Arguments
-
అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్
హైదరాబాద్, సాక్షి: సంధ్య ధియేటర్ వద్ద తొక్కిసలాట కేసుకు సంబంధించి నటుడు అల్లు అర్జున్‌కు భారీ ఊరట లభించింది. తెలంగాణ హైకోర్టు ఆయనకు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో పెట్టిన సెక్షన్లు అల్లు అర్జున్‌కు వర్తించవని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో చంచల్‌గూడ జైలు నుంచి ఆయన విడుదల కానున్నారు. ఈ కేసులో శుక్రవారం ఉదయం అల్లు అర్జున్ను ఆయన నివాసంలో చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆపై వైద్యపరీక్షల అనంతరం ఆయన్ని నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. ఇటు నాంపల్లి కోర్టులో.. అటు తెలంగాణ హైకోర్టులో కాసేపు వ్యవధిలో అల్లు అర్జున్ కేసులో వాదనలు జరిగాయి. అయితే నాంపల్లి కోర్టు రిమాండ్ విధించడంతో ఆయన్ని పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈలోపే.. హైకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్లో అల్లు అర్జున్‌కు ఊరట లభించింది.నాంపల్లి కోర్టులో వాదనలు ఇలా.. ‘‘ఇది అక్రమ అరెస్ట్. బీఎన్ఎస్ 105 సెక్షన్ అల్లు అర్జున్‌కు వర్తించదు. సినిమా చూసేందుకు ఒక నటుడికి ఎవరి అనుమతి అవసరం లేదు. సాధారణ ప్రేక్షకుడిగానే వెళ్లారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే అరెస్ట్ చేశారు. అరెస్టును తిరస్కరించండి’’ అని మేజిస్ట్రేట్‌కు అల్లు అర్జున్ తరఫు లాయర్ కోరారు.ఈ సందర్భంగా.. 2017 నటుడు షారూఖ్ ఖాన్ గుజరాత్ పర్యటనలో చోటుచేసుకున్న అపశ్రుతి ఘటనను ప్రస్తావించారు. ‘2017లో షారూఖ్ పర్యటన సందర్భంగా తొక్కిసలాట జరిగింది. ఈ కేసులో షారూఖ్‌కు ఊరట లభించింది’ మేజిస్ట్రేట్ దృష్టికి అల్లు అర్జున్ లాయర్ తీసుకెళ్లారు. ఇది చదవండి: అల్లు అర్జున్ అరెస్ట్.. ఇది మరీ టూమచ్!అయితే.. భద్రత కోరుతూ సంధ్య థియేటర్ యాజమాన్యం చేసిన విజ్ఞప్తిని పోలీసులు తిరస్కరించారని, అయినా అల్లు అర్జున్ సంధ్యా థియేటర్‌కు వచ్చారని, అలా ర్యాలీగా వెళ్లడం వల్లే తొక్కిసలాట జరిగిందని పోలీసులు వాదించారు. ఈ క్రమంలో.. రెండుగంటలపాటు వాదనలు విన్న నాంపల్లి కోర్టు మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్(ఈ నెల 27వ తేదీ దాకా) విధించారు. అయితే పైకోర్టులో(హైకోర్టులో) తన క్లయింట్ వేసిన క్వాష్ పిటిషన్ విచారణ జరుగుతుందని అల్లు అర్జున్ లాయర్.. మేజిస్ట్రేట్ దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పటికీ రిమాండ్‌కు ఆదేశించడంతో పోలీసులు అల్లు అర్జున్ను చంచల్‌గూడ జైలుకు తరలించారు.మరోవైపు.. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ కొట్టేయాలని అల్లు అర్జున్ తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌పై అల్లు అర్జున్ తరఫున నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఇదీ చదవండి: ‘అల్లు అర్జున్ అరెస్ట్‌తో నాకేం సంబంధం లేదు’హైకోర్టులో వాదనలు ఇలా.. ‘‘సంచలనం కోసమే అల్లు అర్జున్ను అరెస్ట్ చేశారు. ఆయన అరెస్ట్, రిమాండ్ రెండూ అక్రమమే. అల్లు అర్జున్ థియేటర్‌కు వస్తున్నారనే సమాచారం పోలీసుల దగ్గర ఉంది. కానీ, అక్కడ తగినంత పోలీసులు లేరు. థియేటర్ వద్ద ఉన్న జనాల్ని పోలీసులు కంట్రోల్ చేయలేకపోయారు. ఉన్న పోలీసులు కూడా అల్లు అర్జున్ను చూస్తూ ఉండిపోయారు. ఈ కేసు విచారణకు అల్లు అర్జున్ సహకరిస్తున్నారు. ఆయన ఎక్కడికి పారిపోవడం లేదు. మధ్యంతర బెయిల్ మంజూర చేయాలని అల్లు అర్జున్ తరఫు లాయర్ కోరారు. వాదనల సందర్భంగా.. ఈ కేసులో పెట్టిన సెక్షన్లు అల్లు అర్జున్‌కు వర్తించవని, గతంలో బండి సంజయ్ అరెస్ట్‌పై హైకోర్టు స్టే విధించిన విషయాన్ని లాయర్ నిరంజన్‌రెడ్డి ప్రస్తావించారు. ఆ సమయంలో పీపీని హైకోర్టు న్యాయమూర్తి ప్రశ్నిస్తూ.. రేవతి మృతికి అల్లు అర్జున్ ఎలా కారణం అవుతారు?.సెక్షన్ 105, 118(1)లు అల్లు అర్జున్‌కు వర్తిస్తాయా? అని అడిగారు. 👉పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదిస్తూ.. అల్లు అర్జున్ ఓ సెలబ్రిటీ. జనాలు వస్తారని ఆయనకు తెలుసు. తొక్కిసలాటతో ఓ మహిళ ప్రాణం పోయింది. అల్లు అర్జున్ వల్లే తొక్కిసలాట జరిగింది. నేర తీవ్రతను బట్టే పోలీసులు ఈ కేసు పెట్టారు. మధ్యంతర బెయిల్ ఇవ్వదగిన కేసు ఇది కాదు. ఇది క్వాష్ పిటిషన్ మాత్రమే. ఇప్పటికే కింది కోర్టులో అల్లు అర్జున్‌కు రిమాండ్ విధించారు. ఆయన్ని ఈపాటికే చంచల్‌గూడ జైలుకు తరలించారు. కాబట్టి.. వాళ్లు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వేసుకోవచ్చు అన్నారు.ఇదీ చదవండి: అల్లు అర్జున్ అరెస్ట్👉ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్‌పై తీర్పు వెల్లడించింది. ‘‘ఈ కేసులో పెట్టిన సెక్షన్లు అల్లు అర్జున్‌కు వర్తించవు. యాక్టర్ అయినంత మాత్రానా సామాన్య పౌరుడికి వర్తించే మినహాయింపులను నిరాకరించలేం. కేవలం నటుడు కాబట్టే ఆ సెక్షన్లు ఆపాదించాలా?. మృతురాలు రేవతి కుటుంబంపై సానుభూతి ఉంది. అంతమాత్రాన నేరాన్ని ఒకరిపై రుద్దలేం. అల్లు అర్జున్‌కు కూడా జీవించే హక్కు ఉంది’’ అని పేర్కొంటూ మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. ఇక తీర్పు సందర్భంగా.. అర్ణబ్గోస్వామి వర్సెస్ మహారాష్ట్ర కేసులో సుప్రీం కోర్టు తీర్పును జడ్జి ప్రస్తావించారు. వ్యక్తిగత పూచీకత్తు(రూ.50 వేలు)కింద బెయిల్ మంజూరు చేయాలంటూ చంచల్‌గూడ జైలు సూపరిండెంట్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
‘హైడ్రా’పై కేఏ పాల్ వాదనలు.. హైకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి,హైదరాబాద్: హైడ్రాపై కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం(అక్టోబర్ 23) హైకోర్టులో విచారణ జరిగింది. విచారణలో బెంచ్ ముందు పాల్ తానే స్వయంగా వాదనలు వినిపించారు. పాల్ వాదనలు విన్న కోర్టు హైడ్రాకు కీలక ఆదేశాలు జారీ చేసింది. నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టవద్దని హైడ్రాను ఆదేశించింది.నిర్వాసితులు ప్రత్యామ్నాయం చూసుకునేంతవరకు బాధితులకు సమయం ఇవ్వాలని సూచించింది. మూసీ బాధితులకు ఇల్లు కట్టించిన తర్వాతే కూల్చివేతలు చేపట్టాలని హైకోర్టు స్పష్టం చేసింది. బాధితులకు ఇల్లు కేటాయించిన తర్వాతే కూల్చివేస్తున్నామని అడిషనల్ అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, హైడ్రాను హైకోర్టు ఆదేశించింది. -
‘మార్గదర్శి’ ఎగవేతదారుల వివరాలు తెలుసుకోండి: తెలంగాణ హైకోర్టు
