మీటర్ల హర్డిల్స్‌లో ముచ్చటగా మూడో జాతీయ రికార్డును నెలకొల్పింది. తద్వారా తన రికార్డును తానే మళ్లీ మళ్లీ తిరగరాసుకుంటోంది. వుట్ (నెదర్లాండ్స్)లో జరుగుతున్న డి హ్యారీ స్చల్టింగ్ గేమ్స్‌లో మహిళల 100 మీటర్ల హార్డిల్స్‌ను ఆమె 13.04 సెకన్ల టైమింగ్‌తో ముగించి... కేవలం వారం రోజుల్లోపే తన రికార్డును సవరించింది. అయితే ఈ ఈవెంట్ ఫైనల్లో జ్యోతి బరిలోకి దిగలేదు. మొదట ఈ నెల 10న సైప్రస్‌లో 13.23 సెకన్ల టైమింగ్‌తో ఇరవైఏళ్ల క్రితం (2002) అనురాధా బిస్వాల్ రికార్డు (13.28 సె.) చెరిపేసింది. తిరిగి ఈనెల 22న ఇంగ్లండ్‌లో 13.11 సెకన్ల టైమింగ్‌తో జ్యోతి తన రికార్డును తానే తిరగరాసింది. 22 ఏళ్ల జ్యోతి వేగవంతమైన టైమింగ్‌తో ఇదివరకే కామన్వెల్త్ గేమ్స్‌కు అర్హత సంపాదించింది. బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడల్లోగా 13 సెకన్ల టైమింగ్‌ను నమోదు చేయాలని ఆమె లక్ష్యంగా పెట్టుకుంది. Constant Rain of National records this season in 100 meters Hurdle Women by Jyothi Yarraji. Clocked 13.04 seconds in Netherlands today. Wind (+1.4). #Indian Athletics touching Heights. @Adille1 @ril_foundation @Media_SAI @WorldAthletics pic.twitter.com/ASEBp0ZSlZ — Athletics Federation of India (@afiindia) May 26, 2022 -
‘సీ’దదీరుతూ....అండర్ వాటర్ ఎంటర్టైన్మెంట్
సముద్రంపై నౌకలో పార్టీలు, పెళ్లిళ్లు మాత్రమే మనకు ఇప్పటివరకు తెలుసు. సముద్రంలోతుల్లోనూ పార్టీ చేసుకునే అద్భుత అవకాశాన్ని తీసుకొచ్చిందో డచ్ కంపెనీ. సముద్రం లోపల సబ్‌మెరైన్‌లో పార్టీ... ఊహించడానికే థ్రిల్లింగ్‌గా ఉంది కదా! సాధారణంగా జలాంతర్గాములను నేవీకోసమో, లేదంటే సముద్రపు లోతుల్లోని రహస్యాలను కనుగొనేందుకో ఉపయోగిస్తారు. కానీ వ్యక్తిగత, వాణిజ్య జలాంతర్గాముల తయారీలో దిగ్గజ సంస్థ అయిన నెదర్లాండ్స్‌కు చెందిన యూ–బోట్‌వర్క్స్ ఈ అండర్ వాటర్ ఎంటర్టైన్మెంట్ ప్లాట్‌ఫామ్ (యూడబ్ల్యూఈపీ)ను తయారు చేసింది. మినీ క్రూయిజ్ షిప్ తరహాలో రూపొందించిన ఈ సబ్‌మెరైన్ 200 మీటర్ల లోతువరకు డైవ్ చేయగలదు. 120మంది ప్రయాణించగలిగే సబ్‌మెరైన్‌లో 64 సీట్ల సామర్థ్యమున్న రెస్టారెంట్, జిమ్, కాసినో, వెడ్డింగ్ హాల్ కూడా ఉన్నాయి. సముద్రంలోపలి అద్భుతాలను వీక్షించేందుకు వీలుగా దీనికి 14 విశాలమైన కిటికీలను ఏర్పాటు చేశారు. వాటి బయట సముద్రం స్పష్టంగా కనిపించేందుకు ప్రకాశవంతమైన దీపాలను అమర్చారు. ఇది సముద్రతీరంలో ఉన్నప్పుడు, ఉపరితలంపై ప్రయాణిస్తున్నప్పుడు ప్రయాణికులు తీరపు అందాలను ఆస్వాదించేలా యూడబ్ల్యూఈపీపై సన్‌డెక్‌ను, దాని చుట్టూ రెయిలింగ్‌ను కూడా ఏర్పాటు చేశారు. బ్యాటరీతో నడిచే ఈ సబ్‌మెరైన్‌ను ఒక్కసారి చార్జ్ చేస్తే 24గంటలపాటు ప్రయాణించొచ్చు. యూడబ్ల్యూఈపీ ఓ సంచలనమని, నీటి అడుగున వేడుకలకు ఇది దారి చూపుతుందని యూ–బోట్‌వర్క్స్ వ్యవస్థాపక సీఈవో బెర్ట్ హౌట్మాన్ తెలిపారు. ఇంకెందుకాలస్యం.. నెదర్లాండ్స్‌కు వెళదాం అనుకుంటున్నారా! ఆగండాగండి.. ఏదైనా టూరిజం కంపెనీ కొనుగోలు చేసి టూర్స్ ఆఫర్ చేసేవరకూ మనం ఎదురుచూడాల్సిందే. (చదవండి: రష్యా బలగాల దుర్మార్గం! కాల్పులు జరిపి సజీవంగా పాతిపెట్టి.) -
విల్ యంగ్ అద్భుత శతకం.. తొలి వన్డేలో న్యూజిలాండ్ ఘన విజయం
మౌంట్ మాంగనుయ్: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆతిథ్య న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. వన్ డౌన్ బ్యాటర్ విల్ యంగ్ (114 బంతుల్లో 103; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) సూపర్ సెంచరీతో సత్తా చాటడంతో కివీస్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్.. కైల్ జేమీసన్ (3/45), టిక్నర్ (4/50) ధాటికి 49.4 ఓవర్లలో 202 పరుగులకే ఆలౌటైంది. రిప్పన్ (67), సీలార్ (43) రాణించడంతో నెదర్లాండ్స్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. అనంతరం ఛేదనలో యంగ్ సూపర్ శతకానికి తోడు ఓపెనర్ హెన్రీ నికోల్స్ (57) రాణించడంతో కివీస్ 38.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఏప్రిల్ 2న హ్యామిల్టన్‌లో జరుగనుంది. ఇదిలా ఉంటే సిరీస్‌లో భాగంగా జరగాల్సిన ఏకైక టీ20 వర్షం కారణంగా పూర్తిగా రద్దైన సంగతి తెలిసిందే. చదవండి: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఆసీస్ ప్లేయర్ల హవా.. దిగజారిన కోహ్లి, రోహిత్ -
