car driver
-
ట్రాఫిక్ పోలీస్ ను ఈడ్చుకెళ్లిన కారు డ్రైవర్
-
బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ వద్ద కారు బీభత్సం
-
నిర్లక్ష్యం ఖరీదు నిండు ప్రాణం!
అనంతపురం: కారును వేగంగా వెనక్కు తీస్తుండగా చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... పెద్దవడుగూరు మండలం ఎం.రాంపురం గ్రామానికి చెందిన దస్తగిరి, నజ్మూన్ దంపతులు ఆరేళ్ల క్రితం నగరానికి వలసవచ్చారు. నగర శివారులోని చంద్రబాబు కొట్టాలలో నివాసముంటున్న వీరికి ఓ కుమార్తె, కుమారుడు ఆసీఫ్ (15 నెలలు) ఉన్నారు. ఏటీఎం క్యాష్ డిపాజిట్ చేసే ప్రైవేట్ ఏజెన్సీకి చెందిన వాహనానికి దస్తగిరి డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. బుధవారం ఉదయం విధులకు హాజరయ్యేందుకు బయలుదేరిన తండ్రి వెంట ఆసీఫ్ పడ్డాడు. తాను కూడా వెంట వస్తానని మారాం చేశాడు. అతి కష్టంపై కుమారుడికి నచ్చచెప్పి దస్తగిరి వెళ్లిపోయాడు. దీంతో రోడ్డుపై నిలబడి తండ్రి వెళుతున్న వైపే దీనంగా చూస్తూ ఆసీఫ్ నిల్చుండిపోయాడు. అదే సమయంలో దస్తగిరి ఇంటికి సమీపంలోనే నివాసముంటున్న ఫ్రూట్స్ మండీ మేసీ్త్ర రఘు కారును అతని మిత్రుడు తీసుకెళ్లే ప్రయత్నంలో రివర్స్ గేర్‌లో వెనకకు వచ్చాడు. ఇరుకు సందులో రోడ్డుపై చిన్నారి నిలబడిన విషయాన్ని గుర్తించలేక వేగంగా వెనకకు దూసుకొచ్చాడు. ఘటనలో కారు ఢీకొనడంతో ఆసీఫ్ కిందపడ్డాడు. చిన్నారి తలమీదుగా కారు వెనుక చక్రం దూసుకెళ్లింది. అదే సమయంలో తల్లి నజ్మూన్ గట్టిగా కేకలు వేయడంతో వాహనాన్ని నిలిపి డ్రైవర్ పరారయ్యాడు. సమాచారం అందుకున్న ట్రాఫిక్, అనంతపురం నాల్గో పట్టణ పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. బాలుడి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించగా బాధిత కుటుంబసభ్యులు అడ్డుకున్నారు. ప్రమాదానికి కారకులైన వారి ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. ఇంటి ముందు గొయ్యి తవ్వి అక్కడే తమ బిడ్డను ఖననం చేస్తామని చెప్పడంతో పోలీసులు జోక్యం చేసుకుని బాధిత కుటుంబసభ్యులకు సర్దిచెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ట్రాఫిక్ సీఐ వెంకటేష్ నాయక్ తెలిపారు. -
Viral Video: చలానా కట్టమంటే.. ట్రాఫిక్ పోలీసును కారు పై 4కిలోమీటర్లు లాక్కెళ్లాడు
-
కారు డ్రైవర్‌కు మద్యం తాగించి.. ఈ జంట చేసిన పనికి షాక్ అవ్వాల్సిందే
సాక్షి, బెంగళూరు: కారు డ్రైవర్‌కు మద్యం తాగించి కారుతో పరారైన రౌడీషీటర్ మేకె మంజ (27), అతని భార్య వేదవతి అలియాస్ జ్యోతి (25)ని యలహంక ఉపనగర పోలీసులు అరెస్టు చేశారు. డిసిపి అనూప్ శెట్టి తెలిపిన మేరకు వీరు ఇటీవల రాత్రి 10.30 సమయంలో నాగేనహళ్లి గేట్ దగ్గర ఓలా కార్‌ను బుక్ చేసి నగరంలోని వివిధ ప్రదేశాలు తిరిగారు. డ్రైవర్ శివశంకర్‌తో మంచిగా మాట్లాడుతూ డాబాలో పార్టీ చేసుకుందామని తీసుకెళ్లి అతనికి ఫుల్లుగా మద్యం తాగించారు. మత్తులో డ్రైవర్ కారులో పడుకుని ఉండగా మంజ తాళాలు తీసుకుని నడుపుకొంటూ వెళ్లి రాజనుకుంటె దగ్గర డ్రైవర్‌ను బయటికి తోసేసి, అతని మొబైల్‌ను తీసుకుని ఉడాయించారు. మత్తు నుంచి తేరుకున్న డ్రైవర్ యలహంక ఉపనగర పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గాలింపు జరిపి ఘరానా జంటను అరెస్టు చేసి కారు, రెండు మొబైళ్లను స్వాధీనం చేసుకున్నారు. మంజపై హత్య, హత్యాయత్నం, దోపిడీ కేసులు ఉన్నాయి. చదవండి: (లేవరా.. ఒక్కసారి నన్ను చూడరా!) -
వీడు మనిషేనా.. మానవత్వం లేకుండా కుక్కను కారుకు కట్టి లాక్కెళ్లి..
ఆయనో డాక్టర్.. కానీ మానవత్వం మరిచి ఓ మూగజీవాన్ని దారుణంగా హింసించాడు. దీంతో, ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అతను చేసిన పనికి నెటిజన్లు దుమ్మెతిపోస్తున్నారు. పోలీసులు సైతం కేసు నమోదు చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. వివరాల ప్రకారం, రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఓ కారు డ్రైవర్.. ఓ కుక్కను తన కారుకు కట్టి నడిరోడ్డు మీద లాక్కెళ్లాడు. కారును స్పీడ్‌గా డ్రైవ్ చేయడంతో కుక్క వేగంగా పరిగెత్తలేక కిందపడిపోయింది. అయినప్పటికీ అతను మాత్రం కారును ఆపలేదు. కాగా, కారు వెనుక వస్తున్న ఓ బైకర్.. కారును అడ్డుకునే పయత్నం చేశాడు. కారుకు బైకును అడ్డంగా పెట్టడంతో డ్రైవర్ కారును ఆపాడు. ఈ క్రమంలో అక్కడున్న మరికొంత మంది కారు వద్దకు చేరుకుని కుక్కను విడిపించారు. ఈ ప్రమాదంలో కుక్కకు తీవ్ర గాయాలు కాగా ఆసుప్రతికి తరలించారు. అనంతరం.. డ్రైవర్‌ను ఎందుకిలా చేస్తున్నావని ప్రశ్నించాడు. అయితే, ఈ దారుణానికి ఒడిగట్టింది డాక్టర్ రజనీష్ గ్వాలాగా గుర్తించారు. దీంతో, ఈ ఘటనపై కొందరు వ్యక్తులు పోలీసులు, ఎన్జీవోకు ఫిర్యాదు చేశారు. దీంతో, ఎన్జీవోల ఫిర్యాదు మేరకు పోలీసులు జంతు హింస చట్టం కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఇక, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. డాక్టర్‌కు కనికరం లేదని, మానవత్వం అంటే తెలియదని కామెంట్స్ చేస్తున్నారు. The person who did this he is a Dr. Rajneesh Gwala and dog legs have multiple fracture and this incident is of Shastri Nagar Jodhpur please spread this vidro so that @CP_Jodhpur should take action against him and cancel his licence @WHO @TheJohnAbraham @Manekagandhibjp pic.twitter.com/leNVxklx1N — Dog Home Foundation (@DHFJodhpur) September 18, 2022 -