హైదరాబాద్, సాక్షి: సుప్రీం కోర్టు ఆదేశాలతో మార్గదర్శి కేసు విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు.. కీలక ఆదేశాలు జారీ చేసింది. మార్గదర్శి ఎగవేతదారుల వివరాలు తెలుసుకోవాలని, ఇందుకోసం తెలుగు, హిందీ, ఇంగ్లీష్ దినపత్రికల్లో నోటీసులు ఇచ్చి విస్తృత ప్రచారం కల్పించాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ.. విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది. మార్గదర్శి కేసును ఇవాళ తెలంగాణ హైకోర్టులో డివిజన్ బెంచ్ విచారణ జరిపింది. జస్టిస్ సుజోయపాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం వాదనలు వింది. ఉండవల్లి అరుణ్‌కుమార్, మార్గదర్శి న్యాయవాది సిద్దార్థ లూద్రా అన్లైన్ ద్వారా విచారణకు హాజరయ్యారు. ఆర్బీఐ దాఖలు చేసిన కౌంటర్‌పై స్పందన తెలిపేందుకు రెండు వారాలు సమయం కావాలని కోరారు మార్గదర్శి లాయర్ లూద్రా. అయితే..ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45(ఎస్) ప్రకారం మార్గదర్శి చందాలు వసూలు చేయడం చట్టవిరుద్ధమని ఆర్బీఐ కౌంటర్లో తేల్చిందన్న విషయాన్ని ఉండవల్లి బెంచ్ ముందు ప్రస్తావించారు. దీనిపై పూర్తి విచారణ జరపాలని, బాధ్యులను ప్రాసిక్యూట్ చేయాల్సిందేనని చెప్పిందని గుర్తు చేశారు. అలాగే.. మొత్తం 70,000 చందాదారుల వివరాలు సుప్రీంకోర్టుకు మార్గదర్శి సమర్పించిందని, ఆ వివరాలను హైకోర్టుకు పెన్‌డ్రైవ్‌లో ఇచ్చేలా ఆ సంస్థను ఆదేశించాలని ఉండవల్లి కోరారు. అయితే.. ఆ వివరాలు కోరుతూ ఓ అఫిడవిట్ దాఖలు చేయాలని ఉండవల్లికి హైకోర్టు సూచించింది. ఎగవేత దారుల వివరాలు తెలుసుకునేందుకు విస్తృతంగా ప్రచారం కల్పించాలని రిజిస్ట్రీని ఆదేశించింది. మరోవైపు.. రెండు వారాల్లో కౌంటర్లు వేయాలని ఏపీ, తెలంగాణ సర్కారుకు ఆదేశిస్తూ తదుపరి విచారణను సెప్టెంబర్ 11వ తేదీకి వాయిదా వేసింది. -
Parliament Budget Session 2024: మాటల యుద్ధం
న్యూఢిల్లీ: అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదాలు, నినాదాలతో లోక్‌సభ గురువారం దద్దరిల్లింది. పలుమార్లు వాయిదా పడింది. కేంద్ర బడ్జెట్‌పై ప్రారంభమైన చర్చ పూర్తిగా పక్కదారి పట్టింది. తొలుత కాంగ్రెస్ ఎంపీ, పంజాబ్ మాజీ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ మాట్లాడుతూ బీజేపీ ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి రవనీత్‌సింగ్ బిట్టూ తాత, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్‌సింగ్ హత్య ఘటనను ప్రస్తావించారు. దీనిపై బిట్టూ అభ్యంతరం వ్యక్తం చేశారు. చన్నీ, బిట్టూ మధ్య మాటల యుద్ధం జరిగింది. కాంగ్రెస్ నేత సోనియా గాం«దీతోపాటు చన్నీపై బిట్టూ వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు. దీంతో విపక్ష ఎంపీలు ఒక్కసారిగా ఆయనపై విరుచుకుపడ్డారు. బిట్టూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సభ్యుడు అమరీందర్‌సింగ్ రాజా వెల్‌లోకి దూసుకెళ్లేందుకు ప్రయతి్నంచారు. రాహుల్ గాంధీ ఆయనను ఆపేశారు. బిట్టూతోపాటు పలువురు బీజేపీ ఎంపీలు వెల్‌లోకి ప్రవేశించేందుకు ప్రయతి్నంచగా స్పీకర్ స్థానంలో ఉన్న సంధ్యా రే సభను వాయిదా వేశారు. సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడారు. సభ సజావుగా జరిగేలా చూడాలని స్పీకర్ ఓం బిర్లాను కోరారు. సభ్యులంతా సభ గౌరవాన్ని కాపాడాలని స్పీకర్ అన్నారు. నిబంధనలు అతిక్రమించకూడదని చెప్పారు. తర్వాత చన్నీ తన ప్రసంగం కొనసాగించారు. రైతులకు ఇచి్చన హామీలను మోదీ ప్రభుత్వం నిటబెట్టుకోలేదని విమర్శించారు. రైతులను ఖలిస్తానీలు చిత్రీకరించారని బీజేపీ నేతలపై మండిపడ్డారు. సభను చన్నీ తప్పుదోవ పట్టిస్తున్నారని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆరోపించారు. చన్నీ మాట్లాడుతూ రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పందిస్తూ చన్నీ వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఆయనపై సభా హక్కుల తీర్మానం ప్రవేశపెట్టాలని అన్నారు. ఈ సందర్భంగా అధికార, విపక్ష సభ్యుల మధ్య మళ్లీ వాగ్వాదం కొనసాగింది. తర్వాత సభ రెండుసార్లు వాయిదా పడింది. పార్లమెంట్ బయట బిట్టూ మీడియాతో మాట్లాడారు. చన్నీ జాతి వ్యతిరేక శక్తిగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇండియా నుంచి పంజాబ్‌ను విడదీయాలన్నదే ఆయన ఉద్దేశంగా కనిపిస్తోందన్నారు. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ: చన్నీ దేశంలో నరేంద్ర మోదీ పాలనలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందని చరణ్‌జిత్ సింగ్ చన్నీ మండిపడ్డారు. 20 లక్షల మంది ప్రజలు ఎన్నుకున్న ఎంపీని(అమృత్‌పాల్ సింగ్) జాతీయ భద్రతా చట్టం(ఎన్ఎస్ఏ) కింద నిర్బంధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్లు వేసిన ప్రజల సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావించే అవకాశం ఆయనకు ఇవ్వడం లేదని, ఇది ఎమర్జెన్సీ కాక మరేమిటని ప్రశ్నించారు. చన్నీ లోక్‌సభలో ఈ అంశాన్ని లేవనెత్తారు. అయితే, అమృత్‌పాల్ పేరును నేరుగా ప్రస్తావించలేదు. లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లోని ఖదూర్‌సాహిబ్ నియోజకవర్గం నుంచి వివాదాస్పద సిక్కు మత బోధకుడు, ఖలిస్తాన్ సానుభూతిపరుడు అమృత్‌పాల్ సింగ్ స్వతంత్ర అభ్యరి్థగా 2 లక్షల మెజారీ్టతో గెలిచిన సంగతి తెలిసిందే. ఆంధ్రా–బిహార్ బడ్జెట్: సౌగతా రాయ్ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌పై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగతా రాయ్ లోక్‌సభలో విమర్శలు గుప్పించారు. అది ఆంధ్రా–బిహార్ బడ్జెట్ అని ఆక్షేపించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శిక్షణ పొందిన ఆర్థికవేత్త కాదని అన్నారు. ప్రజల ఆకాంక్షలు పట్టించుకోకుండా కేవలం ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వచి్చన సూచనల ఆధారంగా బడ్జెట్ రూపొందించారని విమర్శించారు. గతంలో ఆర్థిక మంత్రులుగా పనిచేసిన మన్మోహన్ సింగ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో, పి.చిదంబరం హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారని, నిర్మలా సీతారామన్ మాత్రం జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో చదువుకున్నారని సౌగతా రాయ్ వ్యాఖ్యానించారు. -
‘హియర్ సే ఎవిడెన్స్’ సాక్ష్యంగా చెల్లదు
