సాక్షి, న్యూఢిల్లీ : గురుగావ్ టోల్ ప్లాజా వద్ద ఓ డ్రైవర్ హల్ చల్ చేశాడు. టోల్ ప్లాజా ఉద్యోగిని తన కారు బానేట్‌పై ఉంచి హై స్పీడ్‌లో ఆరు కిలోమీటర్ల దూరం ఈడ్చుకెళ్లాడు. అసలు ఏం జరిగిందంటే..గురగావ్ టోల్ ప్లాజా వద్దకు ఒక ఇన్నోవా కారు వచ్చింది. అక్కడ ఉన్న ఉద్యోగి టోల్ ఛార్జీ చెల్లించమని అడిగారు. కానీ అతను పట్టించుకోలేదు. అలాగే ముందుకు వెళ్లసాగాడు. దీంతో అక్కడి సిబ్బంది కారును ఆపమని కోరారు.
దీంతో సదరు డ్రైవర్ ‘నా కారును పోలీసులే ఆపలేరు నువ్వు ఆపుతావా’ అంటూ బూతులు తిడుతూ ముందుకు వెళ్లబోయాడు. అతన్ని అడ్డుకునేందుకు ఓ ఉద్యోగి కారు ముందుకు వచ్చి నిలబడ్డాడు. కానీ ఆ డ్రైవర్ కారు ఆపకుండా అతని బానేట్‌పై ఉంచి అలాగే ముందుకు వెళ్లాడు. హైస్పీడ్‌లో దాదాపు 6 కిలోమీటర్ల దూరం వెళ్లాడు. అనంతరం అతన్ని అక్కడ వదిలేసి పారిపోయాడు. ఇందంతా అక్కడి ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడా వీడియో వైరల్ అయింది. కాగా ఆ డ్రైవర్ ను పోలీసులు అరెస్ట్ చేశారా లేదా అన్న విషయం ఇంకా తెలియరాలేదు.
Comments
Please login to add a commentAdd a comment