భార్యను తీసుకొని ఆసుపత్రికి వెళితే.. కారుతో డ్రైవర్ ఉడాయింపు
సాక్షి, నెల్లూరు: కారుతో ఉడాయించిన డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం మేరకు.. ఆత్మకూరులో లైన్మెన్గా పనిచేస్తున్న అదే మండలం అప్పారావుపాళేనికి చెందిన పెంచలయ్యకు హ్యుండయ్ వెన్యూ కారు ఉంది. యాక్టింగ్ డ్రైవర్‌గా అప్పారావుపాళేనికి చెందిన బాలకృష్ణ పనిచేసేవారు. డయాలసిస్ నిమిత్తం పెంచలయ్య, ఆయన భార్యను ఆస్పత్రికి కారులో సోమవారం తీసుకొచ్చారు. వారు ఆస్పత్రి లోపలికి వెళ్లగా, అదునుగా భావించిన బాలకృష్ణ కారుతో ఉడాయించాడు. రాత్రి ఏడు గంటలకు బయటకొచ్చిన పెంచలయ్య ఆయనకు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. బెంగళూరు సమీపంలోని టోల్‌ప్లాజాను కారు దాటినట్లు పెంచలయ్య ఫోన్‌కు మంగళవారం ఉదయం మెసేజ్ వచ్చింది. బాధితుడి ఫిర్యాదు మేరకు దర్గామిట్ట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మంత్రి జోగి రమేష్ కారుకు తప్పిన ప్రమాదం
ఒంగోలు(ప్రకాశం జిల్లా): మంత్రి జోగి రమేష్ ప్రయాణిస్తున్న కారుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆయన సోమవారం ఉదయం చిలకలూరిపేట నుంచి నెల్లూరుకు కారులో వెళ్తుండగా ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని పెళ్లూరు వద్ద జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై పనుల నిమిత్తం ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా దారి మళ్లింపు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. చదవండి: చినరాజప్ప ప్రధాన అనుచరుడు పల్లంరాజు అరెస్టు డివైడర్‌పై ఏర్పాటు చేసిన కోన్లు హోరు గాలికి ఎగిరి రోడ్డుకు అడ్డంగా పడటంతో మంత్రి కాన్వాయ్‌లోని ఓ కారు డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో కాన్వాయ్‌లోని కార్లు ఒకదానిని మరొకటి ఢీకొనడంతో పాటు పక్కనే ఉన్న డివైడర్‌ను ఢీకొన్నాయి. మంత్రి జోగి రమేష్ ప్రయాణిస్తున్న కారు కూడా అదుపు తప్పినప్పటికీ.. ఆయనకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. వెంటనే మరో కారులో ఎక్కి ఆయన వెళ్లిపోయారు. హైవే మొబైల్ సిబ్బంది, తాలూకా సీఐ శ్రీనివాసరెడ్డి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన కారును పక్కకు తొలగించారు. -
కారులో డ్రైవర్ మృతదేహం.. ఎమ్మెల్సీ అనంతబాబు వివరణ
సాక్షి, తూర్పుగోదావరి: కారులో డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతదేహం లభ్యమైన ఘటనపై ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌బాబు వివరణ ఇచ్చారు. సుబ్రహ్మణ్యం తన దగ్గర ఐదేళ్లుగా డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని, అయితే.. రెండు నెలల నుంచి సరిగా పనిలోకి రావడం లేదని చెప్పారు. మద్యం అలవాటు ఉండటంతో ద్విచక్రవాహనంపై అనేకసార్లు ప్రమాదానికి గురైనట్లు ఎమ్మెల్సీ తెలిపారు. గత రాత్రి కూడా సుబ్రహ్మణ్యం యాక్సిడెంట్‌కు గురైనట్టు తెలియడంతో అతని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చానని పేర్కొన్నారు. చికిత్స కోసం కాకినాడ అమృత ఆసుపత్రికి తీసుకెళ్లామని, అతని తల్లిదండ్రులు కూడా ఆసుపత్రికి వచ్చారని ఎమ్మెల్సీ స్పష్టం చేశారు. సుబ్రమణ్యం మృతి చెందడంతో మృతదేహాన్ని వారి స్వగ్రామానికి తీసుకువెళతామని చెప్పడంతో కారులో అపార్ట్మెంట్ వద్దకు పంపించినట్టు వెల్లడించారు. కాకినాడ ఎఎస్పీ శ్రీనివాస్ ఏమన్నారంటే? ‘నిన్న రాత్రి సుబ్రహ్మణ్యం తన స్నేహితుడు మణికంఠతో కలిసి బయటకు వెళ్ళాడు. రాత్రి 12 గంటల తరువాత సుబ్రహ్మణ్యం రోడ్డు ప్రమాదానికి గురై అమృత ఆసుపత్రిలో ఉన్నాడని ఎమ్మెల్సీ అనంతబాబు మృతుని కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. సుబ్రహ్మణ్యం మృతి చెందాడని అమృత ఆసుపత్రి వైద్యులు నిర్ధారించాక బాడీని తల్లిదండ్రుల వద్ద వదిలి వెళ్ళారు. దీనిపై సర్పవరం పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. చదవండి: బోడె... మామూలోడు కాదు.. ఆది నుంచీ అంతే! -
దంపతుల హత్య కేసు.. వెలుగులోకి విస్తుపోయే విషయాలు
సాక్షి, చెన్నై: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన మైలాపూర్ వృద్ధ దంపతుల హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇంట్లో బిడ్డగా ఆదరిస్తే...చివరకు వృద్ధ దంపతుల పాలిట ఆ నేపాలీ డ్రైవర్ యముడయ్యాడు. రూ.40 కోట్ల కోసం ఆ ఇద్దర్ని చిత్ర హింసలకు గురి పెట్టి చంపేశాడు. నగదు దొరక్క పోవడంతో ఇంట్లో ఉన్న నగలతో ఉడాయించి ఆంధ్ర రాష్ట్రం ఒంగోలులో పట్టుబడ్డాడు. ఫిర్యాదు వచ్చిన 6 గంటలలోనే ఆంధ్రా పోలీసుల సహకారంతో నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు మైలాపూర్ అసిస్టెంట్ కమిషనర్ కన్నన్ తెలిపారు. చదవండి: బ్యాచిలర్స్ అద్దెకుంటున్న ఇంట్లో మహిళ అనుమానాస్పద మృతి నేపథ్యం ఇదీ.. చెన్నై మైలాపూర్‌లో వృద్ధ దంపతుల్ని హతమార్చి బంగారు నగలు, వెండి వస్తువులతో తప్పించుకు వెళ్తున్న నేపాల్‌కు చెందిన లాల్ కృష్ణ(45), అతడి మిత్రుడు రవి రాయ్(45)ను ఒంగోలు వద్ద శుక్రవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పట్టుబడ్డ నిందితులను చెన్నైకు తీసుకొచ్చి ప్రశ్నించారు. 