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ భాస్కర్‌రెడ్డి, గజ్జల ఉదయ్‌కుమార్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వు చేసింది. హియర్ సే ఎవిడెన్స్ (నాకు మరొకరు చెప్పారని సాక్ష్యం చెప్పడం) చట్ట ప్రకారం సాక్ష్యంగా చెల్లదని, గూగుల్ టేక్ అవుట్ ప్రామాణికమని ఆ సంస్థే ధ్రువీకరణ ఇవ్వదని భాస్కర్‌రెడ్డి, ఉదయ్కుమారెడ్డి తరపు సీనియర్ న్యాయవాది టి.నిరంజన్ రెడ్డి కోర్టుకు నివేదించారు. అలాంటి సాక్ష్యాలతో అరెస్టు సమర్థనీయం కాదని చెప్పారు. వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు పక్షపాత వైఖరితో సాగుతోందని, కావాలనే ఈ కేసులో తమను ఇరికించారని, తమకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యం లేదని, బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ కె.లక్ష్మణ్ సోమవారం విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘మూడో చార్జీషీట్ (ఈ కేసులో 2వ మధ్యంతర చార్జిషీట్) దాఖలు చేసే వరకు పిటిషనర్లపై ఎలాంటి ఆరోపణలు లేవు. ఆ తర్వాత నిందితులుగా చేర్చడంలో కుట్ర కోణం దాగి ఉంది. అవినాశ్‌రెడ్డి బెయిల్ రద్దు కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన వారు కిరాయి హంతకుడు దస్తగిరి (ఏ–4) యథేచ్ఛగా తిరగడానికి మాత్రం పూర్తిగా సహకరిస్తున్నారు. హత్య వెనుక భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్ ఉన్నారని గంగిరెడ్డి తనకు చెప్పారంటూ దస్తగిరి వాంగ్మూలం ఇవ్వగా.., గంగిరెడ్డి మాత్రం తాను అలా చెప్పలేదని స్పష్టం చేశారు. దస్తగిరి చెప్పిన విషయానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న సీబీఐ.. ఇతరుల వాంగ్మూలాలను మాత్రం పట్టించుకోవడం లేదు’ అని పేర్కొన్నారు. ‘రెండున్నర నెలలు ఢిల్లీలో సీబీఐ కస్టడీలో ఉన్నానని దస్తగిరి చెప్పాడు. ఆ తర్వాతే అప్రూవర్‌గా మారి పిటిషనర్ల పేర్లు చెప్పాడు. దస్తగిరి బెయిల్‌కు సీబీఐ పూర్తిగా సహకరించింది. నాటి దర్యాప్తు అధికారి రాంసింగ్‌పై తీవ్ర ఆరోపణలున్నాయి. ఆయనపై సుప్రీం కోర్టులో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. దీంతో అత్యున్నత న్యాయస్థానం కేసు దర్యాప్తు బాధ్యత నుంచి ఆయన్ని తప్పించి, మరొకరిని నియమించింది. హత్య జరిగిన రోజున అవినాశ్‌రెడ్డికి భాస్కర్‌రెడ్డి ఫోన్ చేయడాన్ని కూడా సీబీఐ కుట్ర కోణంగా పేర్కొనడం సమంజసం కాదు. తండ్రి కుమారుడికి ఫోన్ చేయడం కూడా కుట్రేనా? కావాలనే ట్రయల్ కోర్టులో విచారణను సీబీఐ సాగదీస్తోంది. ముఖ్యంగా నాలుగు అంశాలను ఇక్కడ పరిశీలించాలి. ఇందులో మొదటిది పిటిషనర్లపై ఉన్నది ఆరోపణలు మాత్రమే. వాటికి సాక్ష్యాలు లేవు. రెండోది భాస్కర్‌రెడ్డి వయస్సు. ఆయన వయస్సు దాదాపు 72 ఏళ్లు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవడం మూడో అంశం. ఆయన ఆరోగ్య పరిస్థితిని సమీక్షించిన ట్రయల్ కోర్టు పలుమార్లు మధ్యంతర బెయిల్ కూడా మంజూరు చేసింది. ఆయనకు అత్యవసరమైతే 30 నిమిషాల్లో నిపుణులైన వైద్యుల పర్యవేక్షణకు చేర్చాలి. జైలులో ఉంటే అది సాధ్యం కాదు. ఆయనకు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? నాలుగోది ఆయన్ని అరెస్టు చేసి సంవత్సరమయ్యింది. ఏడాదిగా జైలులో ఉంటున్నారు. వీటిని పరిగణనలోకి తీసుకుని భాస్కర్‌రెడ్డితోపాటు ఉదయ్‌కుమార్‌కు బెయిల్ మంజూరు చేయాలి. ఇదే హైకోర్టు శివశంకర్‌రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. అదే వీరికి కూడా వర్తిస్తుంది. సరైన సాక్ష్యాలు లేనప్పుడు నెలల తరబడి నిందితుల పేరుతో జైలులో ఉంచడం వారి హక్కులను హరించడం కిందకే వస్తుందని సుప్రీంకోర్టు పలుమార్లు చెప్పింది’ అని నిరంజన్‌రెడ్డి వాదించారు. అనంతరం సీబీఐ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. బెయిల్ పిటిషన్లపై తీర్పు రిజర్వు చేశారు. -
పాన్ షాప్ దగ్గర రాజకీయ ముచ్చట్లు.. విసుగెత్తిన ఓనర్ ఏం చేశాడంటే..
రాయ్‌పూర్: ఎన్నికలు వచ్చాయంటే చాలు ఊళ్లలోని టీ కొట్లు, పాన్ షాప్‌ల దగ్గర జనం రాజకీయ ముచ్చట్లు పెడుతుంటారు. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు.. ఎందుకు గెలుస్తారు.. ఏ పార్టీ అధికారంలోని వస్తుంది.. ఇలా చర్చోపచర్చలు చేస్తుంటారు. ఇవి ఒక్కోసారి శ్రుతి మించి ఘర్షణలు, గొడవలకు దారి తీస్తుంటాయి. ఛత్తీస్‌గడ్‌లోని ఓ పాన్ షాప్ వద్ద కూడా జనం ఇలాగే చేస్తుండటంతో విసుగెత్తిపోయిన ఆ షాప్ నిర్వాహకుడు ఏం చేశాడంటే.. డిసెంబర్ 3 వరకు ఆగండి.. ఛత్తీస్‌గఢ్‌లోని మారుమూల ముంగేలి జిల్లాలోని ఓ ఊరిలో పాన్, టీ విక్రయించే చిన్నపాటి దుకాణంలో ఓ బోర్డు దర్శనమిస్తోంది. ‘డిసెంబర్ 3 వరకు ఆగండి. ఇక్కడ రాజకీయాల గురించి చర్చలు పెట్టి నా సమయాన్ని వృధా చేయకండి.. మీ సమయాన్ని చేసుకోకండి’ అని ఆ బోర్డులో రాసిఉంది. ఇక్కడికి వచ్చే జనం రాజకీయాల గురించి చర్చిస్తున్నారని, పార్టీలవారీగా విడిపోయి వాదనలకు దిగుతున్నారని పాన్ షాప్ నిర్వహకుడు మహావీర్ సింగ్ ఠాకూర్ చెబుతున్నారు. వీరి వాదనలు శ్రుతి మించి తరచుగా గొడవలు జరుగుతుండటంతో తన షాప్ వద్ద రాజకీయ చర్చలు వద్దని బోర్డును పెట్టినట్లు పేర్కొన్నారు. దీని వల్ల వ్యాపారం తగ్గినా పరవాలేదని ఆయన చెబుతున్నారు. బోర్డు పెట్టినప్పటి నుంచి అక్కడి వచ్చే జనంలో మార్పు వచ్చిందని, రాజకీయ చర్చలు తగ్గుముఖం పట్టాయని ఠాకూర్ తెలిపారు. కాగా ముంగేలి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. కాంగ్రెస్‌కు చెందిన సంజీత్ బంజారే, మాజీ మంత్రి బీజేపీ అభ్యర్థి పున్నూలాల్ మోహ్లేల మధ్య ఇక్కడ తీవ్ర పోటీ ఉంది. ఛత్తీస్‌గఢ్‌లో నవంబర్ 7, 17 తేదీల్లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. డిసెంబర్ 3న మిగిలిన నాలుగు రాష్ట్రాలతోపాటు ఓట్ల లెక్కింపు జరగనుంది. -
ఎలక్టోరల్ బాండ్ల వివరాలు ఇవ్వండి: ఈసీకి సుప్రీం ఆదేశం
సాక్షి, ఢిల్లీ: రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా నిధులు సమీకరించే పథకం ద్వారా లంచాలను చట్టబద్ధం చేశామా? అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రశ్నించారు. ఎలక్టోరల్ బాండ్స్‌లో అవకతవకలు, గోప్యతల విషయంలో దాఖలైన వాజ్యంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌తోపాటు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బి.ఆర్.గవాయి, జస్టిస్ జేబీ పార్డీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన రాజ్యాంగ ధర్మాసం విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. కేసు విచారణ మంగళవారం మొదలు కాగా..