రష్యా దౌత్యవేత్తల బహిష్కరణ
బ్రసెల్స్: గూఢచర్యం ఆరోపణలపై రష్యా దౌత్యవేత్తలను బహిష్కరిస్తున్నట్టు బెల్జియం, నెదర్లాండ్స్ మంగళవారం ప్రకటించాయి. 21 మంది రష్యా దౌత్యవేత్తలను రెండు వారాల్లోగా దేశం వీడాలని బెల్జియం ఆదేశించింది. నెదర్లాండ్స్ కూడా 17 మంది రష్యా దౌత్యాధికారులను బహిష్కరిస్తున్నట్టు పేర్కొంది. వీరంతా నిజానికి నిఘా అధికారులని ఆరోపించింది. (చదవండి: ఇమ్రాన్ ఖాన్ కౌంట్ డౌన్ స్టార్ట్! ఓటింగ్‌కు దూరంగా ఉండాలని పిలుపు, రద్దు తప్పదా?) -
భారత సంతతి మహిళకు ఉన్నత పదవి ఇవ్వనున్న జోబైడెన్
నెదర్లాండ్స్‌లో అమెరికా రాయబారిగా భారత సంసతికి చెందిన షెఫాలీ జర్తాన్ దుగ్గల్ పేరును అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రతిపాదించారు. బరాక్ ఒబామా, హిల్లరీ క్లింటన్లకు ప్రెసిడెన్షియల్ క్యాంపెయిన్‌గా ఆమె గతంలో పని చేశారు. ఇప్పటి వరకు ఆమె జోబైడెన్ ప్రభుత్వంలో నేషనల్ కో చైయిర్ ఆఫ్ విమెన్‌గా పని చేశారు. కాగా తాజాగా ఆమెకు పదొన్నతి కల్పిస్తుండటంతో త్వరలో నెదర్లాండ్స్‌లో యూస్ రాయబారిగా పని చేయనున్నారు. జమ్ము కశ్మీర్ రాష్ట్రానికి చెందిన షెఫాలీ జర్దాన్ దుగ్గల్ అమెరికాలో స్థిరపడ్డారు. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. న్యూయార్క్ యూనివర్సిటీ నుంచి పొలిటికల్ కమ్యూనికేషన్లో పీజీ చేశారు. ఆ తర్వాత మియామీ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ పట్టా పుచ్చుకున్నారు. ఆ తర్వాత యూఎస్ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. విమెన్ రైట్స్ యాక్టివిస్ట్, హుమన్ రైట్స్ క్యాంపెయినర్‌గా చాలా కాలం పని చేశారు. అనేక అవార్డులు గెలుచుకున్నారు. చదవండి: ఆస్ట్రేలియా అవార్డు రేసులో.. భారత సంతతి యువతి -
కారు డ్రైవింగ్ చేస్తూ.. స్పృహ తప్పి పడిపోయింది! అతని సాహసానికి హ్యాట్సాఫ్
Netherland Man Sacrifices His Car: మనం సాధారణంగా రోడ్డు మీద వెళ్తున్నప్పుడూ ఏవరైనా కారు ర్యాష్‌గా డ్రైవ్ చేస్తే మనకు చాలా కోపం వస్తుంది. ఇన్ని భయంకరమైన ప్రమాదాలు జరిగిన అసలు వీళ్లకు బుద్ధి రాదు అని కూడా అనుకుంటాం. కానీ ఇక్కడొక వ్యక్తి కారుని ఇష్టారీతిన నడిపి ప్రమాదానికి గురవుతాడు. అయితే అతడి నిర్లక్షాన్ని క్షమించి ఆ కారుని కాపాడే ప్రయత్నం చేసి సహృదయం చాటుకున్నాడు ఓ వ్యక్తి. ఆ వివరాలు.. (చదవండి: దెయ్యంతో ఆటలాడిన భౌ.. భౌ..!! వైరల్...) అసలు విషయంలోకెళ్లితే....ఇక్కడ రోడ్డు పై మూడు కార్లు వెళ్తుంటాయి. అందులో ఒక కారు ఉన్నటుండి నియంత్రణ కోల్పోయి చాలా వేగంగా అటు ఇటూ రకరకాలగా వెళ్తుంటుంది. ఈ విషయాన్ని మిగత కారుల్లో ప్రయాణిస్తున్న వాళ్లు గమనిస్తారు. మొదట ఏంటి ఇలా నడుపుతున్నాడు అని వాళ్లంతా అనుకుంటారు. అయితే కాసేపటికి వాళ్లకు అసలు విషయం అర్థమవుతోంది. ఆ కారుని నడుపుపతున్న మహిళ స్పృహ తప్పి పడిపోయిందని అందువల్లే కారు ఇష్టమొచ్చినట్లుగా వెళ్తోంది అని. అయితే ఆమెను ఎలాగైన కాపాడాలని అదే సమయంలో అక్కడ ప్రయాణిస్తున్న మిగతా కార్లలోని వాళ్లు అనుకుంటారు. అంతేకాదు అనుకున్నదే తడువుగా ఆమె కారు వెళ్లేందకు దారి ఇచ్చేసి తర్వాత ఆమె కారుకి ముందు ఒక కారుని అడ్డంగా పెట్టి ఢీ కొట్టేలా చేసి ఆపుతారు. అంతేకాదు ఆమె కారు వెనుక భాగంలో కూడా మరో కారు వచ్చి ఢీకొట్టి ఆ కారుని ఆపడానికి ప్రయత్నిస్తారు. ఆ తర్వాత ఆ కారు నడుపుతున్న మహిళను కాపాడతారు. అంతేకాదు రోడ్డుపై ఎటువంటి ప్రమాదం జరగకుండా చూడటమే కాక తన కారుని అడ్డంగా పెట్టి రిస్క్ చేయడం చాలా ప్రశసించదగ్గ విషయం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పైగా ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్, లైక్‌లు వచ్చాయి. మీరు కూడా ఓ లుక్ వేయండి. (చదవండి: టీ పొడి వ్యాపారం చేద్దామనుకోవడమే వారిపాలిట శాపమైంది.. అదిరిపోయే ట్విస్ట్!!..) Man sacrifices his car to save another driver who was unconscious.. Via @RTVNunspeet pic.twitter.com/drgac0UDez — Buitengebieden (@buitengebieden_) November 21, 2021 -
ప్రపంచంలోనే అతి పెద్ద సైకిల్ పార్కింగ్, ఎక్కడో తెలుసా