11 ఏళ్లుగా ఇంట్లో ఒకడిగా.. మైలాపూర్‌కు చెందిన ఆడిటర్ శ్రీకాంత్(60), అనురాధ(55) దంపతులకు చెన్నై శివారులోని నెమలిచ్చేరిలో ఫామ్ హౌస్ ఉంది. ఇక్కడ నేపాల్‌కు చెందిన లాల్ కిషన్ 20 ఏళ్లుగా సెక్యూరిటీగా పనిచేశాడు. ఆ కుటుంబానికి ఎంతో నమ్మకస్తుడిగా ఉండే వాడు. అనారోగ్య సమస్యలతో లాల్ కిషన్ నేపాల్‌కు వెళ్లి పోయాడు. అదే సమయంలో నేపాల్ నుంచి వచ్చిన లాల్ కిషన్ కుమారుడు లాల్ కృష్ణ ఆ ఇంట్లో డ్రైవర్‌గా చేరారు. 11 ఏళ్ల పాటుగా ఆ ఇంట్లో ఒకడిగా లాల్ కృష్ణ మెలిగాడు. మూడు నెలలుగా పథకం.. మూడు నెలల క్రితం కారులో వెళ్తున్న సమయంలో ఓ స్థలం అమ్మకం విషయంగా ఎవరితోనో శ్రీకాంత్ ఫోన్లో మాట్లాడటాన్ని లాల్ కృష్ణ గమనించాడు. ఆ బేరం రూ.40 కోట్లకు కుదిరినట్టు, ఆ సొమ్ము ఇంట్లో ఉన్నట్టుగా తెలుసుకున్నాడు. ఈ సొమ్ముపై కన్నేసిన లాల్‌కృష్ణ జీవితంలో స్థిర పడేందుకు ఇదే సమయంగా భావించాడు. అదే సమయంలో ఈ దంపతులు ఇద్దరు తమ కుమార్తె సునంద ప్రసవం నిమిత్తం అమెరికాకు వెళ్లి పోయారు. ఆ నగదు కోసం ఫామ్ హౌస్, ఇళ్లు అంతా గాలించినా ఎక్కడ చిక్కలేదు. ఈ పరిస్థితుల్లో డార్జిలింగ్‌కు చెందిన మరో డ్రైవర్ రవిరాయ్కు తన పథకాన్ని వివరించారు. అతడు అంగీకరించడంతో విదేశాల నుంచి ఆ దంపతులు రాగానే అమలుకు ఇద్దరూ సిద్ధమయ్యారు. ముందుగానే గోతిని తవ్వి శుక్రవారం వేకువ జామున దుబాయ్ మీదుగా చెన్నైకు వచ్చి దంపతుల్ని లాల్ కృష్ణ కారులో ఎక్కించుకుని మైలాపూర్ ఇంటికి వెళ్లారు. అక్కడ రవిరాయ్ సాయంతో ఇద్దర్ని కట్టి పడేశాడు. రూ. 40 కోట్ల కోసం చిత్ర హింసలు పెట్టారు. చెప్పకపోవడంతో శ్రీకాంత్, అనురాధను కర్రతో కొట్టి చంపేశారు. చివరికి నగదు దొరక్క పోగా, దంపతుల వద్ద ఉన్న తాళం తీసుకుని ఇంట్లోని లాకర్, అలమారాల్లో ఉన్న నగలు, వెండి వస్తువుల్ని ఎత్తుకుని కారులో పెట్టారు. అలాగే, ఆ దంపతుల మృత దేహాల్ని గోనెసంచుల్లోకి కుక్కి కారులో పడేశారు. ఇంటిని శుభ్రం చేసి, అక్కడి నుంచి నెమలిచ్చేరిలోని ఫామ్‌హౌస్‌కు చేరుకున్నారు. ముందుగా అక్కడ తవ్వి పెట్టిన గోతిలో ఇద్దర్ని పాతి పెట్టి నేపాల్‌కు తప్పించుకు వెళ్లే యత్నం చేశారు. మృతదేహాల వెలికితీత.. ఒంగోలు నుంచి నిందితులు ఇద్దరిని చెన్నైకు ఆదివా రం పట్టుకొచ్చారు. వీరి వద్ద నుంచి 9 కేజీల బంగా రు ఆభరణాలు, 70 కేజీల వెండి వస్తువుల్ని, విదేశా ల నుంచి ఆ దంపతులు తీసుకొచ్చిన ఐదు బ్యాగుల్ని, అందులో ఉన్న వస్తువుల్ని స్వా«దీనం చేసుకున్నా రు. శ్రీకాంత్, అనురాధా దంపతుల్ని పాతి పెట్టిన చోటే వారి సెల్ఫోన్లను ఈ నిందితులు తగల పెట్టి ఉండటం వెలుగు చూసింది. వైద్యులు, రెవిన్యూ అధికారుల సమక్షంలో మృతదేహాల్ని వెలికి తీశారు. పోస్టుమార్టం అనంతరం రాయపేట ఆస్పత్రికి తర లించారు. అసిస్టెంట్ కమిషనర్ కన్నన్ మాట్లాడుతూ ఆడిటర్ కారు, నిందితులు ఉపయోగించిన సెల్ నెంబర్ల ఆధారంగా తమ ప్రత్యేక బృందాలు ఆంధ్రా వైపుగా దూసుకెళ్లాయని వివరించారు. ఆంధ్రా పోలీసుల సహకారంతో ఒంగోలులో అరెస్టు చేశామని తెలిపారు. వీరు నేపాల్‌కు పారి పోయి ఉంటే, ఇంటర్ పోల్సాయంతో పట్టుకునేందుకు కనీసం రెండేళ్లు సమయం పట్టి ఉండేదన్నారు. రూ. 40 కోట్ల కోసమే ఈ హత్యలు చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఇద్దరిపై ఇప్పటి వరకు ఎలాంటి కేసులు లేవని, సమగ్ర దర్యాప్తు జరుగుతోందని వివరించారు. 6 గంటల్లోనే కేసు ఛేదించాం.. తల్లిదండ్రుల ఫోన్లు పనిచేయక పోవడం, లాల్ కృష్ణ స్పందించక పోవడంతో అనుమానం వచ్చిన కుమార్తె సునంద బంధువులకు సమాచారం ఇచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం తమకు ఫిర్యాదు రాగానే, మైలాపూర్ అసిస్టెంట్ కమిషనర్ కన్నన్ సీసీ కెమెరాలను పరిశీలించారు. శ్రీకాంత్ ఇన్నోవా కారు తొలుత నెమలిచ్చేరి వైపుగా వెళ్లడం, మళ్లీ నగరంలోకి వచ్చి ఆంధ్రా వైపుగా వెళ్లడాన్ని గుర్తించారు. ఆంధ్రా పోలీసుల్ని అప్రమత్తం చేయడంతో ఒంగోలు టోల్గేట్ వద్ద నిందితులు ఇద్దరూ పట్టుబడ్డారు. -
విద్యార్థినిని రోజు కాలేజీకి తీసుకెళ్తూ.. ప్రేమ పేరుతో నమ్మించి..
యశవంతపుర: విద్యార్థినిని రోజు కాలేజీకి తీసుకెళ్తున్న కారు డ్రైవర్ ప్రేమ పేరుతో నమ్మించి పెళ్లి చేసుకున్న ఘటన విజయపుర జిల్లా జాలగేరి గ్రామంలో జరిగింది. విజయపురలో ఒక కుటుంబం వద్ద కారు డ్రైవర్‌గా పని చేస్తున్న సోమలింగ ఆ కుటుంబానికి చెందిన అక్షతను రోజూ బైక్‌పై కాలేజీ వద్ద వదిలేవాడు. ఈ సమయంలో మాయమాటలు చెప్పి ఆమెతో ప్రేమాయణం మొదలుపెట్టాడు. అయితే సోమలింగకు పెళ్లయి ఇద్దరు పిల్లలున్నారు. బీకాం పూర్తి చేసిన అక్షత మేజర్ కావడంతో ఇటీవల ఇద్దరూ పెళ్లి చేసుకుని రిజిస్ట్రార్ ఆఫీసులో కూడా నమోదు చేసుకున్నారు. సోమలింగ, అతని మొదటి భార్యతో కలిసి అన్యోన్యంగా జీవిస్తానని అక్షత చెప్పడం గమనార్హం. పుట్టింటి నుంచి హాని ఉందని ఆదివారం జిల్లా ఎస్పీకి రక్షణ కోసం విజ్ఞప్తి చేసింది. ఈ తతంగం చూసి జిల్లావాసులు ఆశ్చర్యపోయారు. -
కాల్పులు జరిపి.. దోచుకెళ్లి..