మూడో రోజైన గురువారం కూడా కొనసాగింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి డీవీ చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం.. రాజకీయ పార్టీలు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా పొందిన విరాళాల వివరాలను ఎన్నికల సంఘానికి సీల్డ్ కవర్లో అందించాలని ఆదేశిస్తూ 2019 ఏప్రిల్ 12 నాడు సుప్రీంకోర్టు జారీ చేసిన మధ్యంతర ఆదేశశాలను ప్రస్తావించింది. ఏప్రిల్ 2019 ఉత్తర్వులు ప్రకటించిన తేదీకే పరిమితం కాదని పేర్కొంది. ఈ విషయంలో ఎన్నికల సంఘానికి ఏదైనా సందేహాలు ఉంటే సర్వోన్నత న్యాయస్థానం నుంచి స్పష్టత తీసుకోవాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది. రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చే ఎలక్టోరల్ బాండ్ల పథకం చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సాగిన విచారణలో.. ఈసీఐ తన వద్ద తాజా వివరాలను అందుబాటులో ఉంచుకోవాలని ధర్మాసనం పేర్కొంది. అయితే ఏప్రిల్ 12, 2019న జారీ చేసిన మధ్యంతర ఆదేశాల ప్రకారం.. ఎన్నికల కమిషన్ 2023 సెప్టెంబర్ 30 వరకు వివిధ రాజకీయపార్టీలు ఎలక్టోరల్ బాండ్ల పథకం ద్వారా పొందిన విరాళాల వివరాలను తమ అందించాలని ఆదేశిస్తున్నట్లు బెంచ్ తెలిపింది అంతకుముందు సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేంద్రం తరపున తన వాదనలను కొనసాగిస్తూ... ‘‘నిర్ణయం మరీ ఏకపక్షమైంద కానంత వరకూ ప్రయోగాలు చేసే హక్కు చట్టసభలకు ఉంది. ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని ప్రవేశపెట్టిన తరువాత ఏమైందన్నది ప్రశ్న. ఆ ధోరణలను బెంచ్ ముందు ఉంచాం’’ అని ధర్మాసనానికి వెల్లడించారు. ఈ సందర్భంగా న్యాయవాది కనూ అగర్వాల్ కల్పించుకుని మాట్లాడుతూ గతంలో రూ.20 వేల కంటే తక్కువ మొత్తం నిధులు చెల్లించే వారి వివరాలు నమోదు చేయాల్సిన అవసరం ఉండేది కాదని.. పార్టీలు ఈ అంశాన్ని అవకాశంగా మార్చుకుని అధికశాతం విరాళాలు ఈ మొత్తం కంటే తక్కువ ఉండేలా జాగ్రత్త పడ్డాయని, పథకాన్ని దుర్వినియోగం చేశాయని బెంచ్ దృష్టికి తీసుకు వచ్చారు. సోలిసిటర్ జనరల్ దీనికి ఉత్తరమిస్తూ... ప్రస్తుతం కొంచెం అనుమానాస్పదమైన రూ.20 వేల కంటే తక్కువ మొత్తమున్న విరాళాలు తగ్గాయని, ఎలక్టోరల్ బాండ్లు పెరిగాయని తెలిపారు. ఈ దశలో జస్టిస్ ఖన్నా కలుగజేసుకుని మాట్లాడుతూ రూ.20 వేల కంటే తక్కువ మొత్తమున్న ఎలక్టోరల్ బాండ్లు ఎంత మేరకు వచ్చాయో చూపాలని కోరారు. బాండ్లు ఎక్కువై ఉంటే ఆ విషయం దీని ద్వారా తెలుస్తుందన్నారు. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా నిధులు సేకరించేందుకు నిరాకరించిన పార్టీ ఇప్పటికీ అంతకంటే తక్కువ మొత్తమున్న స్వచ్ఛంద విరాళాలను స్వీకరిస్తోందని సోలిసిటర్ జనరల్ తెలిపారు. ఎలక్టోరల్ బాండ్లు పెరిగితే రూ.20 వేల కంటే తక్కువ విరాళాలు తగ్గుతాయని చెప్పారు. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా నిధులు సేకరించమన్న పార్టీ విషయంలో మాత్రమే రూ.20 వేల కంటే తక్కువ విరాళాలు తగ్గడం లేదని తెలిపారు. అందుకే ఆ పార్టీ పాత పద్ధతి కోసం డిమాండ్ చేస్తోందని ఆరోపించారు. అనంతరం.. కేంద్రం తరపున అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి వాదనలు వినిపిస్తూ.. ఎలక్షన్ ఫండింగ్, పార్టీ ఫండింగ్, క్యాంపెయిన్ ఫండింగ్ ఇవన్నీ కాలిడోస్కోప్(రంగురంగుల చిత్రాలను ప్రదర్శించే గాజుగొట్టం) లాంటిది. ఇదంతా ఆసక్తికరమైన ప్రయోగాంశంమేనన్నారు. -
చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై ముగిసిన వాదనలు
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణానికి సంబంధించి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ అనుభవిస్తున్న చంద్రబాబు దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో సోమవారం వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు తన నిర్ణయాన్ని మంగళవారానికి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మధ్యంతర బెయిల్‌పై నిర్ణయం ఆధారంగా ప్రధాన బెయిల్ పిటిషన్‌పై విచారణ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కంటి శస్త్ర చికిత్సను కారణంగా చూపుతూ తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ చంద్రబాబు హైకోర్టులో ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సోమవారం జస్టిస్ మల్లికార్జునరావు విచారణ జరిపారు. ‘ఆరోగ్య సమస్యల దృష్ట్యా బెయిలివ్వండి’ సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. చంద్రబాబు పలు అరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని.. అందువల్ల మధ్యంతర బెయిల్ ఇవ్వాలని న్యాయమూర్తిని అభ్యర్థించారు. రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. అందుకు ఆయనపై పెడుతున్న వరుస కేసులే నిదర్శనమని తెలిపారు. గత 52 రోజులుగా చంద్రబాబు జైల్లో ఉన్నారని వివరించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కుట్రపూరితంగా అరెస్ట్ చేశారన్నారు. స్కిల్ కేసులో చంద్రబాబును సీఐడీ ప్రశ్నించడం పూర్తయిందని, అందువల్ల అతనిని జైలులో ఉంచాల్సిన అవసరం ఎంత మాత్రం లేదన్నారు. సీఐడీ రిమాండ్ రిపోర్టులో చంద్రబాబుపై నిర్ధిష్ట ఆరోపణలేవీ లేవన్నారు. జైలులో చంద్రబాబు 5 కేజీల బరువు తగ్గారన్నారు. పలు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని వివరించారు. కుడి కన్నుకు అత్యవసరంగా శస్త్ర చికిత్స చేయించుకోవాల్సిన అవసరం ఉందని, ఇదే విషయాన్ని వైద్యులు సైతం ధ్రువీకరించారని పేర్కొన్నారు. నచ్చిన వైద్యునితో చికిత్స చేయించుకునే ప్రాథమిక హక్కు పిటిషనర్‌కు ఉందన్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ‘ఆరోగ్య సమస్యల్ని సాకుగా చూపుతున్నారు’ సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, స్పెషల్ పీపీ యడవల్లి నాగవివేకానంద, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ శెట్టిపల్లి దుష్యంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. చంద్రబాబు జైలు నుంచి బయటకొచ్చేందుకు అరోగ్య సమస్యలను కారణంగా చూపుతున్నారని స్పష్టం చేశారు. ప్రధాన బెయిల్ పిటిషన్లో వాదనలు వినిపించేందుకు గడువు కావాలని సుధాకర్‌రెడ్డి కోర్టును కోరగా.. గడువు ఇచ్చేందుకు అభ్యంతరం లేదని, ముందు మధ్యంతర బెయిల్‌పై వాదనలు వినిపించాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు. చంద్రబాబు బరువు తగ్గారన్న వాదనలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. ఒకటిన్నర కేజీ బరువు పెరిగారని సుధాకర్‌రెడ్డి తెలిపారు. చంద్రబాబు ఆరోగ్య స్థితిపై వైద్యుల నివేదికలను ఆయన కోర్టు ముందుంచారు. చంద్రబాబుకు జైల్లోనే అన్ని రకాల పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కంటి శస్త్రచికిత్స అత్యవసరం ఎంతమాత్రం కాదన్నారు. వైద్యులు సైతం ఇదే చెప్పారన్నారు. చంద్రబాబుకున్న అనారోగ్య సమస్యలు వయోభారంతో బాధపడే వారికి ఉండేవేనన్నారు. అవేమీ అసాధారణ సమస్యలు కాదన్నారు. జైలు నుంచి బయటకు వచ్చేందుకు ఆరోగ్య సమస్యలను కారణంగా మాత్రమే చూపుతున్నారని తెలిపారు. ఎట్టిపరిస్థితుల్లో మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి వీల్లేదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ మల్లికార్జునరావు మధ్యంతర బెయిల్‌పై మంగళవారం నిర్ణయాన్ని వెల్లడిస్తానని స్పష్టం చేశారు. -
సూరత్ కోర్టులో వాదనలు.. ‘మరీ ఇంత పెద్ద శిక్షా ?’