మన దేశంలో సైకిల్ వినియోగం చాలా తగ్గిపోయింది కానీ, నెదర్లాండ్స్‌లో మాత్రం ప్రజలు సైకిల్‌పై సవారీకే ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. ఆఫీసులకు వెళ్లడానికి దగ్గర నుంచి షాపింగ్ మాల్స్‌లో వస్తువుల కొనుగోలు వరకూ సైకిల్‌నే వినియోగిస్తారు. పర్యావరణంపై వాళ్లకు ఉన్న ప్రేమ అలాంటిది. మోటార్ సైకిళ్లు వినియోగిస్తే కాలుష్యం ఎక్కువ అవుతుందనే స్పృహతోనే డచ్ ప్రజలు సైక్లింగ్‌కు మొగ్గుచూపుతారు. మన దేశంలో మోటార్ సైకిల్ పార్కింగ్లు కనబడ్డట్లే నెదర్లాండ్స్‌లో చాలా చోట్ల సైకిల్ పార్కింగ్లు ఉంటాయి. అలాంటి వాటిల్లో ఉట్రెచ్ నగరంలోని స్టేషన్స్ప్లీన్లో ఉన్న సైకిల్ పార్కింగ్ ప్రపంచంలోనే అతి పెద్దది. 2019 ఆగస్టు 19న దీనిని ప్రారంభించారు. దీనిని ఉట్రెట్ మునిసిపాలిటీ, ప్రోరైల్, ఎన్ఎస్ (డచ్ రైల్) సంయుక్తంగా నిర్వహిస్తాయి. రైల్ ప్రయాణం చేసేవారు తమ సైకిల్‌ను సురక్షితంగా పార్క్ చేసుకోవడానికి ఈ భారీ పార్కింగ్ బిల్డింగ్‌ను నిర్మించారు. ఆ పార్కింగ్ ప్లేస్ విశేషాలు.. ► ఇక్కడ 12,500 సైకిళ్లను పార్క్ చేయవచ్చు. ► దానిలో కొంత జాగా రెంట్ సైకిల్స్‌కు కూడా ఉంటుంది. ► ఉట్రెచ్ రైల్వే స్టేషన్‌కు చేరువలో ఉంటుంది. 24 గంటలూ తెరిచే ఉంటుంది. ► పెద్ద బిల్డింగ్‌లో ఉంటుంది కాబట్టి సైకిళ్లకు ఎండ, వానల నుంచి రక్షణ ఉంటుంది. ► 24 గంటల వరకూ ఫ్రీ పార్కింగ్ సదుపాయం కల్పించారు. ► పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చిప్‌కార్డు సహాయంతో పార్కింగ్ చేసుకోవచ్చు. ► ఇక్కడి కారిడార్లను సైకిల్ తొక్కడానికి అనువుగా రూపొందించారు. ► రెండు ఎంట్రన్స్‌లు ఉండే బిల్డింగ్‌లో వన్‌వే అమల్లో ఉంటుంది. ► మూడు అంతస్తులో ఉండే బిల్డింగ్‌లో ప్రతి చోట బాయ్‌లతో పర్యవేక్షణ ఉంటుంది. ► విభిన్నంగా ఉండే సైకిళ్లు.. అంటే పెద్ద హ్యాండిల్ బార్, డెలివరీ బ్యాగ్‌లను తీసుకెళ్లే సైకిళ్ల కోసం ప్రత్యేకంగా పార్కింగ్ స్థలం ఉంటుంది. ► ఇక్కడ సైకిల్ రిపేరింగ్‌తో పాటు కావాల్సిన సామానులు కూడా అందుబాటులో ఉంటాయి. -
సరికొత్త ఎలక్ట్రిక్ సూపర్ బైక్ ను రూపొందించిన విద్యార్థులు
నెదర్లాండ్ కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ ట్వంటెకి చెందిన విద్యార్ధి బృందం ఏడాది పాటు శ్రమించి ఫోర్త్ జనరేషన్ కు చెందిన డెల్టా ఈఎక్స్ అనే ఎలక్ట్రిక్ రేసింగ్ బైక్ ను డిజైన్ చేసింది. విద్యార్ధులు తయారు చేసిన ఈ బైక్ డిజైన్ తో పాటు ఫీచర్స్ ఆకట్టుకోవడంతో రేసింగ్ ప్రియులు ఈ బైక్ ను కొనుగోలు చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. డెల్టా ఇఎక్స్ మోడల్ రేస్ బైక్ చూడడానికి సుటర్ MMX 500ను పోలి ఉంటుంది. కానీ వాస్తవానికి బైక్ ఎత్తు పల్లాల్లో దాని వేగాన్నిపెంచేందుకు వన్ మోటార్ స్ట్రోక్ ఇంజిన్ ను ఉపయోగిస్తుంటారు. దీనికి మాత్రం టూ మోటార్ స్ట్రోక్ ఇంజిన్ ఉపయోగించారు. అంతేకాదు దాని డిజైన్ ను ( స్టీల్ ట్రేల్లిస్ ఫ్రేమ్) సైతం 1970ల నుంచి వెహికల్ రంగంలో అగ్రగామిగా ఉన్న బక్కర్ ఫ్రేమ్బౌవ్ కంపెనీ ఆధ్వర్యంలో డిజైన్ చేయించారు. ఇక దాని వేగం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.సెకన్ల వ్యవధిలోనే వందల కిలోమీటర్ల టార్గెట్ ను ఛేదిస్తోంది.170 కిలోవాట్ల పిఎమ్ఐసి (పర్మనెంట్ మాగ్నెట్ ఎసి) మోటారుతో పనిచేసే డెల్టా ఈఎక్స్ 300 కిలోమీటర్ల దూరాన్ని తొమ్మిది సెకన్లలో రీచ్ అవుతుంది. అంటే మూడు సెకన్లకు 100 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. దాని బాడీ పార్ట్స్ ఆకట్టుకునేలా ఉంటాయి. ముఖ్యంగా బైక్ టైర్ వేగాన్ని అదుపు చేసేలా సిరామిక్ రెయిన్ ఫోర్స్ డ్ కార్బన్ ట్యూబ్స్‌తో ఓహ్లిన్స్ ఫోర్క్, బైక్ అప్ అండ్ డౌన్ ను కంట్రోల్ చేసే ఓహెలిన్స్ టీటీఎక్స్ జీపీ మోనో షాక్ స్ప్రింగ్స్, బ్రేక్ వేసే సమయంలో ప్రమాదాలు జరగకుండా రక్షించేలా యూకేకు చెందిన హెల్ కంపెనీ ఫోర్ పిస్టోన్ ర్యాడైల్ క్లిప్పర్, ఫోర్జెడ్ అల్యూమినియంతో ఫ్రంట్ వీల్.. పీవీఎం మెగ్నీషియం వెనుక చక్రంతో అమర్చారు. కాగా, ఈ ఎలక్ట్రిక్ సూపర్ బైక్ 70కి పైగా భాగస్వామి కంపెనీల సహాయంతో తయారు చేసింది విద్యార్ధుల బృందం.ప్రస్తుతం మోటోజిపి రేసర్ బైక్ తరహాలో కొన్ని మార్పులు చేసేందుకు సిద్ధమైంది. చదవండి : హోండా నుంచి ఎలక్ట్రిక్ బైక్! -
కదిలితే చనిపోతుంది.. రోజుకు 22 గంటలు బెడ్‌పైనే..