సాక్షి, సిద్దిపేట/సిద్దిపేట కమాన్: సిద్దిపేట పట్టణంలో సోమవారం మధ్యాహ్నం కాల్పుల కలకలం చెలరేగింది. నంబర్ ప్లేట్ లేని బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు సినీ ఫక్కీలో ఓ కారు డ్రైవర్‌పై కాల్పులు జరిపి అందులోని రూ. 43.5 లక్షలను దోచుకెళ్లారు. ఈ సమాచారం అందుకొని వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు... గాయపడిన డ్రైవర్‌ను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ఆ ప్రాంతాన్ని అధీనంలోకి తీసుకున్నారు. ఈ ఉదంతంపై బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను పట్టుకొనేందుకు జిల్లావ్యాప్తంగా 15 బృందాలను రంగంలోకి దించారు. సిద్దిపేట పట్టణంలోని అన్ని సీసీ ఫుటేజీలను పరిశీలిస్తామని ఘటనాస్థలిని పరిశీలించేందుకు వచ్చిన పోలీసు కమిషనర్ శ్వేత తెలిపారు. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం సిద్దిపేట పట్టణంలోని హౌసింగ్ బోర్డులో నివసించే చేర్యాల మండలం దొమ్మాట మాజీ సర్పంచ్ వకులా భరణం నర్సయ్య టీచర్స్ కాలనీలోని తన 176 గజాల స్థలాన్ని సిద్దిపేటలోని హనుమాన్‌నగర్‌కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కన్నయ్యగారి శ్రీధర్‌రెడ్డికి విక్రయించేందుకు ఒప్పందం చేసుకున్నాడు. గజం భూమి రూ. 36,500 చొప్పున 176 గజాలకు రూ.64.24 లక్షలు చెల్లించేందుకు శ్రీధర్ రెడ్డి అంగీకరించి గతేడాది డిసెంబర్ 19న రూ. 16.06 లక్షలను అడ్వాన్స్‌గా చెల్లించాడు. సోమవారం రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా సిద్దిపేట అర్బన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సమీపంలో డాక్యుమెంట్ రైటర్ దగ్గరకు వారిద్దరూ వచ్చారు. ఆ స్థలానికి వీధిపోటు ఉండటంతో కొంత ధర తగ్గించాలని నర్సయ్యను శ్రీధర్‌రెడ్డి కోరగా ఆయన అగ్రిమెంట్ ధరకంటే రూ. 1.29 లక్షలు తగ్గించాడు. దీంతో రూ. 48.18 లక్షల తుది చెల్లింపులో భాగంగా సోమవారం రూ. 43.50 లక్షల నగదు, మరో రూ 1.76 లక్షలకు చెక్కు ఇచ్చాడు. మిగితా రూ. 1.63 లక్షలను సాయంత్రం ఇస్తానని శ్రీధర్ రెడ్డి చెప్పారు. డబ్బు తీసుకున్న నర్సయ్య ఆ బ్యాగును తన కారు (టీఎస్15ఈఈ7127) డ్రైవర్ రంగు పరుశరాములుకు ఇచ్చాడు. ఆపై మధ్యా హ్నం 12:40 గంటలకు రిజిస్ట్రేషన్ కార్యాలయంలోకి వెళ్లి మధ్యాహ్నం 1:05 గంటలకు ప్రక్రియ పూర్తిచేసుకున్నారు. అరగంటపాటు దుండగుల రెక్కీ... కొనుగోలుదారుడైన శ్రీధర్‌రెడ్డి రూ. 43.5 లక్షలను నర్సయ్య డబ్బులు చెల్లించడం, ఆయన ఆ సొమ్మును ఎలక్ట్రానిక్ మిషన్ ద్వారా లెక్కించి ఎర్రటి రంగు ఉన్న బ్యాగులో పెట్టి డ్రైవర్‌కు అప్పగించడాన్ని ఇద్దరు దుండగులు చూస్తూ అరగంటకుపైగా అక్కడే రెక్కీ నిర్వహించారు. ఈ దృశ్యాలన్నీ అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆపై మధ్యాహ్నం 1.10 గంటల సమయంలో ఇన్నోవా కారు దగ్గరికి ఇద్దరు దుండగులు బైక్‌పై వచ్చారు. కారు డ్రైవర్‌ను తలుపు తీయాలని 9 ఎంఎం పిస్టల్‌తో ఓ దుండగుడు బెదిరించగా డ్రైవర్ అప్ర మత్తమై వాహనాన్ని స్టార్ట్ చేసి నడిపే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో దుండగుడు గన్ను రివర్స్‌లో పెట్టి కారు అద్దాన్ని పగలగొట్టాడు. నుదిటిపై గన్ పెట్టడంతో డ్రైవర్, దుండగుడు మధ్య పెనుగులాట జరిగింది. ఈ క్రమంలో కాల్పులు జరగడంతో డ్రైవర్ ఎడమ తోడలోకి బుల్లెట్ దూసుకెళ్లి బయటకు వచ్చింది. ఆ సమయంలో పిస్టల్ కారులోనే పడిపోయింది. ఈ క్రమంలో వాహనం ఎడమ పక్కన నుంచి మరో దుండగుడు డోర్ తీసి ముందు సీట్లో ఉన్న డబ్బుల బ్యాగు తీసుకున్నాడు. అనం తరం ఇద్దరూ బైక్‌పై పరారయ్యారు. గాయపడ్డ డ్రైవర్ తన యజమానికి సమాచారం అందించేందుకు కారు దిగి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వైపు పరుగెత్తాడు. తుపాకీని తీసేందుకు 3 గంటల నిరీక్షణ! కారులో దుండగులు వదిలేసిన పిస్టల్‌ను బయటకు తీసేందుకు మూడున్నర గంటలకుపైగా సమయం పట్టింది. తుపాకీ అన్‌లాక్ అయి ఉండటం, పైగా డ్రైవర్ సీటుకు, డోర్‌కు మధ్య అది ఇరుక్కుపోవడంతో దాన్ని తీసే క్రమంలో ఫైరింగ్ జరగొచ్చని భావించిన పోలీసులు నిపుణులు వచ్చే వరకు వేచిచూశారు. అనంతరం సీపీ సమక్షంలో గన్ను దస్తావేజులు రూపొందించే గదిలోకి నిపుణుడైన శేఖర్ తీసుకెళ్లి దాన్ని లాక్‌చేసి సీజ్ చేశారు. క్లూస్ టీం సభ్యులు తుపాకీపై వేలిముద్రలతోపాటు రక్తపు మరకలను సేకరించారు. మాఫియా ముఠాలు వాడే తుపాకీలా అది ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు రెండు రౌండ్ల కాల్పులు జరిపినట్లు రిజిస్ట్రేషన్ కార్యాలయ ఆవరణలో ఉన్న వారు చెబుతుండగా ఒక తూటా క్యాప్ మాత్రమే పోలీసులకు లభ్యమైంది. దీంతో దుండగుడు ఎన్ని రౌండ్లు కాల్పులు జరిపాడనే దానిపైనా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొనుగోలుదారుడిపైనే అనుమానం: నర్సయ్య తన సొమ్ము చోరీ ఘటన విషయంలో ప్లాట్ కొనుగోలు చేసిన శ్రీధర్‌రెడ్డిపైనే తనకు అనుమానం ఉందని స్థలం విక్రేత నర్సయ్య మీడియాతో మాట్లాడుతూ చెప్పాడు. నేను తప్పు చేయలేదు: శ్రీధర్‌రెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయుడినైన తాను ఎలాంటి తప్పూ చేయలేదని స్థలం కొనుగోలుదారుడు శ్రీధర్‌రెడ్డి వివరించాడు. నిజం నిలకడ మీద తెలుస్తుందని.. పోలీసుల విచారణకు సహకరిస్తానని పేర్కొన్నాడు. గతంలోనే గొడవలు... క్రయవిక్రయదారుల మధ్య అగ్రిమెంట్ కుదిరినప్పటి నుంచి సెట్ బ్యాక్, వీధిపోటు విషయమై గొడవలు జరిగాయి. అయితే పెద్ద మనుషులు సర్దిచెప్పడంతో వారు సోమవారం రిజిస్ట్రేషన్ కార్యాలయానికి చేరుకున్నారు. ఘటన జరిగిన అనంతరం విక్రయించిన వ్యక్తి నర్పయ్య మీడియాతో మాట్లాడుతూ ప్లాట్ విషయం గతంలో గొడవ జరిగిందన్నారు. ఎప్పుడు...సోమవారం మధ్యాహ్నం 12:40 గం. ఏం జరిగింది? 176 గజాల స్థలానికి సిద్దిపేట అర్బన్ రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద క్రయవిక్రయదారుల మధ్య ఒప్పందం కుదిరింది. రూ.43.50 లక్షల నగదును విక్రేత తన కారులో ఉన్న డ్రైవర్‌కు ఇచ్చాడు. మధ్యాహ్నం 1:05గం.కు రిజిస్ట్రార్ ఆఫీస్‌లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి. ఎలా జరిగింది? మధ్యాహ్నం 1:10 గంటలకు కారు దగ్గరికి నంబర్ ప్లేట్ లేని పల్సర్ బైక్‌పై ఇద్దరు గుర్తుతెలియని దుండగులు వచ్చారు. కారు డ్రైవర్‌ను తుపాకీతో బెదిరించి కిటికీ అద్దం తెరవాలని బెదిరించారు. మాటవినకపోవడంతో అద్దం పగలగొట్టి డ్రైవర్‌పై దాడికి ఓ దుండగుడు యత్నించాడు. పెనుగులాటలో కారు డ్రైవర్ తొడలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. డబ్బు సంచి తీసుకొని దుండగులు పరారయ్యారు. -
ప్లీజ్.. నా కారుని ధ్వంసం చెయ్యొద్దు!