సూరత్: మోదీ ఇంటి పేరును అనుచితంగా వాడారనే పరువు నష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్ష, ఎంపీగా అనర్హత వేటును ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తరఫున ఆయన న్యాయవాదులు గురువారం సూరత్ కోర్టులో వాదనలు వినిపించారు. ‘ నేర నిరూపణ విధానం సవ్యంగా లేదు. ఈ కేసులో ట్రయల్ కోర్టు జడ్జి అసమతుల్య సాక్ష్యాధారాలను ఆధారం చేసుకుని తీర్పు చెప్పారు. ఎలక్ట్రానిక్ సాక్ష్యాలతో మొత్తం కేసు ఆధారపడింది. రాఫెల్ కేసులో రాహుల్ చెప్పిన బేషరతు క్షమాపణ అంశాన్ని ఈ కేసుకు సంబంధంలేకున్నా ఇందులో జతచేశారు. మరీ ఇంత పెద్ద శిక్షా ?. ఈ కేసులో గరిష్ట శిక్షను అమలుచేయాల్సిన అవసరం లేదు’ అని అదనపు సెషన్స్ జడ్జి ఆర్పీ మొగెరా ముందు రాహుల్ లాయర్ ఆర్ఎస్ ఛీమా వాదించారు. శిక్షను నిలుపుదల చేయాలని కోరారు. ‘ దొంగలందరి ఇంటి పేరు మోదీ అనే ఎందుకుంది? అనే ప్రసంగం చేసే నాటికి రాహుల్ దేశంలోనే రెండో అతిపెద్ద పార్టీకి అధ్యక్షునిగా ఉన్నారు. దేశ ప్రజలపై ఆయన ప్రసంగ ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. ప్రసంగాన్ని సంచలనం చేయాలనేది ఆయన ఉద్దేశ్యం. ఇలాంటి పరువునష్టం కేసులు ఆయన వేర్వేరు చోట్ల చాలా ఎదుర్కొంటున్నారు. రాఫెల్ కేసులో అనుచిత వ్యాఖ్యలు, ఆనక క్షమాపణల తర్వాతా ఆయన ఇలాంటి ప్రసంగాలు చేశారు’ అని పరువునష్టం కేసు వేసిన పూర్ణేశ్ మోదీ తరఫు లాయర్ హర్షిత్ తోలియా వాదించారు. తర్వాత జడ్జి తీర్పును 20వ తేదీకి వాయిదావేశారు. -
రెచ్చిపోయిన టీడీపీ శ్రేణులు..పోలీసులతో వాగ్వాదం
-
సుప్రీంకోర్టులో మొదలైన ప్రత్యక్ష ప్రసారాలు.. విచారణలు ఇలా చూడండి
న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు.. మంగళవారం తమ కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారం ప్రారంభించింది. సుప్రీంకోర్టులోని మూడు వేర్వేరు రాజ్యాంగ ధర్మాసన కేసుల విచారణను లైవ్ స్ట్రీమింగ్ చేస్తోంది. వీటిని యూట్యూబ్‌లో అందుబాటులో ఉంచారు. రానున్న రోజుల్లో సొంత వేదిక ద్వారా విచారణలు ప్రసారం చేయనున్నట్లు సీజేఐ యూయూ లలిత్ తెలిపారు. ప్రస్తుతానికి రాజ్యాంగ ధర్మాసన విచారణను మాత్రమే ప్రసారం చేస్తున్నారు. తర్వాత మిగతా అన్నింటిని లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నారు. కోర్టులో జరిగే వాదనలకు, లైవ్ స్ట్రీమింగ్కు 30 సెకన్లు వ్యవధి తేడా ఉండనుంది. కాగా మాజీ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పదవీ విరమణ రోజు ఆగస్టు 26న తొలిసారి ధర్మాసనం కార్యకలాపాలను దేశ ప్రజలంతా వీక్షించేలా ప్రత్యక్ష ప్రసారం చేశారు. అయితే నాలుగేళ్ల క్రితం 2018 సెప్టెంబర్ 27సుప్రీంకోర్టు కేసుల వాదనలను లైవ్ స్ట్రీమింగ్ చేయాలని అప్పటి సీజేఐ దీపక్ మిశ్రా నిర్ణయం తీసుకున్నారు. అయినా ఇప్పటి వరకు ఆచరణలోకి రాలేదు. చివరికి సెప్టెంబర్ 27 నుంచి అన్ని రాజ్యాంగ ధర్మాసన కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని సీజేఐ యూయూ లలిత్ ఈనెల 20న నిర్ణయించారు. మొదటి స్ట్రీమింగ్‌లో భారత ప్రధాన న్యాయమూర్తి యూయూ లలిత్ అధ్యక్షతన ఇడబ్ల్యూఎస్ కోటా కేసు విచారణ జరుగుతోంది. ఈ కేసు 103వ రాజ్యాంగ సవరణను సవాలు చేస్తూ దాఖలైందిద. మరో విచారణలో మహారాష్ట్రలోని ఉద్దవ్ ఠాక్రే Vs ఏక్నాథ్ షిండే వర్గం మధ్య విబేధాలకు సంబంధించిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇక జస్టిస్ ఎస్కే కౌల్ అధ్యక్షతన జరిగే మూడో విచారణలో ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ చెల్లుబాటుకు సంబంధించిన అంశంపై వాదనలు కొనసాగుతున్నాయి. చదవండి: జపాన్ ప్రధానికి మోదీ ఘన నివాళులు -
భౌతికంగా కేసుల విచారణ కొనసాగించాలని ఏపీ హైకోర్టు నిర్ణయం
-
గాంధీ వర్ధంతి: మాంసం కోసం కొట్టుకున్న యువకులు
సాక్షి, రాయచూరు (కర్ణాటక): మాంసం కొనుగోలు విషయంలో చిన్నపాటి ఘర్షణ జరిగి 21 మంది గాయపడిన ఘటన ఆదివారం రాయచూరు నగరంలో చోటు చేసుకుంది. వివరాలు... మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా మాంసం దుకాణాలు బంద్ చేశారు. సాయంత్రం నీరుబావి కుంటలో మాంసం దుకాణాలు తెరవడంతో శివప్ప, సూర్య ప్రకాశ్‌లు అక్కడికి వచ్చారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య మాంసం కొనుగోలు సందర్భంగా చిన్నపాటి గలాటా జరిగింది. దీంతో ఇద్దరు వారి స్నేహితులకు సమాచారం ఇచ్చారు. పెద్ద ఎత్తున యువకులు అక్కడికి చేరుకుని కొట్టుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు అక్కడికి చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు సీఐ వీరారెడ్డి తెలిపారు. చదవండిః సిద్ధు భస్మాసురుడు వంటి వాడు -
మాతృ భాషలో వాదనలు తప్పు కాదు
సాక్షి, అమరావతి: హైకోర్టులో మాతృ భాషలో వాదనలు వినిపించడం కోర్టును అవమానించడం ఏ మాత్రం కాదని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. తను ఇంగ్లిష్‌లో అడిగిన ప్రశ్నకు ఓ న్యాయవాది తెలుగులో సమాధానం ఇచ్చినందుకు ఆగ్రహించిన సింగిల్ జడ్జి రూ.25 వేలు ఖర్చుల కింద చెల్లించాలంటూ ఆ కేసు దాఖలు చేసిన పిటిషనర్‌ను ఆదేశిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను ధర్మాసనం రద్దు చేసింది. విశాఖలో ఓ భవన నిర్మాణం అనుమతుల విషయమై అగనంపూడికి చెందిన గురు భాస్కరరావు 2019లో హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సింగిల్ జడ్జి విచారణ జరిపారు. న్యాయమూర్తి పిటిషనర్ విచారణార్హతపై ఓ ప్రశ్న అడిగారు. అప్పటివరకు ఇంగ్లిష్‌లోనే వాదనలు వినిపిస్తూ వచ్చిన న్యాయవాది.. తెలుగులో స్పందిస్తూ.. ‘తమరు పేజీ నెంబర్ 18, 19 ఓసారి చూడండి’ అంటూ సమాధానం ఇచ్చారు. దీనికి న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టులో తెలుగులో వాదనలు వినిపించడం కోర్టు ప్రొసీడింగ్స్‌ను అవమానించడమేనంటూ కేసు పూర్వాపరాల్లోకి వెళ్లకుండానే ఆ పిటిషన్‌ను కొట్టేశారు. ఆ వెంటనే సదరు న్యాయవాది బేషరతు క్షమాపణలు కోరారు. తెలుగులో చెప్పిన సమాధానాన్ని పట్టించుకోవద్దంటూ.. తిరిగి ఇంగ్లిష్‌లో విన్నవించారు. అయినా న్యాయమూర్తి వినిపించుకోకుండా రూ.25 వేల జరిమానాను 4 వారాల్లో హైకోర్టు న్యాయ సేవాధికార సంస్థకు జమ చేయాలని పిటిషనర్‌ను ఆదేశించారు. ధర్మాసనం ముందు అప్పీల్ వేసిన పిటిషనర్ జరిమానా చెల్లించాలనడంపై పిటిషనర్ సీజే ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేయగా, ఇటీవల ఇది ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణ మూర్తి ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. మొత్తం విషయం తెలుసుకున్న ధర్మాసనం.. ‘కేసు పూర్వాపరాల్లోకి వెళ్లి ఈ అప్పీల్‌ను తేల్చాలని పిటిషనర్ కోరడం లేదు. అందువల్ల మేం కూడా ఈ కేసు లోతుల్లోకి వెళ్లడం లేదు. సింగిల్ జడ్జి ఉత్తర్వులను పరిశీలిస్తే, న్యాయమూర్తి అడిగిన ప్రశ్నకు సమాధానం మాత్రమే తెలుగులో చెప్పారు. అంతే తప్ప ఆ న్యాయవాది కేసు మొత్తాన్ని తెలుగులో వాదించలేదు. హైకోర్టులో కార్యకలాపాలు జరిగే భాష ఇంగ్లిష్. అయితే మాతృభాషలో వాదనలు వినిపించడం కోర్టు ప్రొసీడింగ్స్‌ను అవమానించడం ఎంత మాత్రం కాదు. అందువల్ల సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తున్నాం’ అని చెప్పారు. -
మాట్లాడే అవకాశం ఇవ్వలేదని.. లైవ్ డిబేట్లో ఏం చేసిందో తెలుసా?