నెదర్లాండ్స్: డ్రాన్‌టెన్‌కు చెందిన 27 ఏళ్ల సెలెస్ట్ వాస్ వీనెస్ అనే మహిళ అరుదైన వ్యాధితో బాధపడుతుంది. ఆమె ఎహ్లర్స్ డాన్లోస్ సిండ్రోమ్ (EDS) అని పేర్కొనే జన్యు సంబంధ వ్యాధితో బాధపడుతుంది. ఇది వంశపారపర్యంగా సోకే అరుదైన వ్యాధి. దీంతో ఆమె రోజుకు 22 గంటలు మంచంమీదే పడుకుని ఉంటుంది. అయితే ఆమె ప్రత్యేక పైపుల ద్వారా కాల కృత్యాలను తీర్చుకుంటుంది. ఈ వంశపారపర్యం వ్యాధి వలన చర్మం, ఎముకలు, రక్తనాళాలు, అవయవాలకు సంబంధించిన కణజాలాలు తీవ్ర ప్రభావానికి గురౌతాయి. దీని వలన ఆ వ్యక్తిలో కదల్లేని స్థితి ఏర్పడుతుంది. దీంతో మెడ, వెన్నుపూసలు నిటారుగా నిలబడలేవు. కాగా, ఆమె గొట్టాల సహయంతో ద్రవ పదార్థాన్ని ఆహరంగా తీసుకుంటుంది. ఆమె శరీరంలోని కొన్ని భాగాలు కదలకుండా ఉండేందుకు 22 రింగులను తొడిగారు. ఆమె ఎక్కువగా కదిలితే చనిపోయే ప్రమాదం ఉంది. దాంతోనే ఆమె శరీరంలోని పలు భాగాలకు రింగులు అమర్చారు. ఆమె శరీరం సూర్యరశ్మి కిరణాలను కూడా తట్టుకొలేదు. దీంతో ఆమె ఎక్కువ సమయం చీకటిలోనే గడుపుతుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..‘ ఇంకా ఎన్నిరోజులుంటానో తెలియదు.. శారీరకంగా మానసికంగా కుంగిపోతున్నాను..ఇంకా బతకాలని లేదని బాధపడింది’ ..అయితే స్పెయిన్‌లోని బార్సినాలోని వైద్యులు ఆమె అరుదైన వ్యాధికి చికిత్స అందించడానికి ముందుకొచ్చారు. ఈ ఆపరేషన్‌కు అవసరమైన మొత్తాన్ని క్రౌడ్ ఫండింగ్ సహయంతో సేకరిస్తున్నారు. -
రైలును ప్రమాదం నుంచి కాపాడిన తిమింగలం!
ఆమ్స్టర్ డ్యామ్: నెదర్లాండ్‌లో ఒక సబ్వే రైలు ప్రమాదానికి గురి కాకుండా తృటిలో తప్పించుకుంది. సోమవారం తీసిన వైమానిక ఫోటోలో ఆ రైలును చూడవచ్చు. డి అక్కర్స్ మెట్రో స్టేషన్ వద్ద అదుపు తప్పిన రైలు నేరుగా రైలింగ్‌ను ఢీకొట్టి ముందుకెళ్లిపోయింది. అయితే పట్టాలను అనుకొని ఉన్న భారీ తిమింగలం తోక మీద ఆగింది. రోటర్ డామ్ మెట్రోకు దక్షిణంగా ఉన్న స్టేషన్లో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఆర్కిటెక్ట్ స్ట్రూయిజ్స్ అనే వ్యక్తి 20 ఏళ్ల క్రితం తిమింగలాలు వంటి శిల్పాలను అక్కడ నిర్మించారు. ఈ సంఘటన గురించి స్ట్రూయిజ్ మాట్లాడుతూ, నేను ఆశ్చర్యపోయాను ఇలాంటి ఘటనను అసలు ఊహించలేదు. అయితే ఈ సంఘటన ఎలా జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నా అని అన్నారు. అదృష్టవశాత్తు రైలును పార్క్ చేయడానికంటే ముందే ప్రయాణికులందరూ దిగేశారు. ఆ సమయంలో లోకో పైలెట్ ఒక్కడే ఉన్నాడు. ఈ ప్రమాదంలో అతను ఎలాంటి గాయాలు కాకుండా బయటపడ్డాడు. ఈ ప్రమాదం 30 అడుగుల ఎత్తులో జరిగింది. ఒక వేళ తిమింగలం తోక కనుక అక్కడ లేకపోతే పెను ప్రమాదమే జరిగేది. రైలును అక్కడ నుంచి తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చదవండి: పాపకి ఊహించని గిఫ్ట్.. డాడీ అంటూ.. -
కోహ్లి, అజామ్‌లను దాటేశాడు..
అమెస్టర్‌డామ్: ప్రస్తుత క్రికెట్ శకంలో విరాట్ కోహ్లి, బాబర్ అజామ్, రోహిత్ శర్మలు తమదైన ఆటతో రికార్డులు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీరికి సవాల్ విసురుతున్నాడు నెదర్లాండ్ క్రికెటర్. కుడిచేతి వాటం ఆటగాడైన ర్యాన్ టెన్ డషెట్ తన వన్డే యావరేజ్లో కోహ్లి, అజామ్‌లను వెనక్కినెట్టాడు. 33 వన్డేల ఆడిన అనుభవం ఉన్న డషెట్ 32సార్లు బ్యాటింగ్ చేశాడు. మొత్తంగా 67.00 సగటుతో ఐదు సెంచరీల సాయంతో 1541 పరుగులు చేశాడు. దాంతో వన్డే ఫార్మాట్లో కనీసం వెయ్యి పరుగులు సాధించి అత్యధిక యావరేజ్ కల్గిన ఆటగాళ్ల జాబితాలో టాప్‌లో నిలిచాడు. ఇక్కడ కోహ్లి 60. 31తో రెండో స్థానంలో నిలిస్తే, బాబర్ అజామ్ 54.55 సగటుతో మూడో స్థానంలో ఉన్నాడు. దీనికి ఒక స్పోర్ట్స్ చానెల్ ఈ విషయాన్ని తెలియజేస్తూ ఫోటోలను పోస్ట్ చేసింది. దీనిలో భాగంగా వారు కచ్చితంగా నీ కంటే యావరేజ్ కల్గిన బ్యాట్స్‌మన్ కాదంటూ ట్వీట్ చేసింది. దీనికి స్పందించిన డాషెట్.. కోహ్లి, బాబర్ అజామ్‌లకు క్షమాపణలు తెలియజేశాడు. ఇలా పోస్ట్ చేసినందుకు తాను క్షమాపణులు తెలియజేస్తున్నానని పేర్కొన్నాడు. -
ఒక్క రోజుకి పెళ్లి!