US woman left the trunk of her car: ప్రసుతం ప్రజలంతా ఒమిక్రాన్ వైరస్‌తో హడలెత్తిపోతుంటే ఒక పక్క ఈ దొంగల బెడద తప్పడం లేదు. ఈ వైరస్ మహమ్మారికి భయపడి చాలామటుకు ప్రజలంత తమ సోంత కార్లు లేదా(క్యాబ్ బుక్ చేసుకుని) ఎక్కడికైన వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే అదునుగా చేసుకుని మార్గ మధ్యలో దోపిడి దారులు రెచ్చిపోయి కార్లను ఆపి లూటీ చేస్తున్నారు. ఈ క్రమంలో వారు కార్లను ధ్వంసం కూడా చేస్తున్నారు. అచ్చం అదే తరహాతో యూఎస్‌లోని దొంగలు దోపిడి చేయబోతుంటే ఒక మహిళ మాత్రం తెలివిగా తన కారుని ధ్వంసం చేయనివ్వకుండా కాపాడుకుంది. (చదవండి: తగ్గేదేలే! నువ్వు ముందు విమానం నుంచి దిగిపో!) అసలు విషయంలోకెళ్లితే...కాలిఫోర్నియాలోని పారిసా హెమ్మత్, శాన్ఫ్రాన్సిస్కో బే ప్రాంతాల్లో దోపిడిదారులు చోరబడి విధ్వంసం సృష్టించారు. అక్కడ ఉన్న ప్రజల వద్ద నుంచి విలువైన వస్తువులు, డబ్బులు లాక్కోవడం వంటివి చేశారు. ఈ క్రమంలో వారు రహదారులపై ఉన్న కార్లులో వస్తున్న వాళ్లను సైతం ఆపి కారు పగలు గొట్టి భయబ్రాంతులకు గురి చేసి విలువైన వస్తువులను బలవంతంగా లాక్కుంటున్నారు. ఇదే తరహాతో ఒక మహిళ దగ్గరకు రాంగానే ఆమె తన కారుని కాపాడుకునే నిమిత్తం తానే ముందుగా కారు డిక్కి ఒపెన్ చేసి తన కారులో ఏమిలేవు కావలంటే చూడండి అంటూ చూపించింది. దీంతో సదరు దొంగలు ఒక్కసారిగా నిర్ఘాంతపోయి ఆమెను ఏం చేయకుండా అక్కడ నుంచి దొంగలు నిష్క్రమించారు. అయితే ఒక్కోసారి మన దగ్గర అలాంటి దొంగలను ఎదిరించలేని పరిస్థితి ఏర్పడినప్పుడూ సదరు మహిళలా ముందుస్త చర్యగా కాస్త తెలివిగా వ్యవహరిస్తే చిన్న మొత్తంలోనే నష్టంతో సరిపెట్టుకోవచ్చు. ఈ మేరకు శాన్ ఫ్రాన్సిస్కో మేయర్ దోపిడి దారులను పట్టుకునేలా మరింత దూకుడుగా వ్యవహరించే కట్టుదిట్టమైన చట్టాల అమలు కోసం పిలుపునివ్వాలని గట్టి నిర్ణయాన్ని తీసుకున్నారు. (చదవండి: ఒమిక్రాన్ వైరస్ ఈ నగరాన్ని దెయ్యాల నగరంగా మారుస్తోంది!!) -
దేశంలో డ్రైవింగ్ లైసెన్స్ పొందిన తొలి మరుగుజ్జు వ్యక్తి మనోడే!
India's First Dwarf Driving License: ప్రపంచంలో అందరికి ఏవేవో లోపాలు ఉంటాయి. కొంతమంది వాటిని అధిగమించి తమలో ఉన్న నైపుణ్యాలకు పదునుపెట్టి స్ఫూర్తిదాయకంగా నిలవడానికి ప్రయత్నిస్తుంటారు. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి అలానే చేసి అందరికి స్ఫూర్తిగా నిలాచాడు. (చదవండి: అందరూ!....వెక్కిరించి అవమానించే ఏకైక వైకల్యం...నత్తి!!) అసలు విషయంలోకెళ్లితే...కరీంనగర్ జిల్లాకి చెందిన గట్టిపల్లి శివపాల్ సుమారు మూడు అడుగుల ఎత్తులో ఉండే 42 ఏళ్ల మరుగుజ్జు వ్యక్తి. అంతేకాదు మరుగుజ్జువాళ్లలో డిగ్రీ పూర్తి చేసిన మొదటి వ్యక్తిగా నిలిచాడు. అయితే అతన్ని ప్రజలు తనని ఎత్తు కారణంగా హేళన చేస్తుండేవారని చెబుతున్నాడు. ఈ క్రమంలో అతను తనను తాను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడం కోసం చాలా కష్టాలు పడాల్సి వచ్చిందని, పైగా తనలాంటి వాళ్లకి ఉద్యోగం ఇచ్చేందుకు ప్రజలు కూడా సుముఖంగా లేరని వాపోయాడు. అయితే తన స్నేహితురాలి సాయంతో ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం వచ్చిందని, ప్రస్తుతం తాను అక్కడే 20 ఏళ్లుగా పనిచేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఈ మేరకు అతను ఎక్కడికైన వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసినప్పుడల్లా వారు తన రైడ్‌ని రద్దుచేసేవారని, పైగా తన భార్యతో కలిసి బయటకి వెళ్లినప్పుడల్లా రకరకాలుగా కామెంట్లు చేసేవారని శివపాల్ అన్నాడు. దీంతో అప్పుడే శివపాల్ తానే స్వయంగా కారు నడపాలనే నిర్ణయించుకున్నాడు. పైగా అందుకోసం ఇంటర్నెట్లో విపరీతంగా సర్చ్ చేస్తుండేవాడు. ఈ క్రమంలోనే శివపాల్‌కి యూఎస్‌లో ఒక వ్యక్తి అప్లోడ్ చేనిన వీడియో ఒకటి అతన్ని ఆకర్షించింది. అంతేకాదు ఆ వీడియోలో కారుని తన ఎత్తుకు తగిన విధంగా సెటప్ చేస్తే సులభంగా డ్రైవ్ చేయవచ్చునని వివరించి ఉంది. దీంతో అతను అనుకున్నదే తడువుగా తన స్నేహితుడి సాయంతో డ్రైవింగ్ నేర్చుకున్నాడు. అయితే రవాణా శాఖకు ఎత్తుపై కొన్ని మార్గదర్శకాలను కలిగి ఉన్నందున లైసెన్స్ పొందడం మరొక అతి పెద్ద సవాలుగా మారింది. ఈ మేరకు శివపాల్ అధికారులకు విజ్ఞప్తి చేసి సరైన డ్రైవింగ్ టెస్ట్ చేయించి డ్రైవింగ్ లైసెన్స్ పొందాడు. అంతేకాదు డ్రైవింగ్ లైసెన్స్ పొందిన తొలి మరుగుజ్జు వ్యక్తిగా నిలవడమే కాక లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌కి నామినేట్ అయ్యాడు. దీంతో చాలామంది మరుగుజ్జు వ్యక్తులు శివపాల్ని డ్రైవింగ్ శిక్షణ కోసం సంప్రదించడం విశేషం. అంతేకాదు శివపాల్ వచ్చే ఏడాది శారీరక వికలాంగుల కోసం డ్రైవింగ్ స్కూల్ ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. (చదవండి: హే!..రెండు వారాల్లో పిల్లలకు కూడా కోవిడ్ వ్యాక్సిన్!!) -
కారు డ్రైవింగ్ చేస్తూ.. స్పృహ తప్పి పడిపోయింది! అతని సాహసానికి హ్యాట్సాఫ్
Netherland Man Sacrifices His Car: మనం సాధారణంగా రోడ్డు మీద వెళ్తున్నప్పుడూ ఏవరైనా కారు ర్యాష్‌గా డ్రైవ్ చేస్తే మనకు చాలా కోపం వస్తుంది. ఇన్ని భయంకరమైన ప్రమాదాలు జరిగిన అసలు వీళ్లకు బుద్ధి రాదు అని కూడా అనుకుంటాం. కానీ ఇక్కడొక వ్యక్తి కారుని ఇష్టారీతిన నడిపి ప్రమాదానికి గురవుతాడు. అయితే అతడి నిర్లక్షాన్ని క్షమించి ఆ కారుని కాపాడే ప్రయత్నం చేసి సహృదయం చాటుకున్నాడు ఓ వ్యక్తి. ఆ వివరాలు.. (చదవండి: దెయ్యంతో ఆటలాడిన భౌ.. భౌ..!! వైరల్...) అసలు విషయంలోకెళ్లితే....ఇక్కడ రోడ్డు పై మూడు కార్లు వెళ్తుంటాయి. అందులో ఒక కారు ఉన్నటుండి నియంత్రణ కోల్పోయి చాలా వేగంగా అటు ఇటూ రకరకాలగా వెళ్తుంటుంది. ఈ విషయాన్ని మిగత కారుల్లో ప్రయాణిస్తున్న వాళ్లు గమనిస్తారు. మొదట ఏంటి ఇలా నడుపుతున్నాడు అని వాళ్లంతా అనుకుంటారు. అయితే కాసేపటికి వాళ్లకు అసలు విషయం అర్థమవుతోంది. ఆ కారుని నడుపుపతున్న మహిళ స్పృహ తప్పి పడిపోయిందని అందువల్లే కారు ఇష్టమొచ్చినట్లుగా వెళ్తోంది అని. అయితే ఆమెను ఎలాగైన కాపాడాలని అదే సమయంలో అక్కడ ప్రయాణిస్తున్న మిగతా కార్లలోని వాళ్లు అనుకుంటారు. అంతేకాదు అనుకున్నదే తడువుగా ఆమె కారు వెళ్లేందకు దారి ఇచ్చేసి తర్వాత ఆమె కారుకి ముందు ఒక కారుని అడ్డంగా పెట్టి ఢీ కొట్టేలా చేసి ఆపుతారు. అంతేకాదు ఆమె కారు వెనుక భాగంలో కూడా మరో కారు వచ్చి ఢీకొట్టి ఆ కారుని ఆపడానికి ప్రయత్నిస్తారు. ఆ తర్వాత ఆ కారు నడుపుతున్న మహిళను కాపాడతారు. అంతేకాదు రోడ్డుపై ఎటువంటి ప్రమాదం జరగకుండా చూడటమే కాక తన కారుని అడ్డంగా పెట్టి రిస్క్ చేయడం చాలా ప్రశసించదగ్గ విషయం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పైగా ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్, లైక్‌లు వచ్చాయి. మీరు కూడా ఓ లుక్ వేయండి. (చదవండి: టీ పొడి వ్యాపారం చేద్దామనుకోవడమే వారిపాలిట శాపమైంది.. అదిరిపోయే ట్విస్ట్!!..) Man sacrifices his car to save another driver who was unconscious.. Via @RTVNunspeet pic.twitter.com/drgac0UDez — Buitengebieden (@buitengebieden_) November 21, 2021 -
అమానుషం: డీసీఎం డ్రైవర్‌ను 5 కిలోమీటర్లు లాక్కొనిపోయారు..