కోల్‌కతా: సాధారణంగా టీవీ డిబేట్లలో పాల్గొనడానికి వివిధ పార్టీలకు చెందిన నాయకులను, ఆయా రంగాలకు ప్రముఖులను ఆహ్వనిస్తుంటారు. కొన్నిసార్లు ఈ డిబేట్లు ఆసక్తికరంగా సాగితే మరికొన్ని సార్లు ఫన్నీగాను సాగుతుంటాయి. ఈ డిబేట్లలో పాల్గొనే వక్తలు ఒకరిపై మరొకరు ఆధిపత్యం ప్రదర్శించడానికి ప్రయత్నిస్తుంటారు. కొన్నిసార్లు లైవ్ డిబేట్లలో మాటమాట పెరిగి.. సభ్యులు ఒకరిపై మరొకరు దాడిచేసుకొవడం, తిట్ల దండకాన్ని అందుకోవడం మనకు తెలిసిందే. కొన్నిసార్లు ఈ డిబేట్లలో హద్దులు దాటి కూడా ప్రదర్శిస్తుంటారు. కొందరు ఎదుటివారి దృష్టిని తమవైపు ఆకర్శించడానికి కొందరు తమ నోటికి పనిచేబితే.. మరికొందరు ఎదుటివారి వాదనలు వినకుండా ఫన్నీగా ప్రవర్తిస్తుంటారు. తాజాగా.. ఈ కోవకు చెందిన ఒక ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఒక టీవీ ఛానెల్ డిబేట్లో యాంకర్, ఐదుగురు సభ్యులు డిబెట్లో పాల్గొన్నారు. దీనిలో అందరు తమ తమ వాదనలు వినిపిస్తున్నారు. ఈక్రమంలో డిబెట్లో పాల్గొన్న ఒక మహిళ తన వంతు కోసం వేచిచూస్తుంది. ఏదో చెప్పాలనుకుంటుంది. అయితే, మిగతా సభ్యులు మాత్రం ఆమెకు ఏమాత్రం అవకాశం ఇవ్వడం లేదు. దాంతో ఆమె హైడ్రామా క్రియేట్ చేసింది. ఆ మహిళ లైవ్‌లోనే స్టెప్పులేయడం ప్రారంభించింది. దీంతో పక్కనున్న సభ్యులు మహిళ చర్యపట్ల ఆశ్చర్యంతో ఆమె వైపే చూస్తు ఉండిపోయారు. ఆ మహిళ మాత్రం.. తన రెండు చేతులను వివిధ భంగిమలతో చూపిస్తూ .. వెరైటీగా డ్యాన్స్ చేసింది. ఆ తర్వాత.. గట్టిగా అరుస్తు వెరైటీగా స్పందించింది. ఈ ఫన్నీ డిబెట్ గతంలోనే జరిగింది. ఆకుపచ్చని కుర్తీవేసుకున్న మహిళ రోష్నిఆలీ. ఆమె పర్యావరణ వేత్త. తాజాగా, దీన్ని ఎలిజబెత్ అనే ట్విటర్యూజర్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. దీంతో మరోసారి ఇది వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. ‘వావ్.. భలే స్టెప్పులేసింది..’, ‘మహిళ ఎవరిని తిట్టలేదు.. బాగా నిరసన తెలిపింది’, ‘ పాపం.. మాట వినకుంటే ఏంచేస్తుంది..’, ‘మా సపోర్ట్ ఆ మహిళకే..’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. See what the participant in green kurti does when not given a fair chance to speak! 😂😂😂 pic.twitter.com/M58kKkbpxB — Elizabeth (@Elizatweetz) January 16, 2022 చదవండి: మాజీ సర్పంచ్ దాష్టికం!..మహిళా ఆఫీసర్ని జుట్టు పట్టుకుని, చెప్పుతో కొట్టి... చివరికి -
పూటుగా మద్యం తాగి.. సెల్‌ఫోన్ కోసం గొడవ..
సాక్షి, జగద్గిరిగుట్ట (హైదరాబాద్): సెల్‌ఫోన్ కోసం జరిగిన వివాదంలో ఒకరు ప్రాణం కోల్పోయిన ఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగద్గిరిగుట్ట ప్రాంతంలో ఉన్న శశి వైన్స్ వద్ద సోమవారం భూక్య భీమా(45), తన స్నేహితుడు ఫుల్‌గా మద్యం సేవించారు. తాగిన మత్తులో వారిద్దరి మధ్య సెల్‌ఫోన్ కోసం గొడవ జరిగినట్లు ప్రత్యక్ష సాక్షి వైన్స్ షాపు సెక్యూరిటీ గార్డ్ తెలిపాడు. వైన్స్ మూసేసిన తర్వాత సెక్యూరిటీ గార్డ్ భోజనం చేయడానికి పక్కకు వెళ్లగా ఒక పెద్ద బండరాయి శబ్ధం రావడంతో తిరిగి వైన్స్ వద్దకు చేరుకొని చూడగా ఓ వ్యక్తి తలపై బండరాయితో మోది హత్య చేయబడ్డాడని గమనించి వెంటనే జగద్గిరిగుట్ట పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని హత్య కాబడ్డ వ్యక్తి జేబులో ఉన్న బుక్‌ను చెక్ చేయగా అతడి పేరు భూక్య భీమాగా గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. హత్య చేసిన వ్యక్తి కోసం గాలిస్తున్నామని సీఐ సైదులు తెలిపారు. చదవండి: న్యూడ్ ఫొటోలు అప్లోడ్ చేస్తానంటూ బెదిరింపులు -
గల్లీల్లో ఘర్షణ.. టెన్షన్లో జనం
సాక్షి, అంబర్‌పేట(హైదరాబాద్): ఆకతాయిలు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. గల్లీ ఘర్షణలు ఎక్కువవుతున్నాయి. అంబర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని పలు బస్తీల్లో ఆకతాయిల ఆగడాలు మితిమీరుతున్నాయి. కాస్త చీకటి పడగానే గల్లీల్లో తిష్టవేసి వారు చేసే ఆగడాలకు స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రేమ్‌నగర్, ఆజాద్‌నగర్, మహ్మద్‌నగర్, న్యూ పటేల్‌నగర్, గోల్నాకలోని లంకా బస్తీలు, దుర్గానగర్ తదితర ప్రాంతాల్లో ఆకతాయిల ఆగడాలు హద్దులు దాటుతున్నాయి. దీంతో మహిళలు, యువతులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. ఫిర్యాదులకు కనిపించని స్పందన.. ► ఆకతాయిల ఆగడాలపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పెద్దగా పట్టించుకోవడం లేదు. ఫిర్యాదు చేసినప్పుడే తూతూ మంత్రంగా ఘటనా స్థలాన్ని సందర్శించి పోతున్నారు. మితిమీరిన ఆగడాలతో స్థానికులు ఫిర్యాదు చేయడానికి సైతం ధైర్యం చేయడం లేదు. నేరుగా ఫిర్యాదులు చేస్తేనే పట్టించుకుంటామని పోలీసులు తేల్చి చెబున్నారు. ఇప్పటికైనా పోలీసులు ప్రత్యేక పెట్రోలింగ్ నిర్వహించి ఆకతాయిల ఆగడాలను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు. మత్తులో యువత హంగామా.. ► యువకులు డ్రగ్స్, మద్యం మత్తులో ఘర్షణ పడుతున్నారు. ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ స్థానికంగా భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. వీరి మధ్యలో అడ్డుపడితే వారిపై సైతం దాడులు చేస్తున్నారు. ఇలాంటి ఫిర్యాదులు వచ్చినా పోలీసులు పెద్దగా స్పందిస్తున్న దాఖలాలు లేవు. వారిలో వారు కొట్టుకుంటున్నారులే అనే చందంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. సాయంత్రం అయిందంటే బయటకు వెళ్లే పరిస్థితి లేదని, పోలీసులు తక్షణమే స్పందించి ఆకతాయిలపై చర్యలు తీసుకోవాలని స్థానిక మహిళలు కోరుతున్నారు. చదవండి: మహంకాళి దేవాలయం వద్ద మొండెం లేని మనిషి తల -
విశాఖ తీరంలో మరోసారి ఉద్రిక్తత
-
మత్య్సకారుల మధ్య ఘర్షణ: బోట్లపై సినీ ఫక్కీలో ఛేజింగ్
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో రింగువలల కోసం మత్య్సకారుల మధ్య గొడవ చెలరేగింది. దీనిపై రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. అంతటితో ఆగకుండా, రెండు వర్గాలు సినీ ఫక్కీలో సముద్రంపై ఛేజింగ్‌లు చేసుకున్నాయి. దీంతో విశాఖలోని.. పెద్ద జాలరీపేట గంగమ్మ గుడివద్ద ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఇరువర్గాలకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం సంభవించింది. దీంతో సముద్రతీరం రణరంగంగా మారింది. చదవండి: ధర్మేంద్ర ప్రధాన్‌తో సీఎం జగన్ భేటీ -
నీ కుక్కను సరిగ్గా ట్రైన్ చేసుకో.. నా కుక్కనే అంటావా!