ఒక్క రోజు కోసం ఎవరైనా పెళ్లి చేసుకుందామనుకుంటున్నారా? ఆ తర్వాత ఓ అందమైన నగరాన్ని ఆమెతో కలసి చుట్టేయాలనుకుంటున్నారా? మనది కాని ఊరిలో.. ఏ మాత్రం పరిచయం లేని ఓ అందమైన అమ్మాయితో ఒక్కరోజు వివాహం.. సాధ్యమే సుమా! అందంగా అలంకరించిన పెళ్లి మండపంలో వధూవరులిద్దరూ ఉంగరాలు మార్చుకోవడంతో మొదలై సిటీ అంతా ఎంచక్కా ఇద్దరూ కలిసి చక్కర్లు కొట్టేయొచ్చు. అందమైన సరసుల్లో విహారానికెళ్లొచ్చు. మధ్య మధ్యలో సెల్ఫీలకూ వీలుంటుంది. మీ స్తోమతను బట్టి ఈ పెళ్లికి మీ బంధుమిత్రులను కూడా ఆహాæ్వనించొచ్చు. అయితే ఈ పెళ్లి మీరు చేసుకోవాలనుకుంటే వేలం పాటలో పాల్గొనాల్సిందే. ఎంత ఖర్చయినా పర్లేదు ఒక్క రోజు పెళ్లి చాన్స్ కొట్టేయాలనుకుంటే బట్టలు సర్దుకోండి మరి.. కాస్త ఆగండి.. ఈ పెళ్లి తర్వాత ఉండే షరతులు కూడా చెబుతాం.. అప్పుడు ఓకే అనుకుంటే సర్దుకోండి బట్టలు.. ముఖ్యమైనదేంటంటే పెళ్లి చేసుకున్న అమ్మాయిని కనీసం ముద్దు కూడా పెట్టుకోవడానికి వీల్లేదు. అయితే చిన్నపాటి కౌగిలింతకు మాత్రం అవకాశం ఉంటుంది. అసలీ ఒక్క రోజు పెళ్లి ఏంటి..? చక్కర్లు కొట్టడం ఏంటి..? ఆ నిబంధనలేంటి అనుకుంటున్నారా? ఈ తంతు జరిగేది నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డాంలో. యువతను ఆకర్షించి అక్కడి పర్యాటక రంగాన్ని అభివృద్ధిపరిచేందుకు ఇలా ఓ వింత పెళ్లిని జరిపిస్తున్నారు. పర్యాటకులకు సాధారణ గైడ్ మాదిరిగా కాకుండా ఆత్మీయ స్నేహితురాలిగా మెలుగుతూ దగ్గరుండి ప్రాంతాన్ని ఆ వధువు చూపిస్తుందన్న మాట. ఇరువురి మధ్య గౌరవానికి భంగం రాకుండా ప్రవర్తించడం ఒక గొప్ప అనుభవంగా కూడా భావిస్తున్నారు. పర్యాటకులకు, ఆ ప్రాంతవాసులకు మధ్య సుహృద్భావ వాతావరణాన్ని నెలకొల్పేందుకూ ఈ ఆలోచన ఎంతగానో ఉపయోగపడుతోందట. దీని ద్వారా వచ్చే ఆదాయం లో కొంత మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు విని యోగిస్తున్నారు. 2015 నుంచి ఈ వివాహాలను ‘వెడ్ అండ్ వాక్’పేరుతో నిర్వహిస్తున్నారు జోనా రెన్స్. ఆమ్‌స్టర్‌డాంలోని స్థానిక మార్కెటింగ్ సంస్థలు, వ్యాపారులు ‘అన్టూరిస్ట్ గైడ్ టు ఆమ్ స్టర్డాం’పేరుతో వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించారు. -
ఆ బాధను భరించలేకపోతున్నా!
‘చాలా ఏళ్లుగా పోరాడుతూనే ఉన్నా.. ఇప్పుడు ఆ పోరాటం ముగిసింది. ఇక నా వల్ల కాదు. ఈ బాధను నేను భరించలేకపోతున్నా. చాలా సంభాషణలు.. సమీక్షల అనంతరం నేను ఈ లోకం వీడాలనే నిర్ణయానికి వచ్చా.. తినడం, తాగడం మానేసాను. వాస్తవానికి నేను ఎప్పుడో చనిపోయాను. ప్రస్తుతానికి నేను గాలి పీల్చుకుంటున్నా.. అది బతకడానికి కాదు. నా కుటుంబం నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంది. రోజంతా నా కుటుంబంతో గడిపితే నా బాధ నుంచి ఉపశమనం కలిగేది. నా జీవితంలో ముఖ్యమైన వారందరికి గుడ్‌బై. ఇక సెలవు’ అంటూ ఓ 17 ఏళ్ల టీనేజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్. ప్రస్తుతం ఈ పోస్ట్ నెదర్లాండ్స్‌లో ఉన్న చట్టాలపై చర్చకు తెరలేపింది. సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చ జరుగుతోంది. ‘ఇది చాలా విచారకరమైన విషయం. ఓ యంగ్ డచ్ గర్ల్ 17 ఏళ్ల వయసులోనే కారుణ్య మరణం పొందడం ఏంటి. ఆమె తన డిప్రెషన్‌ను హ్యాండిల్ చేయలేకపోయింది. అయినా డచ్ ప్రభుత్వం ఎలా అనుమతిచ్చింది. కనీసం ఆమె మేజర్ అయ్యేంత వరకైనా వేచి చూడాల్సింది. ఆ అమ్మాయి మరణంతో మా గుండె పగిలింది.’ అంటూ ఆ దేశ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విషయం ఏంటంటే.. పసితనంలో తన తనువుపై మృగాళ్లు చేసిన గాయం.. ఆ టీనేజర్‌ను తీవ్ర డిప్రేషన్‌లో నెట్టేసింది. కోలుకోవడానికి ఎంత ప్రయత్నించినా ఆమె వల్ల కాలేదు. చివరకు ఈ భూమి మీద ఉండలేనంటూ కారుణ్య మరణం పొందింది. నెదర్లాండ్స్‌కు చెందిన నోవా పోథోవెన్ చిన్నతనంలో జరిగిన అత్యాచారం నుంచి కోలుకోలేకపోయింది. ఆ ఘటనతో కొన్నేళ్లుగా తీవ్రమానసిక వ్యధను అనుభవించింది. చివరకు తనవల్ల కాదని ప్రభుత్వ అనుమతితో కారుణ్యమరణం పొందింది. ఇక నెదర్లాండ్స్‌లో కారుణ్య మరణం చట్టబద్ధమన్న విషయం తెలిసిందే. అయితే నోవా మరణంతో ఈ చట్టాన్ని సవరించాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో పునరాలోచించాలని కోరుతున్నారు. ఇక నోవా తన జీవితాన్ని ‘విన్నింగ్ ఆర్ లర్నింగ్’ పుస్తకంగా మలిచింది. How incredibly sad. A young Dutch girl has legally euthanised herself at 17-years-old because she couldn't handle the depression of being raped as a child. My heart breaks for this poor baby. Her name is Noa Pothoven. 😢 — CharlieSANSOM.com (@CharlieSansom) June 4, 2019 Unpopular opinion: #NoaPothoven lacked the maturity needed for such a decision. I fear she was spurred on by the attention she was getting by followers I.E "this will be great for drama and attention if I go this way! My followers will love me and I will be worshiped". — City Girl ♥️ (@_abuse_survivor) June 4, 2019 -
వైరల్ : భూమ్మీద నూకలుండటం అంటే ఇదే..!