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో కొందరు వ్యక్తులు డీసీఎం డ్రైవర్‌పట్ల అమానుషంగా ప్రవర్తించారు. ఈ సంఘటన కాన్పూర్‌లో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. గత సోమవారం సాయంత్రం లక్నో-కాన్పూర్ హైవే ఫ్లైఓవర్‌మీద డీసీఎం, కారు ఢీకొన్నాయి. ఈప్రమాదంతో రెండు వాహనాలు దెబ్బతిన్నాయి. కాగా, డీసీఎంలోని డ్రైవర్.. కారులోని వ్యక్తుల మధ్య వాగ్వాదం జరిగింది. ఒకరిని మరొకరు తీవ్రంగా దూశించుకున్నారు. అంతటితో ఆగకుండా కొట్టుకొవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో, డీసీఎం డ్రైవర్.. కారు ముందు వెళ్లి నిల్చున్నాడు. అయితే, కారులో ఉన్న సదరు వ్యక్తులు.. కారును వేగంగా ముందుకు నడిపారు. దీంతో అతను కారు ముందు భాగం మీదపడిపోయి వైపర్‌ను పట్టుకున్నాడు. కారులోని వ్యక్తులు ఏమాత్రం జాలీ లేకుండా.. కారును దంచి కొట్టారు. ఆ యువకుడు వైపర్‌ను పట్టుకుని వేలాడుతున్నాడు. సుమారు 5 కిలోమీటర్ల వరకు అతడిని లాక్కొని పోయారు. ఈ అమానుషాన్ని అక్కడి స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఇది వైరల్‌గా మారింది. ఈ మేరకు కేసును నమోదు చేసిన కాన్పూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
కారు డ్రైవర్ అరుదైన రికార్డు
టీ.నగర్: కారైకుడిలో కారు డ్రైవర్ అరుదైన రికార్డు సాధించాడు. శివగంగై జిల్లా కారైకుడి సమీపంలోని పుదువయల్ నాట్టుచేరి గ్రామానికి చెందిన కార్తియమూర్తి (37) కారు డ్రైవర్. ఇతను గురువారం 1,330 తిరుక్కురల్‌ను 17 గంటల 19 నిమిషాల్లో తలకిందులుగా రాసి చోళన్ వరల్డ్ రికార్డ్స్ పుస్తకంలో స్థానం సంపాదించుకున్నాడు. దీనికి సంబంధించిన సర్టిఫికెట్‌ను వ్యవస్థాపకుడు విమలన్ నీలమేఘం అందజేశారు. దీనిపై కార్తియమూర్తి మాట్లాడుతూ.. ఏడేళ్ల క్రితం బస్సు టికెట్లలో తిరుక్కురల్‌ను చదువుతూ వచ్చానని, దానిపై ఆసక్తి పెంచుకున్న తాను అప్పట్లో 1,330 పద్యాలను తలకిందులుగా రాసినట్లు తెలిపాడు. ఇందుకు 15 రోజులు సమయం పట్టిందన్నాడు. ప్రస్తు తం వళ్లువర్ పేరవై సహకారంతో తిరుక్కురల్‌ను 17 గంటల 19 నిమిషాల్లో ముగించి రికార్డు సాధించడం సంతోషంగా ఉందన్నారు. -
డ్రైవర్‌కు షాక్ ఇచ్చిన జీఎస్టీ అధికారులు
భువనేశ్వర్ : పూట గడవటం కోసం డ్రైవర్‌గా పని చేసుకునే ఓ వ్యక్తికి జీఎస్టీ అధికారులు షాక్ ఇచ్చారు. దాదాపు నాలుగున్నర కోట్ల రూపాయల మేర పన్ను ఎగవేశావంటూ నోటీసులు పంపించారు. ఒడిస్సాలోని రూర్కేలాలో చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. రూర్కేలాకు చెందిన రాజేంద్ర పల్లై డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం కటక్, జీఎస్టీ ఆఫీసునుంచి అతడికి ఏవో నోటీసులు వచ్చాయి. ‘‘ రాజేంద్ర.. ఆర్పీ ఎంటర్ ప్రైజెస్ అనే కంపెనీకి యజమాని. ఆ కంపెనీ పేరిట 4.31 కోట్ల రూపాయల పన్ను బకాయిలు ఉన్నాయి. (అమ్మ ఉద్యోగం పోయింది,14 ఏళ్ల బాలుడు ఏం చేశాడంటే...) అది కూడా నకిలీ కంపెనీ పేరిట, నకిలీ ఇన్వాయిస్లు సృష్టించి పన్ను ఎగవేశావు’’ అని నోటీసులో ఉంది. దీంతో రాజేంద్ర అయోమయానికి గురయ్యాడు. తన ఐడెంటిటీని ఎవరో దొంగిలించారని అతనికి అర్థం అయింది. దీనిపై అతడు మాట్లాడుతూ..‘‘ కొద్దిరోజల క్రితం ఓ వ్యక్తి నాకు 10 వేల రూపాయలు వచ్చే జీతం ఇప్పిస్తానని చెప్పి, నా వద్దనుంచి ఆధార్ కార్డు ఇతర పత్రాలు తీసుకున్నాడు. సదరు పత్రాల ఆధారంగా నా పేరిట నకిలీ కంపెనీ సృష్టించారని తెలిసింది. అధికారులు దీనిపై విచారణ జరపాలని కోరుకుంటున్నా’’నన్నాడు. -
క్యాబ్ డ్రైవర్లే టార్గెట్!
