Netherland Man Sacrifices His Car: మనం సాధారణంగా రోడ్డు మీద వెళ్తున్నప్పుడూ ఏవరైనా కారు ర్యాష్‌గా డ్రైవ్ చేస్తే మనకు చాలా కోపం వస్తుంది. ఇన్ని భయంకరమైన ప్రమాదాలు జరిగిన అసలు వీళ్లకు బుద్ధి రాదు అని కూడా అనుకుంటాం. కానీ ఇక్కడొక వ్యక్తి కారుని ఇష్టారీతిన నడిపి ప్రమాదానికి గురవుతాడు. అయితే అతడి నిర్లక్షాన్ని క్షమించి ఆ కారుని కాపాడే ప్రయత్నం చేసి సహృదయం చాటుకున్నాడు ఓ వ్యక్తి. ఆ వివరాలు..
(చదవండి: దెయ్యంతో ఆటలాడిన భౌ.. భౌ..!! వైరల్...)
అసలు విషయంలోకెళ్లితే....ఇక్కడ రోడ్డు పై మూడు కార్లు వెళ్తుంటాయి. అందులో ఒక కారు ఉన్నటుండి నియంత్రణ కోల్పోయి చాలా వేగంగా అటు ఇటూ రకరకాలగా వెళ్తుంటుంది. ఈ విషయాన్ని మిగత కారుల్లో ప్రయాణిస్తున్న వాళ్లు గమనిస్తారు. మొదట ఏంటి ఇలా నడుపుతున్నాడు అని వాళ్లంతా అనుకుంటారు. అయితే కాసేపటికి వాళ్లకు అసలు విషయం అర్థమవుతోంది. ఆ కారుని నడుపుపతున్న మహిళ స్పృహ తప్పి పడిపోయిందని అందువల్లే కారు ఇష్టమొచ్చినట్లుగా వెళ్తోంది అని.
అయితే ఆమెను ఎలాగైన కాపాడాలని అదే సమయంలో అక్కడ ప్రయాణిస్తున్న మిగతా కార్లలోని వాళ్లు అనుకుంటారు. అంతేకాదు అనుకున్నదే తడువుగా ఆమె కారు వెళ్లేందకు దారి ఇచ్చేసి తర్వాత ఆమె కారుకి ముందు ఒక కారుని అడ్డంగా పెట్టి ఢీ కొట్టేలా చేసి ఆపుతారు. అంతేకాదు ఆమె కారు వెనుక భాగంలో కూడా మరో కారు వచ్చి ఢీకొట్టి ఆ కారుని ఆపడానికి ప్రయత్నిస్తారు.
ఆ తర్వాత ఆ కారు నడుపుతున్న మహిళను కాపాడతారు. అంతేకాదు రోడ్డుపై ఎటువంటి ప్రమాదం జరగకుండా చూడటమే కాక తన కారుని అడ్డంగా పెట్టి రిస్క్ చేయడం చాలా ప్రశసించదగ్గ విషయం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పైగా ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్, లైక్‌లు వచ్చాయి. మీరు కూడా ఓ లుక్ వేయండి.
(చదవండి: టీ పొడి వ్యాపారం చేద్దామనుకోవడమే వారిపాలిట శాపమైంది.. అదిరిపోయే ట్విస్ట్!!..)
Man sacrifices his car to save another driver who was unconscious..
— Buitengebieden (@buitengebieden_) November 21, 2021
Via @RTVNunspeet pic.twitter.com/drgac0UDez
Comments
Please login to add a commentAdd a comment