అదృష్టం బాగాలేకపోతే అరటి పండు తిన్నా పళ్లు ఊడిపోతాయని సినిమాలో ఓ స్టార్ హీరో డైలాగ్.. మరి అదృష్టం బాగుంటే ఎలా ఉంటుంది. ఇదిగో ఇలా ఉంటుంది అంటున్నారు ఈ వీడియో చూసిన జనాలు. వెంట్రుకవాసిలో మృత్యువుని తప్పించుకున్న ఓ సైక్లిస్ట్‌కు సంబంధించిన ఓ వీడియో తెగ వైరలవుతోంది. రైల్వే లైన్ల వద్ద భద్రత ఎంత దారుణంగా ఉందో కళ్లకు కడుతుంది ఈ సంఘటన. నెదర్లాండ్‌లో జరిగింది ఈ సంఘటన. రైల్వే క్రాసింగ్ వద్ద ఎలాంటి భయంకర పరిస్థితులు ఉన్నాయో తెలుపుతూ ఓ రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్షర్ సంస్థ ఈ వీడియోను యూట్యూబ్‌లో అప్లోడ్ చేసింది. వీడియోలో ఉన్న దాని ప్రకారం ఓ సైకిలిస్టు రైల్వే ట్రాక్ దాటే ప్రయత్నంలో ఓ వైపు నుంచి రైలు వస్తుందని అక్కడే ఆగాడు. అది వెళ్లిపోయాక ట్రాక్ దాటుతున్నాడు. అదే సమయంలో మరో ట్రాక్ పైనుంచి దూసుకొస్తున్న రైలును ఆ సైక్టిస్ట్ చూసుకోలేదు. దీంతో సైకిల్ తొక్కుకుంటూ ముందుకెళ్లాడు. రైలు చాలా సమీపంలోకి వచ్చేంతవరకూ సదరు సైక్లిస్ట్ దాన్ని గమనించలేదు. చూసిన వెంటనే అప్రమత్తం కావడంతో కేవలం అర సెకన్ వ్యవధిలో మృత్యువుని తప్పించుకోగలిగాడు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న కెమెరాలో రికార్డయింది. యూట్యూబ్‌లో అప్లోడ్ చేసిన ఈ వీడియోను ఇప్పటికే దాదాపు 8 లక్షల మంది చూశారు. వీడియో చూసిన వారంతా సదరు వ్యక్తి అదృష్టాన్ని తెగ పొగుడుతున్నారు. -
బంగారు కోతులు అతని పంట పండించాయి
95 దేశాల నుంచి 45 వేల ఫొటోలు.. అందులోంచి ఎంపిక చేశారు.. ఈ ఒక్క చిత్రాన్ని.. 2018 వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ పురస్కారం నెదర్లాండ్స్‌కు చెందిన మార్సల్కు దక్కింది.. గోల్డెన్ కపుల్ పేరిట ఆయన తీసిన ఈ బంగారు కోతుల చిత్రానికి గ్రాండ్ ప్రైజ్ వరించింది. దీన్ని చైనాలోని కిన్‌లింగ్ పర్వత ప్రాంతంలో తీశారు. ఈ కోతులు అంతరించిపోతున్న జీవజాతుల జాబితాలో ఉన్నాయి. అది కూడా ఈ పర్వత ప్రాంతంలోనే ఉన్నాయట. ఒకచోట స్థిరంగా ఉండకుండా అటూ ఇటూ దూకుతూ ఉన్నాయని.. ఈ ఫొటో తీయడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందని మార్సల్ తెలిపారు. ఏటా ఈ పోటీలను లండన్‌లోని ప్రఖ్యాత నేచురల్ హిస్టరీ మ్యూజియం నిర్వహిస్తోంది. -
యువతకు ఆ దేశమే బెస్ట్
ఆమ్స్టర్డ్యామ్ : మంచి మార్కులు రాలేదనో.. కోరుకున్న కాలేజిలో సీటు రాదనో.. అమ్మ మందలించిందనో.. నాన్న కోప్పడ్డాడనో కారణాలేవైనా సరే.. క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుంటోంది నేటి యువత. అందరు ఇలానే ఉన్నారని చెప్పలేము. కానీ చాలా దేశాల్లో యువత మాత్రం ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొంటున్నారు. అయితే ఈ విషయం గురించి అధ్యాయనం చేసిన కొన్ని సంస్థలు మాత్రం నేటి యువతకు తగిన దేశం నెదర్లాండ్ అని ముక్త కంఠంతో తేల్చేశాయి. ఎందుకంటే నెదర్లాండ్ యువత తమ టీనేజ్‌ను చాలా సంతోషకరమైన పరిస్థితులు మధ్య గడుపుతున్నట్లు ఈ సర్వేలో తెలిసింది. ప్రపంచ సంపన్న దేశాల్లో సంతోషం, ఆరోగ్యం, మంచి విద్య వంటి పలు అంశాల గురించి చేసిన సర్వేలో నెదర్లాండ్ మిగతా దేశాలను వెనక్కి నెట్టి ప్రథమ స్థానంలో ఉన్నట్లు సర్వేలు తెలిపాయి. యూనిసెఫ్ సర్వేలోనూ ప్రథమం... ఐక్యరాజ్యసమితి ముఖ్య విభాగం యూనిసెఫ్ 2017 సంవత్సరానికి గాను నిర్వహించిన సంతోషకరమైన దేశాల సర్వేలో నెదర్లాండ్ ప్రథమ స్థానంలో నిలిచింది. అంతేకాక మరో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే ప్రపంచ వ్యాప్తంగా ఆడపిల్లల పట్ల హింస పెరిగిపోతున్న ఈ కాలంలో, నెదర్లాండ్ ఆడపిల్లలు మాత్రం చాలా అంటే చాలా తక్కువ శాతం మంది మాత్రమే ఏవో చిన్న చిన్న విషయాల్లో మాత్రమే బాధపడినట్లు సర్వేలో తెలిసింది. అలానే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు విడుదల చేసిన సర్వేలో స్థూలకాయం బారిన పడుతున్న వారి సంఖ్య మిగతా సంపన్న దేశాలతో పోలిస్తే నెదర్లాండ్‌లో చాలా తక్కువగా ఉన్నట్లు గుర్తించింది. అసలు రహస్యం ఇదే... నెదర్లాండ్ దేశ ప్రజలు ఇంత సంతోషంగా ఉండటానికి కారణం వారి పని వేళలు అంటున్నారు నిపుణులు. డచ్ ప్రజలు(నెదర్లాండ్ ప్రజలనే డచ్ ప్రజలు అంటారు) రోజులో 16 గంటల సమయాన్ని తినడం, నిద్రపోవడం, కుటుంబంతో గడపడం వంటి వాటికే కేటాయిస్తారు. వారంలో కేవలం 30.3 గంటలు మాత్రమే పనిచేస్తారు. కేవలం 0.5శాతం మంది మాత్రమే ఎక్కువ గంటలు పనిచేస్తారని నివేదికలు తెలుపుతున్నాయి. నెదర్లాండ్ ప్రజలు కుటుంబ సభ్యులతో గడపడానికి ఎక్కువ ఇష్ట పడతారు. దాంతో అక్కడి యువత తల్లిదండ్రులతో చాలా మంచి అనుబంధాన్ని కల్గి ఉంటారు. వారి తల్లిదండ్రులతో అన్ని విషయాలు చర్చిస్తారని నివేదికలు తెలుపుతున్నాయి. ఇవే డచ్ యువత సంతోషానికి ప్రధాన కారణమంటున్నాయి సర్వేలు. -
సమష్టి పోరుతోనే ఉగ్ర నిర్మూలన