సాక్షి, సిటీబ్యూరో: క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తూ వారినే టార్గెట్‌గా చేసుకుని దృష్టి మళ్లించి సెల్‌ఫోన్ చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని ఉత్తర మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతగాడు ఓ బంగారం వ్యాపారికీ టోకరా వేసినట్లు డీసీపీ పి.రాధాకిషన్ రావు శుక్రవారం వెల్లడించారు. నిజామాబాద్‌కు చెందిన మహ్మద్ అబ్దుల్ రెహ్మాన్ నగరంలోని వారాసిగూడ ప్రాంతంలో నివసిస్తున్నాడు. కొన్నాళ్ల పాటు జనరల్ బజార్లో బంగారు నగల తయారీ, ముత్యాలకు పాలిష్ పెట్టే పని చేశాడు. అయితే అవసరమైన స్థాయిలో పని, ఆదాయం లేకపోవడంతో క్యాబ్ డ్రైవర్‌గా మారాడు. ఇలా వచ్చే సంపాదనతోనూ తృప్తి పడని రెహ్మాన్ క్యాబ్ డ్రైవర్లనే టార్గెట్‌గా చేసుకుని దృష్టి మళ్లిచి నేరాలు చేయాలని పథకం వేశాడు. ప్రయాణికుడి మాదిరిగా క్యాబ్ బుక్ చేసుకునే ఇతగాడు పికప్ పాయింట్లో వాహనం ఎక్కేవాడు. కొద్దిదూరం వెళ్లిన తర్వాత తన ఫోన్ స్విచ్ఛాఫ్ అయిందని, అర్జంట్‌గా తన తల్లిదండ్రులతో మాట్లాడాలని డ్రైవర్‌తో చెప్పేవాడు. ఆ నెపంతో డ్రైవర్ నుంచి సెల్‌ఫోన్ తీసుకుని కాల్ చేసి మాట్లాడుతున్నట్లు నటించేవాడు. ఓ ప్రాంతంలో కారు ఆపమని చెప్పి అదును చూసుకుని ఫోన్‌తో సహా ఉడాయించేవాడు. ఈ పంథాలో ఈ నెలలోనే మహంకాళి, రామ్‌గోపాల్‌పేట, గోపాలపురం పరిధిల్లో మూడు నేరాలు చేశాడు. గత శనివారం జనరల్ బజార్లో ఓ జ్యువెలరీ దుకాణానికి వెళ్లిన రెహ్మాన్ అక్కడ రూ.లక్ష విలువ చేసే నగలు ఖరీదు చేశాడు. రూ.21 వేలు చెల్లించిన ఇతగాడు మిగిలిన మొత్తం తనతో మనిషిని పంపిస్తే ఇస్తానంటూ నమ్మించాడు. జ్యువెలరీ దుకాణం నిర్వాహకులు అలానే చేయగా... ఆ మనిషి బైక్‌పై రెహ్మాన్ తన ఇంటి వరకు వెళ్ళాడు. అక్కడ అతడిని వేచి ఉండమని చెప్పిన ఇతగాడు నగలు తీసుకుని ఉడాయించాడు. దీనిపై మహంకాళి ఠాణాలో మరో కేసు నమోదైంది. దీన్ని ఛేదించడానికి ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు నేతృత్వంలో ఎస్సైలు జి.రాజశేఖర్‌రెడ్డి, కె.శ్రీకాంత్‌లతో ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. జనరల్ బజార్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల్లోని ఫీడ్‌ను పరిశీలించిన పోలీసులు రెహ్మాన్ నిందితుడిగా గుర్తించారు. శుక్రవారం ఇతడిని పట్టుకుని 18.56 గ్రాముల బంగారు నగలు, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. విచారణ నేపథ్యంలో మిగిలిన మూడు నేరాలు సైతం అంగీకరించాడు. తదుపరి చర్యల నిమిత్తం నిందితుడితో సహా సొత్తును మహంకాళి పోలీసులకు అప్పగించారు. ఇతడిపై గతంలో చిలకలగూడలో ఓ చోరీ కేసు నమోదైనట్లు అధికారులు తెలిపారు. -
‘ముత్తిరెడ్డి’ డ్రైవర్ కుటుంబానికి కరోనా పరీక్షలు
రాయపర్తి: ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి డ్రైవర్ రాయపర్తి మండలంలోని మైలారం గ్రామానికి చెందిన ఉల్లెంగుల మధుకు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన విషయం విధితమే. ఈ క్రమంలో డీఎంహెచ్ఓ మధుసూదన్ నేతృత్వంలో మైలారానికి చేరుకొని మధు కుటుంబ సభ్యులకు కూడా పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. కరోనా లక్షణాలు కన్పించలేదని తెలిపారు. కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని గ్రామస్తులకు సూచించారు. మాస్క్‌లు ధరించాలని కోరారు. జెడ్పీటీసీ రంగు కుమారస్వామి, వైద్యాధికారులు డాక్టర్ విపిన్, వెంకటేష్, సీహెచ్ఓ నెహ్రూచంద్, ఏఎన్ఎం అరుణ, ఆశకార్యకర్తలు పాల్గొన్నారు. -
లాక్డౌన్ ప్రభావం క్యాబ్ డ్రైవర్ ఆత్మహత్య
పహాడీషరీఫ్: లాక్డౌన్ ప్రభావంతో ఆర్థిక ఇబ్బందులకు గురైన ఓ క్యాబ్ డ్రైవర్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ సంఘటన బాలాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున జరిగింది. ఎస్ఐ నాగరాజు తెలిపిన మేరకు.. మల్లాపూర్ గ్రామానికి చెందిన పోరెడ్డి నర్సింహా రెడ్డి (39)క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. లాక్డౌన్ నుంచి కారు నడవకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నాడు. ఈ సమయంలోనే ఇంటి నిర్మాణం పెట్టుకోవడం....చిట్టీలు కూడా కట్టలేని పరిస్థితి నెలకొంది. (జీవితం చావడానికి కాదు: ఐశ్వర్య ) ఈ క్రమంలోనే శనివారం రాత్రి భార్య పిల్లలతో కలిసి నిద్రించిన నర్సింహా రెడ్డి అర్ధరాత్రి గదిలో నుంచి బయటికి వచ్చి గదికి బయటి నుంచి గొళ్లెం పెట్టాడు. కొద్ది సేపటి అనంతరం నిద్రలేచిన భార్య....భర్త లేకపోవడంతో డోర్ తీసేందుకు ప్రయత్నించింది. బయటి నుంచి లాక్ చేసి ఉందని గ్రహించి స్థానికులకు ఫోన్ చేయడంతో వారు వచ్చి పరిశీలించగా హాల్లోనే తాడుతో ఉరేసుకొని కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మృతుడికి ఇద్దరు పిల్లలు సంతానం. (సుశాంత్ మృతిపై అనుమానం: సీబీఐ విచారణ) -
మాజీ డ్రైవరే సూత్రధారి
సాక్షి, సిటీబ్యూరో: జూబ్లీహిల్స్ రోడ్ నెం.34లో నివసించే వ్యాపారవేత్త నసీర్ అలీఖాన్ ఇంట్లో చోటు చేసుకున్న చోరీ కేసును పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఛేదించారు. ఈ దొంగతనానికి ఆ ఇంట్లో పని చేసి మానేసిన డ్రైవరే సూత్రధారిగా తేల్చారు. మంగళవారం ముగ్గురు నిందితుల్ని అరెస్టు చేశామని, వారి నుంచి చోరీ సొత్తు య«థాతథంగా స్వాధీనం చేసుకున్నామని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ పేర్కొన్నారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ పి.రాధాకిషన్‌రావుతో కలిసి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు. ఆనుపానులన్నీ తెలుసుకుని.. బోరబండ ప్రాంతానికి చెందిన సయ్యద్ యూసుఫ్ మూడో తరగతితో చదువు మానేశాడు. కొన్నాళ్లు ఎస్సార్‌నగర్‌లో టైలరింగ్ పని చేసి.. 2007లో వివాహానంతరం డ్రైవర్‌గా మారాడు. తొలుత ఎస్సార్‌నగర్‌లోని ఓ ట్రావెల్స్‌లో పని చేసిన యూసుఫ్ ఆపై జూబ్లీహిల్స్‌కు చెందిన కన్స్ట్రక్షన్స్ వ్యాపారి నసీర్ అలీఖాన్ వద్ద డ్రైవర్‌గా చేరారు. 