బెర్లిన్: సాధారణంగా కొందరు శునకాలను చాలా ఇష్టంగా పెంచుకుంటారు. వాటిని తమ ఇంట్లో మనుషుల మాదిరిగా చూసుకుంటారు. వాటిని ఎవరు ఏమన్నా.. ఆగ్రహంతో ఊగిపోతుంటారు. తాజాగా, ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాలు.. జర్మనీలోని తురింజియా పట్టణంలో 27 ఏళ్ల మహిళ, 51 ఏళ్ల మరో మహిళ తమ పెంపుడు కుక్కలను తీసుకుని స్థానికంగా ఉన్న పార్కులో వాకింగ్‌కు తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఒక శునకం.. మరో శునకాన్ని చూస్తు అరుస్తూ దాడికి తెగబడింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన 51 ఏళ్ల మహిళ.. మరో మహిళపై వాగ్వాదానికి దిగింది. శునకాన్ని సరిగ్గా ట్రైన్ చేసుకోవాలని చెప్పింది. దీంతో వీరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ గొడవ పెరిగి.. ఒకరిపై మరొకరు దాడిచేసుకోవడం వరకు వెళ్లింది. ఒకరిని మరోకరు కొరుక్కుంటూ గాయపర్చుకున్నారు. పాపం.. మహిళలిద్దరు కొట్టుకోవడాన్ని వారి శునకాలు చూస్తూ ఉండిపోయాయి. ఆ ప్రదేశంలో ఉన్న స్థానికులు వారి గొడవను ఆపటానికి సాహసించలేదు. ఈ సంఘటన తర్వాత ఇరువురు స్థానిక పోలీసుస్టేషన్ వెళ్లి ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వార్త క్లిప్పింగ్‌లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు ‘మీ కన్నా.. శునకాలే నయం..’, ‘వామ్మో.. ఇలా కరుచుకున్నారేంటీ..’ అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. -
బ్యూటీషియన్ అదృశ్యం
సాక్షి, సిరిసిల్ల(కరీంనగర్): ఇంటి నుంచి బయటకు వెళ్లిన తన కూతురు తిరిగి రాలేదని తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు సీఐ అనిల్‌కుమార్ తెలిపారు. సిరిసిల్ల పట్టణం ఇందిరానగర్‌కు చెందిన కల్లెపల్లి అక్షిత(27) ఆదివారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. మళ్లీ తిరిగి రాలేదు. అక్షిత తల్లి ఎల్దండి కళావతి ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. జీవనోపాధి కోసం బ్యూటీపార్లర్ నడుపుతూ ఉండేదన్నారు. సర్ది చెప్పడానికి వచ్చిన మహిళపై దాడి సిరిసిల్ల: తమ ఇంటి ముందు జరుగుతున్న గొడవను నిలువరించేందుకు ప్రయత్నించిన మహిళపై దాడి చేసిన వ్యక్తి సోమవారం సిరిసిల్లటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ముస్తాబాద్ మండలం రాంరెడ్డిపల్లికి చెందిన పల్లపు సునీత సిరిసిల్ల పట్టణం ఇందిరానగర్‌లో నివసించే వాళ్ల అక్కయ్య ఇంటికెళ్లింది. అక్క కూతురు, ఆమె భర్తకు మధ్య గొడవలను సద్దుమణిచేందుకు మాట్లాడడం గురించి వచ్చింది. ఈక్రమంలోనే కుటుంబికుడైన అరవింద్ అకారణంగా దాడి చేశాడు. దీంతో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో దాడిచేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: మాల్దీవ్స్‌లో ఫుడ్, బెడ్, స్పా అంతా మాదే -
భార్యాభర్తల గొడవ.. కూతురిని ఒంటరిగా తీసుకెళ్లి..
ముంబై: కోపం మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తుంది. ఆ సమయంలో విచక్షణ మరచి ప్రవర్తిస్తే అఘాయిత్యాలే జరుగుతాయి. తాజాగా ఓ కన్న తండ్రి కసాయిలా మారి తన కుమార్తెను పీకపిసికి కిరాతకంగా హతమార్చాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని థానేలో వెలుగు చూసింది. నిందితుడిని థానేలోని ముంబ్రాకు చెందిన అనీష్ మల్దార్ అనే కార్మికుడిగా పోలీసులు గుర్తించారు. వివరాల ప్రకారం.. థానే ప్రాంతంలో మల్దార్ తన భార్య, కుమార్తెతో కలిసి నివసిస్తున్నాడు. గతకొంత కాలంగా ఆ దంపతులు ఇంట్లో చిన్నచిన్న విషయాలపై వారు తరచూ గొడవ పడేవారు. శుక్రవారం రాత్రి, ఏదో విషయమై మల్దార్‌కు తన భార్యతో గొడవ ప్రారంభమై, అది కాస్త తీవ్ర వాగ్వాదంగా మారింది. దీంతో కోపం తెచ్చుకున్న సదరు వ్యక్తి.. ఏడేళ్ల తన కుమార్తెపై ఆ కోపం చూపించాడు. క్షణికావేశంలో ఆ బాలికను ఒంటరిగా బయటకు తీసుకెళ్లి పీక పిసికి చంపేశాడు. కుమార్తె మృతి గురించి అతని భార్యకు తరువాత తెలియడంతో, ఆమె వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు బాలిక మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ తరలించారు. నిందితుడిపై కేసు నమోదు చేసుకుని అదుపులోకి తీసుకున్నరు. చదవండి: మీరే నన్ను చంపేశారు.. నేనే బతికే ఉన్నానయ్య -
మేం చెప్పినట్లుగానే కేసు కట్టాలి.. కేకలు.. అరుపులతో హంగామా..