న్యూఢిల్లీ: ఉగ్రవాద నిర్మూలనకు ప్రపంచ దేశాలన్నీ కలసికట్టుగా పోరాడాలని భారత్, నెదర్లాండ్స్ పిలుపునిచ్చాయి. ఉగ్రవాదుల ప్రాబల్యం, ఆర్థిక వనరులను దెబ్బతీయడానికి, సీమాంతర ఉగ్రవాద నియంత్రణకు పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించాయి. భారత పర్యటనకు వచ్చిన నెదర్లాండ్స్ ప్రధాని మార్క్ రూట్ గురువారం ప్రధాని మోదీతో చర్చలు జరిపారు మతం, జాతి, తెగ, వర్గాలతో ఉగ్రవాదాన్ని ముడిపెట్టొద్దని ఇరువురు నేతలు ఉద్ఘాటించారు. పాక్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్ర సంస్థలు దక్షిణాసియాలో శాంతికి ముప్పుగా పరిణమించాయని ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నారు. అణు సరఫరా బృందం(ఎన్ఎస్జీ)లో భారత్ సభ్యత్వానికి నెదర్లాండ్స్ మద్దతిస్తుందని రూట్ తెలిపారు. మన బంధం మరింత బలపడాలి.. వాణిజ్యం, వ్యవసాయం, ఇంధన వనరులు తదితర రంగాల్లో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని భారత్, నెదర్లాండ్స్ నిర్ణయించాయి. ఇండియా–డచ్ సీఈవోల రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొన్నాక మోదీ, రూట్ సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు. ‘అంతర్జాతీయ సౌర కూటమిలో చేరాలని నెదర్లాండ్స్‌ను గతంలోనే ఆహ్వానించాను. గురువారం వారు అందులో సభ్య దేశంగా చేరారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను’ అని మోదీ అన్నారు. భారత్‌లో అత్యధికంగా విదేశీ పెట్టుబడులు పెడుతున్న దేశాల్లో నెదర్లాండ్స్ మూడో స్థానానికి చేరిందని వెల్లడించారు. భారత్‌లో కల్పిస్తున్న కొత్త అవకాశాల పట్ల డచ్ కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయని నరేంద్ర మోదీ అన్నారు. రూట్ మాట్లాడుతూ..వాణిజ్యం, వ్యవసాయం, స్మార్ట్ సిటీస్, ఇంధన వనరుల్లో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి మెరుగైన అవకాశాలున్నాయని అన్నారు. ద్వైపాక్షిక భేటీ తరువాత విడుదలైన ఉమ్మడి ప్రకటనలో..పెట్టుబడులు, వాణిజ్య సంబంధాల అభివృద్ధిలో ప్రైవేట్ రంగ పాత్ర కీలకంగా మారిందని మోదీ, రూట్ పేర్కొన్నారు. ‘క్లీన్ గంగా’ ప్రాజెక్టుకు రూట్ కితాబు.. పవిత్ర గంగా నది ప్రక్షాళనకు ఎన్డీయే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నమామీ గంగే పథకాన్ని రూట్ ప్రశంసించారు. నీటిని ఆర్థిక వనరుగానే పరిగణించకుండా, సామాజిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, పర్యావరణ పరంగానూ విలువ ఇవ్వాలని పేర్కొన్నారు. గంగా నది శుద్ధి కార్యక్రమంలో ఈ అంశా లన్నీ ఇమిడి ఉన్నాయని కితాబు ఇచ్చారు. కాగా, గురువారం రాత్రే రూట్ స్వదేశం బయల్దేరారు. 29 నుంచి మోదీ విదేశీ పర్యటన ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 29 నుంచి ఐదు రోజుల పాటు ఇండోనేసియా, సింగపూర్ దేశాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఇరుదేశాలతో రక్షణ, భద్రతరంగానికి సంబంధించి పలు ఒప్పందాలు చేసుకుంటారు. మే 29 నుంచి 31 వరకూ మోదీ ఇండోనేసియాలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో ఇండోనేసియాతో రక్షణరంగంలో సహకారం కోసం ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నారు. అనంతరం జూన్ 1న సింగపూర్‌కు వెళ్లనున్న మోదీ ఆ దేశ ప్రధాని లీసెయిన్ లూంగ్‌తో పలు అంశాలపై విస్తృతంగా చర్చిస్తారు. అనంతరం 28 ఆసియా–పసిఫిక్ దేశాల రక్షణ మంత్రులు, ఆర్మీ చీఫ్‌లు పాల్గొనే షాంగ్రీ లా సదస్సులో మాట్లాడతారు. ఈ సదస్సులో ప్రసంగించనున్న తొలి భారత ప్రధాని మోదీనే కావడం గమనార్హం. ‘గ్రామస్వరాజ్’ సక్సెస్ ప్రధాని మోదీ ఉద్ఘాటన న్యూఢిల్లీ: ఎన్డీయే ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల వివరాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఉద్దేశించిన ‘గ్రామస్వరాజ్ అభియాన్’ కార్యక్రమం విజయవంతమైందని.. ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా ఏప్రిల్ 14 (అంబేడ్కర్ జయంతి) మొదలుకుని మే 5 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ‘భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్‌కు నివాళులర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని రూపొందించాం’ అని ఆయన ట్వీట్ చేశారు. పేదలకోసం ఉద్దేశించిన ఏడు ముఖ్యమైన కేంద్ర ప్రభుత్వ పథకాలను వివిధ బృందాలు గ్రామాల్లో పర్యటించి ప్రజలకు వివరించాయన్నారు. ‘ఈ 21 రోజుల్లో 7.53 లక్షల మందికి ఉజ్వల కనెక్షన్లు, 5లక్షల ఇళ్లకు సౌభాగ్య పథకం ద్వారా విద్యుత్ వెలుగులం దించాం. 16,682 గ్రామాల్లో 25 లక్షల ఎల్ఈడీ బల్బులను పంపిణీ చేశాం. 1.65 లక్షల మంది∙చిన్నారులు, 42,762 మంది గర్భిణులకు మిషన్ ఇంద్ర ధనుష్‌లో భాగంగా టీకాలు వేశాం’ అని ప్రధాని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు, స్థానిక సంస్థల భాగస్వామ్యం మరువలేనిదన్నారు. అందరికీ మోదీ కృతజ్ఞతలు తెలిపారు. -
హేగ్ నగరంలో ‘ఫాలో ది మహాత్మా’