2013లో ఉద్యోగం కోసం సౌదీ వెళ్లి 2015లో తిరిగి వచ్చాడు. ఆ తర్వాత ఏడాది ఓలా క్యాబ్స్‌లో డ్రైవర్‌గా చేసినా.. మళ్లీ నసీర్ అలీఖాన్ వద్ద చేరాడు. గత ఏడాది జూలైలో మానివేసే సమయానికి రెండు దఫాల్లో దాదాపు ఎనిమిదేళ్లు నసీర్ అలీ ఖాన్ వద్ద పని చేశాడు. ఈ నేపథ్యంలోనే వారి ఇంట్లో అణువణువూ తెలిసి ఉండటంతో పాటు ఏ సమయంలో ఎలా ఉంటారనే దానిపైనా అవగాహన పెంచుకున్నాడు. ఇటీవల ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఇతగాడు తన మాజీ యజమాని ఇంట్లో చోరీ చేస్తే భారీ మొత్తం దక్కతుందని పథకం వేశాడు. ఈ విషయాన్ని తన స్నేహితులైన బోరబండ వాసులు షేక్ షాహిద్, సయ్యద్ షహబాజ్‌లకు చెప్పడంతో వాళ్లూ అంగీకరించారు. రంగంలోకి దిగిన ఈ త్రయం చోరీ చేస్తున్నప్పుడు ఎవరైనా అడ్డు వస్తే వినియోగించడానికి కత్తి, ఫెన్సింగ్ కట్ చేయడానికి భారీ కత్తెర ఖరీదు చేసుకున్నారు. నగలున్న హ్యాండ్‌బ్యాగుతో ఉడాయింపు.. అదను కోసం ఎదురు చూస్తున్న యూసుఫ్ ఇప్పటికీ నసీర్ అలీ ఖాన్ ఇంట్లో పని చేస్తున్న వారితో ఫోన్ ద్వారా సంభాషిస్తూ యజమానుల కదలికల్ని తెలుసుకుంటూ వచ్చాడు. ఏ దశలోనూ వారికి అనుమానం రాకుండా జాగ్రత్తపడ్డాడు. ఈ నెల 14న వీరికి ఫోన్ చేసిన యూసుఫ్ పనివాళ్ల ద్వారా తమ యజమానురాలు ఓ ఫంక్షన్‌కు వెళ్లినట్లు తెలుసుకున్నాడు. ఇలా వెళ్లిన ప్రతిసారీ ఆమె ఖరీదైన జ్యువెలరీ ధరిస్తారని, తిరిగి వచ్చిన తర్వాత అన్నీ తన హ్యాండ్‌బ్యాగ్‌లోనే ఉంచి బెడ్ పక్కనే పెట్టుకుంటారని తెలిసిన యూసుఫ్ రంగంలోకి దిగాడు. తన ఇద్దరు స్నేహితుల్నీ పిలిపించి అంతా కలిసి అర్ధరాత్రి వేళ ఆ ఇంటి వద్దకు వెళ్లారు. గోడ దూకి లోపలకు ప్రవేశించిన ఈ త్రయం సీసీ కెమెరాల్లో తమ కదలికలు కనిపించకుండా వాటిని పక్కకు తిప్పారు. నేరుగా రెండో అంతస్తులోని బెడ్రూమ్లోకి వెళ్లిన యూసుఫ్ అక్కడ ఉన్న హ్యాండ్ బ్యాగ్ తీసుకుని రావడంతో ముగ్గురూ కలిసి ఉడాయించారు. ఆ సమయంలో అదే ఇంట్లో ముగ్గురు పనివాళ్లు ఉన్నా.. వారికీ చోరుల ఉనికి తెలియలేదు. మరుసటి రోజు చోరీ విషయం గుర్తించిన నసీర్ అలీ ఖాన్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. నేరగాళ్ల కోసం రంగంలోకి దిగిన వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ బి.గట్టుమల్లు నేతృత్వంలో ఎస్సైలు ఎన్.రంజిత్‌కుమార్, పి.మల్లికార్జున్, మహ్మద్ ముజఫర్ అలీ ముమ్మరంగా గాలించారు. ఎట్టకేలకు మంగళవారం ముగ్గురినీ పట్టుకుని రూ.10.10 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం నిందితుల్ని జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. -
ట్రాఫిక్ పోలీసులకే మస్కా
బంజారాహిల్స్: డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పోలీసు విధులకు ఆటంకం కలిగిస్తూ మస్కా కొట్టి పరారైన కారు డ్రైవర్‌పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. వివరాలు.. శనివారం అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతంలో బంజారాహిల్స్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాదరావు సిబ్బందితో కలిసి జూబ్లీహిల్స్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వద్ద డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్నారు. అదే సమయంలో టీఎస్ 34 బి టీఆర్ 0277 డిజైర్ కారు నడుపుతున్న వ్యక్తికి పోలీసులు శ్వాస పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. తాను కారును పక్కన ఆపుతానంటూ వారితో మాట్లాడుతూనే అక్కడి నుంచి ఉడాయించాడు. దీంతో ట్రాఫిక్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించినందుకు పరారీలో ఉన్న కారు డ్రైవర్‌పై ఐపీసీ సెక్షన్ 353 కింద కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
డ్రైవర్‌తో టీచర్ పరార్
తమిళనాడు,తిరువొత్తియూరు : ఇద్దరు పిల్లలను అనాథగా వదలి ప్రియుడితో పారిపోయిన సంగీత, నృత్య ఉపాధ్యాయురాలి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కన్యాకుమారి జిల్లా తిరువట్టార్ సమీపంలో ఓ గ్రామానికి చెందిన అరుణ్ (30) ప్రైవేటు పాఠశాలలో డ్రైవర్‌గా ఉన్నాడు. అతనికి వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. అదే పాఠశాలలో పనిచేస్తున్న (35) సంగీత, నృత్య ఉపాధ్యాయురాలితో పరిచయమైంది. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. ఆమె భర్త విదేశాలలో ఉంటున్నారు. తన ఇద్దరు పిల్లలతో కలిసి ప్రియుడితో ఉల్లాసంగా తిరుగుతున్నట్టు తెలిసింది. ఆమె బంధువులు మందలించడంతో ఇద్దరు పిల్లలను వదలి గత జూలైలో ప్రియుడితో పారిపోయింది. పోలీసులు విచారణ చేపట్టారు. కన్యాకుమారిలో దాగి ఉన్న వారిని తీసుకొచ్చి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.ఈ క్రమంలో శుక్రవారం మళ్లీ పిల్లలను వదిలిపెట్టి వారిద్దరూ పారిపోయినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. -
నమ్మకంగా దోచేశాడు
సాక్షి, విశాఖపట్నం: కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంటి యజమాని వద్ద కారు డ్రైవర్‌గా నమ్మకంగా పనిచేస్తూ... అదే ఇంటిలో బంగారం, నగదు దొంగతనానికి పాల్పడిన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు నగర డీసీపీ – 2 ఉదయ్‌భాస్కర్ బిల్లా తెలిపారు. 21 తులాల బంగారం, రూ.4.49 లక్షల నగదు స్వాదీనం చేసుకున్నామని తెలిపా రు. నగర పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన తెలిపిన వివరాల ప్రకారం... కంచరపాలెం పి.ఆర్.గార్డెన్స్‌లో గల శ్రీరామ్ అపార్టుమెంట్స్‌లో రిటైర్డ్ చార్టెడ్ అకౌంటెంట్ పేరి గోపాలకృష్ణ(78) భార్యతో కలిసి నివాసముంటున్నారు. కంచరపాలెం కోకో కంపెనీ వెనుక నివాసముంటున్న సత్యనారాయణ(36) అనే వ్యక్తిని నెలకు రూ.10వేలు వేతనమిస్తూ కారు డ్రైవర్‌గా పెట్టుకున్నారు. సత్యనారాయణ నమ్మకంగా పనిచేస్తూ కొన్నాళ్లకు ఇంటిలో మనిíÙలా వ్యవహరించేవాడు. గోపాలకృష్ణ పిల్లలిద్దరూ అమెరికాలో స్థిరపడటంతోపాటు ఆర్థికంగా స్థిరపడిన కుటుంబం కావడంతో ఇంట్లో నగదు, బంగారు ఆభరణాల విషయంలో పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ నగదు పెట్టడం, తాళాలను ఒక కబోర్డులో ఉంచడాన్ని సత్యనారాయణ గమనించాడు. ఈ నేపథ్యంలో గత ఏడాది నవంబర్ నెలలో గోపాలకృష్ణ దంపతులకు అనుమానం రాకుండా ఇంట్లో నుంచి సుమారు 21 తులాల బంగారు ఆభరణాలు, రూ.4.49 లక్షల నగదు దోచుకున్నాడు. తర్వాత డ్రైవర్ వృత్తిని విడిచిపెట్టి వెళ్లిపోయాడు. అనంతరం ఈ ఏడాది జనవరి మొదటి వారంలో ఇంటిలోని బంగారం కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన గోపాలకృష్ణ కంచరపాలెం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సత్యనారాయణపై అనుమానం ఉన్నట్లుగా ఫిర్యాదులో పేర్కొనడంతో ఏడీసీపీ(క్రైం) వి.సురేష్‌బాబు నేతృత్వంలో ఏసీపీ(క్రైం) సీహెచ్ పెంటారావు, పశి్చమ సబ్ డివిజన్ సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ మన్మధరావు, కానిస్టేబుల్ సుధాకర్, నవీన్, అప్పలరాజులతో కూడిన బృందం దర్యాప్తు ప్రారంభించారు. సత్యనారాయణపై అనుమానంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఎస్.కోటలో ఉన్నట్లు సమాచారం అందడంతో అక్కడకు వెళ్లి అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా దొంగతనం చేసినట్లు అంగీకరించడంతో అరెస్టు చేశారు. గోపాలకృష్ణ నివాసముంటున్న అపార్టుమెంట్‌లోని ఇళ్లలో కూడా చిన్న చిన్న దొంగతనాలు చేసినట్లుగా విచారణలో సత్యనారాయణ అంగీకరించాడని, ఆ వివరాలు పూర్తిస్థాయిలో ఇంకా సేకరించాల్సి ఉందని డీసీపీ ఉదయ్‌భాస్కర్ తెలిపారు.