సాక్షి, అనంతపురం: నగరంలోని రెండో పట్టణ పోలీసు స్టేషన్లో సీపీఐ, టీడీపీ నాయకులు హైడ్రామాకు తెరలేపారు. తమ పార్టీలకు చెందిన అనుబంధ విద్యార్థి సంఘాల నేతలపై 30 యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేయడాన్ని తప్పుబట్టి వాగ్వాదానికి దిగారు. తాము సూచించిన సెక్షన్ల ప్రకారమే కేసులు నమోదు చేయాలని పట్టుబట్టారు. ఇందుకు పోలీసులు నిరాకరించడంతో స్టేషన్ ఎదుట నానా రభస చేశారు. వివరాలు... ఏఐఎస్ఎఫ్ ఆందోళన.. నగరంలోని ఎస్ఎస్బీఎన్ డిగ్రీ కళాశాలను ఎయిడెడ్‌గానే కొనసాగించాలంటూ ఏఐఎస్ఎఫ్ నాయకులు గురువారం ఆ కళాశాల వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ నెల 8న జరిగిన ఘటనపై ఉన్నతస్థాయి అధికారులతో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. 30 యాక్ట్ అమలులో ఉండడంతో ఆందోళన విరమించాలని అనంతపురం డీఎస్పీ వీరరాఘవ రెడ్డి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. వినకపోవడంతో అరెస్ట్ చేసి, రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆందోళన కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు మనోహర్, రాజేంద్ర ప్రసాద్, చిరంజీవి, రమణయ్య తదితరులు పాల్గొన్నారు. కేకలు.. అరుపులతో హంగామా.. ఏఐఎస్ఎఫ్ నాయకుల అరెస్ట్ విషయం తెలుసుకున్న సీపీఐ, టీడీపీ నాయకులు వెనువెంటనే రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌ను చేరుకున్నారు. తమ అనుబంధ విద్యార్థి సంఘాల నేతలపై 30 యాక్ట్ కింద కేసులు ఎలా నమోదు చేస్తారంటూ సీపీఐ నేత యల్లుట్ల నారాయణస్వామి, టీడీపీ నగర అధ్యక్షుడు మారుతీ ప్రసాద్, నరసింహులు తదితరులు పోలీసులను ప్రశ్నించారు. సీఐలు ప్రతాప్‌రెడ్డి, జాకీర్‌హుస్సేన్, రెడ్డెప్ప, కత్తి శ్రీనివాసులు నచ్చ చెప్పేందుకు ప్రయత్నిస్తుండగానే గట్టిగా కేకలు, అరుపులతో హంగామాకు తెరలేపారు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న డీఎస్పీ వీరరాఘవరెడ్డిని ఏకవచనంతో సంభోధిస్తూ తాము చెప్పిన సెక్షన్ల మేరకే కేసు కట్టాలంటూ డిమాండ్ చేశారు. రూల్ ధిక్కరించడం సబబు కాదని ఈ విషయంగా అనవసర రాద్ధాంతం వద్దని డీఎస్పీ నచ్చచెప్పేందుకు ప్రయత్నిస్తే వారు ససేమిరా అంటూ నానా రభస చేశారు. చివరకు పార్టీ నేతలను డీఎస్పీ బయటకు పంపి 30 యాక్ట్ ధిక్కరించిన టీఎన్ఎస్ఎఫ్ నేతలు పరుశురాం, గుత్తా ధనుంజయనాయుడు, ఏఐఎస్ఎఫ్ నేతలు మనోహర్, కుళ్లాయస్వామి, వంశీ, పృథ్వీ, రమణయ్య, ఉమామహేష్, రవి, రాజేంద్ర తదితరులపై కేసు నమోదు చేశారు. టూటౌన్ పోలీసు స్టేషన్లో హంగామా చేస్తున్న టీడీపీ, సీపీఐ నాయకులు -
Twitter: కొత్త ప్రయోగం.. ట్విటర్ కూల్
సోషల్ మీడియా వేదికగా రకరకాల చర్చలు జరుగుతుంటాయి. ఒక్కోసారి ఆ చర్చలు వాడీవేడి పరిణామాలకు.. అటుపై విపరీతాలకూ దారితీస్తుంటాయి. అయితే ఆ హీట్ డిబేట్లను తగ్గించే ప్రయత్నాలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు చేయలేవా?.. ఇందుకోసమే ట్విటర్ ఇప్పుడు రంగంలోకి దిగింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విటర్ త్వరలో ఓ కూల్ ఫీచర్‌ను తీసుకురాబోతోంది. చర్చ అటుఇటు తిరిగి వాదులాటకు దారితీసే క్రమంలో ట్విటర్.. సదరు ట్వీపుల్స్(ట్విటర్ పీపుల్స్)ను అప్రమత్తం చేస్తుందట. ఇందుకోసం యూజర్ల సంభాషణ మధ్యలో కింద ఆఫ్షన్స్‌తో ఓ ఫీచర్‌ను డిస్ప్లే చేయబోతోంది. అప్పుడు యూజర్లు విచక్షణతో స్పందిస్తే.. ఆ ట్వీట్-రీట్వీట్ల సంభాషణపర్వం వేడెక్కకుండా అక్కడితోనే చల్లబడే ఛాన్స్ ఉంటుంది. అయితే సంభాషణకు సంబంధించి ఏ సందర్భంలో అలర్ట్ చేస్తుంది, అసలు ఎలా అంచనా వేయగలుగుతందనేది, ఎలా పని చేస్తుందనే విషయాల్ని ట్విటర్ ఇప్పుడే చెప్పట్లేదు. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉందట. ఇది పూర్తయ్యాక ఆండ్రాయిడ్, ఐవోఎస్.. రెండింటిలోనూ ఈ కూల్ ఫీచర్‌ను అప్డేట్ ద్వారా తీసుకురాబోతున్నారు. ఇదిలా ఉంటే ట్విటర్లో ఈమధ్య సాంకేతిక సమస్యలు తలెత్తున్నాయని యూజర్లు గగ్గోలు పెడుతున్నారు. ముఖ్యంగా ట్విటర్ టైం లైన్లో వాటికవే రిఫ్రెష్ అయ్యి.. ట్వీట్లు కనిపించకుండా పోతున్నాయి. దీనిపై స్పందించిన ట్విటర్ ఈ సమస్యకు చెక్ పెట్టేలా ఓ ఫీచర్‌ను తెస్తామని హామీ ఇచ్చింది. చదవండి: ఫేస్‌బుక్‌కి దెబ్బ.. వీళ్లేమో పండగ చేస్కున్నరు -
NGT: తాగునీటి కోసమే రిజర్వాయర్లు
సాక్షి, న్యూఢిల్లీ: తాగునీటిని అందించడానికే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల నిర్మాణాన్ని చేపట్టామని తెలంగాణ స్పష్టం చేసింది. ఈ మేరకు బుధవారం జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) చెన్నై ధర్మాసనం ముందు వాదనలు వినిపించింది. అయితే, కేంద్రం వైఖరి చెప్పకుండా ఆదేశాలు ఇవ్వొద్దని ఏపీ అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ విజ్ఞప్తి చేశారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు లేవంటూ ఏపీ రైతుల డి.చంద్రమౌళీశ్వరరెడ్డి తదితరులు దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం జస్టిస్ రామకృష్ణన్, విషయ నిపుణుడు సత్యగోపాల్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఎన్జీటీలో పిటిషన్ దాఖలుకు 6 నెలల కాలపరిమితి ఉంటుందని, ఆ సమయం మించి దాఖలైన పిటిషన్లను విచారించరాదని తెలంగాణ అదనపు అడ్వొకేట్ జనరల్ రాంచందర్‌రావు పేర్కొన్నారు. సుప్రీంకోర్టులోనూ ఈ అంశంలో పిటిషనర్లకు అనుకూలంగా తీర్పు రాలేదన్న విషయం తెలిసీ ఎన్జీటీని ఆశ్రయించారన్నారు. 2015లో ఇచ్చిన జీవో ప్రకారం.. తాగునీటి కోసమే ప్రాజెక్టు చేపట్టామని తెలిపారు. పర్యావరణ అనమతులు వచ్చే వరకూ సాగునీటి ప్రాజెక్టు పనులు చేపట్టబోమని రాంచందర్‌రావు వెల్లడించారు. తాగునీటి కోసమే అయితే అంత సామర్థ్యమున్న రిజర్వాయర్లు ఎందుకు కడుతున్నారు.. సాగునీటి కోసం కూడా ప్రాజెక్టు వినియోగించాలన్న ఉద్దేశంతోనే చేపడుతున్నట్లుంది కదా.. అని ధర్మాసనం ప్రశ్నించింది. కృష్ణాలో నిరంతరం నీరు ఉండదని, వర్షాలు తక్కువ పడినా, వరదలు లేకున్నా నాలుగేళ్లపాటు నిర్విరామంగా తాగునీరు అందించాలన్న లక్ష్యంతో తెలంగాణ సర్కార్ ఈ ప్రాజెక్టులో భాగంగా రిజర్వాయర్లు కడుతోంందని రాంచందర్‌రావు చెప్పారు. ప్రాజెక్టు సమీప 13 మండలాలు ఫోర్లైడ్ బాధిత గ్రామాలని, భూగర్భజలాలు వినియోగం వల్ల ఇబ్బందులు వస్తున్న నేపథ్యంలో భారీ రిజర్వాయర్లు కట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ విచారణ ప్రాథమిక దశలోనే ఉందని తుది విచారణలో తప్పకుండా తమ వైఖరి వెల్లడిస్తామని కేంద్రం తరఫు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. తదుపరి వాదనలు గురువారం (నేడు) వింటామన్న ధర్మాసనం విచారణ వాయిదా వేసింది. చదవండి: టీఆర్ఎస్ జెండాను ఎత్తుకెళ్లిన దుండగులు