దిహేగ్(నెదర్లాండ్స్): గాంధీ జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు నెదర్లాండ్స్ ప్రభుత్వం, ఇక్కడి భారత రాయబార కార్యాలయం నిర్ణయించాయి. అక్టోబర్ 1, 2 తేదీల్లో హేగ్ నగరంలో ‘ఫాలో ది మహాత్మా’ పేరుతో వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నాయి. ఇందులో అహింసా సిద్ధాంతాన్ని బలపరిచే వివిధ సంస్థలు, వ్యక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. ఇందులో భాగంగా అక్టోబర్ ఒకటిన హేగ్ నగరంలోని పీస్ ప్యాలెస్ నుంచి గ్రోట్‌కెర్క్ వరకు ‘గాంధీ మార్చ్’ చేపట్టనున్నారు. ఇందులో భారత్‌తోపాటు వివిధ దేశాలకు చెందిన 1,500 మంది పాల్గొంటారని భావిస్తున్నారు. నెదర్లాండ్స్‌లో ఇటువంటి ర్యాలీ నిర్వహించటం ఇదే ప్రథమమని అంటున్నారు. ఈ సందర్భంగా గాంధీజీ వాడిన సైకిల్‌ను గ్రోటె కెర్క్ వద్ద ప్రదర్శనకు ఉంచుతారు. ఈ సైకిల్‌ను భారత ప్రభుత్వం పంపించింది. నెదర్లాండ్స్ వాసులకు సైక్లింగ్ చాలా ఇష్టం. ఇక్కడి సంస్కృతిలో సైకిల్ ఒక భాగం కావటం గమనార్హం. అదేవిధంగా గ్రోటెకెర్క్ వద్ద ఉన్న కోర్జో థియేటర్లో సత్యాగ్రహ పేరుతో ప్రముఖ సంగీత కళాకారుడు ఫిలిప్ గ్లాస్ నేతృత్వంలో ఒపెరా ఉంటుంది. డచ్ భాషలో ప్రమోద్ కుమార్ అనే భారతీయుడు రచించిన ‘గాంధీ- యాన్ ఇల్యుస్ట్రేటెడ్ బయోగ్రఫీ’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. అదేవిధంగా అక్టోబర్ 2వ తేదీన స్వచ్ఛంద కార్యకర్తలు నెదర్లాండ్స్‌లోని పాఠశాలలకు వెళ్లి గాంధీజీ బోధించిన అహింస, శాంతి, సహనం ప్రాధాన్యతను వివరించనున్నారు. నెదర్లాండ్స్ వాసులకు ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ అహింసా దినోత్సవం అక్టోబర్ 2వ తేదీన చేపట్టే కార్యక్రమాలపై ఫేస్బుక్లో ఒక పేజీ క్రియేట్ చేశామన్నారు. ఆయా కార్యక్రమాలను టాటా స్టీల్ (యూరప్) చైర్మన్ థియే హెన్రార్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ పర్యవేక్షిస్తుంది. ఈ కమిటీలో ప్రొఫెసర్ వినోద్ సుబ్రమణ్యం, వీయూ వర్సిటీ ఆమ్స్టర్డామ్ రెక్టార్ మాగ్నిఫికస్, మాజీ ఎంపీలు ఆర్.రాంలాల్, తాంజా జద్నాన్సింగ్ ఉన్నారు. నెదర్లాండ్స్ దేశస్తులు మహాత్మునికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారంటే.. అక్కడి పట్టణాల్లోని దాదాపు 30 వీధులకు మహాత్మాగాంధీ పేరు పెట్టుకున్నారు. ఇండియా తర్వాత అత్యధికంగా మహాత్ముని పేరు పెట్టుకున్న దేశం నెదర్లాండ్స్ కావటం విశేషం. అంతేకాదు నెదర్లాండ్స్‌లోని దిహేగ్, ఆమ్స్టర్డామ్, ఉట్రెచ్ నగరాల్లో మహాత్ముని విగ్రహాలు నెలకొల్పారు. గాంధీ జయంతి అక్టోబర్ 2వ తేదీని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ అహింసా దినంగా ప్రకటించి, అనేక కార్యక్రమాలు చేపడుతోంది. -
పెట్రోల్, డీజిల్ కార్లపై నిషేధం?!
మానవ అభివృద్ధి సూచీలో ఐదో స్థానంలో ఉన్న నెదర్లాండ్ మరో ముందడుగు వేసేలా కనబడుతోంది. పెట్రోల్, డీజిల్ కార్ల అమ్మకాలు 2025 నాటికి పూర్తి స్థాయిలో నిషేధం విధించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు లేబర్ పార్టీ అక్కడి దిగువసభలో బిల్లును ప్రవేశపెట్టింది. కేవలం ఎలక్ట్రిక్ కార్లను మాత్రమే 2025 తర్వాత అమ్మకాలు జరపాలని తమ ప్రతిపాదనలో పేర్కొంది. ట్విడ్ కమెర్(పార్లమెంట్ దిగువ సభ)కు ఎన్నికైన వారిలో మెజారిటీ సభ్యులు ఈ బిల్లుకు అనుకూలంగా ఉన్నారు. ఈ నిర్ణయంతో అప్పటి వరకు ఉన్న పెట్రోల్, డీజిల్ కార్లు రోడ్లపై తిరిగే అవకాశం ఉంటుంది. కానీ, కొత్త పెట్రోల్, డీజిల్ కార్ల విక్రయాలు పూర్తిగా ఆపివేస్తారు. డచ్ పార్లమెంట్లో దీనిపై పూర్తి స్తాయిలో చర్చజరిగే అవకాశం ఉంది. ఒక వేళ ఈ బిల్లుకు ఆమోదం లభిస్తే ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలకు ఇదొక సానుకూల అంశంగా మారే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ కార్ల వినియోగంతో పెట్రోల్, డీజిల్ కార్ల ద్వారా వచ్చే కాలుష్యానికి చెక్ పెట్టొచ్చు. నెదర్లాండ్‌లో మొత్తం 29 శాతం రవాణాకోసం శక్తిని వినియోగిస్తుంటే వీటిలో కేవలం 10 శాతం మాత్రమే పునరుత్పాదక వనరులపై ఆధారపడుతోంది. ఈ బిల్లు చట్టంగా మారితే ప్రపంచంలోని మిగతా దేశాలకు నెదర్లాండ్ ఆదర్శదేశంగా నిలువనుంది. -
నెదర్లాండ్ ప్రజల సరికొత్త ఆలోచన
-
'సిగరెట్లు, హుక్కాకు ఇక నో..'
దిహేగ్: వచ్చే ఏడాది నుంచి తమ దేశంలో ఈ సిగరెట్లు, హుక్కాను 18 ఏళ్లలోపువారికి అనుమతించకుండా నిషేధాజ్ఞలు జారీ చేయనుంది. భవిష్యత్ యువకుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు నెదర్లాండ్ అధికారులు తెలిపారు. ఈ రెండు వస్తువులు ఊహించిన దానికంటే ఎక్కువ ప్రమాదాన్ని సృష్టిస్తాయని ఇటీవల తెలిసిందని అందుకే చాలా కఠినంగా నిషేదాజ్ఞలు అమలుచేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. పొగాకు రహితంగా ఉండే ఈ సిగరెట్ల వాడకం ద్వారా ఆరోగ్యాన్ని కొంత రక్షించుకోవచ్చని ఇన్నాళ్లు అనుకున్నా అవన్నీ అపోహలు అని తాము తాజాగా నిర్వహించిన అధ్యయనాల్లో తేలిందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. -
నెదర్లాండ్ పై అర్జెంటినా విజయం!
-
నెదర్లాండ్ పై అర్జెంటినా విజయం!
-
పెనాల్టీ షూట్ అవుట్ లో నెదర్లాండ్ పై అర్జెంటినా విజయం!
ప్రపంచ కప్ ఫుట్ బాల్ టోర్నిలో జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్ లో అర్జెంటీనాపై నెదర్లాండ్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ఏజట్టు కూడా నిర్ణీత సమయంలో గోల్ చేయకపోవడంతో అదనపు సమయాన్ని కేటాయించారు. అదనపు సమయంలో కూడా గోల్స్ నమోదు కాకపోవడంతో మ్యాచ్ ఫలితాన్ని నిర్ధేశించేందుకు సీన్ పెనాల్టీ షూట్ వుట్ కు మారింది. పెనాల్టీ షూటవుట్ లో అర్జెంటీనా 4-2 తేడాతో నెదర్లాండ్ పై విజయం సాధించింది.