
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో కొందరు వ్యక్తులు డీసీఎం డ్రైవర్‌పట్ల అమానుషంగా ప్రవర్తించారు. ఈ సంఘటన కాన్పూర్‌లో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. గత సోమవారం సాయంత్రం లక్నో-కాన్పూర్ హైవే ఫ్లైఓవర్‌మీద డీసీఎం, కారు ఢీకొన్నాయి. ఈప్రమాదంతో రెండు వాహనాలు దెబ్బతిన్నాయి. కాగా, డీసీఎంలోని డ్రైవర్.. కారులోని వ్యక్తుల మధ్య వాగ్వాదం జరిగింది. ఒకరిని మరొకరు తీవ్రంగా దూశించుకున్నారు. అంతటితో ఆగకుండా కొట్టుకొవడానికి ప్రయత్నించారు.
ఈ క్రమంలో, డీసీఎం డ్రైవర్.. కారు ముందు వెళ్లి నిల్చున్నాడు. అయితే, కారులో ఉన్న సదరు వ్యక్తులు.. కారును వేగంగా ముందుకు నడిపారు. దీంతో అతను కారు ముందు భాగం మీదపడిపోయి వైపర్‌ను పట్టుకున్నాడు. కారులోని వ్యక్తులు ఏమాత్రం జాలీ లేకుండా.. కారును దంచి కొట్టారు. ఆ యువకుడు వైపర్‌ను పట్టుకుని వేలాడుతున్నాడు. సుమారు 5 కిలోమీటర్ల వరకు అతడిని లాక్కొని పోయారు. ఈ అమానుషాన్ని అక్కడి స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఇది వైరల్‌గా మారింది. ఈ మేరకు కేసును నమోదు చేసిన కాన్పూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment